Youtuber
-
ఇండియాలోని టాప్ యూట్యూబర్లలో ఒకరామె..జస్ట్ పాక నైపుణ్యంతో ఏకంగా..!
యూట్యూబ్ అంటే కొందరికి స్టార్‌డమ్‌ని తెచ్చిపెట్టే వేదిక. మరికొందరికి అదొక సరదా కాలక్షేపం. అయితే కొంతమంది మాత్రం దీంతో మంచి పేరు తోపాటు కోట్లు ఆర్జించి మిలియనీర్లుగా మారారు. అచ్చం అలానే మంచి నేమ్, డబ్బు సంపాదించి స్టార్ యూట్యూబర్‌గా ఎదిగింది 65 ఏళ్ల మహిళ. ఒంటరితనాన్ని దూరం చేసుకునేందుకు సరదాగా మొదలు పెట్టిన యూట్యూబ్ ఛానెల్ విలియన్లమంది ఫాలోవవర్లు, లక్షల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోయింది. అలా ఆమె భారతదేశంలోని అత్యంత ధనిక యూట్యూబర్లలో ఒకరిగా నిలిచి ఎందరికో స్ఫూర్తినిచ్చారు. ఎవరామె..? ఆమె విజయ ప్రస్థానం ఎలా సాగిందంటే..!ఆమె పేరు నిషా మధులిక. 2009లో తన యూట్యూబ్ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె భారతీయ శైలి వంటకాలకు ఫేమస్. ఆమెకు చిన్న వయసు నుంచి వివిధ వంటకాలపై ఉన్న ఆసక్తితో రకరకాల రెసిపీలకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేసింది. అలా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలో దాదాపు రెండు వేలకు పైగా వీడియోలను పోస్ట్ చేసింది. ఆమె ఛానెల్‌కు దాదాపు 14.5 మంది మిలియన్ల మంది సభ్యులు ఉన్నారు. ఆరోగ్యకరమైన వంటకాలతో ప్రతి ఇల్లు ఐక్యతతో సంతోషభరితంగా ఉండాలనేది తన ఆకాంక్ష అని అంటోంది నిషా. ఆమెకు ఈ యూట్యూబ్ తోపాటు ఫేస్బుక్లో 5.7 మిలియన్లు, ఇన్‌స్టాలో 3.41 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. నిషా నేపథ్యం..నిషా ఆగస్టు 24, 1959న ఉత్తరప్రదేశ్‌లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఆమె పాఠశాల విద్య, గ్రాడ్యుయేషన్ తదనంతరం.. కొన్నాళ్లు ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించింది. ఆ తర్వాత పెళ్లితో నోయిడాకు వెళ్లిపోయింది. అక్కడ తన ఇద్దరు పిల్లలను పెంచి పెద్ద చేసింది. ఇక ఆ బాధ్యతలు తీరి ఒంటరితనం వేధించడంతో.. చిన్ననాటి వంటకాల ఆసక్తితో ఆ లోటుని భర్తి చేసింది. ఆ ఇష్టంతోనే యూట్యూబ్ ఛానెల్లో అందుకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేసి.. విశేష జనాదరణ సంపాదించుకుంది. ఒకరకంగా ఆ అభిరుచి ఆమెకు మంచి పేరు, డబ్బులు తెచ్చిపెట్టాయి. రెస్ట్ తీసుకునే వయసులో కాలక్షేపం కోసం మొదలు పెట్టి.. దేశంలోనే టాప్ చెఫ్‌గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు నవంబర్ 2017లో సోషల్ మీడియా సమ్మిట్ & అవార్డ్స్‌లో టాప్ యూట్యూబ్ వంట కంటెంట్ క్రియేటర్‌గా గౌరవాన్ని పొందింది. జస్ట్ తన పాకనైపుణ్యాలతో ఏకంగా రూ. 43 కోట్ల నికర విలువతో భారీ సంపాదనను ఆర్జిస్తోంది నిషా. అంతేగాదు గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్న టాటా ట్రస్ట్‌ల ప్రాజెక్ట్ డ్రూవ్తో సహా అనేక ఇతర ప్రయత్నాలకు తన వంతు సహాయసహకారాలు అందించి సేవదృక్పథంలో కూడా మేటి అనిపించుకుంది. (చదవండి: చందమామ లేదు.. యూట్యూబ్ ఉంది..!) -
Anisha Dixit: సీరియస్ కంటెంట్‌ని.. కామెడీ ట్రాక్‌లో నడిపించడమే ఆమె స్పెషాలిటీ!
యాక్ట్రెస్, మోడల్, కమెడియన్, యూట్యూబర్. ‘రిక్షావాలీ’గా పాపులర్. అదే ఆమె యూట్యూబ్ చానెల్. గర్ల్ సెంట్రిక్ కామెడీకి ఫేమస్. జర్మనీలో పుట్టిపెరిగింది. భారతీయ మహిళల దినచర్య, వాళ్ల ఇబ్బందులు, సమస్యల మీద వీడియోలు చేస్తుంది. సీరియస్ కంటెంట్‌ని కామెడీ ట్రాక్‌లో నడిపించడమే ఆమె స్పెషాలిటీ. ఒక్కమాటలో చెప్పాలంటే ‘రిక్షావాలీ’ అమ్మాయిలను సాధికారత దిశగా ఇన్స్పైర్ చేసే చానెల్! లక్ష్యల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. అనీశా టెడ్ఎక్స్ స్పీకర్ కూడా! -
‘బంగాదేశ్ నుంచి ఇలా చొరబడొచ్చు’
రిజర్వేషన్ల వ్యతిరేక అల్లర్లతో బంగ్లాదేశ్ అట్టుడికి పోయింది. ఇప్పుడిప్పుడే దేశంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే బంగ్లాదేశ్ ఏర్పడినప్పటి నుండి అక్కడి ప్రజలు తరచూ భారతదేశంలోకి చొరబడే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ చొరబాట్లు భారత్‌కు పెద్ద సమస్యగా మారాయి. తాజాగా బంగ్లాదేశ్‌కు చెందిన ఓ యూట్యూబర్ తమ దేశం నుంచి భారత్‌లోకి చొరబడటం చాలా సులభం అని చెబుతూ ఒక వీడియో చేశాడు. ఆ వీడియోలో సదరు యూ ట్యూబర్ చొరబాటు లొకేషన్‌ను రికార్డ్ చేశాడు. ఎలాంటి వీసా లేదా చెకింగ్ లేకుండా ఈ మార్గం గుండా భారతదేశంలోకి ప్రవేశించవచ్చని ఆ వీడియోలో చూపించాడు.ఆ వీడియోలో ఒక వైపున భారతదేశం మరొక వైపు బంగ్లాదేశ్ అని గుర్తించిన మార్కింగ్‌లు కూడా కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో ఎక్కడా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది కనిపించకపోవడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ❗National Security Alert❗A Bangladeshi YouTuber who is making videos on his YouTube channel and telling how to enter In India without passport and visa.pic.twitter.com/smwoC29qZU— DUDI_PARMARAM🇮🇳 (@PARMARAMDU12861) July 26, 2024 -
ట్రోల్స్, రోస్టర్స్ ముసుగులో రెచ్చిపోతున్న కామాంధులు..
-
యూట్యూబర్ ఓవర్ యాక్షన్.. దిమ్మతిరిగే షాక్!
సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఓవర్ యాక్షన్ చేస్తే అది మన మెడకే చుట్టుకుంటుంది. ఛానల్ ఉంది కదా అనో, చేతిలో కెమెరా ఉంది కదా అనో విచక్షణ మరిచి ప్రవర్తించకూడదు. ఇది తెలియక చాలామంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లు ఫేక్‌వార్తలు, సమాచారంతో గప్పాలు కొడుతుంటారు. తాజాగా పబ్లిసిటీ కోసం నిషిద్ధ ప్రాంతంలోకి ఉద్దేశపూర్వకంగా ఎంటరైన ఒక యూట్యూబర్‌కి దిమ్మతిరిగే షాక్ తగిలింది. విషయం ఏమిటంటే.. బెంగళూరులోని యలహంకకు చెందిన వికాస్ గౌడ (23) అడ్డంగా బుక్కయ్యాడు. ఏప్రిల్ 7వ తేదీన మధ్యాహ్నం 12 గంటల సమయంలో చెన్నైకి వెళ్లే ఎయిరిండియా విమానం టిక్కెట్ బుక్ చేసుకున్నాడు. భద్రతా తనిఖీల అనంతరం విమానాశ్రయంలోకి ప్రవేశించాడు. ఇక్కడి దాకా బాగానే వుంది. విమానం ఎక్కకుండా, విమానాశ్రయ ఆవరణలోనే తిరుగుతూ వీడియో కంటెంట్‌ను రికార్డ్ చేశాడు. ఇక్కడితో సరిపెట్టినా బావుండేది. ఎయిర్‌పోర్ట్‌లో రోజంతా బస చేసా.. అయినా తనని ఎవరూ పట్టించుకోలేదంటూ ప్రగల్భాలు పలుకుతూ ఏప్రిల్ 12న ఒక వీడియో తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడు. విమానాశ్రయంలో మొత్తం తిరిగినా తనను ఎవరూ పట్టుకోలేదంటూ, ఎయిర్పోర్ట్ భద్రత గురించి నెగెటివ్ కామెంట్ చేశాడు. అంతా అయ్యాక డ్యామేజ్ కంట్రోల్లో పడ్డాడు. ఆ ఎయిర్పోర్ట్ వీడియోను తన ఛానెల్ నుండి తీసివేశాడు. కానీ అది కాస్తా చేరాల్సిన వారి దృష్టికి అప్పటికే చేరిపోయింది. కట్ చేస్తే.. విషయం తెలుసుకున్న ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ వింగ్ సీఐఎస్ఎఫ్ వికాస్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో అతణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్లు 505, 448 కింద కేసు కూడా నమోదు చేశారు. తన ఫ్లైట్ మిస్సయ్యానని పేర్కొంటూ, సుమారు ఆరు గంటలపాటు విమానాశ్రయంలో తిరిగాడని, కానీ అతను చెప్పినట్టుగా 24 గంటలు కాదని తన విచారణలో తేలిందని భద్రతా అధికారులు వెల్లడించారు. అతని మొబైల్ ఫోన్నుస్వాధీనం చేసుకున్నారు. ఎట్టకేలకు తను చేసింది తప్పేనని అంగీకరించాడు. ప్రచారంకోసం అలా చేశానంటూ లెంపలేసుకున్నాడు. మొత్తం మీద గౌడకు బెయిల్ మంజూరు కావడంతో బతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు. -
Angry Rantman Death: ప్రముఖ యూట్యూబర్ కన్నుమూత.. గుండె పగిలిందంటున్న ఫ్యాన్స్
#Angry Rantman ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్,యూట్యూబర్ అబ్రదీప్ సాహా (Abhradeep Saha) అలియాస్ యాంగ్రీ రాంట్‌మ్యాన్ (Angry Rantman)కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రాంట్‌మ్యాన్ మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచాడు. దీంతో అభిమానుల సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. చిన్న వయసులోనే వెళ్లి పోయాడంటూ అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు. కర్ణాటకు చెందిన అబ్రదీప్ సాహా సోషల్ మీడియాలో రాంట్ మ్యాన్ పేరుతో చాలా పాపులర్. సమాజంలో ప్రతి రోజూ జరిగే అంశాలపై తనదైన శైలిలో వీడియోలు చేస్తూ ఫాలోయర్లు ఆకట్టుకునేవాడు. అతికొద్ది సమయంలోనే దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇటీవలి అతని యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ ప్రకారం యాంగ్రీ రాంట్‌మ్యాన్ గత నెలలో పెద్ద ఆపరేషన్ జరిగింది. లైఫ్ సేవింగ్ సపోర్ట్ సిస్టమ్మీద ఉన్నాడని, తొందరగా కోలుకోవాలని ప్రార్థించాలని అభిమానులను కోరుతూ ఆ తరువాతి అప్డేట్ ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతని ఆరోగ్యం క్షీణించి చనిపోయినట్టు తెలుస్తోంది. 2017, ఆగస్టు 18 లో అబ్రదీప్ తన YouTube ఛానెల్‌ని “నేను అన్నాబెల్లె మూవీని ఎందుకు చూడను!!!!!!” , అలాగే ‘ది కన్జూరింగ్’ చూసిన తర్వాత ఇకపై హారర్ చిత్రాలను చూడడానికి చాలా భయపడ్డానంటూ రివ్యూ వీడియోలు చేశాడు. తనదైన హావభావాలతో ఫన్నీ రివ్యూలతో నెట్టింట్ హల్ చల్ చేసేవాడు. ఈ క్రమంలో 2018 డిసెంబరులో కేజీఎఫ్ సినిమా రివ్యూతో మరింత ట్రెండింగ్‌లోకి వచ్చాడు. కేవలం 27 ఏళ్ల వయసులో అకాల మరణంతో మరోసారి ట్రెండింగ్‌లో నిలవడం విషాదం. యాంగ్రీ రాంట్ మ్యాన్ హ్యాష్ ట్యాగ్ వైరలవుతోంది. Gonna miss pearls of wisdom like these. #AngryRantman pic.twitter.com/wQhnNUGC5G — Ritesh (@Szoboszlai8_) April 17, 2024 -
Ashish Chanchlani: టాలెంట్‌తో.. బిలియన్ల వ్యూస్.. మిలియన్ల సబ్స్క్రైబర్స్..
'Ashish Chanchlani Vines అనే యూట్యూబ్ చానెల్‌తో clout అయ్యాడు. కామెడీ వీడియోస్‌కి వెల్‌నోన్. అమ్మాయిగా.. తండ్రిగా.. కొడుకుగా.. ఇలా డిఫరెంట్ రోల్స్ వేయడంలో ఆశీష్ని మించిన క్రియేటర్ లేడు. సోషల్ మీడియాలో, స్టూడెంట్ లైఫ్, ఎగ్జామ్స్, ఆఫీస్ డ్రామా, ఫ్యామిలీ ఇష్యూస్.. ఇలా ఈ కుర్రాడు ఫోకస్ చేయని టాపిక్ లేదు.' సబ్జెక్ట్ ఏదైనా హిలేరియస్ ట్విస్ట్స్ కడుపుబ్బా నవ్వించే కంటెంట్‌ని చూపిస్తాడు. ఆశీష్ పుట్టి, పెరిగింది మహారాష్ట్రలోని ఉల్లాస్ నగర్లో. ఇంజినీరింగ్ చదువు కోసం నవీ ముంబై చేరాడు. ఫ్రమ్ ద చైల్డ్ హుడ్ అతనిలో యాక్టింగ్ ఇన్స్టింక్ట్ ఉండటంతో టీన్స్‌లో అది డామినేట్ చేసింది. దాంతో మధ్యలోనే ఇంజినీరింగ్‌కి గుడ్ బై చెప్పేశాడు. ఆ గట్స్ అండ్ గట్ ఫీలింగ్‌తో సోషల్ మీడియాలో జర్నీ స్టార్ట్ చేశాడు. యూట్యూబ్ చానెల్ పెట్టి.. చదువు మధ్యలోనే వదిలేసినందుకు రిగ్రెట్ ఫీలయ్యే చాన్స్ ఆశీష్కివ్వలేదు డెస్టినీ! ఫన్నీ వీడియోస్‌తో వితిన్ ద షార్ట్ టైమ్ వెరీ పాపులర్ అయిపోయాడు. ఎంతలా అంటే బాలీవుడ్ బిగ్గీస్ తమ మూవీస్‌కి అతనితో ప్రమోషనల్ వీడియోస్ చేయించుకునేంతలా! అంతేకాదు షాహిద్ కపూర్, కార్తిక్ ఆర్యన్, సారా అలీఖాన్ వంటి బాలీవుడ్ స్టార్స్‌తో కలసి యాడ్స్ చేశాడు. ఇంకో ఇంపార్టెంట్ థింగ్.. 'మెన్ ఇన్ బ్లాక్ ఇంటర్నేషనల్' అనే హాలీవుడ్ మూవీలో కూడా యాక్ట్ చేశాడు. 'ఆఫ్రీ సఫర్' అనే షార్ట్ హారర్ ఫిల్మ్ తీసి తనలోని డైరెక్షన్ చూపించాడు. ఆశీష్ యూట్యూబ్ చానెల్, ఇన్‌స్టా హ్యాండిల్ వంటి వేరియస్ సోషల్ మీడియా అకౌంట్స్‌కి బిలియన్ల వ్యూస్.. రెండు అంకెల మిలియన్ల ఫాలోవర్స్.. అంతకన్నా ఎక్కువ రేంజ్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నెలకు లక్షల్లో ఆమ్దనీ వస్తోంది. అవార్డులు కూడా బాగానే గెలుచుకున్నాడు. 'బెస్ట్ డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్' కేటగిరీలో దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్ అందుకున్నాడు. వరల్డ్ బ్లాగర్స్ అవార్డ్స్ ప్రారంభించిన ఏడాదే (2019) కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో 'బెస్ట్ కామెడీ ఇన్ఫ్లుయెన్సర్' అవార్డును సాధించాడు. ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30లోనూ లిస్ట్ అయ్యాడు. కాన్ఫిడెన్స్ ఉంటే కేన్స్ దాకా వెళ్లొచ్చని భలే ప్రూవ్ చేశాడు కదా! ఇవి చదవండి: అక్షయ్ కుమార్ నుంచి కత్రినా వరకు .. డైట్ సీక్రెట్స్ ఇవే.. -
షూట్ విషయంలో గొడవ.. బిల్డింగ్‌పై నుంచి దూకిన యూట్యూబ్ జంట
క్షణికావేశంలో తీసుకునే కఠిన నిర్ణయాలకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. చిన్న చిన్న సంఘటనలు చిలికి చిలికి గాలి వానలా మారడంతో నిండు జీవితాలు బలైపోవడమే కాకుండా.. కుటుంబీకుల్లోనూ కొండంత విషాదాన్ని మిగిల్చుతుంది. తాజాగా ఇలాంటి ఘటనే హర్యానాలోని బహదూర్‌ఘర్‌లో వెలుగుచూసింది. ఓ విషయంలో గొడవపడిన జంట.. తొందరపాటు నిర్ణయంతో బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను డెహ్రడూన్‌కు చెందిన గర్విత్ 25, నందిని 22గా గుర్తించారు. గర్విత్, నందిని ఇద్దరూ కంటెంట్ క్రియేటర్స్, సొంతంగా ఛానల్ పెట్టి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్,ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో రీల్స్, షార్ట్ వీడియోలు చేస్తూ ఉంటారు. కొన్ని రోజుల కిత్రమే ఈ జంట తమ టీమ్‌తో కలిసి డెహ్రడూన్ నుంచి బహదూర్‌ఘర్‌కు మారారు. రుహీలా రెసిడెన్సీలోని ఏడవ అంతస్తులో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని ఉంటున్నారు. టీమ్‌లోని మరో అయిదుగురు రూమ్మేట్స్తో జీవిస్తున్నారు. ఈ క్రమంలో బయట షూటింగ్ పూర్తి చేసుకొని శనివారం తెల్లవారుజామున ఇంటికి వచ్చారు. అయితే ఇద్దరి మధ్య షూట్ విషయంలో వాగ్వాదం ఏర్పడింది. ఇది కాస్తా పెరిగి పెద్దది అవ్వడంతో క్షణికావేశంలో జంట బిల్డింగ్ ఏడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చివరగా.. ఏ సమస్యకైనా ఆలోచిస్తే తప్పక పరిష్కారం ఉంటుంది.. ప్రాణానికి మించింది ఏదీ లేదు.. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని జీవితాలను బలితీసుకోవద్ద -
ఎన్నికల ముందు ఎందర్ని జైల్లో వేస్తారు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: తమిళనాడు సీఎం స్టాలిన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో సత్తై దురై మురుగన్ అనే యూట్యూబర్‌కు బెయిల్‌ను సుప్రీంకోర్టు పునరుద్ధరించింది. ‘‘యూట్యూబ్‌లో ఆరోపణలు చేశారంటూ ఎన్నికల వేళ ప్రతి ఒక్కరినీ జైళ్లలో వేయడం ప్రారంభిస్తే ఎందరు కటకటాల పాలవుతారో ఊహించండి’’ అని జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. నిరసన తెలపడం, అభిప్రాయాల వ్యక్తీకరణ ద్వారా స్వేచ్ఛను దుర్వినియోగపరిచినట్లుగా భావించరాదని పేర్కొంది. స్టాలిన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు ఆపడం లేదన్న ఫిర్యాదుపై మద్రాస్ హైకోర్టు బెయిల్ రద్దు చేయడంతో మురుగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ఎన్నికల ముందు ఎంత మందిని జైల్లో వేస్తారు? సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ముందు ఎంతమందిని జైల్లో వేస్తారని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. సోషల్ మీడియాలో ఆరోపణలు చేసిన అందరినీ జైల్లోకి నెట్టలేమని తెలిపింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ యూట్యూబర్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు జస్టిస్‌లు అభయ్ ఎస్ ఓకా, ఉజ్జల్ భూయన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెల్లడించారు. సీఎం స్టాలిన్‌పై 2021లో యూట్యూబర్ దురైముగురుగన్ సత్తాయి అవమానకర వ్యాఖ్యలు చేశారు. ఆ కేసులో అతన్ని అప్పట్లో అరెస్టు చేశారు. 2021 నవంబర్‌లో మద్రాసు హైకోర్టు అతనికి బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత హైకోర్టులోని డివిజన్ బెంచ్ ఆ బెయిల్‌ను రద్దు చేసింది. తన బెయిల్‌ను రద్దు చేసిన మద్రాస్ హైకోర్టు ఆదేశాలను మురుగన్ సుప్రీంలో సవాల్ చేశారు. 2022లో అత్యున్నత న్యాయస్థానం ఆ యూట్యూబర్‌కు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి అతను ఆ బెయిల్‌పైనే ఉన్నాడు. గడిచిన 2.5 ఏళ్లుగా మురుగన్ బెయిల్‌పైనే ఉన్నారని, అతని బెయిల్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తాము కొట్టిపారేస్తున్నామని నేడు సుప్రీం బెంచ్ తెలిపింది. కాగా మురుగన్ తనకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేశాడని నిరూపించడనికి ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని పేర్కొంది. బెయిల్‌పై ఉన్న యూట్యూబర్ అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఆయనపై షరతు విధించాలన్న అభ్యర్ధనను సైతం కోర్టు తోసిపుచ్చింది. తమిళనాడు ప్రభుత్వం తరపున హాజరైన న్యాయవాది ముకుల్ రోహత్గిని ఉద్దేశిస్తూ. ‘ఎన్నికల ముందు యూట్యూబ్‌లో ఆరోపణలు చేసే ప్రతి ఒక్కరినీ కటకటాల వెనక్కి నెట్టడం ప్రారంభిస్తే, ఎంతమందికి జైలు శిక్ష పడుతుందో ఆలోచించండి.. ఎంతమందికి జైలు శిక్ష పడుతుందో ఆలోచించండి’ అంటూ జస్టిప్ ఓకా ప్రశ్నించారు. -
ఇంటర్వ్యూ కోసం వెళ్తే.. కిడ్నాప్ చేశారు
ఈరోజుల్లో యూట్యూబర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. కొందరు జెన్యూన్‌గా సబ్ స్క్రైబర్లను పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. మరికొందరు మాత్రం రకరకాల ఫీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో.. కాస్త ఫేమ్ సంపాదించుకున్న ఓ యూట్యూబర్ సాహసం ప్రదర్శించబోయి చిక్కుల్లో పడ్డాడు. జార్జియాకు చెందిన యూట్యూబర్ అడిసన్ పీయెర్రె మాలౌఫ్(యూట్యూబ్‌లో YourFellowArab/Arab). ప్రపంచంలో ప్రమాదకరమైన ప్రాంతాలుగా పేరున్న చోట్లకు వెళ్తూ.. అత్యంత ప్రమాదకరమైన వ్యక్తుల్ని ఇంటర్వ్యూలు చేస్తూ ఆ వీడియోలతో 1.4 మిలియన్ సబ్స్కయిబర్లను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో.. కరేబియన్ దేశం హైతీలో ఓ ముఠా నాయకుడ్ని ఇంటర్వ్యూ చేయాలని డిసైడ్ అయ్యాడు. మావోజో అనే ముఠా నాయకుడు జిమ్మీ ‘బార్బీక్యూ’ చెరిజైర్కు హైతీలోనే కరడుగట్టిన గ్యాంగ్ లీడర్‌గా పేరుంది. అలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడానికి అడిసన్ వెళ్లాడు. ఇందుకోసం హైతీలో ఓ స్థానిక టూరిస్ట్ సాయం తీసుకున్నాడు. అయితే.. ఆ గ్యాంగ్ ఉండే ప్రాంతానికి వెళ్లగానే వాళ్లిద్దరినీ తుపాకులతో 400 మంది చుట్టుముట్టారు. వదిలిపెట్టాలంటే 6 లక్షల డాలర్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. this is the last footage arab uploaded for me before he got kidnapped pic.twitter.com/vRbYdarPn1 — masih (@VFXmasih) March 29, 2024 తన దగ్గరున్న 40 వేల డాలర్లను వాళ్లకు ఇచ్చేసి విడిచిపెట్టమని అడిసన్ బతిమాలాడట. అయితే ఆ ముఠా అవి లాగసుకుని.. మిగతాది ఇస్తేనే రిలీజ్ చేస్తామని షాకిచ్చింది ఆ గ్యాంగ్. దీంతో తన స్నేహితుల కాంటాక్ట్ కోసం అడిసన్ ప్రయత్నిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో.. మార్చి 14వ తేదీన అడిసన్ను మావోజో ముఠా కిడ్నాప్ చేయగా, రెండు వారాలు ఆలస్యంగా ఆ విషయం బయటి ప్రపంచానికి తెలిసిందే. తోటి యూట్యూబర్ ఒకరు ఈ సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అతన్ని విడిపించేందుకు అవసరమైన డబ్బును సమీకరించేందుకు కొందరు యూట్యూబర్లు ముందుకు వచ్చారు. -
Siraj collection and Vlogs: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు...
యూట్యూబ్ ‘సిల్వర్ ప్లే బటన్’ను సొంతం చేసుకోవడం అనేది అంత వీజీ కాదు. లక్ష మంది సబ్స్క్రైబర్లు ఉన్న కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ ప్రతిష్ఠాత్మకమైన సిల్వర్ ప్లే బటన్ సొంతం అవుతుంది. అయితే పాకిస్థాన్‌లోని గిల్గిత్–బల్టిస్థాన్ ప్రాంతంలోని ఖప్లూ నగరానికి చెందిన మహ్మద్ సిరాజ్ అనే పిల్లాడు మాత్రం తన యూట్యూబ్ చానల్ ‘సిరాజీ విలేజ్ వ్లోగ్స్’తో ‘సిల్వర్ ప్లే బటన్’ను అవలీలగా సాధించాడు. సిరాజ్ చానల్‌కు లక్షమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. చెల్లి ముస్కాన్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి సిరాజ్ చేసిన వీడియోలు పాపులర్ అయ్యాయి. యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్‌ను సిరాజ్ అన్బాక్సింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయింది. -
బిగ్‌బాస్ విన్నర్ ఓవరాక్షన్.. యూట్యూబర్‌ను దారుణంగా కొడుతూ..
హిందీ బిగ్‌బాస్ విన్నర్ ఎల్విష్ యాదవ్ ఓ యూట్యూబర్‌పై దాడి చేశాడు. తన మనుషులను వెంటేసుకుని షాపింగ్‌మాల్‌కు వెళ్లి సాగర్ ఠాకూర్ అలియాస్ మాక్స్టర్న్ను చితకబాదాడు. మొదటగా తనను కలిసేందుకు వచ్చాడేమోననుకుని పలకరించడానికి ముందుకు వెళ్లాడు సదరు యూట్యూబర్. కానీ అతడు దగ్గరకు వెళ్లగానే ఎల్విష్.. తన చెంప చెళ్లుమనిపించాడు. కాలితో తన్నాడు. 10 మందితో కలిసి దాడి అతడు తిరిగి దాడి చేద్దామనుకునేలోపు ఎల్విష్ మనుషులు సాగర్‌ను చితకాబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు గురుగ్రామ్ పోలీసులు ఎల్విష్ యాదవ్‌పై కేసు నమోదు చేశారు. 'ఎల్విష్ నన్ను కలవాలనుకుంటున్నాడని తెలిసినప్పుడు ఏదో మాట్లాడతాడనుకున్నాను. కానీ 10 మందిని వెంటేసుకుని వచ్చి నాపై దాడి చేశాడు. బూతులు మాట్లాడుతూ.. వారు తాగి ఉన్నారు. బూతులు మాట్లాడుతూ కొట్టారు. ఎల్విష్ నా వెన్నెముక విరగ్గొట్టాలని చూశాడు. మార్చి 8న ఈ ఘటన జరిగింది. అతడు వెళ్లిపోతూ నన్ను చంపేస్తానని బెదిరించాడు' అంటూ మరో వీడియో రిలీజ్ చేశాడు యూట్యూబర్. కాగా సాగర్ ఠాకూర్.. గతంలో ఎల్విష్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని, ఆ కోపంతోనే ఇలా దాడి చేశాడని తెలుస్తోంది. అటు ఎల్విష్.. పామువిషంతో రేవ్ పార్టీ చేసుకున్నాడంటూ గతేడాది చివర్లో అతడిపై కేసు కూడా నమోదైంది. ఇంతలోనే మరోసారి చీప్‌గా ప్రవర్తిస్తూ కేసులో ఇరుక్కున్నాడు. Full-Kalesh b/w You tuber Elvish Yadav and Real Maxtern yesterday night (With Audio) pic.twitter.com/s8DMjB1qOV — Ghar Ke Kalesh (@gharkekalesh) March 8, 2024 Real Maxtern Reply after this Kalesh Incident:pic.twitter.com/7ubeQZMvSV https://t.co/fjhAGtWCE5 — Ghar Ke Kalesh (@gharkekalesh) March 8, 2024 చదవండి: చెఫ్ అవతారంలో మన గ్లోబల్ స్టార్.. ఉపాసన వీడియో వైరల్! -
YouTube: మీకు మీరే బాస్
ఒక్క వీడియో వైరల్‌గా మారినా.. లక్షలాది రూపాయలు వచ్చి బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. యూజర్లు నచ్చే, మెచ్చే అలాంటి వీడియోలను మరిన్ని అందిస్తూ వెళితే మంచి పేరు, గుర్తింపు, ఐశ్వర్యం సంపాదించుకోవచ్చు. ఇదంతా యూట్యూబ్ ప్రపంచం గురించే. నేడు వయసుతో సంబంధం లేకుండా యూట్యూబర్ కావాలనే అభిలాష చాలామందిలో కనిపిస్తోంది. యూట్యూబ్ కంటెంట్ ద్వారా దండిగా ఆదాయాన్ని సంపాదించుకోవాలన్న కాంక్ష కూడా కనిపిస్తోంది. కానీ ఎలా..? ఎలాంటి సందేహం వచి్చనా, ఆరోగ్యం లేదా ఆహారం, విద్య, వృత్తి, వినోదం, విహారం, యోగాభ్యాసం ఇలా అన్నింటికీ చిరునామాగా యూట్యూబ్ మారిపోయింది. ఎలాంటి సమాచారం కావాలన్నా కళ్ల ముందుంచుతుంది. వీక్షకులకు కావాల్సినంత సమాచారం, వినోదం. పంచే వారికి పండంటి ఆదాయం. ప్రపంచవ్యాప్తంగా 27 శాతం మంది ఇంటర్నెట్ యూజర్లు 2023లో వారంలో 17 గంటల చొప్పున వీడియోలను వీక్షించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. నేడు ఎక్కువ మంది సమాచారాన్ని వీడియోల రూపంలోనే పొందుతున్నారు. కనుక యూట్యూబ్ వినోదం లేదా సమాచార వేదికగానే మిగిలిపోవడం లేదు. ఉపాధిని వెతుక్కునే అవకాశాలకు చిరునామాగా మారిపోయింది. ప్రతి నెలా రూ.లక్షలాది రూపాయలు సంపాదించే తెలుగు యూట్యూబర్లు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో ఒకరిగా చేరిపోవాలంటే..? ఏమి కావాలి..? ఎలాంటి పెట్టుబడి లేకుండా యూట్యూబ్ చానల్ ఆరంభించడం చాలా మందిని ఆకర్షిస్తున్న అంశం. ఓ మంచి ఫోన్, ల్యాప్‌టాప్, వీడియో ఎడిటింగ్ టూల్ (ఉచిత), రూ.150 పెట్టుబడితో వచ్చే మైక్ ఉంటే చాలు. ఇక్కడ ధన పరమైన పెట్టుబడి పెద్దగా అవసరం లేదు. ప్రయత్నం, కృషి, అంకిత భావం వంటి వనరులు కావాలి. వీలైనంత సమయాన్ని వెచి్చంచాలి. ‘‘నేను నా కుటుంబంతో గడిపే దానికంటే పది రెట్లు అధిక సమయాన్ని యూట్యూబ్ కోసం ఆరంభంలో వెచ్చించాల్సి వచ్చేది. వీడియో చేయాలంటే అందుకు సంబంధించిన కంటెంట్ (సమాచారం) సిద్ధం చేసుకోవాలి. దాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత వీడియో షూట్ చేసి, ఎడిటింగ్ అనంతరం పబ్లిష్ చేయాలి. ఇందుకు ఎంతో సమయం పట్టేది. ప్రతిరోజూ ఒక వీడియో అంటే అది అసాధ్యం. దీనికంటే వారానికి రెండు, మూడు వీడియోలకు కుదించుకోవడం మంచిది. ప్రతి సోమవారం, శుక్రవారం సాయంత్రం నిర్ధిష్ట సమయంలో వీడియోలను అప్లోడ్ చేయడం వల్ల యూజర్లకు మరింత చేరువ కావచ్చు’’అని యూట్యూబర్ రతీష్ (‘రతీష్‌ఆర్‌మీనన్’) తెలిపారు. వ్యక్తిగతంగా ఒక నెలలో 8 వీడియోలకు మించి చేయడానికి సమయం సరిపోదన్నది అతడి అభిప్రాయం. బాగా పాపులర్ అయి, సబ్ర్‌స్కయిబర్లు మిలియన్ దాటిపోతే, అప్పుడు సహాయకులను పెట్టుకుని పూర్తి స్థాయి యూట్యూబర్‌గా మరిన్ని వీడియోలు చేయడాన్ని పరిశీలించొచ్చు. కానీ, ఆరంభంలో పరిమాణం కాకుండా, నాణ్యతకు పెద్దపీట వేయాలి. యూజర్లతో బలమైన బాండింగ్ అవసరం. ఆరంభం ఇలా.. ► 18 ఏళ్లు నిండి, భారత్‌లో నివసించే స్థానికులు ఎవరైనా యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ (వైపీపీ)లో నమోదుకు అర్హులే. చానల్ ప్రారంభించి వీడియోల పోస్టింగ్ అనంతరం ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. ► వైపీపీలో చేరాలంటే కనీస చందాదారులను సంపాదించి ఉండాలి. ‘నోటిఫై మీ వెన్ ఐ యామ్ ఎలిజబుల్’ నోటిఫికేషన్ అలర్ట్ పెట్టుకుంటే చాలు. మీ చానల్‌కు అర్హత లభించిన వెంటనే యూబ్యూబ్ నుంచి ఆహా్వనం వస్తుంది. ► ఒక్కసారి మీ చానల్ వైపీపీ కోసం ఎంపిక అయిందంటే అప్పుడు నియమ, నిబంధనలకు అంగీకరిస్తూ, మానిటైజేషన్ ఫీచర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా పని చేస్తుంది..? యూట్యూబ్‌లో వీడియోలను పోస్ట్ చేయాలంటే అందుకు సంబంధించి నియమ, నిబంధనలు తెలిసి ఉండాలి. అశ్లీల, హానికారక, తప్పుదోవ పట్టించే, అవాస్తవ, కల్పిత సమాచారాన్ని వ్యాప్తి చేయకూడదు. చట్టబద్ధంగా వ్యవహరించాలి. వీడియోలు పోస్ట్ చేసే విషయంలో పరిమితి లేదు. వాటిపై ఆదాయం కోరుకునేట్టు అయితే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ (వైపీపీ) కింద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మానిటైజేషన్ ప్రోగ్రామ్‌ను ఎంపిక చేసుకోవాలి. యూట్యూబ్ చానల్‌కు ఎంత మంది సబ్‌్రస్కయిబర్లు (సభ్యులు) ఉన్నారనేది ఇక్కడ కీలకం అవుతుంది. ఒకరు ఎంపిక చేసుకున్న ప్రోగ్రామ్ మాడ్యూల్ ఆధారంగా ఆర్జించే మొత్తం ఆధారపడి ఉంటుంది. ‘‘ఆవిష్కరణలకు యూట్యూబ్ మద్దతు పలుకుతుంది. సృజనాత్మకత ఎలా ఉన్నా సరే దాన్ని యూజర్లకు చేరువ చేసి వారికి తగిన ప్రతిఫలం అందించడమే మా లక్ష్యం. భారత్‌లో 2008లో పార్ట్నర్ (భాగస్వామి) కార్యక్రమాన్ని ప్రారంభించాం. వీడియో క్రియేటర్లు కంటెంట్ ద్వారా ఆర్జించడం మొదలైంది. క్రియేటర్ల విజయంపైనే ప్రకటనల ఆదాయం ముడిపడి ఉంటుంది’’అని యూట్యూబ్ ఇండియా డైరెక్టర్ ఇషాన్ జాన్ ఛటర్జీ వివరించారు. చానల్ సక్సెస్ కోసం..? ఏదైనా ఒక రంగం/విభాగం/సబ్జెక్ట్/కళలో నైపుణ్యాలు ఉంటే, దాన్ని యూజర్లకు అందించొచ్చు. మంచి సృజనాత్మకత ఉండాలి. లేదా సాధారణ విషయాలను సైతం కళాత్మకంగా పంచుకునే నైపుణ్యాలు కావాలి. విలువైన, ఉపయోగకరమైన కంటెంట్‌తో వీడియోలు పోస్ట్ చేయడమే కాదు.. వినూత్నంగా ఉండేలా చూసుకోవాలి. మీ ఛానల్ నుంచి కొత్త వీడియోలు ఎప్పుడు పోస్ట్ అవుతాయనే స్పష్టత యూజర్లలో ఉండాలి. రోజుకు ఒకటా? వారానికి ఒకటా లేదా రెండా..? ఏ సమయంలో వస్తుందనే స్పష్టత ఇవ్వాలి. వీడియోలను పోస్ట్ చేసిన తర్వాత వీక్షకులతో అనుసంధానం కావాలి. వీలైతే కామెంట్లను చదివి, వారి అభిప్రాయాలు అర్థం చేసుకోవడం, వారికి నచ్చేలా కంటెంట్‌ను అందించడంపై దృష్టి పెట్టాలి. వీలు చేసు కుని సబ్్రస్కయిబర్లతో చాట్, సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల బాండింగ్, బ్రాండింగ్ పెరుగుతుంది. అనలైసిస్ టూల్ వాడు కోవాలి. ఆరంభంలో ప్రయోగాలకు వెనుకాడకూడదు. సమయం చాలడం లేదని నాణ్యతలో రాజీపడకూడదు. మరింత మంది యూజర్లను చేరుకునేందుకు, అప్పటికే పాపులర్ అయిన యూట్యూబర్ల సాయం తీసుకోవచ్చు. యూజర్లను పెంచుకునే విషయంలో యూట్యూబ్ సైతం కావాల్సినంత సహకారం, మద్దతును అందిస్తుంది. యూజర్లకు చేరువ అయితే, ఆదాయం అదే వస్తుంది. ఆదాయం ఏ రూపంలో..? యూట్యూబ్‌లో కొత్తగా చేరిన వారు ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్ ద్వారా ఆదాయాన్ని పొందొచ్చు. చానల్ సభ్యులు నెలవారీగా చెల్లించే మొత్తం నుంచి కొంత యూట్యూబ్ పంచుతుంది. సూపర్ చాట్, సూపర్ స్టికర్స్ కోసం సభ్యులు చెల్లింపులు చేస్తారు. బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థి మన్దీప్ సింగ్ 2021లో ‘డేటాసైన్స్డైరీస్’ పేరుతో యూట్యూబ్ చానల్ తెరిచాడు. కృత్రిమ మేధకు సంబంధించి కంటెంట్‌ను ఇది అందిస్తుంటుంది. చందాదారులు కేవలం 1,500 మందే ఉన్నారు. దీంతో ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్ ద్వారా ప్రతి నెలా కొన్ని వేల రూపాయల చొప్పున ఆదాయం సంపాదించే వాడు. అదే ఫ్రీలాన్స్ వెబ్ డిజైనర్ రతీష్ ఆర్ మీనన్ ‘రతీష్‌ఆర్‌మీనన్’ పేరుతో 2012 నుంచి చానల్ నడుపుతుండగా, ప్రస్తుతం చందాదారులు 11.2 లక్షలకు చేరుకున్నారు. మూడు మార్గాల ద్వారా అతడికి ఆదాయం వస్తోంది. యూట్యూబ్ ప్రకటనల ఆదాయంతోపాటు, స్పాన్సర్డ్ ప్రకటనలు, అఫిలియేట్ మార్కెటింగ్ కమీషన్ ద్వారా ఆదాయం వస్తోంది. ఇందులో యూట్యూబ్ ప్రకటనల ఆదాయం ఒక్కటే నేరుగా యూట్యూబ్ నుంచి వచ్చేది. మిగిలిన రెండూ థర్డ్ పారీ్టల రూపంలో వస్తుంది. స్పాన్సర్డ్ ప్రకటనలకు సంబంధించి కంపెనీలు, బ్రాండ్లతో నేరుగా సంప్రదింపులు నిర్వహించుకోవచ్చు. ఇక అఫిలియేట్ మార్కెటింగ్ అంటే.. చానల్ డిస్క్రిప్షన్ లింక్ ద్వారా ఎవరైనా ఉత్పత్తిని కొనుగోలు చేస్తే వచ్చే ఆదాయం. ఉదాహరణకుఒక ఉత్పత్తికి సంబంధించిన యూఆర్ఎల్ లింక్‌ను వీడియో డి్రస్కిప్షన్లో ఉంచడం. ఎవరైనా యూజర్ ఆ లింక్‌ను క్లిక్ చేసి, సంబంధిత ఉత్పత్తి కొనుగోలు చేస్తే, దానిపై 2–5 శాతం కమీషన్‌గా లభిస్తుంది. ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్లో తనకు వచ్చే ఆదాయం నుంచి 70 శాతాన్ని యూట్యూబ్ చెల్లిస్తుంది. షార్ట్‌లకు సంబంధించి వ్యూస్ ఆధారంగా (ఎంత మంది వీక్షించారు) ఆదాయంలో 45 శాతాన్ని చెల్లిస్తుంది. వీడియోల్లో ప్రదర్శించే ప్రకటనల రూపంలో వచ్చే ఆదాయంలో 55 శాతాన్ని చెల్లిస్తుంది. యూట్యూబ్‌కు ప్రీమియం మెంబర్షిప్ ద్వారా కూడా ఆదాయం వస్తుంటుంది. ఈ ఆదాయంలోనూ కొంత వాటాను.. ఛానల్ కంటెంట్‌ను ఏ మేరకు యూజర్లు చూశారనే దాని ఆధారంగా యూట్యూబర్‌కు పంచుతుంది. రెగ్యులర్ ఆదాయానికి ప్రత్యామ్నాయమా..? తమ కంటెంట్‌కు ప్రపంచవ్యాప్త వీక్షకులు యూట్యూబ్ వల్లే సాధ్యమైనట్టు మెజారిటీ యూట్యూబర్లు అంగీకరిస్తున్నారు. కంటెంట్ ద్వారా ఆదాయాన్ని పొందే అవకాశం లభించినట్టు 80 శాతం మంది చెబుతున్నారు. ఇతర వృత్తి, ఉద్యోగాన్ని విడిచి పెట్టేసి యూట్యూబ్‌ను ప్రధాన ఆదాయ మార్గంగా చేసుకుందామని అనుకుంటున్నారా..? ఆచరణలో అదంత సులభమైన పని కాదు. యూట్యూబ్ ప్రపంచంలో ప్యాసివ్ ఆదాయం కోసం (రెండో ఆదాయ మార్గం) చానళ్లను నడిపిస్తున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. తమ కంటెంట్‌కు ఆదరణ వస్తూ, ఆదాయం పెరిగిన తర్వాత, పూర్తి స్థాయిలో యూట్యూబర్‌గా మారుతున్నారు. కనుక ప్రస్తుతం చేస్తున్న వృత్తి లేదా వ్యాపారం లేదా జాబ్ కొనసాగిస్తూనే.. తమకున్న ప్రత్యేక నైపుణ్యాల ఆధారంగా యూట్యూబ్ ఛానల్‌ను ఆరంభించి, ఖాళీ సమయాన్ని కంటెంట్ క్రియేషన్‌పై వెచి్చంచడం మంచి ఆలోచన అవుతుంది. యూజర్లను ఎలా ఆకర్షించాలి, ఆదాయం ఎలా పెంచుకోవాలి? తదితర విషయాలన్నీ తెలియడానికి కొంత వ్యవధి తీసుకుంటుంది. కనుక అప్పటి వరకు ఇతర ఆదాయ మార్గాలను ఎందుకు కాదనుకోవాలి. ఒకవైపు వృత్తి లేదా ఉద్యోగం చేస్తూ, మరోవైపు యూట్యూబ్ వీడియోల కోసం కావాల్సినంత సమయాన్ని వెచి్చంచడం కూడా కష్టమైన టాస్కే. అందుకే ఆరంభంలో కాస్తంత సమతుల్యం చేసుకుని, ఆ తర్వాత ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలి. సమయాన్ని పొదుపుగా వినియోగించుకున్న వారికే ఇది సాధ్యపడుతుంది. అసలు వీలు చేసుకోవడమే పెద్ద సమస్య అని కార్పొరేట్ ట్రైనర్ అయిన నిధి సైని పేర్కొన్నారు. ‘నిధిసైని2808’ పేరుతో ఆమె 2020లో యూట్యూబ్ చానల్ ప్రారంభించింది. 2,690 మంది యూజర్లే ఉన్నారు. అయినా కానీ తన చానల్‌ను మానిటైజ్ (ఆదాయం పొందడం) చేసుకోలేదు. కంటెంట్‌ను అందించేందుకు తగినంత సమయాన్ని వెచి్చంచలేనన్నది ఆమె అభిప్రాయం. కనీసం 1,000 మంది సబ్ర్‌స్కయిబర్లు, 4,000 గంటల వాచ్ అవర్స్ (గడిచిన ఏడాది కాలంలో) ఉంటే ఆదాయం పొందడానికి మార్గం ఏర్పడినట్టేనని రతీష్ అంటున్నారు. యూట్యూబ్ ప్రపంచంలో స్వల్ప మొత్తాన్ని ఆర్జించే వారే ఎక్కువ. యూట్యూబ్‌నే ప్రధాన వృత్తిగా మలుచుకుని, కావాల్సినంత ఆదాయం సంపాదించే వారు తక్కువ. యూట్యూబ్ ఛానల్ ఆరంభించి వీడియోలు పోస్ట్ చేసిన వెంటనే ఆదాయం మొదలు కాదు. ఎంత మంది చూశారు? ఎన్ని గంటల పాటు చూశారు? తదితర పారామీటర్ల ఆధారంగా ఆదాయం మొదలు కావడానికి సమయం తీసుకోవచ్చు. రతీష్‌ఆర్‌మీనన్ 2011లో చానల్ ప్రారంభించగా, నెల రోజుల్లోనే అతడికి ఆదాయం రావడం మొదలైంది. కాకపోతే అప్పట్లో నిబంధనలు ఇప్పటి మాదిరి కఠినంగా లేవు. 2014లో తన చానల్‌ను రీబ్రాండింగ్ చేసుకోగా, ఏడాదిన్నర క్రితమే ఒక మిలియన్ సబ్స్క్రయిబర్ల మార్క్ దాటింది. టెక్ వీడియోలు అప్లోడ్ చేసే రతీష్, ట్రావెల్ వీడియోలను కూడా పోస్ట్ చేసే యోచనలో ఉన్నారు. ఒక వీడియోకి 20,000 వీక్షణలు ఉంటే, టెక్ క్రియేటర్లకు నెలవారీ 500 డాలర్ల వరకు ఆదాయం (రూ.41,000) ప్రకటనల రూపంలో వస్తుందని చెప్పారు. అదే ఎంటర్టైన్మెంట్ చానల్ అయి, ఒక మిలియన్ వ్యూస్ ఉంటే నెలవారీ ఆదాయం రూ.2–3 లక్షల మధ్య ఉంటుందట. ఏమిటి మార్గం..? చానల్‌పై ఎంత సమయం వెచి్చంచగలరనేది ముందుగా నిర్ణయించుకోవాలి. తమ పరిమితులు తెలుసుకోవాలి. మరిన్ని వీడియోలు అందించే కొద్దీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించొచ్చు. కానీ, దాన్నే ప్రధాన ఆదాయ మార్గంగా మార్చుకోవడానికి ఎంతో సహనం, సమయం కావాలి. పెట్టిన చానల్, పోస్ట్ చేసే వీడియోలు ఆదరణ సంపాదించలేకపోవచ్చు. సక్సెస్ అవ్వకపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవేళ అనుకున్నట్టుగా ఫలితం రాకపోతే, అప్పుడు ప్లాన్ బీ కూడా ఉండాలి. యూట్యూబ్‌లో వీడియోలు పోస్ట్ చేయడం ఆపివేసిన వెంటనే, ఆదాయ మార్గం తప్పకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి. సంప్రదాయ వ్యాపారస్థులు కస్టమర్లను చేరుకునేందుకు యూట్యూబ్ ఛానళ్లను వినియోగించుకుంటున్నారు. తమ ఉత్పత్తులకు సంబంధించిన వీడియోలతో కస్టమర్లకు చేరువ అవుతున్నారు. సంగీతం, ఇతర కళల్లో పట్టున్న వారు యూట్యూబ్ చానళ్లు తెరిచి యూట్యూబ్ సాయంతో అభిమానులను పెంచుకుంటున్నారు. ఫలానా అనే కాకుండా, ప్రస్తుత మీ ఉపాధి, వృత్తి నైపుణ్యాలను విస్తరించుకునేందుకు సైతం యూట్యూబ్‌ను వేదికగా చేసుకోవచ్చు. -
బోర్డ్ ఎగ్జామ్స్ కూడా రాయలేదు..కానీ ఏకంగా రూ. 41 కోట్లు..!
ఓ యువకుడు ఉన్నత చదువలు చదవకపోయినా కోట్లు సంపాదించి ఆశ్చర్యపరుస్తున్నాడు. డబ్బు సంపాదించగల సత్తువ ఉంటే అకడమిక్ చదువులతో పనిలేదని ఈ వ్యక్తి ప్రూవ్ చేసి చూపించాడు. మన వద్ద మంచి టాలెంట్ ఉంటే దానికే పదును పెడితే కోట్టు వచ్చి పడతాయని చెప్పకనే చెప్పాడు ఈ కుర్రాడు. ఎలా అంత పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నాడంటే.. ఫరిదాబాద్కి చెందిన అజయ్ నగార్ Aka (ఆల్సో నోన్ యాజ్ ) కైరీమినాటీ.. తన పీర్స్‌లో bae (బిఫోర్ ఎనివన్ ఎల్స్) కెరీర్ స్టార్ట్ చేశాడు. కేవలం పదేళ్ల వయసులోనే! STeaLThFeArzZ అనే యూట్యూబ్ అకౌంట్లో వీడియోలు పోస్ట్ చేస్తూ.. తన మెయిన్ యూట్యూబ్ చానెల్ అడిక్టిడ్ ఏ1కి మాత్రం 2014లో లాగిన్ అయ్యాడు. అలా వీడియో గేమ్ క్లిప్స్.. రియాక్షన్ వీడియోస్ పోస్ట్ చేస్తూ! గతేడాది ఆగస్ట్ కల్లా 40 మిలియన్ సబ్‌స్క్రైబర్స్‌ని సంపాదించుకున్నాడు. తన అన్న యశ్ నగార్‌తో కలసి మ్యూజిక్ ఆల్బమ్స్కీ పనిచేస్తున్నాడు. అజయ్ నగార్ నెలకు 25 లక్షలు సంపాదిస్తున్నాడని, నెట్ వర్త్ దాదాపు 41కోట్లు ఉండొచ్చని పాపులర్ న్యూస్ సైట్ల అంచనా. హరియాణాలోని ఫరిదాబాద్కి చెందిన ఈ అబ్బాయి ఫెయిల్ అవుతానేమో అనే భయంతో ట్వల్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ రాయలేదట. కానీ లైఫ్‌లో మాత్రం పాస్ అయ్యాడు కదా అని ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు. ఆ ఫాలోయింగే అజయ్‌ని 2020లో ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా లిస్ట్‌లోకి చేర్చింది. అపార్ట్ ఫ్రమ్ అకడమిక్స్ సమ్ అదర్ టాలెంట్ ఆల్సో ఇంపార్టెంట్ అని ప్రూవ్ చేశాడు కదా అజయ్ నగార్! (చదవండి: ఇదేం అడవి? రాళ్లు మొలవడం ఏంటీ..?) -
అబ్బాయిలకు రక్షణ లేదు, నా కడుపు మీద కొట్టారు: పక్కింటి కుర్రాడు
సోషల్ మీడియా వచ్చాక ఫేమస్ అవ్వడం చాలా ఈజీ అయిపోయింది. కానీ ఆ పాపులారిటీని కాపాడుకోవడం మాత్రం అంత ఈజీ కాదు. పొరపాటున నోరు జారినా, ఏదైనా తప్పు చేసినా, ఏదేని కేసులో ఇరుక్కున్నా అప్రతిష్ట మూటగట్టుకుంటారు. నలుగురిలో నవ్వులపాలు అవుతారు. ప్రముఖ యూట్యూబర్, నటుడు చందుసాయికి ఇదే పరిస్థితి ఎదురైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. దాదాపు నెల రోజులు జైలు శిక్ష అనుభవించిన తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. విపరీతంగా ఏడ్చా.. చేయని తప్పుకు.. తాజాగా అతడు ఈ కేసు గురించి మాట్లాడుతూ.. ఏం జరిగిందనే విషయాలను ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. చందు మాట్లాడుతూ.. 'ఎవరిమీదైనా పగ తీర్చుకోవడానికి మరీ ఇంత దూరం వెళ్లకూడదు. ఉన్నది చెప్తే ఓకే కానీ లేనిది కల్పించడం అవసరమా? తప్పు కదా.. నా కుటుంబ సభ్యుల మీద కేసు పెట్టారు. అదింకా పెద్ద తప్పు. వాళ్లు ఎంత బాధపడతారు? 27 రోజులు జైల్లో ఉన్నాను. మొదటి మూడు రోజులు విపరీతంగా ఏడ్చేశాను. నిజం ఎప్పటికైనా తెలుస్తుందని బాధను దిగమింగుకుని బతుకుతున్నాను. రిలేషన్‌ను కాపాడుకోవాలనుకున్నా.. నిజంగానే నేను అమ్మాయిని ప్రేమించాను, తనతో రిలేషన్లో ఉన్నాను. కానీ సహజీవనం అనేది వేస్ట్ అని ఆలస్యంగా తెలిసొచ్చింది. నేను నా రిలేషన్‌షిప్‌ను కాపాడుకోవడానికి ఎంతో చేశాను, అక్కడ నేను ఏ తప్పూ చేయలేదు. అయినా చివరకు నాకే దిమ్మతిరిగేలా చేసి కేసు పెట్టారు. ఎంతో కష్టపడి పక్కింటి కుర్రాడిగా పేరు సంపాదించుకున్నాను. నా కడుపు మీద కొట్టారు. ఈ కేసు వల్ల ఓ సినిమా పోయింది. నేను దోషిని కాదు, అలా చూడకండి నా మీద కేసు ఫైల్ అయిందే తప్ప దోషినని రుజువు కాలేదు. దయచేసి ఎవరూ నన్నలా చూడకండి. అయినా అబ్బాయిలకు సమాజంలో రక్షణ లేదు. తప్పు జరిగితే అది ఇద్దరూ చేస్తారు. కానీ శిక్ష ఒక్కరికే పడుతుంది. ఈ విషయంలో అబ్బాయిలు చాలా జాగ్రత్తలు ఉండాలి' అని చెప్పుకొచ్చాడు చందు. చదవండి: 'విడాకులిచ్చేశా.. బిజీగా ఉన్నాను కాబట్టి లైట్..', జీవితం చాలా చిన్నది.. -
రియల్ ఐరన్ మ్యాన్ సూట్‌ని రూపొందించిన యూట్యూబర్!
నటులడు రాబర్ట్ డౌనీ జూనియర్ నటించిన హాలీవుడ్ సినిమా ఐరన్ మ్యాన్ విడుదలైనప్పటి నుంచి ఆ క్యారక్టర్‌కి విశేష ప్రజాధరణ లభించింది. ఆ క్యారక్టర్‌కి స్ఫూర్తిగా చాలామంది పలు రకాలుగా ఐరన్ సూట్లు రూపొందించారు. అయినప్పటికీ, రష్యన్ కంటెంట్ సృష్టికర్త ఇంజనీర్ అలెక్స్ బుర్కాన్ సృష్టి వేరుగా ఉంది, అతను మొదటి నుంచి ఐరన్ మ్యాన్ సూట్‌ను జాగ్రత్తగా జీవం పోసాడు. అతను రూపొందించిన సూట్ సౌందర్యానికి మించి, ఆధునాతన లక్షణాలతో నిండిన సాంకేతిక అద్భుతం. ఇతరులు రూపొందించినట్లుగా కాకుండా యూట్యూబర్సూ అలెక్స్ బుర్కాన్ సూట్లో సెల్ఫ్ పవర్డ్ హైడ్రోజన్ రియాక్టర్, రిపల్సర్ అప్‌గ్రేడ్, బుల్లెట్ ప్రూఫ్ ఆర్మర్ వంటి సాకేంతికత ఉంది.ఈ రష్యన్ ఇంజినీర్, యూట్యూబర్ అలెక్స్ బుర్కాన్ రూపొందించిన రియల్ ఐరన్ మ్యాన్ సూట్ ఆన్లైన్ కమ్యూనిటీని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ‘రియల్–లైఫ్ ఐరన్ మాన్ సూట్ విత్ ఏ రిపల్సర్ బ్లాస్ట్’ కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. ‘క్లిష్టమైన డిజైన్‌తో రూపొందించిన ఐరన్ మ్యాన్ సూట్‌కు సంబంధించి అలెక్స్ బుర్కాన్ ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని, సృజనాత్మకతను నెటిజనులు ప్రశంసిస్తున్నారు. తన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించి అలెక్స్ ఎదుర్కొన్న సాంకేతిక సవాళ్లు, టెస్టింగ్ దశలను తెలియజేసేలా ఉంటాయి ఈ వైరల్ వీడియోలు. ‘రియల్ లైఫ్ టోనీ స్టార్క్’ అంటూ అలెక్స్‌ను ఆకాశానికెత్తాడు ఒక నెటిజెన్. నిజానికి సైన్స్–ఫిక్షన్ టెక్కు సంబంధించి అలెక్స్‌కు ఇది ఫస్ట్ ఎక్స్పరిమెంట్ ఏమీ కాదు. గతంలో కూడా ఆశ్యర్యం కలిగించే ఎన్నో పరికరాలను తయారు చేసి గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కాడు. View this post on Instagram A post shared by Factpro (@thefactpro) (చదవండి: చీరకట్టులో జిమ్ వర్క్ఔట్స్!) -
శ్రీదేవి మరణంపై సంచలన ఆరోపణలు.. చిక్కుల్లో ప్రముఖ యూట్యూబర్!
అందాల తార, తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి శ్రీదేవి. కానీ ఉహించని విధంగా దుబాయ్‌లోని ఓ హోటల్లో కన్నుమూసింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న తుదిశ్వాస విడిచింది.బాలీవుడ్ నిర్మాత బోనీ కపూప్ పెళ్లాడిన శ్రీదేవికి ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. పెద్దకూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ మూవీ దేవరలో కనిపించనుంది. మరోవైపు చిన్నకూతురు ఖుషీ కపూర్ సైతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. అయితే శ్రీదేవి మరణంపై ఒడిశాకు చెందిన ప్రముఖ యూట్యూబర్ సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఆమె మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సహా పలువురు ప్రముఖుల పేర్లతో నకిలీ లేఖలను యూట్యూబ్‌లో ఉంచింది. శ్రీదేవి మరణంపై విచారణను రెండు ప్రభుత్వాలు దాచిపెడుతున్నాయంటూ గతంలో తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో ఆమెపై గతేడాది ముంబైకి చెందిన న్యాయవాది చాందినీ షా సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఆమె యూట్యూబ్ వీడియోలో ఉంచిన పత్రాలు నకిలీవని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా శ్రీదేవి మరణానికి స్పాన్సర్‌గా ప్రభుత్వాన్ని కించపరిచేలా పదేపదే మాట్లాడిందని ఆరోపించారు. ప్రధానమంత్రి, రక్షణ మంత్రి లేఖలతో పాటు సుప్రీంకోర్టుకు సంబంధించిన పత్రాలు, యూఏఈ ప్రభుత్వం నుంచి వచ్చిన రికార్డులు నకిలీవని తేలిందని న్యాయవాది ఫిర్యాదులో ప్రస్తావించారు. ఆయన ఫిర్యాదుతో యూట్యూబర్ దీప్తితో ఆమె లాయర్ భరత్ సురేశ్ కామత్‌లపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మొత్తానికి శ్రీదేవి మరణంపై సంచలన ఆరోపణలు చేసి ఇబ్బందుల్లో ఇబ్బందుల్లో పడ్డారు యూట్యూబర్. తాజాగా సీబీఐ ఛార్జిషీట్ వేయడంపై దీప్తి స్పందించారు. ఆ ఛార్జ్ షీట్ నమ్మేలా లేదని దీప్తి ఆరోపించారు. నా స్టేట్మెంట్ను రికార్డ్ చేయకుండా ఛార్జిషీట్ దాఖలు చేయడం చాలా ఆశ్చర్యంగా ఉందని అన్నారు. కాగా.. గతేడాది డిసెంబర్ 2న భువనేశ్వర్‌లోని ఆమె నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించి ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకుంది. శ్రీదేవి మరణంతో పాటు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై సంచలన కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలో జరిగిన చర్చల్లోనూ దీప్తి చురుకుగా పాల్గొంది. -
కుర్చీ తాత అరెస్ట్.. అసలు నిజాలు బయటపెట్టిన యూట్యూబర్
కుర్చీ తాత.. రెండు మూడు రోజుల క్రితం అరెస్ట్ అయ్యాడు. యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన ఇతడు.. 'గుంటూరు కారం'లోని ఓ పాట వల్ల మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ సడన్‌గా కుర్చీ తాతని అరెస్ట్ చేశారనే విషయం నెటిజన్స్ మధ్య చర్చకు కారణమైంది. ఓ యూట్యూబర్ కేసు పెట్టడంతోనే ఇలా జరిగింది. ఇప్పుడు సదరు యూట్యూబర్.. కుర్చీ తాత బండారం మొత్తం బయటపెట్టాడు. (ఇదీ చదవండి: దిగ్గజ హీరోయిన్ కన్నుమూత.. కారణం ఏంటంటే?) హైదరాబాద్‌లోని కృష్ణానగర్ పరిసర ప్రాంతాల్లో బిచ్చమెత్తుకుంటూ బతికే ఈ ముసలాయన.. ఓ ఇంటర్వ్యూలో 'కుర్చీ మడతపెట్టి..' అనే బూతు డైలాగ్ చెప్పి అలా ఫేమస్ అయిపోయాడు. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఈ పదాన్ని 'గుంటూరు కారం' కోసం తమన్ ఉపయోగించుకున్నాడు. అందుకు గానూ సదరు కుర్చీ తాతకు డబ్బులు కూడా ఇచ్చాడు. అయితే ఈ తాతకి గత కొన్నాళ్ల నుంచి సాయం చేస్తున్న వైజాగ్ సత్యనే ఈయనపై కేసు పెట్టాడు. అలానే అసలేం జరిగిందో మొత్తం చెప్పాడు. 'ఈయన(కుర్చీ తాత) అన్నం పెట్టిన వాడికే సున్నం పెట్టే టైప్. 'గుంటూరు కారం' సినిమాలోని పాటలో ఆయన డైలాగ్ పెట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ దగ్గరికి నేనే తీసుకెళ్లాను. తమన్‌తో మాట్లాడిన తర్వాత ఈ డైలాగ్ సినిమాలో పెట్టుకున్నారు. కుర్చీ తాతకు రూ.20 వేలు సాయం కూడా చేశారు. తర్వాత 'గుంటూరు కారం' స్పూఫ్ కాన్సెప్ట్‌తో తీసిన ఓ షార్ట్ ఫిల్మ్ కూడా చేయించాను. వాళ్లు రూ.5 వేలు ఇచ్చారు. అలా చిన్న చిన్న ఇంటర్వ్యూలు అవి చేసుకుంటూ బాగానే సంపాదించుకున్నాడు. అక్కడితో హ్యాపీగా ఉన్నాడని అనుకున్నాం. కానీ మహేశ్ బాబు దగ్గరికి నన్ను తీసుకెళ్లు.. నాకు ఇల్లు ఇప్పించు, ప్లాట్ ఇప్పించు అని నన్ను సతాయించాడు' (ఇదీ చదవండి: సీరియల్ హీరోయిన్ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్) 'అయితే మహేశ్‌బాబు నీకెందుకు ప్లాట్ ఇస్తాడని కుర్చీ తాతతో నేను అన్నాను. 'గుంటూరు కారం'తో ఆయన రూ.300 కోట్లు సంపాదించాడు. నాకు ప్లాట్ ఇప్పించు అని నన్ను ఒకటే ఇబ్బంది పెట్టాడు. ఆయనెందుకు నీకిస్తారు. ఒకవేళ డబ్బులొచ్చిన ప్రొడ్యూసర్‌కి వస్తాయి గానీ ఆయనకు వస్తాయా అని అడిగాను. దీంతో పగబట్టి.. నా మీద బ్యాడ్ వీడియోలు చేశాడు. సత్య ఓ దొంగ, నా మీద లక్షలు లక్షలు సంపాదిస్తున్నాడు. వాడి కాలు తీసేస్తా, చేయి తీసేస్తా, వాడిని మర్డర్ చేసేస్తా.. మా సొంత బావమరిదినే కుర్చీ మడతపెట్టి చంపేసా అని పిచ్చిపిచ్చిగా వీడియోలు చేశాడు' 'ఇక కుర్చీ తాత మీద నాకు చిరాకొచ్చింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను. దీంతో పోలీసులు.. కుర్చీ తాతని మడతపెట్టేశారు. తీసుకెళ్లి బాగా కోటింగ్ ఇచ్చారు. అయితే స్టేట్మెంట్లో మాత్రం.. వైజాగ్ సత్య చాలా మంచోడు, నా గాడ్ ఫాదర్ లాంటోడు.. కాకపోతే యూట్యూబర్సే నాకు మందు ఇచ్చి సత్యని తిట్టించారని చెప్పాడు. ఈ రోజు నుంచి ఆయనకు నాకు ఎలాంటి సంబంధం లేదు' అని యూట్యూబర్ సత్య చెప్పుకొచ్చాడు. అయితే ఇదంతా చూస్తుంటే కుర్చీ తాతకి కాస్త ఫేమ్ వచ్చేసరికి ఇగో ఎక్కువైపోయింది. దీంతో ఇన్నాళ్లు తన పక్కనున్న వాళ్లే అరెస్ట్ చేయించారు. అలానే పోలీసులు కౌన్సిలింగ్ కూడా ఇతడికి ఇచ్చినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: రూపాయి తీసుకోకుండా సినిమా చేయనున్న మహేశ్! కారణం అదేనా?) -
ట్రాన్స్ జెండర్‌పై అనుచిత వ్యాఖ్యలు..
చెన్నై: ట్రాన్స్‌జెండర్ వ్యాపారవేత్త, ఏఐఏడీఎంకే అధికారి ప్రతినిధి అప్సరా రెడ్డిని అప్రతిష్టపాలు చేసిన ఓ యూట్యూబర్‌కు మద్రాస్ హైకోర్టు రూ.50 లక్షల జరిమానా విధించింది! ఆమె ప్రొవోగ్ మేగజీన్‌లో పని చేసిన రోజుల్లో మైకేల్ ప్రవీణ్ అనే సహోద్యోగితో విభేదాలొచ్చాయి. దాంతో అతను అప్సరను కించపరుస్తూ 10 వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. ప్రవీణ్ నుంచి రూ.1.25 కోట్లు పరిహారం కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. ఆమెకు రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ‘‘సోషల్ మీడియాలో పోస్టులతో ఇతరుల గోప్యతకు భంగం కలిగించొద్దు. ఏ హక్కయినా పరిమితులకు లోబడి ఉంటుంది’’ అని పేర్కొంది. -
కోట్ల విలువైన బంగ్లాను కొనుగోలు చేసిన ప్రముఖ యూట్యూబర్!
ప్రముఖ యూట్యూబర్ కమ్ కమెడియన్ భువన్ బామ్ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. గుజరాత్‌కు చెందిన భువన్ దేశ రాజధాని ఢిల్లీలో విలాసవంతమైన బంగ్లాను తీసుకున్నారు. యూట్యూబ్‌లో తన వీడియోలతో ఓవర్‌నైట్ స్టార్‌గా దాదాపు రూ. 11 కోట్లకు బంగ్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో బంగ్లాను తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీబీ కి వైన్స్ అనే యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తున్నాడు. వడోదరకు చెందిన భువన్ బామ్ యూట్యూబ్‌లో వీడియోల ద్వారానే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2015లో తన యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించగా.. 26.4 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్స్ కలిగి ఉన్నారు. అతని కంటెంట్ ప్రధానంగా హాస్య భరితమైన పాత్రల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబం, స్నేహితులతో కలిసి కామెడీ కంటెంట్‌ను రూపొందిస్తుంటారు. అంతే కాకుండా భువన్ సంగీతంలోకి అడుగుపెట్టారు. ఇప్పటికే చాలా సాంగ్స్ కూడా రిలీజ్ చేశారు. అంతే కాకుండా దిండోరా, రాఫ్తా రాఫ్తా, తాజా ఖబర్ వంటి వెబ్ సిరీస్‌లలో కూడా నటించాడు. ఇటీవలే ప్రసిద్ధ జపనీస్ గేమ్ షో తకేషిస్ కాజిల్‌కు కామెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ వార్తలపై భువన్ ఇంకా స్పందించలేదు. View this post on Instagram A post shared by Bhuvan Bam (@bhuvan.bam22) -
YouTube: ఇక్కడ సంపాదించుకున్నోడికి సంపాదించుకున్నంత!
ఆధునిక టెక్నాలజీ యుగంలో సామాజిక మాధ్యమాలు విస్తృతమయ్యాయి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఎక్స్ ఇలా ఎన్నో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. నేటి రోజుల్లో బ్యాంక్ అకౌంట్ అయినా లేనివారు ఉంటారేమో గానీ ఏదో ఒక సోషల్‌మీడియా అకౌంట్ లేనివారు మాత్రం ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఎన్ని సోషల్‌మీడియా వేదికలు ఉన్నా యూట్యూబ్‌కు ఉన్న ప్రత్యేకత, ఆదరణ వేరు. అత్యధికమంది ఉపయోగించే సోషల్ మీడియా యాప్ ఇది. ఇందుకు కారణం పెద్దగా చదువుకోని సమాన్యులు సైతం ఉపయోగించేందుకు వీలుగా ఉండటం, కంటెంట్ వీడియోల రూపంలో ఉండటం. యూట్యూబ్ యూజర్లు ఏ స్థాయిలో ఉన్నారో అంతే స్థాయిలో కంటెంట్ క్రియేటర్లు అంటే యూట్యూబర్లు కూడా ఉన్నారు. అభిరుచిని తీర్చుకోవడంతోపాటు ఆదాయాన్ని పొందే అవకాశం ఉందిక్కడ. యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేటర్ల సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్, ట్రావెలింగ్, కుకింగ్, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, ఫైనాన్స్, న్యూస్.. ఇలా రకరకాల కంటెంట్‌ను యూట్యూబర్లు క్రియేట్ చేసి వీక్షకుల ముందుకు తెస్తున్నారు. యూట్యూబర్లు అంత సంపాదిస్తున్నారు.. ఇంత సంపాదిస్తున్నారు.. అంటూ మాట్లాడుకోవడమే గానీ వారికి డబ్బు ఎలా వస్తుంది.. ఎంత మంది చూస్తే ఎంత డబ్బు వస్తుంది.. అన్న లెక్కలు చాలా మందికి తెలియవు. ఈ లెక్కల్ని అర్థం చేసుకుని, ఒక యూట్యూబర్ ఎంత సంపాదించగలరు అన్నది అంచనా వేయాలని ఆసక్తి ఉన్న వారి కోసం ఇక్కడ కొంత సమాచారం ఇస్తున్నాం.. డబ్బు ఎలా వస్తుంది? స్పాన్సర్‌షిప్‌ల నుంచి మొదలు పెట్టి ఉత్పత్తుల ప్రమోషన్ వరకూ పలు రకాల మార్గాల్లో యూట్యూబర్లు డబ్బు సంపాదించవచ్చు. కానీ గూగుల్ ప్రకటనలు (Google Ads) నుంచే వచ్చే ఆదాయమే అత్యధికం. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్‌లో చేరిన సోషల్ మీడియా క్రియేటర్లు తమ వీడియోల ద్వారా గూగుల్ ప్లేస్డ్ యాడ్స్‌తో (Google-placed ads) డబ్బు సంపాదించవచ్చు. ఈ అర్హతలుండాలి యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేయడానికి, క్రియేటర్లు తప్పనిసరిగా కనీసం 500 మంది సబ్స్క్రైబర్లను కలిగి ఉండాలి. అలాగే గత 90 రోజుల్లో కనీసం మూడు పబ్లిక్ అప్లోడ్లు చేసి ఉండాలి. సంవత్సర కాలంలో 3,000 వాచింగ్ అవర్స్ లేదా గత 90 రోజుల్లో 3 మిలియన్ల యూట్యూబ్ షార్ట్‌ల వీక్షణలను కలిగి ఉండాలి. ఈ అర్హతలన్నీ ఉండి ఒకసారి అప్రూవల్ పొందిన తర్వాత, అర్హత కలిగిన క్రియేటర్లు ఛానెల్ మెంబర్‌షిప్‌లు, సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్లు, సూపర్ థాంక్, యూట్యూబ్ షాపింగ్‌తో తమ సొంత ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునే సామర్థ్యం వంటి ఫీచర్ల ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఇక యూట్యూబ్ యాడ్సెన్స్ (YouTube AdSense) నుంచి డబ్బు సంపాదన ప్రారంభించడానికి, ప్రోగ్రామ్‌లోని క్రియేటర్లు తప్పనిసరిగా 1,000 మంది సబ్స్క్రైబర్లను కలిగి ఉండాలి. సంవత్సర కాలంలో 4,000 వాచింగ్ అవర్స్‌ను కలిగి ఉండాలి. ఎంత మంది చూస్తే ఎంత డబ్బులు? తమతో యూట్యూబర్లు పంచుకున్న రెవెన్యూ పర్ మిల్లీ (RPM) రేట్ల ఆధారంగా బిజినెస్ ఇన్సైడర్ ఓ అధ్యయనం చేసింది. దాని ప్రకారం.. ప్రతి 1,000 వీక్షణలకు 1.61 నుంచి 29.30 డాలర్లు (రూ.130 నుంచి రూ.2,400) యూట్యూబర్లు సంపాదిస్తున్నారు. యూట్యూబ్ ప్లాట్‌ఫామ్ నుంచి యూట్యూబర్లు నెలకు ఎంత డబ్బు సంపాదిస్తారు అనేది వీక్షణల మొత్తం, ఆడియన్స్ లొకేషన్, కంటెంట్ కేటగిరి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. బిజినెస్ ఇన్సైడర్ అధ్యయనం చేసిన ఓ 28 మంది యూట్యూబర్ల నెలవారీ ఆదాయాలు 82 నుంచి 83,000 డాలర్ల వరకూ (రూ.6,800 నుంచి సుమారు రూ.70 లక్షలు) ఉన్నాయి. ఈ ఆదాయాలు నెలవారీగా మారవచ్చు. ఉదాహరణకు సుమారు లక్ష మంది సబ్స్క్రైబర్లు ఉన్న ఓ యూట్యూబర్ ఒక నెలలో 1,000 డాలర్లు (రూ.83,000) సంపాదిస్తే మరొక నెలలో 6,000 డాలర్లు (సుమారు రూ.5 లక్షలు) వరకు సంపాదించినట్లు బిజినెస్ ఇన్సైడర్ పేర్కొంది. ఇక ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్లను కలిగి ఉన్న వ్యక్తిగత ఫైనాన్స్ గురించి వీడియోలను రూపొందించే మరో యూట్యూబర్ ఒకే నెలలో 50,000 డాలర్లు (సుమారు రూ.41 లక్షలు) కంటే ఎక్కువ సంపాదించారు . గమనిక: ఇది కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. -
జస్ట్ ఫిట్ నెస్ చానెల్‌తో..ఏకంగా రూ. 700 కోట్లు..!
హెల్త్, డైట్, ఫిట్నెస్కి సంబంధించి ‘ఫిట్ ట్యూబర్’ పేరుతో యూట్యూబ్‌లో ఒక చానెల్ స్టార్ట్ చేసిండు. తక్కువ సమయంలోనే అతని వీడియోలు జనాలకు రీచ్ అవ్వడం, ఆదరణ లభించడం రెండూ ఒకేసారి జరిగాయి. దీంతో ఒక్కసారిగా మంచి పేరు వచ్చింది. అక్కడితో ఆగలేదు. ఇతని చానెల్‌కి దాదాపు 6 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారంటే అంతని వీడియోలకు మస్త్ క్రేజ్ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ యూట్యూబ్ ఛానెల్‌తో అతను దగ్గర దగ్గర దాదాపు 750 కోట్లు ఆర్జిస్తున్నాడు. ఇతని పేరు వివేక్ మిత్తల్. సొంతూరు పంజాబ్‌లోని బఠిండా. బీటెక్ పూర్తిచేసి ఇన్ఫోసిస్‌లో జాబ్ కూడా చేశాడు. తర్వాత 2016లో యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశాడు. అయితే ఇతని యూట్యూబ్‌కి ఉన్న ఇన్ఫ్లయోన్స్ చూసి తెలంగాణ గవర్నమెంట్ రాష్ట్రీయా గౌరవ్ అవార్డుతో సన్మానించింది. మీక్కూడా ఇలానే ఏమన్నా టాలంఎంటు ఉంంటే సీరియస్ తీసుకుని సక్కగా వీడియోలు తీసుకుని క్రేజ్ సంపాదించుకుండి. అటోమేటిగ్గా పేరుకి పేరు డబ్బులకు డబ్బులు సంపాదించుకోవచ్చు. (చదవండి: భారత్‌లో ఫస్ట్ క్రిస్మస్ కేక్ ఎక్కడ తయారయ్యిందో తెలుసా!) -
మామూలోడు కాదు.. పక్కా మోసగాడు
-
యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన యూట్యూబర్
-
యూట్యూబర్, 'పక్కింటి కుర్రాడు' చందు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ యూట్యూబర్, నటుడు చందుసాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు అతడిని శుక్రవారం అరెస్ట్ చేశారు. యువతి ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. నార్సింగికి చెందిన యువతికి యూట్యూబర్ చందుసాయి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. 2021 ఏప్రిల్ 25న బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు పిలిచి ఆమెపై అత్యాచారం చేశాడు. పెళ్లి మాట ఎత్తేసరికి ముఖం చాటేశాడు. అతడి చేతిలో మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు చందుపై అత్యాచారం, మోసం కింద కేసులు నమోదు చేశారు. చందుతో పాటు అతడి తల్లిదండ్రులు సహా మరో ఇద్దరిపైనా కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. కాగా చందు అసలు పేరు చంద్రశేఖర్ సాయి కిరణ్. యూట్యూబ్‌లో చందుగాడు పేరుతో ఫేమస్ అయ్యాడు. చందుగాడు , పక్కింటి కుర్రాడు యూట్యూబ్ ఛానల్స్‌లో వీడియోలు చేస్తూ డబ్బు, పేరు సంపాదించుకున్నాడు. అతడు చేసే కామెడీ, ఎంటర్టైన్మెంట్ వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. చందుగాడు యూట్యూబ్ ఛానల్‌కు ఐదున్నర లక్షల పైచిలుకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చదవండి: ప్రముఖ డైరెక్టర్‌తో ప్రభు కూతురి రెండో పెళ్లి.. విశాల్ స్వీట్ వార్నింగ్.. -
యూట్యూబర్ క్రేజీ స్టంట్: ఏడు రోజులు సజీవ సమాధి, చివరికి...!
పాపులారిటీ కోసం, డేర్‌డెవిల్ అని నిరూపించుకునేందుకు ఏమైనా చేయడానికి యూట్యూబర్లు ఏమాత్రం తగ్గడం లేదు. 'కిల్ బిల్'లో ఉమా థుర్మాన్ పాత్ర తరహాలో తాజాగా ఒక పాపులర్ యూట్యూబర్ ఒళ్లు గగుర్పొడిచే సాహసానికి పూనుకున్నాడు. ఏకంగా ఏడు రోజులపాటు తనను సజీవ సమాధి చేసుకున్నాడు. అవును మీరు చదివింది నిజమే. వెన్నులో వణుకు పుట్టించే ఈ స్టంట్‌కోసం ప్రత్యేక ఏర్పాటు చేసుకున్నాడు. రెండు రోజుల్లోనే ఈ వీడియో 64 మిలియన్ల వ్యూస్ సాధించడం విశేషం. వివరాలను పరిశీలిస్తే బీస్ట్‌గా పాపులర్ అయిన జిమ్మీ డొనాల్డ్సన్ ఈ క్రేజీ స్టండ్ చేశాడు. ఏడు రోజులపాటు శవపేటిక లాంటి డబ్బాలో భూగర్భంలో ఉండిపోయాడు. తన 212 మిలియన్ల యూట్యూబ్ సబ్స్క్రైబర్లను ఫిదా చేయాలనే ఆలోచనతోనే ఈ స్టంట్ చేశాడు. చివరికి అదో మానసిక వేదనరా బాబు ఇలా చేయకండి అంటూ తన ఫోలవర్లకు సూచించాడు. ఈ ఫీట్‌కు తన స్నేహితులతో కలిసి ఎక్స్‌కవేటర్‌ని ఉపయోగించి శవపేటిక పైన 20వేల పౌండ్ల మట్టిని పోయించాడు. "రాబోయే ఏడు రోజులు నా జీవితాన్ని ఈ శవపేటికకు అప్పగిస్తున్నాను." అంటూ లోపలికి వెళ్లాడు. అయితే పైన ఉన్న తన టీంతో కమ్యూనికేట్ చేయడానికి వాకీ-టాకీని ఉపయోగించాడు. ఎన్ని చేసినా ఏడు రోజుల పాటు అలా ఉండటం అంటే మాటలా. చావు తప్పి కన్ను లొట్ట పోయినంత పనైంది. చాలా నీరసించిపోయాడు. కాళ్లలో రక్తం గడ్డకట్టి, నిలబడలేకపోయాడు. అదృష్టవశాత్తూ ఇతర అనారోగ్య సమస్యలు ఏమీ ఎదురు కాలేదు. 2021లో 50 గంటల పాటు సజీవంగా సమాధి అయ్యి రికార్డు కొట్టాలని ప్రయత్నించాడు.2012 నుండి యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉన్నప్పటికీ, 2018లో బీస్ట్ బాగా పాపులర్ అయ్యాడు. అనేక విన్యాసాలు చేయడంతో పాటు, డొనాల్డ్సన్ వివాదాస్పదమైన దాతృత్వ చర్యలతో వార్తల్లో నిలిచాడు. 5లక్షల ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి ఆఫ్రికా అంతటా 100 బావుల నిర్మాణం పేరుతో డబ్బులు వసూలు చేయడం విమర్శలకు తావిచ్చింది. దీనికి సంబంధించినవ వీడియోను యూట్యూబ్‌లో షేర్ చేశాడు.పారదర్శకమైన శవపేటికలో వీడియోను రికార్డ్ చేయడానికి కెమెరాలు సహా అవసరమైన వస్తువులతో బీస్ట్‌ని నెమ్మదిగా భూమిలోకి దిపుతారు. ఈ సందర్బంగా ఒక్కోసారి బీస్ట్ భావోద్వేగానికి లోనయ్యాడు. బాత్రూమ్, సహా తన దినచర్య వివరాలనుషేర్ చేశాడు. వీడియో చివరలో ఏడు రోజుల తరువాత సూర్యుడిని చూస్తున్నా..ఈ అనుభవాన్ని వర్ణించలేను అనడంతో వీడియో ముగుస్తుంది. -
యూట్యూబర్ పైత్యం: మండిపడుతున్న నెటిజనులు
యూట్యూబ్‌లో లైక్స్, వ్యూస్ కోసం కొంతమంది వింత విన్యాసాలు, ప్రమాదకర ఫీట్స్‌తో సోషల్‌మీడియా యూజర్లకు చిరాకు తెప్పించడం ఈ మధ్య కాలంలో రొటీన్‌గా మారి పోయింది. ఈ క్రమంలోనే రైలు పట్టాలపై పటాకులు కాల్చిన వీడియో నెటిజనులకు ఆగ్రహం తెప్పింది. రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై యూట్యూబర్ నిర్భయంగా పటాకులు స్నేక్ క్రాకర్స్ కాల్చుతున్న వీడియో ట్విటర్లో వైరల్ అయింది. దీంతో సోషల్ మీడియా క్రియేటర్లకు, యూట్యూబర్ల అతి చేష్టలకు హద్దు పద్దూ లేకుండా పోతోందంటూ ఆగ్రహం పెల్లుబుకింది. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ రైల్వే శాఖను ట్యాగ్ చేస్తూ రీట్వీట్ చేశారు. దీంతో ర్వైల్వే శాఖ స్పందించింది. ఫూలేరా-అజ్మీర్ సెక్షన్‌లోని దంత్రా స్టేషన్ సమీపంలో ఈ వీడియోను షూట్ చేసినట్టు తెలుస్తోంది.ఇందులో రైలు పట్టాలపై కుప్పగా పోసిన పాము బిళ్లల్ని ఒక్కసారిగా వెలిగించాడు. దీంతో ఆ ప్రాంతమంతా నల్లటి పొగ అలుముకుంది.33 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ట్రైన్స్ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది. దయచేసి ఇలాంటి దుర్మార్గులపై అవసరమైన చర్యలు తీసుకోండి అనే క్యాప్షన్‌తో దీన్ని షేర్ చేసింది. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి...ప్రాణాలతో చెలగాటాలా అంటూ ఒకరు, అసలే దేశమంతా కాలుష్యంతో మండిపోతోంది. దీపావళి సందర్భంగా పిల్లలు ఎక్కువగా ఇష్ట పడే ఈ పాము బిళ్ళలు ఎక్కువ కార్బన్‌ను రిలీజ్ చేస్తాయంటూ మరొకరు మండిపడ్డారు. పబ్లిసిటీ కోసం ఇలా చేస్తారా? పర్యావరణం కలుషితమవుతోంది. రైలు పట్టాల దగ్గర ఇలాంటి ప్రయోగాలు ప్రమాదకరం అంటూ తీవ్రంగా స్పందించడం గమనార్హం. అంతేకాదు ఇది పెను ప్రమాదానికి దారి తీయవచ్చు..చర్యలు తీసుకోండి అంటూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కి విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ వీడియోపై నార్త్ వెస్ట్రన్ రైల్వే స్పందించింది. దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా డివిజనల్ రైల్వే మేనేజర్, జైపూర్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ను ఆదేశించింది. ప్రస్తుతం వీడియోపై ఆర్పీఎఫ్ దర్యాప్తు చేస్తోంది. ఇది ఇలా ఉంటే స్నేక్ క్రాకర్స్ అనేవి అత్యధిక మోతాదులో PM2.5 (2.5 మైక్రాన్ల కంటే తక్కువ పర్టిక్యులేట్ మ్యాటర్)ను విడుదల చేస్తాయని 2016నాటి చెస్ట్ రీసెర్చ్ ఫౌండేషన్ (CRF), పూణే విశ్వవిద్యాలయం పరిశోధనలో తేలింది. YouTuber bursting crackers on Railway Tracks!! Such acts may lead to serious accidents in form of fire, Please take necessary action against such miscreants. Location: 227/32 Near Dantra Station on Phulera-Ajmer Section.@NWRailways @rpfnwraii @RpfNwr @DrmAjmer @GMNWRailway pic.twitter.com/mjdNmX9TzQ — Trains of India 🇮🇳 (@trainwalebhaiya) November 7, 2023 -
అర్థవంతమైన జీవితం
‘ఆసక్తి ఉంటే అనంత విశ్వాన్ని మధించవచ్చు’ అనడానికి ప్రతీక శకుంతలాదేవి. అరవై దాటిన తర్వాత యూ ట్యూబర్‌గా ప్రపంచానికి పరిచయమయ్యారు. అంతకంటే ముందు ఆమె తనకంటూ ఓ ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. ఆ ప్రపంచంలో సంగీతం, సాహిత్యం, మొక్కల పెంపకం ఉన్నాయి. ఇప్పుడు డిజిటల్ మీడియా వేదికగా సృజనాత్మకతను పంచుతున్నారు.భర్త బాటలో తాను కూడా మరణానంతరం దేహాన్ని డొనేట్ చేశారు. శకుంతలాదేవి అత్యంత సాధారణ గృహిణి. నలుగురు పిల్లల్ని పెంచుతూ ఆమె తన అభిరుచులను కొనసాగించారు. సాహిత్యాన్ని ఆస్వాదించకుండా ఉట్టిగా పాటలు వినడంలో ఏదో అసంతృప్తి. అందుకే హిందీ పాటల సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి హిందీ– తెలుగు డిక్షనరీలో అర్థాలు వెతుక్కున్నారు. స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియాలను ఉబుసుపోని పోస్టులకు పరిమితం చేయలేదామె. సాంకేతిక పాఠాలను స్మార్ట్‌ఫోన్ తోనే నేర్చుకున్నారు. వీడియో రికార్డ్ చేయడం, ఎడిటింగ్, థంబ్‌నెయిల్ పెట్టడం, యూ ట్యూబ్‌లో అప్లోడ్ చేయడం వరకు అవసరమైనవి అన్నీ సొంతంగా నేర్చుకున్నారు. తనకు తెలిసిన మంచి విషయాలను డిజిటల్ మీడియా వేదికగా ప్రపంచంతో పంచుకుంటున్నారు. ‘నన్ను ప్రపంచానికి తెలియచేసిన యూట్యూబ్‌కి తొలుత కృతజ్ఞతలు’ అంటూ తన వివరాలను ‘సాక్షి’తో పంచుకున్నారు స్వర్ణ శకుంతలాదేవి. ఆధ్యాత్మికం నుంచి అభ్యుదయం వరకు ... ‘‘మాది తెనాలి దగ్గర మూల్పూరు గ్రామం. నాన్న వ్యవసాయంతోపాటు గుడిలో పూజలు చేసేవారు. ఏడుగురు సంతానం. ఐదుగురు అమ్మాయిల్లో ఎస్ఎస్ఎల్సీ వరకు చదివింది నేనే. మా వారు బీఏఎమ్ఎస్ చదువుతూ ఉండడంతో ఆయన చదువు పూర్తయ్యే వరకు, నాకూ చదువుకునే అవకాశం వచ్చింది. ఫిఫ్త్‌ఫారమ్‌లో ఉండగా పెళ్లయింది. తర్వాత పుట్టింట్లోనే ఉండి ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేసి రిజల్ట్స్ వచ్చే నాటికి చీరాలలో అత్తగారింటిలో ఉన్నాను. అప్పట్లో ఆ చదువుకే సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగం ఇచ్చేవారు. మా అత్తగారు ‘ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముందిప్పుడు’ అనడంతో ఇంటికే పరిమితమయ్యాను. టీచర్ అయ్యే అవకాశం అలా చేజారింది. కానీ మా వారి నుంచి ప్రోత్సాహం మాత్రం ఎప్పుడూ ఉండేది. ఆయన ఆయుర్వేద వైద్యులుగా ఒంగోలు దగ్గర అమ్మనబ్రోలులో ప్రాక్టీస్ చేసేవారు. అక్కడే 35 ఏళ్ల పాటు ఉన్నాం. ఇద్దరు పిల్లలు పుట్టిన తరవాత వీణ నేర్చుకున్నాను. ఆ తర్వాత మరో ఇద్దరు పిల్లలు. వాళ్లందరి ఆలనపాలన చూస్తూ నా అభిరుచులను కొనసాగించగలిగాను. ఆధ్యాత్మిక గ్రంథాల నుంచి రంగనాయకమ్మ రాసిన బలిపీఠం, కౌసల్యాదేవి– చక్రవాకం, రవీంద్రనాథుని గీతాంజలి, బాలగంగాధర తిలక్ అమృతం కురిసిన రాత్రి.. ఇలా అదీ ఇదీ అనే వర్గీకరణ లేకుండా చదివేదాన్ని. యద్దనపూడి, మాదిరెడ్డి, యండమూరి, శ్రీశ్రీ రచనలను, అబ్దుల్‌కలామ్ వంటి ప్రముఖుల జీవిత చరిత్రలను ఇష్టంగా చదివాను. కొన్ని రచనలు రేడియోలో నాటికలుగా వచ్చేవి. వాటి కోసం రేడియోకి అంకితమయ్యేదాన్ని. ఇలా సాగుతున్న జీవితంలో పిల్లలు నలుగురూ సెటిల్ అయిన తర్వాత మా వారుప్రాక్టీస్ చాలించారు. 2005లో చీరాలకు వచ్చాం. పెద్దబ్బాయి కొత్తదారిలో నడిపించాడు మా పెద్దబ్బాయి నన్ను కొత్తగా ఆవిష్కరించాడు. తను మెకానికల్ ఇంజనీర్. తాను ఆసక్తి కొద్దీ జెమాలజీ కోర్సు చేశాడు. రత్నాల గురించిన కబుర్లు నాకు ఎక్కువ ఆసక్తినివ్వడంతో రత్నాలకు – రాళ్లకు మధ్య తేడాను గుర్తించడం నేర్పించాడు. ముత్యాలు, పగడాలతోపాటు రకరకాల బీడ్స్, జెమ్స్, సెమీ ప్రెషియస్ స్టోన్ ్సతో ఆర్నమెంట్ మేకింగ్ నేర్పించాడు. జీవితాన్ని మనం ఎంత ఉత్సాహవంతంగా, రాగరంజితంగా మార్చుకున్నప్పటికీ ఏదో ఒక వెలితిని సృష్టించి ప్రశ్నార్థకంగా మన ముందు పెడుతుంది. నా అభిరుచులు మాత్రమే నాతో మిగిలాయి, వాటినిప్రోత్సహించిన మావారు మాకు దూరమయ్యారు. ఆయన కోరిక మేరకు దేహాన్ని వైద్యవిద్యార్థుల అధ్యయనం కోసం ఒంగోలులో మెడికల్ కాలేజ్‌కి ప్రదానం చేశాం. ఆయన బాటలో నేను కూడా మరణానంతరం నా దేహాన్ని డొనేట్ చేస్తూ సంతకం చేశాను. మనం జీవిస్తూ మరొకరికి ఉపయోగం కలిగించడమే జీవితానికి అసలైన అర్థం అని నమ్ముతాను. ఆయన జ్ఞాపకాలతో రోజులు సాగుతున్న సమయంలో కోవిడ్ ప్రపంచాన్ని కుదిపేసింది. యూ ట్యూబ్ ఆత్మీయులనిచ్చింది కోవిడ్ సమయంలో అగాధంలాంటి విరామం. ఆ విరామం ఎంత కాలమో కూడా తెలియదు. యూ ట్యూబ్ చానెల్స్ చూస్తూ, మా వారు సుబ్రహ్యణ్య కుమార్ రాసిన వైద్య గ్రంథాన్ని చదువుతూ గడిపాను. అప్పుడు నాక్కూడా నాకు తెలిసిన సంగతులు చెప్పాలనిపించింది. గూగుల్ లేని రోజుల్లోనే నిత్యాన్వేషిగా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. చేతిలోకి స్మార్ట్‌ఫోన్ వచ్చిన తర్వాత ఇక కష్టమేముంది? యూ ట్యూబ్‌కి సంబంధించిన పరిజ్ఞానమంతా ‘హౌ టూ అప్లోడ్, హౌ టూ డూ ఎడిటింగ్, హౌ టూ డూ థంబ్‌నెయిల్’ అంటూ ‘హౌ టూ’ అని అడుగుతూ నేర్చుకున్నాను. మొదట వంటలు, ఇంటి అలంకరణ, మా వారు రాసిన వైద్యగ్రంథంలోని విషయాలను చెప్పాలనుకుని 2021లో యూ ట్యూబ్ చానెల్ మొదలుపెట్టాను. కొంతకాలం తర్వాత యూ ట్యూబ్ గుర్తించాలంటే ఏదో ఒక టాపిక్ మీదనే దృష్టి పెట్టమని సూచించారు పిల్లలు. వంటలు చాలామంది చేస్తున్నారు. ముత్యాలు, పగడాల గురించి చాలామందికి తెలియని సంగతులు చాలా ఉన్నాయి. వాటి గురించి చెప్పమన్నారు మా పిల్లలు. ఆ తర్వాత నాకు సబ్‌స్రైబర్స్ రెండున్నర లక్షలకు పెరగడంతోపాటు ఫాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. డాక్టర్లు, సైంటిస్ట్‌లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు... సందేహాలడుగుతుంటే నాకు తెలిసినదెంత? ఇంత పెద్ద చదువులు చదువుకున్న వాళ్ల సందేహాలు నేను తీర్చడమేమిటని ఆశ్చర్యంగా ఉంటుంది కూడా. అసలు ముత్యాన్ని, నకిలీ ముత్యాన్ని ఎలా గుర్తించాలి, తైవాన్ పగడం ఎలా ఉంటుంది, ఇటాలియన్ పగడాలెలా ఉంటాయి, వేటిని క్యారట్లలో తూస్తారు, వేటిని గ్రాముల్లో తూస్తారు... వంటి విషయాలనెన్నో చెప్పాను. యూ ట్యూబర్‌గా నేను డబ్బుకంటే వెలకట్టలేని ఆత్మీయతను, అభిమానాన్ని సంపాదించుకున్నాను. ఆంటీ, అమ్మా అనే పిలుపులతోపాటు ఈ తరం యువతులు వాళ్ల సందేహాల కోసం ఫోన్ చేసి ‘అమ్మమ్మా’ అని పిలుస్తుంటే చాలా సంతోషంగా ఉంటోంది. మనిషి, మెదడు పని లేకుండా ఖాళీగా ఉండకూడదు. అలాగే ఎంటర్టైన్ మెంట్ మన మైండ్‌ని చెడగొట్టకూడదని నమ్ముతాను. అందుకే టీవీ సీరియల్స్ నన్ను ఆకర్షించలేదు. నాకు నేనుగా సమయాన్ని ఇలా ఆనందంగా, ఉపయుక్తంగా మలుచుకున్నాను’’ అన్నారు శకుంతలాదేవి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఎల్విష్ రేవ్ పార్టీ కలకలం: మేనకా గాంధీ ఫైర్, అసలీ ట్రాప్ ఎవరిది?
రేవ్‌పార్టీ, కోబ్రా విషం లాంటి సంచలన ఆరోపణలు ఎదుర్కొటున్న యూ ట్యూబర్ బిగ్ బాస్ OTT సీజన్ 2 విజేత ఎల్విష్ యాదవ్ వ్యవహారంలో ట్విస్ట్‌లు ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుతో తనకేమీ సంబంధంలేదనీ ఎల్విష్ వాదిస్తుండగా, అతడే కీలక సూత్రధారి కచ్చితంగా అరెస్ట్ చేయాలని బీజేపీ ఎంపీ మేనకా గాంధీ డిమాండ్ చేశారు. మరోవైపు ఈకేసులో అతని జోక్యంపై ఇంకా ఎలాంటి విషయాలు వెలుగు రాలేదని పోలీసులు తాజాగా తేల్చారు. దీంతో అసలీ వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చింది. మేనకా గాంధీ ఎందుకు స్పందించారు లాంటి వివరాలు ఒకసారి చూద్దాం... యూట్యూబర్, బిగ్‌బాస్ ఓటీటీ సీజన్-2 (హిందీ) విజేత ఎల్విష్ యాదవ్ (Elvish Yadav) పాములు, పాముల విషంతో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నాడన్న ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎల్విష్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సంచలనం రేపింది. అయితే ఈ కేసులో తనను అరెస్టు చేసినట్లు ఆరోపణలు, ఇతర వాదనలు అవాస్తవమని పేర్కొన్నాడు. తనపై అసత్యం ప్రచారం జరుగుతోందంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నానంటూ మీడియాలో వస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం ఎంతమాత్రం నిజంలేదని, అసలు ఈ కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. దీనిపై విచారణ జరిపించాలంటూ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు విజ్ఞప్తి చేశాడు. అంతేకాదు ఈ వ్యవహారంలో తనప్రమేయం ఉందని తేలితే తదనంతర పరిణామాలకు, తాను బాధ్యత వహిస్తానన్నాడు. శిక్ష అనుభవించడానికి సిద్ధమేనని పేర్కొన్నాడు. అంతేకాదు ఈ విషయంలో ఆధారాలు లేకుండా తన పేరును ప్రస్తావించ వద్దని యూపీ పోలీసులను కోరాడు. అతడే కింగ్ పిన్, అరెస్ట్ చేయండి మరోవైపు ఈ ఘటనపై బీజేపీ ఎంపి మేనకా గాంధీ స్పందించారు. ఎల్విష్ యాదవ్‌ను వెంటనే అరెస్టు చేయాలని మేనకా గాంధీ డిమాండ్ చేశారు. అంతేకాదు అతను నిర్దోషి కాకపోతే, ఎందుకు పరారీలో ఉన్నాడని ఆమె ప్రశ్నించారు. వన్యప్రాణుల చట్టం కింది. ఇది గ్రేడ్ 1 నేరం, ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందన్నారు. అలాగే చాలా వీడియోలలో అంతరించిపోతున్న జాతుల పాములను ఉపయోగిస్తాడు. నోయిడా, గురుగ్రామ్‌లలో పాము విషాన్ని విక్రయిస్తున్నాడనే సమాచారం తమ వద్ద ఉందని స్పష్టం చేశారు. కింగ్ కోబ్రాస్ విషాన్ని బయటకు తీస్తే చనిపోతాయనిప తెలిపారు. ఆహారం జీర్ణం కావడానికి ఈ విషం తోడ్పడుతుందని, విషం లేకుండా ఏమీ తినలేక చనిపోతాయన్నారు. దేశంలో నాగుపాములు, కొండ చిలువలు చాలా తక్కువ.. వాటిని సొంతం చేసుకోవడం నేరమని వాటిని కాపాడాలని ఆమె మీడియాకు వెల్లడించారు. దీని వెనుక పెద్ద రాకెట్ ఉండి ఉండవచ్చని, ఈ స్మగ్లింగ్‌కు సంబంధించినమొత్తం వ్యవహారంలో కింగ్‌పిన్ అతడేనని మేనకా గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. మొన్న ఇస్కాన్.. ఇపుడు నేను, ఇలా అయితే లోక్ సభ సీటు వచ్చేస్తుందా? మేనకా గాంధీ వ్యాఖ్యలు తనకు షాకింగ్ అనిపించాయని దీనిపై తనకు క్షమాపణలు చెప్పాలంటూ ఎల్వీష్ ట్వీట్ చేశాడు. మొన్న ఇస్కాన్ మీద ఆరోపణలు, ఇపుడు తనను టార్గెట్ చేశారు... ఇలా లోక్‌సభ టిక్కెట్ వస్తుందా అంటూ ఎల్విష్ యాదవ్ మేనకా గాంధీపై విరుచుకుపడ్డాడు. ఇదిలా ఉండగా ఎల్విష్ పాముతో ఆడుకుంటున్నట్లు మరో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Judge saab proof ye rha pic.twitter.com/2db31v0bVb — Dr Nimo Yadav (@niiravmodi) November 3, 2023 పీపుల్ ఫర్ యానిమల్స్ ట్రాప్ మేనకా గాంధీ ఫౌండర్‌గా ఉన్న స్వచ్ఛంద సంస్థ పీపుల్ ఫర్ యానిమల్స్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, ఈ ఎన్జీవోనే ఎల్విష్ యాదవ్‌ను సంప్రదించి, రేవ్ పార్టీ నిర్వహించి, కోబ్రా విషం కావాలంటూ కోరింది. దీనికి సరేనన్న ఎల్విష్ దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేశాడు. కోబ్రా విషాన్ని తీసుకని రాహుల్ అనే అతను సెక్టార్ 51 బాంకెట్ హాల్‌కు వచ్చాడు. దీంతో నోయిడా పోలీసులు డిఎఫ్ఓతో పాటు అతగాడిని అరెస్టు చేశారు. రేవ్ పార్టీ కేసులో ఎల్విష్ , మరో ఐదుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదైనాయి. అలాగే దు కోబ్రాలతో సహా తొమ్మిది పాములను కూడా రక్షించారు. రాహుల్ నుంచి 20 ఎంఎల్ విషాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని విచారణ నిమిత్తం ఎఫ్ఎస్ఎల్కు పంపించిన సంగతి తెలిసిందే. Uttar Pradesh Police registers FIR against YouTuber and Bigg Boss winner Elvish Yadav, for making available snake venom at rave parties BJP MP and founder of People for Animals (PFA), Maneka Gandhi says, "He should be arrested immediately. This is a grade-I crime - that means… pic.twitter.com/26qX6gciG3 — ANI (@ANI) November 3, 2023 -
ప్రముఖ యూట్యూబర్ ప్రైవేట్ వీడియో లీక్.. ఇంటర్నెట్లో వైరల్
ఇంటర్నెట్, సోషల్ మీడియా రోజురోజుకు ప్రమాదకరంగా మారుతున్నాయి. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే అనేక సంఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ అలీజా సహర్ ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. అలీజా సహర్ పాకిస్థాన్‌లో ఉన్న ప్రముఖ యూట్యూబర్. అలీజా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాకిస్థాన్ పల్లెటూరి జీవితాన్ని చూపించేది. ఈ యూట్యూబర్‌కు సంబంధించిన ప్రైవేట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతుంది. పాకిస్థానీ యూట్యూబర్ ప్రైవేట్ వీడియో వైరల్ అలీజా సహర్ ప్రతిరోజు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాకిస్తాన్ గ్రామీణ జీవితాన్ని చూపించేది. దీంతో ఆమె ఈ ఛానెల్ ద్వారా ప్రజాదరణ పొందింది. యూట్యూబ్, టిక్‌టాక్ ద్వారానే దాదాపు 15 లక్షల మంది సబ్స్క్రైబర్లను సంపాదించుకుంది. వారందరి కోసం పాకిస్తానీ గ్రామ ప్రజల జీవితం, వంట పద్ధతి, సంస్కృతి వంటి కంటెంట్‌ను చూపించేది. అలా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న అలీజా సహర్ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ఆమె ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్‌గా మారింది. (ఇదీ చదవండి: కల్పికతో ఎఫైర్ లేదు.. ఆమె చేసిన రచ్చకు కారణం ఇదే: అభినవ్ గోమటం) ఏం జరిగింది..? అలీజా సహర్ ఒక వ్యక్తితో వీడియో కాల్లో మాట్లాడింది. ఆ సమయంలో జరిగిన కొన్ని కార్యకలాపాలు వీడియో కాల్లో రికార్డ్ చేయబడ్డాయి. దానిని ఆ వ్యక్తి ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడని ఆమె తెలుపుతుంది. నివేదికల ప్రకారం ఆ వీడియో కాల్లో అలీజా సహర్ తన దుస్తులు తొలగించి శరీరాన్ని ప్రదర్శిస్తున్న దృశ్యాలతో పాటు కొంత అసభ్యకరమైన మాటలు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో పాకిస్థానీ సోషల్ మీడియా స్టార్ చిక్కుల్లో పడింది. అయితే, అలీజా సహర్ ఇప్పటికీ దీని గురించి స్పందించి అందులో ఉండేది తాను కాదని ఎవరో వీడియోను ఎడిట్ చేశారంటూ ఆమె పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి వెళ్లింది. కానీ నెటిజన్లు మాత్రం వీడియోలో ఉండేది పక్కాగా ఆమెనే అంటూ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియా స్టార్ అలీజా సహర్ పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ)ని ఆశ్రయించి.. తన ప్రైవేట్ వీడియోను లీక్ చేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేసింది. ఈమేరకు ఖతార్‌లో నివసిస్తున్న అతన్ని ఎఫ్ఐఏ గుర్తించినట్లు ఆమె తెలిపింది. ఈ విషయాన్ని అలీజా తన వీక్షకులకు చెప్పింది. సైబర్ క్రైమ్ టీమ్ కూడా తనకు సహాయం చేసేందుకు వచ్చిందని ఆమె తెలిపింది. కష్టకాలంలో తనకు మద్దతుగా నిలిచిన ఆన్లైన్ కమ్యూనిటీకి తన యూట్యూబ్ ద్వారా కృతజ్ఞతలు తెలిపింది. View this post on Instagram A post shared by Aliza Sehar Official (@aliza.sehar.official) -
ఆసక్తే అతడి శక్తి! అదే టాప్ డిజిటల్ స్టార్‌గా మార్చింది!
తెలుసుకోవాలనే ఆసక్తి ఆ తరువాత శక్తిగా మారుతుంది. శక్తిమంతులు ఊరకే ఉంటారా! కొత్త ద్వారాలు తెరుస్తారు. గర్వ పడేలా ఘన విజయాలు సాధిస్తారు. ఢిల్లీకి చెందిన జే కపూర్ టెక్నో యూనివర్శిటీలలో చదువుకోలేదు. ‘ఎందుకు? ఏమిటి? ఎలా?’ అంటూ గ్యాడ్జెట్ల పుట్టుపుర్వోత్తరాల గురించి ఆసక్తి చూపించేవాడు. ఆ ఆసక్తి అంతులేని శక్తిని ఇచ్చింది. ‘డిజిటల్ స్టార్’ హోదాలో హుందాగా కూర్చోబెట్టింది. తాజాగా... ఫోర్బ్స్ ఇండియా ‘టాప్ డిజిటల్ స్టార్స్’ జాబితాలో చోటు సంపాదించాడు జే కపూర్... మొబైల్, ల్యాప్‌టాప్, కంప్యూటర్లకు సంబంధించి సాంకేతిక సమస్య తలెత్తితే జే కపూర్‌ను వెదుక్కుంటూ వచ్చే వాళ్లు ఫ్రెండ్స్. నిమిషాల వ్యవధిలోనే వాళ్లు పట్టుకొచ్చిన సమస్యకు పరిష్కారం చూపేవాడు కపూర్. కొంతకాలం తరువాత సుపరిచితులే కాదు అపరిచితులు కూడా కపూర్‌ను వెదుక్కుంటూ రావడం మొదలైంది. ఈ నేపథ్యంలోనే ‘తరచుగా ఎదురయ్యే కొన్ని సాంకేతిక సమస్యలకు పరిష్కారాలు’ పేరుతో ఒక వీడియో చేసి యూట్యూబ్‌లో పెట్టాడు. అలా డిజిటల్ ప్రపంచంలో తొలి అడుగు వేశాడు. 2011లో తన పేరుతోనే యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. అయితే చాలామంది యూట్యూబర్లకు ఎదురైనట్లే ఖరీదైన కెమెరా ఎక్విప్మెంట్స్ కొనడానికి ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి. అయినా సరే వెనక్కి తగ్గలేదు. ఎలాగో కష్టపడి తనకు కావాల్సిన సాంకేతిక పరికరాలు సమకూర్చుకున్నాడు. లేటెస్ట్ టిప్స్, ట్రిక్స్, ట్యుటోరియల్స్, ట్రెండింగ్ టాపిక్స్‌తో తన యూట్యూబ్ చానల్ దూసుకుపోయింది. సక్సెస్‌కు ‘ఐడియా అండ్ రిసెర్చ్’ ముఖ్యమైనవి అంటాడు కపూర్. ట్విట్టర్ నుంచి దినపత్రికలలో వచ్చే ఆర్టికల్స్ వరకు ఎక్కడో ఒక చోట తనకు ఐడియా దొరుకుతుంది. ఆ తరువాత అన్ని కోణాల్లో దాని మీద రీసెర్చి మొదలుపెడతాడు. ‘కొన్నిసార్లు మూడు గంటల్లో చేసిన వీడియోలకు లక్షలాది వ్యూస్ వస్తాయి. కొన్నిసార్లు రోజుల తరబడి చేసిన వీడియోలు ఫ్లాప్ అవుతుంటాయి’ నవ్వుతూ అంటాడు కపూర్. 19 సంవత్సరాల వయసులోనే మన దేశంలోని ‘టాప్ 6 టెక్ యూట్యూబర్స్’లో ఒకరిగా నిలిచిన జే కపూర్ ఆండ్రాయిడ్ డెవలపర్ కూడా. ‘ఫ్లాష్ సేల్ హెల్పర్’ అతడి తొలి యాప్. ఆ తరువాత స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఉపయోగపడే ‘వోల్ట్ చెకర్’ యాప్ క్రియేట్ చేశాడు. ‘విజయం సాధించాలనే దృష్టితో పెద్ద వాళ్ళ ఇంటర్వ్యూలు అదేపనిగా చదవడం నుంచి కాన్ఫరెన్స్‌లకు హాజరు కావడం వరకు ఎన్నో చేస్తుంటాం. అయితే మన జయాపజయాలను నిర్ణయించేది మాత్రం మన కష్టమే’ అంటాడు జే కపూర్. టెక్ ఇన్ఫ్లూయెన్సర్గా సుపరిచితుడైన కపూర్ ‘మనీ మిసెక్ట్స్’ పేరుతో చేసే వీడియోలతో ఫైనాన్స్ ఇన్ఫ్లూయెన్సర్గా కూడా మంచి మార్కులు కొట్టేశాడు. కష్టం కనిపిస్తేనే విజయం కనిపిస్తుంది. స్ఫూర్తి అనేది ఎక్కడి నుంచి, ఎవరి నుంచి అయినా తీసుకోవచ్చు. స్ఫూర్తి తీసుకోవడానికి పెద్దగా కష్టం అక్కర్లేదు. అయితే ఆ స్ఫూర్తిని మన విజయంగా మలుచుకోవడానికి మాత్రం బాగా కష్టపడాలి. కష్టం కనబడని చోట విజయం కూడా కనిపించదు. – జే కపూర్ (చదవండి: వాటర్ విమెన్! ఆమె నదిలో నీళ్లు కాదు కన్నీళ్లని చూస్తోంది!) -
ఒక్క వీడియోతో లక్షన్నర పొగొట్టుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్!
సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ ఓటీటీ సీజన్-2 ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ యూట్యూబర్ అభిషేక్ మల్హాన్. ఇటీవలే తన సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. తన జీవితంలో మొదటిసారి పెద్దమొత్తంలో నగదును వెంట తీసుకెళ్తున్నట్లు వీడియోలో వెల్లడించాడు. రూ. 1.5 లక్షలతో ఐఫోన్ కొనాలనుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతని డబ్బులు గుర్తు తెలియని వ్యక్తులు కాజేశారు. (ఇది చదవండి: కావాలయ్యా సాంగ్.. తమన్నా స్టెప్పు చెండాలం అంటూ నటుడి విమర్శలు) అభిషేక్ వీడియోలో మాట్లాడుతూ.. "నేను నా జీవితంలో ఇంత పెద్ద మొత్తంలో నగదును ఎప్పుడూ తీసుకువెళ్లలేదు. ఈ సమయంలో నా హృదయం బాధతో ఉప్పొంగిపోతోంది. నా డబ్బు ఎలా పోయిందో ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఆ డబ్బులతో ఒక ఐఫోన్‌ని కొనుగోలు చేయాలనుకున్నా. కానీ ప్రస్తుతం ఆ నగదు నా వద్ద లేదు. డబ్బుతో జాగ్రత్తగా ఉండమని మా నాన్న చాలా సార్లు చెప్పారు. నేను ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటానని అనుకోలేదు. ఇది తలుచుకుంటే చాలా భయంగా ఉంది. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. ఇక నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నా" అంటూ పోస్ట్ చేశారు. కాగా.. అభిషేక్ బిగ్ బాస్ ఓటీటీ సీజన్-2లో మొదటి రన్నరప్‌గా నిలిచాడు. ప్రస్తుతం యూట్యూబర్‌గా రాణిస్తున్నారు. సోషల్ మీడియా పోస్ట్‌లతో తన అభిమానులను అలరిస్తూ ఉంటాడు. (ఇది చదవండి: బిగ్ బాస్ కంటెస్టెంట్‌కు బిగ్ షాక్.. షో మధ్యలోనే అరెస్ట్!) -
యూట్యూబ్ కింగ్ గౌరవ్ తనేజా గుర్తున్నాడా? మళ్లీ ట్రెండింగ్లోకొచ్చేశాడు!
YouTuber Gaurav Taneja మలేషియాకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థకు మాజీ పైలట్ గౌరవ్ తనేజా మరోసారి వార్తల్లో నిలిచాడు. మెట్రో రైల్లో పుట్టిన రోజు వేడుకలు జరిపిన బుక్కైన యూట్యూబర్ గౌరవ్ తనేజా గుర్తున్నాడా? యూట్యూబ్‌లో ఫ్లైయింగ్ బీస్ట్‌గా ఫిట్నెస్ పాఠాలు చెప్పే యూ ట్యూబర్ గౌరవ్ తన సంపాదన ఎంతో ఫ్యాన్స్‌కి చెప్పేశాడు. అంతేకాదు తన పాత సీఈవోతోపోలిస్తే సంపాదనలో కింగ్‌ని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒకపుడు తనను తొలగించిన ఏయిర్ ఏసియా సీఈవో కంటే ఇపుడు తన సంపాదేన ఎక్కువ అంటూ ఇటీవల ఇన్ఫ్లుయెన్సర్ రాజ్ షమానీ హోస్ట్ చేసిన పోడ్కాస్ట్ సందర్భంగా వెల్లడించారు. బ్రాండ్ డీల్స్, యాడ్స్ ఆదాయం గురించి చెప్పమని అడిగినపుడు ఈ వ్యాఖ్యలు చేశాడు. గౌరవ్ మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చాడు. నిర్దిష్టంగా ఇంత అనీ సంపాదన వివరాలు బహిరంగంగా వెల్లడించలేదు. కానీ ఎయిర్ ఏసియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్ మిలియన్ డాలర్ల ఆస్తులను గుర్తుచేసుకుని తనేజా ఫ్యాన్స్ మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. అదీ సీఈవో టోనీ లింక్డ్ఇన్ పోస్ట్‌తో విమర్శల పాలైన తరువాత కంపెనీ మాజీ పైలట్ వ్యాఖ్యలు వెలుగులోకి రావడంతో మరింత వైరల్‌గా మారాయి. ఇంతకీ ఎవరీ గౌరవ్ తనేజా ♦ 2008లో ఐఐటీ ఖరగ్‌పూర్ పట్టభద్రుడైన గౌరవ్ తనేజా "సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్, ప్రొఫెషనల్ బాడీబిల్డర్ , ఏవియేటర్ కూడా. ♦ ఇపుడు ఢిల్లీ యూనివర్శిటీనుంచి ఎల్ఎల్బీ చేస్తున్నాడు. ♦ మరో పైలట్ రీతూ రథీతో వివాహం. వీరికి ఇద్దరు కుమార్తెలు . ♦ భద్రతా సమస్యల్ని గురించిన మాట్లాడినందుకే తనను ఎయిర్ ఏసియానుంచి తొలగించారనేది గౌరవ్ వాదన. ♦ ఫ్లైయింగ్ బీస్ట్ కంటే ముందే 2016లో FitMuscle TVని లాంచ్ చేశాడు. దీనికి దాదాపు 30 లక్షల సబ్ స్క్రైబర్లున్నారు. ఇక 2020లో లాంచ్ చేసిన రాస్బరీ కే పాపాకి 12 లక్షలకు పైగా సబ్ స్క్రైబర్లున్నారు I was terminated from airasia for raising safety issues! Now, the same issues are raised by #DGCA to @AirAsiaIndian. Justice will prevail! #Sabkeliye — Gaurav Taneja (@flyingbeast320) June 28, 2020 కాగా 2020జూన్‌లో AirAsia ఇండియా గౌరవ్‌ను పైలట్‌గా విధులనుంచి తొలగించింది. అప్పటికే ప్రముఖ వ్లాగర్‌గా తనేజా ఫుట్ టైం కంటెంట్ క్రియేటర్‌గా, యూట్యూబర్‌గా కరియర్ స్టార్ట్ చేశాడు.ఫ్లైయింగ్ బీస్ట్, ఫిట్ మజిల్ టీవీ, రాస్బరీకే పాపా పేర్లతో యూట్యూబ్ ఖాతాలను నిర్వహిస్తున్నాడు. అలా సోషల్‌మీడియాలో పాపులర్ స్టార్‌గా మారిపోయాడు.ప్రస్తుతం, యూట్యూబ్‌లో 80 లక్షలకుపైగా సబ్స్క్రైబర్లు, ట్విటర్లో దాదాపు 900k, ఇన్‌స్టాలో 40 లక్షల ఫాలోవర్స్ ఉన్నారంటే అతని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. -
వివాదాస్పద యూ ట్యూబర్ అనుమానాస్పద మృతి
కొరియాకు చెందిన వివాదాస్పద యూ ట్యూబర్ , మాజీ ఎంటర్టైన్మెంట్ రిపోర్టర్,కిమ్ యోంగ్ హో అనుమానాస్పదంగా శవమై తేలాడు. కిమ్‌పై లైంగిక వేధింపుల కేసుతోపాటు అనేక క్రిమినల్ కేసులుకూడా ఉన్నట్టు తెలుస్తోంది. లైంగిక వేధింపుల కేసు విచారణలో భాగంగా బుసాన్‌లో ఉన్నాడు. మరణానికి ఒక రోజు ముందు విచారణ జరిగింది. ఈ కేసు తీర్పు నేపథ్యంలోనే అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. 2019, జూలైలో హేయుండే రెస్టారెంట్లో ఒక మహిళను లైంగికంగా వేధించిన కేసులో తాజాగా ఎనిమిది నెలల జైలు శిక్ష, రెండేళ్లపాటు సస్పెన్షన్ కూడా ఖరారైంది. ఈ తీర్పు వెలువడిన తరువాత బుసాన్‌లోని హాయుండే జిల్లాలోని హోటల్లోని నాల్గవ అంతస్తులోని హోటల్ చనిపోయి కన్పించాడు. మృతదేహాన్ని స్వాధీనంచేసుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆత్మహత్యే కావచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. కిమ్ యోంగ్ హోపై లంచం, బ్లాక్ మెయిల్అనేక అరోపణలున్నాయి.వాటిలో చాలా వరకు చట్టబద్ధంగా నిజమని నిరూపితమైనాయి కూడా. ప్రధానంగా సెలబ్రిటీలను రహస్యాలను బహిర్గతం చేస్తాననంబెదిరించడం, పెద్ద మొత్తంలో డబ్బు,లగ్జరీ బ్యాగులు డిమాండ్ చేయడంలాంటి ఆరోపణలు వచ్చాయి. అలాగే కిమ్ యోంగ్ హోపై ప్రముఖ కొరియన్ నటి హాన్ యే సీల్ కూడా కేసు పెట్టారు. చివరికి 2021లో తన యూట్యూబ్ ఛానెల్‌ని కూడా మూసివేశాడు. నేనొక రాక్షసుడ్ని కాగా తన చానెల్ మూసివేత సందర్భంగా తన తప్పు ఒప్పుకుంటూ కన్నీటి పర్యంతయ్యాడు. తన మాటలతో మనుషులను పొడిచి చంపడం అలవాటు అయి పోయిందనీ, చాలామంది సబ్స్క్రైబర్లు, వ్యూస్ రావడంతో క్రూరంగా, ఒక రాక్షసుడిగా మార్చేసింది అంటూ ప్రకటించాడు. ఎవరి బలవంతం మీద తానీ పనిచేయడం లేదనీ, సిగ్గుతో శాశ్వతంగా ఈ ప్లాట్ఫారమ్నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మెట్రో రైలులో యూట్యూబర్ హల్చల్.. ప్రయాణికులను షాక్
కర్ణాటక: మెట్రో రైలులో కొందరు తోటి ప్రయాణికులకు ఇబ్బందులు పెడుతున్న ఘటనలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బెంగళూరు మెట్రోలో అలాంటి ఒక ఘటన చోటుచేసుకుంది. విజయనగర నుంచి మెజిస్టిక్‌కు ప్రయాణించే సమయంలో ఓ యూట్యూబర్ తొలుత ఎస్కలేటర్‌పై వస్తూ మూర్ఛ వచ్చినట్లు ప్రాంక్ వీడియో చేసి ప్రయాణికులను గాభరా పెట్టాడు. అనంతరం మెట్రోలో ప్రయాణిస్తూ మూర్ఛవచ్చినట్లు నటించి ప్రయాణికులను షాక్‌కు గురిచేశాడు. అనంతరం ఆ వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశాడు. ఈ ఘటనను బీఎంఆర్సీఎల్ అధికారులు తీవ్రంగా పరిగణించారు. ప్రయాణికులను కంగారుపెట్టిన యువకుడి సమాచారం సేకరిస్తున్నారు. అతడి పేరు ప్రాంక్ ప్రజ్ఞు అని తెలిసింది. ముంబై, న్యూఢిల్లీ మెట్రోలో ఇలాంటి అనేక ఘటనలు వెలుగుచూడగా ప్రస్తుతం బెంగళూరులో జరిగింది. మెట్రో ప్రయాణికుడిపై కేసు నమ్మ మెట్రోరైలులో గోబిమంచూరి తిన్న ప్రయాణికుడిపై బీఎంఆర్సీఎల్ కేసు నమోదు చేసింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.500 జరిమానా విధించింది. బీఎంఆర్‌సీఎల్‌లో ఇలాంటి చర్య తీసుకోవడం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు. కేసు నమోదైన వ్యక్తి నమ్మమెట్రోలో జయనగర నుంచి సంపిగే రోడ్డు మధ్య నిత్యం ప్రయాణిస్తుంటారు. ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించి గోబిమంచూరి తీసుకువచ్చి అక్కడే తిన్నాడు. తోటి స్నేహితులు వారించారు. ఈ వీడియోను ఓ యూట్యూబర్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది. బీఎంఆర్సీఎల్ కేఆర్.మార్కెట్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసింది. -
అవధుల్లేని ఆనందం
డబ్బుల సంగతేమో కానీ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా 114 మిలియన్ల యూట్యూబ్ చానళ్లు ఉన్నాయి. అంటే 11 కోట్లకు పైగానే. ఈ విశ్వంలోని సుమారు 800 కోట్ల జనాభాలో సగటున ప్రతి 72 మందికి ఒక చానల్ అన్నమాట. ఇటీవల విడుదలైన రజినీకాంత్ సినిమా ‘జైలర్’లో రజినీ ఐదేళ్ల మనవడు రుత్విక్ కూడా ఓ చానల్ నడుపుతుంటాడు. వీడియో చిత్రీకరణకు తాత రజినీ సాయం తీసుకుంటుంటాడు. ‘ఏదో ఒక వీడియో తీసేసి అప్లోడ్ చేసెయ్..’ అని తాత సలహా ఇస్తే.. ‘బాగోలేని వీడియోలకు సంబంధించి కామెంట్స్‌లో జనం ఎలా గడ్డి పెడతారో చూడు’ అని సమాధానం చెప్పడం ఆకట్టుకుంటుంది. ఆయా రంగాల్లో రాణిస్తున్న వారు తమ గురించి, తమకు తెలిసింది ప్రజలకు తెలియజేసి, వారి మెప్పు పొందాలని ఉబలాట పడుతుండటం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. ఇలా నిర్ణయించుకున్న మరుక్షణమే యూ ట్యూబ్ చానల్ పెట్టేస్తున్నారు. ఇలా ఆవిర్భవించిన చానళ్ల ద్వారా వంటింట్లో వంటలు మొదలు రాకెట్ తయారీ వరకు ఎవరికి ఏ సందేహం వచ్చినా ఇట్టే సమాధానం దొరుకుతోంది. ఏ చానల్‌కు సంబంధించిన వీడియోను ఎంత ఎక్కువ మంది చూస్తారో ఆ చానల్ పెట్టిన వాళ్లకు అంతగా డబ్బులొస్తాయి. ఇదంతా ఎవరు ఏ అంశానికి అత్యంత ప్రభావితమవుతారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఇటీవలి కాలంలో మన ఇండియన్స్, ప్రత్యేకించి పలువురు తెలుగు యూ ట్యూబర్స్ కూడా లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా చానళ్లు, వీడియోలు వీక్షిస్తున్న వారి అభిరుచుల్లో వచ్చిన మార్పులు ఆశ్చర్యంగొలుపుతున్నాయి. – వీఏవీ రంగాచార్యులు, ఏపీ సెంట్రల్ డెస్క్ కొందరికి ఖేదం.. మరికొందరికి మోదం యూ ట్యూబ్ చానల్ స్టార్ట్ చేసి.. కొందరేమో లక్షలు, కోట్లకు పడగలెత్తుతుంటే మరికొందరు మాత్రం నెలలు, ఏళ్ల తరబడి కష్టపడుతున్నా, కనీసం మానిటైజేషన్‌కు నోచుకోవడం లేదు. ఎలాగోలా మానిటైజేషన్ అయినా వారు అప్లోడ్ చేసే వీడియోలు వైరల్ కావడం లేదంటూ వాపోతుంటారు. ఇందుకు వారు యూ ట్యూబ్ ఆల్గారిథమ్ ఫాలో కాకపోవడమే. ఏ తరహా కంటెంట్‌ను జనం కోరుకుంటున్నారనేది గమనించి.. వీడియోలు రూపొందించుకోవాలి. ఒక్కోసారి సీరియస్ అంశాలు సైతం వైరల్ అవుతుంటాయి. అయితే అది ప్రజల అవసరాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు స్పోకెన్ ఇంగ్లిష్‌కు సంబంధించి మన తెలుగు కుర్రాడు స్టార్ట్ చేసిన ‘వశిష్ట 360’ చానల్ విశేష ఆదరణ పొందింది. ఆ వీడియోల ఆధారంగా ప్రచురించిన పుస్తకాల ద్వారా అతను కోట్లాది రూపాయలు ఆర్జించాడు. వరల్డ్ నంబర్ వన్ మిస్టర్ బీస్ట్ అనే యువకుడు (అసలు పేరు జిమ్మి డొనాల్డ్సన్) తన 13వ ఏట చానల్ స్టార్ట్ చేశాడు. మొదట్లో ‘ఐ పుట్ 100 మిలియన్ ఆర్బీజ్ ఇన్ మై ఫ్రెండ్స్ బ్యాక్ యార్డ్’ అనే వీడియోకు 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ప్రతి వీడియోకు సగటున 150 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. సముద్రంలో ఒంటరిగా ఏడు రోజులు గడపడం, షోల రీ క్రియేషన్, ఒక డాలర్ నుంచి ఒక మిలియన్ డాలర్స్ వరకు హోటల్ గదులు.. ఇలా ప్రతి వీడియో కొత్తదనంతో, విచిత్రంగా ఉండటం విశేషం. ఉదాహరణకు.. పేద్ద మాల్‌లోకి వెళ్లి.. 15 నిమిషాల్లో ఎవరేం కావాలన్నా కొనుక్కుని బిల్లింగ్ కోసం లైన్లో నిలుచుంటే ఆ బిల్లు తానే చెల్లిస్తానని చెప్పడం.. నిజంగానే చెల్లించడం. ఇతడి ప్రతి వీడియో రియాలిటీతో స్ట్రెయిట్‌గా సబ్జెక్ట్‌లోకి వెళ్తుంది. ఎక్కడా సుత్తి ఉండదు. ఒక్కో వీడియో షూటింగ్‌కు వారం పది రోజులు కష్టపడినా, తుదకు ఆ వీడియో నిడివి కేవలం 15–20 నిమిషాలే ఉంటుంది. ఇతను తన వీడియోల ద్వారా వచ్చే మొత్తంలో చాలా వరకు పేద ప్రజల కోసమే వెచ్చిస్తాడు. పాతికేళ్ల ఈ యువకుడు గత ఏడాది యూ ట్యూబ్ ద్వారా అత్యధికంగా సంపాదించిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఏకంగా 82 మిలియన్ డాలర్లు సంపాదించారు. మన భారతీయ కరెన్సీలో సుమారు రూ.700 కోట్లు పైమాటే. అంటే రోజుకు దాదాపు రూ.2 కోట్లు. ఫోర్బ్స్ 2023 టాప్ క్రియేటర్స్ ఇన్ వరల్డ్ లిస్ట్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. అభిరుచుల్లో మార్పు ♦ ప్రపంచాన్ని అన్వేషించడం అనేది ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. కొత్త విషయాలను తెలుసుకోవడంతో పాటు వారి వారి అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం కోసం చాలా మంది సామాజిక మాధ్యమాలను ఫాలోఅవుతున్నారు. ♦ ఈ విషయంలో ఇప్పటిదాకా యూ ట్యూబ్ అతిపెద్ద ఫ్లాట్‌ఫాం. ఈ స్థానాన్ని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఆక్రమించేస్తోంది. యువతరం అంతా ఇన్స్టాలోనే మునిగి తేలుతోంది. ♦ 40–50 శాతం యువత స్క్రీన్ టైమ్ సగటున రోజూ 4 నుంచి 10 గంటలు ఉంటోంది. ఇంత సమయం స్క్రీన్ కోసం కేటాయించడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఇది న్యూరో, కంటి, మానసిక సమస్యలకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు. ♦ యువ దంపతుల దాంపత్య జీవితంలోనూ ఇది చిచ్చు రేపే ప్రమాదం ఉందని చెబుతున్నారు. నెగెటివ్ అంశాల పట్ల మనసు మళ్లడం సహజమే అయినా అస్తమానం అదే అలవాటుగా మారి అనుకరించే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ♦ ఇలా విద్యార్థుల స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల పాఠ్యాంశాల పట్ల అటెన్షన్ స్పాన్ తగ్గిపోతోంది. ♦ఈ సమస్యలన్నింటికీ స్వీయ నియంత్రణే మార్గం అని నిపుణులు చెబుతున్నారు. అది డోపమైన్ ఎఫెక్ట్ జనరేషన్, జనరేషన్‌కు ప్రజల అభిప్రాయాలు, అభిరుచులు మారుతుంటాయి. ఇందుకు సహజంగా 15 ఏళ్లు పడుతుంది. అయితే ఇటీవలి కాలంలో టెక్నాలజీలో మార్పుల∙ప్రభావం వల్ల రెండేళ్లలోనే అభిరుచులు మారిపోతున్నాయి. ఇదివరకు బాగా కష్టపడే వాళ్లు మాత్రమే డబ్బు సంపాదించే వారు. మనం ఇన్నాళ్లు చెత్తా, చెదారం అనుకున్న కంటెంట్‌తో కూడా రూ.లక్షలు, కోట్లు సంపాదించేస్తున్నారు. యాలకలు, లవంగాలు అంటూ చేస్తున్న వీడియోలకు కూడా లక్షల్లో లైక్‌లు వస్తున్నాయి. ఇదంతా ‘హ్యాపీనెస్’ అనే సూత్రం. ఉదాహరణకు ఒక రోజంతా కష్టపడి ఒక పుస్తకం చదివితే ఎంత ఆనందం వస్తుందో.. ఒక నిమిషం పాటి రీల్/షాట్ చూస్తే అంతే ఆనందం వస్తుంది. కొన్ని పిచ్చి పనులను చూసినప్పుడు కూడా కొందరి మనసు అలానే స్పందించి డోపమైన్ అనే న్యూరోట్రాన్స్మీటర్ హార్మోన్ రిలీజ్ అవుతోంది. ఈ తరహా డోపమైన్‌కు జనం అలవాటు పడిపోయారు. – విశేష్ , సైకాలజిస్ట్ -
లైవ్‌లో ఎలిఫెంట్ టూత్‌పేస్ట్ ప్రయోగం చేస్తూ..ఓ యూట్యూబర్..
ఇటీవల యూట్యూబ్‌లో రకరకాల వైరైటీ వీడియోలు చేస్తూ మంచి క్రేజ్ తోపాటు పేరు తెచ్చుకుంటున్న యూట్యూబర్లకు కొదువే లేదు. కాకపోతే కొందరూ ఈ పిచ్చిలో కాస్త తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి లైవ్ వీడియోలు చేస్తున్నారు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఆన్లైన్ క్రేజీ ఆరాటం ఎంత ఉన్నా కాస్త వ్యక్తిగతం ఏది ఎంత వరకు బెటర్ అన్నది బేరీజు చూసుకుని చేస్తేనే మంచిది. ఇక్కడొక యూట్యూబర్ కూడా అలానే ఎలిఫెంట్ టూత్‌పేస్ట్ ప్రయోగం అంటూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయబోయి అతడే మతితప్పి పడిపోయే సంకట పరిస్థితి ఎదురైంది. కొన్ని లైవ్ వీడియోలు సీరియస్‌గా మారి వారి ప్రాణాలనే ఉక్కిబిక్కరి చేసేంత భయానకంగా ఉన్నాయి. దయచేసి ఇలాంటివి చేయాలనుకునే ఔత్సాహిక యూట్యూబర్లు ముందుగా ట్రయల్స్ వేసిగానీ రిస్క్ వీడియోలు చేసే సాహసం చెయొద్దు. ఇంతకీ ఆ యూట్యూబర్ చేసిన ప్రయోగం ఏంటంటే ఎలిఫెంట్ టూత్‌పేస్ట్ ప్రయోగం. జంబో రేంజ్లో టూత్ పేస్ట్‌లాంటి నురుగు పదార్థాన్ని తయారు చేయడం. ఇది నిపుణుల పర్యవేక్షణలో చేయకపోతే ఆ రసాయనాలు రియాక్షన్ ఇచ్చి వికటిస్తే మొదటికే మోసం వస్తుంది. ఈ యూట్యూబర్ కూడా అలాంటి చేదు అనుభవాన్నే ఎదుర్కొన్నాడు. లైవ్‌లో ఆ వింత ప్రయోగాన్ని చేస్తుండగా నురగలు కక్కుతూ పేస్ట్ వస్తూ ఓ విధమైన పొగ ఆ ప్రదేశం అంతా క్షణాల్లో ఆవిరించింది. సరిగ్గా సమయానికి అగ్నిమాక సిబ్బంది రంగంలోకి దిగి ఆ యూట్యూబర్‌ని కెమరామెన్ని వెంటనే ఆ గది నుంచి బయటకు తీసుకొచ్చి రక్షించే యత్నం చేశారు కాబట్టి సరిపోయింది. ప్రస్తుతం ఇద్దరికి కుత్రిమంగా ఆక్సిజన్ని అందిస్తున్నారు వైద్యులు. ఇంతకీ ఆ ఎలిఫెంట్ టూత్‌పేస్ట్ ప్రయోగం ఏంటంటే.. ఇదొక శాస్త్రీయమైన ప్రక్రియ. ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్, డ్రై ఈస్ట్, డిష్ సోప్ కలవగానే ఒక విధమైన నురుగు పదార్థాన్ని సృష్టిస్తారు. చూస్తే ఎక్కువ మొత్తంలో ఊహించని రేంజ్లో ఆ నురుగు వస్తుంది కాబట్టి దీన్ని ఎలిఫెంట్ టూత్‌పేస్ట్ ప్రయోగం అని పిలుస్తున్నారు. ఈ మూడు పదార్థాలు కలిసినపుడు రసాయనాలు ప్రతిస్పందించి ఆక్సిజన్ వాయువును విడుదల చేస్తాయి. అది మనం తట్టుకోలేనంతగా ఒక్కొసారి రావచ్చు దీంతో మన ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే పరిస్థితికి దారితీస్తుంది. అంతేగాదు రాత్రి టైంలో మొక్కలు అధిక ఆక్సిజన్ విడుదల చేస్తాయనే కదా మన పెద్దవాళ్లు చెట్ల కింద పడుకోవద్దనేది. మోతాదుకి మించిన ఆక్సిజన్ని మనిషిని ఉక్కిరిబిక్కిరిచేసి ప్రాణాలను హరించేస్తుంది. ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడూ తస్మాత్ జాగ్రత్త..! (చదవండి: అపార్ట్మెంట్ విండోలో భారీ కొండచిలువ..చూస్తే హడలిపోతారు!) -
ఆడి కారులో వచ్చి ఆకుకూర అమ్ముతున్నాడు - వీడియో
సాధారణంగా ధనవంతులు విలాసవంతమైన జీవితం గడుపుతారని దాదాపు అందరికి తెలుసు. అయితే కొంతమంది దీనికి భిన్నంగా పొలంగా వ్యవసాయం చేస్తారు, రోడ్డుపై కూరగాయలు అమ్ముతారు. ఇలాంటి సంఘటనే ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇటీవల వెరైటీ ఫార్మర్ (variety_farmer) అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ పేజీలో అప్లోడ్ చేసిన ఒక వీడియోలో ఒక వ్యక్తి ఖరీదైన ఆడి కారులో వచ్చి.. రోడ్డు పక్కన ఆకుకూర అమ్మడం చూడవచ్చు. ఈ వీడియో చూడగానే కొందమందికి ఆశ్చర్యం కలగొచ్చు. కానీ ఇది నిజమే. ఆధునిక కాలంలో చాలామంది యువకులు వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు వీడియోలో కనిపించే వ్యక్తి. ఈ వీడియోలో కనిపించే వ్యక్తి ఆడి కారులో వచ్చి ఒక దుకాణం ముందు ఆగాడు. ఆ తరువాత అక్కడే పక్కన ఉన్న ఆటో రిక్షా వద్దకు వెళ్లి ఆకు కూరని రోడ్డుపక్కన ప్లాస్టిక్ షీట్ మీద వేస్తాడు. మొత్తం అమ్మేసిన తరువాత ప్లాస్టిక్ షీట్ మడిచి ఆటోలో పెట్టుకుని మళ్ళీ తన కారు ఎక్కి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇదీ చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.. పండుగ సీజన్లో 5 లక్షల ఉద్యోగాలు! ఈ యువ రైతు పేరు సుజిత్. కేరళకు చెందిన ఈయన గత 10 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక ఆవార్డులను కూడా అందుకున్నాడు. యితడు అందరు రైతుల మాదిరిగానే వ్యవసాయం ప్రారంభించి కరంగా పురోగతి సాధించాడు. వచ్చిన లాభాలతోనే ఆడి కారు కొన్నట్లు తెలిపాడు. ఈ కారు ధర రూ. 40 లక్షల కంటే ఎక్కువ ఉంటుంది. View this post on Instagram A post shared by variety farmer (sujith) (@variety_farmer) -
'ఎవరు సార్ ఆయన.. నాకేంటి సంబంధం'.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన టేస్టీ తేజ!
టేస్టీ తేజ.. మీలో ఈ పేరు ఎంతమందికి తెలుసు. దాదాపుగా చాలామందికి తెలియదనే చెబుతారు. ఎందుకంటే అతని అంతలా ఫేమ్ ఉన్న వ్యక్తి కాదు. అతన్ని గుర్తు పెట్టుకునేంత ఏం చేశాడని అంటారా?.. ఆ సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టేంత వరకు కూడా ఎవరికీ పెద్దగా పరిచయం లేదు. బిగ్ బాస్ షోకు రాకముందు అతను ఏం చేశాడు? తొమ్మిదో కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన టేస్టీ తేజను ఈ అవకాశం ఎలా వరించింది? ఆ వివరాల గురించి ఓసారి తెలుసుకుందాం. (ఇది చదవండి: సుధీర్ బాబు వీడియో లీక్.. అలా మారిపోయాడేంటీ భయ్యా?) జబర్దస్త్‌తో కెరియర్ స్టార్ చేసిన తేజ.. యూట్యూబర్‌గా ఫేమస్ అయ్యారు. తన సొంత యూట్యూబ్ ఛానల్తోనే పాపులరిటీ తెచ్చుకున్నారు. తేజా ఫుడ్ లవర్ కావడంతో అతని పేరు కాస్తా టేస్టీ తేజాగా మారింది. మొదట చిన్న చిన్న స్ట్రీట్ ఫుడ్‌తో తేజా ప్రయాణం మొదలై.. ఆ తర్వాత దూసుకెళ్లాడు. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడలో కూడా సెలబ్రిటీలతో టేస్టీ తేజ ఇంటర్వ్యూలు కూడా చేశారు. ఏకంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. తేజాకి డబ్బులిచ్చి మరీ ఫుడ్ వీడియోలు చేయించుకుంటున్నారంటే మనోడి క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన టేస్టీ తేజ తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన గురించి మాట్లాడుతూ ఫుల్ ఎమోషలయ్యారు. ఆ స్టోరీ ఏంటో చూసేద్దాం. టేస్టీ తేజకు జబర్దస్త్ కమెడియన్‌గా రాణించేందుకు లైఫ్ ఇచ్చింది మాత్రం అదిరే అభి. ఇంటర్వ్యూలో అతని ఫోటో చూడగానే టేస్టీ తేజ కన్నీళ్లాగలేదు. ఫుల్ ఎమోషనల్ అవుతూ ఏడ్చేశాడు. (ఇది చదవండి: 'నీ ఫీలింగ్స్ ఎవరితోనూ పంచుకోకు'.. ఆసక్తిగా ట్రైలర్!) టేస్టీ తేజ మాట్లాడుతూ..'ఎవరు సార్ ఆయన.. ఆయనకు, నాకు ఏంటి సంబంధం సార్.. నాకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఏముంది సార్? .. అంటూ అభిని చూస్తూ చిన్న పిల్లాడిలా బోరున విలపించాడు. తేజ వేరే వాళ్లతో వెళ్దామని చాలా మంది సలహాలిచ్చినా.. లేదు మనోడు చేస్తాడు.. అని నాతో చేయించాడు. ఎప్పుడు ఎక్కడికెళ్లినా ఈయనను మాత్రం మర్చిపోను సార్. జబర్దస్త్‌లో చేసిన పరిచయాల వల్లే నా సొంత యూట్యూబ్ ఛానెల్ పెట్టి ఫేమస్ అయ్యాను. ఏ సినిమా ప్రమోషన్ అయినా టేస్టీ తేజ వీడియో కచ్చితంగా ఉంటుంది. ఇదంతా అన్న వల్లే సాధ్యమైంది. ఎక్కడున్న అన్న బాగుండాలి.. మాలాంటి వారికి ప్రోత్సహించాలి. అందుకే అన్నను చూడగానే ఏడుపు వచ్చేసింది.' అంటూ ఎమోషనల్ అయ్యారు. -
యూట్యూబర్ కు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన నయన తార
-
రూ.5 వేల నుంచి రూ.100 కోట్లు వరకు - సామాన్యుడి సక్సెస్ స్టోరీ!
ఆధునిక కాలంలో డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలున్నాయి. ఇందులో ఒకటి యూట్యూబ్. ప్రస్తుతం యూట్యూబ్ రాజ్యమేలుతోందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దీని ద్వారా సంపాదిస్తున్న వారి సంఖ్య రోజురోజుకి విపరీతంగా పెరుగుతోంది. ఇండియాలో యూట్యూబ్ ద్వారా కోట్లు సంపాదిస్తున్న వారిలో 'భువన్ బామ్' (Bhuvan Bam) ఒకరు. ఈయన గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భువన్ బామ్ యూట్యూబ్‌లో కామెడీ వీడియోలు చేస్తూ ఎక్కువ డబ్బు సంపాదిస్తున్న వారి జాబితాలో ఒకరుగా ఉన్నారు. మ్యుజిషియన్‌గా కెరీర్ ప్రారభించిన భువన్ ఆ తరువాత యూట్యూబ్ ప్రారభించారు. దీని కోసం సింగింగ్ కెరీర్ వదులుకున్నట్లు సమాచారం. ఇతడు చేసిన మొదటి కామెడీ వీడియో బాగా పాపులర్ అయింది. దీంతో 'బీబీ కి వైన్స్' (BB Ki Vines) అనే సొంత సిరీస్ ప్రారభించాడు. స్పూప్ వీడియోలు.. బీబీ కి వైన్స్ సిరీస్‌లో భాగంగా వివిధ రకాల పాత్రలతో స్పూప్ వీడియోలు క్రియేట్ చేసి ఎక్కువ వ్యూవ్స్ పొందగలిగాడు. దెబ్బకు ఈ సిరీస్ పెద్ద హిట్ కొట్టింది. తన సొంత కుటుంబాన్ని మాత్రమే కాకుండా, ఫ్రెండ్స్ పాత్రలు కూడా పోషించి ఎంతోమందిని ఆకట్టుకున్నాడు. ఇప్పటికి తన యూట్యూబ్ ఛానెల్‌కి 2.6 కోట్ల కంటే ఎక్కువమంది సబ్స్క్రైబర్స్ ఉన్నట్లు సమాచారం. వీడియోలు చాలా కామెడీగా ఉండటం వల్ల ఎక్కువ మంది వ్యూవ్స్ రావడంతో, ఇండియాలో టాప్ యూట్యూబర్లలో ఒకడుగా నిలిచాడు. కేవలం యూట్యూబ్ ఛానల్ వీడియోలు మాత్రమే కాకుండా.. అనేక వెబ్ సిరీస్‌లు కూడా ప్రారభించి సక్సెస్ సాధించాడు. దీంతో చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరించాడు. ఇదీ చదవండి: వాడిన పూలతో కోట్ల బిజినెస్ - ఎలాగో తెలిస్తే షాకవుతారు! ప్రారంభంలో కేవలం రూ. 5000 పొందిన భువన్ క్రమంగా లక్షలు సంపాదించడం ప్రారంభించాడు. ప్రస్తుతం రూ. 100 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులని కలిగి ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎంతోమంది యూట్యూబర్లకు రోల్ మోడల్‌గా నిలిచాడు. మొత్తానికి కష్టపడి ఎంతోమంది ప్రేక్షకులను ఆకర్శించి ఈ రోజు గొప్ప సక్సెస్ సాధించిన వారి జాబితాలో ఒకడిగా నిలిచాడు. కష్టపడి అంకిత భావంతో పనిచేయడమే సక్సెస్ మంత్రం అని ఇతని ద్వారా తెలుస్తుంది. -
కథక్ నుంచి తీన్మార్ వరకు ఏదైనా..వారెవా! అనేలా ఇరగదీస్తాడు!
బెల్జియన్ కంటెంట్ క్రియేటర్ ఈడీ పీపుల్ వివిధ ప్రాంతాలలో లోకల్స్‌తో కలిసి చేసే డ్యాన్స్ వీడియోలు ప్రపంచ వ్యాప్తంగా ఫేమ్ అయ్యాయి. ఏదైనా ప్రాంతానికి వెళ్లిన పీపుల్ స్థానికులను ‘మీకు ఇష్టమైన డ్యాన్స్ ఏమిటి?’ అని అడగడమే కాదు ‘నాకు నేర్పించగలరా?’ అని రిక్వెస్ట్ చేసి ఓపిగ్గా నేర్చుకుంటాడు. అలా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలకు చెందిన డ్యాన్స్‌లను నేర్చుకుంటూ, స్థానికులతో పోటీ పడి డ్యాన్స్ చేస్తుంటాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా మన దేశానికి సంబంధించి వివిధ ప్రాంతాలకు చెందిన డ్యాన్స్‌లు చేసి ‘వారేవా’ అనిపించుకున్నాడు. ‘మీ డ్యాన్స్ చూస్తుంటే భారతీయ పౌరసత్వం ఇవ్వాలనిపిస్తుంది’. ‘మా దేశంలోని కొన్ని అద్భుతమై డ్యాన్స్‌లను మిస్ అయ్యారు. వాటిని కూడా చేస్తే బాగుంటుంది’ అంటూ వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈడీ పీపుల్ షేర్ చేసిన డ్యాన్స్ వీడియోలపై నెటిజనులు స్పందించారు. View this post on Instagram A post shared by Ed People (@ed.people) (చదవండి: ఏం చిక్కొచ్చి పడింది! అటు చూస్తే.. జవాన్!.. ఇటు చూస్తే.. ఆఫీస్..!) -
యూట్యూబర్‌ని పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి
ఇండస్ట్రీలో ప్రేమ-పెళ్లి లాంటివి చాలా కామన్. సినిమా యాక్టర్స్ దగ్గర నుంచి సీరియల్ యాక్టర్స్ వరకు చాలామంది ఇలా లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నవాళ్లే. అయితే ప్రముఖ సీరియల్ నటి మాత్రం కాస్త డిఫరెంట్. ఎందుకంటే యూట్యూబర్ తో ప్రేమలో పడి.. దాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లింది. ఆదివారమే(ఆగస్టు 27) ఈ జంట ఒక్కటయ్యారు. (ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటుడు ఎంగేజ్మెంట్.. డాక్టర్‌బాబు సందడి) 'శివ మనసులో శక్తి', 'కణ్మని' తదితర సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న నటి జనని ప్రదీప్.. ఎన్నియన్ అనే యూట్యూబర్‌ని పెళ్లి చేసుకుంది. గతంలో ఈమెనే తన లవ్‌స్టోరీ గురించి బయటపెట్టింది. ఓ ఆల్బమ్ సాంగ్ షూటింగ్ కోసం కలిసిన వీళ్లు.. తొలుత ప్రేమలో పడ్డారు. అలా దాదాపు నాలుగేళ్ల గడిచిపోయాయి. ఈ క్రమంలోనే పెద్దలు కూడా వీళ్లిద్దరికి పెళ్లి నిశ్చయం చేశారు. అలా ఇప్పుడు జనని ప్రదీప్-ఎన్నియన్ కలిసి ఏడడుగులు వేశారు. ఈ వేడుకకు పలువురు సీరియల్ నటీనటులు హాజరై.. కొత్త జంటని ఆశీర్వదించారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాటిపై మీరు ఓ లుక్కేసేయండి. (ఇదీ చదవండి: పెళ్లికి ముందే పూజలు తెగ చేస్తున్న ఆ హీరోయిన్) -
దేశంలో యూట్యూబ్ తోపులు వీళ్లే!
యూట్యూబ్ ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతిఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూట్యాబ్‌ను వీక్షిస్తున్నారు. భారతదేశంలోనూ కోట్ల మంది యూట్యూబ్ వీక్షకులు ఉన్నారు. ఇందుకు తగినట్లే యూట్యూబర్లు, యూట్యాబ్ ఛానళ్లు సైతం ఇటీవల పెద్ద సంఖ్యలో పెరిగాయి. యూజర్లు కంటెంట్‌ని వినియోగించే విధానంలో యూట్యాబ్ విప్లవాత్మక మార్పులు చేసింది. దేశంలో ఈ ప్లాట్‌ఫారమ్ కొత్త తరం డిజిటల్ సెలబ్రిటీలకు జన్మనిచ్చింది. కామెడీ స్కెచ్‌ల నుంచి టెక్నికల్ రివ్యూల వరకు దేశంలోని ఈ టాప్ యూట్యూబర్లు దూసుకుపోతున్నారు. 2008లో భారతదేశంలో యూట్యూబ్ అరంగేట్రం కొత్త శకానికి నాంది పలికింది. ప్రారంభంలో మ్యూజిక్ వీడియోలకే పరిమితమైన యూట్యూబ్ అనతి కాలంలోనే దేశంలోని యూట్యూబర్లు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు అతిపెద్ద వేదికగా మారింది. వర్ధమాన చిత్రనిర్మాతల నుంచి గృహిణుల వరకు యూట్యూబ్ కోట్లాది మంది గొంతుగా మారింది. 2023లో దాదాపు 467 మిలియన్ల మంది యూజర్లతో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యూట్యూబ్ సబ్స్క్రైబర్లను దేశంగా భారత్ నిలిచింది. దేశంలోని టాప్ 10 యూట్యూబర్లు భారతదేశంలో డిజిటల్ సూపర్స్టార్లు ఈ టాప్ 10 యూట్యూబర్లు. యూట్యూబ్‌లో యూజర్లను పెంచుకోవడం మామూలు విషయం కాదు. యూట్యూబ్ అల్గారిథంను అవపోసన పట్టి యూజర్ల నాడిని తెలుసుకుని అందుకు తగిన కంటెంట్‌ను క్రియేట్ చేసే వాళ్లే ఇక్కడ టాప్‌లో నిలుస్తారు. అలా యూజర్లపరంగా టాప్ 10లో ఉన్న యూట్యాబర్లు, వారి చానళ్లు, ఏ రకమైన కంటెంట్ అందిస్తున్నారో తెలుసుకుందాం.. క్యారీమినాటి, 39.9 మిలియన్ సబ్స్క్రైబర్లు, రోస్టింగ్, కామెడీ కంటెంట్ టోటల్ గేమింగ్, 35.7 మిలియన్ సబ్స్క్రైబర్లు, గేమింగ్ కంటెంట్ టెక్నో గేమర్స్, 34.9 మిలియన్ సబ్స్క్రైబర్లు, గేమింగ్ కంటెంట్ మిస్టర్ ఇండియన్ హ్యాకర్, 32.1 మిలియన్ సబ్స్క్రైబర్లు, లైఫ్ హ్యాక్స్, ప్రయోగాలు రౌండ్2హెల్, 30.9 మిలియన్ సబ్స్క్రైబర్లు, కామెడీ స్కిట్లు ఆశిష్ చంచలానీ, 29.8 మిలియన్ సబ్స్క్రైబర్లు, కామెడీ స్కిట్లు, వ్లాగ్‌లు సందీప్ మహేశ్వరి, 27.9 మిలియన్ సబ్స్క్రైబర్లు, మోటివేషనల్ స్పీకింగ్ బీబీకి వైన్స్, 26.3 మిలియన్ సబ్స్క్రైబర్లు, కామెడీ, వినోదం అమిత్ భదానా, 24.3 మిలియన్ సబ్స్క్రైబర్లు, కామెడీ, వినోదం టెక్నికల్ గురూజీ, 23.1 మిలియన్ సబ్స్క్రైబర్లు, టెక్నాలజీ రివ్యూస్ -
రూ.కోటి పోర్షే లగ్జరీ కారు కొన్నాడు.. చిల్లర చూసి సిబ్బందికి ఫీజులు ఎగిరిపోయాయ్
Porsche 718 Boxster : ఇది సోషల్ మీడియా యుగం. ఏది చేసినా వినూత్నంగా చేయాలి. ఆ పని నలుగురిని ఆకట్టుకునేలా ఉండాలి. అలా అని అందరూ చేసే పని చేయకూడదు. ఇదిగో ఇలా ఆలోచించే వారి ధోరణి ఎక్కువైపోయింది. ఆ కోవకే చెందుతాడు ఈ యువకుడు. ఇంతకీ ఆ యువకుడు ఏం చేశాడని ఆలోచిస్తున్నారు. ఇటీవల కాలంలో పలువురు కాయిన్స్‌ను చెల్లించి తమకు కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా, ఓ యువకుడు కోటిరూపాయల లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. ఇందుకోసం కోటి రూపాయి కాయినట్లను చెల్లించడం ఆసక్తికరంగా మారింది. క్రేజీ ఎక్స్‌వైజెడ్ అనే యూట్యూబర్ రూ.1 నాణేలను చెల్లించి రూ.1 కోటి విలువైన పోర్షే 718 బాక్స్స్టర్ను కొనుగోలు చేశాడు. ఇందుకోసం ఆయూట్యూబర్ ఏం చేశాడో తెలుసా? తన ఇంటి వద్దే కాయిన్స్‌ను మూటలుగా కట్టి ఓ కారు షోరూం వద్దకు వెళ్తాడు. అక్కడ షోరూం సిబ్బందితో తాను ఫోర్షే కారు కొనుగులో చేయాలని అనుకుంటున్నాను. ఆ కారు గురించి మొత్తం వివరాలు తెలుసుకుంటాడు. అనంతరం షోరూం బయట ఉన్న తన కార్లో ఉన్న కాయిన్స్ మూటల్ని తెచ్చి షోరూం సిబ్బందికి అందిస్తాడు. దీంతో కంగుతిన్న షోరూం యాజమాన్యం చేసేది లేక కాయిన్స్‌ను రాశులుగా పోసి లెక్కిస్తారు. కొన్ని గంటల పాటు లెక్కించిన అంనతరం.. పోర్షే కారును ఆ యూట్యూబర్‌కు అందిస్తారు. ఈ తతంగాన్ని సదరు యూట్యూబర్ వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. యూట్యూబర్ కొనుగోలు చేసిన పోర్షే 718 బాక్స్‌స్టర్ కూపే జర్మన్ ఆటోమేకర్. మనదేశంలో విక్రయించే లగ్జరీ కార్లలో ఇదొకటి. బాక్స్స్టర్తో పాటు, 718 బ్యాడ్జ్ 718 కేమాన్, 718 కేమాన్ ఎడిషన్, 718 బాక్స్‌స్టర్ స్టైల్ ఎడిషన్, 718 కేమాన్ ఎస్, 718 బాక్స్‌స్టర్ ఎస్, 718 కేమాన్ జీటీఎస్ 4.0,718 బాక్స్‌స్టర్ జీటీఎస్ 4.0 వంటి వేరియంట్లలో లభిస్తుంది. పోర్షే 718 బాక్స్‌స్టర్ కన్వర్టిబుల్ రూఫ్‌టాప్‌తో వస్తుంది. 4-సిలిండర్ 2.0-లీటర్ ఇంజన్‌ను డిజైన్ చేయబడింది. పూర్తి సామర్థ్యంతో, ఇంజిన్ 220 కేడబ్ల్యూ శక్తిని 380 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కారు వేగం 5.1 సెకన్లలో 0-100 కేఎంపీహెచ్ నుండి వేగంగా వెళ్లగలదు. -
తలతిక్క యూట్యూబర్‌కు షాకిచ్చిన పోలీసులు
కర్ణాటక: ముఖానికి మాస్క్ ధరించి బైక్‌పై తిరుగుతూ రద్దీగా ఉన్న రోడ్లపై స్టంట్లు చేస్తూ వాహనదారులకు ఇబ్బందులకు గురిచేసిన యూట్యూబర్‌ను యలహంక పోలీసులు అరెస్టు చేసారు. మహమ్మద్ జావిద్ అరెస్టయిన యూట్యూబర్. ఇతడు తలతిక్క వీడియోలు చేస్తూ యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తుంటాడు. ఈక్రమంలోనే ఇటీవల ముఖానికి మాస్క్ ధరించి బైక్‌పై తిరుగుతూ కెంపేగౌడ ఎయిర్‌పోర్టు రోడ్డులో సిగ్నల్స్ జంప్ చేసి వన్‌వేలో వెళ్లి ఒక కారు అద్దాలు పగలగొట్టి పరారయ్యాడు. ఈ వీడియో యూట్యూబ్‌లో అప్లోడ్ చేసాడు. జరిగిన సంఘటన మరియు వీడియోపై ఫిర్యాదులు అందడంతో కేసు నమోదు చేసుకున్న యలహంక పోలీసులు జావిద్‌ను అరెస్టు చేసి బైక్ సీజ్ చేసారు. యలహంక ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
కొత్త కారు కొన్న ఆనందంతో చిందులేసిన యూట్యూబర్ - వీడియో వైరల్
Youtuber New Toyota Innova Hycross: సాధారణంగా జీవితంలో ప్రతి ఒక్కరు తమకంటూ ఓ మంచి ఇల్లు, కారు ఉండాలని కలలు కంటూ ఉంటారు. కన్న కలలు నిజం చేసుకోవడం మాటల్లో అనుకునేంత సులభమైతే కాదు. దీనికోసం అహర్నిశలు కష్టపడాలి. ఈ మార్గంలో ఎవరి ఆలోచన వారిదే..! కొంతమంది జాబ్ చేస్తే మరికొందరు సొంతంగా ఏదైనా చేసి డబ్బు సంపాదించాలనుకుంటారు. ఈ మార్గంలో నేటి యువత ఎక్కువగా యూట్యూబ్ మీద పడి సంపాదించడం మొదలెట్టారు. గతంలో చాలా సందర్భాల్లో కొంత మంది యూట్యూబర్స్ ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి మరో సంఘటన తాజాగా మళ్ళీ వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రైడర్ గర్ల్ విశాఖ అనే యూట్యూబర్ (ప్రముఖ ఉమెన్ మోటార్‌సైకిలిస్ట్) తాజాగా టయోటా కంపెనీకి చెందిన కొత్త ఇన్నోవా హైక్రాస్ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఒక వీడియో తన ఛానల్లో అప్లోడ్ చేసింది. కారుని డెలివరీ చేసుకోవడానికి తన ఫ్యామిలీతో షోరూంకి రావడం డెలివరీ తీసుకునే సమయంలో చేసిన హంగామా మొత్తం ఈ వీడియో చూడవచ్చు. ఇప్పటికే ఈమె మహీంద్రా థార్ కూడా కొనుగోలు చేసింది. టయోటా ఇన్నోవా హైక్రాస్.. టయోటా కంపెనీకి చెందిన ఇన్నోవా హైక్రాస్ లేటెస్ట్ మోడల్. దీని ధర రూ. 18.82 లక్షల నుంచి రూ. 30.26 లక్షల వరకు ఉంటుంది. అయితే ఇక్కడ యూట్యూబర్ కొనుగోలు చేసిన కారు బ్రాండ్ హైఎండ్ మోడల్. కావున ఆధునిక డిజైన్, అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇందులో స్టాండర్డ్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ 172 బిహెచ్పి పవర్ అండ్ 205 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇక 2.0 లీటర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజిన్ 184 బిహెచ్పి పవర్ డెలివరీ చేస్తుంది. ఈ కారులో డీజిల్ ఇంజిన్ ఆప్షన్ లేదు. -
అచ్చు శునకంలా
జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి. వెర్రి వేయి విధాలు. జపాన్‌లో ఓ వ్యక్తి చేసిన పని చూస్తే ఇలాంటి సామెతలన్నీ వరుసబెట్టి గుర్తు రాక మానవు! అచ్చం కుక్కలా కనిపించేందుకు మనవాడు ఏకంగా 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. పైగా ఆ వేషంలో ఆరుబయట యథేచ్ఛగా తిరిగాడు. అలా జీవితకాల ముచ్చట నెరవేర్చుకుని మురిసిపోయాడు! జపాన్‌కు చెందిన టోకో అనే వ్యక్తి ఓ యూ ట్యూబర్. తన చానల్ పేరేమిటో తెలుసా? ఐ వాంట్ టు బీ యాన్ యానిమల్’ (జంతువులా మారాలనుకుంటున్నా). దానికి ఏకంగా 31 వేల మందికి పైగా సబ్స్రై్కబర్లున్నారు. మనవాడి జీవితకాలపు కోరికుంది. ఏమిటో తెలుసా? ఎలాగైనా కుక్కలా మారడం! దాన్ని తీర్చుకోవడానికి జపాన్‌లో సినిమాలకు, టీవీ షోలకు కాస్ట్యూమ్స్ సరఫరా చేసే జెప్పెట్ అనే ప్రముఖ స్థానిక కంపెనీని సంప్రదించాడు. తన కోరిక వివరించాడు. అచ్చం కుక్కలా కనిపించే కాస్ట్యూమ్ డిజైన్ చేసిచ్చేందుకు వాళ్లూ సరేనన్నారు. అయితే తాను కుక్కను కాదని మనుషులు కాదు కదా, కనీసం కుక్కలు గుర్తు పట్టొద్దని టోకో షరతు విధించాడు. కుక్క వేషంలో తన లుక్ అంత సహజంగా ఉండాలన్నాడు. అందుకోసమని ఏకంగా 20 లక్షల యెన్లు (రూ.12 లక్షలు) చెల్లించాడు. కంపెనీ వాళ్లు దీన్నో సవాలుగా తీసుకున్నారు. 40 రోజులు కష్టపడి మరీ టోకోకు కావాల్సిన కుక్క కాస్ట్యూమ్ తయారు చేసిచ్చారు. పార్కులో ‘డాగ్’ వాక్ ► అంతా రెడీ అయ్యాక, ఒక మంచి రోజు చూసుకుని తను తయారుచేయించుకున్న కుక్క వేషం వేసి మనవాడు తొలిసారిగా షికారుకు బయల్దేరాడు. సమీపంలోని పార్కుకు వెళ్లి సందడి చేశాడు. అచ్చం కుక్కలా దొర్లుతూ, తోటి కుక్కల దగ్గరికెళ్లి వాటిని వాసన చూస్తూ హడావుడి చేశాడు. దీన్నంతటినీ వీడియో తీయించుకోవడం మర్చిపోలేదు. దాన్ని తన యూట్యూబ్ చానళ్లో అప్లోడ్ చేస్తే చూస్తుండగానే 10 లక్షలకు పైగా వ్యూస్ వచ్చి పడ్డాయి! ‘‘నా కుక్క వేషం సూపర్‌హిట్టయింది. జీవితకాల కలా నెరవేరింది. వీడియో కూడా బంపర్ హిట్టయింది. ఎలా చూసుకున్నా కుక్క వేషం కోసం పడ్డ ప్రయాసకు తగిన ఫలితం దక్కింది’’ అంటూ టోకో సంబరపడిపోతున్నాడు. గతేడాదే చెప్పాడు ► మనోడు తన మనోగతాన్ని గతేడాదే బయట పెట్టాడు. మానవ శునకంగా మారాలనుందని డైలీ మెయిల్ వార్తా పత్రిక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ‘‘ఇలాంటి నా అభిరుచులు బయటికి తెలియడం నాకిష్టముండదు. ముఖ్యంగా నా సహోద్యోగులకు. ఎందుకంటే మరీ కుక్కలా మారాలనుందంటే వాళ్లకు విచిత్రంగా తోస్తుందేమో కదా! అందుకే ఇప్పుడు నా అసలు రూపం ఎలా ఉంటుందో అందరికీ చూపించదలచలేదు. ఇలా కుక్కలా మారాలనుందని నా క్లోజ్ ఫ్రెండ్స్‌కు కూడా చెప్పలేదు. పిచ్చనుకుంటారేమోనని భయం’’ అన్నాడు టోకో! కుక్క వేషంలో తొలిసారి పార్కుకు వెళ్లినప్పుడు కాస్త నెర్వస్‌గా, మరికాస్త భయంగా అనిపించిందట మనవాడికి. ‘‘అయితే, అక్కడ నన్ను చూసిన మనుషులతో పాటు కనీసం కుక్కలు కూడా నేను కుక్కను కాదని పొరపాటున కూడా అనుకోలేదు. అంటే నా మిషన్ గ్రాండ్ సక్సెస్ అన్నట్టే కదా’’ అంటూ సంబరపడిపోయాడు. టోకో కోరిక మేరకు కోలీ జాతి కుక్కలాంటి కాస్ట్యూమ్ తయారు చేసిచ్చాం. అది వేసుకున్న వాళ్లు కుక్క కాదని చెప్పినా ఎవరూ నమ్మరు. అంత సహజంగా కుదిరిందది – కాస్ట్యూమ్స్ తయారీ కంపెనీ జెప్పెట్ అధికార ప్రతినిధి -
పాపులారిటీ కోసం పాకులాడింది.. ప్రాణాలు మీదకు తెచ్చుకుంది..
టొరంటో: టిక్ టాక్ ఛాలెంజ్ పేరుతో కెనడాకు చెందిన ఒకమ్మాయి రోజుకు నాలుగు లీటర్ల చొప్పున తాగి ప్రాణం మీదకు తెచ్చుకుంది. 12 రోజుల పాటు ఇలా రోజుకు 4 కంటే ఎక్కువ లీటర్లు తగ్గటంతో చివరి రోజున ఆమెకు కొంత అసౌకర్యంగా అనిపించి డాక్టరును సంప్రదించింది. డాక్టర్లు ఆమెకు పరీక్షలు నిర్వహించి శరీరంలో సోడియం స్థాయిలు బాగాతగ్గిపోయాయని తెలిపారు. మరి కొంచెముంటే ప్రాణాపాయమేనని తెలిపారు. అదోరకం వెర్రి.. సొషల్ మీడియాలో క్రేజ్ కోసం జనం ఎంతగా వెంపర్లాడుతూ ఉంటారంటే తొందరగా స్టార్లు అయిపోయి చేతికందినంత సంపాదించుకోవాలి. ఎక్కడికెళ్లినా కూడా జనం వారిని గుర్తించాలి. ఇదొక్కటే వారికున్న లక్ష్యం. ఈ క్రమంలో ఎలాంటి పిచ్చి పని చేయడానికైనా వెనకాడరు. తాజాగా కెనడాలో వైరల్ గా మారిన ఒక ఫిట్నెస్ ఛాలెంజ్ ఒకమ్మాయిని దాదాపుగా చావు అంచుల వరకు తీసుకుని వెళ్ళింది. 75 హార్డ్ ఛాలెంజ్.. కెనాడకు చెందిన మిచెల్ ఫెయిర్‌బర్న్ అనే టిక్‌టాక్ స్టార్ ఆండీ ఫ్రైసెల్లా అనే ఓ యూట్యూబర్ 2019లో ప్రారంభించిన 75హార్డ్ అనే ఫిట్నెస్ ఛాలెంజ్ ను స్వీకరించింది. ఇందులో భాగంగా ఆమె రోజుకు నాలుగు లీటర్ల కంటే ఎక్కువ నీళ్లు తాగాల్సి ఉంటుంది. కనీసం 45 నిముషాల పాటు రోజుకు రెండు సార్లు వర్కౌట్లు కూడా చేయాలి. రోజుకు 10 పేజీలు చదవాలి. ఇవన్నీ చేస్తునట్టుగా ఒక ఫోటో తీసి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వాలి. అయినా బుద్ధి మారలేదు.. పాపం ఫెయిర్‌బర్న్ ఈ ఛాలెంజ్ చివరి రోజు వరకు బాగానే చేసింది. 12వ రోజున మాత్రం కొంత అసౌకర్యంగా అనిపించడంతో వెంటనే డాక్టరును సంప్రదించింది. డాక్టర్ రోజుకు కేవలం అరలీటరు నీళ్లు మాత్రమే తాగాలని సూచంచారట. ఈ విషయాన్ని స్వయంగా ఫెయిర్‌బర్న్ చెబుతూ.. నేను ఎలాగైనా ఈ ఛాలెంజ్ పూర్తి చేసి తీరతాను. మొదటిసారి కావడంతో కాస్త ఇబ్బంది పడ్డాను. ఎక్కువ నీళ్లు తాగడంతో రాత్రి పూత ఎక్కువగా మూత్రానికి పోవాల్సి వచ్చేది. ఇప్పుడు అరలీటరు నెల మాత్రమేతాగా మంటున్నారు కష్టమే కానీ ప్రయత్నిస్తానంది. ఇది కూడా చదవండి: ఫాతిమాగా మారిన అంజు... ఇల్లు కట్టుకోవడానికి స్థలం, డబ్బు.. -
మారుతి జిమ్నీని సింగిల్ బెడ్‌తో అలా మార్చేసిన జంట; వైరల్ వీడియో
మారుతి సుజుకి చెందిన పాపులర్ వెహికల్ 5-డోర్ మారుతీ జిమ్నీని ఒక క్యాంపింగ్ బెడ్‌గా మార్చేసిన వైనం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. యూట్యూబర్స్ జంట మారుతి సుజుకి జిమ్నీని సౌకర్యవంతమైన క్యాంపింగ్ సెటప్‌గా మార్చేశారు. దీనికి సంబంధించిన వీడియోను Xreme Moto అడ్వెంచర్ షేర్ చేసింది. ఈ వీడియోలో దశల వారీగా మొత్తం ప్రక్రియను పొందుపర్చింది ఈ జంట. ఇది నెటిజనులను ఆశ్చర్య పరుస్తోంది. (బెదిరింపులు: అంబానీ కొత్త బుల్లెట్ ప్రూఫ్ కారు, ప్రత్యేకత తెలిస్తే..!) యూట్యూబర్ , అతని భార్య తమ మారుతి సుజుకి జిమ్నీ కారు లోపలి భాగాన్ని పరుపుకు అనుగుణంగా మార్చి, హాయిగా క్యాంపింగ్ సెటప్‌ను సృష్టించారు. ఇందుకోసం ఆగానే కష్టపడ్డారు. కారు వెనుక తలుపు తెరిచి కవర్‌ను తీసి వేయడం, ఇంటి నుండి 6-అంగుళాల సింగిల్ బెడ్ కోసం మధ్య సీటును తీసివేయడం ప్రారంభిస్తారు. ప్రారంభంలో, వారు మధ్యలో నుండి నాలుగు బోల్ట్లను తీసివేయడానికి ప్రయత్నించి, విఫలమై, మరుసటి రోజుకు వాయిదా వేయడం, మరుసటి రోజు మధ్య వరుస సీట్లలోని పైభాగాన్ని విప్పడంతో వారి పని ఈజీ అవుతుంది. (శాంసంగ్ లాంచ్ ఈవెంట్: అంచనాలు మామూలుగా లేవుగా!) మారుతి సుజుకి జిమ్నీ వంటి కాంపాక్ట్ వాహనంలో కూడా క్యాంపింగ్ సెట్‌ను అందంగా మర్చుకోవడం క్రియేటివ్‌గా నిలిచింది. సెటప్ పూర్తయిన తర్వాత, దంపతులు తమ కొత్త క్యాంపింగ్ ఏర్పాటును తమ తల్లికి ఆసక్తిగా చూపించడంతో వ్యక్తిగతంగా ఎనలేని సంతోషాన్ని, అటు కుటుంబ ఆమోదాన్ని కూడా పొందింది. (ఐటీ రిటర్న్ గడువులోగా ఫైల్ చేయండి..లేదంటే?) -
ఐఐటీ వదిలి కమెడియన్‌గా.. సంపాదన తెలిస్తే అవాక్కవాల్సిందే!
Biswa Kalyan Rath Success Story: ఒక ఐఐటీ గ్రాడ్యుయేట్ చదువు పూర్తి చేసిన తరువాత ఏదైనా మంచి ఉద్యోగంలో చేరి సంపాదించడం ఆనవాయితీ. అలా కాకుండా ఆధునిక కాలంలో కొంతమంది ఐఐటీయన్లు తమకు నచ్చిన ప్రపంచంలో ముందుకు సాగుతున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'బిశ్వ కళ్యాణ్ రాత్' (Biswa Kalyan Rath). ఇంతకీ ఈయనెవరు? ఈయన సంపాదన ఏంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, బిశ్వ కళ్యాణ్ రాత్ ఇండియన్ స్టాండ్-అప్ కమెడియన్, రచయిత అండ్ యూట్యూబర్. ఈయన తన తోటి హాస్యనటుడు కనన్ గిల్‌తో కలిసి యూట్యూబ్ కామెడీ సిరీస్, ప్రిటెన్షియస్ మూవీ రివ్యూస్ ద్వారా ప్రజాదరణ పొందాడు. అంతే కాకుండా 2016 బ్రహ్మన్ నమన్ అనే నెట్‌ఫ్లిక్స్ కామెడీ చిత్రంలో ఒక పాత్ర కూడా పోషించాడు. ఆ తరువాత 2017లో అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ లాఖోన్ మే ఏక్ని సృష్టించాడు. (ఇదీ చదవండి: సుధామూర్తిని ఏడిపించిన అలియా భట్.. కారణం ఇదే!) నిజానికి బిశ్వ కళ్యాణ్ రాత్ 2012లో ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి గ్రాడ్యుయేట్, ఆ తరువాత బయోటెక్నాలజీ పూర్తి చేసాడు. చదువు పూర్తయిన తరువాత గ్రాఫిక్ డిజైన్, అడ్వర్టైజింగ్, సాఫ్ట్వేర్ వంటి వాటిలో పనిచేసాడు. ఈ సమయంలోనే అతను 2013లో బెంగుళూరులో ఒక ఓపెన్ మైక్ ఈవెంట్లో కనన్ గిల్‌ను కలిసి 2014లో తన ఉద్యోగాన్ని వదిలి కమెడియన్‌గా మారాడు. (ఇదీ చదవండి: ఎలాన్ మస్క్, అంబానీ.. వీళ్లకంటే ముందు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఈయనే!) బిశ్వ కళ్యాణ్ రాత్ కమెడియన్‌గా మారిన తరువాత బెంగళూరు, పూణే, ముంబై, హైదరాబాద్ అండ్ కోల్‌కతాలలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. బిస్వా మస్త్ ఆద్మీ అనే పేరుతో కామెడీ షో కూడా ప్రారంభించాడు. మొత్తానికి ఐఐటీ వదిలి కమెడియన్‌గా స్థిరపడిన బిశ్వ నికర ఆస్తి విలువ రూ. 11 లక్షల నుంచి రూ. 67 లక్షల వరకు అని సమాచారం. కాగా పాణిగ్రాహి అంబర్ ధార, దో సహేలియాన్ వంటి షోలలో పాపులర్ అయిన 'సులంగ్నా'ను 2020లో వివాహం చేసుకున్నాడు. -
వీడియోలతో లక్షల సంపాదన.. ఐటీ అధికారుల ఎంట్రీతో షాకైన యూట్యూబర్!
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో ఉన్న యూట్యూబర్ తస్లీమ్ ఇంటిపై జరిపిన దాడిలో రూ. 24 లక్షలను అధికారులు గుర్తించారు. అతను దాదాపు రూ. 1 కోటి వరకు సంపాదించినట్లు సమాచారం. కొన్నేళ్లుగా తస్లీమ్ యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తున్నాడు. కాగా చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తున్నట్లు ఐటీ శాఖ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను అతని కుటుంబం తోసిపుచ్చింది. తస్లీమ్, షేర్ మార్కెట్‌కు సంబంధించిన వీడియోలతో సంపాదిస్తున్నాడు. తనకు వచ్చే ఆదాయం బట్టి అతను ఇన్‌కం ట్యాక్స్ కూడా చెల్లిస్తున్నట్లు అతని సోదరుడు పేర్కొన్నాడు. 'ట్రేడింగ్ హబ్ 3.0' అనే యూట్యూబ్ అకౌంట్‌ను తన సోదరుడు నిర్వహిస్తున్నాడని ఫిరోజ్ తెలిపారు. అతని యూట్యూబ్ ఆదాయం రూ.1.2 కోట్లపైన ఉండగా అందుకు సంబంధించి ఇప్పటికే రూ. 4 లక్షల పన్నులు చెల్లించారని ఆయన పేర్కొన్నారు. "మేము ఎటువంటి తప్పుడు పని చేయడం లేదు. యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతూ.. దాని నుంచి చట్ట ప్రకారమే ఆదాయాన్ని ఆర్జిస్తున్నాం, ఇది నిజం. ఒక కుట్ర ప్రకారమే ఐటీ దాడులు జరిగినట్టు అనిపిస్తోందని’ ఫిరోజ్ చెప్పాడు. తస్లీమ్ తల్లి తన కొడుకును తప్పుగా ఇరికించారని ఈ ఆరోపణలను కొట్టి పారేసింది. చదవండి: వామ్మో.. ఈ మ్యాగీ కంటే బిర్యానీ బెటర్.. ధర చూసి షాకైన యూట్యూబర్! -
వామ్మో.. ఈ మ్యాగీ కంటే బిర్యానీ బెటర్.. ధర చూసి షాకైన యూట్యూబర్!
న్యూఢిల్లీ: ప్రస్తుతం ట్రెండ్ మారుతోంది.. ప్రజలు భోజనాల నుంచి ఫాస్ట్‌గా రెడీ అయ్యే ఫాస్ట్పుడ్స్పై మొగ్గు చూపుతున్నారు. అందుకే హోటల్స్ అనే కాకుండా పుట్‌పాత్‌లపై కూడా ఫాస్ట్ పుడ్ సెంటర్లకి గిరాకీ పెరుగుతోంది. ఈ కేటగిరి ఆహారంలో బయట పుడ్‌కి ప్రత్యామ్నాయంగా మ్యాగీ మంచి గుర్తింపు సంపాదించుకుంది. కేవలం రెండు నిమిషాల్లోనే నోరూరించే వంటకం సిద్ధం కావడంతోపాటు దీని ధర కూడా తక్కువే. ఇంకేముంది చిన్నారుల నుంచి పెద్దల వరకు మ్యాగీని ఎగబడి తింటున్నారు. అయితే అదే మ్యాగీ ఎయిర్‌పోర్టులో కొంటే ఆ బిల్ చూసి ఓ యూట్యూబర్‌కి కళ్లు బైర్లు కమ్మాయి. వెంటనే ఆ బిల్‌ని ఫోటో తీసి నెట్టింట పెట్టి.. ఈ షాకింగ్ విషయాన్ని సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఓ యూట్యూబర్ ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో ఉండగా ఆకలేసింది. సరే ప్రయాణం కాబట్టి తీరిగ్గా తినే టైం లేదని మ్యాగీ ఆర్డర్ చేశాడు. అనుకున్నట్లుగా మ్యాగీ రావడం మనోడు కడుపునిండా తినేశాడు. అయితే చివరిలో వెయిటర్ తెచ్చిన బిల్ చూసి ఆ యూట్యూబర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ మ్యాగీ మసాలా నూడుల్స్ ధర రూ. 184గా చూపించి దానికి జీఎస్టీ రూ. 9.20 జోడించడంతో రూ. 193.20 బిల్లు అయింది. చేసేదేమిలేక ఆ వ్యక్తి బిల్లు చెల్లించి, దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ బిల్ చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ‘వామ్మో.. మరీ ఇంత ధరకు అముతున్నారా.. ఈ ధరకు బిర్యానీ వస్తుందని కొందరు కామెంట్ చేయగా... ఎయిర్‌పోర్టులో ధరలు అలానే ఉంటాయంటూ మరొకరు కామెంట్ చేశారు. చదవండి: వీడియో: బొమ్మ కాదురా నాయనా.. పామును చేతిలో పట్టుకుని.. -
యూట్యూబర్ ఎఫెక్ట్.. కేదార్నాథ్ ఆలయంలో మొబైల్ ఫోన్లు నిషేదం..
డెహ్రాడూన్: సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకోవడం కోసం ఇటీవల ఒక యూట్యూబర్ పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ ఆలయ ప్రాంగణంలో తన ప్రేమను ప్రపోజ్ చేసిన సంఘటన ఆలయ వర్గాలను విస్మయానికి గురి చేసింది. దీంతో ఆలయంలో ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కఠిన చర్యలకు ఉపక్రమించింది శ్రీ కేదార్నాథ్ బద్రీనాథ్ ఆలయ కమిటీ. కొద్దిరోజుల క్రితం విశాఖ ఫల్స్ నుంగే అనే ఒక యూట్యూబర్ తన ఫాలోవర్ల మెప్పు కోసం ఉత్రాఖండ్ లోని కేదార్ నాథ్ ఆలయంలో మోకరించి తనకు బాయ్ ఫ్రెండుకు తన ప్రేమను తెలియజేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మెప్పు పొందడం సంగతి అటుంచితే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఆలయంలో పిచ్చి పనులేంటని కామెంట్లు కూడా పోటెత్తాయి. ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నామని నెటిజన్లు అత్యధిక సంఖ్యలో ఆమెను ఏకిపారేశారు. ఈ సంఘటన జరిగిన కొద్ది వారాలకు శ్రీ కేదార్నాథ్ బద్రీనాథ్ ఆలయ కమిటీ సమావేశమై పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుడదని ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్లను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్బంగా శ్రీ కేదార్నాథ్ బద్రీనాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజయ్ అజేంద్ర మాట్లాడుతూ.. కేదార్నాథ్ ఆలయానికి వచ్చే యాత్రికులు నిండైన దుసులు ధరించాలని, గతంలో కొంతమంది ఇష్టానుసారంగా దుస్తులు ధరించి ఫోటోలు, వీడియోలు తీసుకున్నారని చెబుతూ.. అది సరైన పద్దతి కాదన్నారు. మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బద్రీనాథ్ లో కూడా మొబైల్ ఫోన్లను నిషేధించే విషయమై ఆలోచిస్తున్నామని న్నారు. ఇది కూడా చదవండి: టూరిస్టులతో గుంజీలు తీయించిన రైల్వే పోలీసులు -
ఇండియాలోనే పాపులర్ యూట్యూబ్ చానెల్.. పొలిటికల్ లీడర్స్ కూడా
ఎన్నికల సమయం రాబోతూ ఉంది. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు సోషల్ ఇన్‌ఫ్లూయర్స్‌ను సంప్రదించి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ప్రచారం పొందుతున్నారు. ‘కర్లీ టేల్స్’ యూ ట్యూబ్ చానల్‌తో విశేషంగా ఫాలోయర్స్‌ను సాధించుకున్న కామియా జని ఇటీవల రాహుల్ గాంధీ, ఆదిత్య థాకరే వంటి నేతలను కూడా ఇంటర్వ్యూ చేస్తోంది. 20 లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్ ఉన్న కామియా జని కేవలం ఈ ఇంటర్వ్యూల ద్వారా పేరు, పైకం సంపాదిస్తోంది. కామియా జని ‘సండే బ్రంచ్’ పేరుతో చేసే యూ ట్యూబ్ ఇంటర్వూలు 100వ ఎపిసోడ్‌కు చేరుకున్నప్పుడు గెస్ట్‌గా సచిన్ టెండూల్కర్ వచ్చాడు. ‘శివాజీ పార్కులో చిన్నప్పుడు క్రికెట్ ఆడితే చాలా ఆకలేసేది. మూడు నాలుగు వడపావ్‌లు లాగించేసేవాణ్ణి’ అని చెప్పాడు. వెంటనే కామియా జని ‘మీ కోసం జుహూ, అంధేరి, శివాజీ పార్క్ నుంచి మూడు వడపావ్‌లు తెప్పించాను. వాటిలో ఏది శివాజీ పార్క్దో మీరు తిని కనిపెట్టి చెప్పాలి’ అంది. సచిన్ టెండూల్కర్ చిటికెలో కనిపెట్టాడు. ఇలా ఇంటర్వ్యూ చేస్తే జనం చూడరూ? ‘సండే బ్రంచ్’కు విరాట్ కోహ్లీ ఒక వారం గెస్ట్. ‘అనుష్కతో పెళ్లయ్యాక మమ్మల్ని ఎవరూ గుర్తు పట్టకూడదని హనీమూన్‌కు ఫిన్లాండ్ వెళ్లాం. హాయిగా తిరుగుతున్నాం. ఒక చోట కాఫీ తాగుతూ ఉంటే ఒక సర్దార్జీ మమ్మల్ని గుర్తు పట్టాడు. కోహ్లీ... మా ఇంటి పేరు కూడా కోహ్లీనే అన్నాడు. పెద్దాయనా... ఇప్పుడు హడావిడి చేసి మా గుట్టు బయట పెట్టకు అని బతిమాలుకున్నాం’ అని సరదా విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు.ఇలాంటి సరదా కబుర్ల కోసం కామియా జని ఇంటర్వ్యూలు చూస్తారు. భారత్‌జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ రాజస్థాన్‌లో ఉన్నప్పుడు ‘సండే బ్రంచ్’కు పిలిచి మరీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. కామియా జనితో ‘నాకు పాతికేళ్ల వయసు వచ్చినప్పుడు లండన్‌లో ఒక కార్పొరెట్ కంపెనీలో ఉద్యోగం చేశాను. ఆ రోజుల్లో మొదటి జీతం 2,500 పౌండ్లు అందుకున్నప్పుడు అది చాలా పెద్ద అమౌంట్ అనిపించింది’ అని గుర్తు చేసుకున్నాడు. కామియా జని యూట్యూబ్ చానల్ ‘కర్లీ టేల్స్’కు 20 లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఆమె ఇప్పటి వరకూ ప్రొడ్యూస్ చేసిన వీడియోలకు 88 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఆమె చానల్ ఇండియాలో అత్యంత పాపులర్ చానల్‌గా గుర్తింపు పొందింది. అందుకే కొత్త సినిమా రిలీజ్ అయినా, ఈవెంట్ జరుగుతున్నా సెలబ్రిటీలే ఆమెను ఇంటర్వ్యూ చేయమని కోరుతున్నారు. ఇప్పుడు ఎన్నికలు కనుక రాజకీయ నేతలు కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ ఇంటర్వ్యూల వ్యూస్ కామియా జనికి భారీ ఆదాయం సంపాదించి పెడుతున్నాయి. ఒకప్పుడు జర్నలిస్ట్ ముంబైలో ఒక సాధారణ ఆటో డ్రైవర్‌కు జన్మించిన కామియా జని మాస్ మీడియాలో డిగ్రీ చేసింది. తర్వాత ఎల్ఎల్బీ చేసి 2006లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో సబ్ ఎడిటర్‌గా పని చేసింది. ఆ తర్వాత సిఎన్‌బిసి తదితర చానల్స్‌లో పని చేసి 2016 నాటికి ఈ రోజువారీ పని బోర్ కొడుతోందని భావించి ఉద్యోగం మానేసింది. ఆమెకు ప్రయాణాలు, ఫుడ్ అంటే చాలా ఇష్టం. తన మనసుకు నచ్చిన ప్రయాణాలు చేస్తూ, నచ్చింది తింటూ వాటి మీద వీడియోలు తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేస్తుంటే విశేషమైన ఆదరణ లభించింది. కామియా జని జట్టు రింగులు రింగులుగా ఉంటుంది కనుక ‘కర్లీ టేల్స్’ పేరుతో యూట్యూబ్ చానల్ మొదలెట్టింది. ‘సండే బ్రంచ్’ పేరుతో సెలబ్రిటీలను బ్రంచ్‌కు పిలిచి వారికి నచ్చిన ఫుడ్ ఐటమ్స్ వడ్డిస్తూ పిచ్చాపాటి కబుర్లతో ఇంటర్వ్యూ చేయడం కామియా జని స్టయిల్. విహారం, ఆహారం అంటే అందరికీ ఇష్టం కనుక వ్యూస్ విపరీతంగా పెరిగాయి. పెరుగుతూనే ఉన్నాయి. ఫోలోయెర్స్ ఉన్నవారే నిర్ణేతలు ఇవాళ ఎక్కువమంది ఫాలోయెర్స్ ఉన్నవారే అభిప్రాయాలను నిర్మిస్తున్నారు. ప్రచారం చేస్తున్నారు. రాజకీయ నాయకులు ఇది కనిపెట్టారు. లక్షల మంది ఫాలోయెర్స్ ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల సాయం పొందుతున్నారు. వారు చేసే కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఇంటర్వ్యూలు ఇస్తూ తాము ప్రచారం పొందుతున్నారు. ఇటీవల్ ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్యా థాక్రే కామియా జనికి ఇంటర్వ్యూ ఇచ్చాడు. రానున్న ఎన్నికల్లో కామియా జని లాంటి వాళ్లకు ఇంకా డిమాండ్ పెరగనుంది. -
మూడు పోస్టులు.. మిలియన్ ఫాలోవర్స్ - ఒక్క రోజులోనే గిన్నిస్ రికార్డ్!
Meta Threads: ట్విటర్ ప్రత్యర్థిగా విడుదలైన మెటా థ్రెడ్స్ గురించి ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. విడుదలైన ఒక రోజుకే సంచలనం సృష్టించి ట్విటర్‌కు షాక్ ఇచ్చిన ఈ యాప్ ఏకంగా 1 మిలియన్ మంది యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ థ్రెడ్స్ డౌన్లోడ్ చేసుకున్న ఒక వ్యక్తి కొన్ని గంటల వ్యవధిలోనే 10 లక్షల ఫాలోవర్స్ సాధించిన సరి కొత్త రికార్డ్ నెలకొల్పాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అమెరికాకు చెందిన ప్రముఖ యూట్యూబర్ 'జిమ్మీ డోనాల్డ్సన్' (Jimmy Donaldson) మెటా థ్రెడ్స్ డౌన్లోడ్ చేసుకుని అతి తక్కువ సమయంలోనే 1 మిలియన్ ఫాలోవర్స్ సాధించి ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: అగ్ర రాజ్యంలో వైన్ బిజినెస్ - కోట్లు సంపాదిస్తున్న భారతీయ మహిళ) పాతిక సంవత్సరాల డోనాల్డ్సన్ 'మిస్టర్ బీస్ట్' అనే పేరుతో యూట్యూబ్ ప్రారంభించి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయ్యాడు. తాజాగా విడుదలైన థ్రెడ్స్ యాప్‌లో కూడా తన హవా చూపించాడు. ఇతడు మెటా థ్రెడ్స్‌లో కేవలం మూడు పోస్టులు మాత్రమే చేసినట్లు సమాచారం. ఈ మూడు పోస్టులకు 1 మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చారంటే ఇతడెంత ఫెమస్ అనేది ఇట్టే అర్థమైపోతుంది. ఫాలోవర్స్ పెరుగుతున్న సమయంలో దానికి సంబంధించిన ఒక చిన్న వీడియో తీసి ట్విటర్ ద్వారా పోస్ట్ చేసాడు. The moment @mrbeast reached one million followers on Threads... (yes, this is how we monitored the record) (and yes, it drained the battery from our phone a lot) pic.twitter.com/PwzrUNPa2t — Guinness World Records (@GWR) July 6, 2023 -
నయనతారకు నచ్చుతే చాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది
కథ నచ్చితే కొత్త దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంటారు హీరోయిన్ నయనతార. కోలీవుడ్ దర్శకుడు అశ్విన్ శరవణన్ వంటి వారికి తొలి అవకాశం ఇచ్చింది నయనతారనే. కాగా ఈ బ్యూటీ ఎక్కువగా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తున్న విషయం తెలిసిందే. కథ బాగా నచ్చడంతో తాజాగా మరో లేడీ ఓరియంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాతో విక్కీ డ్యూడ్ అనే ఓ యూ ట్యూబర్ దర్శకుడిగా పరిచయం కానున్నారని టాక్. ఈ సినిమా షూటింగ్‌ను ఈ నెలలో ఆరంభించనున్నారట. ఈ చిత్రం కాకుండా మరో నాలుగు చిత్రాలతో నయనతార ఫుల్ బిజీగా ఉన్నారు. వీటిలో షారుక్ ఖాన్ సరసన నటిస్తున్న హిందీ చిత్రం ‘జవాన్’ ఒకటి. -
బైకర్‌ను కారుతో గుద్ది పారిపోయిన నటుడు, సీసీటీవీ వీడియో వైరల్
-
బైకర్‌ను కారుతో గుద్ది పారిపోయిన నటుడు, సీసీటీవీ వీడియో వైరల్
యూట్యూబ్‌లో వీడియోలు చేసి ఫేమస్ అయ్యాడు టీటీఎఫ్ వాసన్. యూట్యూబ్ ద్వారా వచ్చిన గుర్తింపుతో ఏకంగా సినిమా ఛాన్సే పట్టేశాడు, అది కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగానో, కమెడియన్‌గానో అనుకునేరు.. నేరుగా హీరోగా మారిపోయాడు. వాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మండల్ వీరన్. ఇటీవలే అతడి బర్త్‌డే సందర్భంగా సినిమా నుంచి ఫస్ట్ లుక్ సైతం రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌కు మంచి ప్రశంసలు లభించాయి. ఇదిలా ఉంటే వాసన్ తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. ఆ మధ్య బైక్‌పై అతివేగంగా వెళ్తూ పోలీసులతో చీవాట్లు తిన్న ఇతడు తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. కారులో వేగంగా వెళ్తున్న అతడు పక్కనున్న డివైడర్‌ను ఢీకొట్టడంతో కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న వ్యక్తి అదుపుతప్పి కిందపడటంతో స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. ఈ ఘటనతో భయపడ్డ వాసన్ వెంటనే సంఘటనా స్థలం నుంచి పారిపోయాడు. తన కారును అక్కడే వదిలేసి ఆటో ఎక్కి అక్కడి నుంచి జారుకున్నాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంత నిర్లక్ష్యంగా కారు నడుపుతున్న నటుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: నిర్మాతగా మారిన రాఘవేంద్రరావు మాజీ కోడలు -
ప్రముఖ యూట్యూబర్‌కు ప్రాణాంతక వ్యాధి.. ఇంతకీ ఏమైందంటే?
ప్రముఖ యూట్యూబ్ స్టార్, గ్రేస్ హెల్బిగ్ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకుంది. తనకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తెలియజేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఫుల్ ఎమోషనల్‌గా కనిపించింది గ్రేస్ హెల్బిగ్. (ఇది చదవండి: మహేశ్నే మించిపోయిన సితార.. ఆ ఒక్క విషయంలో) ఆమెకు ప్రస్తుతం ట్రిపుల్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపింది. దాదాపు నెల రోజుల క్రితమే వైద్యులు నిర్ధారించినట్లు వెల్లడించింది. క్యాన్సర్ ఉందని తెలియడంతో షాక్‌కు గురైనట్లు పేర్కొంది. ఈ విషయాన్ని తాను మొదట నమ్మలేకపోయానంటూ ఎమోషనల్ అయింది. తన ఇన్‌స్టాలో రాస్తూ..' దాదాపు నెల రోజుల క్రితం నాకు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ విషయం తెలిసి నేను కూడా షాకయ్యా. అందుకే ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. ప్రస్తుతానికి బాగానే ఉన్నా. నాకు భర్త,ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మద్దతుగా నిలుస్తున్నారు. డాక్టర్లు కూడా నాకు ధైర్యం చెప్పారు. రొమ్ము క్యాన్సర్‌ను జయించి త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తా.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. హెల్బిగ్ యూట్యూబ్ ఛానెల్‌కు 2.6 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. (ఇది చదవండి: బాలీవుడ్ కింగ్ షారుఖ్‌ను ఢీ కొడుతున్న ప్రభాస్..) View this post on Instagram A post shared by Grace Helbig (@gracehelbig) -
కేదార్నాథ్ ఆలయంలో ప్రపోజల్స్... యూట్యూబర్‌పై నెటిజన్స్ ఫైర్..
కేదార్నాథ్ ఆలయ ప్రాంగణంలో ప్రేమికులు ప్రపోజ్ చేసుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రేమికురాలు విశాఖ ఫల్సంగే ఆ వీడియోను పోస్టు చేయగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఈ వీడియోలో ప్రేమికురాలు విశాఖ ఫుల్సంగే తన ప్రియుడి ముందు మోకాలిపై కూర్చుంటుంది. ఇద్దరు కూడా ఒకే రకమైన ఎల్లో కలర్లో దుస్తులు ధరించారు. ఆలయం బయట కేదార్నాథ్ మహాదేవునికి దండం పెట్టుకున్న తర్వాత ప్రియురాలు విశాఖ తన ప్రియునికి ప్రపోజ్ చేస్తుంది. అనంతరం ఇద్దరు కౌగిలించుకుంటారు. ఈ దృశ్యాలను మరో వ్యక్తి వీడియో తీస్తుంటాడు. View this post on Instagram A post shared by Vishakha Fulsunge || India🇮🇳 (@ridergirlvishakha) ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది కాస్త వైరల్‌గా మారింది. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో ఇలాంటివి అవసరమా? అని ఫైరయ్యారు. 11,750 అడుగుల ఎత్తులో కష్టమైన యాత్రను పూర్తి చేసి ఇలా హగ్ చేసుకోవడాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఇందుకు భిన్నంగా ప్రమికులు చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. మహాదేవుని సన్నిధిలో ప్రపోజ్ చేసుకున్నందుకు మెచ్చుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఆలయంలో పెళ్లి చేసుకోవడం తప్పు కానప్పుడు.. పవిత్రమైన కేదార్‌నాథ్‌లో కలిసి ఉంటామని ప్రామిస్ తీసుకోవడంలో తప్పు ఏముందని కామెంట్ చేశారు. ఇదీ చదవండి: కుక్కను కారులోనే వదిలి వెళ్లారు.. తిరిగొచ్చేసరికి.. -
వయసు 11.. సంపాదన వందల కోట్లు - చిన్నారి సక్సెస్ స్టోరీ!
Youtuber Shfa Success Story: ఆధునిక ప్రపంచాన్ని ఈ రోజు ట్విటర్, వాట్సాప్, యూట్యూబ్ ఏలేస్తున్నాయి. ఏ చిన్న సంఘనటన జరిగినా నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. ఈ సోషల్ మీడియా ఆధారంగా ఎంతో మంది లక్షలు సంపాదిస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు 11 సంవత్సరాల 'ష్ఫా' (Shfa). ఇంతకీ ఈమె యూట్యూబ్ ద్వారా ఎంత సంపాదిస్తోంది. ఎలాంటి వీడియోలు చేస్తుంది అనే మరిన్ని విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో 2011 డిసెంబర్ 19న జన్మించిన 'ష్పా' (Shfa) పిల్లలకు ఉపయోగకరమైన ఎన్నో వీడియోలను తన యూట్యూబ్ ఛానల్స్ ద్వారా పోస్ట్ చేసి అతి తక్కువ కాలంలో పాపులర్ అయిపోయింది. ఈ అమ్మాయి వీడియోలు అరబిక్ భాషలో ఉండటం గమనార్హం. ష్ఫా యూట్యూబ్ ఛానల్ పాలొవర్స్.. సుమారు 40 మిలియన్స్ పాలొవర్స్ ఉన్న 'ష్ఫా' యూట్యూబ్ ఛానల్ 2015 మార్చి 29 నుంచి ప్రారంభమైనట్లు సమాచారం. అంతే కాకుండా ఇది మొదట్లో తన తల్లి నిర్వహించేది, అయితే ష్ఫా యూట్యూబ్ వీడియోలు చేయడం ప్రారంభించిన తరువాత ఎంతో మంది పిల్లల హృదయాలను దోచుకుంది, తద్వారా ఈ ఛానల్ బాగా డెవలప్ అయింది. (ఇదీ చదవండి: విడుదలకు ముందే అంచనాలు దాటేస్తున్న హోండా ఎలివేట్ - బుకింగ్స్) నెల సంపాదన ఎంతంటే.. ష్ఫా యూట్యూబ్ ఛానల్ ఇప్పటికి 22 బిలియన్లకు పైగా వీక్షణలను పొందింది, ఫలితంగా రాబడి భారీగా పెరిగింది. 2023 మే నాటికి వీరి ఛానల్ ఆదాయం 2,00,000 డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం, రూ. 1 కోటి కంటే ఎక్కువ. కొన్ని సందర్భాల్లో ఆమె నెల సంపాదన 3,00,000 డాలర్లు కూడా దాటింది. (ఇదీ చదవండి: సంచలనం సృష్టించి కనుమరుగైపోయిన భారతీయ బడా కంపెనీలు ఇవే!) కేవలం ఎనిమిది సంవత్సరాల వ్యవధిలోనే 984 వీడియోలను అప్లోడ్ చేసి సంపాదనలో బిలియన్ డాలర్ మార్క్‌కు చేరుకుంది. ష్పా నికర సంపాదన విలువ 50 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. అంటే సుమారు 410 కోట్లు. కేవలం 11 సంవత్సరాల వయసులోనే కోట్లు సంపాదిస్తున్న ఈ చిన్నారి ఎంతోమందికి ఆదర్శం కావడం చాలా గొప్ప విషయం. -
తొలి జీతం 5వేలే...ఇపుడు రిచెస్ట్ యూట్యూబర్‌గా కోట్లు, ఎలా?
భారతదేశంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లకు పాపులారీటీ గురించి ప్రత్యేకంగా చెప్సాల్సిన పనేలేదు.మిలియన్ల కొద్దీ వ్యూస్, లక్షల కొద్దీ సబ్స్క్రైబర్లతో వేలాదిమంది యూట్యూబర్లు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆదాయ ఆర్జనలోనూ తమ మర్క్‌ను చాటుకుంటున్నారు. అలాంటి వారిలో టాప్‌లో ఎవరున్నారో తెలుసా? ఎంటర్టైన్మెంట్ రంగంలో అత్యధిక నికర విలువతో భారతదేశంలోనే అత్యంత ధనిక యూట్యూబర్‌గా నిలిచాడు. నటుడిగా, గాయకుడిగా, రచయితగా, బిజినెస్ మేన్‌గా భువన్ బామ్ స్ఫూర్తిదాయకమైన విజయగాథను చూద్దాం. బడ్డింగ్ ఆర్టిస్టుగా వినోద పరిశ్రమలో తన కెరీర్‌ను ప్రారంభించిన భువన్ బామ్ ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంనుంచి వచ్చాడు. తన టాలెంట్‌తో అంచెలంచెలుగా ఎదిగాడు. దేశంలోని టాప్ యూట్యూబర్లలో ఒకరిగా నిలిచాడు. 26 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లను తన ఖాతాలో వేసుకున్నాడు. భువన్ బామ్ నికర విలువ దాదాపు 15 మిలియన్ డాలర్లు.. అంటే దాదాపు రూ.122 కోట్లు. ఈ సంపాదనంతా, బ్రాండ్, ఎండార్స్మెంట్ డీల్స్, తన సొంత వెబ్ సిరీస్, సినిమా పాత్రలు , యూట్యూబ్ వీడియోల ద్వారా వచ్చిన ఆదాయం గుజరాత్‌లోని వడోదరకు చెందినవాడు భువన్ బామ్. చిన్నప్పటినుంచి మ్యూజిక్ మీద ఉన్న ప్రేమతో దాన్నే కరియర్‌గా ఎంచుకున్నాడు ఢిల్లీలోని చిన్న కేఫ్‌లు , రెస్టారెంట్లలో పాడటం మొదలు, రియాలిటీ టీవీ షో పాటల పోటీల్లోనూ పాల్గొనేవాడు. ఈ క్రమంలో అతని సంపాదన నెలకు రూ. 5000 మాత్రమే. ఈ చాలీ చాలని జీతమే అతనిలో ఎదైనా సాధించాలంటే పట్టుదల పెరిగింది. దాంతో యూట్యూబ్ వైపు మళ్లాడు. అలా ఒక్కో మెట్టూ ఎదుగుతూ ప్రస్తుతం బిబి కి వైన్స్ అనే కామెడీ ఛానెల్‌తో పాపులర్ అయ్యాడు. కాశ్మీర్ వరదల కారణంగా ఇల్లు కోల్పోయిన మహిళను అభ్యంతర కరమైన ప్రశ్నలు అడిగిన వార్తా విలేకరిని దూషించిన వీడియోను అప్లోడ్ చేసిన పాపులరయ్యాడు. దీనికి ముందు అనేక మ్యూజిక్ ఆల్బమ్స్‌తో సంగీత ప్రియులను ఆకట్టుకున్నాడు. 2018లో తాను రూపొందించిన ప్లస్మైనస్ షార్ట్ ఫిలిం కూడా బాగా పేరు తెచ్చుకుంది. దివ్య దత్తో కలిసి నటించిన ఈ షార్ట్ ఫిల్మ్ 2019లో ది బెస్ట్ షార్ట్‌ఫిలిం అవార్డు కూడా గెల్చుకుంది. సఫర్, రహగుజార్, అజ్ఞాతవాసి లాంటి ఆల్బమ్స్ అతని ఖాతాలో ఉన్నాయి. అంతేనా యూట్యూబ్‌లో టిటు టాక్స్ అనే కొత్త డిజిటల్ సిరీస్‌లో షారుఖ్ ఖాన్ ఫస్ట్ గెస్ట్‌గా కనిపించాడు. మే 2020లో, బామ్ 'లైఫ్‌లైన్ ఆఫ్ సొసైటీ'లో ఇండియాలో లాక్డౌన్ సమయంలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించి చాలామందిని ఆకట్టుకుంటున్నాడు. ఎలక్ట్రీషియన్, హౌస్ హెల్ప్, రైతులు, చిన్నచిన్న వ్యాపారులు తదితరుల కష్టాలను రికార్డు చేసిన ఈ వీడియోలు విశేషంగా నిలిచాయి. జనవరి 2021లో తన ఛానల్ బిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుందని స్వయంగా ప్రకటించాడు. ఇటీవల ధిండోరా అనే వెబ్ సిరీస్‌తోపాటు, భువన్ రొమాంటిక్ కామెడీ అమెజాన్ మినీ టీవీ సిరీస్ రఫ్తా..రఫ్తాతో తానేంటో నిరూపించు కున్నాడు. హిట్ సిరీస్‌లు షోలతో ఇలా ఒకదాని తరువాత సక్సెస్‌తో దూసుకుపోతున్ భువన్ జనవరి 2023లో, తాజా ఖబర్‌తో ఓటీటీ అరంగేట్రం చేసాడు. జూన్ 26న రోడ్డు ప్రమాదంలో మరణించిన సహనటుడు దేవరాజ్ పటేల్‌కు హృదయపూర్వక నివాళులర్పించారు. అయితే 2021లో కోవిడ్ కారణంగా బామ్ తల్లిదండ్రులు చనిపోవడం విషాదాన్ని నింపింది. అయినా మొక్కవోని ధైర్యంతో తన లక్ష్యంపై అడుగులు వేస్తూ తనలాంటివారి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. -
మళ్ళీ జలపాతం కిందికి మహీంద్రా కారు - ఈ సారి ఏమైందంటే?
Clarity About Mahindra Scorpio N Sunroof Leak: భారతీయ మార్కెట్లో అమ్ముడవుతున్న అత్యంత సురక్షితమైన కార్లలో మహీంద్రా స్కార్పియో ఎన్ ఒకటి. గత కొంతకాలం కింద ఒక వ్యక్తి తన కారు సన్‌రూఫ్ నుంచి వాటర్ లీక్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో వీడియో అప్లోడ్ చేసి హల్ చల్ చేసాడు. అయితే ఈ సమస్యకు కంపెనీ పరిస్కారం అందించింది. కాగా తాజాగా మరో సంఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం యష్9డబ్ల్యు (Yash9w) అనే యూట్యూబర్, మహీంద్రా స్కార్పియో ఎన్ కారుని జలపాతం కిందికి తీసుకెళ్లి సన్‌రూఫ్ లీక్‌పై ఉన్న సందేహాలకు సమాధానం చెప్పాలని నిర్ణయించుకుంటాడు. ఇందులో భాగంగానే కారుని జలపాతం కిందికి తీసుకెళ్లాడు. జలపాతం నీరు కారుపై పడినా లోపలికి ఏ మాత్రమే రాలేదని స్పష్టం చేసాడు. అయితే మరో సారి కూడా కారుని జలపాతం కింది తీసుకెళతాడు. అప్పుడు చిన్న నీటి బిందువులను గమనించినట్లు వెల్లడించాడు. చిన్న నీటి బిందువులే కానీ అది అసలు చెప్పుకోదగ్గ సమస్య కాదని కూడా వీడియో ద్వారా వ్యక్తం చేసాడు. కారుని జలపాతం కిందికి తీసుకెళ్లాడనికి ముందు సన్‌రూఫ్ పూర్తిగా క్లోజ్ చేస్తాడు. సన్‌రూఫ్ మూసివేయడంతో ఏ చిన్న తప్పు జరిగినా వేగంగా వచ్చే నీరు లోపలి వస్తుంది. అయితే యూట్యూబర్ స్కార్పియో ఎన్ కారు చాలా పటిష్టమైందని, ఎలాంటి లీక్ లేదని స్పష్టంగా వెల్లడించాడు. (ఇదీ చదవండి: కోటి శాలరీ.. ప్రైవేట్ జెట్‌లో ప్రయాణం.. కుక్కను చూసుకుంటే ఇవన్నీ!) సాధారణంగా వాహన తయారీ సంస్థలు కార్లను చాలా పటిష్టంగా తయారు చేస్తాయి. అయితే వాహన వినియోగదారుడు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల సమస్యలు పుట్టుకొస్తాయి. అయితే కారులో ఏదైనా సమస్య ఉందని గమనిస్తే.. కంపెనీ తప్పకుండా దానికి తగిన పరిష్కారం అందిస్తుంది. అంతే కాకుండా సన్‌రూఫ్ అనేది వర్షపు నీటి బిందువులు లోపలికి రాకుండా కాపాడటానికి, కారులోకి కావలసినంత వెలుతురు రావడానికి ఉపయోగపడుతుంది. (ఇదీ చదవండి: బన్నీ మంచి బిజినెస్మెన్ కూడా! ఈ కంపెనీలన్నీ తనవే..) జలపాతాల కిందికి కారుని తీసుకెళ్లి సన్‌రూఫ్ టెస్ట్ చేయడమనేది సమంజసం కాదు. జలపాతం నుంచి కిందికి పడే నీరు చాలా వేగంతి పడుతుంది. అలాంటి సమయంలో ఏదైనా ఊహించని ప్రమాదం జరగవచ్చు. కావున ఇలాంటి సాహసాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచింది. మొత్తం మీద మహీంద్రా స్కార్పియో ఎన్ సన్‌రూఫ్ పటిష్టంగా ఉందని మరోసారి ఋజువైంది. ఇది మహీంద్రా ప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. -
పెంపుడు కుక్క కోసం 20 వేల డాలర్లతో కాస్ట్లీ ఇల్లు
పెంపుడు కుక్కలను అపురూపంగా చూసుకునే వాళ్లు చాలామందే ఉంటారు గాని, పెంపుడు కుక్కకు ఏకంగా కొత్తిల్లు కట్టించిన ఘనత మాత్రం కాలిఫోర్నియాకు చెందిన యూట్యూబర్ బ్రెంట్ రివెరాకు మాత్రమే దక్కుతుంది. బ్రెంట్ కొంతకాలంగా చార్లీ అనే కుక్కను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. ఈ కుక్క ఏడాది పుట్టిన రోజు మే 29న జరిగింది. ఈ సందర్భంగా బ్రెంట్ తన కుక్కకు విలాసవంతమైన కొత్త ఇంటిని బహూకరించాడు. దీని కోసం అతడికి 20 వేల డాలర్లకు (రూ.16.54 లక్షలు) పైగానే ఖర్చయింది. యూట్యూబ్‌లో బ్రెంట్ తన కుక్క ఇంటి వీడియోను పెడితే, ఏకంగా 7.9 మిలియన్వ్యూస్ వచ్చాయి. కుక్కగారి కొత్త ఇంట్లో చక్కని పడకతో పాటు టీవీ, ఫ్రిజ్ వంటి సౌకర్యాలు ఉండటం విశేషం. -
విదేశీ యూట్యూబర్‌పై దాడి
దొడ్డబళ్లాపురం: సోషల్ మీడియా వచ్చాక అనేకమంది యూట్యూబర్లు ప్రపంచంలోని మారుమూల ప్రాంతాలకూ వెళ్లి వీడియోలు తీస్తూ ఎన్నో కొత్త విషయాలను ప్రపంచానికి పరిచయం చేస్తుంటారు. అయితే కొన్నిచోట్ల దుందుడుకు వ్యక్తులు యూట్యూబర్లపై దాడులకు పాల్పడడం చూస్తుంటాం. భారత సిలికాన్ సిటీ బెంగళూరులో అటువంటి సంఘటనే జరిగింది. భారత పర్యటనకు వచ్చిన నెదర్లా్ండ్స్కు చెందిన యూట్యూబర్ ఫెడ్రో మోటా ఆదివారంనాడు బెంగళూరులోని సండే బజార్ ఆలియాస్ చోర్ బజార్‌ను వీడియో తీస్తూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. నవాజ్ హయత్ షరీఫ్ అనే స్థానిక వ్యాపారి ఫెడ్రోను అడ్డగించి వీడియో ఎందుకు తీస్తున్నావంటూ దౌర్జన్యం చేశాడు. దీంతో భయాందోళనకు గురైన ఫెడ్రో అక్కడి నుండి గబగబా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలు అన్నీ లైవ్ వీడియోలో రికార్డయ్యాయి. ట్విట్టర్లో పోలీసులకు ఫిర్యాదు ముదాసిర్ అహ్మద్ అనే వ్యక్తి ఈ వీడియోను బెంగళూరు సిటీ పోలీసులకు రీట్వీట్ చేసి దుండగునిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు. స్థానిక కాటన్‌పేట పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి నవాజ్ హయత్ షరీఫ్‌ని అరెస్టు చేశారు. -
సూర్యుడికి పంచ్.. వీళ్లకి పోలీసుల పంచ్
సూర్యుడు, జనం ‘యూ హౌమచ్ అంటే యూ హౌమచ్’ అనుకుంటున్నారు. ‘అంతు చూస్తా’ అని ఎండలాయన అంటుంటే ‘మగ్గు తీస్తా’ అని సామాన్యుడు కౌంటర్ వేస్తున్నాడు. ఈసారి ఎన్నడూ లేనంతగా వేడి ఉండటంతో జనం బయటకు బయలుదేరుతూ బకెట్ నీళ్లు, మగ్గు తీసుకెళుతున్నారు. మధ్య దారిలో మగ్గుడు నీళ్లు కుమ్మరించుకుని సూర్యుడికి పంచ్ ఇస్తున్నారు. అయితే ఇలా చేసే వారికి పోలీసులు వేసే పంచ్ వెరైటీగా ఉందనుకోండి. ఈ వైరల్ విశేషాలు... మనకు ఎండలు, ఉష్ణం ఎక్కువ కనుకనే ‘చల్లగా బతుకు’ అనే ఆశీర్వాదం పుట్టింది. కాని వేసవిలో ఎంత కాకలు తీరిన వారైనా– ఏసిలు, కూలర్లు పెట్టుకున్నా– ఇష్షో బుష్షో అంటూ ఉబ్బరింతతో తబ్బిబ్బరింత అవడం సర్వసాధారణం అయింది. ఏ ఏడుకాయేడు ఎండలు పెరగడమే తప్ప కూల్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. ఈ సంవత్సరమైతే ఉడుకు పీక్ మీద ఉంది. కాని బయటకు వెళ్లక తప్పదు. పనులు చేసుకోక తప్పదు. ఈ ఎండ దెబ్బకు కొందరైతే తిక్క వేషాలు కూడా వేస్తున్నారు. తమిళనాడులోని తంజావూరులో అరుణాచలం అనే కుర్రాడు స్కూటర్ ముందు నీళ్ల బకెట్ పెట్టుకొని ఒక చేత్తో నడుపుతూ మరో చేత్తో మగ్గుతో నీళ్లు కుమ్మరించుకుని వైరల్ అయ్యాడు. ఆరాటంలో నీళ్లు కుమ్మరించుకోవడం అతనికి సరదాగానే ఉన్నా పోలీసులు మాత్రం ‘అలా చేయకూడదు నాన్నా’ అని ముద్దు చేశారు. వారు ముద్దు చేస్తే ఎలా ఉంటుందో తెలుసుగా? 2000 ఫైన్ పడుద్ది. నీళ్లు కుమ్మరించుకున్నందుకు అరుణాచలం, ఆ వీడియో తీసినందుకు అతని స్నేహితుడు ప్రసన్న చెరో వెయ్యి వేసుకుని లాఠీ సెగ తగలకుండా బయటపడ్డారు. థానేలో జంట... ఇటు అరుణాచలం ఫీట్ వార్తల్లో ఉండగానే అటు ముంబై సమీపంలోని థానేలో ఆదర్శ్ శుక్లా అనే యూ ట్యూబర్‌కు కూడా ఎండ వల్ల మైండ్ బెసికింది. ఒక నీళ్ల బకెట్టును, స్నేహితురాలిని స్కూటర్ మీద కూచోబెట్టుకుని చౌరాస్తాకు చేరుకుని ఆమె చేత మగ్గుల కొద్దీ నీళ్లు కమ్మరించుకున్నాడు. జనానికి కాలక్షేపం, తనకు నాలుగు సబ్స్క్రిప్షన్లు అనుకున్నాడేమో కాని పోలీసులు వెంటనే స్పందించి ‘తగిన చర్య తీసుకొనబడును’ అని సందేశం పంపారు. దాంతో బేర్మన్న యూ ట్యూబర్ ‘సారీ... హెల్మెట్ లేకుండా ప్రయాణించడం తప్పే. ఫైన్ కడతా’ అని వీడియో రిలీజ్ చేశాడు. కాని ట్రాఫిక్‌లో తనకు, ఎదుటివారికి ప్రాణాంతకం కాగల ఫీట్ చేసినందుకు కదా పోలీసులు ఫైన్ వేస్తారు. అది మర్చిపోయాడు. ఎండలకు వీలైనంత చల్లగా ఉండండి. ఇలాంటి క్రేజీ ఐడియాల జోలికి పోకండి. -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న హర్షసాయి? నిర్మాత ఎవరో తెలుసా?
యూట్యూబ్ స్టార్ హర్షసాయి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అవసరంలో ఉన్నవారికి నేనున్నాంటూ సాయం చేస్తూ యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన హర్షసాయికి యూత్‌లో మాంచి క్రేజ్ ఉంది. యూట్యూబ్‌లో 8.64 మిలియన్ల ఫాలోవర్స్.. ఇన్‌స్టాగ్రామ్‌లో 4 మిలియన్ల ఫాలోవర్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న హర్షసాయిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది.చదవండి: 'పుష్ప-2'లో రష్మిక చనిపోతుందా? వైరల్ అవుతున్న ఫోటోలో నిజమెంత? తాజాగా హర్షసాయికి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. గత కొంతకాలంగా హర్షసాయి వీడియోలకు బ్రేక్ ఇచ్చాడు..దీనికి ఓ కారణం ఉందట. ఆయన త్వరలోనే హీరోగా లాంచ్ అవుతున్నట్లు తెలుస్తుంది. బిగ్‌బాస్ ఫేం మిత్రాశర్మ ఈ సినిమాను నిర్మిస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. కేవలం హీరోగానే కాకుండా దర్శకత్వం కూడా వహించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందట. మరి యూట్యూబ్ స్టార్‌గా పాపులర్ అయిన హర్షసాయి హీరోగా ఎంతవరకు సక్సెస్ అవుతాడన్నది చూడాల్సి ఉంది. చదవండి: సిద్దూ జొన్నలగడ్డతో సమంత? యంగ్ హీరోకు క్రేజీ ఆఫర్ -
ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర.. యూట్యూబర్‌పై మంత్రి కన్నెర్ర
సాక్షి,చైన్నె: యూట్యూబర్ ఎస్ శంకర్‌పై విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ కన్నెర్ర చేశారు. ఆయనపై ఏకంగా నాలుగు పరువు నష్టం దావాలను సోమవారం సైదాపేట కోర్టులో దాఖలు చేశారు. శంకర్ తనకు వ్యతిరేకంగా పదే పదే వీడియోలను విడుదల చేస్తూ వస్తున్నారని ఆ పిటిషన్లలో మంత్రి వివరించారు. మహారాష్ట్ర తరహాలో తమిళనాడులో ప్రభుత్వాన్ని కూల్చేందుకు తానేదో కుట్ర చేస్తున్నట్లుగా శంకర్ ఆధార రహిత ఆరోపణలు చేస్తున్నట్లు పేర్కొన్నా రు. అలాగే, తాను టాస్మాక్బార్లను నిర్వహిస్తున్నట్లు ఆరోపించారని తెలిపారు. ఆధార రహిత ఆరోపణలు చేయడమే కాకుండా డీఎంకే అధిష్టానం తనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తప్పుడు సమాచారం ప్రజలకు అందజేస్తూ వస్తున్నాడని వివరించారు. తన పేరుకు, పరు వుకు కలంకం తెచ్చే విధంగా వ్యవహరిస్తున్న శంకర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ మేరకు కోర్టును కోరారు. -
పేరుకే యూట్యూబర్.. ఆస్తుల్లో కుబేరుడు: ఎవరతడు?
సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన చాలా మందిలో గౌరవ్ చౌదరి ఒకరు. వృత్తిపరంగా టెక్నికల్ గురూజీ పేరుతో సుపరిచితుడైన ఈ యూట్యూబర్ దుబాయ్‌లో నివసిస్తున్నాడు. భారతదేశంలో ఎక్కువ మంది అనుసరించే టెక్ యూట్యూబర్ కూడా. ఈయన రెండు యూట్యూబ్ ఛానెల్‌లను నడుపుతూ కోట్ల కొద్ది సంపాదిస్తున్నారు. గౌరవ్ చౌదరి అండ్ టెక్నికల్ గురూజీ పేరుతో రెండు యూట్యూబ్ ఛానెల్‌లను నడుపుతున్న ఇతనికి సుమారు 27 మిలియన్స్ పాలొవర్స్ ఉన్నారు. ప్రపంచంలో అతి పెద్ద టెక్ ఛానెల్‌లలో ఒకటి టెక్నికల్ గురూజీ యూట్యూబ్ ఛానెల్. 1991లో రాజస్థాన్‌లో అజ్మీర్‌లో జన్మించిన టెక్నికల్ గురూజీ BITS పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో మైక్రో ఎలక్ట్రానిక్స్‌లో డిగ్రీని పూర్తి చేసాడు. 2015లో యూట్యూబ్ ప్రారంభించాడు. ఈ ఛానల్ ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనే గొప్ప సక్సెస్ సాధించాడు. ఒక పక్క యూట్యూబ్ ద్వారా భారీగా సంపాదించమే కాకుండా, దుబాయ్ పోలీసులకు, ఇతర సంస్థలకు భద్రతా సామగ్రిని సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతడు దుబాయ్ పోలీస్ సర్టిఫైడ్ సెక్యూరిటీ సిస్టమ్స్ ఇంజనీర్ అని సమాచారం. ప్రస్తుతం దుబాయ్‌లో రూ. 60 కోట్ల విలువైన ఇల్లు ఉంది, అంతే కాకుండా అతడు ఇప్పటికే ఖరీదైన సుమారు 11 కార్లను కలిగి ఉన్నట్లు సమాచారం. ఇందులో రూ. 8 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్, మెక్లారెన్ GT, రేంజ్ రోవర్ వోగ్, పోర్స్చే పనామెరా GTS, మెర్సిడెస్ బెంజ్ జి-క్లాస్, బిఎండబ్ల్యు 750ఎల్ఐ, మెర్సిడెస్ బెంజ్ 500ఎమ్ఎల్, ఆడి ఏ6, మహీంద్రా థార్ మొదలైనవి ఉన్నాయి. ఖరీదైన ఇల్లు, లగ్జరీ కార్లను కలిగి ఉన్న టెక్నికల్ గురూజీ మొత్తం ఆస్తుల విలువ 45 మిలియన్ డాలర్లు, అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 369 కోట్లు. అతని నెల సంపాదన కోటి కంటే ఎక్కువే. అతనికి ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. -
ఆయన సంపాదనను మరణం కూడా ఆపలేదు.. అతడెవరో తెలుసా?
ప్రముఖ పంజాబీ సింగర్ 'సిద్దూ మూసేవాలా' (Sidhu Moosewala) దుండగులు చేతిలో దుర్మరణం పాలైన విషయం అందరికి తెలిసిందే. అయితే అతని పాటలు అతని మరణానంతరం కూడా భారీగా సంపాదిస్తున్నాయి. 2023 ఏప్రిల్ 7న సిద్దు కొత్త సాంగ్ రిలీజ్ అయింది. యూట్యూబ్ ఛానల్లో విడుదలైన ఈ పాట కేవలం ఐదు గంటల్లో ఐదున్నర మిలియన్స కంటే ఎక్కువ వ్యూస్ పొందగలిగింది. 29 సంవత్సరాల వయసులో సిద్ధు మూసేవాలా మరణించినప్పటికీ అభిమానుల ఫాలోయింగ్‌తో ఇప్పటికీ తన యూట్యూబ్ రాయల్టీలు, డీల్‌ల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించగలిగాడు. ప్రస్తుతం అతని ఆస్తులన్నీ కూడా వారి తల్లిదండ్రులకు బదిలీ చేశారు. సిద్దు మరణించే నాటికి ఆయన ఆస్తుల విలువ సుమారు 14 మిలియన్ డాలర్లు, భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు వంద కోట్లకంటే ఎక్కువ. సిద్ధు మూసేవాలా ఖరీదైన కార్లు, ఇతరత్రా ఖరీదైన వస్తువులను కలిగి ఉన్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఆయన లైవ్ షోలు, కచేరీ వంటి వాటి కోసం సుమారు రూ. 20 లక్షలు, బహిరంగ ప్రదర్శనలకు రూ. 2 లక్షల కంటే ఎక్కువ వసూలు చేసేవాడని కూడా తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఐస్‌క్రీమ్ అమ్మబోతున్న అంబానీ: కొత్త రంగంలో రిలయన్స్ అడుగు..) అతి చిన్న వయసులోనే ప్రఖ్యాత గాయకుడిగా ప్రసిద్ధి చెందిన సిద్ధు.. యూట్యూబ్ ఛానల్ మరణానంతరం కూడా సంపాదిస్తోంది. యూట్యూబ్ పాలసీల ప్రకారం వ్యూవ్స్ ఆధారంగా రాయల్టీలు అందిస్తుంది. అంటే ఏదైనా వీడియో లేదా పాట 1 మిలియన్ వ్యూస్ పొందితే యూట్యూబ్ 1000 డాలర్లను అందిస్తుంది. ఇటీవలే విడుదలైన సిద్ధూ మూసేవాలా కొత్త పాట 18 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ పొందింది. దీంతో ప్రస్తుతానికి యూట్యూబ్ దీనికి రూ. 14.3 లక్షలు అందించాల్సి ఉంది. ఇది మరింత ఎక్కువ వ్యూస్ పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతే కాకుండా స్పాటిఫై, వింక్, ఇతర మ్యూజిక్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి అడ్వర్టైజ్మెంట్ డీల్స్ & రాయల్టీల ద్వారా సిద్ధూ మూసేవాలా తన మరణానంతరం తన పాటల ద్వారా రూ. 2 కోట్లకు పైగా సంపాదించాడు. ఇటీవల విడుదలైన వీడియోలో సిద్దు మూసేవాలా గాత్రానికి నైజీరియన్ సింగర్ బర్నా బాయ్ రాప్ అందించారు. ఈ వీడియోలో మొత్తం సిద్దు మూసేవాలాకి ఏర్పడిన ఒక మంచి ఫేం, అలాగే ఆయనకు వచ్చిన మంచి పేరుతో సిటీలో ఎక్కడపడితే అక్కడ ఆయనకు ఏర్పాటు చేసిన కటౌట్లు, బిల్ బోర్డుల గురించి ప్రస్తావించారు. అంతే కాకుండా ఆయన అభిమానులు గోడలకు సిద్ధూ పిక్చర్లు పెయింట్ చేయడం, ఆయన ఫోటోలు గోడలకు అతికించడం, వాహనాలకు అతికించడం వంటివి కూడా చూడవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అద్భుతమైన టెక్నాలజీతో సిద్దు మూసే వాలా కూడా కనిపించినట్లుగా మ్యాజిక్ చేశారు. -
యూట్యూబర్ అదితి అగర్వాల్ సక్సెస్ జర్నీ..మీరు ఫిదా!
సాక్షి, ముంబై: ఇటీవలి కాలంలో దాదాపు ప్రతీ ఇంటికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉందిఅనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఔత్సాహిక టీనేజర్లు,యువభారతం తమ టాలెంట్‌ను నిరూపించుకునేందుకు యూట్యూబ్‌ను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు వంటలు, చిట్కాలు, యోగాలు, కిచెన్ గార్డెనింగ్ దగ్గర్నించి, బిజినెస్, రాజకీయాలు ఇలా పలు కేటగిరీల్లో సక్సెస్ఫుల్ యూటూబర్లుగా లక్షలు, కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఢిల్లీకి చెందిన భువన్ బామ్ నుండి ముంబైకి చెందిన ప్రజక్తా కోలి వరకు అంతర్జాతీయ ఖ్యాతిని పొందారు. అలాంటి వారిలో ఒకరు యూట్యూబర్ అదితి అగర్వాల్. అద్దె ఇంట్లో మొదలు పెట్టిన ప్రయాణంలో ఇపుడు సొంత ఫ్లాట్‌తో పాటు దాదాపు 70 లక్షల మంది మద్దతుతో ఈ స్థాయికి చేరడం వెనుక ఏళ్ల కష్టం ఉంది. యూట్యూబ్‌లో క్రాఫ్టర్ అదితిగా దూసుకుపోతోందిఅదితి అగర్వాల్. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అదితి ప్రయాగ్‌రాజ్‌లోని బాలికల ఉన్నత పాఠశాలలో తన విద్యను పూర్తి చేశాక అలహాబాద్ యూనివర్శిటీ నుండి డిగ్రీని చేసింది. (చిన్న రుణాలనుంచి..వరల్డ్ టాప్ బ్యాంకర్స్‌లో స్థానం దాకా! కిక్ అంటే ఇది!) అదితి ప్రయాణం ఎలా మొదలైంది? ఒక విధంగా చెప్పాలంటే అదితి ప్రయాణం ఎనిమిదో తరగతిలో మొదలైంది. ఊహాత్మకంగా, ఆకర్షణీయంగా కార్డులు తయారు చేయడం అదితికి చాలా ఇష్టం. అలా ఎనిమిదో తరగతిలో ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఆమె ఓ కార్డును రూపొందించింది. అది చూసిన టీచర్లంతా ఫిదా అయిపోయారు. అక్కడనుంచి ప్రేరణకు తోడు 11వ తరగతిలో, అదితికి కార్డ్ ఆర్డర్ వచ్చింది. దానికి ప్రతిఫలంగా తొలి సంపాదనగా 300 రూపా యలుఆర్జించింది. ఇది ఇలా ఉండగా, అదితి తన 12వ తరగతిలో NIFT పరీక్షకు హాజరై 205 మార్కులు సాధించింది, కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా కళాశాలలో చేరలేదు. (ఫోర్బ్స్ బిలియనీర్ కేషుబ్ మహీంద్రా గురించి తెలుసా? ఆనంద్ మహీంద్రకి ఏమవుతారు?) దీంతో తన స్పెషల్ ఇంట్రస్ట్ గిప్ట్స్, కార్డుల మేకింగ్‌లో ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో సోషల్ మీడియాను ఉపయోగించుకుంది. 2015లో ఫేస్బుక్లో అదితి కార్డ్ జోన్ పేజీని ప్రారంభించింది. ఆ మరుసటి రోజే ఆమెకు 800 రూపాయల ఆర్డర్ వచ్చింది. తానే స్వయంగా కార్డులను డెలివరీ చేసింది. ఈ ప్రయాణం అంతఈజీగా ఏమీ సాగలేదు. కానీ పట్టువదలకుండా తన వంతు ప్రయత్నం చేస్తూ పోయింది అదితి. 2017లో తన యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించింది. గ్రాడ్యుయేషన్ చేస్తూనే ప్రతిరోజూ ఆమె ఒక వీడియోను అప్లోడ్ చేసేది. సోదరి సాయంతో వీడియోలను రికార్డ్ చేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. మదర్స్ డే , ఫాదర్స్ డే ఇలా ఏ అకేషన్‌ను వదులుకోలేదు. రకారకాల గిఫ్ట్స్, కార్డ్‌లను ఆన్లైన్లో విక్రయించడంతో అదితి వీడియోలను అప్లోడ్ చేసేది. అలా కార్డ్ మేకింగ్ వీడియోను వైరల్ అయింది. దాదాపు 2 లక్షల మందికి పైగా దీన్ని వీక్షించారు. దీంతో మరింత పాపులారీటి పెరిగింది. ఫలితంగా 2018లో లక్షమార్క్‌ను దాటిన అదితి ఛానెల్ సబ్స్క్రైబర్లు 2020 నాటికి 2.60 లక్షలకు చేరుకుంది. ఈ సక్సెస్‌తో 30 ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉన్న తన ఫ్యామిలీకి అదితి 2020లో లక్నోలో రెండు పడకగదుల ఫ్లాట్‌ని కొనుగోలు చేసింది. ఆమె తండ్రి ఒక ప్రైవేట్ ఉద్యోగి. ఈలోపు కరోనా రావడంతో 2021లో లక్నోకి మకాం మార్చింది. అదితి ఛానెల్‌పై కోవిడ్-19 ప్రభావం కరోనా సమయంలో, అదితి ఛానెల్ కంటెంట్‌కు ఆదరణ కాస్త తగ్గింది. దీంతో 2.60 లక్షల మంది సభ్యులు 2.54 లక్షలకు పడిపోయారు. ఈ సమయంలో కాస్త నిరాశ పడినా, ఆ తర్వాత అదితి తన తల్లి సపోర్ట్‌తో ప్రతిరోజూ వీడియోలు అప్లోడ్ చేయాలని నిర్ణయించుకుంది. చివరికి వీడియో ఒకటి వైరల్ కావడంతో కేవలం 15 రోజుల్లో సబ్స్క్రైబర్లు 10 లక్షల మంది చేరారు. ప్రస్తుతం అదితి యూట్యూబ్ ఛానెల్లో దాదాపు 7 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లుండటం విశేషం. ఈ రోజు సంపాదన 6 అంకెలలో. అదితికి ఇన్‌స్టాగ్రామ్‌లో 5.9 లక్షల మంది, ఫేస్బుక్లో 2.90 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. రేసు గుర్రంలా పరిగెట్టాల్సిందే యూట్యూబర్ కావాలనుకునే వారికి టిప్స్ ఇస్తూ..సక్సెస్ రావాలంటే లాంగ్ రేసు తప్పదని, చాలామందికి సడెన్‌గా సక్సెస్ వచ్చినా మాయమైపోతుందని, దాన్ని నిలుపు కోవడం ముఖ్యమని సూచిస్తుంది. అందుకే రేసు గుర్రంలా మారితే గొప్ప విజయాన్ని అందుకోలేమని చెబుతుంది అదితి. తనకు కూడా సక్సెస్ రావడానికి ఆరేళ్లు పట్టిందంటూ తన జర్నీని గుర్తు చేసుకుంది. (సర్కార్ కొలువుకు గుడ్‌బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?) YouTube ప్రశంసలు అనేక ఈవెంట్లకు ఆహ్వానం అదితి విజయాన్ని యూట్యూబ్ కూడా ప్రశంసించింది. DIY ఈవెంట్‌కి ఆహ్వానాన్ని అందుకుంది. ఇంకా మెటా అనేక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం వచ్చింది. -
అడల్ట్ సినిమాలో న్యూడ్‌గా నటిస్తున్నారా? అన్న ప్రశ్నకు నటి ఏమందంటే?
అందాలు ఆరబోయడం అనేది ఇండస్ట్రీలో సర్వసాధారణ విషయం. అవకాశాలు రావాలంటే అందాల ఆరబోత తప్పనిసరి! గ్లామర్ షో చేస్తేనే కానీ దర్శకనిర్మాతల కంట పడరు అన్నట్లు తయారైంది సినీ ఇండస్ట్రీ పరిస్థితి. ఒక్క సినీఇండస్ట్రీ మాత్రమే కాదు బుల్లితెరది కూడా ఇంచుమించు అదే పరిస్థితి! సీరియల్స్ నుంచి సినిమాకు ప్రమోషన్ రావాలంటే గ్లామర్ షో చేయాల్సిందే! మంగళ గౌరి మధువె అనే కన్నడ సీరియల్‌తో పాపులర్ అయిన నటి తనీశా కుప్పంద తన అందంతో 2012లోనే పారిజాత అనే సినిమాలో నటించే ఛాన్స్ పట్టేసింది. ఆ తర్వాత వరుస సినిమా ఛాన్సులు కూడా అందుకుంటోంది. ఇటీవల ఆమె పెంటగాన్ మూవీలో నటించింది. ఇందులో బోల్డ్ సన్నివేశాల్లో యాక్ట్ చేసింది నటి. ఈ మూవీ ఏప్రిల్ 7న విడుదల కానుంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్న ఈ బ్యూటీకి ఓ యూట్యూబర్ నుంచి వింత ప్రశ్న ఎదురైంది. 'మీరు అడల్ట్ సినిమా చేస్తారా?' అని అడిగేసరికి నటి ఒక్కసారిగా అవాక్కైంది. 'నేనేమీ బ్లూ ఫిలిం స్టార్ కాదు. మీరిలాంటి ప్రశ్న ఎలా అడుగుతున్నారు? కన్నడ సినీ ఇండస్ట్రీలో ఎవరు న్యూడ్ మూవీస్ చేస్తున్నారు? ఇలాంటి చెత్త ప్రశ్నలు ఎలా అడగాలనిపిస్తుందో నాకైతే అర్థం కావడం లేదు' అని మండిపడింది. అసలు ఆ యూట్యూబర్‌కు ఇతరులను గౌరవించడం ఏమాత్రం తెలియనట్లుంది అని కామెంట్ చేసింది. -
ఒక్కసారిగా మైండ్ బ్లాక్!.. వెయిట్రస్‌కు కోట్ల విలువైన కారు టిప్‌గా ఇచ్చాడు
ప్రముఖ అమెరికన్ యూట్యూబర్ మీస్టర్ బీస్ట్ అలియాస్ జిమ్మీ డొనాల్డ్సన్ ప్రపంచంలో అత్యధికంగా ఫాలోవర్లును సంపాదించుకున్నాడు. వెరైటీ కంటెంట్లతో నెటిజన్లకు ఎప్పటికప్పుడు వినోదాన్ని పంచుతుంటాడు ఈ యూట్యూబర్. అందుకే తన ఫాలోవర్లు సంఖ్య 139 మిలియన్లకు పెంచుకోగలిగాడు. తన బిజినెస్ వెంచర్స్‌ను ప్రమోట్ చేసుకునేందుకు సరికొత్తగా ప్లాన్లు చేసే ఈ యూట్యూబర్ ఇటీవల ఓ వెయిట్రస్‌కు ఊహించని గిఫ్ట్ ఇచ్చి ఆమె ఆనందానికి అవధులు లేకుండా చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఊహించని టిప్.. రెస్టారెంట్‌కు వెళ్లిన ఆ యూట్యూబర్ అక్కడ పని చేస్తున్న వెయిట్రెస్‌తో.. ఇంత వరకు నువ్వు అత్యధికంగా ఎంత టిప్ తీసుకున్నావు అని అడుగుతాడు. ఈ ప్రశ్నకు, ఆమె 50 డాలర్లు అని సమాధానమిస్తుంది. దాంతో ఇప్పటివరకూ నీకు టిప్‌గా కారు ఎవరైన ఇచ్చారా అని అడుగుతూ తన కారు తాళాన్ని వెయిట్రెస్‌కు ఇస్తాడు. మొదట్లో ఆమె ఈ విషయాన్ని నమ్మదు గానీ తర్వాత ఆ యూట్యూబర్ తను కారును పార్క్ చేసిన ప్రదేశానికి వెయిట్రెస్‌ను తీసుకువెళ్లి సర్ప్రైజ్ చేస్తాడు. బ్లాక్ టయోటా కారును వెయిట్రెస్‌కు టిప్‌గా అందిస్తాడు ఆ యూట్యూబర్. టిప్‌గా ఇచ్చిన కారుపై తన చాక్లెట్ కంపెనీ ఫీస్టబుల్ లోగో కనిపిస్తుంది. కస్టమర్ నుంచి కోట్లు ఖరీదైన కారుని టిప్‌గా అందుకోవడంతో వెయిట్రెస్ ఆనందంలో మునిగి తేలిపోతుంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ యూట్యూబర్ ఔదార్యాన్ని ప్రశంసలతో ముంచెత్తుతూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by MrBeast (@mrbeast) -
అతనికి జాబ్ లేదు! కోట్లు సంపాదిస్తున్నాడిలా..
సోషల్ మీడియా ఈ రోజు ప్రపంచాన్ని ఏలేస్తోంది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వాటితో ఎంతోమంది పాపులర్ అవుతున్నారు. ఆలాంటి వారిలో ఒకరు అమెరికాకు చెందిన 'జిమ్మీ డొనాల్డ్సన్'. ఇతడు యూట్యూబ్ ద్వారా ఇప్పుడు కోట్లలో సంపాదిస్తున్నాడు. మిస్టర్ బీస్ట్‌గా ప్రసిద్ధి చెందిన 'జిమ్మీ డొనాల్డ్సన్' యూట్యూబ్ ద్వారా సక్సెస్ సాధించిన వారిలో చెప్పుకోదగ్గ వ్యక్తి. ప్రస్తుతం తన ఛానెల్‌కి 139 మిలియన్ల కంటే ఎక్కువ సబ్‌స్క్రైబర్ కలిగి ఉన్నారు. ఎంతో ఆసక్తికరమైన కంటెంట్స్ సృష్టించడంలో ఆరితేరిన మిస్టర్ బీస్ట్ అద్భుతమైన విన్యాసాలు, ఛాలెంజ్‌లు, విరాళాలను అందించడం ద్వారా బాగా పేమస్ అయ్యాడు. ప్రస్తుతం యూట్యూబ్ ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న యువకులలో డొనాల్డ్సన్ కూడా ఒకరు కావడం గమనార్హం. 2021లో అతడు ఏకంగా 54 మిలియన్ డాలర్లను సంపాదించినట్లు తెలిసింది. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 400 కోట్ల కంటే ఎక్కువ. (ఇదీ చదవండి: New Mahindra Thar: థార్ కొత్త వేరియంట్.. మారుతి జిమ్నీకి గట్టి షాక్!) 1998 మే 1న నార్త్ కరోలినాలోని గ్రీన్విల్లేలో జన్మించిన జిమ్మీ డొనాల్డ్సన్ 2012లో మిస్టర్ బీస్ట్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. గేమింగ్, కామెంటరీ వంటి వాటితో మొదలై అతి తక్కువ కాలంలోనే యువతను ఎంతగానో ఆకట్టుకునే స్టంట్స్ మొదలైనవి ప్రారభించి ఎక్కువమందిని ఆకర్శించాడు. మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ ఛానల్ చాలా వేగంగా లెక్కకు మించిన సబ్స్క్రైబర్స్ పొందగలిగింది. అయితే ఇతని ఛానెల్ కోసం కొన్ని సంస్థలు బిలియన్ డాలర్లను ఆఫర్ చేసినప్పటికీ వాటన్నింటిని తిరస్కరించినట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇప్పటికి కూడా అతడు సొంతంగానే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. (ఇదీ చదవండి: మారుతి జిమ్నీ డెలివరీలు అప్పుడే!) బిలియన్ డాలర్ ఆఫర్‌ను తిరస్కరించినప్పటికీ మిస్టర్ బెస్ట్ అత్యంత విజయవంతమైన కంటెంట్ సృష్టికర్తలలో ఒకరుగా కొనసాగుతున్నాడు. కొన్ని నివేదికల ప్రకారం 2020లో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ సంపాదిస్తున్న యూట్యూబర్స్ జాబితాలో డొనాల్డ్సన్ 40వ స్థానం పొందాడు. -
నకిలీ వీడియో కేసు.. పోలీసుల కస్టడీలో యూట్యూబర్!
చెన్నై: తమిళనాడులోని బీహార్ వలస కార్మికులపై దాడులు చేశారంటూ నకిలీ వీడియోలను పోస్ట్ చేసిన కేసులో యూట్యూబర్ మనీష్ కశ్యప్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతన్ని మధురై కోర్టు ముందు హాజరుపరచగా.. ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం న్యాయస్థానం కశ్యప్‌కు మూడు రోజుల కస్టడీని విధించింది. మార్చి 18న జగదీష్పూర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన తర్వాత బీహార్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOU) కశ్యప్‌ను అరెస్టు చేసింది. పోలీసుల ప్రత్యేక బృందం ట్రాన్సిట్ రిమాండ్‌పై బీహార్ నుంచి తమిళనాడుకు తీసుకువచ్చింది. నకిలీ వీడియోలను వ్యాప్తి చేసినందుకు అతనిపై మధురైలో నమోదైన ఫిర్యాదు ఆధారంగా, అతనిపై కేసు నమోదు చేసి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇటీవల, తమిళనాడులో వలస కార్మికులపై దాడికి గురైన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఫ్యాక్ట్ చెక్ కమిటీ, పోలీసు శాఖ ద్వారా ఈ వీడియోలు ఫేక్ అని తేలింది. దీంతో వెంటనే అతనిపై చర్యలు తీసుకున్నారు. వలస కార్మికులపై దాడి జరుగుతున్నట్లు ఫేక్ వీడియోల అంశంపై తమిళనాడు సీఎం స్టాలిన్ సీరియస్‌గా తీసుకున్నారు. ఇటువంటి పుకార్లను వ్యాప్తి చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో అవసరమైన అన్ని సహాయాన్ని వలస కార్మికులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. -
సన్‌రూఫ్ లీక్‌పై రచ్చ లేపి.. ఇప్పుడు హ్యాపీ అంటున్నాడు: వీడియో
భారతీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన సంస్థలలో ఒకటి. ఇప్పటికే థార్, XUV700, స్కార్పియో క్లాసిక్ వంటి వాటిని విక్రయిస్తూ అమ్మకాల్లో దూసుకెళ్తోంది. అయితే గత కొన్ని రోజులకు ముందు స్కార్పియో-ఎన్ SUV సన్‌రూఫ్ లీక్‌కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మహీంద్రా స్కార్పియో సన్‌రూఫ్ లీక్ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన యూట్యూబర్ అరుణ్ పన్వార్ ఇప్పుడు చాలా హ్యాప్పీగా ఉందంటూ మరో వీడియో పోస్ట్ చేసాడు. దీనికి కారణం కంపెనీ ఎటువంటి చార్జెస్ తీసుకోకుండా సన్‌రూఫ్ బాగుచేసి అతడికి అప్పగించడమే. గతంలో వెలువడిన వీడియోలో అరుణ్ పన్వర్ తన మహీంద్రా స్కార్పియో-ఎన్ కారుని జలపాతం కిందకి తీసుకెళ్లినప్పుడు, నీరు సన్‌రూఫ్ నుంచి లోపలికి వచ్చాయని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రచ్చ చేసాడు. అయితే అదే జలపాతం కింద కంపెనీ అలాంటి కారుని నిలిపి ఎటువంటి లీక్ లేదని నిరూపించింది. అంతే కాకుండా కస్టమర్ అసౌకర్యానికి కంపెనీ బాధ్యత వహిస్తూ అతని కారు సన్‌రూఫ్ బాగు చేసింది. దీనికి రూ. 53,000 ఖర్చయింది. కానీ కస్టమర్ నుంచి డబ్బు తీసుకోకుండా ఫ్రీ సర్వీస్ చేసింది. మొత్తానికి యూట్యూబర్ ఇప్పుడు చాలా హ్యాప్పీగా ఫీలయ్యాడు. కంపెనీ అతనికి కారుని అందించిన తరువాత మహీంద్రా స్కార్పియో-ఎన్ జలపాతం కిందికి వెళ్లే సమయంలో సన్‌రూఫ్ కొంత ఓపెన్ అయి ఉండటం వల్ల నీరు లోపలికి వచ్చిందని నివేదించింది. అంతే కాకుండా జలపాతం కిందికి వెళ్లడం ప్రమాదమని, అది కొన్ని సందర్భాల్లో అనుకోని ప్రమాదాన్ని ఆహ్వానిస్తుందని చెప్పుకొచ్చింది. సాధారణంగా కంపెనీ కారులో ఇలాంటి సమస్యలు గతంలో ఎప్పుడూ వెలుగులోకి రాలేదని కూడా వెల్లడించింది. -
వరల్డ్ నెం.1 యూట్యూబర్ చనిపోయాడని ట్వీట్.. లక్ష మంది లైక్.. చివర్లో ట్విస్ట్
సోషల్ మీడియాలో వ్యాప్తి చెందే వార్తలన్నీ నిజాలు కావు. అత్యుత్సాహంతో కొందరు నిజా నిజాలు నిర్ధరించుకోకుండా ఫేక్ వార్తలను గుడ్డిగా షేర్ చేస్తుంటారు. ఫలితంగా అమాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. తాజాగా అలాంటి ఘటనే జరిగింది. నెం.1 యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు ఉన్న మిస్టర్ బీస్ట్(అసలు పేరు జిమ్మీ డోనాల్డ్సన్) చనిపోయాడనే ఓ వార్త సామాజిక మాధ్యమాలను షేక్ చేసింది. 'డొనాల్డ్సన్ చనిపోయాడు. దీన్ని నమ్మలేకపోతున్నా. అతను ఇంత తర్వగా వెళ్లిపోతాడని ఊహించలేదు. ఈ లెజెండ్ ఎప్పటికీ గుర్తుండిపోతాడు' అని ఓ యూజర్ ట్విట్టర్లో పోస్టు చేశాడు. డొనాల్డ్ సన్ ఫొటోను కూడా షేర్ చేయడంతో ఈ పోస్టు క్షణాల్లోనే వైరల్‌గా మారింది. I cant believe mrbeast died... gone too soon man.. you'll never be forgotten you legend ❤️ pic.twitter.com/3Fr4h3PQAy — duck (@ExtremeBlitz__) March 15, 2023 దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఇది కచ్చితంగా ఫేక్. ఇలాంటి న్యూస్ షేర్ చేసేవారికి అసలు బుద్ధిలేదు. అది అసహ్యం తెప్పించే జోక్‌లా ఉంది. అని ఓ యూజర్ ఘాటుగా రిప్లై ఇచ్చాడు. మరికొందరు మాత్రం మిస్టర్ బీస్ట్ నిజంగానే చనిపోయాడనుకుని నమ్మారు. ఇది నిజమా? ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు అని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంకొందరేమో ఇలాంటి సున్నితమైన విషయాలపై ఫేక్ న్యూస్ ఎలా వ్యాప్తి చేస్తారు? అలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరా? అని ప్రశ్నించారు. ఏదేమైనా మిస్టర్ బీస్ట్ చనిపోయాడనే పోస్టును 1.4 కోట్ల మంది వీక్షించారు. లక్ష మందికిపైగా లైక్ చేశారు. దీంతో డొనాల్డ్సన్ దీనిపై స్వయంగా స్పందించాడు. ఈ పోస్టును లక్ష మంది ఎందుకు లైక్ చేశారో నాకు అర్థం కావడం లేదంటూ నవ్వులు పూయించాడు. అయితే డొనాల్డ్సన్ చనిపోయాడని పోస్టు పెట్టిన వ్యక్తి దీనికి మళ్లీ రియాక్ట్ అయ్యాడు. నా పోస్టుకు రిప్లై ఇవ్వడానికే అతను మళ్లీ తిరిగివచ్చాడు అని చమత్కరించాడు. 10 వేల డాలర్లు (సుమారు రూ. 8,30,000) ఇస్తే ఈ పోస్టును డిలీట్ చేస్తా అన్నాడు. కానీ డొనాల్డ్సన్ దీనిపై మళ్లీ స్పందించలేదు. దీంతో ఆ పోస్టు అలానే ఉంది. కాగా.. మిస్టర్ బీస్ట్ పేరుతో ఉన్న డొనాల్డ్సన్ యూట్యూబ్ ఛానల్‌కు అత్యధికంగా 13.7కోట్ల మంది సబ్‌స్కైబర్లు ఉన్నారు. చదవండి: గుండె ధైర్యమంటే నీదే భయ్యా.. మైండ్ బ్లాంక్ ఇదేనేమో.. -
జాబ్, బిజినెస్ మాకొద్దు.. సంపాదన మాత్రం లక్షల్లో.. ఆ గ్రామంలో అదే ట్రెండ్!
ప్రస్తుత రోజుల్లో గ్రాడ్యుయేట్లుగా కళాశాల నుంచి బయటకొస్తున్న విద్యార్థులు.. ఉద్యోగులుగా మారడం చాలా కష్టమనే చెప్పాలి. ఇక లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం తీవ్రంగా శ్రమిస్తుండగా.. మరి కొందరు ఐటీ రంగంలో ఇంజనీర్లుగా మారేందుకు కుస్తీ పడుతున్నారు. టీచర్లు, మార్కెటింగ్, వ్యాపారమంటూ.. విద్యార్థులు కెరీర్లో ఉన్నత స్థానానికి చేరుకునేందుకు చాలానే కష్టపడుతుంటారు. అయితే ఏ ఉద్యోగం చేసిన సంపాదనే ధ్యేయంగా పని చేస్తుంటాం. ఈ విషయాన్ని గుర్తించిన ఓ గ్రామంలోని యువత జాబ్, వ్యాపారాలు చేయకుండానే సంపాదించేస్తున్నారు. అదెలాగో తెలుసుకుందాం ఆ గ్రామంలో యువత ఎంచుకున్న దారి అదే ట్రండ్ మారుతోంది.. అందుకు తగ్గట్టే యువత దృక్పథంలో కాస్త మార్పు కనిపిస్తోంది. అందుకే కేవలం ఉద్యోగాలనే కాకుండా ఆఫ్‌బీట్ కెరీర్ల వైపు కూడా ఓ లుక్కేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా సోషల్‌మీడియా యూజర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో యూట్యూబ్‌ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంటున్న వారి సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఈ ట్రెండ్‌నే ఫాలో అవుతోంది ఛత్తీస్‌గఢ్‌లో రాయ్‌పూర్‌లోని తులసి గ్రామ యువత. గ్రామంలో నివసిస్తున్నప్పటికీ తమకున్న వనరులతో మంచి కంటెంట్‌ని రూపొందించి యూట్యూబ్ ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ గ్రామంలో దాదాపు 400 పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామ జనాభా 3000-4000 మధ్య ఉండగా.. వారిలో 30 శాతం అనగా దాదాపు 1000 మంది యూట్యూబ్ ద్వారా సంపాదిస్తున్నారు. అలా మొదలైంది.. ఈ స్టోరీ ఇద్దరు స్నేహితులు గ్రామంలో యూట్యూబ్ వీడియోలు చేయడం ప్రారంభించారు. యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించడం కోసం వీరిద్దరూ చేస్తున్న ఉద్యోగాలను సైతం వదులుకున్నారు. అందులో ఒకరు.. జ్ఞానేంద్ర శుక్లా ఎస్బిఐలో నెట్వర్క్ ఇంజనీర్‌గా పనిచేసేవాడు. యూట్యూబ్ వీడియోల ద్వారా సంపాదిస్తున్న యూట్యూబర్ల గురించి తెలుసుకున్నాడు. తాను ఆ దారిలో ప్రయాణించాలనుకుని, అనుకున్నదే తడవుగా జాబ్ రిజైన్ చేసి వీడియోలపై ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు, అతను తన ఛానెల్లో 250 కంటే ఎక్కువ వీడియోలను అప్లోడ్ చేశాడు. మరొకరు.. కెమిస్ట్రీలో ఎంఎస్సీ చేసిన జై వర్మ ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో పార్ట్‌టైమ్ టీచర్‌గా పనిచేశాడు. అక్కడ అతను నెలకు 12,000-15,000 రూపాయలు సంపాదించే వాడు. అయితే యూట్యూబ్‌లో వీడియోల ద్వారా దాదాపు రూ.30,000- 35,000 సంపాదన రావడంతో టీచర్ జాబ్‌కు రిజైన్ చేసి ఈ రంగంలోకి అడుగపెట్టాడు. అలా వీరిద్దరి నుంచి యూట్యూబ్ వీడియోలు మొదలయ్యాయి. ప్రస్తుతం వాళ్లిద్దరి సంపాదన ఏడాదికి లక్షల్లో ఉంది. ఇక దాదాపు ఆ గ్రామంలోని ప్రతి కుటుంబం YouTube వీడియోలలో పాల్గొంటుంది. అంతేకాకుండా అక్కడ యువత ఉద్యోగాలను పక్కను పెట్టి.. వీరినే ఫాలో అవుతూ యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. ప్రస్తుతం తులసి గ్రామం నుంచి 40-50 ఛానళ్లు తయారవుతున్నాయి. -
మంత్రిని ప్రశ్నించినందుకు యూట్యూబర్ అరెస్టు!
రాష్ట్రమంత్రి గ్రామంలో పర్యటించడంతో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి ప్రాజెక్టులు గురించి నిలదీశాడు ఓ యూట్యూబర్. అంతే మరుసటిరోజే నేరస్తుడి మాదిరిగి చేతులకు తాడుకట్టి మరీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. పైగా అతను శాంతి భద్రతలకు విఘాతం కలిగించాడంటూ కేసులు సైతం నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..'మొరాదాబాద్ ఉజ్జల' అనే యూట్యూబ్ ఛానెల్‌ని నిర్వహిస్తున్న సంజయ్ రాణా అనే వ్యక్తి తమ గ్రామానికి వచ్చిన రాష్ట్రమంత్రిని అభివృద్ధి పనులు గురించి ప్రశ్నించాడు. వాస్తవానికి సంభాల్ జిల్లాలలో బుద్‌నగర్ ఖండూవా గ్రామంలోని చెక్‌డ్యామ్ శంకుస్థాపన కోసం స్థానిక ఎమ్మెల్యే తోపాటు సెకండరీ ఎడ్యుకేషన్ రాష్ట్ర మంత్రి గులాబ్ దేవిని గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా సంజయ్ వారిని ప్రశ్నించడమే గాక, అందుకు సంబంధించిన వీడియోని కూడా నెట్టింట పోస్ట్ చేశాడు. దీంతో మరుసటి రోజే అతనిపై స్థానిక బీజేపీ యువజన విభాగం నాయకుడు శుభం రాఘవ్ చందౌసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యూట్యూబ్ ఛానెల్ గుర్తింపు కార్డు, మైక్రోఫోన్ కలిగి ఉన్న నకిలీ జర్నలిస్ట్ అని, ప్రభుత్వ పనికి అంతరాయం కలిగించేలా దుర్భాషలాడుతూ బెదిరింపులకు దిగాడని ఆరోపణలు చేశాడు. అయితే ఆ వీడియోలో యూట్యూబర్ ఆ మంత్రిని మీరు రోడ్డు, గుడి బాగు చేస్తానని చెప్పారు. దీని గురించి ఏం చెబుతారు. గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఆలయంలో ప్రమాణం చేశారు. ఎన్నికల్లో గెలిపించమని సాయం కోరారని అడిగారంటూ మంత్రిని నిలదీశాడు. यूपी के संभल में पत्रकार संजय राणा ने मंत्री गुलाब देवी से तीखे सवाल पूछे, जवाब में पहले FIR फिर गिरफ्तारी हो गई. जिस किसी को श्री राहुल गांधी के लोकतंत्र के कमज़ोर होने वाले वक्तव्य पर आपत्ति है - पढ़िए यह खबरpic.twitter.com/jsnkH6zWle — Supriya Shrinate (@SupriyaShrinate) March 13, 2023 దీంతో ఆ మంత్రి ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని వీడియో చివరలో చెబుతున్నట్లు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మేరకు ఈ సంఘటనను లక్ష్యంగా చేసుకుని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. విదేశీ గడ్డపై కాంగ్రస్ నాయకుడు రాహుల్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్నే యాదవ్ ప్రస్తావిస్తూ.. బీజేపీ దీనికి ఏం చెబుతుందని నిలదీశారు. బీజేపీ ప్రభుత్వం హయాంలో ప్రజాస్వామ్యం స్వేచ్ఛ ఇలానే ఉంటుంది అనడానికి ఇదే ఉదహరణ అంటూ సదరు యూట్యూబర్‌ని అరెస్టు చేసిన వీడియోలను సైతం ట్వీట్ చేశారు అఖిలేష్ యాదవ్. కాగా ఆ యూట్యూబర్‌కి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ బెయిల్ ఇవ్వడంతో అతన్ని విడుదల చేసినట్లు పోలీసులు వెల్లడించారు. विदेशी धरती पर भारत में लोकतंत्र की स्थिति पर बयान देने पर बवाल मचाने वाली भाजपा उप्र के संभल में इस पत्रकार की हालत भी देख ले, जिसे विकास कार्यों पर भाजपाई मंत्री से पूछे गए सवाल के कारण हिरासत में ले लिया गया है। ये है भाजपा सरकार में लोकतंत्र व अभिव्यक्ति की आज़ादी की तस्वीर। pic.twitter.com/smhanrvILb — Akhilesh Yadav (@yadavakhilesh) March 14, 2023 (చదవండి: వేలాది మంది రైతులు ముంబై వైపుగా పాదయాత్ర..) -
తొలిసారి విమానం ఎక్కిన గంగవ్వ హడావుడి చూశారా? ట్రెండింగ్‌లో వీడియో
యూట్యూబ్ స్టార్, బిగ్‌బాస్ ఫేం గంగవ్వ గురించి ప్రత్యేకంగా పరియం అక్కర్లేదు. మై విలేజ్ షో అనే యూట్యూబ్ చానల్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న ఆమె బిగ్‌బాస్ ద్వారా మరింత పాపులర్ అయ్యారు. బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్లో పాల్గొన్న ఆమె మోస్ట్ ఎంటర్టైనర్ ఆఫ్ ద హౌస్‌గా కొనియాడారు. తనదైన మాటలు, తెలంగాణ యాసతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బిగ్‌బాస్ అనంతరం యూట్యూబ్ వీడియోలతో అలరిస్తున్న గంగవ్వ తొలిసారి విమానం ఎక్కింది. చదవండి: ఆస్కార్ స్టేజ్‌పై నాటు నాటుకు చరణ్, తారక్ డాన్స్? ఎన్టీఆర్ క్లారిటీ బిగ్‌బాస్ హౌజ్‌లోని సౌకర్యాలు, లైట్లు, కెమెరాలు చూసి అవాక్కవైన గంగవ్వ ఫస్ట్‌టైం ఫ్లైట్ ఎక్కితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కనర్లేదు. విమానంలో ఆమె చేసిన హడావుడి అంతా ఇంత కాదు. శివరాత్రి సందర్భంగా మొదటిసారి విమానం ఎక్కిన గంగవ్వ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ఫ్లైట్ డోరు, కిటికి తెరవమంటూ గంగవ్వ విమానంలోని సిబ్బందికి చుక్కలు చూపించింది. ఆమె చేసిన సందడి చూసి నెటిజన్లంత సర్ప్రైజ్ అవుతున్నారు. దీంతో ఈ వీడియో గంటల్లోనే వేలల్లో లైక్స్, లక్షల్లో వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇప్పటికీ వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ వీడియో 6 మిలియన్ల వ్యూస్ ట్రెండింగ్‌లో నిలిచింది. చదవండి: నేను నోరు విప్పితే.. మీరు ఎవరెవరి కాళ్లు పట్టుకున్నారో చెప్పనా?: వారికి తమ్మారెడ్డి కౌంటర్ View this post on Instagram A post shared by Milkuri Gangavva (@gangavva) -
ఇదో పిచ్చి.. రూ. 3 కోట్ల కారు నాశనం చేశాడు: షాకింగ్ వీడియో!
న్యూఢిల్లీ: కోట్ల రూపాయల ఖరీదైన లగ్జరీ కారును కళ్లముందే ధ్వంసం చేసిన వీడియో ఒకటి నెట్లో హల్చల్ చేస్తోంది. లిట్ ఎనర్జీ డ్రింక్ ప్రమోషన్లో భాగంగా లంబోర్ఘిని ఉరస్‌ను ఒక రష్యన్ యూ ట్యూబర్ ముక్కలు చేసి పారేశాడు. దీంతో వీడియో వైరల్‌గా గారింది. రూ. 3 కోట్లకు పైగా విలువైన లంబోర్ఘిని కారును నాశనం చేయడం నెటిజన్లని షాక్‌కి గురి చేసింది. (మహీంద్రా స్కార్పియో ఎన్ సన్‌రూఫ్ లీక్ ? షాకింగ్ వీడియో వైరల్) వివరాల్లోకి వెళితే మిఖాయిల్ లిట్విన్ అనే పాపులర్ రష్యన్ యూట్యూబర్ లిట్ ఎనర్జీ డ్రింక్ ప్రమోషన్ కోసం తన వైట్ లంబోర్ఘిని ఉరుస్ ఎస్‌యూవీని ఎంచుకున్నాడు. ఇందులో భాగంగానే ఉరుస్ కారును కేవలం కొన్ని సెకన్లలో ధ్వంసం చేసి, ఆ వీడియో షేర్ చేశాడు. ఒక భారీ క్రేన్‌తో లంబోర్ఘిని కారుపై పడేసి, తద్వారా లిట్ డ్రింక్ చిందేలా చేయడం ఇంటర్నెట్ యూజర్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కేవలం ఎనర్జీ డ్రింక్ ప్రకటన కోసం రూ. 3.15 కోట్ల (ఎక్స్-షోరూమ్) ఖరీదైన ఎస్‌యూవీని యూట్యూబర్ ముక్కలు చేయడంపై నెటిజన్లు పలు అనుమానాల్ని వ్యక్తం చేశారు. స్టంట్‌పై స్పందించిన ఒక యూజర్ బీమా కంపెనీ పరిస్థితి ఏంటి ఒకరు వ్యాఖ్యానించారు. పాపులారిటీ కోసం యూట్యూబర్లు ఇదంతా చేస్తున్నారని కొంతమంది మండి పడ్డారు. అనవసరంగా ఇంత పొల్యూషన్ సృష్టించడం నేరమని కొందరు లైక్స్ అండ్ వ్యూస్ కోసం చేస్తున్న ఫక్తు బిజినెస్ ఇంకొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by Jist (@jist.news) కాగా మహీంద్రా స్కార్పియోఎన్ రూఫ్ టాప్ లీక్ అవుతున్న వీడియోను ఒక యూట్యూబర్ షేర్ చేసిన క్లిప్ కూడా ఇంటర్నెట్లో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో యూట్యూబ్ క్రియేటర్లు ఇలాంటి వైరల్ కంటెంట్‌ను తయారు చేయడంలో ఆరితేరిపోయారనే నవిమర్శలు వినిపిస్తున్నాయి. -
మహీంద్రా స్కార్పియో ఎన్ సన్‌రూఫ్ లీక్? షాకింగ్ వీడియో వైరల్
సాక్షి, ముంబై: మహీంద్రా పాపులర్ ఎస్‌యూవీకి సంబంధించిన వీడియో ఒకటి నెట్లో హల్చల్ చూస్తోంది. గత ఏడాది లాంచ్ చేసిన స్కార్పియో ఎన్ సన్‌రూఫ్ కారులో వాటర్ లీక్ అవుతున్న వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియో 1 రోజు క్రితం పోస్ట్ అయిన ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో 4.7 మిలియన్ల వ్యూస్‌ని సంపాదించింది. యూట్యూబర్ అరుణ్ పన్వార్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తన మహీంద్రా స్కార్పియో ఎన్ సన్‌రూఫ్ కారులో నీరు ఎలా లీక్ అయ్యిందో చూపించే వీడియోను షేర్ చేశారు. కొండల్లో ప్రయాణిస్తుండగా ఓ జలపాతం తనకు ఈ అనుభవం ఎదురైందని వీడియోలో చెప్పాడు. తన కారును జలపాతం కింద కడగాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ కారును పార్క్ చేసే ముందు డ్రైవర్ సన్‌రూఫ్‌ను మూసివేసినా కూడా సన్‌రూఫ్, స్పీకర్ల ద్వారా కారులోకి నీరు లీక్ అయిందని, కారు లోపల పాడైపోయిందని పేర్కొన్నాడు. వీడియోలో, రూఫ్-మౌంటెడ్ స్పీకర్లు, క్యాబిన్ ల్యాంప్ ద్వారా క్యాబిన్ లోపల నీరు పారుతూ ఉండగా, సన్‌రూఫ్ మూసి ఉందా లేదా అని రెండు సార్లు నిర్ధారించుకున్నట్టు కనిపిస్తోంది ఈవీడియోలో. (ఆర్ఆర్ఆర్ మేనియా: రామ్ చరణ్‌పై ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్!) అయితే ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. నా జీప్ మెరిడియన్ని చాలాసార్లు ఇలా కడిగాను కానీ ఇలా ఎపుడూ కాలేదని ఒకరు కమెంట్ చేయగా, అలాంటిదేమీ లేదు.. ఉద్దేశపూర్వకంగా అతగాడు సన్‌రూఫ్‌ను కొద్దిగా తెరిచి ఉంచాడని భావిస్తున్నానంటూ మరొకరు కామెంట్ చేయడం గమనార్హం. (బిజినెస్ క్లాస్ ప్యాసింజర్‌కి షాక్, ట్వీట్ వైరల్: ఎయిరిండియా స్పందన) అయితే కంటెంట్ కోసం అతను నిజంగానే అలా చేశాడా? అసలు ఏమైంది? సన్‌రూఫ్ ఎందుకు లీక్ అయ్యింది, సన్‌రూఫ్ లీక్ ప్రూఫ్‌గా ఉండే రబ్బరు సీల్ ఉందా లేదా అనేదానిపై క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన టెక్నికల్ అంశాలపై మహీంద్ర అధికారికంగా స్పందించాల్సి ఉంది. (గుండె ఆగిపోయినంత పనైంది! నాకే ఎందుకిలా? గూగుల్ ఉద్యోగి భావోద్వేగం ) View this post on Instagram A post shared by Arun Panwar (@arunpanwarx) -
ఇద్దరు భార్యలపై చేయి చేసుకున్న యూట్యూబర్, అర్మన్ మాలిక్ ఫైర్
అర్మన్ మాలిక్.. హిందీలోనే కాకుండా ప్రాంతీయ భాషల్లోనూ ఎన్నో పాటలు పాడి జనాల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. తన గాన మాధుర్యానికి ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చిపడ్డాయి. అర్మన్ మాలిక్ పేరిట ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. కానీ అది ఇతడిది కాదు. అర్మన్ అలియాస్ సందీప్ ఈ ఛానల్ నడుపుతూ వీడియోలు చేస్తుంటాడు. తాజాగా అతడు యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో సందీప్ గర్భంతో ఉన్న ఇద్దరు భార్యలు పాయల్, కృతికలపై చేయి చేసుకున్నాడు. చివర్లో మాత్రం ఇదంతా ప్రాంక్ అని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే యూట్యూబర్ అర్మన్ మాలిక్ తన ఇద్దరు భార్యల చెంప పగలగొట్టాడంటూ నెట్టింట వార్తలు ప్రత్యక్షమయ్యాయి. దీనిపై సింగర్ అర్మన్ మాలిక్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. 'అతడిని అర్మన్ మాలిక్ అని పిలవడం ఇక ఆపండి. అతడి అసలు పేరు సందీప్. నా పేరును దుర్వినియోగం చేస్తున్నాడు. పొద్దుపొద్దున్నే ఇలాంటి వార్తలు చదివాల్సి వస్తుంటే అసహ్యంగా అనిపిస్తోంది. ఇవి నాకు ఎంతగానో చిరాకు తెప్పిస్తున్నాయి' అని ట్వీట్ చేశాడు. దీనిపై యూట్యూబర్ స్పందిస్తూ అర్మన్ మాలిక్ పేరుతో ఈ ప్రపంచంలో ఒక్కడే ఉండాలా? ఆ పేరు ఎవరూ పెట్టుకునే అర్హత లేదా? అని ప్రశ్నించాడు. మీరంటే బాలీవుడ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, ఫేమస్ అయ్యారు. కానీ నాకు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఏదో వీడియోలు, బ్లాగ్లు చేసుకుంటూ గుర్తింపు తెచ్చుకుంటాను అని చెప్పుకొచ్చాడు. Stop calling him Armaan Malik in the media. His real name is freakin’ Sandeep!! For gods sake enough with this misuse of my name. Hate waking up and reading articles like this.. and the news makes me even more disgusted https://t.co/8MrDZt5870 — ARMAAN MALIK (@ArmaanMalik22) February 24, 2023 చదవండి: 50 ఏళ్ల వయసులో రెండో పెళ్లి, నటుడి పెళ్లి ఫోటోలు వైరల్ -
కోటి యూట్యూబ్ సబ్స్క్రైబర్లు: 8500 కోట్లతో సొంత కంపెనీ
న్యూఢిల్లీ: చాలా తెలివైన విద్యార్థి. కష్టపడి చదివేవాడు.10, 12వ తరగతిలో టాపర్.. IITలో సీటు కోసం కష్టపడ్డా... దొరక్కపోవడంతో కాన్పూర్‌లోని హార్కోర్ట్ బట్లర్ కాలేజీలో అడ్మిషన్ తో సరిపెట్టుకున్నాడు. అయితేనేం ఇపుడు కోట్లు సంపాదిస్తున్నాడు. ఆయనే UPకి చెందిన అలఖ్ పాండే. ఐఐటీ రాలేదని నిరాశ చెందకుండా ట్యూషన్ టీచర్‌గా కెరియర్ మొదలు పెట్టి ఇప్పుడు విజయవంతమైన ఎంటర్ ప్రెన్యూర్ గా ఎదిగాడు. ఆన్లైన్ లర్నింగ్ ప్లాట్‌ఫాం ద్వారా బిలియనీర్‌గా ఎదిగాడు. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం ఏలతాడు అన్నట్టు తనలాంటి వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అలహాబాద్ కుర్రోడు బిలియనీర్‌గా అలహాబాద్‌కు చెందిన అలఖ్ పాండే ఇంటర్ చదువుతున్నపుడు ఐఐటీ గురించి కలలు కన్నాడు. కానీ దురదృష్టవశాత్తూ అది సాధ్యం కాలేదు. అయినా కుంగిపోలేదు. ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలోనే చదువుకు టాటా చెప్పేసాడు. సొంత కంపెనీ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ట్యూషన్ టీచర్‌గా ప్రయాణాన్ని మొదలుపెట్టి కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగాడు. ట్యూటర్‌గా అతని తొలి సంపాదన రూ. 5వేలు మాత్రమే. మరిపుడు వేల కోట్ల విలువైన "ఫిజిక్స్ వాలా" అనే కంపెనీ వ్యవస్థాపకుడిగా, సీఈవోగా శబాష్ అనిపించుకుంటున్నాడు. యూట్యూబర్ కూడా అయిన అలఖ్ పాండే విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తాడు. అలాగే తన యాప్ ద్వారా దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు రోజుకు కనీసం 1.5 గంటలు శిక్షణ తీసుకుంటున్నారంటే అతని క్రేజ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫిజిక్స్ వాలాలో జేఈఈ-నీట్ శిక్షణను కూడా ప్రారంభించాడు. అంతేకాదు ఈనెల (ఫిబ్రవరి) 28న విశ్వాస్ దివస్ పేరుతో ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఫెస్ట్ లాంచ్ చేయబోతున్నానని ప్రకటించాడు అలఖ్ పాండే. ఫిజిక్స్ వాలా ఆవిర్భావం ఇంజినీరింగ్ వదిలి అలహాబాద్ తిరిగొచ్చి 2016లో ఫిజిక్స్ వాలా ఛానెల్‌ని ప్రారంభించాడు. దీని తరువాత 2020లో ఒక యాప్‌ను కూడా ప్రారంభించాడు. ఇటీవల భారీ పెట్టుబడులతో పాండే కంపెనీ మొత్తం నికర విలువ రూ.8500 కోట్లుగా నిలిచింది. అలఖ్ యూట్యూబ్ ఛానల్ కు 9.75 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. గతేడాది ఆయన కంపెనీ రూ.350 కోట్లు ఆర్జించింది. కంపెనీలో 19వేల మంది ఉద్యోగులు ఉన్నారు. బిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా ఫిజిక్స్‌వాలా దేశంలోని 101వ యునికార్న్‌గా ఉంది. తాజాగా ఆయన రూ.777 కోట్ల పెట్టుబడులను సమీకరించారు. దేశీయ 101వ యూనికార్న్ ఫిజిక్స్ వాలా ఎడ్టెక్ ప్లాట్‌ఫారమ్ ఫిజిక్స్ వాలా (PWగా పాపులర్) వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్, GSV వెంచర్స్ నుండి సిరీస్ A ఫండింగ్ 100 మిలియన్లను సేకరించడం ద్వారా భారతదేశపు 101వ యునికార్న్‌గా అవతరించింది. 2020, 2021లో నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వంటి పోటీ పరీక్షలలో 10వేల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని కంపెనీ గతంలో ప్రకటించింది. భారతదేశంలో కనీసం ఆరుగురిలో ఒకరు వైద్య విద్యార్థులు, 10మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ఫిజిక్స్వాలాకి చెందిన వారుంటారని పేర్కొంది. అలాగే బైజూస్, వేదాంతా వంటి ఇతర అనేక ఎడ్టెక్ ప్లాట్‌ఫారమ్‌ల మాదిరిగా కాకుండా ఇప్పటికే 18 నగరాల్లో 20 కంటే ఎక్కువ కేంద్రాలను క్షేత్ర స్థాయిలో ఏర్పాటు చేశారు పాండే. 300 మంది సామూహిక వివాహాలకు ఫండింగ్ ఫిబ్రవరి 22న జర్నలిస్ట్ శివాని దూబేతో ఏడు అడుగులు వేశాడు అలఖ్. మరో విశేషం ఏమిటంటే తమ పెళ్లి సందర్బంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే సామూహిక వివాహాలకు ఫండింగ్‌కు ముందుకొచ్చాడు. అంతేకాదు పెళ్లి తరువాత కూడా చదువు కొనసాగించాలనుకునే వారికి చదువుకునేందుకు అన్ని రకాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు పాండే. మార్చి ప్రారంభంలో ప్రయాగ్‌రాజ్, తేలియార్గంజ్లోని NRIPT గ్రౌండ్లో 300మందికి సామూహిక వివాహ వేడుకలను నిర్వహించనున్నారు. View this post on Instagram A post shared by Physics Wallah (PW) (@physicswallah) -
యూట్యూబర్‌ను కిడ్నాప్ చేసి డ్రగ్స్ ఇచ్చిన తండ్రి..కోపంతో దారుణంగా
బాగ్ధాద్: ఇరాక్‌కు చెందిన 22 ఏళ్ల యూట్యూబర్ టిబా అల్ అలీ దారుణ హత్యకు గురైంది. కన్నతండ్రే ఆమెను కిరాతకంగా హతమార్చాడు. డ్రగ్స్ ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసి గొంతునులుమి అంతం చేశాడు. అనంతరం స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తన కూతురు ఇంటి నుంచి వెళ్లిపోయిందనే అవమానం భరించలేకే ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఏం జరిగిందంటే..? టిబ 2017లోనే ఇళ్లు వదిలి టర్కీకి వెళ్లిపోయింది. సిరియాకు చెందిన తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే జనవరిలో తన సొంత దేశం ఇరాక్ జట్టు ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు స్వదేశానికి తిరిగివచ్చింది. ఈ సమయంలోనే ఆమెను తండ్రి కిడ్నాప్ చేసి వాళ్ల ఇంటికి తీసుకెళ్లాడు. అయితే టిబా తన తల్లితో మాట్లాడేందుకు ఒప్పుకుందని, స్నేహితురాలి ఇంట్లో ఆమెను కలిసేందుకు అంగీకరించిందని తెలుస్తోంది. కానీ తండ్రి ఆమెను బలవంతంగా కిడ్నాప్ చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్రం వాగ్వాదం చెలరేగింది. అయితే టిబాకు తండ్రి డ్రగ్స్ ఇవ్వడంతో ఆమె కాసేపటికే సృహకోల్పోయింది. అనంతరం ఆమె నిద్రలో ఉండగానే గొంతునులిమి హత్య చేశాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. చదవండి: కార్చిచ్చు బీభత్సం.. వందల ఇళ్లు ధ్వంసం.. 13 మంది మృతి.. -
మధ్యతరగతి కుటుంబం.. చీపురు పట్టి స్టార్ అయ్యింది! ఒక్కో వీడియోతో
గత సంవత్సరం టాప్ 10 కంటెంట్ క్రియేటర్స్‌గా యూ ట్యూబ్ ప్రకటించిన వారిలో 22 ఏళ్ల అపర్ణా టాండలే ఉంది. మన దేశంలో ఇంటింటా తెలిసిన పని మనిషి పాత్రను చీపురు పట్టి హాస్యం చిలికేలా పోషించడమే అపర్ణా సక్సెస్‌కు కారణం. ఆమె చేసే ‘కామ్‌వాలీ బాయి’ వీడియోలకు 37 లక్షల మంది సబ్స్క్రయిబర్లు ఉన్నారు. 3 కోట్ల వ్యూస్ అపర్ణ చేసిన ‘బారిష్ మే భీగ్నా’ (వానలో తడవడం) అనే మూడు నిమిషాల వీడియోకు 3 కోట్ల వ్యూస్ వచ్చాయంటే ఆమె ఫాలోయింగ్ అర్థం చేసుకోవచ్చు. అపర్ణ పరిచయం. పని మనిషి అప్పుడే ఇల్లు తుడిచి మొత్తం శుభ్రం చేసి ఉంటుంది. అంతలో కాలింగ్‌బెల్ మోగుతుంది. ‘బారిష్ మే భీగ్నా’ తలుపు కన్నం నుంచి చూస్తే వానలో పూర్తిగా తడిసి వచ్చిన అమ్మగారూ, అయ్యగారూ. పని మనిషి గతుక్కుమంటుంది. ‘అమ్మో.. ఇప్పుడు వీళ్లు ఇంట్లోకి వస్తే ఇల్లంతా నీళ్లు, బురదా. మళ్లీ పనంతా చేయాలి’ అనుకుంటుంది. అంతే. తలుపుకు ఇంకో బోల్టు పెట్టేస్తుంది. అమ్మగారు కాలింగ్ బెల్ నొక్కితే బోల్ట్ తీస్తున్నట్టుగా నటిస్తూ ‘అమ్మా... బోల్ట్ స్ట్రక్ అయ్యింది’ అని లోపలి నుంచి అరుస్తుంది. బయటి నుంచి అమ్మగారి పిలుపులు... లోపలి నుంచి తలుపు రావడం లేదని పని మనిషి అరుపులు. తడిసి వచ్చిన అమ్మగారిని, అయ్యగారిని ఇంటి బయటే గంట సేపు కూచోబెట్టి ఈ లోపు హాయిగా టీవీ చూస్కుంటూ వాళ్లు పూర్తిగా ఆరారు అని తేల్చుకున్నాక అప్పుడు తలుపు తీస్తుంది పని మనిషి. ఇది అపర్ణా టాండాలె తీసిన మూడు నిమిషాల‘బారిష్ మే భీగ్నా’ షార్ట్ వీడియో. సూపర్‌హిట్ అయ్యింది. మూడు కోట్ల వ్యూస్ వచ్చాయి. పూణె అమ్మాయి పూణెకు చెందిన 22 ఏళ్ల అపర్ణ టాండాలె 2022లో యూట్యూబ్‌లో ఒక టాప్ కంటెంట్ క్రియేటర్‌గా నిలిచింది. ఆమె షార్ట్ వీడియోస్ కోసం చేసే పాత్ర పేరు షీలా దీదీ. సిరీస్ పేరు ‘కామ్‌వాలీ బాయి’. కామ్‌వాలీ అంటే పని మనిషి. ∙∙ పనిమనిషి లేని మధ్యతరగతి ఇల్లు ఉండదు. పని మనిషితో పేచీ పడని ఇల్లాలూ ఉండదు. పని సరిగ్గా చేయడం లేదని అమ్మగారు సణిగితే, పని ఎక్కువైందని పనిమనిషి గొణుగుతుంది. స్మార్ట్ పనిమనిషి పాత్ర బాగా తెలివైన పని మనిషైతే ‘స్మార్ట్ వర్క్’ చేసి పనిని తగ్గించుకోవడమో, తప్పించుకోవడమో చేస్తుంది. అపర్ణా టాండాలె తన సిరీస్‌లో ధరిస్తున్నది ఈ స్మార్ట్ పనిమనిషి పాత్రనే. ఎప్పుడూ ఆకుపచ్చని చీర, మేచింగ్ బ్లౌజ్, కొప్పు వేసిన జుట్టు, మెడలో నల్ల పూసలు, చేతిలో చీపురు... ఇది పనిమనిషి షీలా ఆహార్యం. ఆమె పని చేసేది ఒక యువ జంట ఇంట్లో. చేయాల్సిన పని చేస్తుంటుంది గాని ఒక్కోసారి తేడా వచ్చిందంటే ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటుంది. ఆ ట్రిక్సే ఒకటీ ఒకటిన్నర నిమిషాల వీడియోలుగా మనం చూస్తుంటాము. – ఒక వీడియోలో యజమాని ఒకసారి బోల్డన్ని ఇండోర్ ΄్లాంట్స్ తెస్తుంది. ‘దీనికి స్ప్రే చేస్తే చాలు. దానికి అరగ్లాసు నీళ్లు చాలు. ఈ దానికి రెండు రోజులకు ఒకసారి నీళ్లు పోయాలి’... ఇలా పది కుండీల లెక్క చెబుతుంది అమ్మగారు. పని మనిషి షీలా ఇంత పని చేస్తుందా? ఒక రోజు పెద్ద బకెట్టు నిండా నీళ్లు మొక్కలకు పోయబోతూ అమ్మగారికి కంగారు పుట్టిస్తుంది. మరోరోజు మొక్కల దగ్గర ఒళ్లు గీరుకుంటూ ‘నాకు మొక్కలంటే ఎలర్జీ’ అంటుంది. మరోరోజు అమ్మగారి మీదే తుమ్ముతూ ‘మొక్కలకు నీళ్లు పోస్తే తుమ్ములు’ అంటుంది. దెబ్బకు మొక్కలకు నీళ్లు పోసే పని అయ్యగారు తీసుకుంటాడు. ఇదంతా ఎంతో ఫన్నీగా ఉంటుంది. మామూలుగా కాదు మరో వీడియోలో అమ్మగారు అల్మారాలోని తన బట్టలన్నీ సర్దమంటే ఒక్కదాన్నే చేయాలా అనుకున్న పని మనిషి ‘అమ్మగారూ... పొరుగింట్లో ఏమయ్యిందో తెలుసా?’ అని అమ్మగారిని పిలిచి మాటల్లో పెట్టి ఆమె చేతే మొత్తం బట్టలు మడత పెట్టిస్తుంది. ఇంకో వీడియోలో స్టోర్‌రూమ్ సర్దమంటే ‘బాబోయ్ ఎలుక...’ అని అరిచి యజమానిని పిలిచి ‘అటు పోయింది... ఇటు పోయింది’ అంటూ మొత్తం సామాను అతడే సర్దేలా చేస్తుంది. ఈ వీడియోలు చూసే ప్రేక్షకులు యజమానుల్లో తమని, షీలా పాత్రలో తమ పని మనిషిని చూసుకోవడం వల్ల ఈ సిరీస్ పెద్ద హిట్ అయ్యింది. ∙∙ పూణెకు చెందిన యూ ట్యూబర్ అపర్ణ టాండాలెకు ‘షార్ట్స్ బ్రేక్’ అనే యూట్యూబ్ చానల్ ఉంది. అందులో ‘కామ్ వాలీ బాయి’ సిరీస్ చేస్తుంది. ఈ ఒక్క యూ ట్యూబ్ చానల్ కాకుండా ‘టేక్ ఏ బ్రేక్’, ‘మ్యాడ్ ఫర్ ఫన్’ అనే ఇంకో రెండు మూడు చానల్స్ నడుపుతోంది అపర్ణ. మధ్యతరగతి కుటుంబం మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అపర్ణకు బాల్యం నుంచి నటి కావాలనే కోరిక. స్కూల్, కాలేజీలో స్టేజ్ మీద నాటకాలు వేసేది. 2018 నుంచి యూ ట్యూబ్‌లో షార్ట్ వీడియోలు మొదలెట్టింది. పలుచటి శరీరంతో చురుగ్గా కదులుతూ హుషారైన ముఖ కవళికలతో ఆకట్టుకుంటుంది అపర్ణ. ‘ప్రతి ఇంట్లో ఇంటి పని ఉంటుంది. అలాగే పని మనిషి కూడా కావాల్సిందే. ఆ పాత్రను తీసుకుంటే ఎంతో హాస్యం పండించవచ్చు. బాధగా ఉన్నవారు కూడా నా వీడియోలు చూసి నవ్వాలి’ అంటుంది అపర్ణ. అలా నవ్వుతున్నారు కనుకనే ఆమెకు పాపులారిటీ. సృజనాత్మక ఐడియాలు ఉంటే భారీగా పాపులర్ కావచ్చనేదానికి అపర్ణే ఒక పెద్ద చీపురంత ఉదాహరణ. View this post on Instagram A post shared by Aparna Tandale (@aparna_tandale) View this post on Instagram A post shared by Shorts Break (@shortsbreak) -
కాలనాగుతో ఆటలు.. చావుబతుకుల్లో యూట్యూబర్!
జైపూర్: అతను తన క్రేజీ వీడియోలతో దేశంలోనే అత్యధిక ఆదాయం అర్జిస్తున్న యూట్యూబర్లలో ఒకడు. ఉన్నత చదువులు చదివాడు. ఆ చదువుకు తగ్గట్లు మంచి ప్యాకేజీతో ఉద్యోగం దక్కదే. కానీ, విచిత్రంగా యూట్యూబ్ వీడియోల వైపు ఆసక్తి చూపించాడు. అది అతనికి కోట్లలో ఆదాయం తెచ్చిపెడుతోంది. అయితే.. చివరికి వ్యూస్ కోసం చేసిన యత్నమే ఆ యూట్యూబర్ ప్రాణం మీదకు తెచ్చింది. 24 ఏళ్ల వయసున్న అమిత్ శర్మ.. రాజస్థాన్‌లో టాప్ యూట్యూబర్. అల్వార్ అతని స్వస్థలం. ఐఐటీ రూర్కీలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఉద్యోగ ప్రయత్నం చేయకుండా.. యూట్యూబ్ ఛానెల్ వైపు అడుగులు వేశాడు. క్రేజీ ఎక్స్‌వైజెడ్ అనే పేరుతో గత ఐదేళ్లుగా ఒక యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నాడు అతను. స్నేహితుల సహకారంతో నడిపిస్తున్న ఆ ఛానెల్‌కు 25 మిలియన్ల సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు కూడా. ఈ ఛానెల్ ద్వారా నెలకు అతని సంపాదన రూ. 9 కోట్లు అని, అన్బాక్సింగ్(కొత్త ప్రొడక్టుల డెమో, రివ్యూల) ద్వారా అతని ప్రత్యేక ఛానెల్ ద్వారా నెలకు మరో రూ.2.5 కోట్లు సంపాదిస్తున్నాడంటూ అక్కడి మీడియా ఛానెల్స్ కథనాలు ప్రచురిస్తుంటాయి. అయితే.. సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ మీద వీడియోలు తీసే అమిత్ శర్మ.. తాజాగా కాలనాగుతో ఓ వీడియో తీయాలని యత్నించాడట. ఆ ప్రయత్నంలోనే అది వేలిని కాటేసింది. కాసేపు అతను ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదట. ఆపై విషం శరీరానికి వ్యాపించడంతో అతను ఆస్పత్రి పాలయ్యాడు. బాడీ మొత్తం పాము విషం వ్యాపించడంతో చావు బతుకుల్లో ఉన్నట్లు అతని స్నేహితులు ఓ వీడియోను పోస్ట్ చేశారు. అతను ప్రాణాపాయం నుంచి బయటపడాలని, త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని వ్యూయర్స్‌ను, సబ్‌స్క్రయిబర్స్‌ను కన్నీళ్లతో వాళ్లు కోరారు. అమిత్ శర్మ వీడియోలకు అక్కడ క్రేజ్ ఉంది. అతను బతకాలని, త్వరగా కోలుకుని మళ్లీ వీడియోలు తీయాలని అతని ఫాలోవర్స్ పోస్టులు పెడుతున్నారు. -
యూట్యూబ్‌తో రూ. 10 వేల కోట్లు.. 7.5 లక్షల పైగా ఉద్యోగాలు!
న్యూఢిల్లీ: ఆన్లైన్ వీడియో ప్లాట్‌ఫాం యూట్యూబ్ వ్యవస్థ 2021లో భారత స్థూల దేశీయోత్పత్తికి (జీడీపీ) ప్రత్యక్షంగా, పరోక్షంగా రూ. 10,000 కోట్ల పైగా తోడ్పాటు అందించింది. అలాగే, 7.5 లక్షల పైచిలుకు ఫుల్‌టైమ్ కొలువులకు సమానమైన ఉద్యోగాలను కల్పించింది. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ రూపొందించిన యూట్యూబ్ ప్రభావ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్‌లో 4,500 పైగా ఛానల్స్‌కు 10 లక్షలకు మించి సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. వార్షికంగా రూ. 1 లక్షకు పైగా ఆదాయం ఆర్జిస్తున్న ఛానల్స్ సంఖ్య వార్షిక ప్రాతిపదికన 2021లో 60 శాతం పైగా పెరిగింది. యూట్యూబ్ ప్రభావంపై ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ నిర్వహించిన సర్వేలో 4,021 యూట్యూబ్ యూజర్లు, 5,633 మంది క్రియేటర్లు, 523 వ్యాపార సంస్థలు పాల్గొన్నాయి. నివేదిక ప్రకారం ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఇద్దరు యూజర్లలో ఒకరు తమ కెరియర్‌కు ఉపయోగపడే నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు యూట్యూబ్‌ను ఉపయోగిస్తున్నారు. అలాగే కొత్తగా ఉద్యోగాలను దక్కించుకోవాలనుకునే యూజర్లలో 45 శాతం మంది, వాటికి అవసరమైన నైపుణ్యాలను సాధించుకునేందుకు యూట్యూబ్‌ను ఉపయోగిస్తున్నారు. ‘యూట్యూబ్‌ను సాంప్రదాయ విద్యాభ్యాసానికి అదనంగా ఒక ప్రయోజనకరమైన సాధనంగా విద్యావేత్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పరిగణించే ధోరణి పెరుగుతోంది. యూట్యూబ్‌తో పిల్లలు సరదాగా నేర్చుకుంటున్నారని దాన్ని ఉపయోగించే పేరెంట్స్‌లో 83 శాతం మంది తెలిపారు. విద్యార్థులు నేర్చుకునేందుకు ఇది సహాయకరంగా ఉంటోందని యూట్యూబ్‌ను ఉపయోగించే 76 శాతం మంది అధ్యాపకులు తెలిపారు‘ అని నివేదిక వివరించింది. మహిళల ఆసక్తి: పర్సనల్ ఫైనాన్స్ గురించి తెలుసుకోవడం మొదలుకుని స్ఫూర్తినిచ్చే సలహాలు పొందేందుకు, తమ హాబీలను ఆదాయ వనరుగా మార్చుకునేందుకు, కెరియర్.. వ్యాపారాలను నిర్మించుకోవడం వరకు ఇలా తమ జీవితానికి తోడ్పడే ఎన్నో అంశాలు నేర్చుకునేందుకు మహిళలు యూట్యూబ్‌ని ఎంచుకుంటున్నారు. జీవితకాల అభ్యాసానికి యూట్యూబ్ ఎంతో ఉపయోగకరమైన ప్లాట్‌ఫాం అని 77 శాతం మంది మహిళలు తెలిపారు. ప్రతి రోజూ ఉపయోగపడే నైపుణ్యాలను నేర్చుకునేందుకు ఇది సహాయకరంగా ఉంటోందని 56 శాతం మంది, తమ ఆకాంక్షలు .. ఐడియాలను పంచుకోవడంలో సహాయపడుతోందని 90 శాతం మంది మహిళా క్రియేటర్లు వివరించారు. చదవండి: న్యూ ఇయర్ ముందు.. కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ! -
ఇద్దరు భార్యలకు ప్రెగ్నెన్సీ.. ప్రముఖ యూట్యూబర్‌పై దారుణంగా ట్రోల్స్
ప్రముఖ యూట్యూబర్, కంటెంట్ క్రియేటర్ అర్మాన్ మాలిక్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేశారు. ఇటీవల ఇన్‌స్టాలో ఇద్దరు భార్యలతో దిగిన ఫోటోలను ఆయన షేర్ చేశారు. తన భార్యలిద్దరూ బేబీ బంప్‌తో ఉండగా.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మాలిక్ ట్రోల్స్‌కు గురయ్యారు. తన ఇన్‌స్టాలో మై ఫ్యామిలీ అంటూ క్యాప్షన్ ఇచ్చిన ఆర్మాన్ మాలిక్ ఫోటోలను పంచుకున్నారు. యూట్యూబర్ ఆర్మాన్ మాలిక్ ఇద్దరు భార్యలు కృతిక, పాయల్ ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నారు. ఈ ఫోటోలను మాలిక్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాయల్ కంటే కృతికతో ఉన్న ఫోటోలు ఎక్కువ పోస్ట్ చేశాడని పలువురు మండిపడ్డారు. మీరు కృతికపై మాత్రమే ఎందుకు ఎక్కువ ప్రేమ చూపుతున్నారని మరికొందరు ప్రశ్నించారు. మరో నెటిజన్ స్పందిస్తూ.. ఇలాంటి తెలివి తక్కువ వ్యక్తులకు ప్రజలు ఎలా మద్దతు ఇస్తారని మండిపడ్డారు. కొంతమంది మాత్రం అందరికీ భిన్నంగా వీరికి అభినందనలు తెలిపారు. View this post on Instagram A post shared by Armaan Malik (@armaan__malik9) -
Molestation: ‘ఐ లవ్యూ అంటూ నడుం పట్టుకున్నాడు’
క్రైమ్: దేశ వాణిజ్య నగరంలో విదేశీ యువతికి ఎదురైన చేదు అనుభవ ఘటనను ముంబై పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇద్దరు టీనేజర్లు ఆమెను లైంగికంగా వేధించే యత్నం చేశారు. ఘటన సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడంతో సుమోటోగా కేసు నమోదు చేసుకుని.. నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. దక్షిణ కొరియాకు చెందిన ఓ యూట్యూబర్‌ను ముంబై ఖర్ వీధుల్లో ఇద్దరు టీనేజర్లు వేధించిన సంగతి తెలిసిందే. అరుస్తూ ఆమె వెంట పడుతూ.. లైంగికంగా వేధించే యత్నం చేశారు. అయితే ఆమె మాత్రం చాకచక్యంగా వ్యవహరించి వాళ్ల నుంచి తప్పించుకుంది. ఈ కేసులో నిందితులిద్దరూ మోబీన్ చాంద్(19), మొహమ్మద్ నఖ్వీబ్ అన్సారీ(20)లను అరెస్ట్ చేశారు. ఇక.. ఈ ఘటనలో బాధితురాలిని స్టేషన్‌కు పిలిపించుకోకుండానే.. మహిళా కానిస్టేబుల్ ద్వారా స్టేట్మెంట్ను రికార్డు చేశారు ఖర్ పోలీసులు. ఈ క్రమంలో ఆ భయానక అనుభవాన్ని మీడియాతో పంచుకుంది ఆ కొరియన్ వ్లోగర్. మంగళవారం రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో ఆ ఘటన జరిగింది. ఇద్దరిలో ఒకతను ఐ లవ్యూ అంటూ నన్ను చూసి అరిచాడు. నేను పెద్దగా పట్టించుకోలేదు. ఆపై నా నడుం పట్టుకుని లాగాడు. నన్ను బలవంతంగా చెయ్యి పట్టుకుని వాళ్ల టూవీలర్‌పై కూర్చోబెట్టుకునే యత్నం చేశారు. నేను వద్దని చెప్పా. ఆపై అతను నా మెడ చుట్టూ చేతులేసి.. బుగ్గలపై ముద్దు పెట్టుకోవాలనుకున్నాడు. అది చూసి నేను నిర్ఘాంతపోయా. అతని విదిలించుకునేందుకు యత్నించా. కానీ, అతను నా నడుం పట్టుకునే ఉన్నాడు. ఆ తర్వాత కూడా వాళ్లు నా వెంట పడ్డారు. నా ఫోన్ నెంబర్ అడిగారు. కానీ, ఆ పరిస్థితి నుంచి తప్పించుకునేందుకు తప్పుడు నెంబర్ ఇచ్చా. ఇంతలో నా వ్యూయర్స్‌లో ఒకతను దగ్గర్లోనే ఉండడం.. సమయానికి అతను రావడంతో అతని సాయంతో తప్పించుకోగలిగా అని ఆమె తెలిపింది. @MumbaiPolice A streamer from Korea was harassed by these boys in Khar last night while she was live streaming in front of a 1000+ people. This is disgusting and some action needs to be taken against them. This cannot go unpunished. pic.twitter.com/WuUEzfxTju — Aditya (@Beaver_R6) November 30, 2022 ‘‘వాళ్లతో చనువుగా నేను వ్యవహరించానని, అందుకే వాళ్లు అలా ప్రవర్తించానని కొందరు వ్యూయర్స్ ఆ టైంలో కామెంట్లు చేశారు. కానీ, చుట్టూ కొంతమంది ఉన్నా నన్ను వాళ్ల నుంచి రక్షించే యత్నం చేయలేకపోయారు కదా. భారత్ ఒంటరి మహిళా వ్లోగర్స్కు సురక్షితమైన ప్రాంతమని చాలామంది అంటుంటారు. కానీ, అది నిజం కాదు. ఆ మాటకొస్తే ప్రపంచంలో ఏ ప్రదేశం సురక్షితం కాదు. ఇలాంటి ఘటనలు ఎక్కడైనా జరుగుతాయి. నాకు వేరే దేశంలో కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది. కానీ, ఆ సమయంలో నేను పోలీసులకు ఫోన్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. భారతదేశంలో మాత్రం చాలా వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. నేను 3 వారాలకు పైగా ముంబైలో ఉన్నాను. ఇంకా ఎక్కువ కాలం ఉండాలనుకుంటున్నాను అని ఆమె ముంబై పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేసింది. -
ముంబైలో నడిరోడ్డు పై కొరియన్ యూట్యూబర్ తో అసభ్య ప్రవర్తన
-
మహిళా యూట్యూబర్‌పై ముంబై ఆకతాయిల వేధింపులు.. వీడియో వైరల్..
ముంబై: మహారాష్ట్ర ముంబై నగర వీధుల్లో దక్షిణ కొరియాకు చెందిన యూట్యూబర్‌ను వేధించాడు ఓ ఆకతాయి. ఆమె లైవ్ వీడియో చేస్తున్న సమయంలో వచ్చి ఇబ్బందిపెట్టాడు. లిఫ్ట్ ఇస్తానని చెప్పి బలవంతంగా చెయ్యి పట్టుకుని లాక్కెళ్లాడు. ఆమెకు దగ్గరగా వెళ్లి ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు. ఈ యువకుడి చేష్టలకు ఆ యూట్యూబర్ భయాందోళన చెందింది. వాళ్ల నుంచి దూరంగా వెళ్లిపోయింది. అయినా ఇద్దరు యువకులు బైక్‌పై ఆమె వెనకాలే వెళ్లి మరోసారి వేధించారు. ఇందుకు సంబంధించిన వీడియోనూ ఆదిత్య అనే ఓ నెటిజన్ ట్విట్టర్లో షేర్ చేశాడు. దక్షిణ కొరియా యూట్యూబర్‌ను వేధించిన ఆకతాయిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. ఇలాంటి వారిని వదిలిపెట్టొద్దని పేర్కొన్నాడు. 1000 మంది ముందు ఆమె లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నప్పుడు ఈ ఘటన జరిగిందని చెప్పుకొచ్చాడు. ముంబై పోలీసులను ట్వీట్లో ట్యాగ్ చేశాడు. @MumbaiPolice A streamer from Korea was harassed by these boys in Khar last night while she was live streaming in front of a 1000+ people. This is disgusting and some action needs to be taken against them. This cannot go unpunished. pic.twitter.com/WuUEzfxTju — Aditya (@Beaver_R6) November 30, 2022 ముంబై పోలీసులు దీనిపై స్పందించారు. యూట్యూబర్ తన వివరాలు చెబితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పారు. అనంతరం కొన్ని గంటలకే వీడియోలోని ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వేరే దేశం నుంచి వచ్చిన మహిళను వేధించిన యువకునిపై సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మన అతిథులతో ఇలాగేనా ప్రవర్తించేది? అని కొందరు మండిపడుతున్నారు. ఇలాంటి ఆకతాయిలను కఠినంగా శక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: గుజరాత్ తొలి విడత పోలింగ్.. ఓటేసిన క్రికెటర్ రవీంద్ర జడేజా -
నవతరం నయా ట్రెండ్ ‘వీ’ ట్యూబింగ్.. ఇంతకి ఏంటది?
మన దేశంలో టాప్ యూట్యూబర్స్ ఎవరు? అనే ప్రశ్నకు జవాబు చెప్పడం కష్టం కాకపోవచ్చు. కానీ ‘వీట్యూబర్స్ ఎవరు?’ అనే ప్రశ్నకు సమాధానం రాకపోగా ‘ఇంతకీ వారు ఎవరు?’ అనే ఎదురు ప్రశ్న ఎదురుకావచ్చు. జపాన్‌లో మంచి ఆదరణ ఉన్న వీట్యూబింగ్ (వర్చువల్ యూట్యూబ్ స్టార్స్) మన దేశంలోకి ప్రవేశించింది. పాపులర్ కావడానికి రెడీగా ఉంది... వెండిరంగు జుట్టు, వెరైటీ కళ్లద్దాలతో ఆకట్టుకునే జాక్నిఎక్స్ తన యూట్యూబ్ చానల్లో పాపులర్ వీడియో గేమ్స్ ఆడుతుంటాడు. జాక్నిఎక్స్కు ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. అతడి ఆటను, మాటను అమితంగా ఇష్టపడుతుంటారు. నిజానికి జాక్నిఎక్స్ నిజం కాదు. దక్షిణాదికి చెందిక ఒక స్టూడెంట్ సృష్టించిన డిజిటల్ అవతార్! మన దేశంలో 90కి పైగా వీట్యూబ్ అవతార్స్ ఉన్నాయి. సాధారణంగా వీట్యూబ్ అవతార్స్ జపనీస్ యానిమేషన్ స్టైల్ ఫీచర్స్‌తో కనిపిస్తుంటాయి. ‘వీట్యూబింగ్’ అనేది 2016లో జపాన్‌కు పరిచయమైంది. స్ట్రీమ్గేమ్స్, ఇంటర్నెట్ ట్రెండ్స్, మ్యూజిక్, ఆర్ట్...ఇలా రకరకాల విభాగాల్లో వీట్యూబ్ అవతార్స్ వీక్షకులను వినోదపరుస్తున్నాయి. ‘వీట్యూబర్స్’ అనే పదం జపాన్‌లోనే పుట్టింది. రికు తజుమితో జపాన్‌లో ‘వీట్యూబర్స్’ ట్రెండ్ అగ్రస్థాయికి చేరుకుంది. 26 సంవత్సరాల రికు తజుమి జపాన్‌లోని యంగెస్ట్ బిలియనీర్లలో ఒకరు కావడానికి కారణం ‘ఎనీ కలర్’ అనే స్టార్టప్. యూనివర్శిటీలో చదువుకునే రోజుల్లోనే 21 సంవత్సరాల వయసులో ఇచికర (శూన్యం నుంచి) అనే ఎంటర్టైన్మెంట్ స్టార్టప్‌ను మొదలు పెట్టాడు రికు. ఆ తరువాత దీని పేరును ‘ఎనీ కలర్’గా మార్చాడు. వీట్యూబర్స్ ప్రపంచంలో ‘ఎనీ కలర్’ అగ్రస్థానంలోకి దూసుకుపోవడానికి ఎంతోకాలం పట్టలేదు. ‘ఏ న్యూ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్’ అనే నినాదంతో నిజజీవితానికి చెందిన వందమంది వర్చువల్ క్యారెక్టర్స్‌ను ఇది సృష్టించింది. యూజర్స్, క్రియేటర్స్‌కు మధ్య సరిహద్దులు లేకుండా చేయడమే తన విధానం అని చెబుతోంది. ఎన్నో వీట్యూబర్స్ ఏజెన్సీలకు ‘ఎనీ కలర్’ మాతృసంస్థగా ఉంది. ‘కోవిడ్ సమయంలో మన దేశంలో ఊపందుకున్న వర్చువల్ యూట్యూబర్ ధోరణి మెయిన్‌స్ట్రీమ్ పాపులారిటీకి దగ్గరలో ఉంది’ అంటున్నాడు వీట్యూబర్ టాలెంట్ ఏజెన్సీ ‘ప్రాజెక్ట్ స్టార్‌స్కేప్’ ఫౌండర్ వేణు జీ జోషి. ‘వీట్యూబింగ్ అనేది ప్రైవసీని కాపాడుకోవడానికి, ముఖ్యంగా మహిళలకు బాగా ఉపయోగపడుతుంది. మీ ముఖం బాగాలేదు, మీ గొంతు బాగలేదు... వంటి విషపూరితమైన ట్రోలింగ్ నుంచి బయటపడవచ్చు. ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో ఏమో అనే సంశయం లేకుండా ధైర్యంగా కంటెంట్‌ను క్రియేట్ చేయవచ్చు’ అంటుంది అసలు పేరే ఏమిటో తెలియని దిల్లీకి చెందిన వర్చువల్ అవతార్ సకుర. వర్చువల్ అవతార్స్ పరిచయం ఆసక్తికరంగా ఉంటుంది. ఒక అవతార్ పరిచయం ఇలా ఉంటుంది: ‘రెండు వందల సంవత్సరాల వయసు ఉన్న ఈ బాలికకు అపారమైన మాంత్రిక శక్తులు ఉన్నాయి’ చాలామంది మోడల్స్ జపనీస్ యానిమేషన్ స్టైల్ డిజైన్లకు ప్రాధాన్యత ఇస్తుండగా కొందరు మాత్రం పురాణాలలోని చిత్ర విచిత్ర పాత్రలను ఎంచుకుంటున్నారు. 19 సంవత్సరాల వీట్యూబర్ ‘మియో’ సగం మనిషి, సగం భూతంతో కూడిన అవతార్‌ను సృష్టించుకుంది. కొందరు తమ అవతార్లకు తామే గొంతు ఇస్తుండగా, మరికొందరు మాత్రం గొంతులో వైవిధ్యం కోసం వాయిస్ మాడ్యులేషన్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. ఇండియన్ వీట్యూబ్ కమ్యూనిటీస్ కోసం రెడిట్‌లో ప్రత్యేకమైన పేజీ నిర్వహిస్తున్న హర్ష్ ‘వీట్యూబర్స్’కు వీరాభిమాని. ‘వీట్యూబర్ను చూస్తే స్నేహితుడిని చూసినట్లుగానే ఉంటుంది. వారి షోలో భాగమైతే రియాలిటీ షోలో భాగమైనట్లు అనిపిస్తుంది’ అంటున్నాడు హర్ష్. అభిమానం, విశ్లేషణ సంగతి ఎలా ఉన్నా అప్‌కమింగ్ వీట్యూబర్స్ కోసం ‘వర్చువలిజం’లాంటి కంపెనీలు వచ్చాయి. వీట్యూబర్గా మారాలని, తమను తాము నిరూపించుకోవాలనే ఆసక్తి యూత్‌లో పెరిగింది. ఇదీ చదవండి: చైతన్యపథం: గేమ్‌ఛేంజర్.. ‘ఇప్పుడే పెళ్లి వద్దు, అబ్బాయి గురించి తెలుసుకోవాలి’ -
ఇదేం తిక్కరా నాయనా.. లక్ష టపాసులతో కారును డెకరేట్ చేసి మంటపెట్టి..
Viral Video.. దీపావళి అనగానే అందరి టపాసులే గుర్తుకువస్తాయి. చిన్న నుండి పెద్దల వరకు ఎంతో ఆనందంగా టపాసులు కాలుస్తూ ఎంజాయ్ చేస్తారు. అయితే, టపాసులు కాల్చే విషయంలో ఎవరి స్టైల్ వారికే ఉంటుంది. దీపావళి సందర్భంగా ఓ స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మీరు కూడా ఓ లుక్కెయండి. కాగా, దీపావళి సందర్భంగా ఓ యూట్యూబర్ కొత్తగా ఆలోచించాడు. అందరిలా మనం కూడా బాణాసంచా కాలిస్తే కిక్కు ఏముందిలే అనుకున్నాడు ఈ క్రమంలో డిఫరెంట్‌గా థింక్ చేశాడు. రాజస్తాన్‌లోని అల్వార్‌కు చెందిన యూట్యూబర్ అమిత్ శర్మ.. కొత్తగా ఏం చేద్దామా అని ఆలోచించి.. ఓ కారును టార్గెట్ చేశాడు. దీపావళి సందర్భంగా ఆ కారును ఏకంగా లక్ష టపాసులతో అలంకరించాడు. కారు చుట్టూ లక్ష టపాసులకు వరసగా పేర్చాడు. కారు ముందున్న గ్లాస్‌పై మాత్రం టపాసులు పెట్టలేదు. అనంతరం, 1.. 2.. 3.. అంటూ బాంబులను పేల్చాడు. #Watch: Ahead of Diwali, this Youtuber sets car on fire by covering it with firecrackers, video goes viral #ViralVideo #Diwali Video Courtesy: Crazy XYZ pic.twitter.com/oUixu6f5sR — NewsMobile (@NewsMobileIndia) October 23, 2022 ఈ క్రమంలో కొద్దిసేపు ఆ ప్రాంతమంతా బాంబుల శబ్ధంతో మారుమోగిపోయింది. ఆ తర్వాత మళ్లీ కారు దగ్గరుకు వెళ్లాడు. బాంబులు పేలడంతో కారు కలర్ మొత్తం మారిపోయింది. కారు లోపల పొగ నిండిపోయి ఉంది. కారు అద్దంపై బాంబులు లేకపోయినప్పటికీ పేలిన టపాసుల ధాటికి గ్లాస్ మెత్తబడిపోయి పగిలిపోయింది. కానీ, ఇన్ని బాంబులు పేలినా కారు ఇంజన్ మాత్రం పనిచేయడం విశేషం. కొద్దిసేపటి తర్వాత యూట్యూబర్ మళ్లీ కారును స్టార్ట్ చేసి డ్రైవింగ్ చేస్తూ తన దోస్తులతో ఎంజాయ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
మోసం చేస్తూ ఏడాదికి రూ.312 కోట్లు సంపాదన.. స్వయంగా అంగీకరించిన యూట్యూబర్!
యూట్యూబ్.. ఈ మధ్య కాలంలో విపరీతంగా వినపడుతున్న పేరు. ప్రత్యేకంగా చెప్పాలంటే వినోదంతో పాటు సామాన్యులను కూడా సెలబ్రిటీలుగా మారుస్తోంది ఈ వీడియో ప్లాట్‌ఫాం. గత కొన్నేళ్లుగా స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరుగుతుండటం, ఇంటర్నెట్ తక్కువ ధరకు అందుబాటులోకి రావడంతో వీటి యూజర్లు విపరీతంగా పెరిగిపోయిన సంగతి తెలిసందే. కొందరు దీని ఎంటర్టైన్మెంట్ సాధనంగా చూస్తుంటే మరికొందరు తమ ఉపాధికి యూట్యూబ్‌ని మార్గంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వీడియోలు అప్లోడ్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. అయితే ఓ యూట్యూబర్ అందరూ షాక్ అయ్యేలా ఏడాదికి రూ.312 కోట్లు సంపాదిస్తూన్నాడు. దీంతోపాటు మరికొన్ని సంచలన విషయాలను అతను బయటపెట్టాడు. ఇదంతా మోసం చేసి సంపాదించాను! వివరాల్లోకి వెళితే.. మార్క్ ఫిష్‌బాచ్ అనే ఒక యూట్యూబర్ ఒక సంవత్సరంలో యూట్యూబ్ ద్వారా 38 మిలియన్ డాలర్లు (రూ. 312 కోట్లు) సంపాదిస్తున్నాడు. ఈ సంపాదన చూసి అతనే ఆశ్చర్యపోతున్నాడట. అయితే ఎందుకో గానీ ప్రజలను మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నట్లు అతనే స్వయంగా అంగీకరించాడు. యూట్యూబ్ ప్రారంభించిన మొదట్లో అనిపించకపోయినా ఇంత పెద్ద మొత్తంలో సంపద రావడంతో మోసం చేస్తున్న భావన కలుగుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇటీవల ఓ వ్యక్తి మార్క్ సంపాదన గురించి అడిగాడు. అందుకు అతను బదులిస్తూ.. ‘యూట్యూబ్ ద్వారా నాకు ఇంత డబ్బు వస్తోందంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నేనే నమ్మలేకపోతున్నాను. అయితే ఒక్కోసారి ఈ దారిలో సంపాదించడం నాకు అన్యాయంగా అనిపిస్తుంది. ఈ అంశంపై మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉంటాను, ఎందుకంటే ఈ స్థాయిలో సక్సెస్, సంపాదన రావడం వెనుక సమాజాన్ని మోసగిస్తున్నట్లు అప్పుడప్పుడు నాకు అనిపిస్తుందని’ తెలిపాడు. భవిష్యత్తులో తన సంపాదనతో ప్రజలకు సహాయం చేయాలని, వారి స్నేహితులు, బంధువుల జీవితాలను మెరుగుపరచాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఇటీవలే యూట్యూబర్ MrBeast, (అసలు పేరు జిమ్మీ డోనాల్డ్సన్), అతని యూట్యూబ్ ఛానెల్ కోసం $1 బిలియన్ల డీల్‌ను ఆఫర్ చేసిన సంగతి తెలసిందే. చదవండి: స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! -
Skylord: కాసేపట్లో గమ్యం.. అంతలోనే ఘోరం
ఇండోర్: కరోనా టైం నుంచి యూట్యూబర్లకు క్రేజ్ పెరుగుతూ పోతోంది. వీళ్లలో జెన్యూన్‌గా జనం మెచ్చుకుంటున్నవాళ్లు చాలా అరుదు. వివాదాలకు, విమర్శలకు దూరంగా పేరు సంపాదించుకుంటున్న యూట్యూబర్లు.. కొంత మందే. అలాంటి వాళ్లలో ఒకడైన ‘స్కైలార్డ్ అభియుదయ్’ మిశ్రా ఇక లేడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. మృత్యువుతో పోరాడి ఓడియాడు ఈ యువ యూట్యూబర్. ఇండోర్(మధ్యప్రదేశ్)కు చెందిన పాపులర్ గేమింగ్ యూట్యూబర్ అభియుదయ్ మిశ్రా. గరేనా ఫ్రీ ఫైర్, పబ్జీ తరహా మల్టీ షూటర్ మొబైల్ గేమ్స్‌పై వీడియోలు అప్లోడ్ చేస్తుంటాడు. యూట్యూబ్‌లో 1.64 మిలియన్ల సబ్స్క్రయిబర్లు ఉన్నారు అతనికి. ఇన్‌స్టాగ్రామ్‌లో 425కే ఫాలోవర్స్ ఉన్నారు. గోల లేకుండా.. యూట్యూబర్లను ఆకట్టుకునేలా వీడియోలు చేయడం ఇతని ప్రత్యేకత. అయితే.. రెండు వారాల కిందట ఇన్‌స్టాగ్రామ్‌లో(iamskylord69) మిశ్రా పెట్టిన సెల్ఫీనే చివరిది. అతని మరణ వార్త విన్న అభిమానులు చివరి సెల్ఫీకి లైకులు, కామెంట్ల రూపంలో నివాళులర్పిస్తున్నారు. అభియుదయ్ మిశ్రాకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గుర్తించి.. అతన్ని పర్యాటక ప్రచారం కోసం ఉపయోగించుకోవాలని మధ్యప్రదేశ్ సర్కార్ భావించింది. ఇందులో భాగంగా.. సెప్టెంబర్ 21వ తేదీన ఖజురహో నుంచి టూరిజం బోర్డు నిర్వహించిన లాంగ్ బైక్ ర్యాలీలో అభియుదయ్ కూడా పాల్గొన్నాడు. సెప్టెంబర్ 27వ తేదీన వరల్డ్ టూరిజం డే సందర్భంగా ఈ యాత్ర ముగియాల్సి ఉంది. అయితే గమ్యస్థానానికి మరో రెండు కిలోమీటర్లు దూరం ఉండగా.. షోహగ్‌పూర్ వద్ద అభియుదయ్ బైక్‌ను ఓ ట్రక్కు రాంగ్రూట్లో వచ్చి ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ కన్నుమూశాడు మిశ్రా. View this post on Instagram A post shared by SkyLord (@iamskylord69) -
గంగూబాయిలా మారిన నిహారిక కొణిదెల.. ఫోటోలు వైరల్
మెగాబ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్‌గా కెరీర్‌గా మొదలుపెట్టిన నిహారిక `ఒక మనసు` చిత్రంతో హీరోయిన్గా అదృష్టాన్ని పరీక్షించుకుంది. పెళ్లి తర్వాత నిర్మాతగా మారిన నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. తాజాగా ఆలియా భట్ నటించిన గంగూబాయ్ లుక్‌లో కనిపించి సర్ప్రైజ్ ఇచ్చింది. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో ఆలియా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా యూట్యూబర్ నిఖిల్ విజయేంద్రసింహా బర్త్‌డే పార్టీకి వచ్చిన నిహారిక గంగూబాయిలా అచ్చం దించేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను నిహారిక తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా అల్లు అర్జున్ భార్య స్నేహా, శ్రీజ సహా పలువురు కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Nihaa Konidela (@niharikakonidela) -
న్యాయస్థానంపై తీవ్రవ్యాఖ్యలు.. యూట్యూబర్ శంకర్‌కు 6 నెలల జైలు
సాక్షి, చెన్నై: యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు ఎస్. శంకర్‌కు ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ ధర్మాసనం గురువారం తీర్పు ఇచ్చింది. రెండు నెలల క్రితం తన ఛానల్లో న్యాయ మూర్తులు, న్యాయవర్గాలపై తీవ్ర ఆరోపణలు చేస్తూ శంకర్ ఓ వీడియో విడుదల చేశారు. న్యాయశాఖ అవినీతి మయమైందని అందులో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ కథనాన్ని మధురై ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. సుమోటోగా కేసు నమోదు చేసి విచారించి, నిందితుడికి 6 నెలల జైలు శిక్ష విధించింది. చదవండి: (మాజీ సీఎం కాన్వాయ్‌ని అడ్డుకున్న ఏనుగు... పరుగులు తీసిన మంత్రి) -
గేమింగ్‌లో గెలుపు జెండా.. ‘పాయల్ ధారే’ విజయపథం
‘ఉమన్ గేమర్! వినడానికి కొత్తగా ఉంది’ అని ఒకరు ఎగతాళిగా నవ్వారు. ‘ఆడడం బాగానే ఉంటుందిగానీ, కెరీర్‌కు బాగుండదు’ అని గంభీరస్వరంతో నిరాశ పరిచారు మరొకరు. అంతా అయోమయంగా ఉంది. అలా అని ఆగిపోలేదు. ఓనమాలు నేర్చుకుంటూనే, కొత్త విషయాలపై పట్టు సంపాదిస్తూనే మేల్–డామినేటెడ్ స్పేస్ అనుకునే గేమింగ్‌లో బిగ్గెస్ట్ యూట్యూబ్ ఉమన్ గేమర్(ఇండియా)గా గెలుపు జెండా ఎగరేసింది పాయల్ ధారే... కరోనా మహమ్మారి పదునుగా కోరలు చాస్తున్న సమయంలో, లాక్డౌన్ రోజుల్లో మధ్యప్రదేశ్‌లోని చింద్వారాకు చెందిన పాయల్ ధారే గేమింగ్–ఫోకస్డ్ ఛానల్‌కు శ్రీకారం చుట్టింది. నిజం చెప్పాలంటే యూట్యూబ్ వీడియో ప్లాట్‌ఫామ్‌పై లైవ్‌స్ట్రీమింగ్ కంటెంట్ గురించి ఆమెకు అంతగా అవగాహన లేదు. కాలేజీలో స్నేహితులతో కలిసి ‘పబ్జీ’ గేమ్ ఇష్టంగా ఆడేది. ‘పబ్జీ’ని నిషేధిస్తారనిగానీ, గేమింగ్‌ను తాను కెరీర్‌గా ఎంచుకుంటాననిగానీ అనుకోలేదు పాయల్. గేమింగ్‌పై ఇష్టం పెరుగుతున్న క్రమంలో తన మనసులో మాటను ఇంట్లో చెప్పింది. ‘గేమింగ్‌నే కెరీర్‌గా ఎంచుకుంటాను’ తల్దిదండ్రులు ససేమిరా అన్నారు. ‘చదువుపై దృష్టి పెట్టు’ అని మందలించారు. వారిని ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎట్టకేలకు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. అలా తొలి విజయం సాధించింది పాయల్. తాము ఉండే చింద్వారా పట్టణంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ అంతంత మాత్రమే. మొదట్లో ఇన్‌స్టాగ్రామ్‌లో గేమింగ్ సెషన్స్ క్లిప్స్‌ను పోస్ట్ చేసేది. 100కె ఫాలోవర్స్‌తో తన మీద తనకు నమ్మకం వచ్చింది. ఈ సమయంలోనే యూట్యూబ్‌లో ప్రయత్నించమని స్నేహితులు, ఫాలోవర్స్ నుంచి ఒక సూచన వచ్చింది. ‘ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం సులభం కాబట్టి మొదట దాన్నే ఎంచుకున్నాను. మీ గేమింగ్ స్కిల్స్‌కు యూట్యూట్ అనేది సరిౖయెన వేదిక అనే సలహాతో పాయల్ గేమింగ్ పేరుతో యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాను’ అంటుంది పాయల్. ఛానల్ మొదలైన తరువాత రకరకాల విషయాలు స్వయంగా నేర్చుకోవడం మొదలుపెట్టింది. ప్రేక్షకుల నుంచి సలహాలు, సూచనలు తీసుకునేది. లైవ్‌స్ట్రీమింగ్ గురించి ఎన్నో రోజులు రిసెర్చ్ చేసింది. ఎలాంటి కంటెంట్‌ను ప్రజలు ఇష్టపడుతున్నారు? లైవ్‌స్ట్రీమింగ్ పనితీరు ఎలా ఉంటుంది? ఇప్పుడున్న గేమింగ్ ఛానల్స్‌కు భిన్నంగా ఎలా ప్రయత్నించవచ్చు....ఇలా రకకరాల విషయాలపై లోతైన పరిశోధన చేసింది. పాయల్ కాస్త సిగ్గరి. నలుగురి ముందు మాట్లాడాలంటే భయం. కెమెరా ఫేస్ చేయాలంటే కష్టం. ‘ఒకటి సాధించాలని బలంగా అనుకొని బరిలోకి దిగితే, వారిలోని రెండు లోపాలు మాయమవుతాయి’ అంటారు. పాయల్ విషయంలోనూ అదే జరిగింది. బరిలోకి దిగిన తరువాత కెమెరాను హాయిగా ఫేస్ చేయడం నేర్చుకుంది. బెటర్ ఇంటర్నెట్ కోసం సొంత పట్టణం వదిలి, అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి మారాలనుకున్నప్పుడు తల్లిదండ్రులు వద్దని గట్టిగా చెప్పారు. వారిని ఒప్పించడానికి చాలా సమయమే పట్టింది. అయితే ఇక్కడికి మారిన తరువాత సబ్స్కైబర్ల సంఖ్య బాగా పెరిగింది. మొదట్లో తనకు పేరున్న గేమర్స్లాగా పర్సనల్ కంప్యూటర్ సెటప్ లేదు. లైవ్‌స్ట్రీమ్, అప్‌లోడ్‌కు తన దగ్గర ఉన్న ఫోన్ తప్ప మరో మార్గం లేదు. ఇప్పుడు మాత్రం తన దగ్గర డ్యూయల్ మానిటర్స్‌తో కూడిన మంచి పీసీ సెటప్ ఉంది. ‘పాయల్ గేమింగ్’ ఛానల్ 2.5 మిలియన్ సబ్స్రైబర్లతో దూసుకుపోతుంది. ఈ విజయాన్ని పాయల్ ఊహించలేదు. అయితే ఇది అంత సులువుగా దక్కిన విజయం కాదు. ‘సబ్స్క్రైబర్లు కొద్దిమంది మాత్రమే ఉన్నప్పుడు పెద్దగా ఎవరి దృష్టి ఉండదు. అయితే అదే ఛానల్ విజయవంతంగా దూసుకుపోతున్నప్పుడు అందరి దృష్టి దానిపైనే ఉంటుంది. ప్రోత్సహించే వారి కంటే రాళ్లు రువ్వే వాళ్లే ఎక్కువగా ఉంటారు. నా లైవ్స్ట్రీమ్స్పై కొందరు హేట్ కామెంట్స్ చేశారు. కొందరు బాడీ షేమింగ్ చేశారు. మొదట్లో బాధపడేదాన్ని. వారు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారనే విషయం అర్థమైన తరువాత వాటిని తేలికగా తీసుకున్నాను’ అంటుంది పాయల్. విజయం కోసం పోరాటం ఎంత ముఖ్యమో, ఆ విజయాన్ని నిలుపు కోవడం కోసం గట్టిగా నిలబడడం కూడా అంతే ముఖ్యం. పాయల్ ధారే ప్రస్తుతం అదే ప్రయత్నంలో ఉంది. ఇదీ చదవండి: విలేజ్ నుంచి విదేశాలకు: పూజా, ఆశా, సుర్భి ఏం చేస్తున్నారంటే! -
‘రాత్రి మా ఆంటీ చనిపోయింది’, ఫోన్ పక్కనే పెట్టుకుని పడుకుంటున్నారా?
రాత్రి పూట స్మార్ట్ ఫోన్ వాడే అలవాటు ఉందా? నిద్రపోయే ముందు మొబైల్‌ను పక్కనే పెట్టుకొని పడుకుంటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఇటీవల కాలంలో చైనా స్మార్ట్ ఫోన్లు పేలుతున్న వరుస సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా చైనాకు చెందిన ఓ స్మార్ట్ ఫోన్ పేలింది. ఈ ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం మొబైల్ పేలిన ఘటన నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీకి చెందిన ఓ మహిళ రెడ్మీ 6ఏ ఫోన్‌ను వినియోగిస్తుంది. అయితే ఈ క్రమంలో ఆర్మీలో విధులు నిర్వహించే ఆమె కుమారుడితో మాట్లాడి..ఆ ఫోన్‌ను పక్కనే పెట్టుకొని పడుకుంది. ఆ మరుసటి రోజు ఆమె అల్లుడు వచ్చి చూసే సరికి బాధితురాలు రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయి విగతజీవిగా కనిపించింది. దీంతో తన అత్త మరణంపై ఆమె అల్లుడు మంజీత్ స్పందించాడు. Hi @RedmiIndia @manukumarjain@s_anuj Yesterday in Night my Aunty found dead 😭, she was using Redmi 6A, she was sleeping & she kept the phone near her face on pillow side & after sometime her phone blast. It's a bad time for us. It's a responsibility of a brand to support🙏 pic.twitter.com/9EAvw3hJdO — MD Talk YT (Manjeet) (@Mdtalk16) September 9, 2022 ‘నిన్న రాత్రి మా ఆంటీ చనిపోయింది. ఆమె రెడ్మీ 6ఏ వాడుతోంది. రాత్రి పడుకునే సమయంలో దిండు పక్కనే దాన్ని పెట్టుకొని పడుకుంది. మధ్య రాత్రిలో అది పేలి మా అత్త చనిపోయింది. ఇది మాకు చాలా విషాదమైన సమయం. మాకు సాయం చేయాల్సిన బాధ్యత సదరు స్మార్ట్ ఫోన్ సంస్థపై ఉంటుంది’ అని అతను ట్వీట్ చేశాడు. అంతేకాదు పేలిన ఫోటోలు, రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయిన తన అత్త ఫోటోల్ని షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ కావడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని రెడ్మీ కంపెనీ వెల్లడించింది. -
వైరల్ వీడియో.. 5 నిమిషాల్లో 3 కేజీల సమోసా తినేశాడు..
న్యూఢిల్లీ: ఆహార పోటీల గురించి చాలా సందర్భాల్లో వినే ఉంటారు. ఆహార పదార్థాలను చెప్పిన సమయంలోపు పూర్తి చేస్తే నగదు బహుమతులు సైతం ఇస్తుంటారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి ఛాలెంజ్‌లు నిర్వహిస్తూ బహుమతులు ఇస్తున్నారు. అలాంటి.. సంఘటనే తాజాగా వైరల్‌గా మారింది. రాజ్నీశ్ జ్ఞాని అనే వ్యక్తి ‘ఆర్ యూ హంగ్రీ’ అనే పేరుతో ఫేస్బుక్ పేజీ, యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. ఆహార పోటీలకు వెళ్లటం.. ఇచ్చిన ఛాలేంజ్‌ను పూర్తి చేసి నగదు గెలుచుకోవటమే పనిగా పెట్టుకున్నాడు. గత నెలలో 30 నిమిషాల్లోనే 21 ప్లేట్ల ‘చోలే కుల్తే’ తిని వైరల్‌గా మారాడు. ఆ ఛాలేంజ్ పూర్తి చేయటం ద్వారా బులెట్ బైక్ గెలుచుకున్నాడు. అయితే, ఆ బైక్‌ను తిరిగి ఇచ్చేసి ఛాలెంజ్‌ను కొనసాగించాలని సూచించాడు. ఆ వీడియోను ఫేస్బుక్లో 12 మిలియన్ల మంది చూశారు. ఇప్పుడు మరోమారు ఈ బ్లాగర్ వీడియో వైరల్‌గా మారింది. స్ట్రీట్ ఫుడ్ ఛాలేంజ్‌లో పాల్గొని కేవలం 5 నిమిషాల్లోనే 3 కిలోల సమోసా లాగించేశాడు. ఢిల్లీలోని ఓ హోటల్లో జరిగిన ఈ సంఘటన వీడియో యూట్యూబ్‌లో షేర్ చేయగా 1 మిలియన్‌కుపైగా వ్యూస్ వచ్చాయి. వీడియోలో.. ఛాలెంజ్‌ను బ్లాగర్‌తో పాటు రెస్టారెంట్ ఓనర్ వివరించారు. ఆ తర్వాత బాహుబలి సమోసాను తింటున్న వీడియోను ప్లే చేశారు. అయితే, ఇలాంటి ఛాలెంజ్‌లు స్వీకరించేందుకు ముందు 1-2 రెండు రోజులు ఏమీ తినకుండా ఉంటాడు. కొంచెం చట్నీ, నీళ్లతో స్నేహితుల ప్రోత్సాహంతో ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేశాడు బ్లాగర్. అందుకు గానూ రెస్టారెంట్ ఓనర్ వద్ద రూ.11వేల నగదు బహుమతి అందుకున్నాడు. ఇదీ చదవండి: Bahubali Samosa Challenge: తిన్నారంటే రూ. 51,000 మీవే.. కానీ ఒక్క షరతు! -
కాళ్లతో నడిచే పామును చూశారా!
ఎంతగా నేర్పిస్తే మాత్రం పాములు ఎక్కడైనా నడుస్తాయా ఏంటి అనుకుంటున్నారా? ఊరకే ఎందుకు నడుస్తాయి? వాటికి నడిచే సాధనాన్ని సమకూరుస్తే భేషుగ్గా నడుస్తాయి. పాములకు నడిచే సాధనమా అని ఆశ్చర్యపోతున్నారా? ఔను! మామూలుగా పాకే పాములకు నడిచే సాధనాన్ని తయారు చేశాడు అలెన్ పాన్ అనే ఔత్సాహిక అమెరికన్ యూట్యూబర్. ఒక పొడవాటి గొట్టం, దానికి రెండువైపులా రెండేసి ప్లాస్టిక్ కాళ్లను అమర్చి, రోబోటిక్ పరిజ్ఞానంతో దీనిని తయారు చేశాడు. ఈ ఫొటో చూశారు కదా, రోబో వాహనంలో ఇమిడిపోయిన పాము ఎంచక్కా ఎలా నడుస్తోందో! నిజానికి 15 కోట్ల ఏళ్ల కిందట పాములకు కూడా కాళ్లు ఉండేవి. పరిణామ క్రమంలో అవి కాళ్లను కోల్పోయాయి. ఇన్నాళ్లకు వాటికి మళ్లీ కృత్రిమంగానైనా, కాళ్లు వచ్చాయి. భలేగా ఉంది కదూ! -
ఆ యూట్యూబర్ ఆచూకీ చెబితే రూ.25,000 రివార్డ్!
డెహ్రాడూన్: విమానంలో సిగరెట్ తాగుతూ, రోడ్డుపై మద్యం సేవిస్తూ ఇటీవల వైరల్‌గా మారిన ప్రముఖ యూట్యూబర్ బాబీ కటారియా అరెస్ట్‌కు పోలీసులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. డెహ్రాడూన్‌లో రోడ్డు మధ్యలో మద్యం సేవిస్తూ ట్రాఫిక్ జామ్‌కు కారణమైన కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో భాగంగా బాబీ కటారియాను అరెస్ట్ చేసేందుకు గాలిస్తున్నారు. ఈ క్రమంలో యూట్యూబర్ ఆచూకీ చెప్పిన వారికి రూ.25,000 రివార్డ్ అందిస్తామని ప్రకటించారు. ‘నిందితుడిపై నాన్ బెయిలెబుల్ వారెంట్ జారీ అయ్యింది. కటారియాను అరెస్ట్ చేసేందుకు హరియాణాలోని గురుగ్రామ్‌లో అతడి నివాసంలో సోదాలు నిర్వహించారు ఉత్తరాఖండ్ పోలీసులు. కానీ, అతడు పారిపోయాడు. దాంతో అతడిని పట్టుకునేందుకు రూ.25,000 రివార్డ్ ప్రకటించటం జరిగింది.’అని తెలిపారు డెహ్రాడూన్ ఎస్ఎస్పీ దిలీప్ సింగ్ కున్వార్. ముస్సోరీ కిమాడి మార్గ్‌లో రోడ్డ మధ్యలో టెబుల్ వేసుకుని మద్యం సేవిస్తూ ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగించాడని తెలిపారు. అలాగే మద్యం మత్తులో బైక్ ప్రమాదకరంగా నడిపాడన్నారు. దీంతో బాబీ కటారియాపై 342,336,290,510, 67 ఐటీ యాక్ట్‌ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు దిలీప్ సింగ్. ఇదీ చదవండి: స్పైస్‌జెట్ విమానంలో సిగరెట్ తాగుతూ సెల్ఫీ వీడియో.. కేసు నమోదు -
యాక్టర్‌గా మారిన టీచర్.. ట్రెండ్ సెట్టర్‌గా మారుతున్న యూట్యూబర్ అనిల్
సాక్షి, కరీంనగర్(మల్యాల): అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే విజయం కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదంటున్నాడు.. యూట్యూబ్ స్టార్ అనిల్ జీల. టీచర్ కావాల్సిన వ్యక్తి యాక్టర్‌గా సక్సెస్ అయ్యాడు. మారుమూల పల్లెనుంచి వచ్చిన వ్యక్తి తనప్రతిభతో దేశంలోనే నంబర్‌వన్ వెబ్‌సిరీస్ తీస్తున్నాడు. అంకితభావం, పట్టుదల, స్వయంకృషి, నేర్చుకోవాలనే తపన ఉంటే ఏదైనా సాధించవచ్చంటూ యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. జన్మనిచ్చింది దర్గాపల్లి అయితే యూట్యూబ్ వైపు అడుగులు నేర్పింది మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామం. నటుడు, ఎడిటర్, సినీ ఫొటోగ్రాఫర్‌గా రాణిస్తున్న ట్రెండ్ సెట్టర్ అనిల్‌పై సండే స్పెషల్.. వ్యవసాయ కుటుంబం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గాపల్లి గ్రామానికి చెందిన జీల మల్లేశం–నిర్మల పెద్ద కుమారుడు అనిల్. వీరిది వ్యవసాయాధారిత కుటుంబం. ఆది నుంచి అన్నింటిలో ముందుండాలనే సంకల్పం, క్రమశిక్షణతో అందరి మన్ననలు పొందాడు అనిల్. స్వయం కృషితో తనదైన లోకాన్ని సృష్టించుకున్నాడు. సెల్‌ఫోన్ వాడటం తెలిసిన యువతకు అనిల్ తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ప్రతీ చోట తనదైన ముద్ర అనిల్ జీల జీవితంలో ప్రతి చోట తనదైన ముద్ర వేసుకున్నాడు. ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు హోటల్లో పనిచేస్తూ చదువు కొనసాగించాడు. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు టీ అమ్మేవాడు. సాయంత్రం వచ్చిన తర్వాత రాత్రి 8గంటల వరకు హోటల్లో పనిచేస్తూ చదువుకుని పాఠశాలలో టాపర్‌గా నిలిచాడు. ఇంటర్లో సైతం టాపర్‌గా నిలిచి సత్తా చాటాడు. అనంతరం బుక్స్టాల్లో సేల్స్ బాయ్‌గా పనిచేసి తన ఆలోచనలకు పదును పెడుతూ సామాన్యులకు పుస్తకాలను చేరువ చేశాడు. చదవండి: నో కాంట్రవర్సీ కామెంట్స్.. ఆద్యంతం నవ్వులు పండించిన మునావర్ ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభం అనిల్ జీల కరీంనగర్‌లోని ఉపాధ్యాయ శిక్షణా కళాశాలలో టీటీసీ పూర్తిచేశాడు. అనంతరం జమ్మికుంటలోని ఆవాసంలో రెండేళ్లపాటు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే తనలోని నటనా ఆసక్తి, ఆలోచలనకు రూపం ఇస్తూ, షార్ట్‌ఫిల్మ్స్ చిత్రీకరణ ప్రారంభించాడు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎదగాలనే తనలోని ఆలోచనలకు అనుగుణంగా ఆచరిస్తూ విద్యార్థులకు బోధించాడు. అనంతరం లంబాడిపల్లికి వచ్చి షార్ట్‌ఫిల్మ్‌లో నటించడం ప్రారంభించి తనలోని నటనతో ప్రపంచాన్ని మెప్పించాడు. వ్లాగ్ నుంచి సినిమాల వైపు.. అనిల్ సహజసిద్ధ నటన పల్లెటూరి సామాన్యుల నుంచి సినీ ఇండస్ట్రీని సైతం ఆకర్షించింది. హాస్యం, జానపద పాటలు, డాక్యుమెంటరీ ఇలా అన్నిరకాల కేటగిరీల్లో ప్రతిభ కనబర్చాడు. దీంతో యువకులకు క్రేజీ హీరోగా మారాడు. అనిల్ ఏది చేసినా ట్రెండింగ్‌గా మారడంతో ట్రెండింగ్ స్టార్‌గా ముద్రపడింది. గతంలో హీరో విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటించాడు. ఎస్ఆర్ కల్యాణ మండపంలో ప్రధానపాత్రలో, డిగ్రీ కాలేజ్, ఫ్రెషర్ కుక్కర్, అర్ధ శతాబ్దం వంటి సినిమాల్లో సైతం నటించాడు. పెళ్లిలో సైతం ప్రత్యేకతే.. అనిల్ పెళ్లి సైతం ప్రత్యేకత సంతరించుకుంది. తెలంగాణ యాసలో రాసిన పత్రిక వైరల్‌గా మారింది. ‘శుభలేకలో శ్రీరస్తు.. శుభమస్తు.. కల్యాణమస్తు స్థానంలో శానిటైజర్ ఫస్టు.. మాస్కు మస్టు.. సోషల్ డిస్టాన్స్ బెస్ట్ అంటూ కరోనా కాలంలో పాటించాల్సిన నియమాలు రాశారు. తల్వాలు పడ్డంక ఎవరింట్ల ఆళ్లే బువ్వ తినుండ్రి. బరాత్ ఉంది కాని ఎవరింట్ల వాళ్లే పాటలు పెట్టుకుని ఎగురుండ్రి. కట్నాలు మాత్రం గూగుల్ పే, ఫోన్ పే చేయుండ్రి’ అంటూ తనదైన ప్రత్యేకత చాటుకున్నాడు. కట్నాల రూపంలో వచ్చిన సుమారు రూ.80వేలకు మరో రూ.20వేలు కలిసి కరోనా కాలంలో బాధపడుతున్న నిరుపేదలకు నిత్యావసర సరుకులు ఇంటింటికీ తిరిగి అందజేసి మానవత్వాన్ని చాటుకున్నాడు అనిల్ జీల. ఇండియాలో నంబర్ 1 అనిల్ అడుగడుగునా అంకితభావం, పట్టుదల, సాధించాలనే తపనతో ముందుకుసాగుతున్నాడు. నిహారిక కొణిదెల నిర్మాతగా హలో వరల్డ్ వెబ్ సిరీస్ ఇండియా మొత్తంలో జీ5 నిర్మించిన అన్ని వెబ్‌సిరీస్‌లలో దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోకెల్లా అనిల్ నటించిన హలో వరల్డ్ వెబ్‌సిరీస్ నంబర్ 1గా నిలిచింది. ఇప్పటికే మై విలేజ్ షోలో సుమారు 100 షార్ట్ ఫిల్మ్‌ల్లో నటించాడు. హుషారు పిట్టలు వెబ్ సిరీస్‌లో సైతం నటించి మెప్పించాడు. ఒకరిని మించి ఒకరు అనిల్ జీల వ్లాగ్‌కు లక్షల్లో సబ్స్క్రైబర్లు, వీక్షకులుండగా సెలబ్రిటీలకు ఇచ్చే గ్రీన్సైన్ లభించింది. అలాగే అతడి జీవిత భాగస్వామి ఆమని చేసే రీల్స్, ప్రమోషన్ పాటలకు సైతం వీక్షకులు లక్షల్లో ఉన్నారు. ఆమె ఇన్‌స్టాగ్రాంకు 1.17 లక్షల మంది ఫాలోవర్సు ఉన్నారు. వీరి అనురాగానికి ప్రతీకైన ఆరునెలల మేధాన్‡్ష ఇన్‌స్టాగ్రాంకు సైతం 3,000 మంది ఫాలోవర్సు ఉండడం విశేషం. అనిల్ వ్లాగ్‌కు సబ్స్క్రైబర్లు: 7.70 లక్షల మంది నటించిన షార్ట్ ఫిల్మ్స్ : 100 ఇన్‌స్టాగ్రాంకు ఫాలోవర్లు: 3.80 లక్షల మంది వీక్షకులు: 25 లక్షల మంది -
హెలికాప్టర్‌కి వేళ్లాడుతూ.... క్రేజీ గిన్నిస్ రికార్డు
ఇంతవరకు పలు గిన్నిస్ రికార్డులు చూశాం. విచిత్రంగా గోళ్లు లేదా జుట్టు పెంచడం వంటివి చేసి రికార్డు సృష్టిస్తారు. మరికొందరూ తమ ప్రతిభా పాటవాలతో అందర్నీ అబ్బురపరుస్తూ ప్రపంచ రికార్డు సృష్టిస్తారు. కానీ ఇక్కడోక వ్యక్తి అందరిలా కాకుండా అన్నింటికంటే భిన్నంగా ఎవరూ ఊహించని విధంగా చేసి గిన్నిస్ రికార్డులో కెక్కాడు . వివరాల్లోకెళ్తే....డచ్ ఫిట్నెస్ జౌత్సాహికుడు స్టాన్ బ్రౌనీ, తన సహచర అథ్లెట్ అర్జెన్ ఆల్బర్స్తో కలిసి యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్నాడు. ఈ ఇద్దరు అథ్లెట్లు గాల్లో హెలికాప్టర్‌కి వేళ్లాడుతూ ఫుల్ అప్ ఎక్సర్సైజులు చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం వారాల తరబడి ప్రాక్టీస్ చేశారు చూడా. అదీగాక బ్రౌనీ కాలిస్టెనిక్స్కి సంబంధించిన జెమ్నాస్టిక్స్లో నిపుణుడు. ఈ మేరకు బ్రౌనీ జూలై 6, 2022న బెల్జియంలోని ఆంట్వెర్ప్లో హోవెనెన్ ఎయిర్‌ఫీల్డ్‌లో ఈ క్రేజీ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. అతను గాల్లో హెలికాప్టర్‌కి వేళ్లాడుతూ ఒక నిమిషం వ్యవధిలో దాదాపు 25 పుల్ అప్ ఎక్సర్సైజులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అతని సహచర అథ్లెట్ ఆల్బర్స్ గత అమెరికన్ రోమన్ సహ్రద్యన్ రికార్డుని బ్రేక్ చేస్తూ ఒక నిమిషంలో 24 పుల్ అప్ ఎక్సర్సైజులు చేశాడు. కానీ బ్రౌనీ ఈ రికార్డును కూడా బద్దలు కొడుతూ ఏకంగా ఒక నిమిషంలో 25 చేసి ఆశ్చర్యపరిచాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని గిన్నిస్ వరల్డ్ రికార్డు పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఒళ్లు గగుర్పొడిచే రోడ్డు ప్రమాదం... స్పాట్లో ఆహుతైన వాహనాలు) -
ఎలక్ట్రిక్ బైక్ ధర రూ.18,500..సింగిల్ ఛార్జ్‌తో 200 కిలోమీటర్ల ప్రయాణం!
ఎలక్ట్రిక్ బైక్ ధర రూ.18,500..సింగిల్ ఛార్జ్‌తో 200 కిలోమీటర్ల ప్రయాణం చేయోచ్చు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అక్షరాల నిజం. వెహికల్స్‌పై ఉన్న మక్కువతో ఓ యూట్యూబర్ పెట్రో వెహికల్‌ను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చాడు. ట్రయల్స్ కూడా చేశాడు. గత కొన్నేళ్లుగా పెరిగిపోతున్న పెట్రో ధరలు సామాన్యులకు మరింత భారంగా మారాయి. ముఖ్యంగా పెట్రోల్,డీజిల్ వెహికల్స్ ఉపయోగించి సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. అందుకే వాహన దారులు పెట్రో వెహికల్స్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఈవీ వెహికల్స్ ధర ఎక్కువగా ఉందని భావించిన ఓ యూట్యూబర్ తన పెట్రో వెహికల్.. ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చాడు. ఇందుకు అతనికి అయిన ఖర్చు అక్షరాల రూ.18,500. దాన్ని ఒక్కసారి చేస్తే 200కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. అలా అని బైక్‌ను నాసిరకంగా ఈవీ బైక్‌గా మార్చాడనుకుంటే పొరబడినట్లే. యూనిక్‌గా ఈవీ వెహికల్స్‌ను ఎలా తయారు చేస్తారో ఈవీ బైక్‌ను అలాగే డెవలప్ చేశాడు. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. సుజికీ ఏఎక్స్ 100 పెట్రోల్ బైక్ సుజికీ ఏఎక్స్ 100ను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చాడు. ఈ బైక్‌ను లిథియం అయాన్ బ్యాటరీ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశాడు. కంట్రోలర్, కేబుల్స్, ఎల్ఈడీ టైల్ టైల్స్,టర్న్ ఇండికేటర్స్, వెహికల్స్ ప్రారంభ స్పీడ్ 50 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా లైటర్ వీల్స్, సింగిల్ సీట్ డిజైన్..అవసరం అనుకుంటే రెండు సీట్లను అమర్చుకోవచ్చు. ఇక ఆర్ఎక్స్ 100 కేఫ్ రేసర్ లుక్‌తో అదరగొట్టేస్తుంది. ప్యాషన్‌తో చేసిందే ఈ బైక్ ఈవీ బైక్‌ను ఎవరు తయారు చేశారనే విషయాలు తెలియాల్సి ఉండగా..ఈ బైక్‌ను నడిపేందుకు ఆర్టీవో, ఆటోమోటీవ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పర్మీషన్ కోసం అప్లయ్ చేసినట్లు తెలిపాడు. ప్యాషన్‌తో చేసిందే తప్పా డబ్బులు కోసం కాదని, ఈ బైక్ తయారు చేసినందుకు ఖర్చు చేసిన మొత్తం జీఎస్టీతో కలుపుకొని రూ.18,500 అని సదరు యూట్యూబర్ వీడియోలో తెలిపాడు. చదవండి: Ola Electric: పాపం..అంచనా తలకిందులైందే? ఈవీ వెహికల్స్ తయారీ నిలిపేసిన ఓలా! -
పెళ్లి విషయం దాచి ప్రేమాయణం.. నటిపై చీటింగ్ కేసు
తిరువొత్తియూరు(చెన్నై): దిండుక్కల్ జిల్లా కొడైకెనాల్‌కు చెందిన ఆనంద రాజా సొంతంగా యూట్యూబ్ చానల్ నడుపుతున్నాడు. ఇందులో పలు కవితలు, కొడైకెనాల్, ప్రకృతి దృశ్యాలు ఫొటోలు తీసి వీడియోలుగా మార్చి అప్లోడ్ చేస్తుంటాడు. అందులో తాటి కొంబు ప్రాంతానికి చెందిన దివ్యభారతి (24) వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నియమించుకున్నాడు. తను రాసిన కవితను దివ్యభారతి వాక్యాలుగా రూపొందించి నటింపజేసేవాడు. దీనికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో దివ్యభారతిని ఆనంద రాజా ప్రేమించడం మొదలుపెట్టాడు. అదే సమయంలో ఆమె వివాహం చేసుకోవడానికి ఆలస్యం చేస్తూ వచ్చింది. అనంతరం ఆమె అతని నుంచి రూ.30 లక్షలు వరకు నగలు, నగదు తీసుకుంది. సందేహం వచ్చి అతను విచారించగా అప్పటికే ఆమెకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. దీనిపై అతడు దిండుక్కల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. చదవండి: Sivakarthikeyan: డైరెక్టర్ శంకర్ కూతురు హీరోయిన్గా శివకార్తికేయన్ కొత్త సినిమా -
శివుడి పాట.. ఫర్మానీ నాజ్‌పై ముస్లిం పెద్దల నారజ్
Farmani Naaz Har Har Shambhu:: యూట్యూబ్ సెన్సేషన్, ఇండియన్ ఐడల్ ఫేమ్ ఫర్మానీ నాజ్‌పై ముస్లిం మతపెద్దలు మండిపడుతున్నారు. ఆమె పాడిన హర్ హర్ శంభూ పాట వైరల్ కావడం ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువు అయ్యింది. హిందూ దైవం శివుడి మీద పాట పాడిన కారణంతో ముస్లిం సంఘాలు ఫర్మానీ నాజ్‌పై ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. ఇది ఇస్లాం వ్యతిరేక చర్య అంటూ ఫత్వా జారీ చేశాయి. ఆమె తన యూట్యూబ్‌లో ఛానెల్లో పాటను పోస్ట్ చేయగా.. వ్యూస్‌తో పాటు విమర్శలూ వెల్లువెత్తున్నాయి. ఈ చేష్టను ఇస్లాం వ్యతిరేక చర్యగా ఆరోపిస్తున్నాయి మతపెద్దలు.. ఇస్లాంలో, అందునా మహిళలు ఇలాంటి పనులు చేయడం మత విరుద్ధమేనని అంటున్నారు. ఉత్తర ప్రదేశ్ దియోబంద్ను చెందిన మతపెద్ద అసద్ ఖ్వాస్మీ దీన్నొక ‘పాపం’గా, ఘోరమైన నేరంగా అభివర్ణిస్తున్నారు. సంగీతానికి ఆమె దూరంగా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే.. స్టూడియోలో రికార్డింగ్ వెర్షన్‌ను ఆమె యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. శ్రావణ మాసం సందర్భంగా పాటను రిలీజ్ చేయగా.. హిందూ సంఘాలు, మరికొందరు అభినందిస్తుండగా, మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఫర్మానీ నాజ్ ఎవరంటే.. ఉత్తర ప్రదేశ్ ముజఫర్‌నగర్‌కు చెందిన ఫర్మానీ నాజ్.. ప్రైవేట్ ఆల్బమ్స్‌తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె యూట్యూబ్‌కు 3.84 మిలియన్లకు పైగా సబ్ స్క్రయిబర్స్ ఉన్నారు. ఇండియన్ ఐడల్ సీజన్ 12లో పాల్గొనడం ద్వారా ఆమెకు ఒక స్టార్ డమ్ దక్కింది. ఆమె వివాహిత. 2017లో ఆమెకు వివాహం అయ్యింది. అయితే కొడుకు పుట్టడం, ఆ కొడుక్కి జబ్బు చేయడంతో భర్త కుటుంబం ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించింది. దీంతో బిడ్డను తీసుకుని ఆమె తన పుట్టింటికి వెళ్లి.. కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆమె గొంతు బాగుండడంతో స్థానికంగా ఉండే ఓ కుర్రాడు.. ఆమె పాటల్ని యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు. అలా యూట్యూబ్ సెన్సేషన్‌గా, ఇ-సెలబ్రిటీగా గుర్తింపు పొందిన ఆమె, ఆపై ఇండియన్ఐడల్లో పాల్గొన్నారు. అయితే కొడుకు ఆరోగ్యం క్షీణించడంతో ఇండియన్ ఐడల్ మధ్యలోనే ఆమె వెనక్కి వచ్చేశారు. అయినా కూడా ఆమె కెరీర్ ముందుకు సాగిపోతూ వచ్చింది. ఏనాడైనా సాయం చేశారా? విమర్శలపై స్పందించిన ఫర్మానీ.. తనది పేద కుటుంబం అని, ఆపదలో ఉన్నప్పుడు ఎవరూ సాయానికి ముందుకు రాలేదని, తన మానాన తాను బతుకుతుంటే.. ఇప్పుడు అడ్డుకోవాలని చూడడం, విమర్శించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు ఆమె. అన్నింటికి మించి కళాకారులకు మతంతో సంబంధం ఉండదని గుర్తించాలంటూ ఆమె చెబుతున్నారు. అలా అనుకుంటే.. సలీం మోహమ్మద్ రఫీ లాంటి వాళ్లు భజన, హిందూ భక్తి పాటలు ఆలపించేవాళ్లు కాదు కదా.. దయచేసి హిందూ మతానికి, సంగీతానికి ముడిపెట్టొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారామె. అంతేకాదు తనకున్న రెండు చానెల్స్‌లో ఒకటి భక్తి గీతాల చానెల్ అని, అందులో కచ్చితంగా అన్ని మతాలకు సంబంధించిన ఆల్బమ్స్ అప్లోడ్ చేసి తీరతానని, అల్లా ఆశీస్సులు తనపై ఉంటాయని అంటున్నారామె. హిందూ సంఘాల మద్దతు ఇక తాజాగా శివుడి మీద పాట వైరల్ కావడంతో.. ఆమె మీద పలువురి అభినందలు సైతం కురుస్తున్నాయి. బీజేపీ నేత సంజీవ్ బాల్యన్.. ఆమె కొడుకు ట్రీట్మెంట్కు అవసరమయ్యే సాయం అందిస్తానని మాటిచ్చారు. మరోవైపు ముస్లిం సంఘాలు ఫర్మానీకి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేయడంపై వీహెచ్‌పీ మండిపడింది. వాళ్లు(ముస్లిం సంఘాలు) పేదలు, నిస్సహాయులకు మాత్రమే ఫత్వా జారీ చేస్తారు. ఇంతకాలం ఆమె యూట్యూబ్ ద్వారా పాడిన సంగతి మరిచిపోయినట్లు ఉన్నారు అంటూ ముస్లిం మత పెద్దలపై విమర్శలు గుప్పిస్తోంది. -
గడియారంలో మొదటి సెకన్‌కు లేటెందుకు?
ఎప్పుడైనా మీరు చేతి వాచీ వైపో, గోడ గడియారంవైపో తదేకంగా చూసినప్పుడు.. అందులో సెకన్ల ముల్లు మొదట మెల్లగా కదిలి, తర్వాత స్పీడెత్తుకోవడం గమనించారా? ఈ విషయాన్ని ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదంటారా? పోనీ ఇప్పుడు ట్రై చేస్తారా?.. డిజిటల్‌వి కాకుండా ముళ్లుండే గడియారంవైపు చూసినప్పుడు.. అందులో సెకన్ల ముల్లు తొలి సెకన్ పాటు మెల్లగా కదిలినట్టు అనిపిస్తుంది. తర్వాతి సెకన్ నుంచి మామూలుగానే ముందుకెళ్తుంది. కాస్త గ్యాప్‌తో ఎన్నిసార్లు మార్చి మార్చి చూసినా దాదాపు ఇలాగే అనిపిస్తుంటుంది. యూట్యూబ్‌లో అసాప్‌సైన్స్ అనే చానల్ నడిపే సైన్స్ నిపుణుడు దీనికి కారణాలను వివరించారు. మెదడు ప్రాసెస్ చేసే తీరు వల్లే.. గడియారాన్ని చూసినప్పుడు మొదటి సెకన్ ఎక్కువ సేపు ఉన్నట్టు అనిపించడం వెనుక సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి. సాధారణంగా మన కళ్లు రెండు రకాలుగా కదులుతుంటాయి.ఒకటి స్మూత్ పర్సూ్యట్, రెండోది సెక్కాడ్. ►స్మూత్ పర్సూ్యట్ విధానంలో కళ్లు చాలా మెల్లగా కదులుతూ గమనిస్తుంటాయి. ఉదాహరణకు మనకు కాస్త దూరంలో కారో, బైకో కదులుతూ ఉంటే.. కళ్లు దానికి అనుగుణంగా కదులుతూ చూస్తుంటాయి. ఈ విధానంలో కంటి నుంచి అందిన సమాచారాన్ని మెదడు వెంటవెంటనే ప్రాసెస్ చేస్తుంటుంది. మనం గడియారంలోకి చూసినప్పుడు.. రెండో సెకన్ నుంచి సెకన్ల ముల్లు అలా కదులుతూ ఉండటాన్ని గమనించడం కూడా ‘పర్సూ్యట్’ కిందకే వస్తుంది. ►సెక్కాడ్ విధానం అంటే.. ఏదైనా ఒకచోటి నుంచి మరో చోటికి వేగంగా, వెంటనే దృష్టి మళ్లించడం. ఇలా చేసినప్పుడు తొలుత చూస్తున్న దృశ్యం, చివరిగా దృష్టిని ఆపిన దృశ్యం మాత్రమే క్లియర్‌గా కనిపిస్తాయి. మధ్యలో ఉన్నదంతా చూచాయగానే అనిపిస్తుంది. ఉదాహరణకు మీకు దూరంగా ఉన్న ఏదైనా భవనాన్ని చూస్తున్నారు. పక్కన ఏదో చప్పుడైతే ఒక్కసారిగా అటువైపు చూశారనుకోండి. ఆ భవనానికి, ఈ చప్పుడు వచ్చిన చోటికి మధ్య దృశ్యాలేవీ పెద్దగా ఆనవు. కంటి నుంచి అందే సమాచారాన్ని మెదడు అంత వేగంగా, వెంటనే ప్రాసెస్ చేయలేకపోవడమే దీనికి కారణం. ►మనం గడియారం వైపు చూసినప్పుడు తొలి దృష్టి సెక్కాడ్ మోడ్‌లోనే ఉంటుంది. అప్పటికే కదులుతూ ఉన్న ముల్లు ఆగి, మళ్లీ కదులుతున్న సమయంలో.. మెదడు ఆ దృశ్యాన్ని ప్రాసెస్ చేయడానికి సమయం తీసుకుంటుంది. అంతకుముందు చూస్తూ ఉన్న దృశ్యం నుంచి గడియారం వైపు దృష్టిని మరల్చిన సమయాన్ని కూడా కలిపేస్తుంది. దీనితో తొలి సెకన్ గడిచేందుకు ఎక్కువసేపు పట్టినట్టు అనిపిస్తుంది. ఆ వెంటనే మన దృష్టి స్మూత్ పర్సూ్యట్లోకి వచ్చేస్తుంది కాబట్టి.. మిగతా సెకన్లు మామూలుగానే గడిచిపోతుంటాయి. -
ఎవరి పేరు చెబితే... పొట్టలు చెక్కలవుతాయో.... వాళ్లే వీళ్లు!
నవ్వడానికి... బడా బ్యాంకు బ్యాలెన్స్ అక్కర్లేదు. ఆధార్ కార్డ్ అంతకంటే అక్కర్లేదు. ఫ్రీగా నవ్వండి టెన్షన్ల నుంచి ఫ్రీ అవ్వండి’ అంటున్నారు ఈ రాజులు. నవ్వులరాజ్యం రారాజులు.. వార్తల నుంచి వంటల వీడియోల వరకు మనం రోజూ సోషల్‌మీడియా ప్లాట్ఫామ్లో గడుపుతుంటాం. ‘స్టాటిస్టా’ లెక్కల ప్రకారం భారతీయులు రోజుకు సుమారు 2 గంటల 36 నిమిషాల సమయాన్ని సోషల్‌మీడియా కోసం వెచ్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, కంటెంట్ క్రియేటర్స్‌కు ప్రాధాన్యత పెరిగింది. ‘కంటెంట్ క్రియేటర్’గా మారడం అనేది ట్రెండీయెస్ట్ కెరీర్‌గా మారింది. అనుకున్నంత మాత్రాన ‘కంటెంట్ క్రియేటర్’ అయిపోతారా? అనే ప్రశ్నకు ‘అదేం కాదు’ అని రెండు ముక్కల్లో జవాబు చెప్పవచ్చు. కంటెంట్ క్రియేటర్స్‌గా రాణించడానికి తారకమంత్రాలు...కష్టపడేతత్వం, సృజనాత్మకత, స్థిరత్వం. ఫోర్బ్స్ ఇండియా, ఐన్సిఏ (గ్రూప్ఎం–సెల్ఫ్ ఇన్ఫ్లూయెన్సర్ అండ్ కంటెంట్ మార్కెటింగ్ సొల్యూషన్స్) తాజాగా కామెడీ, బ్యూటీ, ఫ్యాషన్, బిజినెస్ అండ్ ఫైనాన్స్, ఫిట్నెస్, ఫుడ్, టెక్, ట్రావెల్, సోషల్‌వర్క్...ఇలా తొమ్మిది విభాగాల్లో నుంచి ‘టాప్ 100 డిజిటల్ స్టార్స్’ జాబితాను రూపొందించింది. ఈ తొమ్మిది విభాగాల్లో కామెడీ అగ్రస్థానంలో ఉంది. కామెడీ విభాగంలో స్టార్స్‌గా మెరుస్తున్న కొందరు యువకులు... ఇరవైనాలుగు సంవత్సరాల నిర్మల్ పిళ్లై కామెడీ కెరీర్‌ను సీరియస్ బిజినెస్‌గా చూస్తాడు. చెన్నైకి చెందిన ఈ మలయాళీ కుర్రాడు కాలేజీ రోజుల్లో కలం పట్టుకున్నాడు. కామెడీ ప్లేలు రాశాడు. అయితే అవి కాలేజీ ఆడిటోరియంకే పరిమితం. కరోనా కాలంలో, లాక్డౌన్ రోజుల్లో అతడి కామెడీ స్కిట్లకు సోషల్ మీడియా వేదిక అయింది. ఫస్ట్ వీడియోనే వైరల్ అయింది. ‘ఎవరీ పిళ్లై?’ అనే ఆసక్తిని పెంచింది. ప్రసిద్ధ ‘హ్యారీపోటర్’ను హాస్యరీతిలో అనుకరిస్తూ తాను సృష్టించిన కామెడీకి ఎంతో పేరు వచ్చింది. ప్రయాణంలో ఉన్నప్పుడు చుట్టు జరిగే సంభాషణలను వినడం, హావభావాలను గమనించడం పిళ్లై అలవాటు. వాటిలో నుంచే కామెడినీ సృష్టించడానికి అవసరమైన అంశాలను ఎంచుకుంటాడు. భోపాల్‌లో ఏప్రిల్ 1 సాయంత్రం.. ‘ఏప్రిల్‌ఫూల్ డే’ సందర్భంగా కామెడీ షో ఏర్పాటు చేశారు. ఇలాంటి షో ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. దిల్లీ నుంచి ఎవరో కుర్రాడు వస్తున్నాడట...అనుకున్నారు జనాలు. దిల్లీ కుర్రాడు వచ్చేశాడు. ఆ ఉక్కపోతల ఎండాకాలపు సాయంత్రం ఊహించని భారీవర్షం మొదలైంది. అది మామూలు వర్షం కాదు. నవ్వుల వర్షం! ‘తోడా సాప్ బోలో’ షోతో దేశ, విదేశాల్లో స్టాండ్–అప్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు అభిషేక్. అభిషేక్‌ను చూసీ చూడగానే... ‘ఈ కుర్రాడా! కమెడియన్ పోలికలు బొత్తిగా లేవు. ఏం నవ్విస్తాడో ఏమో’ అనుకుంటారట ప్రేక్షకులు. ఎప్పుడైతే అతడు మైక్ అందుకుంటాడో వారు మైమరిచి నవ్వుతారు. పాత నవ్వులను గుర్తు తెచ్చుకొని మళ్లీ నవ్వుతారు. ‘అబ్బ! ఏం నవ్వించాడ్రా కుర్రాడు’ అని అభిషేక్‌కు మౌఖిక సర్టిఫికెట్ ఇస్తారు. గుర్‌గ్రామ్‌కు చెందిన విష్ణు కౌశల్ కామెడీ కంటెంట్ క్రియేటర్. నిత్యజీవిత వ్యవహారాలు, సంఘటనల్లో నుంచి కంటెంట్‌ను తీసుకొని కామిక్ వీడియోలను రూపొందిస్తుంటాడు. ఆ వీడియోల్లో మనల్ని మనం చూసుకోవచ్చు. ‘అరే! నాకు కూడా అచ్చం ఇలా జరిగిందే’ అనుకోవచ్చు. యూట్యూబ్ కామిక్ వీడియోల నుంచి మొదలైన విష్ణు ప్రస్థానం ఇప్పుడు వోటీటీ కామెడీ సిరీస్, అడ్వర్టైజ్మెంట్ల వరకు వచ్చింది. ‘హాబీగా మొదలు పెట్టాను. ఇప్పుడు నవ్వించడమే నా వృత్తి అయింది’ నవ్వుతూ అంటున్నాడు విష్ణు కౌశల్. ‘ఈయన పరమ సీరియస్ మనిషి. నవ్వించండి చూద్దాం’ అని థానే (మహారాష్ట్ర)కు చెందిన ధృవ్ షా, శ్యామ్ శర్మలతో ఎప్పుడూ పందెం కాయవద్దు. ఈ హాస్యద్వయం గాలి తగిలితే ఆ సీరియన్ మనిషి నవ్వడమే కాదు, నవ్వు......తూనే ఉంటాడు! ఫోర్బ్స్ ‘టాప్ 100 డిజిటల్ స్టార్స్’ జాబితాలో చోటుచేసుకున్న కామెడిస్టార్స్లో వీరు కొందరు మాత్రమే. మరొక సందర్భంలో మరి కొందరు స్టార్స్ గురించి తెలుసుకుందాం. చదవండి: ఆ భార్యాభర్తలు దేశం మొత్తం నడిచేశారు -
తన వీడియోలకు వ్యూస్ రావడం లేదని ఆత్మహత్య
-
హైదరాబాద్‌లో యూట్యూబర్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: సైదాబాద్ క్రాంతినగర్‌లో యూట్యూబర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యూట్యూబ్‌లో వ్యూస్ పెరగడం లేదంటూ డ్రిపెషన్‌తో డీనా అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఐటీ గ్వాలియర్‌లో డీనా ఇంజనీరింగ్ చదువుతున్నాడు. గేమ్ ఆడుతూ తన బాధను చెప్పుకున్న డీనా.. ఆ క్రమంలో ఐదు అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించాడు. చదవండి: నిత్యపెళ్లికొడుకు మామూలోడు కాదు.. 13 మందిని పెళ్లి చేసుకొని.. యూట్యూబ్‌లో selflo గేమ్ ఛానెల్‌ను అతను నిర్వహిస్తున్నాడు. ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు 8 గంటల ముందే సూసైడ్ లెటర్‌ను డీనా సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. డీనా తండ్రి రైల్వేలో ఉద్యోగం చేస్తుండగా.. తల్లి డీఆర్డీవోలో పనిచేస్తున్నట్టుగా సమాచారం -
ఈ యూట్యూబర్‌కు డైరెక్టర్స్ పిలిచి మరీ ఆఫర్స్ ఇస్తున్నారుగా!
సతీష్ సరిపల్లి అనే పేరుకి యూట్యూబ్ వీడియోస్ చూసేవాళ్ళలో ఉన్న క్రేజ్ వేరు. ఏకంగా 1000కి పైగా వీడియోలలో అనేక రకాల పాత్రల్లో కనిపించారు. 'చీపా' గా బాగా ఫేమస్. ముందు కామెడీ పాత్రలతోనే మొదలుపెట్టినా ఆ తరువాత మాత్రం అన్ని రకాల పాత్రలు చేశారు. 'నాన్న ఎందుకో వెనకబడ్డాడు' అనేది సతీష్ సరిపల్లికి మంచి గుర్తింపు తెచ్చింది. అతనిలో ఉన్న నటుడిని అందరికి పరిచయం చేసింది. అలా యూట్యూబ్‌లో బాగా ఫేమస్ అయిన సతీష్ ఆ తరువాత వెండితెర వైపు అడుగులు వేశాడు. గతంలో అతను చేసిన యూట్యూబ్ వీడియోస్ రిఫరెన్స్ గా తీసుకుని చాలామంది డైరెక్టర్స్ పిలిచి ఆఫర్స్ ఇస్తున్నారు. ఇప్పటికే దాదాపు 50 సినిమాల్లో నటించిన సతీష్ రీసెంట్గా ఎఫ్3లో కనిపించారు. త్వరలో చిరంజీవి గాడ్ ఫాదర్, అఖిల్ అక్కినేని ఏజెంట్, సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు కొంచెం చెప్పాలి లాంటి పెద్ద సినిమాలతో పలకరించబోతున్నాడు. నటుడు అవ్వాలని అతను తీసుకున్న రిస్క్ ఫలించిందని, యాక్టర్‌గా టాలీవుడ్ తనని గుర్తించిందని చెబుతున్న సతీష్ సరిపల్లి గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ కింది వీడియో చూసేయండి.. చదవండి: అంతా అయిపోయింది.. మనీ కోసం, ఛాన్స్ కోసం అడుక్కుంటున్నా 91 ఏళ్ల వయసులో నాలుగో భార్యకు మీడియా మొఘల్ విడాకులు -
రూ. 44 లక్షల మోసం.. యూట్యూబర్ అరెస్ట్..
Youtuber Karthik Gopi Nath Arrested For Cheating Rs 44 Lakh: ఆలయాల పునరుద్ధరణ పేరుతో రూ. 44 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడిన యూట్యూబర్, బీజేపీ మద్దతుదారుడు కార్తీక్ గోపీనాథ్‌ను ఆవడి పోలీసులు సోమవారం (మే 30) అరెస్టు చేశారు. ఆవడిలో స్టూడియాతోపాటుగా యూట్యూబ్ చానల్‌ను కార్తీక్ నడుపుతున్నాడు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చిన కార్తీక్‌పై దేవదాయ శాఖ కన్నెర్ర చేసింది. పెరంబలూరులో రెండు ఆలయాల పునరుద్ధరణ కోసం అంటూ.. కార్తీక్ విరాళాల్ని సేకరించాడు. ఇందులో ఒకటైన మదుర కాళి అమ్మన్ ఆలయం దేవదాయశాఖ పరిధిలో ఉంది. కాగా అనుమతి లేకుండా వసూళ్లకు పాల్పడినందుకు సంబంధిత అధికారులు ఆవడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో నిందితుడు రూ. 44 లక్షల మేరకు వసూళ్లకు పాల్పడినట్లు తేలింది. దీంతో కార్తీక్‌ను అరెస్టు చేశారు. అంబత్తూరు కోర్టు అతనికి జూన్ 13 వరకు రిమాండ్‌కు విధించింది. చదవండి:👇 తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు మామయ్య.. నమ్రతా ఎమోషనల్ పోస్ట్ అలా ప్రచారం చేయడం సరి కాదు: కమెడియన్ అలీ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4491455922.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });