స్టార్ కథానాయిక అవసరం లేదు | Happy New Year: Watch Shah Rukh Khan In A New Avatar | Sakshi
Sakshi News home page

స్టార్ కథానాయిక అవసరం లేదు

Published Mon, Oct 6 2014 10:12 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

స్టార్ కథానాయిక అవసరం లేదు - Sakshi

స్టార్ కథానాయిక అవసరం లేదు

యశ్‌రాజ్ ఫిలిమ్స్ సంస్థ సారథ్యంలో త్వరలో రూపొందనున్న ‘ఫ్యాన్’...

ముంబై: యశ్‌రాజ్ ఫిలిమ్స్ సంస్థ సారథ్యంలో త్వరలో రూపొందనున్న  ‘ఫ్యాన్’ సినిమాలో కథానాయిక ఎవరనేది ఇంకా తెలియకపోయినప్పటికీ ఈ సినిమాకి స్టార్ కథానాయిక అవసరం లేదని నటుడు షారుఖ్‌ఖాన్ చెప్పాడు. 48 ఏళ్ల ఖాన్... ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కారణంగా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు.

‘బ్యాండ్ బాజా బారాత్’ దర్శకుడు మనీష్ శర ్మ తీస్తున్న ఈ సినిమాలో ఖాన్ రకరకాల అవతారాల్లో కనిపించనున్నాడు. ‘యశ్‌రాజ్ ఫిలిమ్స్ సంస, మనీష్ శర్మలంటే నాకు ఎంతో ఇష్టం. ఈ సినిమాలో ఇద్దరు యువతులు ఉం టారు. ఈ సినిమాకి స్టార్ కథానాయిక అవసరమే లేదు. ఇది అత్యంత ఆసక్తికరమైనదే కాకుండా విభిన్నమైన సినిమాకూడా. గత 20 సంవత్సరాల కాలంలో నేను నటించిన సినిమాల్లోకెల్లా ఇది అత్యంత సవాళ్లతో కూడినది.  

సినిమా నటుల అభిమానుల గురించి తీస్తున్న సినిమా ఇది’ అని అన్నాడు. కాగా ఖాన్.. రాహుల్ ధొలాకియా తీయనున్న ‘రయీస్’తోపాటు రోహిత్‌శెట్టి దర్శకత్వం వహించనున్న తాజా సినిమాలకు సంతకాలు చేసేశాడు. మరో సినిమాకు సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే అది ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ‘రయీస్’ ఓ విభిన్నమైన సినిమా. దీని గురించి రాహుల్ ధొలాకియా నాకు పూర్తిగా వివరించాడు. నాకు ఎంతోబాగా నచ్చింది’ అని అన్నాడు. ఇదిలాఉంచితే దీపావళి పండుగకు విడుదల కానున్న ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమాకు ఖాన్ అన్నివిధాలుగా సన్నద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు ఫరాఖాన్ దర్శకత్వం వహించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement