cannes film festival
-
ప్రతి నిమిషం.. సినిమా ధ్యాసే..
చిత్ర పరిశ్రమలో దర్శకత్వ విభాగంలో సక్సెస్ కావాలంటే, అందులోనూ ఓ మహిళ ఆ స్థాయిలో అవ్వాలంటే సామర్థ్యంతో పాటు సృజనాత్మకత తప్పనిసరి. సమకాలీన అంశాలను అర్థవంతంగా తెరకెక్కిస్తేనే ప్రేక్షకాదరణ పొందుతుంది. అలాంటిది హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ఎంతో అంకితభావం, చిత్తశుద్ధితో పాటు ధైర్యసాహసాలు కావాలి. ఒకటి కాదు రెండు కాదు వందలాది అంతర్జాతీయ అవార్డ్‌లతో ఔరా అనిపిస్తోంది మన తెలుగమ్మాయి లక్ష్మీ నిమిషా గుమ్మడి. తాజాగా ఆమె ప్రొడక్షన్ డిజైనర్‌గా రూపొందించిన ‘డాస్ బ్రోస్ ఫోర్స్’ ఫీచర్ ఫిల్మ్ అత్యంత ప్రతిష్టాత్మకమైన 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పోటీలో నిలిచింది. ఇది చాలదూ.. హాలీవుడ్లో లక్ష్మీ సత్తా ఏంటో చెప్పేందుకు!? హైదరాబాద్‌లోని సంఘమిత్ర స్కూల్, ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్లో +12 వరకూ చదివిన లక్ష్మీ.. ఆ తర్వాత కర్నాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, కాలిఫోరి్నయాలోని అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ (ఏఎఫ్ఐ)లో ‘ప్రొడక్షన్ డిజైన్’లో ఎంఎస్ పూర్తి చేసింది. సమకాలీన డిజైన్స్‌తో సాంస్కృతిక అంశాలను మిళితం చేసే సామర్థ్యం ఈమె సొంతం. తెర వెనక పాత్రల గురించి తెలిసి.. చిన్నతనంలో సినిమాలు చూసేటప్పుడు క్యారెక్టర్స్‌లో లీనమై అతిగా భావోద్వేగానికి లోనయ్యేదానినని తరుచూ స్నేహితులు ఆమెను ఆటపట్టించేవారు. చిన్నతనం నుంచే తనపై సినిమాల ప్రభావం ఉండటంతో నటి కావాలని అనుకునేది. ఆ వయసులో తెరవెనక దర్శకులు, సినిమాటోగ్రాఫర్లు, నిర్మాతల పాత్ర గురించి ఆలోచించే స్థాయిలేదు కానీ, పెద్దయ్యాక సినిమా మేకింగ్ గురించి తెలిసిన తర్వాత ఆమె ఆసక్తి నటన నుంచి ప్రొడక్షన్ వైపు మళ్లింది.ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ ‘తహనన్’.. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతున్న ‘తహనాన్’ అనే ఫీచర్ ఫిల్మ్ లక్ష్మీ రూపొందించిందే. దీనికి లాస్ ఏంజిల్స్‌లోని కల్వర్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చలనచిత్ర అవార్డ్ వరించింది. అమెరికాలో మ్యూజిక్ వీడియోలు, వాణిజ్య ప్రకటనలు కూడా ఈమె రూపొందిస్తోంది. టేలర్ స్విఫ్ట్సŠ, ఫోర్ట్‌నైట్, రెడ్ క్రిస్మస్, రోబోట్, ఎలిఫెంట్ ఇన్ ది డార్క్, స్టక్ వంటి ఎన్నో మ్యూజిక్ వీడియోలకు లక్ష్మీ పనిచేసింది. అలాగే ఎల్రక్టానిక్ ఉపకరణాల సంస్థ డీఈఎక్స్ వంటి పలు బహుళ జాతి కంపెనీలకు వాణిజ్య ప్రకటనలు రూపొందించింది.తెలుగు చిత్రం రిలీజ్.. ఈజిప్ట్, ఫ్రాన్స్, పోర్చుగల్, జర్మనీ, ఇస్తాంబుల్, యూకే వంటి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన 50 ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో 15 అంతర్జాతీయ అవార్డ్లు లక్ష్మీ సొంతం. తాజాగా ‘డాస్ బ్రోస్ ఫోర్స్’ చిత్రం వచ్చే ఏడాది మేలో జరగనున్న ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పోటీలో నిలిచింది. అర్జున్ ది స్టూడెంట్, మీన్ గోల్స్, ది హల్కైన్ డేస్, బాడీ చెక్ వంటి ఎన్నో ఫీచర్, షార్ట్ ఫిల్మŠస్ను రూపొందించింది. ఇండియాతో పాటు కెనడా, గ్రీస్, టర్కీ, అమెరికా, ఫ్రాన్స్, యూకే వంటి దేశాల్లోని ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డ్‌లను దక్కించుకుంది. రవికుమార్ వాసు దర్శకత్వంలో శివకుమార్ రామచంద్ర వరపు కథానాయకుడిగా తెరకెక్కిన తెలుగు చలనచిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో హైదరాబాద్ ఫ్యాషన్ డిజైనర్ అరుణా గౌడ్ (ఫొటోలు)
-
కేన్స్ 2024లో తళుక్కున మెరిసిన స్టార్, ఎవరీ నాన్సీ త్యాగి (ఫొటోలు)
-
Nancy Tyagi ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. కట్ చేస్తే కేన్స్‌లో అదరగొట్టేసింది!
ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనల మధ్యనుంచే తన భవిష్యత్తును నిర్మించుకుంది. ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఫ్యాషన్ ప్రపంచంలో తన స్థానాన్ని పదిలపర్చుకుని ప్రశంసలను అందుకుంది. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్‌పై అరంగేట్రంలోనే అందరిదృష్టినీ ఆకర్షించిన ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ త్యాగి కేన్స్ 2024లో ఎలా చేరింది. ఉత్తరప్రదేశ్‌లోని బర్నావా గ్రామనుంచి ఫ్రెంచ్ రివేరా పట్టణంలోని రెడ్ కార్పెట్ దాకా ప్రయాణం ఎలా సాగింది? తెలుసుకుందాం రండి.ఇంటర్ మంచి మార్కులతో పాసైన తరువాత 2020 ఐఏఎస్ అవ్వాలనే ఆశయంతో ఢిల్లీకి వచ్చిన నాన్సీ, ఆర్థిక పరిస్థితుల కారణంగా సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోలేకపోయింది. ఎందుకంటే సరిగ్గా అపుడు కోవిడ్ మహమ్మారి, లాక్డౌన్ ఆక్షల సమయంలో నాన్సీ తల్లి ఉద్యోగం కోల్పోయింది. దీంతో ఇల్లు గడపడం కష్టంగా మారింది. ఇక సివిల్స్ కోచింగ్‌కి డబ్బులు కష్టం అని భావించింది. డిజైన్‌పై ఆమెకున్న తొలి ఆసక్తి , బొమ్మలకు బట్టలు కుట్టడం ద్వారా అలవడిన ఫ్యాషన్ అభిరుచిని, భవిష్యత్ కెరీర్‌కు పునాది వేసింది. అలాగే కెమెరా పట్టుకొని వీడియోలు చేయడం మొదలు పెట్టింది. కొన్నిసార్లు, వీడియోల కోసం ఆమె సోదరుడు మను ఫీజును త్యాగం చేయాల్సి వచ్చేదట. వారి గ్రామంలో ట్రాన్స్పోర్ట్ సర్వీస్ నడుపుకునే తండ్రి కూడా సహాయం చేశాడు. నాలుగేళ్ల తర్వాత ఆ కష్టమంతా ఫలించింది. అలా ఉన్నచోటనే విజయాన్ని వెతుక్కుంది. ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్గా పాపులర్ అయింది. ఆమె విలక్షణమైన శైలి బ్రూట్ ఇండియా దృష్టిని ఆకర్షించింది. తమ స్క్వాడ్‌లో చేరమని ఆమెను ఆహ్వానించింది. అలా కేన్స్ రెడ్ కార్పెట్‌పై అరంగేట్రం కేవలం ఆమె వ్యక్తిగత విజయం మాత్రమే కాదు. టీంకు కూడా గర్ వకారణంగా నిలిచింది. ఆత్మవిశ్వాసం,స్థయిర్యంతోపాటు మాతృభాష (హిందీ)లో మాట్లాడి హైలైట్ అయింది.కేన్స్‌లో యువ డిజైనర్‌గా మెరిసింది. స్టన్నింగ్ లుక్స్, డిజైనర్ దుస్తుల్లో ఆమె ఇచ్చిన పోజులు వైరల్ అయ్యాయి ఫలితంగా 23 ఏళ్ల ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 7లక్షల నుండి 20 లక్షలకు పెరిగింది. అంతేనా నటి-ఫ్యాషనిస్టా సోనమ్ కపూర్ వంటివారు తమ కోసం డిజైన్ చేయమని కోరుతున్నారు. ఆమె కోసం ఒక దుస్తులను తయారు చేసేందుకు నాన్సీ సన్నద్ధమవుతోంది. ఇంకా అర్జున్ కపూర్,మసాబా గుప్తా వంటి ప్రముఖుల ప్రశంసలు దక్కించుకుంది. జీవిత ప్రయాణం చాలా కష్టంగా సాగింది. కానీ ప్రతి క్షణం విలువైనదే అంటూ తన జర్నీని గుర్తు చేసుకుంది.మే 14-మే 25 వరకు జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్, కార్సెట్, టెయిల్డ్ స్కర్ట్ , బ్యాక్‌లెస్ బ్లౌజ్, మ్యాచింగ్ వీల్, పొడవాటి పల్లూతో క్లిష్టమైన హ్యాండ్ ఎంబ్రాయిడరీ లావెండర్ చీర తదితర లుక్స్‌తో అదరగొట్టింది. అంతేకాదు తన దుస్తులను తానే స్వయంగా కుట్టుకోవడం ప్రత్యేకత. కేన్స్ కోసం, నాన్సీ నాలుగు దుస్తులను డిజైన్ చేసుకుంది. ఇందుకు ఆమెకు రెండు నెలలు పట్టింది. 30 రోజుల్లో 1,000 మీటర్ల ఫ్యాబ్రిక్‌తో తయారు చేసిన అందమైన 20 కిలోల గులాబీ రంగు గౌనుతో ఆమె ఫస్ట్ లుక్‌ని రూపొందించింది.ఆ ఆ తర్వాతి నెలలో, ఆమె మిగిలిన మూడింటిని సిద్ధం చేసుకుంది. ముఖ్యంగా రెండవలుక్ కోసం దేశీయ చీరను ఎంచుకుంది. వెస్ట్రన్ టచ్‌తో ఆమె ధరించిన చీర ఆడియెన్స్‌తోపాటు, చాలామంది సెలబ్రిటీలకు కూడా వీపరీతంగా నచ్చేసింది.ఈ చీరను 100 శాతం ఆర్గానిక్ కాటన్, సస్టైనబుల్ ఫాబ్రిక్ నుండి తయారు చేసానని స్వయంగా చెప్పంది. అలాగే తాను ఎక్కువగా సోదరుడి సలహాలను తీసుకుంటానని కూడా వెల్లడించింది. ఈ సారి కూడా డిజైన్ల నుంచి దుస్తుల రంగు వరకు అన్నీ మా అన్నయ్య ఆలోచనలే అని తెలిపింది మురిపెంగా. ఇంత పాపులారిటీ వచ్చింది కదా నటిస్తారా అంటే.. తనకు నటన అంటే పెద్దగా తెలియదు కాబట్టిన నో అని చెప్పేసింది. కల నిజమైంది అంటూ తనకు మద్దతిచ్చి, స్ఫూర్తినిచ్చిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది. తన ఫ్యాషన్‌తో మరింత అబ్బుర పర్చాలని భావిస్తున్నట్టు తెలిపింది. -
Cannes 2024: ఊర్వశి రౌతేలా స్టన్నింగ్ లుక్స్ (ఫోటోలు)
-
Cannes 2024 రూ. 105 కోట్ల విలువైన డ్రెస్‌లు : ఈ భామ ఎవరో గుర్తుపట్టండి!
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ సినీ, ఫ్యాషన్ ప్రముఖులు సందడి చేస్తున్నారు. ప్రతీ ఏడాది 12-రోజుల ఈ వేడుకులో ఫ్యాషన్ స్టయిల్, బ్యూటిఫుల్ ఫ్యాషన్ గేమ్, లుక్స్‌తో అదరగొట్టేస్తున్నారు. 77వ కేన్స్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్‌పై ఐశ్వర్యారాయ్ బచ్చన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కియారా అద్వానీ, ప్రీతి జింటా, దీప్తి సాధ్వానీ, శోభితా ధూళిపాళ, అదితి రావ్ హైదరీ తళుక్కున మెరిసారు. అంతేకాదు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ త్యాగికూడా అందరి చూపును తన వైపు తిప్పుకుంది. అయితే వీరిలో మరింత స్పెషల్‌గా నిలుస్తోంది నటి, మోడల్ ఊర్వశి రౌతేలా.ఊర్వశీ రౌతేలా ఖరీదైన ఫ్యాషన్ దుస్తులతో టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా నిలిచింది. ఈ బ్యూటీ కేన్స్ వేదికపై ధరించిన డ్రెస్ ధరలు ఏకంగా రూ.105 కోట్లు. ముఖ్యంగా ఫస్ట్ డే ధరించిన పూల పింక్ గౌన్ స్పెషల్‌గా నిలిచింది. దీని ధర ఏకంగా రూ.47 కోట్లు అని తెలుస్తోంది. అలాగే, కేన్స్ నాలుగవ రోజు వేసుకున్న బ్లాక్ అండ్ వైట్ కస్టమ్ మేడ్ డ్రెస్ ధర ఏకంగా రూ.58 కోట్లు. సో.. మొత్తంగా ఈ రెండు డ్రెస్సులు కలిపి రూ.105 కోట్లు వరకు ఉంటుందనేది హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. ఐశ్వర్య, కియారా అద్వానీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ప్రీతి జింటా లాంటి తారలు ధరించిన డ్రెస్‌ల ధరలు లక్షల్లో ఉంటుందిట. తరువాత రోజుల్లో కూడా తనదైన స్టయిల్లో అదర గొడుతోంది ఈ భామ.👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన ఐశ్వర్యరాయ్ బచ్చన్
అందాల ఐశ్వర్యం, బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన లేటెస్ట్ లుక్‌తో ఇంటర్నెట్లో సంచలనం రేపుతోంది. తాజాగా కొన్ని అద్భుతమైన చిత్రాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసి ట్రోలర్స్‌కు షాకిచ్చింది. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తన లుక్స్‌పై విపరీతంగా ట్రోల్ చేసినవాళ్లకు లేటెస్ట్ ఫోటోస్‌తో తగిన సమాధానం చెప్పింది. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb)కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కలిసి ప్రతిష్టాత్మక కేన్స్ చలన చిత్రోత్సవానికి హాజరైన ఐషూ రెడ్ కార్పెట్ లుక్‌తో వార్తల్లో నిలిచింది. అయితే కొంతమంది నెటిజన్లు ఆమె లుక్‌పై దారుణంగా ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో కేన్స్ 2024 కోసం సిద్ధమవుతున్నప్పటి ఫోటోలతో ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేసింది. తన కొత్త హెయిర్‌స్టైల్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచింది. తన అందమైన లుక్‌తో అందరినీ మంత్రముగ్దులను చేసింది. దీంతో ఫ్యాన్స్ కమెంట్స్ ఒక రేంజ్లో సాగాయి. "రెడ్ కార్పెట్‌పై ఇలా దర్శనమిచ్చి ఉండి ఉంటే ఉచకోతే’’ అని ఒకరు, "కేన్స్ సమయంలో మీరు ఈ రకమైన హెయిర్‌స్టైల్ ఎంచుకుంటే భలే ఉండేది’’ మరొకరు కమెంట్ చేశారు. "భూమిపై అత్యంత అందమైన మహిళ" అని మరో యూజర్ బాలీవుడ్ దియాపై తన ప్రేమను ప్రకటించాడు. -
డబ్బుల కోసమే నటించా.. నాలా చాలామంది ఉన్నారు: నటి
ఇటీవల జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో "ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్" చిత్రానికి గ్రాండ్ ప్రిక్స్ అవార్డు దక్కింది. పాయల్ కపాడియా ఈ చిత్రాన్ని తెరకెకక్కించారు. అయితే ఈ సినిమాలో మలయాళ నటి కని కుస్రుతి కీలక పాత్ర పోషించింది. తాను సినిమాల్లో నటించడం ప్రారంభించినప్పుడు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను ప్రస్తావించింది. కేన్స్ రెడ్ కార్పెట్‌పై సందడి చేసిన కని కస్రుతి పుచ్చకాయను పోలి ఉన్న హ్యండ్బ్యాగ్తో కనిపించిన అందరి దృష్టిని ఆకర్షించింది. తాజా ఇంటర్వ్యూలో తాను పడిన కష్టాలను పంచుకుంది.కని కుస్రుతి మాట్లాడుతూ..'నేను ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలను. తనకు జీవనోపాధి కోసం మాత్రమే సినిమాల్లో నటించాల్సి వచ్చింది. 2020లో నేను నటించిన మలయాళ చిత్రం "బిరియాని"కి కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్, మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నా. కానీ అంతకుముందు నా జీవితమంతా కన్నీళ్లతో పోరాటమే. నా దగ్గర డబ్బు లేని సమయంలో సజిన్ (సజిన్ బాబు) నన్ను సంప్రదించాడు. స్క్రిప్ట్ చదివిన తర్వాత ఆయనతో ఓకే మాట చెప్పా. ఇందులో నాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఈ క్యారెక్టర్ నేను చేయలేను అని చెప్పా. మరొకరిని వెతకండి సలహా ఇచ్చా. ఆ సమయంలో నాకు డబ్బు అవసరం ఉన్నప్పటికీ సినిమా చేయాలని అనిపించలేదని చెప్పింది. మూడు నెలల తర్వాత చిత్రనిర్మాత మళ్లీ నన్ను సంప్రదించారని' కుస్రుతి తెలిపింది.బిరియానీకి రూ.70,000 ఆఫర్కుస్రుతి మాట్లాడుతూ.. "నాకు ఈ సినిమా చేయడానికి ఆసక్తి లేదు. కానీ నా దగ్గర డబ్బు లేదని చెప్పా. నాకు దాదాపు రూ.70 వేల ఆఫర్ ఇచ్చారు. అది నాకు చాలా పెద్ద మొత్తం. అప్పుడు నా ఖాతాలో కేవలం రూ.3 వేలు మాత్రమే ఉంది.' తన కన్నీళ్ల బాధను పంచుకుంది. కాగా..ఒకవేళ తాను థియేటర్‌కే పరిమితమైన ఉంటే.. బాగా సంపాదించగలిగితే సినిమాల్లోకి రాకపోవచ్చని ఆమె అన్నారు. భవిష్యత్తులో జీవనోపాధి పొందే పరిస్థితులు లేకుంటే.. నాకు ఇష్టం లేని పనులు చేయవలసి రావొచ్చని.. అలాంటి వారు చాలా మంది ఉన్నారని' ఆమె చెప్పింది. -
Cannes 2024: సన్నజాజి తీగలా సొట్ట బుగ్గల సుందరి (ఫొటోలు)
-
ఛాయాచిత్రం
హైస్కూల్, కాలేజీ రోజుల్లో నాటకాల్లో ఛాయా కదమ్ నటప్రతిభను మెచ్చుతూ ‘నువ్వు సినిమాల్లోకి వెళితే ఇక తిరుగు లేదు’ అన్నారు చాలామంది. కట్ చేస్తే... ‘అసలు నీకు నటన వచ్చా’ అని తిట్టాడు ఒక డైరెక్టర్. ఒక డైరెక్టర్ అయితే అసహనంతో కుర్చీని నేలకేసి కొట్టాడు. ఇలా ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. అయితే ఏరోజూ వెనకడుగు వేయలేదు.కట్ చేస్తే... ‘ఒక్క సీన్ అయినా ఫరవాలేదు’ అనుకునే స్థాయి నుంచి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’లో నటించే స్థాయికి చేరింది. ఈ చిత్రం కాన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ‘గ్రాండ్ ప్రి’ అవార్డ్ గెలుచుకొని చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ‘పార్వతి’ పాత్రలో నటనకు ప్రశంసలే కాదు అంతర్జాతీయ వేదికపై స్టాండింగ్ వొవేషన్ స్వీకరించింది ఛాయా కదమ్.ముంబై శివారులోని కలీనాలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది ఛాయ. తండ్రి ఓ మిల్లులో కార్మికుడు. స్కూలు రోజుల్లో కబడ్డీ బాగా ఆడేది. స్టేట్, నేషనల్ లెవెల్లో కూడా ఆడింది. ఆటలతో పాటు నటించడం అంటే కూడా ఇష్టం. హైస్కూల్, కాలేజీలో ఎన్నో నాటకాల్లో నటించింది. ఇంటర్మీడియెట్ ఫెయిల్ కావడంతో ‘ఫెయిల్యూర్’ అనేది తొలిసారిగా పరిచయం అయింది. ‘జయాపజయాలు జీవితంలో భాగం. ఫెయిల్యూర్ ఎదురైనా కుంగి΄ోనక్కర్లేదు. నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి సెకండ్ ఛాన్స్ ఉంటుంది అనే విషయం ఎప్పుడూ మరచి΄ోవద్దు’ అనే మాట ఛాయను ముందుకు నడిపించింది.‘టెక్స్టైల్ డిజైన్’ గ్రాడ్యుయేషన్ చేసినప్పటికీ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపింది. అయితే సినిమాల్లో అవకాశం రావడం నాటకాల్లో నటించినంత వీజీ కాదనే విషయాన్ని ఆమె త్వరగానే అర్థం చేసుకుంది. స్ట్రగుల్స్ తర్వాత... రాక రాక ఒక సినిమాలో అవకాశం వచ్చింది. అయితే ఆ సినిమా ఇప్పటికీ రిలీజ్ కాలేదు! ‘సినిమాల్లో నటించాలనుకునేవారికి నటప్రతిభతో పాటు బోలెడు ఓపిక ఉండాలి’ అనే మాటను మాత్రం ఎప్పుడూ మరచి΄ోలేదు ఛాయ.తొలి రోజుల్లో ‘వన్ సీన్’ పాత్రలలోనూ నటించింది. ఆ ఒక్క సీన్ కోసం లొకేషన్లో గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. అయితే ఎప్పుడూ ఓపిక కోల్పోలేదు. ‘ఒక్క సీన్ ఉంది. ఫలానా చోట షూటింగ్’ అని చెప్పేవారు. ΄÷ద్దున్నే లేచి ఆ ్రపాంతం చేరడానికి ్రపాణం మీదికి వచ్చేది. తీరా అక్కడికి వెళ్లాక... ‘ఈ రోజు షూటింగ్ క్యాన్సిల్’ అనే మాటను కూడా ఎన్నో సార్లు విన్నది. కొన్ని సినిమాల్లో మంచి పాత్రలు వచ్చినప్పటికీ డైరెక్టర్ల అహం భరించలేని స్థాయిలో ఉండేది. దుఃఖం ఆగేది కాదు. దుఃఖంలోనే ఉంటే ఆ సాగరంలో ‘నటన’ కొట్టుకు΄ోతుంది. అందుకని ఎంత బాధ అనిపించినా అప్పటికప్పుడు ఆ బాధ నుంచి బయట పడి డైరెక్టర్‌కు నచ్చేంత వరకూ నటిస్తూనే ఉండేది. ఆమె ఓపిక, కష్టం వృథా ΄ోలేదు. మరాఠీ, హిందీ సినిమాల్లో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. కాన్స్ రూపంలో అంతర్జాతీయ వేదికపై ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.శ్రామిక వర్గ బలంశ్రామిక వర్గ నేపథ్యం నుంచి వచ్చాను. నాన్న మిల్లు కార్మికుడు. అలా అని నేను ఎప్పుడూ ఎవరి నుంచి సానుభూతి ఆశించలేదు. అయితే నా నేపథ్యం నేను చేసిన అట్టడుగు, శ్రామిక వర్గ పాత్రలకు బలాన్ని ఇచ్చింది. నా పాత్రలకు అవసరమైన మెటీరియల్‌ను ఇచ్చింది.– ఛాయా కదమ్ -
ఆ ముగ్గురు మహిళలకు ధన్యవాదాలు: దర్శకురాలు పాయల్ కపాడియా
కాన్స్ చిత్రోత్సవాల్లో భారతదేశం చరిత్రలో చెప్పుకునేలా సత్తా చాటింది. ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ‘భారతీయ సినిమా’ కాన్స్‌లో మెరిసింది. తొలి గ్రాండ్ ప్రిక్స్ అవార్డును మన దేశ దర్శకురాలు పాయల్ కపాడియా తెచ్చారు. ప్రతిష్టాత్మక పియరీ ఏంజెనీ అవార్డును అందుకున్న తొలి ఏషియన్‌గా ఛాయాగ్రాహకుడు–దర్శక–నిర్మాత సంతోష్ శివన్ సగర్వంగా దేశానికి తిరిగొచ్చారు. ‘అన్సర్టైన్ రిగార్డ్’ విభాగంలో అనసూయ సేన్ గుప్తా ‘ది షేమ్‌లెస్’ చిత్రానికిగాను ఉత్తమ నటి అవార్డును దక్కించుకున్నారు.ఇదే విభాగంలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ సంధ్యా సూరి దర్శకత్వంలో రూపొందిన ‘సంతోష్’ ప్రదర్శితమైంది. కానీ అవార్డు దక్కించుకోలేకపోయింది. ఇక చిదానంద ఎస్. నాయక్ దర్శకత్వం వహించిన కన్నడ లఘు చిత్రం ‘సన్‌ఫ్లవర్స్ వేర్ ది ఫస్ట్ వన్స్ టు నో’ ‘లా సినిఫ్’ విభాగంలో మొదటి బహుమతి పొందింది. అలాగే ‘బన్నీ హుడ్’ అనే మరో భారతీయ యానిమేటెడ్ మూవీ మూడో బహుమతి సాధించింది. ఇలా ఈసారి 77వ కాన్స్ చిత్రోత్సవాల్లో భారతదేశం హవా కనిపించింది. మే 14న ఆరంభమైన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగిసింది. దర్శకురాలు పాయల్ కపాడియా అందుకున్న అవార్డు విశేషాలతో పాటు మరిన్ని విషయాలు ఈ విధంగా... కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ చిత్రం ‘ఆల్ వీయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ సినిమా సత్తా చాటింది.గ్రాండ్ ప్రిక్ విభాగంలో అవార్డు సాధించింది. కాన్స్ చిత్రోత్సవాల్లోని ఈ ప్రధాన విభాగంలో అవార్డు సాధించిన తొలి భారతీయ చిత్రంగా ‘ఆల్ వీయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ చరిత్ర సృష్టించింది. కాగా ఈ ఫెస్టివల్లో ప్రతిష్టాత్మక విభాగమైన పామ్ డి ఓర్ అవార్డుకు కూడా ‘ఆల్ వీయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ చిత్రం పోటీలో నిలిచినప్పటికీ, అవార్డును అందుకోలేకపోయింది. అయితే దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ విభాగంలో ‘ఆల్ వీయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ రూపంలో ఓ భారతీయ చిత్రం పోటీలో నిలవడం ప్రశంసించదగ్గ విషయం. ఇక పామ్ డి ఓర్ విభాగంలో దాదాపు ఇరవై సినిమాలను వెనక్కి నెట్టి, సీన్ బేకర్ దర్శకత్వం వహించిన కామెడీ డ్రామా ‘అనోరా’ అవార్డును ఎగరేసుకుపోయింది.‘గ్రాండ్ టూర్’ సినిమాకు గాను మిగ్యుల్ గోమ్స్ ఉత్తమ దర్శకుడిగా, ‘కైండ్స్ ఆఫ్ కైండ్‌నెస్’ సినిమాలోని నటనకు గాను జెస్సీ ప్లేమోన్స్ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. క్రైమ్ కామెడీ ఫిల్మ్ ‘ఎమిలియా పరేజ్’లో నటించిన అడ్రియానా పాజ్, కర్లా సోఫియా, సెలెనా గోమేజ్, జో సల్దానాలు ఉత్తమ నటీమణులుగా నిలిచారు. జాక్వెస్ డియార్డ్ నటించిన ఈ సినిమాకే జ్యూరీ ప్రైజ్ దక్కడం విశేషం. చిత్రోత్సవాల తొలి రోజు హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్, ఆ తర్వాత జపాన్‌కు చెందిన యానిమేషన్ స్టూడియో ‘స్టూడియో ఘిబ్లి’ ప్రతిష్టాత్మక పామ్ డి ఓర్ అవార్డు అందుకోగా చివరి రోజు హాలీవుడ్ దర్శక–నిర్మాత జార్జ్ లూకాస్ స్వీకరించారు.‘‘నిజానికి స్క్రిప్ట్ రాసేటప్పుడు కంగారుపడ్డాను. ఆ కంగారులో ఏదో రాశాను (నవ్వుతూ). మా సినిమాని ఇక్కడ వరకూ తీసుకొచ్చిన ‘కాన్స్’కి థ్యాంక్స్. దయచేసి మరో భారతీయ చిత్రం కోసం 30 ఏళ్లు వేచి ఉండొద్దు’’ అని అవార్డు అందుకున్న అనంతరం పాయల్ కపాడియా అన్నారు. వేదిక మీద ఉన్న ఈ మూవీలో నటించిన కనీ కస్రుతి, దివ్య ప్రభ, చాయా కదమ్లను ఆత్మీయంగా హత్తుకుని, ‘‘తమ సొంత సినిమాలా భావించి చేసిన ఈ ముగ్గురు మహిళలకు ధన్యవాదాలు’’ అన్నారు.ఇంకా ఈ చిత్ర నిర్మాతలు, భాగస్వాములు, ఇతర యూనిట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అది మాత్రమే కాదు... ఈ ఏడాది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ తొలి రోజు ఫెస్టివల్ వర్కర్లు మెరుగైన వేతనాలు డిమాండ్ చేస్తూ చేసిన నిరసనకు మద్దతు తెలిపారు. పాయల్ మళ్లీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ – ‘‘నేను తీసిన ఈ సినిమా ముగ్గురి మహిళల స్నేహం నేపథ్యంలో ఉంటుంది. అయితే మహిళలు ఎక్కువగా ఒకరికొకరు గోతులు తీసుకుంటారు.సమాజం అలానే చిత్రీకరించింది. అది దురదృష్టకరం. కానీ స్నేహం అనేది నాకు ముఖ్యమైన బంధం. ఎందుకంటే అది గొప్పతనానికి దారి తీస్తుంది. కలుపుగోలుతనాన్ని పెంచుతుంది. ఈ విలువలను కాపాడుకోవడానికి మనం ప్రయత్నిస్తుండాలి’’ అన్నారు. ఆమె అవార్డు తీసుకురావడం పట్ల భారత ప్రధాని మోదీ, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా హర్షం వ్యక్తం చేశారు.పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన తొలి ఫీచర్ ఫిల్మ్ ‘ఆల్ వీయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’. కని కస్రుతి, దివ్య ప్రభ, చాయా కదమ్ లీడ్ రోల్స్‌లో ఈ సినిమాను థామస్ హకీమ్, జూలియన్ గ్రాఫ్ నిర్మించారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ నెల 23న ఈ చిత్రం ప్రదర్శితమైంది. కాగా పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన తొలి ఫీచర్ ఫిల్మ్‌కే కాన్స్‌లోని ఓ ప్రధాన విభాగమైన గ్రాండ్ ప్రిక్ అవార్డు రావడం విశేషం.అయితే కాన్స్‌లో పాయల్ ప్రతిభ మెరవడం ఇదే తొలిసారి కాదు. 2021లో జరిగిన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ‘ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’ బెస్ట్ డాక్యుమెంటరీగా నిలిచింది. ఆ ఏడాది గోల్డెన్ ఐ అవార్డు పాయల్‌కు దక్కింది. అలాగే 2017లో జరిగిన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన షార్ట్ ఫిల్మ్ ‘ఆఫ్టర్ నూన్ క్లౌడ్’ ప్రదర్శితమైంది. ‘ఆల్ వీయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ కథ ఏంటంటే... కేరళ నుంచి ముంబైకి వెళ్లి నర్సులుగా పని చేస్తుంటారు ప్రభ (కని కస్రుతి), అను (దివ్య ప్రభ). భర్తతో విడిపోయిన ప్రభకు ఓ గిఫ్ట్ వస్తుంది. ఆ గిఫ్ట్‌ను ఆమె భర్త పంపిస్తాడు. దీంతో ప్రభకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు అను తన రిలేషన్షిప్లో ఇబ్బందులకు లోనవుతుంది. ఆ తర్వాత ఈ ఇద్దరూ రోడ్ ట్రిప్‌కు వెళితే ఏం జరిగింది? అన్నదే కథ. -
బ్యాన్ చేసిన వారే ఆమె టాలెంట్‌కు నివ్వెరపోయారు
డైరెక్టర్ పాయల్ కపాడియా... భారతీయ సినిమా గొప్పతనాన్ని కేన్స్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నటులందరూ అక్కడ అడుగుపెడితే చాలు అనుకుంటే భారత్‌కు చెందిన పాయల్ కపాడియా తన ప్రతిభతో అత్యుత్తమ అవార్డును సొంతం చేసుకుంది. 77వ కేన్స్ చలన చిత్రోత్సవంలో పాయల్ కపాడియా రూపొందించిన భారతీయ చిత్రం 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ద్వారా అత్యున్నత పురస్కారమైన 'గ్రాండ్ ప్రిక్స్'ను తాజాగా ఆమె సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా కూడా ఈ అవార్డును దక్కించుకోలేదు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఓ భారతీయ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కాంపిటీషన్లో నిలిచి అవార్డ్ దక్కించుకోవడంతో ఒక్కసారిగా చప్పట్లతో పాయల్ కపాడియాను అభినందించారు.విద్యాభ్యాసంముంబైలో జన్మించిన పాయల్ కపాడియా ఆంధ్రప్రదేశ్‌లోని రిషి వ్యాలీ స్కూల్లో ఇంటర్ వరకు చదివింది. ఆమె ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీ నుంచి ఆర్థికశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందింది. ఆమె సోఫియా కాలేజీలో ఒక సంవత్సరం మాస్టర్స్ డిగ్రీ చేసింది. ఆ తర్వాత, ఆమె ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII)లో ఫిల్మ్ డైరెక్షన్ కోర్సుని అభ్యసించిందిబ్యాన్ చేసిన వారే తన టాలెంట్‌కు ఫిదా అయ్యారుపాయల్ కపాడియాకు చదువుతో పాటు సినిమాలంటే చాలా ఆసక్తి. దీంతో ఆమె డైరెక్టర్‌గా అడుగుపెట్టాలని తపించింది. తన అభిమాన దర్శకులెందరో పుణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII)లో చదువుకున్నారని తెలిసి అక్కడే చేరాలని ఎంతో కష్టపడి 2015లో సీటు సాధించింది. అయితే ఆమెకు అక్కడ పలు సవాళ్లు ఎదురయ్యాయి. కళాశాల ఛైర్మన్‌గా ఉన్న ఒక నటుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం తనకు నచ్చలేదు. దీంతో వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడంతో పాటు తరగతులను కూడా బహిష్కరించింది. పాయల్ చేసిన పనికి ఆగ్రహించిన FTII ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆమెకు వచ్చే స్కాలర్షిప్ను కూడా రద్దు చేసింది. వారు ఎన్ని చేసినా ఆమె బెదరలేదు. చివరకు పాయల్‌పై ఎఫ్టీఐఐ కేసు కూడా పెట్టింది. నమ్మిన సిద్ధాంతాల కోసం ధైర్యంగా నిలబడింది. వాటిపై పోరాడుతూనే మరోపక్క చిత్ర నిర్మాణ కార్యక్రమాలను కూడా ప్రారంభించింది.పాయల్‌ను FTII బ్యాన్ చేసినా కూడా తన పోరాటం ఆగలేదు. 2017లో ఆమె డైరెక్ట్ చేసి షార్ట్‌ఫిల్మ్ 'ఆఫ్టర్నూన్ క్లౌడ్స్' కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది. అప్పుడు భారత్ నుంచి ఎంపికైన ఏకైక చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో ఆమె పేరు ఒక్కసారిగా ప్రపంచానకి తెలిసింది. తర్వాత అదే కళాశాల యాజమాన్యం ఆమె వద్దకు వచ్చింది. ఆమెపై ఉన్న ఆంక్షలను ఎత్తేసింది. ఆ సమయంలో విమాన టికెట్లు సహా ఖర్చులన్నీ విద్యాసంస్థే భరించి కేన్స్‌కు పంపింది.ఆ తర్వాత 2021లో 'ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్' పేరుతో తీసిన డాక్యుమెంటరీ కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అడుగు పెట్టింది. అప్పుడు 'గోల్డెన్ ఐ' అవార్డుని సొంతం చేసుకున్న పాయల్.. దేశం దృష్టినీ మరోసారి తనవైపు తిప్పుకొంది. ఇప్పటి వరకు ఆమె తీసిన ప్రతి సినిమా కూడా పలు అంతర్జాతీయ వేదికల మీదా అవార్డులను కొల్లగొట్టాయి. తాజాగా 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రతిష్ఠాత్మక పామ్ డి ఓర్ స్క్రీనింగ్ కాంపిటీషన్లో 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' చిత్రం ద్వారా 'గ్రాండ్ ప్రిక్స్' అవార్డును సొంతం చేసుకుంది. 30 ఏళ్ల క్రితం 'స్వహం' అనే సినిమా పామ్ డి ఓర్ స్క్రీనింగ్‌కి ఎంపికైంది. ఆ తర్వాత ఈ పోటీలో నిలిచిన భారతీయ సినిమా ఇదొక్కటే కావడం విశేషం. 34 ఏళ్ల పాయల్ జీవితం ఈతరం యువతకు ఆదర్శం. ఆమె డైరెక్ట్ చేసిన ప్రతి సినిమాలో కూడా కథకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈతరం అమ్మాయిల కలలు, ఆశయాలను ఆమె ఎంతో సున్నితంగా తెరకెక్కిస్తారు. తాజాగా అవార్డు అందుకున్న 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' చిత్రం కూడా కేరళకు చెందిన ఇద్దరు నర్సులు గురించి చెబుతుంది. -
కాన్స్‌లో అనసూయకు ఉత్తమ నటి అవార్డు
భారతీయ నటి అనసూయ సేన్ గుప్తా కాన్స్ చిత్రోత్సవాల్లో చరిత్ర సృష్టించారు. 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని ‘అన్సర్టైన్ రిగార్డ్’ విభాగంలో ‘ది షేమ్‌లెస్’ (2024) చిత్రంలోని నటనకు గాను ఆమె ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. ఈ విభాగంలో ఉత్తమ నటి అవార్డు అందుకున్న తొలి భారతీయ నటిగా అనసూయ సేన్ గుప్తా చరిత్రలో నిలిచిపోయారు. ఈ విభాగంలో దాదాపు పదిహేను మంది నటీమణులతో పోటీ పడి ఆమె అవార్డు దక్కించుకోవడం విశేషం.బల్గేరియన్ దర్శకుడు కాన్ట్సాంటిన్ బోజనవ్ ‘ది షేమ్‌లెస్’ సినిమాకు దర్శకత్వం వహించారు. ‘అన్సర్టైన్ రిగార్డ్’ విభాగంలోనే ‘ది స్టోరీ ఆఫ్ సోలమన్’ చిత్రంలోని నటనకుగాను బ్రూనో నాహోన్ ఉత్తమ నటుడిగా నిలిచారు. ఉత్తమ చిత్రంగా ‘బ్లాక్ డాగ్’ ఎంపికైంది. ఉత్తమ దర్శకులుగా రాబర్టో మినర్విని (ది డ్యామ్డ్), రంగనో న్యాని (ఆన్ బికమింగ్ ఎ గినీ ఫౌల్) అవార్డు అందుకున్నారు.కొత్త జీవితం... ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న అట్టడుగు వర్గాలవారు, వలసదారులు సమానత్వం కోసం పోరాటం చేసే పరిస్థితుల్లో ఉన్నందువల్ల పోరాటం చేస్తున్నారు. నిజానికి సమానత్వం కోసం పోరాడాలంటే వలసదారులు, అట్టడుగు వర్గాలవారే కానక్కర్లేదు. మనం మంచి మనుషులు అయితే చాలు’’ అంటూ అవార్డు స్వీకరించిన అనంతరం పేర్కొన్నారు అనసూయ సేన్ గుప్తా. అలాగే ‘‘నాకు కొత్త జీవితాన్నిచ్చిన కాన్స్‌కు ప్రస్తుతానికి గుడ్ బై... కృతజ్ఞతలు’’ అని తన ఇన్‌స్టా స్టోరీలోనూ ఆమె షేర్ చేశారు. ‘ది షేమ్‌లెస్’ కథేంటంటే... ఢిల్లీలోని ఒక వ్యభిచార గృహంలో పోలీసును హత్య చేస్తుంది వేశ్య రేణుక. ఆ తర్వాత మరో రాష్ట్రంలోని సెక్స్ వర్కర్ల కమ్యూనిటీలో ఆశ్రయం ΄÷ందుతుంది. అక్కడ పదిహేడేళ్ల వయసులో ఉన్న దేవిక అనే అమ్మాయితో రేణుక ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత రేణుక, దేవికల జీవితాలు ఎలా మారాయి? ఇద్దరూ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? అన్నదే ‘ది షేమ్‌లెస్’ కథాంశం. ఈ చిత్రంలో రేణుక పాత్రలో అనసూయ సేన్, దేవికగా ఒమరా శెట్టి నటించారు. జర్నలిస్ట్ అవ్వాలనుకుని నటిగా... అనసూయ సేన్ గుప్తా స్వస్థలం కోల్‌కతా. జాదవ్‌పూర్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ లిటరేచర్‌లో డిగ్రీ పూర్తి చేశారామె. జర్నలిజంను వృత్తిగా ఎంచుకోవాలనుకున్నారు. కానీ ఆమె యాక్టర్ అయ్యేలా పరిస్థితులు మారాయి. 2009లో విడుదలైన బెంగాలీ మ్యూజికల్ ఫిల్మ్ ‘మ్యాడ్లీ బెంగాలీ’ అనసూయ సేన్ గుప్తాకు నటిగా తొలి చిత్రం. అంజన్ దత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె ఓ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా విడుదల తర్వాత 2013లో అనసూయ ముంబైకి చేరుకున్నారు.ఆమె సోదరుడు అభిషేక్ సేన్ గుప్తా బాలీవుడ్లో దర్శకత్వ విభాగంలో ఉన్నారు. ఎంతో ప్రయత్నించినప్పటికీ నటిగా సరైన అవకాశాలు రాకపోవడంతో ‘సాట్ ఉచక్కీ, రే, మసాబా మసాబా’ వెబ్ వంటి సిరీస్‌లకు ్ర΄÷డక్షన్ డిజైన్, సెట్ డిజైనింగ్ విభాగాల్లో పని చేశారామె. ఆ తర్వాత కరోనా టైమ్‌లో 2020 జూన్‌లో ‘ది షేమ్‌లెస్’ సినిమాకు ఆడిషన్స్ ఇచ్చారు అనసూయ. అది నచ్చి, దర్శకుడు కాన్ట్సాంటిన్ బోజనవ్ ఆమెను లీడ్ రోల్‌కి ఎంచుకున్నారు. సంతోష్ శివన్‌కు ప్రతిష్టాత్మక పియర్ అవార్డు...రెట్రో ఫోకస్, మోడ్రన్ లెన్స్‌ను కనుగొన్న ఫ్రెంచ్ శాస్త్రవేత్త పియర్ ఏంజెనీకి నివాళిగా 2013 నుంచి ఆయన పేరిట ఓ అవార్డును నెలకొల్పి సినిమాటోగ్రాఫర్లకు అందిస్తున్నారు కాన్స్ చిత్రోత్సవాల నిర్వాహకులు. ఈ ఏడాది ఈ అవార్డును భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుడు సంతోష్ శివన్ అందుకున్నారు. ఈ చిత్రోత్సవాల్లో పాల్గొన్న ప్రముఖ నటి ప్రీతీ జింతా ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డు అందుకున్న తొలి ఏషియన్ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్నే కావడం విశేషం. ఈ సందర్భంగా కాన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు సంతోష్. దర్శక–నిర్మాతగా..మలయాళ ‘నిధియుడె కథ’ (1986) ఛాయాగ్రాహకుడిగా సంతోష్ శివన్‌కి తొలి చిత్రం. ఆ తర్వాత పలు మలయాళ చిత్రాలకు కెమెరామేన్‌గా చేసిన ఆయన ‘దళపతి, రోజా, తుపాకీ’ వంటి తమిళ చిత్రాలకు, హిందీ ‘దిల్ సే’, తెలుగు ‘స్పైడర్’ తదితర చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా చేశారు. దర్శకుడిగా సంతోష్ తెరకెక్కించిన చిత్రాల్లో హిందీలో ‘ముంబైకర్, తహాన్, మలయాళంలో ‘ఉరుమి’ వంటివి ఉన్నాయి. 35ఏళ్లకు పై బడిన కెరీర్లో ఛాయాగ్రాహకుడిగా, దర్శక– నిర్మాతగా సంతోష్ శివన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. -
కేన్స్ 2024: బాలీవుడ్ హీరోయిన్ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా!
భారతీయులు సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తుంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. కలలు నెరవేరినప్పుడు ఎంత సంతోషపడతారో అందుకు తోడ్పడినవారికి కృతజ్ఞతలు చెప్పేందుకు అంతే ముందుంటారు. ఆ ఆశయాన్ని సాధించడం ఎంతో గౌరవంగా భావిస్తారు. తాజాగా అవనీత్ కూడా ఒకింత సంతోషంగా మరింత గర్వంగా ఉంది.ఎర్ర తివాచీపై వయ్యారంగా..తొలిసారి ఆమె కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొంది. ఫ్రాన్స్‌లో జరుగుతున్న 77వ కేన్స్ చలనచిత్రోత్సవాలలో రెడ్ కార్పెట్‌పై నడిచింది. మే 23న ఎర్ర తివాచీపై వయ్యారంగా నడిచింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ఈ ముద్దుగుమ్మ తనకు ఇంత గొప్ప అవకాశం వచ్చినందుకుగానూ నేలకు నమస్కరించి తర్వాత అక్కడ రెడ్ కార్పెట్‌పై హొయలు పోయింది. అచ్చమైన భారతీయురాలుఇది చూసిన జనాలు ఆమెను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. తన కలలు నెరవేరాయి. ఆమె కష్టాన్ని మనం తప్పకుండా గుర్తించి తీరాల్సిందే.. నేలకు నమస్కరించి తను ఒక అచ్చమైన భారతీయురాలు అని నిరూపించింది అని కామెంట్లు చేస్తున్నారు. కాగా మర్దాని సినిమాతో వెండితెరపై ప్రయాణం మొదలుపెట్టిన అవనీత్ బ్రూనీ, ఏక్తా, చిడియాఖన్నా, టికు వెడ్స్ షెరు వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె లవ్ కీ అరేంజ్ మ్యారేజ్, లవ్ ఇన్ వియత్నాం సినిమాలు చేస్తోంది. View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) చదవండి: కేన్స్‌లో రికార్డ్ క్రియేట్ చేసిన ఇండియన్ నటి.. తొలిసారి దక్కిన అవార్డ్ -
కేన్స్‌లో రికార్డ్ క్రియేట్ చేసిన ఇండియన్ నటి.. తొలిసారి దక్కిన అవార్డ్
ఫ్రాన్స్‌లో జరుగుతున్న 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ నటి అనసూయ సేన్‌గుప్తా చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డును అందుకునున్న తొలి భారతీయ నటిగా ఆమె రికార్డ్ క్రియేట్ చేసింది. 'అన్ సర్టెయిన్ రిగార్డ్' విభాగంలో ఉత్తమ నటి అవార్డును ఆమె సొంతం చేసుకుంది.బల్గేరియన్ చిత్రనిర్మాత కాన్స్టాంటిన్ బోజనోవ్ దర్శకత్వం వహించిన 'షేమ్‌లెస్' చిత్రంలో ఆమె పాత్రకు గాను ఈ అవార్డు లభించింది. ఢిల్లీలోని ఓ వేశ్యాగృహం నుంచి పోలీసులను కత్తితో పొడిచి పారిపోయిన 'రేణుక' అనే ఒక వేశ్య జీవిత ప్రయాణాన్ని ఇందులో చిత్రీకరించారు. కోల్‌కతాకు చెందిన అనసూయ సేన్‌గుప్తా వేశ్య పాత్రలో తన నటనతో మెప్పించింది. తాజాగా జరుగుతున్న కేన్స్ వేడుకల్లో 'షేమ్‌లెస్' చిత్రాన్ని ప్రదర్శించగా ఉత్తమ నటిగా ఆమె అవార్డు దక్కింది.అనసూయ సినిమా రంగంలో ఉన్నప్పటికీ వెండితెరపై కనిపించలేదు. ముంబైలో ప్రొడక్షన్ డిజైనర్‌గా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం గోవాలో అనసూయ సేన్‌గుప్తా నివసిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ షో 'మసబా మసబా' చిత్రాన్ని నిర్మించడంలో ఆమె కీలకపాత్ర పోషించింది. బెంగాలీ దర్శకుడు అంజన్ దత్ నిర్మించిన రాక్ మ్యూజికల్ మ్యాడ్లీ బెంగాలీ (2009)లో ఆమె తొలిసారిగా నటించింది. ఆ తర్వాత ఆమె నటనకు దూరమైంది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ అంజన్ దత్ సాయంతోనే షేమ్‌లెస్ చిత్రంలో కనిపించి ఉత్తమ నటిగా అవార్డ్‌ను సొంతం చేసుకోవడం విశేషం. ఈ సినిమాలో వేశ్యగా 'రేణుక' పాత్రలో అనసూయ సేన్‌గుప్తా మెప్పించింది. వేశ్యగా జీవిస్తున్న ఆమెకు సమాజంలో ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొందో ఈ చిత్రం చూపుతుంది. -
కేన్స్‌లో మెరిసిన హైదరాబాదీ బ్యూటీ
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఒక్కసారి అయినా ఆ రెడ్ కార్పెట్‌పై నడవాలని ప్రతి హీరోయిన్‌కు కోరిక ఉంటుంది. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా కొనసాగుతోంది. మరికొన్ని గంటల్లో ఈ వేడుకలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన హీరోయిన్లు, డిజైనర్లు కేన్స్ రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. అయితే తాజాగా అదితిరావు హైదరి మెరిసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.హైదరాబాదీ ముద్దుగుమ్మ అదితిరావు హైదరి కేన్స్ రెడ్ కార్పెట్‌పై అదిరిపోయే లుక్‌లో కనిపించింది. హాఫ్ షోల్డర్ వైట్ అండ్ బ్లాక్ ఔట్ఫిట్తో ఆమె సందడి చేశారు. ప్యాషన్ ప్రపంచం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే కేన్స్ వేడుకల్లో ఇప్పటికే ఐశ్వర్యరాయ్, శోభిత ధూళిపాళ, ఊర్వశీ రౌతేలా, కియారా అద్వానీ లాంటి తారలు తళుక్కున మెరిసి ఆకర్షించారు. వైట్ అండ్ బ్లాక్ ఔట్ఫిట్తో ఆ రెడ్ కార్పెట్‌పై అదితిరావు హైదరి నడుస్తుంటే అక్కడ కెమెరామెన్లతో పాటు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ నటించిన హీరామండి వెబ్ సిరీస్ మంచి టాక్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకుపోతుంది. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్‌లో ఆమె గూడఛారిగా మెప్పించింది. -
Cannes 2024: కన్నడ జానపదానికి కాన్స్ బహుమతి
దక్షిణ భారత జానపద కథ కాన్స్ మొదటి బహుమతి గెలుచుకుంది. కోడి కూయకూడదని ఒక అవ్వ పుంజును దొంగిలిస్తే ఆ ఊళ్లో తెల్లారదు. తర్వాత ఏమవుతుందనేది 15 నిమిషాల షార్ట్ఫిల్మ్గా తీశాడు పూణె ఇన్స్టిట్యూట్ చిదానంద నాయక్. ప్రపంచవ్యాప్తంగా 2263 ఎంట్రీలు వస్తే చిదానంద తీసిన ‘సన్‌ఫ్లవర్స్’కు మొదటి బహుమతి వచ్చింది. ఈ ఘనత సాధించిన చిదానంద పరిచయం.మారుమూల చిన్న పల్లెటూరు. ప్రతి ఉదయం కోడి కూయగానే తెల్లారుతుంది. ఆ రోజు కోడి కూయలేదు. తెల్లారలేదు. చీకటి. ఎక్కడ చూసినా చీకటి. సూర్యుడు ఎందుకు రావడం లేదు? కోడి కూయడం లేదు. కోడెందుకు కూయడం లేదు? ఊళ్లోని అవ్వ దానిని దొంగిలించి దాచేసింది. దేవుడా... పదండి కోడిని వెతకండి. ఊరంతా బయలుదేరింది. లాంతర్లు పట్టుకుని తలోదిక్కు. అంతేనా? దీనికంతటికీ కారణమైన అవ్వ కుటుంబాన్ని వెలేసింది. కోడి దొరక్క΄ోయినా అవ్వ కనపడక΄ోయినా ఆ ఊరిలో సూర్యుడు వచ్చేలా లేడు. తర్వాత ఏమైంది?చిదానంద నాయక్ తీసిన ‘సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్వన్స్ టు నో’ (΄÷ద్దు తిరుగుడు పూలకే మొదట తెలుస్తుంది) షార్ట్‌ఫిల్మ్ చూడాలి. 15 నిమిషాల ఈ షార్ట్‌ఫిల్మ్‌కు కాన్స్ ఫెస్టివల్లో ‘లే సినే’ విభాగంలో ఈ ప్రతిష్టాత్మక బహుమతి దక్కింది.ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థుల కోసం...ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లలో చదివే విద్యార్థులను ్ర΄ోత్సహించేందుకు కాన్స్ ఫెస్టివల్లో ‘లే సినే’ విభాగం ఉంటుంది. దీనికి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు గంట నిడివి లోపు ఉన్న షార్ట్‌ఫిల్మ్స్‌ను ఎంట్రీగా పంపవచ్చు. జ్యూరీ వీటిని పరిశీలించి ఫస్ట్, సెకండ్, థర్డ్ బహుమతులు ఇస్తుంది. ఈసారి మొత్తం 555 ఫిల్మ్ స్కూల్స్ నుంచి 2263 ఎంట్రీలు వస్తే మొదటి ప్రైజ్ చిదానంద తీసిన ‘సన్‌ఫ్లవర్స్’కు దక్కింది. దాదాపు పదమూడున్నర లక్షల ప్రైజ్‌మనీ ఇస్తారు. ఇది సామాన్యవిషయం కాదు. మన దక్షిణాది జానపదానికి దక్కిన గౌరవం కింద లెక్క.దర్శకుడైన డాక్టర్చిదానంద నాయక్ది కర్ణాటక. చిన్నప్పటి నుంచి అకిరా కురసావా సినిమాలు చూస్తూ పెరిగాడు. సినిమా దర్శకుడు కావాలని ఉన్నా మెడిసిన్ చదవాల్సి వచ్చింది. ‘ఒక డాక్టర్‌గా అతి దగ్గరి నుంచి జననాన్ని, మరణాన్ని చూడటం నాకు మానవ జీవనసారాన్ని తెలిపింది. ఒక వైద్యుడిగా జీవించడమంటే క్షణంలో ఆనందం క్షణంలో దుఃఖాన్ని చూడటమే. మనుషుల మకిలి లేని నిజాయితీని ఆ సమయంలోనే చూస్తాం’ అంటాడు చిదానంద. డాక్టరయ్యాక కూడా మనసు సినిమా రంగంలోనే ఉన్నట్టు అర్థమయ్యి పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాడు.నాలుగు రోజుల్లో షూట్:‘సన్‌ఫ్లవర్స్’ షార్ట్‌ఫిల్మ్‌ను తన సంవత్సరాంత అభ్యాసంగా తీశాడు చిదానంద. ‘మా ఇన్స్టిట్యూట్కు 50 కిలోమీటర్ల దూరం లోపల షార్ట్‌ఫిల్మ్ తీయాలని నియమం. ఆ దూరంలోనే ఒక లోపలి పల్లెలో షూట్ చేశాం. నాలుగు రోజుల్లోనే తీయమని చె΄్పారు. కథంతా రాత్రే కాబట్టి నాలుగు రాత్రులు ఒళ్లు హూనం చేసుకుని పని చేశాం’ అని తెలి΄ాడు. పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులే– సూరజ్ (సినిమాటోగ్రఫీ), మనోజ్ (ఎడిటింగ్) సాంకేతిక శాఖలు నిర్వర్తించారు.నీ కోడి కూయక΄ోతే...‘నీ కోడి కూయక΄ోతే తెల్లారదా?’ అనేది లోకోక్తి. అంటే ఎదుటి వారంటే లెక్కలేక΄ోవడం, ఏదైనా లెక్క చేయకుండా ఉండటం ఈ మాటలో ఉంది. కాని ఈ జానపద కథ ప్రతి వ్యక్తి, ప్రతి అనుభవం, ప్రతి మేల్కొలుపు కూడా ముఖ్యమే అని చెబుతుంది. దేనినీ మర్చి΄ోకూడదని, నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తుంది. ‘మా కర్నాటకలో ప్రతి చిన్నపిల్లవాడికి ఈ కథ తెలుసు. దానిని షార్ట్ఫిల్మ్గా తీయడం, ఈ ప్రతిష్టాత్మక బహుమతి రావడం సంతోషంగా ఉంది’ అంటున్నాడు చిదానంద. -
భారత టాలెంట్ సరిహద్దులు దాటుతోంది: రాజమౌళి
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి వారిపై ప్రశంసలు కురిపించారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-2024లో బెస్ట్ షార్ట్ ఫిల్మ్‌గా ఇండియాకు చెందిన చిత్రం ఎంపిక కావడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 'సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో' చిత్రబృందాన్ని అభినందించారు. ఈ మేరకు తన ట్విటర్ ద్వారా వారికి శుభాకాంక్షలు తెలిపారు.రాజమౌళి తన ట్వీట్లో రాస్తూ..'భారతీయ ప్రతిభ సరిహద్దులను దాటుతోంది. ఇది వినడానికి చాలా సంతోషంగా ఉంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్- 2024లో ఉత్తమ షార్ట్ ఫిల్మ్‌గా లా సినీఫ్ అవార్డును గెలుచుకున్న సందర్భంగా ‘సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ ఒన్స్ టు నో’ రూపొందించిన యువతకు ఇవే నా వందనాలు' అంటూ పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఈ షార్ట్ ఫిల్మ్ తీసిన చిదానంద నాయక్‌ను ట్యాగ్ చేశారు.కాగా.. చిదానంద తెరకెక్కించిన సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో షార్ట్ ఫిల్మ్ కేన్స్‌లో అరుదైన ఘనత సాధించింది. వివిధ భాషలకు చెందిన 17 చిత్రాలతో పోటీ పడి తొలి స్థానంలో నిలిచింది. 16 నిమిషాలు ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్‌ను ఓ కన్నడ జానపద కథ ఆధారంగా రూపొందించారు. వృద్ధురాలి కోడిని ఎవరో దొంగలించడం.. దానిని కనుగొనడం కోసం ఆమె పడే తపనను ఈ చిత్రంలో చూపించారు. ఇప్పుడీ షార్ట్ ఫిల్మ్ హాలీవుడ్‌తో పోటీ పడి మొదటి బహుమతి గెలుచుకోవడంపై చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసింది. Indian talent breaching boundaries… Happy to hear that @Chidanandasnaik’s ‘Sunflowers Were the First Ones to Know’ has won the La Cinef Award for Best Short Film at Cannes 2024!Kudos to the youngsters 👏🏻👏🏻— rajamouli ss (@ssrajamouli) May 24, 2024 -
కేన్స్‌లో ఇండియన్ సినిమాకు మొదటి బహుమతి
ఫ్రాన్స్‌లో 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా కొనసాగుతున్నాయి. యావత్తు సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చిత్రోత్సవాలు మే 25న ముగియనున్నాయి. ప్రతిష్ఠాత్మక కేన్స్ చిత్రోత్సవాల్లో భారత్‌కు చెందిన 'సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో' షార్ట్‌ఫిలిం సత్తా చాటింది. 2024కు గాను ఉత్తమ షార్ట్‌ఫిలిం బహుమతిని సొంతం చేసుకుంది.చిదానంద S నాయక్ తెరకెక్కించిన 'సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో' అనే చిత్రం వివిధ భాషలకు చెందిన 17 చిత్రాలతో పోటీ పడి మొదటి బహుమతి అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా 555 ఫిల్మ్ స్కూల్స్ నుంచి 2,263 మంది దరఖాస్తుదారులు ఇందులో పోటీ పడ్డారు. 16 నిమిషాల పాటు నిడివితో ఉన్న ఈ షార్ట్ ఫిలింను కన్నడ జానపద కథ ఆధారంగా తెరకెక్కించారు.ఇదే విభాగంలో బన్నీహుడ్' అనే UK చిత్రానికి మూడో బహుమతి లభించింది. ఈ చిత్రాన్ని మీరట్‌లో జన్మించిన భారతీయ చిత్రనిర్మాత మహేశ్వరి రూపొందించడం విశేషం. మే 23న ఈ అవార్డుల కార్యక్రమం జరిగింది. ఉత్తమ షార్ట్ ఫిలిం అవార్డును గెలుచుకున్న టీమ్‌కు 15,00 యూరోలు, మూడో స్థానానికి 7,500 యూరోలు అందించారు. ఈ రెండు షార్ట్ ఫిలిం టీమ్‌కు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Festival de Cannes (@festivaldecannes) -
ఎంటర్ప్రెన్యూర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన లాయర్! ఏకంగా ఆరుసార్లు కేన్స్..!
ఓ మహిళ ఒక తల్లిగా, వ్యాపారవేత్తగా, మోడల్‌గా రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. లాయర్ నేపథ్యం నుంచి పూర్తి విరుద్ధ రంగంలో తనదైన శైలిలో దూసుకుపోతోంది. అంతేగాదు ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అద్భుతమైన డిజైనర్ డ్రెస్‌లో మెరిసింది. ఇంతకీ ఎవరంటే ఆమె..దక్షిణాసియా ఇన్ఫ్లుయెన్సర్, మహిళా వ్యాపార వేత్త అయిన దీపా బుల్లెర్ ఖోస్లా శక్తిమంతమైన మహిళ. విభిన్న రంగాల్లో దూసుకుపోతూ కూడా ఓ తల్లిగా సమర్థవంతంగా బాధ్యతలను నిర్వహిస్తోంది. ఆమె కంటెంట్ క్రియేటర్‌గా, సామాజకి కార్యకర్తగా విధులు నిర్వర్తిస్తూనే వ్యాపార రంగంలో ప్రభంజనం సృష్టిస్తోంది. అంతేగాదు ముంబై ఆమ్స్టర్డామ్ ఆధారిత ఎంటర్‌ప్రెనూర్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 2.1 మిలియన్ ఫాలోవర్స్‌ని కలిగి ఉంది. మరోవైపు అందం, ఫ్యాషన్‌కి సంబంధించిన వ్యాపార రంగాలను విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇక ఫ్రాన్స్‌లో అట్టహాసంగా జరుగుతున 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ప్రఖ్యాత డిజైనర్ వాల్డ్రిన షైతీ షెల్ఫ్ రూపొందించిన మెటాలిక్ స్ట్రక్చర్డ్ డ్రెస్‌లో గ్లామరస్‌గా కనిపించింది. ముఖ్యంగా ఆమె డిజైనర్ డ్రెస్ ముందుభాగంలో ఉన్న లోహ గులాబీ హైలెట్‌గా నిలిచింది. అందుకు తగ్గట్లుగా బాబ్ స్టైల్ హెయిర్ మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి ఆమెకు. ఈ ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఈవెంట్లో తన అత్యాధుని ఫ్యాషన్ డిజైనర్‌వేర్ డ్రెస్‌తో అందర్నీ మెస్మరైజ్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలకు "బ్యాక్ ఎట్ ది కార్పెట్ అట్ ఆల్ స్టార్ట్... హోమ్‌కమింగ్ @festivaldecannes" అనే క్యాప్షన్ తోపాటు హార్ట్ ఎమోజీని జోడించి మరీ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. ఐతే ఆమె ఈ కేన్స్ ఈవెంట్లో గత ఆరేళ్లుగా పాల్గొంటుందట. ఆమె నేపథ్యం..దక్షిణాసియా ఇన్ఫ్లుయెన్సర్ తన పాఠశాల విద్యను ఊటీలో పూర్తి చేసింది. తల్లి డాక్టర్ కావడంతో తాను కూడా అదే వృత్తిలో ఉండాలనుకుంది. ఐతే ఇంటర్నషిప్లో తన ఆలోచనను మార్చుకున్నట్లు పేర్కొంది. ఆ తర్వాత అంతర్జాతీయ మానవ హక్కుల చట్టంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి అయిన వెంటనే నెదర్లాండ్స్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టోలో న్యాయవాదిగా పనిచేసింది. తదనంతరం లండన్‌లోని యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు, ఐఎంఏ ఇన్ఫ్లుయెన్సర్ ఏజెన్సీలో ఇంటర్న్‌షిప్ చేసింది. అయితే ఎంతోకాలం న్యాయవాద వృత్తిలో కొనసాగలేదు. మళ్లీ డిజట్ కంటెంట్ క్రియెటర్‌గా కెరీర్‌గా ఎంచుకుని మరీ దూసుకుపోయింది. ఇక 2022లో తన బ్యూటీ బ్రాండ్ ఇండెవైల్డ్ను ప్రారంభించింది. తన తల్లి నుంచి ప్రేరణ పొందిన ఆయుర్వేదం బ్రాండ్‌లో పాతుకుపోయింది. చర్మ రక్షణలో ప్రామాణిక ఉత్పత్తులే బెటర్ అని భావించి ఇటువైపు దృష్టి సారించి వ్యాపారవేత్తగా మారింది. 32 ఏళ్ల దీపా తన భర్త డచ్ దౌత్యవేత్త ఒలేగ్ బుల్లెర్తో కలిసి లాభప్రేక్షలేని పోస్ట్ ఫర్ చేంజ్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసింది. ఇది లింగ సమానత్వంపై యూఎస్ UN సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించిన ముఖ్యమైన సమస్యలను పరిష్కరించేందుకు సోషల్ మీడియా శక్తిని వినియోగించుకుంటుంది. ఇన్ని రంగాల్లో రాణిస్తూ బిజీగా ఉన్న కుటుంబం కోసం కూడా కొంత సమయాన్ని కేటాయిస్తుంది. ముఖ్యంగా దీపాకి నాలుగేళ్ల కూతురు దువాతో స్పెండ్ చేయడం మహా ఇష్టం. "సహనానికి ప్రాధాన్యత ఇస్తూ.. ప్రతీది వెంటనే చేయనవసరం లేదని, అలా అని ప్రతి అడుగు వెనక్కి వేసి బ్రేక్ తీసుకోవడం కూడా సరైనది కాదు" అంటుంది దీపా. తన కలలన్నింటిని సాకారం చేసుకుంటూ విజయవంతంగా దూసుకుపోవతూ.. ఎందరో మహిళా పారిశ్రామికవేత్తలందరికీ ఆదర్శంగా నిలిచింది దీపా బుల్లెర్ ఖోస్లా . View this post on Instagram A post shared by Diipa Büller-Khosla (@diipakhosla) (చదవండి: 800 ఏళ్ల నాటి వ్యాయామం..దెబ్బకు ఒత్తిడి, అలసట మాయం!) -
అమ్మ మరణం... ఆమె ఆఖరి కోరిక నెరవేర్చిన ప్రముఖ నటి
మొన్నీ మధ్య 'లాపతా లేడీస్' అనే ఓ సినిమా వచ్చింది. థియేటర్లలో కంటే ఓటీటీలో బాగా ఆదరణ దక్కించుకుంది. ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో మంజు మై అనే పాత్రలో ఆకట్టుకున్న ఛాయా కదమ్ అనే నటి.. ఇప్పుడు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొంది. ఈ క్రమంలోనే ఈమె ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు అందరినీ ఎమోషనల్ చేస్తోంది.(ఇదీ చదవండి: నిర్మాత మోసం.. నిజాలు బయటపెట్టిన హీరోయిన్ నమిత)2009 నుంచి ఛాయా కదమ్ ఇండస్ట్రీలో ఉంది. 'లాపతా లేడీస్'తో దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకుంది. ఈమె నటించిన మలయాళ మూవీ 'ఆల్ వుయ్ ఇమేజిన్ యాజ్ లైట్' సినిమా, కేన్స్ చిత్రాత్సవంలో స్క్రీనింగ్ చేయనున్నారు. ఇందులో భాగంగా ఫ్రాన్స్ వెళ్లిన ఈమె.. చనిపోయిన తల్లి చీర, ముక్కు పుడక పెట్టుకుని వేడుకలో పాల్గొంది.ఈ మేరకు తల్లికి సంబంధించిన గోల్డ్ కలర్ శారీ, ముక్కు పుడకతో కనిపించిన ఛాయా కదమ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. బతికుండగా తన తల్లిని విమానం ఎక్కించాలనుకున్నానని, కానీ ఇప్పుడు కేన్స్‌లో ఆమె చీర కట్టుకోవడం చాలా బాగుందని, ఇలా తన తల్లి కోరిక నెరవేరిందని భావోద్వేగానికి గురైంది.(ఇదీ చదవండి: సింపుల్‌గా పెళ్లి చేసుకున్న యంగ్ డైరెక్టర్.. అమ్మాయి ఎవరంటే?) View this post on Instagram A post shared by Chhaya Kadam (@chhaya.kadam.75) -
బయోపిక్‌లో భార్య రేప్ సీన్.. షాకైన కేన్స్ ఆడియెన్స్
కేన్స్ ఫిల్స్ ఫెస్టివల్ 2024లో ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రముఖ వ్యాపారదిగ్గజం.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బయోపిక్ ‘ది అప్రెంటైస్’ అందుకు కారణం. సినిమా మట్టుకు అద్భుతంగా ఉందంటూ 8 నిమిషాలపాటు స్టాండింగ్ ఒవేషన్ దక్కినప్పటికీ.. ట్రంప్ పర్సనల్ లైఫ్‌లోని కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.తన మాజీ భార్య ఇవానా(దివంగత)పై ట్రంప్ అత్యాచారం చేసినట్లు ఈ చిత్రంలో ఒక సీన్ ఉంది. ఆ సన్నివేశం కేన్స్ ఆడియొన్స్‌ను ఒక్కసారిగా బిత్తరపోయేలా చేసింది. అంతేకాదు.. ఈ సినిమా ద్వారా బయటి ప్రపంచానికి తెలియని ట్రంప్ వ్యక్తిగత జీవితాన్ని చూపించిందని చిత్రాన్ని వీక్షించిన విశ్లేషకులు చెబుతున్నారు. సినిమా కేవలం 70, 80 దశకాల్లో కేవలం ట్రంప్ వ్యాపార జీవితాన్నే ప్రముఖంగా ప్రస్తావించినప్పటికీ.. ట్రంప్ టవర్ వేదికగా జరిగిన కొన్ని చీకటి విషయాల్ని చూపించిందని అంటున్నారు. దావాకు రెడీమరోవైపు ఈ చిత్రం తన అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడుతుందని భావించిన ట్రంప్‌కు.. పెద్ద షాకే ఇచ్చింది. దీంతో ఈ చిత్రంపై దావా వేసేందుకు సిద్ధం అయ్యారాయన. ‘‘ ఈ చిత్రం(ది అప్రెంటైస్) ఒక చెత్త. కల్పిత కథనాలతో సంచలనంగా.. చర్చనీయాంశంగా మారడానికి ప్రయత్నించారు. ఈ చిత్రంపై దావా వేయబోతున్నాం’’ అని ట్రంప్ టీం ఒక అధికారిక ప్రకటక విడుదల చేసింది.ట్రంప్ ఆశ్చర్యపోతారేమో: డైరెక్టర్ అబ్బాసీఅయితే ట్రంప్ టీం దావా బెదిరింపులపైనా చిత్ర డైరెక్టర్ అలీ అబ్బాసీ స్పందించారు. డొనాల్డ్ టీం తప్పకుండా ఈ చిత్రం చూడాలని. ఆ తర్వాతే దావా వేయడం గురించి మాట్లాడాలని అంటున్నారు. అంతేకాదు ట్రంప్ సైతం ఈ చిత్రం చూసి ఆశ్చర్యపోతారే తప్ప నచ్చకపోవడం లాంటిది జరగకపోవచ్చు ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ప్రతీ ఒక్కరూ ఆయన ఫలానా వాళ్ల మీద దావా వేస్తున్నారనే చర్చ జరుపుతుంటారు. కానీ, ఆయన ఎలా సక్సెస్ అయ్యారు? వ్యాపారంలో ఆ స్థాయికి ఎలా ఎదిగారన్నది పట్టించుకోరు. ఈ చిత్రం చూస్తే వాళ్లకే అర్థమవుతుంది. బహుశా ట్రంప్ కూడా ఈ చిత్రాన్ని మెచ్చుకోవచ్చు’’ అని అబ్బాసీ అన్నారు.ది అప్రెంటిస్ చిత్రంలో ట్రంప్ పాత్రను నటుడు సెబాస్టియన్ స్టాన్(మార్వెల్ చిత్రాల ఫేమ్) పోషించగా.. ట్రంప్ వ్యక్తిగత లాయర్ జెర్మీ స్ట్రాంగ్ పాత్రలో రోయ్ కోన్, ఇవానా ట్రంప్ రోల్లో మరియా బాకాలోవా నటించారు. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మే 20వ తేదీన చిత్రాన్ని ప్రదర్శించారు. అయితే అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాదిలోనే రిలీజ్ కావాల్సి ఉండగా.. అధికారిక తేదీని ఇంకా ప్రకటించలేదు. -
ఆనందం.. ఉద్వేగం...
30న హైదరాబాద్‌లో ‘కన్నప్ప’ టీజర్... శివభక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. విష్ణు మంచు టైటిల్ రోల్లో ముఖేష్ కుమార్ దర్శకత్వంలో మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. కాన్స్ చిత్రోత్సవాల్లో ‘కన్నప్ప’ ప్రీమియర్ టీజర్‌ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో విష్ణు మంచు, మోహన్‌బాబు, ప్రభుదేవా పాల్గొన్నారు. ‘‘కన్నప్ప’ టీజర్‌ను కాన్స్‌లో చూపించాం. అందరూ ప్రశంసించారు. అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ‘కన్నప్ప’ టీజర్ చూసి ముగ్దులయ్యారు. ఈ నెల 30న హైదరాబాద్‌లో తెలుగు వెర్షన్ ‘కన్నప్ప’ టీజర్‌ను ప్రదర్శించనున్నాం. జూన్ 13న ఈ టీజర్‌ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నాం’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు విష్ణు మంచు.కాన్స్‌లో తొలిసారి... కాన్స్ చిత్రోత్సవాల్లో ప్రతిష్టాత్మక ‘పామ్ డి ఓర్’ అవార్డు సినీ పరిశ్ర మకు సుదీర్ఘకాలంగా సేవలు అందించినవారికి ఇస్తుంటారు. ఈ ఏడాది 77వ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని ‘పామ్ డి ఓర్’ అవార్డుకు మెరిల్ స్ట్రీప్, జార్జ్ లూకాస్‌లను ఎంపిక చేశారు. కాగా కాన్స్ చరిత్రలోనే తొలిసారి ఓ స్టూడియోకు ఈ అవార్డు దక్కింది. జపాన్‌లోని యానిమేటెడ్ స్టూడియో ‘ఘిబ్లీ’కి ఫామ్ డి ఓర్ అవార్డును ప్రదానం చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ స్టూడియో యానిమేషన్ రంగంలో ఉంది. ఇక హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్ ఆల్రెడీ ఈ అవార్డు స్వీకరించారు. హాలీవుడ్ దర్శక–నిర్మాత జార్జ్ లూకాస్ చిత్రోత్సవాల చివరి రోజున ఈ అవార్డు అందుకోనున్నారు.కన్నీళ్లు పెట్టుకున్న కెవిన్... కెవిన్ కాస్ట్నర్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘హరిజన్: యాన్ అమెరికన్ సాగ’. అమెరికన్ సివిల్ వార్‌కు ముందు ఉన్న పరిస్థితులు, వార్ తర్వాత ఏర్పడ్డ పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. మూడు చాప్టర్స్‌గా ఈ చిత్రం విడుదల కానుంది. తొలి చాప్టర్ ‘హరిజన్: యాన్ అమెరికన్ సాగ’ను కాన్స్ చిత్రోత్సవాల్లో ప్రీమియర్‌గా ప్రదర్శించగా, మంచి స్పందన లభించింది. దాదాపు పది నిమిషాల స్టాండింగ్ ఒవేషన్ దక్కడంతో కెవిన్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సినిమా నిర్మాణానికి 35 ఏళ్లుగా కెవిన్ కష్టపడుతున్నారని హాలీవుడ్ టాక్. ట్రంప్ బయోపిక్... అమెరికా మాజీ అధ్యక్షుడు, వ్యాపారవేత్త డోనాల్డ్ ట్రంప్ జీవితం ఆధారంగా ‘ది అప్రెంటిస్’ సినిమా తీశారు దర్శకుడు అలీ అబ్బాసి. ఈ సినిమాను తొలిసారిగా కాన్స్ ఫెస్టివల్లో ప్రదర్శించగా, స్టాండింగ్ ఒవేషన్ దక్కింది. సెబాస్టియన్ స్టాన్ ఈ చిత్రంలో డోనాల్డ్ ట్రంప్ పాత్రపోషించారు. ఫిల్మ్ మేకర్స్ పొలిటికల్ మూవీస్ మరిన్ని చేయాలని కాన్స్ వేదికగా అలీ అబ్బాసి పేర్కొన్నారు. శునకం సందడి... లాటిటియా డెస్చ్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘డాగ్ ఆన్ ట్రయిల్’. ఫ్రాన్స్‌లో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఓ కుక్క కొంతమందిని కరుస్తుంది. అప్పుడు ఆ శునకాన్ని ఓ లాయర్ ఏ విధంగా కోర్టు కేసు నుంచి రక్షించారు? అన్నదే ఈ చిత్రకథ. ఈ సినిమాను కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. లాటిటియాతో పాటు ఈ సినిమాలో నటించిన శునకం చిత్రోత్సవాలకు హాజరైంది.కాన్స్‌లో భారతీయం... కాన్స్‌లో ఈ ఏడాది మన దేశీ తారలు ఐశ్వర్యా రాయ్, ఊర్వశీ రౌతేలా, కియారా అద్వానీ, శోభితా ధూళిపాళ వంటి వారు సందడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అదితీ రావ్ హైదరి ఈ చిత్రోత్సవాల్లో సందడి చేయడానికి ఫ్రాన్స్ వెళ్లారు. ఇక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో దాదాపు 35 ఏళ్ల తర్వాత పామ్ డి ఓర్ విభాగంలో పోటికి భారతీయ చిత్రం ‘అల్ వీ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ నిలిచిన సంగతి తెలిసిందే.భారతీయ ఫిల్మ్ మేకర్ పాయల్ కపాడియా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం కపాడియా ఫ్రాన్స్‌లోనే ఉన్నారు. అలాగే ‘అన్ సర్టైన్ రిగార్డ్’ విభాగంలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఫిల్మ్‌మేకర్ సంధ్యా సూరి తీసిన ‘సంతోష్’ చిత్రం ఉంది. ఈ చిత్రంలో నటించిన సహానా గోస్వామి,సంజయ్ బిష్ణోయ్‌లతో పాటు సంధ్యా సూరి ఫ్రాన్స్ చేరుకున్నారు. -
బిగ్‌బాస్ బ్యూటీకి చేదు అనుభవం.. నెల రోజులైనా రాలేదు!
బాలీవుడ్ భామ కిరణ్ రాథోడ్ తెలుగు వారికి సైతం పరిచయం అక్కర్లేదు. హిందీ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ముద్దుగుమ్మ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. నువ్వు లేక నేను లేను చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ చిత్రాలు చేసింది. అయితే 2016 నుంచి సినిమాలు చేయడం ఆపేసిన ముద్దుగుమ్మ.. గతేడాది జరిగిన తెలుగు బిగ్‌బాస్ సీజన్-7 మెరిసింది. అయితే మొదటివారంలోనే ఎలిమినేట్ అయి ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది.ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ బ్యూటీ తాజాగా చేసిన పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. వీసా విషయంలో తలెత్తిన సమస్యతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనట్లు పోస్ట్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అసలేం జరిగిందో ఓ సారి తెలుసుకుందాం.ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌కు కిరణ్ రాథోడ్ కూడా హాజరు కావాల్సి ఉంది. ఇందుకోసం ఆమె ఇప్పటికే గతనెలలోనే వీసాకు అప్లై చేసింది. కానీ ఇప్పటికీ ఆమెకు వీసా జారీ కాలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసింది.కిరణ్ రాథోడ్ ఇన్‌స్టాలో రాస్తూ..'కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు మే 13వ తేదీనే వెళ్లాల్సి ఉంది. ఇప్పటికే మా టీమ్ అంతా అక్కడికి చేరుకున్నారు. నేను మాత్రం నెల రోజులైనా వీసా కోసం ఎదురు చూస్తూనే ఉన్నా. ఇప్పటికే ముందస్తుగా హోటల్ బుకింగ్, ట్రావెల్ బుకింగ్ ఖర్చుల కోసం రూ.15 లక్షలు వెచ్చించా. దీంతో తాను మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యా. దీనిపై సదరు వీసా సంస్థ సమాధానం చెప్పాలి.' అని రాసుకొచ్చింది. పాపం.. ఇప్పటికైనా కిరణ్ రాథోడ్‌కు వీసా వస్తుందేమో చూడాల్సిందే. View this post on Instagram A post shared by Keira Rathore (@kiran_rathore_official) -
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసిన కన్నప్ప టీం!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో అగ్ర సినీతారలు నటిస్తున్నారు. ఇటీవలే రెబల్ స్టార్ ప్రభాస్ సైతం తన షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. తాజాగా మరో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సైతం కన్నప్పలో నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, శివరాజ్‌కుమార్, శరత్ కుమార్‌తో పాటు బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ కీలకపాత్రల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభాస్, నయనతారతో పాటు భరతనాట్యంలో నిష్ణాతురాలైన ప్రీతి కథానాయికగా కనిపించనున్నారు. తాజాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-2024లో కన్నప్ప టీం సందడి చేసింది. మంచు విష్ణు, మోహన్ బాబు, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. 'హారిజన్: యాన్ అమెరికన్ సాగా' స్క్రీనింగ్‌లో వీరంతా పాల్గొన్నారు. ఈ విషయాన్ని మంచు విష్ణు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Walked the Red Carpet yesterday for the screening of 'Horizon: An American Saga'@themohanbabu @pddancing @vinimanchu#cannes2024 pic.twitter.com/UcC8OPvFh1— Vishnu Manchu (@iVishnuManchu) May 20, 2024