భారతదేశంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, యూట్యూబర్లకు పాపులారీటీ గురించి ప్రత్యేకంగా చెప్సాల్సిన పనేలేదు.మిలియన్ల కొద్దీ వ్యూస్, లక్షల కొద్దీ సబ్‌స్క్రైబర్లతో వేలాదిమంది యూట్యూబర్లు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆదాయ ఆర్జనలోనూ తమ మర్క్‌ను చాటుకుంటున్నారు. అలాంటి వారిలో టాప్‌లో ఎవరున్నారో తెలుసా? ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో అత్యధిక నికర విలువతో భారతదేశంలోనే అత్యంత ధనిక యూట్యూబర్‌గా నిలిచాడు. నటుడిగా, గాయకుడిగా, రచయితగా, బిజినెస్ మేన్‌గా భువన్ బామ్ స్ఫూర్తిదాయకమైన విజయగాథను చూద్దాం.
బడ్డింగ్ ఆర్టిస్టుగా వినోద పరిశ్రమలో తన కెరీర్‌ను ప్రారంభించిన భువన్ బామ్ ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంనుంచి వచ్చాడు. తన టాలెంట్‌తో అంచెలంచెలుగా ఎదిగాడు. దేశంలోని టాప్ యూట్యూబర్‌లలో ఒకరిగా నిలిచాడు. 26 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు. భువన్ బామ్ నికర విలువ దాదాపు 15 మిలియన్ డాలర్లు.. అంటే దాదాపు రూ.122 కోట్లు. ఈ సంపాదనంతా, బ్రాండ్, ఎండార్స్‌మెంట్ డీల్స్, తన సొంత వెబ్ సిరీస్, సినిమా పాత్రలు , యూట్యూబ్ వీడియోల ద్వారా వచ్చిన ఆదాయం
గుజరాత్‌లోని వడోదరకు చెందినవాడు భువన్ బామ్. చిన్నప్పటినుంచి మ్యూజిక్ మీద ఉన్న ప్రేమతో దాన్నే కరియర్‌గా ఎంచుకున్నాడు ఢిల్లీలోని చిన్న కేఫ్‌లు , రెస్టారెంట్లలో పాడటం మొదలు, రియాలిటీ టీవీ షో పాటల పోటీల్లోనూ పాల్గొనేవాడు. ఈ క్రమంలో అతని సంపాదన నెలకు రూ. 5000 మాత్రమే. ఈ చాలీ చాలని జీతమే అతనిలో ఎదైనా సాధించాలంటే పట్టుదల పెరిగింది. దాంతో యూట్యూబ్ వైపు మళ్లాడు. అలా ఒక్కో మెట్టూ ఎదుగుతూ ప్రస్తుతం బిబి కి వైన్స్ అనే కామెడీ ఛానెల్‌తో పాపులర్ అయ్యాడు.
కాశ్మీర్ వరదల కారణంగా ఇల్లు కోల్పోయిన మహిళను అభ్యంతర కరమైన ప్రశ్నలు అడిగిన వార్తా విలేకరిని దూషించిన వీడియోను అప్‌లోడ్ చేసిన పాపులరయ్యాడు. దీనికి ముందు అనేక మ్యూజిక్ ఆల్బమ్స్‌తో సంగీత ప్రియులను ఆకట్టుకున్నాడు. 2018లో తాను రూపొందించిన ప్లస్‌మైనస్ షార్ట్ ఫిలిం కూడా బాగా పేరు తెచ్చుకుంది. దివ్య దత్‌తో కలిసి నటించిన ఈ షార్ట్ ఫిల్మ్ 2019లో ది బెస్ట్ షార్ట్‌ఫిలిం అవార్డు కూడా గెల్చుకుంది. సఫర్, రహగుజార్, అజ్ఞాతవాసి లాంటి ఆల్బమ్స్ అతని ఖాతాలో ఉన్నాయి. అంతేనా యూట్యూబ్‌లో టిటు టాక్స్ అనే కొత్త డిజిటల్ సిరీస్‌లో షారుఖ్ ఖాన్ ఫస్ట్ గెస్ట్‌గా కనిపించాడు.
మే 2020లో, బామ్ 'లైఫ్‌లైన్ ఆఫ్ సొసైటీ'లో ఇండియాలో లాక్‌డౌన్ సమయంలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించి చాలామందిని ఆకట్టుకుంటున్నాడు. ఎలక్ట్రీషియన్, హౌస్ హెల్ప్, రైతులు, చిన్నచిన్న వ్యాపారులు తదితరుల కష్టాలను రికార్డు చేసిన ఈ వీడియోలు విశేషంగా నిలిచాయి. జనవరి 2021లో తన ఛానల్ బిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుందని స్వయంగా ప్రకటించాడు.
ఇటీవల ధిండోరా అనే వెబ్ సిరీస్‌తోపాటు, భువన్ రొమాంటిక్ కామెడీ అమెజాన్ మినీ టీవీ సిరీస్ రఫ్తా..రఫ్తాతో తానేంటో నిరూపించు కున్నాడు. హిట్ సిరీస్‌లు షోలతో ఇలా ఒకదాని తరువాత సక్సెస్‌తో దూసుకుపోతున్ భువన్ జనవరి 2023లో, తాజా ఖబర్‌తో ఓటీటీ అరంగేట్రం చేసాడు. జూన్ 26న రోడ్డు ప్రమాదంలో మరణించిన సహనటుడు దేవరాజ్ పటేల్‌కు హృదయపూర్వక నివాళులర్పించారు.
అయితే 2021లో కోవిడ్ కారణంగా బామ్ తల్లిదండ్రులు చనిపోవడం విషాదాన్ని నింపింది. అయినా మొక్కవోని ధైర్యంతో తన లక్ష్యంపై అడుగులు వేస్తూ తనలాంటివారి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment