
సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సమయం దొరికితే చాలు కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్తుంటారు. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో తీరిక దొరికినా ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి. అందుకే ఇంట్లోనే తన ఇద్దరి పిల్లలతో కలిసి సరదగా గడుపుతున్నారు మహేష్ బాబు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా మహేష్, సితూ పాపని ఆడిస్తున్న ఓ వీడియో అభిమానులను తెగ అలరిస్తుంది.
(‘ఏంటిదో చెప్పలేం కానీ గిఫ్టయితే పక్కా’)
దీనిలో మహేష్ పాట పాడుతూ.. ఓ టెడ్డీబేర్‌తో సితారని తెగ నవ్విస్తున్నాడు. సితూ పాప ఆనందాన్ని చూసి తను తెగ మురిసిపోతున్నాడు. వీరిద్దరి అల్లరికి అభిమానులు ఫిదా అవుతున్నారు. లాక్‌డౌన్ పూర్తైన తర్వాత మహేష్ బాబు..పరశురాం దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే.(వార్నర్ నోట ‘పోకిరి’ డైలాగ్)
Comments
Please login to add a commentAdd a comment