సోనమ్ కపూర్ (ఫైల్ ఫొటో)
ముంబై : ప్రతీ ఒక్కరి జీవితంలో వివాహమనేది మధుర ఙ్ఞాపకం. వివాహం కొత్త బంధాలతో పాటు బాధ్యతలు కూడా తీసుకువస్తుంది. ఈ విషయంలో సెలబ్రిటీలైనా, సామాన్యులైనా సమానమే. అందుకు బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్... కాదు కాదు శ్రీమతి సోనమ్ కపూర్ అహుజా తాను కూడా మినహాయింపు కాదంటున్నారు.
సోనమ్ కపూర్ ఈ నెల 8న వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లైన వెంటనే కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు వెళ్లిన సోనమ్ అక్కడి నుంచి తిరిగి రాగానే.. ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. అంత బిజీ షెడ్యూల్‌లోనూ భార్యగా తన వంతు బాధ్యత నిర్వహిస్తున్నారు. వ్యాపారంతో నిత్యం బిజీగా ఉండే తన భర్త ఆనంద్‌ను రిసీవ్ చేసుకోవడానికి ఆమె ముంబై ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లారు. భర్తను చూడగానే సంతోషంతో సోనమ్ ముఖం వెలిగిపోయింది. అంతే ఇక ఈ కొత్త జంటను కెమెరాల్లో బంధించడానికి ఫొటోగ్రాఫర్లు పోటీ పడ్డారు. ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను అలరిస్తున్నాయి.
పెళ్లి, కెరీర్ ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవడం కాస్త కష్టమైన విషయమే. కానీ అర్థం చేసుకునే జీవిత భాగస్వామి దొరికితే అదేమంత పెద్ద విషయం కాకపోవచ్చు. ఈ విషయంలో సోనమ్ అదృష్టవంతురాలే అనుకోవచ్చంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment