తల్లి చివరి కోరిక తీర్చబోతున్న మహేశ్‌బాబు.. త్వరలో శుభకార్యం! | Mahesh Babu Planning Daughter Sitara Langa Voni Function | Sakshi
Sakshi News home page

Mahesh Babu Sitara: హీరో మహేశ్‌బాబు ఇంట్లో త్వరలో శుభకార్యం?

Published Fri, Oct 27 2023 7:47 PM | Last Updated on Fri, Oct 27 2023 8:02 PM

Mahesh Babu Planning Daughter Sitara Langa Voni Function - Sakshi

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రస్తుతం 'గుంటూరు కారం' బిజీలో ఉన్నారు. ఈ సినిమాని ఎలాగైనా సరే సంక్రాంతికి తీసుకురావాలనేది ప్లాన్. మరోవైపు గత కొన్నాళ్లలో వరసగా అన్న, తల్లిదండ్రుల్ని కోల్పోయిన మహేశ్.. ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ఇలాంటి టైంలో మహేశ్ ఇంట్లో ఓ శుభకార్యం జరగబోతుందని తెలుస్తోంది. ఇది మహేశ్ తల్లి చివరి కోరిక అని అంటున్నారు.

మహేశ్‌బాబు పక్కా ఫ్యామిలీ‌మ్యాన్. అయితే షూటింగ్స్ లేదంటే కుటుంబంతో ఉంటాడు. ఏడాదికి రెండు మూడుసార్లయినా విదేశాలకు టూర్స్ వేస్తాడు. ఇక మహేశ్ కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈమె 12 ఏళ్లు. కానీ స్టార్ హీరోయిన్ రేంజులో ఫాలోయింగ్ సంపాదించింది. అప్పుడే యాడ్స్ కూడా చేసేస్తోంది. ఇప్పుడు ఈమెకే లంగా ఓణీ ఫంక్షన్ జరగనుందట.

(ఇదీ చదవండి: గ్రాండ్‌గా ఆ హీరోహీరోయిన్ నిశ్చితార్థం.. త్వరలో పెళ్లి కూడా)

మహేశ్ తల్లి ఇందిరా దేవి.. తను బతికున్నప్పుడే సితార ఓణీల ఫంక్షన్ చూడాలని అనుకుందట. కానీ ఎందుకే కుదర్లేదు. ఆమె చనిపోవడంతో ఆ తర్వాత అస్సలు కుదరలేదు. ఇన్నాళ్లకు ఆ శుభకార్యాన్ని మహేశ్ చేయాలని ప్లాన్ చేశాడట. ఈ వేడుకకు మొత్తం ఘట్టమనేని కుటుంబ సభ్యులందరూ హాజరవుతారని తెలుస్తోంది. ఈ నెలలోనే ఆ వేడుక ఉండనుందట.

మహేశ్ సినిమాల విషయానికొస్తే.. 'గుంటూరు కారం' షూటింగ్ డిసెంబరులో పూర్తయిపోతుంది. ఆ వెంటనే రాజమౌళితో చేయబోయే ప్రాజెక్టులోకి వెళ్లిపోతాడు. కొన్నినెలల పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాత అంటే వచ్చే ఏడాది జూన్ నుంచి మహేశ్-రాజమౌళి ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement