పెళ్లింట... బ్యాండ్‌ బాజా | Hard To Beat Kareena And Sonam Kapoor's Veere Di Wedding Swag In These Pics From Song Shoot | Sakshi
Sakshi News home page

పెళ్లింట... బ్యాండ్‌ బాజా

Published Sat, Apr 14 2018 1:03 AM | Last Updated on Sat, Apr 14 2018 1:03 AM

Hard To Beat Kareena And Sonam Kapoor's Veere Di Wedding Swag In These Pics From Song Shoot - Sakshi

ఫరా, సోనమ్‌ కపూర్‌

పెళ్లింట ధూమ్‌ ధామ్‌గా దుమ్ము రేపే డ్యాన్స్‌తో హంగామా చేయడానికి సోనమ్‌ కపూర్‌ అండ్‌ గ్యాంగ్‌ రెడీ అయ్యారు. అదేంటీ ఆనంద్‌ అహూజాతో సోనమ్‌ పెళ్లి మేలో కదా? ఇప్పుడే గానా భజానాకి ఎందుకు రెడీ అయ్యారు అనుకుంటున్నారా? నిజమే. పెళ్లికి టైమ్‌ ఉంది. కానీ ఆమె నటిస్తున్న ‘వీరే ది వెడ్డింగ్‌’ సినిమా రిలీజ్‌కు టైమ్‌ దగ్గరపడుతోంది. ట్రైలర్‌ రిలీజ్‌కు జస్ట్‌ ఐదారు రోజులే ఉంది. ఆ ట్రైలర్‌ కోసమే ఈ హంగామా. పైగా రియల్‌ వెడ్డింగ్‌కన్నా ముందే షూటింగ్‌ పూర్తి చేసేయాలని సోనమ్‌ హడావిడి పడుతున్నారట.

ప్రస్తుతం తీస్తున్న పాట తాలూకు చిన్న బిట్‌ను ట్రైలర్‌లో చూపించాలనుకుంటున్నారట. శశాంక్‌ ఘోష్‌ దర్శకత్వంలో సోనమ్‌ కపూర్, కరీనా కపూర్, స్వర భాస్కర్, తన్సానీయా ముఖ్య పాత్రలుగా రూపొందిన  సినిమా ‘వీరే ది వెడ్డింగ్‌’. నలుగురు అమ్మాయిల మ్యారేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా కథనం సాగనుంది. ఆఫ్టర్‌ మ్యారేజ్‌ కరీనా కపూర్‌ నటిస్తున్న తొలి చిత్రమిదే. ప్రస్తుతం ఆ సినిమాలో ‘తరీఫన్‌...’ అనే స్పెషల్‌ సాంగ్‌ను షూట్‌ చేస్తున్నారు.

తరీఫన్‌ అంటే పంజాబీలో కాంప్లిమెంట్స్‌ అని అర్థం అట. ఈ సాంగ్‌కు ఫరాఖాన్‌ కుందర్‌ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సాంగ్‌కి డ్యాన్స్‌ చేయడానికే సోనమ్‌ అండ్‌ గ్యాంగ్‌ రెడీ అయింది. ‘‘ఫైనల్‌గా సోనమ్‌ కపూర్‌తో లవ్లీ సాంగ్‌ చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు ఫరాఖాన్‌. ‘‘ఫరా.. మీతో కలిసి వర్క్‌ చేయడం నా లక్‌. ఈ సాంగ్‌ చేస్తున్నందుకు థ్యాంక్స్‌’’ అన్నారు సోనమ్‌. మరి... ఈ పెళ్లింట బ్యాండ్‌ బాజా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమాను జూన్‌లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement