
బంజారాహిల్స్ (హైదరాబాద్): ప్రతిష్టాత్మకమైన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికపై నగరానికి చెందిన బిజినెస్ టైకూన్ సుధా రెడ్డి సందడి చేశారు. ప్రఖ్యాత డైరెక్టర్ మార్టిన్ స్క్రోసేస్, హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో చిత్రం ’కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్’ నేషనల్ ప్రీమియర్‌లో భాగంగా ఆమె రెడ్ కార్పెట్ వాక్ చేశారు.
స్టార్–స్టడెడ్ ఫెస్టివల్‌లో ప్రపంచ ప్రముఖులతో అలరించే రెడ్ కార్పెట్‌పై వాక్ చేసిన మొట్టమొదటి సినిమాయేతర సెలబ్రిటీ సుధారెడ్డి కావడంవిశేషం. ఈ సందర్భంగా ఆమె కస్టమ్–మేడ్ ఫల్గుణి షేన్ పీకాక్ పీచ్ పెర్ల్ డ్రెప్ చీరలో ఆకట్టుకున్నారు. అనంతరం ప్రతిష్టాత్మకమైన బీచ్ డెస్టినేషన్, ప్లేజ్ హోటల్ బారియర్ లే మెజెస్టిక్‌లో జరిగిన మేడమ్ ఫిగరో ఈవెంట్‌లో తళుక్కుమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment