Success Story
-
ఒకే ఒక్క శ్వాసతో రికార్డ్: భారతీయ మత్స్య కన్య సక్సెస్ స్టోరీ!
ఐటీ రంగంలో చాలా ఏళ్లు పనిచేసిన 31 ఏళ్ల స్మృతి మిరానీ "భారతీయ మత్స్యకన్య"గా మారతానని ఎప్పుడూ ఊహించలేదు. కానీ అనూహ్యంగా రికార్డు సాధించింది. 40 మీటర్ల నీటి అడుగున డైవ్ చేసిన తొలి భారతీయ మహిళగా నిలిచింది స్మృతి మిరానీ. IIT బాంబే ఇంజనీర్ నుంచి భారతదేశపు తొలి మహిళా ఫ్రీ-డైవింగ్ రికార్డ్ హోల్డర్ వరకు ఆమె పయనం చాలా స్ఫూర్తి దాయకం. ఇది కేవలం రికార్డులను బద్దలు కొట్టడం గురించి మాత్రమే కాదు. తనకెదునైన పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం, అభిరుచి, పట్టుదల ఎవరూ ఊహించని లోతులకు (సముద్రపు) తీసుకెళ్లగలవని నిరూపించిన వైనం గురించి కూడా.ఒక్క శ్వాస ఆమె జీవితాన్ని మార్చగలదు అంటే నమ్ముతారు. అవును స్మృతి మిరానీ విషయంలో అదే జరిగింది. ఒకే ఒక్క శ్వాసతో 40 మీటర్లకు పైగా నీటి అడుగున డైవ్ చేసిన తొలి భారతీయ మహిళగా స్మృతి మిరానీ థాయిలాండ్‌లో చరిత్ర సృష్టించింది. ఎయిర్ ట్యాంక్ లేకుండా ఊపిరిబిగబట్టి సముద్రం లోతులకు చేరి చరిత్ర సృష్టించింది. నిజంగా ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిచ్చింది. ప్రతీ మహిళలకు గర్వకారణమైన క్షణం! View this post on Instagram A post shared by Deepak G Ponoth (@themillenialcomrade) అప్నియా కో ఫంగాన్లో ప్రపంచ ప్రఖ్యాత కోచ్ లుకాస్ గ్రాబోవ్స్కీ ఆధ్వర్యంలో చాలా కఠోరమైన శిక్షణ తీసుకుని తనను తాను తీర్చుకుంది. రికార్డులను బద్దలు కొట్టడానికి తన శారీరక,మానసిక బలాన్ని సాధించింది. ఫ్రీ-డైవింగ్‌లో ఎయిర్ ట్యాంక్ లేదా శ్వాస ఉపకరణాలు లేకుండా సాధించాలంటే శ్వాసతీసుకోవడం అనే కళను అలవర్చుకోవాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని శ్రద్ధగా సాధన చేసే మెంటల్ గేమ్ లాంటిది అంటారామె.తాను నీటి అడుగున ఉన్నప్పుడు తనకు తాను అత్యంత సన్నిహితంగా అనిపిస్తుంది” అని గర్వంగా చెబుతుందామె. ’’ ఇపుడు చాలా స్వేచ్ఛగా ఉన్నాను, నాకు నేనే సవాళ్లు విసురుకుంటా.. భయాన్ని అధిగమించాను. ఫ్రీ-డైవింగ్ ఆనందాన్ని గుర్తించాను’’ అంటుంది. చదవండి: మంగళసూత్రం, మెట్టెలు అందుకే.... అమెరికన్ మహిళ వీడియో వైరల్అండమాన్ దీవులలో ఊహించని విధంగా ఆమె ప్రయాణం ప్రారంభమైంది. తొలిసారి ఫ్యామిలీతో వెళ్లినపుడు స్కూబా-డైవింగ్ నేర్చుకోవాలని ప్రయ్నత్నించింది. రెండోసారి విజయం సాధించింది. ఆ తరువాత 2019లో రిమోట్‌గా పనిచేస్తున్నపుడు స్కూబా-డైవింగ్‌ను కొనసాగించడానికి వెళ్లినపుడు తాబేలుతో పాటు ఫ్రీ-డైవర్ ఈత కొట్టడం చూడటం జీవితం దృక్పథాన్ని మార్చివేసింది. అప్పటినుంచి సముద్రమే నివాసంగా మారి పోయింది. స్మృతి అప్పటి నుండి మాల్టా, బాలి, ఆస్ట్రేలియాతో సహా ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన జలాల్లో కొన్నింటిలో డైవ్ చేసింది. సర్టిఫైడ్ ఫ్రీ-డైవింగ్ బోధకురాలిగా ఎదిగింది. అనేక మందికి శిక్షణనిస్తోంది. వారిలో తమ సామర్థ్యాన్ని అన్వేషించి, వారి భయాలను అధిగమించవడానికి శక్తినిచ్చే లక్ష్యంతో ఉంది. -
‘ఫెవికాల్’ పుట్టిందిలా..
పుస్తకాలు అతికించడం నుంచి గృహోపకరణాల తయారీ వరకూ అనేక చోట్ల ఉపయోగించే ‘ఫెవికోల్’ (Fevicol) దశాబ్దాలుగా భారతీయ ఇళ్లలో భాగంగా మారిపోయింది. ఫోటోకాపీయింగ్కు జిరాక్స్ ఎలాగైతే పర్యాయ పదంగా మారిందో అలాగే బ్రాండ్‌తో సంబంధం లేకుండా జిగురు (గమ్) పదార్థాలకు ఫెవికోల్ పర్యాయపదంగా మారింది. అయితే ఈ ఐకానిక్ బ్రాండ్ వెనుక చిన్న వ్యాపారాన్ని బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యంగా మార్చిన మొదటి తరం వ్యవస్థాపకుడు బల్వంత్ పరేఖ్ అద్భుతమైన కృషి ఉంది. స్వాతంత్ర్య సమరయోధుడైన ఆయన ప్యూన్‌గా ప్రారంభమై పారిశ్రామికవేత్తగా ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయం. "ఫెవికోల్ మ్యాన్" స్ఫూర్తిదాయకమైన ప్రస్థానాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం.ప్రారంభ జీవితం పోరాటాలే..గుజరాత్ లోని మహువాలో జైన కుటుంబంలో జన్మించిన బల్వంత్ పరేఖ్ తొలి జీవితం అనేక పోరాటాలతో కూడుకున్నది. ముంబైలోని గవర్నమెంట్ లా కాలేజీ నుంచి లా డిగ్రీ పొందినప్పటికీ ఆయన వేరే మార్గాన్ని ఎంచుకున్నారు. బల్వంత్ పరేఖ్ ప్రారంభ జీవితం చాలా కఠినంగా గడిచింది. ఆయన డైయింగ్, ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేశారు. తరువాత ప్యూన్ గా పనిచేశారు. ఆ సమయంలో భారతదేశం స్వాతంత్ర్య పోరాటంలో ఉంది. పరేఖ్ కూడా క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అయితే కుటుంబ ఒత్తిడితో చదువును పునఃప్రారంభించి లా డిగ్రీ పూర్తి చేశారు.వ్యాపార సామ్రాజ్యానికి పునాదిమోహన్ అనే ఇన్వెస్టర్ సహకారంతో సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకున్న పరేఖ్.. పాశ్చాత్య దేశాల నుంచి సైకిల్, అరెకా, కాగితపు రంగులను దిగుమతి చేసుకోవడం ప్రారంభించారు. ఇందులో విజయాన్ని సాధించిన తరువాత, పరేఖ్ కుటుంబం ముంబైకి మకాం మార్చారు. ఇది ఆయన జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. తరువాత బల్వంత్ తమ ఉత్పత్తులను భారతదేశంలో మార్కెటింగ్ చేయడానికి జర్మన్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. 1954 లో ఆ కంపెనీ ఆహ్వానం మేరకు ఆయన జర్మనీ వెళ్లారు. కానీ వారి మేనేజింగ్ డైరెక్టర్ మరణించిన తరువాత ఆ సంస్థ భాగస్వామ్యం నుంచి వైదొలిగింది. ఈ ఎదురుదెబ్బ పరేఖ్‌ను అడ్డుకోలేదు. తాను కూడా సొంత వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పానికి అది ఆజ్యం పోసింది.ఫెవికోల్ ప్రారంభమైందిలా.. 1954లో బల్వంత్, ఆయన సోదరుడు సుశీల్ ముంబైలోని జాకబ్ సర్కిల్లో పరేఖ్ డైచెమ్ ఇండస్ట్రీస్‌ను స్థాపించారు. పారిశ్రామిక రసాయనాలు, వర్ణద్రవ్య ఎమల్షన్లు, రంగులను తయారు చేసి విక్రయించడం మొదలుపెట్టారు. భారతీయ జిగురు మార్కెట్లో జంతువుల కొవ్వుతో తయారైన జిగురులు ఆధిపత్యం చెలాయిస్తున్నాయని, అవి వికృతమైనవి, సంక్లిష్టమైనవని గమనించిన పరేఖ్ ఒక అవకాశాన్ని చూశారు. ఫెవికాల్ బ్రాండ్ పేరుతో తెల్ల జిగురు తయారీని ప్రారంభించారు. ఫెవికాల్ అనే పేరు మోవికాల్ అని పిలువబడే ఇలాంటి ఉత్పత్తిని తయారు చేసే ఒక జర్మన్ కంపెనీ ప్రేరణతో వచ్చింది. జర్మన్ భాషలో "కోల్" అంటే రెండు వస్తువలను అతికించేదని అర్థం.పిడిలైట్ ఇండస్ట్రీస్ నిర్మాణంఫెవికాల్ విజయం 1959 లో పిడిలైట్ ఇండస్ట్రీస్ స్థాపనకు దారితీసింది. ఫెవికాల్ దాని నాణ్యత, విశ్వసనీయతకు గుర్తింపు పొందడంతో కంపెనీ త్వరగా ఇంటి పేరుగా మారింది. విరిగిన పాత్రలను అతికించడం దగ్గర నుంచి ఇళ్ల నిర్మాణం వరకు ఫెవికాల్ భారతీయ గృహాలలో అంతర్భాగమైంది. "ఫెవికోల్ కా జోడ్ హై, తూటేగా నహీ" అనే ట్యాగ్ లైన్ తో చేసిన అడ్వర్టైజింగ్ ప్రచారాలు వినియోగదారుల హృదయాలలో ఈ ఐకానిక్ బ్రాండ్ స్థానాన్ని మరింత సుస్థిరం చేశాయి. -
గ్రామంలో నివాసం.. వేలకోట్ల కంపెనీకి సారథ్యం!.. ఎవరో తెలుసా?
మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా.. వచ్చిన దారిని, మూలలను మరచిపోకూడదు. డబ్బు సంపాదించగానే లగ్జరీకి అలవాటుపడే మనుషులున్న ఈ రోజుల్లో కూడా.. వేలకోట్ల రూపాయల కంపెనీ అతని సారథ్యంలో ఉన్నప్పటికీ, నిరాడంబరంగా.. పంచె కట్టుకుని జీవితం గడిపేస్తున్నారు. ఇంతకీ అయన ఎవరు? ఆయన స్థాపించిన కంపెనీ ఏది? సంపాదన ఎంత అనే ఆసక్తికరమైన వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.తమిళనాడులో జన్మించిన 'శ్రీధర్ వెంబు'.. సాధారణ నేపథ్యం నుంచి వచ్చి, నేడు ఎంతోమందికి ఆదర్శమయ్యారు. చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని.. ఆ తరువాత ఉన్నత చదువుల కోసం విదేశాలకు పయనమయ్యారు. చదువు పూర్తయిన తరువాత ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ సంపాదించారు. కానీ కొన్ని రోజులకు మంచి ఉద్యోగాన్ని వదిలి, ఇండియాకు వచ్చేసారు.ఉద్యోగం వదిలి, భారత్ వచ్చిన తరువాత.. సొంత సాఫ్ట్వేర్ సామ్రాజ్యాన్ని నిర్మించారు. అదే నేడు అందరికి సుపరిచయమైన.. 'జోహో కార్పొరేషన్'. చాలా మంది ప్రజలు మంచి అవకాశాల కోసం గ్రామాల నుంచి నగరాలకు, ఆపై విదేశాలకు తరలిపోతున్న సమయంలో వెంబు ఈ ధోరణిని తిప్పికొట్టారు.అమెరికాను విడిచిపెట్టి తమిళనాడులోని ఒక చిన్న గ్రామానికి తిరిగి వచ్చి, అక్కడ నుంచే ఇప్పుడు తన బిలియన్ డాలర్ల కంపెనీని నడుపుతున్నారు. జోహో ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది, కానీ వెంబు 630 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెన్కాసికి సమీపంలోని మారుమూల గ్రామమైన మథలంపారైలో ఓ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు.శ్రీధర్ వెంబు తీసుకున్న ఈ నిర్ణయం.. కంపెనీని అభివృద్ధికి మాత్రమే కాకుండా, సమాజ అభివృద్ధిని ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ భారతదేశాన్ని నిర్మించడానికి దోహదపడింది. దీంతో భారత ప్రభుత్వం.. 72వ గణతంత్ర దినోత్సవం నాడు వెంబుకు ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డును అందించింది.గ్రామీణ ప్రాంతంలో ఆఫీస్ ఏర్పాటు చేయాలనే.. వెంబు ఆలోచన చాలామందిని ఆశ్చర్యపరిచింది. గ్రామాలను వదిలి నగరాలకు ప్రజలు తరచుగా వెళ్లే వలస ధోరణిని తిప్పికొట్టాలనే గ్రామంలో ఆఫీస్ స్టార్ట్ చేసినట్లు శ్రీధర్ వెంబు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.వెంబు తెన్కాసిలో ఒక చిన్న కార్యాలయాన్ని అద్దెకు తీసుకొని ప్రారంభించారు. ఆ తరువాత మథలంపారైలో ఒక పాత ఫ్యాక్టరీని కొనుగోలు చేసి, దానిని టెక్ క్యాంపస్‌గా మార్చారు. వెంబు కార్యాలయాలను ఏర్పాటు చేయడంతోనే ఆగిపోలేదు. ఆయన జోహో స్కూల్ ఆఫ్ లెర్నింగ్‌ను కూడా ప్రారంభించారు. ఇక్కడ ఉన్నత పాఠశాల, డిప్లొమా విద్యార్థులు వివిధ నైపుణ్యాలలో శిక్షణ పొందుతారు.ఇదీ చదవండి: భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. ప్రధాన కారణాలివే!శ్రీధర్ వెంబు ప్రారంభించిన.. జోహో కార్పొరేషన్ విలువ రూ. లక్ష కోట్ల కంటే ఎక్కువ. కాగా ఈయన ఆస్తి రూ. 28వేలకోట్ల కంటే ఎక్కువని సమాచారం. వేలకోట్ల సంపద కలిగి ఉన్నప్పటికీ.. వెంబు చాలా సాధారణ జీవితం గడుపుతున్నారు. రోజువారీ ప్రయాణానికి ఆయన సైకిల్ ఉపయోగిస్తున్నారు. ఖరీదైన సూట్ కాకుండా.. పంచె కట్టుకుంటుటారు. ఇటీవలే 'శ్రీధర్ వెంబు' తన సీఈఓ పదవికి రాజీనామా చేశారు. అయితే అదే కంపెనీలో చీఫ్ సైంటిస్ట్‌గా పనిచేయనున్నట్లు సమాచారం. -
నీట్లో 720/720.. ధోనీతో లింక్.. ‘మానవ్’ సక్సెస్ స్టోరీ
నీట్ సక్సెస్ స్టోరీస్ ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. మానవ్ ప్రియదర్శి నీట్లో సాధించిన విజయం అందరికీ స్ఫూర్తినిస్తుంది. జార్ఖండ్‌కు చెందిన మానవ్ ప్రియదర్శి(Manav Priyadarshi) కుటుంబాన్ని డాక్టర్ల ఫ్యామిలీ అని అంటారు. ఇప్పటికే ముగ్గురు డాక్టర్లున్న ఈ ఫ్యామిలీలో ఇప్పుడు మానవ్ ప్రియదర్శి తన ఎంబీబీఎస్ పూర్తిచేశాక నాల్గవ డాక్టర్ కానున్నాడు.చిన్నప్పటి చదువులో ఎంతో చురుకైన మానవ్ ప్రియదర్శి నీట్(NEET) యూజీలో మొదటి ప్రయత్నంలోనే 720 మార్కులకు 720 మార్కులు తెచ్చుకోవడం విశేషం. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఉంటున్న మానవ్ 2024లో జరిగిన నీట్ యూజీ పరీక్షలో జార్ఖండ్‌లో టాపర్‌గా నిలిచాడు. ఆల్ ఇండియా ర్యాంక్ 57 తెచ్చుకుని, టాప్ 100 నీట్ టాపర్స్‌లో ఒకనిగా నిలిచాడు. నాడు మీడియాతో మానవ్ ప్రియదర్శి మాట్లాడుతూ తనకు టాపర్‌గా నిలుస్తాననే నమ్మకం ఉందని, కానీ స్టేట్ నంబర్ వన్‌గా నిలుస్తానని అనుకోలేదన్నారు.మానవ్ ప్రియదర్శికి ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి(Dhoni) మధ్య ఒక సంబంధం ఉంది. రాంచీలో జేవీఎం శ్యామలీ స్కూలుకు మంచి పేరు ఉంది. ఇదే స్కూలులో ఎంఎస్ ధోనీ చదువుకున్నాడు. ఇప్పుడు ఇదే స్కూలు నుంచి మానవ్ 12వ తరగతి పూర్తి చేశాడు. తాను సాధించిన విజయానికి తన పాఠశాల ఉపాధ్యాయులే కారణమని మానవ్ చెప్పుకొచ్చాడు. మానవ్ ప్రియదర్శి నీట్ యూజీ పరీక్షలో 99.9946856 పర్సంటేజీ తెచ్చుకున్నాడు.మానవ్ ప్రియదర్శి తండ్రి సుధీర్ కుమార్ రిటైర్డ్ ఫిజిక్స్ ప్రొఫెసర్(Physics professor). మానవ్ పెద్దక్క డాక్టర్ నిమిషా ప్రియ భాగల్పూర్ మెడికల్ కాలేజీలో డాక్టర్. మానవ్ చిన్నాన్న డాక్టర్ ప్రిన్స్ చంద్రశేఖర్ సహరసాలో మెడికల్ ఆఫీసర్. మానస్ మామ డాక్టర్ రాజీవ్ రంజన్ రాంచీ ప్రభుత ఆస్పత్రి వైద్యులు. మానవ్ మీడియాతో మాట్లాడుతూ విజయానికి దగ్గరి దారులుండవని, లక్ష్యాన్ని నిర్థారించుకుని, పట్టుదలతో చదివితే ఓటమి ఎదురు కాదన్నాడు. ఇది కూడా చదవండి: బడా నేతల పుట్టినిల్లు డీయూ.. జైట్లీ నుంచి రేఖా వరకూ.. -
ఒకప్పుడు సుజుకీ సంస్థ నమ్మని మొదటి బిలియనీర్!
దృఢ సంకల్పం, మనం కనే కలలపై అచంచల విశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యమని ప్రముఖ పారిశ్రామికవేత్త బినోద్ చౌదరి నిరూపించారు. ఆయన పూర్వీకులు రాజస్థాన్ నుంచి నేపాల్‌లోని ఖాట్మండుకు వలస వెళ్లడంతో అక్కడే స్థిరపడి టెక్స్టైల్ వ్యాపారాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి నేపాల్‌లో తొలి బిలియనీర్‌గా మారారు. బిజినెస్ గురించి ఆయన అవలంబిస్తున్న విధానాలు, చేస్తున్న వ్యాపారాలు వంటి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.బినోద్ చౌదరి నేపాల్‌లోని ఖాట్మండులో మార్వాడీ కుటుంబంలో జన్మించారు. ఆయన పూర్వీకులు ఇండియాలోని రాజస్థాన్ నుంచి చాలా ఏళ్ల కిందటే వలస వెళ్లారు. 1934లో నేపాల్-బిహార్ భూకంపం తరువాత బినోద్ తాత బురమల్దాస్ చౌదరి తన 20వ ఏటా టెక్స్టైల్ వ్యాపారం ప్రారంభించారు. నేపాల్‌లో అధికారికంగా నమోదు చేయబడిన దుస్తుల కంపెనీని ప్రారంభించిన మొదటి వ్యక్తిగా నిలిచారు. బినోద్ తండ్రి లుంకరణ్ దాస్ చౌదరి తాత స్థాపించిన వస్త్ర వ్యాపారాన్ని అభివృద్ధి చేశారు. అంతర్జాతీయ వర్తక సంస్థలను ప్రారంభించారు. 1968లో లుంకరణ్ దాస్ చౌదరి అరుణ్ ఎంపోరియం అనే రిటైల్ స్టోర్‌ను ఏర్పాటు చేశారు. ఇది అత్యంత విజయవంతమైన సంస్థగా నిలిచింది.పద్దెనిమిదో ఏటా బాధ్యతలుపద్దెనిమిదేళ్ల వయసులో బినోద్ చౌదరి చార్టర్డ్ అకౌంటెన్సీ చదవడానికి ఇండియా రావాలని నిర్ణయించుకున్నారు. కాని అతని తండ్రి గుండె జబ్బుతో బాధపడుతుండడంతో కుటుంబ వ్యాపారాన్ని కొనసాగించలేరని డాక్టర్ చెప్పారు. దాంతో కుటుంబ బాధ్యతతోపాటు వ్యాపారాలు చూసుకోవాల్సి వచ్చింది. తాత స్థాపించి, తండ్రి అభివృద్ధి చేసిన వ్యాపారం పగ్గాలు బినోద్ అందుకున్నారు. ఈ సంఘటనపై బినోద్ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ..‘రాత్రికి రాత్రే నా జీవితం పూర్తిగా మారిపోయింది. నాకు వేరే ఆప్షన్ లేదు. కానీ అది నన్ను మరింత కఠినమైన వ్యక్తిగా మార్చింది’ అని అన్నారు.తొలుత నేపాల్‌కు జపాన్ సుజుకీ కార్లను దిగుమతి చేసుకొని ఆ సంస్థ కార్లకు డీలర్షిప్ దక్కించుకొని ఆటోమొబైల్ విభాగంలోకి అడుగుపెట్టాలని బినోద్ భావించారు. కానీ తాను వస్త్ర వ్యాపారి కాబట్టి సుజుకీ సంస్థ తనను నమ్మలేదు. అయినా వారిని ఒప్పించి నేపాల్‌లో సుజుకీ ఉత్పత్తులు విక్రయించడానికి ట్రయల్ డీలర్ షిప్ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో ఎక్కువ కార్లు అమ్మితే పూర్తి డీలర్షిప్ లభిస్తుంది. దాంతో అనుకున్న విధంగానే అత్యధిక కార్లు సేల్ చేసి డీలర్షిప్ పొందారు. తర్వాత కాపర్ ఫ్లోర్ అని పిలువబడే డిస్కోటెక్ కంపెనీను స్థాపించారు. ఈ క్లబ్‌ను సందర్శించిన అనేక మంది సంపన్నుల కారణంగా కంపెనీ భారీ విజయం సాధించింది. 1979లో జపనీస్ ఎలక్ట్రానిక్ సంస్థ నేషనల్ పానాసోనిక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.వై వై నూడుల్స్ తయారీబినోద్ చౌదరి తన 23వ ఏటా ఒకసారి థాయ్‌లాండ్‌కు వెళ్లారు. అక్కడ చాలామంది నూడుల్స్ తినడం, వాటిని కొనుగోలు చేయడం గమనించాడు. వెంటనే నూడుల్స్ అమ్మాలనే ఆలోచన చౌదరికి వచ్చింది. నేపాల్లోనూ థాయ్ నూడుల్స్‌పై మక్కువ ఉందని గ్రహించారు. థాయ్‌లాండ్‌లోని నూడుల్స్‌ను ఉత్పత్తి చేసే థాయ్ ప్రిజర్వ్డ్ ఫుడ్ ఫ్యాక్టరీ కంపెనీ లిమిటెడ్‌ను సందర్శించారు. ఆ కంపెనీతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాడు. దాంతో ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని నేపాల్‌లో ఇన్స్టంట్ నూడుల్స్ బ్రాండ్ వై వైను ప్రారంభించారు. ఈ కంపెనీ చాలా తక్కువ సమయంలోనే భారీగా విక్రయాలు జరిపి రికార్డు నెలకొల్పింది. క్లబ్‌ను నిర్వహించడం, తన తండ్రి స్థాపించిన అరుణ్ ఎంపోరియం నడపడం తనకు ఎన్నో వ్యాపార విషయాలు నేర్పించాయని బినోద్ తెలిపారు.పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక1979లో అతని నూడుల్స్ కంపెనీకి నేపాల్ ప్రభుత్వం నుంచి లైసెన్స్ అవసరం అయింది. ఆ సమయంలో సూర్య బహదూర్ థాపా అధికారంలో ఉన్నారు. అతను చౌదరిని తన పరిపాలనకు, ప్రచారానికి మద్దతు ఇవ్వాలని కోరగా వెంటనే ఒప్పుకున్నారు. తర్వాత కొన్ని కారణాల వల్ల 2017లో షేర్ బహదూర్ దేవ్బా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చౌదరి దేశానికి గణనీయమైన కృషి చేశారని పార్టీ పేర్కొంది. డిసెంబర్ 2022లో పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.ఇతర వ్యాపారాలు1995లో నబిల్ బ్యాంకులో దుబాయ్ ప్రభుత్వ నియంత్రణ వాటాను చౌదరి కొనుగోలు చేశారు. 1990లో సింగపూర్‌లో సినోవేషన్ గ్రూప్‌ను ప్రారంభించారు. హోటళ్లు, రిసార్టులు, వన్యప్రాణులు, పర్యాటకం, ఎఫ్ఎంసీజీ (ఫుడ్ అండ్ బేవరేజెస్), రియల్ ఎస్టేట్, సిమెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో ఈ కంపెనీ సర్వీసు అందిస్తోంది. తాజ్ హోటల్స్ గ్రూప్‌తో జాయింట్ వెంచర్స్ కోసం చౌదరి చర్చలు జరిపారు. బినోద్ చౌదరి నాయకత్వంలో చౌదరి గ్రూప్ టూరిజం, రియల్ ఎస్టేట్, ఆర్థిక సేవలు, విద్యతో సహా వివిధ విభాగాల్లో సర్వీసులు అందిస్తోంది. దాదాపు 30కి పైగా దేశాల్లో విస్తరించింది. నేపాల్‌లో ఇతర పెట్టుబడిదారులు ఇన్వెస్ట్ చేసేందుకు సురక్షితమైన ప్రదేశంగా భావించేలా చేస్తుండడంతో బినోద్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఏ ప్రభుత్వమైనా పెట్టుబడులకు అనుకూలంగా ఉండాలని, సంపద సృష్టి, ఆంత్రప్రెన్యూర్షిప్ను ప్రోత్సహించాలని తెలిపారు.ఇదీ చదవండి: ప్రపంచంలోనే అధిక బంగారు నిల్వలున్న దేశాలుటాటా, బచ్చన్‌లే ఆదర్శంబాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, దివంగత పారిశ్రామికవేత్త జేఆర్డీ టాటా ఇద్దరు ప్రముఖులను బినోద్ ఆదర్శంగా తీసుకుంటారని చెప్పారు. అమితాబ్ బచ్చన్ తీవ్ర సంక్షోభంలో కూడా తననుతాను ఎలా మోటివేట్ చేసుకున్నారో నిత్యం గుర్తు చేసుకుంటానని తెలిపారు. మరోవైపు భారత్ ఎన్నో వ్యాపారాలు ప్రారంభించిన జేఆర్డీ టాటా దార్శనిక నాయకత్వం, నైతిక వ్యాపార విధానాలను తాను ఆదర్శంగా తీసుకుంటానని పేర్కొన్నారు. -
భారీ వేతనమిచ్చే ఉద్యోగాన్ని వదిలేసి.. ఐపీఎస్ అయ్యిందిలా!
అదృష్టాన్ని నమ్ముకుంటే కలలు సాకారం కావు. కృషి, పట్టుదల ఉంటేనే ఏదైనా సాధించవచ్చు. విజయం సాధించాలనే సంకల్పం ఉంటే సరిపోదు.. ఎన్ని కష్టాలైనా, నష్టాలైనా ఓపికతో కృషి చేయాలి. అలా ఆత్మవిశ్వసంతో విజయ తీరాలకు చేరుకున్న స్ఫూర్తిదాతలెందరో ఉన్నారు. అలా తన జీవితంలో ఒక బిగ్ డ్రీమ్ కోసం ఎవరూ ఊహించని విధంగా సాహసోపేతంగా ప్రతిభను చాటుకున్న ఒక ధీర గురించి తెలుసు కుందాం రండి..!ఆమె పేరే పూజా యాదవ్. హర్యానాకు చెందిన పూజా పట్టుదలగా ఎదిగి ఐపీఎస్ ఆఫీసర్ స్థాయికి ఎదిగింది. 1998లో హర్యానాలోని సోనిపట్‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆమె సోనిపట్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. బయోటెక్నాలజీలో బీటెక్, జీ, ఫుడ్ టెక్నాలజీలో ఎంటెక్ పూర్తి చేసింది. అందివచ్చిన అవకాశాలతో కెనడా, జర్మనీలో మంచి వేతనంతో ఉద్యోగాలు చేశారు. కుటుంబ పరిస్థితి గురించి ఆలోచించి ఉద్యోగం చేయాల్చి వచ్చినా, ఐపీఎస్(IPS) అవ్వాలనే ఆశయం మాత్రం నిరంతరం పూజా మదిలో మెదులుతూనే ఉంది. దీనికితోడు దేశాభివృద్ధికి తోడ్పడాలనే బలమైన కోరిక ఉంది. మొదటి నుంచీ, ఆమె తన దేశానికి సేవచేయాలని కోరిక సివిల్ సర్వీసెస్ పరీక్షకు (UPSC వైపు నడిపించింది. అంతే వన్ ఫైన్‌మార్నింగ్ కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఉద్యోగం వదిలేసి భారత దేశానికి తిరిగి వచ్చింది. సివిల్స్ ప్రిపరేషన్ (మొదలు పెట్టింది. కానీ ఇది ఆమె అనుకున్నంత సులువుగా సాగలేదు. ఒకవైపు పూజా కుటుంబం ఆర్థిక పరిస్థితి, మరోవైపు చదువుకి అయ్యే ఖర్చులు ఇలా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే ఐపీఎస్ కావాలనే నిర్ణయానికి కుటుంబంలో అందరూ తోడుగా నిలిచారు.ఇదీ చదవండి: నీతా అంబానీకి ముఖేష్ అంబానీ సర్ప్రైజ్ గిప్ట్రిసెప్షనిస్టుగా పనిచేస్తూనే,ఒకవైపు సిపిల్స్కు ప్రిపేర్ అవుతూనే,తన ఆర్థిక అవసరాల నిమిత్తం పిల్లలకు ట్యూషన్లు చెప్పింది. దీంతోపాటు రిసెప్షనిస్టుగా పనిచేస్తూ, పరీక్షలకు ప్రిపేర్ అయింది. తొలి ప్రయత్నం విఫలమైంది. అయినా పట్టువీడలేదు. నిరాశపడకుంగా, ఏకాగ్రతతో తపస్సులా చేసింది. చివరికి ఆమె కష్టం వృధా పోలేదు.సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఇండియన్ పోలీస్ సర్వీస్‌లో చేరడం ద్వారా పౌరుల జీవితాలపై ప్రభావాన్ని చూపిస్తోంది. 2018 కేడర్‌లో IPSగా నియమితురాలు కావడం తన జీవితంలో మర్చిపోలేని రోజని సంతోషంగా చెప్పింది పూజా. 2021లో స్నేహితుడు వికల్ప్ భరద్వాజ్‌ను ముస్సోరీలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడెమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో సాగిన పరిచయం పెళ్లికి దారి తీసింది. ప్రస్తుతం గుజరాత్ ట్రాఫిక్ డీసీపీగా పనిచేస్తున్నారు. వృత్తిబాధ్యలతోపాటు, పూజ యాదవ్, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆమె ఇన్స్టాగ్రామ్ పేజీలో 3.28 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ప్రజలతో కమ్యూనికేట్ అవ్వడానికి సోషల్ మీడియాను మించినది లేదు అని నమ్మేవారిలో పూజా యాదవ్ ఒకరు. చదవండి: Maha Kumbh Mela అద్భుతమైన అనుభవం: నీనా గుప్తా ప్రశంసలు -
నాడు నెలకు 10 వేలు.. నేడు లక్షలు.. సందీప్ జీవితం మారిందిలా..
ఉద్యోగం కన్నా ఉపాధి మార్గం ఉత్తమం అని కొందరు అంటుంటారు. ఈ దిశగా పయనిస్తూ చాలామంది విజయం సాధించారు. ఇదే తరహాలో ముందడుగు వేసిన ఒక యువకుడు అందరూ మెచ్చుకునే స్థాయికి ఎదిగాడు. అందరికి స్ఫూర్తిని అందిస్తున్నాడు. మరి ఆ యువకుడు ఎవరో ఏం సాధించాడో ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో ఇటీవలి కాలంలో పర్యాటకరంగ వ్యాపారం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో చాలామందికి ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ జాబితాలో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచిందని చెబుతుంటారు. పర్యాటకరంగం అభివృద్ధి కారణంగా గుజరాత్‌లోని యువత నూతన స్టార్టప్(New startup)లతో జీవనోపాధి పొందుతున్నారు. అలాంటివాటిలో ఒకటే టాక్సీ సర్వీస్ నిర్వహణ.కుటుంబంతో సహా ఎక్కడికైనా వెళ్లాలనుకునేవారు టాక్సీ ప్రయాణానికి ప్రాధాన్యతనిస్తుంటారు. టాక్సీ బుక్ చేసుకుని పర్యాటక ప్రదేశాల్లో విహరిస్తుంటారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఒక గ్యారేజీలో పనిచేసే సందీప్ ప్రజాపతి ట్యాక్సీ సర్వీస్ ప్రారంభించాడు. అతనుంటున్న ప్రాంతానికి సమీపంలోని ద్వారకతో పాటు శివరాజ్‌పూర్ బీచ్, సుదర్శన్ సేతు, హర్షద్ అండ్ భన్వాడ్ తదితర పర్యాటక ప్రదేశాలకు(tourist places) ట్యాక్సీని నడపడం ప్రారంభించాడు. దీనికి అనతి కాలంలోనే పరిమితమైన ఆదరణ దక్కింది.సందీప్ ప్రజాపతి గుజరాత్(Gujarat)లో పర్యాటక ప్రదేశాల అభివృద్ధి, పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాల గురించి అధ్యయనం చేశాడు. ‘ఖుషి క్యాబ్’ పేరుతో టాక్సీ సర్వీస్ మొదలుపెట్టాడు. మెల్లమెల్లగా అతని వ్యాపారం(Business) అభివృద్ధి చెందింది. ప్రస్తుతం నాలుగు ట్యాక్సీలు, ఎనిమిది మంది డ్రైవర్లతో సందీప్ ప్రజాపతి వ్యాపారం అందరూ మెచ్చుకునేలా నడుస్తోంది. తన కార్లకోసం గ్యారేజీని ఏర్పాటు చేసిన సందీప్ ఇద్దరు వర్కర్లను కూడా నియమించుకున్నాడు. కిలోమీటరుకు రూ. 10 నుండి రూ. 15 వరకూ ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నాడు. గతంలో మెకానిక్‌గా పనిచేస్తూ నెలకు రూ. 10 వేలు సంపాదించే సందీప్ నేడు లక్షల్లో ఆదాయాన్ని అందుకుంటున్నాడు.ఇది కూడా చదవండి: కుంభమేళా నుంచి అయోధ్యకు జనప్రవాహం -
ఫ్యాషన్‌తో కల సాకారం చేసుకున్న తాన్యా
అప్పటి వరకు అమ్మనాన్న, కుటుంబ సంరక్షణలో సాఫీగా సాగిపోయే జీవితం ఒక్కసారిగా తలకిందులైతే..! 16 ఏళ్ళ వయసులో తాన్యా జీవితం అలాగే అయ్యింది. తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం, తండ్రి వదిలేసి వెళ్లటంతో తల్లి దేవేశ్వరి నాయల్ తాన్యాను, ఆమె తమ్ముడిని పెంచటానికి అనేక ఆర్థికపరమైన సవాళ్ళను ఎదుర్కొంది. ఆ సమయంలో కూలిపోతున్న కలల ప్రపంచాన్ని నిర్మించుకోవడానికి తాన్యా తల్లికి చేదోడుగా ఉండి, తను కూడా సొంతకాళ్లపై నిలబడింది. ఫ్యాషన్ డిజైనర్‌గా, విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగింది.జీవితంలోని ఏదో ఒక దశలో చీకటి క్షణాలు కమ్ముకుంటాయి. ఇలాంటప్పుడు కూడగట్టుకున్న ధైర్యం నిలిచిన విధానం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. తనను తాను నిలదొక్కుకోవడమే కాకుండా తల్లికి చేదోడుగా ఉంటూ ఎదిగిన తాన్యా యువతకు స్ఫూర్తిగా నిలిచే ఓ పాఠం.ముంచెత్తే సవాళ్లుపదహారేళ్ల వయసు అంటే ఎన్నో కలలతో కూడుకున్నది. కుటుంబం నుంచి భద్రతను కోరుకునే కాలం. అలాంటి సమయంలో ఇల్లు అభద్రతలో కూరుకు΄ోయింది. వయసులో ఉండటం కారణంగా చుట్టూ నిండా ముంచెత్తే సవాళ్లను ఎదుర్కొంది. అయినప్పటికీ జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం, అచంచలమైన స్ఫూర్తితో, ఆమె తన పరిస్థితుల సంక్లిష్టతలను బ్యాలెన్స్ చేసుకోగలిగింది. సరైన చదువు లేకపోవడంతో తగిన ఉపాధి దొరకక దేవేశ్వరినాయల్ చాలా కష్టపడేది. దీంతో కుటుంబ ఆర్థిక ఒత్తిడి ఆమె తట్టుకోలేకపోయేది. ఈ క్లిష్ట సమయంలో తాన్య ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సును అభ్యసిస్తూనే చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్పే బాధ్యతను తీసుకుంది. ఇంతలో, కొత్త అవకాశాల కోసం తమ ఇంటిని వదిలిపెట్టారు. తాన్య నాటి రోజులను గుర్తుచేసుకుంటూ–‘పరిచయస్తుల ద్వారా మా అమ్మతో కలిసి రాష్ట్ర దూరదర్శన్ కేంద్రానికి చేరుకున్నాను. అక్కడ, గిరిజనుల దుస్తులను డిజైన్ చేయడానికి నాకు ఆఫర్ వచ్చింది. అప్పటి సెంటర్ డైరెక్టర్ అనుపమ్ జైన్, ఆమె తల్లి మధ్య జరిగిన సంభాషణలో నాకో మార్గం కనిపించింది. దూరదర్శన్ సిబ్బందికి ఒక సాధారణ టిఫిన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని జైన్ మాతో చెప్పింది. ఇది మా జీవితాలకు ఒక మలుపుగా మారింది’ అంటుంది తాన్యా.అంకిత భావందేవేశ్వరి గర్వాలీ, హిందీ భాష రెండింటిలోనూ నిష్ణాతులు. ఆమె భాషా ప్రావీణ్యం దూరదర్శన్ లోని ఒక అధికారి దృష్టిని ఆకర్షించింది. మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన అనేక మంది స్థానిక కళాకారులు హిందీ రాకపోవడంతో ఇబ్బంది పడుతుండేవారు. వారి ఆలోచనలను హిందీలోకి అనువదించడం ద్వారా దేవేశ్వరి భాషా అంతరాన్ని తగ్గించేవారు. అలా దేవేశ్వరి, తాన్య స్థిరమైన ఆదాయం పొందడం అక్కడ నుంచే మొదలైంది. తాన్య అంకితభావం, నైపుణ్యం దూరదర్శన్ కేంద్రంలో కళాకారుల కోసం దుస్తులను రూపొందించే అవకాశాన్ని కూడా సంపాదించిపెట్టింది. కుటుంబం ప్రధాన జీవనోపాధిగా ఆమె పాత్రను మరింత పటిష్టం చేసింది. ఎంతోమందికి ఇబ్బంది అనిపించే బాధ్యతను తాన్యా అతి చిన్న వయసులోనే అలా తీసుకుంది. (కీర్తి సురేష్ మెహిందీ లెహెంగా విశేషాలు, ఫోటోలు వైరల్)సామాజికంగా ఉన్నతంగా!చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నప్పుడు, దేవేశ్వరి గుండెలో ఆమె మాజీ భర్త పట్ల ద్వేషం ఉండేది. ఆమె తన గౌరవాన్ని తిరిగి పొందాలని చదువుతో తన పిల్లలను ఉన్నత స్థాయికి తీసుకురావాలనుకుంది. నిశ్శబ్ద ప్రతీకారంతోనే సామాజికంగా ఉన్నతంగా నిలబడాలని ఆశించింది. వివిధ మార్గాల్లో ఆదాయ వనరులతో ఆమె తాన్య, తరుణ్‌ను మర్చంట్ నేవీలోకి పంపగలిగింది. పోరాటం నుండి విజయం వరకు తాన్య ప్రయాణం అనేక మైలురాళ్లతో సాగింది. వాటిలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఆమె పేరు పొందుపరచడం. (Paris Fashion Week 2025 : అపుడు మంటల్లో.. ఇపుడు దేవతలా ర్యాంప్ వాక్!)నేడు, తాన్య తన స్వంత సంస్థ అయిన ‘తంతి’ వ్యవస్థాపకురాలు. ఈ పదం సంస్కృతం నుండి తీసుకున్నది. ఒక చిన్న వెంచర్‌గా ప్రారంభమైన ‘తంతి’ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న వ్యాపారం. డిజైనర్లు, టైలర్లు, మహిళలతో సహా 53 మందికి వ్యాపారం ద్వారా ఉపాధి కల్పిస్తోంది. ఉత్తరాఖండ్‌లో తాన్యా నాయల్ పేరు ఇప్పుడు పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఆ పేరు ఒక్కటి చాలు, ఆమె స్థాయి ఏంటో ఇట్టే చెప్పేస్తారు. -
యువ డిజైనర్‌గా రాణిస్తున్న ముప్పిడి రాంబాబు
కష్టే ఫలి.. కృషి ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపిత మైన సత్యం. చిన్న తనం నుంచే అదే సూత్రాన్ని తూచ తప్పకుండా పాటిస్తూ.. కష్టపడి పనిచేయడానికి అలవాటుపడి యువడిజైనర్గా డాక్టర్ ముప్పిడి రాంబాబు గుర్తింపు సాధించాడు. బొమ్మల తయారీలో కళాకారుడు తన కళకు నైపుణ్యాన్ని జతచేసి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. అంతే కాకుండా శిల్పకారుడు, రచయిత, అధ్యాపకుడుగానూ పనిచేస్తున్నాడు. శిల్పకారుల కుటుంబానికి చెందిన ముప్పిడి చెక్క, తాటి ఆకు, జనపనార, రాతి ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అనేక కళాకృతులను రూపొందించడంలో దిట్టగా పేరొందారు. ప్రస్తుతం రాయదుర్గంలోని ఎఫ్‌డీడీఐ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఆర్ట్, క్రాఫ్ట్, డిజైన్ ప్రొడక్ట్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్కిటెక్చర్‌గా గుర్తింపు సాధించారు. – రాయదుర్గంపేద కళాకారుల ఆర్థికాభివృద్ధికి.. పేటెంట్ పొందిన డిజైన్లను పేద కళాకారుల ఆర్థికాభివృద్ధికి చేయూతను అందించాలనేదే నా తపన. మాది కళాకారుల కుటుంబం. కళాకారుల పరిస్థితులు నాకు బాగా తెలుసు. పేటెంట్ పొందిన డిజైన్లు ఉచితంగానే అందిస్తా. వాటి తయారీ గురించి వివరిస్తాను. నిర్మల్, కొండపల్లి బొమ్మల తయారీ దారులు కూడా నూతన డిజైన్లలో బొమ్మలు తయారు చేసేలా తగిన సూచనలు అందించాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నా.. – డాక్టర్ ముప్పిడి రాంబాబు, ఎఫ్‌డీడీఐ ఫ్యాకల్టీ రాయదుర్గం మంజూరైన పేటెంట్స్.. 2025లో టేబుల్‌టాప్ ఆర్టిక్రాఫ్ట్స్, ఫిల్లింగ్ 2024లో లెదర్, వుడ్బర్డ్ టాయ్, ఫిల్లింగ్, వుడ్ పెన్‌స్టాండ్, ఫిల్లింగ్, డాల్, లెదర్ వాల్ హ్యాంగింగ్, న్యూస్‌పేపర్ బాస్కెట్, డెకరేటివ్ యాక్సెసరీస్ ఫర్ టేబుల్‌టాప్ టాయ్స్, ట్రెక్కింగ్ బ్యాక్‌ప్యాక్, జ్యువెలరీ బాక్స్కేస్. పీహెచ్డీ పూర్తి చేసి.. ఆంధ్రప్రదేశ్‌లోని జంగారెడ్డిగూడెంలో నిరుపేద కళాకారుల కుటుంబంలో పుట్టి ఉన్నత విద్యను అభ్యసించారు. మొదటి, రెండో తరాలకు చదువులేదు. కానీ మూడో తరం వారు జీవనోపాధి కోసం చేతి వృత్తులు చేస్తున్నా, తండ్రి సూచన మేరకు పీహెచ్డీ పూర్తి చేశారు. రచయిత, కళాకారుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్, హెచ్ఓడీ, అకడమిక్ కన్సల్టెంట్, జూట్బోర్డు ప్యానెల్ డిజైనర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ వంటి ఉద్యోగాలు చేశారు. కేంద్ర జూట్ బోర్డులో జైనర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం ఎఫ్‌డీడీఐలో ఫ్యాకల్టీగా చేస్తున్నాడు. అవార్డులు, పురస్కారాలు.. 2024లో పీహెచ్‌డీలో గోల్డ్‌మెడల్ (పోట్టి శ్రీరాములు తెలుగు వర్శిటీ) 2023లో పికాక్ అవార్డు (తిరుపతి ఆర్ట్ సొసైటీ, ఎక్స్‌లెన్స్ ఇన్ రివ్యూ అవార్డు) 2018 జాతీయ సంజీవ్‌దేవ్ అవార్డు2017లో ప్రమోద్ కుమార్ చటర్జీ జాతీయ అవార్డు 2016లో విశిష్ట కళా సేవారత్న, రోటరీ యువజన అవార్డు, గురుబ్రహ్మ అవార్డు.వీటితో పాటు మరికొన్ని అవార్డులు.. పేటెంట్ల సాధనలో తనకంటూ ప్రత్యేకత సాధించిన ఎఫ్‌డీడీఐ ఫ్యాకల్టీ డాక్టర్ రాంబాబు -
హోటల్లో అంట్లు కడిగాడు,ఆత్మహత్యాయత్నం..కట్ చేస్తే.. రూ 500 కోట్లు
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రిటైలర్, నగల డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా టాప్ డిజైనర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన ఈసక్సెస్ అంత ఈజీగారాలేదు. సామాన్య నేపథ్యంనుంచి వచ్చి గ్లోబల్ ఐకాన్‌గా ఎదగడానికి చాలా కష్టాలుపడాల్సి వచ్చింది. విపరీతమైన డిప్రెషన్, ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తన సోదరి నుంచి 20వేల రూపాయల అప్పుగా తీసుకొని ప్రారంభించిన ప్రయాణం పాతికేళ్ల తరువాత నేడు రూ. 500కోట్లకు చేరింది. సబ్యసాచి అసలు ఎక్కడివాడు, ఆయన కరీర్ మొదలైన విషయాల గురించి తెలుసుకుందాం రండి!సబ్యసాచి 1974లో ఒక మధ్యతరగతి బెంగాలీ కుటుంబంలో జన్మించాడు.తల్లిదండ్రులు బంగ్లాదేశీయులు. అతని తండ్రి బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి శరణార్థిగా వలస వచ్చారు. తండ్రి ఉన్ని మిల్లులో ఉద్యోగం కోల్పోవడంతో కుటుంబం కష్టాల్లో పడింది. అపుడు 15 ఏళ్ల వయస్సులో గోవాకు పారిపోయాడు సబ్యసాచి. అక్కడ వెయిటర్‌గా పనిచేశాడు ,గిన్నెలు కడిగాడు. అప్పుడే డిజైనర్ కావాలనే కల కన్నాడు. ఇందుకోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT)చదువు కోవాలనుకున్నాడు. కానీ అడ్మిషన్‌కు డబ్బులు లేవన్నారు. అయినా పట్టువీడలేదు. ఎలాగో అలా కష్టపడి అడ్మిషన్ తీసుకున్నాడు. 1999లో అహ్మదాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఇండియాస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుండి పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత కొన్ని నెలల తర్వాత కేవలం ముగ్గురు సిబ్బందితో కోల్‌కతాలో తొలి స్టూడియోను ప్రారంభించాడు. అలా తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాడు. అదీ సోదరి దగ్గర 20 వేల రూపాయలను అప్పుగా తీసుకొని మరీ. అలా ప్రస్థానం పాకిస్తాన్ ,యుఎఇ, ఇటలీ , దుబాయ్ ఫ్యాషన్ ప్రియులు ఇష్టపడే తొలి భారత గ్లోబల్ బ్రాండ్ ప్రస్తానానికి పునాది పడింది. ఇక అప్పటినుంచి అన్నీ అవార్డులు, రివార్డులు, ప్రశంసలే తప్ప వెనక్కి తీరిగి చూసింది లేదు.రేయింబవళ్లు కష్టపడి 2002లో లక్మే ఫ్యాషన్ వీక్‌లో తన తొలి కలెక్షన్‌ను ప్రదర్శించి, ఫ్యాషన్ మాస్ట్రోగా మారారు సబ్యసాచి ముఖర్జీ. సింగపూర్‌లో జరిగిన మెర్సిడెస్-బెంజ్ న్యూ ఆసియా ఫ్యాషన్ వీక్‌లో తొలి అంతర్జాతీయ అవార్డు (గ్రాండ్ విన్నర్ అవార్డు) గెలుచుకున్నాడు.డిప్రెషన్, ఆత్మహత్యాయత్నంతాను యుక్తవయసులో డిప్రెషన్‌కు గురయ్యానని, ఆత్మహత్య చేసుకునేందుకు కూడా ప్రయత్నించి విఫలమయ్యాడు.తీవ్రమైన నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యకు కూడా ప్రయత్నించానని ఒక సందర్భంగా సబ్యసాచి వెల్లడించాడు. “నేను నిరాశకు లోనయ్యాను మరియు ఆత్మహత్యకు ప్రయత్నించాను. నేను అపస్మారక స్థితిలో ఉన్నాను. అమ్మ చెంపదెబ్బ కొట్టింది. జలుబు ఎంత సాధారణమో డిప్రెషన్ కూడా అంతే సాధారణం. మీరు డిప్రెషన్లో లేకుంటే, మీరు మామూలుగా లేరు అని అర్థం” అంటూ తన జర్నీని వివరించారు. అంతేకాదు తాను నిరాశను ఎదుర్కోకపోతే, ఫ్యాషన్ దిగ్గజంగా మారడానికి బదులుగా, వేరే కెరీర్ మార్గాన్ని అనుసరించేవాడినని పేర్కొన్నాడు. బహుశా శాన్ ఫ్రాన్సిస్కోలోని గూగుల్ వంటి కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడినని చెప్పుకొచ్చాడు. చదవండి: పదేళ్ల తరువాత తొలిసారి : తన బాడీ చూసి మురిసిపోతున్న పాప్ సింగర్సబ్యసాచి ముఖర్జీ కెరీర్ మైలు రాళ్లుసబ్యసాచి ముఖర్జీ 2001లో ఫెమినా బ్రిటీష్ కౌన్సిల్ యొక్క మోస్ట్ ఔట్‌స్టాండింగ్ యంగ్ డిజైనర్ ఆఫ్ ఇండియా అవార్డుఅసాధారణ డిజైనర్ జార్జినా వాన్ ఎట్జ్డోర్ఫ్తో ఇంటర్న్‌షిప్ కోసం లండన్. 2002లో ఇండియన్ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్న తర్వాత చాలా మీడియా దృష్టిని ఆకర్షించారు. 2003లో తొలి విదేశీ "గ్రాండ్ విన్నర్ అవార్డ్" గెలుచుకున్న తరువాత పారిస్‌లో జీన్-పాల్ గౌల్టియర్ , అజెడిన్ అలైతో వర్క్‌షాప్‌కు దారితీసింది.2004లో మయామి ఫ్యాషన్ వీక్‌లో ‘ ది ఫ్రాగ్ ప్రిన్సెస్ కలెక్షన్,’, భారతీయ వస్త్ర సౌందర్యం ప్రపంచానికి మరింత బాగా తెలిసి వచ్చింది.బ్లాక్ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా జాతీయ అవార్డుప్రపంచవ్యాప్త గుర్తింపు2005లో ది నాయర్ సిస్టర్స్‌ను ప్రారంభించాడు. హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్, ఎంబ్రాయిడరీలు, బగ్రూ లాంటి కలెప్రేరణ పొందిన వసంత-వేసవి సేకరణ. అతని క్రియేషన్స్ ప్రసిద్ధ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వార్షిక బ్లాక్-టై ఛారిటీ డిన్నర్ ఫ్యాషన్ షోలో ప్రదర్శించడానికి ఆహ్వానం2006లో న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో సబ్యసాచి ప్రారంభ స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్ 07 విమర్శకుల ప్రశంసలు అందుకుంది. న్యూయార్క్, మిలన్ మరియు లండన్ అనే మూడు ప్రధాన ఫ్యాషన్ వారాల్లో పాల్గొన్న తొలి భారతీయ ఫ్యాషన్ డిజైనర్.సబ్యసాచి న్యూయార్క్ ,లండన్ ఫ్యాషన్ వీక్స్, అలాగే బ్రైడల్ ఆసియా 2007, లాక్మే ఇండియా ఫ్యాషన్ వీక్ , 2007లో భారతదేశంలో జరిగిన వోగ్ లాంచ్‌లకు హాజరయ్యాడు. 2008లో నగల కలెక్షన్కూడా షురూ చేశాడు. GAJA బ్రాండ్ సహకారంతో 2016 వోగ్ వెడ్డింగ్ షోలో ప్రారంభమైంది. బాలీవుడ్ నటి నేహా ధూపియాతో 2012లో ఒక క్యాలెండర్‌ను రూపొందించారు, ఆ తరువాతఫ్రెంచ్ లగ్జరీ పాదరక్షలు మరియు దుస్తులు డిజైనర్ క్రిస్టియన్ లౌబౌటిన్తో భాగస్వామిగా పనిచేశాడు.బ్రైడల్ కలెక్షన్‌తో పాపులర్2007లో తన తొలి బ్రైడల్ కలెక్షన్‌ను ఆవిష్కరించాడు,యు తన డిజైన్లతో వివాహ పరిశ్రమలో ఒక సంచలనం సృష్టించాడు. భారతీయ సంప్రదాయ వస్త్రాలు, చేనేత, చేతితో తయారు చేసిన తనదైన శైలితో డిజైనర్ వెడ్డింగ్ దుస్తులకు పేరుగాంచాడు.హై-ఎండ్ లగ్జరీ ఇండియన్ టెక్స్‌టైల్స్‌ను ఉపయోగించిన తొలివ్యక్గాపేరుతెచ్చకున్నాడు. బంధాని, గోటా వర్క్, బ్లాక్-ప్రింటింగ్ , హ్యాండ్-డైయింగ్ లాంటి వర్క్స్‌తో ట్రెండ్ క్రియేట్ చేశాడు.బాలీవుడ్ సినిమాలకుసబ్యసాచి సంజయ్ లీలా బన్సాలీ చిత్రం బ్లాక్‌కి కాస్ట్యూమ్ డిజైనర్‌గా అరంగేట్రం చేశారు. 2005లో ఒక ఫీచర్ ఫిల్మ్‌కి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా జాతీయ అవార్డుతో సహా చిత్రానికి చాలా ప్రశంసలు అందుకున్నాడు. బాబుల్,లాగ చునారి మే దాగ్,రావణ్, గుజారిష్, పా,నో వన్ కిల్డ్ జెస్సికా,ఇంగ్లీష్ వింగ్లీష్,బ్లాక్ లాంటి అనేక సినిమాలకు కాస్ట్యూమ్ డిజైన్స్ అందించారు.ప్రముఖుల వివాహాలు నటి విద్యాబాలన్ ,అనుష్క శర్మ , విరాట్ కోహ్లీ, దీపికా పదుకొణె, రణవీర్ సింగ్, నిక్ జోనాస్ , ప్రియాంక, అలియా పీవీ సింధు వివాహ దుస్తులను సబ్యసాచి డిజైన్ చేశారు. ఇంకా శ్రీదేవి, కత్రినా కైఫ్, టబు, షబానా అజ్మీ, ఐశ్వర్య రాయ్ బచ్చన్,శ్రద్ధా కపూర్, సుస్మితా సేన్, కరీనా, నీతా అంబానీ, శ్లోకా, ఇషా, రాధిక అంబానీ సహసబ్యసాచి సెలబ్రిటీ క్లయింట్లే కావడం విశేషం. 25 సంవత్సరాల కృషి తర్వాత, సబ్యసాచి ముఖర్జీ బ్రాండ్ రూ. 500 కోట్ల విలువకు చేరింది. ఈ ఘనతను సాధించిన భారతదేశపు మొట్టమొదటి గ్లోబల్ బ్రాండ్‌గా ఎదిగింది. -
ఒడిశా నుంచి దుబాయ్: సక్సెస్ కోసం 17 ఏళ్ళు
కష్టాల సుడిగుండాలు దాటి.. సక్సెస్ సాధించిన వాళ్ళు ఎందరో. అలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు ఒడిశాలోని రూర్కెలాకు చెందిన 'సౌమేంద్ర జెన' (Soumendra Jena). ఓ చిన్న ఇంట్లో జీవితాన్ని ప్రారంభించిన ఈయన ఇప్పుడు దుబాయ్‌లో విలాసవంతమైన భవనం, పోర్స్చే టైకాన్, జీ వ్యాగన్ బ్రబస్ 800 వంటి ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు. ఇటీవల తన స్ఫూర్తిదాయకమైన విజయగాథను పంచుకోవడానికి ఫోటోలను షేర్ చేశారు.సౌమేంద్ర జెన తన ఎక్స్ ఖాతాలో రెండు ఫోటోలను షేర్ చేశారు. ఒక ఫొటోలో చిన్న ఇల్లు, మరో ఫోటోలో విలాసవంతమైన ఇల్లు, దాని ముందర ఖరీదైన కార్లు ఉన్నాయి. అప్పట్లో ఇది నా ఇల్లు. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. 12వ తరగతి వరకు (1988 నుంచి 2006 వరకు) ఇక్కడే చదువుకున్నాను. నా జ్ఞాపకాల కోసం మళ్ళీ 2021లో ఇక్కడికి వచ్చాను.ఇప్పుడు దుబాయ్‌లో నాకు విలాసవంతమైన ఇల్లు ఉంది. కార్లు ఉన్నాయి. ఇదంతా.. నా 17 సంవత్సరాల శ్రమ, నిద్రలేని రాత్రులు వల్లనే సాధ్యమైందని చెప్పుకొచ్చాడు. విజయం సాధించడనికి సమయం పడుతుంది. దీనికి ఎలాంటి షార్ట్కట్లు లేవు అని అన్నారు.సోషల్ మీడియాలో సౌమేంద్ర జెనా చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు దీనిపై తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. 17 ఏళ్లలో మీరు ఏమి చేశారో నేను తెలుసుకోవచ్చా? ఎందుకంటే నేను చాలా కష్టపడుతున్నాను, కానీ ఇప్పుడు నేను నా కోసం ఇల్లు నిర్మించుకోలేకపోతున్నానని ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరు, విజయానికి సమయం, కృషి, అదృష్టం, సహాయం అన్నీ అవసరం. నువ్వు దుబాయ్‌లో ఉన్నావు. అదే ఒడిశాలో ఉండి ఉంటే ఇలా సక్సెస్ సాధించడం కష్టమయ్యేదని అన్నారు.ఇదీ చదవండి: కొత్త కారు కొంటున్నారా?: ఇలా చేస్తే.. ట్యాక్స్‌లో 50 శాతం తగ్గింపుసౌమేంద్ర జెన ఫైనాన్స్ సెక్టార్లో ఒక ప్రముఖ కంటెంట్ క్రియేటర్‌గా స్థిరపడ్డారు. ప్రస్తుతం ఇతనికి ఇన్‌స్టాగ్రామ్‌లో 3,00,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్‌లో 4,87,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారానే ఆర్ధికపరమైన విషయాలను, పెట్టుబడికి సంబంధించిన సలహాలను ఇస్తూ ఉంటాడు.This was my home back then—a small town in Odisha, Rourkela, where I was born, grew up, and studied till class 12 (1988-2006). Revisited in 2021 for the memories!Today, my home in Dubai tells the story of 17 years of relentless hard work, sleepless nights, and no shortcuts.… pic.twitter.com/nw5tCdtwKE— Soumendra Jena (@soamjena) January 24, 2025 -
రూ. కోటి జాబ్ కాదని..తొలి ప్రయత్నంలోనే సివిల్స్ : తండ్రి భావోద్వేగ క్షణాల్లో
ప్రతిష్టాత్మక యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ( UPSC ) పరీక్షలో విజయం సాధించడం అంటే సాధారణ విషయంకాదు. దానికి కఠోర సాధన పట్టుదల ఉండాలి. ఈవిషయంలో రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి కనిషక్ కటారియా కథ చాలా స్ఫూర్తివంతంగా నిలుస్తుంది.కోటి రూపాయల జీతం ఇచ్చే ఉద్యోగ ఆఫర్‌ను కాదని తన తొలి ప్రయత్నంలోనే 2018 UPSC పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) 1ని సాధించాడు. ఈ ప్రయాణంలో మరో విశేషం కూడా ఉంది అదేంటో తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. (పాలక్ పనీర్, పనీర్ బటర్ మసాలా : రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ అదుర్స్!)ప్రతి ఏటా లక్షలాది మంది అభ్యర్థులు సివిల్స్‌కోసం ప్రిపేర్ అవుతారు. అందులో కొద్ది మంది మాత్రమే విజయం సాధిస్తారు. అలాంటి వారిలో ఒకరు రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి కనిషక్ కటారియా. ఐఐటీ బొంబాయి పూర్వ విద్యార్థి అయిన ఆయన కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ సంపాదించి తన రంగంలో అత్యుత్తమ ప్రతిభావంతుడిగా ఎదిగాడు. ఆ తరువాత దక్షిణ కొరియాలోని శామ్సంగ్ కంపెనీలో సంవత్సరానికి కోటి రూపాయల జీతంతో ఉద్యోగ ఆఫర్ కూడా వచ్చింది. అయితే, వ్యక్తిగత లాభాల కంటే దేశానికి సేవ చేయాలనే కోరిక అతనిలో బాగా నాటుకుపోయింది. అందుకే ఆ ఆఫర్‌ను మరీ తన కలలసాకారంకోసం పరీక్షకు సిద్ధం అయ్యాడు.ఇదీ చదవండి: అందం, ఆరోగ్యమే కాదు, బరువు తగ్గడంలో కూడా ‘గేమ్ ఛేంజర్’ ఇది!దృఢ సంకల్పం, క్రమశిక్షణతో కూడిన అతని ప్రయత్నం వృధాకాలేదు. 2018లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ విజయంలో తన కృషి, పట్టుదలతోపాటు, కుటుంబ మద్దతు సహకారం చాలా ఉందని చెబుతాడు ఆనందంగా కనిషక్. స్పష్టమైన లక్ష్యం, సానుకూల మనస్తత్వంతో ఎలాంటి సవాళ్లనైనా అధిగమించివచ్చని నిరూపించాడు. తనలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు.మరోవిశేషం.. కుటుంబానికి గర్వకారణమైన క్షణాలు కనిషక్ విజయగాథలో మరో ఆసక్తికర విషయం గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. 2024 సెప్టెంబర్ 30ప రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో డివిజనల్ కమిషనర్‌గా పదవీ విరమణ చేశాడు కనిషక్ తండ్రి సన్వర్ మల్ వర్మ. తండ్రి రాజీనామా ఉత్తర్వులపై సంతకం చేసింది మాత్రం కనిషక్. ఈ ప్రత్యేకమైన క్షణాలు ఆ కుటుంబానికి గర్వించ దగ్గ క్షణాలుగామారాయి. అంతేకాదు. కుటుంబం అందించిన సేవ ,అంకితభాం మరింత ప్రత్యేకంగా నిలిచింది.వ్యక్తిగత శ్రేయస్సు, సంపద కంటే సేవకు ప్రాధాన్యత ఇవ్వాలనే అతని నిర్ణయం కనిషక్ను ప్రత్యేకంగా నిలిపింది. శామ్సంగ్లో డేటా సైన్స్‌లో అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని తిరస్కరించి, సమాజంలో అర్థవంతమైన మార్పును సృష్టించాలనే కోరికతో నడిచే సివిల్ సర్వీసెస్‌లో కెరీర్‌ను ఎంచుకోవడం విశేషం. దేశంకోసం దేశసేవకోసం ఆర్థికంగా గొప్ప అవకాశాన్నిఉద్యోగాన్ని వదులుకొని, అతను భవిష్యత్ తరాలకు ఒక ఉదాహరణగా నిలిచాడు. కృషి, అంకితభావం, స్పష్టమైన దృక్పథం ఉంటే ఏ కల కూడా సాధించలేనిది లేదని మరోసారి నిరూపించాడు. -
చదివింది 10వ తరగతే..ముగ్గురు పిల్లలు : అట్టడుగు స్థాయినుంచి వ్యాపారవేత్తగా
చదివింది 10వ తరగతి మాత్రమే. పదహారేళ్లకే పెళ్లి.. ముగ్గురు పిల్లలకు తల్లి. వ్యాపార కుటుంబానికి చెందిన మహిళ కూడా కాదు.కానీ ఏదో సాధించాలనే కోరిక, తపన ఆమెను ఉన్నత స్థితిలో నిలబెట్టింది. ఆమె మరెవ్వరో కాదు అక్షయ్ కుమార్ నటించిన 'ప్యాడ్ మ్యాన్' చిత్రానికి స్ఫూర్తిగా నిలిచిన సరస్వతి. 'ప్యాడ్ ఉమెన్' గా పేరు తెచ్చుకుంది. 'లఖ్పతి దీదీ'లలో ఒకరిగా గుర్తింపు పొందారు. చేయూత నిస్తే అట్టడుగు స్థాయి సాధికారత సాధించగలరు అనడానికి నిదర్శనంగా మారింది. తక్కువ ధరకే శానిటరీ ప్యాడ్ల తయారీ యంత్రాన్ని కనుగొన్న తమిళనాడుకు చెందిన సామాజిక వ్యవస్థాపకుడు అరుణాచలం మురుగనాథంలా అవతరించి నలుగురికి స్ఫూర్తినిస్తోంది.16 ఏళ్ల వయసులోనే ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీలోని బాద్పురా గ్రామంలోకి ఒక పేద కుటుంబంలోకి కోడలిగా వెళ్లింది సరస్వతి భాటి. ఇది చాలా వెనుబడిన గ్రామం. భర్త మోను భాటి ఎలక్ట్రీషియన్. ముగ్గురు పిల్లల పెంపకంలో మునిగిపోతూనే, చుట్టుపక్కల గ్రామాల్లోని చాలా విషయాలను గమనించేది ముఖ్యంగామహిళలు శానిటరీ న్యాప్కిన్లు దొరకడం చాలా కష్టం. అస్సలు ఋతుస్రావం గురించి ప్రజలు బహిరంగంగా మాట్లాడటమే ఉండదు. ఈ పరిస్థితే ఆమెను ఆలోచించజేసింది.చిన్నప్పటినుంచి చదువుకోవడం అంటే సరస్వతికి చాలా ఇష్టం. హర్యానాలోని గ్రామాల్లో మాదిరిగానే, ఆమెపుట్టిన గ్రామంలో కూడా బాలికల విద్యకు పెద్దగా ప్రాముఖ్యతలేదు. ఈ నేపథ్యంలోనే చిన్నవయసులోనే పెళ్లీ, పిల్లలు. సంసార బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఏదైనా సాధించాలని ఆశ పడింది. 2019లో స్వయం సహాయక బృందంలో చేరాలనుకుంటే దీనికి భర్త ఒప్పుకోలేదు. ‘నేను సంపాదిస్తున్నాగా..నీకెందుకు ఇవన్నీ’ అన్నాడు. కానీ ఏదైనా చేయాలనుకుంటే.. ధైర్యంగా ముందుకు పోవాలి అన్న అమ్మమ్మ మాటలు ఆమెకు ధైర్యాన్నిచ్చాయి. మొత్తానికి 2020లో, ఆమె గ్రామంలోని సూర్యోదయ స్వయం సహాయక సంఘంలో చేరింది. ఈ అడుగే ఆమె జీవితం మలుపు తిప్పింది. .మహిళలు, బ్యాంకింగ్, ఆర్థిక స్థిరత్వం, పెట్టబడులు, వ్యాపార మెళకువలు గురించి తెలుసుకుంది.ఇంతలో లాక్డౌన్ వచ్చింది. దూకాణాలు బంద్. ఎక్కడా కూరగాయలు దొరకలేదు. ఆసమయంలో ఊరగాయలు తయారు చేసి విక్రయిస్తే బావుంటుంది కదా ఆలోచించింది. మరో పదిమంది మహిళలతో కలిసి, వెల్లుల్లి, అల్లం, మామిడి లాంటి పచ్చళ్ల తయారీని మొదలు పెట్టింది. మహిళలతో సమీపంలోని గ్రామాల్లో ప్రచారం చేసుకుంది. తొందర్లనే ఆర్డర్లు రావడం మొదలైనాయి. ఇక్కడితో ఆగిపోలేదు.ఇది ఇలా సాగుతుండగానే 2021లో సరస్వతి గ్రామంలో ఒక సౌందర్య సాధనాల దుకాణాన్ని ప్రారంభించింది. బ్రాండెడ్ శానిటరీ న్యాప్కిన్లను చాలా తక్కువ మంది మహిళలు కొనుగోలు చేస్తున్నారని గమనించింది. ఇవి ఖరీదైనవి కాబట్టి చాలా మంది మహిళలు ఇంట్లో వస్త్రాన్ని వాడతారని, శుభత్ర పాటించకపోవండం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారని, వీటి వల్ల ఇబ్బందులకు కూడా తెలుసుకుంది. దీంతో సరసమైన ధరలో, ఆరోగ్యకరమైన శానిటరీ నాప్కిన్లను తానే ఎందుకు తయారు చేయకూడదని ఆలోచించింది. ఈ ఆలోచనను వాస్తవంగా మార్చుకోవాలనే దృఢ సంకల్పంతో, ఈ దుకాణాన్ని మూసివేసి, తన కొత్త వెంచర్ పై దృష్టి పెట్టింది. ఈ ఆలోచనకు భర్త పూర్తి మద్దతు ఇవ్వడం విశేషం.మొదట్లోవాటిని కొనుగోలు చేయడానికి మహిళలు ముందుకు వచ్చేవారు. సవాలక్ష సందేహాల కారణంగా, వీరికి ఆదరణ లభించలేదు. అయితే సరస్వతి స్వయం సహాయక బృందం సభ్యులతో కలిసి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాలలో పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించేది. ఎట్టకేలకు ఆమె ప్రయత్నం ఫలించింది. పైగాఇవి ధర తక్కువ, సహజ సిద్ధమైన పదార్థాలతో తయారు చేయడం వల్ల ఆరోగ్యకరంగా ఉండటం, రాషెస్ సమస్యకూడా ఉండకపోవడంతో గిరాకీ పెరిగింది. బయటి మార్కెట్లో చిన్న ప్యాకెట్ ధర 45 రూపాయలు ఉండగా.. సరస్వతి ఆధ్వర్యంలో తయారుచేస్తున్న ప్యాకెట్ ధర 28 రూపాయలు మాత్రమే ఉండడం విశేషం. గత రెండేళ్లుగా శానిటరీ న్యాప్కిన్ల అమ్మకం నెలకు రూ. 30 వేలకి చేరుకుంది."ప్రతి ప్యాడ్ మాకు రూ. 2 ఖర్చవుతుంది, ప్యాకేజింగ్ తర్వాత, ధర రూ. 2.5. మేము ఏడు ప్యాడ్ల ప్రతి ప్యాక్‌ను రూ. 40కి అమ్ముతాము, అయితే జెల్ ఆధారిత ప్యాడ్లు రూ. 60కి అమ్ముతాము. మా ఉత్పత్తులను మార్కెట్ చేయడంలో సహాయపడిన, మాకు మరిన్ని ఆర్డర్లను తీసుకువచ్చిన NGOలతో కూడా కనెక్ట్ అయ్యాము. రాష్ట్రంలోని ఏడు నగరాలు, పంజాబ్‌లోని రెండు నగరాల నుండి కూడా ఆర్డర్లు వస్తాయి‘’ అని ఆమె గర్వంగా చెబుతుంది సరస్వతి.ఇక పచ్చళ్ల బిజినెస్ దగ్గరికి వస్తే ప్రతి నెలా, మేము కనీసం 300- 500 కిలోల ఊరగాయల ఆర్డర్లు వస్తాయి. ఇలా ఊరగాయలు ,ప్యాడ్ల అమ్మకం ద్వారా ఆమె వార్షిక టర్నోవర్ ఇప్పుడు రూ. 7 లక్షలు దాటింది. తన ఉత్పత్తులను ఆన్లైన్లో అమ్మాలనే లక్ష్యంతో ఉంది. దీనికోసం జీఎస్టీ నెంబరు, ప్యాకేజీని మరింత మెరుగుపర్చుకోని, మరిన్ని నగరాలకు తన ప్యాడ్స్ చేరేలా ముందుకు సాగుతోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఆమెలోని ప్రతిభకు పట్టుదలకు గుర్తింపు లభిచింది. "గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికైంది. దీంతో లక్నోలో డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ ఆమెను సత్కరించారు. సరస్వతి తన జీవితాన్ని మార్చుకోవడమే కాకుండా, తన సమాజంలోని అనేక మందికి స్ఫూర్తినిస్తోందని జిల్లా అభివృద్ధి అధికారి శివ్ ప్రతాప్ రమేష్ ప్రశంసించారు. -
ఐఐఎం గ్రాడ్యుయేట్ : లైఫ్‌లో రిస్క్ తీసుకుంది, నెలకు రూ.4.5 కోట్లు
జీవితంలో అనుకున్నది సాధించాలంటే పట్టుదల, కఠోర శ్రమ కచ్చితంగా ఉండాలి. జీవితంలో రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకుంటేనే సక్సెస్‌లో కిక్ ఉంటుందని నమ్మేవారు చాలామందే ఉంటారు. అలాగే ఎవరి దగ్గరో పనిచేయడం కాకుండా తమంతట తాముగా ఏదైనా చేయాలనే తపనతో ఉన్నత శిఖరాలకు చేరింది. బెంగళూరుకు చెందిన దివ్య. నెలకు వెయ్యి రూపాయల ప్యాకెట్‌మనీ కోసం కష్టపడిన ఈమె ఇపుడు నెలకు నాలుగున్నర కోట్లు ఆర్జిస్తోంది. ఎలా? తెలుసుకోవాలని ఉందా?దివ్య రావు సాధారణ మధ్య తరగతి కుటుండంలో పుట్టి పెరిగింది. కష్టపడి చదువుకుంటేనే భవిష్యత్తు బావుంటుందన్న తల్లిదండ్రుల మాటలను అక్షరాలా నమ్మింది. అచంచలమైన దృఢ సంకల్పంతో 21 సంవత్సరాల వయస్సులోనే సీఏ చదివింది. తరువాత IIM అహ్మదాబాద్‌లో ఫైనాన్స్‌లో MBA చేసింది. ఈ సమయంలో ఆర్థికంగా చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చింది. ఒక ఎగ్ పఫ్ తినడానికి కూడా ఎంతో ఆలోచించాల్సి వచ్చేది. కష్టపడి చదివి కుటుంబంలోనే సీఏ చదవిన యువతిగా పేరు తెచ్చుకుంది. అయితే నల్లేరుమీద నడకలా ఏమీ సాగలేదు. ఆర్థికంగా పలు సవాళ్లు ఎదుర్కొంది. అయినా ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది.వ్యాపారవేత్తగా ఎలా మారింది?ఐఐఎంలో చదువుకునే సమయంలోనే కొన్ని ప్రముఖ ఆహార సంస్థలు, వాటి సక్సెస్‌పై అధ్యయనం చేసింది దివ్యా. ఆ సమయంలోనే ఫుడ్ బిజినెస్ ఆలోచనకు బీజం పడింది. ముఖ్యంగా దక్షిణాది రుచుల్ని విశ్వవ్యాప్తం చేయాలన్న ఆసక్తి పెరిగింది. ఫుడ్ బిజినెస్ అంటే దివ్య తల్లి అస్సలు ఇష్టపడలేదు. 10-20 రూపాయలకు రోడ్లపై ఇడ్లీ, దోసెలు అమ్మాలనుకుంటున్నావా?" అని తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సీఏగా ఉద్యోగం మొదలు పెట్టింది. కానీ మనసంతా వ్యాపారం పైనే ఉండేది. (ముఖం చందమామలా మెరవాలంటే, ఇలాంటి తప్పులు చేయకండి!)ఆహార పరిశ్రమలో 15 ఏళ్లకుపైగా అనుభవం ఉన్న రాఘవేంద్రరావును కలిసే వరకు ఆమె ఆలోచనలకు ఒక రూపం రాలేదు. సీఏగా అతడికి పరిచయమైంది. అలా రాఘవ్‌కు ఫుడ్ బిజినెస్‌లో, ఆర్థికాంశాల్లో దివ్య అతనికి సలహాలిచ్చేది. దీంతో బిజినెస్ పార్ట్‌నర్స్‌గా మారారు. ఆ తరువాత అభిరుచులుకలవడంతో పెళ్లితో ఒక్కటయ్యారు. భర్త రాఘవేంద్రతో కలిసి 2021లో ‘రామేశ్వరం కెఫే’ ప్రారంభించింది. ఆహారం నాణ్యత పరంగా, టేస్ట్ పరంగా ప్రత్యేకంగా ఉండాలని ప్లాన్ చేసింది.తొలుత బెంగళూరులో రెండు బ్రాంచీలతో మొదలై ఇపుడు కోట్ల రూపాయల ఆదాయాన్నిచ్చే స్థాయికి చేరింది. రాబోయే ఐదేళ్లలో దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, విదేశాలలో కూడా ప్లాన్ చేస్తున్నారు ఈ దంపతులు. దుబాయ్, హైదరాబాద్ , చెన్నైలలో బ్రాంచెస్ తెరవనుంది. దాదాపు 700 మందికి ఉపాధి కల్పిస్తోంది. నివేదికల ప్రకారం ప్రతి స్టోర్ నుండి నెలకు రూ. 4.5 కోట్లు అమ్మకాలు సంపాదిస్తున్నారు. సంవత్సరానికి రూ. 50 కోట్లు సంపాదిస్తున్నారు. View this post on Instagram A post shared by Rupa (@ruparavi21578)రామేశ్వరం కెఫేకర్ణాటకలోని బెంగళూరు నగరంలో రామేశ్వరం కెఫే చాలా పాపులర్. అక్కడికి వెళ్లినవారు ఈ కేఫేకు వెళ్లకుండా రారు. అంత ఫేమస్. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొంది. ఈ కేఫును ఈ స్థాయికి తీసుకు రావడంలో భర్తతో కలిసి దివ్య అహర్నిశలు కష్టపడింది. ఇంత చదువూ చదివి, ఇడ్లీలు, దోసెలు అమ్ముతావా? అని గేలిచేసినా వెనుకడుగు వేయలేదు. తనకిష్టమైన ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టి తానేమిటో నిరూపించుకుంది.కెఫే వేదికగా ఇడ్లీ, దోసె, వడ, పొంగల్, బాత్, రోటీ, పరోటాతోపాటు, రైస్ వెరైటీలనూ ఆహార ప్రియులు ఆరగిస్తారు. అలాగే టీ, కాఫీలను స్పెషల్‌గా అందిస్తూ మరింతమందిని ఆకట్టుకుంటోంది. ప్రతీ వంటలోనూ ఆరోగ్య, నాణ్యతా ప్రమాణాల్ని తప్పకుండా పాటిస్తున్నామని ,సహజ పద్ధతుల్లో తయారుచేసిన నెయ్యి, ఇతర పదార్థాలను వాడతామని చెబుతుంది. తమ వంట తిన్న వారు తృప్తిగా.. ఆహా, ఏమిరుచి అన్నపుడు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది అంటుంది సంతోషంగా దివ్య. తన వ్యాపారాన్ని విదేశాలకు సైతం విస్తరించాలని లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తోంది. -
అవమానాల నుండి అంతర్జాతీయ వేదికపై..
చిన్నతనం నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా.. కనీసం పక్కన కూర్చోడానికి కూడా ఒప్పుకోని పరిస్థితిని దాటుకుని మిస్ యూనివర్స్ ట్రాన్స్ 2024 ఐదో స్థానంలో నిలిచానని హర్షిని మేకల అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఓ కార్యక్రమానికి మంగళవారం వచ్చిన హర్షిని మాట్లాడుతూ మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 2024 డిసెంబర్లో ఢిల్లీలో జరిగిన పోటీల్లో 24 దేశాల నుండి మోడల్స్ పాల్గొనగా మిస్ యూనివర్స్ ట్రాన్స్‌లో ఐదో స్థానం, మిస్ ట్రాన్స్ ఆసియా 2024, అలైట్ క్వీన్ యూనివర్స్‌తో మొత్తం మూడు టైటిల్స్ గెలుచుకున్నానని ఆమె పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయికి అంతర్జాతీయ వేదికపై ఇండియా తరపున తాను పోటీలో ఉండడం, వేదికపై హర్షిని మేకల అని అనౌన్స్ చేసినప్పుడు ప్రేక్షకుల నుండి కేరింతలు రావడం, ఆ కేరింతల మధ్య తనకు మిస్ యూనివర్స్ ఆసియా కిరీటం పెట్టడం ఎప్పటికీ మర్చిపోలేనని హర్షిని అన్నారు. మిస్ ట్రాన్స్ ఆసియా గెలుపొందిన తరువాత ఇప్పటివరకూ కృష్ణలంక, బైరాజులపల్లి, బాలామణి అనే మూడు సినిమాల్లో నటించానని, ఓ వెబ్‌సిరీస్, రెండు సీరియల్స్‌లోనూ నటిస్తున్నట్లు తెలిపారు. మార్చిలో మిస్ ట్రాన్స్ తెలంగాణ తెలంగాణలో మొదటిసారిగా సంచారీ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో ఐకానిక్ స్టార్స్ మిస్ ట్రాన్స్ తెలంగాణ ఫ్యాషన్ షో 2025 నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమ పోస్టర్‌ను మిస్ ట్రాన్స్ ఆసియా హర్షిని, మొదటి ట్రాన్స్ డాక్టర్ ప్రాచీ రాథోడ్, హైదరాబాద్ మోడల్ సీఈవో వంశీ పల్లె, నిర్వాహకుడు శ్రీనాథ్, నటుడు కామేష్ గౌడ్, నిర్మాత నవీన్ గౌడ్ మంగళవారం ఆవిష్కరించారు. విజేతలకు సర్టిఫికెట్, కిరీటం, నగదు బహుమతి, యాడ్, యూట్యూబ్‌లో సాంగ్ అవకాశం కల్పిస్తామన్నారు. మార్చి 1 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలకు 9010691111లో సంప్రదించొచ్చు. ఇవీ చదవండి: ఐఐఎం గ్రాడ్యుయేట్ : లైఫ్‌లో రిస్క్ తీసుకుంది, నెలకు రూ.4.5 కోట్లఅమ్మ కోరిక తీర్చాలనే పట్టుదలతో టాప్‌లో నిలిచాడు : సక్సెస్ స్టోరీ -
అమ్మ కోరిక తీర్చాలనే పట్టుదలతో టాప్‌లో నిలిచాడు : సక్సెస్ స్టోరీ
పిల్లల ఎదుగుదలకు, అభివృద్ధిలో తల్లి తండ్రుల పాత్ర చాలా కీలకమైంది. అమ్మానాన్న ప్రోద్బలంతోనే బాగా చదువుకుంటే, మంచి జీవితం ఉంటుందని, సాధించాలనే పట్టుదల ఉంటే, ఎలాంటి కలల్ని అయినా సాకారం చేసుకోవచ్చనే గుణం అలవడుతుంది. అలా బాగా చదువుకుని తన కుటుంబానికి పేరు తేవడమే కాదు యూపీఎస్సీ సివిల్స్(UPSC Civils) మంచి ర్యాంకు సాధించాడు. అతని పేరే మర్రిపాటి నాగభరత్(Marripati Naga Bharath). పదండి నాగ భరత్ సక్సెస్గురించి తెలుసుకుందాం.వైఎస్సార్ కడప జిల్లాకు నాగభరత్ చిన్నప్పటినుంచి చదువులో బాగా రాణించాడు. ఉన్నత విద్య పూర్తైన తర్వాత సాఫ్ట్ వేర్ జాబ్ సాధించాడు. చక్కటి జీవితం. సంతృప్తికరమైన జీతం. కానీ కలెక్టర్ అవ్వాలన్న అమ్మ కోరిక నెరవేరలేదనే వెలితి అతడిని వెంటాడింది. అందుకే 15 లక్షల రూపాయల వేతనాన్ని వదులుకొని మరీ యూపీఎస్సీపై దృష్టి పెట్టాడు. 2023 యూపీఎస్సీ సివిల్స్( UPSC Civils ) ఫలితాల్లో విద్యార్థి ఉన్నత ర్యాంక్ సాధించాడు.నాగ భరత్ ఖరగ్ పూర్ ఐఐటీలో( Kharagpur IIT ) బీటెక్ పూర్తి చేయడంతో పాటు అక్కడే ఎంటెక్ కూడా పూర్తి చేశాడు. అయితే సివిల్స్ కొట్టాలనే ప్రయత్నాల్లో 2022లో ఇంటర్వ్యూ వరకు వెళ్లి వెనక్కు వచ్చాడు. అయినా సరే పట్టువీడలేదు. ఆశించిన ఫలితాలు రాకపోయినా నాగభరత్ మాత్రం వెనుకడుగు వేయలేదు. నిపుణుల శిక్షణలో మరింత రాటు దేలాడు. చివరికి 580వ ర్యాంక్ సాధించాడు.తల్లి కోరిక (ఈమె 2013లో చనిపోయింది.) మేరకు బాల్యం నుంచి కలెక్టర్ కావాలని నిర్ణయం తీసుకున్న నాగభరత్ భవిష్యత్తుపై చాలా ధీమా వ్యక్తం చేశాడు. ఐఏఎస్‌గా ఎంపికై పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తానని వెల్లడించాడు. రైతుల కష్టాలు తీర్చడానికి తన వంతు ప్రయత్నిస్తానని చెప్పడం విశేషం. అంతేకాదు తన చిన్నతనంలో తండ్రి కలెక్టర్ అంటే ఏంటి? ఈ పదవి ద్వారా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టవచ్చు అనేది చెప్పేవారట. పేదలకు ఎలా సాయం చేయవచ్చో కూడా వివరించేవారట. తన తల్లి కోరిక,కల కూడా అదేనని, అమ్మనాన్నలే తన విజయానికి స్ఫూర్తి అని చెప్పాడు గర్వంగా. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో శిక్షణలో ఉన్నాడు. (ఒకే ఒక్క మాటతో 94 నుంచి 71 కిలోలకు : ఏం చేసిందో తెలిస్తే ఫిదానే!) View this post on Instagram A post shared by Marripati Naga Bharath (@bharath_avow) -
మార్నింగ్ టీ కప్‌తోపాటు ఆకాంక్ష స్నాక్స్ ! ఇది కదా సక్సెస్!
కాలక్షేపం కోసం, అందరూ కలిసి ఒకచోట టీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడానికి లక్నోలోని ఐఏఎస్ అధికారుల భార్యలు ఒకచోట చేరేవారు. ఆ తరువాత ఐఏఎస్ ఆఫీసర్స్ వైఫ్స్ (ఐఏఎస్ ఓడబ్ల్యూ) ఏర్పాటు చేశారు. కాలక్రమంలో ఈ సంస్థ సామాజిక సేవ వైపు తన పరిధిని విస్తరించింది. స్వయం–సహాయక సంఘం ‘ఆకాంక్ష’తో ఎంతోమంది సామాన్య మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోంది.తాజా విషయానికి వస్తే... ‘ఆకాంక్ష’లోని మహిళా సభ్యులు కుంభమేళాలో 20 స్టాల్స్ ఏర్పాటు చేశారు.. ‘ఆకాంక్ష’ అనేది ‘ఐఏఎస్వోడబ్ల్యూ’కు స్వయం సహాయక సంఘం. కుంభమేళాలో భక్తుల సందడే కాదు లక్నోలోని ‘ఆకాంక్ష’లో భాగమైన ‘మసాల మాత్రి కేంద్ర’ మహిళల సందడి, సంతోషాలు కూడా కనిపిస్తాయి. నిన్న మొన్నటి వరకు వారు సాధారణ గృహిణులు. ఎప్పుడో తప్ప కొత్త ఊరికి వెళ్లని వారు. ‘ఆకాంక్ష’ పుణ్యమా అని వ్యాపారవేత్తలుగా మారారు. దేశంలోని ఎన్నో ప్రాంతాలకు వెళుతున్నారు.ఉత్తరప్రదేశ్‌లోని ఐఏఎస్ ఆఫీసర్స్ వైఫ్స్ అసోసియేషన్ (ఐఏఎస్ వోడబ్ల్యూ)కు కేవలం ఐఏఎస్ అధికారుల భార్యలు మాత్రమే నేతృత్వం వహించడం లేదు. గత సంవత్సరం జూలైలో ఐఏఎస్ ఆఫీసర్ రష్మీసింగ్ అధ్యక్షురాలు అయింది. ‘ఐఏఎస్ వోడబ్ల్యూ’కు ప్రెసిడెంట్ అయిన తొలి ఐఏఎస్ ఆఫీసర్‌గా నిలిచింది. జమ్మూకశ్మీర్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అయిన రష్మీ యూపీ చీఫ్ సెక్రటరీ మనోజ్ కుమార్‌సింగ్ భార్య.మసాల, మాత్రి (ఉప్పగా ఉండే స్నాక్స్) తయారీకి ప్రసిద్ధి చెందిన ‘మసాల మాత్రి కేంద్ర’లో గతంతో పోల్చితే ఇప్పుడు ప్రొఫెషనలిజం పెరిగింది. లడ్డూలు, చిక్కీలు, బ్యాగుల తయారీ, హస్తకళలలో విస్తరించింది. లక్నోకు చెందిన ఈ సంస్థ కార్యకలాపాలను నోయిడాకు విస్తరించ నున్నారు. కొన్ని నెలల క్రితం తమ ఉత్పత్తులతో భారీఎత్తున ఎగ్జిబిషన్ నిర్వహించారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.‘ఈ ఎగ్జిబిషన్ ఆకాంక్ష సభ్యులకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ముఖ్యమంత్రిని తొలిసారి చూసినవాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఎగ్జిబిషన్ అనేది వారికి కేవలం డబ్బు సం΄ాదన మాత్రమే కాదు. కొత్త ప్రాంతానికి రావడం, కొత్త వ్యక్తులతో మాట్లాడడం... ఇలా ఎన్నో అనుభవాలను సొంతం చేసుకున్నారు’ అంటుంది రష్మీసింగ్.‘మొదటిరోజు స్వయం సహాయక బృందానికి చెందిన మహిళ ఒకరు రెండు వేలే సంపాదించానని అసంతృప్తిగా మాట్లాడింది. అయితే ఈవెంట్ ముగిసే సమయానికి రూ.30,000 సంపాదించింది. ఆ సంతోషాన్ని అందరితో పంచుకుంది’ అంటుంది ఐఏఎస్వోడబ్ల్యూ – ఉత్తర్‌ప్రదేశ్ కార్యదర్శి ప్రతిభ.యాభై నాలుగు సంవత్సరాల హలీమా గత దశాబ్దకాలంగా ‘ఆకాంక్ష’తో కలిసి పనిచేస్తోంది. ఈ కార్యక్రమం వల్ల ఆమెకు కశ్మీర్ నుంచి వచ్చిన మహిళలతో మాట్లాడే అవకాశం వచ్చింది. వ్యాపారం నుంచి తమ ప్రాంత ప్రత్యేకతల వరకు ఎన్నో విషయాలపై మాట్లాడుకున్నారు. వీరు మరోసారి కుంభమేళాలో కలవనున్నారు. ‘ఆకాంక్ష అనేది మా అందరి ప్రాజెక్ట్. మొదట్లో స్వయం సహాయక బృందం సభ్యుల మైండ్‌సెట్‌లో మార్పు తీసుకురావడానికి కృషి చేశాం. వారిన పాత పద్ధతుల నుంచి కొత్తదారిలోకి తీసుకువచ్చాం’ అంటుంది రష్మీసింగ్.‘మా సంస్థ ఒకప్పుడు ఐఏఎస్ అధికారుల భార్యలు టీ తాగడానికి, ముచ్చటించడానికి, యోగా కార్యక్రమాలను నిర్వహించ డానికి వేదికగా ఉండేది. ఇప్పుడు దాని పరిధి ఎంతో విస్తరించింది. సామాజిక సేవదారిలో ప్రయాణిస్తుంది’ అంటుంది శైలజ చంద్ర.‘ నాకు మార్నింగ్ టీ కప్‌తోపాటు ఆకాంక్ష స్నాక్స్ తప్పకుండా ఉండాల్సిందే’ అంటున్నాడు ఒక కస్టమర్. ‘ఆకాంక్ష’ సాధించిన అద్భుత విజయానికి ఈ ఒక్క మాట చాలు కదా! -
Success Story: నాడు అమ్మతోపాటు గాజులమ్మి.. నేడు ఐఏఎస్ అధికారిగా..
బాల్యంలో కటిక దారిద్య్రం అనుభవిస్తూనే, చదువులు కొనసాగించిన కొందరు ఉన్నత స్థానానికి చేరుకున్న ఉదంతాల గురించి మనం అప్పుడప్పుడు వింటుంటాం. ఇదే కోవలోకి వస్తారు రమేష్ ఘోలాప్. ఈయన సాధించిన విజయం యువతకు స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు.రమేష్ ఘోలాప్.. ఐఏఎస్ అధికారిగా మారేవరకూ సాగించిన ప్రయాణంలో చదువుపై ఆయన చూపిన అంకితభావం, శ్రద్ధ, కృషి మనకు కనిపిస్తాయి. మహారాష్ట్రలోని షోలాపూర్(Solapur) జిల్లాలోని మహాగావ్ అనే చిన్న గ్రామంలో జన్మించిన రమేష్ చిన్నప్పటి నుంచి అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. రమేష్ తండ్రి గోరఖ్ ఘోలాప్ ఒక చిన్న సైకిల్ మరమ్మతుల దుకాణం నడిపేవాడు. మద్యం అలవాటు కారణంగా అతని తండ్రి ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఇంట్లో పరిస్థితి అంతకంతకూ దిగజారింది. ఒకరోజు రమేష్ తండ్రి దుకాణం మూసివేశాడు.దీంతో రమేష్ తల్లి విమల్ ఘోలాప్ కుటుంబాన్ని పోషించేందుకు సమీప గ్రామాల్లో గాజులు అమ్మడం ప్రారంభించింది. ఆ సమయంలో రమేష్ తన తల్లికి సహాయం చేస్తూ వచ్చాడు. 2005లో రమేష్ తండ్రి మరణించాడు. కుటుంబసభ్యులు పొరుగింటివారి సాయంలో అంత్యక్రియలు(Funeral) నిర్వహించారు. ఈ ఘటన రమేష్‌ను అమితంగా ఆలోచింపజేసింది. పేదరికం నుండి బయటపడటానికి ఏకైక మార్గం విద్య అని రమేష్ గ్రహించాడు. చదువుపై దృష్టి సారించిన రమేష్ ఓపెన్ యూనివర్సిటీ నుండి ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. 2009 లో ఉపాధ్యాయుడైన తర్వాత కూడా, తన ఆశయంపై దృష్టి సారిస్తూ ముందుకుసాగాడు.యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష (సీఎస్ఈ) కి సిద్ధం కావాలని నిర్ణయించుకుని, ప్రిపరేషన్ కోసం రమేష్ పూణేకు పయనమయ్యాడు. ఆ సమయంలో అతని తల్లి అండగా నిలిచింది. 2010లో రమేష్ తన మొదటి ప్రయత్నంలో యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష విఫలమయ్యాడు. పోలియో బాధితుడైన రమేష్ 2012లో వికలాంగుల కోటా(Disabled quota) కింద యూపీఎస్సీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ (ఏఐఆర్)287తో ఉత్తీర్ణుడయ్యాడు. ఐఎఎస్ అధికారి కావాలన్న తన కలను నెరవేర్చుకున్నాడు. ప్రస్తుతం ఐఏఎస్ రమేష్ ఘోలాప్ జార్ఖండ్ ఇంధన శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయన కథ కోట్లాది మంది యువతకు ప్రేరణ కల్పిస్తుందనడంలో సందేహం లేదు.ఇది కూడా చదవండి: తమకు తామే పిండం పెట్టుకుని.. నాగ సాధువులుగా మారిన 1,500 మంది సన్యానులు -
అత్యధిక జీతాన్ని వద్దనుకొని.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు
కరోనా మహమ్మారి చాలామంది జీవితాల్లో అగాధాన్ని సృష్టించింది. మరెందరో జీవితాల్ని అతలాకుతలం చేసింది. అంతేకాదు కోవిడ్-19 సృష్టించిన విలయం కారణంగా ఆత్మీయులను కోల్పోయినవారిలో, ఉద్యోగాలను పోగొట్టుకున్నవారిలో జీవితం పట్ల ఒక కొత్త దృక్పథాన్ని ఆవిష్కరించింది అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి వారిలో ఒకరు కావ్య ధోబ్లే. కోవిడ్ రోగుల మధ్య నెలల తరబడి పనిచేస్తూ, రోజుకు అనేక మరణాలను చూడటం, స్వయంగా కరోనా బాడిన నేపథ్యంలో జీవితంలో ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది. అదే ఆమె విజయానికి, సంతోషకరమైన జీవితానికి పునాది వేసింది. ఏంటి ఆ నిర్ణయం? కావ్య సాధించిన విజయం ఏంటి? తెలుసుకుందాం ఈ కథనంలో.కావ్య ధోబ్లే-దత్ఖిలే ముంబైలో ఒక నర్సు. కావ్య ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచనలో పెరిగింది. బహుశా ఆ కోరికే ఆమెన నర్సింగ్పైపు మళ్లించిందేమో.జనరల్ నర్సింగ్,మిడ్‌వైఫరీలో డిప్లొమా పూర్తి చేసిన తర్వాత, ముంబైలోని లోకమాన్య తిలక్ మున్సిపల్ మెడికల్ కాలేజ్ మరియు జనరల్ హాస్పిటల్ (సియోన్ హాస్పిటల్)లో పనిచేయడం ప్రారంభించింది. తరువాత ను టాటా క్యాన్సర్ హాస్పిటల్లో రెండు సంవత్సరాలు పనిచేసింది. దీనితో పాటు, కావ్య 2017లో నర్సింగ్‌లో బి.ఎస్సీ పూర్తి చేసింది. ఒక ప్రైవేట్ కళాశాలలో ఒక సంవత్సరం బోధించిన తర్వాత,ముంబైలోని సియోన్ ఆసుపత్రికి స్టాఫ్ నర్సుగా చేరింది. 2019 నుండి 2022 వరకు సియోన్ హాస్పిటల్లో ఆయన పనిచేసిన కాలంలోనే కరోనా మహమ్మారి విజృంభించింది.ఉద్యోగం మానేసి, సంచలన నిర్ణయం కావ్య కూడా కరోనా బారిన పడి దాదాపు మరణం అంచుల దాకా వెళ్లి వచ్చింది. ఎన్నో మరణాలను చూసింది. కానీ తన రోగనిరోధక శక్తి తనను కాపాడిందనే విషయాన్ని అర్థం చేసుకుంది. అలాగే వ్యవసాయం అంటే మక్కువ ఉన్న ఆమె మనం పండించే, రసాయనాలతో నిండిన ఆహారం వ్యాధులకు హేతువని తెలుసుకుంది. అందుకే సమస్య మూలాన్ని తొలగించాలని గట్టిగా నిర్ణయించుకుంది. అంతే నెలకు రూ. 75వేల జీతం వచ్చే ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలివేసింది. ఈ నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకించినా, ఆమె భర్త రాజేష్ దత్ఖిలే క్యావకు మద్దతు ఇచ్చాడు. 2022లో, ఆమె తన ఉద్యోగాన్ని వదిలి భర్త గ్రామానికి వెళ్లింది.నర్సింగ్ నుండి జీరో ఇన్వెస్ట్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వరకుఆహారానికి ఆధారం వ్యవసాయం. అందుకే ఎలాంటి రసాయనాలు వాడని పంటలను ప్రోత్సహించాలని నిర్ణయించుకుంది కావ్య. పట్టుదలగా కృషి చేసింది. వర్మీ కంపోస్ట్ బిజినెస్‌తో లక్షలు సంపాదిస్తోంది. రాజేష్ కుటుంబానికి పూణేలోని జున్నార్‌లోని దత్ఖిలేవాడి గ్రామంలో ఒక ఎకరం భూమి ఉంది. ఇందులో 5 గుంతల (0.02 ఎకరాలు) వర్మీకంపోస్ట్ తయారీ యూనిట్‌ను ప్రారంభించింది. వ్యవసాయంలో రసాయనాల వాడకాన్ని వదిలి, వర్మీకంపోస్ట్ వంటి సేంద్రీయ ఇన్పుట్లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కావ్య స్థానిక రైతులతో మాట్లాడింది. ఉత్తమ వ్యవసాయ పద్ధతులపై ఒక యూట్యూబ్ ఛానెల్‌ను కూడా ప్రారంభించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తొలి సంవత్సరంలో టర్నోవర్ రూ. 24 లక్షలు. ఈ ఆర్థిక సంవత్సరం రూ. 50 లక్షల టర్నోవర్ టార్గెట్ పెట్టుకుంది. కావ్య ప్రతి నెలా దాదాపు 20 టన్నుల రిచ్ వర్మీకంపోస్ట్‌ను తయారు చేస్తుంది. 50 శాతం లాభం మార్జిన్‌తో 50 కిలోల బ్యాగు ధర రూ. 500 లకు విక్రయిస్తుంది. ప్రస్తుతం 30 లక్షల వార్షిక టర్నోవర్‌తో విజయ వంతంగా దూసుకుపోతోంది. వోల్జా డేటా ప్రకారం, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వర్మీకంపోస్ట్ ఎగుమతిదారు. ఆ తర్వాత టర్కీ, ఇండోనేషియా,వియత్నాం ఉన్నాయి. ఈ రంగంలో అవార్డును కూడా అందుకుంది. ప్రారంభంలో తప్పని సవాళ్లుసేంద్రీయ వ్యవసాయం, వర్మీ కంపోస్ట్ గురించి కావ్య రైతులతో మాట్టాడినప్పుడల్లా, ఆమెకు లభించే సమాధానం, 'మీరు దీన్ని చేసి మాకు చూపించండి' అని. దీంతో ఆగస్టు 2022లో, అతను ఒక రైతు నుంచి ఒక కిలో వానపాములతో జీరో పెట్టుబడితో వర్మీ కంపోస్ట్ తయారీనీ మొదలు పెట్టింది. ప్రారంభించాడు. అక్టోబర్ 2022 నాటికి, వర్మీకంపోస్ట్ సిద్ధమైంది. మార్చిలో, కావ్య కృషి కావ్య బ్రాండ్ కింద వర్మీకంపోస్ట్ వాణిజ్య అమ్మకాలను ప్రారంభించింది. దాని ఫలితాలను రైతులు స్వయంగా అనుభవించారు. వారి విజయాలను తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసేది. ఒక రైతు ఐదు టన్నుల వర్మీకంపోస్టును రూ. 50,000 (కిలోకు రూ. 10) కు కొనుగోలు చేశాడు. రెండు వేల మంది రైతులకు ఇవ్వడానికి ఒక ఫౌండేషన్ 2,000 కిలోల వానపాములను కొనుగోలు చేసింది. కావ్య కిలో రూ.400కి అమ్మింది. ప్రతి రెండు నెలలకు 200 కిలోల వానపాములు, 35వేల కిలోల వర్మీ కంపోస్టును విక్రయిస్తుంది. అంతేకాదు ఆమె శిక్షణ తర్వాత మహారాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200 మంది వర్మీ కంపోస్ట్‌ను తయారు చేస్తున్నారు.తన చుట్టూ ఉన్నరైతుల్లో ఈ మార్పు తీసుకురాగలిగినందుకు చాలా సంతోషం అంటుంది కావ్య. వర్మీ కంపోస్ట్ ఎలా తయారు చేస్తారు?వర్మీకంపోస్ట్కు అవసరమైన ప్రధానమైనవి ఆవు లేదా గొర్రెలు , మేక పెంట, చెట్ల ఆకులు, పంట అవశేషాలు, కూరగాయల వ్యర్థాలు, బయోగ్యాస్ ప్లాంట్ స్లర్రీ లాంటి సేంద్రియ వ్యర్థాల మిశ్రమానికి వానపాములు కలుపుతారు, అవి ఎరువుగా రూపాంతరం చెందుతాయి.కేవలం రూ.500 పెట్టుబడితో ప్రారంభించవచ్చు. కంపోస్ట్‌ను ఎత్తైన పడకల మీద, డబ్బాలు, చెక్క డబ్బాలు, సిమెంటు ట్యాంకులు లేదా గుంటలు, వెదురు, ప్లాస్టిక్ కంటైనర్లు లేదా మట్టి కుండలలో కూడా తయారు చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,500 జాతుల వానపాములు ఉన్నాయి. అయితే స్థానిక జాతులను ఉపయోగించడం అనువైనది ఎందుకంటే అవి తక్షణమే అందుబాటులో ఉంటాయి, పైగా స్థానిక వాతావరణానికి బాగా సరిపోతాయి. భారతదేశంలో, సాధారణంగా ఉపయోగించే వానపాము జాతులు పెరియోనిక్స్ ఎక్స్కవాటస్, ఐసెనియా ఫోటిడా , లాంపిటో మౌరిటీ లాంటివి ఉన్నాయి. View this post on Instagram A post shared by Kavya Dhoble - Datkhile (@kavya.dhoble) -
UPSC Success Story: ఇటు ఉద్యోగం.. అటు చదువు.. శ్వేతా భారతి విజయగాథ
పట్టుదల ఉంటే సాధించలేదని ఏదీ లేదని అంటారు. దీనిని కొందరు నిజమని నిరూపించారు. ఈ కోవలోకే వస్తారు శ్వేతా భారతి. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే, మరోవైపు పోటీ పరీక్షలకు సిద్ధమైన శ్వేత తాను అనుకున్నది సాధించి, ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు.యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్ష(UPSC Civil Service Exam) ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన పరీక్షలలో ఒకటని చెబుతుంటారు. పలువురు అభ్యర్థులు యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమయ్యేందుకు కోచింగ్ తీసుకుంటారు. అయితే ఏమాత్రం కోచింగ్ అవసరం లేకుండానే యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణులైనవారు కూడా ఉన్నారు. ఇటీవలే బీహార్ కేడర్‌లో పోస్టింగ్ అందుకున్న ఐఏఎస్ శ్వేతా భారతి దీనికి ఉదాహరణగా నిలిచారు.బీహార్ యువతి శ్వేతా భారతి(Shweta Bharti) యూపీఎస్సీ పరీక్షకు ముందు బీపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణురాలయ్యారు. అయితే ఐఏఎస్ అధికారి కావడమే ఆమె కల. అందుకే ఆమె ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకున్నప్పటికీ, యూపీఎస్సీకి ప్రపరేషన్ కొనసాగించారు. శ్వేతా భారతి ఉదయం పూట 9 గంటల పాటు పనిచేస్తూనే, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు.శ్వేతా భారతి బీహార్‌లోని నలంద జిల్లాలో జన్మించారు. ఆమెది సాధారణ కుటుంబ నేపధ్యం. శ్వేతా భారతి చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుకుగా ఉండేవారు. పట్నాలోని ఇషాన్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్లో 12వ తరగతి వరకు చదువుకున్నారు. అనంతరం ఆమె భాగల్పూర్ ఇంజనీరింగ్ కళాశాల నుండి ఎలక్ట్రికల్,టెలికమ్యూనికేషన్‌లో బీటెక్ డిగ్రీని అందుకున్నారు. తరువాత ఆమె విప్రోలో ఉద్యోగం సంపాదించారు.లక్షల్లో జీతం అందుకుంటున్నప్పటికీ ఆమె ఐఏఎస్ అధికారి(IAS officer) కావాలని నిశ్చయించుకున్నారు. అందుకే ఒకవైపు ఉద్యోగం చేస్తూనే, మరోవైపు యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతూ వచ్చారు. పగటిపూట ఉద్యోగం చేస్తూనే, రాత్రపూట చదువుకోసాగారు. 2020లో జరిగిన బీపీఎస్సీ పరీక్షలో శ్వేతా భారతి 65 వ ర్యాంకు సాధించారు. దీంతో ఆమెకు ప్రోగ్రామ్ ఆఫీసర్ (డీపీఓ)గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. అయినప్పటికీ ఆమె తన లక్ష్యం నెరవేర్చుకునే దిశగానే ముందుకు సాగారు. ఎట్టకేలకు ఆమె కృషి ఫలించింది. 2021లో యూపీఎస్సీ పరీక్షలో 356వ ర్యాంక్ సాధించారు. శ్వేతా భారతి యూపీఎస్సీ2021 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ మహిళా అధికారి. ప్రస్తుతం బీహార్‌లోని భాగల్పూర్లో అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇది కూడా చదవండి: ISRO SpaDeX Mission: స్పేడెక్స్ ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం: ఇస్రో -
రూ. 25 లక్షల ఐటీ జాబ్ వదిలేసి.. ఆర్గానిక్ వైపు జాహ్నవి జర్నీ!
మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్, ఐఎమ్‌టీ ఘజియాబాద్‌లో ఎంబీఏ చదివి నగరంలోని ఐటీ కంపెనీల్లో ఏడాదికి రూ.25 లక్షలకు పైగా జీతమిచ్చే ఉద్యోగాలు చేశారు. ఆ ఉద్యోగాలను వదిలేసి..‘ఆర్గానిక్ ఉత్పత్తులు ఆరోగ్యాన్నిస్తాయి.. కల్తీ ఆహార ఉత్పత్తులతో రోగాల పాలు కావొద్దు’ అని ఇంటింటికీ వెళ్లి చెబుతున్నారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛమైన ఆర్గానిక్ ఉత్పత్తుల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. ఆ విశేషాలు నగరవాసి యోగితా జాహ్నవి మాటల్లోనే.. – సాక్షి, సిటీబ్యూరో గర్భిణిగా ఉన్నప్పుడు పోషకాహారం తినాలని ప్రతి ఒక్కరూ చెబుతారు కానీ పోషకాలు అందించే ఆహారం దొరకాలి కదా.. ఇప్పుడు ఎటు చూసినా కల్తీ.. ఈ పరిస్థితుల్లో కడుపులోని బిడ్డకు స్వచ్ఛమైన ఆహారం అందించడం ఎలా?’ అంటూ చాలా ఆందోళన చెందాను’ అంటూ తాను గర్భిణిగా ఉన్ననాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు ఆర్గానిక్ ఉత్పత్తుల సంస్థ వీ రిచ్ నిర్వాహకురాలు యోగితా జాహ్నవి. అంతా కల్తీ.. తినేదెలా? అదీ ఇదీ లేదని సందేహం వలదు.. ఎందెందు వెదికినా అందందే కలదు అడల్ట్రేషన్.. మనం తింటున్న ఆహారం మనకు పోషకాలు ఇస్తోందా? రోగాలు తెస్తోందా? ఈ ఆందోళన గర్భిణిగా ఉన్నప్పుడు మరింత పెరిగింది. కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా స్వచ్ఛమైన పాలు, తేనె, కుంకుమ పువ్వు తీసుకోవాలనే ఆరాటంతో నా అన్వేషణ మొదలైంది. ఎంత కష్టమైనా సరే స్వచ్ఛమైన ఆహారోత్పత్తులను అందించాలనే తపన పెరిగింది. అదే ఏళ్ల తరబడి శ్రమించి అందుకున్న డిగ్రీ పట్టా, అది అందించిన లక్షల జీతమిచ్చే ఉద్యోగం.. వదిలేసి మా పల్లెటూరి వైపు నా చూపును మళ్లించింది. ఇదీ చదవండి: ఎప్పటినుంచో ఐఏఎస్ కల..కానీ 13 ఏళ్లకే అనూహ్య నిర్ణయం పాడితో కూడి.. ప్రభుత్వోద్యోగం చేసి రిటైరయ్యాక డైరీ ఫార్మ్ పెడదామని నాన్న కల. ఉద్యోగం వదిలేశాక మా నాన్న కల సాకారంతో పాటు నా ఆశయాలకు ఆకారం కూడా ఇవ్వాలని మా సొంత ఊరు కందుకూరులో ఒక డైరీ ఫార్మ్‌ను ఏర్పాటు చేశా. ఆవులు, గేదెలకు గ్రోత్ హార్మోన్ ఇంజక్షన్లు ఇవ్వకుండా వాటి మేత కూడా సహజమైన ఆహారమే అందిస్తున్నాం.. తద్వారా ఏ దశలోనూ కల్తీ కాని, రసాయనాలు కలవని స్వచ్ఛమైన పాలు ఉత్పత్తి చేస్తున్నాం. పరిశోధించి.. పరిశీలించి.. పర్వత ప్రాంతమైన ఉత్తరాఖండ్‌లో ఒకే సీజన్లో తేనె లభిస్తుంది. ప్రభుత్వం, ఎన్జీవోలు కలిపి ప్రతి ఇంటికీ తేనె సేకరించేలా ఏర్పాట్లు చేస్తారు. విభిన్న రకాల పూల నుంచి సేకరించిన ఈ తేనెలో ఔషధ విలువలు పుష్కలం. ఇది తెలిసి అక్కడకు వెళ్లి వారితో ఒప్పందం కుదర్చుకున్నా. అదేవిధంగా బెల్లం పొడి కూడా అక్కడిదే. మెటల్ సీడ్ నుంచే పుట్టే ఈ బెల్లం ఆరోగ్యకరం. ఇక్కడ లభించే బెల్లం పొడిలా దీన్ని కలిపితే పాలు విరగవు. ఇందులో ఐరన్ కంటెంట్ బాలింతలకు ఆరోగ్యకరం. అలాగే అత్యుత్తమ రైస్ రకం గురించి అన్వేషిస్తే బ్లాక్ రైస్ గురించి తెలిసింది. వియత్నాం, రష్యాలో ఈ రైస్‌కి బాగా డిమాండ్ ఉంది. మన దేశంలో మణిపూర్‌లో బాగా పండిస్తారు. అక్కడి నుంచి బ్లాక్ రైస్ తెస్తున్నా. అలాగే కశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు ఇలా దాదాపు డజనుకుపైగా అన్వేషించినవి, అత్యుత్తమమైనవి అందిస్తున్నా. దీన్నేదో కేవలం వ్యాపారంగా చూడటం లేదు. అత్యధిక శాతం మహిళా సిబ్బందితో నడిచే మా సంస్థ.. ఇంటింటికీ ఆరోగ్యకరమైన ఉత్పత్తులు చేరవేయాలని, ముఖ్యంగా బాలింతలు, బలహీనంగా ఉండే మహిళలకు బలవర్థకమైన ఆహారం అందించాలనే ఆశయంతో నిర్వహిస్తున్నాం. -
డెలివరీ బాయ్.. జడ్జిగా మారితే.. యాసిన్ షా సక్సెస్ స్టోరీ
విజయసాధనకు అకుంఠిత దీక్ష అవసరమని అంటారు. పట్టుదలతో లక్ష్యం దిశగా పయినించినవారు తప్పక విజయం సాధిస్తారని కూడా చెబుతుంటారు. ఈ కోవలోకే వస్తారు యాసిన్ షా మహ్మద్. ఈయన జీవితం ఒక సినిమాను తలపిస్తుంది. తన ప్రయాణంలో ఎన్నో సంఘర్షణలు ఎదుర్కొన్న యాసిన్ చివరకు విజయబావుటా ఎగురవేశాడు.జీవితంలో ఎత్తుపల్లాలు, మలుపులుఇటీవల జరిగిన కేరళ జ్యుడీషియల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ యాసిన్ షా మహ్మద్ రెండో స్థానం సాధించాడు. దీంతో సివిల్ జడ్జి అయ్యే అర్హత సాధించాడు. డెలివరీ బాయ్ నుండి మేజిస్ట్రేట్ అయ్యే దిశగా సాగిన యాసిన్ జీవన ప్రయాణంలో అనేక మలుపులు, ఎత్తుపల్లాలు ఉన్నాయి. యాసిన్‌కు మూడేళ్ల వయసున్నప్పడే అతని తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టివెళ్లిపోయాడు. నాడు 19 ఏళ్లు ఉన్న అతని తల్లి.. పిల్లలను పెంచిపోషించింది. శిథిలావస్థకు చేరిన ఇంట్లో ఉంటూ, వారు కాలం వెళ్లదీశారు. రాష్ట్ర ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్ కింద వారికి ఒక చిన్న ఇంటి సౌకర్యం లభించినప్పటికీ, వారికి అది ఏమాత్రం అనువుగా ఉండేది కాదు.న్యూస్ పేపర్ పంపిణీ చేస్తూ..యాసిన్ తన బాల్యంలో ఉదయం 4 గంటలకు నిద్రలేచి వార్తాపత్రికలను పంపిణీ చేసేవాడు. తరువాత 7 గంటల నుండి పాల ప్యాకెట్లు పంపిణీ చేసేవాడు. ఇది పూర్తయ్యాక స్కూలుకు వెళ్లేవాడు. యాసిన్ తల్లి రెండు పాడి ఆవును కొనుగోలు చేసి, వాటి ద్వారా వచ్చే పాలు విక్రయిస్తూ కుటుంబాన్ని సాకేది. యాసిన్ తన ఆరేళ్ల వయసు నుంచే ఆదాయం వచ్చే పనులు చేసేవాడు. ఉదయం, సాయంత్రం వేళల్లో పాలు పంపిణీ చేసేవాడు.స్టేట్ లా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కోసం..సమయం చిక్కినప్పుడు యాసిన్ పెయింటర్‌గా, జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్‌గానూ పనిచేశాడు. ఇతరుల నుంచి పాత పుస్తకాలు సేకరించి చదువుకునేవాడు. అలాగే ఇతరులిచ్చే పాత దుస్తులు ధరించేవాడు. రోజులో ఏది దొరికితే దానిని తిని కడుపునింపుకునేవాడు. ఇలా పనిచేస్తూనే 12వ తరగతి పూర్తిచేసిన యాసిన్ ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా కోర్సులో చేరేందుకు షోరనూర్‌లోని పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్ తీసుకున్నాడు. ఈ కోర్సు పూర్తయ్యాక స్టేట్ లా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గురించి విని, దానికి ప్రిపేర్ కావాలని నిర్ణయించుకున్నాడు. యాసిన్ 46వ ర్యాంక్‌తో కేరళలోని ఎర్నాకులంలోని ప్రతిష్టాత్మక ప్రభుత్వ న్యాయ కళాశాలలో ప్రవేశం పొందాడు. ఈ సమయంలో రాత్రి 2 గంటల వరకు ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేశాడు.29 ఏళ్ల పోరాటంయాసిన్ మీడియాతో మాట్లాడుతూ ‘నేను 12వ తరగతిలో ఫెయిల్ అయి, చదువు మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా పట్టుదల వీడక 12వ తరగతి పాస్ అయ్యాను. నేను మలయాళం మీడియం స్కూల్లో చదవడంతో ఇంగ్లీషులో చదవడం ఇబ్బందిగా అనిపించేంది. పట్టుదలతో ఈ సమస్యను కూడా అధిగమించాను’ అని తెలిపారు. యాసిన్ 2023 మార్చిలో న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో తన పేరు నమోదు చేయించుకున్నారు. తరువాత పట్టాంబి మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో న్యాయవాది షాహుల్ హమీద్ దగ్గర పని చేశారు. ఈ సమయంలోనూ యాసిన్ వార్తాపత్రికలు విక్రయించడం, డెలివరీ బాయ్‌గా పనిచేయడాన్ని మానలేదు. యాసిన్ తనకు 29 ఏళ్ల వయసు వచ్చే వరకూ జీవితంతో పోరాడుతూనే వచ్చాడు. అయితే ఇదే సమయంలో తాను జడ్జి కావాలనుకున్న కలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ వచ్చాడు. ఎట్టకేలకు యాసిన్ తాను అనుకున్న విధంగా జడ్జిగా మారి, పదిమందికి స్ఫూర్తిగా నిలిచారు. ఇది కూడా చదవండి: ‘ఆంగ్లం’లో భారత్ స్థానం ఎంత? నాన్ ఇంగ్లీషులో టాప్ దేశమేది? -
పార్కింగ్ స్థలంలో కంపెనీ : కట్ చేస్తే..యూకే ప్రధానికంటే మూడువేల రెట్లు ఎక్కువ జీతం
నెలకు లక్షల్లో సంపాదిస్తేనే ఔరా అనుకుంటాం కదా. కానీ బ్రిటీష్ బిలియనీర్, మహిళా వ్యాపారవేత్త, అత్యధిక వేతనం పొందే మహిళగా నిలిచింది. 2024లో జీతం , డివిడెండ్లలో 150 మిలియన్ పౌండ్లను ( రూ.1,500 కోట్లకు పైగా) వేతనం అందుకుంది. అంటే రోజురు నాలుగు కోట్ల వేతనం అన్నమాట. అదీ 45 శాతం వేతన కోత తరువాత. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఎవరీ డెనిస్.. ఆమె కంపెనీ ఏంటి తెలుసుకుందాం ఈ కథనంలో.57 ఏళ్ల డెనిస్ కోట్స్(denise Coates)కన్న కల చాలా పెద్దది. అందుకే ఆమె స్థాపించిన ఒక చిన్న కంపెనీ ఇపుడు ప్రపంచాన్ని ఏలుతోంది. 2000లో ఒక మామూలు కారు పార్కింగ్ స్థలంలో "బెట్365" (Bet365)అనే ఆన్లైన్ బెట్టింగ్ సంస్థను ప్రారంభించింది. బహుశా అపుడు ఆమె ఊహించి ఉండదు..వేల కోట్ల టర్నోవర్‌తో, 8,500 మంది ఉద్యోగులతో దిగ్గజంగా ఎదిగుతుందని. కట్ చేస్తే...ఆమె విజయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. డెనిస్ కోట్స్ బ్రిటన్‌లోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా అవతరించారు. సంస్థలో ఆమె మెజారిటీ వాటా50 శాతానికి పైమాటే.ది గార్డియన్ నివేదిక ప్రకారం "బెట్365" కంపెనీ అంతకుముందు సంవత్సరంలో 3.4 బిలియన్ పౌండ్ల నుండి 3.7 బిలియన్ పౌండ్లకు ఆదాయ వృద్ధిని సాధించింది. ఈక్విటీ మార్కెట్ పరిస్థితుల మెరుగుదల మధ్య ఖర్చులను తగ్గింపు, పెట్టుబడి మదింపుల నుండి లాభాన్ని ఆర్జించింది. గత ఏడేళ్లలో ఆమె సంపద ఏకంగా రూ. 20 వేల కోట్లను దాటిపోగా, గత పదేళ్లలో ఆమె ఆర్జించిన మొత్తం దాదాపు రూ.24 వేల కోట్లు. మార్చి 2024తో ముగిసిన ఏడాది లో సంస్థ పన్నుకు ముందు 626 మిలియన్ పౌండ్ల లాభాన్ని సాధించింది. ఇది గత ఏడాదితోపోలిస్తే 60 మిలియన్ పౌండ్ల ప్రీ-టాక్స్ నష్టం నుండి గణనీయమైన పెరుగుదల.ఆన్లైన్ బెట్టింగ్స్ ఊపందుకున్న కోవిడ్-19 మహమ్మారి సమయంలో (2020) ఆమె ఆదాయం అత్యధికంగా రూ.4,690 కోట్లుగా నమోదైంది. కాగా ప్రపంచంలోని ప్రముఖ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కంపెనీల్లో ఒకటి నిలిచిన Bet365 వ్యవస్థాపకురాలైన కోటస్ 1967, సెప్టెంబరు 26న ఇంగ్లాండ్‌లోని స్టోక్-ఆన్-ట్రెంట్‌లో జన్మించింది. షెఫీల్డ్ విశ్వవిద్యాలయంలో ఎకనామెట్రిక్స్ అభ్యసించింది. బెట్టింగ్ షాపులను నిర్వహించు కుటుంబ నేపథ్యంతో ఆమె ఈ కంపెనీని స్థాపించింది. ఆమె సోదరుడు జాన్ కోట్స్ సంస్థకు సంయుక్త సీఈఓగా(CEO), ప్రధాన వాటాదారుగా కొనసాగుతున్నారు. అంతేకాదు స్టోక్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్ స్టేడియానికి బెట్365 పేరు పెట్టారంటేనే Bet365కంపెనీ ప్రాముఖ్యతను ఇట్టే అర్థం చేసుకోవచ్చు.విమర్శలు, వివాదాలు అయితే ఇంత ప్రాపులర్ అయిన సంస్థకు సంబంధించి మరో కోణం కూడా ఉంది. పేదప్రజల ఆశను సొమ్ము చేసుకుంటున్న కంపెనీ అంటూ సంస్థపై అనేక విమర్శలు భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న లక్షలాది మంది కష్టార్జితాన్ని ఈ సంస్థ కొల్లగొడుతోందని విమర్శకులు మండిపడుతున్నారు.మరోవైపు 2020లో డెనిస్ తండ్రి పీటర్ కోట్స్(Peter Coates) బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీకి రూ.25 లక్షలు విరాళంగా ఇవ్వడం రాజకీయ దుమారాన్ని రేపింది . అలాగే 2023లో కస్టమర్ల భద్రతా వైఫల్యం, మనీలాండరింగ్ లాంటి ఆరోపణలతో ఈ సంస్థ రూ.5.82 కోట్ల జరిమానా కూడా చెల్లించాల్సి వచ్చింది. -
రూ.63 వేలకోట్లు ఆస్తి.. అద్దె ఇంట్లో నివాసం!: ఎవరో తెలుసా?
అనుకున్న పని సాధించాలంటే.. కృషి, పట్టుదల చాలా అవసరం. సంకల్పం బలంగా ఉండి.. లక్ష్యం వైపుగా అడుగులు వేస్తే తప్పకుండా సక్సెస్ నీ సొంతం అవుతుందని చెప్పడానికి నిదర్శనమే 'టట్యానా బకల్చుక్' (Tatyana Bakalchuk). బహుశా ఈ పేరు చాలామందికి తెలిసుండకపోవచ్చు. కానీ ఈమె రష్యాలో అత్యంత సంపన్న మహిళలలో ఒకరు. ఈమె గురించి, ఈమె సాధించిన సక్సెస్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.వైల్డ్బెర్రీస్బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, రష్యాలో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజంగా ఎదిగిన 'వైల్డ్‌బెర్రీస్' (Wildberries) నేడు ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం వ్యాపారవేత్త టట్యానా బకల్చుక్. ఈమె రష్యాలో అత్యంత సంపన్న మహిళ. ఈమె నికర విలువ 7.4 బిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 6,34,65,84,10,000.60వేల బ్రాండ్లుఅమెజాన్ కంపెనీలో పోలిస్తే.. వైల్డ్‌బెర్రీస్ రష్యాలోనే అతిపెద్ద ఆన్లైన్ రిటైలర్. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా దుస్తులు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు వంటి సుమారు 60వేల బ్రాండ్లను విక్రయిస్తున్నారు.రష్యాలోని అతిపెద్ద ఈ కామర్స్ దిగ్గజాన్ని స్థాపించిన టట్యానా బకల్చుక్ 2004లో నిరాడంబరమైన జీవితాన్ని గడిపిన ఓ ఇంగ్లీష్ టీచర్. ఈమె తన ప్రసూతి సెలవుల సమయంలో కుటుంబానికి మద్దతుగా నిలబడటానికి కేవలం రూ. 32వేలతో చిన్న వ్యాపారం ప్రారంభించింది. ఆ సమయంలో ఆమె భర్త వ్లాడిస్లావ్ బకల్చుక్, అతని స్నేహితుడి సహకారం కూడా తీసుకుంది.అపార్ట్మెంట్ నుంచి ఆన్లైన్ ప్లాట్ఫామ్మొదట వీరి వ్యాపారం చిన్న అపార్ట్మెంట్ నుంచి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌గా వృద్ధి చెందింది. ఆ సమయంలో ఆమె జర్మన్ రిటైలర్ ఒట్టో సహకారం పొందింది. ఆన్లైన్లో దుస్తులను ఫోటో తీయడం, జాబితా చేయడం, స్వయంగా లాజిస్టిక్స్ చేయడం, పంపడానికి ప్రజా రవాణాను ఉపయోగించడం వంటి వాటితో ఈమె బిజినెస్ ఎదిగింది.ప్రారంభంలో కొన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పటికీ.. పట్టు వదలకుండా, 2008 ఆర్థిక సంక్షోభాల సమయంలో కూడా ఈమె తన వ్యాపారాన్ని వదిలిపెట్టలేదు.2020లో మహమ్మారి సమయంలో సకాలంలో ఇంటి డెలివరీలను నిర్ధారించడానికి ఆమె 12,000 మంది అదనపు కార్మికులను నియమించింది. దీంతో కంపెనీ ఒక్కసారిగా గణనీయమైన వృద్ధి సాధించింది.99 శాతం వాటాకంపెనీలో టాట్యానా 99 శాతం వాటాను కలిగి ఉంది. మిగిలిన 1 శాతం వాటా ఆమె భర్తకు చెందినది. ఈ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు రష్యాలో మాత్రమే కాకుండా.. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ వంటి ప్రదేశాలలో కూడా సేవలు అందిస్తోంది. వేలకోట్లు సంపద ఉన్నప్పటికీ.. టాట్యానా అద్దె ఇంట్లోనే నివసిస్తున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: రూ. 10వేల అప్పుతో రూ.32000 కోట్ల సామ్రాజ్యం: ఎవరీ 'రవి మోదీ'?టట్యానా బకల్చుక్ వ్యాపార ఆవాహన.. రష్యా అధ్యక్షుడు 'వ్లాదిమిర్ పుతిన్' (Vladimir Putin)ను ఆకర్షించింది. దీంతో ఆయన అంతర్జాతీయ స్విఫ్ట్ చెల్లింపు నెట్‌వర్క్‌కు దేశీయ ప్రత్యామ్నాయాన్ని సృష్టించే పనిని ఆమెకు అప్పగించారు. ఓ టీచర్‌గా జీవితం ప్రారంభించి, కుటుంబానికండగా నిలబడాలనే ఉద్దేశ్యంతో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించి.. నేడు ప్రపంచంలోని గొప్ప వ్యాపారవేత్తల సరసన నిలిచిన టట్యానా బకల్చుక్ ప్రశంసనీయం, ఎంతోమందికి ఆదర్శప్రాయం. -
Success Story: రూ. 5 కోట్ల టర్నోవర్‌కు మార్గం చూపిన ‘గుడిమల్కాపూర్’
నేటి కాలంలో యువత ఉద్యోగం చేసేకన్నా వ్యాపారం చేయడమే ఉత్తమమని భావిస్తోంది. ఈ దిశగా అడుగులు వేస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఈ కోవలో అమోఘమైన విజయాలు సాధించినవారు కూడా ఉన్నారు. వారిలో ఒకరే అరూప్ కుమార్ ఘోష్. హైదరాబాద్‌లోని గుడిమాల్కాపూర్ను చూసిన ఆయన తన జీవితాన్నే పూలబాటగా మలచుకున్నారు.కలలు సాకారమయ్యేందుకు..పశ్చిమ బెంగాల్‌లోని కోలాఘాట్(Kolaghat)కు చెందిన అరూప్ కుమార్ ఘోష్ (33) కాలేజీ డ్రాపౌట్. అయితే ఆయన తన వ్యాపారంలో చూపిన అంకితభావం, కృషి అతనిని ఉన్నత స్థానానికి తీసుకెళ్లాయి. చాలామంది యువకులు కలలను కనడంవరకే పరిమితమైతే అరూప్ మాత్రం ఆ కలలను సాకారం చేసుకున్నాడు. ఒకప్పుడు రూ.3500 జీతానికి పనిచేసిన అరూప్ ఇప్పుడు భారీ స్థాయిలో పూల వ్యాపారం చేస్తున్నాడు. బంతి పూలు, వాటి విత్తనాలను విక్రయిస్తూ, తన వ్యాపార వార్షిక టర్నోవర్ రూ. 5 కోట్లను దాటించాడు. అయితే ఈ దిశగా సాగిన ప్రయాణంలో ఎన్నో ఒడిదుకులను ఎదుర్కొన్నాడు.పూల దుకాణంలో పనికి కుదిరి..అరూప్కి చిన్నప్పటి నుంచి పూలంటే ఎంతో ఆసక్తి ఉంది. అరూప్ కుటుంబం తొలుత వరి సాగు చేసేది. అయితే దాని నుండి వచ్చే సంపాదన అంతంత మాత్రంగానే ఉండేది. ఇదే సమయంలో పూల వ్యాపారంలో అరూప్‌కు మంచి అవకాశాలు కనిపించాయి. దీంతో అరూప్ కళాశాల చదువును వదిలివేసి, పూల వ్యాపారం(Flower business)లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నాడు. తన 17 ఏళ్ల వయస్సులోనే పూల అమ్మకందారులతో కలసి పనిచేయడం మొదలుపెట్టాడు. పూల వ్యాపారం గురించి మరింత తెలుసుకునేందుకు హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ పూల మార్కెట్‌ను సందర్శించాడు. తరువాత నెలకు రూ.3,500 జీతం వచ్చేలా ఒక పూల దుకాణంలో పనికి కుదిరాడు. జీతం చాలా తక్కువే అయినప్పటికీ, పూల వ్యాపారం నేర్చుకునేందుకు మంచి అవకాశం వచ్చిందని అరూప్ భావించాడు. ఉద్యోగం చేస్తూ పూల వ్యాపారంలోని సూక్ష్మ నైపుణ్యాలను నేర్చుకున్నాడు.ఆరంభంలో భారీ నష్టాలుకొంతకాలం తరువాత అరూప్ కోలాఘాట్లోని తన ఇంటికి తిరిగి చేరుకున్నాడు. దేశంలోని వివిధ నగరాల్లోని పూల దుకాణాలకు బంతి పూలను విక్రయించడం మొదలుపెట్టాడు. మొదట్లో రూ.2000 నుంచి రూ.3000 వరకు లాభం వచ్చింది. దీంతో 2011లో కొంత భూమిని కౌలుకు తీసుకుని అరూప్ బంతిపూల సాగును ప్రారంభించాడు. ఆరంభంలో అరూప్ భారీ నష్టాలను చవిచూశాడు. తొలుత కోల్‌కతా రకం బంతి పూలు(Kolkata type marigolds) సాగుచేశాడు. ఆ పూలు చిన్నవిగా ఉండటంతో అమ్ముడుపోయేవికాదు. దీంతో అరూప్‌కు వ్యాపారంలో నష్టం వచ్చింది. అయినా అరూప్ నిరాశపడలేదు. 2011లో థాయ్ లాండ్ వెళ్లి మూడు నెలల పాటు అక్కడే ఉండి, పూల సాగులో మెళకువలు నేర్చుకున్నాడు. టెన్నిస్ బాల్ మేరిగోల్డ్ పూలు, వాటి విత్తనాలను ఉత్పత్తి చేసే సాంకేతికతను తెలుసుకున్నాడు. అక్కడి నుంచి ఒక్కో బంతిపూల రకానికి చెందిన విత్తనాలు తీసుకుని కోలాఘాట్కు చేరుకున్నాడు.ఏటా రూ. 5 కోట్లకుపైగా ఆదాయంథాయ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన అరూప్ మరింత భూమిని లీజుకు తీసుకుని, అక్కడ టెన్నిస్ బాల్ రకం బంతి పూలను సాగుచేశాడు. కోలాఘాట్ మార్కెట్లో కిలో 100 రూపాయల చొప్పున బంతిపూలను విక్రయించాడు. డిమాండ్ పెరగడంతో బంతి పూల సాగును మరింతగా పెంచాడు. బంతిపూల విత్తనాలను కూడా అమ్మడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అరూప్ బంతిపూలు, మొక్కలు, విత్తనాలను విక్రయించడం ద్వారా ఏటా రూ.5 కోట్లకు పైగా ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు.ఇది కూడా చదవండి: Paramahansa Yogananda: ‘ఒక యోగి ఆత్మకథ’తో ఆధ్యాత్మిక మార్గాన్ని చూపి.. -
రైతుబిడ్డ సక్సెస్ స్టోరీ, యంగెస్ట్ ఐఐటీయన్, 24 ఏళ్లకే యాపిల్ ఉద్యోగం
అంకిత భావం, ఓర్పు పట్టుదలగా ప్రయత్నించాలే గానీ విజయం వంగి సలాం చేయాల్సిందే. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోడానికి పేదింటి రైతు బిడ్డ పడిన శ్రమ, చేసిన కృషి గురించి తెలుసుకుంటే ఈ మాటలు అక్షర సత్యాలు అంటారు. 13 ఏళ్లకే ఐఐటీ ర్యాంక్ సాధించి, 24 ఏళ్లకే యాపిల్ కంపెనీలో చేరిన సత్యం కుమార్ సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందామా!బిహార్(Bihar)కు చెందిన సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు సత్యం కుమార్ (Satyam Kumar). చిన్నప్పటి నుంచీ తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చకున్నాడు. అయితే పేదరికం కారణంగా చదువు చాలా కష్టంగామారింది. మేనమామ, స్కూలు టీచర్ సాయంతోదీక్షగా చదువుకున్నాడు. కేవలం 13 సంవత్సరాల వయస్సులో దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక ఐఐటీ జేఈఈ ర్యాంక్ సాధించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. 2012లో, అతను ఆల్-ఇండియా ర్యాంక్ 8,137 సాధించి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. అయితే, అతను మళ్లీ మళ్లీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఒక సంవత్సరం తరువాత, అతను మళ్ళీ పరీక్ష మరియు పరీక్షలో ఎక్కువ ర్యాంక్ సాధించాడు.2013లో 13 ఏళ్ల వయసులో కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీటు పొందిన సత్యం, 679 ర్యాంక్ సాధించి, ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు (మునుపటి రికార్డు సహల్ కౌశిక్ పేరిట ఉంది అతను 14 సంవత్సరాల వయస్సులో ఈ ఘనతను సాధించాడు). 2013లో ఐఐటీలో 679 ర్యాంక్ తో ఐఐటీ కాన్పూర్( IIT Kanpur) నుంచి 2018 సంవత్సరంలో బీటెక్ పూర్తి చేశాడు. ఇక్కడ చదువుకునే సమయంలోనే మూడు ప్రాజెక్ట్ లపై సత్యం కుమార్ వర్క్ చేసిన ప్రశంలందుకోవడం విశేషం.ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో సంయుక్త BTech-MTech కోర్సు, అమెరికాలోని ఆస్టిన్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం PhDని పూర్తిచేశాడు. ఆ తరువాత కేవలం 24 సంవత్సరాల వయస్సులో Appleలో ఉద్యోగం చేసాడు. అక్కడ, అతను ఆగస్టు 2023 వరకు మెషిన్ లెర్నింగ్ ఇంటర్న్‌గా పనిచేశాడు.అలాగే యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో గ్రాడ్యుయేట్ రీసెర్చ్ అసిస్టెంట్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేజెస్ స్పెషలైజేషన్‌తో పనిచేశాడు.రాజస్థాన్‌లోని కోటలోని మోడరన్ స్కూల్లో చదువుతున్న సమయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పశుపతి సింగ్, సత్యం ప్రతిభను గుర్తించారు. అందుకే IIT ప్రవేశ పరీక్ష,కోచింగ్ ఖర్చులను వర్మ స్వయంగా భరించారని సత్యం మేనమామ మీడియాకు తెలిపారు. ఈ క్రమంలోనే భవిష్యత్తులో తన రాష్ట్రంలోని పేద విద్యార్థులకు చదువు నేర్పించాలని భావిస్తున్నాడు సత్యం. సత్యం సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా అనడంలో ఎలాంటి సందేహం లేదు. -
20 ఏళ్లకే గ్రేడ్ వన్ అధికారిగా.. ఉత్కర్ష్ శుక్లా సక్సెస్ స్టోరీ
జీవితంపై కోటి ఆశలతో కలలుగనేవారు వాటిని సాకారం చేసుకునేందుకు నిరంతరం శ్రమిస్తుంటారు. అలాంటివారే విజయాలను అందుకుంటారు. దీనిని పలువురు రుజువు చేశారు. ఆ కోవలోకే వస్తాడు యూపీలోని అమేథీకి చెందిన ఉత్కర్ష్ శుక్లా. ఒకనాడు తనకు చదువుకునే పరిస్థితి లేకపోయినా పట్టుదలతో అనుకున్నది సాధించి చూపాడు.యూపీలోని అమేథీలో గల రాజీవ్ గాంధీ పెట్రోలియం ఇనిస్టిట్యూట్‌లో ఉత్కర్ష్ శుక్లా బీటెక్ కోర్సు పూర్తి చేశాడు. చదువులో అత్యుత్తమ ప్రతిభ చూపినందుకు ఉత్కర్ష్ శుక్లా డిగ్రీతోపాటు రాష్ట్రపతి బంగారు పతకం కూడా అందుకున్నాడు. చిన్నప్పటి నుండి ఉత్కర్ష్‌కు చదువులో ఘన విజయం సాధించాలనే తపనతో ఉండేవాడు. ఉత్కర్ష్ తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి.బీటెక్ పూర్తి చేసిన ఉత్కర్ష్ ప్రస్తుతం భారత్ పెట్రోలియం కార్పొరేట్ లిమిటెడ్‌లో గ్రేడ్ వన్ అధికారిగా ఎంపికయ్యారు. 20 ఏళ్ల వయసులో ఉత్కర్ష్ ఇంతటి గొప్ప విజయాన్ని సాధించాడు. ఉత్కర్ష్ మీడియాతో మాట్లాడుతూ తాను సాధించిన విజయం తనకు ఎంతో ఆనందమిస్తున్నదని చెబుతూ, తాను గతంలో ఎదుర్కొన్న అనుభవాలను తెలిపాడు. కరోనా సమయంలో పుస్తకాలు దొరక్క చదువుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని, పోటీ పరీక్షల ప్రపరేషన్కు అనేక ఆటంకాలు ఎదురయ్యాయని తెలిపాడు. అయితే పట్టువదలక పోటీ పరీక్షల్లో ఘన విజయం సాధించానని అన్నాడు. ఇది కూడా చదవండి: ఎంఏ చాయ్‌వాలా.. ఏటా లక్షల సంపాదన -
వెయిటర్గానే ఉండిపోతానేమో అనుకున్నాడు...కట్ చేస్తే..!
అవార్డ్ విజేత, చిత్రకారుడు దీనా సో ఓతేహ్ నీడ– కాంతిలో విలక్షణతను చూపడంలో మాస్టర్. యునైటెడ్ స్టేట్స్లో ఉండే ఈ కళాకారుడి చిత్రాలు మిగతా వాటితో పోల్చితే చాలా భిన్నంగా ఉంటాయి. చీకటి నుండి వెలువడే ప్రకాశవంతమైన చిత్రాలను మన కళ్లకు కడతాడు. ఇద్దరు వ్యక్తుల మధ్య పోరాటాన్ని ‘చిత్రం’గా చూపుతాడు. గురువెవ్వరూ లేకుండానే తన ఊహల్లో నుండి పుట్టుకువచ్చిన కళ గురించి వివరిస్తుంటే వినేవారు చాలా అబ్బురంగా చూస్తారు. ‘‘మా అమ్మ చిన్నప్పటి నుండి నాలో కళాత్మక అభిరుచిని గుర్తించింది. దానిని పెంపొందించడానికి ప్రాధాన్యతను ఇచ్చింది. నేను మంచి కళాకారుడిగా మారుతానని ముందే అనుకున్నాను. కళను వృత్తిగా కొనసాగించాలనే ఆలోచన చాలా ఆలస్యంగా వచ్చింది. నాకు 12 ఏళ్ల వయసులో నా కుటుంబం యునైటెడ్ స్టేట్స్కు వలస వచ్చింది. నాటి పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. మా అమ్మనాన్నలు విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో మాకు సంబంధించిన న్యాయపరమైన పత్రాలన్నీ నాన్న తనతో తీసుకెళ్లిపోయారు. సరైన పత్రాలు లేకపోవడంతో 18 ఏళ్ల వయసులో చదవుకు స్కాలర్షిప్కు అర్హత కోల్పోయాను. దీంతో ఎనిమిదేళ్లు వెయిటర్‌గా పనిచేశాను. అప్పుడు నా కెరీర్ వెయిటర్ అనే అనుకున్నాను. అనిశ్చితి నుంచి నైపుణ్యాలుమొదట నేను ఫైన్ ఆర్ట్ ఆర్టిస్ట్‌ను కాదు. సరైన పత్రాలు లేక΄ోవడం వల్ల వలసదారునిగా ఎనిమిదేళ్లు అనిశ్చితిని ఎదుర్కొన్నాను. ఇష్టపడే పని చేస్తున్నప్పుడే స్థిరత్వం లభించడం ప్రారంభమైంది. నాకు నేను స్వయంగా ఇలస్ట్రేషన్స్ వేసేవాణ్ణి. ఈ సాధన ద్వారా ఇలస్ట్రేషన్ నా నైపుణ్యాలు పెరిగాయి. అది ఎంతగా అంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్‌లో డిగ్రీ సాధించాను. మాస్టర్స్ ప్రోగ్రామ్ద్వారా స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్‌లో మరింత అధ్యయనం సాధ్యమైంది. అప్పుడే ఇలస్ట్రేషన్ నాకు సరిగ్గా సరి΄ోతుందనిపించింది. కథలు చెప్పడం, నేర్చుకోవడం, సమస్యను పరిష్కరించడం, సృష్టించడం... ఇలా ప్రతీది నా మనో వికాసానికి, వృద్ధికి ఇలస్ట్రేషన్ ఆర్ట్ కొత్త తలుపులు తెరిచింది. చివరకు నాది అయిన మార్గంలో ఉన్నట్టు అనిపించింది. ఇదంతా సాధ్యమైంది మా అమ్మ ద్వారా. ఆమే నన్ను నేను గర్వపడేలా చేసింది.నిశ్శబ్దం నుంచి...పరధ్యానాన్ని నివారించడానికి సాధారణంగా స్కెచ్ వేయడం ప్రారంభిస్తాను. కొన్నిసార్లు తెల్లవారుజామున 4–5 గంటల సమయాన్ని ఎంచుకుంటాను. ఆ నిశ్శబ్ద సమయం, ప్రపంచం మేల్కొనే ముందు నేను చాలా సృజనాత్మకంగా ఉంటాను. పరధ్యానాల నుండి విముక్తి పొందుతాను. ఏదైనా ‘రంగు’లోనే ఆలోచిస్తాను. ఎందుకంటే అది ఏదో ఒక చిన్న సృష్టికి కారణం అవుతుంది. అక్కడ నుంచి నా స్కెచ్లకు విస్తృతంగా పని దొరుకుతుంది. ఆరిస్ట్ మార్షల్ అరిస్కాన్ ఎప్పుడూ ఒక మాట చెబుతాడు ‘మీకు తెలిసిన వాటిని గీయండి’ అని. ఆ పదాన్ని అర్ధం చేసుకోవడానికి నాకు సమయం పట్టింది. కానీ, కాలక్రమేణా అది స్పష్టమైంది. కాంతి–చీకటి మధ్య అంతర్గత పోరాటం నాకు తెలిసింది. నేను నా జీవితంలో చాలా చీకటి కాలాలను ఎదుర్కొన్నాను. పోరాటాలకు మించిన అందం వాటిలోనే ఉందని నా ప్రగాఢ నమ్మకం. ఒక అంశంపై తగినంత అవగాహన లేకుండా పని మొదలుపెడితే ఆందోళన కలుగుతుంది. అయితే, ఆ క్షణంలో నేను నా అహం, ఊహాత్మక తీర్పులను, ఫెయిల్ అవుతానేమో అనే భయాలను వదిలేస్తూ ఆర్ట్‌లోకి ప్రయాణిస్తాను’’ అని వివరిస్తాడు ఈ చిత్రకారుడు View this post on Instagram A post shared by Nautilus Magazine (@nautilusmag) -
50 పైసలకు టీ అమ్ముకునే మహిళ..రూ. 100 కోట్లకు అధిపతిగా!
స్వతంత్రంగా జీవించాలని, సొంతకాళ్లపై నిలబడాలనే ఆలోచన ఒక మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. అదీ కష్టాల్లో ఉన్న మహిళ ధైర్యంగా, ఆర్థికంగా ఉన్నతంగా బతకాలని నిర్ణయించుకుంటే మాత్రం తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది. అంది వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ధీరగా నిలబడుతుంది. బీచ్‌లో కాఫీ, టీ అమ్ముకునే స్థాయి నుంచి రెస్టారెంట్ల సారధిగా ఎదిగిన పెట్రిసియా నారాయణ్ అనే మహిళ సక్సెస్ జర్నీ అలాంటిదే. ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి!తమిళనాడులోని నాగర్‌కోయిల్ ప్రాంతంలో జన్మించారు ప్యాట్రిసియా థామస్ 17 ఏళ్ల వయస్సులోనే నారాయన్ అనే వ్యక్తిని మతాంతర వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లలు కలిగారు. కానీ కాల క్రమంలో ఆమె కలలన్నీ కరిగిపోవడం మొదలైంది. ఆమె భర్త మాదకద్రవ్యాలు, డ్రగ్స్‌కి భావిసగా మారిపోయాడు. జీవితం దుర్భరమైపోయింది. డబ్బుల కోసం భర్త వేధించేవాడు. సిగరెట్లతో కాల్చేవాడు. అందిన డబ్బులు తీసుకుని నెలల తరబడి అదృశ్యమయ్యేవాడు. ఇక అతనిలో మార్పురాదని గ్రహించింది. దిక్కుతోచని నిస్సహాయ స్థితిలో ఉన్నపుడు అదృష్టవశాత్తూ ఆమె తల్లిదండ్రులు ఆమెకు ఆసరాగా నిలబడ్డారు.తల్లి ఇచ్చిన ఆర్థిక బలానికి పెట్రిసియా నారాయణ్ దృఢ సంకల్పం తోడైంది. వంటపై ఉన్న ఆసక్తినే వ్యాపారంగా మార్చుకుంది. పచ్చళ్లు, జామ్ లు వంటివి సిద్ధం చేసి విక్రయించటం ప్రారంభించింది. మంచి ఆదరణ లభించింది. దీంతో మరింత ఉత్సాహం వచ్చింది. విభిన్నంగా ఆలోచించింది. పచ్చళ్లు, జామ్‌ల వ్యాపార లాభాలను మరో వ్యాపారంలో పెట్టాలని భావించింది. అంతే క్షణం ఆలోచించకుండా చెన్నై మెరీనా బీచ్‌లో టీ, కాఫీ, జ్యూస్, స్నాక్స్ అమ్మే వ్యాపారాన్ని ప్రారంభించింది. కేవలం 50 పైసలకు కాఫీ, టీ అమ్మింది. మెుదటి రోజు కేవలం ఒక్క కాఫీ మాత్రమే అమ్ముడు బోయింది. అయినా ఎక్కడా ధైర్యం కోల్పోలేదు. పట్టుదలగా ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. అంతే తర్వాతి రోజు పుంజుకున్న వ్యాపారం రూ.700కి చేరింది. మెనూలో శాండ్విచ్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఐస్‌క్రీమ్‌లను కూడా చేర్చింది. స్నాక్స్, ఫ్రెష్ జ్యూస్, కాఫీ, టీ అమ్మడంలో ఆమెకు సహాయం చేయడానికి ఇద్దరు వికలాంగులను నియమించుకుంది. మెరీనా నే బిజినెస్ స్కూల్,అదే నా ఎంబీయే అంటారు ప్యాట్రిసియా. అలా తన సొంత వ్యాపారంతో కుటుంబాన్ని పోషించింది. ఈ క్రమంలో 1998లో సంగీత గ్రూప్ నెల్సన్ మాణికం రోడ్ రెస్టారెంట్‌కి డైరెక్టర్ అవకాశాన్ని పొందటంతో జీవితం మలుపు తిరిగింది.2002లో భర్త మరణించాడు. రెండేళ్ల తర్వాత కూతురు, అల్లుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దీంతో దివంగత కుమార్తె జ్ఞాపకార్థం, కుమారుడుతో కలిసి తొలి రెస్టారెంట్ 'సందీప'ను ప్రారంభించింది. ఇక అప్పటినుంచీ, ఆ హోటలే తన కుమార్తెగా మారిపోయింది. అంత జాగ్రత్తగా దాన్ని ప్రేమించి పోషించింది. కట్ చేస్తే..సందీప్ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ చెన్నైలో కొత్త బ్రాంచీలతో విస్తరించింది. ప్రస్తుతం పెట్రిసియా నారాయణ్ నికర విలువ దాదాపు రూ.100 కోట్లుగా అంచనా. ప్రస్తుతం ఆమె 14 వివిధ ప్రాంతాల్లో 200 మంది ఉద్యోగులతో విజయవంతంగా నడుస్తున్న ఆమె సక్సెస్ జర్నీ స్పూర్తిదాయకంగా నిలుస్తోంది. 2010లో 'FICCI ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును గెలుచుకుంది. సైకిల్ రిక్షా, ఆటో రిక్షానుంచి సొంతకారుకు తన జీవితం మారిందనీ, రోజుకు 50 పైసలు ఆదాయం రోజుకు రూ. 2 లక్షలకు పెరిగింది. ఇద్దరు వ్యక్తులతో మొదలైన తన వ్యాపారం 200 వందలకు చేరిందని గర్వంగా చెప్పుకుంటారు ప్యాట్రిసియా . ఇదీ చదవండి : నయా ట్రెండ్ : పెళ్లికి ముందే బేబీ బంప్ ఫొటోషూట్ రచ్చ! -
కేవలం రూ. 500తో మొదలై, కష్టాలను ‘పచ్చడి’ చేసింది!
రోజూ కొన్ని గంటల పాటు నడుచుకుంటూ పట్టణానికి వెళ్లి కూరగాయలు అమ్మే యాంగ్మీలా ఇప్పుడు ఒక స్టార్టప్‌కు యజమానురాలు. ఎంతోమంది గ్రామీణ మహిళలకు ఉపాధిని, స్ఫూర్తిని ఇస్తున్న ఉత్తేజం.మణిపూర్‌లోని ఫరుంగ్ గ్రామానికి చెందిన యాంగ్మీలా ప్రతిరోజూ ఉదయం తన ఊరి నుంచి ఉఖ్రుల్ పట్టణానికి కూరగాయల బుట్టను మోసుకుంటూ ఏడు కిలోమీటర్లు నడిచి వెళ్లేది. వాటిని అమ్మి ఎండలో తిరిగి ఇంటికి వచ్చేది. తాను నడిచి వెళ్లే దారి మామూలు దారి కాదు. కొండల దారి.ఆర్థిక ఇబ్బందుల వల్ల 21ఏళ్ల వయసులో కూరగాయలు అమ్మడం మొదలుపెట్టింది యాంగ్మీలా. అప్పటికే ఆమెకు ఒక మగబిడ్డ. భర్త తనను విడిచి వెళ్లాడు. బిడ్డతోపాటు అనారోగ్యంతో బాధ పడుతున్న తండ్రిని చూసుకోవాల్సిన బాధ్యత ఉండడంతోకష్టాన్నే నమ్ముకుంది యాంగ్మీలా. వయసు పైబడుతుండడంతో యాంగ్మీలాకు నడక భారమైంది. ‘ఇలా ఎంతకాలం! వేరే మార్గం లేదా?’ అని ఆలోచించింది మనసులో. ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచనతో మొదటగా పాత బట్టల వ్యాపారంలోకి అడుగు పెట్టింది. ఆ తరువాత కోళ్ల పెంపకం చేపట్టింది. మిఠాయిల దుకాణం నడిపింది. ఉసిరి, మామిడి, ఆపిల్... మొదలైన వాటిని ప్రాసెస్ చేసి మిఠాయిలు తయారు చేసేది. ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన శిక్షణ శిబిరంలో సాల్గొన్న తరువాత ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారంలోకి అడుగు పెట్టింది.మిర్చి, వెల్లుల్లి, వంకాయలు, వెదురు చివుళ్లు... మొదలైన వాటితో సేంద్రియ ఊరగాయల తయారీని ప్రారంభించింది. తన స్టార్టప్‌కు ‘షిరిన్ ప్రొడక్ట్స్’ అని పేరు పెట్టింది. ‘షిరిన్’ అనేది నాగా పదం. ‘పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ అభివృద్ధి’ అనేది దీని అర్థం.జర్మన్ ఎన్జీవో ‘జీఐజెడ్’ నుంచి ఈ స్టార్టప్‌కు 1.2 లక్షల గ్రాంట్ లభించింది. ఆర్బీఐకి సంబంధించిన ‘రంగ్ దే’ అనే లెండింగ్ ప్లాట్‌ఫామ్ నుంచి రెండు లక్షల రుణం తీసుకుంది. ‘షిరిన్ ప్రొడక్ట్స్ చుట్టుపక్కల ప్రాంతాలలోనే కాకుండా మణిపూర్ రాజధాని ఇంఫాల్, అస్సాం, నాగాలాండ్, దిల్లీలలో కూడా అమ్ముడవుతున్నాయి.ఫేస్బుక్, ఇతర ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది యాంగ్మీలా.‘ఒకే ఉద్యోగితో మా కంపెనీ ప్రారంభం అయింది. మొదట్లో డోర్ టు డోర్ అమ్మకాలు చేసేవాళ్లం. ఇప్పుడు నా దగ్గర పన్నెండు మంది వర్కర్లు పనిచేస్తున్నారు. వారికి నేనే శిక్షణ ఇచ్చాను’ అంటుంది యాంగ్మీలా. ఎమ్మెస్సీ చేసిన ఆమె కుమారుడు షంగ్రీఫా ఇప్పుడు వ్యాపారంలో తల్లికి సహాయంగా ఉంటున్నాడు.‘సింగిల్ మదర్‌గా ఆమె ఎలాంటి కష్టాలు పడిందో ఊహించుకోవచ్చు. అయితే ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. కష్టపడాలి, ఎప్పుడూ ఏదో చేయాలనే తపన ఆమెకు విజయాన్ని చేరువ చేసింది. వ్యాపారం మీద ఎంత శ్రద్ధ పెట్టిందో నా చదువు, భవిష్యత్ మీద కూడా అంతే శ్రద్ధ పెట్టింది. ఆమెను చూసి గర్వపడతాను. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి భయపడని ధైర్యవంతురాలైన మహిళ మా అమ్మ’ తల్లి గురించి గర్వంగా చెబుతాడు షంగ్రీఫా.‘అస్సాం ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అవార్డ్’ తో సహా ఎన్నో అవార్డ్లు అందుకున్న యాంగ్మీలా ఎంతోమంది గ్రామీణ మహిళలకు స్ఫూర్తిని ఇస్తోంది. -
ఉద్యోగం వదిలేసి మరీ ‘మునగ’ సాగు : జీవితాన్ని మార్చేసింది!
ఉద్యోగం వద్దు వ్యవసాయమే ముద్దు అని అతను నమ్మాడు. సాగులోకి దిగింది మొదలు నిరంతర కృషితో రుషిలా తపించి ఒక అద్భుత మునగ వంగడాన్ని రూపొందించారు. ఈ వంగడం ఖ్యాతి దేశం నలుమూలలకు విస్తరించింది. అధిక దిగుబడులనిస్తూ అళగర్ స్వామికే కాదు అనేక రాష్ట్రాల్లోని వేలాది మంది రైతులకూ కనక వర్షం కురిపిస్తోంది. ఈ ఆవిష్కరణతో అళగర్ స్వామి వ్యవసాయ క్షేత్రం మునగ నర్సరీగా మారిపోయింది.ఏరోజు కారోజు విధులు ముగించుకొని బాధ్యతలు తీర్చుకునే ఉద్యోగం కాదు రైతు జీవితం. అలాగని పంటలు పండించటం, అమ్ముకోవటంతోనే దింపుకునే తల భారమూ కాదు. ఎంత చాకిరీ చేసినా వద్దనని పొలం సముద్రాన్ని ఈదటంలా అనిపిస్తుంటే.. అలసిపోని చేపలా మారి ఆ ప్రయాణాన్ని ఆస్వాదించగలిగితేనే రాణింపు, సంతృప్తి. అళగర్స్వామి చేసింది అదే. తమిళనాడు దిండిగల్ జిల్లాలోని పల్లపట్టి గ్రామం స్వామి జన్మస్థలం. ఆర్ట్స్‌లో పీజీ విద్యను పూర్తి చేసిన స్వామి మక్కువతో వ్యవసాయాన్ని చేపట్టారు. మొక్కుబడి వ్యవసాయం చే యకుండా నిరంతరం శాస్త్రవేత్తలతో చర్చిస్తూ ఆధునిక పద్ధతులను ఆకళింపు చేసుకుంటూ.. వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించారు. దిండిగల్ నుంచి మధురైకి వెళ్లే ప్రధాని రహదారి పక్కనే అళగర్ స్వామికి చెందిన 20 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. బీడు భూమిని సాగులోకి తెచ్చే క్రమంలో మునగ వంగడాన్ని రూ పొందించేందుకు కృషిని మమ్మురం చేసి 2002లో ఒక నూతన మునగ వంగడాన్ని ఆవిష్కరించారు. రెండు స్థానిక రకాలను సంకరం చేసి ఈ వంగడాన్ని సృష్టించారు. దీనికి ‘పళ్లపట్టి అళగర్ స్వామి వెళ్లిమాలై మురుగన్’(పీఏవీఎం) అని తన పేరే పెట్టుకున్నారు. తక్కువ నీటితో సాగయ్యే ఈ వంగడం కరవు పరిస్థితులను, చీడపీడలు, తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకొని మంచి దిగుబడినిస్తుంది. సాగులో ఉన్న రకాలకన్నా అధిక దిగుబడులను ఇస్తుండటంతో ఆనోటా ఈనోటా ప్రచారంలోకి వచ్చిన ఈ వంగడం ఖ్యాతి దేశమంతటా పాకింది. దక్షిణాది రాష్ట్రాలతోపాటు మునగకు పుట్టినిల్లయిన ఉత్తర భారతదేశంలోనూ రైతులు ఈ వంగడం సాగుపై మొగ్గు చూపుతున్నారు. (కంపెనీకి బాండ్ రాశారా? రాజీనామా చేస్తే ఆ బాండ్లు చెల్లుతాయా? )తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 20 వేల మంది రైతులు 30 వేల ఎకరాల్లో పీఏవీఎం మునగ వంగడాన్ని సాగు చేస్తున్నారు. దాదాపు 90 లక్షల పీఏవీఎం మునగ మొక్కలను అళగర్ స్వామి వివిధ రాష్ట్రాల రైతులకు అందించారు. గ్రాఫ్టింగ్ లేదా ఎయిర్ లేయర్ పద్ధతుల్లో అంట్లు కడుతున్నారు.20 అడుగులకో మొక్క...మునగను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే పద్ధతులను అళగర్ స్వామి అనుసరిస్తున్నారు. పంచగవ్యను కనుగొన్న డాక్టర్ నటరాజన్‌తో ఆయనకు సన్నిహిత సంబంధం ఉంది. పంచగవ్యను క్రమం తప్పకుండా వాడతారు. భూమిని దున్ని సిద్ధం చేసుకున్న తర్వాత.. తూర్పు పడమర దిశలో మొక్కలు, సాళ్ల మధ్య 20 అడుగుల ఎడం ఉండేలా నాటుకోవాలి. దీనివల్ల మొక్కలకు గాలి, వెలుతురు ధారాళంగా లబిస్తుంది. ఎకరాకు 150 నుంచి 200 మొక్కల వరకు నాటుకోవచ్చు. మునగ మొక్కలు పెళుసుగా ఉంటాయి కాబట్టి రవాణాలోను.. నాటుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. 50 సెం. మీ. లోతు వెడల్పుతో గుంతలు తీసుకోవాలి. 20 రోజుల వయసు మొక్కలను నాటుకొని, గాలులకు పడి పోకుండా కర్రతో ఊతమివ్వాలి. ప్రతి మొక్కకు 5 కిలోల కం΄ోస్టు ఎరువు లేదా 10 కిలోల పశువుల ఎరువు వేసుకోవాలి. కొత్త మట్టితో గుంతను నింపితే మొక్క త్వరగా వేళ్లూనుకుంటుంది. నాటిన మరుసటి రోజు నుంచి రెండు నెలల పాటు నీరుపోయాలి. తెగుళ్లు వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి తగుమాత్రంగా తడులు ఇవ్వాలి. పూత కాత దశలో మాత్రం సమృద్ధిగా నీరందించాలి. మిగతా సమయాల్లో పొలం బెట్టకొచ్చినట్టనిపిస్తే తడి ఇవ్వాలి. వర్షాధార సాగులో నెలకు రెండు తడులు ఇస్తే చాలు. అంతర కృషి చేసి చెట్ల మధ్య కలుపును ఎప్పటికప్పుడు తొలగించాలి. ఒకటిన్నర ఏడాది తర్వాత కొమ్మల కత్తిరింపు చేపట్టాలి. బలంగా ఉన్న నాలుగైదు కొమ్మలను మాత్రమే చెట్టుకు ఉంచాలి. పెద్దగా చీడపీడలు ఆశించవు. పశువుల బారి నుంచి కాపాడుకునేందుకు కంచె వేసుకోవాలి.లక్షల మొక్కల సరఫరా...ఆళ్వార్ స్వామి ప్రస్తుతం మునగ కాయల సాగుపైన కన్నా నర్సరీపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. 100 మంది కూలీలతో పల్లపట్టి గ్రామంలో నర్సరీని ఏర్పాటు చేసి రైతులకు పీఏవీఎం మొక్కలను సరఫరా చేస్తున్నారు. 90 లక్షలకు పైగా మొక్కలను విక్రయించారు. ఏటా రూ. 6 లక్షలకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అళగర్ స్వామి కృషికి మెచ్చి ఎన్నో అవార్డులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ అందించే ప్రతిష్టాత్మక సృష్టి సమ్మాన్ అవార్డుతోపాటు సీఐఐ అవార్డు, మహీంద్రా టెక్ అవార్డు వంటి దాదాపు వంద అవార్డులు ఆయనను వరించాయి. సిటీ బ్యాంక్ ఉత్తమ ఔత్సాహిక వ్యాపారవేత్త అవార్డుతో సత్కరించడం విశేషం. అద్భుతమైన ఆవిష్కరణతో ఖ్యాతి గడించిన అళగర్ స్వామి స్థానిక గ్రామీణ ఆవిష్కర్తల సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ రైతులకు స్ఫూర్తినిస్తున్నారు. ఐదేళ్లలో చెట్టుకు 3 క్వింటాళ్ల దిగుబడి..ఇతర వంగడాలు నాటిన 9 నెలలకు కాపుకొస్తాయి. పీఏవీఎం మునగ ఆరు, ఏడు నెలల నుంచే కాస్తుంది. సాళ్లు, మొక్కల మధ్య 20 అడులు దూరంలో ఎకరానికి 150 మొక్కలు నాటుకోవాలని అళగర్ స్వామి సూచిస్తున్నారు. నాటిన ఏడాదిన్నర నుంచి ఎకరానికి 10 – 15 టన్నుల కాయల దిగుబడి వస్తుంది. ఐదేళ్ల వయసు చెట్టు సగటున ఏడాదికి 300 కిలోల దిగుబడినిస్తుంది. ఐదేళ్ల తోట నుంచి ఏడాదికి 30 టన్నుల దిగుబడి వస్తుంది. సాధారణ రకాల్లో కాయల దిగుబడి 20 టన్నులే. పైగా అవి ఐదారేళ్ల పాటే నిలకడగా దిగుబడులిస్తాయి. పీఏవీఎం మాత్రం ఏడాదికి 8 –9 నెలల చొప్పున 20–25 ఏళ్లపాటు మంచి దిగుబడి నిస్తుంది. తమిళనాడు రైతులు స్థానిక మార్కెట్లలో కాయ రూ. 5 – 20 చొప్పున విక్రయిస్తున్నారు. ఖర్చులు పోను ఏటా ఎకరాకు రూ. లక్షకు పైగా ఆదాయం ఆర్జిస్తున్నారు. కొందరు రైతులు కంచె పంటగాను ఈ వంగడాన్ని సాగు చేస్తున్నారు. -
రూ. 10వేల అప్పుతో రూ.32000 కోట్ల సామ్రాజ్యం: ఎవరీ 'రవి మోదీ'?
భారతదేశంలో జరిగే వివాహాల్లో దాదాపు అందరూ.. చాలా వరకు సాంప్రదాయ వస్త్రాలనే ధరిస్తారు. సంప్రదాయ వస్త్రాలు అంటే.. ముందుగా గుర్తొచ్చే బ్రాండ్లలో ఒకటి 'మన్యవర్'. ఈ బ్రాండ్ కేవలం 10వేల రూపాయలతో మొదలైందని.. బహుశా చాలామందికి తెలుసుండకపోవచ్చు. ఈ కథనంలో మన్యవర్ గురించి, దీని అభివృద్ధికి కారణమైన వ్యక్తి గురించి వివరంగా తెలుసుకుందాం.మన్యవర్ బ్రాండ్ నేడు ప్రపంచ స్థాయికి ఎదగటానికి కారణమైన వ్యక్తి 'రవి మోదీ' (Ravi Modi). ఈయన తండ్రికి కోల్‌కతాలో చిన్న బట్టల దుకాణం ఉండేది. చిన్నప్పటి నుంచే రవి.. తన తండ్రికి వ్యాపారంలో సహాయం చేస్తూ ఉండేవాడు. సుమారు తొమ్మిది సంవత్సరాలు బట్టల దుకాణంలోని పనిచేస్తూ.. ఈ వ్యాపారానికి సంబంధించిన పూర్వాపరాలు తెలుసుకున్నాడు.రూ.10000 అప్పుతోఅప్పట్లోనే రవి మోదీ కోల్‌కతాలోని సెయింట్ జేవియన్స్ కాలేజీలో బీ.కామ్ పూర్తి చేశాడు. అయితే చాలా రోజులుగా తండ్రి దుకాణంలోని పనిచేస్తూ ఉన్నాడు, ఇంతలోనే తండ్రితో చిన్న విభేదాలు రావడంతో.. తానే సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో తల్లి దగ్గర నుంచి రూ.10,000 తీసుకుని తన కొడుకు పేరు మీదుగా 'వేదాంత్ ఫ్యాషన్స్' అనే పేరుతో బట్టల వ్యాపారమే ప్రారంభించాడు.రవి మోదీ ప్రారంభించిన వేదాంత్ ఫ్యాషన్ అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్ వంటి రాష్ట్రాల్లో రెడీమేడ్ వస్త్రాలను.. రవి విక్రయించడం ప్రారంభించాడు. ప్రజలు కూడా ఇతడు విక్రయించే దుస్తులను బాగా ఇష్టపడ్డారు. వేదాంత్ ఫ్యాషన్స్ లిమిటెడ్ కింద 'మన్యవర్' కూడా చేరింది.భారతదేశంలోని 248 నగరాల్లోమన్యవర్ నేడు భారతీయ వివాహ మార్కెట్లో ప్రసిద్ధ బ్రాండ్. మనదేశంలో పాపులర్ బ్రాండ్‌గా నిలిచిన మన్యవర్ తొలి అంతర్జాతీయ స్టోర్ 2011లో దుబాయ్‌లో ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సంస్థ భారతదేశంలోని సుమారు 248 నగరాల్లో విస్తరించి ఉంది. దేశంలో మాత్రమే కాకుండా గ్లోబల్ మార్కెట్లో 662 స్టోర్లు ఈ మన్యవర్ కింద ఉన్నాయి.రూ. 32వేల కోట్ల కంటే ఎక్కువరవి మోదీ భార్య 'శిల్పి' కంపెనీ బోర్డులో ఉండగా, ఆయన కుమారుడు 'వేదాంత్' కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. కేవలం 10 వేల రూపాయలతో ప్రారంభమైన కంపెనీ విలువ నేడు రూ. 32వేల కోట్ల కంటే ఎక్కువ.ఇదీ చదవండి: సంపదలో సరికొత్త రికార్డ్.. ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా మస్క్మన్యవర్ విజయం.. రవి మోదీని భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యక్తుల జాబితాలో చేర్చింది. ఏప్రిల్ 2023 నాటికి, అతని నికర విలువ 3 బిలియన్లకు (సుమారు రూ. 26,000 కోట్లు) పెరిగింది. ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. రవి మోదీ భారతదేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 64వ స్థానాన్ని.. ప్రపంచవ్యాప్తంగా 1,238వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. -
నాడు నమ్మి లోన్ ఇవ్వలేదు.. నేడు రూ.40 వేల కోట్ల కంపెనీ
వ్యాపార రంగంలో రాణించడం అంత సులువు కాదు.. అందునా మహిళలకు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకపోయినా దశాబ్దాల క్రితం దేశంలో ఓ మహిళ వ్యాపారం ప్రారంభించడమంటే పెద్ద సాహసమే. బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్-షా తన ప్రయాణాన్ని గ్యారేజీలో ప్రారంభించి, దేశపు అత్యంత ప్రభావవంతమైన మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరిగా నిలిచారు.కిరణ్ మజుందార్ షా కథ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తినిస్తుంది. ఈ రోజు ఆమె 3.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.29,050 కోట్లు) నికర విలువతో ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళల్లో స్థానం సంపాదించారు. ఈ లిస్ట్‌లో 82వ స్థానంలో నిలిచిన కిరణ్ మజుందార్ షా భారత్‌లోని అత్యంత సంపన్న వ్యక్తుల్లో 91వ స్థానంలో ఉన్నారు.విద్య, నేపథ్యంకర్ణాటకలోని బెంగళూరులో 1953 మార్చి 23న జన్మించిన కిరణ్ బెంగుళూరు విశ్వవిద్యాలయం నుండి జంతుశాస్త్రంలో తన బీఎస్సీ పూర్తి చేశారు. సైన్స్‌పై ఆకాంక్షతో, ఆమె ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ విశ్వవిద్యాలయం నుండి మాల్టింగ్ అండ్ బ్రూయింగ్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆమె భారత్‌కు తిరిగి రావడానికి ముందు నాలుగు సంవత్సరాల పాటు కార్ల్టన్ & యునైటెడ్ బ్రూవరీస్లో ట్రైనీ బ్రూవర్‌గా పనిచేశారు.జాబ్ ఇవ్వని కంపెనీలుభారత్కు తిరిగి వచ్చిన తర్వాత బ్రూయింగ్‌లో కెరీర్‌ను నిర్మించుకోవాలని కిరణ్ భావించారు. అయితే ఆ సమయంలో భారతీయ పరిశ్రమ పురుషులకు ప్రత్యేకమైన వృత్తిగా బ్రూయింగ్ను చూసేది. దీంతో విద్యార్హతలు ఉన్నప్పటికీ ఢిల్లీ, బెంగళూరులోని కంపెనీలు ఆమెకు జాబ్ ఇవ్వకుండా తిరస్కరించాయి.ఇలా ఉండగా ఐరిష్ వ్యాపారవేత్త లెస్ ఆచిన్‌క్లోస్‌ను కలుసుకోవడం ఆమె కెరీర్‌ను కీలక మలుపు తిప్పింది. సొంత వ్యాపారాన్ని ప్రారంభించమని కిరణ్ మజుందార్ షాను ఆయన ప్రోత్సహించారు. ప్రారంభంలో సంశయించిన ఆమె ఐర్లాండ్‌లోని బయోకాన్ బయోకెమికల్స్‌లో ఆరు నెలల శిక్షణ కోసం ఆయన ప్రతిపాదనను అంగీకరించారు. ఒక వేళ ఆమెకు వ్యాపారం సరిపడకపోతే ఉద్యోగం కల్పించడంలో సహాయం చేస్తానని కూడా ఆచిన్‌క్లోస్ హామీ ఇచ్చారు.రూ.10,000తో బయోకాన్ ప్రారంభం1978లో భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత కిరణ్ బయోకాన్ బయోకెమికల్స్తో భాగస్వామిగా ఉంటూ కేవలం రూ.10,000 పెట్టుబడితో బయోకాన్ ఇండియాను స్థాపించారు. చిన్న గ్యారేజీలో వ్యాపారాన్ని ప్రారంభించిన ఆమె బొప్పాయి సారం నుండి ఎంజైమ్‌లను తయారు చేయడం మొదలుపెట్టారు. ఆమె ఉత్పత్తులు యూఎస్, యూరప్‌లో మార్కెట్‌ను పొందాయి. బయోకాన్‌కు మొదటి విజయం దక్కింది.తరువాత బీర్ వడపోతలో ఉపయోగించే ఐసింగ్లాస్ను తయారు చేయడం ప్రారంభించారు. బయోకాన్ దేశంలో అతిపెద్ద లిస్టెడ్ బయోఫార్మాస్యూటికల్ కంపెనీ. దీని విలువ రూ.40,000 కోట్ల కంటే ఎక్కువ.లోన్ ఇవ్వని బ్యాంకులుకిరణ్ తొలిరోజులలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. అప్పట్లో బయోటెక్నాలజీ భారత్‌లో ఒక నూతన రంగం. ఒక మహిళా వ్యాపారవేత్తగా ఆమె రాణించగలదా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. పురుషాధిక్య పరిశ్రమలో విజయం సాధించగల ఆమె సామర్థ్యాన్ని అనుమానిస్తూ బ్యాంకులు ఆమెకు రుణాలు మంజూరు చేసేందుకు నిరాకరించాయి. అయినప్పటికీ, ఆమె సంకల్పం, వినూత్న విధానం సందేహాల వ్యక్తం చేసినవారి కళ్లు తెరిపించాయి. -
సవాల్ ఉంటేనే సక్సెస్... తగ్గేదేలే!
‘గృహిణిగా బోలెడన్ని బాధ్యతలు ఉంటాయి ఇంక వ్యాపారాలు ఏం చేస్తారు?’ అనుకునేవారికి ‘చేసి చూపుతాం..’ అని నిరూపిస్తోంది నేటి మహిళ. ‘ఒకప్పుడు మేం గృహిణులమే ఇప్పుడు వ్యాపారులం కూడా’ అంటున్నారు. ఎవరిపైనా ఆధారపడకుండా, నచ్చిన పని చేస్తూ అందరూ మెచ్చేలా విజయావకాశాలను అందుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళలు కలిశారు. సవాళ్ళను ఎదుర్కోవడమే తమ సక్సెస్ మంత్ర అని చెప్పారు. ఆ వివరాలు వారి మాటల్లో... – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి స్ట్రాంగ్‌గా ఉంటే.. వింటారు సివిల్ ఇంజినీరింగ్ చేశాను. నాకు ఇంటీరియర్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం. దీంతో ఇంటీరియర్ అడ్వాన్స్ కోర్స్ 2018లో పూర్తి చేశాను. గేటెడ్ కమ్యూనిటీలు, సెలబ్రిటీ హౌజ్‌లు డిజైన్ చేశాను. కస్టమర్ బడ్జెట్, ఆలోచనలు తీసుకొని ప్రత్యేకంగా చేయడానికి ప్రయత్నిస్తుంటాను. ఇప్పటి వరకు 200లకు పైగా ్ర΄ాజెక్ట్స్ పూర్తి చేశాను. ఇంటీరియర్ డిజైనింగ్‌లో మహిళలు రాణించలేరు అనుకుంటారు. కానీ, నేను డామినేటింగ్‌గా ఉంటాను. స్ట్రాంగ్‌గా ఉంటే ఎవ్వరైనా మన మాట వింటారు. – అనూష మేకప్ ఒక ఆర్ట్ మేకప్ ఆర్ట్ నాకు చాలా ఇష్టమైన వర్క్. అందుకే, ప్రొఫెషనల్ కోర్స్ తీసుకొని, ముందు మా కమ్యూనిటీలోనే స్టార్ట్ చేశాను. ఇంటివద్దకే వచ్చి మేకప్ చేయించుకునేవారు. రెండేళ్ల క్రితం స్టూడియో ఏర్పాటు చేశాను. 7–8 రాష్ట్రాలలో మా స్టూడియో ద్వారా మేకప్ సర్వీస్ అందిస్తున్నాను. చాలా మంది మేకప్ అనగానే ఫౌండేషన్, కాజల్.. బ్యుటీషియన్ వర్క్ అనుకుంటారు. అలాగే మేకప్ అనేది చాలా మందికి పెళ్లి వంటి ప్రత్యేకమైన సందర్భం తప్పితే అంతగా అవసరం లేనిదిగా చూస్తారు. కానీ, పెళ్లి, వెస్టర్న్ పార్టీలు, బర్త్ డే పార్టీలు... ఇలా సందర్భానికి తగినట్టు మేకప్ స్టైల్స్ ఉన్నాయి. మేకప్ ఆర్టిస్టులకి మార్కెట్లో చాలా పెద్ద పోటటీ ఉంటుంది. కానీ, వారి నెట్‌వర్క్‌తో ప్రొఫెషనల్‌గా చేసే మేకప్‌కి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. – శ్రీలేఖ, మేకప్ సెంట్రల్ నిరూపించుకోవాలనుకుంటే సాధించగలంలక్సస్ డిజైన్ స్టూడియోస్పెషల్గా బ్రైడల్ వేర్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికీ డిజైన్ చేస్తాను. కార్పొరేట్ యూనిఫార్మ్స్, ఫస్ట్ బర్త్‌డే పార్టీలకు డ్రెస్ డిజైన్ చేస్తాను. 2013లో చెన్నైలో మొదటి బ్రాంచ్ స్టార్ట్ చేశాను. తర్వాత హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాం. సెలబ్రిటీలకు దాదాపు 50 తమిళ సినిమాలకు, 50 తెలుగు సినిమా స్టార్స్‌కి డిజైన్ చేశాను. ఫ్యాబ్రిక్ ఎంపికలో, ఉద్యోగుల విషయంలోనూ, డిజైనింగ్‌లోనూ.. ప్రతిదీ సవాల్‌గా ఉంటుంది. మనల్ని మనం నిరూపించుకోవాలనుకుంటే ఏమైనా సాధించగలం. - అమూల్య, అమూల్య అండ్ కృష్ణ కొచర్ పనిలో ప్రత్యేకత చూపాలికేక్ బేకింగ్ తయారు చేసేటప్పుడు నా చుట్టూ ఉన్నవారు ‘ఇప్పటికే మార్కెట్లో చాలామంది హోమ్ మేకర్స్ ఉన్నారు, నీవేం సక్సెస్ అవుతావు’ అన్నారు. కానీ, వారి మాటలు పట్టించుకోలేదు. నా హార్డ్ వర్క్‌నే నమ్ముకున్నాను. కస్టమైజ్డ్ కేక్స్ హాఫ్ కేజీవి కూడా తయారు చేస్తాను. ఎగ్‌లెస్ డిజర్ట్స్ కేక్స్ మా ప్రత్యేకత. మొదట మా కమ్యూనిటీలోని వారికే చేసేదాన్ని. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో ΄ోస్ట్ చేయడం, ఆ తర్వాత ఒక్కో ఆర్డర్ రావడం మొదలయ్యింది. టైమ్ ప్రకారం డెలివరీ చేసేదాన్ని. ఒకసారి ఒక జంటకు వారి బేబీ షవర్‌కి బహుమతులు ఆర్డర్‌పై అందించాను. ఇటీవల వారి రెండవ బేబీ షవర్ కోసం అతిథులకు ప్రత్యేకమైన కేక్ వర్క్‌షాప్ నిర్వహించాను. దాదాపు 400 మంది కస్టమర్లు ఆర్డర్స్ ఇస్తుంటారు. ఫైనాన్స్ సబ్జెక్ట్‌లో మాస్టర్స్ చేశాను. నాదైన సొంత ఆలోచనతో స్టార్టప్ నడ΄ాలని బేకింగ్ తయారీ మొదలుపెట్టాను. సక్సెస్ అవుతుందా అనే ఆలోచన లేకుండా, ఆందోళన పడకుండా రుచికరమైన కేక్స్ తయారుచేసివ్వడంలోనే దృష్టిపెట్టాను. – రాధిక, ఆర్బేక్ హౌజ్ఇదీ చదవండి: 13 బంగారు పతకాలు, తొలి ప్రయత్నంలోనే సివిల్స్ : ఎవరీ శ్రద్ధా -
తల్లి రైల్వే కూలీ.. బిడ్డకు పవర్ లిఫ్టింగ్‌లో బంగారు పతకం
రష్యాలో జరిగిన డబ్ల్యూపీపీఎల్ వరల్డ్ కప్ పవర్ లిఫ్టింగ్‌లో బంగారు పతకం సాధించి ప్రశంసలు అందుకుంటోంది కస్తూరి రాజమూర్తి. కస్తూరి కథ చాలామంది విజేతలతో పోల్చితే భిన్నమైనది. కస్తూరి తల్లి తిరువణ్ణామలై రైల్వేస్టేషన్లో పోర్టర్. తల్లి పెద్ద పెద్ద బ్యాగులు, సూటుకేసులు మోస్తుంటే ఆసక్తిగా చూసేది. తల్లికి సహాయంగా తాను కూడా చిన్న చిన్న బరువులు మోసేది. ఈ కష్టం ఊరకే పోలేదు. వెయిట్ లిఫ్టింగ్‌పై ఆసక్తి పెంచుకునేలా, పతకాలు గెలుచుకునేలా చేసింది.‘గెలుస్తాను అనుకోలేదు’ అంటుంది కస్తూరి రష్యాలో వెయిట్ లిఫ్టింగ్‌లో బంగారు పతకం గెలుచుకోవడం గురించి. ఎందుకంటే ఆమెను ఓటమి కంటే గెలుపు పలకరించిన సందర్భాలే ఎక్కువ. పోటీలో బరువు ఎత్తబోతున్నప్పుడు మా అమ్మ రైల్వేస్టేషన్లో బ్యాగులు ఎత్తి నెత్తి మీద మోసే దృశ్యాన్ని గుర్తు చేసుకున్నాను. మా అమ్మే నాకు స్ఫూర్తి. మరిన్ని పతకాలు గెలుచుకోవాలనుకుంటున్నాను. ఎలాంటి కష్టాలు లేకుండా అమ్మను చూసుకోవాలనుకుంటున్నాను’ అంటుంది కస్తూరి.తిరువణ్ణామలై ప్రాంతంలోని చెయ్యార్ అనే చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన కస్తూరి అనుకోకుండా వెయిట్ లిఫ్టింగ్‌పై ఆసక్తి పెంచుకుంది. కొత్తూర్పురంలో స్థానిక ఇన్‌స్ట్రక్టర్ల దగ్గర వెయిట్‌లిఫ్టింగ్‌లో శిక్షణ తీసుకుంది. ఇల్లు వదిలి వేరే ఊళ్లో శిక్షణ తీసుకోవడానికి తల్లిదండ్రులు మొదట ఒప్పుకోకపోయినా కస్తూరి పట్టుదల చూసి ఆ తరువాత ఒప్పుకోక తప్పింది కాదు.కొత్తగా పరిచయం అయిన ఆట అయినప్పటికీ ఏడాదిలోపే జిల్లా పోటీలో 36 పతకాలు గెలుచుకుంది. వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి డబ్బులు లేకపోవడంతో యూరప్‌లో పోటీ పడే అవకాశాన్ని కోల్పోయింది. ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ సహకారంతో రష్యాలోని నోవోసిబిర్క్స్ వరల్డ్‌కప్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలో పాల్గొంది. 75 కేజీల విభాగంలో డెడ్‌లిఫ్ట్ చేసింది.తాజాగా.... ఒలింపిక్ వెయిట్‌లిఫ్టింగ్ ట్రైనింగ్ కోసం తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి కస్తూరికి ఫోన్ కాల్ వచ్చింది. అయితే ఈ కాల్ కస్తూరిని పెద్దగా సంతోష పరిచినట్లు లేదు. ‘ముందు నాకు ఉద్యోగం కావాలి. మా కుటుంబం మొత్తం అమ్మపైనే ఆధారపడింది. నాన్న అనారోగ్యంగా ఉన్నారు. మా అక్కాచెల్లెళ్లు ఉద్యోగాల కోసం వెదుకుతున్నారు. నా కుటుంబం ఆర్థికంగా బాగుండి, సంతోషంగా ఉంటేనే నేను ఆటలపై బాగా దృష్టి కేంద్రీకరించగలుగుతాను’ అంటోంది కస్తూరి రాజమూర్తి. -
మొదట్లో లోన్లే దొరకలే, కట్ చేస్తే : రూ. 2వేలతో మొదలై రూ. 125 కోట్లకు
ఏ పండగొచ్చినా, పబ్బమొచ్చినా ఇంట్లో ముందుగా అందరికీ గుర్తొచ్చే అమ్మమ్మ నాన్నమ్మలే. వారి చేతి వంట మహిమ అలాటిది మరి. కరియర్ కోసం సప్త సముద్రాలు దాటి ఈ తరం పిల్లలు చాలామంది ఆ రుచిని మిస్ అవుతున్నామని ఫీల్ అవుతూ ఉంటారు. ఈ క్రమంలో చెన్నైకు చెందిన దంపతులకు ఒక ఐడియా వచ్చింది. దీనికి బిజినెస్‌లో రాణించాలన్న అమ్మమ్మ కుతూహలం కూడా తోడైంది. ఇంకేముంది జానకి పాటి వంటలు ఖండాంతరాలు దాటి రుచులను పంచుతున్నాయి. రూ.2 వేలతో మొదలైన వ్యాపారం రూ.125 కోట్లకు చేరుకుంది. స్వీట్ కారం కాఫీ(ఎస్కేసీ) సక్సెస్ స్టోరీ గురించి తెలుసు కుందాం రండి! చెన్నైలో ఉండే ఆనంద్ భరద్వాజ్, నళిని పార్థిబన్ దంపతులు. చాలా సందర్బాల్లో అమ్మమ్మ జానకి వంటకాలను ఆస్వాదించ లేకపోతున్నామే అని బాధపడేవారు. చివరికి చేస్తున్న ఉద్యోగాలను వదిలేసి మరీ అమ్మమ్మ వద్దకు పరిగెత్తుకు వెళ్లారు. 82 ఏళ్ల అమ్మమ్మ చేత వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ ప్రయత్నం అంత సాఫీగా సాగలేదు. చాలా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి తొలుత సుముఖత చూప లేదు. దీంతో ఇంట్లోనే ఒక చిన్న గదిలో కొద్ది పెట్టుబడితో ప్రారంభించారు.అలా 2015లో ఆనంద్ భరద్వాజ్ , నళిని పార్థిబన్ కేవలం రూ.2000 పెట్టుబడితో చిన్న కిచెన్‌లో స్వీట్ కారం కాఫీని ప్రారంభించారు. ప్రచారం కోసం స్వయంగా కరపత్రాలను పంపిణీ చేసేవారు. దక్షిణాది ప్రాంతాలకు చెందిన స్నాక్స్ జంతికలు జాంగ్రి, మైసూర్ పాక్ వంటి పదార్థాలను పరిచయం చేశారు. ఇక అంతే వెనుదిరిగి చూసింది లేదు. అమ్మమ్మ చేతి వంట అందరికీ తెగ నచ్చేసింది. ఆర్డర్లు వెల్లువలా వచ్చి పడ్డాయి. అలా మొదలైన ప్రయాణం వారు కూడా ఊహించని విధంగా చాలా తక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 32 దేశాలకు విస్తరించింది. కంపెనీ విలువ రూ.125 కోట్లకు చేరుకుంది. అలాగే స్వీట్ కారం కాఫీ తన ఉత్పత్తులను కొన్ని ప్రముఖ ఆన్లైన్ సంస్థల ద్వారా కూడా విక్రయాలను కొనసాగిస్తోంది. అలాగే సొంత వెబ్సైట్, యాప్ ద్వారా విక్రయాలను కొనసాగిస్తోంది. View this post on Instagram A post shared by Sweet Karam Coffee - Experience South India (@sweetkaramcoffee_india) “నేను ఎప్పటికప్పుడు వంటలన్ని దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తాను. ఎక్కడా రాజీ పడను. ప్రతిదీ ప్రేమగా శ్రద్ధగా, శుభ్రంగా, రుచిగా ఉండేలా జాగ్రత్త పడతాను. నా సొంతం కుటుంబంకోసం చేసినట్టే చేస్తాను’’ అంటారు జానకి పాటి. అంతేకాదు పాటీ ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లో కూడా ఈమె చాలా పాపులర్. ఇది నాకు పునర్జన్మ లాంటిది అని చెబుతారు గర్వంగా. క్రికెటర్ ఎంఎస్ ధోని పట్ల తన ప్రేమను సోషల్‌మీడియా ద్వారా పంచుకొని ఆనందిస్తూ, ముదిమి వయసులో కూడా ఆనందంగా గడపడం ఎలాగో చెప్పకనే చెబుతోందీ అమ్మమ్మ. -
పాల వ్యాపారంతో ఏడాదికి రూ.3 కోట్లు సంపాదన: రేణు విజయ గాథ
కొన్ని విజయాలను వ్యక్తిగత విజయాలుగా మాత్రమే పరిగణించలేము.రేణు సంగ్వాన్ సాధించిన విజయం అలాంటిదే.సంప్రదాయ విధానాలకు, ఆధునిక సాంకేతికత జోడిస్తే సాధించగల విజయం అది. పెద్దగా చదువుకోకపోయినా కష్టాన్ని నమ్ముకుంటే అద్భుత విజయాన్ని సొంతం చేసుకోవచ్చు అని నిరూపించిన విజయం అది.హరియాణా రాష్టప్రాం ఝుజ్జర్ జిల్లాలోని ఖర్మన్ గ్రామానికి చెందిన రేణు సంగ్వాన్ డిసెంబర్ 3న న్యూదిల్లీలో ‘కృషి జాగరణ్ మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా’ అవార్డ్ అందుకోనుంది. పాడి పరిశ్రమకు ఆమె చేసిన అసాధారణ సేవలకు గుర్తింపుగా ఈ ప్రతిష్ఠాత్మకమైన పురస్కారానికి ఎంపికైంది రేణు సంగ్వాన్...తొమ్మిది దేశవాళీ ఆవులతో రేణు పాడిపరిశ్రమ ప్రయాణం పారంభం అయింది. ఇప్పుడు ఆమె ‘గోకుల్ ఫామ్ శ్రీకృష్ణ’ 280కి పైగా ఆవులకు నిలయంగా, సుస్థిర పాడి పరిశ్రమ అంటే ఇలా ఉండాలి అని చెప్పుకునేంతటి ఘన విజయం సాధించింది. మూడు కోట్ల టర్నోవర్‌తో దేశంలోని అత్యుత్తమమైన ఫామ్‌లలో ఒకటిగా పరిగణించబడుతోంది.సాహివాల్, గిర్, థార్పర్కర్లాంటి స్వదేశీ ఆవు జాతులపై ఆధారపడడం రేణు విజయంలో కీలక అంశం. ఈ జాతులు ఔషధ గుణాలు కలిగిన పాలను ఉత్పత్తి చేయడానికి ప్రసిద్ధి చెందాయి. అంతేకాదు...హైబ్రిడ్ జాతులతో పోల్చితే వాటి ఆలనాపాలనకు అయ్యే ఖర్చు చాలా తక్కువ.‘ఈ ఆవులు స్థానిక వాతావరణానికి బాగా సరిపోతాయి. వాటి పాలు అధిక పోషక విలువలు కలిగి ఉంటాయి. ఇవి హైబ్రిడ్ జాతుల కంటే భిన్నమైనవి. స్వదేశీ ఆవులను ప్రోత్సహించడం ద్వారా రైతులు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చు’ అంటుంది రేణు.‘గోకుల్ ఫామ్ శ్రీకృష్ణ’ తయారు చేస్తున్న నెయ్యికి మన దేశంలోనే కాకుండా పప్రాపంచవ్యాప్తంగా 24 దేశాల్లో డిమాండ్ ఉంది. ఈ ఫామ్ విజయానికి ఆధునిక పద్ధతులు అవలంబించడం కూడా ఒక కారణం. కుమారుడు వినయ్‌తో కలిసి ఫామ్‌లో ఆటోమేటిక్ మిల్కింగ్ యంత్రాలు, అధునాతన క్లీనింగ్ యంత్రాలు ఏర్పాటు చేసింది రేణు. (భార్యకోసం బంగారు గొలుసుకొన్నాడు.. దెబ్బకి కోటీశ్వరుడయ్యాడు!)‘గోకుల్ ఫామ్ శ్రీకృష్ణ’ దేశీయ ఎద్దుల వీర్యాన్ని ఉత్పత్తి చేసి విక్రయిస్తుంది.‘దేశవ్యాప్తంగా రైతులు స్వదేశీ ఆవులను దత్తత తీసుకొని, వాటి ఉత్పాదకతను పెంచడానికి ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఉపయోగించాలి. కేవలం పాలపైనే కాకుండా నాణ్యమైన పాల ఉత్పత్తుల ద్వారా ఆదాయ వనరులు పెంచుకోవచ్చు’ అంటుంది రేణు.సవాళ్లు లేకుండా ఏ విజయం సాధ్యం కాదు.రేణు పప్రాయాణం మొదలు పెట్టినప్పుడు అది నల్లేరుపై నడకలా కొనసాగలేదు. వనరుల కొరతతో సహా రకరకాల అడ్డంకులను ఎదుర్కోవలసి వచ్చింది. ఆవులు ఆరోగ్యంగా ఉండేలా, వ్యాధుల బారి నుంచి వాటిని రక్షించడం కూడా పెద్ద సవాలుగా మారింది. పాడిపరిశ్రమలో వ్యాక్సినేషన్, పరిశుభప్రాత ఎంతో కీలకం’ అంటున్న రేణు ఆవులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించడం నుంచి పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా ఎంతో సమయాన్ని వెచ్చించింది. ఆవులకు అధిక నాణ్యత గల పశుగ్రాసాన్ని అందించడంపై దృష్టి పెట్టేది. కఠోర శ్రమ, అంకితభావం, సృజనాత్మకతతో దేశవ్యాప్తంగా రైతులు, మహిళలకు ఆదర్శంగా నిలిచిన రేణు సంగ్వాన్ పప్రాతిష్ఠాత్మకమైన ‘జాతీయ గోపాల్ రత్న పురస్కార్–2024’ అందుకుంది.విజయం అంటే మైలురాళ్లను చేరుకోవడం, వ్యక్తిగత సంతోషం మాత్రమే కాదు. కలలు కనడానికి, వాటిని సాధించడానికి ఇతరులను ప్రేరేపించడం. – రేణు సంగ్వాన్ -
వయసు 28, తులసి పంట రారాజు ఫిలిప్పో సక్సెస్ స్టోరీ, ఆదాయం ఎంతో తెలుసా?
ఫిలిప్పో కర్రర 28 ఏళ్ల యువ రైతు. అతనిది ఇటలీలోని ఉత్తరప్రాంతంలోని పర్మ నగరం. ఇటలీలో పెద్ద కమతాలే ఎక్కువ. ఇప్పుడు సగటు వ్యవసాయ క్షేత్రం విస్తీర్ణం సుమారు 11 హెక్టార్లు. అక్కడ కమతాల సైజు పెరుగుతూ వస్తోంది. 2000వ సంవత్సరంలో 5 హెక్టార్లున్న సగటు కమతం విస్తీర్ణం 2010 నాటికి 8 హెక్టార్లకు, తర్వాత 11 హెక్టార్లకు పెరిగింది. వ్యవసాయక కుటుంబంలో పుట్టిన ఫిలిప్పో చదువు పూర్తి చేసుకొని ఏడేళ్ల క్రితం వ్యవసాయంలోకి దిగాడు. పేరుకు వ్యవసాయమే అయినా వాణిజ్య దృష్టితో సేద్యం చేయటంలో దిట్ట ఫిలిప్పో. అతను పగ్గాలు చేపట్టేటప్పటికి వారి కుటుంబ వ్యవసాయ కంపెనీ పది హెక్టార్లలో పంటలు సాగు చేస్తుండేది. ఈ ఏడేళ్లలోనే 150 హెక్టార్లకు విస్తరించిందంటే యువ రైతు ఫిలిప్పో పట్టుదల, కార్యదక్షతలను అర్థం చేసుకోవచ్చు. 50 హెక్టార్లలో ఇటాలియన్ బసిల్ పంటను పండిస్తున్నాడాయన. బసిల్ తులసి జాతికి చెందిన పంట. ఇందులో తీపి రకం కూడా ఉంటుంది. పచ్చి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో కూడిన సలాడ్లలో కలుపుకొని తింటారు. బసిల్ నుంచి నూనెను కూడా వెలికితీసి అనేక ఔషధాల్లో వాడుతూ ఉంటారు. 1996లో పుట్టిన ఫిలిప్పోను ఆ దేశంలో కొత్త తరం రైతులకు, వాణిజ్య స్ఫూర్తికి ప్రతీకగా యువత పరిగణిస్తున్నారు. ‘నేను ఏడేళ్ల క్రితం మా వ్యవసాయం బాధ్యతలు తీసుకున్నాను. పది హెక్టార్ల పొలానికి బాధ్యత తీసుకున్నాను. మా తాత ప్రాంరిశ్రామిక పద్ధతుల్లో భారీ విస్తీర్ణంలో టొమాటోలు సాగు చేసేవారు (ఇటలీ ఉత్తర భాగంలో ఎక్కువ టొమాటోలే సాగవుతూ ఉంటాయి). బసిల్ పంటను అధిక విస్తీర్ణంలో పెంచడానికి అనువైనదిగా గుర్తించాను. ఇది అధికాదాయాన్నిచ్చే పంట. అయితే, రైతులు కొద్ది విస్తీర్ణంలోనే సాగు చేస్తున్నారు. నేను భారీ యంత్రాలు ఉపయోగించటం ద్వారా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయటం ప్రారంభించాను. బసిల్ ఆకులను తాజాగా, సువాసనతో కూడి ఉండాలని దీనితో ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలు ఆశిస్తుంటాయి..’ అంటాడు ఫిలిప్పో (బ్రెడ్‌ఫ్రూట్ (సీమ పనస) : లాభాల గురించి తెలుసా?)మనుషులతో కాకుండా భారీ యంత్రాలతో బసిల్ పంట కోతను చేపట్టాలనుకున్నప్పుడు.. తమ పొలంలో మడుల సైజుకు తగిన విధంగా పంట కోత యంత్రాన్ని ఆయన ప్రత్యేకంగా డిజైన్ చేయించి తయారు చేయించాడు. ఫిలిప్పో ఫిలిప్ఫో బసిల్ ఆకును ఆ రంగంలో వేళ్లూనుకున్న 6 కంపెనీలకు విక్రయిస్తుంటాడు. ‘నేను ఆర్థిక శాస్త్రం, వాణిజ్య శాస్త్రం చదివాను. కానీ, వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం’ అన్నాడు. ‘ఆరుబయట పొలాల్లో విస్తారంగా బసిల్ పంటను నాణ్యమైన దిగుబడి తీసే విధంగా సాగు చేయటం సవాళ్లతో కూడిన పని. అయితే, ఈ పంటలోనే ఎదిగే అవకాశం ఉందని నేను గుర్తించాను. మా కంపెనీ 3 వేల టన్నుల బసిల్ ఆకులను పండిస్తోంది. టన్ను ధర 550 యూరోలు (సుమారుగా రూ. 49 వేలు). అనేక విషయాలపై ఆధారపడి ఈ ధరలో హెచ్చుతగ్గులుంటాయి అనిఫిలిప్పో చెప్పాడు. 50 ఎకరాల్లో ఏడాదికి రూ. 14.66 లక్షల ఆదాయం పొందుతున్నాడు. (పెరటితోటలో పేనుబంకను వదిలించేదెలా?)ఏప్రిల్ రెండోవారంలో బసిల్ విత్తటం ప్రారంభిస్తాం. మొదటి కోత జూన్ రెండోవారంలో మొదలవుతుంది. అక్టోబర్ వరకు కోతలు కొనసాగుతాయి. ‘ఈ ఏడాది సెప్టెంబర్ రెండో వారం వరకు దిగుబడి, నాణ్యత బాగున్నాయి. భారీ వర్షం కురవటంతో పంట దెబ్బతింది.’ అన్నాడు ఫిలిప్పో. పొద్దున్న, సాయంత్రపు వేళల్లో బసిల్ ఆకుల్ని కత్తిరిస్తే వాటి నాణ్యత, రంగు, వాసన బాగుంటాయి. మేం కత్తిరించిన కొద్ది గంటల్లోనే ఫుడ్ కంపెనీకి చేర్చుతాము అని చెప్పాడు. ఇటలీలో ఒకానొక పెద్ద సహకార బ్యాంకింగ్ వ్యవస్థ ‘ఎలిల్బంక’. ఫిలిప్పో కర్రరకు దీని మద్దతు ఉంది. ఫిలిప్పోకు వ్యవసాయం పట్ల ఉన్న మక్కువ, వ్యాపారాత్మక దృష్టి అమోఘమైనవి’ అని ఎలిల్బంక ప్రతినిధి ఆండ్రియా కలెఫ్పి ప్రశంసించారు. -
రూ.25 వేలతో మూడేళ్లలో రూ.33 కోట్ల వ్యాపారం!
కాలేజీ డ్రాపవుట్ అయిన ఓ యువకుడు తన స్నేహితుడి సాయంతో రూ.25,000 పెట్టుబడితో వ్యాపారం సాగించి మూడేళ్లలో ఏకంగా రూ.33.61 కోట్ల వ్యాపారాన్ని విస్తరించాడు. అసలు కాలేజీ డ్రాపవుట్ అయ్యాక తాను ఏ బిజినెస్ ఎంచుకున్నాడు.. తన వ్యాపారాన్ని ఎలా విస్తరించాడో ఈ కథనంలో తెలుసుకుందాం.డారియన్ క్రెయిగ్(31) కొన్ని కారణాల వల్ల కాలేజ్ డ్రాపవుట్ అవ్వాల్సి వచ్చింది. ఇళ్లు గడవడం ఇబ్బందిగా ఉండడంతో చిన్న ఉద్యోగం చేరాడు. ఒకరోజు ఆఫీస్‌కు వచ్చిన క్రెయిగ్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు. తాను ఉద్యోగం కోల్పోయే నాటికి తన బ్యాంకు అకౌంట్లో కేవలం 7 డాలర్లు(రూ.600) ఉన్నాయి. తాను ఎలాగై జీవితంలో ఎదగాలని నిర్ణయించుకున్నాడు. డబ్బు సంపాదించాలనుకున్నాడు. అందుకోసం తన చిన్ననాటి స్నేహితుడు బ్రాండన్ ఎకోల్స్ సాయంతో 300 డాలర్లు(రూ.25,000) అప్పుచేసి వ్యాపారం మొదలు పెట్టాడు. ‘వైఆల్ స్వీట్ టీ’ పేరుతో టీ బిజినెస్ ప్రారంభించాడు. 2021లో మొదలుపెట్టిన ఈ వ్యాపారం అభివృద్ధి చెంది మూడేళ్లలో ఏటా రూ.33.61 కోట్ల ఆదాయం సమకూర్చే స్థాయికి ఎదిగింది.వెంచర్ క్యాపిటలిస్ట్‌ల నుంచి విశేష ఆదరణయునైటెడ్ స్టేట్స్లో కార్యకలాపాలు సాగించే ఈ సంస్థ ద్వారా నేరుగా వినియోగదారులకు తమ టీ ఉత్పత్తులను అందిస్తున్నారు. సుమారు 600 రిటైల్ అవుట్లెట్లతో వ్యాపారం సాగిస్తున్నారు. విభిన్న ఫ్లేవర్లలో టీను అందిస్తున్నారు. ఇటీవల క్రెయిగ్, ఎకోల్స్ తమ కంపెనీ విస్తరణకు వెంచర్ క్యాపిటలిస్ట్‌ల సాయం కోరగా విశేష ఆదరణ లభించిందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: రిలయన్స్ బ్రాండ్స్ ఎండీగా వైదొలిగిన మెహతాకష్టాలు సహజం.. సరైన నిర్ణయాలు ముఖ్యంఉద్యోగం రాలేదనో, డబ్బు లేదనో, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయనో చాలా మంది కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ క్రెయిన్, ఎకోల్స్లాగా జీవితంలో కష్టపడి ఎదుగుతున్నవారు కోట్లల్లో ఉన్నారు. కాబట్టి జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు వాటిని సమర్థంగా ఎలా ఎదుర్కోవాలో ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
భర్తకు తెలియకుండా చేసిన పని.. బెంజ్ కంపెనీ బతికేలా చేసింది
మెర్సిడెస్ బెంజ్.. ప్రపంచ మార్కెట్లో పరిచయం అవసరంలేని బ్రాండ్. ఈ రోజు లగ్జరీ కార్ల విభాగంలో అగ్రగామిగా దూసుకెళ్తున్న ఈ కంపెనీ ఒకప్పుడు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నట్లు, బహుశా చాలా మందికి తెలిసుండకపోవచ్చు. అయితే ఓ మహిళ తీసుకున్న నిర్ణయమే కంపెనీ నేడు ఈ స్థాయిలో ఉండటానికి కారణం అయింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..మెర్సిడెస్ బెంజ్ ఈ రోజు ఆటోమోటివ్ పరిశ్రమలో ప్రతిష్టాత్మకమైన సంస్థగా గుర్తింపు పొందింది అంటే.. దానికి కారణం 'బెర్తా బెంజ్' అనే చెప్పాలి. మొదటిసారిగా ప్రపంచానికి కార్లను పరిచయం చేసిన ఘనత కూడా ఈమె సొంతమే. ఈమె మరెవరో కాదు.. కార్ల్ ఫ్రెడరిక్ బెంజ్ భార్య.కార్ల్ ఫ్రెడరిక్ బెంజ్.. జర్మనీకి చెందిన ప్రొఫెషనల్ ఆటోమోటివ్ ఇంజనీర్, ఇంజన్ డిజైనర్ కూడా. ఈయన 1885లో బెంజ్ పేటెంట్ మోటర్‌వాగన్‌ను సృష్టించారు. ఇదే అతని మొదటి ఆటోమొబైల్. అయితే ఇది రోడ్డుపై ఎలా పనిచేస్తుందనే విషయం మీద కొంత అనుమానం మాత్రం కార్ల్ బెంజ్ మనసులో ఉండేది. కానీ బెర్తా బెంజ్ మాత్రం ఆ వాహనం మీద పూర్తి విశ్వాసాన్ని ప్రకటించింది. ఈ కారణంగానే భర్తకు తెలియకుండానే ఓ పెద్ద నిర్ణయం తీసుకుంది.1888లో ఒకరోజు ఉదయం.. బెర్తా నిద్రలేచి, కార్ల్ బెంజ్‌కి తెలియజేయకుండా తన ఇద్దరు కుమారులు యూజెన్, రిచర్డ్‌లతో కలిసి కారులో ప్రయాణాన్ని ప్రారంభించింది. రోడ్డుపై వస్తున్న ఆ వాహనం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే దాన్ని మహిళ నడపడం చూసి చాలామంది మరింత ఆశ్చర్యపోయారు.నిజానికి కార్ల్ బెంజ్ తన మొదటి వాహనాన్ని రూపొందించినప్పుడు, దానిని విక్రయించడానికి చాలా కష్టపడ్డాడు. దాదాపు మూడేళ్ళ పాటు దాని అమ్మకాలు జరగలేదు. ఈ వాహనంలో బెర్తా 106 కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత.. పేటెంట్ మోటర్‌వాగన్‌ను ప్రపంచం గుర్తించింది. ఆ తరువాత కంపెనీ అమ్మకాలు మొదలయ్యాయి.ఇదీ చదవండి: పెద్ద బ్యాటరీలు కలిగిన టూ వీలర్స్ ఇవే!.. రేంజ్ కూడా ఎక్కువే..బెంజ్ పేటెంట్ మోటర్వాగన్ అమ్మకాలు మొదలైన తరువాత కూడా కొన్ని సాంకేతిక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనిని కంపెనీ విజయవంతంగా పరిష్కరించింది. బెర్తా తీసుకున్న ఆ ఒక్క నిర్ణయమే.. బెంజ్ కారును ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందేలా చేసింది. నేడు ఈ కంపెనీ ఏ స్థాయిలో ఉందో.. ఎంతలా ఎదిగిందో అందరికీ తెలుసు. -
అమెరికాలో ఉద్యోగాన్ని వదిలేసి, ఇండియాలో రూ.120 కోట్ల కంపెనీ
సాధించాలనే తపన, ఆత్మవిశ్వాసం ఉండాలేగానీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అలా అమెరికాలో ఐదెంకల జీతం వచ్చే ఉద్యోగాన్ని సైతం విడిచిపెట్టి తానేంటో నిరూపించుకుంది అహానా గౌతమ్. ముఖ్యంగా తల్లిపై ఉన్న నమ్మకంతో ముందడుగు వేసి, రూ. 120కోట్ల కంపెనీకి అధిపతిగా మారింది. అహానా గౌతమ్ సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందామా!రాజస్థాన్‌లోని ఒక చిన్న నగరానికి చెందిన అహానా గౌతమ్ ఐఐటీ బాంబేలో కెమికల్ ఇంజినీరింగ్ , హార్వార్డ్ బిజినెస్ స్కూల్ లో (2014-2016) ఎంబీఏ పట్టా పుంచుకుంది. ఆ తరువాత ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ (P&G)లో నాలుగేళ్లు ఉద్యోగం చేసింది. అక్కడే ఆరోగ్యకరమైన భారతీయ ఫుడ్‌ను పరిచయం చేయాలనే ఆలోచన వచ్చింది. అధిక బరువుతో ఉండే ఆమె హెల్దీ ఫుడ్ ప్రాముఖ్యతను గుర్తించింది. అంతే 30 ఏళ్ల వయసులో కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ రంగులు, రుచులు ,శుద్ధి చేసిన చక్కెరలో అధికంగా ఉండే జంక్ ఫుడ్ నుంచిన బయటపడాలని లక్ష్యంగా పెట్టుకుంది. సొంతంగా ఆరోగ్యవంతమైన ఆరోగ్యాన్ని అందించే వ్యాపారం ప్రారంభించాలని ఉద్యోగం వదిలి భారత్ కు తిరిగివచ్చింది. తల్లి ఇచ్చిన ఆర్థిక సాయంతో 2019లో ‘ఓపెన్ సీక్రెట్’ అనే స్టార్టప్ కంపెనీని స్థాపించింది. కేవలం మూడేళ్లలోనే కంపెనీ ఆదాయాన్ని రూ. 120 కోట్లకు చేరేలా శ్రమించింది. ఓపెన్ సీక్రెట్ వ్యవస్థాపక సీఈవోగా విజయపథంలో దూసుకుపోతోంది. అనేక సవాళ్ల మద్య 2024 నాటికి కంపెనీ టర్నోవర్ రూ. 100కోట్లుగా ఉంది.అహానా గౌతమ్ ఏమంటారంటే.."ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే.. అది మా అమ్మ వల్లనే. ఆమె ఎప్పుడూ నాకు రెండు విషయాలు చెబుతుండేది: నంబర్ వన్ విద్య చాలా ముఖ్యం. మీరు ఎవరు? ఎక్కడ నుంచి వచ్చారన్నది ముఖ్యం కాదు. విద్యే మన ప్రపంచంలో మార్పు తీసుకొస్తుంది, రెండోది ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటం, ఒకసారి ఆర్థిక సాధికారత సాధిస్తే, జీవితంలో ఎలాంటి నిర్ణయాలైనా సంతోషంగా తీసుకోవచ్చు." అమ్మ చెప్పిన ఈ మాటలే తనలో స్ఫూర్తినింపాయని, ఐఐటి-బాంబే, హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌కు వెళ్లి చదవడానికి ప్రేరణ నిచ్చాయని తెలిపింది అహానా. చివరికి ధైర్యంగా ఒక కంపెనీ స్థాపనకు నాంది పలికాయని వెల్లడించింది.అంతే కంపెనీని ప్రారంభించే ముందు వివాహం చేసుకోవాలని అందరూ పట్టుబడితే తనకు అండగా నిలబడి, ఆర్థిక సాయాన్ని అందించి వెన్నుదన్నుగా నిలబడ్డారంటూ తల్లి గర్వంగా చెబుతుంది. అహానా తల్లి కోవిడ్ రెండో వేవ్‌లో కరోనా కారణంగా చనిపోయారు. -
ఇంటర్లో 39% మార్కులు! కట్ చేస్తే కంపెనీకి సీఈఓ
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఇటీవల ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో’లో పాల్గొన్నారు. దీపిందర్ తన బాల్యంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు.. ఇంటర్ ఫస్ట్‌ఇయర్‌లో 39 మార్కులు సాధించిన గోయల్ ఐఐటీ ఢిల్లీలో సీటు సంపాదించి జొమాటోను ఎలా స్థాపించారో వివరించారు. జీవితం తనకు ఎన్నో పాఠాలు నేర్పిందన్నారు.‘స్కూల్ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు చాలా భయపడుతూ ఉండేవాడిని. దానికి కారణం నేను చదువులో టాప్ స్టూడెంట్ను కాదు. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు పరీక్షలో నేను సరైన సమాధానాలు రాయకపోయినా మా టీచర్ కావాలనే నాకు మంచి గ్రేడ్ ఇచ్చారు. దాంతో కుటుంబం, స్నేహితుల నుంచి ప్రశంసలు అందుకున్నాను. అది నాకు చాలా సంతోషాన్నిచ్చింది. కొంతకాలం తర్వాత చివరి సెమిస్టర్ పరీక్షలు వచ్చాయి. అంతకుముందు వచ్చిన మార్కులు ఫేక్ అనే విషయం నాకు తెలుసు. ఈసారి ఎలాగైనా కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి మళ్లీ ప్రశంసలు పొందాలనుకున్నాను. (నవ్వుతూ)మా ప్రశ్నపత్రాలు ప్రింట్ చేసే ప్రింటింగ్ ప్రెస్ వ్యక్తి వద్దకు వెళ్లి ముందస్తుగా ప్రశ్న పత్రాలను పొందడానికి ప్రయత్నించాను. కానీ అది సాధ్యం కాలేదు. దాంతో విజయానికి షార్ట్కట్లు లేవని అర్థం చేసుకున్నాను. నేను కష్టపడి చదవడం ప్రారంభించాను. చివరి సెమిస్టర్లో క్లాస్‌లో ఐదో స్థానానికి చేరుకున్నాను. ఈ విజయం నాకు జీవితంలో ఏదైనా చేయగలననే విశ్వాసాన్ని కలిగించింది’ఇంటర్ ఫస్టియర్‌లో 39 శాతం మార్కులే..‘కొన్ని కారణాల వల్ల నేను ఇంటర్ ఫస్టియర్(11వ తరగతి)లో 39 శాతం మార్కులే వచ్చాయి. ప్రీ-యూనివర్శిటీ ఎడ్యుకేషన్ కోసం చండీగఢ్‌కు వెళ్లాను. కష్టపడి చదివి ఐఐటీ-జేఈఈ క్లియర్ చేసి ఐఐటీ ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. ఇక్కడ జీవితం ఎన్నో పాఠాలు నేర్పించింది. మన ఆలోచనలు ఉన్నతంగా ఉంటే ఉన్నత వ్యక్తులను కలుస్తాం. మనం ఎంచుకున్న విభాగంలో ఎప్పుడూ మొదటిస్థానంలో ఉండేందుకు కష్టపడి పని చేయాలి. ఇది నిత్య పోరాటంగా సాగాలి’ అన్నారు.డిప్రెషన్‌ను అధిగమించాలంటే..‘నేను కొన్ని కారణాల వల్ల చాలాసార్లు డిప్రెషన్‌గా ఫీల్ అవుతుంటాను. ఈ డిప్రెషన్ సైకిల్ మూడేళ్లుంటుంది. డిప్రెషన్ సైకిల్స్ నిజానికి మంచివని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అవి నన్ను ఒక పాయింట్‌కి మించి మరింత ఉన్నతంగా ఆలోచించేలా చేస్తాయి. మానసిక సవాళ్లను ఎదుర్కోవడమే డిప్రెషన్‌కు సరైన చికిత్స. అందుకే మనం చేస్తున్న పనిలోనే డిప్రెషన్ తొలగించుకునేందుకు పరిష్కారాలు వెతకాలి. ప్రతి సైకిల్‌ను అధిగమించేందుకు గతంలో కంటే మరింత మెరుగ్గా ఆలోచిస్తూ పని చేస్తున్నాను’ అని అన్నారు.ముందు టొమాటో!‘ఐఐటీలో చదువు పూర్తి చేసుకున్నాక కెరియర్ ప్రారంభంలో బైన్ & కో. అనే కన్సల్టింగ్ సంస్థలో పని చేశాను. కమ్యూనికేషన్ నైపుణ్యాలు నేర్పించడంలో, వ్యూహాత్మకంగా ఆలోచించేందుకు ఇది ఎంతో తోడ్పడింది. ఎలా ఆలోచించాలో, ఏం మాట్లాడాలో ఈ సంస్థ నాకు నేర్పింది. నేను ఎప్పటికీ బైన్ అండ్ కో సంస్థకు కృతజ్ఞతతో ఉంటాను. బైన్లో పని చేస్తున్న సమయంలోనే జొమాటో ఆలోచన వచ్చింది. కంపెనీ స్థాపించాలనే ఉద్దేశంతో పేరును ఖరారు చేయాలనే సందర్భంలో ‘టొమోటో’అని అనుకున్నాం. దానికి సంబంధించిన డొమైన్ పేరు ‘టొమోటో డాట్ కామ్’ను కూడా ఏర్పాటు చేశాం. కానీ చివరకు దాన్ని జొమాటోగా నిర్ణయించాం’ అన్నారు.ఇదీ చదవండి: 6:15 గంటల్లో రూ.5 లక్షల కోట్లు ఆవిరి!అంతిమంగా, కొన్ని ఎదురుదెబ్బలు, తను నేర్చుకున్న జీవిత పాఠాలే జొమాటోను ఏర్పాటు చేయడానికి గోయల్‌కు ధైర్యాన్ని అందించాయి. తను కోరుకుంటే ఏదైనా చేయగలననే విశ్వాసాన్ని ఇచ్చాయి. తాత్కాలిక విజయాలకు పొంగిపోవడం, అపజయాలకు కుంగిపోకుండా జీవితంలో దీర్ఘకాల లక్ష్యాలను ఏర్పరుచుకుని దాన్ని సాధించాలనే గట్టి తపనతో ముందుకెళ్లాలి. -
సాంగ్లీ నుంచి స్టాన్ఫోర్డ్ వరకు.. పేద ఇంటి బిడ్డ సక్సెస్ స్టోరీ
‘పెద్ద చదువులు చదవాలి’ అనేది పేదింటి అమ్మాయి ఆక్సా కోరిక. అయితే అదంత తేలికైన విషయం కాదని ఆమెకు అర్థం అయింది. దారి పొడగునా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంది. అయినా సరే ఆమె ప్రయాణం ఆగలేదు. ‘పెద్ద చదువులు చదవడానికి పేదరికం అడ్డు కాదు’ అని నిరూపించి ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తోంది అక్సా పులారా. టెక్ దిగ్గజం గూగుల్‌లో ఇన్నోవేషన్ ప్రాజెక్ట్‌లలో కీలక బాధ్యతలు చూస్తోంది. మహారాష్ట్రలోని సాంగ్లీలో పుట్టిన ఆక్సా పులారా ‘వాల్చంద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్’ నుండి బ్యాచిలర్ డిగ్రీ చేసింది. ‘చదివింది చాలు’ అన్నారు ఇంటి పెద్దలు. ఉన్నత చదువులు చదవాలనేది అక్సా లక్ష్యం.‘నేను ఇంకా చదువుకోవాలనుకుంటున్నాను’ అంటే ససేమిరా అన్నారు.అదేపనిగా అడిగితే పెద్దల మనసు కరిగింది. ‘సరేలే. చదువుకో’ అన్నారు. ఆరోజు తనకు ఎంత సంతోషమైందో!‘యస్...నేను సాధించగలను’ అనే గట్టి నమ్మకం వచ్చింది. ఆ నమ్మకమే అక్సాకు ఎంతో శక్తిని ఇచ్చింది. ఆ శక్తే తనను అమెరికా వరకు తీసుకెళ్లింది. అమెరికాలో చదువుకుంటున్న వారి గురించి వినడమే కాని తాను కూడా చదువు కోసం అక్కడికి వెళతానని కలలో కూడా అనుకోలేదు. సదరన్ కాలిఫోర్నియా యూనివర్శిటీలో చేరింది. ఆ తరువాత స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో కొంతకాలం పనిచేసింది. అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్(యంఎల్)తో సహా అత్యాధునిక సాంకేతికతలో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంది. (రోజుకు నాలుగు గంటలే పని, నెల ఆదాయం 15 లక్షలకు పై మాటే!)ఆ తరువాత గూగుల్‌లో చేరింది. అక్కడ ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఇన్నోవేషన్లకు సంబంధించిన ప్రాజెక్ట్‌లను లీడ్ చేస్తోంది. కాలేజీ, యూనివర్శిటీ రోజుల్లో గూగుల్‌లో ఆవిష్కరణల గురించి ఆసక్తిగా తెలుసుకునేది. ఇప్పుడు ఆ ఆవిష్కరణలలో తాను కూడా భాగం అయింది. అక్సాకు మొదటి నుంచి టెక్నాలజీ అంటే ఇష్టం. ముఖ్యంగా కట్టింగ్–ఎడ్జ్ టెక్నాలజీగా చెప్పే ఏఐ, ఎంఎల్లో ప్రతి చిన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేసేది. నిజజీవితంలో మనం ఎదుర్కొనే ట్రాఫిక్జామ్లాంటి సమస్యలకు ఏఐ, ఎంఐ సాంకేతికత పరిష్కారం చూపుతుందని అంటుంది ఆక్సా పులారా.గూగుల్‌లో చేరిన తరువాత ఆ సంస్థ ఏఐ అండ్ ఎంఎల్ డెవలప్‌మెంట్స్‌లో ప్రధానపాత్ర పోషిస్తోంది. టీమ్ వర్క్‌స్పేసెస్, లుకర్ స్టూడియో ప్రో మొదలైన ఇన్నోవేటివ్ గూగుల్ ప్రొడక్ట్స్‌లో తన వంతు పాత్ర నిర్వహించింది. మనలో సామర్థ్యం ఉండగానే సరి΄ోదు. ఆ సామర్థ్యానికి తగిన వేదిక కూడా దొరకాలి. గూగుల్ రూపంలో ఆమెకు సరైన వేదిక దొరికింది.‘గూగుల్‌లో కనిపించే కల్చరల్ ఆఫ్ ఇన్నోవేషన్ ప్రభావంతో పరిశోధనలపై ఆసక్తి పెరిగింది. సంక్లిష్టమై సమస్యలకు పరిష్కారం కనుక్కోవాలనే కుతూహలం నన్ను ముందుకు నడిపించింది’ అంటుంది అక్సా పులారా. ఆమె పట్టుదల, ఉత్సాహం చూస్తుంటే ఎన్నో ఆవిష్కరణలలో కీలకపాత్ర పోషించబోతుందని గట్టిగా చెప్పవచ్చు. -
రోజుకు నాలుగు గంటలే పని, నెల ఆదాయం 15 లక్షలకు పై మాటే!
‘నేను రోజుకు నాలుగు గంటలే పనిచేస్తాను’ అని ఎవరైనా అంటే....‘అయితే ఏంటటా’ అనుకుంటాం. నేను రోజుకు నాలుగు గంటలే పనిచేసినా నెలకు పదిహేను లక్షలు సంపాదిస్తాను’ అని అంటే మాత్రం ‘అయ్ బాబోయ్’ అని బోలెడు ఆశ్చర్య΄ోవడమే కాదు ‘అలా ఎలా?’ అని అడుగుతాం.అమీ లాండినో (న్యూయార్క్)ను ఇప్పుడు చాలామంది ఈ ప్రశ్న అడుగుతున్నారు. ‘నేను ఉండాల్సింది ఇక్కడ కాదు. డిజిటల్ ఫీల్డ్‌లో’ అంటూ చాలా సంవత్సరాల క్రితం కాలేజీకి గుడ్‌బై చెప్పిన అమీ లాండినో మన కరెన్సీలో నెలకు పదిహేను లక్షలకు పైగా సంపాదిస్తుంది. ‘సోషల్ మీడియా’ను లాభదాయకమైన వ్యాపారక్షేత్రంగా మలుచుకోవడంలో విజయం సాధించింది. మొదట్లో వీడియోలను యూట్యూబ్‌లో షేర్ చేసేది. ఇలా చేస్తున్న క్రమంలోనే తనలోని స్కిల్స్‌ను ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకునేది.వ్యాపారులు తమకు కావలసిన వీడియోలను సొంతంగా ఎలా క్రియేట్ చేసుకోవచ్చో నేర్పే ఆన్లైన్ కోర్సును ప్రారంభించడం అమీ లాండినోకు టర్నింగ్ పాయింట్. లాండినో యూట్యూబ్ చానల్ ‘అమీ టీవి’లో తన గోల్–సెట్టింగ్ ప్రాసెస్‌తో సహా వెయ్యికి పైగా వీడియోలు ఉన్నాయి. అమీ లాండినో ‘స్టార్ యూట్యూబర్’ మాత్రమే కాదు ఎన్నో పుస్తకాలు కూడా రాసింది. (సాంగ్లీ నుంచి స్టాన్ఫోర్డ్ వరకు.. పేద ఇంటి బిడ్డ సక్సెస్ స్టోరీ) -
అపుడు కటిక పేదరికం : ఇపుడు పూలసాగుతో కోట్ల ఆదాయం
దిల్లు ఉన్నోడు దునియా మొత్తం ఏలతాడు అన్నది సినిమా డైలాగే కానీ దీన్ని అక్షరాలా రుజువు చేసి చూపించాడు రైతు కుటుంబంలో పుట్టిన శ్రీకాంత్ బొల్లాపల్లి. చిన్నతనంలో కడు పేదరికంలో గడిపాడు. పదవ తరగతి స్కూలు ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేకపోవడంతో ఏదో ఒక పని చేసుకోవాలని భావించాడు. బెంగళూరులో వెయ్యి రూపాయలకు పనిచేశాడు. అక్కడ ఆయన జీవితం మలుపుతిరిగింది. లాభదాయకమైన పూలసాగు గురించి తెలుసుకుని సక్సెస్ అయ్యాడు. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో రైతు కుటుంబంలో పుట్టి పెరిగాడు శ్రీకాంత్. అతని కుటుంబం వ్యవసాయ కుటుంబమే కానీ పెద్దగా లాభసాటిగా లేదు. చదువుకొని ఉద్యోగం చేయాలనుకున్నాడు. అదీ కుదరలేదు. అటుపేదరికం, ఇటు అప్పులు ఇలా అనేక సవాళ్లు కళ్లముందు కనిపించాయి. దీంతో16 ఏళ్లకే 1995లో బెంగళూరులో బంధువులతో కలిసి పనిచేయాల్సి వచ్చింది. అక్కడ పూల పెంపకం గురించి తెలుసుకుని మళ్లీ వ్యవసాయం చేయాలన్న కోరిక పుట్టింది.నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఏడాది పని చేసిన తర్వాత, శ్రీకాంత్ వ్యాపారానికి సంబంధించిన మెళకువలతో సిద్ధమయ్యాడు. పూలసాగు, కోత, మార్కెటింగ్ ,పువ్వుల ఎగుమతి ఇలా ప్రతిదీ నేర్చుకున్నాడు. తొలుత చాలా తక్కువ పెట్టుబడితో రైతుల నుండి పూలను సేకరించి వాటితో వ్యాపారం చేయడం ప్రారంభించాడు. 1997లో నగరంలో చిన్న పూల దుకాణాన్ని ప్రారంభించాడు. అలా ఒక పదేళ్లు పనిచేశాక ఇతర పూల పెంపకం దారులతో సహా పరిశ్రమలోని ఇతరులతో పరిచయాలు బాగా పెరిగాయి. దీంతో సొంతంగా పూలసాగులోకి దిగాడు. నేషనల్ హార్టికల్చర్ బోర్డును సంప్రదించి, ప్రభుత్వ రుణం తీసుకొని బెంగళూరులోని దొడ్డబళ్లాపుర సమీపంలోని 10 ఎకరాలతో ప్రారంభించిన పూలసాగు ఆయన ఇప్పుడు 52 ఎకరాలకు చేరింది. 52 ఎకరాల పొలంలో గులాబీలు, జెర్బెరా, కార్నేషన్లు, జిప్సోఫిలా ఇలా 12 రకాలకు పైగా పూలను పండిస్తున్నాడు శ్రీకాంత్. ఏడాదికి దాదాపు 70 కోట్లదాకా సంపాదిస్తున్నాడు.వ్యవసాయంలో ముఖ్యంగా వాతావరణ పరిస్థితులలో మార్పులకారణంగా కష్టాలు, సవాళ్లు చాలా ఉంటాయి. దృఢ సంకల్పం , సహనమే తనను ఉన్నత స్థితికి తీసుకువెళ్లింది అంటాడు శ్రీకాంత్. తన సాగు అంతా సేంద్రీయంగా ఉంటుందనీ, గ్రీన్‌హౌస్‌లు, పాలీహౌస్‌లలో సేంద్రీయంగా పెంచుతానని తెలిపాడు. దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లతో, శ్రీకాంత్ రూ. 70 కోట్ల టర్నోవర్‌ను సాధించాడు. గ్రామీణ కర్నాటక చుటుపక్కల 200 మందికి పైగా ఉపాధి కల్పిస్తూ విజయబాటలో నడుస్తున్నాడు. View this post on Instagram A post shared by Bollapally Srikanth (@bollapallysrikanth) -
64 ఏళ్ల వయసులో ఎంబీబీఎస్ సీటు : రిటైర్డ్ ఉద్యోగి సక్సెస్ స్టోరీ
ఒక్కసారి ఉద్యోగంలో చేరి సంసార బాధ్యతల్లో చిక్కుకున్న తరువాత తమ కిష్టమైంది చదువుకోవడం అనేది కలే, దాదాపు అసాధ్యం అనుకుంటాం కదా. కానీ ఈ మాటలన్నీ ఉత్తమాటలే తేల్చి పారేశాడు ఒక రిటైర్డ్ ఉద్యోగి. వినడానికి ఆశ్చర్యంగా ఉందా? నమ్మలేకపోతున్నారా? అయితే ఒడిశాకు చెందిన జైకిశోర్ ప్రధాన్ గురించి తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం ఈయన సక్సెస్ స్టోరీ నెట్టింట చక్కర్లు కొడుతోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిటైర్డ్ ఉద్యోగి జై కిశోర్ ప్రధాన్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ 64 ఏళ్ల వయసులో ఎంబీబీఎస్ కోర్సులో చేరారు. 2020లో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG)లో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించారు. ఎస్బీఐలో డిప్యూటీ మేనేజర్‌గా ఉద్యోగ విధులు నిర్వర్తించిన ఆయన రిటైర్మెంట్ తరువాత అందరిలాగా రిలాక్స్ అయిపోలేదు. డాక్టరవ్వాలనే తన చిరకాల వాంఛను తీర్చుకొనేందుకు రంగంలోకి దిగారు. వైద్య విద్య ప్రవేశానికి గరిష్ట వయోపరిమితి నిబంధన లేకపోవడంతో దృఢ సంకల్పంతో నడుం బిగించారు. అందుకోసం పెద్ద వయసులోనూ కూడా కష్టపడి చదివి జాతీయ స్థాయిలో వైద్యవిద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ లో అర్హత సాధించారు.ఎవరీ జై కిశోర్ ప్రధాన్జై కిశోర్ ప్రధాన్ స్వస్థలం ఒడిశాలోని బార్ గఢ్ ప్రాంతం. బాల్యం నుంచే డాక్టర్ అవ్వాలని కలలు కనేవారు. 1974లో మెడికల్ ఎంట్రన్స్ ర్యాంకు రాకపోవడంతో ఆశలు వదిలేసుకున్నారు. బీఎస్సీడిగ్రీ పూర్తి చేసి ఎస్బీఐలో ఉద్యోగం సంపాదించారు. ఈ సమయంలో తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స తీసుకుంటున్న సమయంలో తండ్రి అనుభవించిన బాధ, కళ్లారా చూసిన జై కిశోర్ ఎప్పటికైనా డాక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నారట.జై కిశోర్ జీవితంలో మరో విషాదం వైద్య వృత్తిపై ఉన్న ప్రేమతో తన పెద్దకుమార్తెను డాక్టర్న చేయాలని ఎంతగానో ఆశపడ్డారు. అయితే, దురదృష్టవశాత్తూ ఆమె ఎంబీబీఎస్ చదువుతుండగా, అనారోగ్యంతో కన్నుమూయడం విషాదాన్ని నింపింది. అయితే తన రెండో కుమార్తెను కూడా మెడిసిన్ చదివిస్తుండటం విశేషం. సాధించాలన్న పట్టుదల ఉండాలేగానీ అనుకున్న లక్ష్యం చేరేందుకు వయసుతో సంబంధం లేదని జై కిశోర్ చాటి చెప్పారు. -
రిస్క్ చేస్తున్నాడు సక్సెస్ అవుతున్నాడు.. కెరీర్ పీక్ పోజిసిషన్ లో నాని
-
రతన్ టాటా సక్సెస్ స్టోరీ
-
గెట్ రెడీ.. ఇట్స్ త్రీడీ.. !
ఇప్పుడంటే త్రీడీ ప్రింటింగ్ సాంకేతికత గురించి అందరికీ తెలిసింది. ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అందరికీ అవగాహన వచ్చింది. కానీ 8 ఏళ్ల క్రితం త్రీడీ ప్రింటింగ్ గురించి ఎవరికీ తెలియదనే చెప్పొచ్చు. కానీ 21 ఏళ్ల కుర్రాడు త్రీడీ ప్రింటింగ్‌లో భవిష్యత్తు ఉందని గుర్తించాడు. త్రీడీ ప్రింటింగ్‌లో ఏదైనా వినూత్నంగా చేయాలని ఆలోచించాడు. ఆ ఆలోచనకు పదును పెట్టాడు. ఓ స్టార్టప్ కూడా స్థాపించాడు. ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి కంపెనీ స్థాపించాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఎన్నో అవమానాలు.. ఎన్నో భయాలు.. వాటన్నింటినీ దాటుకుని ముందడుగు వేశాడు.. ఇప్పుడు ఏకంగా హైదరాబాద్‌లోని త్రీడీ ప్రింటింగ్ కంపెనీల్లో ఒకటిగా నిలిచి.. తన సత్తా చాటుకున్నాడు. అతడి పేరే.. క్రవీంతర్ కమల్.. అతని సక్సెస్ స్టోరీ గురించి మరిన్ని విశేషాలు..మేకర్ గ్లోబల్ పేరుతో 2016లో త్రీడీ ప్రింటర్స్ తయారుచేసే చిన్న స్టార్టప్ ఏర్పాటు చేశాడు. ఇప్పుడు సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నలుగురికీ ఆదర్శంగా నిలుస్తుండటమే కాకుండా.. పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. ఒకప్పుడు అసలు భవిష్యత్తు ఉంటుందా లేదా అని అనుమానం వ్యక్తం చేసిన వారికి ఇప్పుడు త్రీడీ ప్రింటింగ్తోనే భవిష్యత్తు ఉంది అని నిరూపిస్తూ కమల్ ముందుకు సాగుతున్నాడు. మొక్కవోని ధైర్యంతో.. కంపెనీ స్థాపించిన సమయంలో త్రీడీ ప్రింటింగ్‌పై డెలాయిట్, టాటా ఏరోస్పేస్ వంటి కంపెనీల వద్దకు వెళ్లి అవగాహన కలి్పంచేవాడినని కమల్ గుర్తుచేసుకున్నాడు. ఆ తర్వాత త్రీడీ ప్రింటింగ్ మెషీన్లను సొంతంగా తయారు చేసి, కంపెనీలకు విక్రయించేవాడినని చెప్పుకొచ్చాడు. త్రీడీ ప్రింటింగ్ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిన తర్వాత వాటిని తయారుచేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు మేకర్ గ్లోబల్‌కు క్లయింట్స్‌గా మారారు. వారికి కావాల్సిన త్రీడీ ప్రింటింగ్ ఉత్పత్తులను వీరి దగ్గరి నుంచే చేయించుకోవడం మొదలు పెట్టారు. ఎన్నో సినిమాలకు సాయం.. త్రీడీ ప్రింటింగ్‌లో రోజువారీ ఉపయోగించే ఎన్నో వస్తువులు, ఉత్పత్తులను మేకర్ గ్లోబల్ తయారుచేస్తోంది. హైదరాబాద్‌లోని స్కైరూట్ కంపెనీకి రాకాట్ మోడల్స్‌ను త్రీడీ ప్రింటింగ్‌లో రూపొందించి ఇచ్చామని కమల్ పేర్కొన్నాడు. అది చాలా గర్వకారణంగా ఉందని చెప్పాడు. ఇక, ఎన్నో సినిమాల ఆర్ట్ డైరెక్టర్లకు కావాల్సిన వస్తువులను సులువుగా తయారు చేసి ఇస్తుంటామని, ఏటా కనీసం నాలుగు సినిమాలకు పనిచేస్తుంటామని వివరించాడు. ఇక, ఆర్ఆర్ఆర్, హనుమాన్, ఆపరేషన్ వాలెంటైన్, పుష్ప వంటి సినిమాలకు అవసరమైన వస్తువులను నటీనటులకు ఇబ్బంది కాకుండా తేలికగా ఉండేలా తయారు చేసి ఇచ్చామని చెబుతున్నారు. అప్పటి నుంచే ఆసక్తి.. తమిళనాడులోని తిరుచి్చలో జన్మించిన కమల్.. చెన్నైలోని లయోలా కాలేజీలో 2015లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కాలేజీ రోజుల్లోనే ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా పారిస్‌లోని తులుజ్లో ఏరోస్పేస్ హబ్‌లో నెల రోజుల పాటు ఉండే అవకాశం కమల్‌కు వచి్చంది. అక్కడే తొలిసారి త్రీడీ ప్రింటింగ్‌తో ఉన్న లాభాల గురించి తెలుసుకున్నా డు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక.. డిజైనింగ్‌పై ఇష్టంతో హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో చేరాడు. కానీ ఉద్యోగం చేయడం కన్నా సొంతంగా ఎదగాలని, నలుగురికీ ఉపాధి కలి ్పంచాలని ఆలోచన చేశాడు. అప్పుడే త్రీడీ ప్రింటింగ్ గురించి వచ్చిన ఆలోచనతో వెంటనే మేకర్ గ్లోబల్ స్టార్టప్ స్థాపించాడు. ఇప్పుడు ఏటా రెండున్నర కోట్ల టర్నోవర్‌తో ముందుకు వెళ్తున్నాడు. భవిష్యత్తులో సంస్థను మరింత విస్తరించడమే లక్ష్యంగా శ్రమిస్తున్నానని చెబుతున్నాడు. -
ఒకటి కాదు.. రెండు కాదు.. ఓకే వ్యక్తికి 5 ప్రభుత్వ ఉద్యోగాలు
-
చెట్టుకింద వచ్చిన ఆలోచన.. వేలకోట్లు సంపాదించేలా..
ఈ రోజు ఏ సినిమా టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా అందరికీ మొదట గుర్తొచ్చే యాప్ 'బుక్ మై షో' (Book My Show). ఇంతకీ ఈ బుక్ మై షో ఎలా ప్రారంభమైంది. ఎవరు స్థాపించారు, దీని నెట్‌వర్త్ ఎంత? అనే మరిన్ని ఆసక్తికర విషయాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.ముంబైలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన 'ఆశిష్ హేమ్రజని' (Ashish Hemrajani), మరో ఇద్దరు స్నేహితులతో (పరీక్షిత్ దార్, రాజేష్ బల్పాండే) కలిసి బుక్ మై షో స్థాపించారు. ఆశిష్ స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం జుహులో పూర్తయింది. ఆ తరువాత మితిబాయి కాలేజీలో గ్రాడ్యుయేట్, సిడెన్‌హామ్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. చదువు పూర్తయిన తరువాత జే.వాల్టర్ థాంప్సన్ అనే అడ్వర్టైజింగ్ కంపెనీలో పనిచేయడం ప్రారంభించారు.ఆశిష్ హేమ్రజని 1999లో హాలిడే ట్రిప్ కోసం సౌత్ ఆఫ్రికా వెళ్లారు. అక్కడ ఒక రోజు చెట్టుకింద కూర్చుని రేడియోలో ప్రోగ్రామ్ వింటూ ఉన్నారు. ఆ సమయంలో రబ్బీ గేమ్ టికెట్లకు సంబంధించిన ప్రకటన గురించి విన్నారు. ఆ సమయంలో ఓ ఆలోచన వచ్చింది. ఇలాంటి టికెట్ల వ్యాపారాన్ని సినిమా రంగంలో ప్రవేశపెడితే బాగుంటుందని అనుకున్నారు.సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకు వచ్చిన తరువాత ఆలోచనకు కార్యరూపం దాల్చడానికి ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తరువాత సిడెన్హామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ పూర్వ విద్యార్థులు.. ఆశిష్ స్నేహితులైన పరీక్షిత్ దార్, రాజేష్ బల్పాండేతో కలిసి 'గో ఫర్ టికెటింగ్' ప్రారభించారు. ఇదే తరువాత ఇండియా టికెట్ పేరుతో వచ్చింది. చివరకు బుక్ మై షోగా స్థిరపడింది.ఆశిష్ బుక్ మై షో ప్రారంభించిన సమయంలో స్మార్ట్‌ఫోన్స్, ఆన్లైన్ చెల్లింపులు పెద్దగా అందుబాటులో లేదు. దీంతో చాలా రోజులు ఇందులో ఒడిదుడుకుడు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక సందర్భంలో బుక్ మై షో మూసి వేయాల్సిన పరిస్థితికి వచ్చేసింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. ఆశిష్ వెనుకడుగు వేయలేదు. ఒడిదుడుకులు మనల్ని తిరుగులేని వ్యాపారవేత్తను చేస్తాయి అనే మాటలను గట్టిగా నమ్ముకున్న ఆశిష్ ఎప్పుడూ నిరాశ చెందలేదు.ఇదీ చదవండి: భారత్‌లో రూ.10,000 నోటు.. ఎప్పుడు మొదలైందంటే?2006లో నెట్ బ్యాంకింగ్ ప్రారంభమైంది. అంతే కాకుండా దేశంలో మల్టీప్లెక్స్‌ల సంఖ్య కూడా విపరీతంగా పెరిగాయి. దీంతో ఆశిష్ బుక్ మై షో ఎదగడం ప్రారంభించింది. ఆన్లైన్ చెల్లింపులు ఎప్పుడైతే ఎక్కువయ్యాయి.. క్రమంగా సినిమా టికెట్స్ బుక్ చేసుకునే వారి సంఖ్య కూడా పెరిగింది. దీంతో కంపెనీ 2011లో 16 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించింది. ప్రస్తుతం బుక్ మై షో విలువ ఏకంగా రూ. 7500 కోట్లకు చేరింది. -
క్యాన్సర్‌కు నమ్మకమే ఆన్సర్
బ్లడ్ క్యాన్సర్ సోకిన డాక్టర్ నేత్రావతి... తన గురించి తన ఆరేళ్ల కొడుకు ఎక్కడ భయపడతాడో, అసలే ఆందోళనలో ఉన్న తనను చూసి అతడెక్కడ బెంగపడతాడో అని తనకు జబ్బును ఆ చిన్నారి నుంచి దాచిపెట్టింది. తాను స్వయానా డాక్టర్. అందునా ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ కావడంతో కోవిడ్ కేసులు చాలా ఎక్కువగా చూస్తుండేది. దాంతో మొదట్లో తనలో కనిపించిన లక్షణాలను చూసి తనకూ కోవిడ్ సోకిందేమో అనుకుంది. ఎట్టకేలకు అది చాలా తీవ్రమైన ఓ తరహా బ్లడ్ క్యాన్సర్ అని తేలింది. చికిత్స జరగకపోతే బతికేది రెండువారాలూ... మహా అయితే మూడు వారాలు!! ఇప్పుడామె పూర్తిగా కోలుకుని, తనలా క్యాన్సర్ బారిన పడి ఆందోళనతో బెంబేలెత్తుతున్నవారికీ కౌన్సెలింగ్ చేయడం, ధైర్యం చెప్పడం చేస్తోంది. అదీ తాను చికిత్స తీసుకున్న మణిపాల్ హాస్పిటల్లోనే. ఈలోపు మరికాస్త ఎదిగిన కొడుకు ఆమె వీడియోలను చూసి... ‘అమ్మా... నువ్వెంత ధైర్యవంతురాలివి. నిజంగా నువ్వు విజేతవమ్మా’’ అంటుంటే... క్యాన్సర్ మీద కంటే పెద్ద విజయమిది అంటోంది ఆ తల్లి. ఆ విజయగాధను విందాం రండి. డాక్టర్ నేత్రావతి బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కోవిడ్ బాధితులకు ఊరట కలిగిస్తున్న సమయమది. అప్పట్లో 2020 – 2021 నాటి రోజుల్లో కరోనా వైరస్ ఉద్ధృతంగా ప్రపంచాన్ని పరుగులు పెట్టిస్తున్న ఆ క్షణాల్లో ఒకనాడు తనకూ జ్వరంగా ఉంది. ఒళ్లంతా నొప్పులు. తీవ్రమైన అలసట. ఒకవైపు చెయ్యి లాగేస్తోంది. విపరీతమైన నిద్రలేమి. ఒకవేళ నిద్రపడితే అకస్మాత్తుగా మెలకువ వచ్చి చూసుకుంటే ఒళ్లంతా చల్లటి చెమటలు. ఈ లక్షణాలన్నీ దాదాపుగా కోవిడ్‌నే తలపిస్తున్నాయి. అందునా తాను రోజూ కరోనా రోగులకు సేవలందిస్తూ ఉండటంతో కోవిడ్ సోకిందేమోనని మొదట అనుకుంది.తీరా చూస్తే తీవ్రమైన బ్లడ్‌క్యాన్సర్... అసలు సమస్య తెలుసుకోవడానికి రక్తపరీక్ష చేయించుకుని రి΄ోర్టు చూసుకుంటే ప్లేట్లెట్ కౌంట్ 10,000 కంటే కిందికి పడి΄ోయింది. (ఇవి కనీసం 1,50,000 నుంచి 4,50,000 వరకు ఉండాలి). హిమోగ్లోబిన్ కౌంట్ ఐదు కంటే తక్కువ! (ఇది మహిళల్లో 12 నుంచి 15 వరకు ఉండాలి). తెల్లరక్తకణాల సంఖ్య అనూహ్యంగా చాలా ఎక్కువగా పెరిగి΄ోయి ఉంది. అవేవీ కోవిడ్‌కు సంబంధించినవి కావు. ఏదో తేడా కొడుతోంది అనుకుంది. మణిపాల్ హాస్పిటల్‌లోని హిమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ మల్లికార్జున కళాషెట్టిని సంప్రదించింది. వ్యాధి నిర్ధారణలో అది ‘అక్యూట్ ప్రోమైలోసైటిక్ ల్యూకేమియా – ఏపీఎల్’ అనే బ్లడ్ క్యాన్సర్‌గా తేలింది.నాకే ఎందుకిలా... డాక్టర్ నేత్రావతి మంచి ఆరోగ్యస్పృహ ఉన్న వ్యక్తి. తానే స్వయానా డాక్టర్. ప్రతి వీకెండ్‌కూ బెంగళూరు కబ్బన్ పార్కులో పచ్చటి చెట్ల మీది నుంచి వచ్చే పచ్చి గాలి పీలుస్తూ కొడుకూ, భర్తతో సైక్లింగ్ చేస్తుంటుంది. ప్రతిరోజూ తప్పనిసరిగా 45 నిమిషాల పాటు వ్యాయామం చేస్తుంటుంది. వేళకు నిద్రలేవడం, సమయానికి నిద్ర΄ోవడంతో పాటు డాక్టర్ కావడంతో మంచి ఆరోగ్య స్పృహతో ఉండటం, ఆరోగ్యకరమైనవి తినడం ఇవన్నీ చేస్తుండేది. తీరా బ్లడ్ క్యాన్సర్ కనిపించాక... అందరూ చెప్పే మాటే తన నోటి నుంచీ వచ్చింది. అందరిలాగే తానూ అనుకుంది... ‘‘నాకే ఎందుకిలా?!’’ ఆమె వెతలు ఆమె మాటల్లోనే...‘‘ఎట్టకేలకు చికిత్స మొదలైంది. నిజానికి క్యాన్సర్ వ్యాధి కంటే దాని చికిత్సా... అది మనిషి మీద చూపే శారీరక, మానసిక దుష్ప్రభావాలే ఎక్కువగా కుంగదీస్తుంటాయి. నాకున్న ΄÷డవాటి ఒత్తైన జుట్టును చూస్తూ చూస్తూ కోల్పోవాల్సి వచ్చింది. కీమోతో నోట్లోని, కడుపులోని మ్యూకస్ పారలు తీవ్రంగా దెబ్బతిని, ‘మ్యూకోసైటిస్’ అనే ఇన్ఫెక్షన్ వస్తుంది. కీమో మొదలైన రెండు లేదా మూడు వారాల పాటు నోట్లో ఉండే మ్యూకస్ పారలు దెబ్బతినడం వల్ల నోట్లో తెల్లటి చీముమచ్చలు వస్తాయి. దాంతో తినడం, తాగడం, మాట్లాడటం కష్టమయ్యేది. కీమోథెరపీలోని మందులు ప్రమాదకరమైన క్యాన్సర్ కణాలను తుదముట్టిస్తూనే ఆరోగ్యకరమైన మంచి కణాలనూ దెబ్బతీస్తుంటాయి. దాంతో ఈ దుష్ప్రభావాలన్నీ కనిపిస్తుంటాయి. కష్టమనిపించనప్పునడు నా ఆరేళ్ల కొడుకు రూపాన్ని కళ్లముందుకు తెచ్చుకున్నా.’’డాక్టరే పేషెంట్ అయితే...‘‘ఈ చికిత్స ప్రక్రియల సమయంలో మరెన్నో కాంప్లికేషన్లు కనిపించాయి. ఉదాహరణకు గుండె, ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరింది. కిడ్నీ సరిగా పనిచేయడం మానేసింది. రక్తపోటు పడిపోయింది. ఎందుకు వస్తోందో తెలియని తరచూ వచ్చే జ్వరాల మధ్య ఒక్కోసారి శ్వాస ఆడేది కాదు. ఊపిరి అందడమే కష్టమయ్యేది.’’ ‘‘ఇలాంటి దశలో చాలామంది నిరాశ నిస్పృహలకు లోనవుతుంటారు. తమను తాము తమాయించుకోలేరు. ఇక ఆ బాధితురాలు ఒక డాక్టరైతే... లోపల ఏం జరుగుతోందో నాకు స్పష్టంగా తెలిసిపోతుంటుంది. కాబట్టి అది ఆవేదన మరింత పెరిగేలా చేస్తుంది. అయితే ఒక్కమాటలో చెప్పాలంటే జబ్బుకూ, నాకూ జరిగే ఈ పోరులో... నా మానసిక బలం, నా మీద నాకున్న విశ్వాసం ఇవన్నీ గతంలో నేనేనాడూ చూడని స్థాయికి పెరిగాయి. నేను తట్టుకోగలిగే నా సహనపు చివరి అంచు సరిహద్దును మరింత ఆవలకు నెట్టాను’’ అంటూ తన ఆవేదనను కళ్లకు కట్టారు డాక్టర్ నేత్రావతి. చివరగా...డాక్టర్ నేత్రావతి చెబుతున్న మాటలివి... ‘‘జబ్బు తర్వాత మంచి క్రమశిక్షణతో కూడిన జీవితం క్రమం తప్పకుండా ఫాలోఅప్, డాక్టర్ సలహాలు ఖచ్చితంగా పాటించడం. ఇతరులు చెప్పే ప్రత్యామ్నాయ చికిత్సలను పెడచెవిన పెట్టడం, ఇంట్లో వండిన భోజనం తీసుకోవడం, ఎనిమిది గంటల నిద్ర, మధ్యాహ్నం ఓ చిన్న పవర్‌న్యాప్... ఇవన్నీ చేస్తూ ఎప్పటికప్పడు కంప్లీట్ బ్లడ్ కౌంట్‌లో తెల్లరక్తకణాలు నార్మల్‌గా ఉన్నాయేమో చూసుకుంటూ ఉన్నా.ఇప్పుడు అంత ప్రమాదకరం కాదు... ‘అక్యూ ప్రోమైలోసైటిక్ ల్యూకేమియా – ఏపీఎల్’ అని పిలిచే ఆ బ్లడ్ క్యాన్సర్ ఒకప్పుడు చాలా ప్రమాదకరం. కానీ ఇటీవల కొత్త చికిత్సా ప్రక్రియలు వస్తున్న కొద్దీ దాని గురించిన భయం తగ్గుతూ వస్తోంది. కొన్ని గణాంకాల ప్రకారం ఈ జబ్బుకు చికిత్స తీసుకున్నవారిలో 99% మంది నాలుగేళ్లు పైబడి జీవిస్తుంటే... ఐదేళ్లకు పైబడి జీవిస్తున్నవారు 86% మంది ఉన్నారు. -
పాల ప్యాకెట్లు అమ్ముకునే స్థాయి నుంచి వేలకోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా..
ఒక మనిషి ఎదగాలంటే.. కృషి, పట్టుదల అవసరం. పేదరికం నుంచి వేలకోట్ల సామ్రాజ్యం స్థాపించాలంటే.. ఒక్కరోజులో జరిగే పనికాదు. కానీ శ్రమిస్తే.. ఇది తప్పకుండా సాధ్యమవుతుందనేది మాత్రం అక్షర సత్యం. దీనికి నిలువెత్తు నిదర్శనమే.. 'రిజ్వాన్ సజన్' (Rizwan Sajan). ఇంతకీ ఈయనెవరు? ఈయన ఎలా కోటీశ్వరుడయ్యాడు? లాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ చూసేద్దాం..డానుబే సంస్థ వ్యవస్థాపకుడు, చైర్మన్ 'రిజ్వాన్ సజన్' ముంబైలోని ఒక మురికివాడలో పుట్టాడు. చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలను అనుభవించిన రిజ్వాన్.. ఆఖరికి స్కూల్ ఫీజులు కూడా కట్ట లేకపోయాడు. తండ్రి సంపాదనతో ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న రోజుల్లో పుస్తకాలను కొని వీధుల్లో తిరిగి అమ్మేవాడు, ఇంటింటికీ పాల ప్యాకెట్లను వేసేవాడు.. రాఖీలు కొనుగోలు చేసి అమ్మడం వంటివి చేసాడు.చిన్నతనం నుంచే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న రిజ్వాన్ 16వ ఏట తన తండ్రి మరణించారు. ఆ తరువాత కుటుంబ బాధ్యత భుజాలపై పడింది. చదువు మానేసి కువైట్‌కు వెళ్లి తన మామ బిల్డింగ్ మెటీరియల్స్ షాపులో ట్రైనీ సేల్స్‌మెన్‌గా పని చేయడం ప్రారంభించాడు. మెల్ల మెల్లగా ఎదుగుతున్నాడు అనుకునేలోపల గల్ఫ్ యుద్ధం మరోసారి తన జీవితాన్ని మార్చేసింది. మళ్ళీ ముంబైకి వచ్చేశాడు. జీవితం మళ్ళీ జీరో దగ్గరకు వచ్చేసింది.జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలనే ఆశతో మళ్ళీ సొంతంగా బిజినెస్ చేయడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే 1993లో డానుబే గ్రూప్ స్థాపించారు. ఇదే ఆ తరువాత అతిపెద్ద నిర్మాణ సామగ్రి కంపెనీలలో ఒకటిగా విస్తరించింది. 2019నాటికి ఈ డానుబే గ్రూప్ టర్నోవర్ 1.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది.ఇదీ చదవండి: వైకల్యాన్ని జయించి.. బిలియనీర్‌గా నిలిచి: జీవితాన్ని మార్చే స్టోరీఓ చిన్న సంస్థగా ప్రారంభమైన డానుబే గ్రూప్ తన కార్యకలాపాలను ఒమన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా వంటి దేశాలకు విస్తరించింది. డానుబే గ్రూప్ బిల్డింగ్ మెటీరియల్స్, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహా అనేక వ్యాపారాలను నిర్వహిస్తోంది. యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం రిజ్వాన్ నికర విలువ రూ. 20,830 కోట్లు అని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం దుబాయ్‌లోని అత్యంత ధనవతులైన భారతీయులలో ఈయన ఒకరుగా నిలిచారు. -
లక్ష్యం వైపు.. లాక్షనాయుడు
సాక్షి, హైదబారాద్: ఏదైనా రంగంలో రాణించాలంటే ఎంతో శ్రమించాలి.. అలాంటిది అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ ప్రతిభ కనబర్చాలంటే ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చాలి? ఏదైనా పని మొదలు పెట్టాలన్నా.. కొత్త రంగంలోకి వెళ్లాలన్నా ఇంటి నుంచే సవాలక్ష ప్రశ్నలు ఎదుర్కొంటుంటాం. మనకు అవసరమా..? చక్కగా ఉన్న పని చేసుకుని హాయిగా ఉండొచ్చుగా అని సలహాలు ఇస్తుంటారు. మరికొందరేమో రెండు, మూడు పడవలపై ప్రయాణం చేయడం మంచిది కాదంటూ హితవు పలుకుతారు. ఇంకొందరు వెనక్కి లాగే ప్రయత్నం చేస్తుంటారు. కానీ వైఫల్యం గురించి బాధపడుతూ ఒకే దగ్గర కూర్చుంటే అంతకన్నా వైఫల్యం మరొకటి ఉండదని నిరూపిస్తున్నారు డాక్టర్ లాక్షనాయుడు. డాక్టర్‌గా, సింగర్‌గా, శాస్త్రీయ నృత్యకారిణిగా, రాజకీయవేత్తగా చిన్న వయసులోనే రాణిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. -
ఎమిలి ఐడియా అదుర్స్, బనానా వైన్!
‘అవసరం’ నుంచి మాత్రమే కాదు ‘నష్టం’ నుంచి కూడా ‘ఐడియా’ పుడుతుంది. విషయంలోకి వస్తే... ఈస్ట్ ఆఫ్రికా దేశమైన మలావీలో కరోంగ జిల్లాకు చెందిన శ్రీమతి ఎమిలీ చిన్నపాటి రైతు. అరటి సాగు చేసే ఎమిలీలాంటి ఎంతోమంది రైతులకు ఒక సమస్య ఏర్పడింది.విపరీతమైన వేడి వల్ల అరటిపండ్లు చాలా త్వరగా పండుతున్నాయి. పాడవుతున్నాయి. దీనివల్ల రైతులకు భారీగా నష్టం వాటిల్లుతోంది. ‘వెరీ ఫాస్ట్ అండ్ గో టు వేస్ట్’ అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ‘బనానా వైన్’ ఐడియా పుట్టింది.ఇక ఆట్టే ఆలస్యంలోకి చేయకుండా ఎమిలీ బృందం రంగంలోకి దిగింది.‘అరటి వైన్ తయారు చేయడం ఎలా?’ అనేదానికి సంబంధించి వారు చిన్నపాటి శాస్త్రవేత్తలు అయ్యారు. ఎంతోమంది నిపుణులతో మాట్లాడారు. మెచెంజర్ అనే గ్రామంలో నాలుగు గదుల ఇంట్లో వైన్ తయారీ ప్రక్రియ మొదలు పెట్టారు. బాగా మగ్గిన అరటిపండ్లు, చక్కెర, ఎండుద్రాక్ష, నిమ్మకాయలు, నీళ్లు... మొదలైనవి ముడిసరుకుగా బనానా వైన్ తయారీ మొదలైంది. అయితే ఇదేమీ ఆషామాషీ ప్రక్రియ కాదు.ఎమిలి మాటల్లో చెప్పాలంటే ‘టైమింగ్ అనేది చాలా ముఖ్యం’ ఎలాంటి అరటిపండ్లను ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలి, టైమ్ ఎంత తీసుకోవాలి....ప్రతి దశలోనూ ఆచితూచి అత్యంత జాగ్రత్తగా వ్యహరించాల్సి ఉంటుంది. ఇది ‘గుడ్ క్వాలిటీ వైన్’గా పేరు తెచ్చుకోవడానికి ఎంతోకాలం పట్టలేదు. ‘స్మూత్ అండ్ లైట్ వైన్’గా పేరు తెచ్చుకున్న ఈ అరటి మద్యానికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.‘మలావీ నలుమూలలా అరటి మద్యానికి మంచి డిమాండ్ ఉంది’ అంటున్నాడు కమ్యూనిటీ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టెన్నిసన్ గోండ్వే. ‘బనానా వైన్ ఐడియా మా జీవితాలను మార్చేసింది. మాలో కొందరు ఇళ్లు కట్టుకున్నారు. కొందరు పశువులు కొన్నారు. ఇప్పుడు మేము మంచి భోజనం తినగలుగుతున్నాం’ అంటుంది ఎలీన. ఇదీ చదవండి: ‘బాస్! నేనూ వస్తా..’! ఆంబులెన్స్ వెనక దౌడుతీసిన కుక్క, వైరల్ వీడియో -
‘భాషా’..! ఒక్క ప్రశ్న కాదు.. వందైనా ఓకే!
కేవలం 250 మంది మాట్లాడే భాష పేరు చెప్పగలరా? దాని నిర్మాణం ఏమిటి? ఎలా మాట్లాడుతారు, ఎలా రాస్తారో చెప్పగలరా? కొన్ని గంటల్లోనే ఆ భాషను అనువదించగలరా? ‘కష్టం’ అనేవాళ్లే ఎక్కువ. కాని కొందరు ఇష్టంగా ఇంటర్నేషనల్ లింగ్విస్టిక్స్ ఒలింపియాడ్లోకి అడుగుపెట్టి తమ సత్తా చాటుతున్నారు. మన దేశం తరఫున ఈ పోటీలో పాల్గొన్న లక్ష్మీ, అనిమికా దత్తాలు పతకాలు గెలుచుకున్నారు...ఇంటర్నేషనల్ లింగ్విస్టిక్స్ ఒలింపియాడ్ అనేది ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులు, భాషాశాస్త్ర నిపుణులను ఒకచోట చేర్చే అంతర్జాతీయ పోటీ. 2003లో ఇది మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల వ్యాకరణం, నిర్మాణం, సంస్కృతి, చరిత్రను విశ్లేషించడానికి, పజిల్స్‌ను సాల్వ్ చేయడం ద్వారా భాష సామర్థ్యాలను ప్రదర్శించడానికి ఈ పోటీ అవకాశం కల్పిస్తుంది. సృజనాత్మకత, ఊహాశక్తిని మెరుగుపరచడానికి ఈ పోటీ ఉపకరిస్తుంది. భవిష్యత్తు భాషాశాస్త్ర నిపుణులను తయారుచేస్తుంది.‘భాష లేదా భాషాశాస్త్రంపై లోతైన పరిజ్ఞానం అవసరం లేదు. అత్యంత సవాలుతో కూడిన సమస్యలకు కూడా తార్కిక సామర్థ్యంతో, ఓపికతో పరిష్కారం కనుక్కోవచ్చు’ అంటుంది ఐవోఎల్. పోటీలో పాల్గొన్న వారికి ఇన్‌ఫుట్స్ ఇస్తారు. వాటి ఆధారంగా పజిల్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది.ఈ సంవత్సరం ‘ఐవోఎల్’కు బ్రెజిల్ ఆతిథ్యం ఇచ్చింది. ఈ పోటీలో 38 దేశాల నుంచి 51 టీమ్‌లు పాల్గొన్నాయి. బ్రెజిల్ రాజధాని బ్రజిలియాలో జరిగిన 2024 ఇంటర్నేషనల్ లింగ్విస్టిక్స్ ఒలింపియాడ్(ఐవోఎల్)లో మన దేశానికి చెందిన అనిమికా దత్తా ధర్, శ్రీలక్ష్మీ వెంకట్రామన్, ఫరాజ్ సిద్దిఖీ, అనన్య అగర్వాల్‌లు అద్బుత ప్రతిభాసామర్థ్యాలను ప్రదర్శించారు.‘ఐవోఎల్ వెబ్సైట్లో గత ఒలింపియాడ్‌లో వచ్చిన ్రపాబ్లమ్స్ను సాల్వ్ చేస్తూ ్రపాక్టీస్ చేశాను’ అంటుంది పద్నాలుగు సంవత్సరాల శ్రీలక్ష్మీ. బెంగళూరులోని జైగోపాల్ రాష్ట్రీయ విద్యాకేంద్రలో చదువుతున్న శ్రీలక్ష్మీ ఐఐటీ కాన్పూర్ విద్యార్థి ఫరాజ్ సిద్దిఖీతో కలిసి కాంస్య పతకం సాధించింది. పదిహేడు సంవత్సరాల అనిమికా దత్తా ఈ ఒలింపియాడ్‌లో రజత పతకం గెలుచుకుంది. అనిమిక చెన్నై మ్యాథమెటికల్ ఇనిస్టిట్యూట్ విద్యార్ధి. తృటిలో పతకం చేజార్చుకున్న అనన్య పతకం సొంతం చేసుకోకపోయినా బోలెడు ప్రశంసలు అందుకుంది.ఈ ఒలింపియాడ్‌లో పాల్గొన్న మన బృందానికి మైండ్–బ్లోయింగ్ వర్డ్ పజిల్స్ సవాలు విసిరాయి. ఇచ్చిన వ్యవధి ఆరు గంటలు. కొరియాక్(రష్యా), హడ్జా(టాంజానియా), కొమ్టో(పపువా న్యూ గినియా), దావ్ (బ్రెజిల్), యానువ్యవా(ఆస్ట్రేలియా)లాంటి మారుమూల భాషలకు సంబంధించిన పజిల్స్ ఇచ్చారు. ‘భాష నుంచి చారిత్రక సందర్భాలను నిర్వచించవచ్చు’ అంటున్న అనిమిక పపువా న్యూ గినియాకు చెందిన ఎన్డు భాషతో పాటు చారిత్రక విషయాల గురించి కూడా మాట్లాడగలదు. భాషాశాస్త్రం లోతుపాతుల గురించి పెద్దగా తెలియని అనిమిక ఆ శాస్తంపై ఆసక్తి పెంచుకోవడానికి పజిల్స్ కారణం.‘లింగ్విస్టిక్స్ ఒలింపియాడ్‌లో పాల్గొనడం వల్ల కొత్తగా, సృజనాత్మకంగా ఆలోచించే నైపుణ్యం పెరుగుతుంది’ అంటుంది శ్రీలక్ష్మి. ‘నా సాంస్కృతిక నేపథ్యమే నాకు స్ఫూర్తి’ అంటుంది అనన్య అగర్వాల్. ‘ఐవోఎల్’ బ్రెయిన్టీజర్ ఫీచర్లు సాంస్కృతిక అంశాలతో ముడిపడి ఉంటాయి. ఆ సంస్కృతి తెలియకపోతే పజిల్స్ పరిష్కరించడం కష్టం. ఉదాహరణకు ఈ సంవత్సరం ఫ్యామిలీ ట్రీ ఇచ్చారు. ఫరెమ్ ప్రజల గురించి తెలియకపోతే ఆ సమస్య పరిష్కరించలేము. ఫరెమ్ అనేవాళ్లు కొమ్జో భాష మాట్లాడే ప్రజలు. వివాహనికి సంబంధించిన వీరి ఆచారవ్యవహారాలు ఆసక్తిగా ఉంటాయి. ‘ఒకటి కంటే ఎక్కువ భాషల్లో ప్రవేశం అనేది సూక్ష్మస్థాయిలో విశ్లేషణకు, సృజనాత్మకంగా ఆలోచించడానికి ఉపకరిస్తుంది’ అనే విషయాన్ని ‘ఐవోఎల్’ పోటీలు చెప్పకనే చెబుతున్నాయి. బహు భాషలపై ఆసక్తి పెంచుకోవడానికి ప్రేరణను ఇస్తున్నాయి.మరింత సులువుగా...ఒక భాషకు సంబంధించిన వాక్యనిర్మాణం, వ్యాకరణం, ధ్వనులు... మొదలైన వాటిపై భాషాశాస్త్రం పనిచేస్తుంది. భాషాశాస్త్రానికి సంబంధించిన ఆసక్తి ఊపందుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రధాన కారణం. జీపీటి–4, క్లాడ్, జెమినిలాంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం) ఇందుకు ఉదాహరణ. మనిషి ఇచ్చే ఇన్పుట్స్, కమాండ్స్‌కు మెషిన్ అర్థం చేసుకోవడానికి మధ్య అంతరాన్ని పూడ్చడానికి నేచురల్ లాంగ్వేజ్ ్రపాసెసింగ్ సిస్టమ్స్ (ఎన్ఎల్పీ) అవసరం. ఎక్కువ సంఖ్యలో భాషాశాస్త్రవేత్తలు ‘ఎన్ఎల్పీ’ రిసెర్చ్‌లో భాగం అయితే సహజత్వ ప్రక్రియ మరింత సులువు అవుతుంది.ఇవి చదవండి: ఉన్నది ఒకటే.. 'జిమ్'దగీ..! -
Pooja Bedi: ప్రతి విషాదం.. నన్ను దృఢం చేసింది!
సాక్షి, సిటీబ్యూరో, రాయదుర్గం: నా జీవితంలో చోటుచేసుకున్న ప్రతి విషాదం నన్ను దృఢంగా చేసిందని ప్రముఖ నటి పూజా బేడీ అన్నారు. గచ్చిబౌలో గురువారం ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఆమె కాసేపు మీడియాతో ముచ్చటించారు. చాలా తెలుగు సినిమాల్లో నటించాను. మోహన్‌బాబు నుంచి జూ.ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోల వరకూ అనేక సినిమాల్లో నటించాను.హైదరాబాద్ షూటింగ్ ప్రదేశాలను ఎంతగానో ఎంజాయ్ చేశాను. చారి్మనార్ గల్లీల్లో తిరిగాను, గాజుల దుకాణాలు ఆకట్టుకుంటాయి. స్థానిక పర్యాటక ప్రాంతాలను సందర్శించాను. ప్రత్యేకించి హైదరాబాద్ ధమ్ బిర్యానీకి పెద్ద ఫ్యాన్‌ను. అలాగే సలాడ్ కూడా ఇష్టం. వివిధ సందర్భాల్లో వచి్చనపుడు బిర్యానీతో పాటు హలీం తినడానికి ఇష్టపడతాను. హైదరాబాద్ నుంచి ముంబయి వెళ్లే సమయంలో పెద్ద పెద్ద బాక్సుల్లో బిర్యానీ పార్శిల్స్ వచ్చేవి. తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకోవడం ఇష్టం అని తెలిపారు. అంతకు ముందు ఎఫ్ఐసీసీఐ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) గచి్చబౌలి చాప్టర్ సత్వ నాలెడ్జ్ సిటీలో ‘లిమిటేషన్ టు లిబరేషన్ అండ్ అన్‌లాక్ యువర్ ఇన్నర్ స్ట్రెంక్త్’ అనే అంశంపై ఫిల్మ్ స్టార్, వెల్నెస్ ఎవాంజెలిస్ట్ పూజా బేడితో ఇంటరాక్టివ్ సెషన్‌ను నిర్వహించారు. కార్యక్రమంలో ఎఫ్ఎల్ఓ ఛైర్పర్సన్ ప్రియా గజ్దర్, ఫ్లో సభ్యులు పాల్గొన్నారు.నేనెప్పుడూ ఏడవలేదు..విద్యార్థి దశలో నేను తరగతిలో ఫస్ట్ ఉండేదాన్ని. సినిమాల్లోకి వస్తానని అస్సలు అనుకోలేదు. మా అమ్మ మంచి డ్యాన్సర్. ఈ ఫీల్డ్‌లోకి వచ్చాక ఎక్కడా వెనుదిరిగి చూడలేదు. గత కొన్నేళ్లుగా నా కుటుంబంలో ప్రతి ఆరు నెలలకూ చెడు వార్త వినాల్సి వచ్చింది. అమ్మమ్మ చనిపోయింది. నాకు ఇష్టమైన కుక్క మృతి చెందింది. తండ్రిలాంటి వ్యక్తిని కోల్పోయాను. నా తమ్ముడికి మరో సమస్య వచి్చంది. నాకు విడాకుల సమస్య. నేనెప్పుడూ ఏడవలేదు. విచారిస్తూ నా లక్ష్యాన్ని మర్చిపోలేదు. ఆత్మస్థైర్యం కోల్పోలేదు. పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొన్నాను. వెల్నెస్ సంస్థను నిర్మించాను. ప్రతి విషాదం నన్నో దృఢమైన వ్యక్తిని చేసింది. జీవితం చాలా చిన్నది. ఇదొక ప్రయాణం. అందరికీ సమస్యలు ఉంటాయి. జీవితంలో అవి ఒక భాగం మాత్రమే. వాటిని మనం ఎలా ఎదుర్కొంటామనేదే నిజమైన వ్యక్తిత్వం.అలా విముక్తి లభించింది..‘నా జీవితంలో ప్రతి విషాదం నన్ను బలమైన వ్యక్తిగా తయారు చేసింది. విడాకుల సమయంలోనూ 12 ఏళ్ల సంతోషమైన జీవితం కోసం 50 ఏళ్లు దయనీయంగా ఉండరాదనుకున్నా. అప్పుడు నాకు విముక్తి లభించింది’ అని తెలిపారు.ఇవి చదవండి: బ్లాక్‌బస్టర్ మూవీకి బంపరాఫర్.. కేవలం ఒక్క రోజు మాత్రమే! -
మనసులో కుంచె ముంచి..
కళ సామాజిక ప్రయోజనం గురించి చెప్పుకోవడానికి బోలెడు మ్యాటర్ ఉంది. ‘వ్యక్తిగతం’ మాట ఏమిటి? అనే విషయానికి వస్తే...‘కళ అద్భుత ఔషధం’ అంటున్నారు అమెరికాలోని బాల్టిమోర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శ్వేతారావు గార్గ్.‘ఒత్తిడిని చిత్తు చేయడానికి, ఉత్సాహాన్ని శక్తిగా చేసుకోవడానికి కళ బలమైన ఔషధంలా ఉపయోగ పడుతుంది’ అంటున్న శ్వేతారావు గార్గ్ బోధకురాలు, రచయిత్రి, ఆర్టిస్ట్. శ్వేతారావు గార్గ్ కాలేజీ రోజుల్లోకి వెళితే...‘ఒత్తిడి నుంచి బయటపడాలి’‘మనసుకు కాస్త ఉత్సాహం కావాలి’ అనుకున్నప్పుడల్లా ఆమె చేసే పని... కలాన్ని చేతిలోకి తీసుకొని తన మనసులోని భావాలను కాగితంపై పెట్టడం. లేదా కుంచె తీసుకొని రంగు రంగుల చిత్రాలు వేయడం. ఈ ఉపశమనం, ఉత్సాహాన్ని ఇచ్చే పని కళాప్రపంచంలో తనకు చోటు కల్పిస్తుందని శ్వేత ఊహించి ఉండదు.మొదట్లో తాను వేసిన చిత్రాలను ఇతరులకు చూపించేది కాదు. వాటిని రహస్యంగా దాచేది. వివిధ కారణాల వల్ల రచనలు చేయడానికి, బొమ్మలు వేయడానికి దూరమైన శ్వేత మళ్లీ కళాప్రపంచంలోకి వచ్చింది. అప్పుడు తనకు ఎంతో శక్తి వచ్చినట్లు అనిపించింది. బొమ్మలు వేయడమే కాదు నవలలు రాసే ప్రయత్నం కూడా మొదలుపెట్టింది.రచనలు చేస్తున్న కొద్దీ, బొమ్మలు వేస్తున్న కొద్దీ తనమీద తనకు ఆత్మవిశ్వాసం పెరిగింది. ‘వీటిని రహస్యంగా దాచుకోవడం ఎందుకు! ప్రపంచానికి చూపించాలి’ అనుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ రచనలు, చిత్రాలను అధ్యయనం చేసిన శ్వేత అనుకరణ నీడల్లోకి వెళ్లకుండా తనదైన సొంత శైలిని సృష్టించుకుంది.వంటగది నుంచి పిల్లల పెంపకం వరకు మహిళల దైనందిన జీవితంలో రకరకాల ఘట్టాలను కథలుగా మలిచింది. శ్వేత కళాత్మక సాధనలో ‘స్త్రీవాదం’ అనేది ప్రధాన అంశంగా మారింది. ఆమె రచనల్లో స్త్రీ ΄ాత్రలు పరాధీనంగా, బేలగా, నిస్సహాయంగా కనిపించవు. పురుషాధిపత్య ధోరణులను సవాలు చేసేలా, స్వతంత్య్రవ్యక్తిత్వంతో కనిపిస్తాయి. నిత్య ఉత్సాహంతో శక్తిమంతంగా కనిపిస్తాయి.ఇక చిత్రకళ విషయానికి వస్తే శ్వేత ఏ ఆర్ట్ స్కూల్లోనూ పట్టా పుచ్చుకోలేదు. అయితే విన్సెంట్ వాన్ గోహ్ నుంచి అమృతా షేర్గిల్ వరకు ఎంతోమంది చిత్రకారులతో మౌనసంభాషణ చేస్తూనే ఉంటుంది. తనదైన విలక్షణ దృశ్యభాషను సృష్టించుకోవడానికి సాధన చేస్తూనే ఉంటుంది.‘కాలేజీ రోజుల నుంచి నా భావాల వ్యక్తీకరణకు కళ అనేది బలమైన మాధ్యమంగా ఉపయోగపడింది. కథ అయినా కవిత్వం అయినా చిత్రం అయినా కొత్త కోణంలో కనిపించాలనుకుంటాను’ అంటుంది శ్వేత.బోధన, పరిశోధన, కళలలో తనకు ఇష్టమైనది ఏమిటి?ఆమె మాటల్లోనే చె΄్పాలంటే... ‘అవేమీ దేనికవి ప్రత్యేకమైన ప్రపంచాలు కావు. ఉదాహరణకు నా బోధన నేను చేసే పరిశోధనపై, నా పరిశోధన నా కళపై ప్రభావితం చూపిస్తాయి. ఒకదానికొకటి ఉపకరిస్తాయి’శ్వేతారావు గార్గ్ గ్రాఫిక్ నవల ‘ది టేల్స్ ఫ్రమ్ క్యాంపస్: ఏ మిస్ గైడ్ టు కాలేజి’ క్యాంపస్ వాతావరణం కాస్తో కూస్తో పరిచయం లేని వారిని కూడా క్యాంపస్‌లోకి తీసుకువెళ్లి ప్రత్యక్ష అనుభవాన్ని సొంతం చేస్తుంది. లింగభేదం, వేధింపులు, వర్గ హక్కులు, కులవివక్ష... ఇలా ఎన్నో అంశాలపై స్టూడెంట్స్ ఆలోచనలు, అవగాహనను ఈ నవల ప్రతిబింబిస్తుంది. పదమూడు చాప్టర్లలో ప్రతి చాప్టర్ తరువాత వచ్చే ‘స్టాప్ అండ్ థింక్’ సెక్షన్ ఎన్నో విషయాలలో పునరాలోచనకు అవకాశం కల్పిస్తుంది. -
వైకల్యాన్ని జయించి.. బిలియనీర్‌గా నిలిచి: జీవితాన్ని మార్చే స్టోరీ
అనుకున్నది సాధించాలనే అకుంఠిత దీక్ష, పట్టుదల అవసరం. ''సక్సెస్''.. వినటానికి చిన్న పదమే అయినా సాధించాలంటే సంవత్సరాలు పడుతుందని ఎంతోమంది నిజ జీవితంలో నిరూపించి చూపించారు. అయితే విజయం సాధించాలంటే నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'లీ థియామ్ వా' (Lee Thiam Wah). ఇంతకీ ఈయనెవరు? ఈయన సాధించిన సక్సెస్ ఏంటనేది ఇక్కడ చూసేద్దాం..మలేసియాకు చెందిన 'లీ థియామ్ వా' 99 స్పీడ్ మార్ట్ వ్యవస్థాపకులు, యజమాని. నిజానికి ఈయనకు చిన్నతనంలోనే పోలియో వ్యాధి కారణంగా రెండు కాళ్ళూ చచ్చుబడిపోయాయి. తల్లిదండ్రుల ఆర్ధిక స్తోమత అంతంత మాత్రంగా ఉండటం చేత.. లీను ఆరేళ్ళు మాత్రమే పాఠశాలలో చదివించగలిగారు. ఆ తరువాత లీ చదువుకోలేకపోయారు.చిన్నతనం నుంచే ఏదో ఒకటి సాధించాలానే తపనతో లీ థియామ్ వా.. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని రోడ్డు పక్కన ఓ చిన్న దుకాణం స్టార్ట్ చేశారు. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు ఓ కిరాణా దుకాణం ప్రారంభించడానికి కావాల్సిన డబ్బు పొదుపు చేసారు. ఆ తరువాత అనుకున్న విధంగానే కిరాణా దుకాణం మొదలుపెట్టారు. అదే అనతి కాలంలో '99 స్పీడ్ మార్ట్'గా అవతరించింది. ఎంతో శ్రమించి ఈ స్టోర్లను మలేషియా మొత్తం విస్తరించగలిగారు.వైకల్యం కారణంగా నాకు ఎవరూ పని ఇవ్వరు, నాకు నేనే సహాయం చేసుకోవాలి అనే ఉద్దేశ్యంతో ప్రారంభమైన లీ ప్రయాణం నేడు ధనవంతుణ్ణి చేసింది. విజయం సాధించాలంటే అంగవైకల్యం అడ్డుకాదని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన లీ.. ఇప్పుడు ఎంతోమందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు.60 ఏళ్ల లీకు చెందిన 99 స్పీడ్ మార్ట్ రిటైల్ హోల్డింగ్స్ బీహెచ్డీ, కౌలాలంపూర్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో అరంగేట్రం చేసింది. ఏడు సంవత్సరాలలో ఇదే ఏకంగా 531 మిలియన్ డాలర్లను సేకరించింది. ఐపీవో స్టాక్ మొదటిరోజే 15 శాతం పెరగడంతో లీ నికర విలువ 2.8 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ఈయన మలేషియాలో అత్యంత సంపన్నుల జాబితాలో ఒకరుగా నిలిచారు.ఇదీ చదవండి: ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లు ఇవే..కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు.. అదీ చేతకాకపోతే పాకుతూ పో, అంతేకానీ ఒకేచోట అలా కదలకుండా ఉండిపోకు అన్న మహాకవి శ్రీ శ్రీ మాటలు నిజం చేసి ఎంతోమందికి ఆదర్శనంగా నిలిచిన వ్యక్తులలో మలేసియా కుబేరుడు 'లీ థియామ్ వా' ఒకరు. ఈయన జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. -
Sagubadi: ప్రకృతి సేద్యం.. బతికించింది!
దేవేంద్ర మాటలు అనంతపురం జిల్లాకు చెందిన లక్షలాది మంది రైతుల కష్టాలను ప్రతిబింబిస్తాయి. ప్రపంచంలోని ఇతర కరువు పీడిత ్రపాంతాల మాదిరిగానే ఇక్కడ వ్యవసాయం ఒక సవాలు. గత ఏడాది కరువుకు అధిక ఉష్ణోగ్రతలు తోడు కావటంతో ఎండుతున్న చీనీ తోటలు.. పంట నష్టాల మధ్య.. ఈ విద్యాధిక యువ రైతుది ఓ ఆశావహమైన కథ.‘నా పేరు పొత్తూరు దేవేంద్ర. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం చిన్నమల్లేపల్లి గ్రామం. గత ఏడాది లోటు వర్షపాతంతో మా ్రపాంతంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. మాకు 2.5 ఎకరాల సాగు భూమి ఉంది. మా నాన్న చిన్న వెంకట స్వామి 30 ఏళ్లు సంప్రదాయ రసాయన వ్యవసాయం చేశారు. ఆ రోజుల్లో కుటుంబ ఖర్చులకూ కనా కష్టంగా ఉండేది. ఎమ్మే చదివాను. గత 15 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను.నాలుగు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. విత్తనాలు వేయటం నుంచి పంట నూర్పిడి వరకు ప్రతి పనినీ మనసు పెట్టి చేస్తున్నాను. గతంతో పోలిస్తే ఇప్పుడు మా కుటుంబం ఆర్థికంగా చాలా మెరుగైన స్థితిలో ఉంది. అంతేకాదు, వ్యవసాయ పనులను మరింత నైపుణ్యంతో చేయటం నేర్చుకున్నారు. మాకున్న 2.5 ఎకరాల్లో ఒక ఎకరంలో చీనీ(బత్తాయి) తోట ఉంది. నీటి సౌకర్యం చాలా తక్కువగా ఉన్నప్పటికీ, గత ఏడాది జూలై 31న అలసంద, పొద చిక్కుడు, సజ్జలు, కందులు, ఆముదం విత్తనాలను గుళికలుగా మార్చి.. వానకు ముందే విత్తే (పిఎండిఎస్) పద్ధతిలో విత్తాను.ప్రూనింగ్ చేసి ఘనజీవామృతం వేస్తున్న రైతుఅప్పటి నుంచి 13 నెలలుగా చీనీ చెట్ల మధ్యలో భూమిని ఒక్కసారి కూడా దున్నలేదు. కానీ, మట్టిలో బెజ్జాలు చేసి చేతులతో విత్తనాలు వేస్తూ.. ఏడాది పొడవునా కాలానుగుణమైన అంతర పంటలు పండిస్తూనే ఉన్నాం. ఇలా ఏడాది పొడవునా పంటలతో పొలాన్ని ఆకుపచ్చగా కప్పి ఉంచుతున్నాం. పడిన కొద్దిపాటి వర్షంతోనో లేదా కొద్దిపాటి నీటి తడి ద్వారానో మట్టిలో తేమను నిలుపుకుంటున్నాం. చీనీ చెట్లకు, అంతర పంటలకు అవసరమైన విధంగా నిరంతరాయంగా తేమ అందుతున్నట్లు పచ్చని పొలాన్ని చూస్తే నిర్ధారణ అవుతోంది. గత వేసవిలో అతి వేడి పరిస్థితుల్లో కూడా నేలలో తగినంత తేమ ఉంది. గడ్డీ గాదం, పంట అవశేషాలతో నేలను కప్పి ఉంచటం కూడా తోటను పచ్చగా ఉంచడంలో సహాయపడుతోంది. వీటన్నింటితో కరువు పరిస్థితులను అధిగమిస్తున్నా.నాలుగేళ్లలో ఎంతో మార్పు..ప్రకృతి వ్యవసాయం చేపట్టిన తర్వాత ఈ నాలుగేళ్లలో మా పొలం మట్టిలో, చీనీ చెట్లలో అనేక మార్పులను గమనించాను. వానపాములు, సూక్ష్మజీవులు పనిచేయటం వల్ల మట్టిలో జీవవైవిధ్యం పెరిగింది. అందుకు రుణపడి ఉన్నాం. మొక్కలు నేల నుంచి పోషకాలను తీసుకోవడం మెరుగుపడింది. ఫలితంగా చీనీ చెట్లలో ఎటువంటి సూక్ష్మధాతు లోపాలు లేవు. మంచి నాణ్యమైన పండ్ల దిగుబడి వచ్చింది. మా నాన్న రసాయనిక ఎరువులు, పురుగుమందులు వేస్తూ వ్యవసాయం చేసినప్పుడు పరిస్థితి ఇలా లేదు. గత ఏడాది అధిక ఎండలకు మా పొలానికి దగ్గర్లోని తోటల్లో కూడా చీనీ చెట్లు ఎండిపోయాయి. రైతులు చెయ్యని ప్రయత్నం లేదు. ఎన్నో రసాయనాలను స్ప్రే చేశారు. కానీ చీనీ చెట్లను రక్షించుకోలేకపోయారు.ఎపిసిఎన్ఎఫ్ చీఫ్ టెక్నాలజీ– ఇన్నోవేషన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ్రపాజెక్ట్ మేనేజర్ లక్ష్మా నాయక్ చనిపోతున్న చీనీ చెట్లను ఎలా రక్షించుకోవాలో మాకు నేర్పించారు. ఆయన చెప్పినట్లు.. 50 శాతం ఎండిన చెట్ల కొమ్మలను నేల నుంచి 2 అడుగుల ఎత్తులో కత్తిరించి, మోళ్లకు తడి ఘన జీవామృతం పూసి, ద్రవజీవామృతం పిచికారీ చేశాం. ఆ తర్వాత చెట్టు చుట్టూ 2 అడుగుల వెడల్పున పాది చేసి, ఘనజీవామృతాన్ని వేసి, అనేక పంటల విత్తనాలు చల్లి, దానిపైన మట్టి వేశాం.కాయలతో కళకళలాడుతున్న చీనీ చెట్లుఇటువంటి పద్ధతులతో మట్టిలో సూక్ష్మజీవుల కార్యకలాపాల ఫలితంగా చనిపోతున్న చెట్లు కూడా బతికాయి. 20–25 రోజుల్లో కొత్త చిగుర్లు వచ్చాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లోనూ చెట్లు పునరుజ్జీవం పొందాయి. మృత్యువాత పడుతున్న చీనీ చెట్లను కాపాడుకోగలిగినందుకు చాలా సంతోషిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వెనుక ఉన్న సై¯Œ ్సను అర్థం చేసుకొని ఆశ్చర్యపోయాను. రసాయనిక వ్యవసాయం చేసిన రోజుల్లో అనేక మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాం. వైద్యం కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించిన తర్వాత పరిస్థితి మారింది. నా పొలంలో 365 రోజులు కాలానుగుణమైన కూరగాయలు, ఇతర ఆహార పంటలను అంతర పంటలుగా పండించడం ్రపారంభించాను. బయటి నుంచి ఏదైనా ఆహారాన్ని కొనుగోలు చేయడం మానేశాను. మనం ప్రకృతి వ్యవసాయంలో పండిస్తున్నది తినడం వల్ల, హాస్పిటల్ ఖర్చులు, మీరు నమ్ముతారో లేదో గాని, దాదాపు పూర్తిగా తగ్గిపోయాయి.ఎకరంలో 10 టన్నుల బత్తాయిలు..ఎనీ టైమ్ మనీ (ఏటీఎం) మోడల్‌తో పాటు ఏ–గ్రేడ్ మోడల్లో కూడా పంటలు సాగు చేస్తున్నాం. మా కూరగాయలు, తదితర పంటలను ఇంట్లో వాడుకోగా, అదనంగా వీటి ద్వారా ప్రతి నెలా రూ. 4–5 వేల వరకు ఆదాయం వస్తోంది. కుటుంబం ఖర్చులు తీరుతున్నాయి. ఈ ఒక ఎకరం చీనీ తోట నుండి ప్రతి సంవత్సరం సగటున 10 టన్నుల బత్తాయిలు పండిస్తున్నాం. గత 3 సంవత్సరాలుగా, మేం టన్ను బత్తాయి పండ్లను సగటున రూ. 30–33 వేలకు అమ్ముతున్నాం. ఏటా కనీసం రూ. 3 లక్షల ఆదాయం బత్తాయిల ద్వారా వస్తోంది. ఇక చెట్ల మధ్యలో సాగు చేసే బొబ్బర్లు, పొద అనప, కంది, సజ్జ, ఆముదం పంటలతో పాటు సూపర్ నేపియర్ గడ్డి ద్వారా వచ్చే ఆదాయం కలిపితే మొత్తం రూ. 4 నుంచి 4.5 లక్షల వరకు ఉంటుంది..’ – దేవేంద్ర, మొబైల్: 79976 44711గేదెలకూ ఇతర జంతువుల మాదిరిగానే కంటి శుక్లం సమస్య వస్తుంటుంది. కంటి కటకం తెల్లగా మారడం వల్ల దృష్టి లో΄ానికి లేదా అంధత్వానికి దారితీస్తుంది. గేదె కన్ను తెల్లగా మారినా, వాపు ఉన్నా.. కళ్ళు కనపడక వస్తువుల్ని ఢీ కొట్టడం వంటి లక్షణాలను బట్టి శుక్లం వచ్చినట్లు భావించాలి..కారణాలు..– వయస్సు: ముసలి గేదెలకు కంటిశుక్లం వచ్చే అవకాశం ఎక్కువ.– జన్యువులు: వారసత్వంగా వచ్చిన జన్యు కారణాల వల్ల కొన్ని గేదెల్లో కంటిశుక్లం రావచ్చు.– ΄ోషకాహార లోపం: విటమిన్ ఎ వంటి ముఖ్యమైన ΄ోషకాలు లోపించటం వల్ల కంటిశుక్లం ఏర్పడుతుంది.– అంటువ్యాధులు: కొన్ని అంటువ్యాధులు, ముఖ్యంగా కంటిని ప్రభావితం చేసేవి, కంటిశుక్లాలకు కారణమవుతాయి.– గాయం: గాయం వల్ల కంటి కటకాలు దెబ్బతిని శుక్లాలకు దారితీస్తుంది.– రసాయనాలు: కొన్ని రసాయనాలు/ విషతుల్య పదార్థాలు తగలటం వల్ల కంటిశుక్లం ఏర్పడవచ్చు.హోమియోపతి చికిత్స యుఫ్రేసియ– క్యు: కంటిలో 3 చుక్కలు.. రోజుకు 3 సార్లు.. 10 రోజులు వేయాలి.యుఫ్రేసియ 200: 10 మాత్రలు.. రోజుకు 2 సార్లు.. 10 రోజులు వేయాలి. 5 రోజుల్లోనే పూర్తిగా ఫలితం కనపడుతుంది.– డా. జి. రాంబాబు (94945 88885), పశువైద్యాధికారి, కడప -
18 ఏళ్లకే పెళ్లి.. నేడు రూ.18566 కోట్ల కంపెనీకి బాస్: ఎవరీ దీపాలీ?
ఒక స్త్రీ సంపాదించగలిగినప్పుడు.. ఆమె అధికారం పొందుతుందని, తన బిడ్డలను పాఠశాలకు వెళ్లేలా చేస్తుందని గట్టిగా నమ్మే మహిళలలో ఒకరు వెల్స్పన్ లివింగ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ 'దీపాలీ గోయెంకా'. 18 సంవత్సరాలకే పెళ్లి చేసుకున్న ఈమె అతి తక్కువ కాలంలోనే ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరుగా నిలిచారు.వ్యాపారవేత్త బాలక్రిషన్ గోయెంకాను 18 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్న దీపాలీ గోయెంకా.. వివాహం తరువాత 1987లో ముంబైకి వెళ్లారు. తనకంటూ ఓ గుర్తిపు తెచ్చుకోవాలనే కోరికతో భర్త చేసే టెక్ట్స్‌టైల్ వ్యాపారంలోకి అడుగు పెట్టింది. అతి తక్కువ కాలంలోనే తన కొత్త ఆలోచనలతో తనను తాను నిరూపించుకోగలిగింది.సైకాలజీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన దీపాలీకి టెక్ట్స్‌టైల్ రంగంలో ఏ మాత్రం అనుభవం లేదు. ఈమె హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ప్రెసిడెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ వంటివి కూడా పూర్తి చేసింది. పెళ్ళైన తరువాత ఈ టెక్ట్స్‌టైల్ రంగంలోకి అడుగుపెట్టింది.పరిచయమే లేని ఓ రంగంలో అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే.. ఆ రంగంలో ఆరితేరిన దీపాలీ 2016లో ఫోర్బ్స్ ఆమెను ఆసియాలో 16వ అత్యంత శక్తివంతమైన మహిళగా గుర్తించింది. దీపాలీ వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా అనేక దాతృత్వ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ఉంటుంది. నేను ఆమె కంపెనీ మార్కెట్ క్యాప్ ఏకంగా రూ. 18,566 కోట్లు కావడం గమనార్హం.ఇదీ చదవండి: నన్ను పిచ్చివాడిగా భావించారు.. అంతా అదృశ్యమైంది: అనుపమ్ మిట్టల్దీపాలీ ‘వెల్స్పన్’లోకి అడుగు పెట్టినప్పుడు కేవలం ఏడు శాతం మంది మహిళలే పనిచేస్తుండేవారు. కానీ ఆ సంఖ్య దినదినాభివృద్ధి చెందింది. నేడు ఆ సంస్థలో ఏకంగా 30 శాతం కంటే ఎక్కువ మహిళలు పనిచేస్తున్నట్లు సమాచారం. ఆమె ఎదగడమే కాకుండా చుట్టూ ఉన్న మహిళలు కూడా ఎదగాలనే సంకల్పంతో మహిళలను దీపాలీ ప్రోత్సహిస్తోంది. -
Santoshi Shetty: బెస్ట్ ఫ్యాషన్ బ్లాగర్‌గా..
ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టయిల్ బ్లాగర్. ‘The Style Edge’ ఫౌండర్. సోషల్ మీడియా స్టార్. ఇన్‌స్టాలో ఆమెకు ఏడు లక్షలకు పైగా ఫ్యాన్స్ ఉన్నారు. సొంతూరు ముంబై. ఆర్కిటెక్చర్లో గ్రాడ్యుయేషన్ చేసింది.కాలేజీ రోజుల్లోనే తన పేరు మీదే యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేసింది. డార్క్ స్కిన్ వల్ల తను ఎదుర్కొన్న వివక్షను వివరిస్తూ చేసిన వీడియోతో పాపులర్ అయింది. అది ఆమెకు మోడలింగ్ చాన్స్‌నిచ్చింది. ర్యాంప్ మీద షో స్టాపర్‌గా నిలిచింది. ‘Grazia India’ లాంటి ఫ్యాషన్ మ్యాగజీన్లు ఆమె ఫొటోతో కవర్ పేజ్ని మేకప్ చేసుకున్నాయి. బెస్ట్ ఫ్యాషన్ బ్లాగర్‌గా ఎన్నో అవార్డులూ అందుకుంది సంతోషి శెట్టి.ఇవి చదవండి: హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి -
దస్తూరి అయాచిత వరం!
ఈ ఫొటోలోని వ్యక్తి పేరు డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ. విశ్రాంత అధ్యాపకులు. అష్టావధాని, కవి, దాశరథి పురస్కార గ్రహీత! డాక్టర్ నటేశ్వర శర్మ జన్మస్థలం తెలంగాణ, కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి.వృత్తి జీవితం గడిపి, స్థిరపడింది కామారెడ్డిలో. 1977లో, కామారెడ్డిలోని ప్రాచ్యకళాశాలలో సంస్కృత అధ్యాపకుడిగా చేరి, 2014లో అదే కళాశాలలో ప్రధాన ఆచార్యులుగా ఉద్యోగవిరమణ పొందారు. ఆయనకున్న మరో ప్రత్యేకత.. ముత్యాల్లాంటి చేతిరాత. ఆ దస్తూరి చూసి ముచ్చటపడి, ముగ్ధులుకాని వారుండరంటే ఇసుమంతైనా ఆశ్చర్యం లేదు. ఆ చేతిరాతను ఆయనకున్న వరంగా అభివర్ణించుకోవచ్చు. స్వదస్తూరితో నటేశ్వర శర్మ 35 పేజీల పుస్తకాన్ని ముద్రించారు. కవర్ పేజీతో సహా అన్నీ ఆయన చేతి రాతతోనే ఉండడం విశేషం. ఆయనకు రచనావ్యాసంగం పట్ల మక్కువ మెండు. గద్య, పద్య,గేయ కవితలెన్నో రాశారు. యాభైకి పైగా పుస్తకాలు రచించారు. అష్టావధానంలోనూ ఆయన దిట్టే! ఇప్పటివరకు దాదాపు 125కి పైగా అవధానాలు చేశారు. సాహిత్యంలో ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. గత ఏడాది రాష్ట్రప్రభుత్వం ఆయనను దాశరథి సాహిత్య పురస్కారంతో సన్మానించింది.అయాచితం నటేశ్వర శర్మ అద్భుతమైన గురువు కూడా. ఆయన దగ్గర చదువుకున్న వందలాది మంది శిష్యులు తెలుగు పండితులుగా, అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. సాహిత్యరంగంలోనూ రాణిస్తున్నారు. -
Asha Negi: సాహసాలకు ఆమె వెనుకాడని 'ఆశా' జీవి..
ఆశా నేగీ.. హిందీ ‘బిగ్ బాస్’, ‘ఇండియన్ ఐడల్ జూనియర్’ లాంటి రియాలిటీ షోస్ చూసేవారికి బాగా తెలిసిన పేరు. ఒక షోలో ఆమె పార్టిసిపెంట్, మరొక షోకి ఆమె హోస్ట్. రియాలిటీ షోసే కాదు సీరియల్స్, స్పోర్ట్స్, మూవీస్, సిరీస్.. ఇలా చాలా క్రెడిట్సే ఉన్నాయి ఆమెకు!– ఆశా పుట్టిపెరిగింది ఉత్తరాఖండ్ రాజధాని డెహరాడూన్లో. అక్కడి డీఏవీ కాలేజ్‌లో కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. ఆ టైమ్‌లోనే అందాల పోటీలో పాల్గొని ‘మిస్ ఉత్తరాఖండ్’ క్రౌన్ గెలుచుకుంది.– గ్రాడ్యుయేషన్ తర్వాత ఆశాకు బెంగళూరులోని ఓ టూర్స్ అండ్ ట్రావెల్స్ కన్సల్టన్సీలో ఉద్యోగం వచ్చింది. అందులో కొన్నాళ్లు వర్క్ చేశాక కాల్ సెంటర్‌కి మారింది.– తను చేస్తున్న రెగ్యులర్ ఉద్యోగాలేవీ నచ్చకపోవడంతో గ్లామర్ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుని ముంబైకి మకాం మార్చింది. ఎక్కడ ఆడిషన్స్ ఉన్నా వెళ్లి అటెండ్ అవసాగింది. ఆ ప్రయత్నాల్లోనే ‘సప్నోం సే భరే నైనా’ అనే టీవీ సీరియల్లో అవకాశం వచ్చింది. కానీ అది ఆమెకు అంతగా గుర్తింపునివ్వలేదు.తర్వాత ‘పవిత్ర్ రిశ్తా’ అనే సీరియల్లో నటించింది. దాంతో ఆశాకు ఎనలేని గుర్తింపు వచ్చింది. ఆ పాపులారిటీనే ఆమెకు ‘బిగ్ బాస్’ (సీజన్ 6) హౌస్‌కి వెళ్లే చాన్స్‌ను తెచ్చింది. ‘నచ్ బలియే’ సీజన్ 6లో పార్టిసిపేట్ చేసే ఆపర్చునిటీనీ ఇచ్చింది.ఆశాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. చక్కగా ఆడుతుంది. అందుకు స్పోర్ట్స్ రియాలిటీ ఎంటర్టైన్మెంట్ షో ‘బాక్స్ క్రికెట్ లీగ్’ రెండు సీజన్లే ఉదాహరణలు. సీజన్ 1 ఢిల్లీ డ్రాగన్స్ తరఫున, సీజన్ 2లో కోల్‌కతా బాబూ మోశాయ్స్ తరఫున ఆడింది.సాహసాలకూ ఆమె వెనుకాడదు. ఆ ముచ్చట తీర్చుకోవడానికి ‘ఖత్రోంకే ఖిలాడీ’ సీజన్ 6లో పాల్గొని సెమీఫైనల్ దాకా వెళ్లింది.ఆశా యాక్టింగ్ టాలెంట్ చూసి అనురాగ్ బసు తన ‘లూడో’ సినిమాలో వేషం ఇచ్చాడు. తన పాత్ర పరిధిలో చక్కగా అభినయించింది. తర్వాత ‘కాలర్ బాంబ్’ అనే సినిమాలోనూ నటించింది.సీరియల్, సినిమా, సిరీస్.. ఏదైనా సరే.. నటనకు అవకాశం ఉంటే చాలు అనుకునే ఆశా అందుకు తగ్గట్టుగానే ఓటీటీలోకీ ఎంట్రీ ఇచ్చింది.. ‘బారిష్’ అనే సిరీస్‌తో. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘ఇండస్ట్రీ’తో వీక్షకులను అలరిస్తోంది."పేరుకు తగ్గట్టే నేను ఆశా జీవిని. ఆ తత్వమే ఇండస్ట్రీలో నన్ను లైవ్‌గా ఉంచుతోంది." – ఆశా నేగీఇవి చదవండి: Nitasha Gaurav: న్యూ గ్రామర్ అండ్ గ్లామర్! -
Nitasha Gaurav: న్యూ గ్రామర్ అండ్ గ్లామర్!
రంగుల్లో పింక్‌తో, కాస్ట్యూమ్స్‌లో స్కర్ట్‌తో మగవాళ్లకు స్టయిలింగ్ చేసి.. ఫ్యాషన్‌కి ముఖ్యంగా డ్రెసింగ్‌కి, కలర్స్‌కి జెండర్ లేదు.. కంఫర్టే ముఖ్యం అంటూ దేశంలో మెన్ ఫ్యాషన్ గ్రామర్ని, గ్లామర్‌ని మార్చేసిన స్టయిలిస్ట్.. నితాశా గౌరవ్! రణ్వీర్ సింగ్ పర్సనల్ స్టయిలిస్ట్!‘న్యూస్ పేపర్స్, అన్నిరకాల మ్యాగజీన్స్, బుక్స్, ఆర్ట్, ట్రావెల్, నేచర్, మ్యూజిక్.. ఇవన్నీ నాకు ఇన్స్పిరేషనే! స్టయిల్ అండ్ ఫ్యాషన్‌కి మినిమలిజం, మాగ్జిమలిజం రెండూ అవసరమే! ఈ రంగంలో రాణించాలంటే ఫ్యాషన్‌కి సంబంధించిన ఫార్మల్ ఎడ్యుకేషన్ తప్పనిసరి. పనిని ప్రేమించాలి’ అని చెబుతుంది నితాశా గౌరవ్. నితాశా.. లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్, న్యూయార్క్‌లోని ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫ్యాషన్‌కి సంబంధించిన ఫార్మల్ ఎడ్యుకేషన్‌ని పూర్తిచేసింది. ఇండియాకు తిరిగి రాగానే ఫెమినా ఇండియాలో ఉద్యోగంతో ఫ్యాషన్ కెరీర్‌ని మొదలుపెట్టింది. ఫెమినాలో నాలుగేళ్ల కొలువు తర్వాత నిఫ్ట్, ఫ్యాషన్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో చేరింది. అందులో కొన్నాళ్లు చేశాక.. ఇండిపెండెంట్‌గా ఏదైనా స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నప్పుడే కొన్ని ఫ్యాషన్ షోస్‌కి, షూట్స్‌లో మోడల్స్‌కి స్టయిలింగ్ చేసే చాన్స్ రావడంతో ఆ పనిలో పడిపోయింది.అలాంటి ఒకానొక సందర్భంలో ఫిల్మ్‌ఫేర్ షూట్‌కి బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్‌కి స్టయిలింగ్ చేసే అవకాశం దొరికింది. ఆ క్రమంలో నితాశా ఆలోచనలు, పని విధానం రణ్‌వీర్‌కి నచ్చాయి. ముఖ్యంగా ఫెమినైన్ అనుకునే కలర్స్, డ్రెసెస్‌తో ఆమె తనకు స్టయిలింగ్ చేస్తున్న తీరు మరీ నచ్చింది. దాంతో. తర్వాత కూడా చాలా ఈవెంట్స్కీ వాళ్ల అసోసియేషన్ కొనసాగింది. అలా రణ్‌వీర్‌కి ఆమె ఇచ్చిన కొత్త లుక్.. టాక్ ఆఫ్ ద కంట్రీ అవడంతో సెకండ్ థాట్ లేకుండా నితాశాను తన పర్సనల్ స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకున్నాడు రణ్వీర్. అది ఆమె ఊహించనిది. మనసులో సంతోషం కుదిపేస్తున్న బాధ్యత ఆమెను స్టడీగా నిలబెట్టింది.రణ్‌వీర్‌కి పర్సనల్ స్టయిలిస్ట్ అంటే ఆమె క్రియేటివిటీకీ అతనికున్నంత దూకుడు, ఎనర్జీ ఉండాలి! ‘యెస్..’ అనుకుంటూ ఆ జాబ్‌ని చాలెంజింగ్‌గా తీసుకుంది. నిలబెట్టుకుంది. స్టయిలిస్ట్‌గా తనను ఎంచుకోవడంలో రణవీర్ తీసుకున్న నిర్ణయానికి అతన్ని గర్వపడేలా చేసిందే తప్ప‘ఇట్ హ్యాపెన్స్’ అని సర్దుకుపోయేలా చేయలేదు. గల్లీ బాయ్, బేఫిక్రే లాంటి సినిమాలే అందుకు దృష్టాంతాలు. ఆమె అనుష్కాకూ పనిచేసింది స్టయిలిస్ట్‌గా ‘జబ్ హ్యారీ మెట్ సెజల్’ సినిమాలో!ఫ్యాషన్ రూల్ బుక్‌ని అన్‌ఫాలో కావడమే ఆమె ప్రత్యేకత. డిఫరెంట్ స్టయిల్స్‌ని మిక్స్ అండ్ మ్యాచ్ చేయడంలో దిట్ట ఆమె! ఆ స్పెషాలిటీ, ఆ ఫ్యూజన్‌కి ధనుష్, అర్జున్ కపూర్, షాహిద్ కపూర్, అభయ్ డియోల్లూ ముచ్చటపడి.. వాళ్లూ ఆమెను పర్సనల్ స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకున్నారు.ఇవి చదవండి: ‘పంచాయతీ’ రిజర్వేషన్లు మారుతాయి -
Armand Duplantis: ఎవరికీ అందనంత ఎత్తుకు..
పారిస్‌లోని నేషనల్ స్టేడియం.. అథ్లెటిక్స్‌లో ఆ రోజుకు మిగతా అన్ని ఈవెంట్లూ ముగిశాయి. కానీ స్టేడియంలో కూర్చున్న 80 వేల మంది ప్రేక్షకులు మాత్రం ఆ వ్యక్తి కోసం, ఆ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చివరగా అతను వచ్చాడు. పొడవాటి పోల్‌ను తన చేతుల్లోకి తీసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆ కార్బన్ ఫైబర్ పోల్ సహాయంతో ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిన అతను ఆకాశంలోకి దూసుకెళ్లినట్లుగా అనిపించింది. అక్కడినుంచి బార్ మీదుగా అవతలి వైపు ప్యాడింగ్ వైపు పడే లోపే కొత్త ప్రపంచ రికార్డు.. ఒలింపిక్ మెడల్ వచ్చేసింది. హర్షధ్వానాలతో స్టేడియం హోరెత్తిపోయింది. అథ్లెటిక్స్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకున్న ఆ ఆటగాడే ఆర్మండ్ డుప్లాంటిస్.ఒకటి, రెండు, మూడు.. ఇలా ప్రపంచ రికార్డులు బద్దలవుతూనే ఉన్నాయి. అతను ఆడుతోందే వరల్డ్ రికార్డులు నెలకొల్పడానికి అన్నట్లుగా ఉంది పరిస్థితి. నాలుగున్నరేళ్ల వ్యవధిలో ఇలా ఏకంగా అతను 9 కొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. ఈ క్రమంలో రెండు ఒలింపిక్ స్వర్ణాలు అతని ఖాతాలో చేరాయి. తాజాగా పారిస్ ఒలింపిక్స్‌లో కొత్త వరల్డ్ రికార్డుతో సాధించిన స్వర్ణం ఈ క్రీడలో డుప్లాంటిస్ స్థాయిని శిఖరానికి చేర్చింది. ఒలింపిక్ పతకం గెలిచిన రెండు వారాలకే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ పోటీల్లోనూ అలవోకగా అగ్రస్థానంలో నిలిచాడు.క్రీడాకారుల కుటుంబం నుంచి..తల్లిదండ్రులు, ఇద్దరు అన్నలూ క్రీడాకారులే! అలా ఇంట్లో అంతా క్రీడా వాతావరణమే. డుప్లాంటిస్ కూడా సహజంగానే క్రీడల వైపు మళ్లాడు. అమెరికా జాతీయుడైన తండ్రి గ్రెగ్ పోల్‌వాల్టర్ కాగా, స్వీడన్‌కు చెందిన తల్లి హెలెనా హెప్టాథ్లాన్ ప్లేయర్. పెద్దన్నయ్య కూడా పోల్‌వాల్ట్‌లో అంతర్జాతీయ స్థాయికి చేరగా, రెండో అన్న పోల్వాల్ట్తోనే మొదలుపెట్టినా ఆ తర్వాత బేస్‌బాల్ వైపు మళ్లి జాతీయ స్థాయి వరకు ఆడాడు. తండ్రి బాటలోనే డుప్లాంటిస్ నాలుగేళ్ల వయసులోనే పోల్‌వాల్ట్‌పై ఆసక్తి చూపించాడు.ఏడేళ్ల వయసులోనే అందరి దృష్టినీ ఆకర్షించిన అతను పదేళ్ల వయసులో 3.86 మీటర్లు ఎగిరి పోల్‌వాల్ట్‌లో తాను ఏ స్థాయికి చేరగలడో చూపించాడు. ఒక దశలో 7 నుంచి 13 ఏళ్ల వయసు వరకు అన్ని వయో విభాగాల్లో ప్రపంచస్థాయి అత్యుత్తమ ప్రదర్శనలన్నీ డుప్లాంటిస్ పేరు మీదే ఉండటం విశేషం. అమెరికాలోనే పుట్టి, అక్కడే ప్రా«థమిక విద్యాభ్యాసం చేసినా, అమ్మ పుట్టిల్లు స్వీడన్పైనే ఆర్మండ్కు అభిమానం ఎక్కువ. అందుకే క్రీడల్లో స్వీడన్‌కే అతను ప్రాతినిధ్యం వహించాడు.రికార్డుల హోరు..16 ఏళ్ల వయసులో డుప్లాంటిస్ తొలిసారి అంతర్జాతీయ వేదికపై మెరిశాడు. కొలంబియాలో జరిగిన వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకోవడంతో పాటు కొత్త చాంపియన్‌షిప్ రికార్డును నెలకొల్పాడు. ఆ వెంటనే అండర్–16 స్థాయిలోనూ కొత్త వరల్డ్ రికార్డు నమోదైంది. ఆపై వరల్డ్ జూనియర్ రికార్డు కూడా దరి చేరింది. 18 ఫీట్ల ఇండోర్ పోల్‌వాల్ట్ ఈవెంట్లో పోటీ పడిన తొలి స్కూల్ విద్యార్థిగా డుప్లాంటిస్ నిలిచాడు. అండర్–20 విభాగంలో వరల్డ్ చాంపియన్‌గా నిలిచాక అంతర్జాతీయ స్థాయిలో తన తొలి సీనియర్ టోర్నీ యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో అతని సత్తా ప్రపంచానికి తెలిసింది. ఈ టోర్నీలో తొలిసారి 6 మీటర్ల ఎత్తును అధిగమించిన అతనిపై అందరి దృష్టీ పడింది.ఆపై ఎదురు లేకుండా దూసుకుపోయిన డుప్లాంటిస్ కెరీర్లో ఎన్నో అసాధారణ ఘనతలు ఉన్నాయి. యూరోపియన్ జూనియర్లో స్వర్ణం, వరల్డ్ యూత్‌లో స్వర్ణం, వరల్డ్ జూనియర్లో స్వర్ణ, కాంస్యాలతో అతని జూనియర్ కెరీర్లో కీలక మైలురాళ్లు. సీనియర్ స్థాయికి వచ్చే సరికి యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు, యూరోపియన్ ఇండోర్‌లో స్వర్ణంతో మెరిశాడు. ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్‌లో మూడు స్వర్ణాలు గెలుచుకున్నాడు. ఆ తర్వాత వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలు, ఒక రజతం సాధించాడు. వరల్డ్ ఇండోర్ చాంపియన్‌షిప్‌లో మరో రెండు పసిడి పతకాలు అందుకొని ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. 2020 టోక్యో ఒలింపిక్స్, 2024 పారిస్ ఒలింపిక్స్‌లలో గెలుచుకున్న స్వర్ణాలు అతని కెరీర్‌ను సంపూర్ణం చేశాయి.ఒక్కో సెంటీ మీటర్ దాటుతూ..తొమ్మిది ప్రపంచ రికార్డులను నెలకొల్పడంలో డుప్లాంటిస్ ప్రస్థానం అద్భుతంగా సాగింది. ప్రతిసారీ ఒక్కో సెంటీ మీటర్ మెరుగైన ప్రదర్శన ఇస్తూ ముందుకు సాగాడు. 2020 ఫిబ్రవరిలో పోలండ్‌లో జరిగిన కోపర్నికస్ కప్‌లో 6.17 మీటర్ల ఎత్తుకు ఎగిరి అతను తొలిసారి వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అప్పటి నుంచి 2024 పారిస్ ఒలింపిక్స్ వరకు ఇది మెరుగవుతూ వచ్చింది. వరుసగా 6.18, 6.19, 6.20, 6.21, 6.22, 6.23, 6.24, 6.25 మీటర్లతో తన రికార్డులను తానే బద్దలు కొట్టుకుంటూ పోయాడు.ఉక్రెయిన్ దిగ్గజం సెర్గీ బుబ్కా తర్వాత పోల్‌వాల్ట్ స్థాయిని పెంచి, దానికి ప్రత్యేక ఆకర్షణ తెచ్చిన ఆటగాడిగా డుప్లాంటిస్ నిలిచాడు. అమెరికాను కాదని తాను ఎంచుకున్న స్వీడన్ కూడా అన్ని రకాలుగా అతనికి అండగా నిలిచింది. అన్నింటికి మించి తన తల్లి స్వస్థలం ఎవెస్టా మునిసిపాలిటీలో డుప్లాంటిస్ గౌరవ సూచకంగా ప్రభుత్వం ఒక పోల్ వాల్ట్ బార్‌ను ఏర్పాటు చేయడం అతడిని అన్నింటికంటే ఎక్కువగా భావోద్వాగానికి గురి చేసింది. – మొహమ్మద్ అబ్దుల్ హాదిఇవి చదవండి: బడిని గుడి చేసిన గురుదేవుళ్లు.. -
Ashay Bhave: షూట్ ఎట్ ప్లాస్టిక్స్! నీవంతుగా ఒక పరిష్కారం..
ప్లాస్టిక్ వ్యర్థాలను చూసి నిట్టూర్చడం కంటే.. ‘నీవంతుగా ఒక పరిష్కారం’ సూచించు అంటున్నాడు ముంబైకి చెందిన ఆశయ్ భవే. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి స్నీకర్స్ తయారుచేసే ‘థైలీ’ అనే స్టార్టప్‌కు శ్రీకారం చుట్టి విజయం సాధించాడు..మన దేశంలో ప్రతిరోజూ టన్నుల కొద్ది ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘థైలీ’ అనే కంపెనీ ప్లాస్టిక్ వ్యర్థాలు కొండలా పేరుకుపోకుండా తనవంతు కృషి చేస్తోంది. వ్యాపారపరంగా పెద్ద కంపెనీలతో పోటీ పడుతోంది.‘థైలీ’ అంటే హిందీలో సంచి అని అర్థం.‘ప్లాస్టిక్ సంచులను సరిగ్గా రీసైకిల్ చేయకపోవడం వల్ల పర్యావరణ కాలుష్యం గణనీయంగా పెరుగుతుందనే విషయం తెలుసుకున్నాను. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి థైలీ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టాను. పారేసిన ప్లాస్టిక్ సంచుల నుండి ప్రత్యేకంగా సృష్టించిన వినూత్న లెదర్‌ను స్నీకర్స్ కోసం వాడుతున్నాం’ అంటున్నాడు ఆశయ్ భవే.షూస్‌కు సంబంధించిన సోల్‌ను ఇండస్ట్రియల్ స్క్రాప్, టైర్ల నుండి రీసైకిల్ చేసిన రబ్బరుతో తయారుచేస్తారు. షూబాక్స్ను రీసైకిల్ చేసిన జతల నుండి కూడా తయారుచేస్తారు. వాటిలో విత్తనాలు నిక్షిప్తం చేస్తారు. మొక్కలు పెంచడానికి ఇవి ఉపయోగపడతాయి. 2000 సంవత్సరంలో బాస్కెట్‌బాల్ స్నీకర్ ఫ్యాషన్‌ను దృష్టిలో పెట్టుకొని ‘థైలీ’ స్నీకర్ డిజైన్ చేశారు. డిస్కౌంట్ కావాలనుకునేవారు పాత స్నీకర్లు ఇస్తే సరిపోతుంది. షూ తయారీ ప్రక్రియలో ప్రతి దశలో పర్యావరణ స్పృహతో వ్యవహరించడం అనేది ఈ స్టార్టప్ ప్రత్యేకత. ఆశయ్ శ్రమ వృథా పోలేదు. కంపెనీకి ‘పెటా’ సర్టిఫికేషన్‌తో పాటు ఆ సంస్థ నుంచి ప్రతిష్ఠాత్మక ఉత్తమ స్నీకర్ అవార్డ్ లభించింది. పర్యావరణ స్పృహ మాట ఎలా ఉన్నా బడా కంపెనీలతో మార్కెట్లో పోటీ పడడడం అంత తేలిక కాదు.లాభ, నష్టాల మాట ఎలా ఉన్నా... ‘డోన్ట్ జస్ట్ డూ ఇట్ డూ ఇట్ రైట్’ అనేది కంపెనీ నినాదం.‘మా కృషికి గుర్తింపు లభించినందుకు సంతోషంగా ఉంది. ప్లాస్టిక్ వ్యర్థాలు లేని ప్రపంచం నా కల’ అంటున్నాడు 24 సంవత్సరాల ఆశయ్ భవే. న్యూయార్క్‌లోని ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీలో ఫుట్‌వేర్ డిజైన్ కోర్సు చేశాడు ఆశయ్. ఈ స్టార్టప్ పనితీరు, అంకితభావం పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రకు బాగా నచ్చింది. ‘థైలీ ఇన్స్పైరింగ్ స్టార్టప్. యూనికార్న్‌ల కంటే పర్యావరణ బాధ్యతతో వస్తున్న ఇలాంటి స్టార్టప్‌ల అవసరం ఎంతో ఉంది’ అంటూ ఆశయ్ భావేను ప్రశంసించాడు ఆనంద్ మహీంద్ర.ఆ పోటీని తట్టుకొని నిలబడింది ‘థైలీ’ కంపెని..‘మేడ్ ఇన్ ఇండియా’ ప్రాడక్ట్‌గా గుర్తింపు పొందిన ‘థైలీ’ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్‌పై కూడా దృష్టి సారించింది. ఇప్పటి వరకు కంపెనీ వేలాది ప్లాస్టిక్ బాటిల్స్, బ్యాగులను రీసైకిల్ చేసింది.ఇవి చదవండి: ముగ్గురు పాక్ హాకీ ఆటగాళ్లపై జీవితకాల నిషేధం -
Dr Anita Shah: ఆధ్యాత్మిక కళకూ.. ఒక చరిత్ర ఉంది!
ఆమెది హైదరాబాద్‌లో స్థిరపడిన గుజరాతీ కుటుంబం. ఆమె వృత్తీ, ప్రవృత్తీ రెండూ కళలను అధ్యయనం చేయడమే కావడం వల్ల భారతీయ చిత్రరీతుల మీద విస్తృతంగా పరిశోధన చేస్తున్నారు. మనదేశంలో విలసిల్లిన కళారూపాలు ఏయే దేశాల మ్యూజియాల్లో ఉన్నాయో తెలుసుకుని ప్రతి విషయాన్నీ గ్రంథస్తం చేస్తున్నారు. ఆమే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ చేసిన డాక్టర్ అనితా షా, చిత్రకళల పరిశోధకురాలు.ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియమ్స్ (ఐసీఓఎమ్)లో కీలక సభ్యురాలిగా ప్రపంచదేశాల్లో పర్యటిస్తూ మ్యూజియాలజీ విద్యార్థులకు గెస్ట్ ఫ్యాకల్టీగా బోధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మనదేశంలో విస్తరించిన వైవిధ్యభరితమైన చిత్రకళారూపాల గురించిన సమగ్రమైన వివరాలతో ‘కలర్స్ ఆఫ్ డివోషన్’ పేరుతో ఆవిష్కరించారు. అమెరికా, ఇండియాల్లోని వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ చిత్రకళ మీద సదస్సులు నిర్వహిస్తున్న అనితా షా గతంలో ఆమె భర్త భరత్ షాతో కలిసి ‘త్రెడ్స్ ఆఫ్ డివోషన్’ పేరుతో రాజస్థాన్, గుజరాత్‌లోని కచ్‌లో అభివృద్ధి చెందిన ఎంబ్రాయిడరీలతో ప్రదర్శన నిర్వహించారు.రాస్తే కావ్యం... గీస్తే చిత్రం..‘‘చిత్రం అంటే సాహిత్యాన్ని కంటితో చూపించే ప్రక్రియ. నిరక్షరాస్యులకు ఒక గ్రంథసారాన్ని బొమ్మల్లో చూపించవచ్చు. చిత్రకారులు కాలానుగుణంగా మార్పులను జోడించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో దక్కనీ– హైదరాబారీ ఆర్టిస్టులు సంయుక్తంగా కృషి చేసి గోల్డెన్ కలంకారీ పెయింటింగ్స్‌కు రూపకల్పన చేశారు. ఇది పద్దెనిమిదవ శతాబ్దపు చివరి రోజుల్లో అభివృద్ధి చెందింది. కళాకారుల కళానైపుణ్యం అంతా కృష్ణుడు, గోపికల రూపాలను తీర్చిదిద్దడంలో కనిపిస్తుంది. నేను శ్రీవల్లభాచార్య వల్లభ సంప్రదాయ తత్వం పుష్టిమార్గం మీద ఎక్కువగా పని చేశాను.వల్లభాచార్య తత్వం శుద్ధ అద్వైతం, కృష్ణతత్వంతో ఉంటుంది. శైవం ప్రభావం కొన్ని చిత్రాల్లో కనిపిస్తుంది. ఇందులో తాత్విక చింతన, పురాణాల అవలోకనమే ప్రధానంగా సాగుతుంటుంది. సద్గురువుల ప్రవచనాలు, ప్రబోధాల వల్ల అనేక ఊహాచిత్రాలకు రూపం వచ్చింది. సామాన్యులకు ఆరోగ్యకరమైన, ఆచరణీయమైన దైనందిన జీవనశైలిని కూడా పౌరాణిక కథల ద్వారానే వివరించేవారు. తల్లి బిడ్డను లాలనగా నిద్రలేపడం, బిడ్డకు స్నానం చేయించి దుస్తులు ధరింపచేసి చక్కగా అలంకరించడం వంటివన్నీ కృష్ణుడు, యశోద పాత్రల ద్వారా బొమ్మల్లో రూపుదిద్దుకున్నాయి.చిత్రకళలో కృష్ణతత్వం..మన చిత్రకళ, శిల్ప కళ అన్నీ చరిత్ర, పురాణేతిహాసాల ఆధారంగానే అభివృద్ధి చెందాయి. సామాజిక మార్పులను ఇముడ్చుకుంటూ ముందుకు సాగుతుంటాయి. భాగవత పురాణాల ప్రభావం ఉత్తరాదిలో ఎక్కువ. కాబట్టి ఉత్తరాది చిత్రకళలు ఎక్కువగా కృష్ణతత్వాన్ని ప్రతిబింబిస్తుంటాయి. కృష్ణుడు ప్రతి ఇంట్లోనూ కుటుంబ సభ్యుడే. ప్రతి సంఘటనను కృష్ణుడితో అన్వయించుకుంటారు.ముస్లిం ఆర్టిస్టులు హిందూచిత్రాలు..నా తాజా రచన కలర్స్ ఆఫ్ డివోషన్ పుస్తకం వెనుక ఏడేళ్ల శ్రమ ఉంది. ఇది పాఠకుల సాంస్కృతిక, సామాజిక దృష్టి కోణాన్ని విస్తృతపరుస్తుందని చెప్పగలను. హిందూ పురాణాల ఆధారంగా చిత్రాలకు రూపకల్పన చేసిన వారిలో ముస్లిం చిత్రకారులున్నారు. ఆదిల్ షా స్వయంగా సరస్వతీ మాతను పూజించాడు. ఇలాంటి అనేక సామరస్య సహజీవన ఆధారాలు మనప్రాచీన చిత్రాల్లో దొరుకుతాయి. భారతీయ చిత్రకళలో సాంస్కృతికప్రాముఖ్యతను తెలియచేశాను.గతంలో ‘విజిటర్స్ టూ సౌత్ ఇండియన్ మ్యూజియమ్స్– మ్యూజియోలాజికల్ కాంటెక్ట్స్ అండ్ విజిటర్ స్టడీ’ పేరుతో పుస్తకం తెచ్చాను. చిత్రకళారీతులతోపాటు వాటిని చిత్రించిన వస్త్రనైపుణ్యాన్ని కూడా ప్రత్యేకంగా గుర్తించాలి. మన చిత్రకళారీతులన్నీ ఒకచోట గుదిగుచ్చి లేక΄ోవడం దురదృష్టకరం. ఒక్కొక్కటి ఒక్కోచోట ఉండడంతో ఒక సమగ్రమైన స్వరూపం రావడం లేదు. అందుకే మ్యూజియాల్లో ప్రదర్శనలో ఉన్న కళాఖండాల ఫొటోలు, వివరాలతో రచనలు చేస్తున్నాను. ఇదే నా పని’’ అని వివరించారు డా. అనితాషా. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
Vamsi Modem: బస్తాలు మోసిన భుజం.. పతకాలు తెస్తోంది!
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏడో తరగతితోనే చదువు ఆపేసిన భద్రాద్రి ఏజెన్సీకి చెందిన మోడెం వంశీ ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిస్తున్నాడు. కూలీగా మొదలైన ప్రస్థానం ఇపుడు కామన్ వెల్త్ దిశగా సాగుతోంది...మోడెం వంశీ స్వస్థలం ఒకప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లా, ప్రస్తుత ములుగు జిల్లాలోని వాజేడు మండలం ఇప్పగూyð ం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏడో తరగతితోనే చదువును అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చింది. దీంతో బతుకుదెరువు కోసం పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం ఇబ్రహీంపట్నంలో ఓ నర్సరీలో పని చేస్తున్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లాడు. అక్కడ నర్సీరీలో 50 కేజీల బరువు ఉన్న యూరియా బస్తాలను అలవోకగా ఎత్తుకుని తిరగడాన్ని ఆ నర్సరీ యజమాని, మాజీ వెయిట్ లిఫ్టరైన అబ్దుల్ ఫరూక్ గమనించాడు.దీంతో నర్సరీ ప్రాంగణంలోనే వంశీలో ఉన్న ప్రతిభకు సాన పట్టాడు. ఎంతటి బరువులైనా అవలీలగా ఎత్తేస్తుండటంతో తక్కువ సమయంలోనే ఇబ్రహీంపట్నం నర్సరీ నుంచి భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ మీదుగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోని పవర్ లిప్టింగ్ హాల్‌కు వంశీ అడ్రస్ మారింది హైదరాబాద్‌లో పార్ట్‌టైం జాబ్ చేస్తూనే ఎల్బీ స్టేడియంలో వంశీ కోచింగ్ తీసుకునేవాడు. అక్కడ పవర్ లిఫ్టింగ్‌లో ఇండియా తరఫున ఏషియా లెవల్ వరకు ఆడిన సాయిరాం వంశీ ఎదుగుదలకు అండగా నిలిచాడు.గోవాలో 2021లో జరిగిన పోటీల్లో మొదటిసారి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాడు వంశీ. ఆ తర్వాత 2022లో కేరళ, హైదరాబాద్‌లో 2023లో ఇండోర్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పతకాలు గెలుచుకున్నాడు. ఈ ఏడాది రాజస్థాన్, పటియాల (పంజాబ్)లో జరిగిన పోటీల్లోనూ వంశీ పతకాలు గెల్చుకున్నాడు. దీంతో యూరప్‌లోని మాల్టా దేశంలో జరిగే అంతర్జాతీయ స్థాయి పోటీలకు వంశీని ఎంపిక చేస్తూ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 2024 జూన్ లో నిర్ణయం తీసుకుంది."ఆగస్టు 28 రాత్రి (భారత కాలమానం ప్రకారం) 66 కేజీల జూనియర్ విభాగంలో జరిగిన పోటీలో స్క్వాట్ 280 కేజీలు, బెంచ్‌ప్రెస్ 140 కేజీలు, డెడ్‌లిఫ్ట్ 242.50 కేజీలు మొత్తం 662.5 కేజీలు ఎత్తడంతో వంశీకి ప్రథమ స్థానం స్థానం దక్కింది."తొలిసారిగా విదేశాల్లో జరిగే అంతర్జాతీయ పోటీలో పాల్గొనే అవకాశం దక్కిందనే ఆనందం కొద్ది సేపట్లోనే ఆవిరైంది. పాస్‌పోర్టు, వీసా, ప్రయాణం తదితర ఖర్చులకు రూ. 2.10 లక్షల అవసరం పడింది. హైదరాబాద్‌లో స్పాన్సర్లు దొరకడం కష్టం కావడంతో తన వెయిట్ లిఫ్టింగ్ ప్రస్థానం మొదలైన భద్రాచలంలోని సిటీ స్టైల్ జిమ్‌లో కోచింగ్ ఇచ్చిన రామిరెడ్డిని సంప్రదించాడు. క్రౌడ్ ఫండింగ్ కోసం లోకల్ గ్రూప్‌లలో రూ.100 వంతున సాయం చేయండి అంటూ మెసేజ్‌లు పెట్టాడు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో పాటు పట్టణానికి చెందిన వైద్యులు సోమయ్య, శ్రీకర్, కృష్ణప్రసాద్, రోశయ్య, స్పందనలు తమ వంతు సాయం అందించారు.యూరప్ వెళ్లేందుకు వీసా కోసం కాన్సులేట్‌లో జరిగిన ఇంటర్వ్యూలో వంశీకి ఊహించని ఇబ్బంది ఎదురైంది. ‘యూరప్ ఎందుకు వెళ్లాలి అనుకుంటున్నావ్?’ అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఇంగ్లీష్‌లో ప్రశ్నిస్తే ‘ఇక్కడ ఏం జాబ్ చేస్తున్నావు?’ అని అడిగినట్లు భావించి ‘పార్ట్‌టైం జాబ్’ అని బదులు ఇచ్చాడు వంశీ. వీసా క్యాన్సల్ అయ్యింది. దీంతో క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చిన రూ.20వేలు వృథా కాగా మళ్లీ స్లాట్ బుకింగ్‌కు రూ.15 వేల వరకు అవసరం పడ్డాయి. ఈసారి ఆర్థిక సాయం అందించేందుకు భద్రాచలం ఐటీడీఏ – పీవో రాహుల్ ముందుకు వచ్చాడు.ఇంగ్లీష్ గండం దాటేందుకు స్నేహితులు, కోచ్‌ల ద్వారా ప్రశ్నా – జవాబులు రాయించుకుని వాటిని ్రపాక్టీస్ చేశాడు. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఫోన్ చేసి నేర్చుకున్న దాన్ని వల్లెవేయడం, అద్దం ముందు మాట్లాడటం చేస్తూ చివరకు వీసా గండం గట్టెక్కాడు. ఈ పోటీలో పాల్గొనే బృందం ముందుగానే మాల్టా వెళ్లిపోయింది. దీంతో ఆగస్టు 25న హైదరాబాద్ నుంచి ముంబైకి వంశీ ఒక్కడే బస్సులో వెళ్లాడు. అక్కడి నుంచి జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ మీదుగా మాల్టా వరకు ఎయిర్‌బస్‌లో చేరుకున్నాడు.ఆగస్టు 28 రాత్రి (భారత కాలమానం ప్రకారం) 66 కేజీల జూనియర్ విభాగంలో జరిగిన పోటీలో స్క్వాట్æ 280 కేజీలు, బెంచ్‌ప్రెస్ 140 కేజీలు, డెడ్‌లిఫ్ట్ 242.50 కేజీలు మొత్తం 662.5 కేజీలు ఎత్తడంతో వంశీకి ప్రథమ స్థానం దక్కింది. ఈ విజయం అందించిన ఉత్సాహంతో వచ్చే అక్టోబరులో జరిగే కామన్ వెల్త్ గేమ్స్‌లో సత్తా చాటేందుకు వంశీ సిద్ధం అవుతున్నాడు. – తాండ్ర కృష్ణ గోవింద్, సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం. -
Rakshitha: కాళ్లే కళ్లయ్యి..
కళ్లు మూసుకొని నాలుగడుగులు వేయలేము. కళ్లు కనపడకుండా పరిగెత్తగలమా? ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు పారిస్‌లో పారా ఒలింపిక్స్ జరగనున్నాయి. ఒలింపిక్స్‌లో మన క్రీడాకారులు తేలేని బంగారు పతకం మన దివ్యాంగ క్రీడాకారులు తెస్తారని ఆశ. కర్ణాటకకు చెందిన అంధ అథ్లెట్ రక్షిత రాజు 1500 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనబోతున్న తొలి భారతీయ పారా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించనుంది. పతకం తెస్తే అది మరో చరిత్ర. రక్షిత రాజు పరిచయం.అక్టోబర్ 26, 2023.రక్షిత రాజుకు ఆనందబాష్పాలు చిప్పిల్లుతున్నాయి. కన్నీరు కూడా ఉబుకుతోంది. ఆమె హాంగ్జావు (చైనా) పారా ఆసియా గేమ్స్‌లో 1500 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించింది. చాలా పెద్ద విజయం ఇది. ఈ విషయాన్ని ఆమె తన అమ్మమ్మతో పంచుకోవాలనుకుంటోంది. కాని పంచుకోలేక΄ోతోంది. కారణం? అమ్మమ్మకు వినపడదు. చెవుడు. మాట్లాడలేదు. మూగ. కాని ఆ అమ్మమ్మే రక్షితను పెంచి పెద్ద చేసింది. ఆమె వెనుక కొండలా నిలుచుంది. ఆ ఘట్టం బహుశా ఏ సినిమా కథకూ తక్కువ కాదు. నిజజీవితాలు కల్పన కంటే కూడా చాలా అనూహ్యంగా ఉంటాయి.ఊరు వదిలేసింది..కర్నాటకలోని చిక్‌బళ్లాపూర్‌లోని చిన్న పల్లెకు చెందిన రక్షిత రాజు పుట్టుకతోనే అంధురాలు. ఆమెకు నాలుగు సంవత్సరాలు ఉండగా తల్లిదండ్రులు మరణించారు. దాంతో ఊరంతా రక్షితను, ఆమె చిన్నారి తమ్ముణ్ణి నిరాకరించారు. చూసేవాళ్లు ఎవరూ లేరు. అప్పుడు రక్షిత అమ్మమ్మ వచ్చి పిల్లలను దగ్గరకు తీసుకుంది. ఆమె స్వయంగా చెవుడు, మూగ లోపాలతో బాధ పడుతున్నా మనవళ్ల కోసం గట్టిగా నిలుచుంది. మనవరాలిని చిక్‌బళ్లాపూర్‌లో అంధుల కోసం నిర్వహిస్తున్న ఆశాకిరణ్ స్కూల్లో చదివించింది. అక్కడి హాస్టల్లో ఉంటూ అప్పుడప్పుడు అమ్మమ్మ వచ్చి పలుకరిస్తే ధైర్యం తెచ్చుకునేది. అంధత్వం వల్ల భవిష్యత్తు ఏమీ అర్థం అయ్యేది కాదు. దిగులుగా ఉండేది.వెలుతురు తెచ్చిన పరుగు..ఆశా కిరణ్ స్కూల్లో మంజన్న అనే పీఈటీ సారు రక్షిత బాగా పరిగెత్తగలదని గమనించి ఆమెను ఆటల్లో పెట్టాడు. స్కూల్లో ఉన్న ట్రాక్ మీద పరిగెట్టడం ్రపాక్టీసు చేయించాడు. జైపూర్‌లో పారా గేమ్స్ జరిగితే తీసుకెళ్లి వాటిలో పాల్గొనేలా చేశాడు. అక్కడే రాహుల్ అనే కర్ణాటక అథ్లెట్ దృష్టి రక్షిత మీద పడింది. ఈమెను నేను ట్రెయిన్ చేస్తాను అని చెప్పి ఆమె బాధ్యత తీసుకున్నాడు. అప్పటివరకూ సింథెటిక్ ట్రాక్ అంటేనే ఏమిటో రక్షితకు తెలియదు. రాహుల్ మెల్లమెల్లగా ఆమెకు తర్ఫీదు ఇచ్చి అంతర్జాతీయ స్థాయి పారా అథ్లెట్‌గా తీర్చిదిద్దాడు.గైడ్ రన్నర్ సాయంతో..అంధ అథ్లెట్లు ట్రాక్ మీద మరో రన్నర్ చేతిని తమ చేతితో ముడేసుకుని పరిగెడతారు. ఇలా తోడు పరిగెత్తేవారిని ‘గైడ్ రన్నర్‘అంటారు. అంతర్జాతీయ ΄ోటీల్లో రాహులే స్వయంగా ఆమెకు గైడ్ రన్నర్‌గా వ్యవహరిస్తున్నాడు. హాంగ్జావులో 1500 మీటర్లను రక్షిత 5 నిమిషాల 21 సెకన్లలో ముగించింది. ‘చైనా, కిర్గిజ్స్తాన్ నుంచి గట్టి ΄ోటీదారులు వచ్చినా నేను గెలిచాను. పారిస్ లో జరిగే పారా ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించగలననే ఆత్మవిశ్వాసం కలిగింది’ అంటుంది రక్షిత.అదే సవాలు..అంధులు పరిగెత్తడం పెద్ద సవాలు. వారు గైడ్ రన్నర్ సాయంతోనే పరిగెత్తాలి. ‘మాతోపాటు ఎవరైనా పరిగెత్తొచ్చు అనుకుంటారు. కాని గైడ్ రన్నర్లకు, మాకు సమన్వయం ఉండాలి. మమ్మల్ని పరిగెత్తిస్తూ వారూ పరిగెత్తాలి. ఎంతోమంది ప్రతిభావంతులైన అంధ రన్నర్లు ఉన్నా గైడ్ రన్నర్లు దొరకడం చాలా కష్టంగా ఉంటోంది. ఒకప్పుడు నా కళ్ల ఎదుట అంతా చీకటే ఉండేది. ఇప్పుడు పరుగు నాకు ఒక వెలుతురునిచ్చింది. పారిస్‌లో స్వర్ణం సాధించి తిరిగి వస్తాను’ అంటోంది రక్షిత. -
Anisha Dixit: సీరియస్ కంటెంట్‌ని.. కామెడీ ట్రాక్‌లో నడిపించడమే ఆమె స్పెషాలిటీ!
యాక్ట్రెస్, మోడల్, కమెడియన్, యూట్యూబర్. ‘రిక్షావాలీ’గా పాపులర్. అదే ఆమె యూట్యూబ్ చానెల్. గర్ల్ సెంట్రిక్ కామెడీకి ఫేమస్. జర్మనీలో పుట్టిపెరిగింది. భారతీయ మహిళల దినచర్య, వాళ్ల ఇబ్బందులు, సమస్యల మీద వీడియోలు చేస్తుంది. సీరియస్ కంటెంట్‌ని కామెడీ ట్రాక్‌లో నడిపించడమే ఆమె స్పెషాలిటీ. ఒక్కమాటలో చెప్పాలంటే ‘రిక్షావాలీ’ అమ్మాయిలను సాధికారత దిశగా ఇన్స్పైర్ చేసే చానెల్! లక్ష్యల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. అనీశా టెడ్ఎక్స్ స్పీకర్ కూడా! -
Aishwarya Sushmita: వనితా విశేషణం..
యాక్ట్రెస్, సింగర్, మోడల్, బెల్లీ డాన్సర్, నేషనల్ లెవెల్ బాడ్మింటన్ ప్లేయర్.. ఈ విశేషణాలన్నింటి కలబోత ఐశ్వర్యా సుష్మితా! ‘బ్యాడ్ కాప్’ సిరీస్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఐశ్వర్యా సుష్మితా పుట్టింది బిహార్‌లోని దర్భంగాలో. పెరిగింది ఢిల్లీలో. నాన్న.. నారాయణ్ వర్మ, ఎస్బీఐ ఉద్యోగి. అమ్మ.. నీతా వర్మ, గృహిణి. ఐశ్వర్యా.. ఫిలాసఫీలో పోస్ట్‌గ్రాడ్యుయేట్.ఐశ్వర్యా ఆసక్తిని గమనించి, తల్లిదండ్రులూ ఆమెను మోడలింగ్ వైపే ప్రోత్సహించారు. దాంతో ఢిల్లీ బేస్డ్ మోడలింగ్ ఏజెన్సీలో జాయిన్ అయింది ఐశ్వర్యా. అక్కడే ప్రింట్ అడ్వర్టయిజ్మెంట్స్కి మోడల్‌గా పనిచేసింది.స్కూల్ డేస్‌లో ఆమె లక్ష్యం ఐఏఎస్ కావాలని. అందుకే కాలేజీకొచ్చాక ఫిలాసఫీ సబ్జెక్ట్‌ని ఎంచుకుంది. ఆమెకు స్పోర్ట్స్ అంటే కూడా చాలా ఇష్టం. బాడ్మింటన్ ప్లేయర్‌గా జాతీయ స్థాయిలో రాణించింది. అంతేకాదు అందాల పోటీల్లోనూ పాల్గొని, 2016, ఎన్డీటీవీ గుడ్ టైమ్ కింగ్‌ఫిషర్ సూపర్మోడల్స్కీ ఎంపికైంది. ఇవన్నీ ఆమె లక్ష్యాన్ని మార్చాయి.ఆ టైమ్‌లోనే ముంబై మోడలింగ్ ఏజెన్సీల నుంచీ ఆఫర్స్ రావడం మొదలుపెట్టాయి. ముంబై వెళ్లింది. మనీశ్ మల్హోత్రా, అనితా డోంగ్రే, రేణు టాండన్, మానవ్ గంగ్వానీ, రాహుల్ ఖన్నా వంటి సూపర్ డిజైనర్స్‌కి మోడల్‌గా పని చేసింది. టీవీ కమర్షియల్స్‌లోనూ నటించింది. ఆ ఫేమే ఆమెకు ‘స్పెషల్ ఆప్స్ 1.5’ అనే వెబ్ సిరీస్‌లో అవకాశాన్నిచ్చింది.ఆ నటన ఆమెను తాజాగా ‘బ్యాడ్ కాప్’ వెబ్ సిరీస్‌లో ప్రాధాన్యమున్న పాత్రకు ప్రమోట్ చేసింది. ప్రస్తుతం ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది.ఐశ్వర్యాకు సంబంధించి ఇంకో విశేషం, విశేషణం ఏంటంటే ఆమెకు స్పోర్ట్స్ బైక్ రైడింగ్ అంటే ప్రాణం. ఏ కొంచెం వీలు దొరికినా బైక్ రైడింగ్ చేస్తుంది. ఆమె ఫిట్నెస్ ఫ్రీక్ కూడా! రోజూ యోగా చేస్తుంది."నా పేరు విని అందరూ ఆశ్చర్యపోతారు సంబంధం లేకుండా రెండు పేర్లేంటని! ఐశ్వర్యా రాయ్, సుస్మితా సేన్లు మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ క్రౌన్స్ గెలుచుకున్న ఏడాదే పుట్టాను. మా పేరెంట్స్‌కి వాళ్లిద్దరంటే విపరీతమైన అభిమానం. ఆ అభిమానం కొద్దే నాకు ఆ ఇద్దరి పేర్లను కలుపుతూ ఐశ్వర్యా సుష్మితా అని పెట్టారు. అదన్నమాట నా పేరు వెనుకున్న స్టోరీ!" – ఐశ్వర్యా సుష్మితా -
Aditya Subramanian: ఫిట్‌గా ఒక్కో మెట్టెక్కి...
మిస్టర్ ఇండియా విజయం నేను కోరుకుంటున్న కెరీర్‌కు తొలి అడుగు మాత్రమే. నా ఈ విజయం మనదేశంలో మోడలింగ్, ఎంటర్టైన్మెంట్ రంగంలోకి రావాలనుకునే యువతకు స్ఫూర్తినిస్తుందని నమ్ముతున్నాను. అంకితభావంతో హార్డ్‌వర్క్ చేసినప్పుడే విజయం సొంతమవుతుంది. అదే మనల్ని మన లక్ష్యాల దరి చేరుస్తుంది. – ఆదిత్య సుబ్రమణియన్, మిస్టర్ ఇండియా విజేతఆదిత్య సుబ్రమణియన్... ఆరడుగుల ఎత్తున్న 27 ఏళ్ల కుర్రాడు. చెన్నైలోని పల్లవరానికి చెందిన ఈ యువకుడు ఎస్ఆర్ఎమ్ కాలేజ్ ఇంజినీరింగ్ స్టూడెంట్. చదువు పూర్తి చేసి కార్పొరేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడితో సంతృప్తి చెందలేదతడు. సమున్నత లక్ష్యాలను నిర్దేశించుకున్నాడు. కెరీర్ దృష్టిని విస్తృతం చేసుకున్నాడు. తనకిష్టమైన ఫ్యాషన్, ఫిల్మ్ ఇండస్ట్రీ, మోడలింగ్‌లో అదృష్టాన్ని, అవకాశాలనూ పరీక్షించుకోవాలనుకున్నాడు. అందుకోసం ముందుగా ఏదైనా ఒక వేదిక మీద విజేతగా నిలవడం తొలి మెట్టు అనుకున్నాడు. ఏకకాలంలో పలువురి దృష్టిని ఆకర్షించడానికి మిస్టర్ ఇండియా పోటీలను ఎంచుకున్నాడు, విజేతగా నిలిచాడు. కలసాధనకు కాలపరీక్ష!సాహిత్యాభిలాషి అయిన ఆదిత్య తాను కలలు కన్న లక్ష్యాన్ని చేరడానికి ఆరేళ్లుగా కఠోరంగా శ్రమించాడు. పుస్తకాలు చదువుతూ, సినిమాలు చూస్తూ తనను తాను మలుచుకుంటూ దేహాకృతి కోసం క్రమం తప్పకుండా జిమ్‌లో ఎక్సర్సైజ్లు చేశాడు. మిస్టర్ మదరాసీ, ఐరిస్ గ్లామ్ మిస్టర్ సూపరామ్ప్, ఎస్టిలో మిస్టర్ సదరన్ క్రౌన్ టైటిల్స్ గెలుచుకున్నాడు. మోడలింగ్‌లో నిరూపించుకున్నాడు. ఇదంతా చెప్పుకున్నంత సులువుగా జరగలేదు.ఒక్కో విజయాన్ని అందుకుంటూ తాను ఎంచుకున్న శిఖరం వైపు ప్రయాణం సాగిస్తున్న సమయంలో కాలం పెద్ద పరీక్ష పెట్టింది. మిస్టర్ ఇండియా పోటీల కోసం జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్నప్పుడు వెన్నెముకకు గాయమైంది. ప్రాక్టీస్ మానేయాల్సి వచ్చింది. గాయం మానే వరకు విశ్రాంతి తప్పదు. ఈ లోపు బాడీ షేపవుట్ కాకుండా, బరువు పెరగకుండా చూసుకోవడం కూడా పెద్ద చాలెంజ్ అనే చె΄్పాలి. తేలికపాటి వ్యాయామాలు చేస్తూ ఫిట్‌నెస్‌ని కాపాడుకున్నాడు. ఆ సమయంలో మొదలైన అంతర్మథనం తనలో ప్రశాంతతను అలవరిచిందని, ఆత్మస్థయిర్యాన్ని పెంచి వ్యక్తిగా పరిణతి చెందడానికి దోహదం చేసిందని చె΄్పాడు ఆదిత్య. వెండితెర మీద వెలగాలి..ఆదిత్య గెలిచిన మిస్టర్ ఇండియా కిరీటం పేరు ‘రుబారు మిస్టర్ ఇండియా 2024 కాబల్లెరో యూనివర్సల్’. ఈ టైటిల్ విజేతలు వెనిజులాలో అంతర్జాతీయ స్థాయిలో జరిగే కాబల్లెరో యూనివర్సల్ పోటీల్లో ప్రపంచదేశాలతో పోటీ పడతారు. ఆ పోటీల్లో మనదేశానికిప్రాతినిధ్యం వహించనున్నాడు ఆదిత్య. ఫ్యాషన్, ఫిల్మ్ ఇండస్ట్రీ, మోడలింగ్, యాక్టింగ్ పట్ల తన ఇష్టాన్ని తెలియచేస్తూ నటుడిగా స్థిరపడాలనేది తన అంతిమ లక్ష్యమని చె΄్పాడు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
Akanksha Kumari: తాను.. రొటీన్ ఐటీ కాదు.. మైనింగ్ మేటి!
‘ద్వారాలు మూసే ఉన్నాయి’ అని వెనక్కి తిరిగేవారు కొందరు. ఆ ద్వారాలను తెరిచి ముందుకు వెళ్లేవారు కొందరు. ఆకాంక్ష కుమారి రెండో కోవకు చెందిన మహిళ. తొలి భారతీయ మహిళా మైనింగ్ ఇంజినీర్‌గా చరిత్ర సృష్టించింది. ఉద్యోగంలో చేరిన రోజు ఎంత ఉత్సాహం, వృత్తి నిబద్ధతతో ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. ‘నో రిగ్రెట్స్.. ఫీల్ గ్రేట్’ అంటుంది. మైనింగ్ ఫీల్డ్‌లోకి రావాలనుకునే మహిళలకు ధైర్యాన్ని ఇస్తోంది.ఝార్ఖండ్‌లోని మైనింగ్ప్రాంతంలో పెరిగిన ఆకాంక్ష కుమారి బొగ్గు గనుల్లో ‘పై కప్పు కూలిపోవడం’ అనే మాటను ఎన్నోసార్లు విని ఉన్నది. మైనింగ్ ఇంజినీర్‌గా ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టిన తరువాత ‘పై కప్పు కూలిపోవడం’ అనే మాటను వినడం కాదు ప్రత్యక్షంగా చూసింది. ‘ఇది పురుషులు మాత్రమే చేసే కఠినమైన ఉద్యోగం అనుకునే వృత్తిని ఎంచుకోవడానికి కారణం ఏమిటి?’ అనే ప్రశ్నకు ఆమె స్పందన ఇది...‘బొగ్గు తవ్వకాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతంలో పుట్టి పెరిగాను. ఇక్కడి ప్రజలు ఏ మైనింగ్ కంపెనీలో పని చేయకపోయినా వాళ్లకు మైనింగ్ గురించి చాలా విషయాలు తెలుసు. స్కూల్ హాస్టల్లో నా స్నేహితులు పై కప్పు కూలిపోవడం గురించి మాట్లాడడం నేను ఎన్నోసార్లు విన్నాను. అదెలా? ఎందుకు?’ అనేది నాకు ఆశ్చర్యంగా అనిపించేది. మైనింగ్‌కు సంబంధించి రకరకాల విషయాలు వినడం వల్ల నాకు తెలియకుండానే ఆ రంగంలో ఉద్యోగం చేయాలనుకునే కలకు బీజం పడింది’ గతాన్ని గుర్తు చేసుకుంది ఆకాంక్ష.‘పదవ తరగతి పూర్తయిన తరువాత ఏం చేయాలి?’ అనుకున్నప్పుడు ఆటల గురించి ఆలోచించింది. తాను జాతీయస్థాయి అథ్లెట్లిక్స్‌లో కూడా పాల్గొంది. ఆటలపై దృష్టి పెట్టాలా, చదువు కొనసాగించాలా అనే దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు తాను ఉన్న పరిస్థితిల్లో ఉద్యోగం అనివార్యం కావడంతో చదువుకే ్రపాధాన్యత ఇచ్చింది. ఇంటర్మీడియెట్ పూర్తి అయిన తరువాత ‘ఐటీ రంగంలో ఉద్యోగంపై దృష్టి పెట్టు’ అని కొందరు తనకు సలహా ఇచ్చారు. అయితే ‘ఐటీ’ అనేది ఆకాంక్షకు ఆసక్తికరమైన సబ్జెక్ట్ కాదు. ఆ సమయం లోనే తన మనసులో దాగిన కల బయటికి వచ్చింది. ‘కోల్ మైనింగ్ ఫీల్డ్‌లో ఉద్యోగం చేయాలి’ అని నిర్ణయించుకుంది. ఉపాధ్యాయుడైన తండ్రి, అంగన్వాడీ వర్కర్ అయిన తల్లిని ఒప్పించడం కష్టం కాలేదు.‘మా అమ్మాయి మైనింగ్ జాబ్ చేయాలనుకుంటుంది’ అని ఆకాంక్ష తండ్రి మైనింగ్ కంపెనీలో పనిచేసే తన స్నేహితుడిని సలహా అడిగితే...‘చాలా కష్టం. మధ్యతరగతికి చెందిన ఆడపిల్లలు ఈ రంగంలో పనిచేయలేరు. ఆ పనిభారం తట్టుకోవడం ఆడపిల్లలకు చాలా కష్టం’ అన్నాడు. స్నేహితుడు చెప్పిన విషయాలను కూతురితో పంచుకున్నాడు. అయినా సరే, ఆకాంక్ష వెనక్కి తగ్గలేదు. ఇంజినీరింగ్ కోర్స్ అడ్మిషన్ సమయంలో కౌన్సెలర్ ఆమెకు మైనింగ్ ఇంజినీరింగ్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. వాదోపవాదాల తరువాత ఆకాంక్ష కల నెరవేరింది. ఝార్ఖండ్, ధన్‌బాద్‌లోని బిర్సా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సింద్రీలో బీటెక్ పాసైంది. వొకేషనల్ ట్రైనింగ్‌లో భాగంగా అండర్‌గ్రౌండ్ మైన్‌లో కూడా శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి.‘ఇక్కడికి నిన్ను ఎవరు పంపించారు? ఎలా పంపిస్తారు? ఇక్కడ మహిళలకు సౌకర్యాలు, సదుపాయాలు లేవన్న విషయం మీ డిపార్ట్మెంట్ హెడ్‌కు తెలియదా?’ అని విసుక్కున్నాడు జనరల్ మేనేజర్. ఆ తరువాత మాత్రం గెస్ట్‌హౌజ్‌లో ఒక రూమ్ కేటాయించారు. అమ్మ, మేనత్తలతో కలిసి ఆ గదిలో ఉండేది ఆకాంక్ష. చదువు పూర్తయిన తరువాత హిందుస్థాన్ జింక్‌లో ఆకాంక్షకు ఉద్యోగం వచ్చింది. మూడు సంవత్సరాలు గనులలో పనిచేసింది. ఆ తరువాత సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్‌కు చెందిన బొగ్గు గనుల్లో పనిచేసింది. కనీస సౌకర్యాలు లేకపోయినప్పటికీ భూగర్భ గనుల్లో గరిష్ఠంగా ఆరు గంటలు పనిచేసింది.2021లో కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్)లో ఆకాంక్ష చేరిన తరువాత ఇప్పటి వరకు మరో ముగ్గురు మహిళలు మాత్రమే పబ్లిక్ విభాగంలో చేరారు. అయినా సరే ఆకాంక్ష కుమారిలో ఆశాభావం తొలగిపోలేదు. మైనింగ్ ఫీల్డ్‌లో రావాలనుకుంటున్నవారికి సలహాలు ఇవ్వడం, దారి చూపడం మానడం లేదు. ‘సౌకర్యాలు లేకపోవచ్చు. శ్రమతో కూడిన ఉద్యోగం కావచ్చు. అయినా సరే చేస్తాను అనే పట్టుదల మీలో ఉంటే మైనింగ్ ఫీల్డ్‌లోకి తప్పకుండా రావచ్చు’ అంటుంది ఆకాంక్ష కుమారి. తొలి అడుగు వేసి మాత్రమే ఊరుకోలేదు. మరిన్ని అడుగుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూనే తన వంతు ప్రయత్నం చేస్తోంది ఆకాంక్ష.ఇవి చదవండి: ఈ ప్రాణం ఖరీదెంత? -
Paetongtarn Shinawatra: నా నవ్వులు పిల్లలవి!
బిలియనీర్ కూతురు అయిన పేటోంగ్ టార్న్ పదిహేడేళ్ల వయసులోనే పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. 37 ఏళ్ల వయసులోనే థాయ్‌లాండ్ నూతన ప్రధానిగా ఎంపికై చరిత్ర సృష్టించింది. తన ఇద్దరు పిల్లల నవ్వుల్లోంచి బలం తెచ్చుకొని రాజకీయ జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ విజయపథంలో పయనిస్తోంది...థాయ్‌లాండ్ మాజీ ప్రధాని తక్సిన్ షినవత్ర చిన్న కుమార్తె పేటోంగ్ టార్న్. తక్సిన్ మీద అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన దేశం విడిచి విదేశాల్లో ఆశ్రయం పొందుతున్నాడు. దాంతో తండ్రి స్థాపించిన ‘ప్యూ థాయ్’ పార్టీకి పేటోంగ్ టార్న్ పెద్ద దిక్కుగా మారింది. బ్యాంకాక్‌లో పుట్టి పెరిగింది పేటోంగ్ టార్న్. పొలిటికల్ సైన్స్, ఆంత్రోపాలజీ, సోషియాలజీలో పట్టా పుచ్చుకున్న పేటోంగ్ టార్న్ ఇంగ్లాండ్‌లో ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేసింది. చదువులో రాణించిన పేటోంగ్ టార్న్ ఆ తరువాత వ్యాపారరంగంలో అడుగుపెట్టింది. 21 కంపెనీలతో తిరుగులేని ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకుంది.‘నేను ఎనిమిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నాన్న రాజకీయాల్లోకి వచ్చారు’ అని చెబుతుంటుంది పేటోంగ్ టార్న్. పార్టీ నిర్వహణ, ఆ తరువాత ప్రధాన మంత్రిగా పనిచేసిన తండ్రి తక్సిన్ షినవత్రకు పిల్లలతో మాట్లాడే సమయం అతి తక్కువగా ఉండేది.‘నాకు నాన్న అంటే చాలా ఇష్టం. అయితే నాకంటూ సొంత వ్యక్తిత్వం ఉంది’ అంటున్న పేటోంగ్ టార్న్కు రాజకీయాల్లో చురుగ్గా ఉండడానికి కుటుంబ బలం అనేది ఎంత ముఖ్యమో తెలియనిది కాదు. రాజకీయ ప్రపంచం నుంచి ఇంటికి వచ్చిన తరువాత ఇద్దరు పిల్లలే తన ప్రపంచం. పేటోంగ్ టార్న్ ముద్దు పేరు ఉంగ్–ఇంగ్. గ్రామీణ ప్రజలు పేటోంగ్ టార్న్ను ప్రేమగా ఉంగ్–ఇంగ్ అని పిలుచుకునేవారు. కమర్షియల్ పైలట్ పిటాక సూక్సావత్ను పేటోంగ్ వివాహం చేసుకుంది. వీరిది అన్యోన్య దాంపత్యంగా చెబుతుంటారు. భార్యకు ఉన్న సహనాన్ని, నిర్ణయాలు తీసుకోవడంలో ప్రదర్శించే తెలివితేటలను పిటాక ప్రశంసిస్తుంటాడు.‘రాజకీయ నాయకురాలిగా మీకు ఎన్నో చికాకులు ఉంటాయి. అయినా సరే, ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తారు!’ అని అడిగితే ఆమె సమాధానం నవ్వు. ‘ఈ బలం నాకు నా పిల్లలు ఇచ్చారు’ అంటుంది ఆ నవ్వు మరింత పెంచుతూ!‘సోషల్లీ–లిబరల్ క్యాపిటలిస్ట్’గా తనను తాను అభివర్ణించుకునే పేటోంగ్ ముందు రాజ్యాంగాన్ని పునర్లిఖించడంతో సహా ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన కుటుంబ బలం ఉండనే ఉంది. -
Lakshmi Lehr: అదీ స్టయిల్ అంటే! సింపుల్ అండ్ కంఫర్టబుల్ అన్నమాట!
అందుబాటులో ఉన్న వనరులతోనే అద్భుతాలను క్రియేట్ చేసేవాళ్లను నేర్పరులు అంటారు. ఆ కేటగరీలో లక్ష్మీ లెహర్‌ను చేర్చొచ్చు. పర్ఫెక్షన్ కోసం ప్రపంచంలో ఉన్న ద బెస్ట్‌ని ఆర్డర్ చేయదు. కళ్ల ముందున్న వాటితోనే ప్రపంచానికి ద బెస్ట్‌ని చూపిస్తుంది. అందుకే ఆమె సెలబ్రిటీ స్టయిలిస్ట్ అయింది.లక్ష్మీ ముంబై నివాసి. ఫ్యాషన్ డిజైనింగ్ గ్రాడ్యుయేషన్ తర్వాత పలు ఫ్యాషన్ పత్రికల్లో పనిచేసింది. ప్రాక్టికల్ ఎక్స్‌పీరియెన్స్ కోసం ప్రముఖ సెలబ్రిటీ స్టయిలిస్ట్ అనాయితా శ్రాఫ్ స్టయిలింగ్ కంపెనీ ‘స్టయిల్ సెల్’లో చేరింది. ఆమె సృజనకు, పనితీరుకు అనాయితా ఇంప్రెస్ అయింది. ఆమె స్థాయి స్టార్ స్టయిలింగ్ అని గ్రహించింది. లక్ష్మీని సెలబ్రిటీ సర్కిల్‌కి పరిచయం చేసింది. ముందుగా.. కరీనా కపూర్ ఎయిర్ పోర్ట్ అపియరెన్స్కి స్టయిలింగ్ చేసింది లక్ష్మీ. ఆ కూల్ లుక్స్‌కి.. కరీనాను క్యాప్చర్ చేయడానికి ఫాలో అయిన పాపరాట్సీ ఫిదా అయిపోయారు.కరీనా ఫ్యాన్స్ అయితే క్రేజీ.. చెప్పక్కర్లేదు. ఆ స్టయిల్ని కరీనా కూడా కంఫర్ట్‌గా ఫీలై.. స్పెషల్ అకేషన్స్‌కి ఆమెను స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకుంది. లక్ష్మీ స్టయిలింగ్‌ని కియారా ఆడ్వాణీ, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, జాన్వీ కపూర్, ఆలియా భట్, సారా అలీ ఖాన్, అనన్యా పాండే, శ్రద్ధా కపూర్, రశ్మికా మందన్నా, సమంత, పూజా హెగ్డేలూ కోరుకున్నారు.ఆ సెలబ్రిటీల క్యాజువల్ లుక్ నుంచి రెడ్ కార్పెట్ వాక్స్, కార్పొరేట్ ఈవెంట్స్, ఎండార్స్మెంట్స్, సినిమా ప్రమోషన్స్, ఫంక్షన్స్, పెళ్లిళ్లు.. అంతెందుకు వాళ్లు గడపదాటాలంటే చాలు లక్ష్మీ వాళ్లను స్టయిలింగ్ చేయాల్సిందే! అంత డిమాండ్‌లో ఉంది ఆమె. సెలబ్రిటీ ఒంటి తీరు, బాడీ లాంగ్వేజ్‌ని బట్టి స్టయిలింగ్ చేస్తుంది లక్ష్మీ. సింపుల్ చేంజెస్తోనే వైబ్రెంట్‌గా కనిపించేలా వాళ్లను మారుస్తుంది. ఫిమేల్ సెలబ్రిటీలే కాదు మేల్ సెలబ్రిటీలూ ఆమెకు ఫ్యాన్సే! వాళ్లలో రితిక్ రోషన్ ముందుంటాడు. తర్వాత సైఫ్ అలీ ఖాన్. ఆ ఇద్దరికీ లక్ష్మీ స్టయిలింగ్ చేస్తోంది.స్టయిల్ అంటే సెల్ఫ్ ఎక్స్ప్రెషన్! స్టయిలింగ్ కోసం ప్రపంచ బ్రాండ్స్ అన్నిటినీ వార్డ్‌రోబ్‌లో నింపక్కర్లేదు. ఉన్న రెండు జతలతో కూడా స్టయిల్ క్రియేట్ చేసుకోవచ్చు. అయితే మనకు ఏది నప్పుతుంది.. ఏది సౌకర్యంగా ఉంటుందనే స్పృహ ఉండాలి. అంతేకాదు మనమున్న చోటునూ దృష్టిలో పెట్టుకోవాలి. నలుగురిలో కలసిపోయినట్టు ఉంటూనే మన ప్రత్యేకతతో మెరిసిపోవాలి. అదీ స్టయిల్ అంటే! సింపుల్ అండ్ కంఫర్టబుల్ అన్నమాట. నేను స్టయిలింగ్ చేసిన సెలబ్రిటీల్లో నాకు.. కరీనా, జాక్వెలిన్, సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్లు అంటే చాలా ఇష్టం! – లక్ష్మీ లెహర్ఇవి చదవండి: ధైర్యసాహసాలు అనగానే మరో ఆలోచనే.. చమేలీ.. ఓ ధీశాలి! -
Deeksha Juneja: గ్లామర్ ఫీల్డ్ తనకు వర్కవుట్ అవుతుందో కాదో అనుకుంటూనే
దీక్షా జునేజా.. సిననిమ్ ఆఫ్ టాలెంట్. అరుదైన ఆర్టిస్ట్! ఆమె స్వస్థలం.. చండీగఢ్. సెటిల్డ్ ప్లేస్.. ముంబై. మిగిలిన వివరాలు..దీక్ష తల్లిదండ్రులు శశి జునేజా, అశోక్ జునేజాకు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు. ఆర్టిస్ట్ అవ్వాలని దీక్షా అనుకోలేదు. మాస్ కమ్యూనికేషన్స్‌లో పీజీ చేసింది. చదువైపోగానే చండీగఢ్‌లోని 94.3 మై ఎఫ్ఎమ్లో ఇంటర్న్‌గా చేరింది. తర్వాత ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్ ఉద్యోగంలోకి మారింది.రేడియో కొలువులో ఉన్నప్పుడు కంటెంట్ రైటర్‌గానూ పనిచేసింది. ఆ టైమ్‌లోనే ఆమెను ముంబై పిలిచింది మోడలింగ్‌లో చాన్స్ ఉంది రమ్మంటూ! గ్లామర్ ఫీల్డ్ తనకు వర్కవుట్ అవుతుందో కాదో అనుకుంటూనే ముంబై చేరింది.టీవీ కమర్షియల్స్‌తో మోడల్‌గా రాణిస్తున్నప్పుడే ‘ఘుమక్కడ్’ అనే మూవీలో అవకాశం వచ్చింది. తర్వాత చాలా చిత్రాల్లోనే కనిపించినా నటిగా ఆమెకు గుర్తింపు తెచ్చినవి మాత్రం ‘ద జోయా ఫ్యాక్టర్’, ‘రాజ్మా చావల్’ సినిమాలే.సిల్వర్ స్క్రీన్ మీది ఆమె పెర్ఫార్మెన్స్ వెబ్ స్క్రీన్ ఆపర్చునిటీస్నీ తెచ్చిపెట్టింది. అలా ‘గర్ల్‌ఫ్రెండ్ చోర్’, ‘గిల్టీ మైండ్స్’, ‘యునైటెడ్ కచ్చే’ వంటి వెబ్ సిరీస్‌లు చేసి ఓటీటీ వీక్షకులనూ తన వీరాభిమానులుగా మార్చేసుకుంది. ఆమె నటించిన ‘పిల్’ అనే వెబ్ సిరీస్ ప్రస్తుతం ‘జియో సినిమా’లో స్ట్రీమ్ అవుతోంది.దీక్షా మంచి కవయిత్రి కూడా. తన కవితలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. దీక్షా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్‌కి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు.పేరు, ప్రతిష్ఠల మీద నాకు మోహం లేదు. చేసే పనిపట్ల నిబద్ధత, గౌరవం ఉంది. పనే దైవం అనే మాటను నమ్ముతాను, ఫాలో అవుతాను! – దీక్షా జునేజా -
Siddhita Mohanty: లాక్డౌన్ టైమ్ అనేది.. నాకు గోల్డెన్ టైమ్! ఎందుకంటే?
పిల్లల లోకంలో కార్టూన్లు, కార్టూన్ల లోకంలో పిల్లలు ఉంటారు. ఎంతోమంది పిల్లలలాగే సిద్ధిత మొహంతికి కార్టూన్లు అంటే బోలెడు ఇష్టం. ఆ ఇష్టం వినోదానికే పరిమితమై΄ోలేదు. సాంకేతిక విషయాలపై ఆసక్తికి దారి తీసింది. ఆ దారి తనను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దగ్గరికి తీసుకువెళ్లింది. బెంగళూరుకు చెందిన పదిహేనేళ్ల సిద్ధిత పదమూడేళ్ల వయసులోనే స్టార్టప్ మొదలు పెట్టేలా చేసింది..పదమూడు సంవత్సరాల వయసులో ‘బ్లూమ్ రిద్దీ సిద్ధీ’ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టింది సిద్ధిత మొహంతి. గ్రాఫిక్ డిజైనింగ్, కంప్యూటర్ లిటరసీకి సంబంధించిన స్టార్టప్ ఇది. తల్లిదండ్రులు సిద్ధితకు లాప్టాప్ కొనివ్వడంతో అది తన ప్రయోగాలకు వేదిక అయింది. మొదట్లో యూట్యూబ్‌లో కార్టూన్ వీడియోలు మాత్రమే చూసేది. ఆ తరువాత ఆమె ఆసక్తి సాంకేతిక విషయాలపై మళ్లింది. డిజిటల్ డిజైన్ అనేది పాషన్‌గా మారింది. డిజిటల్ డిజైనింగ్ అనే కోర్సు ఉంటుందని తెలియని వయసులోనే సొంతంగా డిజైన్లు చేసి అందరూ ‘వావ్’ అనేలా చేసేది. బొమ్మలు గీయడంలోనూ సిద్ధితకు మంచి నైపుణ్యం ఉంది.బెంగళూరులోని సిద్ధిత చదివే ‘ఆర్చిడ్స్ ది ఇంటర్నేషనల్ స్కూల్’ బాగా ప్రోత్సహించింది. ‘లాక్డౌన్ టైమ్ అనేది నాకు గోల్డెన్ టైమ్’ అంటున్న సిద్ధిత ఆ ఖాళీ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకుంది. ‘నా గురించి నేను బాగా తెలుసుకోవడానికి, ఇంకా ఏం చేయవచ్చు అని ఆలోచించడానికి ఆ ఖాళీ సమయం నాకు ఉపయోగపడింది’ అంటుంది సిద్ధిత. తన స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవడానికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, లైఫ్ స్కిల్స్, వెబ్ డిజైన్, కోడింగ్, రొబోటిక్స్. పబ్లిక్ స్పీకింగ్, నేచురల్ లాంగ్వేజ్ప్రాసెసింగ్, స్పోకెన్ ఇంగ్లీష్....మొదలైన ఎన్నో కోర్సులు చేసింది. ఈ కోర్సులన్నీ పూర్తి చేసిన తరువాత ఏదైనా సాధించాలనే తపన సిద్ధితలో మొదలైంది.ఇప్పటి వరకు 50 యాప్స్, 1,000 త్రీడీ డిజైన్లు క్రియేట్ చేసింది. జాతీయ, అంతర్జాతీయ ఒలింపియాడ్స్‌లో పాల్గొంది. ఒక సమావేశంలో పాల్గొన్న సిద్ధితకు చిన్న వయసులోనే ఎంటర్ప్రెన్యూర్లుగా ప్రయాణంప్రారంభించిన ఎంతో మందితో మాట్లాడే అవకాశం వచ్చింది. వారి మాటల నుంచి స్ఫూర్తి ΄÷ంది తాను కూడా స్టార్టప్ మొదలు పెట్టింది. పదమూడేళ్ల వయసులో ‘గర్ల్ప్రాడిజీ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైంది. సాంకేతిక విషయాలలో ప్రతిభ చూపుతున్న సిద్ధితకు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం అంటే ఇష్టం. గ్రాఫిక్ డిజైనింగ్‌తో పాటు రచనలు చేయడం, కరాటే, క్రికెట్ అంటే సిద్ధితకు ఇష్టం. మెడిసిన్ చదవాలనేది ఆమె కల. ‘సూపర్ సిద్ధి’ పేరుతో పుస్తకం రాసే పనిలో ఉంది.ఎడోబ్ ఎక్స్‌ప్రెస్‌లో కొత్త ఫీచర్లు..ఎడోబ్ ఎక్స్‌ప్రెస్(ఎడ్యుకేషన్)లో జనరేట్ టెక్ట్స్ ఎఫెక్ట్, జనరేట్ ఇమేజ్, జనరేటివ్ ఫిల్లాంటి ఏఐ వపర్డ్ ఫీచర్లు ఉన్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులకు మరింత ఉపయోగపడే విధంగా ‘ఎడోబ్ ఎక్స్‌ప్రెస్’ను అప్డేట్ చేస్తున్నట్లు ప్రకటించింది ఎడోబ్. క్రియేటివిటికి ఉపయోగపడేలా ఈ ఏఐ ఫీచర్లను డిజైన్ చేశారు. వీటితో టెంప్లెట్లు, బ్రోచర్లు, ఫ్లైయర్స్, ఒరిజినల్ కలలింగ్ పేజీలు జననరేట్ చేయవచ్చు. విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని యానిమేషన్ ఫీచర్లు తీసుకురానుంది ఎడోబ్. -
Anita Dongre: ఇండియన్ ఫ్యాషన్‌కి ఆమె ఓ క్రియేటివ్ సిగ్నేచర్!
అనితా డోంగ్రే.. ఫ్యాషన్‌తో ఏ కాస్త పరిచయం ఉన్న వాళ్లకైనా బాగా తెలిసిన పేరు! ఇంకా చెప్పాలంటే ఇండియన్ ఫ్యాషన్‌కి ఆమె ఓ క్రియేటివ్ సిగ్నేచర్! మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ‘హౌస్ ఆఫ్ అనితా డోంగ్రే’కి రీచ్ అయిన ఆ త్రెడ్స్ అండ్ నాట్స్ జర్నీ గురించి..అనితా డోంగ్రే.. ముంబై వాసి. సంప్రదాయ సింధీ కుటుంబం ఆమెది. ఇంటి పనులకే జీవితాన్ని అంకితం చేసిన ఆడవాళ్లున్న నేపథ్యంలో పెరిగి.. ఉద్యోగినులుగా, బాసులుగా, పారిశ్రామిక వేత్తలుగా రాణిస్తున్న ఆడవాళ్ల మధ్యకు చేరింది. తనింట్లోని స్త్రీల్లా కాకుండా, తాను ఎరిగిన ప్రపంచంలోని మహిళల్లా ఉండాలని నిశ్చయించుకుంది. ఆ నిశ్చయానికి ప్రేరణ సాధికారిక స్త్రీలే అయినా స్ఫూర్తి మాత్రం అనితా వాళ్ల అమ్మ! తన అయిదుగురు సంతానానికి ఆవిడే బట్టలు కుట్టేది. అవి రెడీమేడ్ దుస్తులకు ఏమాత్రం తీసిపోయేవికావు. పిల్లలు వాటిని స్కూల్లో వేడుకలు, ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి వేసుకెళితే స్నేహితులు, బంధువులంతా ఏ షాప్‌లో కొన్నారంటూ కితాబులిచ్చేవారు. అలాంటి సందర్భాల్లోనే అమ్మ నైపుణ్యానికి మురిసిపోయేది అనితా. వర్కింగ్ విమెన్ని చూశాక.. అమ్మ పనితనాన్ని తనూ అందిపుచ్చుకుని వర్కింగ్ విమెన్‌కి అనువైన దుస్తులను డిజైన్ చేసి ఫ్యాషన్‌ను శాసించాలని కల కన్నది. తొలి అడుగుగా ముంబైలోని ఎస్ఎన్డీటీ (శ్రీమతి నతీబాయీ దామోదర్ ఠాకర్సే) మహిళా యునివర్సిటీలో ఫ్యాషన్ డిజైన్‌లో డిగ్రీ చేసింది.యూనివర్సిటీ నుంచి బయటకు రాగానే తండ్రి దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకుని, రెండు కుట్టుమిషన్లు కొని, సోదరితో కలసి చిన్న బొటిక్ పెట్టింది. కాలేజీ అమ్మాయిలు, ఉద్యోగినులను కోసం డ్రెసెస్ని డిజైన్ చేసి.. సేల్‌కి పెట్టింది. అనితా సృజనకు ఆమె బొటిక్ ఉన్న కాంప్లెక్స్‌లోని లేడీస్ డ్రెస్ వేర్ షాప్స్ అన్నీ వెలవెలపోసాగాయి. దాంతో ఆ మాల్లోని లేడీస్ ఎంపోరియం షాప్స్ వాళ్లంతా అనితా బొటిక్‌ని అక్కడి నుంచి ఎత్తేయించాలని పట్టుబట్టారు. మాల్ ఓనర్ వాళ్ల డిమాండ్‌కి తలొంచక తప్పలేదు.. అనితా వాళ్లు ఆ మాల్ నుంచి షిఫ్ట్ అవకతప్పలేదు.చేతిలో విద్య ఉంటే ఇక్కడ కాకపోతే ఇంకో చోట.. అనే ధీమాతో మరో చోటును వెదుక్కుంది. కొన్ని నెలలల్లోనే బొటిక్‌ని కాస్త ఏఎన్డీ డిజైన్స్ అనే ఫ్యాషన్ లేబుల్గా మార్చేసింది. ఇక మిషన్ వీల్ వెనక్కి తిరగలేదు. ఏఎన్డీ లేబుల్ కాస్త ‘హౌస్ ఆఫ్ అనితా డోంగ్రే’గా అవతరించింది. దేశీ, క్యాజువల్, బ్రైడల్, గ్లోబల్ .. దుస్తులకు పర్ఫెక్ట్ బ్రాండ్‌గా స్థిరపడింది. ఆ క్రియేటివ్ కంఫర్ట్‌కి సామాన్యులే కాదు సెలబ్రిటీలూ ముచ్చటపడ్డారు. అనితా డోంగ్రే డిజైన్డ్ దుస్తులతో ముస్తాబవ్వాలని క్యూ కట్టారు. ఆ వరుసలో మాధురి దీక్షిత్, మలైకా అరోరా, కాజోల్, కత్రినా కైఫ్, ప్రియంకా చోప్రా, మానుషీ చిల్లర్, కృతి సనన్, ఆలియా భట్, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకుర్, కాజల్ అగర్వాల్, దియా మిర్జా, శోభిత ధూళిపాళ, రాధికా ఆప్టే, సొనాలీ బెంద్రే, మీరా కపూర్, పూజా హెగ్డే, కరిష్మా కపూర్, రష్మికా మందన్నా, అర్జున్ కపూర్, అయుష్మాన్ ఖురానా, విజయ్ దేవరకొండ లాంటి వాళ్లంతా కనిపిస్తారు.సంప్రదాయ కట్టు, కార్పొరేట్ లుక్, కార్పెట్ వాక్, పార్టీ వేర్.. ఏది కావాలన్నా, ఏ తీరులో మెరవాలన్నా ఏ వర్గం వారైనా కోరుకునే బ్రాండ్ ‘హౌస్ ఆఫ్ అనితా డోంగ్రే’నే! ఫ్యాషన్ ప్రపంచంలో ఆమెకు తిరుగులేదు అనే స్థాయికి ఎదిగింది. పింక్ సిటీ పేరుతో జ్యూల్రీ లైన్‌నూ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె దగ్గర మూడు వేలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఎంతోమంది ఔత్సాహిక ఫ్యాషన్ డిజైనర్స్ ఆమె గైడెన్స్ తీసుకుంటున్నారు. వీళ్లు సరే.. పలు ప్రాంతాల్లోని ఎంతోమంది చేనేత కళాకారులకూ పని కల్పిస్తోంది అనితా డోంగ్రే. -
Chamari Athapaththu: మహిళా క్రికెట్‌పై.. పట్టు!
83 బంతుల్లో అజేయంగా 108 పరుగులు, 80 బంతుల్లో 140 నాటౌట్, 47 బంతుల్లో అజేయంగా 80 పరుగులు, 31 బంతుల్లో 55, 28 బంతుల్లో 44, 139 బంతుల్లో 195 నాటౌట్, 46 బంతుల్లో 73.. ఇటీవల కీలక మ్యాచ్‌లలో చమరి అటపట్టు సాధించిన స్కోర్లు ఇవి. న్యూజీలండ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా లాంటి పటిష్ఠ జట్లపై శ్రీలంక సాధించిన అరుదైన, చారిత్రక విజయాలన్నిట్లో అటపట్టుదే కీలక పాత్ర. లంక జట్టుకు వెన్నుదన్నుగానే కాదు సంచలన బ్యాటింగ్‌తో రికార్డు స్కోర్లు సాధిస్తూ వరల్డ్ నంబర్‌వన్‌గానూ కొనసాగుతోంది. ఈ ఆటకు ఆమె నాయకత్వ ప్రతిభా తోడై శ్రీలంకకు మహిళా ఆసియా కప్ టోర్నీని అందించింది. ఇందులో అప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడని, ఏడుసార్లు విజేతైన భారత్‌కు ఫైనల్లో షాక్ ఇస్తూ లంక టైటిల్‌ను అందుకుంది. ఈ టోర్నీలో చమరి ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు సహా 304 పరుగులు అదీ 147 స్ట్రైక్ రేట్‌తో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది.ప్రతి క్రీడలో ఆ దేశపు జాతీయ పతాకాన్ని అగ్రభాగాన నిలిపేందుకు ఒక ప్లేయర్ అవసరమవుతారు. విజయాలు, పరాజయాలతో సంబంధం లేకుండా సదరు క్రీడపై అందరి దృష్టి పడేలా చేయడం, ఆపై తన వ్యక్తిగత ఆటతో జట్టు స్థాయిని కూడా పెంచడం ఆ ‘ట్రయల్ బ్లేజర్’కే సాధ్యం. శ్రీలంక క్రికెట్‌కు సంబంధించి చమరి అటపట్టు పాత్ర కూడా సరిగ్గా అలాంటిదే. అంతర్జాతీయ మహిళల క్రికెట్లో శ్రీలంక జట్టువి అరకొర విజయాలే తప్ప అసాధారణ ప్రదర్శన కాదు. కానీ చమరి తన ఆటతో ఇతర జట్ల దృష్టి తమ టీమ్‌పై పడేలా చేసింది. తన19వ ఏట, 2009 టి20 వరల్డ్ కప్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది. 2011 వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 67 బంతుల్లోనే 60 పరుగులు సాధించడంతో వెలుగులోకి వచ్చింది. తర్వాతి ఏడాదే శ్రీలంక అత్యుత్తమ మహిళా క్రికెటర్ అవార్డు గెలుచుకోవడంతో చమరి శకం మొదలైంది.రికార్డులే రికార్డులు..వన్డే క్రికెట్లోకి చమరి అడుగుపెట్టిన ఏడాదిలోనే ఐర్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 111 పరుగులతో చెలరేగింది. ఫలితంగా శ్రీలంక తరఫున వన్డేల్లో సెంచరీ సాధించిన తొలి మహిళగా గుర్తింపు పొందింది. విశేషం ఏమిటంటే ఇప్పటి వరకు వన్డేల్లో ఆమె మొత్తం తొమ్మిది శతకాలు బాదగా.. మరే శ్రీలంక ప్లేయర్ ఒక్క సెంచరీ కూడా చేయలేకపోవడం! అంతర్జాతీయ టి20ల్లో కూడా మూడు సెంచరీలతో ఆమె ఏకైక స్టార్‌గా నిలిచింది. 2017 వన్డే వరల్డ్ కప్‌లో నంబర్‌వన్ టీమ్ ఆస్ట్రేలియాపై ఆమె ఆడిన 178 పరుగుల ఇన్నింగ్స్ మహిళల వన్డే చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో ఒకటిగా మిగిలింది.34 ఏళ్ల 88 రోజుల వయసులో స్కాట్లండ్‌పై శతకం బాదిన చమరి.. అతి పెద్ద వయసులో ఈ ఘనత సాధించిన మహిళా క్రికెటర్‌గా నిలిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీలంక క్రికెట్‌కు సంబంధించి అన్ని వన్డే, టి20 బ్యాటింగ్ రికార్డులు చమరి పేరిటే ఉన్నాయి. నాయకత్వ లక్షణాలూ పుష్కలంగా ఉన్న చమరి మూడు టి20 వరల్డ్ కప్(2018, 2020, 2023)లలో శ్రీలంక టీమ్ సారథిగా వ్యవహరించింది. ఆమె కెప్టెన్సీలోనే దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లపై టి20ల్లో, న్యూజీలండ్పై వన్డేల్లో తొలిసారి శ్రీలంక సిరీస్‌ను గెలుపొందింది. అయితే కెప్టెన్‌గా ఆమె కెరీర్లో అత్యుత్తమ విజయం ఇటీవల ఆసియా కప్‌ను అందుకోవడమే. అసలు భారత జట్టును ఎదురునిలవడమే అసాధ్యం, భారత్ మినహా ఇతర బలహీన టీమ్‌లతో టోర్నీని నిర్వహించడమే అనవసరం అనే విమర్శల నేపథ్యంలో.. చమరి తన టీమ్‌ను ఆసియా విజేతగా నిలపడంతో ఆమె కెరీర్ శిఖరానికి చేరింది.ఫ్రాంచైజీ క్రికెట్లో..వరల్డ్ క్రికెట్లో దూకుడైన బ్యాటర్‌గా, భారీ హిట్టర్‌గా చమరికి వచ్చిన గుర్తింపు ఫ్రాంచైజీ క్రికెట్లో వరుస అవకాశాలనిచ్చింది. లంక తరఫున ఫ్రాంచైజీ క్రికెట్ ఆడిన తొలి మహిళా క్రికెటర్ ఆమె. ప్రతిజట్టూ తమ టీమ్‌లో ఆమెను ఎంచుకునేందుకు ఆసక్తి చూపించింది. ఆస్ట్రేలియాలోని పెర్త్ స్కార్చర్స్, సిడ్నీ థండర్, మెల్బోర్న్ రెనగెడ్స్ జట్ల తరఫున, ఇంగ్లండ్ టీమ్‌లు ఓవల్ ఇన్విన్సిబుల్స్, యార్క్‌షైర్ డైమండ్స్, దక్షిణాఫ్రికా నార్తర్న్ డిస్ట్రిక్ట్స్, వెస్టిండీస్ జట్టు గయానా అమెజాన్ వారియర్స్‌తో పాటు బీసీసీఐ నిర్వహించిన లీగ్ టోర్నీల్లో సూపర్ నోవాస్, యూపీ వారియర్స్‌కి చమరి ప్రాతినిధ్యం వహించింది.2023–24 ఆస్ట్రేలియా క్రికెట్ విమెన్ బిగ్‌బాష్ లీగ్‌లో 130 స్ట్రైక్‌రేట్‌తో 511 పరుగులు సాధించి ఆమె ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచింది. బిగ్‌బాష్ లీగ్‌లో అటపట్టు ప్రభావం ఎంతగా ఉందంటే లీగ్‌లో ‘చమరి బే’ పేరుతో ప్రత్యేక సీటింగ్ జోన్ ఏర్పాటు చేసేంతగా! ఆమె కెరీర్లో మరో అత్యుత్తమ క్షణమూ ఇటీవలే వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో దక్షిణాఫ్రికాతో వారి సొంతగడ్డ పోష్స్ట్రూమ్లో జరిగిన వన్డేలో చమరి 139 బంతుల్లో 26 ఫోర్లు, 5 సిక్సర్లతో 195 పరుగులు తీసి అజేయంగా నిలిచి, తన అత్యధిక స్కోరును నమోదు చేసింది. ఆమె బ్యాటింగ్‌తో శ్రీలంక.. మహిళల వన్డేల్లో అత్యధిక పరుగులు (302) ఛేదించిన జట్టుగా రికార్డుకెక్కింది. ప్రస్తుతం 34 ఏళ్ల వయసులోనూ సూపర్ ఫామ్‌తో చెలరేగిపోతున్న చమరి అటపట్టు రాబోయే కొన్నేళ్లలో మరిన్ని ఘనతలు అందుకోవడం, రికార్డులు సృష్టించడం ఖాయం. – మొహమ్మద్ అబ్దుల్ హాది