Chaysam Divorce : Samantha Stylist Preetham Jukalkar Instagram Post Viral - Sakshi
Sakshi News home page

ChaySam Divorce:సమంత మేకప్‌ ఆర్టిస్ట్‌, స్టైలిస్ట్‌ ఏమన్నారంటే...

Published Sun, Oct 3 2021 3:15 PM | Last Updated on Mon, Oct 4 2021 10:29 AM

ChaySam Divorce: Samantha Stylist Preetham Jukalkar Insta Post Viral - Sakshi

ChaySam Divorce: టాలీవుడ్‌ మోస్ట్‌ క్యూట్‌ కపుల్‌ సమంత-నాగ చైతన్య విడాకుల వ్యవహారం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించడం అందరినీ షాక్‌కి గురిచేసింది.  అసలు ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అక్కినేని అభిమానులు అస్సలు ఊహించలేదు. కొన్ని రోజులుగా వీరి విడాకుల గురించి వార్తలు వస్తున్నా అవి రూమర్స్‌గానే మిగిలిపోతాయని అభిమానులు భావించారు. కానీ చివరకు ఆ వార్తలనే నిజం చేస్తూ తమ వివాహ బంధానికి స్వస్తి చెప్పారు నాగ చైతన్య-సమంత. చదవండి: నెటిజన్ల ట్రోల్స్‌: చై-సామ్‌ విడాకులకు కారణం ఇతడేనా!?

దీంతో అసలు వీరు విడిపోవడానికి గల కారణాలు ఏంటి? ఎంతో చూడముచ్చటగా ఉండే ఈ జంట ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో సమంత, చైతన్యలతో పాటు వారి సన్నిహితులు, స్నేహితుల సోషల్‌ మీడియాల ఖాతాలపై కూడా నెటిజన్లు ఫోకస్‌ పెట్టారు. ఎవరి వద్ద నుంచి అయినా ఏమైనా క్లూ దొరుకుతుందా అని సెర్చ్‌ చేస్తున్నారు. తాజాగా సమంత పర్సనల్‌ స్టైలిస్ట్‌ ప్రీతమ్‌ జుకల్కర్‌ చేసిన పోస్టులు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి.

‘నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నాసరే అబద్ధాలు, రహస్యాలనేవి అనుబంధాలను తుంచివేస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్న వాళ్లకు ప్రస్తుతం ట్రోలింగ్‌ రూపంలో ఎక్కువ మానసిక వేధింపులకు గురయ్యే అవకాశం ఉంది' అంటూ పోస్ట్‌ చేసిన జుకల్కర్‌.. కొన్ని నిమిషాల్లోనే దానిని డిలీట్‌ చేసేశాడు. అంతకుముందు కూడా ఓ అభ్యంతరకరమైన పదాలతో ఓ పోస్ట్‌ పెట్టి వెంటనే ఆ పోస్ట్‌ను సైతం డిలీట్‌ చేశాడు. మరోవైపు సమంత పర్సనల్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ సాధనా సింగ్‌ సైతం 'డోంట్‌ జడ్జ్‌ ఏ బుక్‌ బై ఇట్స్‌ కవర్‌'( కవర్‌ను చూసి బుక్‌ను జడ్జ్‌ చేయొద్దు)అంటూ ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ పెట్టింది. చదవండి: నాగ చైతన్య నుంచి ఒక్క పైసా కూడా వద్దని చెప్పిన సామ్‌!

ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసింది అన్నదానిపై క్లారిటీ లేదు. మరోవైపు సమంత-నాగ చైతన్య ఎందుకు విడిపోయారంటూ సాధనా, ప్రీతమ్‌లకు ఫ్యాన్స్‌ నుంచి ప్రశ్నల వర్షం కురుస్తుంది. ఏది ఏమైనా సమంత- నాగ చైతన్య విడిపోవడాన్ని అభిమానులే కాక చాలామంది నెటిజన్లు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement