Sitara
-
పార్టీలో ఫుల్ హ్యాపీగా సితార-నమ్రత-చరణ్
రీసెంట్ టైంలో పెళ్లిళ్లు చాలా జరుగుతున్నాయి. సామాన్యుల దగ్గర సెలబ్రిటీల వరకు కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ లో నిర్మాత మహేశ్వర్ రెడ్డి కుమారుడు నితీశ్ రెడ్డి పెళ్లి దుబాయిలో జరిగింది. దీనికి టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు హాజరయ్యారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలేంటంటే?)దుబాయిలో జరిగిన పెళ్లికి చిరంజీవి, ఎన్టీఆర్, మహేశ్ బాబు, నాగార్జున కుటుంబాలు వెళ్లాయి. తాజాగా శనివారం రాత్రి హైదరాబాద్ లో రిసెప్షన్ జరగ్గా.. నమ్రత-సితార, రామ్ చరణ్-ఉపాసన దంపతులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలని నమ్రత తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. కొత్త జంట నితీష్-కీర్తిని ఆశీర్వదించింది.అయితే పార్టీలంటే ముందుండే మహేశ్ బాబు మాత్రం రాజమౌళితో తీస్తున్న సినిమా షూటింగ్ వల్ల వీటిని మిస్ అవుతున్నాడు. ప్రస్తుతం ఒడిశాలోని కోరాపుట్ ప్రాంతంలోని కొండల్లో కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ఇందుకు సంబంధించి లీకైన ఓ వీడియో క్లిప్ కూడా తెగ వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
కొంబర శ్రీకృష్ణ స్వామి ఆలయానికి యాంత్రిక ఏనుగు సేవలు..!
దేవాలయాల్లో దేవుళ్లను గజవాహనంతో ఊరేగించడం వంటివి చేస్తారు. అంతేగాదు కొన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అయితే ఏనుగులపై దేవుడిని ఊరేగిస్తారు. అందుకోసం మావటి వాళ్లు తర్ఫీదు ఇచ్చి దైవ కైంకర్యాలకు ఉపయోగించడం జరుగుతుంది. దీని కారణంగా ప్రకృతి ఓడిలో హాయిగా స్వేచ్ఛగా బతకాల్సిన ఏనుగులు బందీలుగా ఉండాల్సిన పరిస్థితి. దీనివల్లే కొన్ని ఏనుగులు చిన్నప్పుడు వాటి తల్లుల నుంచి దూరమైన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సమస్య తలెత్తకుండా ఉండేలా లాభపేక్షలే జంతు హక్కుల సంస్థ పెటా ఇండియా ఒక చక్కని పరిష్కారమార్గం చూపించింది. ఇంతకీ ఆ సంస్థ ఏం చేస్తోందంటే..గజారోహణ సేవ కోసం ఏనుగుల బదులుగా యాంత్రిక ఏనుగుల(ఛMechanical elephant)ను తీసుకొచ్చింది పెటా ఇండియా. ఏనుగులు సహజ ఆవాసాలలోనే ఉండేలా చేసేందుకే వీటిని తీసుకొచ్చినట్లు తెలిపింది. ఇలా యాంత్రిక ఏనుగులను ఉపయోగించడం ద్వారా నిజమైన జంబోలు తమ కుటుంబాలతో కలిసి ఉండగలవని, పైగా నిర్బంధం నుంచి విముక్తి కలుగుతుందని పేర్కొంది పెటా ఇండియా. అలాగే ఆయుధాలతో నియత్రించబడే బాధల నుంచి తప్పించుకుని హాయిగా వాటి సహజమైన ఆవాసంలో ఉంటాయని పేర్కొంది. ఇక ఈ యాంత్రిక ఏనుగులను రబ్బరు, ఫైబర్, మెటల్, మెష్, ఫోమ్ స్టీల్‌తో రూపొందించినట్లు తెలిపింది. ఇవి నిజమైన ఏనుగులను పోలి ఉంటాయి. ఈ యాంత్రిక ఏనుగు తల ఊపగలదు, తొండం ఎత్తగలదు, చెవులు, కళ్లను కూడా కదిలించగలదు. అంతేగాదు నీటిని కూడా చల్లుతుందట. ఇది ప్లగ్-ఇన్ వ్యవస్థ ద్వారా పనిచేస్తుందట. దీనికి అమర్చిన వీల్‌బేస్ సాయంతో వీధుల గుండా ఊరేగింపులకు సులభంగా తీసుకెళ్లచ్చొట. తాజాగా ప్రఖ్యాత సితార్ విద్వాంసురాలు, ఈ ఏడాది గ్రామీ నామినీ అనౌష్కా శంకర్(Anoushka Shankar) పెటా ఇండియా(Peta India) సహకారంతో కేరళ త్రిస్సూర్‌లోని కొంబర శ్రీకృష్ణ స్వామి ఆలయాని(Kombara Sreekrishna Swami Temple)కి ఇలాంటి యాంత్రిక ఏనుగుని విరాళంగా సమర్పించారు. సుమారు 800 కిలోగ్రాముల బరువున్న ఈ ఏనుగును బుధవారం(ఫిబ్రవరి 05, 2025న ) ఆలయంలో ఆవిష్కరించారు. ఈ యాంత్రిక ఏనుగు పేరు కొంబర కన్నన్.ఇలా పెటా ఇండియా కేరళ(Kerala) ఆలయాలకి యాంత్రిక ఏనుగులను ఇవ్వడం ఐదోసారి. త్రిస్సూర్ జిల్లాలో మాత్రం రెండోది. ఇటీవల మలప్పురంలోని ఒక మసీదులో మతపరమైన వేడుకల కోసం కూడా ఒక యాంత్రిక ఏనుగును అందించింది. నిజంగా పెటా చొరవ ప్రశంసనీయమైనది. మనుషుల మధ్య కంటే అభయారణ్యాలలోనే ఆ ఏనుగులు హాయిగా ఉండగలవు. అదీగాక ఇప్పుడు ఏనుగుల సంఖ్య తగ్గిపోతున్న తరుణంలో ఇలాంటి ప్రత్యామ్నాయం ప్రశంసనీయమైనదని జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. Kombara Kannan, a 3-metre-tall mechanical elephant weighing 800 kilograms, was offered to Kombara Sreekrishna Swami Temple, in Thrissur district on Wednesday, by renowned sitarist Anoushka Shankar and PETA India.📹Thulasi Kakkat (@KakkatThulasi) pic.twitter.com/Cz0vD0NNHs— The Hindu (@the_hindu) February 5, 2025 (చదవండి: ఆ అమ్మాయి భలే అద్భుతం..అచ్చం కంప్యూటర్‌లా..!) -
మ్యూజిక్ కన్సర్ట్‌లో సందడి చేసిన సితార, నమ్రతా శిరోద్కర్ (ఫోటోలు)
-
కాలినడకన తిరుమలకి మహేశ్ బాబు ఫ్యామిలీ (ఫొటోలు)
-
సితార బర్త్‌డే.. మరోసారి మంచి మనసు చాటుకున్న మహేశ్‌బాబు (ఫోటోలు)
-
సితార పాప బర్త్ డే.. మహేశ్, నమ్రత స్పెషల్ విషెస్
సూపర్‌స్టార్ మహేశ్ బాబు పేరు చెప్పగానే అతడి ఫ్యామిలీ కూడా గుర్తొస్తుంది. భార్య నమ్రత, పిల్లలు గౌతమ్-సితార కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటారు. గౌతమ్ పెద్దగా కనిపించడు గానీ సితారకి మాత్రం మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా అందరూ విషెస్ చెబుతున్నారు. కానీ పేరెంట్స్ మహేశ్-నమ్రత కాస్త ప్రత్యేకంగా చెప్పారు.(ఇదీ చదవండి: మొన్న సుకుమార్.. ఇప్పుడు త్రివిక్రమ్.. అల్లు అర్జున్‌తో కలిసి!)మహేశ్ కూతురు సితార తాజాగా 12వ వసంతంలోకి అడుగుపెట్టేసింది. ఈ క్రమంలోనే తండ్రి మహేశ్ బాబు హార్ట్‌ఫుల్‌గా విషెస్ చెప్పాడు. క్యూట్ ఫొటో పోస్ట్ చేసి.. 'హ్యాపీ 12 మై లిటిల్ వన్ సితార. నువ్వు కోరుకున్నది నీకు దక్కాలని కోరుకుంటున్నాను. లవ్ యూ మోర్ అండ్ మోర్. హ్యాపీ బర్త్ డ్ సన్ షైన్' అని మహేశ్ బాబు రాసుకొచ్చాడు.తల్లి నమ్రత కూడా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి ఏడాది సితార ఫొటోలని కలిపి ఓ వీడియోగా చేసి మరీ కూతురికి పుట్టినరోజు విషెస్ చెప్పింది. 'హ్యాపీ బర్త్ డే టూ మై లిటిల్ ట్రావెల్ కంపానియన్. ఎన్నో దేశాలు, మర్చిపోలేని గుర్తులు. నీ వల్ల ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు. ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్ ఆల్వేజ్' అని నమ్రత తన ప్రేమని అక్షరాలుగా రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: 'యానిమల్' బ్యూటీ తృప్తి దిమ్రి కొత్త సినిమా ఎలా ఉందంటే?) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
సినీ ప్రముఖులతో మహేశ్ బాబు కుమార్తె సితార పోజులు.. ఫోటోలు చూశారా?
-
హాలీవుడ్ నటితో మహేశ్ బాబు కూతురు.. సోషల్ మీడియాలో వైరల్!
ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ తనయుడి పెళ్లి ముంబయిలో గ్రాండ్‌గా జరిగింది. గతంలోనే నిశ్చితార్థం చేసుకున్న అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లిలో టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు సినీతారలు హాజరై సందడి చేశారు. నగరంలోని జియో వరల్డ్ కన్వెన్ష్‌న్ సెంటర్లో అత్యంత వైభవంగా వీరి పెళ్లి వేడుక జరిగింది. టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, మహేశ్ బాబు కుటుంబ సమేతంగా హాజరయ్యారు.అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహ వేడుకలో ప్రిన్స్ మహేశ్ బాబు ఫ్యామిలీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. తన ముద్దుల కూతురు సితార, భార్య నమ్రతా శిరోద్కర్‌తో కలిసి పెళ్లి వేడుకల్లో మెరిశారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో సితార ప్రముఖులతో ఫోటోలకు ఫోజులిచ్చింది. హాలీవుడ్ భామ కిమ్ కర్దాసియాన్తో సెల్ఫీలు తీసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతే కాకుండా బాలీవుడ్ తారలు ప్రియాంక చోప్రా, రాధ, ఐశ్వర్యరాయ్, రణ్‌వీర్‌సింగ్, సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ లాంటి బాలీవుడ్ స్టార్స్‌తోనూ ఫోటోలు దిగింది. View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) -
అనంత్ - రాధిక పెళ్లి.. స్పెషల్ అట్రాక్షన్‌గా మహేశ్‌బాబు ఫ్యామిలీ (ఫోటోలు)
-
లండన్‌లో మహేష్ ఫ్యామిలీ మేజికల్ మూమెంట్స్ (ఫోటోలు)
-
ఇంట్లో ఆంక్షలు? ఎవరు స్ట్రిక్ట్? సితార ఫన్నీ ఆన్సర్స్
మహేశ్‌బాబు కూతురు సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. డ్యాన్సులు, వెకేషన్ ట్రిప్ ఫోటోలు, వీడియోలతో చాలా హడావుడి చేస్తుంటుంది. ఈమెకు సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందులో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా వాళ్లు అడిగిన ఎన్నో ప్రశ్నలకు నవ్వుతూ సమాధానాలిచ్చింది.👉 ఇష్టమైన సినిమా?క్లూలెస్👉 బ్యూటీకి సీక్రెట్పేరెంట్స్👉 పేరెంట్స్‌లో ఎవరు స్ట్రిక్ట్?ఇద్దరూ స్ట్రిక్ట్ కాదు👉 ఇష్టమైన ఫుడ్మ్యాగీ నూడుల్స్👉 మీరు యాక్టింగ్ ఫీల్డ్ ఎంచుకుంటారా?ఎస్, కచ్చితంగా నటి అవుతాను.👉 మహేశ్‌బాబు కాకుండా ఇష్టమైన యాక్టర్స్?రష్మిక మందన్నా, శ్రీలీల👉 ఆ పని చేయకూడదు, ఈ పని చేయొద్దు అని ఆంక్షలు పెడతారా?అలాంటి ఆంక్షలేం పెట్టరు.👉 విద్యాభ్యాసం?ఆరో తరగతి పూర్తయింది. ఏడో తరగతిలోకి ఎంటరవుతున్నాను.👉 పేరెంట్స్ దగ్గర లాక్కోవాలనుకునేవి?అమ్మ దగ్గరి నుంచి ఫ్యాషన్ సెన్స్.. నాన్న దగ్గరి నుంచి యాక్టింగ్ స్కిల్స్.👉 మీ నాన్న జుట్టును అత్తయ్య పట్టుకున్నప్పుడు ఏం జరిగింది?నా జుట్టు పట్టుకోవద్దు అని నాన్న అన్నారు. ఎవరైనా తన జుట్టు పట్టుకోవడం నాన్నకు అస్సలు ఇష్టముండదుచదవండి: పెళ్లి కోసం అబ్బాయిని తీసుకెళ్లినా.. ఇంట్లో వాళ్లు నమ్మేలా లేరు: అంజలి -
Mahesh Babu Europe Vacation Photos: యూరప్ వేకేషన్లో ప్రిన్స్ మహేశ్ బాబు ఫ్యామిలీ.. ఫోటోలు
-
Sitara: వెకేషన్లో మహేశ్‌బాబు గారాల పట్టి (ఫోటోలు)
-
మంచులో చిల్ అవుతున్న మహేశ్‌బాబు ఫ్యామిలీ (ఫోటోలు)
-
కిడ్స్ తో కలిసి సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న నమ్రత (ఫొటోలు)
-
మంచుకురిసే వేళలో, సీతూ పాప..లిటిల్ఎల్సాలా.. అమేజింగ్ ఫోటోలు
-
బ్లాక్ చుడిదార్‌లో సితార క్యూట్ లుక్!
టాలీవుడ్ నటుడు మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్‌ల కుమార్తె సీతార పలు యాడ్లలో తండ్రితో కలిసి సందడి చేసింది. ప్రముఖ ఆభరణాల అడ్వర్టైస్మెంట్లో కూడా మోడల్స్ ఎవరూ ఆమె ముందు సరిపోరేమో అన్నంతగా స్టన్నింగ్ లుక్‌తో మిస్మరైజ్ చేసింది. ఈసారి ప్రముఖ బ్రాండెండ్ చుడిదార్‌తో న్యూలుక్‌తో మనముందుకు వచ్చింది. సీతార స్టార్ కిడ్ ఫల్గుణి షేన్ పీకాక్ లగ్జరీ దుస్తులతో తళుక్కుమంది. చెప్పాలంటే ఆమె పేరుకు తగ్గట్టు ఆ బ్లాక్ కలర్ డ్రస్‌లో రాత్రిపూట కనిపించే స్టార్‌లో కాంతిలీనుతోంది. View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) సీక్విన్డ్ బ్లాక్ కుర్తాపై సిల్వర్ గులాబీతో కూడిన అంచులు. దానిపై చక్కగా తీర్చిదిద్ధిన ఎంబ్రాయిడరీ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. సాంప్రదాయ ఆకర్షణను తలపించేలా వెండి ముత్యాల వరుసతో తీర్చిదిద్దారు ఆ డ్రస్‌ని. అందుకు తగ్గట్టు జుట్టుని కూడా వేవ్స్ మాదిరిగా చక్కగా వదిలేశారు. ఈ లుక్క్‌లో సీతార అంతకు మించి అన్నంతగా అదిరిపోతోంది. అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. వివాహశైలికి అద్దం పట్టేలా మింట్ గ్రీన్ లెహంగాతో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసింది. ఇది శాటిన్-సిల్క్ త్రీ-పీస్ సిల్హౌట్‌పై బంగారుపు దారాలతో డిజైన్ చేసి ఉంది. View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) లెహంగాపై గోల్డ్ యాక్సెంట్లలో పూల మోటిఫ్‌లతో చక్కగా రూపొందించారు. ఇక ఈ డ్రస్‌కి తగ్గట్టు సితార ట్రాన్సపరేంట్ ఎంబ్రాయిడర్ నెట్ దుప్పటా, పచ్చలతో పొదిగిన బంగారు హారం, కంకణాలు, ఝంకాలు ధరించింది. ఈ లుక్‌లో సితారను చూస్తే పండుగ వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అంతకుముందు ఆరెంజ్ లెహంగాను ధరించింది. View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) ఆ లెహంగాపై సింపుల్ ఎంబ్రాయిడరీ డిజైన్, షార్ట్ హ్యాండ్స్‌తో కూడిన బ్లౌజ్, సీక్వెన్డ్ దుప్పటతో మెరిసింది. అందుకు తగ్గట్లు నెక్కి ధరించిన నగ ఆమె లుక్‌ని మరింత అందంగా కనిపించేలా చేసింది. ఆ స్టన్నింగ్ లుక్‌లో కట్టిపడేస్తున్న సీతార ఫోటోలను చూసేయండి. (చదవండి: నీతా అంబానీ ఫిట్నెస్ రహస్యం ఇదే! ఏకంగా 18 కిలోలు) -
హీరో మహేష్ బాబు కూతురు సితారకు సైబర్ కష్టాలు
-
సితార పేరుతో మోసాలు.. పోలీసులకు మహేశ్ బాబు టీమ్ ఫిర్యాదు
టాలీవుడ్ ప్రముఖ హీరో మహేశ్‌బాబు కూతురు సితార పేరుతో కొందరు వ్యక్తులు మోసాలకు పాల్పడుతున్నట్లుకు పోలీసులు ఫిర్యాదు అందింది. ఇన్‌స్టాగ్రామ్‌లో సితార పేరుతో నకిలీ ఖాతాలు తెరిచి ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ లింకులను ప్రజలకు పంపుతున్నట్లు ఘట్టమనేని మహేశ్ బాబు టీమ్ (GMB) గుర్తించింది. అలాంటి వాటిని ఎవరూ నమ్మొద్దని వారు తెలిపారు. సితారకు ఉన్న ఏకైక ఇన్స్టాగ్రామ్ లింక్‌ను అక్కడ చేర్చుతూ మాదాపుర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా సెలబ్రిటీల పేరుతో అనుమానస్పద లింకులు వస్తే అందరూ అప్రమత్తంగా ఉండాలని జీఎంబీ తెలిపింది. ఈ అంశాన్ని తాజాగా నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక నోట్ విడుదల చేశారు. అందులో ఇలా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సితార ఘట్టమనేని ఫోటోలు ఉపయోగించి కొందరు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి డబ్బు కోసం సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. గుర్తుతెలియని కొందరు ఘట్టమనేని సితార పేరుతో కొన్ని ట్రేడింగ్, పెట్టుబడి లింక్‌లను పంపుతున్నారు. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పదంగా అనిపించిన తక్షణమే సంబంధించిన అధికారులకు సమాచారం ఇవ్వాలని వారు సూచించారు. మహేష్ బాబు టీమ్ ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. అనుమానస్పద నోటిఫికేషన్‌కు స్పందించవద్దని అభిమానులకు మహేష్ టీమ్ సూచిస్తుంది. త్వరలోనే ఆ సైబర్ నేరగాళ్లను పట్టుకుంటామంటున్న సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. (సితార, నమ్రతకు సంబంధించిన ఒరిజినల్ ఇన్స్టాగ్రామ్ లింక్‌లు గమనించగలరు) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by sitara 🪩 (@sitaraghattamaneni) -
'దమ్ మసాలా' సాంగ్‌కు సితార డ్యాన్స్..
-
'దమ్ మసాలా' సాంగ్‌కు సితార డ్యాన్స్.. మిలియన్లకొద్ది వ్యూస్
టాలీవుడ్ స్టార్ కిడ్స్‌లో ఎక్కువగా వినిపించే పేరు ఘట్టమనేని సితార. మహేశ్ బాబు కూతురిగానే కాకుండా తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ను కూడా క్రియేట్ చేసుకుంది. ఇప్పటికే పలు యూట్యూబ్ ఇంటర్వ్యూలు, వీడియోలతో పాపులరైన సీతూ పాప.. మహేశ్ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా ఎప్పుడూ స్పెషలే అని చెప్పవచ్చు. నటనతో పాటు పదిమందికి సాయం చేయడంతో తండ్రి వారసత్వాన్ని సితార ముందుకు తీసుకెళ్తుంది. భవిష్యత్‌లో సితార కూడా సినిమాల్లోకి వస్తుందని నమ్రత ఇప్పటికే పలుమార్లు చెబుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సితార కూడా చదువుతో పాటు క్లాసికల్ డ్యాన్స్ కూడా నేర్చుకుంది. అప్పుడప్పుడు పలు సూపర్ హిట్ సాంగ్స్‌కు ఆమె డ్యాన్స్ చేస్తూ అభిమానులను మెప్పిస్తూ ఉంటుంది. తాజాగా 'గుంటూరు కారం' సినిమాలోని సూపర్ హిట్ సాంగ్‌కు సితార అద్భుతమైన డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. సితారకు ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు రెండు మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. 'గుంటూరు కారం' సినిమాలోని 'దమ్ మసాలా' పాటకి ఆమె దుమ్మురేపే డాన్సు చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో సితార డాన్సుకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. గుంటూరు కారంలో హీరోయిన్ శ్రీలీలకు ఏ మాత్రం తగ్గకుండ సితార డ్యాన్స్ ఉందని కామెంట్లు చేస్తున్నారు. సీతూ పాప డ్యాన్స్ త్రీ డీలో కనిపిస్తుందని ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. సితార అదరగొట్టిన డ్యాన్స్ వీడియోకు ఇప్పటి వరకు 50 లక్షల వ్యూస్ రావడం విశేషం. -
సితార నెలకు ఎంత సంపాదిస్తుందో తెలిస్తే అవాక్ అవుతారు
-
Sitara Insta Income: టీనేజీలోనే గట్టిగా సంపాదిస్తున్న సితార.. నెలకు ఎన్ని లక్షలంటే?
సూపర్‌స్టార్ మహేశ్ బాబు పేరు చెప్పగానే అందరికీ సినిమాలు గుర్తొస్తాయి. కానీ కొందరికి మాత్రం అతడిలో అసలైన బిజినెస్‌మ్యాన్ గుర్తొస్తాడు. ఎందుకంటే మూవీ అంటే మహా అయితే సంవత్సరానికి ఒకటి చేస్తాడు. కానీ అదే టైంలో యాడ్స్, బ్రాండ్స్ ప్రమోషన్స్ ద్వారా కోట్లకు కోట్లు సంపాదిస్తున్నాడు. టాలీవుడ్లో మిగతా హీరోలతో పోలిస్తే యాడ్స్‌లో మహేశే ఎక్కువగా కనిపిస్తుంటాడు. ఇప్పుడు ఇతడి రూట్లోనే కూతురు సితార కూడా వెళ్తున్నట్లు తెలుస్తోంది. సూపర్‌స్టార్ కృష్ణ వారసుడిగా మహేశ్ సినిమాల్లోకి వచ్చాడు. చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాలు చేసి ఆ తర్వాత హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ మహేశ్ కూతురు సితార మాత్రం పుట్టినప్పటి నుంచే మంచి ఫేమ్ సంపాదిస్తూ వచ్చింది. చిన్నప్పటి నుంచి ఈమె ఫొటోలు వైరల్ అవుతూనే ఉండేవి. ఇప్పుడు టీనేజీలోకి వచ్చిన తర్వాత సితార మరింత యాక్టివ్‌గా కనిపిస్తోంది. (ఇదీ చదవండి: సైలెంట్‌గా ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న 'బిగ్‌బాస్' శోభాశెట్టి) గతంలో ఫ్యామిలీతో కలిసి ఓ యాడ్‌లో కనిపించిన సితార.. 'సర్కారు వారి పాట' సినిమాలోని ఓ పాటలో డ్యాన్సులతో ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా ద్వారా ట్రెండింగ్‌లో ఉంటోంది. ఇన్ స్టాలో ఈమెకు 1.7 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అలానే యూట్యూబ్ ఛానెల్లోనూ 10 వేల మంది వరకు సబ్‌స్కైబర్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే బ్రాండ్స్, ప్రమోషన్స్ లాంటివి చేస్తూ మంచిగా సంపాదిస్తోంది. గతేడాది ఓ జ్యూవెల్లరీ యాడ్‌లో సితార యాక్ట్ చేసినందుకు రూ.కోటి వరకు రెమ్యునరేషన్ ఇచ్చారని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా సితార సంపాదన విషయమై కొన్ని నంబర్స్ వినిపిస్తున్నాయి. నెలకు ఏకంగా రూ.30 లక్షల వరకు వెనకేసుకుంటోందని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్) View this post on Instagram A post shared by sitara 🪩 (@sitaraghattamaneni) -
అనాధ పిల్లల కోసం మరోసారి మంచి మనసు చాటుకున్న సితార
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కుమార్తె సితార తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇప్పటికే మహేశ్ తన సొంత గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేస్తూనే వందల మంది చిన్నారులకు గుండె సంబంధిత ఆపరేషన్లు ఉచింతంగానే చేపించారు. అలా తన గొప్ప మనసు చాటుకుంటూ సినిమాలతో పాటు మరోవైపు సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. తండ్రి బాటలోనే సితార కూడా అడుగులు వేస్తుంది. కొన్ని నెలల క్రితం తన పుట్టిన రోజు సందర్భంగా పేదింటి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. ఆ విద్యార్థులను తన ఇంటికి ఆహ్వానించిన సితార వారితో సరదాగా మాట్లాడటమే కాకుండా వారితో కేక్ కూడా కట్ చేపించారు. ఒక జ్యువెలరీ యాడ్ ద్వారా వచ్చిన రెమ్యునరేషన్ మొత్తం ఒక చారిటీ కోసం విరాళంగా ఇచ్చేశారు. తాజాగా సితార అనాధ పిల్లలతో కొంత సమయం గడిపారు. ఆపై మహేశ్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాను వారందరికి చూపించారు. మొదటిరోజు ఈ సినిమాపై నెగటివ్ టాక్ వచ్చినా తర్వాత సూపర్ హిట్ సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా గుంటూరు కారం కనెక్ట్ అయింది. ఇప్పుడు అనాధ పిల్లల కోసం హైదరాబాద్‌లోని ఏఎంబీ థియేటర్లో స్పెషల్ షో ఏర్పాటు చేసింది. ఏఎంబీలో అత్యంత లగ్జరీ స్క్రీన్‌లో వారు సినిమా చూసేలా ఏర్పాటు చేసింది. (ఇదీ చదవండి: అయోధ్య రామ మందిరానికి 'హనుమాన్' టీమ్ భారీ విరాళం) గతంలో హీరోయిన్ సమంత కూడా హాయ్ నాన్న చిత్రాన్ని అనాధ పిల్లలకు చూపించారు. వారి కోసం ఆమె ఒక స్పెషల్ స్క్రీన్‌ను బుక్ చేసి ఏర్పాట్లు చేశారు. తాజాగా సితార కూడా తన తండ్రి చిత్రం అయిన గుంటూరు కారం అనాధ పిల్లలకు చూపించి నెటిజన్ల నుంచి అభినందనలు పొందుతుంది. View this post on Instagram A post shared by Mahesh Babu FC (@_urstrullymahesh_) -
మరింత అందంగా మహేశ్ కూతురు.. మేకప్ లేకుండా చిట్టి!
హీరోయిన్లని మించిపోయేలా క్యూట్ పోజుల్లో సితార క్యూట్ ఫొటోతో భార్య నయనతారకు బర్త్ డే విషెస్ డిమ్ లైటింగ్‌లో కాజల్ అగర్వాల్ విచిత్రమైన పోజులు బ్యాక్ చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న హీరోయిన్ శ్రియ ఆ అందాలు చూపిస్తూ రెచ్చిపోయిన మలైకా అరోరా క్లాసికల్ డ్యాన్సుతో వావ్ అనిపించిన జాన్వీ కపూర్ వింత స్టిల్‌తో ఎంటర్టైన్ చేస్తున్న కృతి కర్బందా మేకప్ లేకుండా కనిపించిన 'జాతిరత్నాలు' ఫరియా View this post on Instagram A post shared by sitara 🪩 (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Catherine Tresa Alexander (@catherinetresa) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
ముగ్గులేసిన సితార, ఉపాసన ఇంట దీపావళి పార్టీ.. నమ్రత కూడా..
వెలుతురు పోయాక చీకటి వస్తుంది.. చీకటి పోయాక వెలుతురు వస్తుంది. ఇది ప్రతిరోజూ జరిగేదే! కానీ జీవితంలో ఉన్న చీకటిని తొలగించేందుకు వచ్చేదే దీపావళి పండగ. ఈరోజు పూజలు, పునస్కారాలతో పాటు స్వీట్లు, సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు రోడ్లపై పటాకులు పేలుస్తూ నానా రచ్చ చేస్తుంటారు. అమ్మాయిలు ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముగ్గులు వేసి వాటిని చూసుకుని మురిసిపోతుంటారు. తర్వాత అందంగా ముస్తాబై దీపావళి వేడుకలు షురూ చేస్తారు. సెలబ్రిటీలైతే మరింత ఘనంగా పండగ జరుపుకుంటారు. మరి ఈ పండగ రోజు(నవంబర్ 12న) తారలు సోషల్ మీడియాలో ఏమేం ఫోటోలు షేర్ చేశారో చూద్దాం.. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by sitara 🪩 (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Vindhya Vishaka (@vindhya_vishaka) View this post on Instagram A post shared by Rukshaar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Vindhya Vishaka (@vindhya_vishaka) View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) View this post on Instagram A post shared by Krésha (@kreshabajaj) View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) చదవండి: కన్నుమూసిన సీనియర్ హీరో.. పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే.. -
Sitara Ghattamaneni: సితార క్యూట్ ఫొటోస్..
-
తల్లి చివరి కోరిక తీర్చబోతున్న మహేశ్‌బాబు.. త్వరలో శుభకార్యం!
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రస్తుతం 'గుంటూరు కారం' బిజీలో ఉన్నారు. ఈ సినిమాని ఎలాగైనా సరే సంక్రాంతికి తీసుకురావాలనేది ప్లాన్. మరోవైపు గత కొన్నాళ్లలో వరసగా అన్న, తల్లిదండ్రుల్ని కోల్పోయిన మహేశ్.. ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ఇలాంటి టైంలో మహేశ్ ఇంట్లో ఓ శుభకార్యం జరగబోతుందని తెలుస్తోంది. ఇది మహేశ్ తల్లి చివరి కోరిక అని అంటున్నారు. మహేశ్‌బాబు పక్కా ఫ్యామిలీమ్యాన్. అయితే షూటింగ్స్ లేదంటే కుటుంబంతో ఉంటాడు. ఏడాదికి రెండు మూడుసార్లయినా విదేశాలకు టూర్స్ వేస్తాడు. ఇక మహేశ్ కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈమె 12 ఏళ్లు. కానీ స్టార్ హీరోయిన్ రేంజులో ఫాలోయింగ్ సంపాదించింది. అప్పుడే యాడ్స్ కూడా చేసేస్తోంది. ఇప్పుడు ఈమెకే లంగా ఓణీ ఫంక్షన్ జరగనుందట. (ఇదీ చదవండి: గ్రాండ్‌గా ఆ హీరోహీరోయిన్ నిశ్చితార్థం.. త్వరలో పెళ్లి కూడా) మహేశ్ తల్లి ఇందిరా దేవి.. తను బతికున్నప్పుడే సితార ఓణీల ఫంక్షన్ చూడాలని అనుకుందట. కానీ ఎందుకే కుదర్లేదు. ఆమె చనిపోవడంతో ఆ తర్వాత అస్సలు కుదరలేదు. ఇన్నాళ్లకు ఆ శుభకార్యాన్ని మహేశ్ చేయాలని ప్లాన్ చేశాడట. ఈ వేడుకకు మొత్తం ఘట్టమనేని కుటుంబ సభ్యులందరూ హాజరవుతారని తెలుస్తోంది. ఈ నెలలోనే ఆ వేడుక ఉండనుందట. మహేశ్ సినిమాల విషయానికొస్తే.. 'గుంటూరు కారం' షూటింగ్ డిసెంబరులో పూర్తయిపోతుంది. ఆ వెంటనే రాజమౌళితో చేయబోయే ప్రాజెక్టులోకి వెళ్లిపోతాడు. కొన్నినెలల పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాత అంటే వచ్చే ఏడాది జూన్ నుంచి మహేశ్-రాజమౌళి ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?) View this post on Instagram A post shared by sitara 🪩 (@sitaraghattamaneni) -
దసరా స్పెషల్.. అటు మహేశ్ కూతురు, ఇటు బన్నీ వారసులు
జిమ్‌లో తెగ కష్టపడిపోతున్న యాంకర్ అనసూయ చీరలో క్యూట్‌గా అనిపిస్తున్న అను ఇమ్మాన్యుయేల్ లంగా ఓణీలో అబ్బా అనిపిస్తున్న నభా నటేశ్ బ్లాక్ చీరలో మెరిసిపోతున్న హాట్ బ్యూటీ ఈషా రెబ్బా హాట్ పోజుల్లో మెల్ట్ అయ్యేలా చేస్తున్న ఈషా గుప్తా చీరలో పరువాల విందు చేస్తున్న కావ్య కల్యాణ్ రామ్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ వీడియో పోస్ట్ చేసిన మలైకా అరోరా టైగర్ నాగేశ్వరరావు బ్యూటీ అనుకృతి సోయగాలు View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Esha Gupta (@egupta) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Amore by BK (@amorebybk) View this post on Instagram A post shared by Chandrika Ravi • ॐ (@chandrikaravi) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by sitara 🪩 (@sitaraghattamaneni) -
అది నా డీఎన్ఏలోనే ఉంది.. ఎమోషనల్ అయిన సితార
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు గారాలపట్టి సితార ఘట్టమనేని.. తాత, తండ్రి పేరు నిలబెడుతూ.. ఘట్టమనేని వారసురాలిగా దూసుకెళ్తుంది. రాబోయే రోజుల్లో ఆమె పేరొక ప్రభంజనం కాబోతోంది. ఇప్పటికే ఇండస్ట్రీలోని పలువురి ప్రముఖల పిల్లలకు భిన్నంగా తన మార్క్‌ను చూపిస్తుంది. అలా తనకంటూ ఓ ఫ్యాన్ బేస్‌ను కూడా సొంతం చేసుకుంది. సామాజిక సేవలో నాన్న బాటలోనే నడుస్తానని చెప్పినట్లుగానే తన అడుగులు పడుతున్నాయి. (ఇదీ చదవండి: దిల్‌రాజు అల్లుడి కారు చోరీ.. దొంగిలించిన వ్యక్తి మాటలకు పోలీసులు షాక్) శుక్రవారం నేషనల్ సినిమా డే సందర్భంగా సితార ఒక ఫోటోతో పాటు కొన్ని విషయాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తన దృష్టిలో సినిమా అంటే కేవలం ఒక పరిశ్రమ కాదంటూ సితార పేర్కొంది. సినిమా అనేది తన డీఎన్ఏలోనే ఉందని ఆమె తెలిపింది. 'లెజండరీ, ఎవర్గ్రీన్ సూపర్‌స్టార్ కృష్ణగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మా తాతగారు మమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేశారు. ఆయన వారసత్వంలో భాగమైనందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. నాన్న ఎలాగైతే తాతయ్యను స్ఫూర్తిగా తీసుకున్నారో.. నేను కూడా అంతే. నాన్నే నా స్ఫూర్తి.' అంటూ సితార ఎమోషనల్ పోస్ట్ చేసింది. (ఇదీ చదవండి: అభిమాని అలాంటి ప్రశ్న అడగడంతో ఫైర్ అయిన తమన్నా..) ప్రస్తుతం ఇదీ నెట్టింట వైరల్‌గా మారింది. వయసులో సితార చిన్నపిల్ల అయినా ఆలోచనలు మాత్రం ఎంతో ఉన్నతంగా ఉన్నాయని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చలనచిత్ర రంగంలోకి తప్పకుండా అడుగుపెడతానని సితార గతంలో తెలిపిన విషయం తెలిసిందే.. భవిష్యత్‌లో తాను సినిమాల్లో నటిస్తానని, సినిమా రంగంలో తనకూ ఆసక్తి ఉందని ఆమె తెలిపింది. View this post on Instagram A post shared by sitara 🪩 (@sitaraghattamaneni) -
పేద వృద్ధురాలు పట్ల సితార తీరు.. నెటిజన్స్ ఫిదా!
సూపర్ స్టార్ మహేశ్ బాబు రీల్ హీరోనే కాదు రియల్ హీరో కూడా. చాలా మంది పేద పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్ చేయించి ఎన్నో ప్రాణాలను కాపాడుతున్నాడు. తండ్రికి తగ్గట్లే పిల్లలు అన్నట్లుగా.. మహేశ్ కొడుకు, కూతురు కూడా సామాజిక సేవలో ముందుంటారు. ముఖ్యంగా సితార అయితే తన వయసుకు మించిన సహాయాన్ని అందిస్తూ.. అందరి మనసులు గెలుచుకుంటుంది. పెద్దలు అంటే ఆమెకు ఎనలేని గౌరవం. ధన, పేద అనే తేడా లేకుండా అందరిని గౌరవిస్తుంది. తాజాగా జరిగిన సంఘటననే దానికి ఉదాహారణ. అసలేం జరిగింది? తాజాగా సితార హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కి తల్లి నమ్రతతో కలిసి వెళ్లింది. ఈ సందర్భంగా సదరు షాపింగ్ మాల్ యాజమాన్యం పలువురు పేద వృద్ధులకు, మహిళలకు బహుమతులు అందజేశారు. చాలా మంది వృద్ధ మహిళలు ఆ బహుమతులు అందుకోవడానికి వచ్చారు. అయితే ఓ వృద్ధురాలు మాత్రం స్టేజ్ పైకి ఎక్కడానికి చాలా ఇబ్బంది పడింది. ఇది గమనించిన సితార.. వెంటనే స్టేజ్ పై నుంచి దిగొచ్చి.. ఆమె చేయి పట్టుకొని వేదికపైకి తీసుకెళ్లింది. అనంతరం..అక్కడి వారందరితో ప్రేమగా మాట్లాడింది. సితార మంచి మనసుకు మురిసిపోయిన వృద్ధురాలు.. అపురూపంగా ఆమెను ముద్దు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ‘తండ్రి లాగే సితారది కూడా మంచి మనసు’అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మహేశ్ బాబు కూతురి ప్రేమ❤️ చూడండి @urstrulyMahesh #Sitara ❤️ pic.twitter.com/VHSSNLlCfp — Nagendra (@mavillanagendra) October 1, 2023 -
కూకట్‌పల్లిలో నెక్సస్ మాల్లో సందడి చేసిన మహేశ్‌బాబు సతీమణి నమ్రత, కూతురు సితార (ఫొటోలు)
-
వైరల్ అవుతున్న మహేష్ బాబు కొడుకు, కూతురు వినాయకుడి నిమజ్జనం
-
వినాయక నిమజ్జనంలో సితార, గౌతమ్.. వీడియో వైరల్!!
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంట్లో గణేశ్ నిమజ్జన వేడుకలు నిర్వహించారు. టాలీవుడ్ ప్రిన్స్ కూతురు సితార, కుమారుడు గౌతమ్ గణనాథునికి ఘనంగా వీడ్కోలు పలికారు. హైదరాబాద్‌లోని ఇంటిలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన వీడియోను నమ్రతా శిరోద్కర్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: తొలిసారి హీరోయిన్గా ట్రాన్స్‌జెండర్.. హీరోగా ఎవరంటే?) తమ ఇంట్లో పూజలు చేసిన వినాయకుడిని ఆవరణలోని ఓ డ్రమ్ము నీటిలో నిమజ్జనం చేశారు. ఈ వీడియోలో నమ్రతా, మహేశ్ బాబు ఎక్కడా కూడా కనిపించలేదు. ఇంట్లోని పనివారితో కలిసి ఈ వేడుకల్లో సితార, గౌతమ్ పాల్గొన్నారు. నమ్రతా ఇన్‌స్టాలో రాస్తూ 'గణపతి బప్పా మోరియా.. వచ్చే ఏడాది మళ్లీ కలుద్దాం' అంటూ పోస్ట్ చేసింది. అయితే మహేశ్ బాబు కూతురు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గానే ఉంటూ అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది. కాగా.. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న గుంటూరు కారం మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్.. రాజమౌళితో కలిసి ఓ భారీ బడ్జెట్ చిత్రం చేయనున్నారు. (ఇది చదవండి: అండమాన్ దీవుల నేపథ్యంలో సరికొత్త వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
మహేశ్ ఇంట్లో విషాదం.. సితార ఎమోషనల్!
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రస్తుతం 'గుంటూరు కారం' సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు రాజమౌళి మూవీ కోసం ఇప్పటినుంచి ఫిజికల్‌గా సరికొత్త లుక్‌లో కనిపించేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. మరోవైపు కూతురు సితార కూడా యాడ్స్ లో నటిస్తోంది. ఇలా అంతా హ్యాపీగా ఉన్న ఈ ఫ్యామిలీలో తాజాగా విషాదం నెలకొంది. ఈ విషయమై కన్నీళ్లు పెట్టుకున్న సితార.. ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఇంతకీ ఏం జరిగింది? (ఇదీ చదవండి: విజయ్ దేవరకొండకు కాబోయే భార్యపై సామ్ కామెంట్స్ వైరల్) విషాదం అంటే మనుషులు ఎవరికీ ఏం కాలేదు. దాదాపు ఏడేళ్ల నుంచి మహేశ్ ఇంట్లో ఫ్లూటో అనే కుక్కని పెంచుకుంటున్నారు. ఇప్పుడు అది చనిపోయింది. ఈ విషయాన్ని తట్టుకోలేకపోయిన సితార.. పప్పీతో బాండింగ్ ని గుర్తు చేసుకుని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. దీనికి తల్లి నమ్రత కామెంట్ పెట్టింది. 'ఫ్లూటో ఎప్పటికీ మన గుండెల్లో ఉంటుంది' అని రాసుకొచ్చింది. అలానే తన ఖాతాలోనే ఫ్లూటో చనిపోవడంపై పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే మహేశ్ అభిమానులు, సితారని ఓదార్చేలా కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by sitara 🪩 (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) (ఇదీ చదవండి: ఏపీలో పవన్ పొలిటికల్ భవిష్యత్‌పై మంచు విష్ణు కామెంట్!) -
మిమ్మల్ని ఇలా చూస్తుంటే సంతోషంగా ఉంది: నమ్రత పోస్ట్ వైరల్
టాలీవుడ్లో నమ్రతా శిరోద్కర్ పరిచయం అక్కర్లేని పేరు. మహేశ్ బాబును ప్రేమ వివాహాం చేసుకున్న నమ్రత సోషల్ మీడియాలో ఎప్పుడు చురుగ్గా ఉంటుంది. ఎక్కడికెళ్లినా అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఇటీవలే తన ముద్దుల కూతురు సితార బర్త్ డే వేడుకను మహేశ్ బాబు ఫౌండేషన్ విద్యార్థులతో కలిసి జరుపుకున్నారు. అంతే కాదు సితార పుట్టిన రోజు సందర్భంగా పాఠశాల విద్యార్థినిలకు సైకిళ్లు పంపిణీ చేశారు. (ఇది చదవండి:స్టేజిపైనే బోరున ఏడ్చేసిన హీరోయిన్.. కారణమిదే! ) మహేశ్ బాబు స్వగ్రామమైన బుర్రిపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 40 మంది బాలికలకు ఏంబీ ఫౌండేషన్ ద్వారా ఈ సైకిళ్లను అందించారు. అయితే తాజాగా దీనికి సంబంధించిన ఫోటోను నమ్రత తన ఇన్‌స్టాలో పంచుకుంది. బాలికలందరూ సైకిళ్లతో పాఠశాల ముందు నిలబడిన ఫోటోలను షేర్ చేస్తూ ఓ నోట్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ సైతం మహేశ్ బాబు ఫ్యామిలీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నమ్రత తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఈ 40 మంది చిన్నారులు పాఠశాలకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. మీరంతా పాఠశాలకు సైకిల్‌పై వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మన చదువును ఆనందంగా నేర్చుకోవడానికి ఇలాంటివి అవసరం. మీ కళ్లలో సంతోషం తీసుకొచ్చిన సితారకు, మహేశ బాబు ఫౌండేషన్‌కు ధన్యవాదాలు. 'అంటూ పోస్ట్ చేశారు. కాగా.. శనివారం మహేశ్ బాబు ఫ్యామిలీ వేకేషన్‌కు వెళ్తూ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. (ఇది చదవండి: వేకేషన్‌కు మహేశ్ బాబు ఫ్యామిలీ.. ఎయిర్‌పోర్ట్‌లో సందడి!) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
వేకేషన్‌కు మహేశ్ బాబు ఫ్యామిలీ.. ఎయిర్‌పోర్ట్‌లో సందడి!
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు. అయితే మొదట ఈ చిత్రంలో హీరోయిన్గా పూజా హేగ్డేను ఎంపిక చేయగా.. ఆ తర్వాత ఊహించని విధంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. పూజా స్థానంలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీలను హీరోయిన్గా ఎంపిక చేశారు. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే హీరో.. కాస్త విరామం దొరికితే చాలు విదేశాల్లో వాలిపోతుంటారు. (ఇది చదవండి: జ్యువెల్లరీ యాడ్‌లో సితార.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) అయితే ప్రస్తుతం గుంటూరు కారం షూటింగ్‌కు కాస్త విరామం లభించడంతో వేకేషన్ ప్లాన్ చేశాడు ప్రిన్స్ మహేశ్ బాబు. తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు పయనమయ్యారు. మహేశ్ బాబు సతీమణి, పిల్లలు సితార, గౌతమ్ హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. ఎయిర్‌పోర్ట్‌లో మహేశ్ బాబు ఫ్యామిలీ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. జూలై 20న సితార బర్త్‌డేను జరుపుకున్న సంగతి తెలిసిందే. సితార పుట్టినరోజు వేడుకను మహేష్ బాబు ఫౌండేషన్‌లోని యువతులతో కలిసి ఇంట్లోనే చాలా సింపుల్‌గా జరుపుకున్నారు. కాగా.. ఇటీవలే సితార మొదటి జ్యూవెల్లరీ యాడ్ న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఈ యాడ్ కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. సితారకు యాడ్ కోసం ఏకంగా రూ.కోటి ఇచ్చినట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: బేబీ బంప్ వీడియో షేర్ చేసిన నటి..సోషల్ మీడియాలో వైరల్!) Superstar #MaheshBabu with family off to vacation #GunturKaaram @urstrulyMahesh pic.twitter.com/srs35m2Hoh — 𝙎𝙎𝙈𝘽 𝙁𝙍𝙀𝘼𝙆𝙎 𝙁𝘾 (@ssmb_freaks) July 22, 2023 -
Sitara Ghattamaneni Birthday Celebrations: గ్రాండ్ గా సితార పుట్టిన రోజు వేడుక
-
Sitara Ghattamaneni Family Photos: ఫ్యామిలీతో సితార.. ఈ ఫోటోలపై ఓ లుక్కేయండి
-
పుట్టినరోజున పేదపిల్లలకు సితార పాప సైకిళ్ల పంపిణీ (ఫొటోలు)
-
బర్త్‌డే స్పెషల్.. సితార చేసిన పనికి మెచ్చుకోకుండా ఉండలేరు
-
మీరెప్పుడూ చూడని సితార చిన్నప్పటి ఫోటోలు
-
నేడు సితార పుట్టినరోజు.. ఆ పిల్లల కోసం గొప్ప మనసు చాటుకుంది
సూపర్ స్టార్ మహేశ్‌బాబు గారాలపట్టి సితార బర్త్‌డే నేడు (జూలై 20). ఈ సందర్భంగా మహేశ్ తన కూతురికి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. '11వ పడిలోకి అడుగు పెట్టిన నా చిన్నారి పాపకు బర్త్‌డే శుభాకాంక్షలు. నా ప్రపంచంలో నువ్వే స్టార్‌వి. నువ్వు ఏదైనా సాధించగలవు. అని మహేష్ అన్నారు. మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ కుమార్తెగానే కాకుండా తను ఇప్పుడు ఒక స్టార్‌గా గుర్తింపు పొందింది. కానీ నేడు తన పుట్టినరోజును ఎంతో ఆలోచనాత్మకంగా జరుపుకుంది. ఇప్పటికే స్టార్‌గా ఉన్న సితార.. బర్త్‌డేను విలాసవంతమైన సంబరాలకు పోకుండా ఇలా మహేష్‌బాబు ఫౌండేషన్‌లోని యువతులతో చాలా సాధారణంగా సెలబ్రేట్ చేసుకుంది. దీంతో సోషల్‌మీడియా నుంచి ఆమెకు చాలా ప్రంశంసలతో పాటు శుభాకాంక్షలు అందుతున్నాయి. సితార పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఓ వీడియోను నమ్రత శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో, సితార మహేష్ బాబు ఫౌండేషన్‌లోని యువతులను కలుసుకోవడం, వారితో కేక్ కట్ చేయడం వంటివి ఉన్నాయి. అక్కడ ఉన్న వారందరికి పింక్ కలర్లో ఉన్న సైకిళ్లను సితార బహుమతిగా ఇచ్చింది. వీడియో షేర్ చేస్తూ నమ్రత ఇలా తెలిపింది. 'ఇప్పుడు ఆ చిన్నారులు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు వారందరికి పాఠశాల కేవలం సైకిల్ దూరంలో ఉంది. నీలో ఆలోచనాత్మకత ,ఇతరులపై ప్రేమను చూపించే పెద్ద హృదయం ఉంది. నీ అద్భుతమైన ప్రయాణంలో ఇలాంటి అర్థవంతమైన జ్ఞాపకాలను మరెన్నో సృష్టించాలని కోరుకుంటున్నాను.' అని సితారకు నమ్రత పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. పీఎంజే జ్యువెలరీ యాడ్‌లో సితార నటించగా, అందుకు సంబంధించిన ఫోటోలను బిల్‌బోర్డ్‌పై ప్రదర్శించారు. ఈ ప్రకటనలో నటించేందుకుగానూ సితార కోటి రూపాయలు పారితోషికం తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఓ ఇంటర్వ్యూలో తన తొలి పారితోషికంపై స్పందించిన సితార. తనకు ఇచ్చిన రెమ్యునరేషన్‌ను చారిటీకి ఇచ్చానంది సితార. ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ ఆదర్శనీయంగా నిలిచిన మహేశ్‌బాబు అడుగుజాడల్లోనే సితార కూడా నడుస్తోందంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సితార ఫస్ట్ యాక్టింగ్ వీడియో.. తండ్రినే మించిపోయేలా!
Sitara Ad Video: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు తన తర్వాతి తరాన్ని కూడా అప్పుడే పరిచయం చేసేశాడు. కొడుకు గౌతమ్ ఓ సినిమాలో నటించాడు. కాకపోతే అది చైల్డ్ ఆర్టిస్ట్ రోల్. కాబట్టి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కూతురు సితార మాత్రం ఇప్పటి నుంచే తండ్రి మించిపోయేలా అలరిస్తోంది. (ఇదీ చదవండి: ఇద్దరు పిల్లలున్నారు.. బాంబు పేల్చిన తెలుగు హీరోయిన్) సితారకు ప్రస్తుతం 11 ఏళ్లు. అయితేనేం ఏ సెలబ్రిటీ కిడ్కి సాధ్యం కాని విధంగా ఓ యాడ్‌లో నటించింది. ఇందుకోసం ఆమెకు ఏకంగా రూ.కోటి వరకు రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్ నడుస్తోంది. సరే ఎంత అందుకుంది అనేది పక్కనబెడితే ఆ మొత్తాన్ని ఛారిటీకి ఇచ్చేసినట్లు స్వయంగా ఆమెనే బయటపెట్టింది. అలానే ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌లో ఈ యాడ్‌ని తొలుత ప్రదర్శించారు. ఇప్పుడు ఆ యాడ్ పూర్తి వీడియోని మహేశ్‌బాబు తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశాడు. ఈ యాడ్ వీడియోలో సితార.. చాలా అనుభవం ఉన్న అమ్మాయిలా నటించింది. కొన్నిచోట్ల యాక్టింగ్‌లో మెరుపడాల్సి ఉన్నప్పటికీ.. స్క్రీన్ ప్రెజెన్స్, హైట్, స్కిన్ కలర్ తదితర అంశాల్లో మాత్రం తండ్రి మహేశ్‌ని మించిపోతుందేమో అనిపించేలా ఉంది. త్వరలో సినిమాల్లోకి వస్తానని ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన సితార.. ఆల్రెడీ డ్యాన్సర్‌గా ప్రూవ్ చేసుకుంది. ముందు ముందు ఇంకెన్ని అద్భుతాలతో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుందో చూడాలి. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) (ఇదీ చదవండి: మెగాహీరో సినిమాలకు దూరం) -
నాన్న బాటలోనే రాణిస్తా.. సేవలు కొనసాగిస్తా..ఘట్టమనేని సితార
హైదరాబాద్: సామాజిక మాద్యమాల్లో ఈ మధ్య సోషల్ సెలబ్రిటీగా మారిన సూపర్‌స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని కూడా చలనచిత్ర రంగంలోకి అడుగిడుతుందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్న వేళ.. స్వయంగా సితారనే స్పందించింది. భవిష్యత్‌లో తాను సినిమాల్లో నటిస్తానని, సినిమా రంగంలో తనకూ ఆసక్తి ఉందని తెలిపింది. తాజాగా సితార నటించిన పీఎంజే జ్యువెల్స్ యాడ్ షార్ట్ ఫిల్మ్ ‘ప్రిన్సెస్’ ప్రివ్యూను శనివారం బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సితార తన తల్లి నమ్రతా శిరోద్కర్‌తో కలిసి హాజరైంది. షార్ట్ ఫిల్మ్‌తో పాటు సితార కలెక్షన్స్‌తో రూపొందించిన లుక్ బుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సితార మాట్లాడుతూ... వాణిజ్య ప్రకటనలో నటించడంతో వచ్చిన తన తొలి పారితోషికాన్ని చారిటీ కోసం ఖర్చు చేశానంది. అమ్మ– నాన్న.. తనతో బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉంటారని, ఏ విషయమైనా వారితోనే పంచుకుంటానని సంతోషాన్ని వ్యక్తం చేసింది. న్యూయార్క్‌లోని ప్రతిష్టాత్మక టైమ్స్ స్క్వేర్ వేదికపై పీఎంజే జ్యువెల్స్ ఆధ్వర్యంలో సితార సిగ్నెచర్ కలెక్షన్స్ ప్రారంభించడం పట్ల తన తండ్రి మహేష్ బాబు ఎంతో సంతోషంగా ఉన్నారని, తన అమితమైన ఆనందాన్ని స్వయంగా చూశానని సితార తెలిపింది. మహేష్ భావోద్వేగానికి గురయ్యారు.. సితార యాడ్ ఫిల్మ్ చూసినప్పుడు మహేష్‌బాబు భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారని నమ్రతా శిరోద్కర్ తెలిపారు. ఈ సందర్భంగా ‘మీ తనయుడు గౌతమ్ సినిమాల్లోకి ఎప్పుడు వస్తారు’ అని నమ్రతను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. గౌతమ్ ప్రస్తుతం తన చదువుపై ఆసక్తిగా ఉన్నాడని, ఆరేడేళ్ల తర్వాత సినిమాల్లోకి వస్తాడని పేర్కొన్నారు. కేవలం కొన్ని అంశాలను పరిగణించి సినిమా రంగాన్ని కొందరు చెడుగా చూస్తారు.. కానీ సినిమా రంగం చాలా ఉన్నతమైనదని, ఎంతో మందికి గొప్ప వేదిక అని నమ్రత వివరించారు. శౌర్య పరువు దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిల్మ్‌ని పీఎంజే జ్యువెల్స్ అధికారికంగా ఈ నెల 19న విడుదల చేయనున్నామని జ్యువెల్స్ ప్రిన్సిపల్ డిజైనర్ డైరెక్టర్ దినేష్ జైన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ రక్షిత జైన్, నిమేష్, కిరణ్, సీమ, శిల్ప తదితరులు పాల్గొన్నారు. -
సినిమాల్లోకి జూ.ఎన్టీఆర్ కుమారుడు.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ రామ్ సినిమాల్లోకి బాలనటుడిగా తెరంగేట్రం చేయనున్నాడు. అది కూడా సూపర్ స్టార్ మహేశ్‌బాబు కూతురు సితారతో కలిసి నటించబోతున్నాడు. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. దీంతో జూ.ఎన్టీఆర్ - మహేశ్‌బాబు ఫ్యాన్స్‌కు పండుగ లాంటి వార్త అయింది. (ఇదీ చదవండి: గ్లామర్‌తో మతిపోగొడుతోన్న హనీరోజ్ .. సినిమా బ్యాన్ చేయాలంటూ..) ఇప్పటికే రవితేజ, సుధీర్‌బాబు, మహేశ్ బాబు, అల్లు అర్జున్ సహా వారి పిల్లలు పలు సినిమాల్లో కనిపించారు. ఘట్టమనేని సితార సర్కారు వారి పాటలో కనిపించి ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసింది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ రామ్ కూడా సినిమాల్లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహేశ్ కూతురు సితార మల్టీటాలెంటెడ్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో సోషల్‌మీడియాలోనూ ఆమెకు మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇండియాలోనే టాప్ దర్శకుడు అయిన రాజమౌళి తెరకెక్కించబోయే కొత్త సినిమాతో అభయ్ రామ్ ఎంట్రీ ఉండబోతుందని బలంగా ప్రచారం జరుగుతుంది. ప్రిన్స్ మహేశ్‌బాబుతో కలిసి రాజమౌళి ఓ భారీ అడ్వెంచర్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదే సినిమాలో ఇంట్రడక్షన్ సీన్ దాదాపు 15 నిమిషాల పాటు ఉండనుందని సమాచారం. ఇందులో నటించేందుకు సితార - అభయ్ రామ్‌ను అక్కాతమ్ముళ్లుగా చూపించేందుకు జక్కన్న ప్లాన్ వేశారట. ఇప్పుడు ఇదే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఇదే నిజమైతే తారక్ కుమారుడు మొదటిసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరిసినట్టవుతుంది. (ఇదీ చదవండి: ‘బిగ్‌బాస్ 7’లోకి బ్యాంకాక్ పిల్ల.. వీడియోతో క్లారిటీ) -
తొలి పారితోషికంపై సితార కామెంట్స్.. నెట్టింట ప్రశంసల జల్లు
మహేశ్‌బాబు- నమ్రతా శిరోద్కర్‌ల ముద్దుల తనయ సితార అప్పుడే తండ్రి గర్వించే స్థాయికి ఎదిగింది. సితార తొలిసారిగా న్యూయార్క్‌లోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌పై మెరిసిన సంగతి తెలిసిందే కదా! పీఎంజే జ్యువెలరీ యాడ్‌లో సితార నటించగా, అందుకు సంబంధించిన ఫోటోలను బిల్‌బోర్డ్‌పై ప్రదర్శించారు. ఈ ప్రకటనలో నటించేందుకుగానూ సితార కోటి రూపాయలు పారితోషికం తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఇకపోతే చిన్న వయసులోనే యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి అదుర్స్ అనిపించిన సితార మంచి డ్యాన్సర్ కూడా! అదిరిపోయే స్టెప్పులు వేసిన డ్యాన్స్ వీడియోలను అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. ఫ్రోజెన్ 2 సినిమా తెలుగు వర్షన్లో బేబీ ఎల్సా పాత్రకు కూడా తనే వాయిస్ ఓవర్ ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా పీఎంజే అనే జ్యువెలరీ బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గానూ నిలిచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తొలి పారితోషికంపై స్పందించింది. తనకు ఇచ్చిన రెమ్యునరేషన్‌ను చారిటీకి ఇచ్చానంది సితార. ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ ఆదర్శనీయంగా నిలిచిన మహేశ్‌బాబు అడుగుజాడల్లోనే సితార కూడా నడుస్తోందంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: స్టార్ హీరోయిన్.. అయినా చెప్పులు మోసింది -
ట్వింకిల్ ట్వింకిల్ సూపర్‌స్టార్
మహేష్ బాబు–నమ్రతా శిరోద్కర్‌ల ముద్దుల కూతురు సితార న్యూయార్క్‌లోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌పై మెరిసి నెటిజనులను కనువిందు చేసింది. ఒక జ్యుయెలరీ యాడ్‌లో సితార నటించింది. ఆ యాడ్‌కు సంబంధించిన చిత్రాలను బిల్‌బోర్డ్‌పై ప్రదర్శించారు. ‘సో సో ప్రౌడ్ ఆఫ్ యూ మై ఫైర్ క్రాకర్’ అంటూ మహేష్‌బాబు సితార చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘పదాలలో చెప్పలేని సంతోషం ఇది. కీప్ షైనింగ్ మై సూపర్ స్టార్’ అంటూ స్పందించింది నమ్రతా శిరోద్కర్. చిన్న వయసులోనే యూ ట్యూబ్ చానల్ మొదలు పెట్టి ‘ఆహా!’ అనిపించిన సితార చక్కని డ్యాన్సర్ కూడా. ‘ఫ్రోజెన్–2’ సినిమా తెలుగు వెర్షన్లో బేబీ ఎల్సా పాత్రకు వాయిస్–వోవర్ ఇచ్చింది. జ్యుయలరీ బ్రాండ్ ‘పీఎంజే’కు సితార బ్రాండ్ అంబాసిడర్. ఈ నేపథ్యంలో యంగెస్ట్ స్టార్ కిడ్‌గా టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌పై మెరిసింది. -
ఎవరూ ఊహించలేని టార్గెట్ వైపు అడుగులేస్తున్న 'సితార'
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి సితార. కాదు.. కాదు.. 'సితార ఘట్టమనేని' అని చెప్పుకునే స్థాయికి చేరుకుంది. మొదట ప్రిన్స్ మహేష్ బాబు ఫేమ్‌తో గుర్తింపు దక్కినా తర్వాత తన టాలెంట్‌తో సపరేట్ ఫ్యాన్ బేస్‌నే క్రియేట్ చేసుకునే స్థాయికి చేరుకుంది. సితార శాస్త్రీయ నృత్యం నేర్చుకుంది. దీంతో సోషల్ మీడియాలో డ్యాన్స్ వీడియోలతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. గతంలో సినీ సెలబ్రిటీలను కూడా ఇంటర్వ్యూ చేసింది. అంతే కాకుండా ఇటీవలే ఓ ప్రముఖ జ్యూయెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా సైన్ చేసి.. ఆ సంస్థ నుంచి ఒక హీరోయిన్ అందకునేంత రెమ్యునరేషన్ తీసుకుంది. అంటే సుమారు కోటి రూపాయలకు పైగానే అని చెప్పవచ్చు. (ఇదీ చదవండి: Sitara Ad Remuneration: చిన్న యాడ్.. కళ్లుచెదిరే మొత్తం ఇచ్చారు!) గతంలో తన గురించి మహేష్ ఇలా అన్నారు. 'సితార ఎప్పుడో సూపర్ స్టార్ అయిపోయింది. తను ఇంగ్లీష్,తెలుగు చాలా చక్కగ మాట్లాడుతుంది. ముఖ్యంగా తను మాట్లాడేటప్పుడు అమెరికన్ యాక్సెంట్ ఉంటుంది. కానీ అలా మాట్లాడాలని మేము ఎప్పుడూ చెప్పలేదు. తనకు సొంతంగా వచ్చింది.' అని చెప్పారు. సితార ఇంత వరకు ఎలాంటి సినిమాలు తీయలేదు. యూట్యూబ్,ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే తను కనిపిస్తుంది. అక్కడ కూడా తనకు మిలియన్ల కొద్ది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే సితార ఒక స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం వెనుక ఆమె తల్లి నమ్రతా కృషి ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అమెకు డ్యాన్స్,యాక్టింగ్‌లో హావ భావాలు పలికించడంలో రాటుతేలేందకు శిక్షణ ఇప్పించింది. ఈ విధంగా చాలా విషయాల్లో సితార మీద చిన్నప్పటి నుంచే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది నమ్రత. దీంతో ఆమె ఒక స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది. (ఇదీ చదవండి: ప్రభాస్ 'ప్రాజెక్ట్-కె' నుంచి బిగ్ అనౌన్స్మెంట్..!) తాజాగా సినీ ఇండస్ట్రీ నుంచే కాకుండా మహేష్ బాబు అభిమానుల్లో సితార గురించి ఒక వార్త ప్రచారం జరుగుతుంది. సితారని 'మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్' పోటీలకు నమ్రత సిద్ధం చేస్తోంది అని... ఆపై సితారను హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలో పరిచయం చెయ్యాలని అనుకుంటున్నారట.. ఇప్పుడు ఈ వార్త బాగా వైరల్ అవుతుంది. అయితే సితారకి ఇంకా పదకొండేళ్లే.. మిస్ యూనివర్స్ పోటీలలో పాల్గొనాలంటే ఇంకా సుమారుగా ఆరేళ్లు ఉండాల్సిందే. మరీ ఇప్పటి నుంచే ఎందుకంటారా? అలాంటి పోటీలకు శిక్షణ చాలా ముఖ్యం. అక్కడ రానించాలంటే లాంగ్ టర్మ్ తర్ఫీదు తప్పదు. ఈ శిక్షణల వల్లే తను బాలీవుడ్ టాప్ హీరోల పిల్లలను కూడా దాటేసి తనకంటు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ యాడ్ రిలీజ్ అయ్యాక ఆమె మరింత పాపులర్ అవడం ఖాయం. ఒక రకంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సితార ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు సాగడం ఖాయం అని మహేష్ ఫ్యాన్స్ అంటున్నారు. View this post on Instagram A post shared by sitara 🍓 (@sitaraghattamaneni) (ఇదీ చదవండి: 'రంగబలి' సినిమా రివ్యూ) -
పాపులారిటీలో మహేష్ ని మించిపోయిన సితార
-
జ్యువెల్లరీ యాడ్‌లో సితార.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సినిమాలతో బిజీగా ఉంటే.. కూతురు సితార మాత్రం రికార్డులు సృష్టిస్తోంది. చిన్న వయసులో యాడ్ షూట్ లో పాల్గొన్న స్టార్ కిడ్ గా ఘనత సాధించింది. ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలోనూ ఎక్కడికో వెళ్లిపోయినట్లు కనిపిస్తుంది. చేసింది జ్యూవెల్లరీ యాడ్ అయితేనేం.. సితారకు పెద్ద మొత్తమే ఇచ్చారని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం? (ఇదీ చదవండి: అభిమానుల్ని మోసం చేస్తున్న స్టార్ హీరోలు!) సూపర్‌స్టార్ మహేశ్.. ఏడాది లేదా ఏడాదిన్నరకు ఓ సినిమా చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంటాడు. కానీ యాడ్స్, ప్రమోషన్స్ రూపంలో మరోవైపు నుంచి గట్టిగానే సంపాదిస్తున్నాడు. పాన్ మసాలా దగ్గర నుంచి సోప్ వరకు ప్రతిదానిలోనూ యాక్ట్ చేస్తుంటాడు. కోట్లకు కోట్లు ఆర్జిస్తుంటాడు. మహేశ్ ఫ్యామిలీ అంతా కలిసి గతంలో ఓ యాడ్ లో కనిపించారు. ఆ తర్వాత కూతురు సితారకు పలు ఆఫర్స్ వచ్చాయట. కానీ ఎందుకో మహేశ్ వాటిని ఒప్పుకోలేదు. ఇప్పుడు మాత్రం జ్యూవెల్లరీ యాడ్ లో సితార నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కొన్నాళ్ల ముందు ఈ యాడ్ షూట్ జరగ్గా.. ఆ వీడియోని న్యూయార్క్ లోని టైమ్ స్క్వేర్ లో తాజాగా ప్రదర్శించారు. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మహేశ్.. కూతురు ఎదుగుదల చూసి తెగ ఆనందపడిపోయాడు. చాలా ఆఫర్లకు ఒప్పుకోని మహేశ్.. ఇలా ఈ యాడ్ కి ఎలా అంగీకరించాడా అని మీకు డౌట్ రావొచ్చు. అయితే ఇందులో సితార యాక్ట్ చేసినందుకు గానూ ఏకంగా రూ.కోటి ఇచ్చారట. బహుశా మహేశ్ కూడా తన తొలి యాడ్ కోసం కూడా ఇంత తీసుకుని ఉండడు. అందుకే సితార యాడ్ షూట్ కి ఒప్పుకున్నాడేమో? Lighting up the Times Square!! 💥💥💥 So so proud of you my fire cracker ♥️♥️♥️ Continue to dazzle and shine!! 😘😘😘 #SitaraGhattamaneni pic.twitter.com/3ALO0HGNMy — Mahesh Babu (@urstrulyMahesh) July 4, 2023 (ఇదీ చదవండి: ఓ పక్క పెళ్లి.. మరో పక్క విడాకులు.. మెగా ఫ్యామిలీకి ఎందుకిలా?) -
మహేశ్నే మించిపోయిన సితార.. ఆ ఒక్క విషయంలో
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఫుల్ హ్యాపీ. ఓ పక్క సినిమాలు, యాడ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు అతడికి పోటీగా కూతురు సితార కూడా వచ్చేసింది. తన అంతా హైట్ పెరిగిపోయిందని ఆశ్చర్యపడేలోపే.. మరో షాక్ ఇచ్చి మహేశ్నే అవాక్కయ్యేలా చేసినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఏకంగా పాన్ వరల్డ్ రేంజులో ఎంట్రీ ఇచ్చింది. సితార గ్రాండ్ ఎంట్రీ! మహేశ్ కూతురు సితారని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఎప్పటికప్పుడు మహేశ్, నమ్రత షేర్ చేసే ఫొటోలు, వీడియోల వల్ల సితార ఎలా ఉంది, ఏం చేస్తుందనేది తెలుస్తూనే ఉంది. ఇక సితార డ్యాన్స్ వీడియోలైతే ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇదంతా కాదన్నట్లు రీసెంట్ గా ఓ జ్యూవెల్లరీ యాడ్ షూట్లో సితార తొలిసారి పాల్గొంది. ఇప్పుడు దాన్ని న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లో ప్రదర్శించారు. (ఇదీ చదవండి: పాయల్ కొత్త సినిమా టీజర్.. అలాంటి సీన్స్‌తో!) పాన్ వరల్డ్ రేంజులో ఓ నెలరోజుల క్రితం జరిగిన ఈ యాడ్ షూట్ లో సితార పాల్గొనడం ఓ విధంగా రికార్డ్. ఎందుకంటే టీనేజ్ లోకి రాకముందే ఇలా మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిందని తెలియగానే అభిమానులు చాలా సంతోషపడ్డారు. ఇప్పుడు ఏకంగా దాన్ని అమెరికాలోని ప్రఖ్యాత టైమ్ స్కేర్వ్ లో ప్రదర్శించారనేసరికి సోషల్ మీడియాలో ఆ ఫొటోలు, వీడియోలని వైరల్ చేస్తున్నారు. యాక్టర్ అవుతుందా? డ్యాన్సర్‌గా అద్భుతమైన ప్రతిభ చూపిస్తున్న సితార.. ఇప్పుడు యాడ్ షూట్స్ లోకి కూడా వచ్చేసింది. తండ్రి ఇక్కడ యాడ్స్ చేస్తుంటే.. సితార మాత్రం అమెరికా నుంచి మొదలుపెట్టింది. మరి తండ్రి అడుగుజాడల్లోనే నటిగా అరంగేట్రం వస్తుందా లేదంటే కేవలం యాడ్స్, డ్యాన్స్ వరకే పరిమితం అవుతుందా అనేది చూడాలి. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) (ఇదీ చదవండి: సమంత మళ్లీ ప్రేమలో పడిందా? ఆ పోస్ట్ అర్థమేంటి?) -
నా బిగ్గెస్ట్ చీర్లీడర్ అంటూ ఫోటో షేర్ చేసిన సితార
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూతురిగా సితార ఘట్టమనేని పరిచయమే. కానీ తనకంటూ సొంతగుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది. అందుకేనేమో సోషల్‌మీడియాలో తనకు ఫ్యాన్స్ ఎక్కువే. తాజాగా మహేష్‌బాబుకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా షేర్ చేసింది. (ఇదీ చదవండి: Adipurush: దిల్ రాజు ముందే ఊహించాడా?) 'మా సూపర్ డాడ్, నా బిగ్గెస్ట్ చీర్లీడర్కి హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా... లవ్ యూ టు ది మూన్ ' అంటూ తెలిపింది. సితార షేర్ చేసిన ఫోటోలు చాలా అందంగా ఉన్నాయి. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. మహేష్ బాబు తన పిల్లల కోసం ఎక్కువగానే సమయం కేటాయిస్తాడు. అందుకే ఆయనకు పిల్లలతో ప్రత్యేకమైన బాండింగ్ ఉంటుంది. దీంతో టాలీవుడ్లో మహేష్‌కు ఫ్యామిలీ మ్యాన్‌గా గుర్తింపు ఉంది. సినిమా విషయానికి వస్తే గుంటూరు కారం మూవీతో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. (ఇదీ చదవండి: రాజకీయాల్లో సినిమా గ్లామర్ క్లిక్ అవుతుందా?) -
సారంగ దరియా పాటకు సితార డాన్స్
-
‘సారంగ దరియా’పాటకు సీతూ పాప అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు గారాలపట్టి సితార గురించి అందరికి తెలిసిందే. ఇప్పటికీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఆమెకు ఫుల్ క్రేజ్ ఉంది. ఆమె షేర్ చేసే డ్యాన్స్ వీడియోస్, ఫోటోలు తెగ వైరల్ అవుతాయి. సీతూ పాప టాలెంట్ చూసి మహేశ్‌బాబు ప్యాన్స్‌తో పాటు మిగతా నెటిజన్స్ కూడా మురిసిపోతుంటారు. గతంలో మహేశ్ బాబు సినిమాల్లోని చాలా పాటలకు సితార స్టెప్పులేసి అలరించింది. తాజాగా సాయి పల్లవి పాటకు డ్యాన్స్ చేసి, ఆ వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. సాయి పల్లవి, నాగచైతన్య జంటగా నటించిన చిత్రం ‘లవ్‌స్టోరి’. ఈ మూవీలోని ‘సారంగ దరియా’ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. తాజాగా ఈ పాటకు మహేశ్ ముద్దుల తనయ స్టెప్పులేసి అలరించింది. లంగా ఓణీ ధరించి చక్కని అభినయంతో అచ్చం సాయి పల్లవిలా డాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగవైరల్ అవుతోంది. ఇవి చదవండి: ఫ్రెండ్‌కి కాస్ట్లీ కారు గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో! పెళ్లి చేసుకోవాలనుంది, నాకంటూ ఓ కుటుంబం కావాలి: కంగనా -
ఈ విషయంలో మొదటి భారతీయ స్టార్ కిడ్‌గా 'సితారా పాప'కు గుర్తింపు
ప్రముఖ నటుడు మహేశ్‌బాబు తనయ సితార సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. ఫొటోషూట్, విహార యాత్రలు, వేడుకలు.. ఇలా తాను ఎంజాయ్ చేసిన వాటన్నింటి వివరాలను ఫాలోవర్స్‌తో పంచుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే మిలియన్‌కు పైగా ఫాలోవర్లను సంపాదించింది. ఇక తరచూ తండ్రి మహేశ్ నటించిన లేదా ఇతర సినిమాల్లోని పాటలకు తను డాన్స్ చేసిన వీడియోలను ఇన్‌స్టాలో అప్లోడ్ చేస్తుంటోంది. కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్ వద్ద సీతార కొద్ది రోజులుగా డ్యాన్స్ నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. (ఇదీ చదవండి: Adipurush: అక్కడ టికెట్లు కొనేవారే లేరు.. షాక్‌లో ఫ్యాన్స్) తాజాగా సాయిపల్లవి నటించిన లవ్స్టోరీలోని సారంగదరియా సాంగ్‌కు అద్భుతంగా డాన్స్ చేసింది సితార. ఈ వీడియోను తన ఇన్‌స్టా అకౌంట్లో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. తన పెర్ఫార్మెన్స్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సితార డాన్స్ వీడియోకు కేవలం గంట సమయంలోనే దాదాపు లక్షకు పైగా లైక్స్ రావడం విశేషం. టాలీవుడ్ స్టార్ కిడ్స్‌లో సితార చాలా డిఫరెంట్.. ఇప్పటికే తను జ్యూయెలరీ సంస్థకు కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా సైన్ చేసింది. దీంతో యాడ్ కోసం అతి పెద్ద సంస్థకు సైన్ చేసిన మొదటి భారతీయ స్టార్ కిడ్‌గా నిలిచింది. అందుకు గాను సితార భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే షూట్ పూర్తి అయినట్లు సమాచారం. దీంతో మా సితార పాప మల్టీ టాలెంటేడ్ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. Sitara Papa New Dance Video She is really a Rock Star💫 pic.twitter.com/xQlay0b07B — Srinadh (@Srinadhdhfm) June 15, 2023 (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసులో ఇద్దరు స్టార్ హీరోయిన్లు, డైరెక్టర్?) -
పార్టీలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిన మహేశ్‌బాబు (ఫొటోలు)
-
ఆ నవ్వు, అందం.. ఎంతైనా మహేశ్‌బాబు రేంజే వేరు!
మహేశ్ ఈ పేరు వింటే వెబ్రేషన్స్.. ఆయన ఒక్క స్మైల్ ఇచ్చాడంటే అమ్మాయిల గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటాయి. ఇప్పటికీ అందాన్ని చెక్కుచెదరనివ్వకుండా కాపాడుకుంటున్న ఈ సూపర్‌స్టార్ ఎంతోమంది హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. 47 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా కనిపించడం ఒక్క మహేశ్ బాబుకే చెల్లుతుంది. తాజాగా అతడు ఫ్యామిలీతో కలిసి ఓ పార్టీలో పాల్గొన్నాడు. భార్య నమ్రత, కూతురు సితారతో పాటు ఫ్రెండ్స్‌తో కలిసి దిగిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. 'వాట్ ఎ ఫన్ నైట్' అంటూ క్యాప్షన్ జోడించాడు. ఇందులో మహేశ్ స్మైల్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 'ఏ యాంగిల్లో చూసినా అందంగా ఉండేది నువ్వే బ్రో..', 'ఏమున్నాడ్రా మా అన్నయ్య..', 'అందానికి ఆధార్ కార్డులా ఉన్నాడు మా బాబులకే బాబు మహేశ్‌బాబు' అని కామెంట్లు చేస్తున్నారు. అటు నమ్రత కూడా పార్టీకి సంబంధించిన మరిన్ని ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. 'మా ఫ్రెండ్స్ అందరినీ కలిశాం.. పార్టీ ఎంత బాగా జరిగిందో.. నా కూతురితో కలిసి ఇలా పార్టీకి వెళ్లడం బహుశా ఇదే తొలిసారి. తన తండ్రిలాగే తను కూడా ఎంత అల్లరి చేసిందో' అని రాసుకొచ్చింది. ఈ పార్టీకి సంబంధించి పూర్తి వివరాలు మాత్రం తెలియరాలేదు. ఇక మహేశ్‌బాబు విషయానికి వస్తే గతేడాది సర్కారువారి పాట సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. గుంటూరు కారంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అతడు, ఖలేజా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్.. మహేశ్‌బాబుతో చేస్తున్న మూడో సినిమా ఇది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) చదవండి: ఇండియాలో టాప్ 50 వెబ్ సిరీస్‌లు ఇవే, టాప్ 5లో ఏమున్నాయంటే? -
చిన్నవయసులోనే ఆ కాంట్రాక్ట్ సైన్ చేసిన సితార.. భారీగా రెమ్యునరేషన్
సూపర్‌స్టార్ మహేశ్ బాబు కూతురు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. స్టార్ కిడ్‌గా సోషల్ మీడియాలో సితారకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాలో బాగా యాక్టివ్‌గా ఉండే సితార.. ఫ్యామిలీ మూమెంట్స్‌తో పాటు తనకు సంబంధించిన విషయాలను కూడా షేర్ చేస్తుంటుంది. లేటెస్ట్ ఫోటోలు, డ్యాన్స్ వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఆమెకు ఇన్‌స్టాలో 12లక్షలకు పైగానే ఫాలోవర్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీనికి తోడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి సొంతంగా ఓ యూట్యూబ్ చానెల్ కూడా నిర్వహిస్తుంది. మహేశ్ ముద్దుల కూతురిగానే కాకుండా తన స్పెషల్ టాలెంట్‌తో ఈ లిటిల్ సూపర్‌స్టార్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా మరో రికార్డును క్రియేట్ చేసింది. సితారకు ఉన్న ఫ్యాన్ బేస్‌ను దృష్టిలో ఉంచుకొని ఓ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ సితారను తన ప్రచారకర్తగా నియమించుకుంది. ఇందుకోసం ఆమెకు పెద్ద మొత్తంలోనే రెమ్యునరేషన్ అందించినట్లు సమాచారం. ఇప్పటికే సితారతో మూడు రోజుల పాటు యాడ్ షూట్ చేశారట. ప్రముఖ టెక్నీషియన్లు ఈ యాడ్ కోసం పనిచేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన యాడ్ టీవీల్లో కనిపించనుంది. ఈ విషయం తెలిసి మహేశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 🌟 Sitara Ghattamaneni, The Most Happening star kid to bag a major jewellery brand contract! 💎✨ Proud parents Mahesh Babu and Namrata are overjoyed! Stay tuned for the grand TVC launch! @urstrulyMahesh #NamrataShirodkar #Sitara pic.twitter.com/rOMfEjcrio — Mahesh Babu Space (@SSMBSpace) May 26, 2023 -
సితార.. నీ హృదయంతో చేయి.. నమ్రత పోస్ట్ వైరల్!
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ మహేశ్‌బాబు-నమ్రత శిరోద్కర్ జంట ఒకటి. ఇక వీరి పిల్లలు గౌతమ్, సితార గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే మహేశ్ బాబు గారాలపట్టి సితార గురించి మనందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. విదేశాల్లో ఎక్కడ ఉన్నా కూడా ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటుంది. అయితే తాజాగా సితారకు సంబంధించిన ఓ వీడియోను నమ్రత శిరోద్కర్ తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: ఓటీటీకి నాగచైతన్య 'కస్టడీ'.. స్ట్రీమింగ్ పార్ట్నర్ ఫిక్స్!) అయితే గతంలో సితార భరతనాట్యం నేర్చుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే సితార తనదైన టాలెంట్‌తో దూసుకెళ్తోంది. ఓ బాలీవుడ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన వీడియో ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను నమ్రత తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో నెటిజన్స్ వాట్ ఏ గ్రేట్ ఫర్మామెన్స్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సితారా ఓ స్టార్ అంటూ పోస్టులు పెడుతున్నారు. సితార స్టెప్పులకు ఒక అమ్మగా నమ్రత ఫిదా అవ్వకుండా ఉండలేకపోయింది. 'నీ హృదయంతో డ్యాన్స్ చేయి.. నీ పాదం దాన్ని అనుసరిస్తుంది.' అంటూ నమ్రత పోస్ట్ చేసింది. (ఇది చదవండి: ఉపాసనపై కామెంట్స్.. ఓ వ్యక్తిని చితకబాదిన చెర్రీ ఫ్యాన్స్!) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
సితారకు స్టార్ హీరోయిన్ గిఫ్ట్.. సోషల్ మీడియాలో వైరల్
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ముద్దుల కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్డేట్స్ ఇస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. విదేశాల్లో ఉన్నా కూడా ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది. తాజాగా సితార తన ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ వైరలవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పంపిన దుస్తులను పోస్ట్ చేస్తూ కృతజ్ఞతలు తెలిపింది. (ఇది చదవండి: వెబ్సైట్ ప్రారంభిస్తున్నందుకు సంతోషిస్తున్నాం: సితార) ఆలియా భట్ గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ కుమారులకు దుస్తులు పంపి సర్ప్రైజ్ ఇచ్చింది. తాజాగా మరోసారి మహేశ్- నమ్రతల గారాలపట్టి సితారకు దుస్తులు పంపింది. వాటి ఫోటోలను సితార తన ఇన్‌స్టాలో పంచుకుంది. మీ కుటుంబంలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది.. మీ అందరి నా ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. గతేడాది బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌కపూర్ పెళ్లాడిన ఆలియా భట్‌కు ఓ కూతురు జన్మించింది. వారి కుమార్తెకు రాహా అని పేరు పెట్టారు. View this post on Instagram A post shared by sitara 💌 (@sitaraghattamaneni) -
పిల్లగాలి అల్లరి.. పాటకు సితార డ్యాన్స్, మహేశ్ మురిపెం
సూపర్ స్టార్ మహేశ్‌బాబు గారాలపట్టి సితార సోషల్ మీడియాలో ఎంతగానో యాక్టివ్‌గా ఉంటుంది. ఏ పండగ సెలబ్రేట్ చేసుకున్నా, ఎక్కడికైనా వెకేషన్‌కు వెళ్లినా అందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తుంటుంది. అంతేకాదు అందంగా రీల్స్ చేస్తూ వాటిని అప్లోడ్ చేస్తూ ఉంటుంది. తన డ్యాన్స్ వీడియోలను కూడా పంచుకుంటుంది. అయితే ఈసారి మహేశ్‌బాబు సితార డ్యాన్స్ వీడియోను షేర్ చేశాడు. అతడు సినిమాలోని 'పిల్లగాలి అల్లరి ఒళ్లంత గిల్లి..' పాటకు స్టెప్పులేసిన సితార క్యూట్ డ్యాన్స్‌ను మహేశ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ పోస్టుకు డ్యాన్స్ మాస్టర్ ఆట సందీప్ స్పందిస్తూ నెమలిలా నాట్యం చేస్తుందని కామెంట్ చేశాడు. నెటిజన్లు సైతం అద్భుతంగా స్టెప్పులేసిందని కొనియాడుతున్నారు. ఓ నెటిజన్ మాత్రం అన్నా.. ఒక డౌట్.. ఇలాంటివి నువ్వే అప్లోడ్ చేస్తావా? లేకపోతే సితార పాప నీ ఫోన్ లాక్కుని అప్లోడ్ చేస్తుందా? అని అనుమానం వ్యక్తం చేశాడు. చదవండి: పఠాన్‌ను ఎవరూ ఆపలేరు.. ఎన్ని వందల కోట్ల కలెక్షన్స్ అంటే? ఇంటి అద్దె కట్టడానికి కూడా డబ్బుల్లేవు: నటుడు -
త్వరగా వచ్చేయ్.. నిన్ను చాలా మిస్సవుతున్నా: సితార
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ మహేశ్‌బాబు-నమ్రత శిరోద్కర్ జంట ఒకటి. ఇక వీరి పిల్లలు గౌతమ్, సితార గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే మహేశ్ బాబు కుమార్తె సితార గురించి మనందరికీ తెలుసు. తన పోస్టులతో అభిమానులను ఎప్పుడు అలరిస్తూ ఉంటుంది. ఇటీవల అన్న గౌతమ్ కల్చరల్ ట్రిప్ కోసమని విదేశాలకు వెళ్లాడు. దీంతో అన్నయ్యను చాలా మిస్సవుతున్నానంటూ గౌతమ్‌తో సరదాగా ఆడుకుంటున్న ఫోటోలను పోస్ట్ చేసింది సితార. 'మిస్ యూ అన్నయ్య.. త్వరగా తిరిగిరా' అంటూ పోస్ట్ చేసింది. ఇది ఆమె అభిమానులు కొందరు కంగారు పడ్డారు. మీ అన్నయ్య ఎక్కడికెళ్లారంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరేమో అన్న- చెల్లి అనుబంధం చాలా గొప్పదని పోస్టులు పెడుతున్నారు. ఇటీవలే మహేశ్ బాబు సతీమణి నమ్రత కూడా ఎమోషనల్ పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) -
ఈ సంక్రాంతికి సెలబ్రెటీల సందడి చూశారా?
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంక్రాంతి పండుగ సందడి కనిపిస్తోంది. కరోనా కారణంగా రెండేళ్లు ఎలాంటి సందడి లేకుండ నిరాండబరం జరుపుకున్నారు. ఇక పరిస్థితి సాధారణ స్థితికి రావడంతో సాధారణ ప్రజల నుంచి సనీ సెలబ్రెటీల వరకు మకర సంక్రాంతి కుటుంబాలతో కలిసి స్పెషల్‌గా సెలబ్రెట్ చేసుకుంటున్నారు. ఇక ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువకు సినీ సెలబ్రెటీల తమ అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: ‘నేను అలా అనకూడదు.. కానీ హృతిక్‌ను కించపరచడం నా ఉద్దేశం కాదు’ హీరోహీరోయిన్లు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ సంక్రాంతి స్పెషల్ పోస్ట్స్ షేర్ చేస్తున్నారు. మహేశ్ బాబు కూతురు సితార, అల్లు అర్జున్ ముద్దు తనయ అల్లు అర్హ, స్నేహరెడ్డివ నుంచి తమన్నా, నివేతా థామస్, విజయ్ దేవరకొండ సంక్రాంతి విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరి ఈ సంక్రాంతికి తారల సందడి ఎలా ఉందో ఓ సారి ఇక్కడో లుక్కేయండి! View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) -
'బంగారు కళ్ల బుచ్చమ్మో.. కోపంలో ఎంత ముద్దమ్మో'.. సితార వీడియో వైరల్
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సంక్రాంతి సందడి కనిపిస్తోంది. రాజకీయ, సినీ ప్రముఖులందరూ పండుగ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇక పండుగంటే సినీ తారలు చేసే సందడి అంతా ఇంతా కాదు. టాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ ఫెస్టివల్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు గారాల పట్టి సితార గురించి తెలుగు అభిమానులకు పరిచయం అక్కర్లేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది. ఇటీవల న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్విట్జర్లాండ్‌లో జరుపుకున్న ఫోటోలను పంచుకుంది. తాజాగా సంక్రాంతి సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో కనిపించింది సితార. పట్టు వస్త్రాలు ధరించి అచ్చం తెలుగుమ్మాయి అనేలా ఓ వీడియోను షేర్ చేసింది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోలో మహేశ్ బాబు నటించిన మురారి సినిమాలోని 'బంగారు కళ్ల బుచ్చమ్మో.. కోపంలో ఎంత ముద్దమ్మో' అంటూ సాగే సాంగ్‌కు నృత్యం చేస్తూ కనిపించింది. 'ఈ ఆనంద సమయంలో గాలిపటాలు ఎగరనివ్వండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.' అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఎరుపు డ్రెస్‌లో సితార తెలుగువారి సంప్రదాయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. ఈ వీడియోకు మహేశ్ సతీమణి నమ్రత శిరోద్కర్ కామెంట్ చేసింది. ' నా చిట్టి దేవత. నీ కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా' అంటూ రిప్లై ఇచ్చింది. View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) -
వెబ్సైట్ ప్రారంభిస్తున్నందుకు సంతోషిస్తున్నాం: సితార
మహేశ్ బాబు గారాల కూతురు సితార టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో చురుక్కుగా ఉంటున్నారు సితార. అయితే చిన్నపిల్లల కోసం మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మహేశ్ బాబు చేస్తున్న సేవా కార్యక్రమాల కోసం ప్రత్యేక వెబ్సైట్ ప్రారంభిస్తున్నట్లు సితార సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. తన వంతుగా నా పాకెట్ మనీ డొనేట్ చేస్తున్నట్లు సితార ప్రకటించింది. ఈ నూతన సంవత్సరంలో మా అధికారిక వెబ్సైట్ http://maheshbabufoundation.org ప్రారంభించడం పట్ల మేము సంతోషిస్తున్నాం అని సితార వెల్లడించింది. ఫౌండేషన్ తరఫున అందరికీ 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది సితార. In our endeavour to create a world where children survive and thrive, we are happy to be launching our official website this New Year! https://t.co/jY6B4gXMPd For the children...to the children ❤️#MBFoundation wishes you all a happy new year 2023!@urstrulymahesh pic.twitter.com/MdOhnee1sr — Mahesh Babu Foundation (@MBfoundationorg) January 1, 2023 -
క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో స్టార్స్ సందడి.. బ్యూటీల తళుకులు-మెరుపులు
► క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో కాజల్ సిస్టర్స్ ► యంగ్ లుక్‌తో మెరిసిపోతున్న మీరా జాస్మిన్ ► యాంకర్ నిఖిల్ క్రిస్మస్ పార్టీలో టాలీవుడ్ సెలబ్రిటీలు ► అందంతో కేక పుట్టిస్తోన్న హీరోయిన్ శ్రీలీల ► భర్తతో కాజల్ క్యూట్ ఫోటో View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Meera Jasmine (@meerajasmine) View this post on Instagram A post shared by Gautam Kitchlu (@kitchlug) View this post on Instagram A post shared by Are Syamala (@syamalaofficial) View this post on Instagram A post shared by Are Syamala (@syamalaofficial) View this post on Instagram A post shared by Mehaboob Dil Se (@mehaboobdilse) View this post on Instagram A post shared by Ariaana & Viviana Manchu (@ariviviofficial) View this post on Instagram A post shared by Shilpa Reddy (@shilpareddy.official) View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) View this post on Instagram A post shared by Viranica Manchu (@viranica) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Nikhiluuuuuuuuu (@nikhilvijayendrasimha) View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
సితార అన్ప్లాన్డ్ బేబీ: నమ్రత షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్లో మహేశ్‌బాబు-నమ్రత జంట ఒకటి. మిస్ ఇండియా కీరిటాన్ని గెలుచుకున్న నమత్ర ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. వంశీ మూవీ సమయంలో ప్రేమలో పడ్డ మహేశ్-నమ్రత ఆ తర్వాత పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక వివాహం అనంతరం సినిమాలకు గుడ్‌బై చెప్పిన నమ్రత తాజాగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తొలిసారి తన వ్యక్తిగత విషయాలపై నోరు విప్పింది. ఈ ఇంటర్య్వూకి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఈ సందర్భంగా పెళ్లి అనంతరం సినిమాలకు బ్రేక్ ఇవ్వడంపై ఆమెకు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ తమ పెళ్లికి ముందే మహేశ్ ఓ కండిషన్ పెట్టాడంటూ ఆసక్తిర వ్యాఖ్యలు చేసింది. అనంతరం మహేశ్‌తో పెళ్లి జరగడమే తనకు హ్యాపీ మూమెంట్ అని చెప్పిన నమ్రత.. సితార అన్ప్లాన్డ్ బేబీ అని చెప్పి షాకిచ్చింది. ఒకవేళ సితార పుట్టి ఉండకపోతే తమ జీవితాలు అసంపూర్ణంగానే ఉండేవేమోనని నమ్రత పేర్కొంది. అలాగే గౌతమ్ పుట్టిన సమయంలో కఠిన పరిస్థితులు చూశామని, 8 నెలల్లోనే గౌతమ్ పుట్టడంతో బతుకుతాడో లేదో అని వైద్యులు చెప్పారంటూ నమ్రత ఎమోషనల్ అయ్యింది. చదవండి: సావిత్రి గురించి జెమిని గణేశన్ ఇచ్చిన ప్రకటన చూసి చాలా బాధపడ్డాను సీనియర్ నటి ఝాన్సీ అందుకే అప్పుడు సమంతను.. ఇప్పుడు దీపికాను ట్రోల్ చేస్తున్నారు: నటి రమ్య -
ఆ విషయంలో నాకు- మహేశ్‌కు మధ్య గొడవలు అవుతుంటాయి : నమ్రత
టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో మహేశ్‌బాబు-నమ్రత ఒకరు. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పిన నమ్రత భార్యగా, తల్లిగా బాధ్యతలు చేపడుతూనే, మరోవైపు మహేశ్‌కు సంబంధించిన వ్యాపారాలను చేసుకుంటూ బిజినెస్ విమెన్గానూ రాణిస్తుంది. అంతేకాకుండా భర్త మహేశ్‌కు సంబంధించిన కాస్ట్యూమ్స్ సహా పలు విషయాలను దగ్గరుండి చూసుకుంటుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే నమ్రత తాజాగా ఓ ఇంటర్వ్యూలో నమ్రత తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన పలు విషయాలను షేర్ చేసుకున్నారు. ''మహేశ్-నేను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవడం నా జీవితంలోనే బెస్ట్ మూమెంట్. పెళ్లి తర్వాత నా ప్రపంచమే మారిపోయింది. మాతృత్వాన్ని పొందడం గొప్ప అనుభూతి. ఇక భార్యభర్తలుగా మహేశ్‌కు, మీకు ఏ విషయంలో గొడవలు అవుతుంటాయి అన్న ప్రశ్నకు బదులిస్తూ.. మా ఇద్దరి మధ్య పిల్లల విషయంలోనే గొడవలు అవుతుంటాయి. వాళ్లు నన్ను అడిగితే నో చెప్తాను.. అందుకే పిల్లలు వాళ్లకు ఏం కావాలన్నా మహేశ్నే అడుగుతారు. ఆయన నో చెప్పరు. ఈ విషయంలో చిన్నచిన్న గొడవలు జరుగుతుంటాయి'' అంటూ చెప్పుకొచ్చింది నమ్రత. -
‘ఫన్’టాస్టిక్ సితార .. ‘తగ్గేదే లే’అంటున్న అర్హ.. ‘స్టార్’లా ఎదిగిన కిడ్స్ వీరే
ఇవ్వాళ్టి పిల్లలు పెద్దల నీడన దాగుండిపోవడం లేదు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల పిల్లలు.. తల్లిదండ్రుల పాపులారిటీతో పరిచయం అవడానికి ఇష్టపడట్లేదు. ఆ పేరుప్రఖ్యాతులను ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగించుకుని సొంత ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటున్నారు. తమ టాలెంట్‌ను చాటుకుంటున్నారు. ఆ లిస్ట్‌లో ఉన్న కొంతమంది లిటిల్ స్టార్స్ గురించి.. ‘ఫన్’టాస్టిక్ సితార చిన్న వయసు నుంచే తనలోని బహుముఖ ప్రజ్ఞను నిరూపించుకుంటోంది మహేశ్ బాబు–నమ్రతా శిరోడ్కర్ వారసురాలు సితార! ‘ఫన్’టాస్టిక్ తార అనే వెబ్ సిరీస్‌కు సితార బ్రాండ్ అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తోంది. ‘జన్యాస్ క్లోజట్’ బ్రాండ్ కోసం మోడలింగ్ కూడా చేసింది. దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలసి ఓ యూట్యూబ్ చానెల్‌నూ నిర్వహిస్తోంది. తగ్గేదే లే... ఈ మాట అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హకి సరిగ్గా సరిపోతుంది. సూపర్ యాక్టివ్నెస్తో తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ని క్రియేట్ చేసుకుంది. ముద్దు ముద్దు మాటలు.. ముద్దొచ్చే రూపంతో తన తండ్రి సినిమాల్లోని కొన్ని సీన్స్‌కి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ, డైలాగ్స్ చెప్తూ, పాటలు..డ్యాన్స్‌లతో డిజిటల్ మీడియా వీక్షకులను ఇట్టే ఆకట్టుకుంటోంది అర్హ. ఇలా చిన్న వయసులోనే స్టార్ స్టేటస్‌ని సొంతం చేసుకున్న అర్హ మంచి చెస్ ప్లేయర్ కూడా! ‘మంచు’ సింగర్స్... మంచు విష్ణు కూతుళ్లు అరియానా–వివియానా.. ఇన్‌స్టా స్టార్స్. ఈ ట్విన్ సిస్టర్స్ ఫొటోలు, వీడియోలకు ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందం, అభినయమే కాదు.. మధురమైన గాత్రం కూడా వీరి సొంతం. వాళ్ల నాన్న విష్ణు నటించిన ‘జిన్నా’ సినిమా కోసం ‘ఇదే స్నేహం.. యే హై దోస్తీ’ అనే గీతాన్ని ఆలపించారీ అక్కాచెల్లెళ్లు. ఈ పాట విడుదలైన ఒక్క రోజులోనే 40 లక్షలకు పైగా వ్యూస్‌ను సంపాదించి ట్రెండింగ్‌లో ఉంది. ఇంకోవైపు మంచు లక్ష్మి కూతురు విద్య నిర్వాణ కూడా మై కిసీ సే కమ్ నహీ అంటోంది. పేరుకు తగ్గట్టే చదువులో దిట్ట ఈ బిడ్డ. కరోనా సమయంలో తల్లితో కలసి యూట్యూబ్ వీడియోలు చేసి తన టాలెంట్‌ను ప్రదర్శించింది. అన్నట్టు విద్య కూడా మంచి చెస్ ప్లేయర్. ఇంటి చిరు కొమ్మ.. అమ్మ, నాన్న, తాతకు తగ్గకుండా తన పేరునూ పాపులర్ చేసుకుంటోంది ఐశ్యర్య, అభిషేక్ కూతురు ఆరాధ్య బచ్చన్. శ్రావ్యమైన స్వరంతో క్రిస్మస్ జింగిల్స్.. ఇతర పాటలు పాడుతూ తన ఐడెంటిటీ చాటుకుంటోంది. ‘పవర్’ ఫుల్ డాటర్ పవన్ కల్యాణ్–రేణూ దేశాయ్ కూతురు ఆద్యకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆ అమ్మాయి మొన్నామధ్య గిటార్ వాయిస్తూ పాడిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే! ఆమె గాన మాధుర్యానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. తండ్రిలాగే ఆద్యకు పుస్తకాలు చదవడమన్నా ఎంతో ఇష్టం. -
ఇకపై అవేవి ఇంతకు ముందులా ఉండవు, మిస్ యూ తాతయ్య: సితార ఎమోషనల్
తాత సూపర్ స్టార్ కృష్ణ మృతిపట్ల మహేశ్ బాబు కూతురు సితార ఘట్టమనేని భావోద్వేగానికి లోనయ్యింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. తాత కృష్ణతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ ఇకపై ఇంతకు ముందలా ఉండదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఇకపై వీకెండ్ లంచ్ ఇంతకు ముందులా ఉండదు. మీరు నాకు ఎన్నో విలువైన విషయాలు నెర్పించారు. చదవండి: సూపర్ స్టార్ కృష్ణ గురించి అప్పట్లో మహాకవి శ్రీశ్రీ ఏమన్నారో తెలుసా? ఎప్పుడూ నన్ను నవ్వించేవారు. ఇప్పుటి నుంచి అవన్ని మీ జ్ఞాపకాలుగా నా మెమరిలో ఉండిపోతాయి. మీరు నా హీరో. ఏదో ఒక రోజు మీరు గర్వపడే స్థాయికి చేరుకుంటాను. మిస్ యూ సో మచ్ తాతగారు(తాతయ్య)’ అంటూ సితార రాసుకొచ్చింది. కాగా ఆదివారం రాత్రి గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన కృష్ణ చికిత్స పొందతూ నిన్న మంగళవారం తెల్లవారుజాము తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చదవండి: ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూసిన సూపర్ స్టార్ View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) -
టాలీవుడ్ ప్రిన్స్ దీపావళి సర్ప్రైజ్.. సితార అదిరిపోయే ఫర్మామెన్స్
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు తన గారాల పట్టి సితార అంటే పిచ్చి ప్రేమ. తండ్రితో కలిసి సితార ఎప్పుడు సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. ఎక్కడికెళ్లినా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు సర్ప్రైజ్లు ఇస్తుంటారు. తాజాగా ఇవాళ దీపావళిని పురస్కరించుకుని చేసిన షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పటిలా కాకుండా కాస్త భిన్నంగా అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. దీపావళి సందర్భంగా సితార క్లాసికల్ డ్యాన్స్‌తో అదరగొట్టింది. దీనికి సంబంధిత ఆ వీడియోను పోస్ట్ చేస్తూ అభిమానులందరికీ విషెస్ తెలిపింది. తన గురువు మహతీ భిక్షుతో కలిసి నృత్యం చేయటం చాలా సంతోషంగా ఉందని సితార తెలిపింది. ఆ వీడియో చూసిన పలువురు నెటిజన్లు సితార డ్యాన్స్‌ను మెచ్చుకుంటున్నారు. తన కూతురు సితార డ్యాన్స్ చేసిన వీడియోను మహేశ్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. (చదవండి: ఆ సినిమా బాహుబలి కంటే హిట్ అయ్యేది.. ఆర్జీవీ ట్వీట్ వైరల్) మహేశ్ బాబు తన ఇన్‌స్టాలో రాస్తూ..'నన్ను గర్వపడేలా చేయటంలో నువ్వు ఎప్పుడూ ఫెయిల్ కావు. ఈ ప్రదర్శన ఇలాగే కొనసాగించు చిట్టి తల్లి. నీకు నేర్పిన గురువులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ' అంటూ కితాబిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సితారకు ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
మిస్ యూ నానమ్మ.. నువ్వు మళ్లీ తిరిగి రావాలి..: సితార ఎమోషనల్ పోస్ట్
నానమ్మను తలుచుకుంటూ సితార సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యింది. నిన్న(సెప్టెంబర్ 28) సూపర్‌స్టార్ మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మరణంతో ఘట్టమనేని కుటుంబంలో విషాదం నెలకొంది. అయితే నానమ్మను తలుచుకుంటూ సితార ఆమె పార్థివదేహం వద్ద వెక్కి వెక్కి ఏడ్చిన దృశ్యం అందరిని కలిచి వేసింది. కూతురు ఏడుస్తుంటే తండ్రి మహేశ్ ఆమెను ఓదార్చిన సన్నివేశం అభిమానుల హృదయాలను ఆకట్టుకుంది. బుధవారం సాయంత్రం ఆమె అంత్యక్రియలను మహాప్రస్థానంలో నిర్వహించారు. చదవండి: నానమ్మను తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చిన సితార అనంతరం ఆమెను తలుచుకుంటూ మహేశ్, ఆయన భార్య నమ్రత శిరొద్కర్, సితారలు సోషల్ మీడియా వేదికగాఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో వారు భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు. ముఖ్యంగా సితార షేర్ చేసిన పోస్ట్ నెటిజన్ల హృదయాలను హత్తుకుంటుంది. ‘మిస్ యూ సో మచ్ నానమ్మ.. నువ్వు మళ్లీ తిరిగి రావాలని కోరుకుంటున్నా’ అంటూ నానమ్మ, అన్న గౌతమ్‌తో ఉన్న ఫొటోను షేర్ చేసింది సితార. దీనికి హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని జత చేస్తూ భావోద్వేగానికి గురైంది. ఇక ఇది చూసి ‘నానమ్మ అంటే సితూ పాపలకు ఎంత ఇష్టమో’, ‘ఈ పోస్ట్‌తో సితార తన నానమ్మతో ఉన్న అనుబంధం తెలుస్తుంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఏ స్పెషల్ అకేషన్ ఉన్న సితార, గౌతమ్‌లు నానమ్మతో కలిసి సరదా సమయాన్ని గడిపేవారనే విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
ఇందిరా దేవి పార్థీవదేహానికి కుటుంబ సభ్యుల నివాళులు (ఫొటోలు)
-
Indira Devi: నానమ్మను తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చిన సితార
-
నానమ్మను తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చిన సితార
సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి మృతితో ఘట్టమనేని కుటుంబంలో విషాదం నెలకొంది. బుధవారం ఉదయం స్టార్ హీరో మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మరణం మహేశ్ కుటుంబం, ఇతర కుటుంబ సభ్యులను విషాదంలోకి నెట్టింది. ఇక నానమ్మ మరణంతో మహేశ్ కూతురు సితార ఏడుస్తున్న దృశ్యం అందరిని చేత కంటతడి పెట్టిస్తోంది. తండ్రి మహేశ్‌ని పట్టుకుని నానమ్మను తలుచుకుంటూ సితూ పాప వెక్కె వెక్కి ఏడుస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సితార ఏడుస్తుంటే మహేశ్ ఆమెను ఓదారుస్తున్నాడు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: మహేశ్ బాబు ఇంటికి సినీ ప్రముఖులు, ఇందిరా దేవికి నివాళులు మహేశ్ బాబు తల్లి మృతి.. చిరంజీవి సంతాపం -
డాటర్స్ డే స్పెషల్.. కూతురికి మహేశ్ స్పెషల్ విషెష్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన గారాలపట్టి సితారపై మరోసారి ప్రేమను చాటుకున్నారు. ఇంటర్నేషనల్ డాటర్స్ డే సందర్భంగా ఎమోషనల్ అయ్యారు. తన కుమార్తె సితారకు డాటర్స్ డే శుభాకాంక్షలు చెబుతూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇద్దరు కలిసి ఉన్న పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. 'నా ప్రపంచాన్ని ఎల్లప్పుడూ ప్రకాశవంతం చేసే నా చిన్నారికి డాటర్స్ డే శుభాకాంక్షలు" అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. తరచుగా మహేశ్, సితారతో కలిసి సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు. కొద్దిరోజులుగా పలు టీవీ షోలకు సైతం ఇద్దరూ కలిసి వెళ్తున్నారు. (చదవండి: మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న కాజల్ అగర్వాల్.. ఆ సినిమా కోసమే..!) సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో పూజా హెగ్డే కథానాయిక గా నటిస్తోంది. ఈ చిత్రానికి తాత్కాలికంగా 'SSMB28' అని పేరు పెట్టారు. ఈ సినిమాలో బింబిసార ఫేమ్ సంయుక్త మీనన్ నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ 2023 సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
కూతురితో కలిసి బుల్లితెరపై సందడి చేసిన మహేశ్ బాబు
సూపర్ స్టార్ మహేశ్ బాబు బుల్లితెరపై సందడి చేయనున్నారు. ఓ ప్రముఖ డ్యాన్స్ షోకు కూతురు సితారతో కలిసి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో సితార తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. సాధారణంగానే మహేశ్ షోలు, ఫంక్షన్లకు చాలా అరుదుగా వస్తుంటారు. అలాంటిది కూతురు సితారతో కలిసి తొలిసారిగా బుల్లితెరపై కనిపించనుండటంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. వచ్చే ఆదివారం ఈ షో ప్రసారం కానుంది. కాగా ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేశ్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
పదిరెట్లు ఎక్కువగా ప్రేమిస్తున్నా... మహేశ్ బాబు ట్వీట్
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబుకే కాదు.. ఆయన ముద్దుల కూతురు సితారకు కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఆమె పెట్టే డ్యాన్స్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. నేడు(జులై 20) సీతు పాప పుట్టిన రోజు. ఈ సందర్భంగా మహేశ్ బాబు తన గారాల పట్టి సితారకు సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ తెలియజేశాడు. ‘తెలియకుండానే పదేళ్లు గడిచాయి. నా ప్రపంచంలో వెలుగు నింపిన నక్షత్రం నువ్వు. హ్యాపీ బర్త్‌డే సితార..నిన్ను పదిరెట్లు ఎక్కువగా ప్రేమిస్తున్నాను’అని మహేశ్ ట్వీట్ చేశాడు. All of 10.. before we even knew it! ♥️♥️♥️ To the brightest star in my world... Happy birthday Sitara!! I love you tenfold 🤗🤗🤗 pic.twitter.com/m693TMYad5 — Mahesh Babu (@urstrulyMahesh) July 20, 2022 మరోవైపు నమత్ర కూడా సోషల్ మీడియా వేదికగా సీతారకు పుట్టిన రోజు శుభాక్షాంక్షలు తెలిపారు. ‘హ్యాపీబర్త్‌డే మై లిటిల్ వన్. నీ చిన్ని కుయుక్తులు, అల్లరి చేష్టలు, బోరింగ్ బెడ్ స్టోరీస్..అన్నింటిని ప్రేమిస్తున్నాను. ఇవి వచ్చే ఏడాది కూడా కొనసాగుతాయని ఆశిస్తున్నాను. కొత్త దశలోకి అడుగుపెడుతున్న నీకు నా ప్రేమ, కౌగిలింతలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఇంకా నువ్వు కనుగొనవలసినవి, నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నీ మనసులో అనుకున్న ఏ లక్ష్యాన్ని అయినా కచ్చితంగా సాధించగలవని అనుకుంటున్నాను. లవ్ యూ పప్లూ’ అని నమ్రత ఇన్‌స్టాలో రాసుకొస్తూ.. ఓ స్పెషల్ వీడియోని షేర్ చేసింది. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
సితార సోఫాలో నుంచి కిందపడిపోయింది: మహేశ్ బాబు
Mahesh Babu About Sitara In Chit Chat With Youtubers: 'ఆ సీన్ చూసి సితార ఇచ్చిన రియాక్షన్ ఇప్పటివరకు నేను ఎప్పుడూ చూడలేదు' అని సూపర్ స్టార్ మహేశ్ బాబు పేర్కొన్నాడు. ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు మహేశ్ బాబు. ఇందులో భాగంగా శనివారం (మే 21) పలువురు యూట్యూబర్లతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేశ్ బాబు, కీర్తి సురేశ్, డైరెక్టర్ పరశురామ్ పాల్గొన్నారు. యూట్యూబర్లు అడిగిన ప్రశ్నలకు సరదాగా, ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను వారితో పంచుకోవాలని మహేశ్ బాబు తెలిపాడు. ''ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో కీర్తి నన్ను తిట్టాలి. 3 టేకులు తీసుకున్నప్పటికీ కీర్తి చేయలేకపోయింది. దీంతో డైరెక్టర్ ఆమె దగ్గరికి వెళ్లి 'మేడమ్.. మీరు సార్‌ను తిట్టాలి. గుర్తుపెట్టుకోండి ఆయన్ను మీరు తిట్టాలి.' అని చాలాసార్లు చెప్పారు. కీర్తి ఇబ్బందిపడుతోందని నాకు అర్థమైంది. అప్పుడు నేను 'పర్వాలేదు కీర్తి.. నన్ను నువ్వు తిట్టు' అని చెప్పాను. దానికి ఆమె 'సార్.. నేను మిమ్మల్ని తిట్టలేను. ఒకవేళ నేను మిమ్మల్ని తిడితే మీ ఫ్యాన్స్ నన్ను ఏదో ఒకటి అంటారు.' అని చెప్పింది. 'నా ఫ్యాన్స్ ఏం అనరమ్మ. నువ్వు తిట్టు.' అని నచ్చజెప్పి ఆ సీన్ పూర్తయ్యేలా చేశాం. కానీ మొన్న నా ఫ్యామిలీతో కలిసి ఆ సీన్ చూసినప్పుడు సితార ఇచ్చిన రియాక్షన్ ఇప్పటివరకూ నేను ఎప్పుడూ చూడలేదు. తను సోఫాలో నుంచి కిందపడిపోయి మరి నవ్వింది.'' అని చెప్పుకొచ్చాడు మహేశ్‌బాబు. చదవండి: అలా ఎందుకు జరిగిందో తెలియదు: మహేశ్ బాబు ఆ సినిమా చూసి ఏడ్చేశాను : మహేశ్ బాబు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_721246091.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘సర్కారు వారి పాట’ చూసిన సితార పాప రియాక్షన్ ఏంటంటే..
Mahesh Babu About Sitara Reaction After Watching SVP: సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 12న థియేటర్లోకి వచ్చింది. విడుదలైన తొలి రోజు నుంచే హిట్‌టాక్‌తో దూసుకుపోతూ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. విడుదలైన రెండు రోజుల్లోనే ఈ మూవీ రూ.103 కోట్ల గ్రాస్‌ని సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. చదవండి: వేదికపై మహేష్‌బాబు డ్యాన్స్ ఈ నేపథ్యంలో కర్నూల్ ఎస్టీబీసీ కళాశాల మైదానంలో సోమవారం రాత్రి సర్కారు వారి పాట సక్సెస్ మీట్‌ను చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న మహేశ్ బాబు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ‘సర్కారు వారి పాట సినిమా ఫస్ట్ మా ఫ్యామిలీతో కలిసి చూసినప్పుడు మా అబ్బాయి(గౌతమ్ ఘట్టమనేని) షేక్ హ్యాండ్ ఇచ్చి గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఇక సితార అయితే అన్ని సినిమాల్లో కన్నా ఈ సినిమాలో చాలా బాగా నటించావు నాన్న, ఇందులో చాలా అందంగా కూడా ఉన్నావు అని కితాబు ఇచ్చింది’ అంటూ మహేశ్ మురిసిపోయాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: మీడియా ముందుకు కరాటే కల్యాణి: నేను ఎక్కడికీ పారిపోలేదు అలాగే ఈ సినిమా చూసిన మహేశ్ తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ రియాక్షన్ ఏంటని యాంకర్ అడగ్గా.. ఆయన సినిమా చూడగానే ఈ సినిమా పోకిరి, దూకుడు కంటే సూపర్ హిట్ అవుతుందని చెప్పారన్నాడు. కాగా మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సముంద్రఖని, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, అజయ్ తదితరులు నటించిన సంగతి తెలిసిందే. -
సితార చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది : మహేశ్ బాబు
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సర్కారువారి పాట’.పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, కళావతి సాంగ్స్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తున్నాయి. మే 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్ర బృందం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేశ్ బాబు ఈ సినిమా సహా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పెన్నీ సాంగ్‌లో కూతురు సితార పర్ఫార్మెన్స్ గురించి అడగ్గా.. మహేశ్ మాట్లాడుతూ.. అది తమన్ ఆలోచన అని, నమ్రతతో ఈ విషయం గురించి చెప్పేలోపు తమన్ నమ్రతని అడిగాడని చెప్పారు. ఇక ఈ సినిమాలో సితార డ్యాన్స్ ఎండ్ టైటిల్స్‌లో అయినా కనిపిస్తుందా అని అడగ్గా.. 'మేకింగ్ వీడియోలో అనుకున్నాం. ఇప్పటికే ప్రింట్స్ యూఎస్‌కి వెళ్లిపోయాయి. అయినా దయచేసి ఇవన్నీ అడగకండి. ఇప్పటికే సినిమాల్లో ఎందుకు లేను అని సితర అడుగుతుంది. కానీ పర్ఫార్మన్స్ పరంగా తను నన్ను చాలా గర్వపడేలా చేసింది. నాకు తెలిసి తను భవిష్యత్తులో పెద్ద హీరోయిన్ అవుతుంది' అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మహేశ్. -
అమ్మ కోప్పడితే నాన్నకు కంప్లైంట్ చేస్తాను : సితార
నేను గర్వపడేలా చేశావు సితూ పాపా...నమ్రత ఎమోషన్ అయ్యారు...కూతుర్ని గట్టిగా హత్తుకున్నారు.అంతే.. సితూ పాప పిచ్చ హ్యాపీ.నువ్వు మా అమ్మలా ఉంటావు...అలా అంటూ కూతుర్ని ముద్దు చేస్తుంటారు మహేశ్‌బాబు. ఇంతకీ అమ్మ ఆనందపడేలా సితూ ఏం చేసింది?‘మదర్స్ డే’ సందర్భంగా తన తల్లి గురించి సితార చెప్పిన ముచ్చట్లు చదివితే తెలుస్తుంది. ►మదర్స్ డే ప్లాన్ గురించి? సితార: అమ్మ కోసం స్పెషల్ గిఫ్ట్ ఒకటి ప్లాన్ చేశాను. అది సర్ప్రైజ్. అలాగే ఆదివారం మొత్తం అమ్మతో స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యాను. ► ఇంట్లో నిన్ను ‘సితూ పాపా’ అని పిలుస్తారు. మీ అమ్మని ‘అమ్మా’ అనే పిలుస్తావా? మామ్ అని కాదా? అమ్మా అనే పిలుస్తాను. అలా పిలిపించుకోవడం అమ్మకు ఇష్టం. ► ఇంతకీ మీ అమ్మగారు ఎంత స్ట్రిక్ట్? అవసరమైనప్పుడు మాత్రమే స్ట్రిక్ట్. మిగతా సమయాల్లో మా అమ్మ చాలా స్వీట్. ► చదువు విషయంలో, స్పోర్ట్స్, డాన్స్ వంటివి నేర్చుకునే విషయంలో అమ్మ ప్రోత్సాహం ఎంతవరకూ ఉంటుంది? స్కూల్ నుంచి రాగానే హోమ్‌వర్క్‌కి స్పెషల్‌గా టైమ్ ప్లాన్ చేస్తుంది. ఆ టైమ్‌కి మేం హోమ్‌వర్క్ చేసేలా చూస్తుంది. ఇక పెయింటింగ్, డాన్సింగ్... ఇంకా స్కూల్ యాక్టివిటీస్ అన్నింటిలోనూ పార్టిసిపేట్ చేసేలా అమ్మ ప్రోత్సహిస్తుంది. ► ఎప్పుడైనా చదువుపట్ల నిర్లక్ష్యంగా ఉంటే మీ అమ్మగారి రియాక్షన్? నిర్లక్ష్యంగా ఉండే చాన్సే లేదు. రోజూ చదువుకోవడానికి ఒక టైమ్ కేటాయించిందని చెప్పాను కదా. ఆ టైమ్‌కి చదవుకోవాల్సిందే. తప్పించుకోవడానికి లేదు. ► అమ్మ కోప్పడినప్పుడు నాన్నకు కంప్లైంట్ చేయడం జరుగుతుందా? జరుగుతుంది. నాకేదైనా కావాలన్నప్పుడు అమ్మ ‘నో’ చెబితే అప్పుడు నాన్నకు కంప్లైంట్ చేస్తాను. ► మీ ఇద్దరి (సితార అన్నయ్య గౌతమ్)లో అమ్మ ఎవర్ని ఎక్కువగా గారాబం చేస్తారు? ఇద్దరంటే అమ్మకి చాలా ప్రేమ. కానీ నేను చిన్నదాన్ని కాబట్టి నన్ను ఎక్కువగా గారాబం చేస్తుంది... హహ్హహ్హా... ► మీ అమ్మగారి నుంచి తీసుకోవాల్సిన మంచి విషయాలు? పాజిటివ్‌గా ఉండాలని చెబుతుంది. అలాగే ఇతరుల పట్ల కైండ్‌గా ఉండాలని కూడా అంటుంది. మన దగ్గర ఉన్నవాటికి కృతజ్ఞతాభావంతో ఉండాలని అమ్మ ఎప్పుడూ చెబుతుంటుంది. ► పండగలప్పుడు ట్రెడిషనల్‌గా డ్రెస్ చేసుకుని, చక్కగా పూజలు చేస్తుంటావు.. అమ్మ నేర్పిస్తుంటారా? నా చిన్నప్పటి నుంచి అమ్మ మన కల్చర్ గురించి మంచి విషయాలు చెబుతూ ఉంది. కల్చర్ పరంగా మమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం అమ్మకి ఇష్టం. మా అమ్మ మహారాష్ట్రీయన్.. నాన్న తెలుగు అని మీ అందరికీ తెలిసిందే. అందుకే ఇంట్లో ఈ రెండు సంప్రదాయాలకు సంబంధించిన పండగలు చేసుకుంటాం. ఫెస్టివల్ సెలబ్రేషన్స్‌ని బాగా ఎంజాయ్ చేస్తాం. ► మరి... మీ అమ్మగారి మదర్ టంగ్ మరాఠీ వచ్చా? మాట్లాడతాను కానీ అంత ఫ్లూయంట్‌గా రాదు. ► ఫ్రెండ్స్‌తో ఫుడ్ షేర్ చేయడం, కేరింగ్‌గా ఉండటం వంటివి కూడా అమ్మ చెబుతుంటారా? స్కూల్ లేక వేరే చోట ఫ్రెండ్స్‌తో స్పెండ్ చేసినప్పుడు తినడానికి నా దగ్గర ఏం ఉంటే అది వాళ్లతో షేర్ చేసుకుంటాను. నా దగ్గర తక్కువ ఉన్నా సరే షేర్ చేస్తాను. ఎందుకంటే ‘షేరింగ్ ఈజ్ కేరింగ్’ అని అమ్మ చెప్పింది. నేను ఫాలో అయిపోతున్నాను (నవ్వులు). ► మీ నాన్నమ్మలా ఉంటావు కాబట్టి మీ నాన్నగారు ఆ విషయం చెప్పి, గారాబం చేస్తుంటారా? ‘నువ్వు మా అమ్మలా ఉన్నావు’ అని నాన్న ఎప్పుడూ నాతో అంటుంటారు. బాగా ముద్దు చేస్తారు కూడా. కానీ నేను మా అమ్మలా కూడా ఉన్నానని అనుకుంటున్నాను ► నీ యూ ట్యూబ్ చానల్ సక్సెస్ వెనకాల అమ్మ హెల్ప్ ఉందా? అమ్మ బోలెడన్ని ఐడియాలు ఇస్తుంది. అది మాత్రమే కాదు.. షూట్ విషయంలో కూడా హెల్ప్ చేస్తుంది. ► మరి.. ‘సర్కారువారి పాట కోసం’ నువ్వు చేసిన ‘పెన్నీ..’ సాంగ్‌కి ఆమె హెల్ప్ చేశారా? ఆ పాటలో నీ డాన్స్ బాగుంది... ఆ పాట షూట్ మొదలుపెట్టినప్పటి నుంచి పూర్తయ్యేవరకు నా డాన్స్ టీచర్ అనీ మాస్టర్‌తో పాటు అమ్మ నాతోనే ఉంది. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి అనే విషయంలో గైడ్ చేసింది. అలాగే కెమెరా వెనకాల నన్ను చాలా ఎంకరేజ్ చేసింది. ► డాన్స్ మొత్తం పూర్తయ్యాక ఆమె ఏమన్నారు? నా ఫస్ట్ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగా రావడంతో అమ్మ చాలా హ్యాపీ ఫీలయింది. ‘నన్ను గర్వపడేలా చేశావు’ అని గట్టిగా హత్తుకుంది. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ► పిల్లలకు ఆరోగ్యం బాగా లేనప్పుడు మీ అమ్మగారు ఎలా చూసుకుంటారు? అలాంటి సమయాల్లో మా అమ్మ మా పక్కనే ఉంటుంది. ఒంట్లో బాగాలేనప్పుడు ప్రత్యేకంగా డైట్ ప్లాన్ చేసి, మేం తినేలా చేస్తుంది. టైమ్‌కి టాబ్లెట్లు ఇచ్చి, చాలా కేరింగ్‌గా ఉంటుంది. ► నువ్వు, గౌతమ్ ఏం అడిగినా మీ అమ్మ కొనిపెడతారా? ఐస్‌క్రీములు, చాక్లెట్లు ఎక్కువగా తింటే ఒప్పుకుంటారా? మేం ఏం అడిగినా దాదాపు కాదనదు. అయితే ప్రతిదానికీ ఒక లిమిట్ ఉండాలంటుంది. మితి మీరితే ఏదీ మంచిది కాదని అమ్మ అంటుంది. నేను అమ్మ మాటని ఒప్పుకుంటాను. ► ఈ మధ్య ఫ్యామిలీ టూర్ వెళ్లారు కదా. ఆ విశేషాలు? మేం ప్యారిస్, బోర్దూ, ఫ్రాన్స్‌లోని లూర్దు వెళ్లాం. ఈఫిల్ టవర్ చూశాను. ఫుల్‌గా ఎంజాయ్ చేశాం. – డి.జి. భవాని . -
టాలీవుడ్లో ‘థర్డ్ థండర్’ షురూ.. ఫ్యాన్స్‌కి పండగే!
ఆకాశంలో ఉరుము.. మంచి మెరుపుతో తన ఉనికిని చాటుతూ శబ్దం చేస్తుంది. కొత్త జాబ్‌లో మెరవాలనుకునేవాళ్లను, తమ టాలెంట్‌తో సౌండ్ చేసేవాళ్లను ‘థండర్’ (ఉరుము)తో పోల్చుతారు. ఇప్పుడు అలా మెరవడానికి తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో మూడో తరం వారసుల ఎంట్రీ షురూ అయింది. ఈ ‘థర్డ్ థండర్’ని చూడటానికి ఆయా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు మహేశ్‌బాబు. ఈ కుటుంబానికి చెందిన మూడో తరం గౌతమ్ (మహేశ్ కుమారుడు) ఆల్రెడీ ‘వన్: నేనొక్కడినే’ చిత్రంలో చైల్డ్ యాక్టర్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేశ్ కుమార్తె సితార కూడా దాదాపు ఎంట్రీ ఇఛ్చినట్లే. మహేశ్ తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’లోని ‘పెన్నీ..’ లిరికల్ వీడియో సాంగ్‌లో సితార అదిరిపోయే స్టెప్లతో అలరించింది. అలాగే కృష్ణ కుమార్తె ప్రియదర్శిని (నటుడు సుదీర్‌బాబు భార్య) కుమారుల్లో చరిత్ మానస్ ‘భలే భలే మగాడివోయ్’, విన్నర్’ వంటి చిత్రాల్లో బాల నటుడిగా నటించాడు. (చదవండి: థియేటర్లో మహేశ్ బాబు ఫ్యాన్స్ హల్చల్.. అద్దాలు ధ్వంసం) సుధీర్ హీరోగా హర్షవర్ధన్ దర్శకత్వంలో రూపొందు తోన్న తాజా సినిమాలో చిన్నప్పటి సుదీర్లా కనిపిస్తాడు చరిత్. అలాగే రెండో కుమారుడు దర్శన్ ‘సర్కారు వారి పాట’లో మహేశ్‌బాబు చైల్డ్ ఎపిసోడ్స్‌లో జూనియర్ మహేశ్‌గా నటించాడు. కాగా కృష్ణ మరో కుమార్తె పద్మావతి (భర్త జయదేవ్ గల్లా) కుమారుడు అశోక్ గల్లా ఆల్రెడీ ‘హీరో’ చిత్రంతో యాక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరో కుమార్తె– నటి–దర్శకురాలు మంజుల తనయ జాన్వీ కూడా ‘మనసుకు నచ్చింది’లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. ఇటు ప్రముఖ దివంగత నటులు అల్లు రామలింగయ్య యాక్టింగ్ లెగసీని ఆయన మనవడు అల్లు అర్జున్ సక్సెస్‌ఫుల్‌గా కంటిన్యూ చేస్తున్నారు (అల్లు రామలింగయ్య కుమారుడు అరవింద్ తెలుగులో అగ్రనిర్మాతగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే). ‘శాకుంతలం’ చిత్రంలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. అయితే అల్లు రామలింగయ్య కుటుంబానికి చెందిన నాలుగో తరం అల్లు అర్హ. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘శాకుంతలం’లో ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపిస్తుంది అర్హ. మరి.. అల్లు అర్జున్ కుమారుడు అయాన్ కూడా సినిమాల్లోకి వస్తాడా అనేది చూడాలి. అభిరామ్ ఇక దివంగత ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు కుమారులు సురేశ్‌బాబు నిర్మాతగా, వెంకటేశ్ హీరోగా హిట్టయ్యారు. సురేశ్ పెద్ద కుమారుడు రానా యాక్టర్‌గా మంచి ఫామ్‌లో ఉండగా, చిన్న కుమారుడు అభిరామ్ కూడా యాక్టింగ్‌నే ఎంచుకున్నాడు. తేజ తెరకెక్కించిన ‘అహింస’ చిత్రం ద్వారా అభిరామ్ హీరోగా పరిచయం కానున్నాడు. ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. యువ రాజ్‌కుమార్ కన్నడ కంఠీరవ మనవడు ఎంట్రీ కన్నడంలో కూడా మూడోతరం వారసులు నటన వైపు అడుగులు వేస్తున్నారు. దివంగత ప్రముఖ నటుడు, కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ మనవరాలు, కన్నడ యాక్టర్ రామ్‌కుమార్, పూర్ణిమ (రాజ్‌కుమార్ కూతురు)ల తనయ ధన్యా రామ్‌కుమార్ ‘నిన్నా సానిహకే’ ద్వారా హీరోయిన్గా పరిచయం అయ్యారు. ఇక రాజ్‌కుమార్ కొడుకు, నటుడు–నిర్మాత రాఘవేంద్ర రాజ్‌కుమార్ తనయుడు యువ రాజ్‌కుమార్ సైతం హీరోగా సై అన్నాడు. ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ యువ రాజ్‌కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా నిర్మిస్తోంది. రజ్వీర్ డియోల్, అగస్త్య నంద హిందీలోనూ.. తెలుగు నుంచి ఇంతమంది వారసులు వస్తుండగా అటు హిందీలో కూడా థర్డ్ జనరేషన్ రెడీ అయింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కుమార్తె శ్వేతా నంద కుమారుడు అగస్త్య నంద ఎంట్రీ ఖరారైంది. ఈ బిగ్ బి మనవడు జోయా అక్తర్ తెరకెక్కిస్తోన్న ‘ఆర్చీస్’ అనే ఓ వెబ్ షోలో నటిస్తున్నాడు. ఇదే వెబ్ ఫిల్మ్ ద్వారా శ్రీదేవి కుమార్తె ఖుషీ, షారుక్ కుమార్తె సునైనా పరిచయం కానున్నారు. ఇక ప్రముఖ నటుడు ధర్మేంద్ర వారసత్వాన్ని ఆయన కుమారులు సన్నీ. బాబీ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. సన్నీ చిన్న కొడుకు రజ్వీర్ డియోల్ ఎంట్రీ ఖరారైపోయింది. అవనీష్ బర్జాత్యా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ద్వారా రజ్వీర్ పరిచయం అవుతున్నారు. ఇక సన్నీ డియోల్ పెద్ద కుమారుడు అంటే రజ్వీర్ డియోల్ సోదరుడు కరణ్ డియోల్ ఆల్రెడీ నటుడిగా కొనసాగుతున్నాడు. సినిమాల్లోకి ఎంట్రీ కార్డ్ ఈజీ అయినప్పటికీ ఈ వారసులపై అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలను చేరుకుంటే ఫ్యాన్స్‌కి పండగే. వీరే కాదు.. మూడో తరానికి చెందిన మరికొందరు వారసులు తమ టాలెంట్‌ను ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సీతూ పాప చేసిన కూచిపూడి డ్యాన్స్ చూశారా? ఎంత బావుందో..
సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న వయసులోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సితార సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇటీవలె కళావతి పాటతో మెస్మరైజ్ చేసిన సితార..రీసెంట్గా పెన్నీ సాంగ్‌లో తళుక్కున మెరిసింది. ఇప్పటివరకు వెస్ట్రన్ డ్యాన్స్ స్టెప్పులతో ఆకట్టుకున్న సీతూ పాప తొలిసారిగా కూచిపూడి డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను మహేశ్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. 'సితార మొదటి కూచిపూడి డ్యాన్స్ ఇది. ఈ శుభప్రదమైన శ్రీరామనవమి రోజున ఈ వీడియోను మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ శ్లోకం రాముడి గొప్పదనాన్ని తెలియజేస్తుంది. నా సీతూ పాప అంకితభావం, తన టాలెంట్ చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నువ్వు నన్ను మరింత గర్వపడేలా చేస్తున్నావు. సితారకు కూచిపడి నేర్పించిన గురువులకు ధన్యవాదాలు. అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు' అంటూ మహేశ్ పేర్కొన్నారు. ఇక సితూ పాప చేసిన కూచిపూడి డ్యాన్స్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
స్పెషల్ వీడియోతో సితార ఉగాది విషెస్.. వైరల్
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సినీ ప్రముఖులు ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేశ్‌బాబు గారాల పట్టి సితార సైతం అభిమానులకు ఉగాది విషెస్ తెలియజేసింది. ప్రతి పండగకి అభిమానులకు శుభాకాంక్షలు చెప్పడం సితారకు అలావాటు. ఆ పండగ ప్రత్యేకత తెలుసుకొని మరి దానికి తగ్గట్టుగా రెడీ అయి విషెస్ తెలియజేస్తుంది. ఉగాది పండక్కి కూడా సితార అదే ఫాలో అయింది. ఉగాది సందర్భంగా ట్రెడిషనల్ లుక్‌లో ఓ బ్యూటిఫుల్ ఫోటోషూట్ చేయించుకుంది సితార. దానికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..‘అందరికి ఉగాది శుభాకాంక్షలు’ అని అచ్చమైన తెలుగులో చెప్పింది. ఆ వీడియో సితార డ్రెడిషనల్ లుక్‌లో యువరాణిలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇటీవల సితార ఏ పోస్ట్ పెట్టినా అది నెట్టింట వైరల్ అవుతుంది. ఆ మధ్య‘ సర్కారు వారి పాట’ నుంచి కళావతి పాటకు స్టెప్పులేస్తే.. అది నెట్టింట చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత అదే సినిమాలో ‘ఎవ్రీ పెన్ని’ పాటకు తనదైన స్టైల్లో స్టెప్పులేసి ఔరా అనిపించింది. తాజాగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సితూ పాప పోస్ట్ చేసిన వీడియో కూడా వైరల్ అయింది. View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) -
సర్కారు వారి పాట: పెన్నీ ఫుల్ సాంగ్ వచ్చేసింది
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి నేడు(ఆదివారం) సెకండ్ సింగిల్ పెన్నీ ఫుల్ సాంగ్ విడుదలైంది. ‘ఎవ్రీ పెన్ని ఎవ్రీ పెన్ని’ అంటూ సాగే పాట ప్రోమోను నిన్న(శనివారం) రిలీజవగా తాజాగా ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాట ద్వారా తొలిసారి తండ్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుని వెండితెర ఎంట్రీ ఇచ్చేసింది సితార పాప. కాగా పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ హీరోయిన్గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. మే 12న ఈ మూవీ రిలీజ్ కానుంది. చదవండి: మెగాస్టార్ చిరంజీవి సినిమాలో తమిళ బ్యూటీ..! -
నిన్ను గర్వపడేలా చేస్తా నాన్న: సితార
సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. మే 12న ఈ మూవీని విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి నేడు(ఆదివారం) సెకండ్ సింగిల్ ఫుల్ సాంగ్ విడుదల కానుంది. ‘ఎవ్రీ పెన్ని ఎవ్రీ పెన్ని’ అంటూ సాగే పాట ప్రోమోను నిన్న(శనివారం) మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ పాటలో అందరిని ఆశ్చర్యపరిచే ఓ సంఘటన చోటు చేసుకుంది. మహేశ్ బాబు కూతురు సితార ఈ పాటలో కనిపించి షాకిచ్చింది. తొలిసారి తండ్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుని వెండితెర ఎంట్రీ ఇచ్చేసింది సితార పాప. చదవండి: Sarkaru Vaari Paata: సెకండ్ సింగిల్ అవుట్, ఆశ్చర్యపరిచిన సితార దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ సంబరంలో మునిగితేలుతున్నారు. శనివారం(మార్చి 19) ప్రోమో విడుదలైన నేపథ్యంలో సితార తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తిర పోస్ట్ షేర్ చేసింది. ‘పెన్ని సాంగ్ కోసం సర్కారు వారి పాట వంటి అద్భతమైన టీంతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. నాన్న.. నిన్ను గర్వపడేలా చేస్తాను’ అంటూ సితార రాసుకొచ్చింది. కాగా పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) -
‘సర్కారు వారి పాట’ సెకండ్ సింగిల్, సితార పాప ఎంట్రీ ఇచ్చేసిందిగా..
మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే మార్చి 20న ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ప్రోమోను విడుదల చేసింది చిత్ర బృందం. చదవండి: ఫుడ్ డెలివరి బాయ్‌గా మారిన స్టార్ కమెడియన్, ఫొటో వైరల్ ‘ఎవ్రీ ఎవ్రీ పెన్ని..’ అంటూ సాగే ఈ పాటలో మహేశ్ తనయ సితార ఘట్టమేనిన కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. చూస్తుంటే తండ్రి మూవీతోనే సితార వెండితెర ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ పాటలో సితార గ్రూప్‌లో లీడ్ డ్యాన్సర్‌గా కనిపించింది. ఇందులో ఆమె స్టైలిష్ స్టెప్పులతో అదరగొట్టింది. తండ్రి ఓ ఫారిన్ లేడి గ్రూప్‌తో డ్యాన్స్ చేస్తుంటే.. సితార మరో గ్రూప్‌తో లీడ్ డ్యాన్స్‌ర్‌గా ఆకట్టుకుంటుంది. ఇలా తండ్రి కూతుళ్లను ఒకే పాటలో చూసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇక ఫుల్ సాంగ్ ఎలా ఉండబోతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నామంటూ ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
అది ఎప్పుడూ మిస్ చేసుకోం.. ప్రేమిస్తూనే ఉంటాం : నమ్రత ఎమోషల్ పోస్ట్
Superstar Krishna Best Moments With His Grandchildren: సూపర్ స్టార్ మహేశ్ బాబు మంచి ఫ్యామిలీ పర్సన్ అని అందరికి తెలిసిందే. స్టార్ హీరో అయినప్పటికీ తన కుటుంబ సభ్యులతో ఎప్పుడు నార్మల్‌గానే ఉంటాడు. విరామం దొరికితే చాలు ఫ్యామిలీతో టూర్స్ వేస్తుంటాడు. ఇది తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నుంచే నేర్చుకున్నానని మహేశ్ చెబుతుంటాడు. అప్పట్లో కృష్ణ ఫుల్ బీజీగా ఉన్నప్పటికీ.. కుటుంబానికి మాత్రం సమయం కేటాయించేవాడట. ప్రతి రోజు ఉదయం కచ్చితంగా ఫ్యామిలీతో కలిసి టిఫిన్ చేసేవాడట. రాత్రి పిల్లలతో మాట్లాడేవాడట. ఇప్పుడు మహేశ్ కూడా అదే వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. షూటింగ్ లేకుండా ఖాలీగా ఉంటే.. ఆ సమయాన్ని అంతా ఫ్యామిలీకే కేటాయిస్తాడు. అలాగే వారానికి ఒక్క రోజు అయినా.. తన ఫ్యామిలీ అంతా కృష్ణ ఇంట్లో గడుపుతుంటుందట. తాజాగా ఈ విషయాన్ని నమ్రత సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ, సితార, గౌతమ్ ఉన్న ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘మండే లంచ్.. ఎప్పుడూ మిస్ అవ్వం.. ఎన్నో కథలు చెబుతుంటారు.. ఆయన్నుంచి ఎంతో నేర్చుకోవచ్చు.. మేం అంతా కూడా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం మామయ్య గారు’అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసి మహేశ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక మహేశ్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన పరుశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’చేస్తున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
సితార డ్యాన్స్ వీడియోపై మహేశ్ ఏమన్నాడంటే..
Mahesh Babu Comments On Sitara Cute Dance To Kalavathi Song: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆరేళ్ల వయసులోనే సోషల్ మీడియాలోకి అడుగుపెట్టి తన యూనిక్ స్టైల్‌తో బోలెడంత పాపులారిటీ సంపాదించుకుంది. తండ్రికి తగ్గ కూతురిగానే కాకుండా తనకంటూ స్పెషల్ ఇమేజ్ను ఏర్పరచుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సితార తాజాగా తండ్రి, మహేశ్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలోని కళావతి సాంగ్‌కు స్టైలిష్ స్టెప్పులేసి మెస్మరైజ్ చేసింది. ఇది చూసిన సూపర్ స్టార్ మహేశ్‌బాబు.. 'మై స్టార్.. నన్ను బీట్ చేసింది' అంటూ ఇన్‌స్టాలో కూతురిపై ప్రశంసలు కురిపించారు. మహేశ్ భార్య నమ్రత సైతం ఇంకేం చెప్పగలను? లవ్యూ మై లిటిల్ వన్ అని పేర్కొంది. ఇక సితార డ్యాన్స్‌కు మహేశ్ అభిమానులు సహా నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అచ్చం నాన్నలాగే సూపర్‌స్టార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: 'కళావతి' పాటకు మహేశ్ బాబు కూతురు సితార స్టెప్పులు View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) -
'కళావతి' పాటకు మహేశ్ బాబు కూతురు సితార స్టెప్పులు
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జిఎంబి ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఇటీవలె విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్ కళావతి పాట యూట్యూబ్‌లో దుమ్మురేపుతుంది. ఇప్పటికే 35మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. తాజాగా ఈ పాటకు మహేశ్ కూతురు సితార అదిరిపోయే స్టెప్పులేసింది. కమా కమాన్ కళావతి.. నువ్వే లేకుంటే అదోగతి' అంటూ అచ్చం తండ్రిలా స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) -
‘నాన్న పీస్ డేని చెడగొట్టే మిషన్‌లో బిజీ, సితార పోస్ట్ వైరల్
సూపర్ స్టార్ మహేశ్ బాబు ముద్దుల తనయ సితార సోషల్ మీడియోలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగ చెప్పనక్కర్లేదు. అరేళ్ల వయసులో సోషల్ మీడియాలో అడుగుపెట్టి అందరిని అలరిస్తోంది. ఎప్పుడు డ్యాన్స్ వీడియోలు, తండ్రితో కలిసి సరదాగా ఇంట్లో సందడి చేస్తున్న ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆదివారం సెలవురోజు కావడంతో ఉదయాన్నే తండ్రితో కలిసి ఆడుకుంటున్న రెండు ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది సితార పాప. చదవండి: రవితేజపై ఖిలాడి డైరెక్టర్ రమేశ్ వర్మ భార్య షాకింగ్ కామెంట్స్, ఈ వివాదం మరింత ముదరనుందా? ఈ ఫొటోలు చూస్తుంటే సితార తండ్రి మహేశ్ బాబుతో చిన్నపాటి ఫైట్‌కు దిగినట్లు కనిపిస్తోంది. అదే విధంగా ఈ ఫొటోలకు సితారా.. ‘నాన్న పీస్ఫుల్(సండే) డేను చెడగోట్టే విషన్లో బిజీగా ఉన్నాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మహేశ్ బాబు తన కూతురి ఇలా సరదగా ఆడుకోవడం చూసిన ఈ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అంతేగాక ఈ ఫొటోలకు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: దీపికా బోల్డ్ సీన్స్‌పై భర్త రణ్వీర్ స్పందన, ఏమన్నాడంటే.. View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) -
యానీ మాస్టర్‌తో సితార స్టెప్పులు.. వీడియో వైరల్
Mahesh Babu Daughter Sitara Dance With Anee Master Goes Viral: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కూతురు సితార సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా కొరియోగ్రాఫర్, బిగ్‌బాస్5 కంటెస్టెంట్ యానీ మాస్టర్‌తో కలిసి డ్యాన్స్ స్టెప్పులేసింది. డీజే స్నేక్ చార్ట్ బస్టర్ ‘టకీ టకీ’అనే పాటకు ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సితార తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. 'యానీ మ్యామ్ స్టెప్పులతో రీచ్ అవ్వడానికి ప్రయత్నించాను. ఇంకా రావాల్సి ఉంది' అంటూ సితార ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సితార డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చిన్న వయసులోనే సితర డ్యాన్స్ స్టెప్పులతో అదరగొడుతుందంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) -
నా ఆల్‌టైమ్ ఫేవరెట్ అదే: మహేశ్‌బాబు కూతురు సితార
సూపర్ స్టార్ మహేశ్‌బాబు కూతురనే కాదు.. ఆరేళ్ల వయసులోనే సోషల్ మీడియాలోకి అడుగుపెట్టి, తన యూనిక్ స్టైల్‌తో, పాపులర్ అవుతోన్న ‘ఫన్టాస్టిక్ తార’.. సితార. ఈ చక్కని చుక్కని మరింత చక్కగా చూపించిన ఫ్యాషన్బ్రాండ్సే ఇవి. డ్రెస్ డిజైన్.. ఇంద్రధనస్సును ఇష్టపడని పిల్లలు ఉండరు. రెయిన్‌బోను పోలిఉండేలా పైభాగాన్ని తెలుపు-నలుపు డాట్‌లతో కాస్త డల్‌గా ఉంచి, కింది భాగాన్ని పసుపు, పర్పుల్ రంగులతో హైలెట్ చేశారు. వన్స్లీవ్, బ్లాక్ బ్యాండ్, డ్రెస్‌కు డిఫరెంట్ లుక్‌ను తెచ్చింది. ఇక లైట్ మేకప్, నో యాక్సనరీస్తో సితార ఆ డ్రెస్ డిజైన్‌ను మరింత హైలెట్ చేసిందనే చెప్పొచ్చు. జన్యాస్ క్లోసెట్ ఫ్యాషన్‌ను ఇష్టపడే పిల్లల కోసం స్థాపించిన సంస్తే జన్యాస్ క్లోసెట్. 2014లో ప్రారంభమైన ఈ బ్రాండ్.. అందమైన డిజైన్స్‌తో కొద్ది రోజుల్లోనే లగ్జూరియస్ కిడ్స్ ప్యాషన్ హౌస్‌గా ప్రసిద్దిపొందింది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి పదహారేల్ల వయసు వారి వరకూ రెడీమేడ్ దుస్తులు ఇక్కడ లభిస్తాయి. అయితే, కేవలం బాలికల దుస్తులను మాత్రమే డిజైన్ చేస్తారు. పలువురు సెలబ్రిటీల పిల్లలకు జన్యాస్ డిజైన్స్ అందించింది. వీరి కలెక్షన్స్‌తో ఫోటోషూట్లు చేస్తూ సితార కొంతకాలం ఈ బ్రాండ్ మోడలింగ్ కూడా చేసింది. స్టార్స్ కిడ్స్ బ్రాండ్స్ అంటే ధర కూడా అదే రేంజ్లో ఉంటుంది. ప్రత్యేకంగా డిజైన్ చేయించుకోవాలంటే లక్షలు ఖర్చు చేయాల్సిందే. ప్రస్తుతం భారత్‌లోని పలు నగరాలతో పాటు ఆన్‌లైన్‌లోనూ ఈ డిజైన్స్‌ను కొనుగోలు చేయొచ్చు. డ్రెస్ బ్రాండ్: జన్యాస్ క్లోసెట్ ధర: రూ.11,900 నా మేకప్ నేనే వేసుకుంటా.. కొన్ని సార్లు అన్నయ్యను కూడా రెడీ చేస్తుంటా. అన్నయ్యను ఇరిటేట్ చేయడం, ఆ ఆల్‌టైమ్ ఫేవరెట్ - ఘట్టమనేని సితార -
ఫ్యామిలీతో స్విట్జర్లాండ్‌లో ఎంజాయ్ చేస్తున్న మహేశ్
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ వీలు దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటాడు. ఆయన పరశురాం దర్శకత్వంలో చేస్తున్న మూవీ ‘సర్కారు వారి పాట’. ఆ చిత్రంలో షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్‌లో జరుగుతోంది. ఈ సమయంలో కొంచెం గ్యాప్ తీసుకున్న ప్రిన్స్ భార్య, పిల్లలతో కలిసి స్విట్జర్లాండ్‌లో ట్రిప్‌లో ఉన్నాడు. తాజాగా ఈ ట్రిప్‌లో పిల్లలు సితార, గౌతమ్‌తో కలిసి ఈత కొడుతున్న ఎంజాయ్ చేస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇద్దరితో కలిసి శాంతిని కనుగొన్నట్లు క్యాప్షన్ ఇచ్చాడు. అలాగే ఆయన భార్య నమ్రతా సైతం ఈ ట్రిప్ సంబంధించి చిన్న వీడియోని షేర్ చేసింది. అందులో సూపర్ స్టార్ తన కూతురితో కలిసి లూసెర్న్‌లో నడుస్తున్నాడు. దీంతో ఇవీ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారాయి. చదవండి: నా సూపర్ ఉమెన్‌తో ఇలా, చాలా ఆనందంగా ఉంది: మహేశ్ View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
తండ్రికి సితార స్పెషల్ బర్త్‌డే విషెస్, ఆకట్టుకుంటున్న ఇన్‌స్టా పోస్ట్
సూపర్ స్టార్ మహేశ్ బాబు నేటితో 46వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. సోమవారం(అగష్టు 9) ఆయన పుట్టిన రోజు సందర్భంగా మహేశ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే మొత్తం మహేశ్ ఫొటోలు, ఆయనకు సంబంధించిన ట్యాగ్లే దర్శనమిస్తున్నాయి. సినీ ప్రముఖుల నుంచి అభిమానుల వరకు ఆయనకు విషెస్ చెబుతున్నారు. ఇక మహేశ్-నమ్రతల ముద్దుల తనయ సితార ఘట్టమనేని కూడా తండ్రికి ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్ తెలిపింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో తండ్రి గురించి చెబుతూ సీతూ పాప పెట్టిన పోస్టు అందరిని ఆకట్టుకుంటుంది. మహేశ్‌తో దిగిన ఫొటోను షేర్ చేస్తూ ‘ప్రపంచానికి మీరు సూపర్ స్టార్ అయితే మాకు మాత్రం మీరే ప్రపంచం. హ్యాపీ బర్త్‌డే నాన్న. మా ఆటల్లో, అల్లరిలో, నవ్వడం, పాడటం ఇలా అన్నింటిలోను మీరు మాకు బెస్ట్ డాడీగా ఉన్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడే కాదు ఎల్లప్పుడు మిమ్మిల్నీ ప్రేమిస్తూనే ఉంటాను. లవ్ యూ నాన్న’ అంటూ సితార పోస్టు చేసింది. View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) -
చోటీ చోటీ బాతే... సితార, ఆద్య స్పెషల్ ఇంటర్వ్యూ
-
యూ ట్యూబ్ చానల్ స్టార్ట్ చేస్తాం అన్నప్పుడు వద్దన్నారు.. కానీ
సితార–ఆద్య... మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి ‘ఎ అండ్ ఎస్’ పేరుతో యూ ట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నారు. చిన్నారులిద్దరూ యూ ట్యూబ్‌లో చేసే సందడిని లక్షల మంది వీక్షిస్తుంటారు. పండగలప్పుడు, ప్రత్యేక రోజుల్లోనూ, విడిగానూ సితార, ఆద్య చేసే స్పెషల్స్ ఫాలోయర్స్‌ని ఆకట్టుకుంటుంటాయి. స్నేహితుల దినోత్సవం సందర్భంగా చిన్నారులిద్దరూ ‘సాక్షి’ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలోని కొన్ని విశేషాలు ఈ విధంగా.. ► మీ ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయ్యింది? సితార: మా స్నేహం ‘మహర్షి’ సినిమా ఓపెనింగ్ అప్పుడు మొదలైంది. అక్కడ పెద్దగా మాట్లాడుకోలేదు. ఆ తర్వాత ఆద్య వాళ్ల మమ్మీకి మా మమ్మీ ఫోన్ చేసి ఆద్యను ఇంటికి పిలిచింది. అలా మళ్లీ కలిశాం. మా ఇద్దరికీ డాల్స్ అంటే ఇష్టం. మా వేవ్‌లెంగ్త్ మ్యాచ్ అయి, ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అయ్యింది. ఆద్య: మేమిద్దరం ఒకే స్కూల్. అయితే ‘మహర్షి’కి ముందు ఎప్పుడూ సితారతో మాట్లాడలేదు. ఆ సినిమా అప్పుడు కలిసిన తర్వాతే సితారతో నా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. ► మీకు గొడవలు వస్తుంటాయా? మీ ఒపీనియన్స్ సేమ్‌గా ఉంటాయా? ఇద్దరూ: మా ఇద్దరికీ అభిప్రాయభేదాలు ఎక్కువగా వస్తుంటాయి. కానీ ఎన్ని గొడవలొచ్చినా పది నిమిషాలు మాత్రమే. ► మీరు ఏదైనా కొత్తగా చేస్తాం అన్నప్పుడు మీ పేరెంట్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇద్దరూ: యూ ట్యూబ్ చానల్ స్టార్ట్ చేస్తాం అన్నప్పుడు ‘చిన్నపిల్లలు కదా.. ఇప్పుడే ఇంటర్నెట్ అవీ వద్దు’ అన్నారు. కానీ ఫైనల్‌గా ఒప్పుకున్నారు. ► మీ ఇద్దరిలో ఒకరికొకరికి నచ్చేదేంటి? ఆద్య: సితార చాలా ఫన్నీగా ఉంటుంది. షీ ఈజ్ వెరీ కేరింగ్ అండ్ లవింగ్. సితార: షీ ఈజ్ లైక్ మై బిగ్ సిస్టర్. తను నా గురించి చాలా కేర్ తీసుకుంటుంది. ► మీ ఇద్దరూ కలిసి హాలిడేకి ఎక్కడికైనా వెళ్లారా? ఇద్దరూ: ఇద్దరం కలిసి వెళ్లిన ఫస్ట్ ట్రిప్ లండన్. అది మా ఇద్దరికీ ఒక మెమొరబుల్ హాలిడే. అక్కడ చాలా షాపింగ్ చేశాం అండ్ బోలెడన్ని మ్యాచింగ్ ఐటెమ్స్ కొన్నాం. ► యూ ట్యూబ్ చానెల్లో వీడియోస్ ఐడియాలు ఎవరివి? ఆద్య: ఇద్దరం ఐడియాలు డిస్కస్ చేసుకుంటాం. సితార: కానీ జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఆద్య ఇస్తుంటుంది. ► హీరో మహేశ్‌బాబు–నమ్రతల కుమార్తె సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి–మాలినిల కుమార్తె ఆద్యతో స్పెషల్ చోటే చోటే బాతె ఈరోజు ఉదయం 10.30 గంటలకు... మీ ‘సాక్షి’ టీవీలో... ► వెండితెరపై స్నేహ సుమాలల్లిన చిత్రాల తడికన్నులనే తుడిచిన నేస్తమా స్పెషల్ ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు మీ ‘సాక్షి’ టీవీలో... ► వెండితెరపై అలరించిన స్నేహగీతాల పల్లకి స్నేహ గీతం ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు మీ ‘సాక్షి’ టీవీలో... ► స్నేహితులుగా మారిన వెండితెర గాయకులు... ట్రెండ్ సెట్ చేస్తున్న టాలీవుడ్ యంగ్ సింగర్స్ సాహితి, అదితి, శ్రుతీల లైవ్ షో ముస్తఫా ముస్తఫా ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు మీ ‘సాక్షి’ టీవీలో... ► రియాల్టీ షోలే కాదు రియల్ లైఫ్‌లో కూడా ఫ్రెండ్స్ అయిన అరియానా, హారికలతో ఫ్రెండ్షిప్ డే స్పెషల్ గరం గరం న్యూస్ ఈరోజు రాత్రి 8.30 గంటలకు మీ ‘సాక్షి’ టీవీలో... -
సోషల్ హల్చల్: సునీత మెలోడీ.. అలీ కామెడీ
మహేశ్ బాబు గారాల పట్టి సితార పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా నమ్రత తన కూతురికి బర్త్‌డే విషెస్ తెలుపుతూ ఓ క్యూట్ ఫోటోని అభిమానులతో పంచుకుంది. చాలా కాలం తర్వాత సినిమా సెట్లో అనుభూతి పొందుతున్నా అంటూ ఓ ఫోటోని షేర్ చేసింది బాలీవుడ్ బ్యూటీ కాజోల్ 2020లో అసంపూర్తిగా అగిపోయిన ప్రాజెక్ట్ అంటూ యాంకర్, నటి విష్ణు ప్రియ ఓ వీడియోని అభిమానులతో పంచుకుంది. సింగర్ సునీత నోట మరో మెలోడీ సాంగ్ రాబోతుందట. ఈ విషయాన్ని ఆమే సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. తన కొత్త సినిమా షూటింగ్లో పాల్గొన్న కమెడియన్ అలీకి ‘బిగ్‌బాస్’ఫేమ్ సోహైల్ స్వాగతం పలికాడు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) -
నువ్వు ఊహించినదాని కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నా: మహేశ్‌బాబు
Happy Birthday Sitara: సూపర్ స్టార్ మహేశ్‌బాబు గారాలపట్టి సితార బర్త్‌డే నేడు (జూలై 20). ఈ సందర్భంగా మహేశ్ తన కూతురికి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. '9వ పడిలోకి అడుగు పెట్టిన నా చిన్నారి పాపకు బర్త్‌డే శుభాకాంక్షలు. నా ప్రపంచంలో వెలుగులు విరజిమ్మే నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానంటే అది నీ ఊహకు కూడా అందనంతగా!' అంటూ ట్వీట్ చేశాడు. బెలూన్లు చేత పట్టుకుని కెమెరా వైపు స్మైల్ ఇస్తున్న సితార ఫొటోను సైతం అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సితార ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇదిలా వుంటే మహేశ్ ప్రస్తుతం 'సర్కారువారి పాట' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో 'మహానటి' ఫేం కీర్తి సురేశ్ హీరోయిన్. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలో సెట్స్‌లో మహేశ్‌బాబు చెప్పిన ఓ భారీ డైలాగ్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట ప్రత్యక్షం అవగా అదిప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #HBDLittlePrincessSitara 🤗😍 pic.twitter.com/Zk2fdqbxw8 — Binnudhfm (@BaluDhfm7) July 20, 2021 Wishing you a very happy glorious birthday my lil parpie keep smile stay awesome... Bundel of cuteness... pic.twitter.com/PpExflPx6v — Rohi_lv_Mahi (@Rohi_lv_Mahi) July 20, 2021 ❤️❤️❤️ pic.twitter.com/l2movz37Nd — Vyshnavi Yshu✨DHFM💙 (@vyshnavi66666) July 20, 2021 -
Mahesh Babu: సీతూ పాపతో మహేశ్.. పిక్ వైరల్
సూపర్ స్టార్ మహేశ్ బాబు మంచి ఫ్యామిలీ పర్సన్ అని అందరికి తెలిసిందే. స్టార్ హోదా ఎంత పెరిగినా తన కుటుంబ సభ్యులతో ఎప్పుడు నార్మల్‌గానే ఉంటాడు. తండ్రికి మంచి కొడుకుగా, భార్యకు మంచి భర్తగా, పిల్లలకు మంచి తండ్రిగా మహేశ్ ఉంటాడు. విరామం దొరికితే చాలు ఫ్యామిలీతో టూర్స్ వేస్తుంటాడు. ఇక లాక్డౌన్ సమయంలో అయితే మహేశ్ ఎక్కువగా కొడుకు గౌతమ్, కూతురు సితారాతోనే గడిపేస్తున్నాడు. వారితో కలిసి సరదాగా ఆడుకున్నాడు. ఆ ఫొటోలను ఆయన భార్య నమ్రత శిరోద్కర్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో, దానిపై చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో మహేశ్ బాబు తన గారాల పట్టి సితారాను గట్టిగా హత్తుకొని నిద్రపోయాడు. ఆ దృశ్యాన్ని నమత్ర తన కెమెరాలో బంధించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘ఇలాంటి హగ్గులు అనూహ్యంగా వస్తుంటాయ్.. ఎప్పుడైనా ఎక్కడైనా.. ఇలా వస్తాయ్. ఒక వేళ పాఠశాలలు ప్రారంభమైతే.. ఇలాంటివి ఎప్పుడంటే అప్పుడు వస్తూనే ఉంటాయి. అదే ఇప్పుడు మహేశ్ బాబు రియలైజ్ అవుతున్నాడు’అని నమ్రత చెప్పుకొచ్చింది. ఇక మహేశ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన పరుశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’చేస్తున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) చదవండి: సర్కారువారి పాట’ అప్డేట్స్ ఎప్పుడంటే.. -
నాన్న కూచి.. మహేశ్ ఒడిలో సితార అలా.. ఫోటో వైరల్
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీకి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో మనందరికీ తెలిసిందే. షూటింగ్‌లతో బిజీబిజీగా ఉండే ప్రిన్స్.. వీలుదొరికినప్పుడల్లా ఫ్యామిలీతో టూర్స్ వేస్తుంటాడు. ఇక లాక్డౌన్ సమయంలో అయితే మహేశ్ ఎక్కువగా కొడుకు గౌతమ్, కూతురు సితారాతోనే గడిపేస్తున్నాడు. వారితో కలిసి సరదాగా ఆడుకున్నాడు. ఆ ఫొటోలను ఆయన భార్య నమ్రత శిరోద్కర్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో, దానిపై చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మహేశ్ బాబుని తమ గారాలపట్టీ సితార పాప హత్తుకుని పడుకున్న ఫొటో నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఛైర్లో కూర్చొని ఉన్న తండ్రిని సితార పాప గట్టిగా హత్తుకొని నిద్రపోయింది. ఆ దృశ్యాన్ని నమత్ర తన కెమెరాలో బంధించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.‘ఉదయాన్నే గట్టిగా కౌగిలించుకోవడం తప్పనిసరి ! లేదంటే నిద్ర నుంచి తేరుకోవడం చాలా కష్టం.. నిద్రలేపాలంటే ఇదో మంత్రం.. అని నమ్రత తన గారాల పట్టి సితార అలవాటుని బహిర్గతం చేసింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక మహేశ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన పరుశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’చేస్తున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
ఈ ఫోటో.. చిరునవ్వులు తీసుకొచ్చింది : నమ్రత
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజుకి లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఎటు చూసినా ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని జనాలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొంతమంది అయితే భయంతోనే చనిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ధైర్యాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు సినీ, క్రీడా ప్రముఖులు. ప్రస్తుత పరిస్థితుల్లో పాత జ్ఞాపకాలను నెమరువేసుకోమని సలహా ఇస్తూ పోస్ట్ పెట్టింది సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రత. ‘ప్రస్తుతం మన చుట్టూ విషాదాలు, దుర్భర పరిస్థితులే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈ రోజు నా మొహంపై చిరునవ్వులు తీసుకొచ్చింది ఈ ఫోటో. ఇవన్నీ కూడా అద్భుతమైన మెమోరీస్. మీరు కూడా అలాంటి వాటిని వెతికి చూసుకోండి.. కాస్త నవ్వేందుకు ప్రయత్నించండి’అంటూ సితార చిన్నప్పటి ఫోటోని షేర్ చేసింది. దీనికి మెమోరీ థెరపీ అనే హాష్ట్యాక్ని యాడ్ చేసింది. ఇక బుల్లి సితార ఫోటోని చూసి మహేశ్‌బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సితార ఎంత క్యూట్‌గా ఉందో అంటూ మురిసిపోతున్నారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) చదవండి: ఎన్టీఆర్ తన పిల్లల ఫొటోలు, వీడియోలు ఎందుకు షేర్ నెట్టింట వైరలవుతున్న సుధీర్‌బాబు ఫ్యామిలీ ఫోటోలు -
సితూ పాప నువ్వు అప్పుడే ఎదగకు ప్లీజ్..
సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి సితార అప్పుడే పెద్దవ్వడం తనకు ఇష్టం లేదంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. తమన్నా, మహేశ్‌లు నటిస్తున్న ఓ కమర్షీయల్ యాడ్ షూట్ నిన్న దర్శకుడు సందీప్ వంగ డైరెక్షన్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తమన్నా, మహేశ్ గారాల పట్టి సితార పాపను సెట్లో కలిసింది. సితారతో కలిసి షూటింగ్ సెట్లో తమన్నా సందడి చేసి చిరు నవ్వులు చిందిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. అనంతరం ఈ ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. సితారతో అత్యంత సన్నిహితంగా దిగిన ఈ ఫొటోలకు ‘సీతు పాప నువ్వు ఇంత తొందరగా ఎదగకు(పెరగకు) ప్లీజ్’ అంటూ ముద్దులతో ఉన్న ఎమోజీలను జత చేసింది. అలాగే సితార కూడా తమన్నాతో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. చూడండి నేను ఎవరినీ కలిశానో! నాన్నతో కలిసి ఆన్‌సెట్‌లో’ అంటూ ఫొటోలను పంచుకుంది. అయితే మహేశ్-నమ్రత శిరోద్కర్లు 2006లో సీక్రెట్‌గా ప్రేమ వివాహం చేసుకన్న సంగతి తెలిసిందే. 2006లో వీరికి కుమారుడు గౌతమ్ ఘట్టమేనేని జన్మించగా.. కూతురు సితార 2012లో పుట్టింది. కాగా సితారకు ఇప్పడు ఎనిమిదేళ్లు. ఇక తమన్నా ప్రస్తుతం తెలుగులో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ‘సీటిమార్’, ‘గుర్తుందా సీతకాలం’, ‘ఎఫ్-3’, ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’లో నటిస్తోంది. వీటితో పాటు బోలే చుడియాన్‌లో అనే హిందీలో మూవీలో కూడా నటిస్తోంది. View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) -
కూతురి గిఫ్ట్‌ను చూసి మురిసిపోతున్న మహేష్
సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతల ముద్దుల కూతురు సితార చిన్నతనంలోనే సెలబ్రిటీ హోదాను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. స్టార్ హీరో కూతురుగానే కాక డ్యాన్స్, సింగింగ్ లాంటి వ్యక్తిగత టాలెంట్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. సితారకు తల్లిదండ్రులు అంటే అమితమైన ప్రేమ.. తాజాగా వాలంటైన్స్ డే సందర్భంగా పేరెంట్స్‌కు మంచి బహుమతిని అందించి వారిపై ఉన్న ప్రేమను మరోసారి చాటుకుంది. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు పురస్కరించుకొని మహేష్, నమ్రతకు గ్రీటింగ్ కార్డు ఇచ్చింది సితార. దానిపై లవ్ యూ అమ్మ, నాన్న.. హ్యపీ వాలెంటైన్ డే అని రాసిచ్చింది. కూతురు నుంచి ఇలా ఊహించని గిఫ్ట్ అందడంతో మహేష్ దంపతులు ఎమోషనల్ అయ్యారు. ఇక కూతురు ప్రేమగా ఇచ్చిన గ్రీటింగ్ కార్డును అభిమానులతో పంచుకున్నాడు మహేష్. థ్యాంక్ యూ సితూ పాప అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. నమ్రత సైతం సితార గిఫ్టుకు మురిసిపోయి, థ్యాంక్యూ తల్లి అంటూ కూతురుపై ప్రేమను కురిపించింది. ఇదిలా ఉండగా ప్రిన్స్ మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ దుబాయ్‌లో జరుగుతుంది. అక్కడే ఫ్యామిలీతో ఉన్న మహేష్ బాబు కుటుంబంతో ఎంజాయ్ చేస్తూనే షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నాడు. గీత గోవిందం తర్వాత పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతి 2022కు విడుదల కానుంది. చదవండి : వైరల్ అవుతున్న సితార తాజా ఫొటోలు View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
మహేష్ కూతురు సితార ఫోటోషూట్ ఫోటోస్
-
వైరల్ అవుతున్న సితార తాజా ఫొటోలు
సాక్షి, హైదరాబాద్: స్టార్ కిడ్స్ పిల్లలు ఏం చేసినా అవి వార్తల్లో నిలుస్తుంటాయి. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల తనయ సితార ఘట్టమనేని ముందంజలో ఉంటుంది. తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ యాక్టివ్ ఉండే సితార ఇప్పటికే సోషల్ మీడియా సెలబ్రిటిగా మారింది. సూపర్ స్టార్ కూతురుగానే కాక, డ్యాన్స్, పాటలు పాడటం వంటి మల్టీ టాలెంట్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది సితార. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించి తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఓ ఫొటో షూట్లో పాల్గొన్న సితార లైట్ పింక్ ఫ్రాక్‌లో అచ్చం బార్బిడాల్లా కనిపిస్తోంది. ఎంతో అందంగా ముద్దు ముద్దుగా ఫొటోలకు ఫొజులు ఇచ్చిన ఈ ఫొటోలను సితార తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. దీంతో ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింటా సందడి చేస్తున్నాయి. View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) -
ఫన్ ఫ్యామిలీ, నైటౌట్.. మహేశ్ ఫోటో వైరల్
సూపర్ స్టార్ మహేశ్ బాబు, డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్లో వచ్చిన చిత్రం మహర్షి. ఈ సినిమా బాక్సాపీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. మహర్షి తర్వాత వంశీ పైడిపల్లి, మహేశ్ బాబు మధ్య స్నేహబంధం మరింత బలపడింది. మహేశ్ గారాలపట్టి సితార, వంశీ కూతురు ఆద్య కలిసి ఓ యూట్యూబ్ ఛానల్‌ను కూడా మొదలుపెట్టారు. రెండు ఫ్యామిలీలు టైం దొరికినపుడల్లా సరదాగా గడుపుతుంటాయి. అందుకు ఈ ఫోటోనే నిదర్శనం. మహేశ్-వంశీ తమ కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో డిన్నర్ చేశారు. అనంతరం అంతా కలిసి కెమెరాకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోని నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ..ఫన్ ఫ్యామిలీస్..నైటౌట్ అని క్యాప్షన్ ఇచ్చారు. ఇక సినిమాల విషయానికొస్తే సరిలేరు నీకెవ్వరు తర్వాత వంశీ పైడిపల్లితో మరో సినిమా చేస్తానని మహేశ్ ప్రకటించాడు. అయితే వంశీ వినిపించిన కథలు నచ్చకపోవడంతో రిజెక్టు చేశాడు. ఇపుడు పరశురాంతో కలిసి సర్కారు వారి పాట చేస్తున్నాడు ప్రిన్స్. -
నాన్న నా కెమెరా నుంచి తప్పించుకోలేవు
సాక్షి, హైదరాబాద్: సూపర్ స్టార్ మహేశ్ బాబు తన పిల్లలతో చాలా సరదాగా ఉంటారన్న విషయం తెలిసిందే. ఆయన గారాల పట్టి సితార, తనయుడు గౌతమ్‌లతో సరదాగా ఆడుకుంటున్న ఫొటోలను తరచూ మహేశ్ భార్య నమ్రతా శిరోద్కర్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇక సితారా పాప తన తండ్రి మహేశ్ బాబు నటించిన చిత్రాల హిట్ పాటలకు స్టెప్పులేసిన వీడియోలైతే ఎంతాగానో వైరల్ అవుతుంటాయి. ఇక సితారా తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సోమవారం షేర్ చేసిన వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో మహేశ్ బెడ్‌పై పడుకుని ఉండగా సితార వీడియో తీస్తోంది. అయితే తన కెమెరాకు చిక్కకుండా మహేశ్ తలగడతో దాగుడు మూతలు ఆడుతున్నారు. ఈ క్రమంలో సితారా నాన్న నువ్వు తప్పించుకోలేవు అని అంటుండగా మహేశ్ తన రెండు చేతులతో ముఖానికి దాచేశారు. ఈ వీడియోను ‘నాన్న నువ్వు నా కెమెరా నుంచి తప్పించుకోలేవు’ అనే క్యాప్షన్‌తో సితార పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (చదవండి: 'సర్కారు వారి' ప్లాన్ మారిందా?) View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) కాగా కరోనా నేపథ్యంలో సినిమా షూటింగ్‌లు వాయిదా పడటంతో మహేశ్ తన కుటుంబంతో సరదాగా గడుపుతున్న ఫొటోలు, వీడియోలు కూడా ఇటీవల తెగ వైరల్ అయ్యాయి. అయితే ప్రస్తుతం మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అన్ని దేశాలు లాక్డౌన్ ఎత్తివేయడంతో ‘సర్కారి వారి పాట’ షూటింగ్ షెడ్యూల్ ఆమెరికాలో ఉండటంతో మహేష్ తన కుటుంబంతో కలిసి అక్కడ వాలిపోయారు. ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. ఇందులో మహేష్ సరసన కీర్తీ సురేశ్ కథానాయికగా నటుస్తుండగా.. బ్యాంక్ స్కామ్ బ్యాక్‌డ్రాప్‌లో నేపథ్యంలో ‘సర్కారి వారి పాట’ రూపొందనున్నట్లు సమాచారం. (చదవండి: ఇలాంటి క్షణాలు అమూల్యమైనవి: నమ్రత) -
నాన్నను హత్తుకుని నిద్రపోతున్న సితార
సూపర్ స్టార్ మహేశ్‌బాబు గారాల తనయ సితార ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తండ్రి నటించిన హిట్ సినిమాల్లోని పాటలకు స్టెప్పులేసిన వీడియోలైతే ఎంతగానో వైరల్ అయ్యాయి. తాజాగా పాటలు, డ్యాన్సులకు బదులుగా తన గుండెలో కలకాలం నిలిచిపోయిన ఓ పాత ఫొటోను షేర్ చేసుకుంది. ఇందులో కుర్చీలో వాలిపోయిన మహేశ్ మెడ చుట్టూ చేతులు వేసి హాయిగా కునుకు తీస్తోంది. (చదవండి: మహేశ్ డబుల్ బొనాంజా?) "సేద తీరేందుకు ఇంతకన్నా మంచి స్థలం ఎక్కడుంటుంది? నాన్నా.. నువ్వే బెస్ట్" అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇది విమానాశ్రయంలో దిగిన ఫొటో అని తెలుస్తోంది. కాగా సితార తండ్రి పుట్టినరోజున ఓ స్పెషల్ వీడియో తయారు చేసి మహేశ్‌ను సర్ప్రైజ్ చేసిన విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్‌ను నడుపుతోంది. ఇదిలా వుంటే మహేశ్ ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇందులో మహేశ్ డబుల్ యాక్షన్ చేస్తున్నారని టాక్. (చదవండి: తెగ వైరలవుతోన్న మహేష్ బాబు ఫోటో) View this post on Instagram Nothing better than this resting place !!❤️❤️❤️ My cozy snuggle !! Nana you are the best 😍😍😍😍 #airportdiaries #snuggletime #waybackwednesday A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) on Sep 29, 2020 at 8:57pm PDT -
ఈ క్రెడిట్ అంతా సీతూ పాపదే..
సినీ ఇండస్ట్రీలో ఆదర్శదంపతుల్లో ముందు వరుసలో ఉంటారు మహేష్ బాబు-నమ్రతా శిరోద్కర్. మిస్ ఇండియా, హీరోయిన్ అయినప్పటికి కుటుంబం కోసం తన కెరీర్‌ని త్యాగం చేశారు నమ్రత. మహేష్ బాబుకు గైడ్, ఫ్రెండ్, మెంటార్ అన్ని తానే. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూల్లో స్వయంగా వెల్లడించారు మహేష్ బాబు. తన సక్సెస్‌కి నమ్రతనే కారణం అంటూ ప్రశంసలు కురిపించే విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిలో మహేష్, నమ్రతను పట్టుకుని.. కెమరా వైపు చూస్తున్నారు. ‘మన ఉనికికి మూల కారణం.. నాకు ఎక్కువ నమ్మకం కలిగించే విషయం ఏంటంటే ప్రేమతో పాలించడం. లవ్ మాత్రమే మనల్ని సంతోషంగా ఉంచగలదు.. దయ, తాదాత్మ్యం, కరుణ అన్నీ ప్రేమ భావోద్వేగం నుంచే పుట్టుకొస్తాయి. ప్రేమ అనేది నిజమైన, అత్యున్నతమైన భావోద్వేగం. ఒకరిపట్ల ఒకరు ప్రేమగా, దయగా ఉండండి. ఉన్నది ఒకటే జీవితం.. ప్రేమతో జీవించండి. ఇదే నా నిజమైన ఆనందం’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. (చదవండి: వావ్..‘మైండ్ బ్లాక్’ చేసిన సితార) View this post on Instagram The more I think the more I’m convinced the root cause of our Being, is governed by love ❤️ Love is the only emotion that makes us live happy lives .. kindness, empathy compassion all stem from this emotion of love ♥️♥️love is the truest n highest form of being evolved !! This is my perception !! So be loving and be kind and be compassionate people to each other !! We have one live to live and one life to give ♥️♥️♥️#behappy #besafe #bekind this ones with my true happiness !! Pic.Courtesy @sitaraghattamaneni 😂 A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on Sep 20, 2020 at 12:06pm PDT మరో విశేషం ఏంటంటే సితార ఈ ఫోటోని తీసింది. దాంతో అభిమానులు ఫోటో సూపర్.. క్రెడిట్ అంతా సీతూ పాపదే అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక నమ్రత మహేష్ బాబుకి సంబంధించి ఇలాంటి థ్రో బ్యాక్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మహేష్ బాబు సర్కార్ వారి పాటలో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
వావ్..‘మైండ్ బ్లాక్’ చేసిన సితార
సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి సితార మరోసారి తన డ్యాన్స్‌తో ఇరగదీసింది. ఇప్పటికే ఇంగ్లీష్ పాటలతో పాటు తన తండ్రి మహేశ్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని ‘డాంగ్ డాంగ్’ పాటలకు చిందేసి హల్చల్ చేసిన సీతు పాప...తాజాగా అదే సినిమాలోని ఫేమస్ సాంగ్ ‘మైండ్ బ్లాక్’కి తనదైన స్టైల్లో స్టెప్పులు వేసి అదరగొట్టింది. (చదవండి : సితార డాడీ కూతురు.. ఫోటో షేర్ చేసిన నమ్రత) ఈ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోను నమ్రత తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం సితార డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సితార వేసిన స్టెప్స్‌కి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. తండ్రికి తగ్గ తనయ అని అనిపించావు అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురుపిస్తున్నారు. కాగా, అనిల్ రావిపుడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక, విజయశాంతి ముఖ్య పాత్రలు పోషించారు. (చదవండి : మహేశ్ బాబు ఇంట బర్త్‌డే పండగ) -
‘మైండ్ బ్లాక్’ చేసిన సితార
-
సితార డాడీ కూతురు.. ఫోటో షేర్ చేసిన నమ్రత
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే అల్లరిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో నమ్రతా అప్డేట్ ఇస్తూనే ఉంటోంది. తాజాగా మహేశ్, సితారకు కలిసి ఉన్నఓ ఫోటోను నమ్రత తన ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఆఫోటోలో సిరతా బేబీ కుర్చీలో పడుకొని ట్యాబ్‌లో ఏదో వీడియో చూస్తుంది. పక్కనే మహేశ్ కూర్చొని తన గారాల పట్టి ఏం చూస్తూందో అన్నట్లు ట్యాబ్‌లోకి చూస్తున్నాడు. సితార బేబీ డాడీ మహేశ్‌పై కాళ్లు వేసుకొని నవ్వుతూ వీడియో చూస్తుంది. నమ్రత ఈ ఫోటోని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ..సితార డాడీ కూతురు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. (చదవండి : ఇంగ్లీష్ పాటకు ఇరగదీసిన సితార) కాగా శనివారం మహేష్ బాబు ఇంట్లో వినాయక చవితికి సంబంధించిన వేడుకలకు సంబంధించిన వీడియోను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇంట్లో ప్రతిష్ఠించిన వినాయకుడికి నమ్రతతో పాటు మహేష్ బాబు కొడుకు, కూతురు గౌతమ్ కృష్ణ, సితార ఎంతో భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు. ఇక మహేశ్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం డిసెంబర్లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని మన దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. View this post on Instagram Ganpati Bappa Morya!! Pudchya varshi lavkar ya ♥️♥️♥️ गणपती बाप्पा मोरया!! पुढच्या वर्षी लवकर या 🙏🙏 🙏🙏 A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on Aug 28, 2020 at 4:14am PDT -
ఇంగ్లీష్ పాటకు ఇరగదీసిన సితార
అగ్రహీరో మహేశ్‌బాబు గారాల తనయ సితార మరోసారి డ్యాన్స్‌తో ఇరగదీసింది. అయితే ఈ సారి ఇంగ్లీష్ పాటకు స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియోను మహేశ్‌బాబు ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. అటు సితార కూడా తన అకౌంట్లో ఈ డ్యాన్స్ వీడియోను షేర్ చేస్తూ తనకు ఈ పాట ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ డ్యాన్స్ అభిమానులందరినీ ఓ ఊపు ఊపేస్తోంది. గతంలో తండ్రి సినిమా 'మహర్షి'లో నుంచి పాలపిట్ట పాటకు, సరిలేరు నీకెవ్వరులో 'డాంగ్ డాంగ్' పాటకు స్టెప్పులేసిన విషయం తెలిసిందే. (మీకు తెలియనంతగా ప్రేమిస్తా: మహేశ్) కాగా మహేశ్ లాక్డౌన్లో దొరికిన సమయాన్నంతటినీ భార్య నమ్రత, కూతురు సితారతో కలిసి కాలక్షేపం చేస్తున్నారు. ఈ క్రమంలో వారితో కలిసి దిగిన ఫొటోలను కూతురి డ్యాన్స్ వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. కాగా జూలై 20న సితార ఎనిమిదవ పుట్టినరోజు జరుపుకుంది. మరోవైపు మహేశ్ ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ఈపాటికే విడుదలైన ఫస్ట్ లుక్కు అద్భుతమైన స్పందన వస్తోంది. (నయా ట్రెండ్ సృష్టిస్తోన్న ‘ఆహా’) -
సితార డ్యాన్స్ వీడియో
-
మీకు తెలియనంతగా ప్రేమిస్తా: మహేశ్
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తన గారాలపట్టి సితారకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నేడు( జూలై 20)న మహేశ్ కూతురు సితార 8వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో మహేశ్ అభిమానులు సీతు పాపకు బర్త్‌డే విషెష్ తెలుపుతున్నారు. సితార బర్త్‌డే సందర్భంగా మహేశ్ ఒక ప్రత్యేకమైన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘చాలా తొందరగా సితార ఎనిమిదో వసంతంలోకి అడుగుపెట్టింది. నేను నీకు(సీతు పాప) తెలియనంతగా ప్రేమిస్తున్నాను. మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ మహేశ్ కామెంట్ జతచేశారు. మహేశ్ పోస్ట్ చేసిన ప్రత్యేమైన వీడియోలో.. సితార చిన్ననాటి ఫొటోలు, సితారతో మహేశ్ గడిపిన సరదా క్షణాలకు సంబంధించినవి ఫొటోలు ఉన్నాయి. (‘ఓ మై కడవులే’ చిత్రానికి మహేశ్ అభినందనలు) View this post on Instagram I love you like you will never know 😍😍😍 Wishing you a very happy birthday Parpi♥️♥️♥️♥️ #SituPapaTurns8 @sitaraghattamaneni A post shared by Mahesh Babu (@urstrulymahesh) on Jul 19, 2020 at 11:30am PDT అదే విధంగా నమ్రతా శిరోద్కర్ సితారకు ఇన్‌స్టాగ్రామ్‌లో బర్త్‌డే విషెష్ తెలిపారు. సీతు పాపతో కలిసి దిగిన ఫొటోలతో కూడిన ఓ వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘ఎనిమిదేళ్ల క్రితం మీరు ఈ ప్రపంచంలోకి వచ్చారు. నాకు మరిత ఆనందాన్ని, ప్రేమను పంచారు. మా జీవితంలో చాలా ఆనందాన్ని నింపినందుకు ధన్యవాదాలు. మీ చిరునవ్వు నాలోని వెలుగును ఎప్పటీకీ దూరం చేయదు. నాకు మీరు చాలా ఉత్తమైనవారు. మీరు దయ, ప్రేమ గల అమ్మాయిగా పెరుగుతున్నారు. మీకు తల్లిగా నేను చాలా గర్వపడుతున్నాను! నా చిట్టి స్టార్.. ఐ లవ్ యూ. మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని నమ్రత కామెంట్ జత చేశారు. View this post on Instagram 8 years ago !! You came into this world... bringing me more happiness and love to share and give ♥️♥️ Your love for family warms my heart. Thank you for bringing so much joy into our lives. That smile of yours can never fail to light me up 😍😍 You're one of the best things that ever happened to me!! You are growing into a good girl who is kind and loving, has empathy. I'm super proud of you! Go on and shine bright my little star 😘😘😘 I Love you so very much 😍🥰 today and always @sitaraghattamaneni. Wishing u the happiest birthday !! 🎂🎂🎂 #SituPapaTurns8 A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on Jul 19, 2020 at 11:33am PDT ఇక కరోనా వైరస్ కారణంగా మహేశ్‌బాబు తన సతీమణి నమ్రత, పిల్లలు గౌతమ్, సితారతో సమయానన్ని గడుపుతున్నారు. తన పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని మహేశ్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారన్న విషయం తెలిసిందే. సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం మహేశ్‌బాబు ‘గీతగోవిందం’ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సర్కారు వారి పాట’చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తీ సురేష్ కన్ఫార్మ్ అయ్యారు. -
ఆ విషయాల్లో అస్సలు తలదూర్చను: నమ్రతా
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటించిన ఒక్కడు, పోకిరి, మహర్షి, దూకుడు, సరిలేరు నీకెవ్వరు, భరత్ అనే నేను చిత్రాలు తనకెంతో ఇష్టమని ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉండే నమ్రతా మంగళవారం ఇన్‌స్టాలో నిర్వహించిన ‘ఆస్క్ మీ యువర్ క్వశ్చన్’ సోషన్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు. మీకు ఇష్టమైన హీరో? ఇది చాలా కష్టమైన ప్రశ్న(ఫన్నీ ఎమోజీస్). మహేశ్‌బాబు నా ఫేవరెట్ హీరో మహేశ్‌బాబు నటించిన చిత్రాల్లో మీకే బాగా నచ్చేవి? ఒక్కడు, పోకిరి, దూకుడు, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, భరత్ అనే నేను మీరు రుచికరంగా చేసే వంటకం? మ్యాగీ న్యూడిల్స్ మీ జీవితంలోని మధుర క్షణాలు గురించి చెప్పమంటే అంటే ఏం చెబుతారు? మధుర క్షణాలు అంటే రెండు ఉన్నాయి. ఒకటి మహేశ్‌ను పెళ్లి చేసుకోవడం, ఇద్దరు పిల్లలకు జన్మనివ్వడం మహేశ్ బాబు సినిమాల విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అవుతారా? మహేశ్ సినిమా విషయాల్లో అస్సలు తలదూర్చను. మహేశ్-పూరి జగన్నాథ్‌ల కాంబినేషన్లో సినిమా ఉంటుందా? అది కాలమే చెప్పాలి మీ తల్లిదండ్రులు తొలుత మీ ప్రేమను ఒప్పుకున్నారా? మహేశ్‌ను తొలిసారి చూడగానే వారు కూడా ప్రేమలో పడిపోయారు. మీకు ఇష్టమైన క్రికెటర్లు ఎవరు? ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి భవిష్యత్తులో మహేశ్‌తో కలిసి నటించే అవకాశం ఉందా? ఈ జీవితకాలంలో అది మళ్లీ సాధ్యం కాకపోవచ్చని నాకనిపిస్తోంది. సితార, గౌతమ్లలో ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు? ఇద్దరూ బాగా అల్లరిచేస్తారు. సితార సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందా? ఇప్పుడే ఏం చెప్పలేం. ప్రస్తుతం తన ఏఅండ్‌ఎస్ యూట్యూబ్ ఛానల్ వీడియోలతో చాలా సంతోషం ఉంది. ఇందిరమ్మ గురించి ఒక్క మాటలో చెప్పమంటే? ప్రేమకు సంపూర్ణ రూపం ఎవరు ముందుగా లవ్ ప్రపోజ్ చేశారు? అది కరెక్ట్‌గా చెప్పలేం. మీకు ఇష్టమైన ప్రదేశం? స్విస్ ఆల్ఫ్స్ మీ అందానికి, ఆరోగ్యానికి రహస్యాలు తృప్తిగా భోజనం చేయడం, మనశ్శాంతిగా నిద్ర పోవడం. రోజూ వ్యాయామం చేయడం సితార యూట్యూబ్ ఛానల్లో మీరు గెస్ట్‌గా ఎప్పుడు వచ్చేది? అది సితారకే తెలియాలి. చాలా తెలివిగా ఎంపిక చేసుకుంటుంది ఇంటర్వ్యూల కోసం. మేడం మీ టాటూ చూపించగలరా? -
మహేశ్-సితు పాప స్విమ్మింగ్ పోటీ
కరోనా లాక్డౌన్ కారణంగా ఎప్పుడూ బిజీగా ఉండే టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఇప్పుడు ఖాళీ అయిపోయారు. తన కుటుంబంతో కలిసి హాయిగా గడిపేస్తున్నారు. ఫ్యామిలీ అంటే ప్రాణమిచ్చే మహేశ్ ఈ లాక్డౌన్ సమయంలో కాలు కూడా బయటకి పెట్టకుండా పిల్లలతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పటికే గౌతమ్, సితారలతో కలిసి చేస్తున్న అల్లరి, ఆటలకు సంబంధించిన ఫోటోలు, వీడియలోను నమ్రత ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. తాజాగా మహేశ్ తనయ సితార తన తండ్రితో కలిసి ఇండోర్ స్విమ్మింగ్‌ఫూల్‌లో పోటీ పడింది. (సితు పాపను ఓడిస్తూ తాను ఓడుతూ) తండ్రీ కూతుళ్లు స్విమ్మింగ్ చేస్తున్న వీడియోను సితు పాప తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘నాన్నతో పోటీ అంటే చాలా సరదాగా ఉంటుంది. నాన్నతో నేను పాల్గొన్న మొదటి స్విమ్మింగ్ పోటీ ఇది’ అంటూ బుజ్జిబుజ్జి మాటలను జోడించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి హిట్ మూవీ తర్వాత మహేశ్‌బాబు హీరోగా చేస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. కీర్తీ సురేశ్ కథానాయికగా నటించనున్నారు. మైత్రీ మూవీస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14రీల్స్ ప్లస్ పతాకాలపై నవీన్ యర్నేని, రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. (సితు పాప సింపుల్ యోగాసనాలు) View this post on Instagram Racing with Nanna was so much fun ♥️♥️♥️ His arms are way bigger than mine😍😍😍 My first race🏊😃 #swimoclock @urstrulymahesh A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) on Jun 26, 2020 at 9:44pm PDT -
సితు పాపను ఓడిస్తూ తాను ఓడిపోతూ
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ కొంచెం వీలు దొరికినా తన పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి ఆటపాటలతో తెగ ఆల్లరి చేస్తుంటారు. ఇక కరోనా లాక్డౌన్ సమయంలో దొరికిన అనూహ్య సమయాన్ని పూర్తిగా కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్నారు. మహేశ్-గౌతమ్-సితారలకు అల్లరికి సంబంధించిన ఫోటో, వీడియోలను నమ్రత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా మహేశ్-సితారలు టంగ్ ట్విస్టర్ గేమ్ ఆడుతన్న ఓ వీడియోను నమ్రత తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. (మా నాన్న మాకు మంచి ఫ్రెండ్) ఇక ఈ వీడియోలో టంగ్ ట్విస్టర్ గేమ్‌లో తను గెలిచినట్లు తండ్రితో సితార వాదన చేస్తుండటం చూడవచ్చు. ఇక ఈ గేమ్‌లో ఓడిస్తూ, ఓడిపోతూ సితు పాపతో మహేశ్ సరదాగా ఆడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం మహేశ్‌బాబు ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సర్కారు వారి పాట’చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తీ సురేష్ కన్ఫార్మ్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా తాను మహేశ్‌బాబు సినిమాలో నటిస్తున్నట్లుగా వెల్లడించారు కీర్తీ సురేష్. (‘మా నాన్న నవ్వు.. మా బిడ్డ చిరునవ్వు’) -
సీతు పాప సింపుల్ యోగాసనాలు
హైదరాబాద్: నేడు(జూన్ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆద్య, సితారలు అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా సులువైన యోగాసనాలు ఎలా వేయాలో వివరిస్తూ ఓ వీడియోను తమ ఏ అండ్ ఎస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. సునాయసంగా వేసే యోగాసనాలతో పాటు, ఆ ఆసనాలతో కలిగే లాభాలను చక్కగా వివరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక వీరి ప్రయత్నానికి, డెడికేషన్‌కు నెటిజన్లు ఫిదా అవుతూ సూపర్బ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. (సితార డెడికేషన్‌కు నెటిజన్లు ఫిదా) ఇక మహేశ్‌బాబు ముద్దుల కూతురు సితార, వంశీ పైడిపల్లి కూతురు ఆద్య ఇద్దరూ కలిసి ఏ అండ్ ఎస్ అనే యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆటలు, విజ్ఞానం, వినోదానికి సంబంధించిన పలు వీడియోలను అప్లోడ్ చేస్తున్నారు. ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విడుదల తర్వాత మహేశ్, రష్మికలను ఈ ఇద్దరు చిచ్చరపిడుగులు ఇంటర్వ్యూచేసి అకట్టుకున్నారు. ఆడియన్స్‌కు ఎంతో ఎంటర్టైన్మెంట్ ఇస్తూ పలు వీడియోలను పోస్ట్ చేస్తుండటంతో ఏ అండ్ ఎస్ యూట్యూబ్ ఛానల్‌కు అభిమానుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. (మా నాన్న మాకు మంచి ఫ్రెండ్) -
మా నాన్న మాకు మంచి ఫ్రెండ్
‘‘డాడీ ఈజ్ బెస్ట్. మమ్మల్ని బాగా ఆడిస్తారు. స్ట్రిక్ట్‌గా ఉండరు’’ అంటున్నారు గౌతమ్, సితార. తండ్రి మహేశ్‌బాబు గురించి అడిగిన ప్రశ్నలకు ఈ విధంగా చెప్పారు. ► సినిమాలతో బిజీగా ఉండే మీ నాన్నగారు ఇప్పుడు కంటిన్యూస్‌గా ఇంట్లో ఉండటం ఎలా ఉంది? గౌతమ్, సితార: మాకిది క్వాలిటీ టైమ్. మూడు నెలలుగా నాన్న ఇంట్లోనే ఉంటున్నారు. మా సమ్మర్ మొత్తం నాన్నతో ఫుల్‌గా టైమ్ స్పెండ్ చేయడం హ్యాపీగా ఉంది. ► మీ నాన్నతో చాలా ఆటలు ఆడుకుంటున్నారట? స్నేక్ అండ్ ల్యాడర్ ఆడుతున్నాం. నిచ్చెన ఎక్కినప్పుడు భలేగా ఉంటుంది. వీడియో గేమ్స్ కూడా ఆడతాం. పీఎస్ 4 గేమ్స్, ఆన్లైన్ టెన్నిస్, బేస్ బాల్.. ఇలా చాలా చాలా ఆడుకుంటున్నాం. నాన్న మాతో ఫ్రెండ్‌లా ఆడుకుంటారు. ► ఫుడ్ సంగతి? మీ నాన్నకు వంట వచ్చా? క్లీన్ అండ్ హెల్దీ ఫుడ్ మాత్రమే తినాలని అమ్మ అంటుంది. వీకెండ్స్‌లో మాత్రమే పిజ్జా, బర్గర్స్ తింటాం. వెజిటెబుల్, ఫ్రూట్స్.. ఇలా అన్నీ అమ్మ ప్లాన్ చేసినట్లుగానే తింటాం. అమ్మ వంట చేయదు. నాన్న కూడా చేయరు. అయితే మాకు అప్పటికప్పుడు కావాలంటే ఇద్దరూ న్యూడిల్స్ చేసి పెడతారు. ► ఈ లాక్డౌన్లో మీ నాన్నతో కలిసి ఏమేం సినిమాలు చూశారు? తెలుగుతో పాటు హాలీవుడ్ సినిమాలు కూడా చూశాం. ‘ఫ్రోజెన్ 2’, ‘ఓక్జా’, రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ చూశాం. ఇంకా చాలా టీవీ షోస్ కూడా చూస్తున్నాం. ► ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అయ్యాయి కదా? మీ నాన్న దగ్గరుండి గమనిస్తారా? ఈ మధ్యే స్టార్ట్ అయ్యాయి. ఇంతకుముందు రోజులో ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఆడుకునేవాళ్లం. ఇప్పుడు క్లాసులు అయిపోగానే ఆటలే. అయితే క్లాస్ జరుగుతున్నప్పుడు మాత్రం నాన్న మమ్మల్ని డిస్ట్రబ్ చేయరు. బాగా చదువుకోమంటారు. కానీ ఒత్తిడి చేయరు. ► సితారా.. నువ్వు మీ నాన్నకు హెడ్ మసాజ్ చేశావ్ కదా.. ఏమన్నారు? (నవ్వుతూ)... నచ్చిందన్నారు. తన మసాజ్ థెరపిస్ట్ కన్నా బాగా చేశానట. అమ్మతో చెప్పి నవ్వారు. ► టీనేజ్‌లో ఉన్నట్లున్నావ్ అని మీ అత్త మంజుల (మహేశ్ సోదరి) ఇటీవల సోషల్ మీడియాలో మీ నాన్న మేకోవర్ ఫొటో చూసి అన్నారు. మీ నాన్న ఇంకా హ్యాండ్సమ్గా తయారవడానికి కారణం? ఊ... లాక్డౌన్ ఉన్నప్పుడూ లేనప్పుడూ మా నాన్న మాకు ఒకేలానే ఉన్నారు. ఆయనెప్పుడూ హ్యాండ్సమ్మే. ► సరే.. ఫాదర్స్ డే సందర్భంగా మీ నాన్నకు ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? ప్రతి ఫాదర్స్ డేకి నాన్నకు స్పెషల్‌గా కార్డ్ తయారు చేసి ఇస్తాం. నాన్న చాలా జాగ్రత్తగా దాచుకుంటారు. ఈసారి కూడా కార్డ్ తయారు చేశాం. నాన్నకు మేం ఏం చేసినా నచ్చుతుంది. చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇస్తారు. ‘అవర్ డాడీ ఈజ్ బెస్ట్’. తండ్రికి మసాజ్ చేస్తున్న సితార మహేశ్‌బాబు తనయుడు గౌతమ్‌కి 14 ఏళ్లు. కొడుకు ఎంత ఎత్తు ఎదిగాడో ఈ లాక్డౌన్లో మహేశ్ చెక్ చేస్తున్న ఫొటో ఇది. -
సితార క్లాసికల్ డ్యాన్స్..
-
వైరల్: సితార డెడికేషన్‌కు నెటిజన్లు ఫిదా
హైదరాబాద్: కరోనా లాక్డౌన్ కారణంగా థియేటర్లలో మిస్సవుతున్న వినోదాన్ని సోషల్ మీడియా వేదికగా అందించే ప్రయత్నం చేస్తున్నారు సినీ సెలబ్రెటీలు. ఈ జాబితాలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు కుటుంబం ముందు వరుసలో ఉంటుంది. సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉండే నమ్రతా శిరోద్కర్.. మహేశ్, గౌతమ్, సితారలకు సంబంధించిన ఫోటో, వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు. అంతేకాకుండా త్రో బ్యాక్(పాత) ఫోటో, వీడియోలను సైతం షేర్ చేస్తూ ఘట్టమనేని ఫ్యాన్స్‌ను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. (రాజమౌళితో మహేశ్ సినిమా ఆశించొచ్చా?) తాజాగా తన ముద్దుల కూతురు సితార పారిస్ హోటల్లో క్లాసికల్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. సెలవుల్లో కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ ఆపలేదని కామెంట్ జతచేశారు. దీనినే అంకితభావం అని అంటారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక జర్మనీ వీధుల్లో గౌతమ్, సితారలతో కలిసి సైక్లింగ్ చేస్తున్న మరో త్రో బ్యాక్ వీడియోను కూడా నమ్రతా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ రెండు పాత వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక మహేశ్ సినిమాల విషయానికి వస్తే పరుశురామ్ దర్వకత్వంలో ‘సర్కారు వారి పాట’ రూపొందుతున్న విషయం తెలిసిందే. (మహేశ్ సర్ప్రైజ్ వచ్చింది.. ట్రెండింగ్‌లో టైటిల్) View this post on Instagram Her dance practise doesn’t stop even in the confines of her Parisian hotel room😃 It’s dance as opposed to the Eiffel!! #memorytherapy🥰 one for each day💕💕💕 @sitaraghattamaneni A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on Jun 2, 2020 at 7:11am PDT View this post on Instagram The fall season in Brenners (Germany)🍁🍁🍁 Cycling with my babies 😘😘 Nothing like it❤️❤️❤️ @sitaraghattamaneni you better speed up next time! 😜 #badenbadendays #memorytherapy One for each day💕💕💕 @gautamghattamaneni A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on Jun 1, 2020 at 5:30am PDT -
మహేశ్ జిమ్ బాడీ చూసి ఫ్యాన్స్ ఫిదా!
కరోనా కారణంగా సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడటంతో సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.. నిత్యం సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంటే సూపర్ స్టార్ మహేశ్ బాబు లాక్‌డౌన్‌తో ఇంట్లో కుటుంబంతో విలువైన సమయాన్ని గడుపుతున్నారు. కూతురు సితార, కొడుకు గౌతమ్‌తో కలిసి చిన్న పిల్లవాడిలా మారి సరదాగా ఆటలాడుతున్నారు. ప్రతి రోజు కొత్త లుక్‌లో దర్శనమిస్తూ అభిమానులను సర్ప్రైజ్ చేస్తున్నారు. (అదిరేటి లుక్‌లో మహేశ్.. సినిమా కోసమేనా?) మహేశ్ పిల్లలతో చేసే ఎంజాయ్‌ను ఎప్పటికప్పుడు నమత్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ తన ముద్దుల కూతురు సితారతో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో ఆడుకుంటున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. విశేషం ఎంటంటే ఈ ఫోటోలో మహేశ్ షర్ట్ లేకుండా కనిపించారు. మొదటి సారి తమ హీరోను షర్ట్ లేకుండా చూడటంతో ప్రిన్స్ అభిమానులు కాస్తా ఫిదా అవుతున్నారు. సూపర్ స్టార్ జిమ్ బాడీ అదిరిపోయిందని కామెంట్ చేస్తున్నారు. (సితూ పాప కోసం సూపర్ స్టార్ ఏం చేశారంటే..) View this post on Instagram Getting ready for a lap !! My water babies 💕💕💕#lockdown #stayhome A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on May 18, 2020 at 7:03am PDT -
సితూ పాప కోసం సూపర్ స్టార్ ఏం చేశారంటే..
సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సమయం దొరికితే చాలు కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్తుంటారు. అయితే ప్రస్తుతం లాక్డౌన్ అమల్లో ఉండటంతో తీరిక దొరికినా ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి. అందుకే ఇంట్లోనే తన ఇద్దరి పిల్లలతో కలిసి సరదగా గడుపుతున్నారు మహేష్ బాబు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా మహేష్, సితూ పాపని ఆడిస్తున్న ఓ వీడియో అభిమానులను తెగ అలరిస్తుంది. (‘ఏంటిదో చెప్పలేం కానీ గిఫ్టయితే పక్కా’) దీనిలో మహేష్ పాట పాడుతూ.. ఓ టెడ్డీబేర్‌తో సితారని తెగ నవ్విస్తున్నాడు. సితూ పాప ఆనందాన్ని చూసి తను తెగ మురిసిపోతున్నాడు. వీరిద్దరి అల్లరికి అభిమానులు ఫిదా అవుతున్నారు. లాక్డౌన్ పూర్తైన తర్వాత మహేష్ బాబు..పరశురాం దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే.(వార్నర్ నోట ‘పోకిరి’ డైలాగ్) -
‘సితారా.. సింగర్‌గా ట్రై చేయ్’
కరోనా లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌లు రద్దవ్వడంతో మన సెలబ్రెటీలందరూ ఇంటికే పరిమితమయ్యారు. అయితే అనూహ్యంగా దొరికిన లాక్డౌన్ సమయాన్ని పూర్తిగా కుటుంబంతో కలిసి ఆస్వాదిస్తున్నారు. ఇక కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే సూపర్‌స్టార్ మహేశ్ బాబు తన పిల్లలు సితార, గౌతమ్‌లతో తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో మహేశ్ చేస్తున్న అల్లరికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఇక చాలా ఆక్టీవ్‌గా ఉండే సితార గతంలో ‘భరత్ అనే నేను’ సినిమాలోని అరరే ఇది కలలా ఉన్నదే అనే సాంగ్‌ను ఆలపించింది. చాలా ఎనర్జటిక్‌గా పాడిన ఈ పాట నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. సితార పాడిన పాటకు సంబంధించిన పాత వీడియోను నమ్రత తాజాగా తన ఇన్‌స్టాలో తిరిగి పోస్ట్ చేస్తూ ‘నాన్న కూతురు’ అనే కామెంట్‌ను జతచేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొన్ని గంటల వ్యవధిల్లోనే లక్షకు పైగా వ్యూస్ రాగా వేలల్లో లైక్స్ వచ్చాయి. ‘సింగర్‌గా ట్రై చేయ్ లిటిల్ ప్రిన్స్’ అంటూ కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram Daddy’s girl !! #MemoryTherapy❤️ One for each day💕💕💕 @sitaraghattamaneni A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on May 7, 2020 at 7:42am PDT చదవండి: మార్పుని అలవాటు చేసుకోవాల్సిందే భారతీయుడు ఆగలేదు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_931254882.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మహేష్ తలకు మర్దన చేసిన సితార..
స్టార్ హీరో మహేష్ బాబు సతీమణి నమ్రత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలతోపాటుగా.. మహేష్ సినీ విశేషాలను కూడా ఆమె అభిమానులతో పంచుకుంటారు. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో.. మహేష్ కూడా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో మహేష్ పిల్లలతో కలిసి చేసే అల్లరిని నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా మహేష్ కుమార్తె సితార.. ఆయనకు హెడ్ మసాజ్ చేస్తున్న ఫొటోలను నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. హెడ్ మసాజ్ చాలా బాగుందనే ఫీడ్‌బ్యాక్ వచ్చిందని అన్నారు. ‘ఓవైపు జీజీ(గౌతమ్ ఘట్టమనేని) గేమ్ ఆడటం చూస్తున్నాం.. మహేష్‌కు మాత్రం హెడ్ మసాజ్ చేసేందుకు ఓ వాలంటీర్ దొరికింది. కేవలం రెండు నిమిషాల్లోనే పని పూర్తిచేసింది. అయితే అది బాగుందనే ఫీడ్ బ్యాక్ వచ్చింది’ అని నమ్రత పేర్కొన్నారు. మరోవైపు సితార కూడా మహేష్‌కు హెడ్ మసాజ్ చేస్తున్న ఫొటోలను షేర్ చేశారు. నాన్న హెడ్ మసాజ్ నచ్చిందని చెప్పడంతో.. తను చాలా ఆనందపడ్డానని సితార చెప్పారు. నాన్న హెయిర్ చాలా మొత్తగా, సాఫ్ట్‌గా ఉందని అన్నారు. చదవండి : ఇంకా పిల్లల్లానే ట్రీట్ చేస్తున్నారు : విజయ్ -
దొరికిన అవకాశాన్ని వదులుకోనంటున్న మహేశ్
కరోనా వైరస్ వల్ల సెలబ్రిటీలు కూడా ఇళ్లకే అతుక్కుపోయిన పరిస్థితి. ఎప్పుడూ షూటింగ్‌లు, పార్టీలు, ఈవెంటూ అంటూ తిరిగేవారికి కావాల్సినంత బ్రేక్ దొరికింది. దీంతో ఇంటిసభ్యులతో ఎంజాయ్ చేస్తూ.. ఫొటో ఆల్బమ్స్ తిరిగేస్తూ.. పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటూ.. వంటింట్లోకి దూరుతూ, కుంచె పడుతూ, ఇంటి పనికి నడుం వంచుతూ.. ఇలా ఎన్నో పనులను పూర్తి చేసేసుకుంటున్నారు. అలా.. చేతికి చిక్కిన అవకాశాన్ని చేజార్చుకోకూడదు అనే మాటను మన సూపర్ స్టార్ మహేశ్‌బాబు అక్షరాలా పాటిస్తున్నాడు. లాక్డౌన్ వేళ తన గారాలపట్టి సితారతో కలిసి ఇంట్లో కామెడీ చిత్రం "స్టువర్ట్ లిటిల్" చూస్తున్నాడు. (ఆర్జీవీ: రోజూ గిల్లే వాడు) తండ్రీకూతుళ్లు ఎంతో ఏకాగ్రతగా ఆ సీరియల్ చూడటంలో మునిగిపోయినట్లున్న ఫొటోను మహేశ్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ చిత్రం రెండో భాగాన్ని రేపు చూసేందుకు ఎంతో ఆతృతగా ఉన్నానని పేర్కొన్నాడు. లాక్డౌన్ కాలాన్ని ఏదో ఒకలాగా సద్వినియోగం చేసుకోండని అభిమానులకు సలహా ఇచ్చాడు. ప్రియమైన వాళ్లు మనల్ని ఎలాగోలా ఇటువంటి పనుల్లోకి లాగేస్తారని చెప్పుకొచ్చాడు. ఇక కరోనాపై పోరాటానికి ఈ హీరో రూ.1కోటి విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవి "ఆచార్య" చిత్రంలో మహేశ్ నటించనున్నాడని సమాచారం. (బిగ్‌బాస్-4: హోస్ట్‌గా మహేశ్ బాబు!) -
ఆసక్తి కలిగిస్తున్న ఆద్య, సితారల ‘టెలిపతి ఛాలెంజ్’
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార తన బెస్ట్ ఫ్రెండ్ ఆద్యతో కలిసి ఏఅండ్‌ఎస్ అనే యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ యూట్యూబ్ ఛానల్లో పలు విభిన్న వీడియోలను పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్నారు. వివిధ గేమ్స్‌కు సంబంధించిన వీడియోలతో పాటు సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేస్తూ హైలైట్‌గా నిలుస్తున్నారు. మహేశ్ బాబుతో పాటు రష్మిక మందనను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో సితార, ఆద్యలు ప్రొఫెషనల్ యాంకర్స్‌ను తలపించారు. తాజాగా అందరికీ హాలీడే అయిన ఆదివారాన్ని ఫన్‌గా క్రియేట్ చేసేందుకు తమ ఏఅండ్‌ఎస్ ఛానల్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. టెలిపతి (మానసిక ఊహా శక్తి) చాలెంజ్‌లో పాల్గొన్న ఈ ఇద్దరు ఆద్యంతం ఆసక్తి కలిగించేలా ఆడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. పిల్లలకు ఎంతో ఉపయోగకరమైన టెలిపతి చాలెంజ్‌ను తాము కూడా ఆడతామని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
తమన్నా స్టెప్పులేసిన సితార
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు, నమ్రతల గారాల పట్టీ సితార పాప మల్టీ ట్యాలెంటెడ్ అన్న విషయం తెలిసిందే. ఈ పసి ప్రాయంలోనే అటు యూట్యూబ్‌లో వీడియోలు, ఇంటర్వ్యూలు చేస్తూనే.. మరోవైపు నాట్యం నేర్చుకుంటుంది. క్లాసికల్ డ్యాన్స్‌తో పాటు తన తండ్రి సినిమా పాటలకు ఔరా అనిపించేలా స్టెప్పులు వేస్తుంటుంది. తాజాగా మహేశ్ నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సూపర్ డూపర్ హిట్ చిత్రంలోని ‘డాంగ్ డాంగ్’ సాంగ్‌కు స్టెప్పులేసింది. ఆ పాటలో తమన్నా వేసిన స్టెప్పులను అచ్చుగుద్దినట్టు సితార వేసింది. డాంగ్ డాంగ్ సాంగ్‌కు సితార చేసిన డ్యాన్స్‌ను నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. అంతేకాకుండా సితార ప్రతిభను నెటిజన్లు కొనియాడుతున్నారు. కాగా మహేశ్ బాబు ముద్దుల తనయ సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి కుమర్తె ఆద్య కలిసి ‘ఏ అండ్ ఎస్’ అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న సంగతి తెలిసిందే. విభిన్న పోస్టులతో ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్న ఈ చిచ్చర పిడుగులు.. ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమా హీరో మహేశ్ బాబు, హీరోయిన్ రష్మిక మందనలను ఇంటర్వ్యూ చేశారు. ఇక ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్‌ను మహేశ్ తన కుటుంబంతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదే టూర్లో మహేశ్ తన మోకాలి శస్త్ర చికిత్స చేయించుకోనున్నాడు. విశ్రాంతి అనంతరం స్వదేశానికి తిరిగొచ్చి వంశీ పైడిపల్లి చేయబోయే సినిమాను పట్టాలెక్కించనున్నాడు. View this post on Instagram absolutely nailed it💃💃👏👏 #SarileruNeekevvaru A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on Feb 13, 2020 at 5:33am PST -
నా ఫేవరెట్ కో స్టార్ ఆమే: మహేష్ బాబు
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్ సూపర్‌స్టార్... ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా సూపర్‌హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో మహేష్ చిత్ర బృందంతో కలిసి శుక్రవారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అదే రోజు రాత్రి.. హన్మకొండలో చిత్రం విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే సినిమా విడుదలకు ముందు, తర్వాత తాను పాల్గొన్న మూవీ ప్రమోషన్లలో చిన్నారులు ఆద్య, సితారకు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రత్యేమని మహేశ్ బాబు పేర్కొన్నారు. ‘‘నా చిట్టితల్లులకు ఇంటర్వ్యూ ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. నాకు ఇంతకు మించిన సంతోషం ఏం ఉంటుంది! వాళ్ల ఎనర్జీ, స్టైల్ సూపర్. వాళ్లిద్దరికీ నా ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి’’ అని ఇంటర్వ్యూ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. కాగా మహేశ్ బాబు ముద్దుల తనయ సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి కుమర్తె ఆద్య కలిసి ‘ఏ అండ్ ఎస్’ అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న సంగతి తెలిసిందే. విభిన్న పోస్టులతో ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్న ఈ చిచ్చర పిడుగులు.. ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమా హీరోయిన్ రష్మిక మందన్నను ఇంటర్వ్యూ చేశారు. ఇక తాజాగా మహేశ్ బాబును తమ ఛానెల్‌కు ప్రత్యేక అతిథిగా ఆహ్వానించి సూపర్‌స్టార్ అభిమానుల మనసు దోచుకున్నారు. కాగా ఇంటర్వ్యూలో భాగంగా సితార, ఆద్య అడిగిన పలు ప్రశ్నలకు మహేశ్ బాబు సమాధానమిచ్చారు. ఈ ఏడాదిలో జనవరి 11 తనకు ప్రత్యేకమైన రోజని... ఆర్మీ జవానుగా నటించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఇక తన సహనటుల్లో చాలా మంది ఫేవరెట్ యాక్టర్లు ఉన్నారని.. అయితే ప్రస్తుతానికి ఫేవరెట్ కోస్టార్ రష్మిక అని మహేశ్ సరదాగా వ్యాఖ్యానించారు.(‘రష్మికను ఓ ఆటాడుకున్న సితార’) సరిలేరు నీకెవ్వరు : మూవీ రివ్యూ Being interviewed by my lil girls has been the best part of my promotions so far💞💞 Such a pleasure...what more can I ask for! Love their energy & style!!! ❤❤❤ Way to go Aadya and Sitara 🤗🤗 Love & blessings to both!https://t.co/Eb4n3ifmCB — Mahesh Babu (@urstrulyMahesh) January 18, 2020 -
‘రష్మికను ఓ ఆటాడుకున్న సితార’
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి సితార, డైరెక్టర్ వంశీ పైడిపల్లి కుమర్తె ఆద్య వీరిద్దరూ కలిసి ‘ఏ అండ్ ఎస్’ అనే యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. తొలుత త్రీ మార్కర్ ఛాలెంజ్ అంటూ తొలి వీడియో పోస్ట్ చేసిన వీర్దిదరూ.. అనంతరం పలు ఆసక్తికర వీడియోలను పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకున్నారు. అంతేకాకుండా డిఫరెంట్ కంటెంట్ వీడియోలతో పాటు ఆద్యంతం వినోదభరితంగా, విజ్ఞానభరితంగా సాగే వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా సితార, ఆద్యలు ఇద్దరూ కలిసి క్యూట్ హీరోయిన్ రష్మిక మందనను ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇక మహేశ్ సైతం ఈ వీడియోను తన ట్విటర్లో పోస్ట్ చేస్తూ ఈ ముగ్గురి ఎనర్జీ, ఉత్సాహం తనను ఆశ్చర్యపరిచిందని ట్వీట్లో పేర్కొన్నాడు. మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, దిల్ రాజు, మహేశ్ బాబులు ముగ్గురు కలిసి నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా రేపు(శనివారం) విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్లు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి. దీంతో సినిమా హిట్టు సాధించడం ఖాయమని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. విజయశాంతి, ప్రకాష్‌రాజ్, రాజేంద్రప్రసాద్, సంగీత, కౌముది తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. Next gen kids !! Their bubbling energy n enthusiasm never ceases to amaze me 😍😍!! @iamRashmika you are equally amazing 👏👏 Loved the banter !! Rock on, you girls! 👍👍👍 https://t.co/vHNIc232Kt — Mahesh Babu (@urstrulyMahesh) January 10, 2020 -
తన డాన్స్‌తో మరోసారి అదరగొట్టిన బేబీ సితార
-
మళ్లీ అదరగొట్టిన బేబీ సితార
సితార.. సినిమా ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. సూపర్‌స్టార్ మహేష్ కూతురుగా అందరికి సుపరిచితురాలైన లిటిల్ క్వీన్ సితార చిన్నతనంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటుంది. తన టాలెంట్‌తో ఇప్పటికే స్టార్ అవుతున్న బేబీ సితార డిస్నీ సంస్థ తరఫున తెలుగులో వస్తున్న మూవీ ఫ్రాజెన్-2కు గొంతును అందిస్తున్న విషయం తెలిసిందే. అలాగే బాహుబలి-2 సినిమాలోని ‘కన్నా నిదురించరా.. నా కన్నా నిదురించరా’..పాటకు స్టెప్పులేసిన సితార తాజాగా తండ్రి నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని పాటకు చిందులు వేసింది. ‘‘హి ఈజ్ సో క్యూట్’’ అంటూ తన చిన్ని చిన్ని స్టేప్పులతో పాటను అదరగొట్టింది. ఈ పాటలోని సితార స్టెప్పులు మహేష్‌బాబు అభిమానుల చేత అదుర్స్ అనిపిస్తున్నాయి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. కమర్షియల్ ఎంటర్టైనర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న మహేష్‌కు జోడిగా నటిస్తోంది. దిల్ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ స్వయంగా నిర్మిస్తున్నఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన మూడు పాటలు సూపర్ టాక్ సంపాదిస్తుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నారు. -
చిన్న రాణిలా ఒదిగిపోయిన సితూ పాప
సాక్షి, హైదరాబాద్: త్వరలో తెలుగులో విడుదల కానున్న ‘ఫ్రోజెన్ -2’ సినిమాలోని బేబీ ఎల్సా పాత్రకు టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు ముద్దుల తనయ బేబి సితార డబ్బింగ్ చెబుతున్న సంగతి తెలిసిందే. ఎల్సా చిన్నప్పటి పాత్రలో సితార ఒదిగిపోయిందట. నిజంగా తన వాయిస్‌తో క్వీన్ ఎల్సాకు ప్రతిరూపంగా నిలిచిందంటూ మహేష బాబు ట్వీట్ చేశారు. చాలా నమ్మకంగా, మ్యాజికల్‌గా, స్వచ్ఛంగా ఆ పాత్రకు తన వాయిస్ అందించిందంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన తన ముద్దుల కూతురు ప్రతిభపై పొంగిపోతున్నారు. ‘సితూ పాపా నిన్నుచూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నవంబర్ 22 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను' అంటూ మహేశ్ ట్వీట్ చేశారు. కాగా హాలీవుడ్ పాపులర్ చిత్రం 'ఫ్రోజన్'. దీనికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘ఫ్రోజెన్ -2' హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కూడా మరో రెండు రోజుల్లో థియేటర్లను పలకరించనుంది. ఈ మూవీలో పెద్ద ఎల్సా పాత్రకు హీరోయిన్ నిత్యా మీనన్ డబ్బింగ్ చెప్పారు. She is truly a mini version of Queen Elsa! Confident, Magical and Pure. So proud of you Situ papa! ❤❤ Can't wait for 22nd November #Frozen2 in Telugu...@DisneyStudiosIN pic.twitter.com/aN6uu4s0EG — Mahesh Babu (@urstrulyMahesh) November 20, 2019 -
ఎల్సా పాత్రతో నాకు పోలికలున్నాయి
‘‘ఫ్రోజెన్’ సినిమా చూసిన నా ఫ్రెండ్ ఒకామె ’ఆ సినిమా చూసినప్పుడు నువ్వే గుర్తొచ్చావు’ అని చెప్పింది. నాకూ ఎల్సా పాత్రకు పర్సనాలిటీ విషయంలో ఎక్కడో పోలికలున్నాయని సినిమా చూశాక అనిపించింది’’ అని నటి నిత్యామీనన్ అన్నారు. డిస్నీ సంస్థ అందిస్తున్న తాజా యానిమేషన్చిత్రం ‘ఫ్రోజెన్ 2’. ఎల్సా, అన్న అనే అక్కా చెల్లెళ్ల కథ ఇది. నవంబర్ 22న ఈ సినిమా తెలుగులో విడుదలకానుంది. తెలుగు వెర్షన్లో ఎల్సా పాత్రకు నిత్యామీనన్, ఎల్సా చిన్ననాటి పాత్రకు మహేశ్ బాబు కుమార్తె సితార డబ్బింగ్ చెప్పారు. ఈ సందర్భంగా నిత్యామీనన్ మాట్లాడుతూ– ‘‘ఎల్సా పాత్రతో చాలా కనెక్ట్ అయ్యాను. అందుకే.. ‘ఫ్రోజెన్ 2’లో ఎల్సాకు డబ్బింగ్ చెప్పమనగానే ఓకే అన్నాను. మరోసారి డబ్బింగ్ చెప్పమని అడిగినా చెబుతాను (నవ్వుతూ)’’ అన్నారు. ‘‘డబ్బింగ్ చెప్పడం చాలా సరదాగా అనిపించింది. నాన్న సర్ప్రైజ్గా ఫీలయ్యారు. నా ఫేవరెట్ కార్టూన్ పాత్ర ఎల్సానే’’ అని సితార అన్నారు. ‘‘సితారతో డబ్బింగ్ చెప్పించమని డిస్నీ శివప్రసాద్‌గారు మహేశ్‌ని, నన్ను కన్విన్స్ చేశారు. సితార ఎలా డబ్బింగ్ చెబుతుందో అనుకున్నాను.. బాగా చెప్పింది. 3 ఏళ్ల నుంచి ఎల్సా పాత్రకు తను పెద్ద ఫ్యాన్. సితారను సినిమాల్లోకి తీసుకురావాలని ఇదేం స్ట్రాటజీ కాదు. గౌతమ్, సితార కెరీర్‌ని ఇంకా ఏం ప్లాన్ చేయలేదు. వాళ్లు ఏం ఎంచుకున్నా సపోర్టివ్‌గా నిలబడతాం’’అన్నారు నమ్రతా శిరోద్కర్. ‘‘2013లో ‘ఫ్రోజెన్’ చిత్రం రిలీజ్ అయింది. యానిమేషన్ సినిమాల కలెక్షన్లలో టాప్‌గా నిలిచింది’’ అన్నారు డిస్నీ ప్రతినిధి విక్రమ్ దుగ్గల్. -
మహేష్ బాబు కుమార్తె సితారకు లక్కీ ఛాన్స్
సాక్షి,హైదరాబాద్: డిస్నీ సంస్థ ప్రతిష్టాత్మక యానిమేషన్ మూవీ ఫ్రాజెన్-2 తెలుగులోకి డబ్ అవుతున్న సంగతి తెలిసిందే. విడుదలకుముందే యువతలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈ మూవీ సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె ఘట్టమనేని సితార తన గొంతును దానం చేస్తోంది. ప్రతిష్టాత్మక డిస్నీ లాంటి నిర్మాణ సంస్థ చిత్రంలోని బేబీ ఎల్సా పాత్రకు సితార డబ్బింగ్ చెప్పనున్నారు. ఇప్పటికే తన ఆటపాటలతో ఆకట్టుకుంటూ మహేష్‌బాబు అభిమానులను మురిపిస్తున్న బేబీ సితార తన సరికొత్త టాలెంట్‌తో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. మరోవైపు యువరాణి ఎల్సా పాత్రకు ప్రముఖ నటి నిత్యామీనాన్ డబ్బింగ్ చెప్తున్నారు. దీంతో హలీవుడ్లో సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఫ్రోజెన్ 2 రిలీజ్‌కు ముందే ప్రేక్షకుల్లో మంచి జోష్‌ను క్రియేట్ చేస్తోంది. కాగా 2013లో విడుదలైన హాలీవుడ్ మూవీ ‘ఫ్రొజెన్’ ప్రపంచ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటేడ్ చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది. ఎల్సా, అన్నా అనే ఇద్దరు అక్కాచెల్లెళ్ల కథే ‘ఫ్రాజెన్’. ఈ సిరీస్‌లోనే మూవీ ఫ్రాజెన్ -2 రూపుదిద్దుకుంది. ఈ మూవీ మొదటి పార్ట్ ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ యానిమేటెడ్ చిత్రం అవార్డును గెలుచుకొన్నది. ఈ చిత్రంలోని పాపులర్ గీతం ‘లెట్ ఇట్ గో’ కు క్రిస్టిన్ అండర్సన్-లోపెజ్, రాబర్ట్ లోపెజ్ ఉత్తమ మ్యూజిక్కు ఆస్కార్ అవార్డు లభించింది. ఫ్రొజెన్ 2 చిత్రం నవంబర్ 22 తేదీన ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ అవుతున్నది. Meet the little star of the Telugu Film Industry. Sitara Papa will be the voice for Baby Elsa in Telugu! Welcome to the Disney family, Sitara! #Frozen2@urstrulyMahesh #NamrataShirodkar pic.twitter.com/ubPcJTULx6 — Walt Disney Studios India (@DisneyStudiosIN) November 11, 2019 Hear more of @PanicAtTheDisco’s #IntoTheUnknown in Frozen 2. See it in theaters on November 22. pic.twitter.com/rXFXieAw1Q — Walt Disney Studios (@DisneyStudios) November 8, 2019 -
చానల్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు కూతురు
సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు సితార పాడిన పాటలు, చేసిన అల్లరి అన్ని సోషల్ మీడియా పేజ్‌లకు మాత్రమే పరిమితమయ్యాయి. తాజాగా సితార తన స్నేహితురాలు ఆద్యా (దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు)తో కలిసి ఏ అండ్ ఎస్ (A & S) పేరుతో యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించింది. ఈ చానల్లో తొలి వీడియోను ఈ రోజు పోస్ట్ చేశారు. 3 మార్కర్స్ చాలెంజ్ పేరుతో పోస్ట్ చేసిన ఈ వీడియోలో సితార, ఆద్యాలు బొమ్మలకు కలర్స్ ఫిల్ చేయటంలో ఒకరితో ఒకరు పోటి పడ్డారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే 30 వేలకు పైగా వ్యూస్ సాధించటం విశేషం. సితార, ఆద్యాల వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన మహేష్.. చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు. -
దేవీ శ్రీ ప్రసాద్‌కి డాన్స్ నేర్పుతున్న సితార
-
దేవీకి డాన్స్ నేర్పుతున్న సితార
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార ఇప్పటికే స్టార్‌గా మారింది. పాటలు పాడుతూ, డాన్స్ చేస్తూ సోషల్ మీడియా ఆడియన్స్‌ను అలరిస్తోంది ఈ లిటిల్ స్టార్. ఇటీవల బాహుబలి సినిమాలో మురిపాలా ముకుంద పాటకు సితార డాన్స్ చేసిన వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా మరో డాన్స్ వీడియోతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది సితార పాప. సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ఈ కొత్త వీడియోనే షేర్ చేశాడు. శ్రీమంతుడు సినిమాలోని పాటను దేవీ ఆలపిస్తుండగా సితార డాన్స్ తన స్నేహితురాలు, దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్యాతో కలిసి డాన్స్ చేస్తున్న వీడియోను తన ఇన్స్‌స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేశాడు దేవీ. ఈ వీడియోతో పాటు జూనియర్ మహర్షి (సితార) తనకు డాన్స్ చేయటం నేర్పిస్తోంది అంటూ కామెంట్ చేశాడు. గతంలోనూ సితార, ఆద్యాలతో కలిసి దిగిన ఫోటోలను వీడియోలను షేర్ చేశాడు దేవీ. ప్రస్తుతం మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహర్షి సినిమాకు దేవీ శ్రీ ప్రసాదే సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్ మార్చి 29న విడుదల చేయనున్నారు.పీవీపీ, దిల్ రాజు, అశ్వనీదత్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండా అల్లరి నరేష్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
సితారా డ్యాన్స్..వైరల్ వీడియో
-
వైరల్ : సితారా డాన్స్ వీడియో..!
సాక్షి, హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్‌బాబు ముద్దుల తనయ సితారా తన డాన్స్‌తో అదరగొట్టింది. తమ నివాసంలోని జిమ్‌లో బాహుబలి-2 ద కన్‌క్లూజన్ సినిమాలోని ‘కన్నా నిదురించరా.. నా కన్నా నిదురించరా..’ పాటకు స్టెప్పులేసి ఆకట్టుకుంది. తన గారాలపట్టి చిన్ని చిన్ని స్టెప్పులకు తడిసిముద్దయిన మహేష్ ఈ డాన్స్‌కు సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్టు చేస్తూ.. ‘వాట్ ఎ టాలెంట్’ అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. సితారా డాన్స్ వీడియో వైరల్ అయింది. ఇదిలాఉండగా.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ 25వ సినిమా ‘మహర్షి’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దిల్‌రాజు, అశ్వనీదత్, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తుండగా.. పూజా హేగ్డే హీరోయిన్గా అలరించనుంది. (చదవండి :చిన్నారి ఆకాంక్షను నెరవేర్చిన మహేశ్) -
చిన్నారి చిరునవ్వు
మహేశ్‌బాబు తనయ సితార ముఖంలో నవ్వులు పూయించారు బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. ఈ విషయాన్ని మహేశ్‌బాబు సతీమణి నమ్రత పేర్కొన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘మహర్షి’ సినిమా కోసం మహేశ్‌బాబు న్యూయార్క్‌లో ఉన్నారు. మహేశ్‌బాబుతో కలిసి ఆయన భార్యాపిల్లలు నమ్రత, సితార, గౌతమ్‌లు కూడా వెళ్లారు. అక్కడ ఆలియా భట్‌తో కలిసి సితార దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నమ్రత. ‘‘సితారకు ఆలియా అంటే ఎంతో ఇష్టం. ఆమెతో సితార ఫొటో దిగింది. సితార ముఖంలో నవ్వులకు కారణమైన ఆలియాకు థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు నమ్రత. ఇంతకీ ఆలియా న్యూయార్క్ ఎందుకు వెళ్లారనేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నాం... రిషి కపూర్‌కు కాస్త అనారోగ్యంగా ఉంటే న్యూయార్క్‌లో చికిత్స చేయించుకోవడానికి వెళ్లారట. ఆయన్ను చూసేందుకే న్యూయార్క్ వెళ్లారట ఆలియా. ఇంతకీ రిషీని ఆలియా ఎందుకు పరామర్శించారంటే.. రణ్‌బీర్ కపూర్ తండ్రి కాబట్టి. రణ్‌బీర్, ఆలియా లవ్‌లో ఉన్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. -
సితార, ఆద్యల చేతుల మీదుగా...
‘భరత్ అనే నేను’ లాంటి భారీ హిట్ తరువాత మహేష్ బాబు చేసే మూవీపై అందరి దృష్టి నెలకొంది. ఎందుకుంటే ఇది మహేష్ కెరీర్లో 25వ సినిమా. ఈ చిత్రం కోసం మహేష్ గడ్డం పెంచడంతో సరికొత్త లుక్ ట్రై చేయడం అభిమానుల్లో అంచనాలను పెంచేస్తోంది. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు. ఆ రోజున ఈ ప్రతిష్టాత్మక సినిమా ఫస్ట్ లుక్‌ను అభిమానులకు కానుకగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే శనివారం సాయంత్రం సితార, వంశీ పైడిపల్లి కూతురు ఆద్యలు ఈ సినిమా లోగోను రివీల్ చేశారు. పూజా హెగ్డే కథా నాయికగా నటిస్తున్నారు. -
తండ్రి విసిరిన చాలెంజ్‌ను స్వీకరించిన సితార
-
సితార నాటిన మొక్క!
సెలబ్రెటీలకే కాదు వారి పిల్లలకు ఫాలోయింగ్ ఉంటుంది. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితారకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగే వేరు. సోషల్ మీడియాలో తన ఫోటోలు, తనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. మొన్న జరిగిన సితార బర్త్‌డే కూడా ట్విటర్లో ట్రెండింగ్‌గా మారింది. తాజాగా తన తండ్రి విసిరిన చాలెంజ్‌ను స్వీకరించిన సితార ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. టాలీవుడ్లో గ్రీన్ చాలెంజ్ ఏ రేంజ్లో పాపులర్ అవుతుందో వేరే చెప్పనక్కర్లేదు. రాజకీయ ప్రముఖుల నుంచి సినీ సెలబ్రెటీలు ఈ చాలెంజ్‌లో భాగమవుతున్నారు. మహేష్ బాబు విసరిన చాలెంజ్‌ను సితార స్వీకరించి.. ఓ మొక్కను నాటిన వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో వైరల్‌గా మారుతోంది. మరోపక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విసిరిన ఈ గ్రీన్ చాలెంజ్‌ను మాస్ డైరెక్టర్ వివి వినాయక్ స్వీకరించారు. అలాగే మహేష్ బాబు విసిరిన చాలెంజ్‌ను డైరెక్టర్ వంశీ పైడిపల్లి స్వీకరించి సమంత, కాజల్, దేవి శ్రీ ప్రసాద్‌లకు సవాల్ విసిరారు. -
చరణ్ అంకుల్.. ఉప్సీ ఆంటీ..!!
‘థ్యాంక్యూ చరణ్ అంకుల్ అన్డ్ ఉప్సీ ఆంటీ ఫర్ ది లిటిల్ బర్డ్స్! దే ఆర్ సో క్యూట్. హ్యాపీ బర్త్‌డే ఉప్సీ ఆంటీ!’. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు గారాల కూతురు సితార ముద్దుముద్దుగా పలికిన మాటలివి. జూలై 20న సితార పుట్టినరోజు. మొన్న తన ఆరవ పుట్టినరోజు జరుపుకున్న సితారకు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, ఆయన భార్య ఉపాసన చిన్న చిన్న పక్షులను బహుమతులుగా పంపించారట. వాళ్లకు థ్యాంక్స్ చెబుతూ సితార ఒక వీడియో చేసింది. ఆ వీడియోను మహేశ్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. సితారకు చాలా చిన్నప్పట్నుంచే సోషల్ మీడియాలో బాగా ఫాలోయింగ్ ఉంది. సితార పుట్టినరోజు వచ్చిందంటే, మహేశ్ పుట్టినరోజు వచ్చినట్టుగానే ట్విట్టర్లో బర్త్‌డే ట్రెండ్ నడుస్తుంది. అలాగే ఈసారి కూడా సితార బర్త్‌డే ట్విట్టర్లో ట్రెండింగ్‌గా నిలిచింది. ముఖ్యంగా సితార వీడియోకు వేలల్లో రీట్వీట్స్ వచ్చాయి. సితార పుట్టినరోజునే ఉపాసన పుట్టినరోజు కూడా! వీడియో చివర్లో ‘హ్యాపీ బర్త్‌డే ఉప్సీ ఆంటీ!’ అని సితార పలకడం వీడియోకు మరింత క్యూట్‌నెస్ తెచ్చిపెట్టింది. మహేశ్, రామ్‌చరణ్‌ల ఫ్రెండ్షిప్కు అభిమానులు కూడా ముచ్చటపడిపోవడం విశేషంగా చెప్పుకోవాలి! -
ఐ లవ్ యూ సితా పాప: మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కుమార్తె సితార పుట్టిన రోజు వేడుక ఘనంగా జరిగింది. మహేష్, నమ్రతల గారాలపట్టి నేడు( జులై 20) ఆరవ పుట్టినరోజు సందర్భంగా కుటుంబమంతా సరదాగా వేడుక జరుపుకుంది. సితార బర్త్‌డే సందర్భంగా సమ్ థింగ్ స్పెషల్ కేక్‌ను డిజైన్ చేయించారు. తమ ఫ్యామిలీ ఫొటోతో ప్రత్యేకంగా తయారు చేయించిన కేక్‌తో ఓ స్టార్ హోటల్లో బర్త్‌డే వేడుకలు జరుపుకున్నారు. మహేష్, నమ్రత, గౌతమ్ కలిసి సితార పుట్టిన రోజును ఘనంగా జరుపగా.. కేక్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అంతేకాకుండా తన కూతురితో దిగిన ఫోటోని ట్విటర్లో షేర్ చేసిన మహేష్‌బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ సందర్భంగా‘ నా ఎవ్రీథింగ్కు హ్యాపీ బర్త్‌డే. ఐ లవ్ యూ సితా పాప’ అని మహేష్ కామెంట్ పెట్టారు. సితార బర్త్ డేకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Wishing my everything a very happy 6th ♥♥♥ May you have all that you wish for and more 🤗🤗🤗 I love you Sita papa😘😘😘 pic.twitter.com/VHDpNQSQ7Z — Mahesh Babu (@urstrulyMahesh) July 19, 2018