
Samantha Reaction After Divorce: సమంత-నాగచైతన్య విడిపోతున్నట్లు ప్రకటించడం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. దీంతో నెటిజన్ల చూపు వాళ్లిద్దరి సోషల్ మీడియా అకౌంట్లపై పడింది. భార్యా భర్తలుగా విడిపోతున్నామని ప్రకటించిన చై-సామ్ అందుకు తగ్గ కారణాలను మాత్రం వెల్లడించలేదు. దీంతో ఈ క్యూటెస్ట్ కపుల్ ఎందుకు విడిపోయారో అని ఫ్యాన్స్ కారణాలు వెతికే పనిలో పడ్డారు. చదవండి: నెటిజన్ల ట్రోల్స్: చై-సామ్ విడాకులకు కారణం ఇతడేనా!?
ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సమంత విడాకుల ప్రకటన అనంతరం సైలెంట్ అయిపోయింది. అక్టోబర్2న తమ వివాహ బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించిన అనంతరం సోషల్ మీడియాలో ఇంతవరకు ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. తాజాగా విడాకుల అనంతరం సమంత తొలిసారిగా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించింది. ఫ్లయిట్ విండో నుంచి ఓ వీడియో షేర్ చేస్తూ.. 'ఈ ప్రపంచాన్ని నేను మార్చాలనుకుంటే, ముందు నన్ను నేను మార్చుకోవాలి. మనమే అన్ని పనులు చేసుకోవాలి. షెల్ఫ్‌లో ఉన్న దుమ్ము దులపాలి. మధ్యాహ్నం వరకు నిద్రపోతూ మనం చేయాలనుకుంటున్న లక్ష్యాల గురించి కలలు కనొద్దు.బద్దకం వదిలి ముందుకు నడవాలి' ..అంటూ ఇన్‌స్టా స్టోరీలో చెప్పుకొచ్చొంది.
దీన్ని బట్టి తనకు తానే ఒంటరిగా నిలబడి తన లక్ష్యాలు సాకారం చేసుకునేందుకే సమంత ఈ నిర్ణయాన్ని తీసుకుందా అన్న సందేహాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా తను అనుకుంటున్న లక్ష్యాలు చేరుకునేలా సమంతకు ఆల్‌ది బెస్ట్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. చదవండి: నాగ చైతన్య నుంచి ఒక్క పైసా కూడా వద్దని చెప్పిన సామ్!
Comments
Please login to add a commentAdd a comment