breaking news
Mahesh Babu
-
'వారణాసి' ఈవెంట్.. తట్టుకోలేకపోయిన మహేశ్ అభిమాని
మహేశ్ బాబు హీరోగా కొత్త సినిమా గ్రాండ్ లాంచ్ అయింది. శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఈవెంట్ జరిగింది. 'వారణాసి' అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు మూడున్నర నిమిషాల గ్లింప్స్ వీడియోని కూడా విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీని గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. దీనితో పాటు మహేశ్ ఫ్యాన్ చేసిన మరో పని కూడా చర్చనీయాంశంగా మారింది.హైదరాబాద్ శివారులో జరిగిన 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ కోసం మహేశ్ కారులో వస్తున్న వీడియోని ఓ నెటిజన్, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో మహేశ్ కారు నంబర్‌తో చెక్ చేయగా.. రెండు చలాన్లు ఉన్నట్లు తేలింది. మహేశ్ బాబు లాంటి హీరో కారుపై చలాన్లు ఉండటంతో ఈ విషయం టాలీవుడ్ ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్ అయింది. ఇదంతా చూసి తట్టుకోలేకపోయిన ఓ అభిమాని.. మహేశ్ కారుపై చలాన్ల డబ్బుని కట్టేశాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: మహేశ్ 'వారణాసి' ఈవెంట్‌కి అన్ని కోట్లు ఖర్చయిందా?)మహేశ్ బాబు వ్యక్తిగత కారుపై ఉన్న రూ.2070 చలాన్ని ఓ ఫ్యాన్ స్వయంగా చెల్లించడం చూసిన పలువురు నెటిజన్లు.. ఇదెక్కడి అభిమానం బాబోయ్ అని మాట్లాడుకుంటున్నారు.'వారణాసి' సినిమా విషయానికొస్తే ఇందులో మహేశ్ బాబు, రాముడి పాత్రలోనూ కనిపించనున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి స్వయంగా వెల్లడించాడు. ఈ లుక్‌తో 60 రోజుల పాటు షూటింగ్ కూడా పూర్తి చేసినట్లు వెల్లడించాడు. మరోవైపు గ్లింప్స్ వీడియో బట్టి చూస్తే గతం నుంచి వర్తమానం, భవిష్యత్ కాలాలన్నింటిని మిక్స్ చేస్తూ ఫాంటసీ స్టోరీతీ దీన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 2027 వేసవిలో రిలీజ్ కానుందని కీరవాణి చెప్పారు.(ఇదీ చదవండి: రామ్ చరణ్ పెద్ది మూవీ.. చికిరి చికిరి సాంగ్ క్రేజీ రికార్డ్!)#MaheshBabu fans paying his car challan shows their love goes far beyond screens it’s pure admiration in action.#GlobeTrotter #Varanasi pic.twitter.com/Gj21PeSqqw— Addicted To Memes (@Addictedtomemez) November 16, 2025 -
'వారణాసి' ఈవెంట్‌కి అన్ని కోట్లు ఖర్చయిందా?
మహేశ్ బాబు-రాజమౌళి సినిమాకు 'వారణాసి' టైటిల్ ఫిక్స్ అయింది. నిన్నటివరకు రకరకాల పేర్లు వినిపించాయి గానీ చివరకు దీనికి జక్కన్న కట్టుబడి ఉన్నారు. అయితే శనివారం రాత్రి హైదరాబాద్‌లో 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ పేరిట భారీ ఎత్తున ప్లాన్ చేశారు. చిన్న చిన్న ఇబ్బందులు మినహా ఇది గ్రాండ్ సక్సెస్ అయింది. ఇంతకీ ఈ కార్యక్రమం కోసం ఎంత ఖర్చు పెట్టారు? సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ఏంటి?సాధారణంగా రాజమౌళి కొత్త సినిమా తీస్తుంటే మీడియా మీట్ పెట్టి ప్రాజెక్ట్ వివరాలు వెల్లడిస్తుంటారు. ఈసారి మాత్రం ఒక్క విషయం కూడా బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. ఏడాది క్రితమే టైటిల్, గ్లింప్స్ లాంటివి రివీల్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. తాజాగా జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో స్వయంగా రాజమౌళి ఇదంతా చెప్పాడు. అయితే అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతూ ఇన్నాళ్లకు కుదిరిందని అన్నారు.(ఇదీ చదవండి: 'వారణాసి'లో శ్రీరాముడిగా మహేశ్.. రాజమౌళి కామెంట్)టైటిల్ లాంచ్‌ని ఏదో ఆషామాషీగా కాకుండా 100x130 అడుగల ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి, మూవీకి సంబంధించిన స్పెషల్ వీడియోని దీనిపై ప్లే చేశారు. కేవలం ఈ స్క్రీనింగ్ సెటప్ కోసమే రూ.30 లక్షలకు పైగా ఖర్చు చేశారట. మొత్తంగా కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఖర్చులు కలిపి రూ.10-15 కోట్ల వరకు అయినట్లు టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఇండస్ట్రీలో ఇదో రికార్డ్ అవుతుంది.ఎందుకంటే టీజర్ కోసమో, గ్లింప్స్ వీడియో కోసమే ఖర్చు చేయడం లాంటివి విని ఉన్నాం. కానీ మూవీకి సంబంధించిన టైటిల్ లాంచ్ కోసమే ఏకంగా ఈ రేంజులో కోట్లు ఖర్చు పెట్టారంటే.. రాబోయే రోజుల్లో ఇంకే స్థాయిలో ఖర్చు పెడతారో అనిపిస్తుంది. ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలు తీసిన రాజమౌళి.. ఈసారి ప్రపంచవ్యాప్తం ఆడియెన్స్‌ని ఆకట్టుకోవాలనే ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. గ్లింప్స్ చూస్తే అది అనిపించింది కూడా.(ఇదీ చదవండి: రాజమౌళిపై హనుమాన్ భక్తులు ఫైర్) -
గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్.. ఆ ఒక్క సంఘటనతో రాజమౌళి ఫ్రస్టేషన్!
తొలిసారి రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఎన్నో రోజులుగా ఆసక్తిగా ఎదురు చూశారు. దీంతో దర్శకధీరుడు సైతం సర్‌ప్రైజ్‌ల మీద సర్ప్రైజ్లు ఇచ్చాడు. ప్రియాంక చోప్రా లుక్‌తో ఏకంగా సాంగ్ రిలీజ్ చేశారు. అంతే కాకుండా భారీ ఈవెంట్‌తో టైటిల్ గింప్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా ఈ గ్రాండ్ జరిగింది. ఇంత భారీ ఎత్తున చేసిన ఈవెంట్లో ఓ చిన్న సంఘటన రాజమౌళికి కోపం తెప్పించింది. ఆడియన్స్‌కు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అందించాలనే ఉద్దేశంతో భారీ ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. ఈ మూవీ గ్లింప్స్‌ను ఐమ్యాక్స్ ఫార్మాట్లో రిలీజ్ చేయాలని భావించాం.. అందుకే టెస్టింగ్ చేయాలనుకున్నామని రాజమౌళి తెలిపారు. కానీ ఈ గ్లింప్స్ టెస్ట్ ప్లే సమయంలో కొందరు డ్రోన్ విజువల్స్‌తో లీక్ చేయడం నిరాశ కలిగించిదన్నారు. ఎందుకంటే ఇది కోట్ల రూపాయల బడ్జెట్, ఎంతో మంది శ్రమతో రూపొందించామని.. ఇలా చేయడంపై దర్శకధీరుడు బాధగా ఉందన్నారు. నెట్‌ఫ్లిక్స్ నుంచి వచ్చినట్లుగా మా కంటెంట్‌ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారని అన్నారు. ఈ సంఘటనతో మేం సరిగ్గా పరీక్షించలేకపోయామని వెల్లడించారు.కాగా.. ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో మహేశ్ బాబు రుద్రగా కనిపించనున్నారు. తాజాగా రిలీజైన టైటిల్ గ్లింప్స్ ప్రిన్స్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'గ్లోబ్‌ట్రాటర్' పేరుతో ఈ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించారు. వారణాసి చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
'వారణాసి'లో పవర్ఫుల్ దేవత.. రాజమౌళి ప్లాన్ అదుర్స్
మహేష్ బాబు, రాజమౌళి సినిమా వారణాసి నుంచి టైటిల్ గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేశారు. దీంతో ఈ మూవీ కాన్సెప్ట్ గురించి కాస్త హింట్ వచ్చేసింది. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలతో ఈ మూవీ రానుందని అర్థం అవుతుంది. భూమి ఆవిర్భావం మొదలు.. త్రేతా యుగం వరకూ ఆపై ఉల్కాపాతాల ప్రళయం, ఘోర కలి వరకు అన్ని కాలాలతో వారణాసి కథకు లింక్ అయినట్లు తెలుస్తోంది. ఇలా వేర్వేరు కాలాలతో కథ ఉన్నప్పటికీ దానిని కలిసే డాటెడ్ లైన్ మహేష్ అని కనిపిస్తుంది. అయితే, ఇందులో రాక్షస ఘణాన్ని వేటాడే 'ఛిన్నమస్తా దేవి' విజువల్ చాలా ప్రత్యేకంగా ఉంది. ఆమెను ప్రసన్నం చేసుకున్నవారికి అతీంద్రియ శక్తులు అందుతాయి. ఆపై ఎదుటివారు ఎంతటి గొప్పవారైనే సరే చీల్చిచెండాడే శక్తి సొంతమౌతుంది.ఛిన్నమస్తా దేవి దశ మహావిద్యలలో ఒక ముఖ్యమైన దేవత. అమ్మవారు తన తలను తన చేతితోనే నరికి పట్టుకున్నట్లు ఉంటుంది. ఆమె తల నుంచి వచ్చే రక్తాన్ని కుడి, ఎడమ పక్కన ఉన్న డాకిని, వర్ణినిలు తాగుతున్నట్లు ఉంటుంది. ఎంతో భయంకరంగా కనిపించేలా ఆమ్మవారి రూపం ఉంటుంది. ఈమెను శక్తి యొక్క రౌద్ర రూపంగా పూజిస్తారు. చిన్నమస్తా దేవి కథను తెలుసుకుంటే మరణంతో పాటు సృష్టి, వినాశనం అనే వైరుధ్యాలను సూచిస్తుంది. ఆమెను కేవలం తంత్రవిద్యను అభ్యసించే వాళ్లు మాత్రమే పూజిస్తారు.వారణాసితో లింక్ఛిన్నమస్తా దేవి భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు సంబంధించి తెలుసుకునే శక్తిని ప్రసాదిస్తుంది. ఆమెను ప్రసన్నం చేసుకునేందుకే రుద్ర పాత్రలో ఉన్న మహేష్ బాబు కూడా అక్కడ ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఆపై అమ్మవారి ఖడ్గం మీద ప్రియాంక చోప్రా కనిపిస్తుంది. పురాణాల ప్రకారం రాక్షస ఘణాన్ని అంతం చేసినప్పటికీ ఆమెకు రక్త దాహం తీరలేదు. తన వెంట ఉన్న వారికి కూడా తీరకపోవడంతో స్వయంగా శిరచ్ఛేదం చేసుకుని రక్తాన్ని అందిస్తుంది. అంతటి ఉగ్రరూపంతో ఆమె ఉంటుంది. సినిమా ప్రకారం ఉన్న రాక్షస ఘణాన్ని ఎదుర్కునేందుకు కావాల్సిన శక్తిని రుద్ర పాత్రలో ఉన్న మహేష్ ఆమె కటాక్షం పొందవచ్చని తెలుస్తోంది. ఆమె ఆశీస్సులు కేవలం ధైర్యవంతులకు మాత్రమే సొంతం అవుతుంది. ఆమె శత్రు నాశని కూడా అందుకే రాజమౌళి ఆమె పాత్రను వారణాసిలో చూపించనున్నారు. ఆమె పార్వతి దేవి రూపం అని కూడా పూరాణాల్లో ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి సమీపంలోని రామ్‌నగర్‌లో ఆమె ఆలయం ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని బిష్ణుపూర్‌లో కూడా ఛిన్నమస్తా అమ్మవారి ఆలయం ఉంది. -
రాజమౌళిపై హనుమాన్ భక్తులు ఫైర్
మహేష్ బాబు, రాజమౌళి సినిమా వారణాసి టైటిల్ గ్లింప్స్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ మూవీకి సంబంధించిన వీడియో క్లిప్‌ను అభిమానులకు చూపించాలని ఆయన చాలా కష్టపడ్డారు. ఈ వేడుకలో టైటిల్ గ్లింప్స్ ప్రదర్శన సాంకేతిక సమస్యల వల్ల కొద్ది సేపు ఆలస్యమైంది. దీంతో ఆయన హనుమంతుడిని నిందిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వారణాసి గ్లింప్స్ కోసం ఇండియాలోనే అతి పెద్ద ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. అది పని చేయాలంటే దాదాపు 45 జనరేటర్లు రన్ కావాల్సి వుంటుంది. కానీ, తన ప్లాన్ ప్రకారం అది వర్కౌట్ కాకపోవడంతో రాజమౌళి అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన చేసిన కామెంట్లపై నెటిజన్లతో పాటు హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.మొదట కథా రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. వారణాసి కోసం మహేష్ చాలా కష్టపడ్డారని చెప్పారు. కొన్ని కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు. కొన్ని కొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారని ఆయన అన్నారు. అనుక్షణం రాజమౌళి గుండెలపై హనుమ ఉన్నాడని విజయేంద్రప్రసాద్ చెప్పారు. అయితే, వారణాసి గ్లింప్స్ రిలీజ్‌కు పదే పదే సాంకేతిక ఆటంకాలు ఎదుదు కావడంతో రాజమౌళి నిరాశ చెంది హనుమంతుడిపై ఇలా అన్నారు. 'నాకు దేవుడిపైన పెద్దగా నమ్మకం లేదు. హనుమంతుడు నా వెనుకాల ఉండి నడిపించారని మా నాన్న చెప్పారు. ఇలా అంటే నాకు వెంటనే కోపం వచ్చింది. ఆయన ఉంటే ఇదేనా నడిపించేది..?' అని అసహనం వ్యక్తం చేశారు. దీంతో రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు హనుమంతుడి భక్తులతో పాటు హిందూ మనోభావాలను దెబ్బతీశాయని చర్చ తెరపైకి వచ్చింది. టెక్నికల్ టీమ్ వైఫల్యాన్ని కూడా దేవుడికి ఆపాదించడం ఏంటి అంటూ వారు భగ్గుమంటున్నారు. దేవుడిని నమ్మనంటూనే.. ఆటంకాలు వస్తే ఇలా హనుమంతుడిపై నిందలు మోపడం ఎందుకు అంటూ ఫైర్ అవుతున్నారు. సినిమా విజయం సాధించినప్పుడు ఆ క్రెడిట్ మీ ఖాతాలో వేసుకుని.. విఫలమైతే దేవుడిది తప్పు అంటే ఎలా అని రాజమౌళిపై పోస్టులు పెడుతున్నారు.Shocking 😮 what happened? Why is @ssrajamouli blaming lord Hanuman? 😱😡😡 pic.twitter.com/utezaTYnE6— Tathvam-asi (@ssaratht) November 15, 2025 -
ఈ రోజు నా మాటలను నాన్న వింటుంటారు: మహేశ్ బాబు
‘‘నాన్నగారంటే (సూపర్‌స్టార్ కృష్ణ) నాకు చాలా ఇష్టం. ఆయన చెప్పిన ప్రతి మాటని గౌరవించాను, పాటించాను. కానీ ఒక్కటి మాత్రం చేయలేదు. ఆయన నన్నెప్పుడూ పౌరాణికం సినిమా చేయమని అడిగేవారు. ఆ మాట నేను వినలేదు. ఈ రోజు నా మాటల్ని ఆయన వింటుంటారు (‘వారణాసి’లో మహేశ్ చేసిన రుద్ర పాత్రకు పౌరాణికం టచ్ ఉంది). నాన్న ఆశీస్సులు ఎప్పుడూ మనతో ఉంటాయి. ‘వారణాసి’ నా డ్రీమ్ ప్రాజెక్ట్. దీనికి ఎంత కష్టపడాలో అంతా పడతాను. ఈ సినిమా విడుదలైనప్పుడు దేశమంతా గర్వపడుతుంది’’ అని భావోద్వేగంగా మాట్లాడారు మహేశ్‌బాబు. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా కేఎల్ నారాయణ, కార్తికేయ నిర్మిస్తున్న చిత్రానికి ‘వారణాసి’ టైటిల్ ఖరారైంది. శనివారం హైదరాబాద్‌లో ‘గ్లోబ్‌ట్రోటర్’ ఈవెంట్ పేరిట చిత్రయూనిట్ నిర్వహించిన కార్యక్రమంలో ‘వారణాసి’ టైటిల్ గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. çపృథ్వీరాజ్ సుకుమారన్ , ప్రియాంకా చోప్రా ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విజయేంద్రప్రసాద్, కంచి కథ అందించారు. ఈ చిత్రం 2027 వేసవిలో విడుదల కానుంది. ఈ వేడుకలో మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘ఈ వేదికపైకి సింపుల్‌గా నడిచొస్తానంటే రాజమౌళిగారు కుదరదన్నారు... చూశారుగా ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారో (బొమ్మ నందిపైన కూర్చుని వస్తున్నట్లుగా). ఇదంతా మీకోసమే (అభిమానులు). మీరంతా మమ్మల్ని స΄ోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. అప్డేట్స్... అప్డేట్స్ అన్నారు. అవి ఎలా ఉన్నాయో మీరే చెప్పాలి. అవి చూస్తుంటే నాకే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. ముందు ముందు ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. మీరంతా ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. అభిమానులందరూ క్షేమంగా ఇంటికి చేరుకుంటే మేమంతా చాలా సంతోషంగా ఉంటాం’’ అని తెలిపారు. రాజమౌళి మాట్లాడుతూ– ‘‘నాకు చిన్నప్పుడు కృష్ణగారి గొప్పదనం తెలియదు. చిన్నప్పుడు ఎన్టీఆర్‌గారి అభిమానిని. కానీ ఇండస్ట్రీకి వచ్చాక... సినిమా ఏంటో అర్థమయ్యాక కృష్ణగారి గొప్పదనం తెలిసింది. ఒక కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎన్నో దారులను బ్రేక్ చేసుకుంటూ, ఎన్నో దారులు వేసుకుంటూ వెళ్లాలి. ఇక నిన్న (శుక్రవారం) రాత్రి మా సినిమా వీడియోను టెస్ట్ చేయాలనుకున్నాం. లీక్ కాకూడదని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ డ్రోన్స్‌తో వీడియోలు తీసి, నెట్లో పెట్టడం మొదలుపెట్టారు. ఈ వీడియోను ఎంతో దూరం నుంచి వచ్చిన ఆడియన్స్ కోసం ఈ రోజు మేం ప్లే చేద్దామనుకున్నాం. ఇక మహేశ్‌బాబు నుంచి మనందరం నేర్చుకునే ఒక గుణం ఉంది. మనందరికీ సెల్‌ఫోన్ ఎడిక్షన్ ఉంది. ఆఫీసుకు వచ్చినా, షూటింగ్‌కు వచ్చినా సెల్‌ఫోన్ పట్టుకోడు. 8 గంటలైనా, 10 గంటలైనా తన సెల్‌ఫోన్ కారులోనే ఉంటుంది. మళ్లీ కారు ఎక్కితేనే మహేశ్ తన ఫోన్ టచ్ చేస్తాడు. మనందరం ఇది నేర్చుకోవాలి. మహాభారతం, రామాయణం అంటే నాకు చాలా ఇష్టమని చాలాసార్లు చెప్పాను. మహాభారతం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పాను. ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు కూడా రామాయణంలోని ఓ ముఖ్యమైన ఘట్టం తీస్తానని అనుకోలేదు. ఫస్ట్ డే మహేశ్‌కి రాముడి వేషం వేసి, ఫొటోషూట్ చేస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి. సినిమాలోని ఆ ఎపిసోడ్‌ను 60 రోజులు షూట్ చేశాం. నా సినిమాల్లో మోస్ట్ మెమొరబుల్ సీక్వెన్స్‌గా అది ఉండబోతోంది. మీరు ఊహించనంత అందంగా, పరాక్రమంగా, కోపంగా, దయార్ద్ర హృదయంతో ఉంటాడు మహేశ్. ఈ ఎసిసోడ్ షూట్ చేసినందుకు నేను చాలా లక్కీ’’ అన్నారు.ప్రియాంకా చోప్రా మాట్లాడుతూ– ‘‘కొంత గ్యాప్ తర్వాత ఇండియన్ సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో మందాకిని పాత్రకు నన్ను ఎంపిక చేసుకున్న రాజమౌళిగారికి థ్యాంక్స్. మహేశ్‌బాబుగారు, ఆయన ఫ్యామిలీ... నేను హైదరాబాద్‌ని మరో ఇల్లుగా భావించేలా చేశారు’’ అని అన్నారు.పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ– ‘‘రెండేళ్ల క్రితం రాజమౌళిగారి నుంచి నాకో మెసేజ్ వచ్చింది. ఆయన చెప్పిన ఐదు నిమిషాల నరేషన్ విని మైండ్ బ్లో అయ్యింది. ఇండియన్ సినిమా లిమిట్స్ దాటేలా ఈ చిత్రకథ, రాజమౌళి విజన్ ఉంటాయి’’ అని చెప్పారు.ఎమ్ఎమ్ కీరవాణి మాట్లాడుతూ– ‘‘కీరవాణిగారు మెలోడీ బాగా కొడతారు. కానీ బీట్ కాస్త స్లోగా ఉంటుందన్న పేరు నాకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఈసారి మెలోడీ నాదే. బీటూ నాదే’’ అని చెప్పారు.కథా రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో ఓ 30 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ ఉంది. మహేశ్‌బాబు విశ్వరూపాన్ని చూస్తూ నేనలా ఉండిపోయాను. డబ్బింగ్ లేదు... సిజీ లేదు... రీ రికార్డింగ్ లేదు... అయినా నన్ను మంత్రముగ్దుడ్ని చేసింది ఆ సీన్... మర్చిపోలేను. మీరు (ఆడియన్స్) కూడా చక్కని అనుభూతి చెందుతారు. కొన్ని కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు. కొన్ని కొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారు. అనుక్షణం రాజమౌళి గుండెలపై హనుమ ఉన్నాడు’’ అని చెప్పారు కార్తికేయ మాట్లాడుతూ– ‘‘నిర్మాతగా గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై నా తొలి స్పీచ్ ఇది. చాలా గౌరవంగా ఉంది. మన ఇండియా వైపు గ్లోబల్ ఆడియన్స్ చూసేలా, మన ఇండియన్ సినిమా గ్లోబల్ స్థాయికి వెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని చెప్పారు.కేఎల్ నారాయణ మాట్లాడుతూ– ‘‘పదిహేనేళ్ల క్రితం మహేశ్‌బాబు, రాజమౌళిగార్లతో సినిమా చేయాలనుకుని, వారిని అడిగితే వెంటనే ఒప్పుకున్నారు. కానీ ఇంత టైమ్ పడుతుందని రాజమౌళి గారు, నేనూ ఊహించలేదు. ఇప్పుడు నా కల నిజమైంది’’ అన్నారు.ఈ వేడుకలో నమ్రత, సితార, రమా రాజమౌళి, సుప్రియ, కంచి, దేవ కట్టా, ఫైట్ మాస్టర్ సాల్మన్ లతో ΄పాటు పలువురు సినీ ప్రముఖలు పాల్గొన్నారు. -
'వారణాసి'లో మహేష్ బాబు.. టైటిల్ గ్లింప్స్ (ఫోటోలు)
-
‘వారణాసి’ చూసి యావత్ దేశం గర్వపడుతుంది: మహేశ్ బాబు
నాన్నగారు(కృష్ణ) ఎప్పుడూ నన్ను ఒక మాట అడుగుతూ ఉండేవారు. ‘నువ్వు పౌరాణిక పాత్ర చేస్తే చూడాలని ఉంది’ అని చాలా సార్లు అడిగారు. ఈ విషయంలో నేను ఆయన మాట వినలేదు. ఇన్నాళ్లకు వారణాసి(Varanasi)లో అలాంటి పాత్ర చేశా. ఆయన ఎక్కడ ఉన్నా ఆశిస్సులు మనతో ఉంటాయి’ అన్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu). రాజమౌళి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం ‘వారణాసి’. ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషించాడు. గ్లోబ్ ట్రాటర్ పేరుతో హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్లో శనివారం ఈ మూవీ టైటిల్‌తో పాటు స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ..‘వారణాసి నా డ్రీమ్ ప్రాజెక్ట్. జీవితంలో ఒక్కసారి మాత్రం ఇలాంటి సినిమా చేసే అవకాశం వస్తుంది. దీని కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడతా. అందరూ గర్వపడేలా చేస్తా. ముఖ్యంగా రాజమౌళి గర్వపడేలా శ్రమిస్తా. ఈ మూవీ విడుదలైన తర్వాత యావత్ దేశం మనల్ని చూసి గర్వపడుతుంది. ఈ ఈవెంట్ కేవలం టైటిల్ ప్రకటన కోసమే. ముమ్ముందు ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. మీ(ఫ్యాన్స్) సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నా. మీరు చూపించే అభిమానానికి థ్యాంక్స్ అనే మాట చాలా చిన్నది. ఈ ఈవెంట్ ఇంత సజావుగా జరిగేలా సహకరించిన పోలీసులకు ధన్యవాదాలు’ అని అన్నారు. ఎంఎం కీరవాణి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2027 వేసవిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. -
'వారణాసి'లో శ్రీరాముడిగా మహేశ్.. బయటపెట్టిన రాజమౌళి
రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు చేస్తున్న సినిమాకు 'వారణాసి' అనే టైటిల్ నిర్ణయించారు. ఈ మేరకు స్పెషల్ వీడియోని 'గ్లోబ్ ట్రాటర్'లో ప్రసారం చేశారు. విజువల్స్ అన్నీ టాప్ నాచ్ ఉండగా.. అభిమానులు దీన్ని చూసి మైమరిచిపోయారు. ఇదే అనుకుంటే.. ఈ సినిమాలో మహేశ్ బాబు శ్రీరాముడిగా నటించారని చెప్పి రాజమౌళి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. ఏకంగా 60 రోజుల పాటు రాముడి ఎపిసోడ్ చిత్రీకరించామని చెప్పారు.(ఇదీ చదవండి: మహేశ్ బాబు 'వారణాసి'.. 2027 వేసవిలో రిలీజ్)'తొలిరోజు ఫొటోషూట్‌లో మహేశ్ బాబుని శ్రీరాముడిగా రెడీ చేసి ఫొటోలు తీశాం. అయితే మహేశ్, కృష్ణుడి పాత్రకు బాగా సూట్ అవుతాడని అనుకున్నా. కానీ ఆ రోజు మహేశ్.. నా అంచనా తప్పు అని నిరూపించాడు. దీంతో మహేశ్ రాముడి గెటప్ ఫొటోని నా వాల్ పేపర్‌గా పెట్టుకున్నాను. కానీ ఎవరు చూసేస్తారేమో అనుకుని దాన్ని తీసేశాను. రామాయణంలోని ఓ ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని నేను అనుకోలేదు. మహేశ్‌ని రాముడి వేషం వేసి తీసుకొచ్చి ఫోటోషూట్ తీస్తుంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. రాముడి ఎపిసోడ్‌ని 60 రోజుల పాటు తీశాం. రీసెంట్‌గానే అది పూర్తయింది. ఇందులో చాలా సబ్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. ఈ ఒక్క ఎపిసోడ్.. నాకు, మహేశ్ కెరీర్లోనే మర్చిపోలేని సీక్వెన్స్' అని రాజమౌళి చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: 30 నిమిషాల ఫైట్.. మహేశ్ విశ్వరూపం చూశా: విజయేంద్ర ప్రసాద్) -
మహేశ్-రాజమౌళి 'వారణాసి' సినిమా వీడియో రిలీజ్
సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో తీస్తున్న సినిమాకు 'వారణాసి' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ శివారులో 'గ్లోబ్ ట్రాటర్' పేరుతో నిర్వహించిన ఈవెంట్లో స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. దాదాపు మూడున్నర నిమిషాల పాటు సాగిన ఈ వీడియో అద్భుతమనే రేంజులో ఉంది. ఆ విజువల్స్, గ్రాఫిక్స్ మతిపోగొట్టేలా కనిపించాయి.వారణాసి 512సీఈ నుంచి మొదలుపెట్టి.. ఆస్టరాయిడ్ శంభవి 2027సీఈ.. అంటార్కిటికా ఆఫ్రికా.. ఉగ్రభట్టి గుహ.. లంకా నగరం త్రేతాయుగం.. వారణాసి మణికర్ణిక ఘాట్.. అంటూ చూపించారు. చివర్లో మహేశ్ బాబు ఎద్దుపై స్వారీ చేస్తూ చేతిలో త్రిశూలంతో కనిపించారు. చివరలో 'వారణాసి' అనే టైటిల్ పడింది. 3 నిమిషాల 40 సెకన్ల వీడియోలో ఒక్క డైలాగ్ కూడా లేదు. అయినా సరే విజువల్ వండర్ అనేలా తీర్చిదిద్దారు. -
మహేశ్ బాబు 'వారణాసి'.. 2027లో రిలీజ్
మహేశ్ బాబుతో రాజమౌళి ఓ సినిమా చేస్తున్నారు. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ మొదలైనప్పటికీ ఒక్క అప్డేట్ కూడా రిలీజ్ చేయలేదు. మిగతా యాక్టర్స్ నుంచి కూడా ఒక్కటి కూడా బయటకు రానీయకుండా జాగ్రత్తపడ్డారు. అలాంటిది ఇప్పుడు 'గ్లోబ్ ట్రాటర్' పేరుతో భారీ ఎత్తున హైదరాబాద్‌లో ఈవెంట్ నిర్వహించారు. సినిమా గురించి డీటైల్స్ బయటపెట్టారు.ఇదే కార్యక్రమంలో మాట్లాడిన మూవీ టీమ్ అంతా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ చిత్రానికి సంగీతమందించిన కీరవాణి కూడా చాలా మాట్లాడారు. పనిలో పనిగా మూవీ రిలీజ్ ఎప్పుడనేది కూడా చూచాయిగా బయటపెట్టారు.'మహేశ్ బాబు ఫ్యాన్స్.. మీ అందరి హృదయాల్లో పర్మినెంట్‌గా ఉండిపోటానికి ఒక కొత్త ఫ్లాట్ కొన్నా. బిల్డర్ హ్యాండోవర్ చేసేసాడు. ప్రొడ్యూసర్ హ్యాపీ. డైరెక్టర్ హ్యాపీ. టైల్స్ ఏత్తన్నారు. మెలోడీ నాదే బీటు నాదే. సమ్మర్ 2027కి గృహప్రవేశం' అని కీరవాణి చెప్పుకొచ్చారు.కీరవాణి చెప్పడమైతే చెప్పారు గానీ 2027 వేసవిలోనే కచ్చితంగా రిలీజ్ అవుతుందా అంటే సందేహమే. ఎందుకంటే రాజమౌళి తీసే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా పలు కారణాల వల్ల ఆలస్యం కావడం, ముందు అనుకున్న విడుదల తేదీ వాయిదా పడటం తెలిసిందే. మరి ఈసారైనా కీరవాణి చెప్పినట్లు 2027 వేసవిలోనే వస్తారా లేదా అనేది చూడాలి? -
30 నిమిషాల ఫైట్ సీక్వెన్స్.. మహేశ్ విశ్వరూపం చూశా: విజయేంద్ర ప్రసాద్
దర్శకుడు రాజమౌళి, మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నట్లు మొన్నటివరకు బయటపెట్టలేదు. అలాంటిది ఇప్పుడు 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ అనేసరికి అభిమానులు తెగ ఎగ్జైట్ అయిపోయారు. ప్రస్తుతం వేలాదిమంది సమక్షంలో ఈవెంట్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. 'వారణాసి' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా మూవీ గురించి, మహేశ్ యాక్టింగ్ గురించి కూడా అద్భుతమైన అప్డేట్ వచ్చేసింది.'వారణాసి' కథని రాసిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. 'ఈ సినిమా తాలూకు 30 నిమషాల యాక్షన్ ఎపిసోడ్ చూశాను. అందులో సీజీ లేదు, బీజీఎం లేదు, అయినా కానీ మహేశ్ బాబుని అలా చూస్తూ ఉండిపోయాను. ఎందుకంటే స్క్రీన్ ప్రెజెన్స్ నన్ను మంత్రంతో కట్టి పడేసింది. మీరు కూడా అనుభూతి పొందుతారు. మహేశ్ తాలూకు విశ్వరూపం చూసి షాక్ అవుతారు. కొన్ని కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు. కానీ కొన్ని కొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారు అనుక్షణం రాజమౌళి గుండెలపై హనుమాన్ ఉన్నారు. ఏం చేయాలో చెబుతూ ఉన్నారు' అని విజయేంద్రప్రసాద్ చెప్పారు.30 నిమిషాల పాటు సాగే యాక్షన్ ఎపిసోడ్ అంటే కచ్చితంగా ఇది క్లైమాక్స్ అయి ఉండొచ్చు. విజయేంద్రప్రసాద్ చెప్పిన దానిబట్టి చూస్తే యాక్షన్ ఎపిసోడ్స్ అయితే కొంతమేర తీశారు. కాకపోతే దీనికి సీజీ, గ్రాఫిక్స్, బీజీఎం లాంటివి జోడిస్తే ఏ రేంజులో ఉంటుందోనని అభిమానులు అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు. -
మహేశ్-రాజమౌళి సినిమా టైటిల్ 'వారణాసి'
ప్రస్తుతం ఎక్కడ చూసినా మహేశ్-రాజమౌళి 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ హడావుడి గురించే డిస్కషన్. హైదరాబాద్ శివారులో ఈ కార్యక్రమం భారీగానే ప్లాన్ చేశారు. అభిమానులతో పాటు వేలాదిమంది దీన్ని వీక్షిస్తున్నారు. అయితే ఈవెంట్ ప్రారంభంలోనే మూవీ టైటిల్ ఏంటనేది ప్రకటించేశారు. గత కొన్నిరోజుల నుంచి అనుకుంటున్నట్లే 'వారణాసి' అని ఫిక్స్ చేశారు. టైటిల్ గ్లింప్స్ వీడియోని ఈవెంట్ స్క్రీన్ పై ప్రసారం చేశారు.టైటిల్ గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. గత కొన్నిరోజుల నుంచి రుద్ర, వారణాసి.. ఇలా పలు టైటిల్స్ వినిపించాయి. వీటిలో ఏది పెడతారా అనే డిస్కషన్ అయితే నడిచింది. ఫైనల్‌గా రాజమౌళి 'వారణాసి' అనే పేరుకే కట్టుబడి ఉన్నట్లు ఇప్పుడీ వీడియోతో క్లారిటీ వచ్చేసింది.ఇందులో మహేశ్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రియాంక చోప్రా, మందాకిని పాత్రలో.. పృథ్వీరాజ్ సుకుమారన్, కుంభ అనే విలన్‌గా కనిపిస్తాడు. వీళ్లు ముగ్గురు కాకుండా ఇంకెవరెవరు ఉన్నారనేది వీడియోలో రివీల్ చేస్తారేమో చూడాలి? -
గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్.. ఫ్యాన్స్‌కి తప్పని ఆ ఇబ్బంది!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మహేశ్-రాజమౌళి 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ గురించే చర్చ నడుస్తోంది. హైదరాబాద్ శివారులో జరుగుతున్న ఈవెంట్‌కి అభిమానులు బాగానే వస్తున్నారు. ఇందుకు సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి కూడా. అయితే మిగతా అందరికీ కాదు గానీ అభిమానులకు మాత్రం ఓ విషయంలో ఇబ్బంది తప్పట్లేదు. పలువురు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం పసుపు, ఎరుపు, తెలుపు, ఊదా(వయలెట్) రంగుల్లో పాస్(పాస్పోర్ట్స్)లు జారీ చేశారు. వీటిలో అభిమానులకు పసుపు రంగు పాస్‌లు ఇచ్చారు. వీటిని తీసుకుని అభిమానులు కార్యక్రమానికి వెళ్లారు. అయితే మిగతా అన్ని పాస్‌లు ఉన్నవాళ్లకు ఎలాంటి సమస్య లేదు గానీ పసుపు రంగు పాస్‌లు ఉన్నవాళ్లతో పాటు వాటర్ బాటిల్స్‌ని తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వట్లేదట. బదులుగా వాటర్ పాకెట్స్ ఇస్తున్నారు గానీ అవి ఏ మేరకు అవసరం ఉన్నవాళ్లకు అందుతాయనేది చూడాలి.ఈవెంట్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్లాలంటేనే అభిమానులు.. 3-4 కిలోమీటర్లు నడవాలి అని తెలుస్తోంది. వెళ్లిన తర్వాత కనీసం వాటర్ బాటిల్‌ని కూడా అనుమతించకపోవడం ఏంటని మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమం హాట్‌స్టార్ ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్ కానుంది.ఈ కార్యక్రమానికి హీరో మహేశ్ బాబు, దర్శకుడు రాజమౌళితో పాటు ఈ సినిమాలో భాగమైన ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ హాజరు కానున్నాయి. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో మూవీ టైటిల్‌తో పాటు సినిమా ఎలా ఉండబోతుందా అనే విజువల్స్‌తో కూడిన వీడియోని కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి ట్వీట్ చేశారు. -
'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్లో ఆ రెండు రిలీజ్.. రాజమౌళి క్లారిటీ
రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో తీస్తున్న కొత్త సినిమా టైటిల్ ఏంటో మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది. హైదరాబాద్ వేదికగా ఈరోజు (నవంబరు 15) సాయంత్రం 'గ్లోబ్ ట్రాటర్' పేరుతో భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. 100 అడుగుల ఎత్తున్న ఎల్ఈడీ స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్లో అసలేం రిలీజ్ చేస్తారా అని అభిమానుల మదిలో బోలెడన్ని సందేహాలు. ఇప్పుడు వాటికి ఎండ్ కార్డ్ వేసిన రాజమౌళి.. ఒక్క ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చేశారు.(ఇదీ చదవండి: మహేష్ బాబు కోసం 7వేల కిలోమీటర్లు దాటి వచ్చేశాడు)గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో టైటిల్ రివీల్ చేయడంతో పాటు మూవీ థీమ్ ఏంటనేది వీడియో రూపంలో రిలీజ్ చేయబోతున్నట్లు రాజమౌళి చెప్పుకొచ్చారు. ఈవెంట్లో స్క్రీన్ పై ప్రసారమైన తర్వాత యూట్యూబ్‌లోనూ ఆ వీడియోని రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు. అయితే ఈ వీడియో దాదాపు మూడు నిమిషాల పాటు ఉండనుందని తెలుస్తోంది. ఇందులో అన్ని పాత్రలకు సంబంధించిన విజువల్స్, మూవీ స్టోరీ ఏంటనేది చూచాయిగా చూపించడం గ్యారంటీ.ఇప్పటికే ఈ మూవీలో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' లుక్, ప్రియాంక చోప్రా 'మందాకిని' లుక్స్ రిలీజ్ చేశారు. వీటిపై మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతానికి ఫ్యాన్స్ అందరూ కూడా మహేశ్ బాబు లుక్ కోసమే ఎదురుచూస్తున్నారు. మరి లుక్ రిలీజ్ చేస్తారా? నేరుగా వీడియోనే రిలీజ్ చేసి అభిమానులకు జక్కన్న కిక్ ఇస్తారా అనేది చూడాలి? ఇప్పటికే వారణాసి, రుద్ర అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి. మరి దేన్ని ఫైనల్ చేశారో మరికొద్ది గంటల్లో తేలనుంది. (ఇదీ చదవండి: ఈరోజు మీగురించే ఎక్కువ ఆలోచిస్తున్నా: మహేశ్‌బాబు)The title of the film will be revealed along with a visual to the world…Once it airs on the big screen at the #GlobeTrotter event, we will make it live online…. 🤗🤗🤗— rajamouli ss (@ssrajamouli) November 15, 2025 -
ఈరోజు మీగురించే ఎక్కువ ఆలోచిస్తున్నా: మహేశ్‌బాబు
రాజమౌళి (SS Rajamouli) సినిమా అంటే జనాల్లో క్రేజ్.. అందులోనూ సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu)తో సినిమా అంటే ఆ క్రేజ్ ఇంకే రేంజ్లో ఉంటుందో ఎవరి ఊహకూ అందదు. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న #SSMB29 మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలో సినిమా టైటిల్, మహేశ్‌బాబు ఫస్ట్ లుక్ కొన్ని గంటల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకోసం గ్లోబ్ ట్రాటర్ అనే ఈవెంట్‌ను ఘనంగా ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కోసం పాస్‌పోర్ట్‌ల మాదిరిగా ఉండే పాస్‌లను జారీ చేశారు.మీ గురించే ఆలోచిస్తున్నా..దీంతో ఇండస్ట్రీలో పండగ వాతావరణం నెలకొంది. మరోవైపు నేడు (నవంబర్ 15న) మహేశ్ తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి. ఈ సందర్భంగా మహేశ్‌బాబు తండ్రిని గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. నాన్నా, ఈరోజు మీ గురించి కాస్త ఎక్కువగానే ఆలోచిస్తున్నా.. మీరుంటే చాలా గర్వపడేవారు అంటూ తండ్రితో దిగిన ఓ ఫోటోను పోస్ట్‌కు జత చేశాడు.మరికాసేపట్లో టైటిల్ రివీల్#SSMB29 సినిమా విషయానికి వస్తే మహేశ్‌బాబు ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ మూవీని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్, మందాకినిగా ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. ఇదివరకే వీరిద్దరి ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. నేడు సాయంత్రం జరగబోయే గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో మహేశ్ ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో పాటు టైటిల్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్‌కు వెళ్లలేనివారు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) చదవండి: చాలా సినిమాలు రిజెక్ట్ చేశా: దీపికా -
మహేష్ బాబు కోసం 7వేల కిలోమీటర్లు దాటి వచ్చేశాడు
మహేష్ బాబు , రాజమౌళి (SS Rajamouli) సినిమాకు సంబంధించిన #GlobeTrotter ఈవెంట్ కోసం ప్రపంచదేశాల నుంచి కూడా ఆయన అభిమానులు హైదరాబాద్‌లో వాలిపోతున్నారు. నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో ఎంతో ఘనంగా ఈ కార్యక్రమం జరగనుంది. పాస్‌పోర్ట్ మాదిరిగా ఉన్న పాస్‌లను ప్యాన్స్ కోసం జక్కన్న ఇప్పటికే జారీ చేశారు. అయితే, మహేష్ అభిమాని ఒకరు ఈ కార్యక్రమం కోసం ఏకంగా 6817 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాడు. అందుకు సంబంధించిన ఒక పోస్ట్‌ను రాజమౌళి కుమారుడు కార్తికేయ షేర్ చేశారు.మహేష్ బాబుకు ఇతర దేశాల్లో కూడా భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే, సునీల్ ఆవుల అనే అభిమాని SSMB29 కార్యక్రమం కోసం సింగపూర్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. చాలా ఏళ్ల తర్వాత కేవలం మహేష్ కోసం వస్తున్నట్లు పేర్కొన్నాడు. అందుకోసం ఏకంగా 6817 కిలోమీటర్ల దూరం 12 గంటల పాటు ప్రయాణం చేశానన్నారు. తన పంచుకున్న పోస్ట్‌ను కార్తికేయ్ షేర్ చేశారు. ఒక తెలుగోడు మాత్రమే అనుభూతి చెందే బిగ్గెస్ట్ ఎమోషన్ ఇదే అని ఆపై ఆకాశం కూడా హద్దు కాదంటూ పేర్కొన్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది.OKKA TELUGODU MAAATRAME FEEL AYYE BIGGEST EMOTION….SKY ALSO NOT THE LIMIT…. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 https://t.co/jH4eJniB0U— S S Karthikeya (@ssk1122) November 15, 2025 -
పాస్‌పోర్ట్ లేకుండా కంగారుపడి వచ్చేయకండి: మహేశ్
మరికొన్ని గంటల్లో మహేశ్-రాజమౌళి సినిమాకు సంబంధించిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ భారీ లెవల్లో జరగబోతుంది. శనివారం(నవంబరు 15) సాయంత్రం హైదరాబాద్ శివారులో ఈ వేడుక జరగనుంది. గత కొన్నిరోజుల్లో పలు ప్రమాదాలు జరిగిన దృష్ట్యా.. కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ రాజమౌళి ఇప్పటికే వీడియో రిలీజ్ చేసి తగు జాగ్రత్తలు చెప్పారు.ఇప్పుడు హీరో మహేశ్ బాబు వంతు వచ్చింది. పాస్‌పోర్ట్ (ఈవెంట్ పాస్) ఉంటేనే లోపలికి అనుమతి ఉంటుందని, లేదంటే మాత్రం వచ్చేయకండి అని సుతిమెత్తగా చెప్పారు. ఇంకా చాలా ఈవెంట్స్ ఉండనే ఉంటాయని అభిమానులు కంగారుపడొద్దని జాగ్రత్తలు చెప్పారు.'ఈవెంట్ రోజున ఆర్ఎఫ్సీ మెయిన్ గేట్ మూసేసి ఉంటుంది. మీతో పాటు ఉన్న పాస్ స్కాన్ చేస్తే మీరు ఏ గేటు నుంచి రావాలో చూపిస్తుంది. ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించండి. పోలీసులకు, సెక్యూరిటీ వాళ్లకు సహకరించండి. పోలీసులు మనకు చెప్పింది ఏంటంటే.. అందరూ ఎంత తక్కువ ట్రాన్స్పోర్టేషన్తో వస్తే అందరికీ అంత ఈజీగా ఉంటుంది. పాస్‌పోర్ట్ లేకుండా కంగారుపడి వచ్చేయకండి. మనకు ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటూనే ఉంటాయి. రేపు సాయంత్రం కలుద్దాం' అని మహేశ్ బాబు చెప్పారు.SSMB29 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తీస్తున్నారు. ఇప్పటికే కుంభ పాత్రలో పృథ్వీరాజ్, మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా నటిస్తున్నట్లు ప్రకటించారు. ఆయా పాత్రల ఫస్ట్ లుక్స్ కూడా రిలీజ్ చేశారు. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో మహేశ్ లుక్ రిలీజ్ చేయడంతో పాటు అనౌన్స్మెంట్ వీడియోని కూడా భారీ స్క్రీన్ పై ప్లే చేయనున్నారు. ఈవెంట్ వెళ్లలేకపోతే హాట్‌స్టార్ ఓటీటీలో దీన్ని లైవ్‌గా చూడొచ్చు.Tomorrow it is… 🤗🤗🤗Come safely, enjoy it and go home safely.❤️❤️❤️ #GlobeTrotter pic.twitter.com/5ybhjJ5ZP4— Mahesh Babu (@urstrulyMahesh) November 14, 2025 -
SSMB29 ఈవెంట్ పాస్‌లు.. సరికొత్తగా ప్లాన్ చేసిన రాజమౌళి
మహేష్ బాబు , రాజమౌళి (SS Rajamouli) సినిమా SSMB29 ఈవెంట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. #GlobeTrotter పేరుతో నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక ఈవెంట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.. అయితే, కార్యక్రమానికి సంబంధించిన పాస్‌లు ఉన్నవాళ్లు మాత్రమే రావాలని ఒక వీడియోతో రాజమౌళి పంచుకున్నారు. పాస్‌పోర్ట్ మాదిరిగా ఉన్న ఈ పాస్‌లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.హైదరాబాద్ మూవీ లవర్స్‌కి సుదర్శన్ థియేటర్ అంటే పరిచయం అక్కర్లేదు.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న ఈ థియేట్ మహేష్ అభిమానులకు ఓ ఎమోషనల్, సెంటిమెంట్ అని చెప్పాలి. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ఇక్కడ భారీ కటౌట్లతో పాటు వందల కొద్ది ఫెక్సీలు కనిపిస్తాయి. ఇప్పుడు ఇదే థియేటర్ వద్ద ఆయన అభిమానులు #GlobeTrotter ఈవెంట్ పాస్‌లను చూపుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.త్రిశూలం బొమ్మతో ముద్రించిన ఈ పాస్‌లు పాస్‌పోర్ట్ మాదిరిగా ఉండటంతో సరికొత్తగా ఉందంటూ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ఫస్ట్ పేజీలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక, పృథ్వీరాజ్, రాజమౌళి ఫొటోలను ముద్రించారు. ఆపై కార్యక్రమంలో పాల్గొనేవారు పాటించాల్సిన రూల్స్, మ్యాప్‌తో సహా ఇచ్చారు. పాస్‌లు ఉన్నవారు మాత్రమే వేదిక వద్దకు చేరుకోవాలని ఇప్పటికే రాజమౌళి పేర్కొన్నారు. ఎట్టిపరిస్థితిల్లోనూ చిన్నపిల్లలు, సీనియర్ సిటిజన్లకు అనుమతి లేదని తెలిపారు. ఇంటి వద్దే జియో హాట్‌స్టార్‌లో లైవ్ చూడాలని కోరారు.Here it is #GlobeTrotter event passes overview at our SSMB Fort Please follow the given Instructions in the pass and enjoy the #GlobeTrotter event at RFC 📍Make the event grand success on noveMBer 15th Enjoy the event & Be Safe 🙏#SSMB29 || #MaheshBabu𓃵 pic.twitter.com/vgzLggcQxD— Sudarshan35mm'MB'FC (@sudarshan35mm) November 13, 2025Passport #GlobeTrotter 🔥🔥🔥🔥What an innovative promotion by team 👏🏻@ssrajamouli 🔥 pic.twitter.com/Y7ttggs7tk— Thyview (@Thyview) November 13, 2025 -
తెలుగు స్టార్ హీరోల పిల్లలు.. భవిష్యత్ ప్లాన్స్ ఏంటి?
ప్రస్తుత జనరేషన్ తెలుగు హీరోల్లో చాలామంది ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు తండ్రి బాధ్యతల్ని అంతే చక్కగా పూర్తి చేస్తున్నారు. తమ కొడుకు లేదా కూతురికి ఏం కావాలంటే అది చేస్తున్నారు. దీంతో హీరోల కొడుకులు హీరోలే కావాలని కాకుండా పలు రంగాల్లో తమ ప్రతిభ చూపించే పనిలో బిజీగా ఉన్నారు. ఇంతకీ టాలీవుడ్ యంగ్ హీరోల వారసులు ఏం చేస్తున్నారు? వాళ్ల భవిష్యత్ ప్లాన్స్ ఏంటి? చిల్డ్రన్స్ డే (బాలల దినోత్సవం) సందర్భంగా మీకోసం.మహేశ్ బాబు విషయానికొస్తే కొడుకు గౌతమ్, కూతురు సితార.. ఇదివరకే తన సినిమాల్లో చాలా చిన్న పాత్రల్లో కనిపించారు. గౌతమ్‌కి స్పోర్ట్స్ స్టార్‌గా ఎదగాలని కల ఉందట. మరి అందుకు తగ్గ ప్రిపరేషన్స్‌లో ఉన్నాడో లేదో తెలియదు గానీ ప్రస్తుతానికైతే విదేశాల్లో యాక్టింగ్ కోర్స్ నేర్చుకుంటున్నాడు. సితార అయితే టీనేజీలోకి రాకముందు నుంచి నటి కావాలని తెగ ఇంట్రెస్ట్ చూపించింది. క్లాసికల్ డ్యాన్స్ ఇప్పటికే నేర్చుకుంది. జ్యూవెల్లరీ షాప్ యాడ్ కూడా చేసేసింది. చూస్తుంటే అటు గౌతమ్, ఇటు సితార ఇద్దరూ కూడా నటులే అయ్యేలా కనిపిస్తున్నారు.అల్లు అర్జున్ విషయానికొస్తే.. కొడుకు అయాన్ ప్రస్తుతం చదువుకుంటున్నాడు. తండ్రిలా నటుడు అవుతాడా లేదా అనేది స్తుతానికి సస్పెన్స్. కూతురు అర్హ మాత్రం కచ్చితంగా హీరోయిన్ అవుతుంది. గతంలోనే సమంత 'శాకుంతలం'లో బాలనటిగా చేసింది. చూస్తుంటే పెరిగి పెద్దయ్యాక హీరోయిన్ కావడం గ్యారంటీ అనిపిస్తుంది.ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్.. తండ్రిలా హీరో కావాలని అనుకోవట్లేదట. దర్శకుడిగా మారాలనే ఆలోచనలో ఉన్నాడట. రవితేజ కొడుకు మహాధన్.. గతంలో 'రాజా ది గ్రేట్' చిత్రంలో తండ్రి చిన్నప్పటి పాత్రలో బాలనటుడిగా చేశాడు. కానీ ఇతడి మనసులో మాత్రం దర్శకత్వం ఆలోచనే ఉందట. ప్రస్తుతం వెంకీ అట్లూరి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ కూతురు మోక్షద అయితే అటు నటన ఇటు దర్శకత్వం లాంటివి కాకుండా నిర్మాత అయ్యే ఆలోచనలో ఉందట. ఆల్రెడీ అదే పనిలో ఉందని కూడా తెలుస్తోంది.నాని కొడుకు అర్జున్.. ప్రస్తుతం మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు. పియానో ప్లే చేస్తున్న వీడియోని నాని భార్య అంజన.. సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేసింది. మరి సంగీతం వైపు వస్తాడా లేదంటే తండ్రిలా యాక్టర్ అవుతానని అంటాడా అనేది తెలియాలంటే ఇంకొన్నేళ్లు ఆగాలి. మంచు విష్ణు వారసులు ఇప్పటికే స్క్రీన్ పై కనిపించేశారు. కుమార్తెలు అరియానా, వివియానా.. కొడుకు అవ్రామ్.. 'కన్నప్ప' మూవీలో యాక్ట్ చేశారు. చూస్తుంటే విష్ణు తర్వాత తరాన్ని కూడా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడనమాట.తెలుగు దర్శకుల్లో సుకుమార్ కూతురు సుకృతి.. ఇప్పటికే 'గాంధీ తాత చెట్టు' మూవీలో నటించింది. జాతీయ అవార్డ్ కూడా అందుకుంది. కానీ ఈమెకు మాత్రం మ్యూజిక్ టీచర్ కావాలని ఉందట. డైరెక్టర్ త్రివిక్రమ్ పెద్ద కొడుకు రిషి మనోజ్.. ఇప్పటికే దర్శకత్వంలో మెలకువలు నేర్చుకుంటున్నాడు. ప్రభాస్ 'స్పిరిట్' కోసం సందీప్ రెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నాడట.వీళ్లందరినీ చూస్తుంటే రాబోయే తరంలోనూ నటీనటులతో పాటు మ్యూజిక్ వైపు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. మరి వీళ్లలో ఎవరెవరు ఏమేమవుతారనేది రాబోయే కొన్నేళ్లలో కాలమే నిర్ణయిస్తుంది. -
రాజమౌళి బిగ్ ఈవెంట్.. హోస్ట్‌గా ప్రముఖ యూట్యూబర్!
మహేష్ బాబు - రాజమౌళి కాంబోలో వస్తోన్న యాక్షన్ అడ్వెంచరస్ మూవీ ఎస్ఎస్ఎంబీ29. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు మన దర్శకధీరుడు. ఓ సాంగ్‌ను రిలీజ్ చేయడంతో ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. అయితే ఈ మూవీ టైటిల్‌పై ఫ్యాన్స్‌లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. టైటిల్ ఎప్పుడెప్పుడు రివీల్ చేస్తారా? అని మహేశ్ బాబు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజమౌళి బిగ్ ఈవెంట్ ప్లాన్ చేశారు.హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో బిగ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 15న గ్రాండ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకలో భాగంగా మూవీ టైటిల్‌తో పాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్‌ను రివీల్ చేయనున్నారు. దీంతో భారీగా ఫ్యాన్స్ రానున్న నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి కొన్ని సూచనలు ఇస్తూ ఒక వీడియో విడుదల చేశారు. ఈవెంట్ పాస్‌లు ఉన్నవాళ్లకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చారు.(ఇది చదవండి: మహేష్ బాబు సినిమా ఈవెంట్.. వాళ్లకు నో ఎంట్రీ: రాజమౌళి)అయితే తాజాగా ఈ ప్రతిష్టాత్మక గ్రాండ్ ఈవెంట్‌కు హోస్ట్ ఎవరన్నది కూడా టాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్లకు మన స్టార్ యాంకర్ సుమ ఉండనే ఉంటుంది. సుమతో పాటు ప్రముఖ యూట్యూబర్ ఈ మెగా ఈవెంట్‌కు హోస్ట్‌గా పనిచేయనున్నారు. బాలీవుడ్‌కు చెందిన ఆశిష్ చంచలానీ హోస్ట్‌గా కనిపించనున్నారు. ఈ విషయాన్ని ఓ ఫన్నీ వీడియో ద్వారా మేకర్స్ రివీల్ చేశారు. రాజమౌళితో కలిసి ఈ వీడియోను రూపొందించారు.కాగా.. తొలిసారి రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు గ్లోబ్ ట్రాటర్ అనే టైటిల్ ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ బిగ్ ఈవెంట్లో ఈ విషయాన్ని రివీల్ చేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు దాదాపు 50 వేల మందికి పైగా అభిమానులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నవంబర్ 15న సాయంత్రం 7 గంటలకు జియోహాట్‌స్టార్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. So here we go…⁰@ashchanchlani will host @thetrilight presents the #GlobeTrotterEvent 🔥November 15th - gear up for an exhilarating day of something spectacular.#GlobeTrotterEvent @ssrajamouli @urstrulyMahesh @priyankachopra @PrithviOfficial @mmkeeravaani @SriDurgaArts… pic.twitter.com/RElWGR9uiJ— Sri Durga Arts (@SriDurgaArts) November 13, 2025 -
మహేష్ బాబు సినిమా ఈవెంట్.. వాళ్లకు నో ఎంట్రీ: రాజమౌళి
మహేష్ బాబు , రాజమౌళి సినిమా SSMB29 ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ నెల 15న జరగనుంది. ఈ వేడుకలో భాగంగా మూవీ టైటిల్‌తో పాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్‌ను రివీల్ చేయనున్నారు. దీంతో భారీగా ఫ్యాన్స్ రానున్న నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి కొన్ని సూచనలు ఇస్తూ ఒక వీడియో విడుదల చేశారు. ఈవెంట్ పాస్‌లు ఉన్నవాళ్లకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చారు.'SSMB29 గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ బాగా జరగాలంటే మీ సహకారం చాలా అవసరం. ఈవెంట్ పట్ల క్రేజ్ ఎక్కువ ఉండటంతో పోలీసు వారు ఎక్కువ ఆంక్షలు విధించారు. వాటిని తప్పకుండా మనం పాటించాలి. ఈ కార్యక్రమం బహిరంగంగా జరగడం లేదు. కాబట్టి పాస్‌లు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంటుంది. పాస్‌లు లేకున్నా సరే అనుమతి ఇస్తారని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. వాటిని నమ్మకండి. ఆన్లైన్లో కూడా మేము పాస్‌లు అమ్మడం లేదు. మాకు అనుమతి ఉన్నమేరకు మాత్రమే పాస్‌లు ఇస్తాం. అదే పాస్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఎలా రావాలి అనేది అందులోనే క్లియర్‌గా చెప్పబడింది. దానిని మాత్రమే ఫాలో అవుతూ వేదిక వరకు చేరుకుండి. శనివారం మధ్యాహ్నం 2గంటల నుంచి అనుమతి ఉంటుంది. 18 సంవత్సరాల లోపు పిల్లలతో పాటు సీనియర్ సిటిజన్లుకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. కాబట్టి ఈ కార్యక్రమానికి వారెవరూ రావద్దని కోరుతున్నాను. ఇంటి వద్దే ఉండి జియోహాట్‌స్టార్‌లో లైవ్ ప్రసారంలో చూసేయండి. రీసెంట్గా జరిగిన పలు సంఘటనలను పోలీసులు దృష్టిలో పెట్టుకుని ఎక్కువ ఆంక్షలు విధించారు. కార్యక్రమంలో ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే రద్దు చేస్తామని కూడా కమిషనర్ చెప్పారు. కాబట్టి వారి సూచనలను మనం తప్పకుండా పాటించాలి.' అని ఆయన అన్నారు. వేదిక వద్దకు ఎలా చేరుకోవాలి వంటి అంశాలను వీడియోలో తెలిపారు. Very excited to see you all at the #Globetrotter event on November 15.The RFC main gate will be closed on the event day. Follow the instructions on your entry pass. Cooperate with police and security to ensure a hassle-free, safe, and happy experience for everyone. pic.twitter.com/bG3Hw5XmD8— rajamouli ss (@ssrajamouli) November 13, 2025 -
ఢిల్లీలో పేలుడు.. SSMB29 ఈవెంట్‌పై పడుతుందా..?
మహేష్ బాబు (Mahesh Babu), రాజమౌళి (Rajamouli) సినిమాకు సంబంధించి రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ నెల 15న SSMB29 ఈవెంట్‌ను నిర్వహించనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే, ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుళ్ల ఘటన ఈ కార్యక్రమంపై ప్రభావం చూపనుందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఢిల్లీలో పేలుళ్ల ఘటన తర్వాత దేశవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని రద్దీ ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా సిటీ మెట్రో, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ వంటి ప్రదేశాల్లో సెక్యూరిటీ పెంచారు. అయితే, SSMB29 ఈవెంట్ నిర్వాహుకులపై ఏమైనా ఆంక్షలు పెడుతారనే ఊహాగానాలు వస్తున్నాయి.ఈ నెల 15న ఈ మూవీ టైటిల్‌తో పాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌ను ఘనంగా జరపాలని రాజమౌళి ప్లాన్ చేశారు. ఆమేరకు కొన్ని వారాల ముందే పనులు ప్రారంభించారు.. ఈ కార్యక్రమం కోసం కనీసం లక్షకుపైగానే అభిమానులు రావచ్చని తెలుస్తుంది. అయినప్పటికీ అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఢిల్లీలో బాంబు పేలుళ్లు జరగడంతో అందోళన కలిగిస్తుంది. ఉగ్రవాదులు మరిన్ని పేలుళ్లకు పాల్పడవచ్చనే అనుమానం రావడంతో దేశవ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు. ఆపై దేశవ్యాప్తంగా పలు ఆంక్షలు విధించారు. ఇలాంటి సమయంలో ఇంత పెద్ద ఈవెంట్‌పై కూడా నీలి నీడలు కమ్ముకునేలా ఉంది. భారీగా తరలివచ్చే జనాన్ని కంట్రోల్ చేసి ఈవెంట్ నిర్వహించడం సాధ్యమేనా అనే అనుమానాలు వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తుందా అనే సందేహం కూడా వస్తుంది. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రా వంటి స్టార్స్‌తో పాటు చాలామంది వీఐపీలు పాల్గొంటారు. కాబట్టి జాగ్రత్తలతో పాటు ఫుల్ సెక్యూరిటీ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఆపై పోలీసులను కూడా ఈ కార్యక్రమం కోసం భారీగా మోహరించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈవెంట్ జరిగినా పోలీసుల నుంచి ఎక్కువగా ఆంక్షలు రావచ్చని సమాచారం. -
మహేశ్ బాబు- రాజమౌళి కాంబో.. గన్ను గురిపెట్టిన ప్రియాంక చోప్రా
మహేశ్‌బాబు- రాజమౌళి కాంబోలో యాక్షన్ అడ్వెంచరస్ మూవీని తెరకెక్కిస్తున్నారు. తొలిసారి వీరిద్దరి జతకట్టడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది. ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ చిత్రంలో మందాకిని పాత్రలో బాలీవుడ్ ముద్దుగుమ్మ కనిపించనుంది.ఇటీవలే ఈ మూవీ నుంచి సించారీ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. తాజాగా రిలీజైన ప్రియాంక చోప్రా పోస్టర్ చూస్తే రెండు చేతులతో గన్ పట్టుకుని ఫుల్ అగ్రెసివ్ అండ్ యాక్షన్ మోడ్‌లో కనిపించింది. చీరకట్టులో ప్రియాంక గన్ పట్టుకున్న పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ చూస్తుంటే ప్రియాంక చోప్రా రోల్ పవర్‌పుల్‌గా ఉండనున్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ రోల్ కుంభగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే.మరోవైపు ఈ మూవీకి సంబంధించి బిగ్ ఈవెంట్ ప్లాన్ చేశారు రాజమౌళి. ఈనెల రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్‌గా నిర్వహించన్నారు. ఈ కార్యక్రమాన్ని జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్లో టైటిల్ రివీల్ చేయనున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
రీరిలీజ్ హవా.. 15 రోజుల్లో 6 సినిమాలు!
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో రీరిలీజ్ హవా కొనసాగుతుంది. ముఖ్యంగా తెలుగులో ఈ ట్రెండ్ బాగా నడుస్తోంది. స్టార్ హీరోల సూపర్ హిట్ చిత్రాలు మరోసారి థియేటర్స్‌లో సందడి చేస్తున్నాయి. 4K రీమాస్టర్ వెర్షన్లతో పాత క్లాసిక్ సినిమాలు తిరిగి విడుదల అవుతున్నాయి.ఫ్యాన్స్ వీటిని బాగా ఆదరిస్తున్నాయి. కలెక్షన్స్ కూడా భారీగానే వస్తుండడంతో అందరు హీరోలు ఇప్పుడు ఇదే ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాలన్నీ మరోసారి బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. రానున్న పక్షం రోజుల్లో అరడజనుకు పైగా చిత్రాలు రీరిలీజ్ అవుతున్నాయి.‘శివ’తో ప్రారంభం.. నవంబర్ నెలలో కాంత, ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రాలు మినహా మిగతా పెద్ద చిత్రాలేవి రిలీజ్ కావడం లేదు. చిన్న చిత్రాలు బరిలో ఉన్నప్పటికీ వాటిపై బజ్ క్రియేట్ కాలేదు. దీంతో ఈ గ్యాప్‌ని సొమ్ము చేసుకునేందుకు రెడీ అయ్యారు టాలీవుడ్ నిర్మాతలు. వరసగా పాత చిత్రాలను మళ్లీ థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. ఈ నెలలో మొదటగా రీరిలీజ్ అవుతున్న చిత్రం ‘శివ’. 36 ఏళ్ల కిత్రం(1989) రామ్ గోపాల్‌వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం.. టాలీవుడ్లో హిస్టరీ క్రియేట్ చేసింది. నాగార్జున కెరీర్లో అతి ముఖ్యమైన ఈ సినిమా.. నవంబర్ 14న మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. 4కె ప్రింట్‌తో, డాల్బీ అట్మాస్ సౌండ్ తో రాబోతున్న ఈ కల్ట్ మూవీ.. ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.‘కొదమసింహం’తో మెగాస్టార్.. ‘శివ రిలీజ్ అయిన మరుసటి రోజే.. అంటే నవంబర్ 15న సిద్ధార్థ్-త్రిషల సూపర్ హిట్ చిత్రం ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీలోని పాటలు ఎంత సూపర్ హిట్‌గా నిలిచాయో అందరికి తెలిసిందే. యూత్ టార్గెట్‌గా ఈ మూవీ మరోసారి థియేటర్స్‌లోకి రాబోతుంది.ఇక నవంబర్ 21న మెగాసార్ చిరంజీవి ‘కొదమసింహం’ రీరిలీజ్ కాబోతుంది. . చిరంజీవి నటించిన ఒకే ఒక కౌబాయ్ సినిమా ఇది. 1990, ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సాధించిన "కొదమసింహం" సినిమాను ఈ నెల 21వ తేదీన 4కే కన్వర్షన్, 5.1 డిజిటల్ సౌండింగ్ తో సరికొత్తగా రమా ఫిలింస్ అధినేత కైకాల నాగేశ్వర రావు రీ రిలీజ్ చేస్తున్నారు.వారం గ్యాప్‌లో కోలీవుడ్ బ్రదర్స్కోలీవుడ్ బ్రదర్స్ సూర్య, కార్తికి తెలుగులో భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు హీరోలు వారం గ్యాప్‌లో బాక్సాఫీస్ ముందుకు రాబోతున్నారు. కార్తిని తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర చేసిన చిత్రం ‘ఆవారా’. ఈ మూవీ తర్వాత టాలీవుడ్లో కార్తి మార్కెట్ పెరిగింది. ఇప్పుడు ఈ చిత్రం మరోసారి థియేటర్స్‌లో సందడ చేయబోతుంది. నవంబర్ 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక వారం రోజుల గ్యాప్ తర్వాత కార్తీ బ్రదర్, కోలీవుడ్ హీరో సూర్య ‘సికిందర్’ చిత్రం రీరిలీజ్ కాబోతుంది.ఇక నవంబర్ చివరి వారం(నవంబర్ 29)లో మహేశ్ బాబు ‘బిజినెస్ మెన్’ తో మరోసారి థియేటర్స్‌లోకి వచ్చేస్తున్నాడు. ఇప్పటికే ఒకసారి ఈ చిత్రం రీరిలీజ్ అయింది. అయితే అప్పుడు కొన్ని చోట్ల మాత్రమే రిలీజ్ చేశారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రీరిలీజ్‌కి ప్లాన్ చేసినట్లు సమాచారం. మొత్తంగా రానున్న 15 రోజుల్లో అరడజనుకు పైగా సినిమాలు మరోసారి విడుదల కానున్నాయి. వీటీల్లో ఏ చిత్రం భారీ కలెక్షన్స్‌ని రాబడుతుందో చూడాలి. -
సర్ప్రైజ్.. మహేశ్-రాజమౌళి 'గ్లోబ్ ట్రాటర్' సాంగ్ రిలీజ్
ఇన్నిరోజులు అసలు సినిమా తీస్తున్న విషయమే బయటకు రానీయకుండా జాగ్రత్తపడిన రాజమౌళి.. ఇప్పుడు మాత్రం అన్ని సడన్ సర్ప్రైజులు ఇస్తున్నాడు. ఈనెల 15న హైదరాబాద్‌లో మహేశ్ బాబు 'SSMB29' మూవీకి సంబంధించి భారీ ఈవెంట్ జరగనుంది. దీన్ని హాట్‌స్టార్‌లో ప్రసారం చేయనున్నారు. ఈ క్రమంలోనే మహేశ్, ప్రియాంక చోప్రా వీడియో బైస్ట్ ఇప్పటికే రిలీజ్ చేశారు.అలానే కొన్నిరోజుల క్రితం ఇదే సినిమాలో విలన్‌గా నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కుంభ పాత్రలో కనిపించనున్నట్లు పేర్కొన్నారు. అయితే వీల్ ఛైర్లో ఉన్న పృథ్వీరాజ్ లుక్‌పై చాలా ట్రోల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎలాంటి ప్రకటన లేకుండా 'గ్లోబ్ ట్రాటర్' అనే పాటని రిలీజ్ చేశారు. హీరోయిన్ శ్రుతి హాసన్ దీన్ని పాడటం విశేషం.'సంచారి.. సంచారి' అని సాగే లిరిక్స్.. హీరో గురించి చెప్పకనే చెబుతున్నట్లు ఉన్నాయి. ఈ పాటని సినిమా కోసమే స్వరపరిచారా లేదంటే ఈ వారం జరగబోయే ఈవెంట్ కోసమా అనేది తెలియాల్సి ఉంది. శ్రుతి హాసన్ పాడింది అంటే కచ్చితంగా మూవీలో ఉంటుందనే అనుకోవచ్చేమో? View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) -
జయ కృష్ణ సినిమా.. నిర్మాత, దర్శకుడు ఎవరంటే..
ఘట్టమనేని కుటుంబం నుంచి మరో నటుడు చిత్రపరిశ్రమలోకి వస్తున్నారు. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని గ్రాండ్ లాంచ్ కానున్నారు. తన బాబాయి మహేష్ బాబు ఆశీస్సులతో తొలి సినిమాకు సిద్ధం అవుతున్నాడు. ఆర్ఎక్స్ 100, మంగళవరం చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupathi) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను వైజయంతి మూవీస్‌తో అశ్విని దత్ సమర్పిస్తున్నారు. చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు.గతంలో సూపర్ స్టార్ కృష్ణతో కల్ట్ బ్లాక్‌బస్టర్ అగ్ని పర్వతం చిత్రాన్ని నిర్మించి, తరువాత రాజకుమారుడుతో ప్రిన్స్ మహేష్ బాబును తెలుగు సినిమాకు పరిచయం చేసిన అశ్విని దత్, ఇప్పుడు ఘట్టమనేని నుంచి మరో వారసుడిని వెండితెరకు పరిచయం చేస్తున్నారు. అజయ్ భూపతితో కలిసి మూడవ తరం స్టార్ జయ కృష్ణ ఘట్టమనేనితో ఒక మంచి ప్రేమకథను అశ్విని దత్ నిర్మిస్తున్నారు.జయ కృష్ణ ఇప్పటికే నటనతో పాటు పైట్స్, డ్యాన్స్ వంటి ఇతర నైపుణ్యాలలో శిక్షణ పొందాడు. ఈ ప్రాజెక్ట్ ఇదే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. టైటిల్ వంటి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. తెలుగు సినిమాలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఒక ప్రేమకథను ఈ మూవీలో చూపించనున్నట్లు తెలుస్తోంది. జయ కృష్ణ తండ్రి రమేశ్ బాబు అనారోగ్యం కారణంగా 2022లో కన్నుమూశారు. దీంతో ఆయన కుమారుడి కెరీర్‌ను చూడాల్సిన బాధ్యత మహేష్ బాబు మీద ఉంది.With a Great Story comes Greater Responsibility...Thrilled and honoured to introduce #JayaKrishnaGhattamaneni through my next film 😇🤩From the heart of the hills, a raw, intense and realistic love story, #AB4 Title announcement soon❤️🔥Presented by @AshwiniDuttChProduced by… pic.twitter.com/Fmn2AoYeEU— Ajay Bhupathi (@DirAjayBhupathi) November 9, 2025 -
రాజమౌళి కొత్త సినిమా నుంచి ప్రమోషన్ స్టార్ట్.. మహేష్ బాబు టైటిల్ ఇదేనా?
-
రాజమౌళి సినిమా.. అదిరిపోయేలా 'పృథ్వీరాజ్' ఫస్ట్‌లుక్
మహేశ్‌బాబు (Mahesh Babu), ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajamouli)ల సినిమా #SSMB29 నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. అదిరిపోయే రేంజ్లో ఉన్న ఈ పోస్టర్‌ను చూస్తుంటే ఆయన మరోసారి ఈ మూవీలో సరికొత్తగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.కుంభ పాత్ర గురించి రాజమౌళి కామెంట్#SSMB29 సినిమాలో కుంభ పాత్రలో పృథ్వీరాజ్(Prithviraj Sukumaran) కనిపించన్నున్నారని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఒక వీల్‌చైర్‌లో కూర్చోని రోబో సాయంతో ఒక భారీ ఫైట్ సీన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్‌ను ప్రేరణగా తీసుకుని ఈ పాత్రను డిజైన్ చేశారా అనిపించేలా ఉంది. పృథ్వీరాజ్ పాత్ర గురించి రాజమౌళి ఇలా చెప్పారు. 'పృథ్వీతో మొదటి షాట్ చిత్రీకరించిన తర్వాత, నేను అతని దగ్గరకు వెళ్లి, మీరు నాకు తెలిసిన అత్యుత్తమ నటులలో ఒకరు అని చెప్పాను. ఈ దుష్ట, క్రూరమైన, శక్తివంతమైన విరోధి కుంభకు ప్రాణం పోయడం సృజనాత్మకంగా చాలా సంతృప్తికరంగా ఉంది. పృథ్వీకి ధన్యవాదాలు.' అంటూ ఆయన ఒక పోస్ట్ చేశారు. #GlobeTrotter హ్యాష్‌ట్యాగ్‌తో ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి తీసుకెళ్తున్నారు. నవంబర్ 15న ఒక భారీ ఈవెంట్‌తో #SSMB29 సినిమా టైటిల్‌తో పాటు మహేష్ బాబు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే సుమారు 2 నిమిషాలకు పైగా ఉండే ఒక వీడియోను కూడా అభిమానులతో పంచుకోనున్నారు. ఈ కార్యక్రమాన్ని లైవ్‌లో జియోహాట్ స్టార్ (JioHotstar)లో చూడొచ్చు. ఈ వేడుక కోసం ఇప్పటికే ప్రియాంకచోప్రా హైదరాబాద్ చేరుకున్నారు. After canning the first shot with Prithvi, I walked up to him and said you are one of the finest actors I’ve ever known.Bringing life to this sinister, ruthless, powerful antagonist KUMBHA was creatively very satisfying.Thank you Prithvi for slipping into his chair…… pic.twitter.com/E6OVBK1QUS— rajamouli ss (@ssrajamouli) November 7, 2025 -
SSMB29 టైటిల్ లాక్! బ్లాస్ట్ అవుతున్న సోషల్ మీడియా
-
జక్కన్న ప్లాన్ అదుర్స్.. భారతీయ సినీ చరిత్రలోనే తొలిసారి!
సినిమాను తెరకెక్కించడమే కాదు..దాన్ని జనాలకు రీచ్ అయ్యేలా ప్రచారం చేయడంతో రాజమౌళి(SS Rajamouli) దిట్ట. ఎలా ప్రమోషన్స్ చేస్తే ఒక సినిమా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది? ఎలాంటి ఈవెంట్స్ పెడితే సీనీ ప్రేక్షకులు ఆకర్షితులవుతారు? అనే విషయం జక్కన్నకు బాగా తెలుసు. అంతేకాదు తన ప్రచారాన్ని ఎలా సొమ్ము చేసుకోవాలో కూడా ఆయన తెలిసినట్లుగా మరెవరికీ తెలియదేమో. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలకు జక్కన చేసిన ప్రమోషన్స్ చాలా ప్లస్ అయ్యాయి. దేశవ్యాప్తంగా ఆయన నిర్వహించిన ఈవెంట్స్ రిలీజ్‌కు ముందే సినిమాపై హైప్‌ని క్రియేట్ చేశాయి. ఇప్పుడు మహేశ్‌బాబు సినిమా(SSMB29)ను కూడా స్ట్రాటజీని అప్లే చేయబోతున్నారు. ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారట. టైటిల్ అనౌన్స్మెంట్ మొదలు..టీజర్, ట్రైలర్.. ఇలా పలు ఈవెంట్లను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబోతున్నారు. ఈ నెల 15న సినిమా టైటిల్‌ని ప్రకటించబోతున్నారు. ఈ ఈవెంట్‌ని హైదరాబాద్‌లోని రామోజీఫిల్మ్ సిటీలో నిర్వహించబోతున్నారు.భారీ ధరకు ప్రచార రైట్స్జక్కన్న ఏం చేసిన కొత్తగా ఉంటుంది. అలాగే ప్రతీదీ బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకొనే చేస్తాడు. ప్రమోషన్స్‌కి భారీగా ఖర్చు చేస్తున్న జక్కన్న.. ఆ సొమ్ముని కూడా తిరిగి నిర్మాతకు అప్పగిస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్‌కి అమ్మేశారు. భారీ ధరకు జియోస్టార్ ఈ రైట్స్‌ని కొనుగోలు చేసినట్లు సమాచారం. టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్ మొదలు.. ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఈవెంట్స్‌ని జియోస్టార్‌కు విక్రయించి..ఈ రూపంలోనూ నిర్మాతకు భారీ సొమ్ముని అందించాడట. ఇప్పటివరకు ఏ సినిమా టైటిల్ రివిల్ కార్యక్రమానికి సంబంధించిన హక్కులను ఇలా ఓటీటీ సంస్థలు కొనుగోలు చేయలేదు. కానీ తొలిసారి మహేశ్ బాబు- రాజమౌళి సినిమా విషయంలోనే ఇలా జరగటం విశేషం.(చదవండి: 100 కోడిగుడ్లతో కొట్టించుకున్న స్టార్ హీరో.. ఒక్క మాట అనలేదు!)ఈ నెల 15న జరిగే టైటిల్ రిలీజ్ ఈవెంట్‌కి దాదాపు లక్ష మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ గ్లింప్స్ ని ప్రదర్శించడానికి రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ తెర ఏర్పాటు చేస్తున్నారట. భారతీయ సినీ చరిత్రలో ఇంతవరకు జరగని రీతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారట.టైటిల్ ఇదేనా.. రాజమౌళి ఒక సినిమాను ప్రకటించినప్పుడే వర్కింగ్ టైటిల్‌ని ప్రకటిస్తాడు. అదే టైటిల్‌ని సినిమాకు పెట్టి..అధికారికంగా వెల్లడిస్తాడు. కానీ మహేశ్ బాబు సినిమా టైటిల్ విషయంలో జక్కన్న గోప్యత పాటించాడు. సినిమా పేరు గురించి ఇంతవరకు ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ ‘వారణాసి’అనే టైటిల్‌ని పెట్టబోతున్నట్లు ఆ మధ్య నెట్టింట వైరల్ అయింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసే సినిమాకు అలాంటి సింపుల్ టైటిల్ పెట్టరని చాలా మంది కొట్టిపారేశారు. (చదవండి: 'రాజాసాబ్' వాయిదా రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత)మహేశ్ ఫ్యాన్స్ కూడా పెదవి విరిచారు. కానీ ఈ సినిమాకు ‘వారణాసి’నే టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 15న ఇదే టైటిల్‌ని ప్రకటిస్తారట. ఇప్పటికే ఈ పేరుని మరో నిర్మాత ఫిలిం చాంబర్లో రిజిస్టర్ చేయించుకొన్నాడు . ఆయన అనుమతి కోసం ప్రయత్నిస్తున్నారట. ఒకవేళ అది కుదరకపోతే..‘వారణాసి’ ముందో లేదా వెనకాలో ఏదో ఒక పదాన్ని యాడ్ చేసి నవంబర్ 15న టైటిల్‌ని ప్రకటిస్తారు. టైటిల్ కోసం మహేశ్ ఫ్యాన్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సినీ ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. -
ఇదీ క్రేజ్ అంటే.. జగన్ ర్యాలీలో మహేష్ బాబు ఫ్యాన్స్!
-
మాల్దీవులు ట్రిప్ జ్ఞాపకాలతో సితార (ఫొటోలు)
-
మహేశ్ బాబు సినిమా ఈవెంట్.. ఓటీటీలో లైవ్
మహేశ్‌బాబు(Mahesh Babu) అభిమానులు గుంటూరు కారం సినిమా తర్వాత ఆయన్ను వెండితెరపై మళ్లీ చూసేందుకు ఆశ పడుతున్నారు. ఈ క్రమంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB29 ప్రాజెక్ట్ అప్డేట్ కోసం వారు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే నాలుగు షెడ్యూల్ పైగానే పూర్తి చేసుకుంది. ఒరిస్సా, కెన్యా, వంటి ప్రదేశాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది. నైరోబి, టాంజానియాల్లో కొత్త షెడ్యూల్ కోసం ప్లాన్ చేస్తోంది. అయితే, నవంబర్ 16న సినిమా టైటిల్‌తో పాటు మహేశ్ ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. అందుకోసం గ్రాండ్‌గా ఒక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.SSMB29 ప్రాజెక్ట్ గురించి నవంబర్ 16న హైదరాబాద్‌లో ఒక భారీ ఈవెంట్‌ను ఏర్పాటు చేయాలని రాజమౌళి ఉన్నారట. సినిమా టైటిల్ గ్లింప్స్ వీడియోను ఆవిష్కరించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయనున్నారని తెలుస్తోంది. అయితే, ఈ కార్యక్రమాన్ని అందరూ చూసేందుకు వీలు ఉండేందుకు ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనుందట. ఈ అంశం గురించి త్వరలో అధికారికంగా ప్రకటన కూడా రావచ్చని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా , పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్‌తో పాటు మరికొందరు సెలబ్రిటీలు పాల్గొననున్నారని సమాచారం.ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటివరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి చూపించబోతున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2027 ప్రారంభంలో విడుదల చేయాలని చూస్తోంది. -
రాజమౌళి తర్వాత మరో సెన్సేషనల్ డైరెక్టర్ తో మహేష్ మూవీ
-
ఇచ్చిన మాట నిలబెట్టుకోండి.. రాజమౌళితో మహేశ్ బాబు
మహేశ్ బాబు- ఎస్ఎస్ రాజమౌళి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. నవంబర్‌లో #SSMB29 అప్డేట్ ఇస్తామని గతంలోనే జక్కన్న ఒక పోస్ట్ చేశారు. సినిమా టైటిల్‌తో పాటు మహేశ్ ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని చెప్పడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, నవంబర్ మొదలు కావడంతో సోషల్ మీడియాలో #noveMBerwillbehiSStoRic, #noveMBer వంటి హ్యాష్‌ట్యాగ్స్ వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే మొదట మహేశ్ ఒక ట్వీట్ వేశారు. ఆ తర్వాత రాజమౌళి నుంచి రిప్లై వచ్చింది. అలా ఇద్దరి మధ్య ట్వీట్ వార్ మొదలైంది.#SSMB29 అప్డేట్ కోసం 'ఆల్రెడీ నవంబర్ వచ్చేసింది' అని మహేశ్‌బాబు ట్వీట్ వేశారు.. తాను కూడా ఎదురుచూస్తున్నట్లు కళ్ల ఎమోజీ పెట్టారు. దానికి రాజమౌళి కూడా ఫన్నీగా 'అవును, నవంబర్ వచ్చేసింది. ఈ నెలలో ఏ సినిమాకి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నావ్' అంటూ పంచ్ వేశారు. దీంతో మహేశ్ కూడా 'మీరు ఎప్పటి నుంచో తెరకెక్కిస్తున్న మహాభారతం సినిమాకు ఇద్దాం అనుకుంటున్నాను' అంటూ రిటర్న్ పంచ్ ఇచ్చారు.అయితే, మహేశ్ అసలు విషయానికి వద్దాం అంటూ.. 'ముందుగా నవంబర్‌లో మీరు మాకు ఒక హామీ ఇచ్చారు. దయచేసి ఆ మాట నిలబెట్టుకోండి' అని కోరారు. దీంతో జక్కన్న కూడా 'సరే మహేశ్.. నవంబర్ మొదలైంది ఇప్పుడే కదా.. మేము తప్పకుండా ఒక్కొక్కటిగా వెల్లడిస్తాం' అని సమాధానం ఇచ్చారు.ఇంకా ఎంత సమయం కావాలి సార్ అంటూ జక్కన్నకు మరో ట్వీట్ వేశారు మహేశ్.. '2030లో స్టార్ట్ చేద్దామా..? మన దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా జనవరి నుంచే హైదరాబాద్‌లోని ప్రతి స్ట్రీట్‌లో తనకు నచ్చిన స్టోరీలను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తోంది' అంటూ ప్రియాంక చోప్రాను ట్యాగ్ చేసి మహేశ్ బాబు సెటైర్లు వేశారు.బ్లైండ్‌గా ఏసేస్తా అంటూ ప్రియాంక ఎంట్రీ'హలో హీరో.. సెట్లో నువ్వు నాతో చెప్పిన కథలన్నీ లీక్ చేయాలనుకుంటున్నావా ఏంటి.. నేను ఒక్కసారి మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్‌గా ఏసేస్తా..' అంటూ మహేశ్ బాబుకు అతని స్టైల్లోనే ప్రియాంక చోప్రా రిప్లై ఇచ్చింది. ఇంతలో జక్కన్న ఎంట్రీ ఇచ్చేసి 'ప్రియాంక చోప్రా ఇందులో నటిస్తుందనే విషయాన్ని ఎందుకు బయటపెట్టేశావ్ మహేశ్.. మంచి సర్ప్రైజ్ని ఇద్దాం అనుకుంటే నువ్వు నాశనం చేశావ్' అంటూ పంచ్ వేశారు. ఇంతలో మహేశ్ కూడా మరో పంచ్‌తో తెరపైకి వచ్చారు. 'మీ ఉద్దేశంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఒక సర్ప్రైజ్ అని చెప్పాలనుకుంటున్నావా..' అని మరో లీక్ ఇచ్చేశారు. అప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఒక పోస్ట్ ఇలా చేశారు. 'రాజమౌళి సార్.. నేను ఇలాగే తరుచుగా వెకేషన్ కోసం హైదరాబాద్‌కు వస్తూ ఉంటే.. నా కుటుంబం నన్ను అనుమానించడం స్టార్ట్ చేస్తారు' అని ముగిస్తారు. ఇలా సరదాగా ట్వీట్లతోనే ఈ సినిమాలో నటిస్తున్న వారిని తొలిసారి పరిచయం చేశారు.It’s November already @ssrajamouli 👀— Mahesh Babu (@urstrulyMahesh) November 1, 2025 -
మహేశ్ ఫ్యామిలీ నుంచి రాబోయే 'సినీ' వారసులు (ఫొటోలు)
-
మహేశ్‌తో సందీప్ సినిమా?
మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 2027లో విడుదల కావొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం తర్వాత మహేశ్‌బాబు ఏ దర్శకుడితో సినిమా చేయనున్నారనే చర్చ కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే కొంతమంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పేరు మరోసారి తెరపైకి వచ్చింది.‘అర్జున్ రెడ్డి’ తర్వాత మహేశ్‌బాబుతో ఓ సినిమా చేయాలని సందీప్ రెడ్డి ప్రయత్నాలు చేశారనే వార్త అప్పట్లో ప్రచారమైంది. ఇప్పుడు ఆ సమయం వచ్చిందని, మహేశ్‌బాబు–సందీప్ రెడ్డిల కాంబినేషన్లో ఓ సినిమా రూపోందేందుకు సన్నా హాలు మొదలయ్యాయని భోగట్టా. ఇక ప్రస్తుతం ‘ఎస్ఎస్ఎమ్బీ 29’తో మహేశ్‌బాబు బిజీగా ఉన్నారు. మరోవైపు ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమా చేయనున్నారు సందీప్ రెడ్డి. ఇలా మహేశ్, సందీప్ తమ ప్రస్తుత ్రపాజెక్ట్లను పూర్తి చేసిన తర్వాత వీరి కాంబినేషన్లోని సినిమా పై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
పెళ్లితో ఒక్కటైన తెలుగు సీరియల్ యాక్టర్స్
తెలుగు సీరియల్స్‌లో మనమ్మాయిలు చాలా తక్కువగా కనిపిస్తుంటారు. అలాంటిది 10కి పైగా సీరియల్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు బ్యూడీ సాండ్రా జైచంద్రన్. 19 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్న ఈమె.. తన భర్త మరో అమ్మాయితోనూ రిలేషన్లో ఉన్నాడని విడాకులు ఇచ్చేసింది. తర్వాత సీరియల్స్ చేసుకుంటూ బిజీ అయిపోయింది. ఈ ఏడాది ప్రియుడిని పరిచయం చేసిన ఈమె ఇప్పుడు పెళ్లి కూడా చేసుకుంది.(ఇదీ చదవండి: కాంట్రాక్టర్ పేరు రాజమౌళి.. 'బాహుబలి'పై ప్రశాంత్ నీల్ రివ్యూ)'కలవారి కోడలు' సీరియల్‌తో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన సాండ్రా.. 'ముద్దమందారం', 'శుభస్య శీఘ్రం'లోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం 'ఆటో విజయశాంతి' సీరియల్ చేస్తోంది. అయితే కొన్నాళ్ల ముందు నుంచి 'మనసిచ్చి చూడు', 'శుభస్య శీఘ్రం' సీరియల్స్‌లో హీరోగా చేసిన మహేశ్ బాబు కాళిదాసుతో కలిసి సాండ్రా ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించింది. అలా కలిసి వీళ్లిద్దరూ వీడియోలు కూడా చేస్తూ వచ్చారు.ఈ క్రమంలోనే సాండ్రా-మహేశ్ ప్రేమలో ఉన్నారా అని అంతా అనుకున్నారు. సడన్‌గా ఈ ఏడాది జూలైలో ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. అందరూ అనుకుంటున్నట్లు తాము లవ్‌లో ఉన్నామని వెల్లడించారు. జీవితాంతం ఈ ప్రేమను ఇలాగే కొనసాగించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టులో నిశ్చితార్థం చేసుకోగా.. ఇప్పుడు పెళ్లితో సీరియల్ నటులు ఇద్దరూ ఒక్కటయ్యారు. కొత్త జీవితాన్ని ప్రారంభించారు. సాండ్రా.. సీరియల్స్‌తో పాటు ఆర్య, తకిట తకిట అనే తెలుగు సినిమాల్లోనూ సహాయ పాత్రలు చేసింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'టూరిస్ట్ ఫ్యామిలీ' డైరెక్టర్) -
బాహుబలిపై మహేష్ బాబు కొడుకు షాకింగ్ రివ్యూ
-
మహేశ్ బాబు మాస్ యాక్షన్ మూవీ.. మళ్లీ వచ్చేస్తోంది
సూర్య భాయ్.. ఎలాగోలా ముంబయిలో బతకాలని రాలేదు.. ఈ ముంబయిని ఏలడానికి వచ్చా.. ఈ డైలాగ్ గుర్తుందా? ప్రిన్స్ ఫ్యాన్స్‌కు అయితే వెంటనే చెప్పేస్తారు. ఈ డైలాగ్ మూవీ పేరుతో పాటు క్యారెక్టర్ కూడా వెంటనే గుర్తుకొచ్చేస్తుంది. అంతలా ఈ సినిమాలో డైలాగ్స్ గుర్తుండిపోతాయి. అదేనండి.. మన మహేశ్ బాబు నటించిన మాస్ యాక్షన్ మూవీ బిజినెస్మెన్. అదే సూర్యభాయ్ అంటే పేరు కాదు.. ఇట్స్ ఏ బ్రాండ్ .. ఇలాంటి మళ్లీ వినాలనుకుంటున్నారా? అది థియేటర్లలో మరోసారి వింటే ఎలా ఉంటుంది. అందుకే మీకోసం మళ్లీ వచ్చేస్తున్నాడు సూర్య భాయ్.మరోసారి మిమ్మల్ని అలరించేందుకు సూర్య భాయ్ వస్తున్నాడు. పూరి జగన్నాధ్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. 2012లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మాస్ యాక్షన్ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. వచ్చేనెల నవంబర్ 29న ఈ మూవీ రీ రిలీజ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను 4కె వర్షన్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 46 years of Superstar @urstrulyMahesh in Telugu Cinema will be celebrated with the re-release of #Businessman💥#Businessman4K - noveMBer 29th, 2025 🦁#BusinessmanReRelease@MsKajalAggarwal #PuriJagannadh @musicthaman #RRMakers @MangoMassMedia #TeluguFilmNagar pic.twitter.com/m0D3yel12t— Telugu FilmNagar (@telugufilmnagar) October 30, 2025 -
మహేశ్ ఫ్యామిలీ నుంచి 'ఏడుగురు' వారసులు
ఇండస్ట్రీలో ఒకే కుటుంబం నుంచి ఎక్కువమంది వారసులు అనగానే మెగా లేదంటే నందమూరి ఫ్యామిలీలే గుర్తొస్తాయి. అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల నుంచి హీరోలు ఉన్నప్పటికీ వేళ్లపై లెక్కపెట్టేంత మంది ఉన్నారు. త్వరలో ఈ లిస్టులోకి ఘట్టమేనేని కుటుంబం కూడా చేరనుంది. ఎందుకంటే ఒకరిద్దరు కాదు ఏకంగా ఏడుగురు వరకు వారసులు.. రాబోయే కొన్నేళ్లలో ఇండస్ట్రీలోకి రాబోతున్నారు. ఇంతకీ వాళ్లెవరు? ఏంటి సంగతి?(ఇదీ చదవండి: 'బాహుబలి', 'మాస్ జాతర' కోసం సైడ్ అయిపోయిన హీరో)సూపర్‌స్టార్ కృష్ణ వారసుడిగా రమేశ్ బాబు, మహేశ్ బాబు ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే హీరోగా ఒకటి రెండు సినిమాలు చేసినప్పటికీ రమేశ్ బాబు పెద్దగా నిలదొక్కుకోలేకపోయాడు. మహేశ్ బాబు మాత్రం స్టార్ హీరో అయిపోయాడు. ప్రస్తుతం రాజమౌళితో మూవీ చేస్తున్నాడు. మహేశ్ అక్క మంజుల పలు చిత్రాల్లో సహాయ పాత్రలు చేశారు తప్పితే హీరోయిన్ కాలేకపోయారు.తర్వాత తరానికి వస్తే.. మహేశ్ బాబు చెల్లి ప్రియదర్శని భర్త సుధీర్ బాబు ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్నాడు. గల్లా జయదేవ్ కొడుకు అంటే మహేశ్‌కి మేనల్లుడు అశోక గల్లా కూడా హీరోగా రెండు మూడు మూవీస్ చేశాడు. కాకపోతే పెద్దగా గుర్తింపు రాలేదు. వీళ్ల కాకుండా ఇప్పుడు తర్వాత తరం కూడా చాలామంది సిద్ధమైపోయారు. కొందరు అవుతున్నారు.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)ముందుగా మహేశ్ కొడుకు గౌతమ్ విషయానికొస్తే ప్రస్తుతం అమెరికాలో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. త్వరలోనే ఎంట్రీ ఉండొచ్చు. కూతురు సితార ఇప్పటికే తండ్రితో కలిసి పలు యాడ్స్ చేసింది. సినిమాల్లోని పాటల్లోనూ అతిథిగా కనిపించింది. ఈమెది ఇంకా చిన్న వయసే. కాబట్టి హీరోయిన్ కావడానికి ఇంకా చాలా టైమ్ ఉంది.మహేశ్ బాబు అన్న రమేశ్ బాబు కొడుకు జయకృష్ణ ఇప్పటికే హీరోగా తొలి సినిమా చేసేందుకు సిద్ధమైపోతున్నాడు. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి తీయబోయే కొత్త సినిమాతో జయకృష్ణ హీరోగా పరిచయం కానున్నాడని టాక్. రమశ్ బాబు కుమార్తె భారతి కూడా నటి అయ్యేందుకు ఆసక్తి ఉందని తెలుస్తోంది.తాజాగా మహేశ్ సోదరి మంజుల కూడా తన కూతురు జాన్వి.. త్వరలో సినిమాల్లోకి రానుందని చెబుతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ఈమె కూడా త్వరలోనే హీరోయిన్ అయ్యేలా కనిపిస్తుంది. మరోవైపు సుధీర్ బాబు కూడా తన కొడుకుల్ని ఇండస్ట్రీలోకి తీసుకొస్తానని చాన్నాళ్ల క్రితమే చెప్పాడు. అందుకు తగ్గట్లే పెద్ద కొడుకు చరిత్ మాసస్.. ఇప్పటికే అన్ని రకాల ట్రైనింగ్ తీసుకుంటుండగా.. చిన్న కొడుకు దర్శన్ కూడా 'ఫౌజీ'లో యంగ్ ప్రభాస్‌గా కనిపించబోతున్నాడని టాక్.పైన చెప్పిన లిస్ట్ చూస్తే ఒకరిద్దరూ కాదు ఏకంగా ఏడుగురు వారసులు.. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి రాబోయే కొన్నేళ్లలో ఇండస్ట్రీలోకి రాబోతున్నారనమాట. మరి వీళ్లలో ఎవరు ఎప్పుడొస్తారు? ఎవరు నిలదొక్కుకుంటారనేది చూడాలి?(ఇదీ చదవండి: నేను కూడా చిరుతో అప్పట్లో అనుకున్నా.. కానీ: మాళవిక మోహనన్) -
ఒంటరిగా మాల్దీవులు టూర్లో నమ్రత (ఫొటోలు)
-
హీరోయిన్గా మహేశ్‌బాబు మేనకోడలు ఎంట్రీ
తెలుగు సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరొకరు వెండితెరపై అడుగుపెట్టబోతున్నారు. మహేశ్ మేనకోడలు జాన్వీ స్వరూప్ (Jaanvi Swarup Ghattamaneni) త్వరలోనే బిగ్స్క్రీన్పై కనిపించనుంది. మహేశ్‌బాబు అక్క మంజుల ఘట్టమనేని (Manjula Ghattamaneni)- సంజయ్ స్వరూప్ దంపతుల కూతురే జాన్వీ స్వరూప్. తన సినీఎంట్రీని మంజుల సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.ప్రపంచం ఎదురుచూస్తోంది'నా చిన్నారి జాన్వీ ఎంత ఎదిగిపోయిందో! ఇప్పుడు రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. తనకు మంచి మనసుతో పాటు అద్భుతమైన టాలెంట్ ఉంది. అవన్నీ త్వరలోనే ప్రపంచం చూడబోతోంది. నీకోసం వెండితెర ఎదురుచూస్తోంది మై డార్లింగ్.. ఐ లవ్యూ సో మచ్. హ్యాపీ బర్త్‌డే మై జాను' అంటూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా జాన్వి చిన్నవయసులో ఓ సినిమా చేసింది. తల్లి మంజుల ఘట్టమనేని దర్శకత్వం వహించిన మనసుకు నచ్చింది (2018) సినిమాలో తొలిసారి కెమెరా ముందుకు వచ్చింది. ఈ మూవీకి మహేశ్‌బాబు వాయిస్ ఓవర్ ఇచ్చాడు.పేరెంట్స్ కూడా యాక్టర్సే!జాన్వీ పేరెంట్స్ మంజుల- సంజయ్ స్వరూప్ కూడా యాక్టర్సే! మంజుల.. షో, కావ్యాస్ డైరీ, ఆరెంజ్, సేవకుడు, మళ్లీ మొదలైంది, హంట్, మంత్ ఆఫ్ మధు చిత్రాల్లో నటించింది. దర్శకురాలిగా మనసుకు నచ్చింది అని ఒకే ఒక్క మూవీ చేసింది. షో, నాని, పోకిరి, ఏ మాయ చేసావె వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించింది. సంజయ్ స్వరూప్.. అర్జున్ రెడ్డి, చల్ మోహనరంగ వంటి పలు చిత్రాల్లో సహాయ నటుడిగా మెప్పించాడు. View this post on Instagram A post shared by Manjula Ghattamaneni (@manjulaghattamaneni)చదవండి: కుటుంబంతో సహా చనిపోదామనుకున్నా.. ఆ హీరో వల్లే బతికా! -
మైత్రీ మేకర్స్ మాస్టర్ ప్లాన్.. మహేష్ బాబు ఓకే అంటే!
-
మహేష్ ఎక్కడ? నమ్రతకు ఫ్యాన్స్ ప్రశ్న...!
దీపావళి పండుగ సెలబ్రిటీలకు చాలా ఇష్టమైన పండుగ అని చెప్పొచ్చు. వ్యక్తిగతంగా జరుపుకోవడం మాత్రమే కాదు బిజీ జీవితంలో అరుదుగా మాత్రమే కలవగలుగుతున్న సన్నిహితులకు, పరిచయస్థులకు దీపావళి బాష్ పేరిట పార్టీలు ఇవ్వడానికి కూడా ఇదే చక్కని సందర్భంగా స్టార్స్ భావిస్తారు. దాంతో ఈ సమయంలో దీపావళి పార్టీలు జోరుగా సాగుతాయి. మన టాలీవుడ్‌తో పోలిస్తే బాలీవుడ్లో ఇవి ఒక సంప్రదాయంగా మారిపోయాయి. ఈ నేపధ్యంలో ముంబైలో ఝాన్సీరెడ్డి అనే సన్నిహితులు ఇచ్చిన ఈ పార్టీకి పలువురు బంధుమిత్రులతో పాటు మన సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోడ్కర్ కూడా హాజరయ్యారు. ఈ పార్టీకి ఆమె సోదరి శిల్పా శిరోడ్కర్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్లు ఇద్దరూ పార్టీలో సరదాగా గడుపుతూ సందడి చేశారు. ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ పార్టీలో మహేష్, నమ్రతల కుమార్తె తాజా యాడ్ వరల్డ్ యంగెస్ట్ సెన్సేషన్ సితార కూడా పాల్గొంది.ఈ సందర్భంగా నమ్రత తమ ఘట్టమనేని అభిమానులతో తన దీపావళి వేడుకల విశేషాలను పంచుకున్నారు. తన కుమార్తె సితార ఘట్టమనేని సోదరి శిల్పా శిరోద్కర్‌తో తాము కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు.ఆ ఛాయా చిత్రాలను పంచుకుంటూ, నమ్రత ‘వెచ్చదనం, వెలుగులు అద్భుతమైన వ్యక్తులతో నిండిన సాయంత్రం... నిజంగా మరపురాని దీపావళి రాత్రులు... మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు‘ అంటూ క్యాప్షన్‌లో రాశారు. ఈ ఫొటోలో హైదరాబాద్ నగర ప్రముఖులు పింకీ రెడ్డి వంటివారు కూడా నమ్రత బృందంలో కనిపించారు. అయితే సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? తమ అభిమాన కధానాయకుడు లేకుండా ఆయన భార్య వేడుకలు జరుపుకుంటే.. అడగకుండా ఉంటారా? అందుకే ఆ ఫొటోల కింద కామెంట్లు వెల్లువెత్తాయి. మహేష్ బాబు ఎక్కడ అంటూ పలువురు ఫ్యాన్స్ ప్రశ్నలు కురిపించారు. ఒకరు, ‘మన సూపర్ స్టార్ ఎక్కడ?‘ అని ఆరా తీయగా మరికొందరు, ‘బాబు ఎక్కడ‘ అనీ అడిగారు. నమ్రతను తన కుమార్తెతో కలిసి ఉన్న మరిన్ని ఫోటోలను షేర్ చేయమని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు అభ్యర్ధించారు. మరోవైపు రాజమౌళి తీస్తున్న సినిమా షూటింగ్లో మహేష్ ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
మాంచెస్టర్ సిటీని కుదిపేసిన 'అతడు'.. దటీజ్ మహేశ్ బాబు
పశ్చిమ ఆఫ్రికాలోని ఐవోరియన్ దేశానికి చెందిన ఫుట్‌బాల్ ఆటగాడు 'యాయా టౌరే' నెట్టింట వైరల్ అవుతున్నాడు. అందుకు ప్రధాన కారణం మహేష్ బాబు అతడు సినిమానే కావడం విశేషం. వివిధ మ్యాచ్‌లలో ఆయన చేసిన గోల్స్ ఒక వీడియోగా క్రియేట్ చేసి దానికి అతడు సినిమా బిజీఎమ్ను జోడించారు. ఆపై ఆడు మగాడ్రా బుజ్జి అంటూ తనికెళ్ల భరణి చెప్పే ఎలివేషన్ డైలాగ్స్‌ను కూడా మిక్స్ చేశారు. అయితే, ఆ వీడియోను చిన్నాచితక పేజీ షేర్ చేయలేదు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్‌బాల్ జట్టు మాంచెస్టర్ సిటీ (ఇంగ్లాండ్) తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. 'పెను తుఫాను తలొంచి చూసే… తొలి నిప్పు కణం అతడే ' అంటూ తెలుగు డైలాగ్‌ను కూడా షేర్ చేసింది. 56 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న ఆ పేజీలో ఒక తెలుగు సినిమాకు చెందిన బీజీఎమ్‌తో పాటు అతడు సినిమాలో తనికెళ్ల భరణి చెప్పిన డైలాగ్స్ చేర్చడం విశేషం.ప్రపంచంలోని అత్యుత్తమ ఫుట్‌బాల్ జట్టుగా పేరుగాంచిన మాంచెస్టర్ సిటీ(Manchester City).. ప్రతిష్ఠాత్మకమైన ఫిఫా క్లబ్ వరల్డ్ కప్(FIFA Club World Cup)- 2023 చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ టీమ్‌కు చెందిన సోషల్‌మీడియా పేజీలో టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు సినిమాకు సంబంధించిన డైలాగ్స్‌ను పంచుకోవడం గొప్ప విషయం. ఇప్పటికే ఆ వీడియో ఒక మిలియన్ వ్యూస్ చేరుకుంది.మాంచెస్టర్ సిటీ షేర్ చేసిన వీడియోలో యాయా టౌరే కొడుతున్న గోల్స్‌కు తనికెళ్ల భరణి డైలాగ్స్ జత కావడంతో ట్రెండ్ అవుతుంది. యాయా టౌరే ప్రస్తుతం సౌదీ అరేబియా జాతీయ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా ఉన్నాడు . View this post on Instagram A post shared by Manchester City (@mancity) -
'నువ్వే కావాలి'@25.. ఒక ట్రెండ్ సెట్టర్.. కానీ, వదిలేసిన స్టార్ హీరో
తెలుగు సినిమా చరిత్రలో ‘నువ్వే కావాలి’ సినిమా చెరగని ముద్ర వేసింది. ఈ చిత్రం విడుదలై నేటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2000 సమయంలోని యూత్‌కు ఈ సినిమాతో ఎన్నో తీపి గుర్తులు తప్పకుండా ఉంటాయని చెప్పవచ్చు. ఆ సమయంలో యూత్‌ను బాగా ఆకర్షించిన చిత్రాల్లో నువ్వే కావాలి ముందు వరుసలో ఉంటుంది. కె.విజయభాస్కర్ దర్శకత్వానికి త్రివిక్రమ్ రచనా శైలి మరింత బలాన్ని ఇచ్చింది. ఆపై కోటి అందించిన అద్భుతమైన సంగీతం ఇప్పటి తరం యూత్‌ను కూడా మెప్పిస్తుంది.తరుణ్ బాల నటుడిగా దాదాపు 30 సినిమాలు చేశాడు. కానీ, హీరోగా ఆయనకు ఇదే తొలి సినిమా.. హీరోయిన్గా రిచా నటించగా మరో కీలకమైన పాత్రలో సాయి కిరణ్ నటించారు. మలయాళంలో భారీ విజయం సాధించిన ‘నిరం’ చిత్రానికి రీమేక్‌గా నువ్వే కావాలి తెలుగులో విడుదలైంది. అయితే, ఈ మూవీ ఇక్కడ కూడా కొన్ని థియేటర్స్‌లలో 400 రోజులు కూడా ఆడింది. 20 సెంటర్స్‌కు పైగానే 200రోజులు పాటు రన్ అయింది. ఆరు సెంటర్స్‌లలో 365రోజులు ప్రదిర్శించారు.ఈ చిత్రం అక్టోబరు 13, 2000న విడుదలైంది. మొదట్లో ఈ చిత్రానికి తక్కువ థియేటర్లే దక్కాయి. హిట్ టాక్ రావడంతో రెండో వారం నుండి ఎక్కువ థియేటర్లలో విడుదల చేశారు. సుమారు మూడు కోట్లమందికి పైగా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసినట్లు ఒక అంచనా. రూ. 1.3 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం 24 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ చిత్ర విజయంతో స్రవంతి రవికిషోర్ ఆర్థిక కష్టాలు కూడా తీరిపోయాయని చెబుతారు. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి ఆయన ఎక్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించాడు.ఈ సినిమాకు ఫస్ట్ చాయిస్ మహేష్ బాబు ఈ సినిమా హీరో ఎంపిక ఎలా జరిగిందో గతంలో నిర్మాత రవికిషోర్ ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. ఒక మంచి యువ నటుడితో బడ్జెట్లో సినిమా తీసి లాభాలు అందుకోవాలని రవికిషోర్ ఆలోచన. అప్పుడే మహేష్ బాబు కథానాయకుడిగా ప్రవేశించారు. రాజకుమారుడు సినిమా విడుదలై యువరాజు షూటింగ్ జరుగుతుంది. ఆ సమయంలోనే 'నిరం' చిత్రం చూడమని మేకర్స్ ప్రింట్ పంపించారు. రెండు నెలలయినా ఆయన నుంచి స్పందన రాలేదు. రెండో ప్రత్యామ్నాయంగా సుమంత్ అనుకున్నారు. కానీ సుమంత్ అప్పటికే యువకుడు, పెళ్ళిసంబంధం చిత్రాల్లో నటిస్తూ ఖాళీ లేకుండా ఉన్నాడు. తర్వాత రాం గోపాల్ వర్మ హిందీ సినిమా మస్త్లో నటిస్తున్న ఆఫ్తాబ్ శివదాసానీని కూడా పరిశీలించారు. అయితే, తమ బడ్జెట్లో అయ్యేలా కనిపించలేదు. చివరగా కొత్త వాళ్ళతో సినిమా తీయాలని రవికిషోర్ నిర్ణయించుకున్నాడు. బాలనటుడిగా కొన్ని సినిమాల్లో నటించిన తరుణ్ పెద్దయిన తర్వాత ఒక వ్యాపార ప్రకటనలో కనిపించాడు. తరుణ్ కుటుంబం కూడా అతన్ని కథానాయకుడిగా ప్రవేశ పెట్టాలని ఆలోచిస్తున్నారు. అప్పుడే రవికిషోర్ తమ సినిమాను గురించి చెప్పి అతన్ని ఒప్పించారు. ఆ సినిమాకు తరుణ్ పారితోషికం రూ. 3 లక్షలు. కథానాయిక కోసం చాలా వెతుకులాట జరిగింది. చివరికి వద్దనుకున్న ఫోటోల్లో మళ్ళీ వెతుకుతుంటే రిచా సరిపోతుందనిపించింది. రెండో కథానాయకుడిగా గాయకుడు రామకృష్ణ కొడుకు సాయికిరణ్‌ను ఎంచుకున్నారు.సినీ ట్రెండ్ సెట్టర్: ఈ చిత్రం తెలుగు ప్రేమకథా చిత్రాల ధోరణిని మార్చిన సినిమా. వాస్తవికత, సహజమైన సంభాషణలు, యువతరాన్ని ఆకట్టుకునే కథనంతో కొత్త ఒరవడిని తీసుకొచ్చింది. ఈ సినిమా తరుణ్, త్రివిక్రమ్, విజయభాస్కర్, కోటి వంటి ప్రతిభావంతుల కెరీర్‌కు మైలురాయిగా నిలిచింది. హిందీ రీమేక్: ఈ సినిమా తుఝే మేరీ కసమ్ అనే పేరుతో హిందీలో పునర్నిర్మించబడింది, ఇందులో జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్ నటించారు.‘నువ్వే కావాలి’ సినిమాకు జాతీయ అవార్డు లభించింది. ఇది 2000 సంవత్సరానికి ‘ఉత్తమ తెలుగు చిత్రం’గా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకుంది.నంది అవార్డులు:- ఉత్తమ కథానాయకుడు – తరుణ్- ఉత్తమ కథానాయిక – రిచా పల్లోడ్- ఉత్తమ దర్శకుడు – కె. విజయభాస్కర్- ఉత్తమ రచయిత – త్రివిక్రమ్ శ్రీనివాస్- ఉత్తమ సంగీత దర్శకుడు – కోటి- ఉత్తమ చిత్రం – ఉషాకిరణ్ మూవీస్ -
రాజమౌళికి 'జక్కన్న' పేరు ఎవరు పెట్టారో తెలుసా? (ఫోటోలు)
-
SSMB 29 బిగ్ అప్డేట్.. మూవీ టైటిల్ ఇదే..!
-
టైటిల్ ప్లీజ్ గురూ!
ఒక సినిమాకు అందులోని హీరో, దర్శకుడు, హీరోయిన్ సెంట్రాఫ్ ఎట్రాక్షన్‌గా ఉంటారు. అలాగే ఆ సినిమా ప్రేక్షకులకు చేరువ కావడానికి, మరింత ప్రమోషన్‌కు ఆ సినిమా టైటిల్ చాలా ముఖ్యం. అందుకే టైటిల్ విషయంలో చాలా కేర్ తీసుకుంటుంది యూనిట్. స్టార్ హీరో సినిమా అయితే ఏ టైటిల్ పెడతారా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఆ కోవకు చెందిన తెలుగు చిత్రాలు పదికి పైనే ఉన్నాయి.ఈ చిత్రాలకు వర్కింగ్ టైటిల్స్ ఉన్నప్పటికీ, హీరో అభిమానులు ఒరిజినల్ ‘టైటిల్ ప్లీజ్ గురూ..!’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇందుకు తగ్గట్లుగానే ఆయా చిత్రబృందాల మేకర్స్ కొన్ని టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారు. మరి... ఏ హీరో సినిమాకు, ఏ టైటిల్ పరిశీలిస్తున్నారనే విషయంపై మీరూ ఓ లుక్ వేయండి.కింగ్ 100నాగార్జున కెరీర్‌లోని వందో సినిమా షూటింగ్ పనులు ఊపందుకున్నాయని తెలిసింది. తమిళ దర్శకుడు ఆర్ఏ కార్తీక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైందని సమాచారం. నాగార్జున పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట మేకర్స్. ఈ సినిమా టైటిల్‌ను గురించి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.నాగార్జున కెరీర్‌లోని ఈ వందో సినిమాకు ‘కింగ్ 100’, ‘కింగ్ 100 నాటౌట్’, ‘లాటరీ కింగ్’ అనే టైటిల్స్ తెరపైకి వచ్చాయి. మరి... ఈ టైటిల్లో ఏ టైటిల్‌ని ఖరారు చేస్తారో మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే... నాగార్జున హీరోగా నటించిన ‘మన్మథుడు 2’ సినిమాలో కీర్తీ సురేష్ ఓ చిన్న గెస్ట్ రోల్ చేశారు. అలాగే కథ రీత్యా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్‌కు చాన్స్ ఉందట.కీర్తీ సురేష్ ఓ లీడ్ హీరోయిన్గా చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఇంకా నాగార్జున, టబుల కాంబినేషన్లో ‘నిన్నే పెళ్లాడతా’ ఎంతటి బ్లాక్‌బ స్టర్ హిట్ సాధించిందో తెలిసిందే. నాగార్జున వందో సినిమాలోనూ టబు భాగమయ్యారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ విషయాలపై పూర్తి స్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్‌పై నాగార్జున నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది.ఆనంద నిలయం? హీరో వెంకటేశ్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా రానుంది. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చిన బాబు) నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు చెందిన ఫొటోషూట్ కూడా జరిగింది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుందని తెలిసింది. వెంకటేశ్ కెరీర్‌లోని ఈ 77వ సినిమా ప్రధాన కథాంశం వైజాగ్ నేపథ్యంలో సాగుతుందని, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించనున్నారని సమాచారం.కాగా, ఈ సినిమా టైటిల్ ఇదంటూ పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ చిత్రానికి ‘ఆనంద నిలయం’, ‘వెంకట రమణ’, ‘వెంకటరమణ కేరాఫ్ ఆనంద నిలయం’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లుగా ఫిల్మ్‌నగర్ సమాచారం. కాగా, త్రివిక్రమ్ దర్శకత్వంలోని సినిమాల టైటిల్స్ ప్రధానంగా ‘అ ఆ’ అక్షరాలతోనే ప్రారంభం అవుతుంటాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ‘ఆనంద నిలయం’ అనే టైటిల్ తెరపైకి రావడం ఆసక్తికరమైన విషయం.మరోవైపు వెంకటేశ్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రాలు ‘మల్లీశ్వరి’ ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలకు త్రివిక్రమ్ రైటర్‌గా పని చేశారు. ఇప్పుడు వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ సినిమా చేస్తున్న నేపథ్యంలో ఈ మూవీపై ఇటు ఇండస్ట్రీలో అటు ఆడియన్స్‌లో అంచనాలు ఉండటం సహజం. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.భర్త మహాశయులకు విజ్ఞప్తి‘భర్త మహాశయులకు విజ్ఞప్తి, రోల్ మోడల్, అనార్కలి’... ఇప్పటివరకు రవితేజ 76వ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న టైటిల్స్ ఇవి. ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమాను కిశోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ స్పెయిన్‌లో జరుగుతోంది. కొంత టాకీ పార్టుతో పాటు పాటలను కూడా చిత్రీకరిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.పైగా, ఈ మూవీని వచ్చే సంక్రాంతికే విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్‌ను అతి త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తారని ఊహించవచ్చు. మరి... ప్రచారంలో ఉన్న టైటిల్స్‌లో ఏదో ఒకటి రవితేజ 76వ సినిమాకు ఫిక్స్ అవుతుందా? లేక మరో టైటిల్ ఏదైనా తెరపైకి వస్తుందా? అనేది చూడాలి.వారణాసిహీరో మహేశ్‌బాబు–దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ అనే వర్కింగ్ టైటిల్ ఉంది. అయితే ‘రాజకుమారుడు’, ‘జెన్ 63’ వంటి టైటిల్స్ తెరపైకి వచ్చాయి. తాజాగా ఈ సినిమాకు ‘వారణాసి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.ఈ భారీ బడ్జెట్ సినిమా కోసం దాదాపు రూ. 50 కోట్లతో చిత్రయూనిట్ హైదరాబాద్ శివార్లలో ‘వారణాసి’ సినిమా సెట్స్ వేయడం, ఈ సినిమాకు కాశీ బ్యాక్‌డ్రాప్ ఉంటుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ‘వారణాసి’ అనే టైటిల్ తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. కాగా, నవంబరు నెలలో ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ సినిమా అప్డేట్ను విడుదల చేస్తామని ఇటీవల రాజమౌళి అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నవంబరులో ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ టైటిల్ అనౌన్స్‌మెంట్‌నే అని, ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కావొచ్చని, ఇందుకోసం నవంబరు రెండో వారంలో ఓ పెద్ద ఈవెంట్‌ను రాజమౌళి అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం.ప్రస్తుతం ‘బాహుబలి: ది ఎపిక్’ సినిమా పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో ఉన్నారు రాజమౌళి. ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. దీంతో నవంబరులో మళ్లీ ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు రాజమౌళి. నవంబరులో మహేశ్‌బాబు, ప్రియాంకా చోప్రాలపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని, ఓ పాట చిత్రీకరణ కూడా ఉంటుందని, డిసెంబరులో చిత్రయూనిట్ కెన్యాకు వెళ్లనుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.ఫౌజి... బ్రహ్మరాక్షసప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజాసాబ్’ సినిమా సెట్స్‌లో ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ యూరప్‌లో జరుగుతోంది. సాంగ్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాతో పాటు దర్శకుడు హను రాఘవపూడితో ప్రభాస్ ఓ పీరియాడికల్ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఇందులో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తుండగా, మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ ఇతర ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ‘ప్రభాస్హను’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది.కాగా, ఈ సినిమాకు మేకర్స్ ‘ఫౌజి’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని, త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ రానుందని, వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయిని తెలిసింది. వచ్చే ఏడాది సెకండాఫ్‌లో ఈ సినిమా థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. అలాగే దర్శకుడు ప్రశాంత్ వర్మతో హీరో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నారని, ఈ సినిమాకు ‘బ్రహ్మరాక్షస’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.డ్రాగన్హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలిసి ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా సినిమా చేస్తున్నారు. ‘ఎన్టీఆర్‌నీల్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. కన్నడ దర్శక– నటుడు రిషబ్ శెట్టి, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణకు చిన్న బ్రేక్ పడింది. ఓ యాడ్ షూటింగ్లో ఎన్టీఆర్ గాయపడ్డారు. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకున్న తర్వాత ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది.నెక్ట్స్ షూటింగ్ షెడ్యూల్ విదేశాల్లో జరుగుతుందని, ముందుగా యూకేలో ప్లాన్ చేశారని ఫిల్మ్‌నగర్ సమాచారం. కాగా, ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తారట. కల్యాణ్‌రామ్, నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 25న విడుదల కానుంది.బ్లడీ రోమియో!సిల్వర్ స్క్రీన్‌పై నాని ఓ రోమియోగా కనిపించనున్నారట. నాని హీరోగా సుజిత్ డైరెక్షన్లో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం రానుంది. ఇందులో ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ దసరా సందర్భంగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ సినిమాకు ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారని తెలిసింది.లవ్, యాక్షన్ ప్రధానాంశాలుగా ఈ చిత్రం కొనసాగుతుందట. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ఈ టైటిల్ అయితే బాగుంటుందని మేకర్స్ అనుకుంటున్నారని తెలిసింది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్, యునానిమస్ ప్రోడక్షన్స్ పతాకాలపై నాని, వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే సుజిత్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తోంది.కొరియన్ కనకరాజు? సిల్వర్ స్క్రీన్‌పై వరుణ్ తేజ్ దెయ్యాలను ఎలా అదుపు చేస్తారనే విషయం వచ్చే ఏడాది వెండితెరపై చూడొచ్చు. వరుణ్ తేజ్ హీరోగా మేర్ల పాక గాంధీ దర్శకత్వంలో ఓ హారర్ కామెడీ చిత్రం రూ పొందుతోంది. ఈ చిత్రంలో హాస్యనటుడు సత్య ఓ కీ రోల్ చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. కాగా, ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారని, త్వరలోనే ఈ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించే చాన్సెస్ ఉన్నాయని ఫిల్మ్‌నగర్ భోగట్టా.స్లమ్ డాగ్విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘పూరీ సేతుపతి’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్గా నటిస్తుండగా టబు, దునియా విజయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో బెగ్గర్‌గా విజయ్ సేతుపతి, విలన్‌గా టబు నటిస్తున్నారని తెలిసింది. వచ్చే వారం ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.ఈ సెప్టెంబరు 28న పూరి జగన్నాథ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను అధికారంగా ప్రకటించాలనుకున్నారు మేకర్స్. కానీ తమిళనాడులో జరిగిన కరూర్ దుర్ఘటన కారణంగా టైటిల్ రిలీజ్ ఈవెంట్‌ను క్యాన్సిల్ చేశారు మేకర్స్. అయితే ఈ సినిమాకు ‘స్లమ్ డాగ్, బెగ్గర్, భవతీ భిక్షాందేహి’ అనే టైటిల్స్‌ను పరిశీలించారట. త్వరలోనే ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. పూరి జగన్నాథ్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా, చార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతం అందిస్తారు. ఇలా రెండు, మూడు టైటిల్స్‌ను పరిశీలిస్తూ, త్వరలోనే ఓ టైటిల్‌ను ప్రకటించనున్న మరికొన్ని సినిమాలు ఉన్నాయి.‘చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా... చూస్తావా నా మైనా’... ఈ పాట వినగానే, ‘ఏప్రిల్ 1 విడుదల’ సినిమా గుర్తుకు వస్తుంది. కానీ ‘చుక్కలు తెమ్మన్నా... తెంచుకురానా..’ అనే టైటిల్‌తో ఓ ఉమెన్ సెంట్రిక్ సినిమా రానుందని, వైజయంతీ మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. అలాగే ఈ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌లోని ప్రధాన పాత్ర పోషించేందుకు భాగ్యశ్రీ భోర్సే, శ్రీలీల వంటి వార్ల పేర్లను పరిశీలిస్తున్నారట మేకర్స్. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. – ముసిమి శివాంజనేయులు -
SSMB29: మహేశ్-ప్రియాంకతో ఫోక్ సాంగ్.. టైటిల్ ఇదే!
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli), సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) కాంబినేషన్లో ఓ సినిమా(SSMB 29) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్‌పై ఇప్పటికే చాలా పుకార్లు వచ్చాయి. టైటిల్ ఇదే అంటూ రకరకాల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ రాజమౌళి మాత్రం ఎప్పటిమాదిరే టైటిల్‌ని గోప్యంగా ఉంచాడు. అంతేకాదు సినిమా షూటింగ్ అప్డేట్ కూడా బయటకు రానివ్వడం లేదు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ విషయంలో మరో కొత్త పేరు ప్రచారంలోని వచ్చింది. అదే వారణాసి. గతంలో పలు పేర్లు అనుకున్నా.. చివరకు రాజమౌళి ఈ పేరుకే మొగ్గు చూపినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.డివోషనల్ టచ్..ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి..మహేశ్ బాబుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించగానే.. ఇదొక జంగిల్ అడ్వెంచరస్ మూవీ అని ప్రచారం జరిగింది. లీకైన షూటింగ్ క్లింప్స్ కూడా అలానే అనిపించాయి. అయితే జక్కన్న మాత్రం ఈ జంగిల్ అడ్వెంచరస్ కథకి డివోషినల్ టచ్ ఇచ్చాడట. ఆగస్ట్‌లో రాజమౌళి రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే కూడా ఇది నిజమనే తెలుస్తుంది. అందులో మహేశ్ మెడలో నంది, త్రిశూలం-ఢమరుకం లాకెట్ ఉంది. అది చూస్తే.. ఇందులో డివోషనల్ ఎలిమెంట్స్ ఉంటాయనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాదు ఇప్పుడు ప్రచారంలోకి వచ్చిన ‘వారణాసి’ టైటిల్ కూడా ఆ పుకారుకి మరింత బలం చేకూర్చింది.నవంబర్‌లో క్లారిటీ!రాజమౌళి చిత్రాల టైటిల్స్ యూనిక్‌గా ఉంటాయి. కథకు తగ్గట్లుగా టైటిల్స్ పెట్టడంలో ఆయన దిట్ట. ఇప్పుడు మహేశ్ సినిమాకు వారణాసి అని పెట్టినట్లు తెలుస్తుంది. ఈ టైటిల్ కూడా అన్ని భాషలకు అర్థమయ్యేలా ఉంది. కానీ జక్కన్న ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మరి ఈ టైటిల్ ఇండియా మినహా మిగతా ప్రపంచానికి అర్థమవుతుందా? అక్కడ వేరే టైటిల్‌తో రిలీజ్ చేస్తాడా? అసలు వారణాసి టైటిల్ ఫైనల్ అయిందా లేదా అనేది తెలియాలంటే.. నవంబర్ వరకు ఆగాల్సిందే. (చదవండి: ప్రతి విషయాన్ని ఆన్లైన్లో పంచుకోలేను..రూమర్స్‌పై స్పందించిన రష్మిక)నవంబర్ 16న సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తారంటూ నెట్టింట ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్ శివార్లలో వారణాసి నగరాన్ని తలపించేలా ఓ భారీ సెట్ వేశారట. అందులోనే మేజర్ సన్నివేశాలన్నీ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.ఫోక్ సాంగ్?ఈ సినిమాలో ఓ ఫోక్ సాంగ్ కూడా ఉంటుందట. ఇప్పటికే సంగీత దర్శకుడు కీరవాణీ ఓ జానపద బాణీని రాజమౌళికి ఇచ్చాడట. అది ఆయనకు బాగా నచ్చిందట. ట్రయల్ షూట్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. మహేశ్-ప్రియాంక చోప్రాల మధ్య ఆ సాంగ్ ఉంటుందట. ఆ ఫోక్ సాంగ్‌కి వీరిద్దరు వేసే ఊరమాస్ స్టెప్పులు అదిరిపోతాయట. మొత్తానికి ‘నాటు నాటు’ ని మించేలా ఆ పాటను తీర్చి దిద్దాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడట. -
జక్కన్న - మహేష్ మూవీ రూమర్స్.. అదే గనుక నిజమైతే..!
-
రాజమౌళి కొత్త రికార్డ్.. మహేష్ సినిమాకు 300 కోట్ల రెమ్యునరేషన్
-
నేనేం తప్పు చేశానని..? డార్క్ రూమ్‌లో కూర్చుని ఏడ్చా: తమన్
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (S Thaman).. ఇండస్ట్రీకి ఎన్నో మ్యూజికల్ బ్లాక్‌బస్టర్స్ ఇచ్చాడు. స్టార్ హీరోలందరి సినిమాలకు పని చేశాడు. అల వైకుంఠపురములో సినిమాకుగానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. తమన్.. చివరగా ఓజీ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ మూవీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.నేనేం తప్పు చేశా?ఈ సందర్భంగా తమన్ మాట్లాడుతూ.. 'ఓ సినిమా విషయంలో మహేశ్‌బాబు (Mahesh Babu) అభిమానులు నన్ను నానామాటలన్నారు. ఎంతో బాధపడ్డాను. నేనేం తప్పు చేశాను? మహేశ్‌బాబుగారికి నేనేం బ్యాడ్ మ్యూజిక్ ఇచ్చాను? నేను ఏ తప్పు చేయలేదే? అని డార్క్ రూమ్‌లో కూర్చుని ఏడ్చాను. సినిమా బాగోలేకపోతే దానికి మనమేం చేస్తాం? ఈ విషయం అభిమానులెందుకు అర్థం చేసుకోరని బాధేసింది.అండగా ఉన్నాడునా బాధను అర్థం చేసుకున్న ఒకే ఒక్క వ్యక్తి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆరు నెలలవరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండమన్నాడు. ఆ నెగెటివ్ కామెంట్లు ఏవీ చూడొద్దన్నాడు. నేను నీతో ఉన్నా.. నేను చూసుకుంటా.. నువ్వు మళ్లీ నిరూపించుకోగలవు అని ధైర్యం చెప్పాడు' అని పేర్కొన్నాడు. కాగా మహేశ్‌బాబు నటించిన బిజినెస్మెన్, ఆగడు, దూకుడు, సర్కారువారిపాట, గుంటూరు కారం చిత్రాలకు తమనే సంగీతం అందించాడు.చదవండి: షార్ట్ ఫిలింస్ నుంచి సినిమాల్లోకి.. హార్ట్స్ దోచేస్తున్న తెలుగమ్మాయి -
SSMB29పై జక్కన్న అదిరిపోయే స్కెచ్.. రంగంలోకి వార్నర్ బ్రదర్స్
-
మహేశ్‌బాబు సినిమాలో..?
‘‘మహేశ్‌బాబుకి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయన సూపర్ స్టార్’’ అని రణ్‌బీర్ కపూర్ ‘యానిమల్’ సినిమా వేడుక (2023)లో మహేశ్ పట్ల తన అభిమానాన్ని వ్యక్తపరిస్తే, ‘‘రణ్‌బీర్ కపూర్‌కి నేను అభిమానిని. ఇండియాలో తను బెస్ట్ యాక్టర్ అన్నది నా అభి్రపాయం’’ అని మహేశ్ పేర్కొన్నారు. అలా ఒకరి పట్ల మరొకరికి ఉన్న అభి్రపాయాన్ని పంచుకున్న ఈ హీరోలిద్దరూ ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ‘ఎస్ఎస్ఎమ్బి29’ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో ఓ శక్తిమంతమైన అతిథి పాత్ర ఉందట. ఈ పాత్రకు రణ్‌బీర్‌ని ఎంపిక చేయాలని రాజమౌళి అనుకుంటున్నారని టాక్. ఈ వార్త ఎంతవరకూ నిజమో తెలియాల్సి ఉంది. ఇక, ఈ ఫారెస్ట్ అడ్వెంచరస్ మూవీలో ప్రియాంకా చో్రపా ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ పెద్ద అప్డేట్ నవంబరులో రానుంది. 2027లో ‘ఎస్ఎస్ఎమ్బి 29’ విడుదలయ్యే అవకాశం ఉంది. -
మహేష్ తో ప్రభాస్ డైరెక్టర్.. స్క్రీన్స్ బ్లాస్ట్ పక్కా
-
ప్రధాని మోదీకి దర్శకధీరుడు విషెస్.. వీడియో రిలీజ్
మనదేశ ప్రధాని నరేంద్రమోదీకి టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి విషెస్ తెలిపారు. ఇవాళ మోదీ బర్త్ డే కావడంతో ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 75 ఏళ్ల వయసులోనూ మీరు 50 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తున్నారని ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా ఇండియాకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారని అన్నారు. వరల్డ్‌వైడ్‌గా బలమైన స్థానంలో నిలబెట్టారని కొనియాడారు. మీరు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం, శక్తి, ఆనందాన్ని పొందాలని కోరుకుంటున్నానని వీడియోను పోస్ట్ చేశారు.టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు సైతం ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మీ నిబద్ధత, జీవితం గురించి చూస్తే రాబోయే తరాలకు ఆదర్శమని కొనియాడారు. దేశం కోసం మీరు చేస్తున్న కృషి ప్రతి భారతీయుడని గర్వపడేలా చేసిందన్నారు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యం, ఆనందంతో ఉండాలని.. మీ నాయకత్వంతో మా అందరికీ స్ఫూర్తినిస్తూ కొనసాగాలని కోరుకుంటున్నాని వీడియో రిలీజ్ చేశారు.కాగా.. మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో ఓ భారీ యాక్షన్ అడ్వెంచరస్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలిసారి వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది.Happy Birthday to our honourable Prime Minister Shri @narendramodi Ji. May you always be blessed with good health, happiness and continue inspiring us all with your leadership. 🇮🇳 pic.twitter.com/hBKEnKGtVx— Mahesh Babu (@urstrulyMahesh) September 17, 2025 Wishing our Honourable Prime Minister Shri @narendramodi ji a very Happy Birthday. May you be blessed with good health, energy and happiness always. pic.twitter.com/fMftlzOeka— rajamouli ss (@ssrajamouli) September 17, 2025 -
దయచేసి ఎక్కడికీ వెళ్లొద్దు బ్రదర్.. మహేశ్‌బాబు రిక్వెస్ట్
యూట్యూబర్, మీమర్ మౌళి హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన చిత్రం లిటిల్ హార్ట్స్ (Little Hearts Movie). శివానీ నాగారం హీరోయిన్గా నటించింది. సాయి మార్తాండ్ దర్శకత్వం వహించగా సినిజిత్ ఎర్రమిల్లి సంగీతం అందించాడు. సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.30 కోట్లకుపైగా వసూలు చేసింది.సెలబ్రిటీల ప్రశంసలు సినిమా బాగుందంటూ గోపీచంద్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి సినీతారలు అభినందించారు. అయితే ఈ సినిమా దర్శకుడు సాయి, మ్యూజిక్ డైరెక్టర్ సినిజిత్ మహేశ్‌కు పెద్ద ఫ్యాన్స్. ముఖ్యంగా సినిజిత్.. నా దేవుడు మా సినిమా గురించి ఒక్క ట్వీట్ వేస్తే చాలు.. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వారం రోజులు ఎక్కడికైనా వెళ్లిపోతా.. అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాడు. ఎట్టకేలకు ఆయన కోరిక ఫలించింది. మహేశ్‌బాబు లిటిల్ హార్ట్స్ సినిమాపై రివ్యూ ఇచ్చాడు. దయచేసి ఎక్కడికీ వెళ్లకు'లిటిల్ హార్ట్స్ కొత్తగా, వినోదాత్మకంగా ఉంది. నటీనటులందరూ అద్భుతంగా నటించారు. సినిజిత్.. నువ్వు దయచేసి ఫోన్ ఆఫ్ చేసి ఎక్కడికీ వెళ్లొద్దు బ్రదర్, త్వరలోనే నువ్వు చాలా బిజీ అయిపోతావ్.. ఇలాగే అదరగొడుతూ ఉండు. చిత్రయూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు' అని మహేశ్‌బాబు ఎక్స్ (ట్విటర్) వేదికగా పోస్ట్ పెట్టాడు. అభిమాన హీరో ట్వీట్ చూడగానే సినిజిత్ సంతోషంతో ఎగిరి గంతేశాడు. నేను ఎక్కడికీ వెళ్లను అన్నా అని రిప్లై ఇచ్చాడు. NENU INKA YEKKADIKI VELLANU ANNA @urstrulyMahesh 😭😭😭😭😭😭❤️❤️❤️💥💥💥💥💥 https://t.co/KcVcyVHwMK pic.twitter.com/eTH3pOQl0d— SinjithYerramilli (@SinjithYerramil) September 16, 2025 చదవండి: మళ్లీ జతకట్టిన 'కోర్ట్' జంట.. శ్రీదేవి నోట బూతులు -
ఫారిన్ పోదాం చలో... చలో
సూట్‌కేసులు సర్దుకుని మరికొన్ని రోజుల్లో ఫారిన్‌కు మకాం మార్చనున్నారు కొందరు టాలీవుడ్ హీరోలు. వెకేషన్ కోసం అయితే కానే కాదు... సినిమాల చిత్రీకరణ కోసమే. ఈ స్టార్ హీరోల ఫారిన్ షూటింగ్ వివరాలు ఈ విధంగా...కెన్యా టు హైదరాబాద్ కెన్యా టు హైదరాబాద్ చక్కర్లు కొట్టనుందట ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్) సినిమా టీమ్. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ కెన్యాలో జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రముఖ స్డూడియోలో షూటింగ్ జరుగుతోంది. అయితే కెన్యా షెడ్యూల్ ఇంకా పూర్తి కాలేదట. ఈ సినిమాకి కీలకమైన ఫారెస్ట్ నేపథ్యంలో సాగే సన్నివేశాల చిత్రీకరణ అంతా కెన్యా అడవుల్లో జరిపేలా ప్లాన్ చేశారట రాజమౌళి. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయ్యాక ఈ టీమ్ మళ్లీ కెన్యాకు వెళ్లనుందని సమాచారం. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఫారెస్ట్ అడ్వెంచరస్ మూవీ 2027లో రిలీజ్ కానుంది.ఆటా పాటా... ప్రభాస్ నటిస్తున్న తొలి హారర్ కామెడీ చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. పాటలను అతి త్వరలోనే విదేశాల్లో చిత్రీకరించడానికి యూనిట్ ప్లాన్ చేస్తోందట. ఇప్పటికే దర్శకుడు మారుతి గ్రీస్ వెళ్లి, అక్కడి లొకేషన్స్‌ను చూసొచ్చారట. త్వరలోనే ఈ టీమ్ అక్కడికి వెళ్లి రెండు పాటలను, కొంత టాకీ పార్టును షూట్ చేయనుంది. అయితే ఫారిన్ షూటింగ్ షెడ్యూల్‌కు ముందు ‘ది రాజా సాబ్’ టీమ్ కేరళకు వెళుతుందని, అక్కడ ప్రభాస్ పరిచయ పాటను చిత్రీకరిస్తారని సమాచారం. మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 జనవరి 9న విడుదల కానుంది. పది దేశాల్లో డ్రాగన్ డ్రాగన్ విదేశీయానం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతోన్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘డ్రాగన్’. ఇందులో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం కర్ణాటకలో వేసిన ఓ భారీ సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇదిలా ఉంటే... ఈ సినిమా కథలో ఇంటర్నేషనల్ టచ్ ఉంటుందట. దీంతో తర్వాతి షూటింగ్ షెడ్యూల్ కోసం ‘డ్రాగన్’ టీమ్ విదేశాలకు వెళ్లనుందని తెలిసింది. అంతేకాదు... పదికి పైగా దేశాల్లోని లొకేషన్స్‌లో ‘డ్రాగన్’ చిత్రీకరణ జరగనుందని సమాచారం. కల్యాణ్‌రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 25న రిలీజ్ కానుంది. ఏడారిలో... హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో ‘ఏఏ22 ఏ6’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ముంబైలో దాదాపు 50 రోజులకు పైగా ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. నెక్ట్స్ షెడ్యూల్ అబుదాబిలో జరగనుందని, అతి త్వరలో అక్కడ షూట్ ప్రారంభం కానుందని తెలిసింది. అల్లు అర్జున్ పాల్గొనగా కీలక యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట అట్లీ. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో రిలీజ్ కానుందనే ప్రచారం జరుగుతోంది.ఇలా షూటింగ్ కోసం త్వరలో విదేశాలు ప్రయాణం కానున్న హీరోలు మరికొందరు ఉన్నారు. -
యూఎస్ టూర్లో ఎంజాయ్ చేస్తున్న మహేశ్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
రాముడిగా..?
మహేశ్‌బాబు వెండితెరపై రాముడిగా కనిపించనున్నారట. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచరస్ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం కెన్యా దేశంలోని నైరోబీలో జరుగుతోంది. ఇటీవల మొదలైన ఈ లాంగ్ షూటింగ్ షెడ్యూల్ నెల రోజులకు పైనే ఉంటుందట. అయితే చిన్న గ్యాప్ రావడంతో ప్రస్తుతం మహేశ్‌బాబు హైదరాబాద్ చేరుకున్నారని, త్వరలోనే మళ్లీ నైరోబీకి వెళ్తారనే టాక్ వినిపిస్తోంది. కాగా రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని, ఈ చిత్రానికి ‘జెన్ 63’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కథనం విభిన్న కాల మానాల్లో జరుగుతుందని, ఇందులో భాగంగా కొన్ని సన్నివేశాల్లో రాముడి పాత్రలో మహేశ్‌బాబు కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది.అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 120కి పైగా దేశాల్లో ఈ చిత్రం 2027లో విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. -
ప్లాన్ వరల్డ్
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ కనిపిస్తుంటుంది. నిన్న మొన్నటి వరకు తెలుగు హీరోలు, దర్శక–నిర్మాతలు పాన్ ఇండియా మంత్రం జపించారు. ఇప్పుడు పాన్ వరల్డ్’ అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా విదేశీ భాషల్లోనూ తెలుగు సినిమాలను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇలా పాన్ వరల్డ్ రిలీజ్ ప్లాన్‌లో ఉన్న చిత్రాలపై ఓ లుక్ వేద్దాం.తెలుగు సినిమా హీరోలు, దర్శక–నిర్మాతలే కాదు.. బాలీవుడ్, కన్నడ వంటి సినీ పరిశ్రమలు కూడా హాలీవుడ్ మార్కెట్‌పై దృష్టి సారించాయి. భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ ఆధారంగా హిందీలో ‘రామాయణ’ అనే సినిమా రూ పొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. కాగా ‘రామాయణ’ సినిమా రెండు భాగాలను దాదాపు 4 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూ పొందిస్తున్నామని, హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం ఈ సినిమా తీసి పోదని ఈ చిత్రనిర్మాత నమిత్ మల్హోత్రా ఓ సందర్భంలో తెలిపారు.అలాగే విదేశీ ప్రేక్షకులు సైతం మెచ్చుకునేలా ‘రామాయణ’ సినిమాను తీస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఇలా ‘రామాయణ’ సినిమాను విదేశీ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నట్లుగా ఆయన పరోక్షంగా వెల్లడించారు. ‘రామాయణపార్ట్ 1’ చిత్రం వచ్చే ఏడాది దీపావళికి, ‘రామాయణపార్ట్ 2’ చిత్రం ఆపై వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ కానున్నాయి.ఇంకా రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’, యశ్ ‘టాక్సిక్’ చిత్రాలు కొన్ని భారతీయ భాషలతోపాటు ఇంగ్లిష్ వెర్షన్స్‌ను కూడా రిలీజ్ చేయనున్నాయి. ఈ విధంగా విదేశీ మార్కెట్‌పై భారతీయ ఫిల్మ్‌మేకర్స్ దృష్టి పెట్టారు. ఇక ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రం ఈ అక్టోబరు 2న విడుదల కానుండగా, ‘టాక్సిక్’ చిత్రం వచ్చే ఏడాది మార్చి 19న విడుదల కానుంది.అవతార్‌ను మించి..! హాలీవుడ్లో ప్రంపచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలుగా చెప్పుకునే ‘అవతార్’, ‘అవెంజర్స్’ వంటివి దాదాపు వంద దేశాల్లో విడుదలయ్యాయి. అలాంటిది హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లోని ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్) మాత్రం అంతకు మించి, 120కిపైగా దేశాల్లో రిలీజ్ అయ్యేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసి పోదని.ఇంకా చెప్పాలంటే... హాలీవుడ్ చిత్రాలకే పోటీగా నిలుస్తున్న సినిమా ఇది. పైగా ఈ సినిమా అప్డేట్స్కి కూడా గ్లోబల్ రీచ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు రాజమౌళి. ఈ ‘ఎస్ఎస్ఎమ్బీ29’ సినిమా ఫస్ట్ లుక్‌ను ‘టైటానిక్, అవతార్’ వంటి మూవీస్‌ని డైరెక్ట్ చేసిన జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా రిలీజ్ చేసేందుకు రాజమౌళి అండ్ టీమ్ సన్నాహాలు చేస్తోందని తెలిసింది.నవంబరులో తన సినిమా ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ప్రమోషన్స్‌లో భాగం దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఇండియాకు రానున్నారని, ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేయించేలా రాజమౌళి ఏర్పాట్లు చేస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇలా చేస్తే ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ రీచ్ గ్లోబల్ స్థాయిలో ఉంటుందన్నది టీమ్ ఆలోచనగా తెలుస్తోంది. ⇒ ఇక ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కెన్యాలో జరుగుతోంది. ఈ చిత్ర హీరో మహేశ్బాబుతోపాటుగా ఇతర ప్రధాన తారాగణం ప్రియాంకా చో్రపా, పృథ్వీరాజ్ సుకుమారన్పాల్గొంటుండగా ఆఫ్రికా అడవుల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.1200 కోట్లు అని, ఈ సినిమాకు ‘జెన్ –63’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని, దాదాపు 20కిపైగా భాషల్లో ఈ సినిమాను అనువదించి, 2027 మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇంకా ఈ సినిమాలో క్రిస్ హెమ్స్‌వర్త్ వంటి హాలీవుడ్ నటులు కూడా కనిపిస్తారని, ఇందుకు సంబంధించి ఓ ప్రముఖ హాలీవుడ్ యాక్టింగ్ ఏజెన్సీతో రాజమౌళి ఒప్పందం కుదుర్చుకున్నారనే వార్తలు ఉన్నాయి. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.ఫారిన్ స్పిరిట్ ప్రభాస్ ది ఇంటర్నేషనల్ హీరో కటౌట్. ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి, కల్కి2898 ఏడీ’ వంటి చిత్రాలు జపాన్ దేశంలో విడుదలై, అక్కడి ప్రేక్షకులను అలరించాయి. ఇక ప్రభాస్ హీరోగా నటించనున్న చిత్రాల్లో ‘స్పిరిట్’ కూడా ఒకటి. ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.యూవీ క్రియేషన్స్, టీ–సిరీస్, భద్రకాళి పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనున్నాయి. అయితే ఈ సినిమా అనౌన్స్మెంట్ సమయంలోనే ‘స్పిరిట్’ను భారతీయ భాషలతోపాటు ఇంగ్లిష్, చైనా, జపాన్, కొరియా భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. దీంతో ‘స్పిరిట్’ చిత్రం ఇంటర్నేషనల్ లెవల్లో రిలీజ్ కానుంది. ఇంకా ‘స్పిరిట్’ సినిమా చిత్రీకరణ మొదలు కాలేదు. రిలీజ్ సమయానికి ‘స్పిరిట్’ మరిన్ని విదేశీ భాషల్లో రిలీజ్ అయ్యే అవకాశాలు లేక పోలేదు.ఇక ఈ చిత్రంలో తొలిసారిగా ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటించనున్నారు. నిజానికి ఈ సినిమా చిత్రీకరణ ఈపాటికే మొదలు కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతోంది. కాగా ఈ సినిమాలోని ఓ మేజర్ షూటింగ్ షెడ్యూల్‌ను మెక్సికోలో ప్లాన్ చేసినట్లుగా ఈ చిత్రదర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇటీవల ఓ సందర్భంలో వెల్లడించిన విషయం గుర్తుండే ఉంటుంది.ఇంకా ఈ చిత్రంలో సౌత్ కొరియన్ నటుడు డాన్ లీ విలన్‌గా నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. డాన్ లీతో తెలుగు నటుడు శ్రీకాంత్ ఉన్న ఫొటోలు ఇంటర్ నెట్లో వైరల్ అయ్యాయి. దీంతో..‘స్పిరిట్’ చిత్రంలో డాన్ లీ, శ్రీకాంత్ ఏమైనా భాగం అయ్యారా? అనే టాక్ తెరపైకి వచ్చింది. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.గ్లోబల్ డ్రాగన్ హీరో ఎన్టీఆర్–దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూ పొందుతున్న సినిమా ‘డ్రాగన్’. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. మలయాళ నటుడు టొవినో థామస్ విలన్‌గా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా అనౌన్స్మెంట్ సమయంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెరపైకి వచ్చాయి. ఈ సినిమాను దాదాపు 15 దేశాల్లో చిత్రీకరించాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశారన్నది ఆ వార్తల సారాంశం. ఇందుకు తగ్గట్లుగానే ఈ ‘డ్రాగన్’ కోసం ఇంటర్నేషనల్ కనెక్ట్విటీ ఉండే ఓ ప్రపంచాన్ని ప్రశాంత్ నీల్ క్రియేట్ చేస్తున్నారనే టాక్ తాజాగా తెరపైకి వచ్చింది.అంతేకాదు... ఈ సినిమా విదేశీ షూటింగ్ షెడ్యూల్స్ నవంబరులో ప్రారంభం అవుతాయట. మరి... ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉన్న స్టోరీని రెడీ చేసుకుని, ఇంటర్నేషనల్ లొకేషన్స్‌లో చిత్రీకరణకు ప్లాన్ చేసినప్పుడు, ఇంటర్నేషనల్ రేంజ్ రిలీజ్‌ను కూడా ప్లాన్ చేయకుండా ఉంటారా? ‘డ్రాగన్’ టీమ్ ఈ దిశగా ఆలోచిస్తోందట. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిల్మ్స్ పతాకాలపై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న ఈ సినిమా 2026 జూన్ 25న విడుదల కానుంది.ఇదిలా ఉంటే... ‘ఆర్ఆర్ఆర్’ (ఇందులో రామ్‌చరణ్ మరో హీరో) చిత్రంలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఎన్టీఆర్. ఈ సినిమా ఆస్కార్ క్యాంపైన్ ప్రమోషన్స్‌లో ఉత్సాహంగాపాల్గొన్నారు ఎన్టీఆర్. ఈ విధంగా ప్రపంచవ్యాప్త సినిమా ఆడియన్స్‌కు ఎన్టీఆర్ గురించి ఓ అవగాహన ఉంది.ఇంటర్నేషనల్ పెద్ది స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలకు ఓ సౌలభ్యం ఉంటుంది. భాష అర్థం కాక పోయినా గేమ్, ఇందులోని స్ట్రాటజీస్ ఏ భాషవారికైనా కనెక్ట్ అవుతాయి. హిందీలో ‘మేరికోమ్, భాగ్ మిల్కా సింగ్, చక్ దే ఇండియా’ వంటి సినిమాలు వచ్చినప్పుడు ఇక్కడి తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమాలను హిందీ భాషలోనే చూసి, ఈ చిత్రాలను సూపర్ హిట్ చేశారు. ఇప్పుడు ‘పెద్ది’ టీమ్ కూడా ఇదే చేయనుందట. కాక పోతే ఇంటర్నేషనల్ లెవల్లో. రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పీరియాడికల్ మల్టీస్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. బుచ్చిబాబు సానా ఈ సినిమాకు దర్శకుడు.ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా జగపతిబాబు, దివ్యేందు శర్మ, శివరాజ్‌కుమార్ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ మైసూర్లో జరుగుతోంది. రామ్చరణ్పాల్గొంటుండగా ఓపాటతోపాటు కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న విడుదల కానుంది.కాగా ఈ సినిమాను గ్లోబల్ స్థాయిలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. మంచి ఎమోషన్స్ ఉన్న స్పోర్ట్స్ డ్రామా కాబట్టి యూనివర్సల్ అప్పీల్ ఉంటుందని టీమ్ భావిస్తోందట. ఈ దిశగా ప్రయత్నాలను మొదలు పెట్టిందట టీమ్. ఇక ‘ఆర్ఆర్ఆర్’ (ఈ చిత్రంలో ఎన్టీఆర్ మరో హీరో) చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా రామ్‌చరణ్‌కు క్రేజ్ వచ్చింది. ఈ సినిమా ఆస్కార్ ప్రమోషన్స్‌లోనూ రామ్‌చరణ్ ఉత్సాహంగాపాల్గొన్నారు. ‘ఆర్ఆర్ఆర్’లో రామ్‌చరణ్ పెర్ఫార్మెన్స్ను కొందరు హాలీవుడ్ దర్శకులు మెచ్చుకున్నారు. ఇదంతా ‘పెద్ది’ సినిమాను ఇంటర్నేషనల్ ఆడియన్స్‌కు దగ్గర చేయడంలో ఉపయోగపడుతుందని టీమ్ భావిస్తోందని ఫిల్మ్‌నగర్ భోగట్టా.హాలీవుడ్ అసోసియేషన్ ‘పుష్ప’ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ‘పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్’ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ బాగా పెరిగింది. ‘పుష్ప:ది రూల్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత హీరో అల్లు అర్జున్ అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు అట్లీ డైరెక్టర్. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. కాగా ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం సన్నాహాలు కూడా మొదలుపెట్టింది.హాలీవుడ్లో ‘అవతార్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, డ్యూన్, జురాసిక్ వరల్డ్’ వంటి సినిమాల ప్రమోషన్స్‌లో క్రీయాశీలకంగా వ్యవహరించిన హాలీవుడ్ ప్రముఖ మార్కెటింగ్ ఏజెన్సీ ‘కనెక్ట్ మాబ్ సీన్’తో అల్లు అర్జున్–అట్లీ టీమ్ అసోసియేట్ అయ్యేందుకు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో భాగంగానే ‘కనెక్ట్ మాబ్ సీన్’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ క్రియేటివ్ కంటెంట్ అలెగ్జాండ్రా ఈ. విస్కోంటి ఇటీవల ముంబై వచ్చి, అల్లు అర్జున్–అట్లీ అండ్ టీమ్‌ని కలిసి మాట్లాడారు. ‘కనెక్ట్ మాబ్ సీన్’తో అసోసియేషన్ దాదాపు ఓకే అయ్యిందని, త్వరలోనే అధికారిక ప్రకటన ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. ⇒ కాగా ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. అల్లు అర్జున్‌తోపాటు ఈ చిత్రంలోని కీలక తారాగణంపాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇక ఈ సినిమాలో దీపికా పదుకోన్ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. కథ రీత్యా ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్స్‌కు స్కోప్ ఉందని, దీపికా పదుకోన్ ,మృణాల్ ఠాకూర్ కన్ఫార్మ్ అయ్యారని, మిగతా హీరోయిన్స్‌గా జాన్వీ కపూర్, ఆలియా.ఎఫ్, భాగ్యశ్రీ బోర్సే వంటివారు కనిపించే అవకాశం ఉందనే టాక్ తెరపైకి వచ్చింది.ఇంకా ఈ చిత్రంలో రమ్యకృష్ణ, యోగిబాబు, విజయ్ సేతుపతి వంటి వారు ఇతర కీలకపాత్రల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు... ఈ చిత్రంలో అల్లు అర్జున్ నాలుగుపాత్రల్లో కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. తాత – తండ్రి–ఇద్దరు కొడుకులపాత్రల్లో అల్లు అర్జున్ కనిపిస్తారట. ఇక అల్లు అర్జున్ కెరీర్‌లోని ఈ 22వ సినిమా 2027 ఆగస్టులో రిలీజ్ కానుందనే ప్రచారం జరుగుతోంది.ది ప్యారడైజ్ ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత నాని–దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూ పొందుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కానుంది. కాగా ‘ది ప్యారడైజ్’ సినిమాను కొన్ని భారతీయ భాషలతోపాటు స్పానిష్, ఇంగ్లిష్ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.ఇందుకు తగ్గట్లుగానే హాలీవుడ్ ప్రముఖ మార్కెటింగ్ ఏజెన్సీ ‘కనెక్ట్ మాబ్ సీన్’ సంస్థతో ఇటీవల చర్చలు జరిపారు మేకర్స్. అంతేకాదు... ‘ది ప్యారడైజ్’ సినిమా ఇంటర్నేషనల్ వెర్షన్ రిలీజ్ కోసం ఓపాపులర్ హాలీవుడ్ యాక్టర్‌తో అసోసియేట్ కావాలనుకుంటున్నారు మేకర్స్. ఈ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. త్వరలోనే ఈ విషయంపై మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.వీరే కాదు.. మరికొంతమంది తెలుగు హీరోలు కూడా తమ మార్కెట్ పరిధిని గ్లోబల్ స్థాయిలో పెంచుకునేందుకు ఇప్పట్నుంచే వ్యూహ రచనలు చేస్తున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. – ముసిమి శివాంజనేయులు -
హాలీవుడ్ రేంజ్ లో మహేష్ బాబు - రాజమౌళి సినిమా
-
120 దేశాల్లో ఎస్ఎస్ఎమ్బి29 విడుదల
‘‘సుందరమైన నైవాషా, ఐకానిక్ అంబోసెలి, మసాయి మారా తాలూకు విశాలమైన మైదానం... ఇలా కెన్యాలోని ప్రకృతి అందాలు 120 దేశాల్లో విడుదల కానున్న ప్రతిష్ఠాత్మక చిత్రంలో కనువిందు చేయనున్నందుకు హ్యాపీగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ (వంద కోట్లు)కి పైగా ప్రేక్షకులకు ఈ చిత్రం చేరువ అవుతుందనే అంచనాలు ఉన్నాయి’’ అంటూ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు కెన్యా విదేశీ వ్యవహారాల మంత్రి ముసాలియా డబ్లు్య ముడవాడి. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో రూ పొందుతున్న భారీ చిత్రం గురించే ముసాలియా ఈ విధంగా పేర్కొన్నారు. ఈ ఫారెస్ట్ అడ్వెంచరస్ మూవీ షూటింగ్‌ని ఎక్కువ శాతం కెన్యాలో చిత్రీకరించాలని రాజమౌళి అనుకున్నారట. టీమ్‌తో కలిసి అక్కడి లొకేషన్స్‌ని సందర్శించారు. ఈ సందర్భంగా ముసాలియాని కలిశారు రాజమౌళి. ఆ ఫొటోలను ముసాలియా తన ‘ఎక్స్’లో షేర్ చేసి, అభిప్రాయాలను కూడా పంచుకున్నారు. ‘‘ప్రపంచంలోని గొప్ప ఫిల్మ్ మేకర్స్‌లో ఒకరైన రాజమౌళి సినిమా కోసం కెన్యా ఓ వేదిక అయింది. మంచి విజన్ ఉన్న గొప్ప భారతీయ దర్శకుడు ఆయన. చక్కని స్క్రీన్‌ప్లే రైటర్, కథకుడు కూడా. ఆయన కథలు ఖండాంతర ప్రేక్షకుల ఊహలను ఆవిష్కరించాయి. రెండు దశాబ్దాల కెరీర్లో రాజమౌళి శక్తిమంతమైన కథనాలు, దృశ్యాలు, సాంస్కృతికతలను తన కథల్లో చొప్పించారు. 120 మందితో కూడిన ఆయన టీమ్ ఈస్ట్ ఆఫ్రికాలో విస్తృతంగా పర్యటించాక కెన్యాని ఎంచుకుంది. ప్రాథమిక చిత్రీకరణకు గమ్యస్థానంగా మా దేశాన్ని ఎంచుకోవడం ఇక్కడి అందం, ఆతిథ్యం గురించి ప్రపంచ వేదికకు చెప్పినట్లుగా భావిస్తున్నాం. ‘ఎస్ఎస్ఎమ్బి29’ (వర్కింగ్ టైటిల్) సినిమా లెన్స్ ద్వారా మా దేశాన్ని చూపించనుండటం కెన్యాకి గర్వకారణం’’ అని ముసాలియా డబ్లు్య ముడవాడి పేర్కొన్నారు. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో గ్లోబల్ రేంజ్లో కేఎల్ నారాయణ ‘ఎస్ఎస్ఎమ్బి29’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంకా చో్ప్రాఓ లీడ్ రోల్ చేస్తున్నారు. ఇంకా పలువురు భారతీయ నటీనటులతో పాటు హాలీవుడ్ నటీనటులు నటించనున్నారు. అలాగే హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఓ పెద్ద అప్డేట్ని నవంబరులో ఇవ్వనున్నామని ఇటీవల మహేశ్‌బాబు బర్త్‌డే (ఆగస్ట్ 9) సందర్భంగా రాజమౌళి పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది. -
120 దేశాలు.. 100 కోట్ల మంది.. కెన్యా మంత్రితో రాజమౌళి
మహేశ్‌బాబు- దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో SSMB29 ప్రాజెక్ట్ తెరకెక్కుతుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ టీమ్ కెన్యాలో షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఆ దేశ మంత్రి ముసాలియా ముదావాదిని చిత్ర యూనిట్ కలిసింది. ఇదే విషయాన్ని అక్కడి మంత్రి సోషల్‌మీడియాలో పంచుకున్నారు. కెన్యా మంత్రి ఇలా చెప్పారు. ' ప్రపంచంలోని గొప్ప దర్శకులు రాజమౌళి. ఆయన రెండు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఆయన సినిమాలు ఖండాంతర ప్రేక్షకులను కూడా ఆకర్షించాయి. అతను దార్శనిక భారతీయ దర్శకుడు. 120 మందితో కూడిన రాజమౌలి టీమ్ తూర్పు ఆఫ్రికా అంతటా పర్యటించి ఫైనల్‌గా తమ సినిమా కోసం కెన్యాను ఎంచుకుంది. దాదాపు 95% ఆఫ్రికన్ దృశ్యాలను చిత్రీకరించే ప్రాథమిక గమ్యస్థానంగా మన దేశాన్ని నిర్ణయించింది. ఇక్కడ ఉండే మసాయి మరా మైదానాల నుంచి సుందరమైన నైవాషా, ఐకానిక్ అంబోసెలి వంటి ప్రాంతాలు అతిపెద్ద చలనచిత్రంలో భాగం కాబోతున్నాయి. 120 దేశాల్లో ఈ మూవీని విడుదల చేయాలని వారు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికిపైనే చేరువయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు ప్రపంచ వేదికలపై మా దేశ అందాలు, ఆతిథ్యం, అందమైన దృశ్యాలు కనిపిస్తాయి. SSMB29 సినిమా ద్వారా కెన్యా తన చరిత్రను ప్రపంచంతో పంచుకునేందుకు రెడీగా ఉంది.' అని అక్కడి మంత్రి ముసాలియా ముదావాది తెలిపారు.మహేశ్‌బాబు ఇప్పటికే ఆఫ్రికాలో ఉన్నారు. సినిమా షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. భార్య నమ్రత వినాయక చవితి పండగ జరుపుకున్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి, మహేశ్‌బాబును మిస్ అవుతున్నట్లుగా పేర్కొన్నారు. ఈ షెడ్యూల్లో మహేశ్‌బాబుపై ఓ భారీ యాక్షన్ అడ్వెంచరస్ సీక్వెన్స్ చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట రాజమౌళి. ఇక కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఓ హాలీవుడ్ నిర్మాణ సంస్థ కూడా నిర్మాణంలో భాగస్వామి కానుందనే ప్రచారం జరుగుతోంది.Kenya this past fortnight became the stage for one of the world’s greatest filmmakers, @ssrajamouli, the visionary Indian director, screenwriter, and storyteller whose works have captured the imagination of audiences across continents. Rajamouli, with a career spanning over two… pic.twitter.com/T1xCGVXQ64— Musalia W Mudavadi (@MusaliaMudavadi) September 2, 2025 -
ఐఐటీ సీటు వదులుకున్న హీరోయిన్.. ఇప్పుడు ఏకంగా ఐటీ కంపెనీ సీఈఓ
బాలీవుడ్ హీరోయిన్ మయూరి కాంగో (Mayoori Kango) ఆమె కేవలం నటి మాత్రమే కాకుండా, కార్పొరేట్ ప్రపంచంలోనూ తనదైన ముద్ర వేసిన వ్యక్తిగా పేరు గాంచింది. 1995లో "నసీమ్" అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ సమయంలో నటన కోసం కాన్పూర్‌లో వచ్చిన ఐఐటీ సీటును కూడా వదులుకుని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు మహేశ్ భట్ తెరకెక్కించిన 'పాపా కెహతే హై' (1996) చిత్రంతో ఆమె పేరు పాపులర్ అయిపోయింది. ఇండస్ట్రీలో కేవలం ఐదేళ్లు మాత్రమే కొనసాగిన మయూరి మహేశ్ బాబు, సంజయ్ దత్, అజయ్ దేవగణ్‌లతో నటించింది.మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌కు చెందిన మయూరి కాంగో తన మనసు మార్చుకుని కేవలం ఐదేళ్లలోనే సినిమాలకు వీడ్కోలు చెప్పింది. 2003లో ఆదిత్య థిల్లాన్ అనే ఎన్నారైని పెళ్లి చేసుకుని ఆమెరికా వెళ్లిపోయింది. ఆ తర్వాత అమెరికాలో MBA (Marketing & Finance) పూర్తి చేసింది. కేవలం తన తల్లి కోరిక మేరకు మాత్రమే సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత తన లక్ష్యాన్ని మార్చుకుని ఒక అసాధారణ ప్రయాణం కొనసాగించింది.గూగుల్ నుంచి సీఈఓ వరకుఅమెరికాలో తన విద్య పూర్తి అయిన తర్వాత మయూరి కాంగో తన కుటుంబంతో పాటు ఇండియాకు వచ్చేసింది. హరియాణలోని గుర్గావ్లో నివాసం ఏర్పాటుచేసుకుంది. 2019లో గూగుల్ ఇండియాలో చేరిన మయూరి.. అక్కడ ఇండస్ట్రీ హెడ్ పదవిని చేపట్టింది. అయితే, తాజాగా పబ్లిసిస్ గ్రూప్(Publicis Group)లో ఆమెకు కీలక పదవి దక్కింది. ఆ కంపెనీ గ్లోబల్ డెలివరీ విభాగానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా బాధ్యతలు అందుకుంది. ఆమె స్టోరీ తెలుసుకున్న నెటిజన్లు అభినందిస్తున్నారు. అమ్మ కోసం సినిమాల్లో నటించి ఆపై తనకు ఇష్టమైన కెరీర్లో అత్యున్నత స్థాయికి చేరుకున్న మయూరి జీవితం చాలామందికి ఆదర్శం అంటూ కామెంట్లు చేస్తున్నారు. గూగుల్ వంటి టాప్ కంపెనీల్లో అత్యున్నత స్థానంలో పనిచేసి ఇప్పుడు ఏకంగా మరో టాప్ కంపెనీకి సీఈఓగా ఎదగడంతో ఇదే కదా సక్సెస్ అంటే అంటూ చెబుతున్నారు.తెలుగులో మహేశ్ బాబుతో సినిమా2000లో విడుదలైన 'వంశీ' సినిమాతో ఆమె టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్, మయూరి కాంగో నటించారు. బి.గోపాల్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం మంచి ఆదరణ పొందింది. ఇందులో స్నేహ పాత్రలో మయూరి నటించింది. ఈ సినిమా తర్వాత మయూరి పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. -
మిరాయ్ చిత్రంలో మహేశ్ బాబు.. తేజా సజ్జా క్లారిటీ!
హనుమాన్ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న హీరో తేజా సజ్జా. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం తేజా సజ్జా మరో విజువల్ వండర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తేజా సజ్జా లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం మిరాయ్. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. విజువల్స్‌కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. మరో బ్లాక్‌బస్టర్ ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు.అయితే ఈ ట్రైలర్లో చివర్లో రాముడి పాత్రను చూపించారు. ఆ రోల్ చేసింది ఎవరనేదానిపై టాలీవుడ్లో చర్చ మొదలైంది. రాముడి పాత్రలో ఉన్నది ప్రిన్స్ మహేశ్‌బాబు అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అయితే ఈ సీన్లో ఉన్నది ఎవవనేది మాత్రం చిత్ర బృందం క్లారిటీ ఇవ్వలేదు.ప్రస్తుతం మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న తేజ సజ్జాకు దీనిపై ప్రశ్న ఎదురైంది. రాముడి పాత్రలో ఉన్నది మహేశ్ బాబేనా అని అడిగారు. దానికి ఆయన కాదని తేజ సజ్జా సమాధానమిచ్చాడు. దీంతో రూమర్స్‌కు చెక్ పడింది. కాగా.. రాముడి పాత్రలో స్టార్ హీరో ఉన్నారని.. ఏఐ సాయంతో ఆ క్యారెక్టర్ రూపొందించారని మొదట రూమర్లు వినిపించాయి. మరి రాముడి పాత్రలో ఉన్నది ఎవరో తెలియాలంటే మాత్రం థియేటర్లలో చూడాల్సిందే. కాగా.. ఈ సినిమాకు కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ విలన్ పాత్ర్లో మెప్పించనున్నారు. -
హీరోయిన్ గా మహేష్ కూతురు ఎంట్రీ..!
-
అల్లు అర్జున్ ‘ఇంటి’ పేరు ‘అల్లు’ కాదా?. మహేశ్ ‘ఇంటి’పేరు ఘట్టమనేని కాదా?
‘‘మన్నాత్’’ అనగా మనసా వాచా కోరుకున్నవన్నీ నిత్యం జరుగుతాయని వ్యక్తం చేసే ఆకాంక్ష. ‘‘జన్నత్’’ అనగా స్వర్గం అదే క్రమంలో వస్తుంది మన్నాత్ కూడా. ఇంతకీ ఈ మన్నాత్ అనే పదం మన దేశంలో ఇంత పాప్యులర్ కావడానికి కారణం ఏమిటో తెలుసా? అది బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ ఇంటిపేరు కావడమే. ఇంటిపేరు అంటే మనం అనుకునేది కాదండోయ్.. సాధారణంగా ఇంటి పేరు అనగానే మనకు ఏం గుర్తొస్తుంది? వంశపారం పర్యంగా మన పేరు కు ముందు వస్తున్న ఇనీషియల్ కదా. వాడుకలో ఎందుకని అలా మారిందో గానీ నిజానికి అది వంశం పేరు. చాలా మంది తమ నివాస భవనాలకు పెట్టుకునే పేర్లను కూడా ఇంటి పేరు అనే పేర్కొంటారు. తాము స్వంతం చేసుకున్న ఇంటికి పేర్లు పెట్టడం అనేది సాధారణ పౌరులతో పాటు సెలబ్రిటీలకు కూడా సాధారణమే.గత 2001లో షారుఖ్ ఖాన్ ఒక ‘విల్లా వియెన్నా’ని కొనుగోలు చేసిన దగ్గర నుంచి ఇప్పటి దాకా సెలబ్రిటీల ఇళ్లలో అత్యంత ప్రాచుర్యంలో ఉన్నది మన్నాత్. అత్యంత ఖరీదైన సెలబ్రిటీ బంగ్లా అనే స్టేటస్ నుంచి మొదలై ఈ ఇంటి గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త హల్ చల్ చేస్తూనే ఉంటుంది.ఈ నేపధ్యంలో మరికొందరు తారలు పెట్టుకున్న ఇళ్ల పేర్లు పరిశీలిస్తే...బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంటి పేరు కూడా ఆయన లాగే బాగా పాప్యులర్. ఆయన ఇంటి పేరు ‘జల్సా’’‘‘జల్సా’’ అంటే ఆనందం సంబురాలకు ప్రసిద్ధి అనేది మనకు తెలిసిందే. జూహూలో ఉన్న ఈ బంగ్లా, బచ్చన్ అభిమానులకు నిత్య సందర్శనీయ ప్రదేశంగా మారింది.అదే విధంగా మరో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఆయన భార్య సీనియర్ నటి కాజోల్ లు నివసించే ఇంటి పేరు భక్తి భావనలకు చిరునామాగా ఉంటుంది. వీరి ఇంటి పేరు‘శివ శక్తి’’ ఈ పేరులో శివుడి శక్తి తో పాటు దైవ భక్తి కూడా ప్రతిఫలిస్తుంది. అదే విధంగా రాజకీయ నేత, సీనియర్ బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా నివసించే భవనం పేరు రామాయణ్.. తన కుటుంబ సభ్యుల పేర్లు కూడా కలసి వచ్చేలా ఆయన ఇంటికి పేరు పెట్టారు. అపర కుబేరుడు ముఖేష్ అంబానీ తన 27 అంతస్థుల సౌధానికి అంటిల్లా అని నామకరణం చేశారు. బోలెడన్ని విలాసాలు, రహస్య సంపదలు ఉన్న 15వ శతాబ్ధపు ద్వీపం పేరట ఇది.అలాగే బాలీవుడ్ యువ జంట రణబీర్ కపూర్ అలియాభట్‌లు తాజాగా అత్యంత ఖరీదైన ఇల్లు కొనుగోలు చేశారు. దీనికి కృష్ణరాజ్ బంగ్లా అంటూ పేరు పెట్టారు. తన నానమ్మ కృష్ణ కపూర్ తాతయ్య రాజ్ కపూర్ ల పేర్లు కలిసి వచ్చేలా అలా నామకరణం చేశారు.ఇక మన టాలీవుడ్ స్టార్స్ సైతం తమ తమ ఇళ్లకు పేర్లు తమ అభిరుచులకు అనుగుణంగా పెడుతున్నారు అయితే ప్రస్తుతానికి అవి మరీ బాలీవుడ్ స్థాయిలో పాప్యులర్ కాకపోయినా, అన్ని విషయాల్లోనూ బాలీవుడ్‌ని అధిగమిస్తున్న మన టాలీవుడ్ స్టార్స్ ఇంటి పేరు పాప్యులారిటీలోనూ పోటీ పడతారేమో చూడాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటికి బ్లెస్సింగ్ అనే పదం ఉంటుంది. అలాగే ఇంటి లోపల ఉన్న విశాలమైన ఉద్యానవనం కు అల్లు గార్డెన్స్ అని పేరు పెట్టారు.జూబ్లీహిల్స్‌లోని తన భవనానికి సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా పద్ధతిగా చాలా మంది తెలుగువారి ఇళ్లకు ఉండే పేరును తలపించేలా శ్రీ లక్ష్మీ నిలయం అనే పేరు పెట్టారు. ఇక టాలీవుడ్ రౌడీ...విజయ్ దేవరకొండ మాత్రం ఇంటి పేరునీ తన వంశం పేరునీ ఒకటి చేసేశారు. ఆయన ఇంటికి దేవరకొండ హౌస్ అని పేరు పెట్టడం ద్వారా. -
'ఈ ఒక్క ఏడాదే మిస్సవుతున్నా'.. తనయుడికి టాలీవుడ్ ప్రిన్స్ విషెస్
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు తన కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు 20వ వసంతంలోకి అడుగుపెడుతున్న గౌతమ్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. ఈ ఏడాది నీ పుట్టినరోజును మిస్సవుతున్నా అంటూ పోస్ట్ చేశారు. నీ ప్రతి అడుగులో నా ప్రేమ ఉంటుందని ట్విటర్లో రాసుకొచ్చారు. నువ్వు చేసే ఏ పనిలోనైనా ఎల్లప్పుడూ నువ్వే అతిపెద్ద చీర్ లీడర్.. ఎప్పటికీ ఇలాగే ఎదుగుతూ ఉండాలని కోరుకుంటున్నా అంటూ గౌతమ్‌లో చిన్నప్పటి ఫోటోను షేర్ చేస్తూ తనయుడిపై ప్రేమను చాటుకున్నారు. ఇది చూసిన అభిమానులు సైతం గౌతమ్‌కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.మహేశ్ తన ట్వీట్లో రాస్తూ.. '19 ఏళ్ల నా కుమారుడు.. ప్రతి సంవత్సరం నన్ను కొంచెం ఎక్కువగానే ఆశ్చర్యపరుస్తున్నావ్. ఈ సంవత్సరం నీ పుట్టినరోజు మిస్ అవుతున్నా. నా ప్రేమ నీ ప్రతి అడుగులోనూ ఎప్పటికీ నీతోనే ఉంటుంది. నువ్వు చేసే ఏ పనిలోనైనా ఎల్లప్పుడూ నువ్వే అతిపెద్ద చీర్ లీడర్... ఎప్పటికీ ఇలాగే ప్రకాశిస్తూ, ఎదుగుతూ ఉండు' అంటూ పోస్ట్ చేశారు.కాగా.. మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళితో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో తొలిసారిగా యాక్షన్ అడ్వెంచరస్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కనిపించనుంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ ఒడిశాలో పూర్తి చేసుకుంది. ఈ మూవీ కోసం మహేశ్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.Happy 19 my son!! Each year you amaze me a little more… ♥️♥️♥️ Missing your birthday this year, the only one i have ever missed… my love is with you every step of the way….😘😘😘 Always your biggest cheerleader in whatever you do… keep shining and keep growing…🤗🤗🤗 pic.twitter.com/0bV51ZRR8S— Mahesh Babu (@urstrulyMahesh) August 31, 2025 -
ఆఫ్రికాలో అడ్వెంచర్?
హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో ఓ భారీ బడ్జెట్ చిత్రం రూ పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఆఫ్రికా లొకేషన్స్‌లోనే జరుగుతోందనే ప్రచారం సాగుతోంది. దానికి కారణం ప్రియాంకా చోప్రా తాజాగా షేర్ చేసిన కొన్ని ఫొటోలు ప్రధానంగా ఫారెస్ట్ లొకేషన్స్‌కు సంబంధించినవి కావడమే.దీంతో ఆమె ప్రస్తుతం ఆఫ్రికాలో ఉన్నారని, ఆమె అక్కడికి వెళ్లింది మహేశ్‌బాబు సినిమా కోసమే అనే టాక్ తెరపైకి వచ్చింది. మరోవైపు మహేశ్‌బాబు భార్య నమ్రత వినాయక చవితి పండగ జరుపుకున్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి, మహేశ్‌బాబును మిస్ అవుతున్నట్లుగా పేర్కొన్నారు. సో... మహేశ్‌బాబు కూడా రాజమౌళి సినిమా షూటింగ్ కోసం ఆఫ్రికా వెళ్లారనే ఊహాగానాలు నెలకొన్నాయి. ఇక ఈ షెడ్యూల్లో మహేశ్‌బాబుపై ఓ భారీ యాక్షన్ అడ్వెంచరస్ సీక్వెన్స్ చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట రాజమౌళి. ఇక కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఓ హాలీవుడ్ నిర్మాణ సంస్థ కూడా నిర్మాణంలో భాగస్వామి కానుందనే ప్రచారం జరుగుతోంది. -
2025లో ఒక్క సినిమా కూడా చేయని స్టార్ హీరోలు వీరే!
గతంలో హీరోలు వరుసగా సినిమాలు చేసేవారు. ఏడాదికి రెండు మూడు లేదంటే కనీసం ఒక్క సినిమా అయినా విడుదల చేసేవారు. అయితే ప్రస్తుతం దాదాపు చాలామంది హీరోల నుంచి వరుస పెట్టి సినిమాలు రావడం లేదు. ఒక్కొక్కరు రెండు మూడేళ్లకు ఓ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఏడాదికి ఓ సినిమాని ఆడియన్స్ ముందుకి తీసుకొచ్చే వాళ్లను వేళ్లల్లో లెక్కపెట్టొచ్చు. పైగా ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. అందుకే ఇప్పుడు అందరూ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాలవైపు మొగ్గు చూపుతున్నారు.లేట్ అయినా భారీ హిట్ ఇవ్వాలనే ఆలోచనలతో ఇటు హీరోలు, అటు దర్శక–నిర్మాతలు కథ, షూటింగ్, క్వాలిటీ, విజువల్ ఎఫెక్ట్స్ కోసం బాగా సమయం తీసుకుని, ఆచి తూచి ఎంతో జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నారు. ఈ కారణంగా షూటింగ్, పోస్ట్ ప్రోడక్షన్‌కే చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. ఈ కారణంగా చిరంజీవి, నాగార్జున, ప్రభాస్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, అఖిల్, నిఖిల్, వరుణ్ తేజ్, శర్వానంద్... ఇలా పలువురు హీరోలు 2025ని మిస్ అవుతున్నారు. ఈ ఏడాది వారు సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఏమాత్రం లేవు. అలా 2025ని మిస్ అవుతున్న కథానాయకులెవరో చూద్దాం. రెండేళ్లుగా వెయిటింగ్ తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోల్లో చిరంజీవి ఒకరు. ఆయన సినిమా ఎప్పుడొస్తుందా? అని మెగా అభిమానులు రెండేళ్లకు పైగా వెయిటింగ్లో ఉన్నారు. చిరంజీవి హీరోగా వచ్చిన చివరి చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023 ఆగస్టు 11న విడుదలైంది. ఈ చిత్రం తర్వాత చిరంజీవి నటించిన సినిమా ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ మూవీలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేష న్స్ పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పల పాటి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నిర్మించారు.ఈ సినిమాని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అందుకు తగ్గట్టే షూటింగ్ కూడా శరవేగంగా జరిగింది. అయితే చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం కోసం ‘విశ్వంభర’ విడుదలను వాయిదా వేశారు మేకర్స్. ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్‌పై రకరకాల వార్తలొచ్చాయి. కానీ, ఈ ఏడాది కూడా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ కారణంగా ఈ సినిమాని 2026 వేసవిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.ఇదిలా ఉంటే చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ‘పండగకి వస్తున్నారు’ అన్నది ట్యాగ్‌లైన్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. అర్చన సమర్పణలో సాహు గార పాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వరుసగా 2024, 2025ని మిస్ అయ్యారు చిరంజీవి. అయితే వచ్చే ఏడాది రెండు సినిమాల్లో కనిపించి, అలరించనున్నారు.సోలో హీరోగా గ్యాప్ టాలీవుడ్ టాప్ ఫోర్ సీనియర్ హీరోల్లో నాగార్జున కూడా ఒకరు. ఆయన సోలో హీరోగా వచ్చిన చివరి చిత్రం ‘నా సామిరంగ’. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజైంది. అయితే ఆ తర్వాత ఆయన సోలో హీరోగా ఏ చిత్రంలోనూ నటించలేదు. కానీ ‘కుబేర, కూలీ’ సినిమాల ద్వారా తమిళ–తెలుగు ప్రేక్షకులను పలకరించారాయన. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘కుబేర’ సినిమాలో ధనుష్‌తో కలిసి స్క్రీన్ చేసుకున్నారు నాగార్జున. ఈ సినిమా జూన్ 20న విడుదలైంది.అలాగే రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ‘కూలీ’ సినిమాలో విలన్ పాత్రలో మెప్పించారు నాగార్జున. ప్రతి నాయకుడిగా ఆయనకు ఇదే మొదటి చిత్రం. ఇక నాగార్జున సోలో హీరోగా రూపొందనున్న వందో చిత్రానికి తమిళ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వం వహించనున్నారు. తన కెరీర్‌లోని ఈ మైలురాయి చిత్రంలో హీరోగా నటించడంతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్‌పై స్వయంగా నిర్మించనున్నారు నాగార్జున.ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే లాక్ అయింది. ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రకటన ఉంటుందని అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ, ఎలాంటి అప్డేట్ లేక పోవడంతో వారు నిరాశ చెందారు. ఈ సినిమా ఈ ఏడాది సెట్స్‌పైకి వెళ్లినా విడుదలయ్యేది మాత్రం 2026లోనే. ఆ రకంగా సోలో హీరోగా 2025ని నాగార్జున కూడా మిస్ అయినట్టే. అభిమానులకు నిరాశే వరుస పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ స్వింగ్‌లో దూసుకెళుతున్నారు హీరో ప్రభాస్. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. ప్రభాస్ సోలో హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం 2024 జూన్ 27న విడుదలైంది. ఆ తర్వాత ఆయన కథానాయకుడిగా రూ పొందుతోన్న సినిమా ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ హారర్ జానర్లో రూ పొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ద్వి పాత్రాభినయం చేస్తున్నారు.దీంతో ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమాని డిసెంబరు 5న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే టాకీ పార్ట్ పూర్తయినా కొన్ని పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉండటం, వీఎఫ్ఎక్స్ వల్ల డిసెంబరు 5న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయలేక పోతున్నట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఇటీవల ప్రకటించారు. దీంతో ప్రభాస్ అభిమానులు నిరాశపడ్డారు. ‘‘ది రాజా సాబ్’ సంక్రాంతికి వస్తే బాగుంటుందని ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు.తెలుగు బిజినెస్ సర్కిల్ వారు కూడా ఈ సినిమాని జనవరి 9న విడుదల చేయాలని చెబుతున్నారు. కానీ, హిందీ ఆడియ న్స్ మాత్రం డిసెంబర్ 5న రిలీజ్ చేయాలని కోరుతున్నారు’’ అంటూ టీజీ విశ్వప్రసాద్ తెలి పారు. అయితే తెలుగువారికి పెద్ద పండగైన సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఆ రకంగా సోలో హీరోగా 2025ని ప్రభాస్ మిస్ అయినట్టే. అయితే విష్ణు మంచు హీరోగా నటించిన ‘కన్నప్ప’లో రుద్రగా ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించి, అలరించారు. ఈ చిత్రం జూన్ 27న విడుదలైంది.నిరీక్షణ తప్పదు మహేశ్‌బాబు హీరోగా రూ పొందుతోన్న తాజా చిత్రం ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్). ‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ‘గుంటూరు కారం’ చిత్రం 2024 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత రాజమౌళి సినిమా ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ కమిట్ అయ్యారు మహేశ్. ఈ సినిమాలో ప్రియాంకా చో్ర పా, హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో ఇప్పటివరకూ చేయని వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు మహేశ్. ఇందుకోసం పొడవాటి జుట్టు, గడ్డంతో మేకోవర్ అయ్యారాయన. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఇండియానా జో న్స్ స్టైల్ కథతో ఈ సినిమా రూ పొందుతోందనే వార్తలు గత కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. రాజమౌళి సినిమా అంటే కనీసం రెండేళ్లకు పైగా చిత్రీకరణకు సమయం పడుతుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రోడక్షన్‌కి కూడా ఎక్కువ టైమ్ తీసుకుంటారాయన. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా 2026లో విడుదలయ్యే అవకాశాలు లేవని ఫిల్మ్‌నగర్ టాక్. 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ రకంగా చూస్తే 2025 కాదు... 2026ని కూడా మహేశ్ మిస్ అయ్యే అవకాశాలున్నాయి. అప్పటి వరకూ ఆయన అభిమానులకు నిరీక్షణ తప్పదు. రెండేళ్లు గ్యాప్? ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చిత్రం ‘దేవర: పార్ట్ 1’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2024 సెప్టెంబరు 27న విడుదలైంది. ఆ సినిమా తర్వాత ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు.ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రానికి ‘డ్రాగ న్ ’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని ఫిల్మ్‌నగర్ టాక్. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించింది. అయితే రిలీజ్ డేట్లో మార్పు చేసుకుంది. జనవరి 9న కాకుండా జూన్ 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొన్న విషయం తెలిసిందే.అంటే... సోలో హీరోగా దాదాపు రెండేళ్లు గ్యాప్ వచ్చినట్లు అవుతుంది ఎన్టీఆర్‌కి. ఇదిలా ఉంటే... హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన హిందీ చిత్రం ‘వార్ 2’. ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్ బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 14న విడుదల అయింది. అయితే ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన ఏ సినిమా కూడా 2025లో రిలీజ్ కాలేదు.. అలా ఈ ఏడాదిని ఆయన మిస్ అయినట్లే అని చె ప్పాచ్చు. గ్యాప్ ఇవ్వలేదు... వచ్చింది ‘గ్యాప్ ఇవ్వలేదు.. వచ్చింది..’ అంటూ ‘అల వైకుంఠపురములో...’ సినిమాలో అల్లు అర్జున్ ఓ డైలాగ్ చెబుతారు. అలా ‘పుష్ప 1, 2’ సినిమాల తర్వాత ఆయనకు 2025లో గ్యాప్ వచ్చినట్లే. సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప: ది రైజ్’, ‘పుష్ప: ది రూల్’ సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను అలరించారు హీరో అల్లు అర్జున్. ‘పుష్ప: ది రూల్’ 2024 డిసెంబరు 5న విడుదలై, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1800 కోట్ల రూ పాయల వసూళ్లు సాధించింది.ఆ సినిమా తర్వాత తమిళ డైరెక్టర్ అట్లీతో సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్. ‘ఏఏ22 ఏ6’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ హీరోయిన్గా ఫిక్స్ అయ్యారు. కళానిధి మార న్ సమర్పణలో సన్‌పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది.‘అవతార్’, ‘డ్యూన్’, ‘బార్బీ’ వంటి హాలీవుడ్ చిత్రాలకు పని చేసిన కన్నెక్ట్ మాబ్ సీన్ అనే ప్రముఖ టెక్నికల్ టీమ్ ఈ చిత్రానికి పని చేస్తోంది. ‘పుష్ప: ది రూల్’ తర్వాత వస్తున్న ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘ఏఏ22 ఏ6’ చిత్రం 2026 చివర లేదా 2027 సంక్రాంతికి విడుదల కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అలా 2025ని అల్లు అర్జున్ కూడా మిస్ అయ్యారు. ఇంకా... ⇒ అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెని న్ ’. ‘ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది’ కాదు అనేది ఉపశీర్షిక. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నాగార్జున, నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అఖిల్ నటించిన చివరి చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 ఏప్రిల్ 28న విడుదలైంది. ఆ తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం ‘లెనిన్’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ 2026లో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన వరుసగా 2024, 2025ని అఖిల్ మిస్సయ్యారు. ⇒ వరుణ్ తేజ్ హీరోగా రూ పొందుతోన్న తాజా చిత్రం ‘వీటీ 15’ (వర్కింగ్ టైటిల్). మేర్ల పాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్నారు. యువీ క్రియేష న్స్ , ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టై న్ మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. గత ఏడాది నవంబరు 14న ‘మట్కా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు వరుణ్. తాజాగా ఆయన నటిస్తున్న ‘వీటీ 15’ సినిమా ఈ ఏడాది నవంబరులో విడుదల కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రం కూడా 2026లోనే రిలీజ్ కానుందని ఫిల్మ్‌నగర్ టాక్. దీంతో వరుణ్ తేజ్ కూడా 2025ని మిస్ అయినట్లే. ⇒ నిఖిల్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్త, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం లేదు. నిఖిల్ నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రం గత ఏడాది నవంబరు 8న విడుదలైంది. సో... ‘స్వయంభు’ 2026లో రిలీజ్ కానుండటంతో 2025ని నిఖిల్ మిస్సయ్యారని చెప్పాచ్చు. ⇒ శర్వానంద్ హీరోగా నటించిన ‘మనమే’ చిత్రం 2024 జూన్ 7న విడుదలైంది. ఈ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న చిత్రాల్లో ‘నారి నారి నడుమ మురారి’ ఒకటి. సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టై న్ మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది విడుదల కావాల్సి ఉన్నా రిలీజ్ డేట్‌పై స్పష్టత లేదు. అదే విధంగా శర్వానంద్, మాళవికా నాయర్ జోడీగా నటిస్తున్న చిత్రం ‘శర్వా 36’ (వర్కింగ్ టైటిల్). అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ రెండు చిత్రాలు కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలు లేవు. ఈ కారణంగా శర్వానంద్ కూడా 2025ని మిస్ అయినట్లే. పైన చెప్పిన హీరోలే కాదు. ఇంకా పలువురు కథానాయకులు 2025ని మిస్ అయ్యారు. 2025ని మిస్ అయినప్పటికీ 2026లో మాత్రం తమ జోరు చూపిస్తామంటున్నారు. – డేరంగుల జగన్ మోహన్ -
రాజమౌళి సైలెంట్.. హీరోయిన్ మాత్రం తగ్గట్లే
స్టార్ డైరెక్టర్ రాజమౌళి.. ప్రస్తుతం మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ ఉందని అందరికీ తెలుసు. కానీ రాజమౌళి ఒక్కటంటే ఒక్క మాట బయటపడకుండా జాగ్రత్త పడుతున్నాడు. అటు మహేశ్ బాబు కూడా పిన్ డ్రాప్ సైలెంట్ అనేలానే ఉన్నాడు. మిగతా టీమ్ అంతా కూడా ఒక్క ఫొటో కూడా పోస్ట్ చేయట్లేదు. కానీ హీరోయిన్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. ఫొటోలు పోస్ట్ చేస్తూనే ఉంది. తాజాగా ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.రాజమౌళి-మహేశ్ బాబు సినిమాకు 'SSMB29' అనే వర్కింగ్ టైటిల్ నిర్ణయించారు. ఇందులో హీరోయిన్గా ప్రియాంక చోప్రా చేస్తోంది. షూటింగ్ జరిగిన ప్రతిసారి ఆ ప్రాంత ఫొటోలని ఈమె పోస్ట్ చేస్తూనే ఉంది. కొన్ని నెలల క్రితం ఒడిశాలో షూటింగ్ జరగ్గా.. అప్పుడు కూడా ఆయా ప్రాంతంలో తీసుకున్న కొన్ని ఫొటోల్ని ప్రియాంక పోస్ట్ చేసింది. ఇప్పుడు టీమ్ అంతా కెన్యాలో చిత్రీకరణ చేస్తోంది. అక్కడ పర్యావరణ అందాల్ని తన కెమెరాలో బంధించిన ఈ బ్యూటీ.. పలు ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో మహేశ్ ఫ్యాన్స్‌కి షూటింగ్ అప్డేట్ ఇచ్చినట్లయింది.(ఇదీ చదవండి: హీరో అసభ్య ప్రవర్తన.. నేను ఎంజాయ్ చేయలేదు, ఏడ్చా.. ఇండస్ట్రీకో దండం!) చాలా ఏళ్ల క్రితమే రాజమౌళి.. కెన్యా వెళ్లి వచ్చాడు. అప్పుడు లొకేషన్ల కోసం కాగా ఇప్పుడు షూటింగ్ జరుగుతోంది. అయితే ఆగస్టు 9న మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఏదైనా లుక్, పోస్టర్ లాంటిది వస్తుందని అభిమానులు ఆశపడ్డారు. కానీ నవంబర్లోనే అఫీషియల్ పోస్టర్ వస్తుందనే అప్డేట్ లాంటిది ఆ రోజున ప్రకటించారు. ఇప్పుడు కెన్యాలో ఎలాంటి సౌండ్ లేకుండా షూటింగ్ చేసుకుంటున్నారు. గత చిత్రాలతో పోలిస్తే రాజమౌళి ఈసారి భిన్నంగా ప్రవర్తిస్తుండటం విశేషం.ఇకపోతే ఈ మూవీ గ్లోబ్ ట్రాటెర్ కాన్సెప్ట్ అని చాన్నాళ్ల క్రితమే చెప్పారు. అంటే ఈ స్టోరీలో హీరో ప్రపంచమంతా తిరుగుతుంటాడు. అడ్వెంచర్స్ చేస్తుంటాడు. మహేశ్ బాబుకి విలన్‌గా 'సలార్' ఫేమ్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు. ఈ విషయం కూడా చాన్నాళ్ల క్రితం లీకైన ఓ వీడియో వల్ల బయటపడింది.(ఇదీ చదవండి: ఎంగేజ్మెంట్తో మారిపోయా.. ఇకపై అలాంటి సీన్లు చేయను: విశాల్) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
వారి కోసం రెండు షిఫ్టులు పని చేస్తాను: శ్రీలీల
ఈ మధ్య సీనియర్ హీరో జగపతిబాబు కొత్తగా టాక్ షోను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అందులో శ్రీలీల తన తల్లితో కలిసి పాల్గొంది. కాగా ఈ షోలో శ్రీలీలకు రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ ఒకేసారి కాల్షీట్లు అడిగితే ముందు ఎవరికి కాల్షీట్ ఇస్తావ్? అనే ప్రశ్న ఎదురైంది. దానికి శ్రీలీల ఎప్పట్లానే తన స్టైల్లో గడసరి సమాధానం చెప్పింది. ఈ ఇద్దరి కోసం రెండు షిఫ్టులు పనిచేస్తుందట. ఇక మహేష్ బాబు, రవితేజలో ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారనే ప్రశ్నకు రవితేజ పేరు చెప్పింది.పెళ్లి సందD మూవీతో వెండితెరపై హీరోయిన్గా శ్రీలీల ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ధమాకా, గుంటూరు కారం, భగవంత్ కేసరి, స్కంద, రాబిన్‌హుడ్, జూనియర్.. ఇలా అనేక సినిమాలు చేసింది. పుష్ప 2లో 'కిస్ కిస్ కిస్సిక్..' అనే ఐటం సాంగ్‌లోనూ ఆడిపాడింది. జూనియర్ మూవీలోని వైరల్ వయ్యారి పాటతో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. తాజాగా రవితేజ సరసన నటించిన మాస్ జాతర త్వరలోనే రిలీజ్ కానుంది. -
ఘట్టమనేని వారసుడికి జోడీగా బాలీవుడ్ హీరోయిన్ కూతురు
-
మహేష్ మూవీ విడుదల ముహూర్తం ఖరారు
-
స్టార్ హీరోయిన్ కూతురు ఎంట్రీ.. ఘట్టమనేని జయకృష్ణతో ఫస్ట్ సినిమా!
ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరోను లాంచ్ చేసేందుకు అంతా సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహేశ్ బాబు పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటుతున్నారు. త్వరలో ఆయన సోదరుడు రమేశ్ బాబు కుమారుడు జయకృష్ణ చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు. మహేశ్ కి అన్నయ్య అయిన రమేశ్ బాబు కూడా హీరోగా పలు చిత్రాలు చేశారు గానీ పెద్దగా నిలదొక్కుకోలేకపోయారు. తర్వాత వ్యాపారాలు చూసుకున్నారు. కొన్నేళ్ల క్రితం అనారోగ్య సమస్యలతో ఆయన చనిపోయారు. బాబాయ్‌గా జయకృష్ణను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను మహేశ్ తీసుకున్నారు.హీరోయిన్ ఎవరు..?ఘట్టమనేని వారసుడు జయకృష్ణకు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రషా టాండానీ టాలీవుడ్‌కు పరిచయం కానుందని వార్తలు వస్తున్నాయి. ఆమె ఇప్పటికే బాలీవుడ్లో ఆజాద్ అనే సినిమాలో నటించింది. - రషా తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ పొందింది. సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది. ఇప్పుడు వీరద్దరూ కలిసి సినిమా చేస్తున్నట్లు వార్తలు రావడంతో నెట్టింట వైరల్ అవుతుంది. 'ఆర్ఎక్స్ 100', 'మంగళవారం' సినిమాల ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతిని దర్శకుడిగా తీసుకున్నారని సమాచారం. ఎమోషనల్ లవ్ స్టోరీతో జయకృష్ణను చిత్రపరిశ్రమకు పరిచయం చేయాలనే ఆలోచనతో అజయ్ భూపతి ఉన్నారని టాక్.మహేశ్ బాబుని లాంచ్ చేసిన నిర్మాత అశ్వనీదత్.. జయకృష్ణని కూడా ఒక నిర్మాతగా పరిచయం చేయబోతున్నారని ఇండస్ట్రీలో టాక్. ప్రస్తుతం అంతా ఫిక్స్ అయినప్పటికీ, త్వరలో ఈ విషయమై క్లారిటీ ఇస్తారు. ఇకపోతే మహేశ్.. రాజమౌళి సినిమా బిజీలో ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ కి విరామం ప్రకటించడంతో జయకృష్ణ లాంచింగ్ పనులు చూస్తున్నారట. -
జేమ్స్ కామెరాన్ చేతిలో SSMB29 ప్రమోషన్స్
-
కామెరూన్‌తో ఫస్ట్ లుక్ రిలీజ్?
హీరో మహేశ్‌బాబు–దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను సెప్టెంబరులో నైరోబీ, టాంజానియా, సౌత్ ఆఫ్రికా లొకేషన్స్‌లో ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. కాగా ఈ సినిమా అప్డేట్ను నవంబరులో వెల్లడిస్తామని మహేశ్‌బాబు బర్త్ డే సందర్భంగా ఈ ఆగస్టు 9న రాజమౌళి పేర్కొన్నారు. ఈ సినిమాకు ‘జెన్ 63’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారనే వార్త ప్రచారంలో ఉంది.ఇక ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్రదర్శకుడు జేమ్స్ కామెరూన్ ఇండియా వచ్చినప్పుడు ఈ ‘జెన్ 63’ ఫస్ట్ లుక్, ప్రమోషనల్ కంటెంట్‌ను ఆయన చేతుల మీదుగా రిలీజ్ చేస్తే గ్లోబల్ రేంజ్లో రీచ్ ఉంటుందని రాజమౌళి భావిస్తున్నారట. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.ఇదిలా ఉంటే... 2023లో జరిగిన ఓ అంతర్జాతీయ అవార్డుల వేడుకలో భాగంగా రాజమౌళి, జేమ్స్ కామెరూన్ కలుసుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని కామెరూన్ ప్రశంసించారు. ఇదిలా ఉంటే... జేమ్స్ కామెరూన్ డైరెక్షన్‌లోని ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ చిత్రం ఈ డిసెంబరు 19న తెలుగులోనూ రిలీజ్ కానుంది. -
మహేశ్ బాబు కూతురికి తప్పని 'ఫేక్' కష్టాలు
ఇప్పుడంతా సోషల్ మీడియా జమానా. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అన్ని రకాల ఫ్లాట్‌ఫామ్స్‌లో కనిపిస్తున్నారు. అయితే సోషల్ మీడియా వల్ల మంచి ఉన్నట్లే చెడు కూడా బోలెడంత ఉంది. ఫేక్ అకౌంట్ల బాధ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. సెలబ్రిటీలు, వాళ్ల పిల్లలు వీటి బారిన పడుతుంటారు. ఇప్పుడు మహేశ్ బాబు కూతురు సితారకు కూడా అలాంటి అనుభవమే ఎదురైనట్లు ఉంది. దీంతో ఓ పోస్ట్ పెట్టింది. క్లారిటీ ఇచ్చింది.(ఇదీ చదవండి: ప్రభాస్.. రూ.50 కోట్లు తిరిగిచ్చేశాడు: డిస్ట్రిబ్యూటర్)'నా పేరు మీద పలు ఫేక్ అకౌంట్స్ ఉన్నట్లు దృష్టికి వచ్చింది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ.. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే అకౌంట్ ఉంది. ఇదే నా అఫీషియల్. ఏదైనా చెప్పాలనుకుంటే దీని ద్వారా చెబుతా. వేరే ఏ సోషల్ మీడియాలోనూ నాకు ఖాతా లేదు' అని సితార ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. మరి సితారకు ఈ మధ్య కాలంలో ఫేక్ అకౌంట్స్ వల్ల ఏదైనా సమస్య ఎదురైందేమోనని అనిపిస్తుంది. లేదంటే సడన్‌గా ఇప్పుడెందుకు ఈ పోస్ట్ పెడుతుంది?సితార విషయానికొస్తే క్లాసికల్ డ్యాన్స్ లాంటివి నేర్చుకుంటుంది. ప్రస్తుతానికైతే టీనేజర్. నటి అవుతానని గతంలో ఓసారి చెప్పింది. మరి ఎప్పుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుందో చూడాలి? మహేశ్ బాబు విషయానికొస్తే రాజమౌళితో సినిమా చేస్తున్నారు. పదిరోజుల క్రితం మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఏదైనా అప్డేట్ వస్తుందని అభిమానులు ఎదురుచూశారు కానీ నవంబరులోనే అలాంటివి ఉంటాయని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు.(ఇదీ చదవండి: దెయ్యంగా రష్మిక.. 'వరల్డ్ ఆఫ్ థామా' చూశారా?) View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) -
మహేశ్‌బాబు బ్యానర్ సినిమా.. 'రావు బహదూర్' టీజర్
మహేశ్‌బాబు, నమ్రాతా శిరోద్కర్ సొంత నిర్మాణ సంస్థ GMB ఎంటైర్టెన్మెంట్స్ సమర్పణలో తెరకెక్కుతున్న ‘రావు బహదూర్’ మూవీ టీజర్ తాజాగా విడుదలైంది. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కిస్తున్నారు. గతంలో ఆయన డైరెక్ట్ చేసిన 'కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాలు టాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్నాయి.ఈ చిత్ర టీజర్‌ను అగ్ర దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. సైకలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ రానుంది. ఈ ప్రాజెక్ట్‌లో సత్యదేవ్ పాత్ర సరికొత్తగా ఉండనుంది. రావు బహదూర్ పాత్ర మేకప్ కోసమే అయిదుగంటల సమయం పట్టేదని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో వికాస్ ముప్పాల, దీపా థామస్, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ తదితరులు ఉన్నారు. -
మహేష్ మూవీపై కీలక ప్రకటన
-
మహేశ్ బాబు మరదలికి తృటిలో తప్పిన ప్రమాదం
బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ (Shilpa shirodkar) రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. ఇదే విషయాన్ని తెలుపుతూ సోషల్‌మీడియాలో ఆమె పోస్ట్ చేసింది. ఈ క్రమంలో తన కారు ఫోటోలను కూడా పంచుకుంది. మహేశ్‌బాబు మరదలు, నమత్రా శిరోద్కర్‌కు ఆమె సోదరి అవుతారనే విషయం తెలిసిందే. 'బ్రహ్మ' సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన ఆమె పలు హిందీ సీరియళ్లలో కీలక పాత్రలు పోషించింది. ఆపై ‘బిగ్‌బాస్ 18’ (హిందీ) కంటెస్టెంట్‌గా కూడా మెప్పించింది.ముంబైలో తాను ప్రయాణిస్తున్న కారును ఒక ప్రైవేట్ బస్సు ఢీ కొట్టిందని శిల్పా శిరోద్కర్ పేర్కొంది. అయితే, ఈ ప్రమాదంలో తనకు ఎలాంటి గాయాలు కాలేదని చెప్పింది. కానీ, తన కారుకు మాత్రమే డ్యామేజ్ అయిందని ఆమె ఇలా చెప్పింది. ఆ బస్సు ఏ కంపెనీ కోసం అయితే పనిచేస్తుందో ఆ యాజమాన్యంపై శిల్పా ఫిర్యాదు చేసింది. అయితే, ఎవరికీ గాయాలు కాలేదు కదా అంటూ.. ఈ సంఘటనకు తమ కంపెనీ బాధ్యత వహించడానికి సిద్ధంగా లేదని సదరు కంపెనీ చెప్పినట్లు ఆమె పేర్కొంది. ముంబైలోని ఆ ఆఫీసుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులు యోగేష్ కదమ్, విలాస్ ఇది తమ కంపెనీ బాధ్యత కాదని, డ్రైవర్ బాధ్యత అని వెళ్లిపోయారని శిల్పా శిరోద్కర్ పేర్కొంది. ఈ వ్యక్తులు ఎంత క్రూరంగా ఉన్నారు..? డ్రైవర్ ఎంత సంపాదిస్తున్నాడు..? అని సోషల్‌మీడియాలో ఆమె రాసింది. ఈ విషయంలో ముంబై పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యారని వారు సరైనా న్యాయం చేశారని ఆమె తెలిపింది. -
మహేశ్ బాబు నిర్మాతగా కొత్త సినిమా.. ఈ హీరోని గుర్తుపట్టారా?
ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్న మహేశ్ బాబు.. ఆ బిజీలో ఉన్నాడు. మరోవైపు నిర్మాతగా కొత్త మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మేరకు డీటైల్స్ బయటపెట్టారు. 'కేరాఫ్ కంచరపాలెం' ఫేమ్ వెంకటేశ్ మహా చాన్నాళ్ల తర్వాత మళ్లీ దర్శకత్వం చేస్తున్నాడు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? హీరో ఎవరు?(ఇదీ చదవండి: మెడలో పసుపు తాడుతో 'కోర్ట్' హీరోయిన్ శ్రీదేవి.. ఏంటి విషయం?)టాలీవుడ్లో హీరో కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్.. ఇటీవలే 'కింగ్డమ్'లోనూ హీరోకి సరిసమానంగా ఉండే నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు వెంకటేశ్ మహా దర్శకత్వంలో కొత్త సినిమా చేయబోతున్నాడు. దీనికి 'రావు బహదూర్' అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ కూడా వదిలారు.సత్యదేవ్.. 'రావు బహదూర్' ఫస్ట్ లుక్ పోస్టర్లో డిఫరెంట్‌గా కనిపించాడు. చెప్పాలంటే గుర్తుపట్టడం చాలా కష్టం. ముసలి రాజు గెటప్‌లో అస్సలు గుర్తుపట్టలేనట్లు ఉన్నాడు. 'అనుమానం పెనుభూతం' అనే ట్యాగ్ లైన్‌తో ఈ మూవీ తీస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించేశారు. గతంలో సత్యదేవ్-వెంకటేశ్ మహా 'ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య' అనే మూవీ చేశారు. కాకపోతే అది రీమేక్. ఇప్పుడు ఒరిజినల్ కంటెంట్‌తో వస్తున్నారు. ఈసారి ఏం మ్యాజిక్ చేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: ఆ సినిమా చేస్తున్నప్పుడు కంఫర్ట్‌గా అనిపించలేదు: అనుపమ) -
సూపర్ స్టార్ బర్త్ డే కు అదిరిపోయిన రాజమౌళి సర్ ప్రైజ్
-
మహేష్ నువ్వు తెలుగు సినిమా కే : చిరు
-
నా బలం, నా సర్వస్వం.. మహేశ్‌కి నమ్రత స్పెషల్ విషెస్
తెలుగు హీరో మహేశ్ బాబు.. 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సెలబ్రిటీలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. మరోవైపు మహేశ్ భార్య నమ్రత కూడా క్యూట్ అండ్ లవ్లీ విషెస్ చెప్పింది. తనకు బలం, సర్వస్వం నువ్వే అని చెబుతూ ఫ్యామిలీ ఫొటోని పంచుకుంది. ఈ పోస్ట్‌కి మహేశ్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.(ఇదీ చదవండి: తెలుగు సినిమాకు గర్వకారణం.. మహేశ్ బాబుకు 'మెగా' శుభాకాంక్షలు)దాదాపు 25 ఏళ్లుగా సినిమాలు చేస్తున్న మహేశ్ బాబు.. తన నటనతో పాటు వ్యక్తిగతంగానూ ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఈ క్రమంలో చాలామంది పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అలానే థియేటర్లలో రీ రిలీజ్ అయిన 'అతడు' చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మిగతా వాళ్లు విషెస్ చెప్పడం సంగతి చెప్పడం కంటే మహేశ్‌కి భార్య నమ్రత తన విషెస్ చెప్పడం ప్రత్యేకంగా నిలిచింది.'నా జీవితాన్ని ఓ అందమైన కలలా మార్చిన మనిషికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నా లవ్, నా బలం, నా సర్వస్వం. ఎప్పటికీ నిన్నే ప్రేమిస్తుంటా మహేశ్' అని నమ్రత తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. మరోవైపు మహేశ్ పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి మూవీ నుంచి చిన్న అప్డేట్ కూడా వచ్చింది. నవంబర్లోనే సినిమా నుంచి కీలక అప్డేట్ ఇస్తామని, అప్పటివరకు వెయిటింగ్ తప్పదు అని ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'చిట్టి' గుండెల కోసం మహేశ్ బాబు.. సాయం కోసం ఇలా సంప్రదించండి) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
మహేశ్ బాబు సినిమా.. కీలక అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
మహేశ్‌బాబు నేడు (ఆగష్టు 9) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తను హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్) నుంచి దర్శకుడు రాజమౌళి ఒక అప్డేట్ ఇచ్చారు. చాలా కాలంగా ఈ సినిమా వివరాల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కథ ఏంటి? షూటింగ్ ఎంత వరకూ వచ్చింది? వంటి విషయాలపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో మహేశ్ అభిమానుల్లో నిరాశ ఏదురైంది. అయితే, తాజాగా జక్కన్న చేసిన ప్రకటనతో కాస్త రిలాక్స్ అయ్యారు.మహేశ్‌బాబు సినిమా గురించి ఉద్దేశిస్తూ రాజమౌళి ఇలా పోస్ట్ చేశారు.. 'భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రియమైన సినిమా ప్రేమికులారా, అలాగే మహేశ్ అభిమానులారా.. మేము షూటింగ్ ప్రారంభించి చాలా కాలం అయింది. ఈ చిత్రం గురించి తెలుసుకోవాలనే మీ ఆసక్తిని మేము అభినందిస్తున్నాము. అయితే, ఈ సినిమా కథ పరిధి చాలా విస్తృతమైనది. కేవలం ప్రెస్‌మీట్ పెట్టి ఆపై కొన్ని పోస్టర్స్ విడుదల చేయడం వల్ల ఈ ప్రాజెక్ట్‌కు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేమని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం మేము ఒక ప్రపంచాన్ని సృష్టిస్తున్నాం. చాలా లోతైన సబ్జెక్ట్ కోసం కష్టపడుతున్నాం. ఒక అద్భుతాన్ని చూపించేందుకు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాం. అయితే, నవంబర్ 2025లో ఈ సినిమా గురించి ఆవిష్కరిస్తాం. అప్పుడు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఎంతో కాలంగా ఓపికతో ఉన్న మీ అందరికీ ధన్యవాదాలు.' అని రాజమౌళి పేర్కొన్నారు.అయితే ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ‘ఇండియానా జోన్స్’ స్టైల్ కథతో ఈ సినిమా రూపొందుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే... ఈ కథలో విలన్ ఎవరు? అనే విషయం సినిమా ముగిసేవరకూ ఊహించలేమట. పతాక సన్నివేశాల వరకు నెగెటివ్ రోల్ తెలియనివ్వకుండా ప్రేక్షకులను సస్పెన్స్ చేయనున్నారట రాజమౌళి. ఈ చిత్రంలో మాధవన్ కీలకపాత్రలో కనిపించనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. దాంతో ఆయన విలన్‌గా కనిపించనున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ సినిమాలో హీరోయిన్ ప్రియాంకా చోప్రా హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలు చేస్తున్నారు. కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. For all the admirers of my #GlobeTrotter… pic.twitter.com/c4vNXYKrL9— rajamouli ss (@ssrajamouli) August 9, 2025 -
మహేశ్ బాబు 50వ పుట్టినరోజు.. గోల్డెన్ పిరియడ్ (ఫోటోలు)
-
తెలుగు సినిమాకు గర్వకారణం.. మహేశ్ బాబుకు 'మెగా' శుభాకాంక్షలు
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు (Mahesh Babu) నేడు 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సందడి నెలకొంది. ప్రతి ఒక్కరి జీవితంలో 50 ఏళ్ల వేడుక చాలా ప్రత్యేకమైనది. దీంతో ఇండస్ట్రీలోని చాలామంది సెలబ్రిటీలు ఆయనకు విషెస్ చెబుతూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు. ఈ క్రమంలో పలు సినీ నిర్మాణ సంస్థలు కూడా మహేశ్‌కు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్‌లు పెడుతున్నాయి. మరోవైపు ‘అతడు’ రీ రిలీజ్ సందర్భంగా థియేటర్లలో వద్ద అభిమానులతో సందడి వాతావరణం నెలకొంది.'నా ప్రియమైన మహేశ్ బాబుకు 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు తెలుగు సినిమాకు గర్వకారణం. అతీంద్రియాలను జయించాలని నిర్ణయించుకున్నారు. ప్రతి సంవత్సరం గడిచేకొద్దీ మీరు చిన్నవారవుతున్నట్లు కనిపిస్తోంది. మీకు అద్భుతమైన సంవత్సరం కానుంది. ఎన్నో సంతోషాలను తీసుకొస్తుంది.'.. - చిరంజీవిప్రియమైన మహేశ్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ రోజు నీకు 50 ఏళ్లు నిండుతాయి. కానీ, నువ్వు ఎప్పటికీ నా చిన్నోడివే . నీ జోక్స్, ప్రేమ ఎప్పటికీ చాలా మంది హృదయాలకు చేరువ అవుతుంది. నిజంగా నీలాంటి వారు ఎవరూ లేరు. ఎప్పటికీ నవ్వుతూ ఉండు. #SSMB29లో ప్రపంచం నీ మాయాజాలాన్ని చూసే వరకు నేను వేచి ఉండలేను!.. - వెంకటేశ్ Wishing Superstar 🌟 @urstrulyMahesh garu a spectacular 50th birthday! 💥Your charisma only grows stronger with time. Onward to the next epic chapter ahead! 🦁🔥#HBDSuperStarMahesh pic.twitter.com/tLHxdLcDom— Geetha Arts (@GeethaArts) August 9, 2025Happy Happy 50th, my dear SSMB @urstrulyMahesh !💐🤗You are the pride of Telugu Cinema, destined to conquer the beyond! You seem to grow younger with every passing year! Wishing you a wonderful year ahead and many, many happy returns! 💐— Chiranjeevi Konidela (@KChiruTweets) August 9, 2025 -
'చిట్టి' గుండెల కోసం మహేశ్ బాబు.. సాయం కోసం ఇలా సంప్రదించండి
మహేశ్‌బాబు అనగానే టక్కున గురొచ్చేది రాజకుమారుడు లాంటి అందం. నేడు ఆయన 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కానీ, ఇది కేవలం నంబర్ మాత్రమే.. వయసుతో సంబంధం లేకుండా గ్లామర్‌తో చూపు తిప్పుకోనివ్వడు. ఇప్పటికీ టీనేజర్లా ఉంటాడు. తన తనయుడికి సోదరుడిలా కనిపిస్తారు. టాలీవుడ్లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరు అనే ప్రశ్నకు ప్రిన్స్ మహేశ్ పేరు మొదటి వరుసలో ఉంటుంది. అయితే, ఆయన కేవలం అందంతో మాత్రమే కాదు.. వ్యక్తిత్వంతోనూ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటారు. టక్కరిదొంగలా అభిమానుల మనసు దోచేశాడు. నాన్న నుంచి నేర్చుకున్న పాఠాలతో తన జీవితానికి బంగారు బాటలు వేసుకున్నాడు. పేద చిన్నారులకు సాయం చేయడంలో ఆయనకు ఎవరూ సరిలేరు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా మహేశ్‌బాబు ఫౌండేషన్ గురించి తెలుసుకుందాం.ఎప్పుడూ తప్పుచేయని జీవితంమహేశ్బాబు ఎప్పుడూ కూడా నవ్వుతూనే కనిపిస్తారు. ముఖంమీద చెరగని చిరునవ్వే నిజమైన అందమని ఒకసారి మహేశ్ పంచుకున్నారు. అయితే, ఆ నవ్వు మనస్ఫూర్తిగా రావాలని, అందుకు మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని అన్నారు. జీవితంలో తాను చాలా ప్రశాంతంగా ఉండటానికి ప్రధాన కారణం ఎప్పడూ కూడా తప్పు చేయకపోవడమేనని తెలిపారు. భవిష్యత్తులోనూ ఎలాంటి తప్పు చెయ్యనని.. అది తన మీద తనకున్న నమ్మకం అంటూ.. అది నాన్న నుంచి నేర్చుకున్నానని పలుమార్లు మహేశ్ చెప్పారు.చిట్టి గుండెలను కాపాడే 'సేవియర్'మహేశ్ ఎన్నో చిట్టి ‘గుండె’లను కాపాడారు. ఇప్పటి వరకు ఏకంగా 4500 మంది చిన్నారుల ప్రాణాలకు ఊపిరిలూది రియల్ హీరో అనిపించుకున్నారు. సాయం కోసం చేయి చాచిన వారందరికి అండగా నిలుస్తూ.. పేద పిల్లలకు ఆపరేషన్లు చేయించాలని మహేశ్ దంపతులు నిర్ణయించుకున్నారు. విజయవాడ ఆంధ్రా హాస్పిటల్ ద్వారా మహేశ్‌బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేల మంది చిన్నారులకు ఇప్పటికే వైద్య సాయం అందించారు. తెలంగాణలో ఉండేవావి కోసం ఇబ్బంది లేకుండా ‘ప్యూర్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్’ పేరిట హైదరాబాద్‌లోనూ గుండె ఆపరేషన్లు చేయించడం మొదలుపెట్టారు. దీంతో అభిమానులు ఆయన్ను ఏకంగా దేవుడిలా పూజిస్తారు. 'రాళ్లలో దేవుడున్నాడో లేదో మాకు తెలీదు.. కానీ ఇన్ని ప్రాణాలు కాపాడిన మా మహేశ్వరుడిలో ఖచ్చితంగా ఉన్నాడు' అంటూ పొంగిపోతారు.స్థాపనకు ప్రేరణమహేష్ బాబు తన కుమారుడు గౌతమ్ పుట్టినప్పుడు గుండె సంబంధిత సమస్య ఎదుర్కొన్నాడు. అయితే, తనకు ఆర్థికంగా సౌలభ్యం ఉండటంతో సర్జరీ చేయించగలిగాడు. కానీ, డబ్బుల్లేక చిన్నారులు చికిత్స పొందలేక పోతున్నారనే ఆలోచన మహేష్‌ను ఎంతో కలవరపెట్టింది. అందుకే, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఉచిత గుండె ఆపరేషన్లు అందించేందుకు ఈ ఫౌండేషన్‌ను స్థాపించారు. ఫౌండేషన్ వెబ్సైట్ ద్వారా డైరెక్ట్‌గా రిక్వెస్ట్ పెట్టే అవకాశం కల్పించడం విశేషం. మహేశ్ బాబు ఫౌండేషన్‌ను ఆయన తన సతీమణి నమ్రతా శిరోద్కర్‌తో కలిసి 2020లో స్థాపించారు.నిధులు ఎలా..?మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా చిన్నపిల్లల గుండె ఆపరేషన్ల కోసం ఏటా సుమారు రూ. 50 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని సమాచారం ఉంది. మహేష్ బాబు తన సంపాదనలో సుమారు 30% భాగాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయిస్తున్నారు. ఉచిత వైద్య శిబిరాలు, బాలికలకు గర్భకోశ క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్లు, పాఠశాలకు కంప్యూటర్లతో పాటు మహేష్ బాబు దత్తత తీసుకున్న గ్రామాలకు ఆయన చేసిన అభివృద్ధి పనులు నిజంగా ప్రశంసనీయం. ఆయన 2016లో ఆంధ్రప్రదేశ్‌లోని బుర్రిపాలెం మరియు తెలంగాణలోని సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకున్నారు. అక్కడి ఆసుపత్రుల నుంచి బడుల వరకు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు.రియల్ హీరోగా మహేష్.. సాయం కోసం ఇలా 'ధరఖాస్తు' చేయండిమహేష్ బాబు తన సినీ జీవితంతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ ఆదర్శంగా మొదటి నుంచి నిలుస్తున్నారు. అభిమానులు ఆయనను "మహేశ్వరుడు" అని పిలుస్తూ, దేవుడిగా భావిస్తున్నారు. మహేష్ బాబు ఫౌండేషన్ వెబ్సైట్ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది. పేద పిల్లల హార్ట్ సర్జరీ కోసం డైరెక్ట్‌గా వెబ్సైట్లోనే https://www.maheshbabufoundation.org/request/ రిక్వెస్ట్ పెట్టొచ్చు. ఇందులో పూర్తి వివరాలతో నమోదు చేసుకుంటే మహేశ్ టీమ్ మిమ్మల్నే సంప్రదిస్తుంది. కొద్దిరోజుల క్రితం ప్రతి మహేష్ బాబు ఫ్యాన్ తమ సోషల్ మీడియా బయోలో ఫౌండేషన్ లింక్‌ను షేర్ చేశారు. సోషల్‌మీడియాలో నెటిజన్లు కూడా ఆయన్ను అభినందిస్తూ పోస్టులు పెట్టారు. ఫ్యాన్ వార్ పేరుతో కొందరు మహేశ్‌ను టార్గెట్ చేసినా.. ఆయన చేసిన మంచిపనులే తిరిగి సమాధానం చెప్తాయి.సూపర్‌స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్ఇటీవల ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్ధంతి సందర్భంగా (Superstar Krishna Educational Fund)ను ప్రారంభించారు, ఇది పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించేందుకు ఉద్దేశించబడింది. మొదటి ఏడాదిలోనే 40మందికి పైగా పేద విద్యార్థులను ఎంపిక చేసి ఈ స్కాలర్షిప్ అందించారు. పాఠశాల చదువు నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉపకార వేతనం ఇవ్వనున్నారు. భవిష్యత్‌లో ఈ సంఖ్య పెంచుకుంటూ పోతారు.తండ్రికి తగ్గ కూతురుమహేష్ బాబు ముద్దుల కూతరు సితారకు భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. పీఎంజే అనే జ్యువెలరీ కంపెనీ యాడ్‌లో నటించిన సితారకు సుమారు రూ. 1 కోటి పైగానే రెమ్యునరేషన్ వచ్చింది. అయితే తనకు వచ్చిన మొదటి పారితోషికాన్ని ఒక చారిటీకి విరాళంగా ఇచ్చేసింది. ఈ విరాళం వృద్ధుల ఆరోగ్యం, ఆహారం, అవసరాల కోసం ఉపయోగించబడింది. తండ్రి బాటలోనే సేవా దృక్పథం వైపు అడుగులు వేసిన సితారను ఎందరో అభినందించారు.టాలీవుడ్లో తిరుగులేని రికార్డ్స్మహేశ్ ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాల్లో నటించలేదు. ఆయన సినిమాలు కనీసం రెండు మూడు భాషల్లో కూడా విడుదల కాలేదు. కేవలం తెలుగులోనే విడుదలయ్యాయి. ఈ క్రమంలో కేవలం టాలీవుడ్ బాక్సాఫీస్ కలెక్షన్లను తిరగేసి ఆయన రికార్డ్స్‌ను చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. అత్యధిక కలెక్షన్లు సాధించిన ప్రాంతీయ భాషా చిత్రాలుగా పాన్ ఇండియా చిత్రాల సరసన నిలబడ్డాయి.మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ తెలుగులోనే విడుదలై రూ. 214 కోట్ల వసూళ్లను సాధించింది. సరిలేరు నీకెవ్వరు రూ. 260 కోట్లు, మహర్షి రూ. 170 కోట్లు, గుంటూరు కారం రూ. 200 కోట్లు, భరత్ అనే నేను రూ. 187 కోట్లు రాబట్టింది. ఒక్క భాషలోనే విడుదల అయితేనే ఇలాంటి కలెక్షన్లతో సత్తా చాటితే అదే పాన్ ఇండియా రేంజ్లో రేపొద్దన బొమ్మ పడితే ఎలా ఉంటుందో ఊహకే వదలేయ వచ్చు అని చెప్పవచ్చు. -
ఖలేజా రికార్డ్స్ బద్దాలేనా? అతడు రీ-రిలీజ్
-
థియేటర్లలో మరోసారి అతడు.. రీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
టాలీవుడ్లో ఈ ఏడాది రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలు సినిమాలు మళ్లీ బిగ్ స్క్రీన్‌పై సందడి చేశాయి. తాజాగా మరో టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది. ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9న అతడు సినిమా థియేటర్లలో కనువిందు చేయనుంది.ఈ నేపథ్యంలోనే అతడు రీ రిలీజ్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మహేశ్‌బాబు- త్రివిక్రమ్ కాంబోలో 2005లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. మహేశ్ బాబు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలోని డైలాగ్స్, పాటలు అద్భుతంగా ఆకట్టుకున్నాయి. దీంతో మరోసారి మహేశ్ బాబు- త్రిష కెమిస్ట్రీని థియేటర్లలో చూసే ఛాన్స్ వచ్చింది. Gun & Bullet rendu chuddam Super 4K lo...vindham Dolby lo 🤌🔥Here comes the #AthaduSuper4K Trailer ▶️ https://t.co/hJrElS0H5d Releasing in theatres as a Superstar @urstrulyMahesh Birthday Special on Aug 9th♥️#AthaduHomecoming#Athadu4KOnAug9th #Athadu4K pic.twitter.com/piO9jrQGfa— Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) July 30, 2025 -
చలో టాంజానియా
మహేశ్‌బాబు టాంజానియా వెళ్లనున్నారు. ఆయన హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ‘ఎస్ఎస్ఎమ్బీ 29’(వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతరపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్ పడింది. కాగా ఈ సినిమా ఫారిన్ షెడ్యూల్ చిత్రీకరణను తొలుత కెన్యాలో ప్లాన్ చేశారు మేకర్స్.కానీ, ప్రస్తుతం అక్కడ నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా, సౌతాఫ్రికాలో చిత్రీకరణను ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ఈస్ట్ ఆఫ్రికాలోని టాంజానియాలో చిత్రీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారట రాజమౌళి. ఆగస్టు రెండో వారంలో చిత్రయూనిట్ టాంజానియా వెళ్లనున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఇదిలా ఉంటే... ఈ చిత్ర సంగీత దర్శకుడు కీరవాణితో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్‌పై వర్క్ చేస్తున్నారు రాజమౌళి. ఇందుకోసం రాజమౌళి ఓ ప్రత్యేకమైన స్టూడియోను ఏర్పాటు చేసుకున్నారట. అలాగే టాంజానియాలో చిత్రీకరించబోయే యాక్షన్ సీక్వెన్స్ కోసం రిహార్సల్స్ కూడా జరుగుతున్నాయని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ చిత్రం 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది. -
మహేష్,విజయ్ దేవరకొండ,అల్లు అర్జున్,రవితేజ.. ‘మల్టీ’స్టారర్
అభిమాన హీరో సినిమాను ఫలానా థియేటర్లో చూశాం అని చెప్పుకోవడం ఎప్పుడూ ఉండేదే. అయితే అభిమాన హీరో ధియేటర్లో ఫలానా హీరో సినిమా చూశాం అని చెప్పుకునే రోజులు శర వేగంగా వచ్చేస్తున్నాయి. సినిమా హీరోలు వరుసపెట్టి మల్టీఫ్లెక్స్ సహ యజమానులుగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది.తొలి క్లాప్ మోహన్‌లాల్‌దే...నిజానికి ఈ తరహా ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది మళయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ అని చెప్పొచ్చు. గత పాతికేళ్లకు పైగా ఆశీర్వాద్ సినిమాస్ పేరిట నిర్మాణ సంస్థ ను నిర్వహిస్తున్న ఆయన తాను సహ యజమానిగా కేరళలో ఆశీర్వాద్ సినీప్లెక్స్ పేరిట మల్టీప్లెక్స్ థియేటర్ కాంప్లెక్స్ నెలకొల్పారు.కాన్సెప్ట్ ఆధారిత సినీ అనుభవం..కాన్సెప్ట్–ఆధారిత సినిమా చూసే అనుభవం. అనే సరికొత్త శైలితో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ఈ రంగంలోకి దూసుకొచ్చారు. ఆయన 2018లో తన పిల్లలు నైసా, యుగ్ పేరు మీద తన సొంత లేబుల్ ఎన్వై సినిమాస్ ను ప్రారంభించడం ద్వారా చిన్న పట్టణాలు నగరాల్లో సినిమా వ్యాప్తిని మెరుగుపరచాలని నిర్ణయించుకున్నాడు. రూ. 600 కోట్ల నుంచి రూ. 750 కోట్ల పెట్టుబడితో మల్టీఫ్లెక్స్‌లు ఏర్పాటు చేస్తున్నారు ఆయన గ్రూప్ తమ మొదటి మల్టీప్లెక్స్‌ను మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో రైల్వే నేపథ్య ఇంటీరియర్‌తో ప్రారంభించింది. అలాగే గురుగ్రామ్‌లోని ఎలాన్ ఎపిక్ మాల్లో ఒక విలాసవంతమైన మల్టీప్లెక్స్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఇందులో మాక్‌టెయిల్ బార్, ఎన్వై కేఫ్ అమోర్ లాంజ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి‘మల్టీ’ బాటలో ముందున్న టాలీవుడ్కోవిడ్ సమయంలో ఈ ట్రెండ్‌లోకి అడుగుపెట్టిన టాలీవుడ్ ఒకరి తర్వాత ఒకరుగా హీరోలను జత చేసుకుంటూ శరవేగంగా ముందంజలో దూసుకుపోతోంది. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు 2021లో మల్టీఫ్లెక్స్ థియేటర్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఆయన ఆసియన్ సినిమాస్ తో కలిసి హైదరాబాద్ లో ఎఎంబి సినిమాస్ (ఆసియన్ గ్రూప్ – మహేష్ బాబు జాయింట్ వెంచర్) ను స్థాపించాడు. ఆయనతో పాటే నేను సైతం అంటూ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కూడా అదే ఏడాది థియేటర్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఆసియన్ విజయ్ దేవరకొండ (ఎవిడి) సినిమాస్ కు యజమానినని ఆయన సగర్వంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. మొదటి ఎవిడి సినిమా అధికారికంగా తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్, లో ప్రారంభమైంది.మహేష్ బాబు విజయ్ దేవరకొండ తర్వాత ఆసియన్ సినిమాస్‌తో చేతులు కలిపిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఆయన కూడా అదే సంవత్సరంలో ఆసియన్ సినిమాస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ’ఎఎఎ’ పేరుతో కొత్త మల్టీప్లెక్స్ నెలకొల్పాడు. ఆసియన్ సినిమాస్ ఈ సారి మాస్ మహారాజ్‌ను ఎంచుకుంది. మాస్ జాతరకు చిరునామాగా పేరున్న హీరో రవితేజతో కలిసి హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో జాయింట్ వెంచర్ ఆర్ట్ సినిమాస్ పేరుతో నెలకొల్పింది. ఇది జులై 31న విజయ్ దేవరకొండ కింగ్డమ్తో ప్రారంభం కానుంది.విస్తరణ బాటలోనూ సై..మరోవైపు మహేష్ బాబు నమ్రతా శిరోద్కర్ యాజమాన్యంలోని కొండాపూర్‌లోని ఎఎంబి సినిమాస్ మరింతగా విస్తరిస్తోంది. ఈ మల్టీఫ్లెక్స్‌లో బార్కోహెచ్డిఆర్ ప్రొజెక్షన్ తో కూడిన కొత్త స్క్రీన్ వచ్చే ఆగస్టులో వార్ 2తో ప్రారంభం అవుతుంది, తద్వారా ఇది హైదరాబాద్ టెక్ కారిడార్‌లో సినీ అభిమానులకు ప్రధాన ఆకర్షణగా మారనుంది. మరోవైపు జనవరి 2026లో, కోకాపేటలోని అల్లు సినిమాస్ హైదరాబాద్‌లో మొట్టమొదటి డాల్బీ సినిమాను పరిచయం చేయనుంది. -
శ్రీలంక ట్రిప్‌లో మహేశ్ బాబు ఫ్యామిలీ (ఫొటోలు)
-
ఆ స్టార్ డైరెక్టర్ తో మహేష్ బాబు 30వ సినిమా
-
మ్యూజిక్ ఆన్
హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణకు స్మాల్ బ్రేక్ ఇచ్చింది యూనిట్. ఈ గ్యాప్‌లో ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ వర్క్స్‌పై ఫోకస్ పెట్టారట రాజమౌళి అండ్ టీమ్. ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో కలిసి ఈ సినిమాలోనిపాటలు, ఆర్ఆర్ ఎలా ఉండాలన్న విషయాలపై చర్చలు జరుపుతున్నారట రాజమౌళి.ఈ చర్చలు ఓ కొలిక్కి వస్తే ఈ సినిమా మ్యూజిక్ వర్క్స్‌ను పూర్తి స్థాయిలో ప్రారంభిస్తారట కీరవాణి. ఈ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ మూవీలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. మాధవన్ మరో కీలకపాత్రలో నటిస్తారని, ఈ సినిమా కథ కథనం, భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా ఉంటాయనే టాక్ వినిపిస్తోంది.ఇక ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ వచ్చే నెలలోనే ప్రారంభం అవుతుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... ఆగస్టు 9న మహేశ్‌బాబు బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఏదైనా వస్తే బాగుంటుందని మహేశ్‌బాబు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి... మహేశ్‌బాబు ఫ్యాన్స్ ఆశ నెరవేరుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
నా భార్య కండీషన్.. ఇప్పటికీ అదే పాటిస్తున్నా: మురళీ మోహన్
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అతడు’ (Athadu Movie Re Release) క్లాసిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. జయభేరి ఆర్ట్స్ బ్యానర్ మీద మురళీ మోహన్ నిర్మించిన ఈ చిత్రాన్ని మహేశ్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9న రీరిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో శనివారం నాడు రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మురళీ మోహన్ మాట్లాడుతూ.. ‘మా బ్యానర్లో 2005 ఆగస్టు 10న అతడు సినిమా రిలీజ్ చేశాం. ఇప్పుడు ఆగస్ట్ 9న టెక్నాలజీ పరంగా అప్ గ్రేడ్ చేసి మళ్లీ విడుదల చేస్తున్నాం. ఈ మూవీ కోసం ఓ ఇంటి సెట్‌ను వేస్తే అందరూ అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. సెట్ తీసేశారుదాదాపు 90 శాతం సీన్లు అదే సెట్లో షూటింగ్ చేశాం. ఆ తరువాత ఆ సెట్‌ను చాలా మంది వాడుకున్నారు. అయితే తర్వాతి కాలంలో ఓఆర్ఆర్ రావడంతో ఆ సెట్ వెళ్లిపోయింది. లేదంటే అక్కడే ఓ స్టూడియో కూడా కట్టేవాళ్లం. ‘అతడు’ మూవీ కోసం మహేశ్‌బాబు చాలా సహకరించారు. ఎంత ఆలస్యమైనా సరే, ఎన్ని డేట్లు అయినా ఇచ్చారు. క్లైమాక్స్ ఫైట్ కోసం చాలా కష్టపడ్డారు. ఈ చిత్రం మా సంస్థకు మంచి గౌరవాన్ని తీసుకు వచ్చింది.చాలా డబ్బుసెన్సార్ వాళ్లు ‘అతడు’ మూవీ చూసి ఇంగ్లీష్ సినిమాలా ఉందన్నారు. థియేట్రికల్ పరంగా మేం అనుకున్నంత రేంజ్లో ఆడలేదు. కానీ బుల్లితెరపై మాత్రం రికార్డులు క్రియేట్ చేసింది. ఈ మూవీ కోసం వేసిన సెట్‌ను ఇతర ప్రొడక్షన్ కంపెనీలు కూడా వాడుకున్నాయి. వాటి ద్వారా కూడా చాలా డబ్బులు వచ్చాయి. కమర్షియల్‌గా ‘అతడు’ పట్ల మేం సంతృప్తిగానే ఉన్నాం. నాకు ఈ చిత్రంలో త్రివిక్రమ్ వేషం ఇవ్వలేదు. ‘నాకు వేషం ఇవ్వండి అని ఎవరినీ అడగొద్దు’ అంటూ మా ఆవిడ నాకొక కండీషన్ పెట్టారు. భార్య కండీషన్అందుకే ఇంత వరకు ఎవ్వరినీ నేను వేషం అడగలేదు. మహేశ్‌బాబు, త్రివిక్రమ్ డేట్లు ఇస్తే ‘అతడు’ సీక్వెల్‌ను మా బ్యానర్ నిర్మిస్తుంది. ‘అతడు’ మూవీకి మొదట్లో డివైడ్ టాక్ వచ్చింది. కానీ బుల్లితెరపై వచ్చాక ‘అతడు’ గొప్పదనాన్ని అందరూ తెలుసుకున్నారు. అందుకే ఈ రీ రిలీజ్‌కు ఇంత క్రేజ్ ఏర్పడింది. ఇందులో నాజర్ పోషించిన పాత్రకి శోభన్ బాబును అనుకున్నాం. కానీ, ఆయన అందరికీ నేను హీరోగా మాత్రమే గుర్తుండాలి అంటూ ఆ పాత్ర రిజెక్ట్ చేశారు. బుల్లితెరపై ఎక్కువ సార్లు ప్రదర్శించిన చిత్రంగా ‘అతడు’ రికార్డులు క్రియేట్ చేసింది’ అని అన్నారు.4k వర్షన్మహేష్ బాబు ఫౌండేషన్ ప్రతినిధి అన్వేష్ మాట్లాడుతూ.. ఈ రీ రిలీజ్‌ల ద్వారా ఎంత డబ్బు వచ్చినా సరే దాన్ని ఫౌండేషన్ కోసమే వాడుతున్నాం. మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యం సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటామన్నారు. జయభేరి ఆర్ట్స్ ప్రతినిధి ప్రియాంక దుగ్గిరాల మాట్లాడుతూ .. ‘‘అతడు’ మూవీని ఫిల్మ్‌లో తీశారు. ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకుని దాన్ని 8k, సూపర్ 4Kలోకి మార్చాం. డాల్బీ సౌండ్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. క్లైమాక్స్ ఫైట్‌లో సౌండింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.చదవండి: టెన్షన్ ఎందుకు? భర్త ఉద్యోగానికి వెళ్తే భార్య పిల్లల్ని చూసుకోవాలి! -
బ్లాంక్ చెక్ ఇచ్చాం.. అయినా అతడు రిజెక్ట్ చేశారు: మురళీ మోహన్
కొత్త సినిమాలు వస్తున్నా సరే పాత చిత్రాలను ఇంకా రీరిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే మహేశ్‌బాబు హీరోగా నటించిన క్లాసిక్ మూవీ అతడు (Athadu Movie Re Release)ను వచ్చే నెలలో మళ్లీ విడుదల చేస్తున్నారు. మహేశ్ బర్త్‌డే రోజైన ఆగస్టు 9న అతడు రీరిలీజ్ కానున్నట్లు ఇదివరకే ప్రకటించారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ చిత్ర నిర్మాత మురళీ మోహన్ ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. అప్పటికే సినిమాలకు దూరం..ఈ సినిమాలో శోభన్‌బాబు నటించాల్సిందని, కానీ ఆయన రిజెక్ట్ చేశారని పేర్కొన్నారు. మురళీ మోహన్ (Murali Mohan) మాట్లాడుతూ.. అప్పటికే శోభన్‌బాబు సినిమాలు చేయడం ఆపేశారు. అతడు మూవీలో నాజర్ వేసిన క్యారెక్టర్ శోభన్‌బాబు వేస్తే బాగుంటుందనిపించింది. డైరెక్టర్ త్రివిక్రమ్‌తో చెప్తే అంతకంటే కావాల్సింది ఇంకేముంది? అన్నాడు. అప్పటికే మేము హైదరాబాద్ వచ్చేశాం. ఆయన చెన్నైలోనే ఉన్నారు. నేను నేరుగా అడగడానికి మొహమాటపడి మేకప్‌మెన్ రామును పిలిచాను. ఖాళీ చెక్..ఓ బ్లాంక్ చెక్ ఇచ్చి రాముతో చెన్నై పంపించాం. రెమ్యునరేషన్ తనకెంత కావాలనుకుంటే అంత రాసుకోమన్నాం. దాని గురించి బేరమాడాలనుకోలేదు. ఈ క్యారెక్టర్ ఆయన చేస్తే ఆ పాత్రకు ప్రాముఖ్యత పెరుగుతుంది, సినిమాకు విలువ వస్తుందనుకున్నాను. కానీ శోభన్‌బాబు (Sobhan Babu) ఫోన్ చేసి.. సారీ, మురళీ మోహన్‌గారు, ఏమీ అనుకోవద్దు. హీరోగానే గుర్తుండిపోవాలిఎవరైనా శోభన్‌బాబు అని గుర్తు చేసుకోగానే హీరోగా అందంగా, టిప్‌టాప్‌గా కనిపించాలే తప్ప తండ్రిగా, తాతగా, రోగిష్టిగా వారికి గుర్తు రాకూడదు. అలాంటి క్యారెక్టర్లు నేను చేయదల్చుకోలేదు. మీరేం అనుకోవద్దు. ఇది కచ్చితంగా మంచి సినిమా అయ్యుంటుంది, లేకపోతే మీరు తీయరు. నాకు ఇచ్చిన పాత్ర కూడా మంచిదే అయ్యుంటుంది, లేకుంటే మీరు నన్ను అడగరు. దయచేసి ఏమీ అనుకోవద్దు. నేను చేయలేనని తిరస్కరించారు అని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.చదవండి: ప్రియురాలితో ఎక్కువసేపు గడపాలనుంది: విజయ్ దేవరకొండ -
'అతడు' రీరిలీజ్.. కలెక్షన్స్ అంతా 'గుప్పెడు గుండెల' కోసమే
సూపర్ స్టార్ మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా 'అతడు' రీరిలీజ్ కానుంది. 2005లో విడుదలైన ఈ సినిమా ఆయన పుట్టినరోజు సందర్భంగా (ఆగష్టు 9) మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. జయభేరి ఆర్ట్ పతాకంపై మురళీ మోహన్ నిర్మించారు. అప్పట్లో ఈ చిత్రానికి రూ. 7 కోట్లకు పైగానే బడ్జెట్ అయినట్లు సమాచారం. అయితే, తాజాగా ఒక మీడియా సమావేశాన్ని మేకర్స్ నిర్వహించారు. అతడు రీరిలీజ్ ద్వారా వచ్చే డబ్బును మహేశ్ బాబు ఫౌండేషన్ కోసం వినియోగిస్తామని ఆయన టీమ్ ప్రకటించింది.మహేశ్ బాబు ఫౌండేషన్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచన నమ్రత, మహేశ్‌కు వచ్చిందని ఆయన టీమ్ తాజాగా పేర్కొంది. మహేశ్‌బాబు బర్త్‌డే సందర్భంగా అతడు సినిమా ఆగష్టు 9న రీరిలీజ్ కానుందన్నారు. ఈ మూవీకి వచ్చే కలెక్షన్స్ మొత్తం మహేశ్‌బాబు ఫౌండేషన్‌కు ఉపయోగిస్తామని ఆయన టీమ్ తెలిపింది. ముఖ్యంగా చిన్న పిల్లల గుండే ఆపరేషన్స్, పేద పిల్లల చదువు కోసం ఈ డబ్బు ఉపయోగిస్తామన్నారు. గతంలో రీరిలీజ్ అయిన పోకిరి, ఒక్కడు, బిజినెస్ మేన్ వంటి సినిమాలకు వచ్చిన కలెక్షన్స్ కూడా ఫౌండేషన్ కోసం ఉపయోగించామని పేర్కొన్నారు. ప్రతి ఏడాది మహేశ్ బాబు బర్త్‌డే నాడు తను నటించిన సినిమాలలో ఏదో ఒకటి రీరిలీజ్ అవుతుంది. తమ అభిమాన హీరో స్థాపించిన ఫౌండేషన్ కోసం సాయంగా ఉండాలని ఆయన ఫ్యాన్స్ భారీగా సినిమా చూసేందుకు వెళ్తారు.మహేశ్ బాబు ఫౌండేషన్ గురించిపేద పిల్లలకు ఉచిత గుండె శస్త్రచికిత్సలతో పాటు విద్య, ఆరోగ్యానికి సంబంధించిన ఇతర సేవలను కూడా మహేశ్ ఫౌండేషన్ అందిస్తుంది. ఈ సంస్థకు హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రి రెయిన్బోతో భాగస్వామ్యం కలిగి ఉంది. దీనికి అంబాసిడర్‌గా మహేష్ బాబు కొనసాగుతున్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు 4,500 కంటే ఎక్కువ ఉచిత గుండె శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ట్రస్ట్ బాధ్యతలన్నీ నమ్రతా శిరోద్కర్ దగ్గరుండి చూస్తుంటారు.#AthaduHomeComing :MB ఫౌండేషన్ IDEA #MaheshBabu & #Namratha గారిది, ఇప్పటి దాకా వచ్చిన రీ రిలీజ్ వసూళ్లు అంతా పిల్లల హార్ట్ ఆపరేషన్ కి, EDUCATION కి ఉపయోగపడుతుంది.#Athadu కలెక్షన్స్ కూడా ఫౌండేషన్ కే..#AthaduSuper4K #Athadu4K pic.twitter.com/CNyrp4Ui3m— IndiaGlitz Telugu™ (@igtelugu) July 26, 2025 -
మహేశ్ ఎన్నో కష్టాలు చూశాడు, అయినా పైకి మాత్రం..!
మనసుకు నచ్చినవారు దూరమైతే తట్టుకోలేం. అందులోనూ కన్నవారు ఒకరివెంట మరొకరు మనల్ని వీడి వదిలి వెళ్లిపోతే ఆ బాధను భరించలేము. కానీ, అంతకు మించిన బాధనే భరించాల్సి వచ్చింది సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu)కు! 2022 జనవరిలో మహేశ్ సోదరుడు రమేశ్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో తల్లి ఇందిరా దేవి, నవంబర్‌లో తండ్రి కృష్ణ చనిపోయారు. ఒక్క ఏడాదిలోనే ముగ్గురిని కోల్పోయి తీవ్ర బాధలో కూరుకుపోయాడు.ఎన్నో కష్టాలుఆ విషయాన్ని మహేశ్ మరదలు, ఒకప్పటి హీరోయిన్ శిల్ప శిరోద్కర్ గుర్తు చేసుకుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ ప్రపంచంలో నాకు తెలిసిన అత్యుత్తమ మానవుల్లో మహేశ్ బావ ఒకరు. ఫ్యామిలీ కోసం ధృడంగా నిలబడతాడు. కానీ, తను చాలా కష్టాలు చూశాడు. కుటుంబాన్ని (తల్లిదండ్రులు, సోదరుడు)ని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ తనను అభిమానించేవారికోసం చిరునవ్వుతో కనిపించేవాడు. మా పేరెంట్స్‌ను కోల్పోయినప్పుడు అక్కకు మహేశ్, నాకు నా భర్త అండగా నిలబడి ఓదార్చారు. వీళ్లిద్దరూ మాకోసం ఎంతో చేశారు అని చెప్పుకొచ్చింది.తనకు చంటిబిడ్డనయ్యానమ్రత గురించి మాట్లాడుతూ.. నమ్రత నాకంటే పెద్దది. కానీ సినిమాల్లోకి నేనే ముందు వచ్చాను, నాకే ఫస్ట్ పెళ్లయింది, నాకే ముందు పాప పుట్టింది. దీంతో అందరూ నన్నే పెద్దదాన్ని అనుకుంటారు. నాకు పెళ్లయ్యాకే నమ్రతకు మరింత క్లోజయ్యాను. మా పేరెంట్స్ చనిపోయాక నేను తనకు చంటిబిడ్డగా మారిపోయాను. తన కన్నబిడ్డల కంటే నా గురించే ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్క నాపై అంత ప్రేమ చూపిస్తుంది అని శిల్ప శిరోద్కర్ చెప్పుకొచ్చింది.చదవండి: కాస్టింగ్ కౌచ్.. అసహ్యంతో ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్నా -
చిన్న విరామం
హీరో మహేశ్‌బాబు సినిమా షూటింగ్‌కు చిన్న విరామం ఇచ్చారు. ఆయన హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ‘ఎస్ఎస్ఎమ్బీ 29’(వర్కింగ్ టైటిల్) చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి కేఎల్ నారాయణ నిర్మాత. ఈ మూవీ చిత్రీకరణకు స్మాల్ బ్రేక్ పడింది. వెకేషన్లో భాగంగా ఫ్యామిలీతో కలిసి శ్రీలంకకు వెళ్లారు మహేశ్‌బాబు. మరోవైపు బహమాస్ తీరంలో సేద తీరుతున్నారు ప్రియాంకా చోప్రా. ఇంకోవైపు ‘బాహుబలి: ది ఎపిక్’ సినిమా పోస్ట్ ప్రోడక్షన్ పనులపై రాజమౌళి బిజీగా ఉన్నారని సమాచారం. ఇలా ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ చిత్రీకరణకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ఆగస్టులో ప్రారంభమవుతుందని తెలిసింది.ఈ చిత్రం గత షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరిగింది. ఆగస్టులో మొదలుకానున్న కొత్త షెడ్యూల్ విదేశాల్లో మొదలవుతుందా? లేక హైదరాబాద్ శివార్లలో వేసిన వారణాసి సెట్లో ప్రారంభం అవుతుందా? ఈ విషయంపై స్పష్టత రావాలి. -
మహేశ్, సుకుమార్‌ని ఫిదా చేసిన సినిమా.. ఏంటి దీని స్పెషల్?
బాలీవుడ్ అనగానే చాలామందికి రొమాంటిక్ ఫీల్ గుడ్ మూవీస్ గుర్తొచ్చేవి. కానీ గత కొన్నేళ్లలో చూసుకుంటే ఆ తరహా సినిమాలు తగ్గిపోయాయని చెప్పొచ్చు. అప్పట్ల 'ఆషికి 2' ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇన్నాళ్లకు మళ్లీ అదే మూవీ తీసిన డైరెక్టర్ మోహిత్ సూరి నుంచి 'సయారా' అనే మూవీ వచ్చింది. గత వీకెండ్లో థియేటర్లలో రిలీజైంది. నార్త్ యువత అంతా తెగ ఫీలైపోతున్నారు.(ఇదీ చదవండి: వృత్తిపరంగా ఇబ్బందుల్లో ఉన్నా.. యాంకర్ రష్మీ పోస్ట్)అంతెందుకు మన స్టార్ హీరో మహేశ్ బాబు, 'పుష్ప 2' డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ సినిమా చూసి ఫిదా అయిపోయారు. ఎంత నచ్చిందో ఏమోగానీ మహేశ్ ట్వీట్ చేయగా.. సుక్కు తన ఇన్ స్టా స్టోరీలో సినిమా అదిరిపోయిందని పోస్ట్ చేశాడు. మరి సినిమా అంత బాగుందా? ఇంతకీ మూవీ కథేంటి? అనేది ఇప్పుడు చూద్దాం.'సయారా' విషయానికొస్తే.. ప్రేమలో విఫలమైన హీరోయిన్(అనీత్ పడ్డా) ఓ రైటర్. అయితే ఓ అప్ కమింగ్ సింగర్(అహన్ పాండే)ని ప్రేమిస్తుంది. వీళ్లిద్దరి ప్రేమకు దేవుడు పెద్ద అవాంతరం కలిగిస్తాడు. హీరోయిన్‌కి అల్జీమర్స్ వ్యాధి వచ్చి ప్రతిదీ మర్చిపోతూ ఉంటుంది. అలాంటి టైంలో హీరోయిన్ పాత ప్రేమికుడు తిరిగొచ్చి ఆమెని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మరోవైపు కెరీర్లో ఎదగడానికి ఎంతో ప్రయత్నిస్తున్న హీరో.. కెరీర్‌ని కావాలనుకున్నాడా? ప్రేమని కోరుకున్నాడా? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: వరలక్ష్మికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన భర్త.. రేటు ఎంతంటే?)అరే ఈ స్టోరీ లైన్ చూడగానే ఏదో తెలుగు సినిమా గుర్తొస్తుందే అనిపించిందా? అవును మీరు అనుకున్నది నిజమే. స్వయానా ఈ మూవీ తీసిన మోహిత్ సూరి 'ఆషికి 2' ఛాయలతో పాటు తెలుగు సినిమాలైన 'పడిపడి లేచే మనసు', 'అర్జున్ రెడ్డి' ఛాయలు కూడా గట్టిగానే కనిపిస్తాయి. మన ఆడియెన్స్ 'బేబి' రిలీజైనప్పుడు ఎంతలా ఫీలయ్యారో.. ఇప్పుడు నార్త్ ఆడియెన్స్ కూడా అలానే తెగ ఎమోషనల్ అయిపోతున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.ప్రస్తుతానికైతే బాలీవుడ్లో 'సయారా' కాస్త గట్టిగానే సౌండ్ చేస్తోంది. ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే హీరోహీరోయిన్ ఇద్దరు కొత్తోళ్లే. అహన్ పాండే.. హీరోయిన్ అనన్య పాండేకి అన్నయ్య. అంటే పెదనాన్న కొడుకు. ఇతడు చూడటానికి అందంగా, ఫ్రెష్‌గా ఉన్నాడు. యాక్టింగ్ కూడా బాగానే చేశాడు. హీరోయిన్ అనీత్ పడ్డా కూడా గ్లామరస్‌గా భలే ఉంది. మోహిత్ సూరి ఎప్పటిలానే తనకు అచ్చొచ్చిన లవ్ రొమాంటిక్ జానర్ కథతో అదరగొట్టేశాడు. దానికి తోడు హిందీ ఇండస్ట్రీలోని డ్రై పీరియడ్ కూడా దీనికి కాస్త గట్టిగానే కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఈ మూవీకి ఐదుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఐదు పాటలు ఇచ్చారు. అవన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. అది ఇంకో ప్లస్. అలా అన్ని ప్లస్సులు కలిసి 'సయారా'ని సూపర్ హిట్ చేసినట్లు కనిపిస్తోంది.(ఇదీ చదవండి: తల్లి సమాధి దగ్గర మంచు లక్ష్మి.. వీడియో) -
మహేశ్‌బాబుకు అతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉంది: ప్రముఖ ఎయిర్‌లైన్స్ పోస్ట్
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ప్రస్తుతం బిగ్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. తొలిసారి దర్శకధీరుడు రాజమౌళితో ఆయన జతకట్టారు. వీరిద్దరి కాంబోలో యాక్షన్ అడ్వెంచరస్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే ఈ మూవీని ఒడిశాలోని అందమైన లోకేషన్స్‌లో మొదటి షెడ్యూల్‌ను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ మూవీని ఎస్ఎస్ఎమ్బీ 29 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు.అయితే ప్రస్తుతం షూటింగ్‌కు కాస్తా విరామం లభించడంతో ప్రిన్స్ విదేశాల్లో చిల్ అవుతున్నారు. మన ప్రిన్స్ తరచుగా ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్‌లకు వెళ్తుంటారు. ఇటీవల మహేశ్ బాబు శ్రీలంక ట్రిప్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోను ఏకంగా శ్రీలంక ఎయిర్‌లైన్స్ తమ ట్విటర్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. దక్షిణ భారత సినీ స్టార్ హీరో మహేష్ బాబును ఆహ్వానించడం మాకు, మా సిబ్బందికి ఆనందంగా ఉందంటూ మహేశ్‌బాబుతో సెల్పీ దిగిన ఫోటోను షేర్ చేసింది. ఇంత గొప్ప అతిథిని మా విమానంలోకి ఆతిథ్యం ఇచ్చినందుకు మా సిబ్బంది ఎంతో సంతోషించారని తెలిపింది. మాతో పాటు శ్రీలంకకు ప్రయాణించినందుకు మహేశ్‌బాబుకు ధన్యవాదాలు తెలిపింది. ఈ పోస్ట్ కాస్తా వైరల్ కావడంతో దట్ ఈజ్ ప్రిన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.We had the pleasure of welcoming South Indian cinema icon Mahesh Babu on his journey from Hyderabad to Colombo with SriLankan Airlines!Our crew was delighted to host such a celebrated guest onboard.Thank you for flying with us.@urstrulyMahesh #SriLankanAirlines… pic.twitter.com/44euwfcfCB— SriLankan Airlines (@flysrilankan) July 21, 2025 -
నా జీవితానికి వెలుగు నీవే.. సితారకు మహేశ్ బర్త్‌డే విషెస్
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు గారాలపట్టి సితార (Sitara Ghattamaneni) బర్త్‌డే నేడు (జూలై 20). కూతురి పుట్టినరోజు పురస్కరించుకుని మహేశ్-నమ్రత దంపతులు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు పెట్టారు. క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో తీసుకున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన మహేశ్ (Mahesh Babu).. 'తనిప్పుడు టీనేజర్.. హ్యాపీ బర్త్‌డే సితార. నువ్వు నా జీవితంలో ఎప్పుడూ వెలుగులు నింపుతూనే ఉంటావు. లవ్యూ సో మచ్..' అని క్యాప్షన్ జోడించాడు.నా ప్రపంచాన్ని మార్చేసిన చిన్నారినమ్రత.. సితార చిన్నప్పటి ఫోటోలతో పాటు ఇటీవలి కాలంలో తనతో దిగిన పిక్‌ను సైతం షేర్ చేసింది. 'నువ్వు ఎంత పెద్దదానివైనా.. నా ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసిన చిన్నారివి నీవే! హ్యాపీ బర్త్‌డే సితార.. ఐ లవ్యూ' అని రాసుకొచ్చింది. సితార అన్న గౌతమ్ కూడా చెల్లెలికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. జీవితాన్ని మరింత సంతోషదాయకంగా మార్చే సితారకు హ్యాపీ బర్త్‌డే.. లవ్యూ అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌కు చిన్నప్పటి ఫోటోను జత చేశాడు.సితార వెరీ పాపులర్కాగా సితార.. చిన్నప్పటి నుంచే సోషల్ మీడియాలో చాలా పాపులర్. పలు పాటలకు డ్యాన్సులు చేసి అలరించేది. ఇటీవలి కాలంలో తండ్రితో కలిసి వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపిస్తోంది. ఓ జ్యువెలరీ బ్రాండ్‌కు అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తోంది. ఈ జ్యువెలరీ యాడ్ అమెరికాలోని న్యూయార్క్‌లో టైమ్ స్క్వేర్ బోర్డ్‌పై ప్రత్యక్షం కావడంతో సితార పేరు తెగ మార్మోగిపోయింది. తన ఫస్ట్ రెమ్యునరేషన్ ఓ ఛారిటీకి విరాళంగా ఇచ్చేసి తండ్రిలాగే తనది కూడా గొప్ప మనసని నిరూపించుకుంది. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Gautam Ghattamaneni (@gautamghattamaneni) చదవండి: బాలీవుడ్‌ని వణికించిన మాఫియా డాన్ లవర్..ఎవరా హీరోయిన్? -
రాజమౌళి- మహేశ్ మూవీ.. ఊహించని విలన్!
మహేశ్‌బాబు హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్). రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ప్రియాంకా చోప్రా హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలు చేస్తున్నారు. కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా కథ ఏంటి? షూటింగ్ ఎంత వరకూ వచ్చింది? వంటి విషయాలపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.అయితే ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ‘ఇండియానా జోన్స్’ స్టైల్ కథతో ఈ సినిమా రూపొందుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే... ఈ కథలో విలన్ ఎవరు? అనే విషయం సినిమా ముగిసేవరకూ ఊహించలేమట. పతాక సన్నివేశాల వరకు నెగెటివ్ రోల్ తెలియనివ్వకుండా ప్రేక్షకులను సస్పెన్స్ చేయనున్నారట రాజమౌళి. ఈ చిత్రంలో మాధవన్ కీలకపాత్రలో కనిపించనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. దాంతో ఆయన విలన్‌గా కనిపించనున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. -
డూప్ లేని యాక్షన్
హీరో మహేశ్‌బాబు–దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల హైదరాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను కెన్యాలో ప్లాన్ చేశారట రాజమౌళి. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ సౌతాఫ్రికాలో జరగనుందని సమాచారం.అక్కడ కీలకమైన టాకీపార్ట్, ఓ సాంగ్, ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్‌కు సంబంధించిన షూటింగ్ రిహార్సల్స్‌తో ప్రస్తుతం యూనిట్ బిజీగా ఉందని తెలిసింది. అంతేకాదు... ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను మహేశ్‌బాబు ఎటువంటి డూప్ లేకుండా చేస్తున్నారని, దీంతో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో యూనిట్ తగిన జాగ్రత్తలుపాటిస్తోందని ఫిల్మ్‌నగర్ భోగట్టా. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. మరో కీలకపాత్రలో మాధవన్ నటిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. -
Thota Prasad: పోకిరి ఆ హీరో చేయాల్సిన సినిమా మహేష్ బాబు చేసాడు..
-
హీరో మహేష్ బాబుకు నోటీసులు
-
మహేశ్‌బాబుకు వినియోగదారుల కమిషన్ నోటీసులు
సినీ నటుడు మహేష్ బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా, ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ఆయన్ని.. 3వ ప్రతివాదిగా పేర్కొంటూ నమోదైన కేసులో ఈ పరిణామం చోటు చేసుకుంది. మొత్తం ముగ్గురు ప్రతివాదులకు నోటీసులిచ్చిన కమిషన్.. ప్రతివాదుల హాజరు కోసం విచారణను సోమవారాని కి వాయిదా వేసింది. సాయి సూర్య డెవలపర్స్ బాలాపూర్ గ్రామంలో లేఅవుట్ వేశామని చెప్పడంతో ఆకర్షితులైన ఓ మహిళా డాక్టర్, మరో వ్యక్తి చెరో ప్లాటు కొనడానికి రూ. 34.80 లక్షలు చెల్లించారు. అయితే ప్రతిపాదిత ప్రాంతంలో లేఅవుట్ లేదని తెలుసుకొని డబ్బు తిరిగివ్వాలని అడగ్గా సంస్థ యజమాని కంచర్ల సతీశ్‌చంద్ర గుప్తా రూ. 15 లక్షలే చెల్లించారు. బాధితులు వేసిన కేసులో సంస్థతోపాటు దాని యజమాని, ప్రచారకర్తగా ఉన్న మహేశ్‌బాబును ప్రతివాదులుగా పేర్కొన్నారు.ఇదిలా ఉంటే రియల్ ఎస్టేట్ మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సైతం మహేష్‌బాబుకి గతంలో నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసే ఉంటుంది. -
SSMB 29 రిలీజ్ డేట్ వచ్చేసింది..
-
రాముడిగా మహేష్ బాబు.. బంపర్ ఛాన్స్ మిస్ చేసుకున్నాడా..!
-
ఇండియన్ సినిమా చేయడం హ్యాపీ
‘‘ఇండియాని చాలా మిస్ అయిపోతున్నాను. హిందీ సినిమాలను కూడా మిస్సవుతున్నాను. ఇప్పుడు ఓ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అంటూ ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంకా చోప్రా చెప్పిన విషయాలు వైరల్‌గా మారాయి. ఈ బ్యూటీ నటించిన హాలీవుడ్ చిత్రం ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా ఆమె ఇండియన్ సినిమాల గురించి కూడా మాట్లాడారు. ‘‘ఇండియాలో 2002లో నా తొలి సినిమా (తమిళ చిత్రం ‘తమిళన్’)తో కెరీర్ మొదలుపెట్టి, ఎన్నో రకాల సినిమాలు చేశాను.ఎందరో ప్రతిభావంతులతో సినిమాలు చేశాను. అందుకే ఈ సంవత్సరం ఇండియన్ సినిమా (మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాని ఉద్దేశించి) చేయడం చాలా ఆసక్తిగా ఉంది. భారతీయ ప్రేక్షకులు నా పై చూపించే ప్రేమ నాకెంతో విలువైనది. నాపై వారి ప్రేమ ఎప్పటికీ అలానే ఉండాలని కోరుకుంటున్నా’’ అని ప్రియాంకా చోప్రా పేర్కొన్నారు.హాలీవుడ్ సింగర్–యాక్టర్–మ్యూజిక్ డైరెక్టర్ నిక్ జోనస్‌ని 2018లో పెళ్లి చేసుకున్న ప్రియాంక ఆ తర్వాత భారతీయ చిత్రాలు ఎక్కువ చేయడంలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో మహేశ్‌బాబు–రాజమౌళి కాంబినేషన్లోని సినిమాలో నటించడం పట్ల ఆమె చాలా ఆనందంగా ఉన్నారు. ఈ చిత్రం 2027 వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది. -
మహేష్, రాజమౌళి సినిమా ఆ ఓటీటీలోనే...రికార్డ్స్ బద్ధలయ్యాయిగా...
దర్శక దిగ్గజం రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎమ్బి29(SSMB29) సినిమా ఇప్పుడు మన దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలోనూ సినీ వర్గాలను ఆకర్షిస్తోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని విక్రయించారంటూ వస్తున్న వార్తలు కూడా సంచలనంగా మారాయి. దీనికి కారణం చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో ఈ సినిమా ఓటీటీ హక్కుల ధర పలకడమే.ఇప్పటి దాకా ఓటీటీలో అత్యధిక ధర పలికిన చిత్రంగా రాజమౌళి, రామ్‌చరణ్,ఎన్టీయార్ల సినిమా ఆర్ఆర్ఆర్ నిలుస్తోంది. ఆ తర్వాత సుకుమార్, అల్లు అర్జున్‌ల పుష్ప 2, లోకేష్ కనగరాజ్ హీరో విజయ్‌ల తమిళ చిత్రం లియో, అట్లీ, షారూఖ్ఖాన్ల హిందీ చిత్రం జవాన్, ప్రశాంత్ నీల్, ప్రభాస్‌ల సలార్, ఓంరౌత్, ప్రభాస్‌ల ఆదిపురుష్, సిద్ధార్ధ్ ఆనంద్, షారూఖ్ ల పఠాన్ చిత్రాలు నిలుస్తున్నాయి ఇవన్నీ రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల మధ్య చెల్లించి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లు స్వంతం చేసుకున్నట్టు సమాచారం. వీటిలో ఆదిపురుష్, పఠాన్, పుష్ప2 తప్ప మిగిలినవన్నీ నెట్‌ఫ్లిక్స్ ఖాతాలోనే పడ్డాయి. తద్వారా భారతీయ సినిమాలకు అత్యధిక రేట్లకు కొనుగోలు చేయడంలో ఎవరికీ అందనంత స్థాయిలో నెట్‌ఫ్లిక్స్ దూసుకుపోతోంది.అదే క్రమంలో మరోసారి తన సత్తా చాటిన నెట్‌ఫ్లిక్స్ ఎస్ఎస్ఎమ్బి 29 హక్కుల్ని కూడా దక్కించుకుందని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో మరే చిత్రానికి పెట్టనంత ధరను చెల్లించి ఈ చిత్రం పోస్ట్ థియేట్రికల్ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని తెలుస్తోంది. తద్వారా ఇది భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద నాన్–థియేట్రికల్ డీల్స్‌గా నిలుస్తోందని సమాచారం.రాజమౌళి మునుపటి చిత్రం ఆర్ఆర్ఆర్ సైతం నెట్‌ఫ్లిక్స్‌లోనే ఆ సినిమాను కూడా భారీ ధరకు కొనుగోలు చేసిన నెట్‌ఫ్లిక్స్ ప్రారంభంలోనే అద్భుతమైన వీక్షక విజయం అందుకుంది, అంతేకాక ఆ సినిమా పాట ఆస్కార్ అందుకోవడంతో నెట్‌ఫ్లిక్స్‌కు మరోసారి కాసుల పంట పండింది. ఆ అవార్డ్ ద్వారా వచ్చిన ప్రపంచవ్యాప్త గుర్తింపుతో ఓటీటీలో ఆ సినిమాకు వీక్షకులు వెల్లువెత్తారు. దాందో ఆర్ఆర్ఆర్కి భారీ ధర చెల్లించినప్పటికీ నెట్‌ఫ్లిక్స్ భారీ లాభాలను ఆర్జించడానికి ఇదో కారణం.ఈ నేపధ్యంలో రాజమౌళి చిత్రాలపై గురి కుదిరిన నెట్‌ఫ్లిక్స్ చాలా ముందస్తుగానే ఓటీటీ హక్కులపై కన్నేసింది. అపజయాలు అంతే తెలియని దర్శకుడు రూపొందిస్తున్న ఎస్ఎస్ఎమ్బి 29 చిత్రంలో ప్రియాంక చోప్రా వంటి ఇంటర్నేషనల్ స్టార్ ఉండడం అంతర్జాతీయ ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకునే అంశమే. అందుకే ఈ చిత్రం అత్యంత భారీ ధర పలికింది అనుకోవచ్చు. వచ్చే 2027లో విడుదల కానున్న ఈ భారీ చిత్రం ఇంకెన్నో సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి. -
SSMB 29: బడ్జెట్ విషయం లో తగ్గేదేలే అంటున్న డైరెక్టర్స్
-
SSMB 29: పాన్ ఇండియాకు ఊహించని షాక్ ఇవ్వబోతున్న రాజమౌళి..
-
'ఏ మాయ చేశావే నాగచైతన్యతో కాదు.. ఆ స్టార్ హీరోతో చేయాలని': డైరెక్టర్
ఏ మాయ చేశావే మూవీతో టాలీవుడ్లో సూపర్ హిట్‌గా నిలిచింది. నాగచైతన్య, సమంత హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. హీరోయిన్ సమంత ఈ మూవీతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ లవ్ ఎంటర్టైనర్ చిత్రంలో జెస్సీ పాత్రలో మెరిసింది. 2010లో విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమా రిలీజై జూలై 18 నాటికి 15 ఏళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ చిత్రం గురించి మాట్లాడారు. అయితే మొదటి ఏ మాయ చేశావే చిత్రానికి హీరోగా నాగచైతన్యను అనుకోలేదని తెలిపారు. స్టార్ హీరో మహేశ్ బాబుతోనే తీద్దామని ఈ కథను రాసుకున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో క్లైమాక్స్‌లో చిరంజీవి గెస్ట్ రోల్‌గా పెట్టాలని అనుకున్నట్లు గౌతమ్ వాసుదేవ్ తెలిపారు. క్లైమాక్స్ భిన్నంగా ఉండాలని మెగాస్టార్‌తో ప్లాన్ చేశానని పేర్కొన్నారు.కాగా.. జూలై 18న 'ఏమాయ చేసావె' రీ రిలీజ్ కానున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ఏకకాలంలో తమిళంలో కూడా విడుదలైంది. అక్కడ 'విన్నైతాండి వరువాయా' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో శింబు, త్రిష ముఖ్య పాత్రల్లో నటించారు. కానీ ఈ సినిమా హిందీలో 'ఏక్ థా దీవానా' పేరుతో రీమేక్ అయింది. అక్కడ మాత్రం పరాజయం చవి చూసింది. Gautam Vasudev Menon explaining how the #YMC story developed keeping Mahesh babu @urstrulyMahesh in mind , and initial climax he planned was different planning to cast Chiranjeevi as guest role pic.twitter.com/iC2gXj3uhu— #Coolie varaaru 🌟 (@yourstrulyvinay) July 1, 2025 -
ట్రెండ్ కి దూరంగా మహేష్ బాబు, రామ్ చరణ్
-
టాలీవుడ్లో నెం1 గ్లోబల్ స్టార్ ఎవరు?
టాలీవుడ్ సూపర్ స్టార్ల స్టార్ ఫైట్... ఇప్పుడు గ్లోబల్ ఫైట్‌గా మారింది. గత కొంత కాలంగా అంతర్జాతీయ స్థాయిలో టాలీవుడ్ హీరోలు రాణిస్తుండడం, అయితే ఒకరి తర్వాత ఒకరు రికార్డ్స్ బద్దలు కొట్టడంతో... వీరిలో ఎవరు నెం1 గ్లోబల్ స్టార్ అనేది ఇంకా తేలలేదు. తొలుత ప్రభాస్, తర్వాత ఎన్టీయార్, రామ్ చరణ్, ఆ తర్వాత అల్లు అర్జున్... పాన్ ఇండియా సినిమాల ద్వారా సత్తా చాటారు. అయితే వీరిలో ఎవరు టాప్ అనేది ఇంకా నిరూపణ కాలేదు. ఈ నేపధ్యంలో వచ్చే 2027 సంవత్సరం తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా నిలవబోతోంది. టాలీవుడ్ స్టార్ల నుంచి దూసుకు వస్తున్న మూడు భారీ ప్రాజెక్టులు ఎస్ఎస్ఎంబి29, ఎఎ22, స్పిరిట్... చిత్రాలు మూడూ గ్లోబల్ బాక్సాఫీస్‌ను లక్ష్యంగా చేసుకొని రూపొందుతున్నాయి. ఈ మూడు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి.ఈ మూడింటిలో రాజమౌళి – మహేష్ బాబు కాంబోలో వస్తున్న తొలిచిత్రం ఎస్ఎస్ఎంబి29పై అత్యధికంగా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ ద్వారా ఇప్పటికే గ్లోబల్ ప్రేక్షకుల నాడి తెలిసిన రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారు. తొలిసారిగా మహేష్ బాబు ఈ చిత్రంలో పూర్తి మేకోవర్‌తో కనిపించనున్నాడు. సమాచారం. అంతేకాక పాన్ ఇండియా సినిమా లో తన సత్తా తొలిసారి చాటనున్నాడు. అల్లూ అర్జున్, అట్లీ కాంబినేషన్ లో మాస్ అండ్ స్టైల్ ఎంటర్టైనర్గా ఎఎ22 చిత్రం కూడా దాదాపుగా అదే సమయంలో రానుంది. ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న 2వ చిత్రంగా నిలవబోతోంది. విజువల్స్, యాక్షన్, హై ఎనర్జీ ప్రెజెంటేషన్ కారణంగా ఇది ఇండియన్ మార్కెట్ తో పాటు ఇంటర్నేషనల్ సూపర్ హీరో సినిమాల అభిమానులను కూడా ఆకర్షించే అవకాశం ఉందని అంటున్నారు.హీరోగా ఇప్పటికే గ్లోబల్ స్టార్ డమ్‌ను స్వంతం చేసుకున్న ప్రభాస్...స్పిరిట్ కూడా రేసు లో వుంది. తన ప్రతీ సినిమా ద్వారా ప్రేక్షకులకు షాక్ కొట్టే కధాంశాలతో హిట్స్ కొట్టే సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ కు దర్శకత్వం వహిస్తున్నారు, ఇప్పటికే దీపిక పదుకునే నిష్క్రమణ సందీప్ వంగా పై కామెంట్స్ తదితర వార్తల ద్వారా ఈ చిత్రం నిత్యం సినీ అభిమానుల నోట్లో నానుతోంది.ఈ చిత్రం యాక్షన్, డార్క్ థీమ్, బోల్డ్ నెరేటివ్ తో రూపొందుతోంది. అంతర్జాతీయ నటుల ఎంపిక, గ్లోబల్ రిలీజ్ ప్లాన్ వంటి లతో ఇది ఇంటర్నేషనల్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తోంది.ఈ మూడు ప్రాజెక్టులు తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయంగా మరో మెట్టుకు తీసుకెళ్లే అవకాశముంది. ప్రతి చిత్రమూ దేనికదే తనదైన ప్రత్యేకతను కలిగి ఉండటంతో, ఇండియన్ సినిమా గ్లోబల్ ఆడియన్స్ ముందుకు ఎలా తీసుకెళ్లాలి అనే విషయంలో తదుపరి సినిమాలకు ఈ మూడూ దేనికదే ప్రత్యేక శైలి లో దిశా నిర్ధేశ్యం చేయనున్నాయి. ఆ మార్గదర్శకత్వం చేస్తున్నవారు దక్షిణాది వారు అందులోనూ ఒక్క అట్లీ తప్ప అందరూ తెలుగు వారు కావడం నిజంగా గర్వకారణమే. -
సందడే సందడి
భాగ్యనగరంలో భలే జోరుగా షూటింగ్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు టాలీవుడ్ స్టార్ హీరోస్. సందడి సందడిగా ఈ షూటింగ్స్ జరుగుతున్నాయి. మరి... హైదరాబాద్‌లో ఏ స్టార్ ఎక్కడెక్కడ షూటింగ్ చేస్తున్నారో తెలుసుకుందాం.షామిర్‌పేటలో... తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర హీరోల్లో ఒకరైన చిరంజీవి ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ‘బింబిసార’ ఫేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో ఒక పాట మినహా ‘విశ్వంభర’ సినిమా పూర్తి చేశారు చిరంజీవి. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్) అనే చిత్రంలో నటిస్తున్నారు చిరంజీవి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్పై సాహు గారపాటి, సుష్మితా కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార నటిస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. మూడవ షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్ సమీపంలోని షామిర్‌పేటలో శరవేగంగా జరుగుతోంది. చిరంజీవితో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఈ నెలాఖరు వరకు అక్కడే షూటింగ్ ఉంటుందని, జూలై 1 నుంచి కేరళలో కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుందనీ తెలిసింది. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి నటిస్తున్న పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం ఇది. ఆయన మార్క్ ఎంటర్టైన్మెంట్తో పాటు అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో ఈ సినిమా రూపొందుతోందని టాక్. ‘మెగా 157’ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కానుంది. అఖండ తాండవం హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘అఖండ 2: తాండవం’. ‘సింహా, లెజెండ్, అఖండ’ వంటి హిట్ చిత్రాల తర్వాత వారి కాంబినేషన్లో రూపొందుతోన్న నాలుగో చిత్రమిది. సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌కి సమీపంలోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. బాలకృష్ణతో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట బోయపాటి శ్రీను. ఈ చిత్రం సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఆర్ఎఫ్సీలో... వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకెళుతున్నారు హీరో ప్రభాస్. ఆయన కథానాయకుడిగా ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘ఫౌజి’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వీ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. సినిమాలోని ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు తీస్తున్నారట హను రాఘవపూడి. ‘సీతారామం’ వంటి హిట్ మూవీ తర్వాత ఏడాదికిపైగా సమయం తీసుకుని ‘ఫౌజి’ కథను తీర్చిదిద్దారు దర్శకుడు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆలియా భట్ యువరాణి పాత్ర చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆటా పాటా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. ‘ఆర్ఆర్ఆర్, దేవర’ వంటి వరుస హిట్ చిత్రాల తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్‌రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు.ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లో భాగంగా ఎన్టీఆర్‌పై ఓ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారట మేకర్స్. అయితే ఇది రెగ్యులర్ సాంగ్ కాదని, దేశభక్తి నేపథ్యంలో ఉంటుందని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా, మలయాళ నటుడు టొవినో థామస్ కీలక పాత్రలో నటిస్తున్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ సినిమా 2026 జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. శంకర్‌పల్లిలో... హీరో మహేశ్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్). ‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. దుర్గా ఆర్ట్స్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా నటిస్తున్నారు. అయితే ఆమెది హీరోయిన్ పాత్ర కాదని... నెగటివ్ క్యారెక్టర్ అని టాక్.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లిలోని ఓ స్టూడి యోలో జరుగుతోంది. అమేజాన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్స్ వేశారట. ప్రస్తుతం మహేశ్‌బాబు, ఇతర నటీనటులపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ సినిమా కోసం గుబురు గడ్డం, పొడవైన జుట్టుతో మహేశ్ సరికొత్త లుక్‌లోకి మారిపోయారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రానుందని ఫిల్మ్‌నగర్ టాక్. మొయినాబాద్‌లో... హీరో రవితేజ, దర్శకుడు కిశోర్ తిరుమల కాంబినేషన్ లో ‘ఆర్టీ 76’ (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రవితేజ నటిస్తున్న 76వ చిత్రం ఇది. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌కి సమీపంలోని మొయినాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేకమైన సెట్లో చిత్రీకరణ జరుగుతోంది.రవితేజతో పాటు ప్రధాన తారాగణం ఈ షెడ్యూల్ షూటింగ్లో పాల్గొంటున్నారని సమాచారం. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో రవితేజ ట్రేడ్ మార్క్ కామిక్ టైమింగ్, మాస్ అప్పీల్ మిస్ అవకుండా కథను సిద్ధం చేశారు కిశోర్ తిరుమల. ఈ సినిమా కోసం రవితేజ స్పెషల్‌గా మేకోవర్ అయ్యారు. 2026 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో... రామ్ పోతినేని హీరోగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ ఫేమ్ మహేశ్‌బాబు పి. దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ర్యాపో 22’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ గబ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది.హీరో హీరోయిన్లతో పాటు ఇతర తారాగణంపై కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట దర్శకుడు. రాజమండ్రిలో 34 రోజుల పాటు నాన్ స్టాప్‌గా డే అండ్ నైట్ షూటింగ్ చేసిన అనంతరం తర్వాతి షెడ్యూల్‌ని హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు యూనిట్. ముచ్చింతల్‌లో... ‘దసరా’ (2023) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ఫ్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతోంది. నానితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను రూపొందిస్తున్నారట శ్రీకాంత్ ఓదెల. ఈ సినిమాలో ఫుల్ మాస్ లుక్‌లో కనిపించనున్నారు నాని. ‘ది ఫ్యారడైజ్’ నుంచి ‘రా స్టేట్మెంట్’ పేరుతో ఇప్పటికే విడుదలైన ఓ గ్లింప్స్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ సినిమా 2026 మార్చి 26న రిలీజ్ కానుంది. తుక్కుగూడలో... ‘విరూపాక్ష, బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్. ప్రైమ్‌షో ఎంటర్టైన్ మెంట్‌పై ‘హను మాన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ నిర్మించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో జరుగుతోంది. హీరో, హీరోయిన్‌తో పాటు ప్రముఖ తారాగణంపై కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట మేకర్స్. ఈ సినిమా సెప్టెంబర్ 25న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. గండిపేటలో... ‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ చిత్రాల ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమా ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని గండిపేటలో జరుగుతోంది.ప్రత్యేకంగా వేసిన సెట్లో సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధిలపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మనసును హత్తుకునే స్వచ్ఛమైన ప్రేమ, అనుబంధాల నేపథ్యంలో అద్భుతమైన భావోద్వేగాలు, వినోదాలతో ఈ సినిమా రూపొందుతోంది. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 17న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.శంషాబాద్‌లో... ‘జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రాల ఫేమ్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’. మారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ శంషాబాద్‌లో జరుగుతోంది. నవీన్ పొలిశెట్టితో పాటు ఇతర తారాగణం పాల్గొంటున్న ఈ షెడ్యూల్ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ప్రముఖ స్టూడియోలో...‘హనుమాన్’ (2024) చిత్రంతో పాన్ ఇండియన్ హిట్ అందుకున్న తేజ సజ్జా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తున్నారు. మనోజ్ మంచు, జగపతి బాబు, శ్రియ శరణ్, జయరామ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. టీమ్ అంతా ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారని సమాచారం. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ హైలైట్‌గా నిలవనున్నాయి. ‘మిరాయ్’ 8 భాషల్లో 2డీ, 3డీ ఫార్మాట్లో సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.పై సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. - డేరంగుల జగన్ మోహన్ -
Movie Sequels: చరణ్ & మహేష్ రూటే సెపరేట్
-
మీతో జర్నీ అద్భుతం మేడమ్
‘‘ప్రియాంకా చోప్రా మేడమ్‌తో పని చేయడం నాకో ప్రత్యేకమైన అనుభవం. ఆమె చాలా తెలివిగలవారు... మంచి చమత్కారి... స్ట్రాంగ్ ఉమన్ కూడా. అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు’’ అంటూ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ విక్కీ భరత్యా కొనియాడారు. ఇంతకీ ప్రియాంకాతో కలిసి విక్కీ ఏ సినిమా చేశారంటే... మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎస్ఎస్ఎమ్బి 29’ (వర్కింగ్ టైటిల్)కి. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా ఓ లీడ్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఓ పాటకు విక్కీ నృత్యదర్శకుడిగా పని చేసినట్లుగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆయన షేర్ చేసిన పోస్ట్ స్పష్టం చేస్తోంది. ఈ పాటలో ప్రియాంకా చోప్రా ఎనర్జీ సూపర్ అని విక్కీ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘‘డ్యాన్స్ రిహార్సల్స్ సమయంలో, షూటింగ్ అప్పుడు ప్రియాంక కనబరిచిన ఎనర్జీ చాలా స్ఫూర్తిగా ఉంటుంది. తన శాయశక్తులా కృషి చేస్తారామె. ఆమెలో నాకు నచ్చిన ఇంకో విషయం ఏంటంటే... స్థాయిని బట్టి కాకుండా అందరితోనూ గౌరవంగా ఉంటారు. ఒకవైపు హార్డ్‌వర్క్ చేస్తూనే మరోవైపు తన చుట్టూ ఉన్న అందర్నీ పట్టించుకుంటారు. నాకు ఆమె మీద అభిమానం, గౌరవం పెరిగిపోయాయి. కళ పట్ల మీరు (ప్రియాంక) కనబరిచే అంకితభావం, ప్రేమ, అందరి పట్ల మీరు చూపించే గౌరవ మర్యాదలకు ధన్యవాదాలు మేడమ్. మీతో నా ఈ చిన్ని ప్రయాణం (ఎస్ఎస్ఎమ్బి 29ని ఉద్దేశించి) అద్భుతం. ఈ జర్నీలో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది’’ అంటూ ప్రియాంకా చోప్రాపై తనకు ఏర్పడిన అభిమానాన్నంతా వ్యక్తపరిచారు విక్కీ భరత్యా. ఇదిలా ఉంటే... ప్రియాంకా చోప్రా పై చిత్రీకరించిన పాటలో మహేశ్‌బాబు కూడా ఉన్నారా? లేక సోలో పాటనా? అనేది తెలియాల్సి ఉంది. ఇక భారీ బడ్జెట్‌తో అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని కేఎల్ నారాయణ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది. -
జపనీస్ వీడియో గేమ్‌లో రాజమౌళి.. ఇదో క్రేజీ రికార్డ్
స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం మహేశ్‌తో సినిమా చేస్తున్నాడు. ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలు చేసిన ఈయన.. ఈ చిత్రంతో పాన్ వరల్డ్‌లోనూ తన పనితనం ఏంటో చూపించబోతున్నాడు. సరే ఇవన్నీ పక్కనబెడితే ఎవరూ ఊహించని పనిచేసి జక్కన్న వార్తల్లో నిలిచాడు. ఓ జపనీస్ వీడియో గేమ్‌లో కనిపించి భారతీయ నటీనటులు ఎవరికీ సాధ్యం కాని ఘనత సాధించాడు. ఇంతకీ ఏంటా గేమ్? అసలేం జరిగింది?'ఆర్ఆర్ఆర్' సినిమాని గ్లోబల్ వైడ్ ప్రమోట్ చేసిన రాజమౌళి.. ఆస్కార్ కూడా అందుకున్నాడు. ఈ చిత్రాన్ని జపాన్‌లోనూ రిలీజ్ చేయగా అక్కడ కూడా రెస్పాన్స్ బాగానే వచ్చింది. అయితే జపనీస్ వీడియో గేమ్ సృష్టికర్త హిడియో కోజిమాని అప్పట్లో రాజమౌళి కలవడం చర్చనీయాంశమైంది. మహేశ్ సినిమా కోసం ఈయనతో కలిసి పనిచేయబోతున్నాడా అని అందరూ అనుకున్నారు. కానీ అవన్నీ కాదని ఇప్పుడు తేలిపోయింది.(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త తెలుగు సినిమా)కోజిమా సృష్టించిన 'డెత్ స్టాండింగ్ 2' వీడియో గేమ్‌లో రాజమౌళితో పాటు ఆయన కొడుకు కార్తికేయ కనిపించారు. ఇది చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లని పాన్ ఇండియా స్టార్స్‌ని చేసిన జక్కన్న.. ఇప్పుడు ఇంటర్నేషనల్ వీడియో గేమ్ కనిపించి తానే పాన్ వరల్డ్ స్టార్ అయిపోయాడు. వీడియో గేమ్‌లో కనిపించిన భారతీయ తొలి సెలబ్రిటీగా రికార్డ్ సృష్టించాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.మహేశ్ ప్రాజెక్ట్ విషయానికొస్తే.. ఇదివరకే హైదరాబాద్, ఒడిశాలో షూటింగ్ జరిగింది. కొన్ని సీన్స్ కోసం త్వరలో కెన్యా వెళ్లి రానున్నారని తెలుస్తోంది. అలానే రూ.50 కోట్లు ఖర్చు పెట్టి.. హైదరాబాద్‌లోనే వారణాసి సెట్ వేశారని, ఇది సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన సెట్ అని మాట్లాడుకుంటున్నారు. అంతా ఓకే గానీ మహేశ్ సినిమా మొదలైన తర్వాత ఇప్పటివరకు రాజమౌళి.. ఒక్కటంటే ఒక్క విషయం కూడా చెప్పట్లేదు. మరి ప్రాజెక్ట్ గురించి ఎప్పుడు చెబుతాడో ఏంట?(ఇదీ చదవండి: హీరోయిన్ సమంతకు కష్టకాలం!)#DeathStranding2 video game featuring SSR! 👍pic.twitter.com/HsdS4wZh0N— idlebrain jeevi (@idlebrainjeevi) June 24, 2025 -
ఈ మూవీ నవ్విస్తుంది, ఏడిపిస్తుంది.. చప్పట్లు కొట్టేలా చేస్తుంది
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం సితారే జమీన్ పర్ (Sitaare Zameen Par). ‘సబ్ కా అప్న అప్న నార్మల్’ అనేది ఉపశీర్షిక. ఆమిర్‌ఖాన్ నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన హిట్ ఫిల్మ్ ‘తారే జమీన్ పర్’ (2007)కు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కింది. జూన్ 20న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది.తాజాగా ఈ సినిమాకు సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) రివ్యూ ఇచ్చాడు. సితారే జమీన్ పర్.. అందరి మనసులు దోచుకుంటోంది. ఈ మూవీ మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. అలాగే చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఈ సినిమా చూశాక కచ్చితంగా చిరునవ్వుతో బయటకు వస్తారు అని రాసుకొచ్చాడు.సితారే జమీన్ పర్ మూవీలో ఆమిర్ ఖాన్, జెనీలియా జంటగా నటించారు. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించగా ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆమిర్‌ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మించారు. ఈ చిత్రంలో ఆరోష్ దత్తా, గోపీకృష్ణ వర్మ, సంవిత్ దేశాయ్, వేదాంత్ శర్మ, ఆయుష్ భన్సాలీ, ఆశిష్ పెండ్సే, రిషి షహానీ, రిషబ్‌జైన్ , నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్ వంటి వారు కీలకపాత్రల్లో నటించారు. #SitaareZameenPar …Shines so bright and how…..It’ll make you laugh, cry and clap!! Like all Aamir Khan’s classics, you’ll walk out with a big smile on your face… Love and Respect..♥️♥️♥️#AamirKhan @geneliad @r_s_prasanna @AKPPL_Official @ShankarEhsanLoy #AmitabhBhattacharya…— Mahesh Babu (@urstrulyMahesh) June 22, 2025 చదవండి: మహేశ్‌బాబుతో పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యా: త్రిష -
మహేశ్‌బాబుతో పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యా: త్రిష
అతడు, సైనికుడు సినిమాల్లో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు(Mahesh Babu)తో జోడీ కట్టింది హీరోయిన్ త్రిష (Trisha Krishnan). నిజానికి ఈ బ్యూటీకి మహేశ్ సినీ ఇండస్ట్రీలోకి రాకముందే తెలుసు. వీరిద్దరూ చెన్నైలోనే కాలేజీ విద్య పూర్తి చేశారు. మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా మహేశ్, త్రిష మధ్య పరిచయం ఏర్పడింది. కానీ యాక్టర్స్ అవుతామని అస్సలు అనుకోలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అదే ఇంటర్వ్యూలో మహేశ్ గురించి మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.షూటింగ్ అయిపోగానే..త్రిష మాట్లాడుతూ.. మహేశ్ అద్భుతమైన నటుడు. నాకు ఇష్టమైన నటుల్లో ఆయన ఒకరు. పెద్ద స్టార్ అయినప్పటికీ తోటి నటులను ఎంతో గౌరవిస్తారు. చాలామందికి అది చేతకాదు. తను చాలా ప్రొఫెషనల్. చాలా హార్డ్‌వర్క్ చేస్తారు. నాకేమో.. షూటింగ్ అయిపోగానే అలసటతో త్వరగా ఇంటికి వెళ్లిపోదామనిపిస్తుంది. కానీ వేకువజామునే సెట్‌కు వచ్చిన మహేశ్ మాత్రం రాత్రి 10.30 గంటలవరకు అక్కడే ఉంటాడు. అలా ఆయనతో కలిసి పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యాను.ఎప్పుడూ మానిటర్ దగ్గరే..తను వానిటీ వ్యాన్‌కు వెళ్లగా నేనెప్పుడూ చూడలేదు. తన సీన్ షూట్ లేనప్పుడు కూడా.. మానిటర్ దగ్గరే కూర్చునేవారు అని చెప్పుకొచ్చింది. త్రిష చివరగా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నటించింది. మహేశ్‌బాబు SSMB29 సినిమా చేస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా చేస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్ -
హైదరాబాద్‌లో వారణాసి!
మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ అంతర్జాతీయ స్థాయి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంకా చో్ప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ఈ వారంలో హైదరాబాద్‌లో మొదలైందని సమాచారం. ఈ షెడ్యూల్ కోసం మేకర్స్ హైదరాబాద్ శివార్లలో భారీ సెట్స్‌ను క్రియేట్ చేశారని తెలిసిందే.ఇందులో భాగంగా వారణాసి నగరాన్ని తలపించేలా భారీ సెట్స్ వేశారని భోగట్టా. ఈ సెట్స్‌కు రూ. 40 కోట్లకు పైనే అయ్యిందని టాక్. అంతేకాదు... ఈ సినిమాలోని మేజర్ సన్నివేశాల చిత్రీకరణ ఈ సెట్స్‌లోనే జరుగుతుందని, అందుకే ఈ స్థాయిలో ఖర్చుపెట్టారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత టీమ్ ఫారిన్‌కి వెళుతుందని, అక్కడి ఫారెస్ట్ లొకేషన్స్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లను ΄్లాన్ చేశారనే టాక్ వినిపిస్తోంది. -
చై-శోభితను పట్టించుకోని మహేశ్? వీడియోతో ఆన్సర్ దొరికేసింది!
ఇంట్లో పెళ్లంటే ఆ సందడే వేరుంటుంది. పనులన్నీ ఒక ఎత్తయితే ఒక్కో కార్యక్రమానికి ఒక్కో రకంగా రెడీ కావడం మరో ఎత్తు. సెలబ్రిటీలు తమ ఇంట జరిగే ఫంక్షన్స్‌లో మరింత స్పెషల్‌గా కనిపించేలా జాగ్రత్తపడతారు. అందరికంటే భిన్నంగా, గ్రాండ్‌గా రెడీ అవ్వాలని తహతహలాడతారు. కానీ అక్కినేని ఇంట్లో మాత్రం అందరూ సింప్లిసిటీ, సాంప్రదాయానికి ప్రాధాన్యత ఇచ్చారు. అఖిల్- జైనబ్ వివాహంలో నాగార్జున (Nagarjuna Akkineni)-అమల, నాగచైతన్య- శోభిత ధూళిపాళ ట్రెడిషనల్‌గా రెడీ అయ్యారు. శోభితను పట్టించుకోని మహేశ్?అయితే రిసెప్షన్లో మాత్రం అందరూ ఎవరి టేస్ట్‌కు తగ్గట్లుగా వారు గ్రాండ్‌గానే కనిపించారు. ఈ వేడుకకకు మహేశ్‌బాబు సహా పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. మహేశ్ మాత్రం సాదాసీదాగా టీషర్ట్‌తో వచ్చేశాడు. అయితే రిసెప్షన్ వేడుకలో మహేశ్ (Mahesh Babu).. చై-శోభితను పలకరించకుండా ముందుకుసాగిపోయిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు.. మహేశ్‌కు సమంత మంచి స్నేహితురాలు అని, ఆమె స్థానంలోకి వచ్చిన శోభిత (Sobhita Dhulipala)తో మాట్లాడటం ఇష్టం లేకే వారిని చూసీచూడనట్లు వెళ్లిపోయాడని ఎవరికి తోచినట్లు వారు కథలు అల్లేశారు.వీడియోతో క్లారిటీకానీ, అసలు విషయమేంటనేది ఇప్పుడు బయటకు వచ్చింది. అఖిల్ రిసెప్షన్‌కు సంబంధించి తాజాగా మరో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అందులో మహేశ్ సతీమణి నమ్రత, సితార.. చై దంపతుల్ని ఆప్యాయంగా పలకరించారు. అనంతరం మహేశ్ కూడా.. చైకి షేక్ హ్యాండ్ ఇచ్చి హత్తుకున్నాడు. అనంతరం శోభితను కూడా నవ్వుతూ పలకరించి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. శోభితపై మహేశ్ ద్వేషం పెంచుకున్నాడని కామెంట్లు చేసినవారికి ఈ వీడియో చెంపపెట్టు అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.పెళ్లినాగచైతన్య - సమంత విషయానికి వస్తే వీరిది ప్రేమ వివాహం. ఇరు కుటుంబాల అంగీకారంతో 2017లో వీరి పెళ్లి జరిగింది. కలకాలం కలిసుంటారనుకుంటే నాలుగేళ్లకే విడిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం చై.. గతేడాది డిసెంబర్లో శోభితను రెండో పెళ్లి చేసుకున్నాడు. అటు సామ్ కూడా దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. కాగా అఖిల్- జైనబ్.. జూన్ 6న పెళ్లి చేసుకోగా జూన్ 8న రిసెప్షన్ జరిగింది. View this post on Instagram A post shared by Radhika (@the_mahi_dhfm2.0) The adorable glimpse of Yuvasamrat @chay_akkineni & #Sobhita garu shares the warm greetings with Superstar @urstrulyMahesh and #Namratha garu ✨A charming moment at #AkhilZainabReception ❤️#NagaChaitanya #Dhullakotteyala #NC24 pic.twitter.com/LSsmzcZnLw— Naga Chaitanya FC (@ChayAkkineni_FC) June 17, 2025 చదవండి: అవమానించారని అనుపమ ఆవేదన.. టాప్ హీరోయిన్లకూ అదే దుస్థితి తప్పలేదా? -
షారూఖ్‌ను మించిపోయేలా, మహేష్ టేస్ట్ అండ్ స్టైల్ : ధర రూ. 8 కోట్లు!
సెలబ్రిటీలు, సినీ స్టార్ల జీవనశైలి విలాసవంతంగా ఉంటుంది. వారునివసించే బంగ్లాలు, వారిదుస్తులు ఫ్యాషన్ స్టైల్, లగ్జరీ కార్లు ఇలా ప్రతీది స్పెషల్ ఎట్రాక్షన్గానేఉంటుంది. తాజాగా టాలీవుడ్ సూపర్‌హీరో, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు(Mahesh Babu ) కోట్ల విలువైన విలాసవంతమైన వానిటీ వ్యాన్ నెట్టింట్ హాట్‌టాపిక్‌గా నిలుస్తోంది. మరింకెందుకు ఆలస్యం ..ఆ వివరాలేంటో తెలుసుకుందాం.తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటులలో ఒకరు మహేష్‌బాబు. అలనాటి సూపర్ స్టార్, దివంగత ఘట్టమనేని కృష్ణ నటవారుసుడిగ బాల్యంలోనే సత్తా చాటుకున్న నటుడు మహేష్ బాబు. అందమైన రూపం, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, అద్భుతమైన నటనతో తిరుగులేని హీరోగా ఎదిగాడు. వయసు పెరుగుతున్నా మరింత అందంగా, స్మార్ట్‌గా తయారవుతూ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్న హీరో. తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోగా పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా సంపాదన కూడా తక్కువేమీ కాదు. తన స్టార్డంకు తగ్గట్టుగానే ఖరీదైన అభిరుచులకు కూడా పాపులర్. సొగసైన కార్లతో నిండిన గ్యారేజ్, ప్రైవేట్ జెట్ . హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో ఒక భారీ ఇల్లు అతని సొంతం. వీటిన్నిటి కంటే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మహేష్ కారవాన్. ఇది బాలీవుడ్ షారుఖ్ ఖాన్ వోల్వో 9BR కంటే ఖరీదైనదిగా తెలుస్తోంది.ఒక ప్రకటన షూటింగ్ సమయంలో నటుడు దానిని తీసుకువచ్చినప్పుడు మహేష్ బాబు వానిటీ వ్యాన్ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రిన్స్ వ్యక్తిగత అభిరుచి, స్టైల్‌కు తగ్గట్టు ఈ విలాసవంతమైన వాహనాన్ని పూణేకు చెందిన ఆటోమొబైల్ కంపెనీ DC ద్వారా పూర్తిగా కస్టమైజ్ చేశారట. మహేష్ బాబు క్యారవాన్ ధర దాదాపు రూ. 6 కోట్లు అని పింక్ విల్లా కథనం ద్వారా తెలుస్తోంది. అంతేకాదు హై-ఎండ్ కస్టమైజేషన్‌కు మరో రూ. 2 కోట్లు అదనం. సో.. వానిటీ వ్యాన్ ధర రూ. 8 కోట్లు అన్నమాట.మహేష్ బాబు కారవాన్ ఫీచర్స్ఇందులో ఒక లగ్జరీ బెడ్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్ను ఒక బటన్ క్లిక్ చేయడం ద్వారా మీటింగ్ రూమ్‌గా సులభంగా మార్చవచ్చు. ఒక మినీ కిచెన్ కూడా ఉంది, వేడి మరియు చల్లటి నీటి సరఫరా రెండూ అందుబాటులో ఉన్న వాష్‌రూమ్, క్లైనింగ్ సీట్లు, భారీ టీవీ, ఇంపోర్టెడ్ లగ్జరీ లైట్లు , స్పీకర్లతో కూడిన హోం థియేటర్‌తో పాటు ఇతర సకల సదుపాయాలున్నాయట.రూ. 8 కోట్ల ధరలో, టాలీవుడ్ స్టార్ కారవ్యాన్ ఒక విలాసవంతమైన ఇంటికంటే తక్కువేమీ కాదు.షారుఖ్ ఖాన్ వోల్వో వ్యాన్ కంటే ఖరీదైనది బాలీవుడ్ కింగ్' కంటే ‘టాలీవుడ్ ప్రిన్స్’ క్యారవాన్ అత్యాధునిక వానిటీ వ్యాన్ అని తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ గతంలో అత్యంత ఖరీదైన వానిటీ వ్యాన్ కలిగి ఉన్న నటుడిగా పేరుగాంచాడు. దీని ధర రూ. 4-5 కోట్లు, నివేదికల ప్రకారం,అయితే, ఇప్పుడు మహేష్ బాబు అతన్ని అధిగమించి జాబితాలో ఈ స్థానాన్ని ఆక్రమించాడు.మహేష్ బాబు మోడల్ , నటి నమ్రతా శిరోద్కర్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి పిల్లలు గౌతమ్, సితార ఉన్నారు. తండ్రికి తగ్గ తనయగా సితార, ఎంచుకున్న రంగంలో గౌతమ్ రాణిస్తున్నారు. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ( SSMB29) మహేష్ బాబు- ప్రియాంక చోప్రా , పృథ్వీరాజ్ సుకుమార్ నటిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. ఈ చిత్రం 2027 లో విడుదల కానుందని అంచనా.ఇదీ చదవండి: Akhil-Zainab Reception డైమండ్ నగలతో, గార్జియస్‌గా అఖిల్ అర్థాంగి -
మహేశ్ బాబు ఒకవేళ 'పుష్ప' చేస్తే..?
కొన్నిసార్లు ఒకరు చేయాల్సిన సినిమా మరొకరి దగ్గరకు వెళ్తుంది. ఊహించని బ్లాక్‌బస్టర్ అయితే.. అరె ఈ మూవీ మా హీరో చేసుంటే బాగుండేదేమో అని అభిమానులు బాధపడుతుంటారు. కానీ అదంతా ఒకప్పుడు. ఇప్పుడు టెక్నాలజీ వల్ల లేనిదాన్ని కూడా సృష్టించేస్తున్నారు. తాజాగా మహేశ్ బాబు ఒకవేళ 'పుష్ప' సినిమా చేసుంటే ఎలా ఉండేదా అని ఓ వీడియోని వైరల్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: కాంచీవరం చీరలో పూజా.. పేపర్ డ్రస్సులో అషు) 'వన్: నేనొక్కడినే' సినిమా తర్వాత మహేశ్ బాబు.. సుకుమార్‌తో మరో సినిమా చేయాల్సింది. కానీ ఎందుకో కాంబో సెట్ కాలేదు. అయితే అప్పుడు మహేశ్‌కి 'పుష్ప' కథే చెప్పారని, కానీ తనకు సెట్ కాదనే ఉద్దేశంతో వదులుకున్నారనే రూమర్స్ వచ్చాయి. తర్వాత సుక్కు.. అల్లు అర్జున్‌తో 'పుష్ప' చేయడం, ఇది పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే ఇప్పుడు మరి ఎవరు చేశారో గానీ మహేశ్ బాబు ఒకవేళ 'పుష్ప' చేసుంటే ఎలా ఉండేదో అని చెబుతూ ఓ ఏఐ వీడియోని సృష్టించారు. ఇందులో పలు హిట్ సీన్స్‌ని రీ క్రియేట్ చేయడం బాగుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. మహేశ్ సినిమాల విషయానికొస్తే చివరగా 'గుంటూరు కారం'తో పలకరించారు. ప్రస్తుతం రాజమౌళి సినిమా చేస్తున్నారు. ఇదివరకే షూటింగ్ మొదలైంది కూడా. ఇందులో మహేశ్ సాహసికుడిగా కనిపించబోతున్నారు. 2027లో ఈ మూవీ రిలీజ్ ఉండొచ్చని టాక్ నడుస్తోంది. అప్పటివరకు మహేశ్ ఫ్యాన్స్‌కి వెయిటింగ్ తప్పదు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'విరాటపాలెం')What if pushpa did by MB.. ?" Mahesh Babu " pic.twitter.com/HcbRuNAnU8— Sᴜʀʏᴀ.. 🐦🔥 (@Wolverine9121) June 16, 2025 -
మహేష్ బాబు, రాజమౌళి న్యూ మూవీ అప్డేట్..
-
SSMB29: నిధి అన్వేషణ కోసం ఆఫ్రికా అడవుల్లోకి 'మహేశ్'
మహేశ్ బాబు(Mahesh Babu) కథానాయకుడిగా దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) తీస్తున్న చిత్రం పనులు స్పీడ్ అందుకున్నాయి. కొద్దిరోజుల క్రితం ఒడిసాలో చిత్రీకరణ జరుపుకున్న ఈ భారీ ప్రాజెక్ట్ అక్కడ కొన్ని కీలక సన్నివేశాలతోపాటు, యాక్షన్ ఘట్టాల్ని తెరకెక్కించారు. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్నా చిత్ర యూనిట్ ఇప్పుడు ఆఫ్రికాలోని అటవీ ప్రాంతాల్లోకి షిఫ్ట్ అవుతుంది. కథ రీత్యా ఈ సినిమాలోని అత్యంత కీలకమై సీన్స్ ఇక్కడ షూట్ చేయనున్నారని తెలుస్తోంది.SSMB29 టీమ్ జులైలో కెన్యాకు పయనమయ్యేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అక్కడ మసాయి-పిగ్మీస్ తెగలతో ఇప్పటికే మహేశ్‌బాబు కొద్దిరోజులు గడిపారు. ఆ ప్రాంతపు యుద్ధ విద్యలపై బేసిక్ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. అక్కడి షెడ్యూల్ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. పలు కారణాల వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు అక్కడికి వెళ్లేందుకు కావాల్సిన అన్ని అనుమతులు కూడా తీసుకున్నారట. దాదాపు 30రోజుల పాటు జరగనున్న షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసేశారట. అక్కడి ప్రఖ్యాత అంబోసెలి నేషనల్ పార్క్‌లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.కెన్యాలో జరిగే ఈ షెడ్యూల్లో ప్రియాంక చోప్రా సెట్స్‌లో అడుగుపెట్టనుంది. మహేశ్, పృథ్వీరాజ్ సుకుమార్‌తో పాటు మరికొందరు అక్కడ షూటింగ్లో పాల్గొననున్నారు. ఇక ఈ సినిమాకు ‘మహారాజా’, ‘మహారాజ్’ అనే టైటిల్స్‌ను అనుకుంటున్నారని, 18వ శతాబ్దం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని, ఓ నిధి అన్వేషణతో ఈ సినిమా ఉంటుందనీ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. -
అడవిలో అన్వేషణ!
అడవుల్లో మహేశ్‌బాబు కళ్లు దేని కోసమో వెతుకుతున్నాయి. కొందరు నిధి కోసం అంటున్నారు. మరికొందరు ప్రాణం పోసే సంజీవిని తరహా లాంటి మొక్క కోసం అంటున్నారు. ఈ మాటలు మహేశ్‌బాబు కొత్త సినిమా గురించే. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో మహేశ్‌బాబు క్యారెక్టరైజేషన్, సినిమా కథ గురించి ఎప్పటికప్పుడు కొత్త వార్తలు వస్తుండటం, సినీ ప్రేమికులు వీటిని ఆసక్తికరంగా గమనిస్తుండటం జరుగుతోంది. తాజాగా ఈ సినిమా గురించిన మరో ఆసక్తికరమైన వార్త ప్రచారంలోకి వచ్చింది. అదేంటంటే... ఈ సినిమాకు భారతీయ ఇతిహాసం రామాయణ నేపథ్యం ఉంటుందట.రామాయణంలో సంజీవని మొక్క కోసం వెతికే హనుమంతుడిని పోలిన లక్షణాలు మహేశ్‌బాబు పాత్రలో ఉంటాయని ఫిల్మ్‌నగర్ భోగట్టా. మరి... మహేశ్‌బాబు అడవిలో దేని కోసం అన్వేషిస్తున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు కథ అందించారు. ఆ మధ్య ఈ సినిమా షూటింగ్ నిరవధికంగా జరిగింది. తర్వాత బ్రేక్ తీసుకున్నారు. ఈ వారంలో మళ్లీ చిత్రీకరణ మొదలవుతుందని, కాశీ నగరాన్ని తలపించే సెట్‌ని రెడీ చేయించారని, ఈ సెట్లోనే షెడ్యూల్ ప్రారంభం అవుతుందని తెలిసింది. రెండు వారాలకు పైగా ఇక్కడే చిత్రీకరణ జరుగుతుందట. ఇక ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో విడుదల కానుంది. -
మహేశ్-రాజమౌళి సినిమా.. నో చెప్పిన స్టార్ హీరో?
ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. వివిధ భాషల్లోనూ హీరోలు తెలుగు సినిమాల్లో, మన దర్శకులతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్స్ చాలామంది తమిళ, మలయాళ హీరోలని కీలక పాత్రల కోసం తీసుకుంటున్నారు. అయితే రాజమౌళి, మహేశ్ బాబుతో చేస్తున్న ప్రాజెక్ట్ కోసం ఓ స్టార్ హీరోని అడగ్గా నో చెప్పాడట. ఇంతకీ ఎవరతడు? ఏంటి సంగతి?'ఆర్ఆర్ఆర్' తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని రాజమౌళి మహేశ్‌తో సినిమా చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం షూటింగ్ మొదలవగా రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఎస్ఎస్ఎమ్బీ 29 వర్కింగ్ టైటిల్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. సాధారణంగా మూవీ మొదలుపెట్టగానే ప్రెస్ మీట్ పెట్టే రాజమౌళి.. ఈసారి మాత్రం ఒక్క మాట చెప్పకుండా సైలెన్స్ మెంటైన్ చేస్తున్నాడు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో నటిస్తున్నారనే విషయం లీకైంది. కానీ రాజమౌళి అస్సలు రెస్పాండ్ కాలేదు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్)ఇప్పుడు కూడా సడన్‌గా తమిళ హీరో విక్రమ్.. రాజమౌళి ఇచ్చిన ఆఫర్ చేశాడంటూ కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. సినిమాలో విలన్ పాత్ర కోసం విక్రమ్‌ని సంప్రదించగా, తనకు ప్రతినాయకుడి రోల్స్ చేయడం ఇష్టం లేదని జక్కన్నతో ఇతడు చెప్పాడట. దీంతో మరో ఆప్షన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్‌ని ఎంపిక చేశాడని అంటున్నారు. గతంలో ప్రభాస్ 'సలార్'లో పృథ్వీరాజ్ ప్రతినాయక ఛాయలున్న పాత్ర చేశాడు. ఇప్పుడు మహేశ్ బాబుకి విలనీగా చేస్తున్నాడనమాట.ఇదే సినిమాలో మాధవన్ కూడా కీలక పాత్ర చేయనున్నాడనే టాక్ రెండు మూడు రోజుల క్రితం వినిపించింది. త్వరలో మొదలయ్యే కొత్త షెడ్యూల్లో ఇతడు జాయిన్ అవుతాడని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ మూవీ 2027లో రిలీజ్ టార్గెట్‌గా సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. అటవీ నేపథ్యంతో ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహసికుడి కథగా ఇది సిద్ధమవుతోంది.(ఇదీ చదవండి: త్రివిక్రమ్ లాంటి దర్శకుడికి ఇలాంటి పరిస్థితా?) -
అఖిల్ రిసెప్షన్లో సింపుల్‌గా మహేశ్.. ఆ టీ షర్ట్ ధర లక్షల్లో..!
అందరికీ వయసు పెరుగుతుంది. కానీ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu)కు మాత్రం వయసు తగ్గిపోతూ వస్తుంది. అన్నం తింటాడా? అందం తింటాడా? అన్నంత హ్యాండ్సమ్గా కనిపిస్తుంటాడు. కుమారుడు గౌతమ్ పక్కన నిలబడితే అతడికి తండ్రిలా కాదు, అన్నలా ఉంటాడు. మహేశ్ అందం గురించి చెప్తే మాటలు సరిపోవు. అతడి ఫోటో కనిపిస్తే చాలు సోషల్ మీడియా షేకైపోతుంది.సింపుల్‌గా టీ షర్ట్‌లో మహేశ్తాజాగా మహేశ్.. అక్కినేని ఇంట శుభకార్యానికి హాజరయ్యాడు. నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని- జైనబ్ రవ్జీలు జూన్ 6న పెళ్లి చేసుకున్నారు. ఆదివారం (జూన్ 8న) అన్నపూర్ణ స్టూడియోలో వీరి రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మహేశ్.. భార్య నమ్రత, కూతురు సితారను తీసుకుని హాజరయ్యాడు. అయితే మహేశ్.. సింపుల్‌గా టీ షర్ట్ వేసుకుని వెళ్లాడు. లక్ష పైచిలుకు..చూడటానికి సింపుల్‌గా కనిపిస్తున్న ఈ టీ షర్ట్ ధర వేలల్లో కాదు లక్షల్లోనే ఉంది. ఫ్లవర్ ప్రింటింగ్ ఉన్న ఈ టీషర్ట్.. హెర్మ్స్ అనే లగ్జరీ బ్రాండ్‌కు చెందినది. దీని ధర దాదాపు రూ.1.37 లక్షలని తెలుస్తోంది. సినిమాల విషయానికి వస్తే మహేశ్ చివరగా గుంటూరు కారం అనే సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం రాజమౌళితో #SSMB 29 చేస్తున్నాడు. ఇందులో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.చదవండి: అఖిల్ అక్కినేని రిసెప్షన్.. ఈ విషయం గమనించారా? -
కలెక్షన్స్ లో ఖలేజా సెన్సేషన్
-
మహేశ్‌బాబు, అల్లు అర్జున్.. కొత్తగా మల్టీఫ్లెక్స్ నిర్మాణాలు ఎక్కడంటే?
టాలీవుడ్ స్టార్ హీరోలు మహేశ్‌బాబు, అల్లు అర్జున్, రవితేజ, విజయ్ దేవరకొండ ఇప్పటికే మల్టీప్లెక్స్ నిర్మాణంలో అడుగుపెట్టారు. ఏషియన్ గ్రూప్స్ భాగస్వామ్యంతో వారు ఈ రంగంలో రాణిస్తున్నారు. హైదరాబాద్‌లోనే అత్యంత విలాసవంతమై మల్టీప్లెక్స్‌ను (AMB) మహేశ్‌బాబు నిర్మించగా.. (AAA)పేరుతో అల్లు అర్జున్ రీసెంట్గా ఈ వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. అయితే, ఇప్పుడు వారిద్దరూ ఇతర రాష్ట్రాల్లో కూడా తమ వ్యాపారాన్ని విస్తరించే ప్లాన్‌లో ఉన్నారని తెలుస్తోంది.అయితే, (AMB) పేరుతో బెంగళూరులో ఒక భారీ మల్టీప్లెక్స్‌ను మహేశ్ నిర్మించారు. త్వరలో ప్రారంభం కానుంది. ఆరు స్క్రీన్స్‌తో అత్యంత లగ్జరీ సౌకర్యాలతో దీనిని నిర్మించారు. ఇప్పుడు చెన్నై, గోవాలో కూడా మరో మల్టీప్లెక్స్ నిర్మించబోతున్నారు. ఏషియన్ సినిమాస్‌తో కలిసి అక్కడ అతిపెద్ద థియేటర్‌ను నిర్మించాలని ప్రిన్స్ మహేశ్ ప్లాన్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ తన సన్నిహితుల వద్ద చెప్పారు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇప్పటికే హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో (AAA) సినిమాస్ పేరుతో ఒక మల్టీప్లెక్స్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. ఆయన కూడా ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతోనే ఈ వ్యాపారంలో అడుగుపెట్టారు. అయితే, ఇప్పుడు ఆయన వైజాగ్‌లో AAA మల్టీప్లెక్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వైజాగ్‌లో త్వరలో ప్రారంభం కానున్న ఇనార్బిట్ మాల్లో హైదరాబాద్‌లో ఉన్నట్లే మల్టీప్లెక్స్ కట్టిస్తున్నారట. ఇదే విషయాన్ని సునీల్ నారంగ్ చెప్పుకొచ్చారట. త్వరలో అధికారికంగా ప్రకటన రావచ్చని తెలుస్తోంది.హైదరాబాద్‌లో అతిపెద్ద ఐమాక్స్ థియేటర్ కూడా త్వరలో నిర్మించనున్నట్లు ఏషియన్ అధినేత సునీల్ నారంగ్ చెప్పారని మీడియా సర్కిల్లో ఒక వార్త ఉంది. భాగ్యనగరంలో ఇప్పటి వరకు నిజమైన IMAX థియేటర్లు లేవు. గతంలో హైదరాబాద్‌లో IMAX థియేటర్లు ఉన్నప్పటికీ, ఇప్పుడు అవి లేవు. అయితే, ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో "PCX" అని పిలువబడే ఒక పెద్ద స్క్రీన్ ఉంది, ఇది 3D IMAX 70mm స్క్రీన్‌గా ఉండేది.., కానీ ఇప్పుడు కాదు. ఒకవేళ అన్ని అనుకున్నట్లు జరిగితే హైదరాబాద్‌కు తొలి ఐమాక్స్ థియేటర్ త్వరలో రానుంది. -
మహేశ్ సినిమాలో..?
మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంలో హీరోయిన్ ప్రియాంకా చోప్రా, హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలుపోషిస్తున్నారు. తాజాగా ఈ టీమ్‌లోకి మాధవన్ కూడా చేరినట్లు ఫిల్మ్‌నగర్ సమాచారం. ఆయన ఓ కీలకపాత్రలో కనిపించనున్నారని టాక్. ఈ మేరకు మాధవన్‌తో చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే ఆయన సెట్స్‌లో అడుగు పెట్టబోతున్నారని భోగట్టా.మరి... ఈ చిత్రంలో మాధవన్ భాగం అవుతారా? లేదా అనే విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఇండియానా జోన్స్ స్టైల్ కథతో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. కొత్త షెడ్యూల్‌ని ఈ నెలలోనే మొదలు పెట్టనున్నారట. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ ఈ అడ్వెంచరస్ ఫిల్మ్‌ను దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్తోపాన్ వరల్డ్ రేంజ్లో నిర్మిస్తున్నారనే టాక్ నడుస్తోంది. తెలుగులో ఇదే అత్యధిక బడ్జెట్ ఫిల్మ్ అని టాక్. -
ఘట్టమేని ఫ్యామిలీ నుంచి మరో హీరో... మహేశ్ బాబు భారీ స్కెచ్!
టాలీవుడ్లో ఘట్టమనేని ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో సాహసానికి, మంచితనానికి కేరాఫ్‌గా నిలిచారు సూపర్‌స్టార్ కృష్ణ ఈ ప్యామిలీ నుంచి వచ్చిన వాడే. ఆ తర్వాత కృష్ణ వారసుడిగా మహేశ్ బాబు(Mahesh Babu) హీరో అయ్యాడు. తనదైన శైలీలో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఇప్పుడు ఘట్టమేని ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరో రాబోతున్నాడు. సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మనవడు, మహేశ్ అన్నయ్య రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా ఓ చిత్రం తెరకెక్కబోతోంది.ఈ కొత్త ప్రాజెక్టును దర్శకుడు అజయ్ భూపతి స్వయంగా హెల్మ్ చేయనున్నారని తాజా సమాచారం. RX 100 వంటి బ్లాక్‌బస్టర్‌తో తన ప్రతిభను చాటిన అజయ్ భూపతి, ఇటీవల థ్రిల్లర్ "మంగళవరం"తో మళ్ళీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం "మంగళవరం 2" ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉండగానే, మరో హై-ప్రొఫైల్ లాంచింగ్ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా జయకృష్ణ వెండితెరకు పరిచయమవుతున్నాడు.ఈ చిత్రానికి ఇద్దరు ప్రముఖ నిర్మాతలు మద్దతు ఇస్తున్నట్టు సమాచారం. భారీ బడ్జెట్ కేటాయించి వైజయంతి ఆర్ట్స్, అనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను రూపొందించనున్నారట. ఈ సినిమాకు సంబంధించిన కథ, నటీనటులు, షూటింగ్ షెడ్యూల్ వివరాలు ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు. అయినప్పటికీ, సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నారని తెలియడంతో చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.జయకృష్ణ ప్రస్తుతం లండన్‌లో ప్రొఫెషనల్ నటనా శిక్షణ తీసుకుంటున్నాడని సమాచారం. సోషల్ మీడియాలో ఇటీవల బయటకు వచ్చిన ఫోటోల ద్వారా అతని లుక్ పై కూడా జనాల్లో ఆసక్తి పెరిగింది. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రాజెక్ట్‌ను జయకృష్ణ బాబాయి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మంచి లాంచ్ కోసం అవసరమైన నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలపై మహేష్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు టాక్. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
రీరిలీజ్‌లో ఆల్‌టైమ్ రికార్డ్.. నీ వల్ల అవుద్ది సామీ!
'ఖలేజా' సినిమా (Khaleja Movie)తో నిండా మునిగాడు నిర్మాత సింగనమల రమేశ్. కొమురం పులి, ఖలేజా సినిమాలతో ఏకంగా రూ.100 కోట్లు నష్టపోయానని ఆ మధ్య తన బాధను వ్యక్తం చేశాడు. మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా నటించిన ఖలేజా సినిమా షూటింగ్ జాప్యం ఒక కారణమైతే ప్రేక్షకులు దాన్ని డిజాస్టర్‌గా మల్చడం మరో కారణం. కానీ ఆ సినిమా ఇప్పుడు అద్భుతాలు సృష్టిస్తుండటం విశేషం!అప్పుడలా.. ఇప్పుడిలా..2010లో త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ఖలేజా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కానీ తర్వాత టీవీల్లో మాత్రం జనాలు బాగానే చూసేవారు. అసలే కొంతకాలంగా రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. బిజినెస్‌మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పోకిరి, ఒక్కడు.. ఇలా మహేశ్ సినిమాలే చాలావరకు రీరిలీజ్ అయ్యాయి. తాజాగా మహేశ్ తండ్రి, సూపర్‌స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని ఖలేజాను 4కె వర్షన్లో రీరిలీజ్ చేశారు.నీ వల్ల అవుద్ది సామిఇంకేముంది, మరోసారి జనం థియేటర్లకు క్యూ కట్టారు. కొత్త సినిమాలను సైతం పక్కకు నెట్టి ఖలేజా సినిమాను వీక్షిస్తున్నారు. కేవలం మూడు రోజుల్లోనే ఈ మూవీ రూ.11.83 కోట్లు రాబట్టినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. రీరిలీజ్‌లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తెలుగు చిత్రంగా ఖలేజా నిలిచింది. ఇది చూసిన అభిమానులు.. ఈ రికార్డులన్నీ కేవలం నీ వల్లే అవుతాయి సామి అంటూ కామెంట్లు చేస్తున్నారు.త్వరలోనే మరో రీరిలీజ్ఖలేజా సినిమాలో మహేశ్‌బాబుకు జంటగా హీరోయిన్ అనుష్క నటించింది. ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, సునీల్, షఫీ, అలీ, సుబ్బరాజు ఇతర పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం అందించాడు. అతడు తర్వాత త్రివిక్రమ్- మహేశ్ డైరెక్షన్లో వచ్చిన రెండో చిత్రమిది. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్, ఉత్తమ గేయరచయిత విభాగంలో రెండు ఫిలింఫేర్ సౌత్ అవార్డులు అందుకుంది. ఇకపోతే మహేశ్‌బాబు బర్త్‌డే సందర్భంగా ఆగస్టు 9న అతడు చిత్రాన్ని మళ్లీ రిలీజ్ చేయనున్నారు. Raju’s Rage is Real, Box-Office Numbers are Surreal 🥵#Khaleja4K smashes records as the first Telugu re-release to cross ten crore, raking in ₹11.83 crore in just 3 days💥💥@urstrulyMahesh #RecordBreakingKhaleja4K pic.twitter.com/vjV0Zbtzcg— Khaleja4K (@KhalejaTheFilm) June 2, 2025చదవండి: నార్మల్ డెలివరీ కంటే ఆపరేషన్ ఈజీనా? మీకేం తెలుసు?: నటి కన్నీళ్లు -
శంకర్ కూతురు ఆ తెలుగు డైరెక్టర్‌ను అంతమాట అనేసిందేంటి!
అభిమాన హీరో కళ్ల ముందు కనిపిస్తే చాలు సెల్ఫీలంటూ ఎగబడతారు. స్టార్ డైరెక్టర్ శంకర్ కూతుళ్లు అదితి, ఐశ్వర్య కూడా అదే పని చేశారు. తండ్రితో కలిసి షూటింగ్‌కు వెళ్లినప్పుడు ఓ హోటల్ దగ్గర ఆగారు. అక్కడ మహేశ్‌బాబు (Mahesh Babu)ను చూడగానే సెల్ఫీ అంటూ అతడి ముందు వాలిపోయారు. అయితే వీళ్లు శంకర్ కూతుర్లని తెలీక.. ఫ్యామిలీతో ఉన్నాను.. ఇప్పుడు సెల్ఫీ ఇవ్వడం కుదరదని పంపేశాడు.అదితితో సెల్ఫీకి నో చెప్పిన మహేశ్దీంతో వాళ్లు నిరాశగా వెనుదిరిగారు. ఇదంతా చూసిన డైరెక్టర్ మెహర్ రమేశ్ (Meher Ramesh).. వెంటనే హీరో దగ్గరకు వెళ్లి.. ఆ అమ్మాయిలు ఎవరన్న విషయం చెప్పడంతో అతడు నాలుక్కరుచుకున్నాడు. శంకర్ దగ్గరకు వెళ్లి.. మీ కూతుర్లని తెలీక అలా చేశానని మహేశ్ సారీ చెప్పాడు. అందుకు శంకర్.. హీరోలంటే ఎలా ఉండాలో వాళ్లక్కూడా తెలియాలి కదా అని రిప్లై ఇచ్చాడు. శంకర్ కూతుర్లు చాలా సింపుల్‌గా ఉంటారంటూ మహేశ్‌బాబు ఈ సంఘటనను అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో వెల్లడించాడు.మహేశ్‌కు సారీ చెప్పిన శంకర్ కూతుర్లుతాజాగా ఇదే సంఘటనను అదితి శంకర్ (Aditi Shankar) ఓ యూట్యూబ్ ఛానల్లో గుర్తు చేసుకుంది. నాన్న సినిమా కోసం మేమందరం ఓ చోటుకు వెళ్తున్నాం. దారిలో ఓ హోటల్ దగ్గర బ్రేక్‌ఫాస్ట్ కోసం ఆగాం. అక్కడ మహేశ్‌బాబు ఉన్నారు. నేను, నా సోదరి ఆయనకు అభిమానులం. మేము తన దగ్గరకు వెళ్లి ఓ ఫోటో అడిగాం. అందుకాయన.. ఇప్పుడు ఇవ్వలేనమ్మా అని తిరస్కరించారు. డిస్టర్బ్ చేసినందుకు సారీ చెప్పి వెళ్లిపోయాం. వీడియో వైరల్అప్పుడు మహేశ్ బాడీగార్డ్ వెళ్లి.. మేము శంకర్ కూతుర్లమని చెప్పాడు. దాంతో ఆయన మేమున్న టేబుల్ దగ్గరకు వచ్చి మీ కూతుర్లని తెలీదు సర్ అని వివరణ ఇచ్చుకున్నాడు. పర్లేదు.. హీరో ఎలా ఉంటారో వారికి తెలియాలి. అయినా వాళ్లకు ఫోటో కావాలంటే నీ దగ్గరకు వచ్చి అడుగుతారు. ఇస్తావా? లేదా? అనేది నీ నిర్ణయం అని నాన్న అన్నాడు. ఏదో తెలీక నో చెప్పానంటూనే మహేశ్ మాతో ఫోటో దిగాడు అని అదితి చెప్పుకొచ్చింది. ఈ వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన జనాలు.. పాపం, మెహర్ రమేశ్‌ను మహేశ్‌కు బాడీగార్డ్‌ను చేసేసిందని కామెంట్లు చేస్తున్నారు. Finally hearing from @shankarshanmugh daughter about her funny experience with @urstrulyMahesh.Papam @MeherRamesh ni body guard anukundi 😂😂#MaheshBabu #Khaleja4K #ssmb29 pic.twitter.com/TfzfBLePGo— 👌🌟Ⓜ️🅱️2️⃣9️⃣ (@SPYderLoading) May 31, 2025 చదవండి: కమెడియన్ అలీకి చిరంజీవి గిఫ్ట్.. ఈసారి స్పెషల్‌గా..! -
ఖలేజా రీ రిలీజ్.. అనూహ్యంగా ట్రెండింగ్‌లోకి వచ్చిన నటి.. అసలు విషయం ఇదే!
మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూవీ ఖలేజా. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ సినిమా రీ రిలీజ్ చేశారు. అప్పట్లో థియేటర్లలో అంతగా రాణించని ఈ చిత్రం.. రీ రిలీజ్లో మాత్రం ఊహించని రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. మొదటి రోజే అత్యధిక వసూళ్లు సాధించిన సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. రీ రిలీజ్ రోజు మహేశ్ బాబు అభిమానులు థియేటర్లలో ఓ రేంజ్లో సందడి చేశారు. ఓ అభిమాని ఏకంగా పామును పట్టుకుని మూవీ థియేటర్‌కు వచ్చాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది.అయితే ఈ సినిమా రీ రిలీజ్ తర్వాత అనూహ్యంగా ఆమె పేరు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఆమె ఈ సినిమాలో నటించిన హీరోయిన్ అనుష్క అని అందరూ అనుకుంటున్నారేమో. అస్సలు కాదు.. ఓ చిన్న పాత్రలో మెప్పించిన ఆమె ఉన్నట్టుండి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఈ స్టోరీ చదివేయండి.ఈ సినిమాను ఎక్కువగా రాజస్థాన్‌లో షూట్ చేశారు. ఆ సమయంలో టాక్సీ డ్రైవర్ అయినా హీరో దిలావర్ సింగ్ అనే వ్యక్తి కుటుంబాన్ని కలిసేందుకు వెళ్తాడు. ఈ సీన్స్ మహేశ్ బాబు ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి. ఈ సీన్స్‌లో నటించిన దిలావర్ సింగ్ భార్యగా నటించిన ఆమె దివ్య మేరి సిరియాక్ అని నెట్టింట తెగ వైరలైంది. అయితే ఇది చూసిన ఆమె.. ఖలేజా మూవీలో తాను నటించలేదని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఆమె క్లారిటీ ఇచ్చింది.తాజాగా ఖలేజా రీ రిలీజ్ కావడంతో దిలావర్ సింగ్ భార్యగా నటించింది దివ్య మేరి సిరియాక్ అని నెట్టింట వైరలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చింది. ఆ రోల్ తాను చేయలేదని స్పష్టం చేసింది. తానేనని చాలామంది పొరపాటుగా పోస్ట్ చేశారని తెలిపింది. View this post on Instagram A post shared by Divya Mary Cyriac (@divyacyriac) -
ఒకేసారి రెండు రికార్డ్స్ బ్రేక్ చేసిన మహేష్
-
మహేశ్ 'ఖలేజా' రీ రిలీజ్.. ఆల్ టైమ్ కలెక్షన్ రికార్డ్
టాలీవుడ్లో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి. కొత్తగా రిలీజ్ అవుతున్న సినిమాలు సరిగా ఆడట్లేదు. అదే టైంలో రీ రిలీజ్‌ల హడావుడి ఎక్కువైపోయింది. గత కొన్నాళ్ల నుంచి ఈ తరహాలోనే పాత చిత్రాల్ని విడుదల చేస్తున్నారు. వీటికే కోట్లకు కోట్లు కలెక్షన్స్ కూడా వస్తుండటం విశేషం. ఇప్పుడు మహేశ్ 'ఖలేజా' కూడా అలానే రీ రిలీజ్ కాగా.. కళ్లు చెదిరే వసూళ్లు వచ్చాయి.(ఇదీ చదవండి: నాగార్జున కొడుకు పెళ్లి.. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం)రీ రిలీజ్ ట్రెండ్‌లో మహేశ్ సినిమాలకు ఎక్కువ ఆదరణ దక్కుతోంది. మురారి, బిజినెస్‌మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తదితర చిత్రాలని రీ రిలీజ్ చేయగా.. అభిమానులు థియేటర్లలో రచ్చ రచ్చ చేశారు. తాజాగా సూపర్‌స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా 'ఖలేజా'ని మళ్లీ థియేటర్లలోకి తీసుకొచ్చారు. దీనికి ఏకంగా ప్రీమియర్స్ కూడా వేయడం విశేషం.ఇప్పుడు 'ఖలేజా' మూవీ రీ రిలీజ్లోనూ రికార్డ్స్ సృష్టించినట్లు తెలుస్తోంది. తొలిరోజు మొత్తం రూ.8.26 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే అధికారిక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించిన 'ఖలేజా'.. 2010లో థియేటర్లలో రిలీజైంది. అప్పుడేమో డిజాస్టర్ అయింది. తర్వాత టీవీల్లో ప్రసారమైనప్పుడు చాలామందికి ఇది ఫేవరెట్ అయిపోయింది. ఇప్పుడు రీ రిలీజ్ వల్ల అభిమానులు ఈ చిత్రంపై తన ప్రేమనంతా చూపించారు. వచ్చే శుక్రవారం వరకు ఈ మూవీని తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ప్రదర్శించనున్నారు.(ఇదీ చదవండి: వారానికే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
పిచ్చి పీక్స్.. 'ఖలేజా' రీ రిలీజ్లో పాముతో వీరంగం!
గత కొన్నాళ్లుగా టాలీవుడ్లో వింత పరిస్థితి. కొత్త సినిమాల కంటే రీ రిలీజ్‌ల హడావుడి ఎక్కువైపోయింది. స్టార్ హీరోల మూవీస్ అయితే అభిమానులు, సదరు చిత్రాల్లో సీన్లని రీ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా 'ఖలేజా' రీ రిలీజ్ సందర్భంగానూ అంతకు మించి అనేలా ఓ అభిమాని రచ్చ చేశాడు. ఏకంగా థియేటర్లలోకి పాము తీసుకొచ్చి హల్చల్ చేశాడు.(ఇదీ చదవండి: నటి స్నానం చేసిన నీటితో సబ్బు.. రేటు ఎంతంటే?)తెలుగు రాష్ట్రాల్లో తాజాగా మహేశ్ బాబు 'ఖలేజా'ని రీ రిలీజ్ చేశారు. ఈ మూవీలో సీన్లకు తగ్గట్లు కొందరు ఆస్పత్రి డ్రస్ వేసుకుని వెళ్లగా, మరికొందరు కుండీతో మొక్కని తీసుకెళ్లారు. విజయవాడలో ఓ అభిమాని మాత్రం థియేటర్లలోకి పాముని తీసుకెళ్లాడు. సినిమా ప్రారంభంలో మహేశ్ బాబు పాముని పట్టుకుని.. విలన్లకి పైకి విసురుతాడు. ఇప్పుడు అభిమాని కూడా.. స్క్రీన్ దగ్గర పాముతో కనిపించాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.'గుంటూరు కారం' తర్వాత మహేశ్ ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్నాడు. ఇది రావడానికి మరో మూడు నాలుగేళ్లు పట్టొచ్చు. అందుకే మహేశ్ ఫ్యాన్స్.. 'ఖలేజా' రీ రిలీజ్ సందర్భంగా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. రకరకాల సీన్లని రీ క్రియేట్ చేస్తూ నెట్టింట వైరల్ అయిపోతున్నారు. ఇకపోతే ఈ సినిమాకు తొలిరోజు భారీగానే వసూళ్లు వచ్చేలా కనిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: విష్ణుని రెచ్చగొట్టేలా మంచు మనోజ్ మరో పోస్ట్!)ఇదేమీ సీన్ రిక్రియేషన్ పిచ్చిరా బాబు...విజయవాడలో ఖలేజా రీరిలీజ్ సందర్భంగా ఓ అభిమాని హల్చల్. సినిమా ప్రదర్శితమవుతున్న ఓ థియేటర్లోకి పాముని తీసుకెళ్లి, స్క్రీన్ పైకి ఎక్కి వీరంగం సృష్టించాడు.#KhalejaReRelease #MaheshBabu pic.twitter.com/kJbWY6ptFE— greatandhra (@greatandhranews) May 30, 2025 -
మహేష్ బాబు అభిమాని అత్యుత్సాహం..
-
రాజమౌళి-మహేష్ బాబు సినిమాని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ హీరో..!
-
SSMB29: రూ.20 కోట్ల ఆఫర్‌ని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ నటుడు!
రాజమౌళి..ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ దర్శకుడు. ఇందులో నో డౌట్. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే కచ్చితంగా అది రికార్డులు సృష్టిస్తుంది. అలాంటి దర్శక దిగ్గజం సినిమాలో నటించే అవకాశం వస్తే ఏ నటుడైనా వదులుకుంటాడా? కానీ బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ మాత్రం రాజమౌళి ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించాడట. రూ. 20 కోట్ల పారితోషికం ఇస్తానని చెప్పినప్పటికీ ఆయన ఒప్పుకోలేదట. నమ్మశక్యంగా లేనిఈ వార్తను బాలీవుడ్ మీడియా తెగ ప్రచారం చేస్తోంది.న్యూస్ 18 కథనం ప్రకారం.. మహేశ్ బాబుతో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం(SSMB 29)లో కీలక పాత్ర కోసం నానా పటేకర్‌ని తీసుకుందాం అనుకున్నారట. ఈ మేరకు రాజమౌళి పూణే వెళ్లి నానా పటేకర్‌కు స్క్రిప్ట్ మొత్తం వివరించారట. కథ, పాత్ర బాగున్నప్పటికీ.. దానికి నేను న్యాయం చేయలేనని నానా పటేకర్(Nana Patekar ) భావించారట. ఈ విషయం రాజమౌళి టీమ్‌కి చెప్పి.. సున్నితంగా తప్పుకున్నాడని బాలీవుడ్ మీడియా పేర్కొంది. అంతేకాదు..ఇందులో నటించేందుకు నానా పటేకర్‌ని భారీగా పారితోషికం ఇస్తామని చెప్పారట. కేవలం 15 రోజుల షూటింగ్ కోసం దాదాపు రూ. 20 కోట్ల వరకు ఇస్తామని చెప్పినప్పటికీ, నానా పటేకర్ ఈ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించినట్టుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పాత్ర నచ్చకపోవడంతోనే నానా పటేకర్ మహేశ్ సినిమాను రిజెక్టర్ చేశారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇదంతా బాలీవుడ్ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారం అని, రాజమౌళి అడిగితే నానా పటేకరే కాదు అమితాబ్ లాంటి స్టార్స్ కూడా నటించేందుకు ముందుకు వస్తారని టాలీవుడ్ ఫ్యాన్స్ అంటున్నారు. రాజమౌళి- మహేశ్ సినిమా విషయానికొస్తే.. SSMB 29 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యం తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది.


