పర్ఫెక్ట్ పోజుతో ప్రియాంక హల్ చల్
లాస్ ఏంజిల్స్: ఆస్కార్ వేదికపై బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా అదరగొట్టింది. వైట్ షౌల్డర్ గౌనులో స్టన్నింగ్ లుక్ తో దర్శనమిచ్చిన ప్రియాంక 88వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో బాలీవుడ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. గోల్డెన్ బ్రౌన్ స్మోకీ ఐస్, స్ట్రాప్ లెస్ వైటు గౌనుతో రెడ్ కార్పెట్ మీద పర్ఫెక్ట్ పోజు అంటే ఇలా ఉండాలి అన్నట్టు ఈ మాజీ మిస్ వరల్డ్ కనిపించింది.
ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న ఈ అమ్మడు ఈ సందర్భంగా అక్కడే ఉన్న యాకంర్ తో సరదాగా ముచ్చటించింది. బాలీవుడ్ కు , హాలీవుడ్ కు పెద్దగా తేడా లేదని, రెండూ కూడా అత్యద్భుతంగా దూసుకుపోతున్నాయని పేర్కొంది. మరి రెడ్ కార్పెట్ మీద పర్ఫెక్ట్ పోజు ఎలా ఉండాలని అడిగితే.. ఈ 'క్వాటింకో' బ్యూటీ 'ఎస్' (S) ఆకృతిలో సోయగంగా ఒదిగిపోయి.. ఇదిగో ఇలా ఉంటూ చూపించింది.
ఇప్పటికే ఏబీసీ టీవీ థ్రిల్లర్ షో 'క్వాంటికో'లో నటించడం ద్వారా ప్రియాంక చోప్రా హాలీవుడ్ ప్రేక్షకులకు చేరువయ్యింది. త్వరలో 'బే వాచ్' సినిమాలో నటించడం ద్వారా హాలీవుడ్ చిత్రసీమకు పరిచయం కాబోతున్నది. 'పీపుల్స్ చాయిస్ అవార్డు' అందుకున్న తొలి బాలీవుడ్ పర్సన్ అయిన ప్రియాంక హాలీవుడ్ సినీ దిగ్గజాలతో కలిసి ఆస్కార్ వేదికపై విజేతలకు అవార్డులు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్నది.