humiliation
-
బాలుడిపై తోటి విద్యార్థులతో దాడి చేయించిన టీచర్..
లక్నో: యూపీలోని ఓ ప్రైవేటు పాఠశాలలోని టీచర్ ఒక ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించిన సంఘటన పెను సంచలనంగా మారింది. విద్యార్థిని కొట్టించడం సంగతి అటుంచితే ఆమె మతవిద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం వివాదాన్ని మరింత పెద్దది చేసింది. ఈ వీడియో బయటకు పొక్కడంతో రాజకీయ వర్గాల్లో కూడా అగ్గి రాజుకుంది. ఉత్తర్‌ప్రదేశ్ ముజఫ్ఫర్‌నగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో పాఠాలు చెప్పాల్సిన టీచరమ్మ అమానుషంగా వ్యవహరించి పసి మనసుల్లో మత విద్వేషాలను నాటే ప్రయత్నం చేసిందని తెలిపారు యూపీ పోలీసులు. వీడియో ఆధారంగా యూపీ పోలీసులు టీచర్‌పైన చర్యలు తీసుకోవాలని విద్యా శాఖను ఆదేశించారు. How humiliating for a small child to be put through this at a young age. Making the Muslim boy stand in front of the whole class and getting the Hindu kids to come and slap him. That teacher needs a slap tbh pic.twitter.com/n1KDWtTTwQ — Abu Hafsah (@AbuHafsah1) August 25, 2023 పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం.. టీచర్ కొట్టించిన బాలుడు ముస్లిం. టీచర్ కచ్చితంగా మతపరమైన దూషణలు చేసినట్టు వీడియోలో స్పష్టమైందని అయితే ఆమె నైజం ఏమిటన్నది విచారణ చేస్తున్నామని తెలిపారు. ఆ ముస్లిం విద్యార్థి గణిత పట్టికలను నేర్చుకోలేదని మతపరమైన దూషణ చేస్తూ తోటి విద్యార్థులను ఆ బాలుడిపై దాడి చేయమని ఉసిగొల్పారన్నారు. బాలల హక్కుల సంఘం కూడా టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బాలుడి తండ్రి పాఠశాల యాజమాన్యం రాజీకి వచ్చిందని తాము కట్టిన ఫీజును కూడా తిరిగి చెల్లించిందని ఇకపై తమ బిడ్డను ఆ పాఠశాలకు పంపేది లేదని తేల్చి చెప్పేశారు. ఈ విషయంపై స్పందించే ఉద్దేశ్యం తనకు లేదని దీన్ని ఇక్కడితో వదిలేయాలని కోరారు. కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ గాంధీ ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందిస్తూ.. పవిత్రమైన పాఠశాలలో పిల్లల మనసుల్లో విద్వేషాలను నాటడం కంటే దేశద్రోహం మరొకటుండదు. ఇది దేశాన్ని బుగ్గిపాలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం పోసిన ఆజ్యమే. చిన్న పిల్లలు దేశ భవిష్యత్తు. వారిని ద్వేషించకుండా ప్రేమతత్వాన్ని నేర్పాలని అన్నారు. मासूम बच्चों के मन में भेदभाव का ज़हर घोलना, स्कूल जैसे पवित्र स्थान को नफ़रत का बाज़ार बनाना - एक शिक्षक देश के लिए इससे बुरा कुछ नहीं कर सकता। ये भाजपा का फैलाया वही केरोसिन है जिसने भारत के कोने-कोने में आग लगा रखी है। बच्चे भारत का भविष्य हैं - उनको नफ़रत नहीं, हम सबको मिल… — Rahul Gandhi (@RahulGandhi) August 25, 2023 మరో ఎంపీ జయంత్ సింగ్ స్పందిస్తూ.. హింసను రెచ్చగొడుతూ మైనారిటీలకు వ్యతిరేకంగా మతవిద్వేషాలు ఎంత లోతుగా పాతుకుపోయాయనడానికి ఈ సంఘటన ఒక నిదర్శనమన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని విద్యార్థి భవిష్యత్తు పాడవకుండా చూడాలని.. పోలీసులు కేసును సుమోటోగా స్వీకరించాలని డిమాండ్ చేశారు. Muzaffarnagar school video is a painful warning of how deep rooted religious divides can trigger violence against the marginalised, minority communities. Our MLAs from Muzzafarnagar will ensure that UP Police files a case suomoto & the child’s education is not disrupted! — Jayant Singh (@jayantrld) August 25, 2023 ఇది కూడా చదవండి: బెంగళూరులో మోదీ.. 'జై విజ్ఞాన్, జై అనుసంధాన్' నినాదాలు -
చిచ్చుపెట్టిన బైక్‌ర్యాలీ!
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/కొత్తగూడెం అర్బన్: కొత్తగూడెం గులాబీ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మున్సిపాలిటీలోని రెండు వర్గాలు ఇప్పటివరకు మాటల తూటాలు, విమర్శలకే పరిమితమయ్యాయి. ద్విచక్రవాహన ర్యాలీలో చోటుచేసుకున్న ఘటనతో మరింత వివాదాస్పదంగా మారాయి. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరికి నిరసనగా జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్నేతలు శుక్రవారంనాడు ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేయడంతో పాటు బైక్ ర్యాలీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించగా, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మితో పాటు పాలకవర్గం, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ర్యాలీలో తన తనయుడితో కలిసి కాపు సీతాలక్ష్మి వెళ్తున్న బైక్‌ను, మాజీ కౌన్సిలర్ యూసుఫ్ వాహనం వెనుకనుంచి ఢీకొట్టడంతో సీతాలక్ష్మి కిందపడిపోయారు. యూసుఫ్ కావాలనే తన వాహనాన్ని ఢీకొట్టారంటూ సీతాలక్ష్మి రోడ్డుపై బైఠాయించారు. పార్టీ నాయకులు కొందరు యూసుఫ్‌తో వాగ్వాదానికి దిగగా.. ప్రమాదవశాత్తూ జరిగిందంటూ కొందరు యూసుఫ్‌కు మద్దతుగా నిలిచారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. టూటౌన్ సీఐ రాజు ఇరువర్గాలను సమదాయించి పంపించేశారు. కాగా, చైర్‌పర్సన్‌ను ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పరామర్శించారు. ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ఆమెకు సంఘీభావం తెలిపారు. నేను మహిళను, దండం పెడతా అన్నా.. ‘నేను ప్రయాణిస్తున్న బైక్‌ను యూసుఫ్ అప్పటికే రెండుసార్లు ఢీకొట్టారు. ‘ఆగన్నా నేను మహిళను.. మీకు దండం పెడతా...’ అని చెప్పినా వినిపించుకోలేదు. అలాగే ముందుకొచ్చాడు. నా కుమారుడికి చెప్పి బండి పక్కకు ఆపి ఇంటికొచ్చేశా. మహిళనని చూడకుండా అగౌరవపరిచారు. చైర్‌పర్సన్‌కే రక్షణ లేకుంటే సాధారణ మహిళలు బయటికి ఎలా వస్తారు? యూసుఫ్‌పై చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానంతో పాటు ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లాను’ అంటూ కాపు సీతాలక్ష్మి శుక్రవారం సాయంత్రం ఓ వీడియో విడుదల చేశారు. అనంతరం కొత్తగూడెం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. కాగా, ‘చైర్పర్సన్ డ్రైవర్ నాగరాజు బండి తొలుత నా వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పి నా బండి చైర్పర్సన్ వాహనాన్ని ఢీకొంది. అంతే తప్ప దురుద్దేశంతో చేయలేదు’అంటూ యూసుఫ్ మరో వీడియోలో స్పందించారు. -
స్కూల్లో టీచర్ అవమానించిందని.. 30 ఏళ్ల తర్వాత.. 101 సార్లు పొడిచి..
బ్రస్సెల్స్: చిన్నప్పుడు స్కూల్లో అవమానించిందని ఓ వ్యక్తి టీచర్‌పై కక్ష్య పెంచుకున్నాడు. ఏడేళ్ల వయసులో జరిగిన అవమానానికి దాదాపు 30 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్నాడు. గుంటెర్ ఉవెంట్స్ అనే 37 ఏళ్ల వ్యక్తి 2020లో టీచర్‌ను హత్య చేశాడు. ఏకంగా 101 సార్లు కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘోర ఘటన బెల్జియంలో చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బెల్జియం పోలీసులు గురువారం మీడియాకు వెల్లడించారు. కాగా 2020లో ఆంట్వెర్ప్ సమీపంలో మారియా వెర్లిండెన్ అనే 59 ఏళ్ల టీచర్‌ను హత్య చేశారు. 101 సార్లు పొడిచి చంపారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు బెల్జియం పోలీసులు దాదాపు 100 మంది అనుమానితుల డీఎన్ఏలను పరీక్షించారు. అయినా కేసును చేధించలేకపోయారు. అయితే మహిళ మృతదేహం పక్కనే ఉన్న డైనింగ్ టేబుల్‌పై ఉన్న నగదు అలాగే ఉండటంతో ఆమెను డబ్బుల కోసం హత్య చేయలేదనే నిర్ధారణకు వచ్చారు. చదవండి: భార్యను వదిలేసి స్వాతి టీచర్‌తో నాయ్యవాది.. చిత్ర హింసలు.. కాదు కిడ్నాప్! అయితే హత్య జరిగిన 16 నెలల తర్వాత, ఉవెంట్స్ టీచర్‌ను హత్య చేసిన విషయం తన స్నేహితుడి దగ్గర చర్చించాడు. దీంతో అతను పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఉవెంట్స్‌ను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో లభించిన క్లూతో నిందితుడి డీఎన్ఏను పరీక్షించగా అతనే నేరం చేసినట్లు తేలింది. అంతేగాక నిందితుడు హతురాలి పూర్వ విద్యార్ధి అని తేలింది. తనను అవమానించినందుకే టీచర్‌ను హత్య చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. 1990లో తన ఏడేళ్ల వయస్సులో పాఠశాల విద్యార్థిగా ఉన్న సమయంలో టీచర్ మారియా వెర్లిండెన్ తన గురించి చేసిన వ్యాఖ్యలను ఇప్పటి వరకు మరిచిపోలేదని చెప్పాడు. చదవండి: ఎవరినీ లెక్కచేయని పుతిన్.. బైడెన్ తీవ్ర వ్యాఖ్యలు.. రష్యా అభ్యంతరం -
డబ్బు పోయింది, కుటుంబం విచ్ఛిన్నమైంది.. 'సమంత మనసులో ఇంత బాధ ఉందా'?
Samantha Shares Cryptic Quote Related To Failure, Loss, Divorce, Humiliation: స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత షేర్ చేస్తున్న పోస్టులపై ఫోకస్ మరింత పెరిగింది. తాజాగా హాలీవుడ్ హాస్యనటుడు విల్ స్మిత్ పుస్తకం నుంచి ఓ కోట్‌ను షేర్ చేసింది. అందులో.. 'గత 30 ఏళ్లుగా అందరిలాగే నేను కూడా వైఫల్యం, నష్టం, అవమానం, విడాకులు వంటి వాటిని ఫేస్ చేశాను. నాకు ప్రాణహాని ఉంది. నా డబ్బు పోయింది. నా ప్రైవసీని అతిక్రమించారు. నా కుటుంబం విచ్ఛిన్నమైంది' అంటూ భావోద్వేగ పోస్ట్‌ను షేర్ చేసింది. దీంతో పాటు ప్రతిరోజు ఇటుకను కాంక్రీట్ కలిపి పేర్చాలని మీరు ఏ దారిలో వెళ్తున్నా అక్కడ ఒక ఇటుక పేర్చేందుకు ఉంటుందని.. కానీ ఆ ఇటుకను పేర్చేందుకు నువ్వు లేచి నిలబడాలి అంటూ పేర్కొంది. మరో పోస్టులో.. కష్టపడి పని చేయండి. మీకు తగిలిన ఎదురుదెబ్బల నుంచి నేర్చుకోండి. మిమ్మల్ని మీరు చూసుకోండి. మిమ్మల్ని మీరు ప్రతి రోజూ ఆవిష్కరించుకోండి అంటూ పేర్కొంది. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విడాకుల తర్వాత సమంత మనసులో ఇంత బాధ ఉందా అంటూ నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. -
రైతుకు ఘోర అవమానం.. స్పందించిన ఆనంద్ మహీంద్రా
Anand Mahindra Respond On Farmer Issue: కర్ణాటక తుమకూరు మహీంద్రా షోరూంలో జరిగిన ఘటన సోషల్ మీడియా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. బొలెరో కొనడానికి వెళ్లిన ఓ రైతు, అతని స్నేహితుల్ని.. వేషధారణ చూసి సేల్స్‌మ్యాన్ ఘోరంగా అవమానించాడు. ప్రతీకారంగా గంటలో పది లక్షలతో అక్కడ వాలిపోయిన రైతు.. షోరూం నిర్వాహకుల గర్వం అణచిన ఘటన తెలిసిందే. ఈ ఘటనలో చాలాసేపు వాగ్వాదం తర్వాత ఆఖరికి రైతు కెంపగౌడకి, అతని స్నేహితులకు క్షమాపణలు తెలియజేశాడు సేల్స్ ఎగ్జిక్యూటివ్. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా.. తన షోరూంలో జరిగిన ఘటనపై స్పందించలేదేం అనే అనుమానం చాలామందికి తలెత్తింది ఈ నేపథ్యంలో తాజాగా ఆయన కూడా స్పందించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మంగళవారం ఒక వ్యక్తి గౌరవాన్ని నిలబెట్టడం ప్రాముఖ్యత గురించి ఒక ట్వీట్ చేశారు. @MahindraRise యొక్క ప్రధాన ఉద్దేశ్యం కమ్యూనిటీలు, అన్ని వాటాదారుల్ని అభివృద్ధి చేయడం. ఒక కీలకమైన ప్రధాన విలువ.. ఆ వ్యక్తి యొక్క గౌరవాన్ని నిలబెట్టడం. ఈ తత్వశాస్త్రం నుండి ఏదైనా ఉల్లంఘన జరిగితే చాలా అత్యవసరంగా పరిష్కరించబడుతుంది అంటూ వ్యవహారాన్ని సీరియస్‌గానే తీసుకున్నట్లు పరోక్షంగా పేర్కొన్నారు ఆయన. The Core Purpose of @MahindraRise is to enable our communities & all stakeholders to Rise.And a key Core Value is to uphold the Dignity of the Individual. Any aberration from this philosophy will be addressed with great urgency. https://t.co/m3jeCNlV3w — anand mahindra (@anandmahindra) January 25, 2022 అంతకు ముందు గిరిసొన్నాసెరీ అనే ట్విటర్ హ్యాండిల్ నుంచి ఓ వ్యక్తి రైతుకు జరిగిన అవమానం గురించి ఓ వార్త కథనాన్ని ట్యాగ్ చేసి ట్వీట్ చేయగా.. దానికి మహీంద్రా అండ్ మహీంద్రా సీఈవో విజయ్ నక్రా స్పందించారు. కస్టమర్ సెంట్రిక్ అనుభవాన్ని అందించడంలో డీలర్లు అంతర్భాగం. మా కస్టమర్లందరినీ మేం ఎల్లప్పుడూ గౌరవిస్తాం. మేము సంఘటనపై దర్యాప్తు చేస్తున్నాము. తగిన చర్య తీసుకుంటాం అని విజయ్ నక్రా రీట్వీట్ చేయగా.. ఆ రీట్వీట్‌కు రియాక్ట్ అయ్యారు ఆనంద్ మహీంద్రా. Dealers are an integral part of delivering a customer centric experience & we ensure the respect & dignity of all our customers. We are investigating the incident & will take appropriate action, in the case of any transgression, including counselling & training of frontline staff https://t.co/9jLUptoevy — Veejay Nakra (@vijaynakra) January 25, 2022 A farmer was insulted for his looks by @MahindraRise showroom and he returned with full cash to buy the truck. @anandmahindra sir, please look into it. If true, I know this is not something that you would ever encourage! https://t.co/C9hXDXtIGM — GiriSonnaSeri Tech (@GiriSonnaSeri) January 24, 2022 Mahindra Car showroom salesman taunted a farmer aftr seeing his attire when he visited showroom to buy Bolero Pik-up. Farmer Kempegowda alleged field officer of showroom made fun of farmer & his attire, told him tat car is not worth 10 rupees for him to buy. @anandmahindra pic.twitter.com/9fXbc5naY7 — Sagay Raj P || ಸಗಾಯ್ ರಾಜ್ ಪಿ (@sagayrajp) January 23, 2022 సంబంధిత వార్త: ఘోర అవమానం.. రైతు అల్టిమేట్ రివెంజ్ -
పిల్లాడిపై వ్యక్తి కర్కశత్వం.. చితకబాది..
చిన్న పిల్లాడనే కనికరం లేకుండా.. ఓ వ్యక్తి బాలుడి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. అతడిని అమాంతం ఎత్తి పడేస్తూ కర్కషంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగక కిందడేసి తొక్కుతూ బాలుడికి నరకం చూపించాడు. ఈ అమానుష చర్యకు సంబంధించిన వీడియోను నటి లక్ష్మీ రామకృష్ణన్ ట్విటర్లో షేర్ చేశారు. ‘ అసలేంటిది. చూడలేకపోతున్నా!!! ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లిందా లేదా? ఈ అమానుష చర్యను ఆపకుండా అక్కడున్న స్త్రీ వీడియో తీయడమేంటి? పోలీసులు కేసు రిజిస్టర్ చేశారా’ అంటూ లక్ష్మీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా లక్ష్మీ ట్వీట్‌పై స్పందించిన నెటిజన్లు...మరీ ఇంత రాక్షసత్వమా అంటూ వీడియోలలో ఉన్న వ్యక్తిపై మండిపడుతున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇది దాదాపు సంవత్సరం క్రితం జరిగిన ఘటన అని, పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేసి ఉంటారని పేర్కొంటున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రజాక్షేత్రంలో బీజేపీకి పరాభవమే
సాక్షి, హైదరాబాద్: ప్రజాక్షేత్రంలో బీజేపీకి పరాభవం తప్పదని, మునిగిపోయే పడవ బీజేపీదేనని మంత్రి జోగు రామన్న అన్నారు. బీజేపీ నేతల మాటలు మాయల ఫకీర్‌ను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. బుధవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఈ మాటలను తెలంగాణ ప్రజలు సహించబోరని హెచ్చరించారు. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాకుంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, అధికారంలోకి వస్తే మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని లక్ష్మణ్‌కు సవాల్ విసిరారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన నీరవ్ మోదీ, విజయ్‌మాల్యా దర్జాగా విదేశాల్లో తిరుగుతున్నారని చెప్పారు. లక్ష్మణ్ ఇప్పటికైనా పగటి కలలు కనడం మానేసి, వాస్తవ పరిస్థితుల్లో జీవించాలని సూచించారు. టీఆర్ఎస్ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను బీజేపీ పాలిత రాష్ట్రాలు, కేంద్ర మంత్రులు అభినందిస్తున్న విషయాన్ని గమనించాలని చెప్పారు. -
ఎయిర్‌పోర్ట్‌లో ప్రముఖ అనామకులు
అవమానం ఇళయరాజాకి బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో అవమానం జరిగింది! అవమానమా? ఎవరు అవమానించి ఉంటారు? ఈ ప్రశ్నకు సమాధానం లేదు. ఎందుకంటే లోకంలో అవమానించేవారు అంటూ ఎవరూ ఉండరు. అవమాన పడేవాళ్లు మాత్రమే ఉంటారు. పట్టించుకుని ఫీల్ అయితే అవమానం. ఫీల్‌ని వదిలేస్తే.. జస్ట్ అదొక అనుభవం. ప్రముఖులకు, ప్రసిద్ధులకు జరిగే అవమానాలు సాధారణంగా పెద్దపెద్దవి అయి ఉండవు. కానీ పెద్దవాళ్లు కాబట్టి చిన్న చిన్న విషయాలకే ఫీల్ అవుతుంటారు. సగటు మనుషులుగా ఇది మన అబ్జర్వేషన్ మాత్రమే అయి ఉండొచ్చు కూడా. ఏదైనా నొప్పి నొప్పే. నొప్పించిన వాళ్లు డ్యూటీలో భాగంగా నొప్పించినా సరే.. గొప్పవాళ్లు బాధపడే అవకాశం ఉంది. ఇళయరాజా కూడా అలాగే బాధపడ్డారు. అవమానం ఫీల్ అయ్యారు. ఆ సంగతి కాస్త ఆలస్యంగా బయటికి వచ్చింది. గతవారం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం కోసం మంగుళూరు వెళ్లారు. దర్శనం అయ్యాక చెన్నైకి తిరుగు ప్రయాణం కట్టారు. బెంగళూరు విమానాశ్రయంలో ఆయన్ని భద్రత అధికారులు ఆపి తనిఖీ చేశారు! ఇళయరాజా దగ్గర ఉన్న దైవ ప్రసాదాన్ని వాళ్లు మరింకేదో అని అనుమానించి, ప్రసాదంతో పాటు ఇళయరాజా దగ్గర ఉన్న మిగతా సరంజామానంతా తనిఖీ చేశారు. ఆయన వివరణ ఇవ్వబోయినా వినిపించుకోలేదు. తర్వాత ఆయన కుటుంబ సభ్యులను కూడా చెక్ చేశారు. ఈ సంగతి తెలిసి ఇళయరాజా అభిమానులు కలత చెందారు. ఎండీఎంకే నేత వైగో ఈ అవమానాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఒక సంగీత దర్శకుడిని.. ఎవరో అపరిచితుణ్ణి చేసినట్టుగా తనిఖీ చేస్తారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ సెలబ్రిటీలు ఇలా ఇంటా బయటా విమానాశ్రయాలలో మరీ అవమానం కాకపోయినా, అభాసుపాలైన సంఘటనలు మరికొన్ని ఉన్నాయి. 2013లో రణ్‌బీర్ కపూర్ ముంబైలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో బుక్ అయ్యాడు. అతడు లెక్కలో చూపించని వస్తువులు అధికారుల తనిఖీలో బయపడడంతో కపూర్ అక్కడికక్కడ కస్టమ్స్ వాళ్లకు లక్ష రూపాయలు కక్కవలసి వచ్చింది. పెనాల్టీగా మరో 70 వేలు. అయితే అంత డబ్బు తన దగ్గర లేకపోవడంతో వస్తువుల్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. తర్వాత కపూర్ మనుషులు డబ్బు కట్టి వాటిని విడిపించుకున్నారు. అనుష్కా శర్మ 2011లో ఏదో అవార్డు ఫంక్షన్‌కి ఫారిన్ వెళ్లి వస్తూ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ వాళ్లకు పట్టుబడ్డారు. అమె దగ్గర్నుంచి 45 లక్షల రూపాయల విలువైన ఆభరణాలను, అతి ఖరీదైన వాచీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదే ఏడాది బిపాష బసును ముంబై ఏర్పోర్ట్ అధికారులు తనిఖీ కోసం ఆపారు. ఆమె దగ్గర ఉన్న హ్యాండ్‌బ్యాగ్ భారీగా కనిపించడంతో వారికి అనుమానం వచ్చి చూశారు. చిన్న పాటి వస్తువులకు 12 వేలు సుంకం కట్టించుకుని, గంటపాటు నానా రకాల ప్రశ్నలు వేసి ఆమెను వదిలిపెట్టారు. 2012లో బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ని చికాగో ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ వాళ్లు, ఇమిగ్రేషన్ వాళ్లు ఇద్దరూ కలిసి ఆయన్ని ఒళ్లంతా తడిమి చూశారు. రకరకాల ప్రశ్నలతో విసిగించారు. ఒక కథనం ప్రకారం ఆయన బట్టలు కూడా తీయించి చెక్ చేశారు! ఈ చర్యలను ఆమిర్ ఎంతో అవమానకరమైనవిగా భావించారు. జాన్ అబ్రహాం 2009లో యు.ఎస్. వెళ్లినప్పుడు న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీ సిబ్బంది ఆపి చాలాసేపు గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. అతడి పాస్‌పోర్ట్‌లో ఓసారెప్పుడో ఆఫ్ఘనిస్థాన్‌కు వెళ్లివచ్చినట్లు ఉండడంతో వారికి అనుమానం వచ్చింది. తను సినిమా నటుడినని చెప్పి, వారిని ఒప్పించి ఎలాగో బయటపడ్డాడు అబ్రహాం. ఇదే ఎయిర్‌పోర్ట్‌లో అదే ఏడాది షారుక్‌ఖాన్‌ని అధికారులు ఆపేశారు. అప్పుడాయన ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ చిత్రం ముందస్తు ప్రమోషన్ టూర్లో వున్నారు. పేరు చివర ఖాన్ అని ఉండడంతో అనుమానించిన అధికారులు షారుఖ్‌ని దాదాపు రెండు గంటల పాటు ప్రశ్నించారు. అక్కడి భారతీయ రాయబారులు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని షారుక్‌ని విడిపించాల్సి వచ్చింది. వీళ్లందర్నీ అలా ఉంచండి. సాక్షాత్తూ మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్‌నే ఏర్పోర్ట్ అధికారులు అడ్డుకుని, ప్రశ్నలతో సతమతం చేశారు. 2011లో ఆయన్ని యు.ఎస్.లోని. జాన్ ఎఫ్.కెన్నెడీ విమానాశ్రయ భద్రతా సిబ్బంది జాకెట్, షూజ్ విప్పించి మరీ తనిఖీ చేశారు. ఆ తర్వాత ఈ విషయమై అమెరికా, ఇండియాకు క్షమాపణ చెప్పింది. 2009లో కూడా కలామ్‌కి ఇలాంటి అవమానమే జరిగింది. న్యూఢిల్లీలో ఆయన ఎక్కిన కాంటినెంటల్ ఎయిర్‌లైన్స్ (యు.ఎస్.) విమాన సిబ్బంది ఆయన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే వదిలిపెట్టారు. అయితే కలామ్ ఈ రెండు సందర్భాలలోనూ అవమానంగా ఫీల్ అవలేదు. నవ్వుతూ తనిఖీ అధికారులకు సహకరించారు. ఆయన తరఫున భారత ప్రభుత్వం మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేసింది. పైన ‘పట్టుబడ్డ’ బాలీవుడ్ ప్రముఖులలో ఎక్కువమంది నిబంధనలు అతిక్రమించారు. కాబట్టి వాళ్లు దానిని అవమానంగా ఫీల్ కానవసరం లేదు. ఇక ఇప్పుడు ఇళయరాజాకు జరిగింది అవమానమా కాదా అన్నది కూడా ఆయన దానిని ఎలా తీసుకున్నారన్న దాన్ని బట్టే ఉంటుంది. -
హీరోయిన్‌కు ఘోర అవమానం!
లాస్ ఏంజెల్స్: జెన్నిఫర్ లారెన్స్.. ప్రస్తుతం ఈ పేరు హాలీవుడ్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోంది. కానీ, నటుడు హ్యారీసన్ ఫోర్డ్ ఒకప్పుడు ఆమె ఎవరో కూడా గుర్తించలేదట. ఈ విషయాన్ని లారెన్స్ 'గ్రాహం నోర్టాన్ షో' లో బయటపెట్టింది. బ్రిటిష్ కమెడియన్ జాక్ వైట్ హాల్‌తో బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపింది. ఆ ఘటన అనంతరం ఫోర్డ్, స్టార్ వార్స్ ది ఫోర్స్ అవేకన్ జేజే అబ్రమ్స్ తో కలిసి డాన్స్ చేయాలని నిర్ణయించుకున్నట్లు లారెన్స్ వివరించింది. తాను అందరూ తనను గుర్తించాలని కోరుకోనని.. కానీ ఫోర్డ్, అబ్రమ్స్ కూడా తనను గుర్తించలేకపోవడాన్ని తీవ్ర అవమానంగా భావించానని తెలిపింది. దాంతో వారివద్దకు వెళ్లి ఏం చేస్తున్నానో కూడా అర్ధం కాకుండా డాన్స్ చేసినట్లు వివరించింది. ఆ తర్వాత తనకే చాలా ఇబ్బందిగా అనిపించినట్లు తెలిపిందీ హీరోయిన్. ప్రస్తుతం 'ది హంగర్ గేమ్స్: మాకింగ్ జే- పార్ట్-1' లో నటిస్తోంది. -
మాతృభాషకు పరాభవం
♦ ఇంటర్ ఫలితాల తీరు.. ♦ అధిక శాతం తెలుగు పరీక్ష ఫెయిల్ ♦ ఆర్ట్స్ కంటే సైన్స్ గ్రూప్‌ల్లో ఉత్తీర్ణత మెరుగు సాక్షి, సిటీబ్యూరో: తెలుగు నేలపై మాతృభాషకు పరాభవం ఎదురైంది. అత్యధిక శాతం ఇంటర్మీడియట్ విద్యార్థులు తెలుగు భాషా పత్రంలో ఫెయిలయ్యారు. తెలుగు భాషా కంటే.. ఇంగ్లిష్, సంస్కృతం పేపర్లలోనే చాలా మెరుగ్గా విద్యార్థులు నెగ్గడం విశేషం. అంతేగాక సైన్స్ కంటే.. ఆర్ట్స్ గ్రూప్‌లకు చెందిన విద్యార్థులే అధికంగా ఫెయిలయ్యారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో ఫలితాల తీరు ఇదే రీతిలో ఉంది. శుక్రవారం ప్రకటించిన జంట జిల్లాల ఇంటర్ ఫలితాలను విశ్లేషిస్తే పలు ఆసక్తికర అంశాలు స్పష్టమయ్యాయి. తెలుగు భాషా పేపర్లోనూ జంట జిల్లాల విద్యార్థులు చతికిలబడ్డారు. ఆ భాష పట్ల ఉన్న చులకన భావమే వారి కొంప ముంచిందని విద్యావేత్తలు చెబుతున్నారు. మాతృభాషపై మమకారం పెంచుకోవాలని, లేదంటే భాష ఉనికికే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో ఇంటర్ సెకండియర్ తెలుగు భాషా పేపర్లో 15.49 శాతం విద్యార్థులు తప్పారు. ఇంగ్లిష్‌లో 5.83 శాతం, సంస్కృతంలో 4.42 శాతం, హిందీలో 7.59 శాతమే ఫెయిలయ్యారు. రంగారెడ్డి జిల్లాలో తెలుగులో 11.90 శాతం, ఇంగ్లిష్‌లో 5.10, సంస్కృతంలో 4.08, హిందీలో 4.56 శాతం తప్పారు. ఫస్టియర్ ఫలితాల్లో హైదరాబాద్ విద్యార్థులు అమ్మభాషలో అధిక శాతం బోల్తా పడ్డారు. ఏకంగా 27.21 శాతం మంది ఫెయిలవడం గమనార్హం. రంగారెడ్డి జిల్లాలో సైతం 19 శాతం నమోదైంది. ఆర్ట్స్‌లో వెనుకంజ.. ప్రకటించిన ఫలితాల్లో సైన్స్ గ్రూప్ విద్యార్థులతో ఆర్ట్స్ విద్యార్థులు పోటీ పడలేకపోయారు. చాలామంది గణితం, జీవశాస్త్రం, కెమిస్ట్రీ, ఫిజిక్స్ తదితర సబ్జెక్టులంటే భయంతో.. ఆర్ట్స్ గ్రూప్‌లను ఆశ్రయిస్తున్నారు. తీరా ఫలితాల్లో బోల్తాపడుతున్నారు. సెకండియర్ ఫలితాల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఫలితాల తీరు ఇలాగే ఉంది. సైన్స్ కంటే.. ఆర్ట్స్ విద్యార్థులు ఏడెమినిది రెట్లు అధికంగా ఫెయిలయ్యారు. హైదరాబాద్ జిల్లాలో సైన్స్ సబ్జెక్టుల్లోనూ అధిక శాతం ఫెయిలయ్యారు. అధికంగా గణితం 2బిలో 23 శాతానికి పైగా అనుత్తీర్ణత నమోదైంది. -
ఎమ్మెల్యే రాజుకు ఎంతటి అవమానం!
విశాఖపట్నం: చోడవరం టీడీపి ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు (కలిదిండి సూర్యనాగ సన్యాసి రాజు)కు ఆ పార్టీ సమావేశంలోనే అవమానం జరిగింది. వరుసగా రెండు సార్లు చోడవరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రాజుని పార్టీ కార్యకర్తల సమావేశంలోనికి పోలీసులు అనుమతించలేదు. మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు అక్కడే ఉన్నారు. అందరూ చోద్యం చూసినట్లు ఉండిపోయారు. దాంతో ఎమ్మెల్యే రాజు తీవ్ర మనఃస్తాపానికి గురైయ్యారు. సమావేశం బయటే ఉండిపోయారు. -
ఓటర్లను ఎంత అవమానించారు!
ఓటర్లకు ఎంత అవమానం! ప్రజా తీర్పును ఎంత చులకన చేశారు! ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంత ముఖ్యమైనవో అందరికీ తెలిసిందే. ప్రతి రాజకీయ పార్టీ తను అమలు చేసే పథకాలను, తను అనుసరించే విధానాలను ప్రజలకు తెలియజేసి ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులను నిలబెడుతుంది. ఏ రాజకీయ పార్టీ విధానాలు, పథకాలు, పద్దతులు నచ్చుతాయో ఆ పార్టీకి చెందిన అభ్యర్థులను ఓటర్లు ఎన్నుకుంటారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని, అన్ని విధాల తమకు అండగా ఉంటారని ఓటర్లు ఆ పార్టీని, ఆ పార్టీ నేతను తమ ప్రతినిధిగా ఎన్నుకుంటారు. అలా ఎన్నికైన ప్రజా ప్రతినిధి పట్టుమని పదిరోజులైనా కాకుండానే పార్టీ ఫిరాయిస్తే ఏమనాలి? ఎన్నికైన పదవికి ప్రమాణస్వీకారం కూడా చేయకుండా మరో పార్టీలో చేరిపోతే ఆ వ్యక్తిని ఏ విధంగా అంచనా వేయాలి? ఇది తమను ఎన్నుకున్న ప్రజలను అవమానించడం కాదా? ఆ విధమైన పార్టీ మార్పిడులను ప్రోత్సహించినవారిని, సమర్ధించిన వారిని ఏమనాలి? వారికి ప్రజాస్వామ్యంపై నమ్మకం, గౌరవం ఉందా? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా? ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చినట్లు కాదా? ప్రజాస్వామ్య పటిష్టత కోసం మన రాజ్యాంగాన్ని రూపొందించిన కర్తలను అవమానించడం కాదా? లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ నెల 16న వెలువడ్డాయి. సార్వత్రిక ఎన్నికల బరిలోకి తొలిసారి దిగినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టిడిపికి గట్టి పోటి ఇచ్చి 9 లోక్‌సభ స్థానాలను, 70 శాసనసభ స్థానాలను గెలుచుకుంది. పోలైన ఓట్లలో దాదాపు 45 శాతం ఓట్లు ఈ పార్టీకి పోలయ్యాయి. గెలిచిన పార్టీకి, ఈ పార్టీకి మధ్య ఓట్ల వ్యత్యాసం1.9 శాతం మాత్రమే. ఎంత నమ్మకం లేకపోతే ఇంత శాతం ఓట్లు ప్రజలు ఈ పార్టీకి వేశారో అర్ధం చేసుకోవచ్చు. ఈ పార్టీ తరపున గెలిచిన ఎంపిలలో ఏడుగురు, శాసనసభ్యులలో 45 మంది కొత్తగా ఎన్నికైనవారు కావడం ప్రజలు ఈ పార్టీని చూసి ఓటు వేశారనడానికి నిదర్శనంగా చెప్పవచ్చు. అటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎస్పివై రెడ్డి నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కేంద్రంలో గానీ, రాష్ట్రంలో గానీ ఇంకా ప్రభుత్వాలు ఏర్పడలేదు. ఫలితాలు వెలువడి పది రోజులు పూర్తి కాలేదు. అప్పుడే ఎస్పివై రెడ్డి తనను గెలిపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి టిడిపిలో చేరిపోయారు. ఎస్పివై రెడ్డి అంటే చిన్నచితకా మనిషి కాదు. జీవితానుభవం, రాజకీయానుభవం, వ్యాపారునుభవం ఉంది. జిల్లాలో, రాష్ట్రంలో అందరికీ తెలిసిన వ్యక్తి. కాస్త పేరున్న వ్యక్తి. ఆయనే చెప్పుకున్నట్లు హార్డ్ కోర్ పొలిటిషియన్ కాదు. అదీ గాక ''వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన రెడ్డితో ఎలాంటి విభేదాలు లేవు. వైఎస్ జగన్ అంటే అభిమానం'' అని ఆయన చెప్పారు. అటువంటి పరిస్థితులో ఆయన పార్టీ ఎందుకు మారవలసి వచ్చింది. ఎస్పివై రెడ్డి లాంటి వ్యక్తి పార్టీ మారాలనుకున్నప్పుడు ప్రజాస్వామ్య విలువలు గురించి ఆలోచించలేదా? తనను ఎన్నుకున్న ప్రజలకు ఏం సమాధానం చెప్పాలనుకున్నారు? ఈ సమాజానికి ఏం సందేశం ఇవ్వదలచుకున్నారు? ఆయనపై అనర్హత వేటు పడుతుండా? లేదా? అనేది ఇక్కడ అప్రస్తుతం. అసలు ఎస్పివై రెడ్డి లాంటి వ్యక్తికి ఇది మంచి పద్దతేనా? ఎస్పివై రెడ్డి కూడా రాజకీయంగా దిగజారిపోయాడనుకోవాలా? ప్రజాసేవ చేయడానికి రాజకీయ పదవులు అవసరంలేదని అనేక మంది చెబుతారు. అలాగే చేస్తుంటారు. అటువంటిది తన ప్రాంతం, తన నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను పార్టీ మారినట్లు ఎస్పివై రెడ్డి చెబుతున్నారు. ఆ మాటలను నిజం అని నమ్మాలా? నిజమని నమ్మినా ఇలా పార్టీ మారడాన్ని ఎవరైనా సమర్ధిస్తారా? ఇక ఇటువంటి ఫిరాయింపులను ప్రోత్సహించేవారిని, సమర్ధించేవారిని ఎలా అర్ధం చేసుకోవాలి? ముఖ్యంగా పూర్తి మెజార్టీతో అధికారంలోకి రాబోతున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని ఎలా అర్ధం చేసుకోవాలి? ప్రస్తుత పరిస్థితులలో టిడిపికి లోక్‌సభ సభ్యుల అవసరం కూడా లేదు. అయినా ఇటువంటి ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఆయనకు ఇటువంటివి కొత్తేమీకాదనుకోవాలా?. చంద్రబాబు నాయుడు నైజమే, స్వభావం, ఆలోచనా విధానం, రాజకీయం విధానం, వ్వహార శైలి ఇదేనని, గతంలో అనుసరించిన విధంగానే అనుసరిస్తున్నారని అనుకోవాలా?