![Samantha Shares Will Smith Quotes On Divorce Failure And Humiliation - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/25/sam.jpg.webp?itok=7b-AS_Qw)
Samantha Shares Cryptic Quote Related To Failure, Loss, Divorce, Humiliation: స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత షేర్ చేస్తున్న పోస్టులపై ఫోకస్ మరింత పెరిగింది. తాజాగా హాలీవుడ్ హాస్యనటుడు విల్ స్మిత్ పుస్తకం నుంచి ఓ కోట్‌ను షేర్ చేసింది. అందులో.. 'గత 30 ఏళ్లుగా అందరిలాగే నేను కూడా వైఫల్యం, నష్టం, అవమానం, విడాకులు వంటి వాటిని ఫేస్ చేశాను.
నాకు ప్రాణహాని ఉంది. నా డబ్బు పోయింది. నా ప్రైవసీని అతిక్రమించారు. నా కుటుంబం విచ్ఛిన్నమైంది' అంటూ భావోద్వేగ పోస్ట్‌ను షేర్ చేసింది. దీంతో పాటు ప్రతిరోజు ఇటుకను కాంక్రీట్ కలిపి పేర్చాలని మీరు ఏ దారిలో వెళ్తున్నా అక్కడ ఒక ఇటుక పేర్చేందుకు ఉంటుందని.. కానీ ఆ ఇటుకను పేర్చేందుకు నువ్వు లేచి నిలబడాలి అంటూ పేర్కొంది.
మరో పోస్టులో.. కష్టపడి పని చేయండి. మీకు తగిలిన ఎదురుదెబ్బల నుంచి నేర్చుకోండి. మిమ్మల్ని మీరు చూసుకోండి. మిమ్మల్ని మీరు ప్రతి రోజూ ఆవిష్కరించుకోండి అంటూ పేర్కొంది. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విడాకుల తర్వాత సమంత మనసులో ఇంత బాధ ఉందా అంటూ నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment