black dress
-
హీరోయిన్లా మెరిసిపోతున్న టాప్ సింగర్.. ఎవరో గుర్తుపట్టారా..? (ఫోటోలు)
-
హెయిర్‌ని అటు ఇటు తిప్పేస్తున్న యాంకర్ రష్మి (ఫొటోలు)
-
హీరోయిన్ అదితీ జడ చూశారా? మీరు ఇలా ట్రై చేస్తే! (ఫొటోలు)
-
బ్లాక్ సీతాకోకచిలుకలా 'ఉప్పెన' బ్యూటీ కృతిశెట్టి (ఫొటోలు)
-
Jyotika: బ్లాక్ డ్రెస్‌లో స్టన్నింగ్ లుక్స్‌లో మెరిసిపోతున్న జ్యోతిక (ఫోటోలు)
-
బంగారు కాంతుల మధ్య మెరిసిపోతున్న మెహరీన్ (ఫొటోలు)
-
Kajal Aggarwal: బ్లాక్ డ్రెస్‌లో ‘చందమామ’ మెరుపులు (ఫొటోలు)
-
శ్రీలీల బాత్రూం స్టిల్స్.. గ్లామర్ డోస్ పెంచేసింది! (ఫొటోలు)
-
Shruti Haasan: ఫేవరెట్ కలర్ డ్రెస్‌లో పటాకాలా మెరుస్తున్న హీరోయిన్ (ఫోటోలు)
-
Janhvi Kapoor Photos: షార్ట్ డ్రస్‌లో జాన్వీ కపూర్.. చూస్తే మతి పోతుందంతే! (ఫొటోలు)
-
Malvika Sharma Photos: బ్లాక్ డ్రెస్‌లో మాళమాళవిక శర్మ మెరుపులు (ఫోటోలు)
-
బ్లాక్ చుడిదార్‌లో సితార క్యూట్ లుక్!
టాలీవుడ్ నటుడు మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్‌ల కుమార్తె సీతార పలు యాడ్లలో తండ్రితో కలిసి సందడి చేసింది. ప్రముఖ ఆభరణాల అడ్వర్టైస్మెంట్లో కూడా మోడల్స్ ఎవరూ ఆమె ముందు సరిపోరేమో అన్నంతగా స్టన్నింగ్ లుక్‌తో మిస్మరైజ్ చేసింది. ఈసారి ప్రముఖ బ్రాండెండ్ చుడిదార్‌తో న్యూలుక్‌తో మనముందుకు వచ్చింది. సీతార స్టార్ కిడ్ ఫల్గుణి షేన్ పీకాక్ లగ్జరీ దుస్తులతో తళుక్కుమంది. చెప్పాలంటే ఆమె పేరుకు తగ్గట్టు ఆ బ్లాక్ కలర్ డ్రస్‌లో రాత్రిపూట కనిపించే స్టార్‌లో కాంతిలీనుతోంది. View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) సీక్విన్డ్ బ్లాక్ కుర్తాపై సిల్వర్ గులాబీతో కూడిన అంచులు. దానిపై చక్కగా తీర్చిదిద్ధిన ఎంబ్రాయిడరీ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. సాంప్రదాయ ఆకర్షణను తలపించేలా వెండి ముత్యాల వరుసతో తీర్చిదిద్దారు ఆ డ్రస్‌ని. అందుకు తగ్గట్టు జుట్టుని కూడా వేవ్స్ మాదిరిగా చక్కగా వదిలేశారు. ఈ లుక్క్‌లో సీతార అంతకు మించి అన్నంతగా అదిరిపోతోంది. అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. వివాహశైలికి అద్దం పట్టేలా మింట్ గ్రీన్ లెహంగాతో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసింది. ఇది శాటిన్-సిల్క్ త్రీ-పీస్ సిల్హౌట్‌పై బంగారుపు దారాలతో డిజైన్ చేసి ఉంది. View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) లెహంగాపై గోల్డ్ యాక్సెంట్లలో పూల మోటిఫ్‌లతో చక్కగా రూపొందించారు. ఇక ఈ డ్రస్‌కి తగ్గట్టు సితార ట్రాన్సపరేంట్ ఎంబ్రాయిడర్ నెట్ దుప్పటా, పచ్చలతో పొదిగిన బంగారు హారం, కంకణాలు, ఝంకాలు ధరించింది. ఈ లుక్‌లో సితారను చూస్తే పండుగ వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అంతకుముందు ఆరెంజ్ లెహంగాను ధరించింది. View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) ఆ లెహంగాపై సింపుల్ ఎంబ్రాయిడరీ డిజైన్, షార్ట్ హ్యాండ్స్‌తో కూడిన బ్లౌజ్, సీక్వెన్డ్ దుప్పటతో మెరిసింది. అందుకు తగ్గట్లు నెక్కి ధరించిన నగ ఆమె లుక్‌ని మరింత అందంగా కనిపించేలా చేసింది. ఆ స్టన్నింగ్ లుక్‌లో కట్టిపడేస్తున్న సీతార ఫోటోలను చూసేయండి. (చదవండి: నీతా అంబానీ ఫిట్నెస్ రహస్యం ఇదే! ఏకంగా 18 కిలోలు) -
సునాక్ ఇంటిపై నల్లవస్త్రం
లండన్: బ్రిటన్ ప్రధాని ఇంటిపై నల్లటి వ్రస్తాన్ని కప్పిన నలుగురు పర్యావరణ కార్యకర్తలను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఉత్తర ఇంగ్లాండ్‌లో నార్త్ యార్క్‌షైర్ ప్రాంతంలోని రిచ్మండ్లో ఉన్న రిషి సునాక్ ఇంటిపై వారు నల్లటి వస్త్రం కప్పి తమ నిరసనను తెలియజేశారు. వీరు ‘గ్రీన్‌పీస్’ అనే పర్యావరణ పరిరక్షణ సంస్థలో సభ్యులుగా ఉన్నారు. సముద్రంలో చమురు, గ్యాస్ వెలికితీతను మరింత విస్తరిస్తూ సునాక్ ఇటీవల తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఇలా నిరసన వ్యక్తం చేశారు. సునాక్ ఇంటిపైకి ఎక్కి 200 చదరపు మీటర్ల నల్ల వస్త్రాన్ని కప్పారు. అలాగే సునాక్ ఇంటి ముందు మరో ఇద్దరు కార్యకర్తలు ‘చమురు లాభాలు ముఖ్యమా? లేక మా భవిష్యత్తు ముఖ్యమా?’ అని ప్రశ్నిస్తూ బ్యానర్‌ను ప్రదర్శించారు. ఈ సమయంలో సునాక్ కుటుంబసభ్యులెవరూ ఆ ఇంట్లో లేరు. -
‘ప్రధాని మోదీ రావాలి.. మాట్లాడాలి’
సాక్షి, న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్లో ప్రతిపక్షాల నిరసనల హోరు కొనసాగుతూనే ఉంది. విపక్ష ఎంపీలు తమ డిమాండ్‌పై ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మణిపూర్ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు వచ్చి.. సమాధానం ఇవ్వాల్సిందేనని వారు తెగేసి చెప్పారు. ప్రధానమంత్రి మొండి వైఖరిని నిరసిస్తూ నల్లరంగు దుస్తులు ధరించి పార్లమెంట్‌కు హాజరయ్యారు. విపక్షాల నినాదాలు, ఆందోళనలతో ఉభయ సభల్లో గురువారం సైతం వాయిదాల పర్వం కొనసాగింది. ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. మణిపూర్ అంశంపై వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. మోదీ మౌనాన్ని వీడాలని, మణిపూర్ హింసపై నోరు విప్పాలని బిగ్గరగా నినాదాలు చేశారు. దీంతో అధికార బీజేపీ సభ్యులు ఎదురుదాడికి దిగారు. ‘మోదీ, మోదీ’ అంటూ నినాదాలు ప్రారంభించారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత ప్రతిపక్ష సభ్యుల నినాదాల హోరు మధ్యే కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ఖనిజ చట్ట సవరణ బిల్లును, కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ జన్‌విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా పడింది. సభ పునఃప్రారంభమైన తర్వాత జన్‌విశ్వాస్ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. 76 కాలం చెల్లిన చట్టాల రద్దుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలియజేసింది. అనంతరం లోక్‌సభను శుక్రవారానికి వాయిదా వేశారు. ఆ భేటీని బహిష్కరించిన ఎంపీలు రాజ్యసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశాన్ని ప్రతిపక్ష ఎంపీలు బహిష్కరించారు. మణిపూర్ అంశంపై ప్రధాని వైఖరికి నిరసనగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు చెప్పారు. రాజ్యసభ బీఏసీలో మొత్తం 11 మంది సభ్యులు ఉన్నారు. ఈ కమిటీ సమావేశాన్ని జైరాం రమేశ్(కాంగ్రెస్), మీసా భారతి(ఆర్జేడీ), డెరెక్ ఓబ్రెయిన్(టీఎంసీ) బహిష్కరించారు. భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) సభ్యుడు కేశవరావు గైర్హాజరయ్యారు. దేశాన్ని విభజిస్తున్నారు: రాహుల్ దేశాన్ని విభజించాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలసికట్టుగా కుట్రపన్నుతున్నాయని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘ప్రజల దుఃఖం బాధ వారికి పట్టడం లేదు. అధికారం తప్ప వారికి మరి దేనిపైనా ఆసక్తి లేదు’ అని అన్నారు. యువజన కాంగ్రెస్ గురువారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆన్లైన్లో పాల్గొని ప్రసంగించారు. ‘బీజేపీ–ఆర్ఎస్ఎస్కి కావాల్సింది అధికారమే. దాని కోసం ఏమైనా చేస్తారు. అధికారం కోసం వారు మణిపూర్‌ను రావణకాష్టంలా మారుస్తారు. యావత్ దేశాన్ని నిప్పుల కుంపటి చేస్తారు. దేశ ప్రజల బాధ, శోకం వారికి పట్టదు’ అని తీవ్ర స్థాయిలో «ధ్వజమెత్తారు. ‘మీరు ఒక వైపు కూర్చొని ప్రేమను పంచుతూ ఉంటారు. దేశానికి, దేశ ప్రజలకి గాయమైతే మీకూ ఆ నొప్పి తెలుస్తుంది. కానీ వాళ్లకి అలాంటి భావాలే లేవు. ఆర్ఎస్ఎస్, బీజేపీకి ప్రజల బాధ ఏంటో తెలీదు. వాళ్లు దేశాన్ని విభజించే పనిలో బిజీ’ అని అన్నారు. రాజ్యసభ నుంచి విపక్షాల వాకౌట్ రాజ్యసభలోనూ విపక్ష ఎంపీల ఆందోళన కొనసాగింది. మణిపూర్‌లో మంటలు చెలరేగుతున్నా ప్రధాని ఎందుకు మాట్లాడడం లేదని విపక్ష ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నినాదాలతో సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత ప్రతిపక్ష నేత ఖర్గే మాట్లాడేందుకు ప్రయ తి్నస్తుండగా, అధికారపక్ష ఎంపీలు అడ్డుకోవడంతో సభలో గందరగోళం నెలకొంది. వెంటనే సభ మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా పడింది. పునఃప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన మధ్యే కేంద్ర మంత్రి ఠాకూర్ సినిమాటోగ్రఫీ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. రాజ్యసభలో విపక్షాల తీరును ఆయన తప్పుపపట్టారు. దాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. ఒక సమయంలో ప్రతిపక్ష సభ్యులు ‘ఇండియా, ఇండియా’ అంటూ నినాదాలు చేయగా, బీజేపీ సభ్యులు ‘మోదీ, మోదీ’ అంటూ నినదించారు. సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు మూజువాణి ఓటుతో సభలో ఆమోదం పొందింది. -
బ్లాక్ డ్రెస్‌లో సొగసులు ఒలకబోస్తున్న జాన్వీ కపూర్(ఫోటోలు)
-
ఆస్కార్ వేదికపై నల్ల గౌనులో మెరిసిన దీపిక.. ట్విస్ట్ ఏంటంటే..?
వాషింగ్టన్: బాలీవుడ్ స్టార్ దిపికా పదుకొణె ఆస్కార్ వేదికపై సందడి చేశారు. 95వ అకాడెమీ అవార్డుల ప్రధానోత్సవానికి తొలిసారి ప్రెజెంటర్‌గా వెళ్లిన ఆమె రెడ్‌కార్పెట్‌పై నల్ల గౌనులో మెరిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా.. సామాజిక మాధ్యమాల్లో అవి వైరల్‌గా మారాయి. నల్ల రంగు గౌను, వెల్వెట్ గ్లౌస్, డైమండ్ నెక్లెస్‌తో హాలీవుడ్ గ్లామర్ భామలను తలదన్నేలా దీపిక తన అందంతో అందరినీ ఆకట్టుకుంది. అయితే దిపికా పదుకొణెకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉన్నా.. హాలీవుడ్ మీడియా సంస్థ ఏఎఫ్‌పీతో పాటు గెట్టీ, వోగ్ మెగజీన్ను ఆమెను గుర్తుపట్టలేకపోయాయి. దిపికాను బ్రెజిల్ మోడల్, డిజైనర్ క్యామిలా అనుకొని పొరపడ్డాయి. దీపికా గతంలో కేన్స్ జ్యూరీ, ఫిఫా వరల్డ్ కప్ వేడుకల్లో కూడా సందడి చేశారు. అయినా ఆమెకు, క్యామిలాకు మధ్య వ్యత్యాసాన్ని హాలీవుడ్ సంస్థలు పసిగట్టలేకపోయాయి. View this post on Instagram A post shared by Deepika Padukone (@deepikapadukone) View this post on Instagram A post shared by Camila Alves McConaughey (@camilamcconaughey) -
అనన్య నాగళ్ల సోయగాలు (ఫోటోలు)
-
కుర్రకారును ఉర్రూతలూగిస్తోన్న పూజాహెగ్డే (ఫొటోలు)
-
కాంగ్రెస్ నిరసనలకు రామ మందిరానికి లింక్: అమిత్ షా
న్యూఢిల్లీ: దేశంలో ధరల పెరుగుదల, ఈడీ దాడులను నిరసిస్తున్నట్లు చెప్తూ.. శుక్రవారం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో చేపట్టిన నిరసనల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు నేతలు, కార్యకర్తలు నల్ల దుస్తులు ధరించి పాల్గొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నిరసనలను తిప్పికొట్టారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణ శంకుస్థాపనకు వ్యతిరేకంగానే నల్ల దుస్తులు ధరించారని ఆరోపించారు. ‘కోర్టులో కేసులు నమోదయ్యాయి. అయితే, ప్రతిరోజు ఎందుకు నిరసనలు చేస్తున్నారు? కాంగ్రెస్‌కు రహస్య ఎజెండా ఉందని నా భావన. వారు వారి బుజ్జగించు రాయకీయాలను మరో రూపంలో అమలు చేస్తున్నారు. ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎవరికీ సమన్లు జారీ చేయలేదు, ఎవరినీ ప్రశ్నించలేదు. ఎలాంటి రైడ్లు జరగలేదు. అయినప్పటికీ ఆకస్మికంగా ఈరోజు కాంగ్రెస్ నిరసనలకు దిగింది. ఈరోజే ఎందుకు నిరసనలు చేపట్టారనేది అర్థం కావట్లేదు. 550 ఏళ్ల సమస్యకు సామర్యంగా పరిష్కారం చూపి.. సరిగ్గా ఇదే రోజున అయోధ్య రామమందిర నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అందుకే కాంగ్రెస్ నిరసనలు చేపట్టినట్లు తెలుస్తోంది. ’ అని పేర్కొన్నారు అమిత్ షా. ఈరోజు నల్ల దుస్తులు ధరించి నిరసనలు చేపట్టటం ద్వారా తాము రామ మందిర నిర్మాణ శంకుస్థాపనకు వ్యతిరేకమని కాంగ్రెస్ చెబుతోందన్నారు హోంమంత్రి అమిత్ షా. బుజ్జగింపు పాలసీని ఈ విధంగా ముందుకు తీసుకెళ్తోందని ఆరోపించారు. ప్రస్తుత రోజుల్లో దేశంలో హింసాత్మక ఘటనలు, అల్లర్లు జరిగినట్లు కనిపిస్తోందా? అని ప్రశ్నించారు షా. ఇదీ చదవండి: హస్తినలో తీవ్ర ఉద్రిక్తతలు.. పోలీసుల అదుపులో ప్రియాంక, రాహుల్ -
బ్లాక్ డ్రెస్‌లో చందమామ స్టన్నింగ్ లుక్స్
-
అందం.. అదితిరావు హైదరి సొంతం
టాలీవుడ్ టు బాలీవుడ్ .. అందంతోనూ, నటనతోనూ మెప్పిస్తున్న నటి అదితిరావు హైదరి. ఇటీవల టాప్ టు బాటమ్ బ్లాక్ ఔట్ఫిట్లో అభిమానుల మైండ్ బ్లాంక్ చేసేసింది. చెట్ల కలప నుంచి తీసిన గుజ్జుతో తయారైన టెన్సిల్ ఫ్యాబ్రిక్‌తో చూపులను చుట్టేసింది. ఈ డ్రెస్‌లో అద్భుతం అనిపించిన హైదరి ఆభరణాల జోలికి వెళ్లలేదు. వేళ్లకు రెండు బంగారు ఉంగరాలు, నలుపు రంగు హీల్స్ మాత్రమే ధరించింది. సహజసిద్దమైన స్కిన్ టోన్ మేకప్, దట్టమైన కనుబొమ్మల తీరు, వదిలేసిన హెయిర్ స్టైల్‌తో మెరిపించింది. ఈ ఫోటోపై బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ స్పందించాడు. స్టన్నింగ్ అంటూ కామెంట్ చేశాడు. View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
లిటిల్ బ్లాక్ డ్రెస్!
పాశ్చాత్య దేశాలలోని సంపన్న మహిళల బట్టల బీరువాల్లో ఎల్బీడీ (లిటిల్ బ్లాక్ డ్రెస్) తప్పనిసరిగా ఉంటుంది. యువతుల ఫేవరెట్ డ్రెస్ అది. వాళ్లంతా ఎక్కువగా సాయంకాలపు వేడుకలకు దీనిని ధరించి వెళుతుంటారు. ఎక్కడైనా డ్యాన్స్ చేయాల్సి వస్తే అక్కడికి కూడా. ఎల్బీడీకి ప్రత్యేకంగా గుర్తింపు ఉంది. ప్రత్యేకంగా పేరే లేదు. లిటిల్ బ్లాక్ డ్రెస్. అంతే. ఈ డ్రెస్ సృష్టికర్త హ్యూబర్ట్ జివించీ తన 91వ ఏట.. మొన్న శనివారం రోజు కన్నుమూశారు. ఆయన అలా కన్నుమూయగానే ఎల్బీడీ చరిత్ర ప్రముఖంగా వార్తల్లోకి, వర్తమానంలోకి వచ్చింది. 1920లలోనే ఎల్బీడీకి ఒక రూపం ఉన్నప్పటికీ, హాలీవుడ్ చిత్రం ‘బ్రేక్‌ఫాస్ట్ ఎట్ టిఫనీస్’ హీరోయిన్ ఆడ్రీ హెప్బర్న్ కోసం హ్యూబర్ట్ డిజైన్ చేసిన ఎల్బీడీతో ఫ్యాషన్ రంగానికి ఒక కొత్త ఊపు వచ్చింది. ఆర్డర్లు పెరిగాయి. మార్కెట్ పెరిగింది. తనకే పేరూ లేకుండానే డిజైనర్‌కు పేరు తెచ్చిపెట్టిన డ్రెస్.. ప్రపంచ ఫ్యాషన్ చరిత్రలో బహుశా ఇదొక్కటే కావచ్చు. హ్యూబర్ట్ జివించీ -
దేవుడా.. అసలేం జరిగింది: రెజీనా
తెలుగులో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న రెజీనా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. అది కూడా అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, అర్జున్ రాంపాల్, అర్షద్ వార్సీలాంటి టాప్ స్టార్స్ నటిస్తున్న సినిమాలో ఆమెకు అవకాశం రావడం విశేషం. ఆంఖే సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఆంఖే-2 లో రెజీనా మెరవబోతుంది. ఈ అవకాశం తాను ప్రయత్నించింది కాదని, ఇతర సినిమాల్లో తన నటన చూసి స్వయంగా ఆంఖే-2 టీం తనను అప్రోచ్ అయ్యారంటూ రెజీనా సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. షూటింగ్ కు ఇంకా సమయం ఉంది కాబట్టి.. ఈలోపు హిందీలో పట్టు సాధించి సొంత డబ్బింగ్ చెప్పుకుంటానని అంటోంది. కాగా ఆ వేడుకకు రెజీనా వేసుకొచ్చిన బ్లాక్ డ్రెస్ ఆమెకు తలనొప్పులు తీసుకొచ్చి పెట్టింది. నలుపు రంగు డిజైనర్ దుస్తుల్లో రెజీనా మెరిసినా, ఆ డ్రెస్ ఆమెను ఇబ్బందుల్లో పడేసింది. ఆమె స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఆ దుస్తులు మరింత కురచగా అయిపోయి అతిధులను సైతం ఇబ్బంది పెట్టాయి. చుట్టూ ఉన్న కెమెరాలు వరుసపెట్టి క్లిక్ మనిపించాయి. విషయం గమనించినా ఆమె తన డ్యాన్స్‌ను కొనసాగించింది. ఇక అప్పటినుంచి ఆమె డ్రెస్ పై సోషల్ మీడియాలో కామెంట్లు చెలరేగిపోయాయి. చివరకు ఈ విషయంపై రెజీనా స్పందించింది. స్టేజ్ దిగిన వెంటనే 'దేవుడా.. అసలేం జరిగింది' అని ఆందోళనకు గురైందట. తన బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన కార్యక్రమంలో ఇలా జరగడం బాధాకరమంటూ వాపోయింది. అయితే అక్కడున్న టీం అంతా తనకు ఎంతో సహకరించారని, ఇలాంటి పొరపాట్లు జరగడం సాధారణమేనని తనకు ధైర్యం చెప్పారని తెలిపింది. ఇక జరిగింది వదిలేసి ముందుకెళ్లాలని తనకు తాను చెప్పుకున్నానని తెలిపింది రెజీనా. -
విపక్ష సభ్యుల ఆందోళనతో రెండోసారి సభ వాయిదా
హైదరాబాద్: ఎమ్మెల్యే రోజాను సభలోకి అనుమతించకపోవడంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శనివారం మరోసారి వాయిదా పడింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. ఎమ్మెల్యే రోజాను సభలోకి అనుమతించాలంటూ మండిపడ్డారు. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన తర్వాత ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో అసెంబ్లీ దద్దరిల్లింది. దీంతో స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు అసెంబ్లీని 10 నిమిషాలు వాయిదా వేశారు. అంతకుముందు ఎమ్మెల్యే రోజాను సభలోకి అనుమతించాలంటూ నల్లదుస్తులు ధరించిన ఎమ్మెల్యేలు నినాదాలు కొనసాగించడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. అయినా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో పెద్ద ఎత్తున 'వుయ్ వాంట్ జస్టిస్' అంటూ నినదిస్తూనే ఉన్నారు. -
విపక్ష సభ్యుల ఆందోళనతో ఏపీ అసెంబ్లీ వాయిదా
హైదరాబాద్: ఎమ్మెల్యే రోజాను సభలోకి అనుమతించకపోవడంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దద్దరిల్లింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. ఎమ్మెల్యే రోజాను సభలోకి అనుమతించాలంటూ మండిపడ్డారు. ఒకవైపు ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతూనే ఉన్నా... నల్లదుస్తులు ధరించిన ఎమ్మెల్యేలు నినాదాలు కొనసాగించడంతో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను వాయిదా వేశారు. అంతకుముందు అధికార పక్ష సభ్యులే ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించారు. అధికారపక్ష సభ్యులతో పాటు బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు కూడా ఏకపక్షంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తప్పుపడుతూ వ్యాఖ్యానాలు చేశారు. అయినా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో పెద్ద ఎత్తున 'వుయ్ వాంట్ జస్టిస్' అంటూ నినదిస్తూనే ఉన్నారు.