షారుక్ ఖాన్ కు చెన్నైలో చుక్కెదురు | Angry journalists boycott Shah Rukh Khan press conference | Sakshi
Sakshi News home page

షారుక్ ఖాన్ కు చెన్నైలో చుక్కెదురు

Published Sat, Oct 4 2014 11:36 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

షారుక్ ఖాన్ కు చెన్నైలో చుక్కెదురు - Sakshi

షారుక్ ఖాన్ కు చెన్నైలో చుక్కెదురు

చెన్నై :  బాలీవుడ్‌ బాద్‌షా షారుక్ ఖాన్‌కు చెన్నైలో చుక్కెదురైంది.'హ్యాపీ న్యూ ఇయర్' సినిమా ప్రమోషన్‌కు వచ్చిన షారుక్కు.. చెన్నై మీడియాకు మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో షారుక్ ప్రెస్‌మీట్‌ను మీడియా బహిష్కరించింది. చెన్నైలోని ఓ స్టార్‌ హోటల్‌లో సాయంత్రం 4.30 గంటలకు 'హ్యాపీ న్యూఇయర్‌' సినిమా ప్రమోషన్‌ జరుగుతుందని సమాచారమిచ్చి.. రాత్రి 8గంటలు దాటుతున్నా షారుక్ మీడియా సమావేశానికి రాలేదు. దీనిపై అక్కడున్నవారు కూడా జర్నలిస్టులకు సరైన సమాధానం ఇవ్వలేదు.

దీంతో ఆగ్రహించిన మీడియా ప్రతినిధులు రూమ్‌లో ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తున్న షారుక్ వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే వారిని షారుక్ సిబ్బంది అడ్డుకోవటంతో మీడియా ప్రతినిధులు.... షారుఖ్‌ బయటకు రావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అప్పుడు తీరిగ్గా బయటకు వచ్చిన షారుక్ ఆలస్యానికి క్షమించాలని కోరాడు.

 

తనకు మీడియా సమావేశంపై స్పష్టత లేదని చెప్పాడు. సరైన అవగాహన లేకుండా తమను ఎందుకు నాలుగు గంటల పాటు వేచి ఉంచేలా చేశారని  షారుక్ తో వాగ్వాదానికి దిగారు. అనంతరం మీడియా సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. దీంతో 'హ్యాపీ న్యూఇయర్‌' ప్రమోషన్‌ కాస్తా రసాభాసగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement