హాలీవుడ్‌ నటితో మహేశ్ బాబు కూతురు.. సోషల్ మీడియాలో వైరల్! | Mahesh Babu Daughter Sitara Selfie With Kim Kardashian From Anant Ambani Wedding, Pic Goes Viral | Sakshi
Sakshi News home page

Sitara: హాలీవుడ్‌ భామతో సితార సెల్ఫీ.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్!

Published Sun, Jul 14 2024 3:35 PM | Last Updated on Sun, Jul 14 2024 5:49 PM

Mahesh Babu daughter Sitara selfie with Kim Kardashian from Anant Ambani wedding

ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ తనయుడి పెళ్లి ముంబయిలో ‍గ్రాండ్‌గా జరిగింది. గతంలోనే నిశ్చితార్థం చేసుకున్న అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లిలో టాలీవుడ్ నుంచి హాలీవుడ్‌ వరకు సినీతారలు హాజరై సందడి చేశారు. నగరంలోని జియో వరల్డ్‌ కన్వెన్ష్‌న్‌ సెంటర్‌లో అత్యంత వైభవంగా వీరి పెళ్లి వేడుక జరిగింది. టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, మహేశ్ బాబు కుటుంబ సమేతంగా హాజరయ్యారు.

అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహ వేడుకలో ప్రిన్స్ మహేశ్ బాబు ఫ్యామిలీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. తన ముద్దుల కూతురు సితార, భార్య నమ్రతా శిరోద్కర్‌తో కలిసి పెళ్లి వేడుకల్లో మెరిశారు. ఈ గ్రాండ్‌ వెడ్డింగ్‌లో సితార ప్రముఖులతో ఫోటోలకు ఫోజులిచ్చింది. హాలీవుడ్ భామ కిమ్ కర్దాసియాన్‌తో సెల్ఫీలు తీసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  అంతే కాకుండా బాలీవుడ్ తారలు ప్రియాంక చోప్రా, రాధ, ఐశ్వర్యరాయ్, రణ్‌వీర్‌సింగ్, సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ లాంటి బాలీవుడ్ స్టార్స్‌తోనూ ఫోటోలు దిగింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement