ఈ యూట్యూబర్‌కు డైరెక్టర్స్‌ పిలిచి మరీ ఆఫర్స్‌ ఇస్తున్నారుగా! | Know About Youtuber, Actor Satish Saripalli | Sakshi
Sakshi News home page

Satish Saripalli: 'నాన్న ఎందుకో వెనకబడ్డాడు' వీడియో నుంచి వెనక్కు తిరిగి చూసుకోలేదు!

Published Thu, Jun 23 2022 9:29 PM | Last Updated on Thu, Jun 23 2022 9:29 PM

Know About Youtuber, Actor Satish Saripalli - Sakshi

సతీష్ సరిపల్లి అనే పేరుకి యూట్యూబ్ వీడియోస్ చూసేవాళ్ళలో ఉన్న క్రేజ్ వేరు. ఏకంగా 1000కి పైగా వీడియోలలో అనేక రకాల పాత్రల్లో కనిపించారు. 'చీపా' గా బాగా ఫేమస్. ముందు కామెడీ పాత్రలతోనే మొదలుపెట్టినా ఆ తరువాత మాత్రం అన్ని రకాల పాత్రలు చేశారు. 'నాన్న ఎందుకో వెనకబడ్డాడు' అనేది సతీష్ సరిపల్లికి మంచి గుర్తింపు తెచ్చింది. అతనిలో ఉన్న నటుడిని అందరికి పరిచయం చేసింది. అలా యూట్యూబ్‌లో బాగా ఫేమస్ అయిన సతీష్ ఆ తరువాత వెండితెర వైపు అడుగులు వేశాడు. గతంలో అతను చేసిన యూట్యూబ్ వీడియోస్ రిఫరెన్స్ గా తీసుకుని చాలామంది డైరెక్టర్స్ పిలిచి ఆఫర్స్ ఇస్తున్నారు.

ఇప్పటికే దాదాపు 50 సినిమాల్లో నటించిన సతీష్ రీసెంట్‌గా ఎఫ్‌3లో కనిపించారు. త్వరలో చిరంజీవి గాడ్ ఫాదర్, అఖిల్ అక్కినేని ఏజెంట్, సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు కొంచెం చెప్పాలి లాంటి పెద్ద సినిమాలతో పలకరించబోతున్నాడు. నటుడు అవ్వాలని అతను తీసుకున్న రిస్క్ ఫలించిందని, యాక్టర్‌గా టాలీవుడ్ తనని గుర్తించిందని చెబుతున్న సతీష్ సరిపల్లి గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ కింది వీడియో చూసేయండి..

చదవండి: అంతా అయిపోయింది.. మనీ కోసం, ఛాన్స్‌ కోసం అడుక్కుంటున్నా
91 ఏళ్ల వయసులో నాలుగో భార్యకు మీడియా మొఘల్‌ విడాకులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement