red carpet
-
మాజీ సైనికులకు కార్పొరేట్ ‘సెల్యూట్’!
రక్షణ దళాల్లో పనిచేసి రిటైర్ అయిన మాజీ సైనికోద్యోగులకు కార్పొరేట్ కంపెనీలు రారమ్మంటూ రెడ్ కార్పెట్ వేస్తున్నాయి. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా అలవోకగా పని చేసే శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, ప్రాజెక్టుల అమలులో కచ్చితత్వం వంటి ప్రత్యేక నైపుణ్యాలను ఉపయోగించుకోవడంపై ఫోకస్ చేస్తున్నా యి. కొన్ని విభాగాల్లో నిపుణుల కొరతను అధిగమిస్తున్నాయి. దేశంలో మాజీ సైనికుల వెంట పడుతున్న టాప్ కంపెనీలు, బడా కార్పొరేట్ సంస్థల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అతిపెద్ద కార్పొరేట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో ఏకంగా 2,000 మంది మాజీ సైనికోద్యోగులను నియమించుకుంది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య మూడో వంతు ఎక్కువ. దీంతో ఈ కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో రక్షణ దళాల మాజీ సిబ్బంది 7,500 మందికి ఎగబాకారు. ఇంత భారీ సంఖ్యలో ఎక్స్–సర్వీస్‌మెన్ ఉన్న కంపెనీగా కూడా రిలయన్స్ రికార్డు సృష్టించింది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం టాటా గ్రూప్ కంపెనీలు, మారుతీ తో పాటు అదానీ గ్రూప్, ఆర్పీజీ గ్రూప్, వేదాంత, సొడెక్సో, ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ వంటి సంస్థలు సైతం మాజీ సైనిక సిబ్బందిని నియమించుకుంటున్న జాబితాలో టాప్‌లో ఉన్నాయి. ఏటా 60,000 మంది పదవీ విరమణ... త్రివిధ దళాల్లో (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్) ఏటా పదవీ విరమణ చేస్తున్న రక్షణ సిబ్బంది సంఖ్య దాదాపు 55,000–60,000 వరకు ఉంటుందని అంచనా. వీరిలో ఆఫీసర్ ర్యాంకుల్లో ఉన్నవారు 1,200–1,300 (సుమారు 2%) మంది వరకు ఉంటారు. అంతేకాకుండా, 50 ఏళ్లు పైబడిన చాలా మంది అధికారులు స్వచ్ఛందంగా రిటైర్ అయ్యేందుకు మొగ్గు చూపుతుండటం విశేషం. ఇలా వైదొలగుతున్న వారిలో ఎక్కువగా రిలయన్స్, అదానీ, ఎల్అండ్ టీ, టాటా గ్రూప్ వంటి బడా కార్పొరేట్ కంపెనీల్లో హెచ్ఆర్, అడ్మిన్, సరఫరా వ్యవస్థలు ఇతరత్రా విధుల్లో చేరుతున్నారని త్రివిధ దళాల మాజీ సైనికుల సంక్షేమ సంఘం చీఫ్ మెంటార్, పూర్వ అధ్యక్షుడు కమోడోర్ సుదీర్ పరకాల చెబుతున్నారు. సరుకు రవాణా (లాజిస్టిక్స్), ఈ–కామర్స్, వేర్–హౌసింగ్ పరిశ్రమతో పాటు ఆటోమొబైల్, తయారీ, విద్యుదుత్పత్తి, టెలికం వంటి రంగాల్లో ఎక్స్–సరీ్వస్మెన్కు దండిగా అవకాశాలు లభిస్తున్నాయి. ఇంజనీరింగ్, మెషీన్ విభాగాలు, అడ్మినిస్ట్రేషన్ విధుల్లో ఎక్కువగా నియమించుకుంటున్నాయి. ప్రత్యేక సామర్థ్యాలు ప్లస్... మాజీ సైనికోద్యోగులకు అత్యుత్తమ ఫిట్‌నెస్‌కు తోడు క్రమశిక్షణ వంటి ప్రత్యేకతల కారణంగా సంస్థకు అదనపు బలం చేకూరుతోందని రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టులను పక్కాగా అమలు చేసే సామర్థ్యం, సంక్లిష్ల పరిస్థితులను అధిగమించే నైపుణ్యాలు, ప్రతికూల ప్రదేశాలను తట్టుకుని పని చేసే ధైర్య సాహసాలు... కంపెనీలు ఏరికోరి మరీ వారిని నియమించుకునేలా చేస్తున్నాయన్నారు. దీనివల్ల వైవిద్యంతో పాటు కొన్ని విభాగాల్లో నిపుణుల కొరత కూడా తీరుతుందనేది హైరింగ్ నిపుణుల మాట. ‘రక్షణ దళాల్లో ఏళ్ల తరబడి పనిచేసేటప్పుడు అలవడిన క్రమశిక్షణ, వారికి ఇచ్చే కఠోర శిక్షణ కారణంగా మాజీ సైనిక సిబ్బందికి ప్రత్యేక సామర్థ్యాలు అలవడతాయి. ముఖ్యంగా సమస్యల పరిష్కార తీరు, టీమ్ వర్క్, మల్టీ టాస్కింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వంటి విషయాల్లో వారు ఆరితేరి ఉంటారు. అందుకే టాటా, ఆదిత్య బిర్లా, రిలయన్స్, ఎల్అండ్టీ, వేదాంత గ్రూప్ వంటి బడా కార్పొరేట్లు మాజీ సైనికుల హైరింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి’ అని సియెల్ హెచ్ఆర్ అంటోంది.ఓఎన్జీసీ: కంపెనీ నిబంధనల మేరకు మాజీ సైనికోద్యోగులకు ఎగ్జిక్యూటివ్ స్థాయి నియామకాల్లో 5 ఏళ్ల వయో సడలింపును ప్రకటించింది. రిలయన్స్: గత ఆర్థిక సంవత్సరంలో 2,000 మంది మాజీ సైనికులను నియమించుకుంది. ఈ సంఖ్య 7,500కు చేరింది.వేదాంత: రక్షణ దళాల మాజీ సిబ్బంది నియామకం కోసం 2023–24లో ప్రత్యేక పాలసీ చర్యలు చేపట్టింది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
కాన్స్‌లో ఆ ముగ్గురు
కాన్స్ ఫెస్టివల్లో సినిమాలకు ఎంట్రీ దొరికినా సెలబ్రిటీలకు ఆహ్వానం దొరికినా చాలా ఘనత. ఈసారి కాన్స్‌లో చాలా ఏళ్ల తర్వాత ఒక భారతీయ సినిమా ప్రదర్శితం కానుంది. అదలా ఉంటే మన దేశానికి చెందిన ముగ్గురు యువ ఇన్ఫ్లుయెన్సర్లను కాన్స్ ఆహ్వానించింది. మే 14–25 మధ్య జరగనున్న ఈ ఫెస్టివల్లో ఆర్జె కరిష్మా, ఆస్థా షా,నిహారికా ఎన్.ఎమ్ రెడ్ కార్పెట్ మీద దర్జాగా నడవనున్నారు.వారి పరిచయాలు.ప్రపంచ సినిమా ప్రతిష్ఠాత్మకంగా భావించే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నేటి నుంచి (మే 14) నుంచి ఫ్రాన్స్‌లోని కాన్స్ నగరంలో ్ర΄ారంభం కానుంది. ఆస్కార్ అవార్డ్స్‌తో సమానంగా కాన్స్ అవార్డులను భావిస్తారు. ఈసారి భారతదేశం నుంచి ΄ాయల్ క΄ాడియా దర్శకత్వం వహించిన ‘ఆల్ వియ్ ఇమాజిన్ యాజ్ లైట్’ సినిమా మెయిన్ కాంపిటీషన్లో ఎంట్రీ సాధించింది. సినిమాకు, సంస్కృతికి ్ర΄ాధాన్యం ఇచ్చే ఈ ఫెస్టివల్లో భారతదేశం నుంచి కొంతమంది యువ ఇన్ఫ్లుయెన్సర్లకు ఆహ్వానం అందింది. అతిరథ మహారథులతో కలిసి రెడ్ కార్పెట్ మీద నడిచే అవకాశం వీరు ΄÷ందారు. స్ఫూర్తినిచ్చే తమ జీవితాల ద్వారా, ప్రతిభ, విజయం ద్వారా వీరు అవకాశం ΄÷ందారు. అలాంటి ముగ్గురి పరిచయం.ఆస్థా షాసోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా తన జీవిత ΄ోరాటంతో ప్రభావం చూపుతున్న ఆస్థా షాది ఢిల్లీ. 24 ఏళ్ల ఆస్థా 8 ఏళ్ల వయసు నుంచి విటిలిగో (తెల్లమచ్చలు) బారిన పడింది. పూర్తిగా నివారణ లేని ఈ చర్మవ్యాధి ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ప్రతి ఒక్కరూ ‘ఈ అమ్మాయికి పెళ్లవుతుందా’ అని తల్లిదండ్రులను వేధించేవారు. అన్ని రకాల వైద్య విధానాలతో విసిగి΄ోయిన ఆస్థా నేను ఎలా ఉన్నా నా జీవితం ముఖ్యం అనుకుని చదువు మీద దృష్టి పెట్టింది. మంచి ప్రతిభ చూపి ఇప్పుడు హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంక్‌లో ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా పని చేస్తోంది. ఇన్‌స్టా, ట్విటర్ ద్వారా ΄ాపులర్ అయ్యి డబ్బు సం΄ాదిస్తోంది. ‘ఆడపిల్లలకు విటిలిగో ఉంటే ఆ అమ్మాయిలను తల్లిదండ్రులే ఇంటి నుంచి బయటకు రానీకుండా చూస్తారు. ఆమెను న్యూనతకు గురి చేస్తారు. విటిలిగో కేవలం ఒక చర్మస్థితి. ఇప్పుడు నేను పూర్తి విటిలిగోతో తెల్లగా అయి΄ోయాను. కాని నా జీవితాన్ని సమర్థంగా జీవిస్తున్నాను. మీరు ఎలా ఉన్నారో అలా కనపడుతూ ముందుకు సాగి΄ోండి’ అని చెప్పి లక్షలాది మంది అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం పెంచుతోంది ఆస్థా. అందుకే ఆమెకు ఆహ్వానం.ఆర్జె కరిష్మాసోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా నెలకు 30 లక్షలు సం΄ాదిస్తున్న కరిష్మా బహురూ΄ాలు వేసి కామెడీ చేయడంలో నేర్పరి. చిన్నప్పుడు ఒకరోజు కరిష్మా గదిలో నుంచి రకరకాల గొంతులు వినిపిస్తుంటే తల్లి కంగారు పడి తలుపు తట్టి ‘కరిష్మా నీతో ఎవరున్నారు’ అని అడిగితే తలుపు తెరిచిన కరిష్మా అవన్నీ తాను మిమిక్రీ చేస్తున్న గొంతులని చెప్పింది. జమ్ము కశ్మీర్‌కు చెందిన కరిష్మా నటి కావాలనుకుని ఆర్.జె. అయ్యి ఆ తర్వాత కామెడీ బిట్స్ చేసే యూట్యూబర్‌గా ఖ్యాతి ΄÷ందింది. ఇండోర్‌లో రెడ్ ఎఫ్.ఎం. లో పని చేసేటప్పుడు ఆమె షో సూపర్‌హిట్ అయ్యింది. మానవ ప్రవర్తనల్లోని భిన్నత్వాన్ని ఆమె చూపే విధానం వల్ల చాలా సీరియస్ విషయాలను కూడా తేలిగ్గా తీసుకుని ముందుకు సాగవచ్చనే ధిలాసా ఇస్తుంది. అందుకే ఆమెకు ఈ ఆహ్వానం.నిహారికా ఎన్.ఎమ్.బెంగళూరులో పుట్టి పెరిగి ఇప్పుడు లాస్ ఏంజెలిస్‌లో ఉంటున్న నిహారికకు తెలుగు బాగా వచ్చు. బహుశా తెలుగు మూలాలు ఉండొచ్చు. యూట్యూబ్‌లో, ఇన్‌స్టాలో నిహారిక చేసే వీడియోలకి లక్షల మంది ఫాలోయెర్స్ ఉన్నారు. నిహారికతో షో చేస్తే ప్రచారం లభిస్తుందని భావించే పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉన్నారు. 27 ఏళ్ల ఈ ఇన్ఫ్లుయెన్సర్ లోపలొకటి బయటొకటిగా ఉండే మనుషులను గేలి చేస్తూ బోలెడన్ని వీడియోలు చేసి నవ్విస్తుంటుంది. ‘మార్కులు వస్తేనే జీవితం. గొప్ప మార్కులు వచ్చినవారే గొప్ప జీవితాన్ని గడపగలరు అనే భావన నుంచి తల్లిదండ్రులు బయటపడాలి. పిల్లల తెలివితేటలు, ఆసక్తిని బట్టి వారిని ్ర΄ోత్సహిస్తే వారు సక్సెస్ అవుతారు. నేను డాక్టరో ఇంజనీరో కావాలని మా అమ్మా నాన్నలు అనుకున్నారు. కాని లక్షలాది మంది అభిమానించే యూ ట్యూబర్ని అయ్యాను. కలలు కని ముందుకు సాగండి’ అనే సందేశం ఇస్తుంటుంది నిహారిక. ఆమె ఇప్పుడు రెడ్ కార్పెట్ మీద హంగామా చేయనుంది. -
తడబడినా భలే గమ్మత్తుగా కవర్ చేసింది ఈ ముద్దుగుమ్మ!
ప్రముఖ ఇంటర్నెట్ సెన్సెషన్ యూట్యూబర్, హాలీవుడ్ నటి లిజా కోశి ఆస్కార్ అవార్డు షో కార్యక్రమానికి హాజరయ్యింది. ఆ కార్యక్రమంలో రెడ్ కార్పెట్‌పై నడుస్తూ సడెన్‌గా తడబడి పడిపోయింది. అయితే ఆమె మాత్రం ఆ ఘటనను కవర్ చేస్తూ ఫోటోలకు అందంగా ఫోజులిచ్చింది. ఆమె అందరిముందు పడిపోవడాన్ని అవమానంగా భావించకుండా చాలా సమయస్ఫూర్తిగా కవర్ చేసుకుంది. అక్కడున్న వాళ్లంతా ఆమె పడిపోయిందని సహాయం చేసేందుకు ముందుకొచ్చిన వాళ్లనే షాక్‌కి గురి చేసింది. వాళ్లు కూడా కాస్త గందరగోళానికి లోనయ్యారనే చెప్పొచ్చు. ఎందుకుంటే? పడిపోయి దాన్నే స్టైయిలిష్‌గా ఫోటోలకు ఫోజులు ఇస్తున్నట్లు పెట్టడంతో..వాళ్లు పడిపోలేదా? పొరపడ్డామా? అన్నట్టు సందేహంగా చూడటం వాళ్ల వంతయ్యింది. కోశి ఈ వేడుకల్లో ఎరుపు రంగు ఫుల్ లెంగ్త్ గౌనుతో తళుక్కుమంది. అనుకోని ప్రమాదం జరిగినా ముఖంపై ప్రశాంతతను చెదరనివ్వకుండా చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజిలిచ్చింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు మాత్రం ఎంతైన నటి కథ ఆ మాత్రం కవర్ చేయాల్సిందే అంటూ సెటైరికల్ కామెంట్లతో పోస్టులు పెట్టారు. Liza Koshy stuns in red dress at The Oscars 2024 #Oscars #Oscars2024 pic.twitter.com/Y1Xlnowt8A — joe (@vetoedjoe) March 10, 2024 (చదవండి: ఆ ఆటో డ్రైవర్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్‌కి యూకే టూరిస్ట్ ఫిదా!) -
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో నగరవాసి
బంజారాహిల్స్ (హైదరాబాద్): ప్రతిష్టాత్మకమైన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికపై నగరానికి చెందిన బిజినెస్ టైకూన్ సుధా రెడ్డి సందడి చేశారు. ప్రఖ్యాత డైరెక్టర్ మార్టిన్ స్క్రోసేస్, హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో చిత్రం ’కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్’ నేషనల్ ప్రీమియర్‌లో భాగంగా ఆమె రెడ్ కార్పెట్ వాక్ చేశారు. స్టార్–స్టడెడ్ ఫెస్టివల్లో ప్రపంచ ప్రముఖులతో అలరించే రెడ్ కార్పెట్‌పై వాక్ చేసిన మొట్టమొదటి సినిమాయేతర సెలబ్రిటీ సుధారెడ్డి కావడంవిశేషం. ఈ సందర్భంగా ఆమె కస్టమ్–మేడ్ ఫల్గుణి షేన్ పీకాక్ పీచ్ పెర్ల్ డ్రెప్ చీరలో ఆకట్టుకున్నారు. అనంతరం ప్రతిష్టాత్మకమైన బీచ్ డెస్టినేషన్, ప్లేజ్ హోటల్ బారియర్ లే మెజెస్టిక్‌లో జరిగిన మేడమ్ ఫిగరో ఈవెంట్లో తళుక్కుమన్నారు. -
రాజ్యసభలో రెడ్, లోక్‌సభలో గ్రీన్ కార్పెట్.. ఎందుకో తెలుసా?
ఢిల్లీ: మన దేశంలోని నూతన పార్లమెంట్ గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. మరోవైపు పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంపై రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. కాగా, పార్లమెంట్ నూతన భవన ప్రారంభాన్ని బహిష్కరించేందుకు 19 విపక్షపార్టీలు ఇప్పటికే పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో కొత్త పార్లమెంట్ నిర్మాణ శైలి, హంగుల గురించి కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. అధికార బీజేపీ పక్షం నూతన పార్లమెంట్ భవన నిర్మాణం మొదలుకొని వివిధ అంశాలలో రికార్డులు నెలకొల్పిందని చెబుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ ఫొటోలలో రాజ్యసభ హాలులో రెడ్ కార్పెట్, లోక్‌సభ హాలులో గ్రీన్ కలర్ కార్పెట్ ఉండటాన్ని మనం గమనించవచ్చు. చాలామంది దీనిని డిజైన్ అని అనుకుంటారు. కానీ, దీని వెనుక ఒక కారణం ఉంది. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ విధానం నూతన పార్లమెంట్‌లోనే కాదు పాత పార్లమెంట్ భవనంలోనూ కొనసాగింది. కొత్త భవనంలో పలు మార్పులు చోటుచేసుకున్నప్పటికీ కార్పెట్ రంగుల విషయంలో ఎటువంటి మార్పులేదు. పార్లమెంట్‌లోని ఉభయ సభలకు భిన్నమైన ప్రత్యేకత ఉంది. రెండు సభలలో సభ్యులను ఎన్నుకునే ప్రక్రియలోనూ ఎంతో తేడా ఉంది. లోక్‌సభలోని సభ్యులు నేరుగా ప్రజల చేత ఎన్నికయినవారై ఉంటారు. అదేవిధంగా రాజ్యసభ విషయానికొస్తే సభ్యులను ప్రజా ప్రతినిధులు ఎన్నుకుంటారు. లోక్‌సభ సభ్యులంతా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారు. అంటే వీరు కింది స్థాయి(నేల)తో విడదీయరాని అనుబంధం కలిగివుంటారు. భూమితో ముడిపడివున్న వ్యవసాయానికి గుర్తుగా పచ్చరంగును పేర్కొంటారు. అందుకే లోక్‌సభలో పచ్చరంగు కార్పెట్ వినియోగిస్తారు. రాజ్యసభలో రెడ్ కార్పెట్ ఎందుకంటే.. రాజ్యసభలోని సభ్యులు.. ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికైనవారై ఉంటారు. వీరి ఎంపిక ప్రక్రియ విభిన్నంగా ఉంటుంది. ఎరుపు రంగును గౌరవానికి ప్రతీకగా భావిస్తారు. రాజ్యసభలోని ప్రజాప్రతినిధులను ప్రత్యేక సభ్యులుగా గుర్తిస్తారు. అందుకే రాజ్యసభలో ఎరుపురంగు కార్పెట్‌ను వినియోగిస్తారు. ఇది కూడా చదవండి: రాజదండం సాక్షిగా... పార్లమెంటులో చోళుల సెంగోల్ -
కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఊహించని ఘటన.. మహిళ ఒంటిపై ‘రక్తం’ పోసుకుని
అంతర్జాతీయ సినీ వేడుక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌కు సంఘీభావంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఒక మహిళ తెలిపిన నిరసన అందరి దృష్టిని ఆకర్షించింది. వివరాల్లోకి వెళితే.. దక్షిణ ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఫెస్టివల్లో ఆదివారం సాయంత్రం ఫ్రెంచ్ చలనచిత్ర దర్శకుడు జస్ట్ ఫిలిప్పోట్ చిత్రం యాసిడ్ ప్రీమియర్‌కు ముందు ఓ మహిళ ఉక్రెయిన్ జెండా రంగులున్న దుస్తులు ధరించి రెడ్ కార్పెట్‌పైకి నడుచుకుంటూ వెళ్లి, ఓ చోట నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చింది. అనంతరం తన వెంట తెచ్చిన బాటిల్‌ను తెరిచి అందులోని ఎరుపు రంగుని తన తలపై పోసుకుని నిరసన తెలపడం మొదలుపెట్టింది. దీంతో అక్కడున్న భద్రతా సిబ్బంది అప్రమత్తతో వ్యవహరించి వెంటనే ఆ మహిళను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. గత సంవత్సర కాలంగా రష్యా ఉక్రెయిన్‌పై జరుపుతున్న దాడులు కారణంగా అక్కడ నెత్తుటి దారులు ఏరులై పారుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంకేతంగా ఆ మహిళ నకిలీ రక్తంతో ఈ రకంగా తన నిరసన ప్రదర్శించినట్లు తెలుస్తోంది. అయితే సదరు మహిళ వివరాలు తెలియాల్సి ఉంది. ఆమె ఉక్రెయిన్ దేశస్థురాలిగా అనుమానిస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడులకు వ్యతిరేకిస్తూ ఈ ఏడాది కూడా రష్యా ప్రతినిధులు, ఫిల్మ్ కంపెనీలపై కేన్స్ నిషేధం విధించారు. గతేడాది కూడా ఓ మహిళ ఇలాగే అనూహ్యంగా నిరసనకు దిగి అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. At the Cannes Film Festival, a brave young lady dressed in the colors of Ukraine doused herself in fake blood. She did it on the red carpet before the screening of the Russian film "Acid". The security service quickly ran up to her and rushed her away. 🇺🇦💙💛… pic.twitter.com/rqx2CNlJ0N — Snodgrass (@Snodgrass9876) May 22, 2023 చదవండి: సూడాన్: అమెరికా, సౌదీ దౌత్యం.. సంబురపడేలోపే కథ మళ్లీ మొదటికి! -
‘రూ.2 వేల నోట్లు వెనక్కి.. ఏ పత్రాలు వద్దు.. కేంద్రం తెలివి తక్కువ పని’
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం చలామణిలో ఉన్న రూ. 2 వేల నోటు రద్దు నిర్ణయాన్ని తప్పుపట్టారు. అదొక తెలివి తక్కువ పనిగా అభివర్ణించారు. పైగా నలధనాన్ని వెలికి తీసేందుకే ఈ పెద్ద నోట్లని రద్దు చేసినట్లు ప్రభుత్వం పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ రెండు వేల రూపాయల నోటు మార్చుకునేందుకు ఎలాంటి గుర్తింపు పత్రాలు, ఆధారాలు అవసరం లేదని బ్యాంకులు స్పష్టం చేశాయి. అంటే దీని అర్థం నల్లదనాన్ని మార్చుకునే వారికి రెడ్ కార్పెట్ పరిచి మరీ వెసులుబాటు కల్పించినట్లేగా అని ఎద్దేవా చేశారు. నిజానికి సాధారణ ప్రజల వద్ద రూ. 2 వేల రూపాయల నోట్లు ఉండనే ఉండవు. 2016లో డీ మానిటైజేషన్ పేరిట ప్రవేశపెట్టిన నోట్ల రద్దుతో ప్రజలు పెద్ద నోట్లకు చాలా దూరంగా ఉన్నారన్నారు. అయినా రోజువారి చిల్లరకు ఆ నోటు సామాన్యులకు పెద్దగా ఉపయోగం ఉండదు కూడా అని చెప్పారు. నల్లధనాన్ని కూడబెట్టేవారికి సులభంగా దాచుకునేందుకు మాత్రమే ఆ నోటు ఉపయోగపడుతుందన్నారు. 2016 తర్వాత సరిగ్గా ఏడేళ్లకి ఈ మూర్ఖపు చర్యను తీసుకున్నందుకు సంతోషం అని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా, శుక్రవారమే భారత రిజర్వ్ బ్యాంకు రూ.2 వేల నోటుని చలామణి నుంచి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. అలాగే ప్రజలు తమ ఖాతాల్లో డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు సమయం ఇవ్వడమే గాక అందుకు ఎలాంటి గుర్తింపు పత్రాలు కూడా అవసరం లేదని ప్రకటించడం గమనార్హం. మరోవైపు ఈ రూ. 2 వేల రూపాయల నోటుని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ.. ఇది ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపదని, కేవలం అక్రమ డబ్బు తరలింపును కష్టతరం చేయడానికేనని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా చెప్పడం విశేషం. (చదవండి: శ్రీనగర్‌లో కట్టుదిట్టమైన భద్రత..భారీగా బలగాలు మోహరింపు) -
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిసిన అమన్ గుప్తా..
ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ బోట్ సహ వ్యవస్థాపకుడు అమన్ గుప్తా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిశారు. రెడ్ కార్పెట్ మీద భార్య ప్రియా దాగర్‌తో కలిసి అడుగులు వేశారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇలా రెడ్ కార్పెట్‌పై నడిచిన మొదటి భారతీయ పారిశ్రామిక వేత్త ఆయనే. అమన్ గుప్తా తొలిసారిగా కేన్స్ ప్రదర్శన కోసం భార్య ప్రియా దాగర్‌తో కలిసి వచ్చారు. ఈ మేరకు అమన్ గుప్తా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న ఫొటోలను షేర్ చేశారు. ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్‌పై నడిచిన తొలి భారతీయ పారిశ్రామికవేత్తను నేనే కావడం గర్వంగా ఉంది’ అని పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Aman Gupta (@boatxaman) మరోవైపు బాలీవుడ్ తారలు సారా అలీ ఖాన్, మానుషి చిల్లర్, ఈషా గుప్తా, మృణాల్ ఠాకూర్ వంటి వారు ఈ సంవత్సరం కేన్స్‌లోకి అడుగుపెట్టారు. కేన్స్ వెటరన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ లోరియల్ బ్రాండ్ అంబాసిడర్‌గా 21వ సారి ఫెస్టివల్లో ప్రదర్శన ఇచ్చింది. -
ఆస్కార్ వేదికపై నల్ల గౌనులో మెరిసిన దీపిక.. ట్విస్ట్ ఏంటంటే..?
వాషింగ్టన్: బాలీవుడ్ స్టార్ దిపికా పదుకొణె ఆస్కార్ వేదికపై సందడి చేశారు. 95వ అకాడెమీ అవార్డుల ప్రధానోత్సవానికి తొలిసారి ప్రెజెంటర్‌గా వెళ్లిన ఆమె రెడ్‌కార్పెట్‌పై నల్ల గౌనులో మెరిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా.. సామాజిక మాధ్యమాల్లో అవి వైరల్‌గా మారాయి. నల్ల రంగు గౌను, వెల్వెట్ గ్లౌస్, డైమండ్ నెక్లెస్‌తో హాలీవుడ్ గ్లామర్ భామలను తలదన్నేలా దీపిక తన అందంతో అందరినీ ఆకట్టుకుంది. అయితే దిపికా పదుకొణెకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉన్నా.. హాలీవుడ్ మీడియా సంస్థ ఏఎఫ్‌పీతో పాటు గెట్టీ, వోగ్ మెగజీన్ను ఆమెను గుర్తుపట్టలేకపోయాయి. దిపికాను బ్రెజిల్ మోడల్, డిజైనర్ క్యామిలా అనుకొని పొరపడ్డాయి. దీపికా గతంలో కేన్స్ జ్యూరీ, ఫిఫా వరల్డ్ కప్ వేడుకల్లో కూడా సందడి చేశారు. అయినా ఆమెకు, క్యామిలాకు మధ్య వ్యత్యాసాన్ని హాలీవుడ్ సంస్థలు పసిగట్టలేకపోయాయి. View this post on Instagram A post shared by Deepika Padukone (@deepikapadukone) View this post on Instagram A post shared by Camila Alves McConaughey (@camilamcconaughey) -
జిన్‌పింగ్ సౌదీ పర్యటనతో..టెన్షన్లో పడిన అమెరికా
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ బుధవారం నుంచి సౌదీ అరేబియాలో మూడు రోజుల అధికారిక పర్యటన చేయనున్నారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్ సౌదీలోని చైనా గల్ఫ్ సహకార మండలి(జీసీసీ) సమావేశంలో పాల్గొంటారు. ఈ మేరకు జిన్‌పింగ్ తన మూడు రోజుల అధికారిక పర్యటన కోసం అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు గల్ఫ్ కింగ్డమ్కి చేరుకుంటారని సౌదీ మీడియా పేర్కొంది. ఈ పర్యటనలో సౌదీ రాజు సల్మాన్ అధ్యక్షతన ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం ఉంటుంది. దీనికి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్‌సల్మాన్ హాజరవుతారని సౌదీ ప్రభుత్వ మీడియా నివేదికలో పేర్కొంది. అలాగే ఆరుగురు సభ్యులతో కూడిన జీసీసీకి చెందిన పాలకుల శిఖరాగ్ర సమావేశానికి జిన్ పింగ్ హాజరవుతారని, పైగా మధ్యప్రాచ్యంలోని ఇతర ప్రాంతాల నాయకులతో కూడా సమావేశమై చర్చలు జరుపుతారని నివేదికలో వెల్లడించింది. జీసీసీ అనేది బహ్రెయిన్ , కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్లతో కూడిన ప్రాంతీయ అంతర్ ప్రభుత్వ రాజకీయ ఆర్థిక సంఘం. ఐతే ప్రస్తుతం జిన్‌పింగ్ సౌదీ రాక అమెరికాను కాస్త కలవరపాటుకు గురిచేస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చమురు అభ్యర్థనను తిరస్కరించిన నేపథ్యంలో సౌదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కి రెడ్‌కార్పెట్ పరిచి ఆహ్వానించటం అనేది యూఎస్‌ని టెన్షన్‌కి గురి చేసే అంశమే. అదీగాక అమెరికా అధ్యక్షుడు వాషింగ్టన్ మధ్య ప్రాచ్యాన్ని బీజింగ్‌కి అప్పగించదు అని తేల్చిన నేపథ్యంలో జరుగుతున్న జిన్‌పింగ్ పర్యటనే కావడం. అంతేగాక వాషంగ్టన్ని ప్రభావితం చేసే దేశాలతో లింక్ అప్ పెంచుకోవాలనే చైనా కోరికను తేటతెల్లం చేస్తోంది ఈ పర్యటన. మరోవైపు సౌదీ ముడి చమురుకి సంబంధించి చైనా ఏ అతిపెద్ద కస్టమర్ కూడా. ఐతే ఈ పర్యటనలో సౌదీ ఆర్థిక వ్యవస్థను చమురు నుంచి వైవిధ్యపరచాలనే ప్రిన్స్ మహ్మద్ ఆలోచనకు అనుగుణంగా మెగాప్రాజెక్టులలో చైనా సంస్థలు మరింతగా భాగస్వామ్యమయ్యేలా ఒప్పందాలపై ఇరు దేశాల నాయకులు చర్చిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. జిన్‌పింగ్ చివరిసారిగా 2016లో సౌదీ అరేబియాను సందర్శించారు. (చదవండి: సినీఫక్కీలో దోపిడీ: జస్ట్ 60 సెకన్లలో 7 కోట్ల విలువైన కార్లను కొట్టేశారు: వీడియో వైరల్) -
‘బాగా నిద్రపోగలరా..జాబిస్తాం! జీతంతోపాటు మరో ఆఫర్ కూడా!
ఉద్యోగులెవరైనా ఆఫీసు వేళల్లో గుర్రుపెట్టి నిద్రపోతే ఏం జరుగుతుంది? ఏముంది.. ఆ పనేదో ఇంటికెళ్లి చేసుకోండంటూ సంస్థ వారిని ‘సాగనంపుతుంది’. కానీ అలాంటి వారే తమకు కావాలని ఏదైనా కంపెనీ ముందుకొస్తే?! అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన క్యాస్పర్ అనే పరుపుల కంపెనీ నిద్రపోవడంలో అసాధారణ ప్రతిభ చూపగల ఔత్సాహికులకు రెడ్‌కార్పెట్ పరుస్తోంది. నిద్రా నిపుణుల కోసం ఉద్యోగ ప్రకటన సైతం జారీ చేసింది. ‘వీలైనంత సేపు నిద్రపోవాలన్న కోరిక ఉండటంతోపాటు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిద్రాభంగం కలగని సామర్థ్యం ఉన్న వారి కోసం ఎదురుచూస్తున్నాం’ అంటూ ఆన్లైన్ ప్రకటనలో పేర్కొంది. ‘మా స్టోర్లతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఊహించని ప్రాంతాల్లో నిద్రపోండి. మీ నిద్రానుభవాన్ని టిక్‌టాక్ తరహా కంటెంట్ ద్వారా మా సోషల్ మీడియా చానళ్ల ద్వారా ఇతరులతో పంచుకోండి’ అని సూచించింది. నిద్రకు సంబంధించిన అన్ని రకాల అంశాలను ఇతరులతో పంచుకోగలగడం, నిద్ర గురించి మాట్లాడే జిజ్ఞాస కలిగి ఉండటం అభ్యర్థులకు అదనపు అర్హత అవుతుందని తెలిపింది. ఎంపికైన అభ్యర్థులకు తగిన జీతంతోపాటు కంపెనీ ఉత్పత్తులను ఉచితంగా అందిస్తామని మరో ఆఫర్ ఇచ్చింది. ఉద్యోగులు పైజామాల్లో ఆఫీసుకు వచ్చేందుకు అనుమతిస్తామని పేర్కొంది. నిద్రకు నిద్ర, జీతానికి జీతం కావాలనుకొనే ఔత్సాహికులు దరఖాస్తులు సమర్పించేందుకు గురువారమే చివరి రోజు.. త్వరపడండి మరి. -
స్కర్ట్ వేసుకున్న స్టార్ హీరో.. వరల్డ్‌వైడ్‌గా చర్చ
Brad Pitt Explains On Why He Wore Skirt On Bullet Train Red Carpet: ఇప్పటివరకు బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన దుస్తులు ధరించి ట్రోలింగ్‌కు గురి కావడం చూశాం. తాజాగా ఇలాంటి డిఫరెంట్ వేర్‌తో దర్శనమిచ్చి వైరల్‌గా మారాడు ఓ స్టార్ హీరో. హాలీవుడ్ ప్రముఖ కథానాయకుల్లో బ్రాడ్ పిట్ ఒకరు. యాక్షన్ సినిమాలతో వరల్డ్ వైడ్‌గా పాపులారిటీ సంపాదించుకున్నాడు ఈ ఆస్కార్ విన్నర్. ఈ హీరో కూడా అప్పుడప్పుడు విచిత్రమైన ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తుంటాడు. బ్రాడ్ పిట్ తాజాగా నటించిన చిత్రం 'బుల్లెట్ ట్రైన్'. ఈ మూవీ ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రం రిలీజ్‌కు ముందు పలు దేశాల్లో ప్రీమియర్ షోలను వేస్తున్నారు. ఇలానే కొన్ని వారాల క్రితం బెర్లిన్‌లో 'బుల్లెట్ ట్రైన్' ప్రీమిర్ షోను ప్రదర్శించారు. ఈ షో కోసం వేసిన రెడ్ కార్పెట్‌పై స్కర్ట్ వేసుకుని కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు బ్రాడ్ పిట్. మోకాళ్ల వరకు ఉన్న స్కర్ట్, బూట్లు, వదులుగా ఉండే నార షర్ట్, జాకెట్‌తో దర్శనమిచ్చిన బ్రాడ్ పిట్ లుక్ వరల్డ్‌వైడ్‌గా వైరల్ అయింది. బ్రాడ్ పిట్ వేసుకున్న కాస్ట్యూమ్‌పై ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. దీంతో ఈ విషయంపై తాజాగా లాస్ ఏంజెల్స్‌తో జరిగిన మూవీ ప్రీమియర్ షోలో స్పందించాడు బ్రాడ్ పిట్. చదవండి: సౌత్ సినిమాలు సరిగ్గా ఆడట్లేదు: అలియా భట్ ఈ ప్రీమియర్ షోకు సాధారణ దుస్తుల్లో వచ్చన బ్రాడ్ పిట్.. 'బెర్లిన్‌లో అలా ఎందుకు చేశానో నాకు కూడా సరిగ్గా తెలియదు. కానీ త్వరలో మనందరం చనిపోతాం. అందుకే కొంచెం డిఫరెంట్‌గా చేద్దామని అనిపించింది' అని స్కర్ట్ వేసుకోవడంపై వివరణ ఇచ్చాడు. అలాగే తన రిటైర్మెంట్ ప్లాన్ గురించి చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించాడు. 'నేను రిటైర్ అవుతున్నాననే ఉద్దేశ్యంతో అలా మాట్లాడలేదు. ప్రస్తుతం నేను మిడిల్ ఏజ్‌లో ఉన్నాను. చివరి రోజుల్లో ఎలా ఉండాలనుకుంటున్నానో చెప్పాను అంతే' అని పేర్కొన్నాడు. చదవండి: 4కె ప్రింట్‌తో మళ్లీ రిలీజ్ చేస్తున్నారంటగా.. ఫ్యాన్స్ హ్యాపీనా.. -
ఆ హీరోయిన్స్‌ను జిరాఫీలు అన్న అదితి రావ్.. ఎందుకంటే ?
Aditi Rao Hydari About Cannes Film Festival 2022 Debut Experience: తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది బ్యూటీఫుల్ హీరోయిన్ అదితి రావ్ హైదరీ. ఇటీవల మహా సముద్రం, హే సినామిక చిత్రాలతో అలరించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో తళుక్కుమంది. బాలీవుడ్ స్టార్స్ ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొణె, నవాజుద్ధీన్ సిద్ధిఖీ, ఆర్ మాధవన్, పూజా హెగ్డేతోపాటు అదితి పాల్గొంది. వేడుకలో భాగంగా ఐదో రోజు రెడ్ కార్పెట్‌పై రెడ్ అండ్ పింక్ గౌన్‌లో అందంగా నడిచి ఆకట్టుకుంది. ఈ క్రమంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది అదితి రావ్ హైదరీ. 'నేను చాలా పొట్టిగా ఉంటాను. అందుకే కేన్స్ ఫెస్టివల్లో ఉన్న జిరాఫీలతో (మిగతా హీరోయిన్స్ తనకన్నా హైట్‌గా ఉంటారన్న ఉద్దేశ్యంతో) పోటీపడలేనని మాటల సందర్భంలో సబ్యసాచితో (డిజైనర్) చెప్పాను. నేను నటిని. పొట్టిగా ఉన్నప్పటికీ నాకు బాధ లేదు. ఎందుకంటే నాలాగా ఉండటానికి నేను ఎంతో సౌకర్యవంతంగా ఫీల్ అవుతాను. అందుకే ధైర్యం చేసి ఫెస్టివల్లో పాల్గొంటాను. నేను చాలా తెలివితక్కువ పని చేయబోతున్నాను. రెడ్ కార్పెట్‌పై నడిచేప్పుడు కచ్చితంగా ఏదో ఒక పొరపాటు చేస్తాను. అప్పుడు నన్ను అందరు విమర్శిస్తారు. అయినా పర్లేదు. అంతా మన మంచికే. దాని నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు.' అని అదితి చెప్పుకొచ్చింది. అయితే రెడ్ కార్పెట్‌పై ఎలాంటి పొరపాటు లేకుండా హొయలు పోయింది అదితి రావ్ హైదరీ. చదవండి: లగ్జరీ కారు కొన్న అదితి రావు హైదరీ.. ధర ఎంతంటే ? View this post on Instagram A post shared by Vivo India (@vivo_india) View this post on Instagram A post shared by Vivo India (@vivo_india) -
కులాల లెక్కన...‘ఆకర్ష్’ మంత్రం
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రస్తుతం కులాలు, వర్గాల వారీగా ఓట్లను రాబట్టగల నేతలను ఆకర్షించడంపై పార్టీలు ప్రధానంగా దృష్టి సారించాయి. ప్రధాన కులాలను ప్రభావితం చేయగల సమర్ధులైన కీలక నేతలపై ఆకర్ష్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్న అన్ని ప్రధాన పార్టీలు, వారిని చేర్చుకునేందుకు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా యూపీలో అధికారాన్ని కాపాడుకోవాలనే గట్టి పట్టుదలతో ఉన్న బీజేపీ అందరికంటే ముందుగానే ఫిరాయింపుదారులకు రెడ్‌కార్పెట్ వేయగా, ఎన్నికల షెడ్యూల్ అనంతరం సమాజ్‌వాదీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి బీజేపీ వ్యూహాన్ని చిత్తుచేసే పనిలో పడింది. మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, దారాసింగ్ చౌహాన్లు రాజీనామా చేసి బీజేపీని వీడటం, వారి బాటలోనే బీజేపీకి మరో నలుగురు ఎమ్మెల్యేల రాజీనామాతో వలసల పర్వం హీటెక్కుతోంది. ముందే చేరికలను తెరతీసిన బీజేపీ గడిచిన ఎన్నికల్లో 403 స్థానాలకు గానూ 312 స్థానాలు గెలుచుకున్న బీజేపీ, ప్రస్తుత ఎన్నికల్లోనూ తన సత్తా చాటాలని కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగానే అన్ని పార్టీల కన్నా ముందుగానే మేల్కొన్న పార్టీ అధిష్టానం గత ఏడాది నవంబర్ నుంచే ప్రభావవంతమైన నేతలను ఆకట్టుకునే యత్నాలు ఆరంభించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచనల మేరకు లక్ష్మీకాంత్ బాజ్‌పాయ్ నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని పార్టీ నియమించింది. సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ మాజీ ఎమ్మెల్యేల కాళీచరణ్, మహారాజ సుహేల్దేవ్ సేన రాష్ట్ర అధ్యక్షుడు బాబన్ రాజ్‌భర్‌ను పార్టీలో చేర్చుకుంది. 2.4 శాతంగా ఉన్న రాజ్భర్లు గతంలో బీజేపీతోనే ఉన్నా సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ ఎస్పీతో పొత్తు పెట్టుకోవడంతో వీరి ఓట్ల అటువైపుకు వెళ్లకుండా బీజేపీ జాగ్రత్తలు తీసుకుంది. ఇక బ్రాహ్మణ వర్గాలు ఏమాత్రం చేజారిపోకుండా కాంగ్రెస్‌కు చెందిన మాజీ హోంమంత్రి, ప్రయోగ్‌రాజ్ నుంచి మూడుస్లార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజేంద్ర త్రిపాఠితో పాటు మరో మాజీ మంత్రి జై నారాయణ్ తివారీ, మరో కీలక నేత విజయ్ మిశ్రాలను పార్టీ కండువా కప్పింది. బీఎస్పీ నుంచి ఎస్పీకి దళిత ఓటు బ్యాంకు వెళ్లకుండా ఎస్సాలోని ప్రముఖ దళిత నేత సుభాస్ ఫసికి కాషాయ కండువా కప్పింది. ఎస్పీని బలహీనపర్చే యత్నంలో గత నవంబర్‌లో పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రవిశంకర్సింగ్, నరేంద్రసింగ్ భాటి, సీపీచాంద్, రామ్ నిరంజన్లను పార్టీలోకి లాగేసింది. వీరంతా ఠాకూర్ వర్గానికి చెందిన వారే. తాజాగా స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామా నేపథ్యంలో మేల్కొన్న బీజేపీ బుధవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే నరేష్ సైనీ, ఎస్పీ ఎమ్మెల్యే హరిఓంలను పార్టీలో చేర్చుకుంది. æ ఆటలో వేడి పెంచిన ఎస్పీ చేరికలపై బీజేపీ కమిటీ ఏర్పాటు చేసిన మరుక్షణమే వారికి షాక్ ఇచ్చేలా గత ఏడాది అక్టోబర్‌లోనే ఆరుగురు బీఎస్పీ, ఒక బీజేపీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడంతో ఆట మొదలు పెట్టిన ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్.. ప్రస్తుతం మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, దారాసింగ్ చౌహాన్‌ల రాజీనామాతో వేడి పెంచారు. స్వామి ప్రసాద్ సహా ఆయనతో పాటు బీజేపీకి రాజీనామా చేసిన నలుగురు ఎమ్మెల్యేలు 14న ఎస్పీలో చేరే అవకాశం ఉంది. ఓబీసీ వర్గాల్లో స్వామి ప్రసాద్‌కు గట్టు పట్టు ఉండగా, మిగతా ఎమ్మెల్యేలు తమతమ నియోజకవర్గాల్లో ప్రభావం చూపే వారే. వీరితో పాటు మరో 13 నుంచి 17 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎక్కువగా ఓబీసీ, రాజ్‌పుత్, బ్రాహ్మణ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కీలక నేత, ముస్లిం వర్గాల్లో గట్టి పట్టున్న ఇమ్రాన్ మసూద్‌ను ఎస్పీ చేర్చుకోగా, ఆయనతో పాటే ఇద్దరు ఎమ్మెల్యేలు నరేశ్ సైనీ, మసూద్ అక్తర్‌లో ఎస్పీలో చేరారు. 19 శాతంగా ఉన్న ముస్లిం ఓట్లు చీలకుండా ఇప్పటికే కాంగ్రెస్, బీఎస్పీలలో మైనారిటీ నేతలందరినీ పార్టీలో చేర్చుకునేలా అఖిలేశ్ వ్యూహ రచన చేస్తున్నారు. -
ఆస్కార్ 2021: రెడ్ కార్పెట్ మీద హొయలు ఒలికించిన తారలు
-
బాలీవుడ్ భామలు .. లేత మెరుపు తీగలు
-
సైమా అవార్డ్స్ రెడ్ కార్పెట్
-
సోనమ్ సందడి
‘ఫ్యాషన్ ఐకాన్’ సోనమ్ కపూర్ ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా కాన్స్ చలన చిత్రోత్సవాల్లో సందడి చేస్తున్నారు. ఓ సౌందర్య సాధనానికి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సోనమ్ ఆ బ్రాండ్‌ని ప్రమోట్ చేయడానికి ప్రతి ఏడాది కాన్స్ చలన చిత్రోత్సవాల్లో పాల్గొంటారు. ఈసారి కూడా అలానే వెళ్లారు. దాంతో పాటు ఫ్రెంచ్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన ‘చారిటీ డిన్నర్’లో కూడా పాల్గొన్నారామె. రెడ్ కార్పెట్‌పై అందంగా క్యాట్ వాక్ చేసి, అందర్నీ ఆకట్టుకున్నారు. అందరితో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. కాన్స్ ఉత్సవాల్లో పాల్గొన్న పాకిస్తానీ యాక్ట్రెస్ మహీరా ఖాన్‌కు ఆత్మీయంగా ముద్దు పెట్టారు. 2011 నుంచి ప్రతి ఏడాదీ సోనమ్ కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొంటున్నారు. మహీరా ఖాన్‌కి ఇదే ఫస్ట్ టైమ్. అయినప్పటికీ ఎంతో ఆత్మవిశ్వాసంతో మహీరా రెడ్ కార్పెట్‌పై అడుగులు వేసి, భేష్ అనిపించుకున్నారు. అన్నట్లు.. రేపు సోనమ్ ఇండియా వచ్చేస్తారు. -
కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఐశ్వర్య ప్రత్యేక ఆకర్షణ
-
కేన్స్‌లో మెరిసిన దీపిక పదుకొనె
-
తళుక్కుమన్న తారాలోకం
-
రెడ్ కార్పెట్‌పై సెల్ఫీలు బ్యాన్
ఒలంపిక్స్ తర్వాత అతిపెద్ద ఆకర్షణ గల వేడుక ఏదైనా ఉంది అంటే అది కేన్స్ ఫిలిం ఫెస్టివలే. ఏటా నిర్వహించే ఈ వేడుకలు ప్రపంచ దేశాల నుంచి నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు రెడ్‌కార్పెట్‌పై హోయల పోయేందుకు తహతహలాడుతుంటారు. ఆయా సినిమాల ప్రీమియర్ షో ప్రదర్శనలప్పుడు తాజా ఫ్యాషన్‌ను పరిచయం చేస్తూ నటీనటులు చేసే సందడి అంతా ఇంతా కాదు. అభిమానులతో సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తూ. అయితే ఈ సారి కేన్స్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్ సెల్ఫీలను బ్యాన్ చేసేశారు. మే 8 నుంచి మే 17 వరకు జరిగే కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు సంబంధించి కొత్త ప్రొటొకాల్స్ జారీ అయ్యాయి. ఈ ప్రొటోకాల్స్‌లో ప్రెస్ వారి కోసం నిర్వహించే మార్నింగ్ స్క్రీనింగ్‌లను తీసేశారు. దాంతో పాటు రెడ్‌కార్పెట్‌పై హోయల్ పోతూ.. నటీనటులు దిగే సెల్ఫీలను కూడా బ్యాన్ చేసినట్టు తెలిసింది. వెరైటీకి ఇచ్చిన డైరెక్టర్స్ ఇంటర్వ్యూలో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ డైరెక్టర్ థియరీ ఫ్రీమాక్స్ ఈ విషయాన్ని వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం ప్రెస్ కోసం ఉదయం పూట ప్రదర్శించే సినిమాలను రద్దు చేయాలని నిర్ణయించామని చెప్పారు. అతిథులతో పాటే, జర్నలిస్టులు, విమర్శకులు సినిమాలను సాయంత్రం సమయంలోనే చూడాల్సి ఉందన్నారు. రెడ్ కార్పెట్‌పై సెల్ఫీలను కూడా రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ‘దీనిపై కొంతమంది ప్రతికూలంగా స్పందిస్తూ.. నిరసనలు చేయొచ్చు. కానీ 10 ఏళ్ల క్రితం అసలు సెల్ఫీలనేవే లేవు. ప్రపంచంలో ఇది అసలు అంత ముఖ్యమైన విషయమే కాదు. కేన్స్‌కు వెళ్లేది సినిమాలు చూడటానికి, సెల్ఫీలు తీసుకోవడానికి కాదు’ అని తెలిపారు. కాగ, మే 8 నుంచి అంగరంగ వైభవంగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ఫ్రాన్స్‌లో జరుగబోతోంది. దీనిపై అధికారిక ఎంపిక ఏప్రిల్ 12న ప్రకటించనున్నారు. అంతకముందు దీన్ని ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌గా పిలిచేవారు. -
బ్లాక్ డ్రెస్‌కు రెడ్ కార్పెట్
‘మీ టూ’ హాష్ ట్యాగ్ ఉద్యమం వృ«థా కాలేదు. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవంలో ఫలితం కనిపించింది. రెడ్ కార్పెట్ ఆహ్వానాన్ని నలుపు దుస్తుల వస్త్రధారణ నిరసనగా మార్చింది. ప్రపంచాన్ని మొత్తం తనవైపు తిప్పుకునే íసినిమా అవార్డులు రెండే రెండు. ఒకటి ఆస్కార్, రెండు గోల్డెన్ గ్లోబ్! ప్రసిద్ధ హాలీవుడ్ నిర్మాత హార్వీ వైన్‌స్టీన్ లైంగిక వేధింపుల గురించి మొదట ఓ బాధితురాలు ‘మీ టూ’ ఆన్లైన్ ఉద్యమంలో వెళ్లబోసుకుంది. అప్పటి నుంచి అతని మీదా, హాలీవుడ్ పరిశ్రమలో ఉన్న ఇలాంటి వేధింపుల మీదా మాట్లాడే ధైర్యాన్ని తెచ్చుకున్నారు బాధితులు. ఈ అరాచకాలను ఖండించడానికి, అణచివేయడానికి ఎలాంటి అవకాశం దొరికినా జారవిడుచుకోకూడదని ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలోని మహిళలు ఒక ప్రమాణం చేసుకున్నట్టుంది! అందుకే హాలీవుడ్‌తో పాటు మొత్తం ఎంటర్టైన్మెంట్ మీడియాలో జరుగుతున్న ఈ అకృత్యాలకు.. హార్వీ వైన్‌స్టీన్, ఇంకా హాలీవుడ్‌లోని అలాంటి ప్రబుద్ధులకు వ్యతిరేకంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవానికి విచ్చేసిన ప్రముఖులంతా నల్ల దుస్తుల్లో దర్శనమిచ్చారు. ఇది మంచి పరిణామం! ‘మీ టూ’ ఉద్యమం బలహీనపడకుండా ఊపిరిపోసే శుభ సంకేతం. -
అక్రమాలకు రెడ్‌కార్పెట్
– యథేచ్ఛగా నగరంలో అక్రమ కట్టడాలు – చేష్టలుడిగి చూస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు అనంతపురం న్యూసిటీ : అధికార పార్టీ అండ.. టౌన్ ప్లానింగ్ అధికారుల బాధ్యతారాహిత్యంతో నగరంలో ఇష్టారాజ్యంగా అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారుల లోపాయికార ఒప్పందాలకు అధికార పార్టీ నేతల ప్రోత్సాహం తోడవడంతో అనధికార కట్టడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. సుమారు వందకు పైగా అక్రమ కట్టడాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్థంగా తయారవుతున్న తరుణంలో నిబంధనలకు తూట్లు పొడుస్తూ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించి నగరాన్ని మరింత రద్దీ చేసేందుకు పాలకులు, అధికారులే కంకణం కట్టుకున్నారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. బీపీఎస్‌తో లింక్ నగరంలో అక్రమ కట్టడాలకు బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బీపీఎస్)తో ముడిపెడుతున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ప్రభుత్వం బీపీఎస్‌కు అనుమతి ఇస్తుందని అప్పటి వరకు ఏవిధంగా కట్టినా పర్వాలేదన్న ధోరణిలో అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇదే అదునుగా బిల్డర్లు, యజమానులు వారికి నచ్చినట్లు కట్టడాలు చేపడుతున్నారు. వాస్తవంగా 2014 డిసెంబర్‌లోపు నిర్మాణాలు చేపట్టిన వారికి ప్రభుత్వం బీపీఎస్‌ను ప్రవేశపెట్టింది. నగరంలో బీపీఎస్ కింద 1068 దరఖాస్తు చేసుకోగా అందులో 768 మంది క్లియరెన్స్ రాగా ఇంకా 300 వరకు పరిష్కారానికి నోచుకోలేదు. బీపీఎస్ క్లియర్ చేసుకోని వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. సెల్లార్లకు రెడ్‌కార్పెట్ సెల్లార్లకు పూర్తీ స్థాయిలో అనుమతి లేదు. కమర్షియల్ ఆలోచనతో ఇష్టారాజ్యంగా సెల్లార్లు నిర్మిస్తున్నారు. కమర్షియల్‌కు 500 చదరపు అడుగులు (12 1/2 సెంట్లు) ఉంటే సెల్లార్‌కు అనుమతి ఉంటుంది. అదే రెసిడెన్షియల్‌కు 750 (18 1/2 సెంట్లు) చదరపు అడుగుంటే సెల్లార్‌కు అనుమతిస్తారు. అలాంటిది రెండు, మూడు సెంట్ల స్థలం ఉన్నా అందులో సెల్లార్లు నిర్మిస్తున్నారు. భారీ వర్షాలు వస్తే సెల్లార్ మునిగిపోయి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. 2016 జూన్ 27న కురిసిన భారీ వర్షంతో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ సెల్లార్ మునిగిపోవడం దీనికి చక్కది ఉదాహరణ. అన్నీ అతిక్రమణలే.. నగరంలో భవన అతిక్రమణలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నట్లు సాక్షాత్తు కమిషనర్ పీవీవీఎస్ మూర్తినే చెబుతున్నారు. ఇలాంటివి ప్రధాన ప్రాంతాల్లోనే 31 మంది భవనాలను గుర్తించిన విషయం తెలిసిందే. అక్రమ నిర్మాణాలకు చెక్ పెడుతాం – పీవీవీఎస్ మూర్తి , కమిషనర్ నగరంలో అక్రమ నిర్మాణాలున్న మాట వాస్తవమే. కొందరు ప్లాన్ ప్రకారం నిర్మాణాలు చేపట్టడం లేదు. ఇలాంటి కట్టడాలపై ప్రత్యేక నిఘా ఉంచాం. త్వరలోనే అక్రమ నిర్మాణాలకు చెక్ పెడతాం. -
కళకళలాడిన కేన్స్