Farah Khan
-
కమాన్.. ఉదిత్ జీ.. ముద్దు పెట్టు... సానియామీర్జా, ఫరాఖాన్ సందడి!
ఫిల్మ్ మేకర్ ఫరా ఖాన్,బాలీవుడ్ ప్రఖ్యాత దర్శకురాలు కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ తన వినోదాత్మక వ్లాగ్లకూ పేరొందారు. ఇక మాజీ టెన్నిస్ ప్లేయర్ హైదరాబాదీ సానియా మీర్జా గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. కొన్నాళ్లుగా సన్నిహితులైన వీరిద్దరూ ఇటీవలే ఫరాఖాన్ ఇంటిలో కలిశారు. ఆమెతో పాటు ఆమె సోదరి అనమ్ మీర్జా కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సానియా మీర్జా ఫరాతో కలిసి కిచెన్‌లో సందడి చేశారు. ఆమెతో పాటు వంట సెషన్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సానియా క్లాసిక్ హైదరాబాదీ–శైలి చికెన్ 65 వంటకాన్ని తయారు చేశారు, అదనపు సాస్‌లతో తన స్వంత సృజనాత్మక ట్విస్ట్‌ను ఫరా దానికి జోడించింది. ఇలా కిచెన్ లో వంటలో దినుసులు కలపడంతో పాటు హాస్యం పంచడంలో కూడా ఇద్దరు స్నేహితులు పోటీ పడడంతో ఈ ఎపిసోడ్ అంతా నవ్వులు, సరదాలతో నిండిపోయింది. సానియా ప్రతిభ టెన్నిస్ కోర్ట్‌కు మించి విస్తరించిందో లేదో చూడండి అంటూ ఫరా తన యూట్యూబ్ ఛానెల్లో తమ కిచెన్‌లో షూట్ చేసిన వీడియోను పంచుకుంది.తద్వారా వీక్షకులకు నిజమైన హైదరాబాదీ చికెన్ 65 రెసిపీని నేర్చుకునే అవకాశాన్ని కూడా వీరు అందించారు, ఇది ఏ సందర్భానికైనా సరిపోయే క్రిస్పీ ఫ్లేవర్ఫుల్ డిష్ గా వర్ణించారు. ఇదంతా ఒకెత్తయితే... ఈ సందర్భంగా ఫరా చూపిన హాస్య చతురత వీక్షుకులకు నవ్వుల్ని పంచింది. హాస్య స్వభావానికి పేరొందిన ఫరా... సానియా కుమారుడిని ముద్దు పెట్టమని ఉల్లాసంగా అడిగే విధానం అందరి దృష్టిని ఆకర్షించింది. తన ఇంట్లో ఫుట్‌బాల్ ఆడుకుంటున్న ఆ కుర్రాడి నుంచి బంతిని తీసుకున్న ఫరా, ఇజాన్ తన బంతిని వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ‘‘నీ నుంచి కొన్ని బ్రౌనీ పాయింట్లు సంపాదించడానికి నేను మీకు బంతిని తిరిగి ఇవ్వవలసి ఉంది‘ అని చెప్పారు. బంతిని ఇవ్వాలంటే ఓ షరతు కూడా విధించారు. అదేమిటంటే... ‘‘మొదట నన్ను నువ్వు ముద్దు పెట్టుకోవాలి, అదెలాగో నీకు తెలుసు. కమాన్... ముద్దివ్వండి ఉదిత్ జీలా ’’ అంటూ ఆ బాలుడ్ని అడగడం నవ్వుల్తో ముంచెత్తింది. ఈ వీడియోను చూసిన నెటిజనులు కూడా ఫరా హాస్య చతురతను కొనియాడుతున్నారు.ఇటీవల ప్రముఖ బాలీవుడ్ గాయకుడు ఉదిత్ నారాయణ్ ముద్దు ఉదంతం నెట్టింట సంచలనం సృష్టించింది. ఓ సంగీత కార్యక్రమంలో పాల్గొన్న ఉదిత్ నారాయణ్... తన పాటలతో అభిమానుల్ని ఉర్రూతలూగించారు. అదే జోరులో ఆయన టిప్ టిప్ బర్సా పానీ పాట పాడుతూండగా పలువురు అభిమానులు ఆయన వేదికకు బాగా దగ్గరగా వచ్చేశారు. అలా పాట పాడుతూనే వేదిక మీద నుంచే ఒక అభిమానికి ఉదిత్ దగ్గరగా జరిగినప్పుడు ఆ యువతి ఆయనకు బుగ్గ మీద ముద్దు పెట్టేందుకు ప్రయత్నించింది. అప్పుడు ఆయన ఏకంగా ఆమె పెదాల మీదే ముద్దు పెట్టేశారు. దీంతో ఈ ఉదంతం నెట్టింట ఉదిత్‌పై తీవ్ర విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తడానికి దారి తీసింది. ఈ నేపధ్యంలోనే ఫరా... సానియా మీర్జా కుమారుడితో ‘‘నాకు ముద్దివ్వు ఉదిత్ జీ అవ్వు.. అంటూ అనడం నెటిజన్లను ఆకర్షించింది. -
లావుగా ఉన్నానని ఆ పాట నుంచి తప్పించారు: శిల్ప
హీరోయిన్ల లైఫ్ అంత ఈజీగా ఉండదు. కాస్త లావెక్కినా, వయసు మీద పడుతున్నట్లు ఏమాత్రం కనిపించినా వారి కెరీర్ డేంజర్లో పడ్డట్లే! పైగా కొత్తవారు ఎంట్రీ ఇచ్చేకొద్దీ తమను తాము ప్రూవ్ చేసుకుంటూ నిలదొక్కుకునేందుకు మరింత కష్టపడాల్సి వస్తుంది. అయినా కొన్నిసార్లు ఏవో వంకలు చెప్పి రిజెక్ట్ చేస్తూనే ఉంటారు.బిగ్‌బాస్ షోలో నమ్రత సోదరిటాలీవుడ్ హీరో మహేశ్‌బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ ఒకప్పుడు హీరోయిన్. ఆమె చెల్లి శిల్ప శిరోద్కర్ కూడా కథానాయికగా నటించింది. ఒకప్పుడు బాలీవుడ్లో ఈమె టాప్ హీరోయిన్గా చెలామణి అయింది. కానీ పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఇన్నాళ్లు ఆన్‌స్క్రీన్‌పై చూశారు.. ఇప్పుడు ఆఫ్‌స్క్రీన్‌లో నేనెలా ఉంటానో చూపిస్తానంటూ హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్లో పాల్గొంది. సల్మాన్ ఖాన్‌కు బదులుగా..ఈ షోకు వెళ్లేముందు నమ్రతతో గొడవపడి మరీ వచ్చేశానంటూ తన సోదరిని తల్చుకుని కన్నీళ్లు పెట్టుకుంది. తాజాగా శిల్ప మరో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. వీకెండ్ ఎపిసోడ్లో సల్మాన్ ఖాన్‌కు బదులు కొరియోగ్రాఫర్, దర్శకనటి ఫరాఖాన్ హోస్ట్‌గా వ్యవహరించింది. ఆమెను చూడగానే శిల్పకు ఓ విషయం గుర్తుకు రావడంతో దాన్ని మరో కంటెస్టెంట్‌తో పంచుకుంది. సడన్‌గా నన్ను తీసేశారుబ్లాక్బస్టర్ సాంగ్ చయ్య చయ్య (దిల్సే మూవీలోనిది) పాటకోసం మొదట నన్నే అనుకున్నారు. నా దగ్గరకు వచ్చిన ఫరా ఖాన్ నన్ను చూసి కాస్త బరువు తగ్గమని చెప్పింది. వారం పదిరోజుల తర్వాత నన్ను పక్కనపెట్టి మరో నటి(మలైకా అరోరా)ని వెతుక్కున్నారని తెలిసింది. నేను మరీ లావుగా ఉన్నానని, ఆ పాటకు సూటవనని ఫరా నాతో చెప్పింది. నిజంగా నన్ను తీసేయడానికి అదే కారణమా? ఇంకేదైనా ఉందా? అన్నది కొరియోగ్రాఫర్ ఫరా, డైరెక్టర్ మణిరత్నమే చెప్పాలి అని శిల్ప శిరోద్కర్ గుర్తు చేసుకుంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఫరా ఖాన్ ఇష్టపడే వంటకం: ఇడ్లీలో ఇన్ని రకాలా..!
బాలీవుడ్ ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, దర్శకుడు ఫరా ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడూ వీడియోలు షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది. ముఖ్యంగా రెసిపీలు, ప్రముఖ రెస్టారెంట్ల భోజనం గురించి అభిమానులతో షేర్ చేస్తుంటారు. యఖ్నీ పులావ్ నుంచి ఝలక్ దిఖ్లా జా షో సెట్స్‌లో నోరూరించే భోజనం వరకు ప్రతిదీ షేర్ చేస్తుంటారు. ఆ వీడియోలో ఎక్కువగా ఆహారప్రియులు ఇష్టపడే ప్రముఖ వంటకాలే ఉండటం విశేషం. అలానే ఈ సారి కూడా ముంబైలో ఒక రెస్టారెంట్లో పాడ్‌కాస్టర్ రాజ్ షమనితో కలిసి ఫుడ్‌ని ఆస్వాదిస్తున్నవీడియోని షేర్ చేశారు. ఆ వీడియోలో ముంబైలోని సౌత్ టిఫిన్హౌస్లో కండివలి అనే విచిత్రమైన తినుబండారాన్ని పరిచయం చేశారు ఫరా. ఈ మైండ్ బ్లోయింగ్ సౌత్ ఇండియన్ ఫుడ్‌ని రాజ్ షమానీతో కలిసి ఆస్వాదిస్తున్నట్లు వీడియోలో పేర్కొంది ఫరా ఖాన్. వారు అక్కడ టేబుల్ వద్ద కూర్చొన్నప్పుడూ సర్వర్ ఆ రెసీపీని తీసుకురాగనే ముందుగా వివిధ చట్నీలతో కూడిన ప్లేట్ ఒకవైపు మరోవైపు కండివలి అనే విచిత్ర తినుబండారం. ఆ ప్లేట్లో వివిధ రాష్ట్రాల్లో ఉండే ఫేమస్ ఇడ్లీలు ఉన్నాయి. ఇది చూస్తే ఇడ్లీలో ఇన్ని రకాలు ఉన్నాయా..? అని విస్తుపోతారు. అందులో బొగ్గు మాదిరిగా ఉండే ఇడ్లీ చూస్తే వామ్మో ఏంటిది అనుకుంటారు. ఫరా ఖాన్ కూడా వీడియోలో బొగ్గు ఇడ్లీని చూపిస్తూ ఇదేం ఇడ్లీరా బాబు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇక మిగిలి ఇడ్లీలు వరసగా లావా సాంబార్ ఇడ్లీ, రాగి ఇడ్లీ, కాంచీపురం ఇడ్లీ, ఆవిడి కుడుములాంటి ఇడ్లీ తదితరాలన్నింటిని వీడియోలో పరిచయం చేసింది. చివరగా రాజ్ కారప్పోడి నెయ్యితో ఉన్న ఇడ్లీని టేస్ట్ చేస్తూ బాగుందని చెబుతాడు. నిజంగానే బాగుందా? అని ఆశ్యర్యంగా అడుగుతుంది ఫరా. ఏం పర్లేదు బేషుగ్గా తినొచ్చు. బాగుంది ఇడ్లీ అని చెబుతాడు. ఫరా ఈ వీడియోని వ్యాపార సలహాలు అనే క్యాప్షన్‌తో ఈ వీడియోని ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ వీడియోకి ఏకంగా లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. View this post on Instagram A post shared by Farah Khan Kunder (@farahkhankunder) (చదవండి: నటి భాగ్యశ్రీ వ్యాయామాలతో భుజాల నొప్పులు మాయం!) -
ఆ స్టార్ హీరో డ్యాన్స్ చూసి ఏడ్చేశా: కొరియోగ్రాఫర్
బాలీవుడ్‌లోని ఓ స్టార్ హీరోకు డ్యాన్స్ రాదని, తనకు నేర్పించడం చేతకాక ఏడ్చేశానంటోంది కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్. బాలీవుడ్లో టాప్ కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్న ఫరా ఖాన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. సల్మాన్ ఖాన్ సినిమాల్లోకి రావాలని ప్రయత్నిస్తున్న కొత్తలో ఆడిషన్స్‌కు వెళ్లాడు. అలా ఓసారి స్క్రీన్ టెస్ట్ చేసినప్పుడు తనకు డ్యాన్స్ నేర్పించాను. స్టెప్పులేయడమే చేతకాదునాలుగు గంటలపాటు నేర్పిస్తూనే ఉన్నాను, కానీ తనకు రావట్లేదు. నీకు డ్యాన్స్ నేర్పించడం ఎవరి వల్లా కాదు. నీకసలు స్టెప్పులేయడమే చేతకాదని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాను. తర్వాత అతడిని మైనే ప్యార్ కియా సినిమాకు సెలక్ట్ చేశారని తెలిసి ఆశ్చర్యపోయాను. ఆ మూవీలో అతడు ఒదిగిపోయే తీరు చూసి షాకైపోయాను అని చెప్పుకొచ్చింది.సల్మాన్ జర్నీకాగా సల్మాన్ ఖాన్.. 1988లో 'బివి హో తో ఐసీ' అనే సినిమాతో వెండితెరపై ప్రయాణం ప్రారంభించాడు. దబాంగ్ సినిమాలో మున్నీ బద్నాం హూయి పాటలో సల్మాన్‌కు ఫరా స్టెప్పులు నేర్పించింది. మరెన్నో హిట్ సాంగ్స్‌కు సైతం ఫరాయే కొరియోగ్రఫీ చేసింది. సల్మాన్ గతేడాది.. కిసి కా భాయ్ కిసీ కీ జాన్, టైగర్ 3 చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం సికిందర్ సినిమా చేస్తున్నాడు. -
ఫరా ఖాన్ తల్లి మేనకా ఇరానీ కన్నుమూత
బాలీవుడ్లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్న ఫరాఖాన్ కుటుంబంలో విషాదం నెలకొంది. నేడు (జులై 26) ఆమె అమ్మగారు మేనక ఇరానీ (79) అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని అధికారికంగా ఫరాఖాన్ తెలపనప్పటికీ పలు నివేదికలు ఆమె మరణాన్ని ధృవీకరిస్తున్నాయి. కొంత కాలంగా మేనక ఇరానీ తీవ్రమైన అనారోగ్యం కారణంగా పలు శస్త్ర చికిత్సలు చేపించుకున్నారు. వయసు ఎక్కువగా ఉండటం వల్ల ఆమె శరీరం అందుకు సహకరించలేదని తెలుస్తోంది.ఫరాఖాన్ తల్లి మేనక ఇరానీ జులై 12న పుట్టినరోజు జరుపుకున్నారు. ఆ సమయంలో సంతోషంగా ఉన్న ఆ ఫోటోలను ఫరాఖాన్ పంచుకుంది. కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో ఫరాఖాన్ దిగ్భ్రాంతి చెందారు. ఫరాఖాన్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, నటి, నిర్మాత, డ్యాన్సర్‌గా చిత్రపరిశ్రమలో రాణించారు. బాలీవుడ్లో టాప్ ప్రముఖుల లిస్ట్‌లో ఆమె ముందువరుసలో ఉంటుంది.ఓం శాంతి ఓం, తీస్మార్ఖాన్, హ్యాపీ న్యూ ఇయర్ వంటి చిత్రాలను ఫరాఖాన్ డైరెక్ట్ చేశారు. సుమారు 100కి పైగా పాటలకు ఆమె కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. గతేడాదిలో జవాన్ చిత్రంలో 'చెలెయా' సాంగ్‌కు ఆమె డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేశారు. ఈ సాంగ్ సోషల్ మీడియాలో బిగ్ హిట్ అయిన విషయం తెలిసిందే. -
షారూఖ్ ఖాన్ కంటే నేనే ఎక్కువ సంపాదించా..
షారూఖ్ ఖాన్ కంటే తానే ఎక్కువ సంపాదించానంటోంది కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్. అదెలా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఇది చదివేయండి.. ప్రేక్షకులు ఎంతగానో అభిమానించే షారూఖ్ ఖాన్ తొలిసారి వెండితెరపై కనిపించింది దీవానా చిత్రంలో! ఈ మూవీతోనే అతడి కెరీర్ ఆరంభమైంది. నిజానికి అతడు ఫస్ట్ సంతకం చేసింది కబీ హా కబీ నా సినిమాకు.. తొలిసారి కెమెరా ముందుకు వచ్చిందీ ఈ సినిమాకే! ఈ సినిమాకు ఫరా ఖాన్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించింది.నాకే ఎక్కువ..తాజాగా ఫరా ఖాన్ ఆ సినిమా విశేషాలను చెప్పుకొచ్చింది. కబీ హా కబీ నా తక్కువ బడ్జెట్లోనే పూర్తి చేశారు. ఈ సినిమాకుగానూ షారూఖ్ ఖాన్‌కు రూ.25,000 ఇచ్చారు. అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ నాకే ఇచ్చారు. అదెలాగంటే.. ఒక్క పాటకు రూ.5,000 చొప్పున ఆరు పాటలకుగానూ రూ.30,000 ఇచ్చారు. అప్పట్లో అసిస్టెంట్‌ను పెట్టుకునేంత సీన్ కూడా లేదు.ఫ్రెండ్షిప్కాబట్టి ఆ జీతం అంతా నేను మాత్రమే తీసుకున్నాను. పైగా ఆనా మేరే ప్యార్ కో పాట కోసం బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్లకు బదులుగా గోవాలో ఉన్న జనంతోనే షూటింగ్ కానిచ్చేశాం అని తెలిపింది. ఈ సినిమా నుంచే షారూఖ్- ఫరా ఖాన్ మధ్య స్నేహ బంధం బలపడింది. ఫరా ఖాన్ దర్శకత్వంలో షారూఖ్.. మై హూనా, ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూ ఇయర్ వంటి చిత్రాల్లో నటించాడు.చదవండి: రాజకీయాల కంటే సినిమాలే నయం: కంగనా రనౌత్ -
ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ.. డాక్టర్ ఒకరిని తీసేస్తానంది!
బహుముఖ ప్రజ్ఞాశాలి ఫరాఖాన్.. కొరియోగ్రాఫర్, డైరెక్టర్, నటి, నిర్మాత, డ్యాన్సర్‌గా చిత్రపరిశ్రమలో రాణిస్తోంది. ఈమె 2004లో దర్శకుడు, ఎడిటర్ శిరీష్ కుందర్‌ను పెళ్లాడింది. పిల్లల కోసం కలలు కన్నారు. కానీ సహజంగా ఆ కల నెరవేరకపోవడంతో ఐవీఎఫ్ పద్ధతిని ఆశ్రయించారు. ఐవీఎఫ్ ద్వారా 2008లో ముగ్గురు పిల్లలకు ఒకేసారి జన్మనిచ్చింది. తాజాగా అప్పటి పరిస్థితులను గుర్తు చేసుకుంది ఫరా ఖాన్. గర్భం దాల్చానని గుడ్‌న్యూస్ ఆమె మాట్లాడుతూ.. 'నేను, శిరీష్ ఎప్పుడూ పిల్లల గురించే ఆలోచించేవాళ్లం. వాళ్లు పుట్టాక ఏం పేర్లు పెట్టాలి? మన లైఫ్ ఎలా ఉండబోతుంది? అని మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. ఐవీఎఫ్ ఫెర్టిలిటీ ట్రై చేసినప్పుడు డాక్టర్ నన్ను పిలిచి గర్భం దాల్చినట్లు చెప్పింది. కానీ ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దంది. మేము షాకవుతూనే ఏమైందని అడిగాం. ఒకటి కంటే ఎక్కువ పిండాలు ఏర్పడ్డాయని చెప్పింది. ఇద్దరు కాదు ముగ్గురు మేము ట్విన్స్ పుడతారేమోననుకున్నాం. వాళ్లకు ఏ పేర్లు పెట్టాలా? అని తెగ ఆలోచించాం. ఓ రోజు శిరీష్.. ఒకవేళ గర్భంలో ముగ్గురుంటే.. ఇంకో పేరు కూడా ఆలోచించాలి కదా అన్నాడు. అలా చిత్రవిచిత్ర పేర్లు పెట్టుకున్నాం. ఒకరోజు డాక్టర్ పిలిచి నీ కడుపులో ఉన్నది ఇద్దరు కాదు ముగ్గురు.. నీకు 43 ఏళ్లు రాబోతున్నాయి. ఈ వయసులో ముగ్గురిని మోయడం నీకంత మంచిది కాదు. డెలివరీ సమయంలో ఏదైనా ఇబ్బందులు రావొచ్చు. ఒక బేబీ చిన్నదిగా పుట్టే ఆస్కారం ఉంది, ఒకసారి ఆలోచించమని సూచించింది. ఏడున్నర కిలోలు.. నేను బిడ్డను తీసేయడానికి ఒప్పుకోలేదు. కడుపులో ఉండే శిశువు రెండు కిలోలవరకు బరువుండాలని చెప్పింది. పిల్లలు సరైన బరువుతో పుట్టేలా చూసుకుంటానన్నాను. మీరు నమ్మరు గానీ... నా పిల్లలు ఒక్కొక్కరు రెండున్నర కిలోల బరువుతో జన్మించారు. అంటే ఏడున్నర కిలోలు నా పొట్టలో మోస్తూ తిరిగాను' అని చెప్పుకొచ్చింది. ఫరా ఖాన్ తన పిల్లలకు సిజర్, అన్య, దివ అనే పేర్లు పెట్టింది. ఆ ముగ్గురూ ప్రస్తుతం పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నారు. View this post on Instagram A post shared by Farah Khan Kunder (@farahkhankunder) చదవండి: తల్లి మనసు ఎంత గొప్పదో.. చరణ్‌కు మర్చిపోలేని గిఫ్ట్ -
షారుక్ అలా ఫిక్సయిపోయాడు.. కానీ కమల్.. : దర్శకురాలు
ఫరాఖాన్.. బాలీవుడ్లో పేరు మోసిన కొరియోగ్రాఫర్. దర్శకరచయితగా, నిర్మాతగానూ పేరు తెచ్చుకుంది. ఈమె డైరెక్టర్‌గా వ్యవహరించిన తొలి చిత్రం మై హూనా. ఇందులో షారుక్ ఖాన్ హీరోగా నటించాడు. అయితే విలన్ పాత్ర కోసం తీవ్రంగా శ్రమించానంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది ఫరా ఖాన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'మై హూనా మూవీలో విలన్ కోసం ఎంతోమందిని సంప్రదించాను. కమల్ ఒప్పుకుంటాడని షారుక్ ధీమా కానీ ఎవరూ చేయడానికి ముందుకు రాలేదు.. నసీరుద్దీన్ షాను అడిగితే చేయనన్నాడు. కమల్ హాసన్ దగ్గరకు వెళ్లాను.. ఆయన కచ్చితంగా చేస్తాడని, తానంటే కమల్ సర్‌కు ఎంతో ఇష్టమని, ఇద్దరం కలిసి ఇదివరకే హే రామ్ అనే సినిమా కూడా చేశామని షారుక్ ఎంతో కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. కానీ ఆయన కూడా తిరస్కరించాడు. నానా పటేకర్‌ను కలిశా.. వారం రోజులకు ఆయన కూడా చేయనని చేతులెత్తేశాడు. షారుక్ నిర్మాతగా తొలి మూవీ చివరకు సునీల్ శెట్టి ఆ పాత్ర చేశాడు' అని ఫరా ఖాన్ చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమా షారుక్ ఖాన్ సొంత బ్యానర్ అయిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్లో తెరకెక్కిన తొలి చిత్రం కావడం విశేషం. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. తర్వాత ఫరా ఖాన్- షారుక్ ఖాన్ కాంబినేషన్లో ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూ ఇయర్ చిత్రాలు రూపొందాయి. చదవండి: రెండో పెళ్లి చేసుకున్న నటి మాజీ భర్త.. ఆశీర్వదించండంటూ పోస్ట్.. -
ఆమె అందరి ముందే నోటికొచ్చినట్లు తిట్టి, నాపై చెప్పులు విసిరింది: నటుడు
ప్రముఖ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ తనను అందరిముందే తిట్టి అవమానించిందన్నాడు నటుడు జాయెద్ ఖాన్. అంతేకాక తనపై చెప్పులు విసిరిందని చెప్పాడు. మరి దర్శకురాలికి అంత కోపం వచ్చేలా జాయెద్ ఏం చేశాడు? తను ఎందుకంత వైల్డ్‌గా ప్రవర్తించిందో అతడే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 'మై హూనా(2004) సినిమా షూటింగ్ జరుగుతున్న రోజులవి. అప్పుడు ఇంకా టెక్నాలజీ అంత అభివృద్ధి చెందలేదు. నచ్చినన్ని టేకులు తీసుకునేందుకు ఆస్కారం లేదు. సెట్లో అందరూ క్రమశిక్షణతో మెదులుకోవాల్సిందే! ఒక సీన్లో కెమెరా.. అమృతరావును క్యాప్చర్ చేసి ఆ తర్వాత నావైపుకు వస్తోంది. నా చుట్టూ ఉన్నవారంతా కూడా రెడీగా ఉండండి అని అరుస్తున్నారు. అప్పటికే డ్యాన్సర్లంతా వేసిన స్టెప్పులే మళ్లీ వేసి రెడీగా నిల్చున్నారు. సరిగ్గా కెమెరా నా వైపుకు రాగానే నా వెనకాల ఉన్న డ్యాన్సర్ ఒకరు ఫిట్స్‌తో కింద పడిపోయారు. నాకేం చేయాలో అర్థం కాలేదు. కానీ నేను డ్యాన్స్ చేస్తూ ఉన్నాను. అతడలా పడిపోతే నేను పట్టించుకోకుండా డ్యాన్స్ చేయడం నచ్చలేదు. కట్ అన్నాను. అంతే ఫరాకు పట్టరానంత కోపం వచ్చింది. నానామాటలు అంది. ఆవేశంతో నా మీదకు తన చెప్పులు విసిరింది. తన ప్రవర్థన అర్థం కాక.. ఓవైపు మనిషి చావుబతుకుల్లో ఉంటే నన్ను డ్యాన్స్ చేయమని ఎలా అడుగుతున్నావు? అని తిరిగి ప్రశ్నించాను. దీనికామె నా సెట్లో కట్ చెప్పడానికి నువ్వెవరు? చెప్తే నేను మాత్రమే చెప్పాలి అని అరిచింది. అప్పటికి అక్కడున్నవాళ్లకు పరిస్థితి అర్థమై వెంటనే ఆ పడిపోయిన వ్యక్తిని కాపాడారు. ఆ తర్వాత డ్యాన్స్ యథావిధిగా కొనసాగింది' అని చెప్పుకొచ్చాడు జాయెద్. కాగా 2004లో వచ్చిన మై హూనా సినిమాలో షారుక్ ఖాన్, సుష్మితా సేన్, సునీల్ శెట్టి, అమృత రావు, జాయెద్ ఖాన్ ముఖ్య పాత్రల్లో నటించారు. పశ్చిమ బెంగాల్‌లోని సెయింట్ పాల్ స్కూల్లో ఈ షూటింగ్ జరిగింది. ఇకపోతే జాయెద్ ఖాన్ 2003లో 'చౌరా లియా హై తుమ్నే' చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. మై హూనా, శబ్ధ్, దస్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడు చివరగా హాసిల్ షోలో కనిపించాడు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న అతడు 'దట్ నెవర్ వాస్' చిత్రంతో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. మోహిత్ శ్రీవాత్సవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాకీ ష్రాఫ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. చదవండి: చైతన్యకు అప్పు లేదు, ఇంకేదో జరిగింది: డ్యాన్స్ మాస్టర్ బంధువు కానిస్టేబుల్ పరీక్షలో బలగం ప్రశ్న, దిల్ఖుష్ అయిన డైరెక్టర్ -
విడాకులు తీసుకున్న స్టార్ హీరో మాజీ భార్య సోదరి
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ భార్య సుసానే ఖాన్ సోదరి ఫరా ఖాన్ అలీ విడాకులు తీసింది. తన భర్త డీజే అకీల్‌తో అధికారికంగా విడాకులు తీసుకున్నట్లు తెలిపింది. కాగా.. 2021లోనే తామిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. జువెలరీ డిజైనర్ ఫరా ఖాన్ అలీ భర్త అకీల్‌తో ఉన్న చిత్రాలను పోస్ట్ చేసింది. ఆమె తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'మేము అధికారికంగా విడాకులు తీసుకున్నాం. ఈ విషయంలో మేమిద్దరం సంతోషంగా ఉన్నాం. మేము ఒకరికొకరు చాలా ప్రేమ, సంతోషంతో ఉన్నాం. ఇకముందు ప్రయాణంలో ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. మేము ఎల్లప్పుడూ మా పిల్లలు అజాన్, ఫిజాలకు తల్లిదండ్రులుగానే ఉంటాం. ఇన్ని రోజుల మా ప్రయాణంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు.' అంటూ పోస్ట్ చేసింది. ఇదే విషయాన్ని అకీల్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశాడు. మీ ఇద్దర్నీ ప్రేమిస్తూనే ఉంటా సుసానే ఖాన్ కామెంట్ చేసింది. ఈ విడాకులు తీసుకున్న జంటపై బాలీవుడ్ నటులు ట్వింకిల్ ఖన్నా, నందితా మహతాని, సైషా షిండే, దియా మీర్జా, భావన పాండే, మోజెజ్ సింగ్, ఎల్నాజ్ నొరౌజీ తదితరులు స్పందించారు. ఫరా, అకీల్ కొన్ని సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన తర్వాత ఫిబ్రవరి 20, 1999న పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు అజాన్, ఫిజా ఉన్నారు. View this post on Instagram A post shared by Farah Khan Ali (@farahkhanali) -
చిన్నతనంలో ఎన్నో కష్టాలు.. నాన్న సినిమా రిలీజైన రెండు రోజులకే..
తిరస్కరణను అంగీకరించడంతో పాటు నిజమైన ప్రతిభ, నమ్మకం ఉన్న వారే బాలీవుడ్‌ను ఎంచుకోవాలని బాలీవుడ్ దర్శకురాలు ఫరా ఖాన్ అన్నారు. జూబ్లీహిల్స్‌లో ఫిక్కి ఎఫ్ఎన్ఓ ఆధ్వర్యంలో ది ఫోర్స్ ఆఫ్ ఫిమేల్ ఫార్టిట్యూట్ పేరుతో నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలీవుడ్‌ను కేరీర్‌గా ఎంచుకోవాలని లక్షలాది మంది కోరుకుంటారన్నారు. అయితే తాను వద్దని చెప్పడానికి చాలా కారణాలున్నాయని, నిజంగా ఈ రంగంలోకి రావాలని ఆశించే వారు చాలా ఓపికతో ఉండాలన్నారు. ప్రతిభ ఉండి, మీపైన మీకు నమ్మకం ఉండి, మీరు నటించకపోతే చనిపోతారని భావిస్తే మాత్రమే ఈ రంగంలో రాణించే అవకాశాలు ఉన్నాయన్నారు. హైదరాబాద్ తనకు ఎంతో ప్రత్యేకమని, తాను తరచూ ఇక్కడికి ప్రయాణం చేస్తూ ఉంటారన్నారు. దర్శకుల విషయంలో లింగ భేదం, పక్షపాతం ఉండదని, బాలీవుడ్లో అత్యంత విజయవంతమైన మహిళా దర్శకురాలిగా తాను చేసిన ప్రయాణాన్ని వివరించారు. తాను కూడా చాలామంది మాదిరిగానే చిన్న తనంలో బాధలు, కష్టాలు, ఇబ్బందులు చూశానన్నారు. శుక్రవారాలు పరిశ్రమలోని చాలామంది కళాకారుల భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని, తన తండ్రి సినిమా విడుదలవుతున్న శుక్రవారాల్లో ముందు చాలా మంది మెచ్చుకుని, చిత్రం విడుదలైన రెండు రోజుల తర్వాత ఆదివారం ప్రజలు అతడిని చూడటం, ఇంటికి రావడం మానేశారన్నారు. తమ జీవితాలు ఇలాగే ఉంటాయని వివరించారు. బాలీవుడ్లో తమ కేరీర్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు టెక్నిక్, నైపుణ్యం, అర్హత లేదా ప్రతిభ వీటిలో ఏది ముఖ్యమని ఫిక్కీ సభ్యులు అడిగినప్పుడు ఫరాఖాన్‌తో పాటు సినీ నటులు పూజా హెగ్డే, అడవి శేష్ ఈ మూడూ అవసరమని సమాధానం చెప్పారు. సహజమైన ప్రతిభ కలిగి ఉండటం మంచిదని, నైపుణ్యాలనూ ప్రదర్శించాలని ఫరాఖాన్ అన్నారు. దర్శకత్వం తనకు ఎంతో సంతృప్తి ఇచ్చిందన్నారు. సినీ ప్రముఖులు అడవి శేష్, పూజా హెగ్డే, ఫిక్కీ ఎఫ్ ఏఓ హైదరాబాద్ చైర్పర్సన్ భుభా మహేశ్వరి, పింకీరెడ్డి, దాదాపు 300 మంది ఫిక్కీ సభ్యులు పాల్గొన్నారు. చదవండి: పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇవ్వబోతున్న హీరోయిన్ -
యాంకర్ చెంప చెళ్లుమనిపించిన మహిళ దర్శకనిర్మాత!
బాలీవుడ్ మహిళా దర్శకనిర్మాత, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ యాంకర్, నటుడు మనీశ్ పౌల్ చెంప చెళ్లుమనిపించింది. ఈ వీడియోను మనీశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అసలేం జరిగిందంటే.. అమ్మాయిలకు పెద్దగా లెక్కలు రావని మనీశ్ అన్నాడు. అంత సినిమా లేదు, అది నిజం కాదని బదులిచ్చింది ఫరా ఖాన్. దీంతో అతడు రెండులోంచి రెండు తీసేస్తే ఎంత అని ఓ ప్రశ్న అడిగాడు. అందుకామె అసలు ప్రశ్నే అర్థం కావట్లేదంది. మనీశ్ అదే ప్రశ్నను మరోలా అడిగాడు. నువ్వు రెండు చపాతీలు తింటున్నావనుకో.. ఆ రెండింటినీ నేను తీసుకుంటే నీ దగ్గర ఎన్ని మిగులుతాయి? అని ప్రశ్నించాడు. అందుకామె ఇంకేం మిగులుతాయి. కేవలం కూర మాత్రమే మిగులుతుందని చెప్పింది. ఆ వెంటనే కోపంతో నా చపాతీ లాక్కోవడానికి నీకెంత ధైర్యం? అంటూ సరదాగా అతడి చెంప చెళ్లుమనిపించింది. ఫరాకు లెక్కలు ఎంత బాగా వచ్చో అంటూ మనీశ్ ఈ వీడియోను సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశాడు. దీనికి ఫరా స్పందిస్తూ నా తిండి దొంగిలించాలని ఎప్పుడూ అనుకోకు అంటూ కామెంట్ చేసింది. కాగా మనీశ్ పౌల్ చివరగా జుగ్ జుగ్ జియో సినిమాలో నటించాడు. ఇందులో కియారా అద్వానీ సోదరుడి పాత్రలో కనిపించాడు. View this post on Instagram A post shared by Maniesh Paul (@manieshpaul) చదవండి: కియారాతో పెళ్లనగానే నా భార్య విడాకుల దాకా వెళ్లింది మాటలు రావడం లేదు, ఈ అవార్డు భారత్‌కు అంకితమిస్తున్నా -
కరణ్ జోహార్ బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్: ఫరా ఖాన్
బాలీవుడ్ చిత్రనిర్మాత, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్‌ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించింది. తాజాగా కరణ్ డ్రెస్సింగ్ స్టైల్‌పై ఆమె మాట్లాడారు. కరణ్ తాను కొరియోగ్రఫీ చేసిన పాటల్లో బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్ల మాదిరిగానే డ్రెస్ వేసుకుంటాడని చెప్పుకొచ్చింది. ఫరా ఖాన్ ఇటీవల కరణ్ జోహార్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న సంఘటనను గుర్తు చేసుకుంది. ఫరా ఖాన్ కొద్ది రోజుల క్రితమే దుబాయ్‌లో జరిగిన ఓ హోటల్ లాంఛ్ కార్యక్రమంలో హాజరయ్యారు. ఈవెంట్లో ఆమె ధరించిన దుస్తులపై కరణ్ ఎలా స్పందిస్తారని అడగ్గా..' కరణ్ జోహార్ తనను మనీష్ మల్హోత్రా బృందంలో చూస్తే షాక్ అవుతారని చెప్పింది. నా చెత్త రెడ్ కార్పెట్ పీడకల ఏమిటంటే అందులో కరణ్ కనిపించడం. అతను నేను కొరియోగ్రఫీ చేసిన పాటల్లో ఎప్పుడూ బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ లాగా దుస్తులు ధరిస్తాడు.' అంటూ నవ్వుతూ చెప్పింది. ఫరా ప్రస్తుతం రాబోయే ప్రాజెక్ట్‌లో పని చేస్తోంది. ఆమె చివరిగా దర్శకత్వం వహిచిన 2014 చిత్రం హ్యాపీ న్యూ ఇయర్. ఇందులో షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనే, బోమన్ ఇరానీ, సోనూ సూద్, వివాన్ షా నటించారు. సల్మాన్ ఖాన్ తన రాబోయే చిత్రానికి పని చేయడానికి విరామంలో ఉన్నందున ఆమె ప్రస్తుతం బిగ్ బాస్ 16కి హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. -
అంత్యక్రియలకు డబ్బుల్లేవ్.. కేవలం రూ.30తో బతికాం: ప్రముఖ దర్శకురాలు
ఫరా ఖాన్ బాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ చిత్రనిర్మాతగా, కొరియోగ్రాఫర్‌గా ఫరా ఖాన్ సినిమాల్లో తనదైన ముద్ర వేసింది. ఆమె అందించిన చాలా పాటలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఆమె 80 సినిమాల్లో దాదాపు 100 పాటలకు సంగీతమందించారు. మొదట మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఫరా ఖాన్ ఆ తరువాతే దర్శకురాలిగా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె జీవితంలో ఎదురైన అత్యంత దుర్భర పరిస్థితులను వివరించారు. దాదాపు ఆరేళ్ల పాటు స్టోర్ రూమ్‌లో నివసించినట్లు వెల్లడించింది. ఇటీవలే 'ఇండియన్ ఐడల్ 13' కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఫరా ఖాన్ మాట్లాడూతూ..' మా తండ్రి చనిపోయినప్పుడు కేవలం 30 రూపాయలు మాత్రమే ఉన్నాయి. నాకు 18 ఏళ్ల వయసులో మరణించాడు. ఆయనకు అంత్యక్రియలు నిర్వహించడం కూడా కష్టంగా మారింది. తన సోదరుడు సాజిద్ ఖాన్‌కు అప్పుడు 14 ఏళ్లు. దీంతో తమ బంధువుల ఇంటిలోని స్టోర్ రూమ్‌లో ఆరేళ్ల పాటు నివసించాం. చివరకు తమకు ఇంటి స్థలం కూడా లేదని వాపోయారు. బిగ్ బాస్-16వ పాల్గొన్న ఆమె సోదరుడు సాజిద్ ఖాన్ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. మద్యం మత్తులో తన తండ్రి చనిపోతే అంత్యక్రియలకు చెల్లించడానికి కూడా కుటుంబం వద్ద డబ్బు లేదని అన్నారు. ఆ సమయంలోనే సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ అంత్యక్రియలు, రేషన్, కరెంటు బిల్లుల కోసం డబ్బు ఇచ్చాడని తెలిపారు. -
Sania Mirza: సానియా మీర్జా బర్త్‌డే.. షోయబ్ మాలిక్ పోస్ట్ వైరల్
Sania Mirza- Shoaib Malik: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పుట్టినరోజు నేడు. ఆమె ఈరోజు(నవంబరు 15) 36వ వసంతంలో అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సానియాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. లవ్ యూ ఫరా ఈ క్రమంలో సానియా మీర్జా బెస్ట్ ఫ్రెండ్, బాలీవుడ్ కొరియోగ్రాఫర్,దర్శకురాలు ఫరా ఖాన్.. సానియా కేక్ కట్ చేస్తున్న వీడియోను షేర్ చేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు స్పందించిన సానియా.. ‘‘లవ్ యూ’’ అంటూ బదులిచ్చారు. షోయబ్ విషెస్ ఇదిలా ఉంటే.. సానియా వైవాహిక జీవితానికి సంబంధించి ఇటీవల పలు వదంతులు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. భర్త షోయబ్ మాలిక్‌కు దూరంగా ఉంటున్న ఆమె విడాకులకు సిద్ధమయ్యారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో సానియా బర్త్‌డే సందర్భంగా షోయబ్ చేసిన పోస్టు వైరల్ అవుతోంది. అవన్నీ అబద్ధాలేనా? భార్య కళ్లల్లోకి ఆప్యాయంగా చూస్తూ ఉన్న ఫొటోను పంచుకున్న ఈ వెటరన్ క్రికెటర్.. ‘‘పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలు, సంతోషాలతో నీ జీవితం విలసిల్లాలి. నీదైన ఈ రోజును పూర్తిగా ఆస్వాదించు’’ అంటూ ఆమెను విష్ చేశాడు. ఈ ఫొటో చూసిన షోయబ్ ఫ్యాన్స్.. ‘‘విడాకుల రూమర్లు అబద్ధమని తేలినట్లేగా! మీది చూడముచ్చటైన జంట. మీరిలా ఎల్లప్పుడూ కలిసే ఉండాలి’’ అంటూ ఆకాంక్షిస్తున్నారు. కొడుకుతో సానియా- షోయబ్ సరిహద్దులు దాటిన ప్రేమ పాకిస్తాన్‌కు చెందిన ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్‌ను ప్రేమించిన సానియా.. 2010 ఏప్రిల్‌లో అతడిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి కుమారుడు ఇజహాన్ సంతానం. ఇక ఓ మోడల్‌తో షోయబ్ ప్రేమలో పడ్డాడని, అందుకే సానియాను దూరం పెట్టడంతో ఆమెకు విడాకులకు సిద్ధమయ్యారని పాక్ మీడియాలో ఇటీవల కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సానియాతో కలిసి మీర్జా మాలిక్ షో చేస్తున్నట్లు ప్రకటించడం సహా ఇలా భార్య పుట్టిన రోజున షోయబ్ విషెస్ తెలపడం గమనార్హం. చదవండి: Sania Mirza-Shoaib Malik: విడాకులకు సిద్ధమైన సానియా? ‘ఒకే ఒక్క ప్రేమ’ అని ఫరా కామెంట్.. ముక్కలైన హృదయం అంటూ.. View this post on Instagram A post shared by Shoaib Malik (@realshoaibmalik) View this post on Instagram A post shared by Farah Khan Kunder (@farahkhankunder) -
అఫిషియల్: అలియాకు ఫర్హా ఖాన్ విషెస్, బయటికొచ్చిన వీడియో చాట్
ప్రస్తుతం బాలీవుడ్లో అలియా భట్, రణ్‌బీర్ కపూర్ల పెళ్లి హాట్‌టాపిక్‌గా మారింది. వీరి పెళ్లి ముహుర్తం, వివాహ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు పెళ్లిలో కాబోయే జంట ధరించే పెళ్లి పట్టలు, నగలు నుంచి వివాహ వేదిక వరకు అన్నింటిపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే పెళ్లి వార్తలపై ఇప్పటి వరకు అలియా కానీ, రణ్‌బీర్ కానీ స్పందించలేదు. దీనిపై ఇరు కుటుంబాలు కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో అలియా-రణ్‌బీర్ పెళ్లి వార్తలను అఫిషియల్ చేస్తూ తాజాగా ఓ వీడియో నెట్టింట దర్శనం ఇచ్చింది. చదవండి: పెళ్లి తేదీ వాయిదా వేసుకున్న లవ్‌బర్డ్స్! కారణం ఇదేనా? మహిళ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ వీడియో కాల్లో అలియాతో మాట్లాడుతూ కనిపించారు. ఇందులో అలియా వెనకాలే రణ్‌బీర్ కూడా కనిపించాడు. ఓ రెస్టారెంట్లో విందుకు వెళ్లిన ఫరా ఖాన్, ఆమె స్నేహితులు అలియాకు శుభాకాంక్షలు తెలుపుతూ గట్టిగా అరిచారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమైంది. అయితే ఈ లవ్‌బర్డ్స్ త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగు పెట్టబోతున్నారంటూ వచ్చే వార్తలు నిజమేనంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఈ వీడియో చూసిన ఈ జంట ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా అలియా-రణ్‌బీర్‌కు నెటిజన్లు సైతం శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఏప్రిల్ 13, 14, 15 తేదీల్లో ఈ జంట ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అలియా-రణ్‌బీర్‌ల వెడ్డింగ్ తేదీ వాయిదా పడిందని ఆమె కజిన్ రాహుల్ స్పష్టం చేశాడు. రీసెంట్గా మీడియాలో మాట్లాడుతూ.. వెడ్డింగ్ ప్లాన్స్ బయటకు రావడం వల్లే పెళ్లి తేదీని ఏప్రిల్ 20కి వాయిదా వేసినట్లు అతడు చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by POP Diaries (@ipopdiaries) -
KBC 13: చిన్నారి చికిత్సకు రూ.16 కోట్ల ఇంజెక్షన్.. అమితాబ్ సాయం
బాలీవుడ్ స్టార్, బిగ్ బీ అమితాబచ్చన్‌కి ఉన్న గొప్ప మనసు గురించి తెలిసిందే. ఆయన ఎంతోమందికి సాయం చేస్తుంటాడు. తాజాగా ఓ చిన్నారికి సైతం ఆర్థిక సహాయం చేసేందుకు సిద్ధమయ్యాడు. వివరాలు ఇలా.. కౌన్ బనేగా కరోడ్‌పతి షోకి బిగ్ బీ హోస్ట్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేబీసీ 13వ సీజన్ నడుస్తోంది. ఈ షోకి అతిథులుగా సెలబ్రీటీలను పిలవడం పరిపాటి. ఎవరు వచ్చినా గెలుచుకున్న ప్రైజ్‌మనీని ఏదో ఒక మంచి పనికి ఉపయోగిస్తుంటారు. తాజాగా ఈ షోకి కొరియోగ్రాఫర్, దర్మకురాలు ఫరాఖాన్, హీరోయిన్ దిపికా పదుకొనే అతిథులుగా వచ్చారు. ఈ ఎపిసోడ్‌కి చెందిన కొత్త ప్రోమోని సోనీటీవీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందరిలాగే తాము గెలుచుకున్న మొత్తాన్ని స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీతో బాధపడుతున్న 17 నెలల చిన్నారి అయాన్ష్ సహాయార్థం ఇస్తామని ఫరాఖాన్ తెలిపింది. ఆ బాలుడికి రెండో ఏటా వేయాల్సిన ఒక ఇంజక్షన్ ఖరీదు 16 కోట్లని, అందుకే చికిత్స కోసం సాయం చేయాలనుకుంటున్నట్లు తెలిపి ఎమోషనల్ అయింది. అమితాబ్ మాట్లాడుతూ.. ‘విచిత్రమైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అయాన్ష్ కోసం ఫరా ఈ షోలో పాల్గొంటోంది. నాకు ఇక్కడ చెప్పాలో లేదో తెలియట్లేదు కానీ ఆ చిన్నారికి నేను కూడా ఆర్థిక సహాయం చేస్తాను’అని తెలిపాడు. కానీ ఎంత మొత్తం చేసేది మాత్రం తెలియజేయలేదు. అంతేకాకుండా దీపికా తన ఫౌండేషన్ ‘లివ్ లవ్ లాఫ్’ గురించి షోలో మాట్లాడింది. 2014లో చాలా డిప్రెషన్లోకి వెళ్లానని, ఆ సమయంలో చనిపోవాలని కూడా అనుకున్నానని భావోద్వేగానికి లోనైంది. అందుకే మానసికంగా బాధపడుతున్న వారికి సహాయం చేసేందుకు ఫౌండేషన్ నెలకొల్పినట్లు తెలిపింది. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
కేబీసీలో దీపికా, ఫరా సందడి: మాంచి మ్యూజికల్ ట్రీట్
సాక్షి, ముంబై: హిందీలో పాపులర్ రియాల్టీ షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ హవా మామూలుగా లేదు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా ఉన్న ఈ షో ప్రస్తుత సీజన్లో కూడా అత్యంత ప్రజాదరణతో దూసుకుపోతోంది. కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్-13లో రానున్న ఎపిసోడ్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్, న్యత్య దర్శకురాలు ఫరా ఖాన్ సందడి చేయనున్నారు. ముఖ్యంగా రానున్న గణేష్ చతుర్థి సందర్భంగా (శుక్రవారం, సెప్టెంబరు 10) ప్రసారం కానున్న ఎపిసోడ్లో దీపికా, ఫరా ఖాన్ ఈ షోలో హంగామా చేయనున్నారు. తనదైన శైలిలో ఫరా పంచ్‌లు విసురుతోంటే దీపిగా పగలబడి నవ్వుతూ అభిమానులకు కనువిందు చేసింది. ఈ సందర్భంగా అమితాబ్ హోస్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చదవండి : బాబాయి అందమైన వీడియో, నటి భావోద్వేగం అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కార్యక్రమంలో మ్యూజికల్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ ఫైనలిస్టు తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ, విన్నర్ పవన్ దీప్ రాజన్, అరుణితా కంజిలాల్ తమ మ్యూజికల్ ట్రీట్‌తో మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు రిలీజ్ చేశారు. అలాగే పవన్ దీప్ కూడా దీన్ని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దీంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. రానున్న ఎపిసోడ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. చదవండి : కోటి రూపాయలను తలదన్నే కథ View this post on Instagram A post shared by Pawandeep Rajan (@pawandeeprajan) -
రెండు డోసులు.. అయినా ఫరా ఖాన్‌కు కరోనా పాజిటివ్
Farah Khan Tests COVID-19 Positive : బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ కరోనా బారిన పడింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ తనకు పాజిటివ్ వచ్చిందని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు వెల్లడించింది. 'రెండు సార్లు టీకా వేయించుకున్నా. అలాగే డబుల్ డోస్ టీకా తీసుకున్న జనాలతో పని చేస్తున్న నాకు కరోనా సోకుతుందని అస్సలు ఊహించలేదు. దాదాపు నాతో సన్నిహితంగా మెలిగిన అందరికీ వెంటనే కోవిడ్ టెస్ట్ చేసుకోమని చెప్పాను. ఒకవేళ పొరపాటున ఎవరికైనా చెప్పడం మర్చిపోయుంటే దయచేసి పరీక్ష చేయించుకోండి. వీలైనంత త్వరగా ఈ వైరస్‌ను జయిస్తానని ఆశిస్తున్నాను' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చింది. కాగా ఫరా ఖాన్ ప్రస్తుతం జీ కామెడీ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇప్పుడామెకు కరోనా అని తేలడంతో ఆమె స్థానాన్ని భర్తీ చేసేందుకు సింగర్ మైకా సింగ్‌ను షోకు రప్పించనున్నారని సమాచారం. ఈ మధ్యే ఆమె సూపర్ డ్యాన్సర్ 4 షోలో గెస్ట్‌గా అలరించగా, కౌన్ బనేగా కరోడ్ పతి 13వ సీజన్లో ఆమె మీద ఒక ఎపిసోడ్ కూడా చిత్రీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
కింగ్ ఖాన్ పుట్టినరోజు.. ‘మనం కలిస్తే మ్యాజిక్కే’
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నేడు 55వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. సోమవారం ఆయన 56వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా సెలబ్రిటీలు, అభిమనుల నుంచి సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం షారుక్ యూఏఈలో ఉన్నారు. అక్కడ జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తన జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మద్దతు ఇస్తున్నారు. ఇక షారుక్ తన 30 ఏళ్ల కెరీర్లో దాదాపు 90 చిత్రాల్లో నటించారు. చిత్ర పరిశ్రమలోని అందరి హీరోయిన్లతో కలిసి పనిచేశారు. ఈ క్రమంలో షారుక్‌తో కలిసి జీరో, జబ్ తక్ హై జనాన్ వంటి సినిమాలో నటించిన అనుష్క శర్మ బర్త్‌డే విషెస్ తెలిపారు. చదవండి: ‘షారుక్‌లా అవ్వాలంటే ఏం తినాలి?’ అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షారుక్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. లెజండరీ, ఒపెన్ హార్టెడ్నెస్, ఇంటెలిజెన్స్.. అల్ ఇన్ వన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పోస్టు చేశారు. అలాగే షారుక్‌తో కలిసి అనేక పాటలకు కొరియోగ్రఫ్ చేసిన ఫరా ఖాన్.. గతంలో షారుక్‌తో దిగిన ఫోటోను షేర్చేస్తూ ఆయనకు బర్త్‌డే విషెస్ తెలిపారు. అదే విధంగా షారుక్ నటించిన ‘బాజీగర్’ సినిమాతో బాలీవుడ్లో అడుగు పెట్టి శిల్పా శెట్టి తన మొదటి హీరోకు ట్వీట్ చేశారు. ‘నా మొదట హీరో, నా బాజిగర్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. జీవితంలో అన్ని ఆనందాలను పొందాలని ఆశిస్తున్నాను’. అని పేర్కొన్నారు. చదవండి: షారుఖ్ ‘మన్నత్’ను అమ్మేస్తున్నాడా?! View this post on Instagram Happy birthday @iamsrk .. the most valuable Antiques are old friends 😘😜 ♥️ A post shared by Farah Khan Kunder (@farahkhankunder) on Nov 1, 2020 at 8:53pm PST దిల్‌తో పాగల్ హై, కోయలా, అంజమ్, దేవదాస్ వంటి చిత్రాల్లో షారుక్‌తో నటించిన మాధురి దీక్షిత్ తన సహ నటుడికి బర్త్‌డే విషెస్ తెలిపారు. వీరిద్దరు కలిసి దిగిన ఫోటోను పోస్టు చేస్తూ.. ‘మనం కలిసినప్పుడల్లా ఎంతో ఆనందంగా ఉంటుంది. ఏదో మ్యాజిక్ జరుగుతుంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు. జాగ్రత్తగా ఉండండి. త్వరలో మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నా’ అని తెలిపారు. ఇదిలా ఉండగా కింగ్ ఖాన్ పాత స్నేహితుల్లో ఒకరైన జూహి చావ్లా ఎస్ఆర్కే పుట్టిన రోజు సందర్భంగా 500 మొక్కలను నాటినట్లు ట్విటర్లో వెల్లడించారు. కాగా ప్రతి ఏడాది నవంబర్ 2న షారుక్ పుట్టిన రోజు సందర్బంగా ఆయన ఇంటి వద్ద వేలాది మంది అభిమానులు గుమ్మి గూడుతారు. ‘మన్నత్’గా పేరొందిన విలాసవంతమైన ఆ బంగ్లా ఖరీదు దాదాపు రూ. 200 కోట్లు. అయితే కోవిడ్ కారణంగా ఈ ఏడాది ఎవరూ గుంపులుగా రావొద్దని షారుక్ వేడుకున్నారు. అయితే ఈసారి తన పుట్టిన రోజున మన్నత్‌ను తన అభిమానులకు వర్చువల్ రియాల్టీ ద్వారా చూపించేందుకు సిద్దం అవుతున్నట్లు ప్రకటించాడు. వీఆర్ సెట్‌ను ఉపయోగించి మన్నత్ ను అనువనువు 360 డిగ్రీలు తిరిగి చూసే వీలును షారుఖ్ కల్పించబోతున్నాడు. ఇది నిజంగా అభిమానులకు స్పెషల్ గిఫ్ట్ అనే చెప్పుకోవచ్చు. -
ఫరాఖాన్‌ను అనుకరించిన కమెడియన్ కూతురు
-
ఫరాఖాన్‌ను అనుకరించిన కమెడియన్ కూతురు
ముంబై: బాలీవుడ్ ప్రముఖ కమెడియన్ జాన్ లివర్ కూతురు అచ్చం బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరాఖాన్‌లా మాట్లాడుతూ తనని అనుకరిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనని కౌగిలించుకోవాలని ఉందంటూ ఫర్హా ఈ వీడియోను ట్విటర్లో బుధవారం పంచుకున్నారు. దీనికి ఫర్హా ‘ఎంత సరదాగా చేశారు... మిమ్మల్ని కౌగిలించుకోవాలని ఉంది. అచ్చం నాలాగే మాట్లాడుతున్నారు. మీలో చాలా ప్రతిభ ఉంది’ అంటూ #IHateMyVoice అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేసి ట్వీట్ చేశారు. (చదవండి: కనీసం ఒక్క ఛాన్స్ ఇవ్వండి: నటి) 5 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో జాన్ కూతురు అచ్చం ఫరాలా మాట్లాడమే కాకుండా తనలా నటిస్తూ.. తన దర్శకత్వం, కొరియోగ్రఫీని కూడా అనుకరిస్తున్న ఆమెపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘ఆమె అచ్చం మీలా మాట్లాడుతుంది. అదే వాయిస్ కూడా’. ‘తను అద్భుతం’ ‘తనకు మంచి భవిష్యత్తు ఉంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వారం క్రితం జాన్ లీవర్ షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటీ వరకు 3.8 లక్షలకు పైగా వ్యూస్, వచ్చాయి. This is TOOO FUNNY.. https://t.co/NY2LTqnJ1R @Its_JamieLever Ur sooo talented! Want to hug u n gag u at the same time😂 #ihatemyvoice — Farah Khan (@TheFarahKhan) July 8, 2020 -
వివాదాస్పద ట్వీట్.. రంగోలి ఖాతా తొలగింపు
కంగనా రనౌత్ సోదరి, ఫైర్‌బ్రాండ్ రంగోలి చందేల్ ట్విటర్ ఖాతాను అధికారులు తొలగించారు. ఓ వర్గాన్ని ఉద్ధేశించి రంగోలి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోందని బాలీవుడ్ సెలబ్రిటీలు చేసిన ఆరోపణలపై స్పందించిన ట్విటర్ అధికారులు ఆమె అకౌంట్‌ను సస్పెండ్ చేశారు. కాగా బుధవారం ఉత్తర ప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తిని ఐసోలేషన్‌కు తరలిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై రంగోలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక నిర్ధిష్ట వర్గానికి చెందిన వారిని, సెక్యూలర్ మీడియాను కాల్చి చంపాలని రంగోలి ట్వీట్ చేశారు. (రంగోలి సంచలన వ్యాఖ్యలు) ఈ ట్వీట్ కాస్తా వైరలవ్వడంతో రంగోలి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని దర్శకుడు రీమా కగ్టి, నటి కుబ్రా సైత్తోపాటు కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ సహా ట్విటర్లో ఫిర్యాదు చేశారు. ఒక వర్గంపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినందుకు, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన రంగోలిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముంబై పోలీసులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు ట్యాగ్ చేశారు. వీటిపై స్పందించిన ట్విటర్ అధికారులు వెంటనే రంగోలి అకౌంట్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. చివరికి రంగోలి అకౌంట్‌ను అధికారులు తొలగించడంతో ఫరాఖాన్తోపాటు తదితర నటులు ట్విటర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. (‘అలా అయితే.. కంగనా నటన వదిలేస్తుంది’) Thank you @Twitter @TwitterIndia @jack for suspending this account. I reported this because she targeted a specific community and called for them to be shot along with liberal media and compared herself to the Nazis. 🙏🙏🙏 . pic.twitter.com/lJ3u6btyOm — Farah Khan (@FarahKhanAli) April 16, 2020 -
సెలబ్రిటీలు, ఇది కరోనా పార్టీ కాదు
లాక్డౌన్ వల్ల ఇంట్లో జరుగుతున్న ఈ చిన్న విషయాన్నైనా అభిమానులతో పంచుకుంటున్నారు సెలబ్రిటీలు. అందులో భాగంగా ఇంటి పనులు చేస్తూ, వంట చేస్తూ, షూటింగ్స్ లేవు కదా అని బద్దకించకుండా వర్కవుట్స్ చేస్తూ వీటన్నింటినీ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయిత ప్రస్తుత విపత్కర పరిస్థితిలో వర్కవుట్ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంపై ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ మండిపడింది. జనాలకు ఉపయోగపడే వీడియోలను చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె సెలబ్రిటీలను ఉద్దేశిస్తూ.. "ముందుగా అందరినీ క్షమాపణ కోరుతున్నా. వ్యాయామం చేయడం అవసరమే. నేను ప్రతిరోజు బాల్కనీలో ఒక గంట నడుస్తాను. కానీ ప్రస్తుత పరిస్థితి గురించి నేను ఆందోళన చెందుతున్నాను. ఇది ప్రపంచం జరుపుకుంటున్న పార్టీ కాదు, ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. మీరు చేయాల్సిన మంచిపనులు ఎన్నో ఉన్నాయి. అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు. సెలబ్రిటీలు పెద్ద మనసుతో ఎన్నో సహాయ సహకారాలు చేసినప్పటికీ ఇలాంటి చిన్నపొరపాట్లే చేటుని తెస్తాయి. ఇదొక్కటే కాదు. సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారిని గుర్తించి ఆదుకోండి. నా పన్నెండేళ్ల కూతురు మూగజీవాలకు తిండి పెట్టేందుకు దారులు వెతుకుతోంది. నా కొడుకు అందరికీ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా పాటలు రాసేందుకు పూనుకున్నాడు. కాబట్టి ఇలాంటి సమయంలో మీ పాపులారిటీని పక్కనపెట్టి కదలండి. మీరు తల్చుకుంటే ఏదైనా చేయగలరు, కానీ అందుకు ఇంకా సిద్ధపడట్లేదు" అని విమర్శించింది. కాగా బాలీవుడ్ హీరోహీరోయిన్లు కత్రినా కైఫ్, అర్జున్ కపూర్, జాక్వలిన్ ఫెర్నాండేజ్, సారా అలీఖాన్, మలైకా అరోరా, రకుల్ ప్రీత్‌సింగ్, శిల్పా శెట్టి పలువురు వర్కవుట్ వీడియోలు షేర్ చేసిన లిస్టులో ఉన్నారు. అయితే ఆమె నేరుగా ఏ ఒక్కరి పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. (వైరసవత్తరమైన సినిమాలు) -
కరోనా: జంతువుల కోసం కుంచె పట్టి..
-
వినూత్నంగా విరాళాలు సేకరించిన చిన్నారి
లాక్డౌన్ వల్ల పేద ప్రజలకు పూట గడవడం కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఎంతోమంది పెద్ద మనసుతో ముందుకు వచ్చి వారికి నిత్యావసర సరుకులు అందిస్తూ, నిర్భాగ్యులకు భోజనం పెడుతున్నారు. సినీ సెలబ్రిటీలు కూడా తమకు తోచిన విధంగా సాయం చేస్తూ కష్టకాలంలో మీకు అండగా మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ పన్నెండేళ్ల కూతురు అన్యా జంతువుల కోసం ఆలోచించింది. వాటికి భోజనం ఎలా దొరుకుతుందని తనలో తానే మధనపడింది. మండుటెండలో తిండీ, నీళ్లు దొరక్క అవి చనిపోకూడదని నిశ్చయించుకుంది. అందుకోసం మూగజీవాల చిత్రాలను గీసి వాటిని అమ్మకానికి పెట్టింది. ఒక్కో చిత్రాన్ని రూ.1000 చొప్పున అమ్మింది. అలా ఇప్పటివరకు రూ.70 వేల వరకు విరాళాలను సేకరించింది. (కరోనా కుయ్యో మొర్రో) ఈ విషయాన్ని డైరెక్టర్ ఫరాఖాన్ ట్విటర్లో స్వయంగా వెల్లడించారు. తన కూతురు అన్య డ్రాయింగ్ ద్వారా ఐదురోజుల్లో 70 వేల రూపాయలను సేకరించిందని తెలిపింది. వీటిని వీధి జంతువులకు ఆహారాన్నందించేందుకు వినియోగించనున్నట్లు పేర్కొంది. పెంపుడు జంతువుల చిత్రాలను గీయమని ఆర్డర్లు ఇచ్చినవారితోపాటు, విరాళాలిచ్చినవారికి కతజ్ఞతలు తెలిపింది. కాగా చిన్నాపెద్ద, సామాన్యుడు సెలబ్రిటీ తేడా లేకుండా అందరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నేను సైతం అంటూ ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. (‘హ్యాపీ బర్త్‌డే మమ్మీ.. లవ్ యూ ఎవర్’) -
కోర్టు మెట్లెక్కిన ప్రముఖ హాస్య నటి
చంఢీగర్ : బాలీవుడ్ కామెడీ క్వీన్ భారతీ సింగ్ పంజాబ్, హరియాణా హైకోర్టు తలుపు తట్టారు. క్రిస్టియన్ల మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలపై బాలీవుడ్ నటి రవీనా టాండన్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్, హాస్యనటి భారతి సింగ్‌పై అమృత్సర్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాగా, తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని, కేసుకు సంబంధించిన విచారణపై స్టే విధించాలని భారతీ సింగ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏ మతానికి చెందిన మనోభావాలను తాను కించపరచలేదని పిటిషన్లో పేర్కొన్నారు. భారతీ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ నేడు పంజాబ్, హరియాణ హైకోర్టులో విచారణకు రానుందని ఆమె తరపు లాయర్ అభినవ్ సూద్ తెలిపారు. (చదవండి : చిక్కుల్లో ఆ ముగ్గురు) కాగా, క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్లో ప్రసారమైన ఒక టీవీ షోలో రవీనా టాండన్, ఫరా ఖాన్, భారతీ సింగ్ క్రైస్తవ మత భావాలకు వ్యతిరేకంగా అవమానకరమైన, ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారంటూ క్రిస్టియన్ ఫ్రంట్ అజ్నాలా బ్లాక్ అధ్యక్షుడు సోను జాఫర్ అజ్నాలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా వివిద సెక్షన్ల కింద అమృత్సర్ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఇక కేసు విచారణలో భాగంగా ఈ ముగ్గురూ తమ ముందు హాజరు కావాలని అమృత్సర్ పోలీసులు మూడు వారాల కింద నోటీసులు ఇచ్చారు. దాంతో రవీనా టాండన్, ఫరా ఖాన్ జనవరి 23న హైకోర్టును ఆశ్రయించగా.. వారిద్దరిపై మార్చి 25 వరకు ఎలాంటి బలవంతపు విచారణ చేపట్టొద్దని కోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. (చదవండి : రెండేళ్లుగా ఇలాగే ఉంది.. అయినా..) -
‘హ్యాపీ బర్త్‌డే మమ్మీ.. లవ్ యూ ఎవర్’
ముంబై : బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్, ప్రొడ్యూసర్ ఫరా ఖాన్ గురువారం తన పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ రోజుతో ఆమె 55వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. దీంతో బాలీవుడ్ ప్రముఖుల నుంచి ఫరాఖాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ స్టార్ మాధురి దీక్షిత్.. ఫరాతో కలిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ‘మనం కలిసినప్పుడల్లా నవ్వుతూనే ఉంటాం. ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉన్నందుకు నీకు ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చారు. యే జవానీ హై దివానీ సినిమాలో వీరిద్దరూ కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. ఫరా కొరియాగ్రాఫిలో మాధురీ, రణ్‌బీర్ కపూర్ కలిసి ఘాగ్రాకు పాటకు స్టెప్పులేశారు. మరోవైపు ఫరాఖాన్‌ను ప్రేమగా అమ్మ అని పిలుస్తూ.. ‘హ్యాపీ బర్త్‌డే మమ్మీ.. లవ్ యూ ఎవర్’ అంటూ కత్రినా కైఫ్ విష్ చేశారు. బాలీవుడ్ నడుటు అనిల్ కపూర్ సైతం ఫరాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ ఏడాది మీరు అనుకున్నవన్నీ సాధించాలని కోరుకుంటున్నా, పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని తెలిపారు. వీరితోపాటు రవీనా టండన్, అనన్య పాండే, కార్తిక్ ఆర్యన్ తదితరులు ఫరాకు బర్తడ్ విషేస్ తెలిపారు. ఇక దాదాపు వంద పాటలకు పైగా కొరియోగ్రఫి చేసిన ఫరా.. ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు. View this post on Instagram Love you faru @farahkhankunder to the moon and back! Happpyyyy Birthdayyy ! The karmic connection continues.. 😜😜andar bahar, bahar andar 😂😂😂😂😂😂😘😘😍 A post shared by Raveena Tandon (@officialraveenatandon) on Jan 9, 2020 at 2:04am PST -
ముగ్గురు సెలబ్రిటీలపై మూడో కేసు..
చండీగఢ్ : బాలీవుడ్ సెలబ్రిటీలు మరోసారి న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటున్నారు. ఓ టీవీ షోలో పాల్గొన్న బాలీవుడ్ నటి రవీనా టాండన్, దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్, హాస్యనటి భారతి సింగ్‌లు మత భావాలకు వ్యతిరేకమైన వ్యాఖలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఉద్దేశపూర్వకంగా వారు వ్యాఖ్యలు చేశారంటూ క్రిస్టియన్ ఫ్రంట్ అజ్నాలా బ్లాక్ అధ్యక్షుడు సోను జాఫర్ అజ్నాలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాజాగా వీరిపై మరో కేసు నమోదైంది. మతాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. కంబోజ్నగర్ వాసి పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు శనివారం వారిపై కేసు నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 295-ఎ ప్రకారం వారిపై కేసు నమోదు చేశామని ఫిరోజ్‌పూర్ ఎస్ఎస్పీ వివేక్ శీల్ సోనీ పేర్కొన్నారు. వీరిపై ఎఫ్ఐర్ నమోదు కావటం ఈ వారంలో మూడోసారి కావడం గమనార్హం. వివిధ సెక్షన్ల కింద ఈ ముగ్గురు బాలీవుడ్ సెలబ్రిటీలుపై కేసు నమోదు చేశామని.. తదుపరి దర్యాప్తు జరుగుతోందని అమృత్సర్ రూరల్ పోలీసు అధికారి విక్రమ్ జీత్ దుగ్గల్ తెలిపారు. ఈ ఆరోపణలపై బాలీవుడ్ నటి రవీన్ టాండన్ స్పందిస్తూ.. తాను ఏ మతాన్ని అవమానించినట్లు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని ఇదివరకే తెలిపారు. తన సహచర నటులు ఫరా ఖాన్, భారతి సింగ్‌లు సైతం ఎవరిని అవమానించలేదని ఆమె పేర్కొన్నారు. ఒకవేళ ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. మరోవైపు తాము అన్ని మతాలను గౌరవిస్తామని.. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలన్న ఉద్దేశం తమకు లేదని హాస్యనటి భారతి సింగ్ అన్నారు. తమ వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలైనా గాయపడితే.. మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నామని భారతి సింగ్ తెలిపారు. -
చిక్కుల్లో ఆ ముగ్గురు
అమృత్సర్: బాలీవుడ్ సెలబ్రిటీలు న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. ఒక మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో పంజాబ్‌లో కేసు నమోదైంది. ఒక టెలివిజన్ షోలో క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారన్న ఫిర్యాదుపై బాలీవుడ్ నటి రవీనా టాండన్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్, హాస్యనటి భారతి సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. క్రిస్మస్ సందర్భంగా ప్రసారమైన ఒక టీవీ షోలో రవీనా టాండన్, ఫరాఖాన్, భారతి సింగ్ క్రిస్టయన్ మత భావాలకు వ్యతిరేకంగా అవమానకరమైన, ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారంటూ క్రిస్టియన్ ఫ్రంట్ అజ్నాలా బ్లాక్ అధ్యక్షుడు సోను జాఫర్ అజ్నాలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా వివిద సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్టు పోలీసు అధికారి వెల్లడించారు. సంబంధిత షో వీడియో ఫుటేజీని కూడా ఫిర్యాదుదారుడు అందించినట్టు తెలిపారు. 295 -ఏతోపాటు వివిధ సెక్షన్ల కింద ముగ్గురిపై కేసు నమోదు చేశామని, తదుపరి దర్యాప్తు జరుగుతోందని అమృతసర్ రూరల్ పోలీసు అధికారి విక్రమ్ జీత్ దుగ్గల్ తెలిపారు. -
షాహిద్‌కు అవార్డు ఇవ్వకపోవచ్చు!
బాలీవుడ్ హిట్ చిత్రం కబీర్‌సింగ్.. అందులోని కథానాయకుడు షాహిద్‌కపూర్‌కు ఎలాంటి అవార్డులు రాకపోవచ్చని ప్రముఖ దర్శక నిర్మాత ఫరా ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కబీర్‌సింగ్’ నిలిచింది. షాహిద్ కపూర్ కెరీర్లోనే అతిపెద్ద సోలో హిట్‌గా రికార్డులు సృష్టించింది. సందీప్ వంగా దర్శకత్వంలో తెలుగు సినిమా అర్జున్ రెడ్డికి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదలైనప్పుడు హీరో క్యారెక్టర్, బిహేవియర్ గురించి చాలా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఫరా ఖాన్ ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ.. కబీర్‌సింగ్ ఎంత ఘన విజయం సాధించినా, షాహిద్ నటన ఎంత బాగున్నా ఈ సినిమాకు ఎలాంటి అవార్డు రాకపోవచ్చు. ఎందుకంటే సినిమాకు వసూళ్లతో పాటు విమర్శలు కూడా భారీగానే వచ్చాయి. ఎవరైనా అవార్డు ఇవ్వాలనుకునే వాళ్లు ఈ విమర్శల గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే కబీర్‌సింగ్ చిత్రం విజయం సాధించిన తర్వాత షాహిద్‌కపూర్ స్పందిస్తూ ప్రజల ఆలోచనా ధోరణిలో చాలా మార్పు వచ్చిందనే విషయం స్పష్టమైందన్నారు. ఈ పరిణామం ఇండస్ట్రీకి మరింత ప్రోత్సాహకంగా ఉంటుందని ఆయన తెలిపారు. -
రెండోసారి...
హృతిక్ రోషన్ కెరీర్లో పెద్ద హిట్స్‌లో ఒకటైన ‘అగ్నిపథ్’ చిత్రం అదే పేరుతో చేసిన అమితాబ్ బచ్చన్ చిత్రానికి రీమేక్ అనే సంగతి తెలిసిందే. తాజాగా మరో అమితాబ్ సినిమా రీమేక్‌లో హృతిక్ నటించబోతున్నాడని బాలీవుడ్ సమాచారం. అమితాబ్ హీరోగా 1982లో వచ్చిన ‘సట్టే పే సట్టా’ చిత్రాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా ఫరాఖాన్ రీమేక్ చేసేందుకు స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారట. ఈ సినిమాలో నటించడానికి హృతిక్ అంగీకారాన్ని తెలిపారని తెలిసింది. ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్‌లో ఉందట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రానుంది. రోహిత్‌శెట్టితో కలసి ఫరాఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. -
#మీటూ : స్పందించిన సాజిద్ సోదరి
మీటూ ఉద్యమం రోజురోజుకూ ఉధృతమవుతున్న నేపథ్యంలో..బాలీవుడ్ నటి సలోని చోప్రా డైరెక్టర్ సాజిద్ ఖాన్ పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నటులు డ్రెస్ మార్చుకునే గదుల్లోకి వచ్చి అసభ్యంగా ప్రవర్తించేవాడని, వారి డ్రెస్ తీసి చూపించమని అడిగేవాడని, వాటిని తను అడ్డుకోబేతే బయటకు పంపేవాడని పేర్కొంది. తనను లైంగికంగా వాడుకునేందుకు ప్రయత్నించాడని ఆరోపించింది. సినిమాలో అవకాశం కావాలంటే తనతో గడపాలన్నాడని, చాలా మంది మహిళలను ఇలానే వాడుకున్నాడని తెలిపింది. సమయం వచ్చింది కాబట్టి ఇవన్నీ ఇప్పుడు బయటపెడుతున్నట్లు సలోని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సాజిద్ సోదరి ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ఫరా ఖాన్ స్పందించారు. ‘ఇది మా కుటుంబానికి ఎంతో బాధాకరమైన సమయం. కొన్ని క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి మేం కృషి చేయాలి. ఒకవేళ నా సోదరుడు ఓ మహిళ పట్ల అలా ప్రవర్తించి ఉంటే..అతడు తన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మహిళలను ఎవరైనా కించపరిచినా.. ఇబ్బందిపెట్టేటట్లు ప్రవర్తించినా..మేము బాధిత మహిళకు మద్దతుగా ఉంటాం. ఇలాంటివి సహించమ’ని ఫరా ఖాన్ ట్వీట్ చేశారు. This is a heartbreaking time for my family.We have to work through some very difficult issues. If my brother has behaved in this manner he has a lot to atone for.I don’t in any way endorse this behavior and Stand in solidarity with any woman who has been hurt. — Farah Khan (@TheFarahKhan) October 12, 2018 సలోలి చోప్రా ఆరోపణల నేపథ్యంలో సాజిద్ ఖాన్ దర్శకత్వంలో చేస్తున్నహౌస్ ఫుల్ 4 చిత్రాన్ని ఆపేస్తున్నట్లు అక్షయ్ కుమార్ ప్రకటించాడు. సాజీద్ ఖాన్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ పూర్తైన తరువాత షూటింగ్ మొదలు పెడుదామని ట్వీట్ చేశాడు. -
‘హౌస్‌ఫుల్’పై మీటూ ఎఫెక్ట్
‘మీటూ’ ఉద్యమానికి సంబంధించి పది రోజులుగా యాక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, రైటర్స్, డైరెక్టర్స్, సింగర్స్‌లపై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి సినీ కెరీర్‌పై ‘మీటూ’ ఉద్యమం ప్రభావం చూపిస్తున్నట్లుంది. మహిళలను లైంగికంగా వేధించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న సుభాష్ కపూర్‌తో కలిసి పని చేయలేనని చెప్పేశారు ఆమిర్‌ఖాన్. ఇప్పుడు అక్షయ్ కుమార్ కూడా ఇదే బాటలో నడుస్తానంటున్నారు. ‘హౌస్‌ఫుల్ 4’ షూటింగ్‌ను వెంటనే ఆపివేయాలని అక్షయ్ ఈ సినిమా నిర్మాత సాజిద్ నడియాడ్వాలాను కోరినట్లు బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ‘హౌస్‌ఫుల్ 4’ డైరెక్టర్ సాజిద్ ఖాన్, నటుడు నానా పటేకర్లపై ‘మీటూ’ ఆరోపణలు రావడమే ఇందుకు కారణమని బాలీవుడ్ టాక్. ‘‘విదేశాలు నుండి ఇంటికి తిరిగి రాగానే ‘మీటూ’ ఉద్యమానికి చెందిన కథనాలను చదివి కలత చెందాను. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులపై విచారణ జరగాలి. బాధితులకు సరైన న్యాయం జరగాలి. మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారితో కలిసి నటించాలని నేను అనుకోవడం లేదు’’ అన్నారు అక్షయ్ కుమార్. ‘హౌస్‌ఫుల్’ ఫ్రాంచైజీలో వస్తున్న నాలుగో పార్ట్ ‘హౌస్‌ఫుల్ 4’. ఇందులో అక్షయ్‌కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, పూజా హెగ్డే, కృతీ కర్భందా, కృతీసనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘‘మీటూ’ ఉద్యమంలో భిన్న రంగాల మహిళలు తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి చెప్పిన విషయాలు నన్ను ఆవేదనకు గురి చేశాయి. స్రీలు ఇలా తమ చేదు అనుభవాలను బయటపెట్టడానికి నిజంగా ధైర్యం కావాలి. వారి కథనాలను వినాలి కానీ జడ్జ్ చేయకూడదు. బాధిత స్త్రీలందరికీ నా మద్దతు తెలుపుతున్నా. అలాగే ‘హౌస్‌ఫుల్ 4’కు సంబంధించి అక్షయ్ కుమార్ నిర్ణయాన్ని నేనూ కట్టుబడి ఉండాలనుకుంటున్నా అన్నారు ‘హౌస్‌ఫుల్ 4’ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్న రితేష్ దేశ్‌ముఖ్. అలాగే హౌస్‌ఫుల్ 4 సినిమా నుంచి నానా పటేకర్ తప్పుకున్నారని బాలీవుడ్ టాక్. తన వల్ల ‘హౌస్‌ఫుల్ 4’ సినిమా టీమ్‌కు ఇబ్బంది కలగకూడదని నానా పటేకర్ ఫీల్ అయ్యారని హిందీ చిత్రపరిశ్రమలో తాజాగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల నానా పటేకర్‌పై తనుశ్రీ దత్తా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు తన మీద వచ్చిన ఆరోపణలకు సాజిద్ ఖాన్ స్పందించారు. నైతిక బాధ్యత వహిస్తున్నా ‘మీటూ’ ఉద్యమంలో నాపై వచ్చిన ఆరోపణల కారణంగా నా కుటుంబ సభ్యులు, నా నిర్మాతలు, నా సినిమాల్లోని హీరోల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాను. అందుకే ఈ ఆరోపణలకు సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ, నిజం నిరూపితమయ్యే వరకు డైరెక్టర్ చైర్ నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటున్నాను. అలాగే నా స్నేహితులకు, మీడియా వారికి ఒక విన్నపం. నిజం నిరూపించబడే వరకు దయచేసి నాపై వస్తున్న ఆరోపణలను పాపులర్ చేయకండి’’ అని ‘హౌస్‌ఫుల్ 4’ దర్శకుడు సాజిద్ ఖాన్ అన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్ నిర్ణయాల పట్ల నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ‘‘అక్షయ్ కుమార్‌కు సెల్యూట్. మీటూ ఉద్యమంలో భాగంగా అక్షయ్ లాగే చాలా మంది స్పందించి మహిళలకు సమానత్వం, గౌరవం అనే అంశాల్లో అండగా నిలుస్తారని ఆశిస్తున్నాను. అప్పుడు మహిళలు ఇండస్ట్రీలో సంతోషంగా పనిచేసే వాతావరణం ఏర్పడుతుంది’’ అని కన్నడ కథానాయిక పరుల్ యాదవ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. పక్కదారి పట్టకూడదు తాజాగా ఈ విషయంపై కమల్‌హాసన్ స్పందించారు. ‘‘మీటూ’ ఉద్యమంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు పెదవి విప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్యమం నిజాయతీగా సక్రమమైన మార్గంలో వెళితే మంచి మార్పు వస్తుంది. కానీ ఇది పక్కదారి పట్టకూడదు. తప్పుడు ఆరోపణలు తెరపైకి రాకూడదు. నిజం ఉన్నప్పుడు ‘మీటూ’ ఉద్యమం తప్పుకాదు. సమాజంలో మహిళల సమస్యలను అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే కాదు పురాణాల కాలం నుంచే మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నారు’’ అని కమల్ పేర్కొన్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వస్తున్న ‘మీటూ’ కథనాలు నన్ను బాధించాయి. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. తాము ఎదుర్కొన్న భయంకరమైన సంఘటలను షేర్ చేసిన మహిళలందరికీ నేను మద్దతు తెలుపుతున్నాను. ఇప్పుడు మహిళలందరూ ఏకతాటిపైకి రావడం మంచి పరిణామంగా భావిస్తున్నాను. మీటూ గొంతు ఇప్పుడు జాతీయ స్థాయిలో వినిపిస్తోంది. మాట్లాడాల్సిన సమయం ఇదే. మంచి మార్పుకు కూడా సరైన సమయం ఇదే. – రకుల్ ప్రీత్‌సింగ్ ‘మీటూ’ కథనాల వల్ల బాగా డిస్ట్రబ్ అయ్యాను. మహిళలకు సొసైటీలో గౌరవం, భద్రత ఉండాలి. అందుకు నేను, నా కంపెనీ కట్టుబడి ఉంటాం. మీటూ ఉద్యమ బాధితులకు నా మద్దతు ఉంటుంది. – అజయ్ దేవగన్ బయటకు వస్తున్న పేర్ల కంటే కూడా ఆ సంఘటనలు జరిగిన విధానం నన్ను ఎక్కువగా బాధిస్తున్నాయి. అలాగే ఇన్ని భయంకరమైన సంఘటనలు కూడా మంచు కొండలో కోన మాత్రమే అని అనుకుంటున్నాను’’ అని ట్వీట్ చేశారు. – తాప్సీ మా కుటుంబానికి చాలా విషాదకరమైన సమయం ఇది. ఇప్పుడు మేము కొన్ని సమస్యలను ఎదుర్కొనక తప్పదు. నా తమ్ముడు సాజిద్ ఖాన్‌పై వచ్చిన ఆరోపణలు ఒకవేళ నిజమే అయితే ఆ బాధిత మహిళలకు ఒక మహిళగా నా సపోర్ట్ ఉంటుంది – ఫరా ఖాన్ కథానాయికలు రిచా చద్దా, కృతీ సనన్, ఫరాఖాన్, చిత్రాంగద సింగ్‌లతో పాటు మరికొందరు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ‘మీటూ’ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. - -
వామ్మో.. నా గదిలో యువతి!: నటుడు
ముంబై : బాలీవుడ్లో నటీనటులు, దర్శకులు-నిర్మాతల, ఇతర యూనిట్ మధ్య మంచి సంబంధాలు ఉంటాయన్నది తెలిసిందే. అయితే కొన్నేళ్ల కిందట జరిగిన ఓ సన్నివేశాన్ని నటుడు ఉదయ్ చోప్రా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం నటుడి పోస్ట్ వైరల్ అవుతోంది. కొరియోగ్రాఫర్‌గా పేరుతెచ్చుకున్న తర్వాత దర్శకత్వ శాఖలోనూ భారీ సినిమాలు తీశారు ఫరా ఖాన్. అమెను ఓ ఏడాది దీపావళి పార్టీలో భాగంగా అనుకోకుండా కలిశాను. అది ఎలా అంటే.. ఆరోజు ఇంట్లో నేను నా గదిలోకి వెళ్లి చూసేసరికి బెడ్‌మీద ఓ యువతి నిద్రిస్తున్నట్లు గుర్తించాను. వెంటనే మెట్లు దిగుతూ కిందకి పరుగులు తీశాను. నా గదిలో ఎవరో అమ్మాయి ఉందని చెప్పేసరికి.. అంతా ఆమె ఫరా ఖాన్ అని ఒక్కసారిగా అన్నారు. నువ్వు నా బెడ్ అక్రమించుకున్నా నిన్ను ప్రేమిస్తున్నాను ఫరా’ అంటూ ఉదయ్ చోప్రా ట్వీట్ చేశారు. ఫరా ఖాన్ కూడా ఉదయ్ ట్వీట్‌పై అంతే ఫన్నీగా స్పందించారు. ఉదయ్ అది నేను కాదు. మీనాక్షి శేషాద్రి. నేను ఆది రూములో నిద్రపోయాను. ఐ లవ్ యూ టూ’అని ఫరా పోస్ట్ చేశారు. ‘అవును అది ఆది బెడ్ అని నాకు తెలుసు. కానీ మాకు ప్రత్యేక గదులు లేవు. ఇద్దరం ఒకే రూములో ఉన్నామని’ ఉదయ్ మరో ట్వీట్ చేశాడు. ఓహ్.. అయితే మా ఇద్దరిలో నిన్ను ఎవరు అంతగా భయపెట్టారో నాకు తెలియదు. నేనా.. లేక మీనాక్షినా. సమాధానం చెప్పవద్దు ప్లీజ్’ అని ఫరా మరో రీట్వీట్ చేశారు. వీళ్ల మరిచిపోలేని జ్ఞాపకాలు ఫ్యాన్స్‌కు చాలా ఆనందాన్ని పంచుతున్నాయి. The first time I encountered @TheFarahKhan was at a Diwali party. I was sleepy and wanted to go to bed and when I went to my room she was sleeping there. I ran downstairs and said there’s a girl in my bed and everyone said ya that’s Farah. Love u farah even though u stole my bed! — Uday Chopra (@udaychopra) 1 July 2018 Udayyyyy.. that was Meenakshi sheshadri😂i went to sleep in Adi’s room.. n i Lov u too.. ♥️ https://t.co/DgJvwDrD4C — Farah Khan (@TheFarahKhan) 1 July 2018 Ohhhhh then I don’t know who scared u more.. me or Meenakshi?😂Dont answer pls https://t.co/FwRYosnX8r — Farah Khan (@TheFarahKhan) 1 July 2018 -
పెళ్లింట... బ్యాండ్ బాజా
పెళ్లింట ధూమ్ ధామ్‌గా దుమ్ము రేపే డ్యాన్స్‌తో హంగామా చేయడానికి సోనమ్ కపూర్ అండ్ గ్యాంగ్ రెడీ అయ్యారు. అదేంటీ ఆనంద్ అహూజాతో సోనమ్ పెళ్లి మేలో కదా? ఇప్పుడే గానా భజానాకి ఎందుకు రెడీ అయ్యారు అనుకుంటున్నారా? నిజమే. పెళ్లికి టైమ్ ఉంది. కానీ ఆమె నటిస్తున్న ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా రిలీజ్‌కు టైమ్ దగ్గరపడుతోంది. ట్రైలర్ రిలీజ్‌కు జస్ట్ ఐదారు రోజులే ఉంది. ఆ ట్రైలర్ కోసమే ఈ హంగామా. పైగా రియల్ వెడ్డింగ్కన్నా ముందే షూటింగ్ పూర్తి చేసేయాలని సోనమ్ హడావిడి పడుతున్నారట. ప్రస్తుతం తీస్తున్న పాట తాలూకు చిన్న బిట్‌ను ట్రైలర్లో చూపించాలనుకుంటున్నారట. శశాంక్ ఘోష్ దర్శకత్వంలో సోనమ్ కపూర్, కరీనా కపూర్, స్వర భాస్కర్, తన్సానీయా ముఖ్య పాత్రలుగా రూపొందిన సినిమా ‘వీరే ది వెడ్డింగ్’. నలుగురు అమ్మాయిల మ్యారేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా కథనం సాగనుంది. ఆఫ్టర్ మ్యారేజ్ కరీనా కపూర్ నటిస్తున్న తొలి చిత్రమిదే. ప్రస్తుతం ఆ సినిమాలో ‘తరీఫన్...’ అనే స్పెషల్ సాంగ్‌ను షూట్ చేస్తున్నారు. తరీఫన్ అంటే పంజాబీలో కాంప్లిమెంట్స్ అని అర్థం అట. ఈ సాంగ్‌కు ఫరాఖాన్ కుందర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సాంగ్‌కి డ్యాన్స్ చేయడానికే సోనమ్ అండ్ గ్యాంగ్ రెడీ అయింది. ‘‘ఫైనల్‌గా సోనమ్ కపూర్‌తో లవ్లీ సాంగ్ చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు ఫరాఖాన్. ‘‘ఫరా.. మీతో కలిసి వర్క్ చేయడం నా లక్. ఈ సాంగ్ చేస్తున్నందుకు థ్యాంక్స్’’ అన్నారు సోనమ్. మరి... ఈ పెళ్లింట బ్యాండ్ బాజా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమాను జూన్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
ఆత్మ విశ్వాసమే.. వారి గెలుపు గీతం
ఆత్మ విశ్వాసమే పెట్టుబడిగా ముందుకు సాగుతూ కళా, సాంకేతిక, వ్యాపారం వంటి వివిధ రంగాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకుని, మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తోన్న మణిహారికలు ఈ అతివలు. సుధా మూర్తి, రచయిత్రి పొదుపు చేయటంలో మహిళలు దిట్ట అంటారు. అలా ఒకానొక నాడు సుధా మూర్తి పొదుపు చేసిన 10 వేల రూపాయలు ఆమె భర్త స్థాపించిన ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ పెట్టుబడిగా ఉపయోగపడ్డాయి. 1974లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి కంప్యూటర్ సైన్స్ విభాగంలో పట్టా పొందిన మొదటి మహిళా ఇంజనీర్గగా చరిత్రకెక్కారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ స్థాపించి ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాల పంపిణీ, పేద విద్యార్థుల విద్యకై నిధులు వెచ్చించడం వంటి పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. రచయిత్రిగా గుర్తింపు పొందారు. 13 పుస్తకాలు రచించారు. వాటిలో రెండు ఆంగ్ల రచనలు కూడా ఉన్నాయి. రోహిణి నీలేకని, సామాజిక కార్యకర్త భారత వ్యాపారవేత్త నందన్ నీలేకని భార్య. సామాజిక కార్యకర్త. జర్నలిస్టుగా కూడా పనిచేశారు. అక్షర ఫౌండేషన్ ద్వారా సుమారు లక్ష మంది పిల్లలకు సాయం అందిస్తున్నారు. నిరాండంబర జీవితాన్ని గడపడానికే ఇష్టపడతారు. ఫరాఖాన్, కొరియోగ్రాఫర్ బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఫరాఖాన్. కొరియోగ్రాఫర్‌గా, యాడ్ ఫిల్మ్ మేకర్‌గా, పలు టీవీ షోల నిర్వహణకర్తగా ప్రాచుర్యం పొందిన ఫరాఖాన్ తన అభిమాన హీరో షారూఖ్ ఖాన్ ‘మై హూ నా’ సినిమాతో దర్శకురాలిగా మారారు. ఓం శాంతి ఓం వంటి పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. లీలా శాంసన్, నృత్యకారిణి తొమ్మిదేళ్ల ప్రాయంలోనే కళాక్షేత్రంలో అడుగుపెట్టి, దివ్యఙ్ఞాన పాఠశాలలో చేరిన తర్వాత కళనే ఊపిరిగా భావించారు. భరతనాట్యం సాధన చేసి, కళాక్షేత్రంలో తన వంటి ఎందరో నృత్యకారులను తయారు చేసేందుకు నాట్య పాఠాలు నేర్పుతున్నారు. ఆశా భోస్లే, గాయని ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ సోదరిగానే కాకుండా మధురమైన గాత్రంతో అందరినీ అలరించే గాయనిగా అభిమానుల్ని సంపాదించుకున్నారు ఆశా భోస్లే. సుమారు ఆరు దశాబ్దాలుగా తన పాటల ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. సినిమా పాటలే కాకుండా, సంప్రదాయ సంగీతంతో పాటు గజల్స్, భజనలు, కవ్వాలీలు ఆలపిస్తారు. హిందీలోనే కాకుండా మరెన్నో ఇతర భాషల్లో పాటలు పాడారు. సంగీత ప్రపంచంలో అత్యధిక పాటలు రికార్డు చేయబడిన సింగర్‌గా ‘గిన్నిస్ బుక్ రికార్డు’ సాధించారు. మల్లికా శ్రీనివాసన్, వ్యాపారవేత్త భారతదేశంలో రెండో అతిపెద్ద ట్రాక్టర్ల తయారీ కంపెనీ ‘టాఫె’ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. టీవీఎస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ భార్యగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. టాఫెలో జనరల్ మేనేజర్‌గా చేరి 86 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ బాధ్యతలు చేపట్టి 2600 కోట్లకు చేర్చారు. రూపా పురుషోత్తమన్, ఆర్థిక నిపుణురాలు ప్రతిష్టాత్మక ‘యేల్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్’ నుంచి పట్టా పొందారు. ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడి యాజమాన్య సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. బ్రిక్స్ దేశాల ఎకానమి ప్రశంసా పత్రాల సహరచయితగా వ్యవహరించారు. న్యూయార్క్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చి ప్రస్తుతం ముంబైలోని ఆర్థిక సంస్థ పాంటాలూన్ రీటైల్లో పనిచేస్తున్నారు. ఆమె భర్త న్యూయార్క్ సిటీ ఎడుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఏక్తా కపూర్, ప్రొడ్యూసర్ సినీ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు ఏక్తా కపూర్. బాలాజీ టెలీఫిల్మ్స్ అధినేతగా, సినీ నిర్మాతగా ఎన్నో విజయవంతమైన సీరియళ్లు, సినిమాలు నిర్మించారు. బోల్డ్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ‘నేను ఇంట్లోనూ పని చేస్తాను.. పనిచేసే ప్రదేశం కూడా నాకు ఇల్లు వంటిదే’ అంటూ వృత్తి పట్ల తన నిబద్ధతను తెలియజేశారు. ప్రేమ ధన్‌రాజ్ ఎనిమిదేళ్ల ప్రాయంలో కాలిన గాయాలతో సీఎమ్సీ వెల్లూర్ ఆస్పత్రికి చేరారు ప్రేమ ధన్‌రాజ్. తల్లి కోరిక మేరకు వైద్య విద్యనభ్యసించి, నేడు అదే ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీ వైద్య విభాగానికి ప్రధాన అధికారిగా వ్యవహరిస్తున్నారు. బర్న్ విక్టిమ్స్(కాలిన గాయాలతో బాధపడేవారు ) కోసం పలు అంతర్జాతీయ సంస్థలు నిర్వహిస్తున్న అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆమె దేవున్ని నమ్ముతారు. ప్రతీ ఆదివారం చర్చ్‌కి వెళ్తారు. రోజుకు 18 గంటలు పనిచేస్తారు.‘ఒకరితో ఎప్పుడు పోల్చుకోకు. ఏ సత్యాన్రైనా ధైర్యంగా స్వీకరించి, జీవితంలో ముందుకు సాగు’అనేది ఆమె పాటించే జీవన సత్యం. షాయెస్తా అంబర్ అఖిల భారత ముస్లిం మహిళా వ్యక్తిగత లా బోర్డు స్థాపించి సంస్కరణలు తీసుకువచ్చేందుకు పాటుపడ్డారు. ఖురాన్ పేరిట ముస్లిం మహిళల పట్ల వివక్ష చూపిస్తున్న మౌల్వీల వ్యవహార శైలిని ప్రశ్నించారు. ఈ కారణంగా ఆమె మతపెద్దల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది. లక్నో యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందారు. ఉర్దూ- పర్షియన్ సాహిత్యంలో ఆమెకు ప్రావీణ్యం ఉంది. లక్నో పరిసర గ్రామాల్లో ‘గాడ్‌మదర్’గా పేరు పొందారు. ‘ఒక ముస్లిం మహిళగా నా భర్త ఆదేశాలు తప్పనిసరిగా ఆచరించాల్సిందే. కానీ నేను చేసే ప్రతీ పనికి ఆయన సహకారం ఉంటుందని’ పేర్కొన్నారు. సోనియా మన్చంద్ర, డిజైనర్ పాంటాలూన్, న్రిత్యగ్రామ్ వంటి ప్రముఖ కంపెనీలకు డిజైన్లు రూపొందిస్తున్నారు. 35 మందితో ప్రారంభమైన ఆమె ‘ఎ న్యూ ఇడియమ్’ నేడు 125 మందికి చేరి భారత్‌లో అతిపెద్ద డిజైనర్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. ‘కంపెనీ ప్రారంభించిన మొదట్లో డిజైన్లు చూపించేందుకు హోటల్‌కి రావాల్సిందిగా ఒక కస్టమర్ కోరారు. తీరా అక్కడికి వెళ్లాక నా పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ’ ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని పంచుకున్నారు. లక్ష్మీ పురి, దౌత్యవేత్త జెనీవాలోని ఐక్యరాజ్య సమితి వాణిజ్యాభివృద్ధి సంస్థకు భారత దౌత్యవేత్తగా వ్యవహరించారు. వాణిజ్య రంగంలో భారత్ అభివృద్ధికై తన వంతు కృషి చేశారు. పరిపూర్ణమైన, శాంతయుతమైన, భద్రత కలిగిన ప్రపంచ రూపకల్పనకై కృషి చేసినందుకు ఐక్యరాజ్య సమితి అందించే ‘పవర్ ఆఫ్ వన్ అవార్డు’ అందుకున్నారు. మంజులా రావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ‘బెస్ట్ బేకరీ కేసు’ (2002లో వడోదరలో జరిగిన అల్లర్లలో 14 మంది మరణించారు) కోసం ప్రత్యేక న్యాయవాదిగా నియమితులైన సమయంలో కేసు గురించి పూర్తి అవగాహన పెంచుకునేందుకు గుజరాతీ నేర్చుకుని మరీ వాదించారు. వృత్తి పట్ల ఆమె నిబద్ధతకు ఇది నిదర్శనం. ప్రముఖ మాజీ క్రికెటర్ సీకె నాయుడు మనుమరాలు. బాంబే వాలీబాల్, బాడ్మింటన్ జట్లకు ప్రాతినిథ్యం వహించారు. మీనాక్షీ చౌదరి, ఊర్వశి గులాటి, కేశ్నీ ఆనంద్ అరోరా(ఐఏఎస్ అధికారిణిలు) ఈ ముగ్గురు సోదరీమణులే ఒకప్పుడు పరోక్షంగా హర్యానా ప్రభుత్వాన్ని నడిపించారు. ఎలాగంటే.. చౌదరి హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, గులాటి వైద్య, విద్య కార్యదర్శిగా, అరోరా హోం ప్రత్యేక కారదర్శిగా పనిచేశారు. పంజాబ్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కూతుళ్లైన వీరు ముగ్గురు పనిచేసే చోట తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. సిస్టర్ సుధా వర్గిస్, సామాజిక కార్యకర్త పేదరికం వల్ల ఎలుకలనే ఆహారంగా తీసుకునే ‘ముసహర్ల’(బీహార్‌లోని ఎస్సీ వర్గం) ఉద్ధరణకై కేరళ నుంచి బీహార్‌కు వెళ్లారు. వివిధ కేసుల నుంచి వారిని విముక్తి చేసేందుకు న్యాయ విద్యనభ్యసించారు. ఆమె సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. రష్మీ సింగ్, నేవీ అధికారిణి భారత్‌లో మొదటి మహిళా స్కైడైవింగ్ శిక్షకురాలు. 400 సార్లు ఆకాశంలో చక్కర్లు కొట్టిన ఆమె, యుద్ధ నౌక ఐఎన్ఎస్ విరాట్ సముద్రంలో ఉండగానే డైవింగ్ చేస్తూ డెక్‌పై ల్యాండ్ అయ్యారు. వైజాగ్‌లోని నౌకాదళ ఎయిర్‌బేస్‌లో ట్రాఫిక్ కంట్రోల్ ఆఫీసర్‌గా పనిచేశారు. రుత్ మనోరమ, హక్కుల పరిరక్షణకర్త జాతీయ మహిళా కూటమి అధ్యక్షురాలిగా పనిచేశారు. దళితుల సమస్యల పరిష్కారానికై పోరాడారు. దళితుల్లో దళితులుగా పరిగణింపబడుతున్న దళిత మహిళల హక్కులకై కృషి చేశారు. అషూ సూయశ్, ఆర్థిక నిపుణురాలు సిటీగ్రూప్ సంస్థలో చాలా ఏళ్లు సీఏగా పనిచేసిన తర్వాత, ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ మ్యూచ్‌వల్ ఫండ్ సంస్థను బోస్టన్‌లో ప్రారంభించారు. దేశీయంగా 3600 కోట్ల టర్నోవర్, అంతర్జాతీయంగా 250 బిలియన్ డాలర్ల టర్నోవర్‌తో కంపెనీని అభివృద్ధి పథంలో నడిస్తున్నారు. భారత పెట్టుబడి రంగంలోని మహిళలకు ఆదర్శంగా నిలిచారు. అనురాధా పాల్, తబలా వాయిద్యకారిణి పురుషులు మాత్రమే తబలా వాయిద్యకారులుగా ఉన్న సమయంలో మహిళా వాయిద్యకారిణిగా తనకంటూ ప్రత్యేక ఒరవడిని సృష్టించుకున్నారు. ఆంగ్ల సాహిత్యంలో పీజీ చేశారు. ఆల్ ఉమన్ పర్కుషన్ బ్యాండ్, స్త్రీ శక్తిని స్థాపించారు. అన్ని రకాల సంగీతాన్ని ప్రోత్సహించేందుకు కృషి చేశారు. లతికా ఖనేజా, స్పోర్ట్స్ మేనేజర్ ప్రముఖ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, ఒలంపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రాలకు స్పోర్ట్స్ మేనేజర్‌గా వ్యవహరించారు. ఐఐఎమ్ కలకత్తా నుంచి పట్టభద్రురాలైన లతిక వ్యాపార ఒప్పందాలు కుదర్చటంలో దిట్ట. అనితా నాయర్, రచయిత్రి కేరళకు చెందిన ప్రముఖ భారతీయ ఆంగ్ల రచయిత్రి. సాహిత్య రంగంలో ఆమె కృషికి గుర్తింపుగా 2012లో కేరళ సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. ఆమె రచనలు విదేశీ భాషల్లో కూడా ప్రచురితమయ్యాయి. ప్రియాదత్, రాజకీయ వేత్త బాలీవుడ్ దంపతులు సునీల్‌దత్, నర్గీస్‌ల కుమార్తెగా, సంజయ్‌దత్ సోదరిగా సుపరిచితమైన ప్రియాదత్ రాజకీయవేత్త కూడా. 2005లో తండ్రి మరణానంతరం ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు ముంబై నార్త్ వెస్ట్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేసి ఎంపీగా గెలుపొందారు. గర్భవతిగా ఉన్న సమయంలో కూడా ప్రచారం నిర్వహించి, కార్యక్షేత్రంలో మహిళలు ఎంతటి కష్టనష్టాలకైనా వెరవరని నిరూపించారు. పద్మా రవిచందర్, ఐటీ నిపుణురాలు భారత సాంకేతిక రంగంలో శక్తిమంతమైన మహిళగా పద్మా రవిచందర్ పేరు పొందారు. బహుళజాతి కంపెనీ ‘పెరోట్ సిస్టమ్’ను ఒంటిచేత్తో నడిపిస్తూ తన కౌశల్యాన్ని నిరూపించుకున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని టెక్నోట్రీ సంస్థకు సీఈఓగా ఉన్నారు. రూపా గంగూలీ, నటి మహాభారతం సీరియల్లో ద్రౌపదిగా నటించి ప్రేక్షకుల దృష్టిని తనవైపునకు మరల్చుకున్నారు ఈ బెంగాలీ నటి. తూర్పు భారతదేశంలో ఉన్న అతికొద్ది మంది మహిళా నిర్మాతల్లో ఒకరు. వృద్ధులు, అనాథలను చేరదీసే ఎన్జీవోకి మార్గదర్శకురాలిగా వ్యవహరిస్తున్నారు. బెలిందా రైట్, వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ కలకత్తాలో జన్మించిన బెలిందా నేషనల్ జియోగ్రఫిక్ ఫోటోగ్రాఫర్‌గా, ‘లాండ్ ఆఫ్ టైగర్’ సినిమాకు బెస్ట్ ఫిల్మ్ మేకర్‌గా ఎన్నో అవార్డులు పొందారు. పులుల సంరక్షణకై ఆమె ఎంతగానో కృషి చేశారు. ‘వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా’ను స్థాపించారు. వినీతా బాలి, వ్యాపారవేత్త భారతీయ మహిళా వ్యాపారవేత్త. ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్(బీవరేజెస్, ప్యాకేజ్డ్ ఫుడ్స్) వ్యాపారంలో ప్రవేశించి అనతికాలంలోనే విజయవంతమయ్యారు. బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. - సుష్మారెడ్డి యాళ్ళ -
బాలీవుడ్.. బాష్
-
పసందుగా పదేళ్లు!
... కంప్లీట్ అయ్యాయి... హీరోయిన్గా దీపికా పదుకోన్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి. ఫరా ఖాన్ దర్శకత్వంలో షారుక్‌ఖాన్ హీరోగా నటించిన ‘ఓం శాంతి ఓం’ ద్వారా ఈ సొట్టబుగ్గల సుందరి హిందీ తెరపై మెరిసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా తర్వాత ఈ సౌత్ బ్యూటీ వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీ అయ్యారు. 2007 నవంబర్ 9న ఆ చిత్రం విడుదలైంది. హీరోయిన్గా పదేళ్లు కెరీర్ విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా దీపిక తిరుపతి వెళ్లారు. వెంకటేశ్వరుడి ఆశీస్సులు పొందారు. దీపిక తిరుమల వెళ్లిన ఫొటోను ఇన్సెట్లో చూడొచ్చు. తిరుపతిలోని పద్మావతి టెంపుల్ని కూడా సందర్శించారామె. లేటెస్ట్గా సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ ముఖ్యపాత్రల్లో రూపొందిన ‘పద్మావతి’ని డిసెంబర్ 1న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. పద్మావతి పేరుతో సినిమా చేశారు కాబట్టి, ప్రత్యేకంగా ఆ అమ్మవారి గుడికి వెళ్లి ఉంటారని ఊహించవచ్చు. ఆ సంగతి పక్కన పెడితే... గడచిన పదేళ్లలో ‘లవ్ ఆజ్ కల్, హౌస్‌ఫుల్, రేస్ 2, చెన్నై ఎక్స్‌ప్రెస్, పీకూ, బాజీరావ్ మస్తానీ’ వంటి హిట్ చిత్రాల్లో ఆమె నటించారు. గతేడాది ‘ట్రిపులెక్స్: రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్’ చిత్రం ద్వారా ఆమె హాలీవుడ్‌కి ఎంట్రి ఇచ్చిన సంగతి తెలిసే ఉంటుంది. రణబీర్ కపూర్‌తో లవ్, బ్రేకప్ తర్వాత కొంత డిప్రెషన్‌కి గురయ్యారు. ఆ సమయంలో సైకాలజిస్ట్‌ని కలసి, డిప్రెషన్ నుంచి బయటపడ్డారు. ఏమైతేనేం.. ప్రొఫెషనల్‌గా... పర్సనల్‌గా ఇప్పుడు దీపిక మంచి స్పేస్‌లో ఉన్నారు. -
ఈ స్టార్ హీరోయిన్ ని గుర్తు పట్టారా..?
బిగ్ బి అమితాబ్ బచ్చన్ కెరీర్ లో ఘనవిజయాల్లో హమ్ సినిమా ఒకటి. ఈ సినిమాలో అమితాబ్ చెప్పిన డైలాగ్స్, ఆయన బాడీ లాంగ్వేజ్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఈ సినిమాలో అమితాబ్ లుక్ ను ఇప్పటికీ అబిమానులు ఫాలో అవుతుంటారు. తాజాగా ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ హమ్ సినిమాలో అమితాబ్ గెటప్ లో దర్శనమిచ్చింది. ప్రముఖ దర్శకురాలు ఫరాఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న లిప్ సింగ్ బ్యాటిల్ కోసం బాలీవుడ్ నటి శిల్పాశెట్టి అమితాబ్ గెటప్ లో అలరించారు. హమ్ సినిమాలోని జుమ్మా చుమ్మా పాటకు బిగ్ బి స్టైల్ లో స్టెప్స్ వేసి ఆకట్టుకుంది శిల్పా. తన సోషల్ మీడియాలో పేజ్ లో బిగ్ బి గెటప్ కు సంబంధించిన ఫొటోతో పాటు ఓ వీడియోను పోస్ట్ చేసిన శిల్పా, నాజీవితంలోనే అతి కష్టమైన పని అంటూ కామెంట్ చేసింది. Totally into it! Only love @amitabhbachchan Sir.😬❤️❤️❤️❤️My Ode to you ! The most difficult task of my life 😱😇#respect #legend #challenging #unimitable A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on Sep 27, 2017 at 1:28am PDT 😅😅😅😅😅😅Playing "The Legend" @amitabhbachchan ,the man I love, adore and eulogise.. dunno how I gathered the gumption to do this . Huge pressure😰😅@farahkhankunder the things u make me do 🙈#lipsingbattle #challenge #Legend #friendswithoutbenefits A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on Sep 27, 2017 at 1:25am PDT -
ఆ నటుడి కూతురా? నమ్మలేం.. డీఎన్ఏ టెస్ట్ చేయండి!
బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య (18) ఇప్పుడు సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. అనన్య ఫొటోను ఆమె తల్లి భావన పాండే ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా.. కాసేపట్లోనే ఈ ఫొటో వైరల్‌గా మారింది. అనన్య అందం అదుర్స్ అంటూ ఎంతోమంది నెటిజన్లు కితాబిచ్చారు. అయితే, అంతకుమించి అన్నట్టు ఈ ఫొటోపై బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫర్హా ఖాన్ బాంబులాంటి కామెంట్ చేశారు. అనన్య చుంకీపాండే కూతురంటే నమ్మలేం.. డీఎన్ఏ పరీక్ష చేయించాలంటూ ఆమె పేర్కొన్నారు. సరదాగా ఆటపట్టించేందుకు ఆమె పెట్టిన ఈ కామెంట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. క్యూట్‌గా ఉన్న అనన్య ఫొటోకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1700లకుపైగా లైకులు వచ్చాయి. ఎంతోమంది కామెంట్ పెట్టారు. ఫర్హా ఖాన్ కూడా సరదాగా స్పందిస్తూ.. 'దయ చేసి డీఎన్ఏ పరీక్ష చేయించండి. తను చుంకీ కూతురంటే నమ్మలేం. చాలా లవ్లీగా ఉంది' అంటూ లాఫ్టర్ ఎమోజీతో కామెంట్ చేసింది. -
మీ పిల్లలు హిందువులా? ముస్లిములా?
ఫీల్ గుడ్ కొత్త సంవత్సరంలో గడిచింది పది రోజులే అయినా, మీరిప్పుడు ‘బ్యూటిఫుల్ ఆన్సర్ ఆఫ్ ది ఇయర్ – 2017’ ను వినబోతున్నారు. అంటే దీనర్థం 31 డిసెంబర్ 2017 వరకు ఇంత అందమైన సమాధానాన్ని మీరు వినే అవకాశమే లేదు! ‘ఫరాఖాన్ అండ్ ఫ్యామిలీ’ జనవరి ఒకటిన అరిజోనా (యు.ఎస్.) లోని ‘గ్రాండ్ కేనియన్’ శిఖరం చేరుకుంది. ఫరా తెలుసు కదా. బాలీవుడ్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్! ఆమె, ఆమె భర్త శిరీశ్ కుందర్, పిల్లలు జార్, అన్య, దివా.. గ్రాండ్ కొండలోయ పైకి చేరుకున్నాక.. తల్లీ పిల్లల్ని ఫోటో తీసి దాన్ని ట్విట్టర్లో షేర్ చేశాడు శిరీశ్. ఫొటో అందంగా ఉంది. (పైన మీరు చూస్తున్నదే). ఆ ఫొటో కింద శిరీశ్ రాసిన క్యాప్షన్ సరదాగా ఉంది. ‘‘నన్ను లోయలోకి తోసి, నా ఫ్యామిలీ.. శిఖరంపై సగర్వంగా నిలుచుంది. నేనెక్కడ ఉన్నానో తెలియడం లేదు. 2017 వచ్చేసిందా?’’ అని పోస్ట్ చేశాడు శిరీశ్. రెస్పాన్స్‌గా చాలా ట్వీట్లు వచ్చాయి. గ్రాండ్ కేనియన్ బాగుందనీ, ఫొటో బాగుందనీ, ఫరా బాగున్నారనీ, పిల్లలు చక్కగా ఉన్నారనీ, ఫొటో కాప్షన్ బాగుందనీ.. చాలా ట్వీట్లు వచ్చాయి. వీటికి భిన్నమైన ట్వీట్ కూడా ఒకటి వచ్చింది!‘‘మీ పిల్లలు హిందువులా? ముస్లింలా?’’.. అన్న ట్వీట్ అది. ఫరా ముస్లిం. శిరీశ్ హిందూ. అందుకే ఆ ట్వీటర్ అలా అడిగాడు.మరి దానికి శిరీశ్ ఏమని సమాధానం చెప్పి ఉంటాడు? గెస్ చెయ్యండి. ఈ లోపు ఈ దంపతుల గురించి కొన్ని ముచ్చటలు చెప్పుకుందాం. ఫరా కన్నా శిరీశ్ 8 ఏళ్లు చిన్న. 2004లో వీళ్ల మ్యారేజీ అయింది. ఫరా ముంబై అమ్మాయి. శిరీశ్ మంగుళూరు అబ్బాయి. ఫిల్మ్ రైటర్, ప్రొడ్యూసరు, డైరెక్టర్, ఎడిటర్, కంపోజర్. ‘మై హూ నా’ షూటింగ్లో వీళ్ల పరిచయం జరిగింది. 2008లో ఫరాకు ఆమె 43 ఏళ్ల వయసులో ‘ట్రిప్లెట్స్’ పుట్టారు. ఒకే డెలివరీలో ముగ్గురు పిల్లలు. ఫరాకు ప్రస్తుతం 51, శిరీశ్‌కు 43. ఫరా బర్త్ డే జనవరి 9న. నిన్ననే. సరే, ఇంతకీ ఆ ట్వీటర్ క్వొశ్చన్‌కి, శరీశ్ ఏమని ఆన్సర్ ఇచ్చాడు?ట్వీటర్ ప్రశ్న: మీ పిల్లలు హిందువులా? ముస్లిములా?శిరీశ్ ఆన్సర్: అది నెక్ట్స్ వచ్చే పండుగను బట్టి ఉంటుంది. గత వారం నా పిల్లలు క్రిస్టియన్లు. వావ్! ఎంత క్యూట్ రిప్లయ్! టచ్ చేశావ్ శిరీశ్. ఆన్సర్ ఆఫ్ ది ఇయర్. -
‘ఐదేళ్ల వరకు పిల్లల్ని కనకూడదా?’
ముంబై: కేంద్రం ఆమోదించిన సరోగసీ(అద్దెగర్భం) బిల్లు ముసాయిదాను బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ తీవ్రంగా వ్యతిరేకించారు. పౌరుల స్వేచ్ఛను హరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ‘మేమేం తినాలో మీరే చెబుతున్నారు. మేము ఎటువంటి బట్టలు ధరించాలో కూడా చెబుతున్నారు. పిల్లల్ని ఎప్పుడు కనాలో కూడా చెప్పేందుకు ఇప్పుడు రెడీ అయ్యార’ని ఫరాఖాన్ అన్నారు. 43 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ ద్వారా ఒకేసారి ముగ్గురు పిల్లలకు ఫరాఖాన్ జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. సరోగసీ ముసాయిదా బిల్లుతో సరోగసీ మహిళల హక్కులకు ఎటువంటి ప్రయోజనం ఉండదని ఫరాఖాన్ అభిప్రాయపడ్డారు. పెళ్లైన దంపతులను మాత్రమే సరోగసీకి అనుమతిస్తామని చెప్పడం, అదికూడా ఐదేళ్ల తర్వాతే అని బిల్లులో పొందుపరచడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దంపతులు ఐదేళ్ల వరకు పిల్లల్ని కనకూడదని ఎలా చెబుతారని ఆమె ప్రశ్నించారు. కరీనా కపూర్ కూడా సరోగసీ బిల్లుపై ఇంతకుముందు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అద్దెగర్భం ద్వారా శిశువులకు జన్మనిచ్చిన మహిళల ప్రయోజనాలు కాపాడేందుకు, కమర్షియల్ సరోగసిని నియత్రించేందుకు ఈ బిల్లు రూపొందించినట్టు కేంద్రం తెలిపింది. -
పేలుడు నుంచి తప్పించుకున్న లేడీ డైరెక్టర్
ముంబై: న్యూయార్క్ పేలుడు నుంచి బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరాఖాన్, ఆమె కొడుకు సీజర్ కుందర్ తృటిలో తప్పించుకున్నారు. న్యూయార్క్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సెంట్రల్ పార్క్ లో ఈ నెల 3న పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. సెంట్రల్ పార్క్ లో బాణా సంచా/మరేదైనా పేలుడు పదార్థంపై ఓ యువకుడు కాలు పెట్టినప్పుడు పేలుడు జరిగిందని 'న్యూయార్క్ డైలీ న్యూస్' వెల్లడించింది. పేలుడు ధాటికి యువకుడి కాలు తెగిపోయింది. బాంబ్ స్వ్కాడ్ ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించింది. కాగా, పేలుడు జరిగినప్పుడు తాము ఐఎన్ సెంట్రల్ పార్క్ లోనే ఉన్నామని ఫరాఖాన్ ట్విటర్ ద్వారా తెలిపారు. తాము అక్కడ ఉండగానే పలుడు సంభవించడం పట్ల ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాము క్షేమంగా ఉన్నామని వెల్లడించారు. Oh god can't believe v were IN Central Park whn the explosion happened!! pic.twitter.com/r04aJjo4eY — Farah Khan (@TheFarahKhan) July 3, 2016 -
దేవి(ల్)లో గెస్ట్‌గా ఫరాఖాన్
త్రిభాషా చిత్రం దేవి(ల్)లో బాలీవుడ్ ప్రముఖ నృత్య దర్శకురాలు ఫరాఖాన్ గెస్ట్ రోల్లో మెరవనున్నారు. ప్రభుదేవా, తమన్నా జంటగా విజయ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రానికి ఛ్ఛీఠిజీ()అనే పేరును నిర్ణయించారు. బాలీవుడ్ నటుడు సోనూసూద్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి హాలీవుడ్ కథారచయిత పాల్ అరూన్ విజయ్‌కి సహకార రచయితగా పని చేస్తున్నట్లు దర్శకుడు విజయ్‌నే స్వయంగా వెల్లడించారు. నిర్మాత కే.గణేశ్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంలో కొత్తగా ప్రముఖ బాలీవుడ్ నృత్య దర్శకురాలు ఫరాఖాన్ వ చ్చి చేరారు. దీని గురించి దర్శకుడు తెలుపుతూ చిత్ర కథ డిమాండ్ చేయడంతో ఫరాఖాన్‌ను నటింపజేస్తున్నామన్నారు. ఆమె హిందీలో చాలా పేరున్న నృత్య దర్శకురాలు, నటి, దర్శకురాలని అన్నారు. అయినా తాము అడగ్గానే దేవి(ల్) చిత్రంలో నటించడానికి అంగీకరించినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నానన్నారు. ఇందులో ఫరాఖాన్ నృత్యదర్శకురాలిగానే నటిస్తున్నారని తెలిపారు. -
హాలీవుడ్ స్టార్ హీరో.. బాలీవుడ్ డ్యాన్స్
హాలీవుడ్ యాక్షన్ స్టార్ జాకీచాన్ కొద్ది రోజులు భారత్‌లో సందడి చేస్తున్నాడు. తన కొత్త సినిమా కుంగ్ ఫూ యోగా కోసం షూటింగ్ షెడ్యూల్స్‌తో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇండో చైనీస్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాకీతో పాటు పలువురు భారతీయ నటులు కూడా కనిపించనున్నారు. ఇందులో భాగంగా తాజా షెడ్యూల్లో జాకీ చాన్, సోనూసూద్లపై ఓ పాటను చిత్రీకరించారు. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ కొరియోగ్రాఫిలో జాకీ చేసిన ఇండియన్ డ్యాన్స్ సినిమాకే హైలెట్ అన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం జోద్ పూర్, మండోర్ గార్డెన్స్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విశేషాలను కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ వెల్లడించారు. జాకీచాన్ తో కలిసి దిగిన ఫోటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఫరా, 'యాక్షన్ కింగ్ డ్యాన్ కూడా చేస్తాడు. తన పేరును జాకీ జాక్సన్‌గా మార్చుకోనున్నాడు' అంటూ కామెంట్ చేశారు. సోనూ సూద్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సౌత్ హీరోయిన్స్ అమైరా దస్తర్, దిశ పటానీలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. The King of action CAN dance n how!! Changing his name 2 Jackie Jackson!! #kungfu yoga pic.twitter.com/2rcQXvtKeg — Farah Khan (@TheFarahKhan) 4 April 2016 -
'అప్పుడే ఎనిమిదేళ్లు గడచిపోయాయి'
ముంబై : డైరెక్టర్ గా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ ట్విట్టర్ అకౌంట్ ఫాలోవర్లు 30లక్షలకు చేరుకున్నారు. 43 ఏళ్ల వయస్సులో ఐవీఎఫ్ ట్రీట్ మెంట్ ద్వారా ముగ్గురు పిల్లలకు తల్లి అయిన ఫరా.. గురువారం వారి 8వ పుట్టినరోజు వేడుకలను జరిపారు. ముగ్గురు పిల్లలు అన్య, సీజర్, దివాలు చిన్నప్పటి ఫొటోతోపాటు ప్రస్తుతం ఎలా ఉన్నారో తెలిపే మరో ఫోటోను అభిమానుల కోసం ట్విట్టర్లో పోస్టు చేశారు. 'జీవితానికున్న అసలైన అర్థం చూడకుండా ఉండకండి, సమయం చాలా వేగంగా ఎగిరిపోతుంటుంది. చూస్తుండగానే ఎనిమిదేళ్లు గడచిపోయాయి. మనం ప్రేమించేవాళ్లు ఉంటే నిజంగానే సమయం ఎగిరిపోతుంది, లేదంటే క్షణమొక యుగంలా అసలు కదలనే కదలదంటూ' ఫొటోలతో పాటు ట్వీట్ చేసి మాతృత్వపు మాధుర్యాన్ని ఎంతగా చవిచూస్తున్నారో చెప్పకనే చెప్పారు ఈ హ్యాపీ న్యూ ఇయర్ డైరెక్టర్. ఫరాఖాన్ ఎడిటర్, డైరెక్టర్ శిరీష్ కుందర్‌ను 2004లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తన చిన్నారుల పుట్టినరోజునే 30లక్షలకు చేరుకున్న అభిమానులను ట్విట్టర్ ఫ్యామిలీగా పేర్కొంటూ 'సదా నాతో ఉన్న అభిమానులందరికీ కృతజ్ఞతలు' అని తెలిపారు ఫరాఖాన్. Never lose sight of what life truly is meant to be..Time flies quicker than v know..2realise that wait 4 next tweet pic.twitter.com/MLlbu1ZEft — Farah Khan (@TheFarahKhan) February 11, 2016 8 yrs today!! Like I said.. Time flies..with the ones u love.. Without them it doesn't even move.. pic.twitter.com/BssxdrKqjW — Farah Khan (@TheFarahKhan) February 11, 2016 -
ఫుట్ పాత్ లు ఉన్నది పడుకోవడానికా?
ముంబై: సల్మాన్ ఖాన్ కు జైలు శిక్ష విధించిన నేపథ్యంలో డిజైనర్ ఫరా అలీఖాన్, గాయకుడు అభిజిత్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఫుట్ పాత్ లు ఉన్నది జనాలు నిద్రించడానికి కాదని అభిజిత్ ట్వీట్ చేశాడు. ఫుట్ పాత్ లపై ఏదైనా ప్రమాదం జరిగితే అందుకు బాధ్యత డ్రైవర్లు లేదా మద్యానికి కాదని పేర్కొన్నాడు. ఆత్మహత్య నేరం, మరి ఫుట్ పాత్ లపై పడుకోవడం నేరం కాదా అని ప్రశ్నించాడు. 80 శాతం మంది నిరాశ్రయులు ఎంతో కష్టపడి బాలీవుడ్ లో స్టార్ డమ్ సాధించారని వారెప్పుడూ ఫుట్ పాత్ లపై నిద్రించలేదని వ్యాఖ్యానించాడు. 'హిట్ అండ్ రన్'కు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిజైనర్ ఫరా అలీఖాన్ ట్వీట్ చేశారు. పేదలను నిరాశ్రయులను చేయడం వల్లే వారు ఫుట్ పాత్ లపై పడుకుంటున్నారని తెలిపారు. నిరాశ్రయులు ఫుట్ పాత్ పై నిద్రించకుండా ఉంటే సల్మాన్ వారిపై కారు ఎక్కించేవాడు కాదని పేర్కొన్నారు. పట్టాలు దాటుతున్న వ్యక్తిపై రైలు పోనిచ్చినందుకు రైలు డ్రైవర్ ను శిక్షించిన చందంగా సల్మాన్ ఖాన్ కు శిక్ష విధించారని అన్నారు. రోడ్డు లేదా ఫుట్ పాత్ లపై ఎవరూ నిద్రించరాదని... ఇది రైలు పట్టాలు దాటడం లాంటిదని ఆమె వర్ణించారు. అయితే తన వ్యాఖ్యలపై వివాదం రేగడంతో ఆమె వివరణ ఇచ్చారు. పేదలను అవమానించడం తన ఉద్దేశం కాదని, పాలకుల చేతగాని తనాన్ని ఎద్దేవా చేశానని చెప్పారు. పేదలకు ఇళ్లు నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. అభిజిత్ కూడా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు. మనుషులు కుక్కల్లా ఫుట్ పాత్ లపై పడుకోరాదన్నదే తన ఉద్దేశమని వివరణయిచ్చాడు. తన దృష్టిల్లో ప్రతి మనిషి గౌరవింపదగిన వాడేనని చెప్పాడు. -
దేవుడే దిగివచ్చినా!
బాలీవుడ్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే స్టార్లు ఖాన్ త్రయం... షారూఖ్, సల్మాన్, ఆమిర్. ఈ ముగ్గురు హీరోలూ... చాలా కాలం తరువాత ఈమధ్యే జరిగిన సల్మాన్ సిస్టర్ మ్యారేజ్‌లో ఒక్కటయ్యారు. అంతాబానే ఉంది గానీ... స్టార్ దర్శకురాలు ఫరాఖాన్ వీరిని తన కుకరీ షోకు రప్పిస్తుందనేది ఇప్పుడో సంచలన వార్తగా మారింది. కానీ అలాంటిదేమీ లేదని కూల్‌గా చెప్పింది ఫరా. ‘మీరు ప్రయత్నించలేదా’ అంటే... అవన్నీ రూమర్లేనని కొట్టిపారేసింది. కాకపోతే... తన ‘ఓంశాంతి ఓం’ సినిమా కోసం ముగ్గుర్నీ ఒకే స్క్రీన్‌పైకి తీసుకు రావాలనుకున్నా వర్కవుట్ కాలేదని చెప్పింది! అసలు తానే కాదు... ఈ ఖాన్ త్రయాన్ని కలిపి ఒకే సినిమాలో చూపించడం ఆ దేవుడి వల్ల కూడా కాదనేసింది! మొత్తానికీ డైలాగ్... ప్రయత్నించి విసిగిపోయిన ఫ్రస్టేషన్లో వచ్చిందా... తనవల్ల కానిది ఇంకెవరివల్లా కాదన్న కాన్ఫిడెన్స్‌తో వచ్చిందా... లేక మళ్లీ ముగ్గురి మధ్య గ్యాప్ పెరిగిందన్న సంకేతం ఇస్తోందో... అన్నది అర్థం కావట్లేదు బీటౌన్ పీపుల్‌కు! -
షారూఖ్‌కు షాక్!
చూస్తుంటే టీవీ భామలకు బాలీవుడ్ స్టార్లంటే లెక్కలేనట్టుంది. ఫరాఖాన్ హోస్ట్ చేస్తున్న టీవీ షో ‘ఫరా కీ దావత్’లో అభిషేక్ బచ్చన్ ఎపిసోడ్‌కు ఇద్దరు బుల్లితెర నటీమణులు నో చెప్పిన విషయం తెలిసిందే. ఈసారి సర్గుణ్ మెహతా వంతు! ఈ తార ఏకంగా బాలీవుడ్ బాద్షాతో కలసి చేసే ఎపిసోడ్‌నే వదిలేసుకుందట! ఈ టీవీ స్టార్‌కు షారూఖ్ అంటే తెగ పిచ్చి. కానీ... ఇంత మంచి అవకాశం వస్తే ఠక్కున కాదనేసింది. అభిషేక్‌తో ఎపిసోడ్‌కు సదరు భామలు రామని చెప్పిన తరువాత ఫరా... సర్గుణ్ను పిలిచింది. దీంతో పాటు షారూఖ్‌తో షోలో కూడా పాల్గొనమని ఆఫర్ ఇచ్చింది. అయితే గియితే కింగ్‌ఖాన్‌తో కలసి సినిమాలో పనిచేస్తాను గానీ... అందరు ఫ్యాన్స్‌లా కలిసే ఆలోచన తనకు లేదని అసలు విషయం చెప్పింది సర్గుణ్! నో చెప్పినందుకు ముందు ఫరా షాక్ తిన్నా... తరువాత సర్గుణ్ మాటలకు కన్విన్స్ అయిందట! -
బాలీవుడ్ లోకి అబ్ రామ్ ఎంట్రీ అలా జరిగింది: షారుక్
న్యూఢిల్లీ: బాలీవుడ్ లో అబ్ రామ్ ఎంట్రీపై షారుక్ ఖాన్ సంతోషం వ్యక్తం చేశారు. హ్యాపీ న్యూఇయర్ విజయం కంటే తన చిన్న కుమారుడు అబ్ రామ్ తెరమీద కనిపించడమే తనకు అత్యంత సంతోషాన్ని కలిగిస్తోందని షారుక్ అన్నారు. అబ్ రామ్ తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నించిన దర్శకురాలు ఫరాఖాన్ కే ఆ క్రెడిట్ దక్కుంతుందని షారుక్ తెలిపారు. షూటింగ్ లో బిజీగా ఉండటం ద్వారా తాను ఎక్కువగా అబ్ రామ్ తో గడపలేకపోయాను. అయితే ఓ రోజు అబ్ రామ్ స్టూడియోకు వచ్చాడు. డాన్స్ స్టేజ్ పై కూర్చుని వాడితో డాన్స్ చేశాను. అబ్ రామ్ తో డాన్స్ చేయడం చూసిన ఫరా.. షూటింగ్ చేయాలా అని తనను అడిగింది. వెంటనే నేను ఓకే అని చెప్పడంతో ఆ సన్నివేశాన్ని ఫరా షూట్ చేసింది. అలా అబ్ రామ్ అనుకోకుండా బాలీవుడ్ తెరమీద ఎంట్రీ ఇచ్చాడు అని షారుక్ ఐఏఎన్ఎస్ కిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. హ్యపీ న్యూ ఇయర్ చిత్రంలో ఎండ్ టైటిల్స్ లో షారుక్ తో కలిసి అబ్ రామ్ కనిపిస్తాడు. సర్రోగసి ద్వారా ఇటీవల షారుక్ దంపతులు అబ్ రామ్ కు జన్మనిచ్చారు. అబ్ రామ్ జననానికి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారనే అంశం వివాదస్పదమైన సంగతి తెలిసిందే. -
హ్యాపీ హ్యాపీగా..
హీరోలతో స్టెప్పులేయించిన ఈ లేడీ.. మెగాఫోన్‌తో కూడా సక్సెస్‌లు కొడుతోంది. ఫస్ట్ మూవీ ఓం శాంతి ఓం హిట్‌తో డెరైక్టర్‌గా బాలీవుడ్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఫరాఖాన్.. హ్యాపీ న్యూ ఇయర్ సక్సెస్‌ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. తన కెరీర్ ముచ్చట్లను, మూవీ జర్నీని సిటీప్లస్‌తో పంచుకుంది. డెరైక్టర్ డ్రీమ్ కోసం.. జీవితంలో అన్నీ అనుకున్నట్టు జరగవు కదా. మన ప్లాన్లు మనకుంటే జీవితం తన పని తను చేస్తుంది. నేను కూడా.డెరైక్టర్ అవ్వాలని కలలు కన్నా. ఫస్ట్ కొరియోగ్రాఫర్ అయ్యా. పదేళ్ల తర్వాత నా కల తీరింది. నేనిప్పుడు కొరియోగ్రఫీ నుంచి పూర్తిగా రిటైర్ అయినట్టే. హ్యాపీ న్యూ ఇయర్లో నా ఒక్క సాంగ్ మాత్రం చేశాను. బేసిగ్గా నాకు పేషెన్సీ చాలా తక్కువ. బహుశా అప్పట్లో డెరైక్టర్ కావాలనే డ్రీమ్ కోసమే ఓర్పుగా పని చేసి ఉంటాను. నన్ను హ్యాపీగా ఉంచేవాళ్లతోనే ఉండటం అంటే ఇష్టం. సెన్సాఫ్ హ్యూమర్ ఉందనే శిరీష్ (హజ్బెండ్)ను పెళ్లి చేసుకున్నా. షారూఖ్.. దీపికల గురించి.. సినీరంగంలో చాలా మందితో కలసి వర్క్ చేశా కాని షారూఖ్‌లాంటి స్టార్‌ని మాత్రం చూడలేదు. అతని స్టార్డమ్ మాత్రమే కాదు గొప్ప హ్యూమన్ బీయింగ్ కూడా. షారూఖ్‌ఖాన్ ఎవరికైనా లక్కీస్టార్. దర్శకుల నటుడు. అతనితో పనిచేయడం అద్భుతమైన విషయం. హ్యాపీ న్యూ ఇయర్ హీరోయిన్ ఎంపిక విషయంలో మీడియాలో రకరకాల ఊహాగానాలు వచ్చాయి. అదే సమయంలో దీపిక కాల్ చేసి నన్నెందుకు అడగడం లేదు అని క్వశ్చన్ చేసింది. వెంటనే తనని ఎంచుకున్నాం. తన ఫస్ట్ మూవీ (ఓం శాంతి ఓం) నాతో చేసింది. మంచి మూవీస్ చేస్తోంది. చక్కగా నటిస్తోంది. ప్రేక్షకులే పాఠం... హిట్స్ తీయాలనే ఎవరైనా కోరుకుంటారు. ప్రేక్షకుల అంచనాలను రీచ్ కాకపోవడం వల్లే తీస్మార్ఖాన్ యావరేజ్‌గా పోయింది. ప్రేక్షకులు ఓం శాంతి ఓం మించిన సినిమాని నా నుంచి ఆశించారు. ఓన్లీ కామెడీ, ఓన్లీ రొమాన్స్ కాదు.. వాళ్లకి కంప్లీట్ ఎంటర్టైనర్ కావాలని అప్పుడర్థమైంది. దాని రిజల్టే హ్యాపీ న్యూ ఇయర్. ఇది ఎంటర్టైనర్ మూవీ అయినా ఇందులోనూ మెసేజ్ ఉంది. ‘99 శాతం అన్నీ పోయినా ఇంకో శాతం అవకాశం మిగిలే ఉంటుంది. ఆ సమయాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి’ అనేది ఈ సినిమా అందించే సందేశం. తెలుగు సినిమాకు డెరైక్షన్... దర్శకుడికి సినిమాపై పూర్తిగా పట్టుండాలంటే భాష తప్పకుండా తెలిసుండాలి. ఏ భాషలోనైతే కంఫర్టబుల్‌గా ఉన్నానో అదే భాషలో సినిమాలు చేస్తాను. హిందీ సినిమాలు తీస్తున్న తమిళ్, తెలుగు దర్శకుల్ని చూస్తే నాకు అడ్మైరింగ్‌గా అనిపిస్తుంది. అలాగే ఇండియాలో ఇంగ్లిష్ సినిమా అంటే ఎందుకు తీయాలో నాకు అర్థం కాదు. ఆర్ట్ మూవీ మాఫియా ఉందేమో... బయటకు లుక్ ఎలా ఉన్నా... ఐయామ్ ఫుల్లీ యంగ్ ఇన్సైడ్. లైవ్లీ, హ్యాపీ పర్సనాలిటీ నాది. మనం తీసే సినిమా మనల్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అలాగే నా సినిమాలు నన్ను రిఫ్లెక్ట్ చేస్తాయి. నిజానికి వెరీ ఈజీ టూ మేక్ ఎ ఆర్ట్ ఫిలిమ్. ఓ గదిలో నలుగురు కూచుని కూడా తీసేయవచ్చు. అయితే పెద్ద బడ్జెట్‌తో చేసే మల్టీస్టారర్, ఎక్కువ మంది చూసే,ఎంతో బిజినెస్ చేసే పెద్ద బడ్జెట్ సినిమా తీయడం చాలా కష్టం. ఆర్ట్ ఫిలిమ్స్ తీయడం తప్పనో మరొకటో చెప్పడం లేదు. అయితే కమర్షియల్ సినిమాలను తక్కువ చేసి చూడవద్దని మాత్రమే చెబుతున్నాను. -
సినిమా రివ్యూ: హ్యపీ న్యూ ఇయర్
చంద్రమోహన్ మనోహర్ శర్మ అలియాస్ చార్లీ (షారుక్ ఖాన్) 300 కోట్ల రూపాయల విలువైన వజ్రాలను పారిశ్రామిక వేత్త చరణ్ గ్రోవర్ (జాకీష్రాఫ్) నుంచి దొంగిలిండచడానికి ప్లాన్ వేస్తాడు. అందుకోసం ఏర్పాటు చేసిన 'హ్యాపీ న్యూ ఇయర్ మిషన్' టీమ్ లో టామీ (బొమ్మన్ ఇరానీ), నందూ భిడే ( అభిషేక్ బచ్చన్), జాక్ (సోనూ సూద్), మోహిని (దీపికా పదుకొనే), రోహన్ (వివాన్ షా)లను చేర్చుకుంటాడు. దుబాయ్‌లో జరిగే వరల్డ్ డాన్స్ ఛాంపియన్ షిప్లో పాల్గొని, అక్కడే వజ్రాలను చేజిక్కించుకోవాలని ప్లాన్ చేస్తారు. వజ్రాలను దొంగిలించడానికి కారణమేంటి? అందులో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? వజ్రాలను ఎలా చేజిక్కించుకున్నారనేదే సింపుల్ గా 'హ్యాపీ న్యూ ఇయర్' కథ. ఆకట్టుకునే అంశాలు: దీపికా పదుకొనే, అభిషేక్ బచ్చన్, షారుక్ యాక్టింగ్ బొమ్మన్, సోనూ సూద్‌ల కామెడీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు, డ్యాన్స్ నిరాశపరిచే అంశాలు: లాజిక్ లేని, రొటీన్ కథ కథనంలో వేగం లోపించడం దోపిడీ నేపథ్యంగా సాగే కథలోథ్రిల్స్, ట్విస్ట్ లు లేకపోవడం నటీనటుల పెర్ఫార్మెన్స్: ఈ చిత్రంలో ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకునే పాత్రలు కేవలం రెండే రెండు. ఒకటి అభిషేక్ బచ్చన్, రెండవది దీపికా పదుకొనే. నందూ భిటే పాత్రలో అభిషేక్ కొత్తగా కనిపిస్తారు. చక్కటి టైమింగ్‌తో కామెడీని, ఫెర్మార్మెన్స్ను పండించడంలో అభిషేక్ తన సత్తాను చూపాడు. అభిషేక్‌కు మంచి గుర్తింపు తెచ్చే పాత్ర అని చెప్పవచ్చు. ఇక మోహినిగా బార్ డాన్సర్‌గా దీపిక కనిపించింది. వచ్చీరాని ఇంగ్లీష్ మాట్లాడే పాత్రలో దీపికా మంచి మార్కులు కొట్టేసింది. ఇక షారుక్‌తో కలిసి అక్కడక్కడ మెరుపులు మెరిపించింది. చెవిటి వాడిగా సోను సూద్, మూర్ఛ రోగిగా బొమ్మన్, సాఫ్ట్ వేర్ హ్యాకర్‌గా వివాన్ షా తమ పాత్రల పరిధి మేరకు పర్వాలేదనింపిచారు. కథ అంతా షారుక్ నడిపించినా.. ఆపాత్రకు బలమైన క్యారెక్టరైజేషన్ కొరవడంతో పెద్దగా ఆకట్టకోలేకపోయడానే చెప్పవచ్చు. దర్శకత్వ విభాగ పనితీరు: సింపుల్ కథను ఎంచుకుని పగ, ప్రతీకారం నేపథ్యానికి వినోదం, ప్రేమ, ఎమోషన్స్ లను మేళవించి టాప్ ఆర్టిస్టులతో దర్శకురాలు ఫరాఖాన్ చేసిన ప్రయత్నం హ్యాపీ న్యూ ఇయర్. పగ, ప్రతీకారం నేపథ్యంగా రూపొందే చిత్రాల్లో బలమైన విలనిజం లేకపోవడం ఈ చిత్రానికి పెద్ద మైనస్ గా మారింది. ప్రధానమైన విలన్ జాకీ ష్రాఫ్ పాత్రను గెస్ట్‌గా మార్చడంతో హీరోయిజం ఎక్కడా ఎలివేట్ కాలేకపోయింది. షారుక్ తోపాటు మిషన్ హ్యాపీ న్యూయర్ టీమ్ ను బలంగా తీర్చిదిద్దలేకపోవడం లాంటి అంశాల్లో ఫరా ఖాన్ బలహీనతలు కనిపిస్తాయి. పూర్తి స్థాయిలో అటు యాక్షన్ చిత్రంగా లేదా వినోదాత్మకం చిత్రంగా మలచడంలో విఫలమయ్యారని చెప్పవచ్చు. ఎలాంటి ఎమోషన్స్ లేకుండా ప్రేమ కథ సాగడం, షారుక్-దీపికా పదుకొనేల మధ్య కెమిస్ట్రీ పెద్దగా వర్కవుట్ కాకపోవడం ఈ చిత్రంలో మరో ప్రధానమైన వైఫల్యంగా మారింది. షారుక్ ఎయిట్ ప్యాక్, సోనుసూద్ సిక్స్ ప్యాక్ మీద పెట్టిన దృష్టిని కొంత మరల్చి కథపై పెట్టి ఉంటే మరింత మెరుగైన ఫలితాన్ని పొందే అవకాశం ఉండేది. ఒక మాటలో చెప్పాలంటే ఈ చిత్రం చూశాక హ్యపీ న్యూ ఇయర్ పూర్తిస్థాయి చిత్రంగా కాకుండా టెలివిజన్ డ్యాన్స్ అండ్ రియాల్టీ షోగానే ప్రేక్షకులకు అనిపించడం సహజం. --రాజబాబు అనుముల -
సొంతింటికొచ్చినట్టుంది
ఫరాఖాన్, షారుఖ్ ఖాన్ సంయుక్త ప్రాజెక్టు ‘ఓం శాంతి ఓం’ సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించిన బాలీవుడ్ నటి దీపికా పదుకొణే ... తిరిగి ఏడేళ్ల తర్వాత దీపావళి పండుగకు విడుదల కానున్న ‘హ్యేపీ న్యూఇయర్’ సినిమాతో సొంతించినట్టుగ ఉందంది. ఈ సినిమాకు ఫరాఖాన్ దర్శకత ్వం వహించగా షారుఖ్ ఖానే కథానాయకుడు. ‘హ్యేపీ న్యూఇయర్ సినిమాతో నాకు సొంతింటికి వచ్చినట్టనిపిస్తోంది. ఈ సినిమాతో ‘ఓం శాంతి ఓం’ జ్ఞాపకాలు మదిలో మెదులుతున్నాయి. ఫరా.. నన్ను బేబీ అని పిలిచేది. నేను ఫరాను అమ్మా అని పిలిచేదాన్ని. ఫరా నాతో ఎంతో స్వేచ్ఛగా ఉండేది. వాస్తవానికి మాఇద్దరి సంబంధం అత్యంత ప్రత్యేకం. చాలాసేపు గడిపేవాళ్లం. కలిసి మాట్లాడుకునేవాళ్లం. సమయమే తెలిసేది కాదు. ఇక షారుఖ్, ఫరాలు కూడా కుటుంబసభ్యుల మాదిరిగా ఉండేవాళ్లు’ అని అంది. ఈ సినిమాకు ఫరాఖాన్ దర్శకత్వం వహించగా షారుఖ్‌తోపాటు అభిషేక్ బచ్చన్, సోనూసూద్, బొమన్ ఇరానీ, వియాన్షా తదితరులు నటించారు. ‘నిర్మాత/ కొరియోగ్రాఫర్, షారుఖ్‌ఖాన్‌ల చేతిలో నా కెరీర్ అత్యంత భద్రంగానే ఉందనిపిస్తోంది. ఇద్దరి వయసూ 49 సంవత్సరాలే. బాలీవుడ్లో అడుగుపెడుతూనే వారు నాకు మంచి అవకాశం కల్పించారు. నా బాధ్యతను వారు తమ నెత్తిపై పెట్టుకున్నారు. చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమా పూర్తికాగానే ఫరాఖాన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. హ్యాపీ న్యూ ఇయర్ సినిమా చేయమని అడిగింది. నా డేట్స్ ఖాళీగా ఉన్న సమయంలోనే ఈ సినిమా షూటింగ్ జరిగింది’ అని ముగించింది ఈ 29 ఏళ్ల సుందరి. -
స్టార్ కథానాయిక అవసరం లేదు
ముంబై: యశ్‌రాజ్ ఫిలిమ్స్ సంస్థ సారథ్యంలో త్వరలో రూపొందనున్న ‘ఫ్యాన్’ సినిమాలో కథానాయిక ఎవరనేది ఇంకా తెలియకపోయినప్పటికీ ఈ సినిమాకి స్టార్ కథానాయిక అవసరం లేదని నటుడు షారుఖ్‌ఖాన్ చెప్పాడు. 48 ఏళ్ల ఖాన్... ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కారణంగా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ‘బ్యాండ్ బాజా బారాత్’ దర్శకుడు మనీష్ శర ్మ తీస్తున్న ఈ సినిమాలో ఖాన్ రకరకాల అవతారాల్లో కనిపించనున్నాడు. ‘యశ్‌రాజ్ ఫిలిమ్స్ సంస, మనీష్ శర్మలంటే నాకు ఎంతో ఇష్టం. ఈ సినిమాలో ఇద్దరు యువతులు ఉం టారు. ఈ సినిమాకి స్టార్ కథానాయిక అవసరమే లేదు. ఇది అత్యంత ఆసక్తికరమైనదే కాకుండా విభిన్నమైన సినిమాకూడా. గత 20 సంవత్సరాల కాలంలో నేను నటించిన సినిమాల్లోకెల్లా ఇది అత్యంత సవాళ్లతో కూడినది. సినిమా నటుల అభిమానుల గురించి తీస్తున్న సినిమా ఇది’ అని అన్నాడు. కాగా ఖాన్.. రాహుల్ ధొలాకియా తీయనున్న ‘రయీస్’తోపాటు రోహిత్‌శెట్టి దర్శకత్వం వహించనున్న తాజా సినిమాలకు సంతకాలు చేసేశాడు. మరో సినిమాకు సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే అది ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ‘రయీస్’ ఓ విభిన్నమైన సినిమా. దీని గురించి రాహుల్ ధొలాకియా నాకు పూర్తిగా వివరించాడు. నాకు ఎంతోబాగా నచ్చింది’ అని అన్నాడు. ఇదిలాఉంచితే దీపావళి పండుగకు విడుదల కానున్న ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమాకు ఖాన్ అన్నివిధాలుగా సన్నద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు ఫరాఖాన్ దర్శకత్వం వహించింది. -
హ్యాపీ ఫ్రెండ్షిప్!
‘కమర్షియల్’ థింకింగో... ‘రియలైజింగ్’ ఎఫెక్టో..! మొత్తానికి ఆ మధ్య బందైన యాక్టర్, డెరైక్టర్ షారూఖ్‌ఖాన్- ఫరాఖాన్‌ల జిగిరీ దోస్తీ ప్రస్తుతానికి ‘హ్యాపీ’ ఎండింగ్ తీసుకుంది. తమ మధ్య ఏదేదో జరిగిపోతుందని వస్తున్న రూమర్లకు ఫరా ఫుల్స్టాప్ పెట్టింది. కింగ్ ఖాన్‌తో విడుదలకు సిద్ధంగా ఉన్న తన మూడో చిత్రం ‘హ్యాపీ న్యూ ఇయర్’ ప్రమోషన్లో భాగంగా ఈ లేడీ డెరైక్టర్ మనసు విప్పి మాట్లాడింది. ‘అపోహలన్నీ తొలగిపోయి మా దోస్తీ మరింత దృఢంగా మారింది. ఫ్రెండ్షిప్ విలువేంటో కోల్పోయినప్పుడే తెలుస్తుంది’ అంటూ పురాణం చెప్పుకొచ్చింది. -
అనాహ్లాదకర చిత్రాలను తెరకెక్కించను!
న్యూఢిల్లీ: 'హ్యాపీ న్యూ ఇయర్' చిత్రాన్ని తన డ్రీమ్ ప్రాజెక్టుగా వర్ణించిన దర్శకురాలు ఫరాఖాన్.. ఆ చిత్రం మరో కొత్త ట్రెండ్ ను సృష్టింస్తుందని అభిప్రాయపడ్డారు. తన సినిమాల్లో డ్యాన్స్ లు, పాటలు, మెలోడ్రామా, రొమాన్స్, ఎమోషన్స్, కలర్, స్టార్ పవర్ అన్ని కలగలసి ఉంటాయని తాజాగా ఐఎన్ఎస్ కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. తాను ఎప్పుడూ అనాహ్లాదకర చిత్రాలపై మక్కువ చూపనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాను ఫిల్మ్ మేకింగ్ కు రాకముందు కొరియోగ్రఫీలో అనుభవం ఉన్నందున ప్రధానమైన పాటల్లో డ్యాన్స్ సీక్వెన్స్ ల్లో పాలుపంచుకుంటానని ఫరాఖాన్ తెలిపారు. అన్ని రకాల ప్రేక్షకులను వినోదాన్ని అందించడమే తన లక్ష్యమన్నారు. కొన్ని సమయాల్లో కథ బాగున్నా.. భారతీయ ప్రేక్షకుల్ని ఆకర్షించడం చాలా కష్టంతో కూడుకున్న పని అని ఫరాఖాన్ తెలిపారు. గతంలో తీస్ మార్ ఖాన్ ను తెరకెక్కించిన 49 ఏళ్ల ఫరాఖాన్ హ్యాపీ న్యూ ఇయర్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా తాను ఎల్లప్పుడూ వినోద భరితమైన చిత్రాలపైనే దృష్టి పెడుతుంటానని.. అనాహ్లాదకర చిత్రాలను ఎప్పుడూ తెరకెక్కించనన్నారు. -
'హ్యాపీ న్యూ ఇయర్' ఆడియో ఆవిష్కరణ
-
ఖాన్ పర్యటనపై ఉత్సుకత
వాషింగ్టన్: తన తాజా చిత్రం ‘హేపీ న్యూ ఇయర్’ ప్రచారం కోసం బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్‌ఖాన్ చేపట్టనున్న అమెరికా పర్యటన భారతీయులతోపాటు అమెరికన్లు, దక్షిణాసియాకు చెందిన అభిమానుల్లో ఎనలేని ఉత్సుకత కలిగిస్తోంది. దశాబ్దకాలం తర్వాత ఈ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్ స్టార్’ అమెరికాలో పర్యటించనున్నా డు. అక్కడ లైవ్ ప్రదర్శనలు ఇవ్వనున్నాడు. ఈ పర్యటన కు శ్లామ్ (ఎస్ఎల్ఏఎం) అని ఖాన్ నామకరణం చేశాడు. ఎస్ అంటే సౌండ్, ఎల్ అంటే లైట్, ఏ అంటే యాక్షన్, ఎం అంటే మూవీ. ఖాన్ ప్రచార కార్యక్రమంలో దీపికా పదుకొణే, అభిషేక్ బచ్చన్, బొమన్ ఇరానీ, మాధురీదీక్షిత్, మలైకా అరోరా తదితరులు పాల్గొననున్నారు. ఖాన్ ప్రచార కార్యక్రమం విషయమై వాషింగ్టన్ డీసీ శివారులో నివసిస్తున్న అతని అభిమాని రిచర్డ్ వైట్ మాట్లాడుతూ ఇందుకోసం ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్నామన్నాడు. నా స్నేహితుడు బలవంతం చేయడంతో ఖాన్ నటించిన ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ సినిమా చూశా. అతడొక గొప్ప నటుడు’అని అన్నాడు. వర్జీనియాలో త్వరలో జరగనున్న ప్రదర్శనను తిలకించేందుకు రిచర్డ్‌తోపాటు అతని స్నేహితులు ఇప్పటికే టికెట్లను కొనుగోలు చేశారు. ఖాన్ ప్రచార కార్యక్రమాలు ఈ నెల 19వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఖాన్‌తోపాటు ‘హేపీ న్యూ ఇయర్’ సినిమాలోని సహనటులంతా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. 19వ తేదీన హోస్టన్, 20న న్యూజెర్సీ, 26న చికాగో, 28న కాలిఫోర్నియాలో ప్రచార కార ్యక్రమాలు జరగనున్నాయి. ఆ తర్వాత ఈ నెల 27వ తేదీన ఈ బృందం కెనాడాలోని వాంకోవర్ నగరం వెళ్లి అక్కడ నిర్వహించే ప్రచార కార్యక్రమంలో పాల్గొననుంది. -
‘హ్యాపీ న్యూ ఇయర్’ నా డ్రీమ్ ప్రాజెక్ట్
హ్యాపీ న్యూ ఇయర్ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్టు అని దర్శకురాలు ఫరాఖాన్ అన్నారు. షారుఖ్‌ఖాన్, దీపికా పదుకొనె, అభిషేక్ బచ్చన్, సోనూ సూద్, బొమన్ ఇరానీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న చిత్రం ‘హ్యాపీ న్యూ ఇయర్’ ట్రైలర్‌ను ఈ నెల 14న విడుదల విడుదల చేయనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒకరోజు ముందే సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ బుధవారం ప్రకటించింది. నగరంలోని సహారా స్టార్ హోటల్లో జరగనున్న ఈ కార్యక్రమంలో చిత్రా తారాగణంతోపాటు దర్శకురాలు ఫరాఖాన్, సంగీత దర్శక ద్వయం విశాల్-శేఖర్లు కూడా పాల్గొననున్నారు. సినిమాలో అంతర్లీనంగా భారతీయతాభావం ఉన్నందున స్వాతంత్య్రోత్సవాలకు ఒకరోజు ముందు ట్రైలర్స్‌ను విడుదల చేస్తున్నట్లు రెడ్ చిల్లీస్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమాలు ప్రత్యేకంగా ఉంటాయని తెలిపింది. సినిమా సక్సెస్ కోసం చేసే డిజిటల్ ప్రచారం కూడా భిన్నంగా ఉండబోతోందని ప్రకటించింది. ఈ ఆలోచన అంతా దర్శకురాలు ఫరాఖాన్దేనని తెలిపింది. ఈ విషయమై ఫరాఖాన్ మాట్లాడుతూ... ‘హ్యాపీ న్యూ ఇయర్... నా కలల ప్రాజెక్టు. చాలా రోజుల నుంచి ఈ సినిమా కోసం కష్టపడుతున్నాను. సినిమా ఫస్ట్‌లుక్ విడుదలవుతుందంటేనే నాకెంతో థ్రిల్లిం గ్గా ఉంది. ఈ సినిమా కోసం షారుఖ్, నేను దాదాపు ఏడేళ్లు కష్టపడ్డాం. ట్రైలర్స్‌తోనే సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఏర్పడడం ఖాయం. సినిమా కూడా వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. ఈ ట్రైలర్స్‌ను కేవలం మీడియా ప్రతి నిధుల కోసమే కాదు.. కొంతమంది అభిమానులకు కూడా అవకాశం ఇచ్చాం. వారంతా మాతోపాటు లంచ్‌లో పాల్గొం టారు. సినిమాలో అన్నిరకాల వాణిజ్య అంశాలతోపాటు విమర్శకులుసైతం మెచ్చుకునే అంశాలు కూడా పుష్కలంగా ఉన్నాయ’ని తెలిపింది. -
ఫరా ఖాన్‌కు షారుక్ ఖాన్ ఖరీదైన కానుక
ముంబై: స్నేహితులను ఎలా సంతోషపెట్టాలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కు బాగా తెలుసు. ఖరీదైన కానుకలతో వారిని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాడు. షారుక్ తన సన్నిహితురాలు, డైరక్టర్ ఫరా ఖాన్‌కు ఖరీదైన ఓ కొత్త బ్రాండ్ కారును కానుకగా ఇచ్చాడు. షారుక్ చిత్రం 'హ్యాపీ న్యూ ఇయర్'కు ఫరా దర్శకత్వం వహించింది. బహుమతిని అందుకున్న ఫరా సంతోషంతో షారుక్‌కు కృతజ్ఞతలు తెలియజేసింది. 'నేనందుకున్న బహుమతి ఏమిటో చూడండి! షారుక్‌కు ధన్యవాదాలు' అంటూ ఫరా ట్వీట్ చేసింది. కారుతో దిగిన ఫొటోను ఆమె పోస్ట్ చేసింది. షారుక్, ఫరా చాలా కాలంగా మంచి స్నేహితులు. ఫరాకు ఖరీదైన బహుమతులు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. 2004లో షారుక్ నటించిన'మై హూ నా', 2007లో 'ఓం శాంతి ఓం' చిత్రాలు విడుదలైన తర్వాత ఫరాకు ఖరీదైన కార్లను బహుమతిగా ఇచ్చాడు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో 'హ్యాపీ న్యూ ఇయర్'చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో అభిషేక్ బచ్చన్, దీపికా పదుకోన్ తదితరులు తారాగణం. -
మల్టీస్టారర్ తీయడం కష్టమేమీ కాదు
‘మల్టీస్టారర్ చిత్రాలు తీయడం అంత కష్టం కాదు.. అందులో పనిచేసే హీరోలు ఎంత స్టార్లైనా కథను అనుసరించి తమ పని తాము చేసుకుపోతే ఇబ్బందులు అనేవి ఉండవు. నా వరకు నేను తీసిన ఏ సినిమాలోనూ నటులతో ఇబ్బంది పడలేదు.’ అని దర్శకురాలుగా మారిన నృత్య దర్శకురాలు ఫరాఖాన్ వ్యాఖ్యానించారు. 2007లో వచ్చిన ‘ఓం శాంతి ఓం’ సినిమాలో ఆమె ఒక పాటలో 31 మంది టాప్ హీరో, హీరోయిన్లను చూపించారు. స్టార్ నటులు షారూఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్, దీపికా పడుకొనేతో పాటు బొమ్మన్ ఇరానీ, సోనూ సూద్, వివాన్ షా వంటి వారితో ప్రస్తుతం ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమా తీస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ‘ మల్టీస్టారర్ తీయడం పెద్ద కష్టం కాదు.. ఉదాహరణకు తీసుకుంటే.. హ్యాపీ న్యూ ఇయర్ సినిమాలో షారూఖ్ ఒక్కడిదే ముఖ్య పాత్ర అనుకుంటే పొరపాటు. స్క్రిప్ట్‌లో ఆరుగురూ ప్రధాన పాత్రధారులే.. ప్రతి ఒక్కరికీ తగిన పాత్ర ఉంది. వాటికి అనుగుణంగా డైలాగులు ఉంటాయి. పాత్ర చిత్రీకరణ ఉంటుంది. ఎవరిని తక్కువ చేసి చూపించినా దాని ప్రభావం మొత్తం చిత్రంపై పడుతుంది..అందుకే నేను స్క్రిప్ట్‌కే ప్రాధాన్యమిస్తా..’ అని ఆమె అన్నారు. అలాగే షారూఖ్ ఖాన్ కూడా మొదటి నుంచి నాకు ఈ విషయంలో చాలా మద్దతు ఇస్తున్నాడన్నారు. ‘ఇందులో అందరి పాత్రలూ ప్రధానమైనవే.. వివాన్ లేదా సోనూ సూద్‌ల పాత్రలకూ కూడా తగిన ప్రాధాన్యతనివ్వు.. అప్పుడే సినిమాకు న్యాయం జరుగుతుంది అని షారూఖ్ మొదటి నుంచి చెబుతున్నాడు..’ అని ఆమె చెప్పారు. ‘ఈ సినిమాలో నటులందరూ ఎటువటి బేషజాలు లేకుండా పనిచేస్తున్నారన్నారు. సినిమా ఇప్పటికే 95 శాతం పూర్తయ్యింది. దీపావళికి ఈ సినిమా సందడి చేస్తుంది..’ అని ఆమె చెప్పారు. 2004లో షారూఖ్ ఖాన్ ‘మై హూనా’ సినిమాతో ఫరాఖాన్ దర్శకురాలిగా బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. తర్వాత మళ్లీ 2008లో షారూఖ్‌తో ‘ఓం శాంతి ఓం’ తీశారు. 2010లో అక్షయ్‌కుమార్, కత్రినా కైఫ్ జంటగా ‘తీస్ మార్ఖాన్’ సినిమా తీశారు. ఇప్పుడు తీస్తున్న ‘హ్యాపీ న్యూ ఇయర్’ షారూఖ్‌తో దర్శకురాలిగా ఆమె మూడో సినిమా. అయితే దర్శకురాలిగా ఎక్కువ సినిమాలు చేయలేకపోవడానికి వేరే కారణంపై ఆమె స్పందిస్తూ..‘నేను సినిమా ఫ్యాక్టరీని కాదు.. దర్శకురాలిని మాత్రమే.. మంచి కథ తయారుచేసుకొని, తర్వాత కథకు సరిపడా నటులను ఎంపిక చేసుకోవడం మొదలు అన్ని పనులు చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. అందుకే పదేళ్లలో కేవలం నాలుగు సినిమాలు మాత్రమే చేయగలిగాను..’ అని అన్నారు. అయితే మంచి సినిమా చేయాలంటే కనీసం రెండేళ్ల సమయం పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.