
మిస్ ట్రాన్స్ ఆసియా-2024 హర్షిని మేకల
అలైట్ క్వీన్ యూనివర్స్, మిస్ యూనివర్స్ ట్రాన్స్‌లో ఐదో స్థానం
ఐకానిక్ స్టార్స్ మిస్ ట్రాన్స్ తెలంగాణ ఫ్యాషన్ షో 2025
చిన్నతనం నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా.. కనీసం పక్కన కూర్చోడానికి కూడా ఒప్పుకోని పరిస్థితిని దాటుకుని మిస్ యూనివర్స్ ట్రాన్స్ 2024 ఐదో స్థానంలో నిలిచానని హర్షిని మేకల అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఓ కార్యక్రమానికి మంగళవారం వచ్చిన హర్షిని మాట్లాడుతూ మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 2024 డిసెంబర్‌లో ఢిల్లీలో జరిగిన పోటీల్లో 24 దేశాల నుండి మోడల్స్ పాల్గొనగా మిస్ యూనివర్స్ ట్రాన్స్‌లో ఐదో స్థానం, మిస్ ట్రాన్స్ ఆసియా 2024, అలైట్ క్వీన్ యూనివర్స్‌తో మొత్తం మూడు టైటిల్స్ గెలుచుకున్నానని ఆమె పేర్కొన్నారు.
అంతర్జాతీయ స్థాయికి
అంతర్జాతీయ వేదికపై ఇండియా తరపున తాను పోటీలో ఉండడం, వేదికపై హర్షిని మేకల అని అనౌన్స్ చేసినప్పుడు ప్రేక్షకుల నుండి కేరింతలు రావడం, ఆ కేరింతల మధ్య తనకు మిస్ యూనివర్స్ ఆసియా కిరీటం పెట్టడం ఎప్పటికీ మర్చిపోలేనని హర్షిని అన్నారు. మిస్ ట్రాన్స్ ఆసియా గెలుపొందిన తరువాత ఇప్పటివరకూ కృష్ణలంక, బైరాజులపల్లి, బాలామణి అనే మూడు సినిమాల్లో నటించానని, ఓ వెబ్‌సిరీస్, రెండు సీరియల్స్‌లోనూ నటిస్తున్నట్లు తెలిపారు.
మార్చిలో మిస్ ట్రాన్స్ తెలంగాణ
తెలంగాణలో మొదటిసారిగా సంచారీ ఎంటర్‌టైన్‌మెంట్ ఆధ్వర్యంలో ఐకానిక్ స్టార్స్ మిస్ ట్రాన్స్ తెలంగాణ ఫ్యాషన్ షో 2025 నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమ పోస్టర్‌ను మిస్ ట్రాన్స్ ఆసియా హర్షిని, మొదటి ట్రాన్స్ డాక్టర్ ప్రాచీ రాథోడ్, హైదరాబాద్ మోడల్ సీఈవో వంశీ పల్లె, నిర్వాహకుడు శ్రీనాథ్, నటుడు కామేష్ గౌడ్, నిర్మాత నవీన్ గౌడ్ మంగళవారం ఆవిష్కరించారు. విజేతలకు సర్టిఫికెట్, కిరీటం, నగదు బహుమతి, యాడ్, యూట్యూబ్‌లో సాంగ్ అవకాశం కల్పిస్తామన్నారు. మార్చి 1 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలకు 9010691111లో సంప్రదించొచ్చు.
ఇవీ చదవండి: ఐఐఎం గ్రాడ్యుయేట్ : లైఫ్‌లో రిస్క్ తీసుకుంది, నెలకు రూ.4.5 కోట్ల
అమ్మ కోరిక తీర్చాలనే పట్టుదలతో టాప్‌లో నిలిచాడు : సక్సెస్ స్టోరీ
Comments
Please login to add a commentAdd a comment