Mahesh Babu Makeup Man Pattabhi Father Passed Away - Sakshi
Sakshi News home page

Namrata Shirodkar: మహేశ్‌ మేకప్‌ మ్యాన్‌ ఇంట విషాదం.. స్వయంగా వెళ్లి పరామర్శించిన నమ్రత!

Published Sun, Feb 12 2023 10:34 AM | Last Updated on Sun, Feb 12 2023 11:31 AM

Mahesh Babu Makeup Man Pattabhi Father Passed Away - Sakshi

టాలీవుడ్‌ మోస్ట్‌ బ్యూటిఫుల్‌ కపుల్స్‌లో సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు-నమ్రత శిరోద్కర్‌ జంట ఒకటి. ‘వంశీ’, ‘అంజీ’ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన ఆమె పెళ్లి ఆనంతరం నటకు గుడ్‌బై చెప్పేసింది. హౌజ్‌ వైఫ్‌గా పిల్లల బాధ్యత, ఇంటి పనులతో పాటు భర్త మహేశ్‌ సినిమా, బిజినెస్‌ వ్యవహరాలను చూసుకుంటుంది. ఇక ఈ క్యూట్‌ కపుల్‌ సామాజిక సేవ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏపీలోని ఓ ఆస్పత్రితో కలిసి పేద చిన్నారులకు ఉచితంగా హార్ట్‌ ఆపరేషన్స్‌ చేయిస్తున్నారు.

చదవండి: అందుకే సినిమాలు చేయడం మానేశా: నటి హేమ

ఇప్పటికే వెయ్యి మంది చిన్నారులకు ఈ జంట గుండె ఆపరేషన్‌ చేయించి అండగా నిలిచారు. అంతేకాదు తరచూ ఫౌండేషన్స్‌కు విరాళాలు ఇస్తుంటారు. సినిమాల విషయంలోనే కాదు సామాజిక సేవలోనూ భర్త వెన్నంటే ఉంటున్న నమ్రత తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇంటి పెద్దను కొల్పోయిన  ఓ కుటుంబానికి నమత్ర అండగా నిలిచారు. మహేశ్‌ పర్సనల్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ తండ్రి శనివారం ఉదయం కన్నుమూశాడు. దీంతో నమ్రత స్వయంగా వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

చదవండి: క్యాన్సర్‌ బారిన ఆటో రామ్‌ ప్రసాద్‌? క్లారిటీ ఇచ్చిన నటుడు

పట్టాభి అనే మేకప్‌ ఆర్టిస్ట్‌ మహేశ్‌ వద్ద ఎంతోకాలంగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయనకు మహేశ్‌ బాబు ఫ్యామిలీతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం పట్టాభి తండ్రి అకాల మరణం చెందాడు. ఈ వార్త తెలుసుకున్న మహేశ్‌ భార్య నమ్రత స్వయంగా వెళ్లి అతడి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నివాళులు అర్పించారు. అయితే మహేశ్‌ ప్రస్తుతం స్పెయిన్‌ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement