makeup artist
-
ఈ మేకప్ ఆర్టిస్ట్ చాలా కాస్టీ..! రోజుకు ఎంత ఛార్జ్ చేస్తాడో తెలుసా..?
-
ఎర్రటి ఎండ.. అమలాపాల్ కేరవాన్‌లో నుంచి దిగమంది: మేకప్ ఆర్టిస్ట్
హీరోహీరోయిన్లకు కేరవాన్, వానిటీ వ్యాన్లు సర్వసాధారణమైపోయాయి. కొందరైతే వంటకోసం, రిలాక్స్ అవడానికి, వర్కవుట్ చేయడానికి.. ఇలా ఒక్కోదానికి ఒక్కో కేరవాన్ కూడా వాడుతున్నారు. కొన్నిసార్లు నిర్మాణ సంస్థలే వానిటీ వ్యాన్ ఏర్పాటు చేసి పెడతాయి. అయితే స్టార్ సెలబ్రిటీలు ఆ కేరవాన్‌లోకి అవతలివారిని రానివ్వరు. అందులో అమలాపాల్ కూడా ఒకరని తెలుస్తోంది. తాజాగా మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టైలిస్ట్ హేమ ఓ ఇంటర్వ్యూలో అమలాపాల్ వల్ల ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది.ఎర్రటి ఎండలో షూటింగ్ఆమె మాట్లాడుతూ.. 'ఓసారి చెన్నైలో అమలాపాల్‌తో షూటింగ్‌కు వెళ్లాను. ఓ ఫ్రెండ్ ద్వారా ఆమెను కలిశానే తప్ప తనతో నాకసలు పరిచయమే లేదు. ఏప్రిల్, మే నెలలో ఎర్రటి ఎండలో షూటింగ్‌కు వెళ్లేవాళ్లం. మేము వెళ్లిన లొకేషన్లో కాసేపు నీడలో కూర్చుందామంటే ఒక్క చెట్టు కూడా ఉండేది కాదు. అలా వానిటీవ్యాన్లో కూర్చున్నాను.వెళ్లిపోమందిఆ వ్యాన్‌లో రెండు భాగాలుండేవి. ఒక వైపు ఆర్టిస్టులు మరోవైపు టెక్నీషియన్లు కూర్చోవడానికి వీలుండేది. ఓసారి అమలాపాల్ తన మేనేజర్‌ను పిలిచి మమ్మల్ని వానిటీ వ్యాన్‌లో నుంచి బయటకు వెళ్లిపోమని చెప్పింది. మేమంతా ఒకరి ముఖం మరొకరు చూసుకున్నాం. ఇంతటి ఎండలో ఎక్కడికని వెళ్తాం అనుకున్నాం.. కానీ అందులో నుంచి దిగక తప్పలేదు. ఇలాంటివి చాలానే జరిగాయి.మమ్మల్ని లెక్క చేయరుమేకప్ ఆర్టిస్టులు, హెయిర్ స్టైలిస్టు వంటి వారు వ్యాన్‌లోకి రాకూడదని సౌత్ ఇండస్ట్రీలో ఏదైనా రూల్ ఉందేమో మరి! మమ్మల్ని వారసలు లెక్క చేయరు. అలాంటప్పుడు మేమెలా పరిచయం చేసుకుంటాం. టబు వంటి స్టార్స్‌తో కలిసి పని చేశామని ఎలా చెప్పగలం? మా లాంటి వారికోసం టబు వ్యాన్ అంతా బుక్ చేసేది. ఎంతో బాగా చూసుకునేది' అని చెప్పుకొచ్చింది.చదవండి: అట్టర్ ఫ్లాప్ సినిమాలు.. హీరోకు రూ.165 కోట్ల పారితోషికం! -
టీవీ సీరియల్ మేకప్‌మెన్ దారుణ హత్య
రహమత్‌నగర్: రహమత్‌నగర్ డివిజన్ పరిధిలోని నిమ్స్‌మే మైదానంలో మంగళవారం రాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల సమాచారం మేరకు... కార్మిక నగర్ చిల్లా వద్ద పక్కన ఉన్న నిమ్స్‌మే మైదానం లోపల గోడ వద్ద పడివున్న యువకుడి మృతదేహాన్ని గుర్తించిన నిమ్స్‌మే సెక్యూరిటీ సిబ్బంది బుధవారం ఉదయం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఆర్నగర్ ఏసీపీ వెంకటరమణ, బోరబండ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ వీరశేఖర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడు టీవీ సీరియల్స్ మేకప్‌మెన్‌గా పనిచేసే మహబూబ్‌నగర్ వనపర్తి ప్రాంతానికి చెందిన చుక్కా చెన్నయ్య అలియాస్ తరుణ్‌తేజ్(28)గా గుర్తించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు.మారణాయుధాలతో దాడి జరుగున్న క్రమంలో మృతుడు గాయాలతో పరిగెత్తి గోడ వద్ద కుప్పకూలి పోయి ఉంటాడని పోలీసులు అంచనాకు వచ్చారు. ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి మృతుడు చెన్నయ్యతో పాటు ఎంత మంది నిమ్స్ మే మైదానంలోని వచ్చారు? ఎలా వచ్చారు? అనే వివరాలను పోలీసులు అరా తీస్తున్నారు. కార్మిక నగర్, బస్ స్టాప్, కారి్మకనగర్ శ్రీరాంనగర్ ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ మేరకు బోరబండ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి చేసుకున్న నటుడు.. వధువుపై ట్రోలింగ్
పెళ్లి అనేది రెండు మనసులను ఒక్కటి చేసే తంతు. రెండు కుటుంబాలను కలిపే గొప్ప ప్రక్రియ. ఎవరి ఇష్టాయిష్టాలను బట్టి వారు తమ భాగస్వాములను ఎంచుకుంటారు. జీవితాంతం వారితో కలిసి ఉండేందుకు ఇష్టపడతారు. అయితే పెళ్లి చేసుకునేవాళ్లు బాగానే ఉన్నా జనాలు మాత్రం కొన్నిసార్లు ఆ జంటను విమర్శిస్తూ ఉంటారు. దంపతుల్లో ఒకరి ఎత్తు తక్కువైందనో, లావుగా ఉన్నారనో, రంగు లేదనో.. జోడీ బాలేదంటూ నోటికొచ్చింది అనేస్తుంటారు. ప్రియురాలి మెడలో తాళి కట్టిన నటుడు కన్నడ నటుడు విరాట్ విషయంలోనూ అదే జరిగింది. ఒకప్పుడు హీరోగా సినిమాలు చేసిన ఇతడు తర్వాత బుల్లితెరకు షిఫ్ట్ అయ్యాడు. తమిళంలో పలు సీరియల్స్ చేశాడు. అలాగే రియాలిటీ షోలలో పాల్గొంటున్నాడు. ఏప్రిల్ 18న అతడు తన ప్రేయసి నవీన మెడలో మూడుముళ్లు వేశాడు. ఈమె సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్. పలువురు నటీనటుల దగ్గర మేకప్ ఆర్టిస్ట్‌గా పని చేసింది. గురువారంనాడు తమిళనాడులోని మహాబలిపురంలో వీరి వివాహం జరిగింది. పుట్టినింటికి దూరమవుతానన్న బాధతో పెళ్లిపీటలపైనే నూతన వధువు కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో ఆమెను ఓదార్చుతూ నటుడు తనకు ఆప్యాయంగా ముద్దు పెట్టాడు. పెళ్లికూతురిపై ట్రోలింగ్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు విరాట్ పెళ్లి చేసుకున్న అమ్మాయి బాగోలేదని, ఆంటీలా ఉందని సెటైర్లు వేస్తున్నారు. ఇద్దరూ అబ్బాయిల్లాగే ఉన్నారు.. ఆమె గుండమ్మలా ఉందని బాడీ షేమింగ్ చేస్తున్నారు. శుభమా అని పెళ్లి చేసుకున్న కొత్త జంటను ఆశీర్వదించాల్సింది పోయి ఇలా ఎందుకు తిడుతున్నారని నటుడి అభిమానులు మండిపడుతున్నారు. చదవండి: సినిమా కోసం తిరిగి పర్సు ఖాళీ.. అప్పుడు భార్యే..! -
డ్రైఫ్రూట్స్ నగల ధగధగలు
ఫంక్షన్లో పదిమంది దృష్టి పడేలా ప్రత్యేకంగా కనిపించాలనుకోవడం సహజం. మేకప్ ఆర్టిస్ట్ వసుంధర మరింత ప్రత్యేకంగా కనిపించాలని డిసైడై ‘డ్రై ఫ్రూట్స్ జ్యూలరీ’ ధరించింది. యూనిక్ లుక్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో బజ్ క్రియేట్ చేసింది. మాంగ్ టిక్క, గాజులు, జూకాలు, వడ్డాణం... ఇలా అన్నీ డ్రైఫ్రూట్స్‌తో తయారు చేసినవే. ఫంక్షన్ తరువాత డ్రైఫ్రూట్స్‌ను రీయూజ్ చేస్తారా, పారేస్తారా అనేది మాత్రం తెలియదు. ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియో వేలాది లైక్‌లతో వైరల్ అయింది. ‘భలే ఉన్నారు’ అనే ప్రశంసలతో పాటు ‘వేస్టేజ్ ఆఫ్ ఫుడ్’లాంటి కామెంట్స్ కనిపించాయి. -
టీవీ షోలో ఛాన్స్ ఇప్పిస్తానంటూ యువతి మీద లైంగిక దాడి
హైదరాబాద్: మేకప్ ఆర్టిస్ట్‌తో శారీరక వాంఛలు తీర్చుకొని అనంతరం అతని ప్రియురాలితో కలిసి దాడిచేసిన సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... ఏపీలోని వినుకొండ ప్రాంతానికి చెందిన ఓ యువతి మేకప్ ఆర్టిస్ట్ గా కొంతకాలంగా పనిచేస్తూ రహమత్‌నగర్‌లో నివాసం ఉంటుంది. గత ఏడాది తన స్వగ్రామం వినుకొండకు బస్సులో బయలుదేరింది. అదే బస్సులో ప్రయాణిస్తున్న జొన్నలగడ్డ రాజా అనే యువకుడితో పరిచయం అయింది. ఓ టీవీలో వచ్చే కామెడీ ప్రోగ్రాంలో జూనియర్ ఆర్టిస్ట్నని చెప్పారు. తనకు ఇండస్ట్రీలో బాగా పలుకుబడి ఉందని, మేకప్ ఆర్టిస్ట్‌గా అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించాడు. అనంతరం హైదరాబాద్‌కు వచ్చిన ఆమెను శారీరక వాంఛలు తీర్చుకున్నాడు. రూ. 50 వేలు కూడా తీసుకున్నాడు. కొద్దిరోజుల కిందట భాను అనే మహిళ ఆమెకు ఫోన్ చేసి రాజు తన భర్త అని ఎందుకు సంబంధం పెట్టుకున్నావంటూ బెదిరించింది. ఆమెతో మాట్లాడటానికి సికింద్రాబాద్ రమ్మని చెప్పగా ఈ యువతి నమ్మి అక్కడు వెళ్లింది. అక్కడ యువతి ఆధార్ కార్డు, ఫొటోలు తీసుకుని విషయం బయటకు చెబితే చంపుతామని బెదిరించారు. దాంతో తాను మోసపోయానని తెలుసుకుని యువతి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నీతా అంబానీ పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ ఎంత చార్జ్ చేస్తుందో తెలుసా!
సెలబ్రెటీలకు ప్రత్యేకంగా మేకప్ ఆర్టిస్ట్‌లు ఉంటారు. వాళ్లు మేకప్ వేసుకున్నట్లు అనిపించకుండా నేచురల్‌గా ఉండేలా చేయడంలో మంచి నైపుణ్యం ఉన్నవారు. అలాంటి ఆర్టిస్ట్‌లు ఒక్క వ్యక్తికి మేకప్ వేయడానికి ఎంత తీసుకుంటారో వింటే షాకవ్వుతారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్‌లలో ఒకరు నిషా సింగ్. ఆమె ఎంతో మంది బాలీవుడ్ హీరోయిన్ల వద్ద మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. అలాగే కొన్ని బాలీవుడ్ సనిమాలకు మేకప్ ఆర్టిస్ట్‌గా కూడా పనిచేశారు. ఆమె ఓ కల్చర్ సెంటర్(ఎన్ఎంఏసీసీ) ఈవెంట్ హాజరయ్యేందుక వెళ్తున్న నీతాఅంబానికి మేకప్ వేయాల్సి వచ్చింది. మొదట నిషా నీతాకు తన పని నచ్చుతుందా అని సందేహించారు. ఆ ఈవెంట్లో ఆమె బనార్సీ చీరలో అందంగా కనిపించేలా చేశారు. తొలుత నీతా అంబానీకి తానే మేకప్ వేయడానికి వెళ్తున్నానా! అని ఆశ్చర్యం వేసింది, పైగా ఎలా వేస్తానో? అని గాబరా పడిపోయానంటోంది నిషా. అయితే తాను వేసిన మేకప్ నీతా అంబానికీ నచ్చడమే గాక ఆకట్టుకునేలా వేశారని తనని మెచ్చకున్నట్లు చెప్పుకొచ్చారు నిషా. నీతా అంబానీతో కలిసి పనిచేయడం తనకు చాలా సంతోషంగా అనిపించిందని చెప్పుకొచ్చారు నిషా. బీర్సింగ్లో పుట్టిన నిషా ప్రస్తుతం ముంబైలో నివశిస్తున్నారు. ఆమె ఏడేళ్లు మేకప్, హెయిర్ స్ట్రైలింగ్లో మంచి శిక్షణ పొందిన ఆర్టిస్ట్. పైగా గౌరిఖాన్ మీరా రాజ్‌పుత్, కరణ్ జోహార్, కియారా అద్వానీ, రష్మిక మందన్న, జాన్వీ కపూర్, షానాయ కపూర్, సారా అలీఖాన్, వాణి కపూర్, మానుషి చిల్లర్, అతియా శెట్టి, యామీ గౌతమ్ వంటి ప్రసిద్ధ బాలీవుడ్ ప్రముఖులతో కలసి పనిచేశారు. నిషా సింగ్ తల్లి రామ్లఖాన్ సింగ్ టాటా మోటార్స్‌లో ఉద్యోగి కాగా, ఆమె తండ్రి అజయ్ కుమార్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. ఇద్దరూ ఇప్పుడు రిటైరయ్యారు. అంతేగాదు మేకప్ ఆర్టిస్ట్‌గా ధడక్, జగ్ జగ్ జీయో, భూల్ భూలయ్యా 2, పృథ్వీరాజ్ చౌహాన్, ఘోస్ట్ స్టోరీస్ వంటి చలనచిత్రాలకు కూడా పనిచేయడం విశేషం. ఆమెకు సోషల్ మీడియాలోనూ ఎక్కువ మంది ఫాలోయర్లు ఉన్నారు. అంతేగాదు ప్రముఖ సెలబ్రెటీ క్లయింట్లకు సంబంధించిన వీడియోలను కూడా ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేస్తుంటారు. ఇక ఒక్కో క్లయింట్‌కి నిషా సుమారు రూ. 30 వేలకు పైనే చార్జ్ చేస్తుందట. View this post on Instagram A post shared by Nishi Singh (@nishisingh_muah) (చదవండి: తన పెదవులే అందరికంటే పెద్దవిగా ఉండాలని ఏకంగా 26కి పైగా..!) -
పర్ఫెక్ట్ బిజినెస్ లేడీ నీతా అంబానీ బ్యూటీ సీక్రెట్ తెలుసా మీకు!
సాక్షి,ముంబై: ఆసియా బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్‌గా ఆమె తన స్టయిల్, ఫ్యాషన్‌తో అభిమానులను కట్టిపడేస్తారు. (ఇదీ చదవండి: NMACC: నీతా అంబానీ అద్భుతమైన డ్యాన్స్, మీరూ ఫిదా అవ్వాల్సిందే!) ముఖ్యంగా వయసు పెరుగుతున్న కొద్దీ, తనదైన శైలితో ఆకట్టుకోవడం ఆమె ప్రత్యేకత. జ్యుయల్లరీ, హ్యాండ్‌బ్యాగ్‌లు, పాదరక్షలతోపాటు అధునాతన డ్రెస్సింగ్ సెన్స్, మేకప్‌తో తల నుండి కాలి వరకు పర్ఫెక్ట్గా కనిపించేలా లేడీ. ఈ నేపథ్యంలో నీతా అంబానీ బ్యూటీ సీక్రెట్, ప్రతి ఈవెంట్లోనూ అందంతో మెస్మరైజ్ చేసే నీతా అంబానీ వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్ గురించి తెలుసుకుందాం. (లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన సమంత! ధర ఎంతంటే?) ముఖ్యంగా నీతా బ్యూటీ వెనుక ఉన్న పాపులర్ మేకప్ ఆర్టిస్ట్ మిక్కీ కాంట్రాక్టర్ పాత్ర గురించి తెలిస్తే ఔరా అంటారు. పాపులర్ సెలబ్రిటీలకు మేకప్‌మేన్‌గా పనిచేసిన మిక్కీ టోక్యో బ్యూటీ పార్లర్లో పని చేసేవారు. చాలా క్లిష్ట సమయంలో నటి హెలెన్ హెయిర్ డ్రస్సర్‌గా చేస్తూ.. ఆమె సలహా మేరకే చిత్ర పరిశ్రమలో మేకప్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అలా హమ్ అప్కే హై కౌన్, దిల్ టు పాగల్ హై, కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ గమ్, కల్ హో నా హో, మొహబతేం, మై నేమ్ ఈజ్ ఖాన్, కార్తీక్ కాలింగ్ కార్తీక్, డాన్, గుడ్ వంటి బాలీవుడ్ సినిమాలకు మేకప్ మేన్ గా పని చేశారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటీమణుల్లో కరీనా కపూర్, దీపికా పదుకొనే, ఐశ్వర్య రాయ్, అనుష్క శర్మ దాకా మిక్కి క్లయింట్లే కావడం గమనార్హం. కానీ నీతా అంబానీకి మాత్రం మిక్కీ పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్. నీతా అంబానీ కుమార్తె ఇషా అంబానీతో పాటు కోడలు శ్లోకా అంబానీకి కూడా మిక్కీనే మేకప్ వేస్తారు. ముంబైలో తన సేవలకు ఒక్కో వ్యక్తికి రోజుకు లక్షల రూపాయల్లోనే వసూలు చేస్తారు. అంబానీల దగ్గర పనిచేస్తున్న మిక్కీ జీతం పలు కంపెనీల సీఈవోల శాలరీ కంటే ఎక్కువేనట. ఇదే ఇపుడు హాట్‌టాపిక్‌గా నిలుస్తోంది. (శాంసంగ్ 32 అంగుళాల స్మార్ట్‌టీవీ: కేవలం రూ. 5వేలకే) నీతా అంబానీకి తన అందమైన కళ్లను ఆకర్షణీయంగా ఉంచుకోవడం అంటే చాలా ఇష్టం. తన ఐబ్రోస్ ఎపుడూ నీట్ షేప్‌లో ఉండేలా చూసుకుంటారు. ఎప్పుడూ మాస్కరాను మర్చిపోరు. ఒక విధంగా అదే ఆమె సిగ్నేచర్ లుక్. అంతేకాదు నీతా అంబానీ కస్టమైజ్డ్ లిప్‌స్టిక్ కలెక్షన్ చూస్తే దిమ్మతిరగాల్సిందే. బంగారం, వెండితో తయారు చేసిన ఈ లిప్‌స్టిక్ బాటిళ్ల ధర దాదాపు రూ.40 లక్షలకు పైమాటే. కాగా కేవలం గ్లామర్ విషయంలోనే కాదు ముంబై ఇండియన్స్ ఓనర్‌గా, రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్‌పర్సన్‌గా రిలయన్స్ ఇండస్ట్రీస్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ధీరూభాయ్ అంబానీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అధినేతగా నీతా అంబానీ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అంతేనా.. అంబానీ కుటుంబానీకి చెందిన ప్రతీ ఈవెంట్లోనూ నీతా సాంప్రదాయ నృత్య ప్రదర్శన ఉండి తీరాల్సిందే. -
'అవార్డులే అనుకున్నా ఆస్కార్ కూడా కొనేశారు కదరా'
ఆస్కార్ రావడం భారతీయులందరికీ ఎంతో గర్వకారణమైన విషయం. కానీ సౌత్ సినిమాలకు ఈ అవార్డులు రావడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు(ఆర్ఆర్ఆర్) పాటకు, బెస్ట్ షార్ట్ ఫిలిం కేటగిరీలో ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్స్ గెలుచుకున్న సంగతి తెలిసిందే! ఇది జీర్ణించుకోలేకపోయిన కొందరు ఈ రెండు చిత్రాలపై అక్కసు వెల్లగక్కుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మేకప్ ఆర్టిస్ట్, క్లోజ్ ఫ్రెండ్ షాన్ ముట్టతిన్ ఆస్కార్ విజయంపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. 'హహ్హ, ఇది భలే ఉంది. ఇండియాలో ఈజీగా అవార్డులు కొనేస్తారనుకున్నాను కానీ ఏకంగా ఆస్కార్‌ను కూడా కొనేస్తారని ఊహించలేదు. అంతా డబ్బు మహిమ, డబ్బుంటే ఏదైనా సాధ్యమవుతుంది. అది ఆస్కార్ అయినా!' అని ఓ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కింద కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవగా నెటిజన్లు మండిపడుతున్నారు. అతడు ఇలా ఆర్ఆర్ఆర్ను ఆడిపోసుకోవడానికి కారణం లేకపోలేదు. తన స్నేహితురాలు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటించిన 'టెల్ ఇట్ లైక్ ఎ వుమెన్' సినిమాలోని అప్లాజ్ కూడా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్‌కు పోటీపడింది. అయితే ఆ పాటను వెనక్కు నెట్టి నాటునాటుకు అకాడమీ అవార్డు రావడంతో అతడు అసూయ పడుతున్నాడు. అయినా మరీ అంత జెలసీ పనికిరాదని బుద్ధి చెప్తున్నారు నెటిజన్లు. -
మహేశ్ మేకప్ మ్యాన్ ఇంట విషాదం.. స్వయంగా వెళ్లి పరామర్శించిన నమ్రత!
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు-నమ్రత శిరోద్కర్ జంట ఒకటి. ‘వంశీ’, ‘అంజీ’ వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఆమె పెళ్లి ఆనంతరం నటకు గుడ్‌బై చెప్పేసింది. హౌజ్ వైఫ్‌గా పిల్లల బాధ్యత, ఇంటి పనులతో పాటు భర్త మహేశ్ సినిమా, బిజినెస్ వ్యవహరాలను చూసుకుంటుంది. ఇక ఈ క్యూట్ కపుల్ సామాజిక సేవ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏపీలోని ఓ ఆస్పత్రితో కలిసి పేద చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్నారు. చదవండి: అందుకే సినిమాలు చేయడం మానేశా: నటి హేమ ఇప్పటికే వెయ్యి మంది చిన్నారులకు ఈ జంట గుండె ఆపరేషన్ చేయించి అండగా నిలిచారు. అంతేకాదు తరచూ ఫౌండేషన్స్‌కు విరాళాలు ఇస్తుంటారు. సినిమాల విషయంలోనే కాదు సామాజిక సేవలోనూ భర్త వెన్నంటే ఉంటున్న నమ్రత తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇంటి పెద్దను కొల్పోయిన ఓ కుటుంబానికి నమత్ర అండగా నిలిచారు. మహేశ్ పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ తండ్రి శనివారం ఉదయం కన్నుమూశాడు. దీంతో నమ్రత స్వయంగా వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చదవండి: క్యాన్సర్ బారిన ఆటో రామ్ ప్రసాద్? క్లారిటీ ఇచ్చిన నటుడు పట్టాభి అనే మేకప్ ఆర్టిస్ట్ మహేశ్ వద్ద ఎంతోకాలంగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయనకు మహేశ్ బాబు ఫ్యామిలీతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం పట్టాభి తండ్రి అకాల మరణం చెందాడు. ఈ వార్త తెలుసుకున్న మహేశ్ భార్య నమ్రత స్వయంగా వెళ్లి అతడి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నివాళులు అర్పించారు. అయితే మహేశ్ ప్రస్తుతం స్పెయిన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. pic.twitter.com/WlTBEYQJrV — P.SrinivasaRaju (@srinusrkr) February 11, 2023 మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి. పర్సనల్ మేకప్ మెన్ పట్టాభి సార్ గారి. వాళ్ళ నాన్నగారు స్వర్గస్తులైనారు వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని. కోరుకుంటున్నాను🙏 ఆ భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తూ🙏 pic.twitter.com/lAOKJBf8WJ — P.SrinivasaRaju (@srinusrkr) February 11, 2023 -
వైరల్ వీడియో: చేతల్లో చూపించగలగేవాడికి చేతులతో పని ఏమి?
-
చేతల్లో చూపించగలగేవాడికి చేతులతో పని ఏమి ?
చాలామంది అన్ని సక్రమంగా ఉన్న నేను ఆ పని చేయలేను, నా వల్ల కాదు అంటూ రకరకాలుగా చెబుతుంటారు. అంతెందుకు పరిస్థితులు అన్ని బాగున్నప్పటికీ ఏవేవో సాకులతో కాలక్షేపం చేసేస్తుంటారు. ఇక్కొడక వ్యక్తి పుట్టుకతో అవయవాలు ఏమి సరిగా లేవు అయినా చక్కగా మేకప్ వేసుకోగలడు. (చదవండి: వ్యాక్సిన్ వేయించుకుంది ...రూ 7.4 కోట్లు గెలుచుకుంది) అసలు విషయంలోకెళ్లితే....గేబ్ ఆడమ్స్-వీట్లీ అనే వ్యక్తి హన్ హార్ట్ సిండ్రోమ్ అనే పుట్టుకతో వచ్చే వ్యాధితో జన్మించాడు. దీంతో అతని తల్లిదండ్రులు పుట్టిన వెంటనే బ్రెజిల్ ఆసుపత్రిలోనే వదిలి వెళ్లిపోయారు. ఇది అవయవాలపై ప్రభావం చూపే అరుదైన వ్యాధి. ఈ సిండ్రోమ్ కారణంగా అతనికి దవడ, నాలుక, చేతులు, కాళ్లు పూర్తిగా ఏర్పడలేదు. అంతే కాదు తొమ్మది నెలల వయసులో ఉన్న గేబ్ని ఉటాకు చెందిన ఒక కుటుంబం దతత్త తీసుకుంది. దీంతో అతని జీవితం ఊహించని మలుపు తిరిగింది. అతని దత్తత తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో తాను శిశువులా ఉండిపోకూడదని అన్ని నేర్చుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు అతను ప్రముఖ టీవీ షో 'యుఫోరియా ప్రేరణతో తన ముఖానికి తాను చక్కగా మేకప్ వేసుకుంటాడు. అంతేకాదు అతని మేకప్ కళకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడమే కాకా కాళ్లు, చేతులు లేకపోవడంతో తాను రోజువారీ పనులు చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడో కూడా వివరిస్తుంటాడు. అయితే ప్రస్తుతం గేబ్కి మేకప్ కళకు సంబంధించి వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పైగా ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: అక్తర్‌కు పరువు నష్టం నోటీస్.. భజ్జీతో కనిపించినందుకే!) -
నాగ చైతన్య రియాక్ట్ అవుతాడనుకున్నా : సమంత స్టైలిస్ట్
Samantha's stylist Preetham Jukalker Comments On Affair Rumours With Sam: టాలీవుడ్ క్యూటెస్ట్ కపుల్ నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. మేము విడిపోతున్నామంటూ అక్టోబర్ 2 ఈ స్టార్ జంట అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వారిద్దరూ విడిపోవడానికి కారణాలను మాత్రం వెల్లడించలేదు. దీంతో సోషల్ మీడియాలో వీరి విడాకుల విషయం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో చై-సామ్ విడిపోవడానికి కారణాలు ఏముంటాయనే దానిపై విశ్లేషిస్తూ పలువురు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. చదవండి: ChaySam Divorce: చై-సామ్ విడిపోవడానికి గల కారణాన్ని ఆమె స్టైలిష్ట్ ఇలా బయట పెట్టాడా? ఈ క్రమంలో చై-సామ్ విడిపోవడానికి సమంత స్టైలిష్ట్ ప్రీతమ్ జుకల్కర్ వల్ల వీరిమధ్య మనస్పర్థలు వచ్చాయని, సమంత, ప్రీతమ్ చాలా సన్నిహితంగా ఉండటమే విడాకులకు దారి తీసిందంటూ కొందరూ కామెంట్ చేశారు. దీంతో ప్రీతమ్‌ను నెటిజన్లు దాడి చేయడం ప్రారంభించారు. అంతేగాక ఏకంగా కొందరూ సమంతకు ప్రీతమ్‌తో ఎఫైర్, అబార్షన్ చేసుకుందంటూ ఊహాగాన ఆరోపణలు కూడా చేశారు. దీంతో ఈ కామెంట్స్ కాస్తా వార్తల్లో నిలిచాయి. ఇప్పటికే తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ సమంత స్పందించిన వాటిని ఖండిచింది. తాజాగా దీనిపై ఆమె స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ కూడా స్పందించాడు. ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై, సమంతపై వస్తున్న రూమార్లపై పెదవి విప్పాడు. చదవండి: ChaySam: అఫైర్స్, అబార్షన్ వార్తలపై స్పందించిన సమంత ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘నేను సమంతను అక్క అని పిలుస్తాను. చాలా మందికి అది తెలుసు. అలాంటిది మా మధ్య ఎఫైర్ ఎందుకు ఉంటుంది. ఐ లవ్యూ అని సోషల్ మీడియాలో ఎందుకు కామెంట్ చేశావని చాలా మంది అడుగుతున్నారు. కుటుంబ సభ్యులకు, సోదరిగా భావించే వారికి ఐ లవ్యూ చెప్పడం తప్పెలా అవుతుంది. ఎంతో మంది నన్ను ఆసభ్య పదజాలంతో తిడుతూ మెసేజ్‌లు చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు. నా కెరీర్‌ను నాశనం చేస్తామని హెచ్చరిస్తున్నారు. బతికుండగానే మా అమ్మ చనిపోయిందని కొన్ని వెబ్సైట్లు రాస్తున్నాయి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. చదవండి: సమంత లేటెస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్: భావోద్వేగంతో ఇలా.. అంతేగాక ‘నాగచైతన్య నాకు ఎన్నో ఏళ్లుగా తెలుసు. సమంతకు, నాకు మధ్య ఉన్న అనుబంధం గురించి ఆయనకు స్పష్టంగా తెలుసు. నాకు, సమంతకు ఎఫైర్ ఉందని వస్తున్న కామెంట్ల గురించి నాగచైతన్య స్పందించకపోవడం చాలా బాధ కలిగిస్తోంది. ఆయన ఒక్క స్టేట్మెంట్ ఇస్తే పరిస్థితిలో చాలా మార్పు వస్తుంది. ఫ్యాన్స్ పేరుతో కామెంట్లు చేస్తున్న వారిని అదుపులో పెట్టేందుకు నాగచైతన్య కచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి. ప్రస్తుతం సమంత విషాదంలో ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆమెకు కచ్చితంగా మద్దతుగా ఉంటా. ఇలాంటి ట్రోలింగ్‌కు నేను భయపడను’ అంటూ ప్రీతమ్ చెప్పుకొచ్చాడు. -
చై-సామ్ కాపురంలో చిచ్చు: 'అక్కా అని పిలిచే వ్యక్తితో'..
Chaysam Divorce: సమంత-నాగ చైతన్య విడాకుల వ్యవహారం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఎంతో చూడముచ్చటైన ఈ జంట విడిపోవడాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. పదేళ్ల పరిచయం.. ఏడేళ్ల ప్రేమ.. మూడేళ్ల వివాహ బంధానికి స్వస్తి చెబుతూ అక్టోబర్2న సామ్-చై ఇక భార్యభర్తలుగా కొనసాగలేమంటూ ప్రకటించారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఇలా విడిపోతారని కలలో కూడా అనుకోలేదు అంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విడాకులకు అంత బలమైన కారణాలు ఏమై ఉంటాయా అని పలువురు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ కూడా ఓ కారణమే అంటూ పలువురూ అతడిని నిందిస్తున్నారు. సమంతతో ఉన్న పాత ఫొటోలను షేర్ చేస్తూ సామ్-చై కాపురంలో చిచ్చుపెట్టావ్ అంటూ ప్రీతమ్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దీనిపై సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ స్పందించింది. చదవండి: నెటిజన్ల ట్రోల్స్: చై-సామ్ విడాకులకు కారణం ఇతడేనా!? సమంత-ప్రీతమ్‌కు మధ్య ఉన్న బంధాన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. నిజానికి ప్రీతమ్..సమంతను అక్కా(జీజీ)అని పిలుస్తాడు. జీజీ అంటే అర్థం తెలుసు కదా..అంటూ ఘాటుగా బుదులిచ్చింది. ఆ దేవుడు నాకు తెలివిని ప్రసాదించాడు. దీన్ని కొందరు తెలివిలేని వాళ్లకు పంచుదామని అంటూ ఇన్‌స్టా స్టోరీలో చెప్పుకొచ్చింది. చదవండి: విడాకుల ఎఫెక్ట్: షూటింగ్లో కన్నీళ్లు పెట్టుకున్న సమంత -
చై-సామ్ విడిపోవడానికి గల కారణాన్ని ప్రీతమ్ ఇలా బయట పెట్టాడా?
Naga Chaitanya And Samntha Divorce Reasons: టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్ సమంత-నాగ చైతన్య విడాకుల వ్యవహారం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించడం అందరినీ షాక్‌కి గురిచేసింది. ఇలాంటి వార్త ఒకటి వినాల్సి వస్తుందని అక్కినేని అభిమానులు అస్సలు ఊహించి ఉండరు. కొన్ని రోజులుగా వీరి విడాకుల గురించి వార్తలు వస్తున్నా అవి రూమర్స్‌గానే మిగిలిపోతాయని అభిమానులు భావించారు. కానీ చివరకు ఆ వార్తలనే నిజం చేస్తూ తమ వివాహ బంధానికి స్వస్తి చెప్పారు నాగ చైతన్య-సమంత. చదవండి: నెటిజన్ల ట్రోల్స్: చై-సామ్ విడాకులకు కారణం ఇతడేనా!? ఈ క్రమంలో వారి విడిపోవడానికి కారణాలేంటని అందరూ ఆలోచించడం మొదలు పెట్టారు. ఇందులో సమంత కొంతకాలం షేర్ చేస్తున్న గ్లామర్ ఫొటోలు, ప్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్, సూపర్ డీలక్స్‌ల సినిమాల్లో ఆమె నటించిన బోల్డ్ సీన్స్ ప్రధాన కారణం అంటున్నారు. జీవితాన్నే ప్రభావం చేసే ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం వెనకా ఇంకా ఏదైనా బలమైన కారణాలు బయటకు వస్తాయోమో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో సమంత పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ చేసిన పోస్టులు చర్చనీయాంశం మారాయి. వీరి విడాకులు ప్రకటన అనంతరం అతడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు, ఇన్స్టాగ్రామ్ స్టోరీలు చర్చకు దారి తీశాయి. అంతేగాక వెంటనే వాటిని డిలీట్ చేయడంతో ఇవి కాస్తా వార్తల్లో నిలిచాయి. పేర్లు ప్రస్తావించకపోయినా.. సమంతకు ఏదో అన్యాయం జరిగిందన్నట్లుగా అతడి డిలీటెడ్ పోస్టులు సూచించాయి. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రీతమ్ జుకల్కర్ తొలగించిన ఓ పోస్టు చై-సామ్ విడాకులకు అసలు కారణాన్ని వెల్లడించాడా? అని అందరూ ఇప్పుడు చర్చించుకుంఉటన్నారు. సమంత మానసిక ఒత్తిడి, వేధింపుల కారణంగానే విడాకులకు దారి తీసిందా అనే అనుమానాలు తలెత్తెలా అతవి డిలీటెడ్ పోస్ట్ ఉంది. చదవండి: సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనైన సమంత, పోస్ట్ వైరల్ అలాగే ‘సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్న వాళ్లకు ప్రస్తుతం ట్రోలింగ్ రూపంలో ఎక్కువ మానసిక వేధింపులకు గురయ్యే అవకాశం ఉంది’ అంటూ పోస్ట్ చేసిన జుకల్కర్.. కొన్ని నిమిషాల్లోనే దానిని డిలీట్ చేసేశారు. మరి ఇవి ఎవరిని ఉద్దేశించి జుకల్కర్ చేశాడో తెలియదు గానీ.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు చై-సామ్ విడిపోవడానికి ఇతడే కారణమంటూ పలువురు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అతడిని వేధిస్తుంటే.. సైబర్ క్రైం పోలీసులను ట్యాగ్ చేస్తూ జుకల్కర్ వారి అకౌంట్లకు సంబంధించిన ఫోటోలను తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. #Samantha Stylist #Jukalker Deleted Post... pic.twitter.com/z0hEwWPGDY — telugufunworld (@telugufunworld) October 5, 2021 -
హాట్ టాపిక్‌గా మారిన సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ పోస్టులు
ChaySam Divorce: టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్ సమంత-నాగ చైతన్య విడాకుల వ్యవహారం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించడం అందరినీ షాక్‌కి గురిచేసింది. అసలు ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అక్కినేని అభిమానులు అస్సలు ఊహించలేదు. కొన్ని రోజులుగా వీరి విడాకుల గురించి వార్తలు వస్తున్నా అవి రూమర్స్‌గానే మిగిలిపోతాయని అభిమానులు భావించారు. కానీ చివరకు ఆ వార్తలనే నిజం చేస్తూ తమ వివాహ బంధానికి స్వస్తి చెప్పారు నాగ చైతన్య-సమంత. చదవండి: నెటిజన్ల ట్రోల్స్: చై-సామ్ విడాకులకు కారణం ఇతడేనా!? దీంతో అసలు వీరు విడిపోవడానికి గల కారణాలు ఏంటి? ఎంతో చూడముచ్చటగా ఉండే ఈ జంట ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో సమంత, చైతన్యలతో పాటు వారి సన్నిహితులు, స్నేహితుల సోషల్ మీడియాల ఖాతాలపై కూడా నెటిజన్లు ఫోకస్ పెట్టారు. ఎవరి వద్ద నుంచి అయినా ఏమైనా క్లూ దొరుకుతుందా అని సెర్చ్ చేస్తున్నారు. తాజాగా సమంత పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ చేసిన పోస్టులు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ‘నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నాసరే అబద్ధాలు, రహస్యాలనేవి అనుబంధాలను తుంచివేస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్న వాళ్లకు ప్రస్తుతం ట్రోలింగ్ రూపంలో ఎక్కువ మానసిక వేధింపులకు గురయ్యే అవకాశం ఉంది' అంటూ పోస్ట్ చేసిన జుకల్కర్.. కొన్ని నిమిషాల్లోనే దానిని డిలీట్ చేసేశాడు. అంతకుముందు కూడా ఓ అభ్యంతరకరమైన పదాలతో ఓ పోస్ట్ పెట్టి వెంటనే ఆ పోస్ట్‌ను సైతం డిలీట్ చేశాడు. మరోవైపు సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ సైతం 'డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్'( కవర్‌ను చూసి బుక్‌ను జడ్జ్ చేయొద్దు)అంటూ ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ పెట్టింది. చదవండి: నాగ చైతన్య నుంచి ఒక్క పైసా కూడా వద్దని చెప్పిన సామ్! ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసింది అన్నదానిపై క్లారిటీ లేదు. మరోవైపు సమంత-నాగ చైతన్య ఎందుకు విడిపోయారంటూ సాధనా, ప్రీతమ్‌లకు ఫ్యాన్స్ నుంచి ప్రశ్నల వర్షం కురుస్తుంది. ఏది ఏమైనా సమంత- నాగ చైతన్య విడిపోవడాన్ని అభిమానులే కాక చాలామంది నెటిజన్లు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. -
నటి సహాయకురాలు మోసంతో మొదలైన డ్రామా
సాక్షి, సిటీబ్యూరో: నల్లకుంటకు చెందిన బిల్డర్ వెంకటేశం సినిమా తీయడం కోసం బెంగళూరు హీరోయిన్ని బుక్ చేసుకోవాలని ప్రయత్నించారు. ఓ మధ్యవర్తిని, ఆ నటి సహాయకురాలిని నమ్మి రూ.13.5 లక్షలకు మోసపోయాడు. దీన్ని రికవరీ చేయాల్సిన బాధ్యతల్ని బంజారాహిల్స్‌కు చెందిన మేకప్ ఆర్టిస్ట్ అమర్నాథ్రెడ్డికి అప్పగించాడు. చెన్నైకి చెందిన వారి ద్వారా రూ.10 లక్షలు వసూలు చేశాడు అమర్నాథ రెడ్డి. అందులో వారికి రూ.4 లక్షలు ఇవ్వాల్సి ఉండగా.. అమర్నాథ్ రెడ్డి చెన్నై వాళ్లనూ మోసం చేశాడు. దాంతో ఈ డబ్బు రికవరీ కోసమే వచ్చిన నిందితులు అమర్నాథ్ రెడ్డిని కిడ్నాప్ చేశారు. ఈ కేసును బంజారాహిల్స్ పోలీసులు 10 గంటల్లోనే ఛేదించినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం వెల్లడించారు. శ్రీనగర్‌కాలనీలో నివసించే కె.అమర్నాథ్ రెడ్డి సినీ రంగంలో మేకప్ ఆర్టిస్ట్, క్యాస్టింగ్ కోచ్, ప్రొడక్షన్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు మాదాపూర్‌లోని కావూరిహిల్స్‌లో కార్యాలయం ఉంది. ప్రతిరోజూ ఉదయం వెళ్లే ఆయన రాత్రి తిరిగి వస్తుంటారు. నల్లకుంట ప్రాంతానికి చెందిన ఎస్వీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ యజమాని పి.వెంకటేశం ఓ చిత్రాన్ని నిర్మించాలని భావించారు. బెంగళూరుకు చెందిన నటిని ఇందులో హీరోయిన్గా బుక్ చేసుకోవడానికి జునైద్ అనే వ్యక్తిని సంప్రదించారు. ఇతగాడు ఆ నటి సహాయకురాలు అనుతో కలిసి వెంకటేశంను మోసం చేయాలని పథకం వేశాడు. గతేడాది అడ్వాన్సుగా రూ.13.5 లక్షలు తీసుకుని వెంకటేశంను బెంగళూరుకు పిలిపించారు. అక్కడ ఇతడిని ఓ హోటల్లో ఉంచి వాళ్లిద్దరూ డబ్బుతో ఉడాయించారు. ఈ సొమ్ము వసూలు చేసి పెట్టాల్సిందిగా వెంకటేశం తన స్నేహితుడైన అమర్నాథ్రెడ్డిని కోరారు. దీనికి అంగీకరించిన ఈయన చెన్నైకి చెందిన న్యాయవాది కుమారగురుకు విషయం చెప్పారు. ఆయన సహాయంతో బెంగళూరులోని హైరోడ్ పోలీసుస్టేషన్లో అను, జునైద్లపై ఫిర్యాదు చేశారు. వీరిపై మోసం కేసు నమోదు చేసిన అక్కడి పోలీసులు రూ.10 లక్షలు రికవరీ చేసి కోర్టులో డిపాజిట్ చేశారు. డబ్బు రికవరీ చేయిస్తే రూ.4 లక్షలు చెల్లించాలని అమర్నాథ్రెడ్డి-కుమార గురు మధ్య ముందే ఒప్పందం కుదిరింది. అయితే కోర్టు నుంచి ఈ డబ్బు తీసుకున్న అమర్నాథ్ రెడ్డి కుమార గురుకు ఇవ్వలేదు. ఈ విషయాన్ని కుమార గురు తన స్నేహితులైన చెన్నై వాసులు ప్రదీప్ నటరాజన్, పాలూరు లోకేష్ కుమార్, ఎస్.జగదీష్, పీకే గణేష్ కుమార్‌కు చెప్పాడు. వాళ్లు కూడా అమర్నాథ్రెడ్డిని ఫోన్లో సంప్రదించడానికి ప్రయత్నించినా స్పందన లేదు. దీంతో హైదరాబాద్ వెళ్లి అమర్నాథ్రెడ్డిని కిడ్నాప్ చేసి తమకు రావాల్సిన డబ్బు వసూలు చేద్దామని ప్రదీప్ పథకం వేశాడు. గురువారం ఉదయం ఈ ఐదుగురితో పాటు ప్రదీప్ గర్ల్‌ఫ్రెండ్ కీర్తన కూడా కారులో నగరానికి వచ్చింది. వీళ్లంతా వనస్థలిపురంలోని హరణి వనస్థలి పార్క్‌లో ఉన్న గెస్ట్‌హౌస్‌లో బస చేశారు. అక్కడ నుంచి మాదాపూర్‌లోని కావూరీ హిల్స్‌కు వెళ్లిన నిందితులు కీర్తన ద్వారా అమర్నాథ్రెడ్డిని ట్రాప్ చేశారు. అర్జంట్ పని ఉందని, కలవాలంటూ సందేశం పంపిన కీర్తన తన లైవ్ లోకేషన్‌ను పంపింది. ఆమెను కలవడానికి అక్కడకు వెళ్లిన అమర్నాథ్ రెడ్డిని నిందితులు పట్టుకుని ఆయన కారులోనే వనస్థలిపురంలోని గెస్ట్‌హౌస్‌కు తీసుకువెళ్లారు. అక్కడ ఆయన బట్టలు విప్పి కిడ్నాపర్లు వీడియో చిత్రీకరించారు. బయటకు వెళ్లాక తమపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఈ క్లిప్పుల్ని సోషల్‌మీడియాలో పెడతామంటూ బెదిరించారు. ఆపై ప్రదీప్ ఫోన్ నుంచి అమర్నాథ్ రెడ్డి భార్య కల్పనకు ఫోన్ చేయించి రూ.4 లక్షలు ప్రదీప్ ఖాతాలో డిపాజిట్ చేయాలని చెప్పించారు. తనను ఏడుగురు గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని, వారు చెప్పినట్లు చేయకపోతే చంపేస్తారంటూ అమర్నాథ్రెడ్డి చెప్పడంతో ఆందోళనకు గురైన కల్పన గురువారం మధ్యాహ్నం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. కిడ్నాపర్లను ట్రాప్ చేసి పట్టుకోవాలని నిర్ణయించుకున్న పోలీసులు ఆ మొత్తాన్ని వాళ్లే సిద్ధం చేశారు. డబ్బు ఫొటోలను కల్పన ఫోన్ నుంచి వాట్సాప్ ద్వారా ప్రదీప్‌కు పంపి, తీసుకోవడానికి శ్రీనగర్ కాలనీకి రమ్మని చెప్పారు. అక్కడ కాపు కాసిన పోలీసులు సాయంత్రం 6.30 గంటలకు అమర్నాథ్రెడ్డి కారులో వచ్చిన ప్రదీప్, కుమార గురు, లోకేష్‌లను గుర్తించారు. ఈ విషయం గుర్తించిన కిడ్నాపర్లలో ఇద్దరు పారిపోగా.. లోకేష్ చిక్కాడు. ఇతడిని విచారించిన అధికారులు దుండగులు వనస్థలిపురంలో బస చేసినట్లు తెలుసుకున్నారు. ఈ లోపు అప్రమత్తమైన నిందితులు అమర్నాథ్రెడ్డిని తీసుకుని తమ కారులో చెన్నైకు బయలుదేరారు. వెళ్తూ ఈ విషయాన్ని కల్పనకు ఫోన్ ద్వారా చెప్పి తక్షణం రూ.4 లక్షలు చెల్లించకుంటే అమర్నాథ్రెడ్డిని చంపేస్తామన్నారు. వ్యూహాత్మకంగా వ్యవహరించిన పోలీసులు నిందితుల కదలికల్ని సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా గుర్తించారు. వీళ్లు నల్లగొండ జిల్లాలోని మాడుగులపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ అధికారులు తమిళనాడు రిజిస్ట్రేషన్‌తో కారులో వెళ్తున్న కుమార గురు, జగదీష్, గణేష్‌లను రాత్రి 11 గంటలకు పట్టుకున్నారు. అప్పటికే ప్రదీప్, కీర్తన వీరి నుంచి వేరు పడి బస్సులో పరారయ్యారని గుర్తించారు. ఆ కారులో ఉన్న అమర్నాథ్రెడ్డిని రెస్క్యూ చేశారు. నిందుతుల్ని సిటీకి తరలించిన పోలీసులు అనంతరం వారిని అరెస్టు చేశారు. వీరి నుంచి కారు తదితరాలు స్వాధీనం చేసుకుని పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. -
సినీ పరిశ్రమలో విషాదం : క్రిస్మస్ స్టార్ కడుతూ
సాక్షి,కొచ్చి: ప్రముఖ మేకప్ మ్యాన్, మలయాళ హీరో నివిన్ పాలీ వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్ దుర్మరణం ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. నివిన్ పర్సనల్ మేకప్‌మేన్ షాబు పుల్పల్లి (37) ప్రమాదవశాత్తూ ఆదివారం కన్నుముశారు. క్రిస్మస్ స్టార్‌ను వేలాడదీసేందుకు చెట్టు ఎక్కిన షాబు అకస్మాత్తుగా అదుపు తప్పి కిందపడిపోయారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించి నప్పటికీ షాబూని రక్షించలేకపోయామని ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఫెఫ్కా) డైరెక్టర్స్ యూనియన్ ఫేస్బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. షాబు అకాల మరణం తీరని లోటంటూ హీరో దుల్కర్ సల్మాన్ సంతాపం తెలిపారు. బెంగుళూరు డేస్ , విక్రమాదిత్యన్ మూవీల్లో ఆయనతో కలిసి పనిచేశానంటూ ఆయన జ్ఞాపకాలనుగుర్తుచేసుకున్నారు. ఇంకా నటుడు ఉన్ని ముకుందన్, దర్శకుడు బోబన్ శామ్యూల్ మలయాళ మూవీ అండ్ మ్యూజిక్ డేటాబేస్ (ఎం 3 డిబి) కూడా షాబూకి సంతాపాన్ని ప్రకటించాయి. వీరితోపాటు మలయాళ నటీ నటులు, ఇతర పరిశ్రమ పెద్దలు ఆయన మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాగా 2012 లో ‘పుతియా తీరంగల్’ చిత్రంతో నివిన్పాలీతో షాబు జర్నీ ప్రారంభమైంది. పరిశ్రమలో తనదైన ముద్రతో మంచి పేరు సంపాదించుకున్నారు. షాబు ప్రసిద్ధ మేకప్ ఆర్టిస్ట్ షాజీ పుల్పల్లి సోదరుడు. షాబుకి భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
‘హెల్ బాయ్’, ‘ప్రిడేటర్’ సృష్టికర్త మృతి
హెల్ బాయ్, ద నట్టీ ప్రొఫెసర్, ప్రిడేటర్ లాంటి ఎన్నో అద్భుతమైన పాత్రలను వెండితెర మీద ఆవిష్కరించిన గ్రేట్ మేకప్ ఆర్టిస్ట్, క్రీచర్ క్రియేటర్ మాట్ రోజ్ మృతి చెందారు. ఎన్నో వింత పాత్రలకు రూపమిచ్చిన మాట్ మృతి పట్ల హాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో కలిసి పనిచేసిన అనుభవాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ‘మేకప్ ఆర్టిస్ట్‌ల స్వర్ణయుగంలో ఆయన ఓ అద్భుతం. అందరితో స్నేహంగా ప్రేమగా ఉండే వ్యక్తి’ అంటూ ఆయన సన్నిహితులు గుర్తు చేసుకున్నారు. -
గిఫ్ట్ అదుర్స్
బీటౌన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కొత్త కారు కొన్నారు. ఇక ముంబై వీధుల్లో రయ్ మంటూ జాక్వెలిన్ దూసుకెళ్లడమే తర్వాయి అనుకుంటున్నారా! ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆమె కారు కొన్నది తన కోసం కాదు. తన మేకప్ ఆర్టిస్టు షాన్ ముల్తైల్ కోసం. అసలు మేటర్ ఏంటంటే.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ దగ్గర షాన్ కొన్నేళ్లుగా మేకప్ ఆర్టిస్ట్‌గా వర్క్ చేస్తున్నారు. రీసెంట్గా తన బర్త్‌డే. ఈ సందర్భంగా జాక్వెలిన్ ఓ ఖరీదైన కారును షాన్‌కు బహుమతిగా ఇచ్చారు. ఈ సడెన్ గిఫ్ట్ చూసి షాన్ షాకయ్యారట. ‘‘జాక్వెలిన్.. మీరు నిజంగా నన్ను సర్ప్రైజ్ చేశారు. మీరు కారు దగ్గరికి వెళ్తుండగా వీడియో తీయమని అడిగినప్పుడు అది నా కోసమేనని ఏ మాత్రం ఊహించలేదు.. థ్యాక్యూ’’ అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయాడట షాన్. ఈ సంగతి ఇలా ఉంచితే... ప్రస్తుతం జాక్వెలిన్ ‘రేస్3, డ్రైవ్’ సినిమాల్లో నటిస్తున్నారు. రెమో డిసౌజా దర్వకత్వంలో సల్మాన్‌ఖాన్ హీరోగా నటిస్తున్న ‘రేస్ 3’ చిత్రం ఈ ఏడాది రంజాన్‌కు రిలీజ్ కానుంది. -
జూనియర్ ఎన్టీఆర్ కోసం ప్రఖ్యాత మేకప్ ఆర్టిస్ట్
చెన్నై: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో ప్రఖ్యాత మేకప్ ఆర్టిస్ట్ పనిచేయనున్నారు. లార్డ్ ఆఫ్ రింగ్స్, షట్టర్ ఐలాండ్ వంటి చిత్రాలకు మేకప్ ఆర్టిస్టుగా పనిచేసిన వాన్స్ హార్ట్వెల్ ఎన్టీఆర్‌కు మేకప్ మేన్‌గా పనిచేయనున్నట్లు సమాచారం. లాస్ఏంజెల్స్ నుంచి వచ్చిన మేకప్ ఆర్టిస్ట్ వాన్స్ హార్ట్వెల్ శనివారం చెన్నైలో జూనియర్ ఎన్టీఆర్‌తో గంటసేపు చర్చలు జరిపారు. బాబీ దర్శకుడిగా ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నెలాఖరులో ఎన్టీఆర్ కూడా షూటింగ్లో పాల్గొంటారని, మార్చిలో మేకప్ ఆర్టిస్ట్ హార్ట్వెల్ వస్తారని చిత్ర వర్గాలు తెలిపాయి. మూడు రకాల గెటప్‌తో ఎన్టీఆర్ ఈ సినిమాలో పూర్తి వెరైటీ లుక్‌తో ఉంటారని చెబుతున్నారు. ఈ సినిమాలో రాశీఖన్నా ఓ హీరోయిన్గా కాగా మరో హీరోయిన్ నూ ఇంకా నిర్ణయించాల్సి ఉందని సమాచారం. -
'హాలోవీన్' కోసం మూతిని కుట్టేసుకుంది!
ఏదైనా హర్రర్ సినిమాలో సూది దారం తీసుకొని నోటిని కుట్టేసుకున్న దృశ్యాన్ని చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది నిజంగానే మూతి కుట్టేసుకొని కనిపిస్తే భయపడిపోరు! పాశ్చాత్య దేశాల్లో ఈ నెల 31న నిర్వహించే 'హాలోవిన్' పార్టీ కోసం మూతిని సూదిదారంతో ఎలా కుట్టేసుకోవాలో ఇంటర్నెట్ వేదికగా వివరించింది 'ప్రామిస్' అనే మేకప్ ఆర్టిస్ట్. ప్రామిస్ అసలు పేరు ప్రతిగ్యా తమంగ్. నేపాల్‌లో పుట్టిన ఆమె ప్రస్తుతం అమెరికాలో నివాసముంటున్నది. 'మానవ ఊసరవెల్లి'గా పేరొందిన ఈ అమ్మడికి యూట్యూబ్‌లో పెద్దసంఖ్యలోనే ఫ్యాన్స్ ఉన్నారు. యూట్యూబ్‌లో ఆమెకు 40 లక్షలమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వారికి ఈమె చిత్రవిచిత్రంగా ఆన్లైన్ పాఠాలు చెప్తుంది. తాజాగా ప్రతిగ్యా మూతిని సూది దారంతో ఎలా కుట్టేసుకోవాలో ట్యూషన్ చెప్పింది. ఆమెకు పిచ్చికాకపోతే ఎవరైనా చూస్తూ చూస్తూ మూతిని కుట్టేసుకుంటారా? అనుకోకండి. ఆమె కేవలం మూతిని కుట్టేసుకున్నట్టు ఎలా కనిపించాలో వివరించిందంతే. నోటిని కుట్టేసుకున్నట్టు దారాన్ని రెండు పెదవుల అంచులకు అంతకించుకొని.. సూది గుచ్చినట్టు ఎర్రని చుక్కలు పెట్టి నోటిని కుట్టేసుకున్నట్టు కనిపించవచ్చునని వివరించింది. ఈ వీడియోను యూట్యూబ్‌లో ఇప్పటివరకు 30 లక్షలమంది చూశారు. -
అందానికి నేస్తానివై..
బ్రహ్మ మనసు పెట్టి చేసిన బొమ్మయినా.. రవివర్మ గీసిన వదనమైనా.. మరింత అందంగా కనిపించాలంటే కాసింతైనా మేకప్ కావాల్సిందే. అందుకే కాలేజీ అమ్మాయిలంతా హిమాలయ ప్యూర్ స్కిన్ ఫేషియల్ వర్క్‌షాప్‌నకు క్యూ కట్టారు. ప్రఖ్యాత సౌందర్య నిపుణురాలు తమన్నా రూజ్ హెర్బల్ స్కిన్‌కేర్ టెక్నిక్లను అనుసరించి అందంగా ముస్తాబయ్యారు. చర్మ సంరక్షణకు సంబంధించి విద్యార్థులకు రకరకాల చిట్కాలు చెప్పిన మేకప్ ఆర్టిస్ట్ తమన్నా రూజ్‌తో ‘సిటీప్లస్’ ముచ్చటించింది. - వాంకె శ్రీనివాస్ నేను పుట్టింది ఢిల్లీ. అయితే 15 ఏళ్ల క్రితం కుటుంబసభ్యులతో కలసి హైదరాబాద్‌కు వచ్చా. ఎంబీఏ పూర్తవగానే నగరంలోని కార్పొరేట్ కంపెనీల్లో మార్కెటింగ్ హెడ్‌గా పనిచేశా. నేను మేకప్ బాగా చేస్తుండటంతో స్నేహితులు, కుటుంబసభ్యులు దాన్నే ప్రొఫెషన్‌గా తీసుకోమని ప్రోత్సహించారు. అలా ఐదేళ్ల కిందట మేకప్ ఆర్టిస్ట్‌గా నా ప్రయాణం మొదలైంది. తొలినాళ్లలో చారిటీల కోసం మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేశాను. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ షోలో నా ప్రత్యేకత చూపించాను. తర్వాత నటి శ్రీదేవి దగ్గర అసిస్టెంట్ మేకప్ ఆర్టిస్ట్‌గా ఒప్పందం కుదుర్చుకున్నాను. బేసిక్ మేకప్‌ను ఇష్టపడే శ్రీదేవి కళ్ల అందానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. టెన్నిస్ స్టార్ సానియామీర్జాకు ఇప్పటికీ మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నాను. టాలీవుడ్ హీరోయిన్లు సమంత, చార్మితో పాటు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలకు మేకప్ మెరుగులు దిద్దుతున్నా. నమ్మకమే నన్ను నడిపిస్తోంది... ప్రతి పని నమ్మకంతో చేస్తా. ఎదుటి వాళ్లు ఎక్స్పెక్ట్ చేసినదానికన్నా రెట్టింపు అవుట్ ఇవ్వడానికి కష్టపడతాను. నా క్రియేటివిటీతో వారి అందానికి వన్నె తెస్తా. ఒక్క ముఖమే కాదు.. చర్మ సౌందర్యానికి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. మేలు రకమైన సౌందర్య సాధనాలను ఉపయోగించడం ద్వారా సహజ సౌందర్యాన్ని మరింత ఇనుమడింప చేయవచ్చు. బంజారాహిల్స్‌లో నేను నెలకొల్పిన ‘తమన్నా మేకప్ ఆర్టిస్ట్రీ’ స్టూడియో ద్వారా పెళ్లిళ్లకు, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, ఫ్యాషన్, ప్రత్యేక కార్యక్రమాలకు మేకప్ సర్వీసులు చేస్తుంటాను కూడా. -
ముస్తాబు వస్తాదులకు మేకప్ ఉమన్ కోటింగ్!!
‘చారూ’... కేసు గెలిచారు అప్పుడప్పుడే రెక్కలు విప్పుకుని ఉపాధి కోసం లోకంలోకి వచ్చిన వారికి ఏమంత ప్రోత్సాహకంగా ఆహ్వానం లభించదు. అలా లోకం మీదికి వచ్చిన వాళ్లు మహిళలైతే ఇక చెప్పే పనే లేదు, ‘‘నీకిక్కడేం పని ఫో’’ అని లోకం తరిమికొడుతుంది. 32 ఏళ్ల చారూ ఖురానానే తీసుకోండి. గత పదేళ్లుగా ఈ ఢిల్లీ యువతి తనకు బాగా వచ్చిన పనిని ముంబైలో చేయడం కోసం పోరాడుతున్నారు. కానీ అక్కడి ‘సినీ కాస్ట్యూమ్ మేకప్ ఆర్టిస్ట్స్ అండ్ హెయిర్ డ్రెస్సెర్స్ అసోసియేషన్’ ఆమెకు సభ్యత్వం ఇవ్వడానికి నిరాకరిస్తూ వస్తోంది. అసోసియేషన్ వాదన ఏమిటంటే మహిళలకు మేకప్ పని అంతగా రాదని! నిజానికి చారూ ఖురానా తన పాతికేళ్ల వయసు నుంచీ ఢిల్లీలో ఫ్యాషన్ షోలు, వాణిజ్య ప్రకటనల షూటింగ్లలో మోడళ్లకు మేకప్ వేస్తున్నారు. మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. అయితే తన ప్రతిభకు ఢిల్లీలో ఉన్నవి పరిమిత అవకాశాలేనని గ్రహించిన చారూ పదేళ్ల క్రితం బాలీవుడ్ చేరుకున్నారు. చారూ మాదిరిగా ఎవరైనా బాలీవుడ్‌లోని ఏ విభాగంలోనైనా ఉపాధి కోసం ప్రయత్నించదలచుకుంటే ముందుగా ఆ విభాగానికి సంబంధించిన సంఘంలో సభ్యులై ఉండాలి. అందుకే ఆమె 2004లోనే సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ మేకప్ ఆర్టిస్టుల అసోసియేషన్ ఆమె దరఖాస్తును స్వీకరించలేదు. ‘‘ఆడవాళ్లు ఇక్కడ నిషిద్ధం. అయినా ఆర్టిస్టులకు మేకప్ వేయడం మగవాళ్ల వల్ల మాత్రమే అయ్యే పని’’ అని అసోసియేషన్ నాయకులు చారూ అభ్యర్థనను తిరస్కరించారు. నిజానికి వారి భయం ఏమిటంటే చారూ లాంటి ప్రతిభావంతుల రాకతో తమ ఉపాధికి గండి పడుతుందని. అయితే చారూ ఈ విషయాన్ని అంతటితో వదిలిపెట్టలేదు. గత ఆరు దశాబ్దాలుగా మహిళలు తమకు పోటీగా రాకుండా స్వయం ప్రకటిత నిషేధంతో జాగ్రత్తపడుతూ వస్తున్న బాలీవుడ్ మేకప్ ఆర్టిస్టుల అసోషియేషన్ లైంగిక వివక్షపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనేక వాయిదాలు, వాదోపవాదాల అనంతరం గతవారం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. బాలీవుడ్ మేకప్ ఆర్టిస్టుల అసోసియేషన్ మహిళలకు సభ్యత్వం ఇవ్వవలసిందేనని స్పష్టం చేసింది. దీనిపై చారూ ఖురానా హర్షం వ్యక్తం చేశారు. అయితే ఆ హర్షం... కేసులో తను గెలిచినందుకు కాదు, బాలీవుడ్లో తనేమిటో నిరూపించుకునే అవకాశానికి పూర్తి అవరోధం తొలగిపోయినందుకు. అలాగే సాటి మహిళా మేకప్ ఆర్టిస్టులకు ఈ తీర్పు ద్వారా పురుషులతో సమానంగా ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని ఆమె ఆశిస్తున్నారు. ఇక అసోసియేషన్ అధ్యక్షుడు శరద్ షెలార్ అయితే తమ సంఘం సుప్రీం కోర్టు ఆదేశాలను శిరసా వహిస్తుందని ఏ మాత్రం ఆలస్యం లేకుండా ప్రకటించారు! చారూ ఖురానా తరఫు న్యాయవాది జ్యోతిక కల్రాకు ఈ విజయంలో కీలక భాగస్వామ్యమే ఉందని చెప్పాలి. ‘‘ఇది స్త్రీల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడం తప్ప మరొకటి కాదు’’ అని వాదించేందుకు ఆమె అనేక ఉదాహరణలను న్యాయమూర్తి ఎదుట ప్రభావవంతంగా ప్రస్తావించగలిగారు. ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో ఇటీవల జరిగిన ఒక సర్వే... ప్రపంచ దేశాలలో (ఇండియా సహా) చలనచిత్ర రంగానికి సంబంధించిన 11 అత్యంత లాభదాయకమైన మార్కెట్లలో బలమైన లైంగిక వివక్ష కొనసాగుతోందని తేల్చి చెప్పిన విషయాన్ని కూడా జ్యోతిక .. న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన సంగతి. మేకప్ ఆర్టిస్ట్ చారూ ఖురానా సాధించిన ఈ విజయం నవతరం మహిళా మేకప్ కళాకారులు బాలీవుడ్లో రాణించేందుకు తోడ్పడుతుందని జ్యోతిక వ్యాఖ్యానించారు. స్త్రీకి స్త్రీయే శత్రువు అన్నవారు... ఒక స్త్రీ (జ్యోతిక) తన విజయాన్ని సాటి స్త్రీ (చారూ ఖురానా) విజయంగా చెప్పడంలోని ఔన్నత్యాన్ని గమనించాలి.