బ్లాక్‌ చుడిదార్‌లో సితార క్యూట్‌ లుక్! | Sitara Ghattamaneni Wearing Black Embroidered Falguni Shane Peacock | Sakshi
Sakshi News home page

బ్లాక్‌ చుడిదార్‌లో సితార క్యూట్‌ లుక్!

Published Sun, Mar 17 2024 4:18 PM | Last Updated on Sun, Mar 17 2024 4:22 PM

Sitara Ghattamaneni Wearing Black Embroidered Falguni Shane Peacock  - Sakshi

టాలీవుడ్‌ నటుడు మహేష్‌ బాబు, నమ్రత శిరోద్కర్‌ల కుమార్తె సీతార పలు యాడ్‌లలో తండ్రితో కలిసి సందడి చేసింది. ప్రముఖ ఆభరణాల అడ్వర్టైస్‌మెంట్‌లో కూడా మోడల్స్‌ ఎవరూ ఆమె ముందు సరిపోరేమో అన్నంతగా స్టన్నింగ్‌ లుక్‌తో మిస్‌మరైజ్‌ చేసింది. ఈసారి ప్రముఖ బ్రాండెండ్‌ చుడిదార్‌తో న్యూలుక్‌తో మనముందుకు వచ్చింది. సీతార స్టార్‌ కిడ్‌ ఫల్గుణి షేన్‌ పీకాక్‌ లగ్జరీ దుస్తులతో తళుక్కుమంది. చెప్పాలంటే ఆమె పేరుకు తగ్గట్టు ఆ బ్లాక్‌ కలర్‌ డ్రస్‌లో రాత్రిపూట కనిపించే స్టార్‌లో కాంతిలీనుతోంది.

View this post on Instagram

A post shared by sitara (@sitaraghattamaneni)

సీక్విన్డ్‌ బ్లాక్‌ కుర్తాపై సిల్వర్‌ గులాబీతో కూడిన అంచులు. దానిపై చక్కగా తీర్చిదిద్ధిన ఎంబ్రాయిడరీ డిజైన్‌ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. సాంప్రదాయ ఆకర్షణను తలపించేలా వెండి ముత్యాల వరుసతో తీర్చిదిద్దారు ఆ డ్రస్‌ని. అందుకు తగ్గట్టు జుట్టుని కూడా వేవ్స్‌ మాదిరిగా చక్కగా వదిలేశారు. ఈ లుక్క్‌లో సీతార అంతకు మించి అన్నంతగా అదిరిపోతోంది. అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రాంలో షేర్‌ చేసింది. వివాహశైలికి అద్దం పట్టేలా మింట్‌ గ్రీన్‌ లెహంగాతో ఉన్న ఫోటోలను కూడా షేర్‌ చేసింది. ఇది శాటిన్-సిల్క్ త్రీ-పీస్ సిల్హౌట్‌పై బంగారుపు దారాలతో డిజైన్‌ చేసి ఉంది.

View this post on Instagram

A post shared by sitara (@sitaraghattamaneni)

లెహంగాపై గోల్డ్‌ యాక్సెంట్‌లలో పూల మోటిఫ్‌లతో చక్కగా రూపొందించారు. ఇక ఈ డ్రస్‌కి తగ్గట్టు సితార ట్రాన్సపరేంట్‌ ఎంబ్రాయిడర్‌ నెట్‌ దుప్పటా, పచ్చలతో పొదిగిన బంగారు హారం, కంకణాలు, ఝంకాలు ధరించింది. ఈ లుక్‌లో సితారను చూస్తే పండుగ వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అంతకుముందు ఆరెంజ్‌ లెహంగాను ధరించింది.

View this post on Instagram

A post shared by sitara (@sitaraghattamaneni)

ఆ లెహంగాపై సింపుల్‌ ఎంబ్రాయిడరీ డిజైన్‌, షార్ట్‌ హ్యాండ్స్‌తో కూడిన బ్లౌజ్‌, సీక్వెన్డ్‌ దుప్పటతో మెరిసింది. అందుకు తగ్గట్లు నెక్‌కి ధరించిన నగ ఆమె లుక్‌ని మరింత అందంగా కనిపించేలా చేసింది. ఆ స్టన్నింగ్‌ లుక్‌లో కట్టిపడేస్తున్న సీతార ఫోటోలను చూసేయండి. 

(చదవండి: నీతా అంబానీ ఫిట్‌నెస్‌ రహస్యం ఇదే! ఏకంగా 18 కిలోలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement