హ్యాపీ హ్యాపీగా..
హీరోలతో స్టెప్పులేయించిన ఈ లేడీ.. మెగాఫోన్‌తో కూడా సక్సెస్‌లు కొడుతోంది. ఫస్ట్ మూవీ ఓం శాంతి ఓం హిట్‌తో డెరైక్టర్‌గా బాలీవుడ్‌లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఫరాఖాన్.. హ్యాపీ న్యూ ఇయర్ సక్సెస్‌ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. తన కెరీర్ ముచ్చట్లను, మూవీ జర్నీని సిటీప్లస్‌తో పంచుకుంది.
డెరైక్టర్ డ్రీమ్ కోసం..
జీవితంలో అన్నీ అనుకున్నట్టు జరగవు కదా. మన ప్లాన్‌లు మనకుంటే జీవితం తన పని తను చేస్తుంది. నేను కూడా.డెరైక్టర్ అవ్వాలని కలలు కన్నా. ఫస్ట్ కొరియోగ్రాఫర్ అయ్యా. పదేళ్ల తర్వాత నా కల తీరింది. నేనిప్పుడు కొరియోగ్రఫీ నుంచి పూర్తిగా రిటైర్ అయినట్టే. హ్యాపీ న్యూ ఇయర్‌లో నా ఒక్క సాంగ్ మాత్రం చేశాను. బేసిగ్గా నాకు పేషెన్సీ చాలా తక్కువ. బహుశా అప్పట్లో డెరైక్టర్ కావాలనే డ్రీమ్ కోసమే ఓర్పుగా పని చేసి ఉంటాను. నన్ను హ్యాపీగా ఉంచేవాళ్లతోనే ఉండటం అంటే ఇష్టం. సెన్సాఫ్ హ్యూమర్ ఉందనే శిరీష్ (హజ్బెండ్)ను పెళ్లి చేసుకున్నా.
షారూఖ్.. దీపికల గురించి..
సినీరంగంలో చాలా మందితో కలసి వర్క్ చేశా కాని షారూఖ్‌లాంటి స్టార్‌ని మాత్రం చూడలేదు. అతని స్టార్‌డమ్ మాత్రమే కాదు గొప్ప హ్యూమన్ బీయింగ్ కూడా. షారూఖ్‌ఖాన్ ఎవరికైనా లక్కీస్టార్. దర్శకుల నటుడు. అతనితో పనిచేయడం అద్భుతమైన విషయం. హ్యాపీ న్యూ ఇయర్ హీరోయిన్ ఎంపిక విషయంలో మీడియాలో రకరకాల ఊహాగానాలు వచ్చాయి. అదే సమయంలో దీపిక కాల్ చేసి నన్నెందుకు అడగడం లేదు అని క్వశ్చన్ చేసింది. వెంటనే తనని ఎంచుకున్నాం. తన ఫస్ట్ మూవీ (ఓం శాంతి ఓం) నాతో చేసింది. మంచి మూవీస్ చేస్తోంది. చక్కగా నటిస్తోంది.
ప్రేక్షకులే పాఠం...
హిట్స్ తీయాలనే ఎవరైనా కోరుకుంటారు. ప్రేక్షకుల అంచనాలను రీచ్ కాకపోవడం వల్లే తీస్‌మార్‌ఖాన్ యావరేజ్‌గా పోయింది. ప్రేక్షకులు ఓం శాంతి ఓం మించిన సినిమాని నా నుంచి ఆశించారు. ఓన్లీ కామెడీ, ఓన్లీ రొమాన్స్ కాదు.. వాళ్లకి కంప్లీట్ ఎంటర్‌టైనర్ కావాలని అప్పుడర్థమైంది. దాని రిజల్టే హ్యాపీ న్యూ ఇయర్. ఇది ఎంటర్‌టైనర్ మూవీ అయినా ఇందులోనూ మెసేజ్ ఉంది. ‘99 శాతం అన్నీ పోయినా ఇంకో శాతం అవకాశం మిగిలే ఉంటుంది. ఆ సమయాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి’ అనేది ఈ సినిమా అందించే సందేశం.
తెలుగు సినిమాకు డెరైక్షన్...
దర్శకుడికి సినిమాపై పూర్తిగా పట్టుండాలంటే భాష తప్పకుండా తెలిసుండాలి. ఏ భాషలోనైతే కంఫర్టబుల్‌గా ఉన్నానో అదే భాషలో సినిమాలు చేస్తాను. హిందీ సినిమాలు తీస్తున్న తమిళ్, తెలుగు దర్శకుల్ని చూస్తే నాకు అడ్మైరింగ్‌గా అనిపిస్తుంది. అలాగే ఇండియాలో ఇంగ్లిష్ సినిమా అంటే ఎందుకు తీయాలో నాకు అర్థం కాదు.
ఆర్ట్ మూవీ మాఫియా ఉందేమో...
బయటకు లుక్ ఎలా ఉన్నా... ఐయామ్ ఫుల్లీ యంగ్ ఇన్‌సైడ్. లైవ్‌లీ, హ్యాపీ పర్సనాలిటీ నాది. మనం తీసే సినిమా మనల్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అలాగే నా సినిమాలు నన్ను రిఫ్లెక్ట్ చేస్తాయి. నిజానికి వెరీ ఈజీ టూ మేక్ ఎ ఆర్ట్ ఫిలిమ్. ఓ గదిలో నలుగురు కూచుని కూడా తీసేయవచ్చు. అయితే పెద్ద బడ్జెట్‌తో చేసే మల్టీస్టారర్, ఎక్కువ మంది చూసే,ఎంతో బిజినెస్ చేసే పెద్ద బడ్జెట్ సినిమా తీయడం చాలా కష్టం. ఆర్ట్ ఫిలిమ్స్ తీయడం తప్పనో మరొకటో చెప్పడం లేదు. అయితే కమర్షియల్ సినిమాలను తక్కువ చేసి చూడవద్దని మాత్రమే చెబుతున్నాను.