
Samantha: సమంత-నాగ చైతన్య విడాకుల వ్యవహారం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. మోస్ట్ క్యూటెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట విడిపోవడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. అయితే విడాకుల అనంతరం సమంత షేర్ చేస్తున్న పోస్టులు ఫ్యాన్స్‌లో పలు సందేహాలను రేకెత్తిస్తున్నాయి. ఎంతో చలాకీగా కనిపించే సామ్ విడాకుల ప్రకటనతో కుంగిపోయినట్లు సమాచారం. ఇంత బాధలో ఉన్నప్పటికీ షూటింగ్స్‌లో పాల్గొంటూ తన ప్రొఫెషనల్ వర్క్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. చదవండి: హీరోయిన్ కాజల్ ముఖ్యమైన ప్రకటన..ఇన్‌స్టాలో పోస్ట్
ఈ క్రమంలో సమంత ఎంతో భావేద్వేగంతో సోషల్‌మీడియాలో పోస్టులు పంచుకుంటుంది. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ పిల్ల ఏనుగు దారి తప్పిపోతే అటవీ సిబ్బంది గుర్తించి దాన్ని తల్లి ఏనుగు వద్దకు చేర్చిన వీడియోను సామ్ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. అయితే సామ్‌చై మధ్య తాజా పరిణామాల నేపథ్యంలో సమంత ఏ పోస్ట్ పెట్టినా అది హాట్‌టాపిక్‌గా మారుతుంది. ఇటీవలె సమంత పోస్టుల్లో బలమైన అర్థం ఉందని,ప్రస్తుత పోస్ట్‌ను కూడా అలాగే అన్వయిస్తూ నెటిజన్లు కమెంట్స్ చేస్తున్నారు. చదవండి: మనసులోని బాధను బయటపెట్టిన సమంత.. పోస్ట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment