![Deepika Padukone Black Gown At Oscars 2023 Ceremony - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/13/Deepika-Padukone.jpg.webp?itok=hHlWHINQ)
వాషింగ్టన్: బాలీవుడ్ స్టార్ దిపికా పదుకొణె ఆస్కార్ వేదికపై సందడి చేశారు. 95వ అకాడెమీ అవార్డుల ప్రధానోత్సవానికి తొలిసారి ప్రెజెంటర్‌గా వెళ్లిన ఆమె రెడ్‌కార్పెట్‌పై నల్ల గౌనులో మెరిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా.. సామాజిక మాధ్యమాల్లో అవి వైరల్‌గా మారాయి. నల్ల రంగు గౌను, వెల్వెట్ గ్లౌస్, డైమండ్ నెక్లెస్‌తో హాలీవుడ్ గ్లామర్ భామలను తలదన్నేలా దీపిక తన అందంతో అందరినీ ఆకట్టుకుంది.
అయితే దిపికా పదుకొణెకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉన్నా.. హాలీవుడ్ మీడియా సంస్థ ఏఎఫ్‌పీతో పాటు గెట్టీ, వోగ్ మెగజీన్‌ను ఆమెను గుర్తుపట్టలేకపోయాయి. దిపికాను బ్రెజిల్ మోడల్, డిజైనర్ క్యామిలా అనుకొని పొరపడ్డాయి. దీపికా గతంలో కేన్స్ జ్యూరీ, ఫిఫా వరల్డ్ కప్ వేడుకల్లో కూడా సందడి చేశారు. అయినా ఆమెకు, క్యామిలాకు మధ్య వ్యత్యాసాన్ని హాలీవుడ్ సంస్థలు పసిగట్టలేకపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment