boycott
-
జీ20 మంత్రుల భేటీకి అమెరికా దూరం
వాషింగ్టన్: దక్షిణాఫ్రికాలో ఈనెలలో జరిగే జీ–20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి అమెరికా తరఫున ఎవరూ హాజరుకాబోరని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో బుధవారం ప్రకటించారు. ఈ నెల 20, 21 తేదీల్లో జొహన్నెస్‌బర్గ్‌లో జరిగే విదేశాంగ మంత్రుల జీ20 చర్చలను బహిష్కరిస్తున్నట్లు రూబియో చెప్పారు. దక్షిణాఫ్రికా ప్రభుత్వం అమెరికా వ్యతిరేక ఎజెండాతో వ్యవహరిస్తున్నందువల్లే సమావేశానికి దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న అమెరికా గైర్హాజరు జీ20 కూటమికి పెద్ద దెబ్బే. ఉక్రెయిన్ యుద్ధంపై దౌత్యానికి ట్రంప్ మొగ్గుచూపుతున్న విదేశాంగ మంత్రుల భేటీలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో రూబియో తొలిసారిగా భేటీ అవుతారని అంతా అనుకుంటున్న వేళ అసలు అమెరికా ఈ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించిందని రూబియో ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. -
జనసేన నేతల గ్రామ బహిష్కరణ
పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు కోనపాపపేటలో జనసేనకు చెందిన నాలుగు కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేస్తూ టీడీపీ ఆధ్వర్యాన గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించింది. కొత్తపల్లి మండలం కోనపాపపేట వద్ద కేఎస్‌ఈజెడ్‌లో ఇటీవల ఒక కంపెనీ నిరి్మస్తున్న పైప్‌లైన్‌వల్ల తమ ఉపాధి దెబ్బతింటోందని స్థానిక మత్స్యకారులు కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. కొందరు జనసేన నేతలు కంపెనీ వద్ద రూ.6 కోట్లు తీసుకున్నట్లు టీడీపీ నేతలు ప్రచారం చేశారు. ఈ మేరకు గ్రామంలో గురువారం సమావేశం ఏర్పాటుచేసి, ఆరోపణలు ఎదుర్కొంటున్న జనసేనకు చెందిన పల్లేటి బాపన్నదొర, పల్లేటి దారకొండ, పల్లేటి నాగేశ్వరరావు, పల్లేటి శ్రీనుతో పాటు వారి కుటుంబ సభ్యులకు జరిమానా విధించారు. దీంతో కోపోద్రిక్తులైన ఆరుగురు వ్యక్తులు టీడీపీ నేతలపై దాడికి దిగగా ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారి తరఫున టీడీపీ నేతలు కొత్తపల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే, దాడిచేసిన వారిపై పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో కోనపాపపేటలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నాలుగు కుటుంబాలను గ్రామం నుంచి బహిష్కరించినట్లు గ్రామస్తుల పేరుతో శుక్రవారం మైక్‌లో ప్రచారం చేశారు. అలాగే, వారి ఫొటోలతో గ్రామంలో ఫ్లెక్సీలు సైతం ఏర్పాటుచేశారు. ఈ నాలుగు కుటుంబాల వారితో ఎవరైనా మాట్లాడినా, వారికి సహకరించినా, వారి దుకాణాల వద్ద ఏ విధమైన వస్తువులు కొన్నా, వారికి చేపలు అమ్మినా, కొన్నా రూ.లక్ష జరిమానా విధించనున్నట్లు బహిరంగంగా ప్రచారం చేశారు. విషయం తెలుసుకున్న గ్రామ సచివాలయ సిబ్బంది అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో అధికారులు ఆ గ్రామానికి చేరుకుని గ్రామ బహిష్కరణ ప్రచారాన్ని నిలుపుదల చేశారు. గ్రామ బహిష్కరణ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలు అధికారులకు ఫిర్యాదు చేయగా.. తమపై దాడిచేసిన వారిని వెంటనే అరెస్టుచేయాలని టీడీపీ నేతలూ పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో కొత్తపల్లి పోలీసులు గ్రామంలో పహారా ఏర్పాటు చేశారు. కొండెవరంలో టీడీపీ–జనసేన కుమ్ములాట.. మరోవైపు.. కొత్తపల్లి మండలం కొండెవరం గ్రామంలో టీడీపీ–జనసేన నేతలు శుక్రవారం కుమ్ములాటలకు దిగారు. గ్రామంలో జరుగుతున్న ఏ కార్యక్రమాలూ తనకు తెలియడంలేదని, ప్రొటోకాల్ పాటించడంలేదని టీడీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యుడు దుళ్ల సత్తిబాబు ఇటీవల ఎంపీడీవో రవికుమార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎంపీడీఓ శుక్రవారం కొండెవరం గ్రామ సచివాలయానికి వచ్చి విచారణ చేపట్టారు. దీనికి ఎంపీటీసీ సభ్యుడ్ని ఆహ్వానించగా.. ఆయన టీడీపీ నేతలను వెంటబెట్టుకుని సచివాలయానికి వెళ్లారు. విషయం తెలుసుకున్న జనసేన నేతలూ గ్రామ సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయంలో మీకు పనేంటి.. వెంటనే వెళ్లిపోవాలని టీడీపీ నేతలు హుకుం జారీచేయడంతో ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగింది. విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు ఇరువర్గాలనూ అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ సంఘటనపై టీడీపీ నేతలు నిరసన తెలిపారు. -
ఈయూలో చేరిక అంశం వాయిదా
టిబిలిసీ: యురోపియన్ యూనియన్(ఈయూ)లో జార్జియా చేరే అంశాన్ని నాలుగేళ్లపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రధాని ప్రకటించడంతో.. దేశంలో ఆగ్రహం వెల్లువెత్తింది. ప్రతిపక్షాలు పార్లమెంటును బహిష్కరించాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఈయూ, జార్జియన్ జెండాలను ప్రదర్శిస్తూ పార్లమెంట్ వెలుపల ర్యాలీ నిర్వహించారు. రాజధాని టిబిలిసీ ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు శుక్రవారం నిరసనకారులపై బాష్పవాయువు, జలఫిరంగులను ప్రయోగించారు. కూటమి సిఫార్సులను నెరవేర్చాలనే షరతుతో ఈయూ 2023 డిసెంబరులో జార్జియాకు అభ్యర్థి హోదాను ఇచ్చింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ‘విదేశీ ప్రభావ’చట్టాన్ని ఆమోదించిన తరువాత దాని విలీనాన్ని నిలిపివేసింది. ఆర్థిక మద్దతును కూడా తగ్గించింది. ఈ నేపథ్యంలో జార్జియాలో అక్టోబర్ 26న ఎన్నికలు జరిగాయి. వీటిని యురోపియన్ యూనియన్‌లో చేరాలన్న దేశ ఆకాంక్షలకు రెఫరెండంగా భావించారు. అధికార జార్జియన్ డ్రీమ్ పార్టీనే ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే జార్జియాను తన అదీనంలోనే ఉంచుకోవాలనే రష్యా ప్రభావంతో ఓటింగ్‌లో రిగ్గింగ్ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. డబ్బు ప్రవాహం, డబుల్ ఓటింగ్, హింసాత్మక వాతావరణంలో ఓటింగ్ జరిగిందని యూరోపియన్ ఎన్నికల పరిశీలకులు సైతం తెలిపారు. అంతకుముందు, జార్జియన్ పార్లమెంటరీ ఎన్నికలు నిష్పాక్షికంగా జరగలేదని యురోపియన్ పార్లమెంటు గత నెలలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీనికి అధికార జార్జియన్ డ్రీమ్ పార్టీదే పూర్తి బాధ్యతని తెలిపింది. ఏడాదిలోగా పార్లమెంటరీ ఓటింగ్‌ను పునఃసమీక్షించాలని, జార్జియాపై ఆంక్షలు విధించాలని, ప్రభుత్వంతో అధికారిక సంబంధాలను పరిమితం చేయాలని సభ్యులు ఈయూకు పిలుపునిచ్చారు. ఈయూ ఆరోపణలను జార్జియా ఖండించింది. ఇది బ్లాక్మెయిల్ రాజకీయాలని, జార్జియాను శాసించే అధికారం ఎవ్వరికీ ఇవ్వబోమని ప్రధాని ప్రకటించారు. అంతేకాదు.. యురోపియన్ యూనియన్ దిశగా మా పంథాను కొనసాగిస్తామని తెలిపారు. అయితే 2028 చివరివరకు చర్చలను ఎజెండాలో ఉంచబోమని ప్రధాని కొబాఖిడ్జే గురువారం చెప్పారు. ఈయూ నుంచి ఎలాంటి బడ్జెట్ గ్రాంట్లను తీసుకోబోమని తెలిపారు. ప్రధాని ప్రకటన తర్వాత వేలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు. టిబిలిసీలోని పార్లమెంటు భవనం ఎదుట ర్యాలీ నిర్వహించారు. ఇతర నగరాల్లోనూ ప్రదర్శనలు నిర్వహించారు. జార్జియన్ డ్రీమ్పార్టీ నిరంకుశంగా మారి మాస్కో వైపు మొగ్గు చూపుతోందని విమర్శకులు అంటున్నారు. అధ్యక్షుడు సలోమ్ జౌరాబిచి్వలి అధికారిక ఫలితాలను తిరస్కరించారు. పార్లమెంటు చట్టబద్ధతను గుర్తించడానికి నిరాకరించారు. వచ్చే నెలలో అధ్యక్షుడి ఆరేళ్ల పదవీకాలం ముగియనుంది.. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. ఎన్నికలను దేశాన్ని ఐరోపా నుంచి, రష్యా వైపు తీసుకెళ్లేందుకు జరిగిన ‘తిరుగుబాటు’గా అభివరి్ణంచారు. దేశ భవిష్యత్తుపై పాలకపక్షం యుద్ధం చేస్తోందని ఆరోపించారు. -
పీఏసీ ఎన్నికల విషయంలో YSRCP కీలక నిర్ణయం
-
పీఏసీ ఎన్నికల్ని బాయ్‌కాట్ చేసిన వైఎస్సార్సీపీ
అమరావతి, సాక్షి: రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ)కి ఎన్నికలు నిర్వహించాల్సి రావడం దురదృష్టకరమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు పార్టీ తరఫున శుక్రవారం ఆయన ప్రకటించారు.‘‘ఇప్పటివరకు ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, కూటమి ప్రభుత్వం ఆ ఆనవాయితీకి విరుద్ధంగా చేస్తోంది. అందుకే ఈ ఎన్నికలను బాయ్‌కాట్ చేస్తున్నాం. గతంలో సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా పీఏసీ ప్రతిపక్షానికే ఇచ్చారు. ప్రతిపక్ష హోదా లేని పార్టీలకు కూడా అనేకసార్లు పదవి అప్పగించారు. పార్లమెంట్లో సైతం ఇలాంటి పరిణామం అనేకసార్లు చోటు చేసుకుంది... పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతుంది. అందుకే ప్రతిపక్షానికి ఇస్తారు. ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాల్లో అన్నింటా ప్రతిపక్షానికే పీఏసీ ఇస్తారు. ఒక్క తాలిబన్లు పాలిస్తున్న ఆఫ్ఘనిస్తాన్‌లో తప్ప. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం దగ్గరి నుంచి కోల్ గేట్ స్కామ్, కామన్ వెల్త్ గేమ్స్ కుంభకోణం.. అన్నీ పీఏసీనే వెలికితీసింది. 1994లో కాంగ్రెస్ పార్టీ కి ప్రతిపక్ష హోదా లేకపోయినా కాంగ్రెస్ కి పీఏసీ చైర్మన్ ఇచ్చారు... మాకు గతంలో 151 మంది ఎమ్మెల్యేలు బలం ఉన్నా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కి పీఏసీ చైర్మన్ ఇచ్చాం. కానీ, ఇప్పుడు పీఏసీకి ఎన్నికలు నిర్వహించడం దురదృష్టకరం. ఈ ప్రభుత్వం ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ ను ఇవ్వడం లేదు. అందుకే.. ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం’’ అని పెద్దిరెడ్డి ప్రకటించారు. -
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బహిష్కరించిన YSRCP
-
ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ భేటీ
గుంటూరు, సాక్షి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైఎస్సార్సీపీ దూరంగా ఉంది. సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంపై నిరసనగానే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఒకవైపు సమావేశాలు జరుగుతుండగానే.. ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు.సభలో కూటమి తర్వాత ఎక్కువ ఓటు షేరింగ్ ఉన్న వైఎస్సార్సీపీని లేఖ రాసినప్పటికీ స్పీకర్ ప్రతిపక్షంగా గుర్తించకపోవడం, గత సమావేశాల్లో మాట్లాడేందుకు మైక్ ఇవ్వకపోవడంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బాయ్‌కాట్ చేసింది వైఎస్సార్సీపీ. ఇక నుంచి మీడియా ఎదుటే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. రానున్న రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై ఎమ్మెల్యేలతో జగన్ చర్చించారు. -
Waqf Amendment Bill: రేపు రాబోం
కోల్‌కతా/న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లుపై సమీక్ష చేపడుతున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నవంబర్ 9వ తేదీ నుంచి మొదలుకానున్న తదుపరి సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు కమిటీలోని విపక్ష సభ్యులు ప్రకటించారు. కమిటీ సభ్యులు కల్యాణ్ బెనర్జీ, నదీముల్ హక్ గురువారం కోల్‌కతాలో మాట్లాడారు. ‘‘విరామం ఇవ్వకుండా, సమీక్షలకు మేం సిద్ధమయ్యే అవకాశం లేకుండా చైర్మన్, బీజేపీ నేత జగదాంబికా పాల్ సమావేశాలకు తేదీలు ఖరారు చేశారు. వేర్వేరు రాష్ట్రాల్లో గువాహటి, భువనేశ్వర్, కోల్‌కతా, పట్నా, లక్నోల్లో ఆరు రోజుల్లో సమావేశాలకు రమ్మంటున్నారు. పాల్ ఏకపక్ష నిర్ణయాలను మేం వ్యతిరేకిస్తున్నాం. అందుకే ఈ దఫా భేటీలను మేం బహిష్కరించబోతున్నాం’’ అని అన్నారు. -
ఆరోపణలు నిజమైతే ఐదేళ్లు బహిష్కరణ
నటీమణులపై లైంగిక వేధింపుల వ్యవహారంలో కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హేమా కమిటీ ప్రభావం ఇతర ఇండస్ట్రీల్లోనూ చర్చనీయాంశమైంది. దీంతో దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) నటీమణులపై లైంగిక వేధింపుల వ్యవహారంలో చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం చెన్నైలోని ఆ సంఘం నిర్వాహకుల సమావేశంలో కొన్ని తీర్మానాలు చేశారు. ఇందులో ముఖ్యంగా విశాఖ కమిటీ సూచనల మేరకు నటీమణుల రక్షణ కోసం ఎస్ఐఏఏ–జీఎస్ఐసీసీ పేరుతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తీర్మానం చేశారు. దీనికి నటి రోహిణి అధ్యక్షురాలిగానూ, నటీమణులు సుహాసిని, ఖుష్బూ సభ్యులుగానూ వ్యవహరిస్తారు. ఈ కమిటీకి ఒక న్యాయవాదిని నియమించనున్నారు. నటీమణులపై లైంగిక వేధింపులు రుజువైతే అందుకు కారణమైన వారిని సినిమాల నుంచి 5 ఏళ్లు బహిష్కరించాలని నిర్మాతల మండలికి సిఫారసు చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా బాధిత నటీమణులకు చట్టపరంగా సహాయాలను అందించడం జరుగుతుందన్నారు. అలాగే బాధితుల ఫిర్యాదుల కోసం ఇప్పటికే ఫోన్ నంబర్ ఏర్పాటు చేశామనీ, తాజాగా ఈమెయిల్ ద్వారానూ ఫిర్యాదులు చేయవచ్చనీ తీర్మానం చేశారు. కాగా యూట్యూబ్ ఛానల్స్ కారణంగా బాధితులైనవారు సైబర్ ΄ోలీసులకు ఫిర్యాదు చేస్తే తమ కమిటీ వారికి సహకరిస్తుందని, కమిటీ చర్యలను నటీనటుల సంఘం పర్యవేక్షిస్తుందని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడు నాజర్, ఉ΄ాద్యక్షుడు పూచి మురుగన్, కోశాధికారి కార్తీ ΄ాల్గొన్నారు. -
స్తంభించిన వైద్యసేవలు
సాక్షి, అమరావతి/నెట్వర్క్: కోల్‌కతాలోని ఆర్జీ కర్ వైద్యకళాశాలలో రెసిడెంట్ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్యకు నిరసనగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా వైద్యవర్గాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఆ అఘాయిత్యానికి నిరసనగా శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం ఉదయం 6 వరకు 24 గంటల పాటు వైద్యసేవల బంద్‌కు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పిలుపునివ్వడంతో రాష్ట్రంలో అత్యవసర వైద్యసేవలు మినహా మిగిలిన సేవలు స్తంభించాయి. అన్ని జిల్లాల్లోను ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సులు, వైద్యసిబ్బంది విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు.ఐఎంఏ, పలు వైద్యసంఘాల ఆధ్వర్యంలో వైద్యులు, విద్యార్థిసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాల వారు గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం నగరాలతో పాటు అనేకచోట్ల కొవ్వొత్తులతో ర్యాలీలు, ప్రదర్శనలు, మానవహారాలు నిర్వహించారు. ఆర్జీ కర్ ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని ఈ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో వైద్యులపై దాడులు, అత్యాచారం, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని కోరారు. ఇందుకోసం ఓ ప్రత్యేక రక్షణ చట్టాన్ని రూపొందించాలని, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో జూనియర్ డాక్టర్లు అత్యవసర సేవలకు కూడా దూరంగా ఉండి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో రోగులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రభుత్వ వైద్యులు సైతం అన్ని ఆస్పత్రుల్లో విధులకు హాజరై నిరసన తెలిపారు. ఐఎంఏ చేపట్టిన ఈ బంద్ ఆదివారం ఉదయం 6 గంటలకు ముగుస్తుంది. -
నీతిఆయోగ్ భేటీకి ఆరుగురు సీఎంలు దూరం
న్యూఢిల్లీ: హస్తినలో శనివారం జరగబోయే నీతి ఆయోగ్ పాలకమండలి భేటీని విపక్ష ‘ఇండియా’ కూటమి పార్టీలకు చెందిన ఆరుగురు సీఎంలు బహిష్కరించారు. కేంద్ర బడ్జెట్లో తమ రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో తీవ్ర వివక్ష చూపారంటూ ఈ నిర్ణయం తీసుకున్నారు. వీరిలో కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల సీఎంలు రేవంత్‌రెడ్డి (తెలంగాణ), సిద్ధరామయ్య (కర్ణాటక), సుఖీ్వందర్ సింగ్ సుఖూ (హిమాచల్ ప్రదేశ్)తో పాటు ఎంకే స్టాలిన్ (తమిళనాడు), విజయన్ (కేరళ), భగవంత్ మాన్ (పంజాబ్) ఉన్నారు. ఢిల్లీ ప్రభుత్వమూ భేటీని బాయ్‌కాట్ చేసింది.ప్రణాళికా సంఘమే కావాలి: మమతపశి్చమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ మాత్రం భేటీలో పాల్గొంటానని స్పష్టంచేశారు. ‘‘బడ్జెట్ కేటాయింపుల్లో విపక్షాలపాలిత రాష్ట్రాలపై మోదీ సర్కార్ వివక్షను భేటీలో ప్రస్తావిస్తా. బెంగాల్లో విభజన రాజకీయాలు తెస్తూ పొరుగురాష్ట్రాలతో వైరానికి వంతపాడుతున్న కేంద్రాన్ని కడిగేస్తా. నీతి ఆయోగ్ ప్రణాళికలు ఒక్కటీ అమలుకావడం చూడలేదు. ప్రణాళికా సంఘంలో ఒక విధానమంటూ ఉండేది. రాష్ట్రాల సూచనలకు విలువ ఇచ్చేవారు. నీతిఆయోగ్‌లో మా మాట వినే అవకాశం లేదు. పట్టించుకుంటారన్న ఆశ అస్సలు లేదు. అందుకే ప్రణాళికా సంఘాన్ని పునరుద్ధరించాలి’’ అని మమత అన్నారు. నేడు మోదీ నేతృత్వంలో భేటీ 2047 ఏడాదికల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై చర్చించేందుకు నేడు ప్రధాని మెదీ అధ్యక్షతన 9వ నీతిఆయోగ్ పాలకమండలి సమావేశం జరగనుంది. ఈ భేటీకి కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరుకానున్నారు. అయితే పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి ఈ భేటీకి రావట్లేదని తెలుస్తోంది. పుదుచ్చేరిలో రంగస్వామికి చెందిన ఏఐఎన్ఆర్సీ పార్టీ బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజాజీవనాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్రాలు ఎలా మరింత సమన్వయంతో పనిచేయాలనే అంశాలనూ ఈ భేటీలో చర్చించనున్నారు. వికసిత భారత్‌కు దార్శనిక పత్రం రూపకల్పనకు తీసుకోవాల్సిన చర్యలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ క్రతువులో రాష్ట్రాల పాత్రపై విస్తృతస్థాయిలో చర్చ జరగనుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. గత ఏడాది డిసెంబర్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల మూడో జాతీయ సదస్సులో చేసిన సిఫార్సులనూ సమావేశంలో పరిశీలించనున్నారు. -
లాల్ చౌక్‌లో నేతల సందడి.. స్వేచ్ఛాయుత ఓటుకు జనం సిద్దం!
దేశంలో ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో కశ్మీర్లో వినూత్న ఉదంతం చోటుచేసుకుంది. గతంలో కశ్మీర్ లోయలో ఎన్నికలు ప్రకటించినప్పుడు వేర్పాటువాదులు బహిష్కరణకు పిలుపునిచ్చేవారు. దాని ప్రభావం స్పష్టంగా కనిపించేది. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా ఎలాంటి బహిష్కరణ పిలుపు లేకుండా ఇక్కడ లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.ప్రస్తుతం శ్రీనగర్‌లోని చారిత్రక లాల్ చౌక్ రాజకీయ నినాదాలతో మారుమోగుతోంది. క్లాక్ టవర్ ఎన్నికల సభలకు వేదికగా నిలిచింది. గత మూడు దశాబ్దాలుగా వేర్పాటువాదుల బంద్ పిలుపులు, రాళ్లదాడులు, ఎన్కౌంటర్లు, ఊరేగింపులకు అడ్డాగా నిలిచిన క్లాక్ టవర్ ప్రాంతంలో ఇప్పుడు వేర్పాటువాదుల బహిష్కరణ పిలుపు లేకుండా వివిధ రాజకీయ పార్టీల బహిరంగ సభలు జరుగుతున్నాయి.దీనిని 2019 తరువాత వచ్చిన భారీ మార్పుగా పరిగణిస్తున్నారు. స్థానికుడు సుహైల్ అహ్మద్ మాట్లాడుతూ కాశ్మీర్లో గత కొన్నేళ్లలో వేర్పాటువాదులపై ఎన్ఐఏ తదితర ఏజెన్సీలు చర్యలను కఠినతరం చేశాయి. వేర్పాటువాదులలోని కొందరు గృహనిర్బంధంలో ఉండగా, మరికొందరు జైలులో ఉన్నారని తెలిపాడు. మరో యువకుడు జహూర్ హుస్సేన్ మాట్లాడుతూ గతంలో బహిష్కరణ పిలుపు ఇచ్చేవారికి భయపడి ఓట్లు వేసేవారు కాదని, అయితే ప్రతి ఒక్కరికీ తమ ప్రతినిధిని ఎన్నుకునే హక్కు ఉందని, ఈసారి తామంతా తమ హక్కును వినియోగించుకుంటామని తెలిపారు.అల్తాఫ్ ఘంటాఘర్, నౌహట్టా, జామియా మసీదు, గోజ్వారా, రాజౌరి కడల్, సిమెంట్ కడల్, ఈద్గా తదితర ప్రాంతాలలో రాజకీయ పార్టీలు ఎటువంటి భయం లేకుండా ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. ఒకప్పుడు అశాంతితో అట్టుడికిపోయే లాల్ చౌక్‌లో ప్రస్తుతం రాజకీయ నేతలు శాంతి సందేశం ఇస్తూ, తమకు ఓటు వేయాలని కోరుతున్నారు. -
బంగ్లాదేశ్‌లో జోరుగా...‘బాయ్‌కాట్ ఇండియా’
ఢాకా: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా నాలుగో విడత ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టాక సామాజిక మాధ్యమాల్లో భారత వ్యతిరేక ప్రచారం ఊపందుకుంది. చీరలు, సుగంధ ద్రవ్యాలు వంటి భారత ఉత్పత్తుల్ని బాయ్‌కాట్ చేయాలన్న ప్రచారానికి ప్రతిపక్ష నేతలు మద్దతిస్తున్నారు. భారత ఉత్పత్తులతో నిండిపోయే ఢాకా మార్కెట్లో కొంతకాలంగా వంటనూనె, ప్రాసెస్ట్ ఫుడ్స్, కాస్మెటిక్స్, దుస్తులు వంటి వాటి విక్రయాలు పడిపోయాయి. హసీనాను, ఆమె ఆవామీ లీగ్ పార్టీని అతిపెద్ద భారత ఉత్పత్తులుగా ప్రతిపక్ష బీఎన్పీ నేతలు అభివరి్ణస్తుండగా ప్రధాని హసీనా భారత వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. తనకెంతో ఇష్టమైన చీరలతోనే ప్రత్యర్థి వాదనను ఆమె ఎదుర్కొంటున్నారు. భారత ఉత్పత్తుల్ని బాయ్‌కాట్ చేయాలని ప్రతిపక్ష బీఎన్పీ నేతలు నిజంగా భావిస్తున్నట్లయితే పార్టీ ఆఫీసు ఎదురుగా వాళ్లు భార్యల చీరలకు ఎందుకు నిప్పుపెట్టడం లేదు? అని ప్రశ్నించారు. బీఎన్పీ నేతలు, వారి భార్యలు భారత్‌లో చీరలు కొనుక్కొచి్చ, బంగ్లాదేశ్‌లో అమ్ముకుంటున్నారన్నారు. ‘గరం మసాలా, అల్లం, వెల్లుల్లి, ఉల్లి తదితర ఎన్నో దినుసుల్ని భారత్ నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. బీఎన్పీ నేతలు భారత సుగంధ ద్రవ్యాలు వాడకుండా వంట చేయగలరా?’అని హసీనా నిలదీశారు. అలా తినగలమని వారు సమాధానం చెప్పగలరా అని అన్నారు. ప్రజల నుంచి దూరమైన ఆ పార్టీ భారత వ్యతిరేక ప్రచారాన్ని ఎగదోస్తోందని హసీనా అన్నారు. భారత వ్యతిరేక ఆన్లైన్ ప్రచారం యూరప్, అమెరికాల్లో ఉన్న బంగ్లాదేశీయులతో ముందుగా మొదలైంది. పారిస్‌లో ఉంటున్న పినాకీ భట్టాచార్య భాయ్‌కాట్ ఇండియా ప్రచారంలో కీలకంగా ఉన్నారు. మొదట్లో ప్రతిపక్ష బీఎన్పీ నేతలు ఇందులో లేరు. తర్వాత్తర్వాత ప్రజల్లో మద్దతు సంపాదించేందుకు వారూ ఈ ప్రచారంలో తోడయ్యారు. -
నాగాలాండ్‌లో ఎన్నికల బహిష్కరణ? ఈఎన్‌పీవో నిర్ణయం?
లోక్‌సభ ఎన్నికలను నాగాలాండ్‌లోని ఒక వర్గం బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ (ఈఎన్‌పీవో) రాష్ట్రంలోని ఆరు జిల్లాలను కలిపి ప్రత్యేక పరిపాలన కేంద్రం లేదా రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తూవస్తోంది. వీటిని నెరవేర్చని పక్షంలో రాష్ట్రంలోని ఏకైక లోక్‌సభ స్థానానికి జరిగే ఎన్నికల్లో పాల్గొనబోమని తేల్చిచెప్పింది. ఈఎన్పీవోతో పాటు అపెక్స్ నాగా బాడీ, ఆరు జిల్లాల్లోని దాని అనుబంధ సంస్థలు ప్రత్యేక రాష్ట్రం కోరుతూ గత సంవత్సరం (ఫిబ్రవరి 27) అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చాయి. అయితే ఆ తరువాత ఈ విషయమై ప్రభుత్వం నుంచి హామీ వచ్చింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సలహాదారు ఏకే మిశ్రా అధ్యక్షతన ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. అనంతరం కమిటీ సభ్యులు నాగాలాండ్‌ను అనేకసార్లు సందర్శించి, అక్కడి ప్రజల అభిప్రాయాలను సేకరించారు. మరోవైపు నాగాలాండ్‌లోని తూర్పు ప్రాంత ప్రజలకు స్వయంప్రతిపత్తి ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి సిఫార్సు చేసిందని నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫియు రియో ఇటీవల తెలిపారు. కాగా ఇఎన్పీవో ఇప్పటికే పబ్లిక్ ఎమర్జెన్సీని ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఏ పార్టీకి అనుమతి ఇవ్వబోమని తేల్చిచెప్పింది. -
‘బాయ్‌కాట్’ దెబ్బ గట్టిగా తగిలింది: మాల్దీవుల మాజీ అధ్యక్షుడు
న్యూఢిల్లీ: మాల్దీవులపై భారత్ ఇచ్చిన బాయ్‌కాట్ కాల్‌పై ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ ఇచ్చిన బాయ్‌కాట్ పిలుపుతో మాల్దీవుల పర్యాటకంపై భారీ ప్రభావం పడిందని చెప్పారు. ఈ విషయమై ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న నషీద్ మీడియాతో మాట్లాడారు. ‘భారత్ బాయ్‌కాట్ పిలుపు మాల్దీవుల పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. దీనిపై నేను చాలా ఆందోళన చెందుతున్నాను. ఇందుకు క్షమాపణలు చెబుతున్నాను. హాలీడేస్‌కు భారత ప్రజలు మాల్దీవులకు రావాలని కోరుకుంటున్నాను. మా ఆతిథ్యంలో ఎలాంటి తేడాలుండవు. భారత్, మాల్దీవుల సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలి. ఈ పర్యటనలో ప్రధాని మోదీని కూడా కలిశాను. నేను మోదీకి పెద్ద మద్దతుదారును. ఆయనకు ఆల్ ద బెస్ట్ చెబుతున్నాను’అని నషీద్ తెలిపారు. మాల్దీవుల నుంచి భారత సైన్యం వైదొలగాలని ప్రస్తుత అధ్యక్షుడు మహ్మద్ మిజ్జు తీసుకున్న నిర్ణయంపైనా నషీద్ స్పందించారు. దీనిపై ఇరు దేశాలు చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కాగా, చైనా మద్దతుదారుగా పేరున్న ప్రస్తుత మాల్దీవుల ప్రధాని మిజ్జు ఈ నెల 10లోగా భారత సైన్యం మాల్దీవులను విడిచి వెళ్లాలని డెడ్‌లైన్ పెట్టిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. గాజాలో దారుణం.. తిండి కోసం ఎదురు చూస్తున్నవారిపై పారాచూట్ -
Lakshadweep vs Maldives: ముదిరిన లక్షద్వీప్–మాల్దీవుల వివాదం
న్యూఢిల్లీ: ‘లక్షద్వీప్–మాల్దీవుల’ వివాదం ముదురుతోంది. మన పర్యాటక రంగంపై మాల్దీవుల మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలతో మొదలైన ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’ పిలుపుకు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఆ దేశ దౌత్యవేత్త అలీ నజీర్ మొహమ్మద్‌తో భారత హైకమిషనర్ మును ముహావర్ సోమవారం సమావేశమయ్యారు. భారత్ పట్ల, ప్రధాని మోదీ పట్ల మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలను ఎండగట్టారు. వారిని మాల్దీవులు ఇప్పటికే సస్పెండ్ చేయడం తెలిసిందే. అయినా దీనిపై భారతీయ సమాజంలో ఆగ్రహావేశాలు తగ్గలేదు. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, శ్రద్దా కపూర్, వెంకటేశ్ ప్రసాద్, వీరేందర్ సెహా్వగ్ తదితర సెలెబ్రిటీలు కూడా ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’కు జై కొట్టారు. మాల్దీవుల పర్యటన మానేసి లక్షద్వీప్, అండమాన్ వంటి భారతీయ రమణీయ కేంద్రాలకు వెళ్లాలంటూ ఫొటోలను షేర్చేశారు. మాల్దీవులతో వాణిజ్య కార్యకలాపాలు తగ్గించుకోవాలని కన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ పిలుపునిచి్చంది. 3,400 శాతం పెరిగిన సెర్చింగ్! లక్షద్వీప్‌లో మోదీ పర్యటన తర్వాత ఆన్లైన్ వేదికల్లో భారత దీవుల కోసం వెతికే వారి సంఖ్య ఏకంగా 3,400 శాతం పెరిగిందని మేక్మైట్రిప్ సంస్థ పేర్కొంది. మాల్దీవులకు పర్యాటకుల్లో భారతీయుల సంఖ్యే అత్యధికమని ఆ దేశ పర్యాటక శాఖ గణాంకాల్లో వెల్లడైంది. గతేడాది 2.09 లక్షల మంది భారతీయులు అక్కడికెళ్లారు. 2022లో 2.4 లక్షలు, 2021లో 2.11 లక్షల మంది పర్యటించారు. అంతేకాదు, కోవిడ్ కాలంలోనూ 63,000 మంది అక్కడ పర్యటించారు! ట్రెండింగ్‌లో లక్షద్వీప్ మాల్దీవులకు బదులు భారతీయ పర్యటక కేంద్రాలకే వెళ్దామన్న సెలబ్రిటీలు పిలుపుతో లక్షద్వీప్ కోసం ఆన్లైన్లో సెర్చింగ్ అనూహ్యంగా పెరిగింది. ‘లక్షద్వీప్’ పదంతో ప్రపంచవ్యాప్తంగా సెర్చింగ్ చేస్తున్న వారి సంఖ్య గత రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంత ఎక్కువ స్థాయికి చేరుకుందని ‘గూగుల్ ట్రెండ్స్’ గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఈజ్‌మైట్రిప్ సంస్థ భారత్‌కు మద్దతుగా మాల్దీవులకు విమానాల బుకింగ్స్‌ను రద్దుచేసింది. ‘‘మాల్దీవులు/సీషెల్స్ మాదిరే లక్షద్వీప్‌లోని బీచ్‌లు, పరిసరాలు అద్భుతంగా ఉంటాయి. ఇక్కడే పర్యటించండి’’ అని సంస్థ సీఈవో నిషాంత్ పిట్టి చెప్పారు. -
పార్లమెంట్.. విపక్షాలది ఫ్రస్ట్రేషన్: మోదీ
Parliament Winter Session 2023 Updates ►లోక్‌సభలో కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్.. స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. టెలికమ్యునికేషన్ బిల్లు-2023 పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లు భవిష్యత్తులో ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. Deputy Leader of Congress in Lok Sabha, Gaurav Gogoi writes to Lok Sabha Speaker Om Birla, expressing his "deep concern about the Telecominniocation Bill 2023. In its current form, the Bill raises several serious concerns that have the potential to negatively impact the future of… pic.twitter.com/81nSyleKma — ANI (@ANI) December 19, 2023 ►కేంద్ర వస్తు సేవల పన్ను (రెండవ సవరణ) బిల్లు- 2023 లోక్‌సభలో ఆమోదం పొందింది. The Provisional Collection of Taxes Bill, 2023 taken up for consideration and passing in Lok Sabha. — ANI (@ANI) December 19, 2023 ► ప్రొవిజినల్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్-2023ని లోక్‌సభలో ప్రవేశపెట్టారు. The Provisional Collection of Taxes Bill, 2023 taken up for consideration and passing in Lok Sabha. — ANI (@ANI) December 19, 2023 ► రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంఖర్‌పై మిమిక్రీ చేయడం సభ హక్కులను దిక్కరించడమేనని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు అన్నారు. "Contemptible": Kiren Rijiju slams Rahul Gandhi for filming TMC's Kalyan Banerjee mimicking Rajya Sabha Chairman Read @ANI Story | https://t.co/B5BomJ328f#KalyanBanerjee #RajyaSabha #RahulGandhi pic.twitter.com/6wQgyUPRrW — ANI Digital (@ani_digital) December 19, 2023 ► ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి తర్వాత విపక్షాలు ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నాయని ప్రధాని మోదీ చురకలు అంటించారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. Venting out frustration after poll routs: PM Modi calls out Oppn for 'political spin' to Parliament security breach Read @ANI Story | https://t.co/r9FJB4hexS#BJP #PMModi #Parliament pic.twitter.com/dP60IxCqg3 — ANI Digital (@ani_digital) December 19, 2023 ►పార్లమెంటు వెలుపల తనపై మిమిక్రీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ మండిపడ్డారు. ఎంపీ స్థానంలో ఉండి సభాధ్యక్షున్ని హేళన చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. #WATCH | "Ridiculous, unacceptable", says Jagdeep Dhankhar after TMC MP Kalyan Banerjee mimics Rajya Sabha Chairman and Congress MP Rahul Gandhi films the act. pic.twitter.com/F3rftvDmhJ — ANI (@ANI) December 19, 2023 ఎన్సీఆర్ ఢిల్లీ సవరణ బిల్లు, సీజీఎస్టీ సవరణ బిల్లులకు లోక్‌సభ ఆమోదం #WATCH | National Capital Territory of Delhi Laws (Special Provisions) Second (Amendment) Bill, 2023 taken up for consideration and passing in Lok Sabha. pic.twitter.com/dmAXVkSdtp — ANI (@ANI) December 19, 2023 పార్లమెంట్ నుంచి మరింత మంది ఎంపీల సస్పెన్షన్ లోక్‌సభ, రాజ్యసభల నుంచి మరింత మంది ఎంపీల సస్పెన్షన్ ఇవాళ ఒక్కరోజే లోక్‌సభ నుంచి 49 మంది ఎంపీల సస్పెన్షన్ నిన్న 33 మంది ఎంపీలు..అంతకుముందు 13 మంది సస్పెన్షన్ లోక్‌సభ నుంచి 95 మంది, రాజ్యసభ నుంచి 46 మంది ఎంపీల సస్పెండ్ ఈ సెషన్లో మొత్తం 141 మంది ఎంపీలు బయటికి More Opposition MPs in Lok Sabha including Supriya Sule, Manish Tewari, Shashi Tharoor, Md Faisal, Karti Chidambaram, Sudip Bandhopadhyay, Dimple Yadav and Danish Ali suspended for the remainder of the winter session of Parliament pic.twitter.com/nxcUVnlVEn — ANI (@ANI) December 19, 2023 అపోజిషన్ ముక్త్ పార్లమెంట్‌కు బీజేపీ ప్రయత్నం : శశి థరూర్ ప్రభుత్వం ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తోంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసి చర్చ లేకుండా బిల్లులు పాస్ చేసుకోవాలనుకుంటోంది పార్లమెంట్ డెమొక్రసీకి ఇవాళ చచ్చిపోయింది #WATCH | On suspension of more than 40 MPs from Lok Sabha, including his own, Congress MP Shashi Tharoor says, "...It is clear that they want an Opposition-mukt Lok Sabha and they will do something similar in Rajya Sabha. At this point, unfortunately, we have to start writing… pic.twitter.com/mh9LeXEgiB — ANI (@ANI) December 19, 2023 లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా విపక్షాల నినాదాల మధ్య లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా ప్లకార్డులు ప్రదర్శించవద్దని కోరిన స్పీకర్ పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై హోం మంత్రి స్టేట్మెంట్కు విపక్షాల పట్టు గాంధీ విగ్రహం వద్ద ఖర్గే, శరద్‌పవార్ నిరసన 92 మంది ఎంపీల సస్పెన్షన్‌పై విపక్షాల ఆందోళన పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద నేతల నిరసన #WATCH | Opposition MPs including NCP's Sharad Pawar and Congress' Mallikarjun Kharge stage protest in front of Gandhi Statue in Parliament premises, after the suspension of 92 MPs for the remainder of the ongoing winter session pic.twitter.com/WKzk0xa1TP — ANI (@ANI) December 19, 2023 పార్లమెంటు సమావేశాలను బహిష్కరించిన విపక్షాలు నేడు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నేతృత్వంలో విపక్ష నేతల భేటీ పార్లమెంట్ సమావేశాల బహిష్కరించాలని నిర్ణయించిన పార్టీలు ఒక్కరోజే ఉభయ సభలో 78 మంది ఎంపీల సస్పెన్షన్ పై విపక్షాల ఆగ్రహం మొత్తం 92 మంది ఎంపీలపై పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ వేటు సస్పెండైన ఎంపీలు మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నా చేయాలని నిర్ణయం కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్ భద్రతా వైఫల్యానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్న విపక్షాలు నేడు పార్లమెంటులో కీలక బిల్లులు ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్టుల స్థానంలో కొత్త బిల్లులు నిన్న విపక్ష ఎంపీల సస్పెన్షన్ తో సాఫీగా సభా కార్యక్రమాలు జరిగే చాన్స్ సస్పెన్షన్‌పై పార్లమెంట్ బయట ఆందోళన చేపట్టనున్న విపక్ష ఎంపీలు లోక్ సభలో బిల్లులపై చర్చ ప్రారంభించనున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా బ్రిటిష్ కాలం నాటి చట్టాల పేరు మార్పు ఐపీసీని భారత న్యాయ సంహితగా పేరు మార్పు సిఆర్పీసీకి భారత నాగరిక సురక్ష సంహితగా చేంజ్ ఎవిడెన్స్ యాక్టుకు భారత సాక్ష బిల్లుగా నామకరణం కొత్త బిల్లులకు హిందీ పేర్లు పెట్టడంపై విపక్షాల ఆందోళన హిందీ పేర్లతో వల్ల న్యాయ ప్రక్రియలో అయోమయం ఏర్పడే అవకాశం ఉందంటున్న విపక్షాలు -
అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం: రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు శనివారం ప్రమాణం చేసేందుకు ఉద్దేశించిన ఈ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలు హాజరుకావడం లేదన్నారు. శనివారం ఉదయం తమ పార్టీ కార్యాలయంలో కేంద్రమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డితో ఎమ్మెల్యేలు సమావేశమై, ఆయా అంశాలపై చర్చిస్తామని తెలిపారు. బీజేఎల్పీ సమావేశం అనంతరం ఎమ్మెల్యేలు చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శుక్రవారం రాజాసింగ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎందరో సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నా ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెమ్ స్పీకర్‌గా నియమించినందున తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రజాకార్ల సైన్యానికి నాయకత్వం వహించిన ఖాసిం రజ్వీ వారసులైన ఎంఐఎం పార్టీ నేతల ఎదుట ప్రమాణం చేయదలుచుకోలేదని రాజాసింగ్ చెప్పారు. ఆ తర్వాత స్పీకర్ ఎదుట ఎప్పుడైనా ప్రమాణం చేస్తామని తెలిపారు. 2018లోనూ ప్రొటెమ్ స్పీకర్‌గా ఉన్నందున ఎంఐఎం సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్‌ఖాన్ ఎదుట రాజాసింగ్ ప్రమాణం చేయలేదు. -
పలు టీవీ ఛానళ్లపై ఇండియా కూటమి నిషేధం.. ఎందుకంటే..?
ఢిల్లీ: తమపై దుష్ప్రచారం చేస్తున్న టీవీ ఛానళ్లు, షోలపై నిషేధం విధించాలని ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంది. తమపై విషం చిమ్ముతున్నవారి జాబితాను సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేసింది. నిన్న ఢిల్లీలో జరిగిన కూటమి సమన్వయ కమిటీ భేటీలో ఈ మేరకు తీర్మానించింది. #WATCH | "There are some anchors who conduct provocative debates. We'll make a list of them and INDIA alliance partners will stop going to their shows.": AAP Rajya Sabha MP Raghav Chadha after meeting of INDIA alliance coordination committee.#AamAadmiParty #RaghavChadha… pic.twitter.com/GlGz2wEqXK — Free Press Journal (@fpjindia) September 13, 2023 నిన్న ఢిల్లీలో ఇండియా కూటమి సమన్వయ కమిటీ మొదటిసారి సమావేశమైంది. ఎన్సీపీ నేత శరద్ పవార్ నివాసంలో భేటీ అయి ఎన్నికల ప్రచారం, సీట్ల షేరింగ్‌పై చర్చించారు. అక్టోబర్‌లో మొదటి బహిరంగ సభ నిర్వహించాలని తీర్మానించారు. ఈ క్రమంలోనే కొన్ని మీడియా సంస్థలు తమను పట్టించుకోవట్లేదని ఆరోపణలు చేసింది. పైగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడింది. అలాంటి ఛానళ్లను, షోలను, యాంకర్లను ఇకపై నిషేధించాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆయా జాబితాను సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేసింది. BIG BREAKING: The INDIA alliance has prepared the list of TV anchors who propagate hatred. Next week the list will be published by all the opposition parties. -Aman Chopra -Amish Devgan -Arnab Goswami -Sushant Sinha -Chitra Tripathi -Deepak Chaurasia -Rubika Liyaquat These… — Amock (@Politics_2022_) September 13, 2023 కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సమయంలో కొన్ని మీడియా ఛానళ్లు పట్టించుకోలేదని కాంగ్రెస్ ఆరోపించింది. తమకు వ్యతిరేకమైన అంశాలనే ప్రచారం చేసినట్లు తెలిపింది. జోడో యాత్రపై సోషల్ మీడియాలో విశేష స్పందన లభించినప్పటికీ ప్రధాన మీడియా పక్కకు పెట్టినట్లు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ ఆరోపించారు. 'కొన్ని మీడియా సంస్థల ఎడిటర్లు భారత్ జోడో యాత్రను నిషేధించారు. లక్షల మంది పాల్గొన్నప్పటికీ తగినంత ప్రచారం కల్పించలేదు. పైగా వ్యతిరేకమైన వార్తలనే ప్రచారం చేశారు' అని రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ మండిపడ్డారు. 2019 మేలోనూ కొన్ని మీడియా ఛానళ్లపై కాంగ్రెస్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. టీవీ డిబేట్లకు కాంగ్రెస్ తమ ప్రతినిధులను పంపకూడదని సీనియర్ నాయకుడు రణదీప్ సుర్జేవాలా అప్పట్లో పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: Sanatan Dharma Remark Controversy: సనాతన ధర్మంపై మాట్లాడకండి.. పార్టీ శ్రేణులకు స్టాలిన్ సూచన -
మాకొద్దీ మాయదారి మద్యం
పలమనేరు/బైరెడ్డిపల్లి (చిత్తూరుజిల్లా) : చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం మేకల మాగిరెడ్డిపల్లి గ్రామస్తులు మద్యం తాగకూడదని నిర్ణయం తీసుకున్నారు. దీనిని ఎవరు అతిక్రమించినా జరిమానాతో పాటు గ్రామ బహిష్కరణ చేయాలని సర్పంచ్‌తో కలిసి నిర్ణయం తీసుకున్నారు. మేకల మాగిరెడ్డిపల్లిలో మొత్తం 270 కుటుంబాలు, రెండు వేల దాకా జనాభా ఉన్నారు. దాదాపు అందరికీ కూలీనాలీయే జీవనాధారం. అయితే కొన్నాళ్లుగా కొందరు కర్ణాటక టెట్రాప్యాకెట్లను తెచ్చి గ్రామంలో అమ్ముతున్నారు. దీంతో యువకులు మద్యానికి బానిసలై కుటుంబాలకు భారంగా మారారు. దీన్ని గమనించిన సర్పంచ్ బాలకృష్ణ గ్రామ పెద్దలతో చర్చించి వారం రోజుల కిందట పంచాయితీ పెట్టించారు. తమ గ్రామం బాగుపడాలంటే ఊర్లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. మద్యం తాగినా, కర్ణాటక నుంచి ఎవరైనా మద్యం తెచ్చి అమ్మినా వారికి రూ.20 వేల జరిమానాతో పాటు, గ్రామ బహిష్కరణ చేయాలని తీర్మానించారు. ఫలితంగా గ్రామంలో వారం నుంచి మద్య పానం ఆగిపోయింది. అమ్మకాలు నిలిచిపోయాయి. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం.. మా గ్రామంలో చాలామంది మద్యానికి బానిసలైపోవడంతో కలత చెందాం. దీంతో పాటు కర్ణాటక నుంచి టెట్రా ప్యాకెట్లను తెచ్చి విక్రయించేవాళ్లు ఎక్కువయ్యారు. దీంతో గ్రామంలో యువకులు చెడిపోవడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. – బాలకృష్ణ, సర్పంచ్, ధర్మపురి పంచాయతీ -
గ్రూప్–4 పరీక్షను బహిష్కరించిన ఓయూ విద్యార్థి నేతలు
లాలాపేట(హైదరాబాద్): టీఎస్పీఎస్సీ శనివారం నిర్వహించిన గ్రూప్–4 పరీక్షను బహిష్కరించినట్లు ఓయూ జేఏసీ నాయకులు రాజు నేత తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ గత మార్చి నెలలో నిర్వహించిన టీఎస్పీఎస్సీ గ్రూప్–1 ప్రశ్నాపత్రం లీకేజీ కేసు విషయమై పోరాడితే అక్రమంగా కేసులు పెట్టారని తెలిపారు. కానీ ఇప్పటి వరకు అసలైన నేరస్తులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అందుకే గ్రూప్–4 పరీక్షకు వెళ్లకుండా బహిష్కరించామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 30 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,180 వేల ఉద్యోగాల భర్తీకి శనివారం నిర్వహించిన గ్రూప్–4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రెండు సెషన్లుగా ఉదయం, మధ్యాహ్నం జరిగిన ఈ పరీక్షలకు 80 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. టీఎస్పీఎస్సీ వెల్లడించిన ప్రాథమిక గణాంకాల ప్రకారం ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు జరిగిన పేపర్–1 పరీక్షకు 7,62,872 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పేపర్–2 పరీక్షకు 7,61,198 మంది హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలవారీగా ఓఎంఆర్ షీట్ల లెక్కింపు తర్వాత హాజరు శాతంపై స్పష్టత వస్తుందని తెలిపింది. చదవండి: ఐదు తరగతులు.. ఒక్కరే మాస్టారు -
పార్లమెంటు భవన ప్రారంభోత్సవ బహిష్కరణ నిర్ణయం...
న్యూఢిల్లీ: పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలన్న విపక్షాల నిర్ణయాన్ని ప్రముఖులు ఖండించారు. కుటుంబ పార్టీల నిర్వాకం ఇలాగే ఉంటుందని విమర్శించారు. ఈ మేరకు 270 మంది ఉమ్మడిగా ఒక ప్రకటన విడుదల చేశారు. వీరిలో మాజీ ఉన్నతాధికారులు, రాయబారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రారంభించుకోవడం దేశ ప్రజలు గర్వపడాల్సిన సందర్భమని వివరించారు. ప్రతిపక్షాలు అపరిపక్వ, డొల్ల వాదనలతో బహిష్కరణ నిర్ణయం తీసుకోవడం సరికాదని హితవు పలికారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రధాని ప్రారంభిస్తే తప్పుపట్టడానికి ఏముందని ప్రశ్నించారు. ‘ఇండియా ఫస్ట్’ నినాదంతో కేంద్రం ముందుకు సాగుతోందని, కొన్ని పార్టీలు ‘ఫ్యామిలీ ఫస్ట్’ అంటున్నాయని ఎద్దేవా చేశారు. -
బహిష్కరణ సబబేనా?!
వాకౌట్లు, వాయిదాలు, అరుపులు, కేకలతో తరచు వార్తల్లోకెక్కే పార్లమెంటు కనీసం కొత్త భవనం ప్రారంభోత్సవ సందర్భంలోనైనా పండుగ కళను సంతరించుకుంటుందని ఆశిస్తే అది సాధ్యపడేలా లేదు. నూతన పార్లమెంటు భవనాన్ని ఎవరు ప్రారంభించాలన్న అంశం చుట్టూ ఇప్పుడు వివాదం రాజుకుంది. పనిలో పనిగా రాజ్యాంగ చట్రంలో ఎవరి పాత్రేమిటన్న చర్చ కూడా మొదలైంది. ఈ ఆదివారం నూతన పార్లమెంటు భవనం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమవుతుండటమే తాజా వివాదానికి మూలం. రాజ్యాంగం నిర్దేశించిన మూడు వ్యవస్థల్లో శాసన వ్యవస్థ ఒకటి కనుక రాజ్యాంగాధినేత అయిన రాష్ట్రపతి ప్రారంభిస్తేనే బాగుంటుందని విపక్షాలు వాదిస్తున్నాయి. కార్యనిర్వాహక వ్యవస్థకు ప్రాతినిధ్యం వహించే ప్రధాని పార్లమెంటులో మెజారిటీ పక్షానికి మాత్రమే నాయకుడని, అందువల్ల ఆయన ప్రారంభించటం సరికాదంటున్నాయి. తమ వాదనకు ప్రభుత్వం సమ్మతించటం లేదని అలిగి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించటానికి నిర్ణయించుకున్నాయి. మొత్తంగా 20 పార్టీలు బహిష్కరణ పిలుపులో భాగం కాగా, 25 పార్టీలు ఈ వేడుకకు హాజరవుతున్నాయి. ఏ నిర్ణయాన్నయినా అందరూ ఆమోదించాలని లేదు. విభేదించే హక్కు, భిన్నా భిప్రాయాన్ని ప్రకటించే హక్కు ప్రజాస్వామ్యంలో అందరికీ ఉంటుంది. కానీ ఆ పరిధి దాటి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడే సమస్య మొదలవుతుంది. సమస్త అధికార సౌధాలూ ఒకేచోట ఉండాలని నిర్ణయించి అందుకోసం బృహత్తరమైన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం పూనుకుంది. అందులో నూతన పార్లమెంటు భవనం ఒకటి. పార్లమెంటును ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణిస్తారు. దేశ పౌరుల ప్రయోజనాలు, భద్రతతో ముడిపడివుండే అనేక అంశాలు అక్కడ చర్చకొస్తాయి. చట్టాలు రూపొందుతాయి. ప్రతి పక్షం ఏమి ఆశిస్తున్నదో ప్రభుత్వం తెలుసుకోవటం, ప్రభుత్వ వైఖరేమిటో విపక్షాలు గ్రహించటం ఎక్కడో ఒకచోట రెండు పక్షాలూ అంగీకారానికి రావటం ప్రజాస్వామ్యానికి శోభనిస్తుంది. లేదంటే పరస్పరం విభేదించుకోవటానికైనా ఆ పక్షాల మధ్య అంగీకారం కుదరాలి. ఇవేమీ లేకుండా ఎప్పుడూ కత్తులు నూరుకోవటమే, ఎదుటి పక్షంపై పైచేయి సాధించటమే ధ్యేయంగా మారితే అలాంటిచోట ప్రజాస్వామ్యం బతికి బట్టగడుతుందా? అందుకే బహిష్కరణ నిర్ణయం ఎలాంటి సందేశం పంపుతుందో విపక్షాలు ఆలోచించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరిని ప్రదర్శిస్తున్న దనో, దాని నిర్ణయాలు ఏకపక్షంగా ఉంటున్నాయనో విమర్శిస్తే, నిలదీస్తే అర్థం చేసుకోవచ్చు. అడపా దడపా విపక్షాలు ఆ పని చేస్తూనే ఉన్నాయి. నూతన సౌధాన్ని రాష్ట్రపతి ప్రారంభించటమే సరైందన్న తమ అభిప్రాయాన్ని ప్రజలముందుకు తీసుకువెళ్లటంలో కూడా తప్పు పట్టాల్సిందేమీ లేదు. ఆ వాదనను ఆమోదించటమో, తిరస్కరించటమో ప్రజలు తేల్చుకుంటారు. జనం తీర్పుకే దాన్ని విడిచిపెట్టి యధావిధిగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటే విపక్షాల హుందాతనం వెల్లడయ్యేది. ప్రజాస్వామ్యానికి ప్రతీక అయిన పార్లమెంటు నూతన సౌధం సమకూర్చుకోవటం ఎంతో ప్రాముఖ్యతగల ఘట్టమని విపక్షాలే ప్రకటించివున్నాయి. మరి అటువంటి ముఖ్య ఘట్టానికి ముఖం చాటేయటం ఏం సబబన్న విజ్ఞత వాటికి ఉండొద్దా? స్వాతంత్య్ర వచ్చిన తొలినాళ్లలో పార్లమెంటుతోపాటు రాష్ట్రాల్లోని చట్టసభలన్నిటా పరిణత చర్చలు జరిగేవి. ఆరోగ్యకరమైన విధా నాలూ, సంప్రదాయాలూ అమలయ్యేవి. కానీ రాను రాను అవి బలప్రదర్శనలకు వేదికలవుతు న్నాయి. నేలబారు రాజకీయాలే దర్శనమిస్తున్నాయి. మొన్న మార్చిలో రూ. 45 లక్షల కోట్ల విలువైన కేంద్ర బడ్జెట్ లోక్‌సభలో ఎలాంటి చర్చా లేకుండా గిలెటిన్‌తో ముగిసిపోయిందని గుర్తుంచుకుంటే మన పార్లమెంటు ఎలాంటి దుఃస్థితిలో పడిందో అర్థమవుతుంది. అదానీ వ్యవహారంపై దర్యాప్తు కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటుకు అంగీకరించాలని విపక్షాలూ... దేశ వ్యవ హారాల్లో విదేశీ జోక్యం కోరినందుకు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అధికార పక్షమూ పట్టుబట్టడంతో బడ్జెట్ సమావేశాలు తుడిచిపెట్టుకుపోయాయి. కనీసం కొత్త పార్లమెంటు భవనంలోనైనా అధికార, విపక్షాలు సరికొత్త ఒరవడికి నాంది పలుకుతాయనుకుని భ్రమించిన వారికి విపక్షాల బహిష్కరణ పిలుపు నిరాశ మిగిల్చింది. పార్లమెంటుపై రాజ్యాంగ నిర్ణాయక సభలో చర్చ జరిగినప్పుడు దాన్ని కేవలం రెండు చట్టసభల సముదాయంగా మాత్రమే పరిగణించటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమైంది. దేశంలో మున్ముందు చోటుచేసుకోవాల్సిన సామాజిక, ఆర్థిక మార్పులకు దాన్నొక సాధనంగా రాజ్యాంగ నిర్మాతలు పరిగణించారు. ఈ లక్ష్యసాధనలో పార్లమెంటు విఫలమైతే దేశంలో అశాంతి ప్రబలుతుందని కూడా హెచ్చరించారు. కానీ వర్తమాన రాజకీయ నేతలకు అదేమీ గుర్తున్నట్టు లేదు. వారు ఎదుటి పక్షాన్ని శత్రువుగానే భావిస్తున్నారు. అంతకుముందు సంగతెలావున్నా గత పదేళ్లుగా ఇదే తంతు నడుస్తోంది. ప్రజాస్వామ్యానికి ఈ మాదిరి వైఖరి తోడ్పడుతుందో, దాన్ని కడతేరుస్తుందో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే ఇరుపక్షాలూ పరిణతితో మెలగాలి. దేశ ప్రజల విశాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలి. అలిగిన విపక్షాలను ఒప్పించేందుకు, వాటిని కలుపుకొని పోయేందుకు బీజేపీ ప్రయత్నించాలి. తమ అభ్యంతరాల అంతస్సారం ప్రజల్లోకి వెళ్లింది గనుక అంతకుమించటం మితిమీరడంతో సమానమవుతుందని విపక్షాలు గుర్తించాలి. ప్రజాస్వామిక స్ఫూర్తిని విస్మరించటం సరికాదని గ్రహించాలి. -
విపక్షాల బాయ్‌కాట్ నిర్ణయంపై ప్రధాని చురకలు!
ఢిల్లీ: పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విపక్షాలన్నీ బహిష్కరించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత కాకుండా.. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆ కార్యక్రమం జరుగుతుండడమే ఇక్కడ ప్రధాన అభ్యంతరం. అయితే.. ఈ నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా విపక్షాలకు చురకలు అంటించారు. విపక్షాల బాయ్‌కాట్ నిర్ణయం సరైంది కాదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఇదివరకే పేర్కొన్నారు. నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం నవ భారతాన్ని, ప్రాచీన సంప్రదాయాలతో అనుసంధానం చేయడమని, దీనిని రాజకీయం చేయవద్దని ప్రతిపక్ష పార్టీలకు హితవు పలికారు. ప్రజలను ఆలోచించనిద్దామని, వారికి నచ్చిన విధంగా స్పందించనిద్దామని చెప్పారు. అయినప్పటికీ విపక్షాలు వెనక్కి తగ్గడం లేదు. ఈలోపు.. ప్రధాని నరేంద్ర మోదీ సైతం పరోక్షంగా ఈ అంశంపై స్పందించారు. విదేశీ పర్యటన ముగించుకుని ఈ ఉదయం ఢిల్లీలో అడుగుపెట్టిన మోదీ.. అక్కడ బీజేపీ ఏర్పాటు చేసిన స్వాగత సభలో ఈ అంశంపై మాట్లాడారు. ‘‘సిడ్నీలో జరిగిన కమ్యూనిటీ ఈవెంట్లో నేను మాట్లాడింది వినడానికి 20 వేల మంది హాజరయ్యారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్, అధికారపార్టీ ఎంపీలు మాత్రమే కాదు.. ఆ దేశ మాజీ ప్రధాని, ప్రతిపక్ష పార్టీ ఎంపీలు కూడా హాజరయ్యారు. దేశం ఐక్యంగా ఉందని చాటి చెప్పేందుకే వాళ్లంతా ఒకే వేదికపైకి చేరుకున్నారు’’ అంటూ ప్రధాని మోదీ ఇక్కడి విపక్షాలకు చురకలు అంటించారు. అలాగే.. కరోనా టైంలో విదేశాలకు వ్యాక్సిన్ అందించడంపై విపక్షాలు చేసిన విమర్శలనూ ఆయన ప్రస్తావించారు. ఇది గాంధీ, బుద్ధుడు లాంటి మహానుభావులు పుట్టి నడయాడిన నేల. వాళ్లే మనకు స్ఫూర్తిదాయకం. అందుకే శత్రువుల్ని సైతం ఆదరించే గుణం మనుకుంది అంటూ పేర్కొన్నారాయన. ఇదిలా ఉంటే.. మే 28వ తేదీన పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. అయితే ఉభయ సభల ప్రతినిధి అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పక్కన పెట్టేసి ప్రధాని మోదీ చేతుల మీదుగా పార్లమెంట్‌ను ప్రారంభించడం తీవ్రంగా ఖండిస్తున్నాయి విపక్షాలు. ఈ మేరకు 20 పార్టీలు కలిసి బాయ్‌కాట్ చేస్తున్నట్లుసంయుక్త ప్రకటన చేశాయి. వైఎస్సార్సీపీతో పాటు ఒడిషా అధికార పక్షం బీజేడీ మాత్రం కార్యక్రమానికి హాజరవుతామని ప్రకటించాయి. ఇదీ చదవండి: పార్లమెంట్ ప్రారంభోత్సవానికి వైసీపీ హాజరవుతుంది: ఏపీ సీఎం జగన్ -
కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై 19 ప్రతిపక్ష పార్టీల కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 28న లాంఛనంగా ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అయితే పార్లమెంట్ ప్రారంభోత్సవానికి ప్రతిపక్షాలు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, జేడీ(యూ), ఎన్సీపీ, ఎస్పీ, శివసేన (ఉద్ధవ్ ఠాక్రే), కమ్యూనిస్ట్‌లు సహా 19 ప్రతిపక్ష పార్టీలు ముక్త కంఠంతో ప్రకటించాయి ఈ మేరకు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ప్రజాస్వామ్యానికి అవమానం పార్లమెంట్ భవనాన్ని ప్రధాని తన చేతుల మీదుగా ప్రారంభించడాన్ని విపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రణాళికలో భాగంగనే మోదీ ఇలా చేస్తున్నారని మండిపడ్డాయి. రాష్ట్రపతితో ప్రారంభించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అదే విధంగా మహాత్మాగాంధీని జీవితాంతం వ్యతిరేకించిన హిందూత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ జయంతి రోజు ఈ కార్యక్రమం షెడ్యూల్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. (చూడండి : కొత్త పార్లమెంటు లోపల ఎలా ఉంది?) ద్రౌపది ముర్ముని పూర్తిగా పక్కకు పెట్టి కొత్త పార్లమెంట్ భవనాన్ని తానే స్వయంగా ప్రారంభించాలనుకున్న మోదీ నిర్ణయం ప్రజాస్వామ్యానికి తీవ్ర అవమానమని తెలిపాయి. ఈ చర్య రాష్ట్రపతి అత్యున్నత పదవికి, రాజ్యంగ స్పూర్తిని, తొలి ఆదివాసీ మహిళా గౌరవాన్ని దెబ్బతీయడమే అవుతుందని ప్రతిపక్షాలు తమ ప్రకటనలో పేర్కొన్నాయి. అందరికీ ఆహ్వానం: అమిత్ షా ప్రతిపక్షాల ఆరోపణలపై కేంద్రమంత్రి అమిత్ షా స్పందించారు. పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి ప్రతి ఒక్క పార్టీని ఆహ్వానించామని తెలిపారు. ఉభయ సభల ఎంపీలకు, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంలకు.. ఇతర నేతలకు భౌతిక, డిజిటల్ రూపాల్లో ఆహ్వానాలు పంపినట్లు పేర్కొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి రావడం.. రాకపోవడంపై నిర్ణయం వారి విజ్ఙతకే వదిలేస్తున్నామన్నారు. మరోవైపు కార్యక్రమాన్ని బహిష్కరించాలనేకునే తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని ప్రతిపక్షాలకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సూచించారు. చదవండి: కొత్త పార్లమెంట్ భవనంలో చారిత్రక రాజదండం 'సెంగోల్'.. విశేషాలివే.. రాష్ట్రపతిని విస్మరించారు కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడంపై ప్రతిపక్షాల అభ్యంతరం వ్యక్తం చేస్తూ వేడుకను బహిష్కరిస్తున్నట్లు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అలాగే రాష్ట్రపతిని ప్రధాని మోదీ దాటవేస్తున్నారని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. కొత్త పార్లమెంటు భవనానికి శంకుస్థాపన జరిగినప్పుడు మోడీ రాష్ట్రపతిని విస్మరించారని. ఇప్పుడు ప్రారంభోత్సవంలో కూడా అలాగే చేస్తున్నారని, ఇది ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేస్తున్నామని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా ప్రకటించారు. పార్లమెంట్ కేవలం భవనం కాదు అంతకుముందు.. ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. రాష్ట్రపతిని ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడంపై తలెత్తుతున్న ప్రశ్నల దృష్ట్యా ఆప్ ఈ నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ తెలిపింది. టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ట్విటర్ ద్వారా పార్టీ నిర్ణయాన్ని ప్రకటించారు. ‘పార్లమెంట్ కేవలం కొత్త భవనం కాదు. ఇది పాత సంప్రదాయాలు, విలువలు, నియమాలతో కూడిన స్థాపన. ఇది భారత ప్రజాస్వామ్యానికి పునాది. ప్రధాని మోదీకి అది అర్థం కాదు. ఆదివారం నాటి కొత్త భవనం ప్రారంభోత్సవం నేను, నాకోసం అనే ఆయన ఆలోచిస్తున్నారు’ అని ఆయన ట్వీట్ చేశారు. ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన 19 పార్టీలు: 1. కాంగ్రెస్ 2. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) 3. ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) 4.రాష్ట్రీయ జనతా దళ్ 5. శివసేన (ఉద్దవ్ వర్గం) 6. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 7. జనతాదల్ యునైటెడ్(జేడీయూ) 8. సమాజ్ వాదీ పార్టీ 9. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 10. జార్ఖండ్ ముక్తి మోర్చా 11 కేరళ కాంగ్రెస్ (మణి) 12 విడుతలై చిరుతైగల్ కట్చి 13. రాష్ట్రీయ లోక్ దళ్ 14. తృణమూల్ కాంగ్రెస్ 15. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 16. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 17 నేషనల్ కాన్ఫరెన్స్ 18 రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ 19. మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం -
అధికారులదే హవా?
-
జీహెచ్ఎంసీ చరిత్రలోనే మొదటిసారి.. కౌన్సిల్ సమావేశం రసాభాస
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని అధికారులు బహిష్కరించారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, వాటర్ బోర్డు అధికారులు బయటకు వెళ్లిపోయారు. జీహెచ్ఎంసీ చరిత్రలోనే మొదటిసారిగా అధికారులు బాయ్‌కాట్ చేశారు. వివరాల ప్రకారం.. నగరంలో వర్షాల నేపథ్యంలో జరిగిన పరిణామాలపై బీజేపీ కార్పొరేటర్లు తీవ్ర విమర్శలు చేశారు. అలాగే సమావేశాలకు కూడా బీజేపీ కార్పోరేటర్లు వినూత్న వేషధారణతో నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్పొరేటర్ల తీరుపై అధికారులు నిరసన తెలిపారు. ఈ క్రమంలో బీజేపీ కార్పొరేటర్లు గొడవ చేస్తున్నారంటూ సమావేశాం నుంచి జలమండలి అధికారులు సమావేశాన్ని బహిష్కరించారు. దీంతో, వారికి మద్దతుగా జీహెచ్ఎంసీ అధికారులు నిలిచి సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారు. అయితే, గతంలో విపక్ష కార్పొరేటర్లు మాత్రమే సమావేశాలను బహిష్కరించేవారు. తాజాగా అధికారులే సమావేశాలను బాయ్‌కాట్ చేశారు. కాగా, జీహెచ్ఎంసీ చరిత్రలోనే అధికారులు బాయ్‌కాట్ చేయడం ఇదే మొదటిసారి. అనంతరం బీజేపీ కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడుతూ.. ప్రశ్నలు అడిగతే అధికారుల పారిపోయారని ఎద్దేవాచేశారు. పిల్లలు చనిపోతున్నారని నిరసన తెలిపితే మాపై కేసులు పెడతారా?. అధికారులు మమ్మల్ని కాదు.. మేయర్‌ను అవమానించారు అంటూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో మేయర్ విజయలక్ష్మీ సీరియస్ అయ్యారు. అధికారులకు సిగ్గులేదా? అని మాట్లాడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఎస్సై, డ్రైవర్ దుర్మరణం.. -
బాయ్‌కాట్ చేయాల్సింది ఇదీ!
ఇది నిజంగా అసాధారణమే. ఒక జాతీయ పార్టీ కీలక సారథి, అందులోనూ ప్రధానమంత్రి హోదాలో దేశాన్ని పాలిస్తున్న వ్యక్తి ఈ తరహా సూచన చేయడం మునుపెన్నడూ కనలేదు, వినలేదు. సినిమాల లాంటి అసంగతమైన వాటిపై అనవసర వ్యాఖ్యలు చేసి, మన కఠోరశ్రమపై నీలినీడలు కమ్ముకొనే పరిస్థితి తేవద్దని ప్రధాని నరేంద్ర మోదీ అధికార బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఇటీవల అన్నారన్న వార్త అందుకే ప్రధానమైనది. మోదీ వ్యాఖ్యలకు తాజా ప్రేరణ – షారుఖ్ ఖాన్ నటించిన తాజా హిందీ చిత్రం ‘పఠాన్’పై కొందరు బీజేపీ నేతలు చేస్తున్న విపరీత వ్యాఖ్యలు, వివాదాలు. ఒకపక్క సోషల్ మీడియాలో బాయ్‌కాట్ ప్రచారాలు, మరోపక్క సినీ ప్రముఖుల గత చరిత్రలు, సినిమాల్లో దుస్తులపై అత్యుత్సాహ రాజకీయ దుమారాలు కలసి కొన్నేళ్ళుగా హిందీ చిత్ర సీమ ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ మోదీ మాట ఒకింత ఊరట. ఏ సందర్భంలో, ఏ ఉద్దేశంతో ఇచ్చినప్పటికీ ఆ స్థాయి వ్యక్తి ఇలాంటి సలహా ఇవ్వాల్సిన పరిస్థితి రావడం దేశంలో నెలకొన్న అసహన వాతావరణానికి అద్దం పడుతోంది. సోషల్ మీడియాలో హిందీ సినీ పరిశ్రమను కొన్నాళ్ళుగా వెంటాడుతున్న భూతం – బాయ్‌కాట్ ప్రచారం. విమర్శలు, ట్రోలింగ్‌ల నుంచి చివరకిది సంక్షోభం స్థాయికి వెళ్ళింది. ఆ మాటకొస్తే కొన్ని సినిమాలపై విద్వేష ప్రచారాలు, బాయ్‌కాట్ పిలుపులతో గడచిన 2022 ‘బాయ్‌కాట్ బాలీవుడ్’ నామ సంవత్సరంగా పాపులరైంది. చిత్రంగా బాయ్కాట్లేవీ జనంలో నుంచి తమకు తాము వచ్చి నవి కాదు. కొన్ని ట్విట్టర్ ఖాతాలు, వెబ్సైట్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల తతంగం. ప్రత్యేకించి నిర్ణీత సినిమాలపైనే, వాటి రిలీజ్ వేళే సోషల్ మీడియా విద్వేషం వెళ్ళగక్కడం, మతోన్మాదపు మాటలతో లక్షలకొద్దీ ట్వీట్లు వెల్లువెత్తడం ఓ పకడ్బందీ పథకమే. నిరుడు అలియా భట్ ‘డార్లింగ్స్’, ఆమిర్‌ఖాన్ ‘లాల్‌సింగ్ చడ్ఢా’, విజయ్ దేవరకొండ ‘లైగర్’, రణబీర్ కపూర్ ‘బ్రహ్మాస్త్ర’– ఇలా అనేకం బాయ్‌కాట్ విద్వేషం బారిన పడ్డవే. ఆ వరుసలో తాజా చేరిక ‘పఠాన్’. ఈ యాక్షన్–థ్రిల్లర్ గూఢచారి చిత్రం 57 ఏళ్ళ వయసులో షారుఖ్ కెరీర్‌తో పాటు కరోనా నుంచి కుదేలైన హిందీ చిత్రసీమనూ మళ్ళీ పట్టాలెక్కిస్తుందని ఓ ఆశ. ఆ పరిస్థితుల్లోఅందులోని ‘బేషరమ్’ పాటపై, ఆ పాటలో నాయిక ధరించిన ఆరెంజ్ రంగు బికినీపై, పాటలోని కొన్ని పదాలపై మధ్యప్రదేశ్ మంత్రి సహా విశ్వహిందూ పరిషత్ తదితర మితవాద సంస్థలు నిరసనల మొదలు నిషేధాల బెదిరింపుల దాకా వెళ్ళారు. చివరకు తమ నియామకమైన సెన్సార్ బోర్డ్ ఛైర్మన్ ప్రసూన్ జోషీ చేతనే ధర్మోపన్యాసాలు చెప్పించి, భావప్రకటనా స్వేచ్ఛను గాలికొదిలి సినిమాలో మార్పులు చేయించడం అప్రజాస్వామికమే. అధికార పక్షానికి దగ్గరైన సినీ పెద్దలకూ ఈ సెగ తగిలి, కథ విదేశీ మీడియా దాకా వెళ్ళిందంటే తప్పెవరిది? ఎప్పుడూ పెదవి విప్పని అమితాబ్ సైతం కోల్‌కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేదికపై పౌరహక్కులు, భావప్రకటనా స్వేచ్ఛ గురించి మాట్లాడాల్సి వచ్చింది. హీరో సునీల్ శెట్టి అస్తుబిస్తయిన చిత్రసీమ అవస్థను యూపీ సీఎంకు మొరపెట్టుకోవాల్సి వచ్చింది. పరిస్థితి చేయిదాటినప్పటికీ, ఇప్పటికైనా ప్రధాని తన వారికి సుద్దులు చెప్పడం చిరు సాంత్వన. అయినా సరే గోల పూర్తిగా సద్దుమణగలేదు. హిందూ స్వామీజీ అవిముక్తేశ్వరానంద సరస్వతి ఏకంగా ‘ధర్మ సెన్సార్ బోర్డ్’ పెట్టి, సినిమాల్లో సనాతన ధర్మ వ్యతిరేకత ఉంటే అడ్డుకుంటామనడం పరాకాష్ఠ. జన్మనిచ్చిన తల్లితండ్రుల నుంచి ఇస్లామ్ ధర్మాన్ని గ్రహించి, క్రైస్తవ పాఠశాలలో చదువుకొని, ఢిల్లీ రామ్‌లీలా ఉత్సవాల్లో వానర వీరుడిగా నటించి, ‘జై సీతారామ్కీ’ అని నినదించి, హిందూస్త్రీని వివాహమాడి, పిల్లల్ని లౌకిక భారతీయులుగా పెంచుతున్న షారుఖ్ ఇవాళ ఈ ఉన్మాదులకు తన నిజాయతీని నిరూపించుకోవాల్సి రావడం సమాజానికే సిగ్గుచేటు. సెన్సారైన సినిమాలు సైతం కొన్నేళ్ళుగా చిక్కుల్లో పడుతున్నాయి. ఇందిరా గాంధీ కాలపు ‘ఆంధీ’, ‘కిస్సా కుర్సీకా’ నుంచి టీవీ సీరియల్ ‘తమస్’ (1988) మీదుగా ఇటీవలి ‘పద్మావత్’ (2018) దాకా అనేక చిత్రాలు కుల, మత, రాజకీయాల పేర అభ్యంతరకర చిత్రీకరణ అంటూ మూకస్వామ్యం పాలబడ్డాయి. సెన్సార్ సర్టిఫికెట్లకూ, చట్టానికీ అతీతంగా వ్యవహరిస్తున్న రాజకీయ, నైతిక పోలీసు మూకల ముందు మోకరిల్లాల్సి వస్తున్న సినీసీమ ఇకనైనా ఒక్కతాటిపైకి రావాలి. సెన్సార్ బోర్డ్ సంస్క రణలపై మళ్ళీ చర్చ లేవనెత్తాలి. ఒకప్పుడు సెన్సార్ బోర్డ్ నిర్ణయాలపైనా అప్పీల్ చేసుకొనేందుకు అప్పిలేట్ ట్రిబ్యునల్ ఉండేది. ఘనత వహించిన సర్కార్ గత ఏడాది దాన్ని ఏకపక్షంగా రద్దు చేసేసింది. ఇక, 2016 నాటి శ్యామ్‌బెనెగల్ కమిటీ, 2013 నాటి జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీల సిఫార్సులకు అతీగతీ లేదు. వాటిని అమలు చేసేలా పాలకులను ఒప్పిస్తే మంచిది. ఏమైనా, దేశంలో అన్నిటికీ అసహనం పెరిగిపోతున్న వేళ కళను కళగా చూడడం నేర్చుకోవాలి. అసభ్యాలు, అభ్యంతరాలుంటే అడ్డుకోవడానికి ప్రజాస్వామ్యంలో చట్టబద్ధమైన సెన్సార్ బోర్డ్, పోలీసు వ్యవస్థ ఉండనే ఉన్నాయి. వాటిని తోసిరాజని రాజ్యాంగేతర నైతిక సెన్సారింగ్, పోలీసింగ్ చేయాలనుకోవడమే పెద్ద తప్పు. వీటికి తక్షణం అడ్డుకట్ట పడకపోతే... అనేక కులాలు, ధర్మాలు, భావజాలాల సహజీవనంతో రంగురంగుల ఇంద్రచాపమైన మన సంస్కృతి మొత్తానికీ ఒకే దేశం – ఒకే భావజాలం – ఒకే సంస్కృతి అనే దురవస్థ పడుతుంది. అప్పుడు కళ కాంతి తప్పుతుంది. వేల ఏళ్ళ చరిత్ర గల భారతావని కళవళ పడుతుంది. తస్మాత్ జాగ్రత్త! -
సినిమాలు లేకపోతే మీ పరిస్థితేంటి?.. కరీనా కపూర్
బాయ్‌కాట్ బాలీవుడ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇటీవల బాలీవుడ్ సినిమాలపై వరుసగా వివాదాలు తలెత్తుతున్నాయి. రెండేళ్లుగా వస్తున్న బాయ్‌కాట్ వివాదం మరోసారి షారుక్ ఖాన్ మూవీ పఠాన్‌తో ట్రెండ్ అవుతోంది. ఈ అంశంపై ఏకంగా ప్రధాని మోదీ దృష్టికి వెళ్లిందంటే దీని ప్రభావం ఏమేరకు ఉందో అర్థమవుతోంది. బాలీవుడ్‌ను కుదిపేస్తున్న ఈ వివాదంపై తాజాగా స్టార్ నటి, సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్ స్పందించారు. సినిమాలు లేకపోతే ప్రేక్షకులకు వినోదం ఎక్కడ లభిస్తుందని కరీనా ప్రశ్నించారు. ఇటీవల కోల్‌కతాలో ఓ కార్యక్రమానికి హాజరైన నటి ఈ వ్యాఖ్యలు చేశారు. కరీనా కపూర్ మాట్లాడుతూ.. 'బాయ్‌కాట్ బాలీవుడ్ ట్రెండ్‌ను ఏమాత్రం ఒప్పుకోను. ఒకవేళ సినిమాలపై నిషేధం విధిస్తే.. మీకు ఎంటర్టైన్మెంట్ ఎలా దొరుకుతుంది. మీ జీవితంలో ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? వినోదం ప్రతి ఒక్కరికీ అవసరం.' అని అన్నారు. రెండేళ్లుగా ఈ వివాదం బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. తాజాగా మరోసారి ట్విట్టర్లో ట్రెండ్ పెరిగింది. 2020లో నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానంతరం మరింత పుంజుకుంది.షారుఖ్ ఖాన్ పఠాన్, అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా, అక్షయ్ కుమార్ రక్షా బంధన్, రణబీర్ కపూర్, అలియా భట్ బ్రహ్మాస్త్ర వంటి అనేక పెద్ద చిత్రాలు బాయ్‌కాట్‌ను ఎదుర్కొన్నాయి. మొదట నటీనటులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన నెటిజన్లు.. ఆ తర్వాత సినిమాలు విడుదలయ్యే సమయంలో నిషేధించాలంటూ ట్రెండింగ్ చేస్తున్నారు. సినిమాలపై ఈ విధమైన ద్వేషాన్ని ప్రదర్శించడం కరెక్ట్ కాదని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు సినీ ప్రముఖులు ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కూడా కలిశారు. కరీనా కపూర్ దర్శకుడు సుజోయ్ ఘోష్ 'ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్' తెరకెక్కిస్తున్న థ్రిల్లర్‌లో కనిపించనుంది. ఇందులో విజయ్ వర్మ, జైదీప్ అహ్లావత్ కూడా నటిస్తున్నారు. అంతే కాకుండా, దర్శకుడు హన్సల్ మెహతా చిత్రంలో కనిపించనుంది. -
మోదీజీ.. పరిస్థితి చెయ్యి దాటిపోయింది!
ముంబై: సొసైటీలో సినిమాల ప్రభావం ఎలా ఉన్నా.. ప్రస్తుతం సినిమాల చుట్టూరానే రాజకీయాలు కచ్ఛితంగా నడుస్తున్నాయి. తాజాగా.. సోమవారం జరిగిన బీజేపీ కీలక సమావేశంలో ప్రధాని మోదీ కార్యకర్తలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల మీద కామెంట్లు చేయడం, అతిగా స్పందించడం మానుకోవాలని ప్రధాని మోదీ.. కార్యకర్తలకు సూచించారాయన. అయితే.. ప్రధాని సలహాపై తాజాగా ప్రముఖ దర్శకుడు, బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ అనురాగ్ కశ్యప్ స్పందించారు. పరిస్థితి ఎప్పుడో చెయ్యి దాటిపోయిందనన్నారు ఆయన. ముంబైలో తన తాజా చిత్రం ఆల్మోస్ట్ ప్యార్ విత్ డీజే మొహబ్బత్ చిత్ర ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మోదీ తన పార్టీ కార్యకర్తలకు చేసిన సూచనపై దర్శకుడు అనురాగ్ కశ్యప్ స్పందించారు. ‘‘ప్రధాని మోదీ నాలుగేళ్ల కిందట ఈ సలహా ఇచ్చి ఉంటే బాగుండేది. పరిస్థితి ఇంకోలా ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారుతుందని అనుకోవడం లేదు. పరిస్థితి చెయ్యి దాటిపోవడంతో.. జనాలు వాళ్లంతట వాళ్లే కంట్రోల్లో ఉండాల్సిందే తప్ప మరో మార్గం కనిపించడం లేదు. ఎవరు ఎవరికీ వింటారని అనుకోవడం లేద’’ని కశ్యప్ అభిప్రాయపడ్డారు. మరోవైపు చిత్ర నిర్మాత షరీఖ్ పటేల్ మాత్రం ప్రధాని సూచనపై సానుకూలంగా స్పందించారు. ఇకనైనా మంచి జరుగుతుందని ఆశిస్తున్నానని, ఇండస్ట్రీలో ఏర్పడిన నెగటివిటీ కనుమరుగు అవుతుందని భావిస్తున్నట్లు చెప్పారాయన. ఇదిలా ఉంటే.. బాలీవుడ్లో ఉత్త పుణ్యానికే బాయ్‌కాట్ ట్రెండ్ తెర మీదకు వస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి.. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు ఈ ట్రెండ్‌కు అడ్డుకట్ట పడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో రెండు వారాల తర్వాత పార్టీ కీలక సమావేశంలో ప్రధాని మోదీ సలహా ఇవ్వడం విశేషం. కిందటి ఏడాది బాయ్‌కాట్ ట్రెండ్‌ను చాలానే ఎదుర్కొన్నాయి. లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్, దొబారా, లైగర్, బ్రహ్మస్త్ర: పార్ట్ వన్-శివ బాయ్‌కాట్ ట్రెండ్‌లో అల్లలాడిపోయాయి. ఈ ఏడాది ప్రారంభంలో షారూక్ ఖాన్ పథాన్ చిత్రం బాయ్కాట్ట్రెండ్ను ఎదుర్కొంటోంది. -
కొందరు కావాలనే చేస్తున్నారు.. అందుకే ఈ దుస్థితి: సునీల్ శెట్టి
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బాలీవుడ్ చాలా కష్టాల్లో ఉందన్నారు ఆయన. పలువురు బాలీవుడ్ చిత్రాలను బహిష్కరించాలంటూ సోషల్‌మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒక్క శాతం మంది వల్లనే బాయ్‌కాట్ బాలీవుడ్ ట్రెండ్ అవుతోందన్నారు. కొందరి వల్లే బాలీవుడ్‌కు ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు. కొందరు కావాలనే బాయ్‌కాట్ బాలీవుడ్ హ్యాష్‌ట్యాగ్ ట్రైండ్ చేస్తున్నారని మండిపడ్డారు. (ఇది చదవండి: ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్.. ఇండియా నుంచి ఆ రెండు చిత్రాలే) సునీల్ శెట్టి మాట్లాడుతూ..'నేను చాలా ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నా. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదు. ఇప్పుడు మనం కేవలం కంటెంట్ ఉన్న సినిమాలను రూపొందించాలి. కొత్తవ్యక్తులకు సృజనాత్మకత ఉన్న వారికి అవకాశాలు కల్పించాలి. ప్రస్తుతం మనం ఇబ్బందుల్లో ఉన్నాం. ఇక నుంచి మనమేంటో నిరూపించుకోవాలి. మనల్ని మనం మెరుగు పరచుకోవాలి.' అని అన్నారు. బాయ్‌కాట్ బాలీవుడ్ అంటూ హ్యాష్‌ట్యాగ్‌లు పెట్టేవారు దయచేసి ఆపేయాలని విజ్ఞప్తి చేశారా సునీల్ శెట్టి. -
దురాక్రమణదారు చైనా నుంచి దిగుమతులా?
న్యూఢిల్లీ: భారత్‌పై దురాక్రమణలకు పాల్పడుతున్న చైనా నుంచి దిగుమతులకు కేంద్రం ఎందుకు అనుమతిస్తోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెడుతున్న సైనికుల గౌరవాన్ని ప్రభుత్వం కాపాడాలన్నారు. ధైర్యంగా చైనా దిగుమతులను నిలిపివేసి మత సత్తా చాటాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. చైనా ఉత్పత్తులను బాయ్‌కాట్ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చౌకగా దొరికేవే అయినా చైనా వస్తువులను మానేసి, ఖరీదైనా దేశీయంగా తయారైన వాటినే కొనాలని కోరారు. ఎద్దు నుంచి పాలు పితికాం గుజరాత్ ఎన్నికల్లో ఐదు సీట్లు గెలుచుకోవడంపై కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘ఆవు నుంచి పాలు ఎవరైనా పితుకుతారు. కానీ, గుజరాత్లో మేం ఎద్దు నుంచి పాలు పితికాం. అతికష్టమ్మీద 5 సీట్లు గెలుచుకున్నాం’ అని అన్నారు. -
ఎఫ్ఆర్వో దారుణ హత్య.. గుత్తికోయల బహిష్కరణ!
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావుపై దాడి.. హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు పంచాయతీ ఇవాళ కీలక తీర్మానం చేసింది. గుత్తి కోయలందర్నీ గ్రామం నుంచి బహిష్కరించాలని బెండాలపాడు గ్రామసభ తీర్మానించింది. సాక్షి, భద్రాద్రి జిల్లా: ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు మృతికి కారణమై గుత్తి కోయలను బహిష్కరిస్తూ శనివారం బెండాలపాడు గ్రామసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య ఘటనను ఈ సందర్భంగా గ్రామసభ ముక్తకంఠంతో ఖండించింది. బెండలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రబోడు నుంచి అక్కడ నివసిస్తున్న గుత్తి కోయలను బహిష్కరిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాదు.. వాళ్లను వాళ్ల స్వరాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌కు పంపాలంటూ ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ సందర్భంగా.. బెండాలపాడు గ్రామస్తులు గుత్తి కోయలపై పలు ఆరోపణలు చేశారు. గుత్తి కోయలు రోజూ గంజాయి, నాటుసారా సేవిస్తూ విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొంది. గుత్తి కోయల తీరు చాలా ప్రమాదకరంగా ఉందని, మారణాయుధాలు ధరించి తిరుగుతున్నారని, వాళ్ల వల్ల తమకూ ప్రాణహాని పొంచి ఉందని ఆ తీర్మానంలో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గుత్తి కోయలను వాళ స్వస్థలమైన ఛత్తీస్‌గఢ్‌కు తరలించాల్సిందేనని సభ తీర్మానించింది. పోడు సాగుకు అడ్డొస్తున్నారని చంద్రుగొండ రేంజ్ ఎఫ్ఆర్వో చలమల శ్రీనివాసరావు(45)ను గొత్తికోయలు దారుణంగా దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే. -
'భారత్‌లో జరిగే వరల్డ్‌కప్‌ను బాయ్‌కాట్ చేస్తాం'
Asia Cup 2023- India Vs Pakistan: చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగి చాలా కాలమైపోయింది. రాజకీయ వ్యవహారాల కారణంగా ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు లేవు. అందుకే ఐసీసీ మేజర్ టోర్నీల్లోనే టీమిండియా, పాకిస్తాన్‌లు తలపడుతూ వస్తున్నాయి. ఈసారి టి20 ప్రపంచకప్‌లోనూ అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థులు తలపడనున్నారు. మ్యాచ్ సంగతి పక్కనబెడితే.. ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శి జై షా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పాకిస్థాన్ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న ఆసియాకప్-2023లో భారత్ జట్టు పాల్గొనబోదని కుండబద్దలు కొట్టాడు. కాగా జై షా వ్యాఖ్యలపై పాకిస్తాన్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది టీమిండియా ఆసియా కప్ ఆడేందుకు పాకిస్తాన్ రాకపోతే.. అదే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్‌కప్ 2023 బాయ్‌కాట్ చేయాలని పీసీబీకి సూచనలు ఇస్తున్నారు. అంతేకాదు జై షా అధ్యక్షుడిగా ఉన్న ఏసీసీ(ఆసియా క్రికెట్ కౌన్సిల్) నుంచి కూడా తప్పుకోవాలనే యోచనలో పీసీబీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పీసీబీ కూడా జై షా వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. టి20 వరల్డ్‌కప్ ముగిసిన అనంతరం మెల్బోర్న్లో జరగనున్న ఐసీసీ సభ్య సమావేశంలో జై షా చేసిన వ్యాఖ్యలను దృష్టికి తీసుకువస్తామని పీసీబీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఇక వన్డే వరల్డ్‌కప్ 2023కి భారత్ ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. ఏసీసీ అధ్యక్ష హోదాలో ఉండి ఒక దేశం తరఫునే మాట్లాడటం సరికాదని అభిమానులు మండిపడుతున్నారు. బీసీసీఐ తమ పలుకుబడి చూపిస్తోందని.. పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌ను తొక్కెయ్యాలనుకుంటుందని పేర్కొన్నారు. వన్డే వరల్డ్‌కప్ బాయ్‌కాట్ చేస్తే బీసీసీఐ, ఐసీసీకి భారీ నష్టం వాటిల్లుతుందని.. పాకిస్థాన్ లేకుండా టోర్నీని ఎలా నిర్వహిస్తారో చూద్దామని కామెంట్ చేశారు. వన్డే వరల్డ్‌కప్‌ను బాయ్‌కాట్‌ను చేయడం ద్వారా బీసీసీఐకి వచ్చే నష్టం ఏం లేదని.. అది పీసీబీకే ఎసరు తెస్తుందని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. వన్డే ప్రపంచకప్ బాయ్‌కట్ చేస్తే.. పీసీబీపై ఐసీసీ కన్నెర్ర చేస్తుందని, బ్లాక్ లిస్ట్‌లో పెట్టి ఇచ్చే నిధులను ఆపేస్తుందని చెబుతున్నారు. తద్వారా పీసీబీకే నష్టం వాటిల్లుతుందని, ఈ వ్యవహారంపై ఆచితూచి అడుగెయ్యాలని హెచ్చరించారు. చదవండి: ఆసియా కప్ టోర్నీలో ఆడలేం: జై షా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ ఆదిపురుష్.. ‘బాలీవుడ్ మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తోంది’
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ మూవీని వివాదాలు చుట్టుముడుతున్నాయి. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 2న అయోధ్య వేదికగా ఆదిపురుష్ టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. మైథలాజికల్ చిత్రంగా రామాయణం ఇతిహాసం నేపథ్యంలో బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ ఈ మూవీని త్రీడీలో తెరకెక్కించారు. అయితే ఈమూవీకి వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు ఓం రౌత్. దీంతో 3డీలో రిలీజ్ చేసిన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఆదిపురుష్‌ను విజువల్ వండర్ అంటూ కొందరు కొనియాడుతుండగా.. మరికొందరు పిల్లలు చూసే కార్టూన్ సినిమాలా ఉందంటూ ట్రోల్ చేస్తున్నారు. చదవండి: ‘ఆది పురుష్’ టీజర్‌పై ట్రోలింగ్.. స్పందించిన డైరెక్టర్ ఓంరౌత్ రామాయణం అని చెప్పి బొమ్మల సినిమా, గ్రాఫిక్స్ సినిమా తీశారేంటి అని తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రావణాసురుడు ఎలా ఉంటాడో తెలీదా, హనుమంతుడు ఎలా ఉంటాడో తెలీదా అంటూ హిందు సంఘాలు, బీజేపీ నాయకులు ఓంరౌత్‌పై మండిపడుతున్నారు. ఇప్పుడు ఏకంగా బాయ్‌కాట్ ఆదిపురుష్ అంటూ మూవీ టీంకు షాకిస్తున్నారు. ఆదిపురుష్‌ను బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు కొందరు నెటిజన్లు. బాయ్‌కాట్ ఆదిపురుష్, బ్యాన్ ఆదిపురుష్ అంటూ హ్యాష్ ట్యాగ్‌లను వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ సినిమాల మీద తీవ్ర వ్యతిరేకత ఉన్న సంగతి తెలిసిందే. చదవండి: అలా జరిగి ఉంటే.. బాహుబలిలో రాజమాత పాత్ర నేను చేసేదాన్ని: జయచిత్ర బాయ్‌కాట్ బాలీవుడ్ అంటూ గత కొన్ని రోజులుగా వ్యతిరేకత వస్తున్న సంగతి విదితమే. ఇదిలా ఉంటే హిందూ దేవుళ్లపై బాలీవుడ్లో సినిమాలు తెరకెక్కించి ప్రతిసారి అభ్యంతరాలు వస్తుంటాయి. తమ చిత్రాల్లో హిందు దేవుళ్లని, పురాణాలని, చరిత్రని బాలీవుడ్ వక్రీకరిస్తుందనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. ప్రతిసారి దేవుళ్లకి సంబంధించిన సినిమాలు తీయడం, హిందు మతవిశ్వాసాలను దెబ్బతీయడం బాలీవుడ్‌కు అలవాటు అయిందంటున్నాయి హిందు సంఘాలు. ఇప్పుడు ఆదిపురుష్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది అంటున్నారు. దీంతో మూవీ టీం మరింత ఆందోళనకు గురవుతోంది. -
దేశం కోసం గెలవాలన్న కసి టీమిండియాలో పోయింది.. ఐపీఎల్ బాయ్‌కాట్ చేస్తేనే..!
ఆసియా కప్ 2022లో టీమిండియా వరుస పరాజయాల నేపథ్యంలో భారత అభిమానులు సోషల్‌మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూపర్-4 దశలో తొలుత పాక్ చేతిలో, తాజాగా శ్రీలంక చేతిలో ఎదురైన ఘోర పరాభవాలను జీర్ణించుకోలేని అభిమానులు భారత ఆటగాళ్లపై దుమ్మెత్తిపోస్తున్నారు. టీమిండియా ప్లేయర్స్ ఇలా తయారవ్వడానికి ప్రధాన కారణం ఐపీఎలేనని విరుచుకుపడుతున్నారు. దేశం కోసం మ్యాచ్‌లు గెలవాలన్న కసి టీమిండియాలో కొరడిందని, జాతికి ప్రాతినిధ్యం వహించేప్పుడు భారీ అంచనాలు పెట్టుకుంటే ఇలాగేనా ఆడేదని ఏకి పారేస్తున్నారు. #boycottipl This is what happens when u have too many expectations on nations match just play ipl and generate money pic.twitter.com/83Ti8JYrmo — NihaL Vaishya 🇮🇳 (@VaishyaNihal) September 6, 2022 వెళ్లి ఐపీఎల్ ఆడి డబ్బు కూడబెట్టుకోండి.. భారత్ గెలిచినా, ఓడినా మీకు పట్టదు అంటూ ధ్వజమెత్తుతున్నారు. ముఖ్యంగా గత రెండు మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శన కనబర్చి టీమిండియా ఓటముల్లో కీలక పాత్రధారిగా మారిన రిషబ్ పంత్‌ను ఎగాదిగా వాయించేస్తున్నారు. పంత్‌కు సీరియస్‌నెస్ అనేదే లేదని, దేశం కోసం ఆడుతున్నాడన్న ధ్యాసే లేదని, ఇతర విషయాలపై ఉన్న శ్రద్ధ క్రికెట్‌పై లేదని మండిపడుతున్నారు. మొత్తంగా భారత క్రికెటర్లు ఇలా తయారవ్వడానికి ఐపీఎలే కారణమని, బీసీసీఐ ఇకనైనా మేల్కొని ఐపీఎల్‌కు అడ్డుకట్ట వేయకపోతే మున్ముందు భారత క్రికెటర్లు జాతీయ జట్టుకు ఆడటమే మానేస్తారని హెచ్చరిస్తున్నారు. #boycottipl the Indian team has lost the will to win matches for the country. Lousy body language. pic.twitter.com/qvpm25592a — स्वतंत्र मैं 🇮🇳 (@anshukumarmish4) September 6, 2022 ఏడాదికి ఓసారి ఐపీఎల్ నిర్వహిస్తుంటేనే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించేప్పుడు భారత ఆటగాళ్ల పరిస్థితి ఇలా ఉంటే.. ఏడాదికి రెండు ఐపీఎల్‌లు నిర్వహిస్తే అంతే సంగతులని కామెంట్లు పెడుతున్నారు. జనాలు ఐపీఎల్ చూడటం మానేసినప్పుడే.. భారత ఆటగాళ్లు జాతీయ జట్టు తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తారని అంటున్నారు. ఇలాగే వదిలేస్తే ఆటగాళ్లు జాతీయ జట్టు ప్రయోజనాలు గాలికొదిలేసి, క్యాష్ రిచ్ లీగ్ మాయలో కెరీర్లు నాశనం చేసుకుంటారని బల్ల గుద్ది చెబుతున్నారు. రాబోయే టీ20 ప్రపంచకప్‌లోనూ భారత ఆటగాళ్ల తీరు మారకుంటే జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేసి, ఐపీఎల్ ఆడని ఆటగాళ్లను ఎంపిక చేయాలని సూచిస్తున్నారు. The day from which Indian Public Stop watching IPL the day from. That this Useless team start playing for the country & pride not running for the money Same happens in the T20 WC #boycottipl pic.twitter.com/oOIGpX6XsN — 💫 ͡K͎ ͜ᴀ ʀ ͡ ͜ᴛ ʜ 𝚒 ͡💫🇮🇳 (@its_karthikoff) September 7, 2022 చదవండి: అర్షదీప్‌పై దూషణకు దిగిన గుర్తు తెలియని వ్యక్తి.. ఉతికి ఆరేసిన జర్నలిస్ట్ -
పైలట్ల సమ్మె... లుఫ్తాన్సా విమానాలు రద్దు
న్యూఢిల్లీ: డిమాండ్ల సాధన కోసం పైలట్లు ఒకరోజు సమ్మెకు దిగడంతో జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ సంస్థ విమానాలు ప్రపంచమంతటా నిలిచిపోయాయి. వందలాది విమానాల రాకపోకలను లుఫ్తాన్సా యాజమాన్యం రద్దు చేసింది. వేతనాలు పెంచాలని, మెరుగైన సౌకర్యాలు కల్పిచాలన్న డిమాండ్లతో పైలట్లు తమ విధులను బహిష్కరించారు. శుక్రవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు విమానాలు రద్దయ్యాయి. టర్మినల్–3 వద్ద దాదాపు 700 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఎయిర్‌పోర్టు బయట ఆందోళన చేపట్టారు. ప్రయాణికులు కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, లేదంటే రుసుము తిరిగి చెల్లించాలని పట్టుబట్టారు. ప్రయాణికుల్లో చాలామంది విదేశాలకు వెళ్లాల్సిన విద్యార్థులు ఉన్నారు. తమకు న్యాయం చేయాలంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చాలాసేపు వేచి చూసి, చేసేది లేక ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్లిపోయారు. అతిత్వరలో విమానాల రాకపోకలను పునరుద్ధరిస్తామని లుఫ్తాన్సా ప్రతినిధులు వెల్లడించారు. -
బాయ్‌కాట్ బాలీవుడ్ వివాదంపై ఫన్నీగా స్పందించిన హీరో విక్రమ్
బాలీవుడ్లో బాయ్‌కాట్ ట్రెండింగ్ నడుస్తోంది.బాలీవుడ్ స్టార్స్ ని, బాలీవుడ్ సినిమాలని వరుసపెట్టి బాయ్‌కాట్ చేస్తున్నారు నెటిజన్లు. ఇటీవల ఆమిర్ ఖాన్ ‘లాల్‌సింగ్ చడ్డా’, అక్షయ్ కుమార్ ‘రక్షా బంధన్’, తాప్సీ ‘దొబారా’చిత్రాలకు ఈ బాయ్‌కాట్ సెగ తగిలింది. గత గురువారం(ఆగస్ట్ 25) విడుదలైన ‘లైగర్’ని బహిష్కరించాలంటూ #BoycottLigerఅనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్వీటర్లో ట్రెండ్ చేశారు. ఇలా ఈ మధ్య కాలంలో వచ్చిన పెద్ద చిత్రాలన్నింటికీ ఏదో ఒక రకంగా బాయ్‌కాట్ సెగ తగిలింది. ఈ బాయ్ కాట్ వివాదంపై ఇప్పటికే పలువురు హీరోలు స్పందించారు. తాజాగా తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఈ బాయ్‌కాట్ వివాదంపై కాస్త వ్యంగంగా స్పందించారు. విక్రమ్ హీరోగా నటించిన తాజా చిత్రం కోబ్రా చిత్రం ఆగస్ట్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో విక్రమ్ మీడియాతో ముచ్చటించారు. (చదవండి: కోబ్రా సినిమా.. చాలా ఎమోషనల్ క్యారెక్టర్ నాది: విక్రమ్) ఈ మధ్య కాలంలో బాయ్‌కాట్ మూవీస్ అంటూ పలు బాలీవుడ్ చిత్రాలను బహిష్కరించాలని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అని ఓ విలేకరి ప్రశ్నించగా.. విక్రమ్ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. ‘అసల్ బాయ్‌కాట్ అంటే ఏంటి? బాయ్ అంటే తెలుసు..గర్ల్ బాగా అంటే తెలుసు.. చివరకు కాట్ అంటే కూడా నాకు తెలుసు కానీ.. బాయ్‌కాట్ అనే పదమే నాకు తెలియదు’అని విక్రమ్ చెప్పుకొచ్చాడు. ఇక కోబ్రా సినిమా విషయానికొస్తే.. యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు.సెవెన్ స్టూడియోస్ - రెడ్ జెయింట్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ‘కేజీఎఫ్’ భామ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం తెలుగులో ఎన్వీ ప్రసాద్ ఎన్వీఆర్ సినిమా ద్వారా విడుదలౌతుంది. -
అందుకే మాకు ఈ కఠిన పరిస్థితులు..: సునీల్ శెట్టి
ప్రస్తుతం బాలీవుడ్ బాయ్‌కాట్ ట్రెండ్ ప్రధాన సమస్యగా మారింది. బాలీవుడ్ చిత్రాలకు ఆదరణ తగ్గిపోతున్న తరుణంగా ఈ బాయ్‌కాట్ సెగ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ బాయ్‌కాట్ ట్రెండ్ వల్ల స్టార్ హీరో అయిన ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా వసూళ్లు పరంగా వెనకపడిపోయింది. ఆయనకు సపోర్ట్ చేసిన అక్షయ్ కుమార్ రక్షాబంధన్, హృతిక్ రోషన్ అప్కమ్మింగ్ మూవీ విక్రమ్ వేదాలకు కూడా దీని సెగ తాకింది. ఈ క్రమంలో తాజాగా బాయ్‌కాట్ ట్రెండ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి స్పందించారు. చదవండి: బాలీవుడ్ స్టార్లను అమ్ముకుంటుంది: అనుపమ్ ఖేర్ సంచలన వ్యాఖ్యలు ఇటీవల రాయ్‌పూర్ వచ్చిన ఆయను మీడియా బాయ్‌కాట్ ట్రెండ్‌పై ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం తమ సినిమా కథల పట్ల ప్రజలు సంతోషంగా లేరని అనిపిస్తోందన్నారు. ‘మేము ఎన్నో మంచి సినిమాలు చేశాం. కానీ నేటి రోజుల్లో మేం చూపిస్తున్న కథల పట్ల ప్రజలు సంతోషంగా లేనట్టున్నారు. అందుకే మేము(బాలీవుడ్) ఇలాంటి కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. ప్రజలు థియేటర్లకు రావడం లేదు. ఎందుకు ఇలా జరుతుందనే దానిని గురించి నేను కచ్చితంగా చెప్పలేను. దీనికి కారణాలేంటో వేలెత్తి చూపలేను’ అని చెప్పుకొచ్చారు. చదవండి: కేబీసీలో ఆసక్తికర సంఘటన, షర్ట్ విప్పి రచ్చ రచ్చ చేసిన కంటెస్టెంట్ అలాగే ‘ఒకప్పుడు ప్రజలకు వినోదం అంటే టీవీ, థియేటర్లే. కానీ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైం వంటి ప్లాట్‌ఫాంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంచి మంచి షోలు, మూవీలను చూసే అవకాశం ఏర్పడింది. 4జీ టెక్నాలజీ రావడం, డేటా చార్జీలు దిగి రావడం, ఓటీటీల ట్రెండ్ నడుస్తుండడం, కరోనా తర్వాత ఏర్పడిన పరిస్థితుల వల్ల ప్రేక్షకులు థియేటర్లకు దూరమయ్యారు. ఇది దేశవ్యాప్తంగా సినిమా పరిశ్రమపై పెద్ద ప్రభావాన్నే చూపిస్తోంది’ అని సునీల్ శెట్టి వ్యాఖ్యానించారు. -
హృతిక్ రోషన్ యాడ్‌పై జొమాటో క్షమాపణలు
భోపాల్: బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ నటించిన మహాకాల్ వాణిజ్య ప్రకటన వివాదం కావడం తెలిసే ఉంటుంది. boycott zomato ట్రెండ్ కూడా సోషల్ మీడియాలో దుమారం రేపింది. దీంతో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో క్షమాపణ చెప్పింది. తాము పేర్కొన్న మహాకాల్ ఒక రెస్టారెంటే తప్ప ఉజ్జయిని ఆలయానికి సంబంధించింది కాదంటూ వివరణిచ్చింది. ఆ ప్రకటనలో హృతిక్..‘ఉజ్జయినిలో నాకు థాలి(నార్త్ ఇండియా భోజనం) తినాలనిపిస్తే మహాకాల్ నుంచే తెప్పించుకుని తింటా’ అని అంటాడు. దీనిపై మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయ పూజారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు ఉజ్జయిని కలెక్టర్.. మహాకాల్ ఆలయ ట్రస్ట్ చైర్మన్ అశిష్ సింగ్ స్పందిస్తూ.. భక్తులు ఇక్కడి ప్రసాదాన్ని పరమపవిత్రంగా భావిస్తారని, అలాంటిది ఈ యాడ్ వాళ్ల మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందని విమర్శించారు. ఈ నేపథ్యంలో.. తమ ప్రకటన ఉజ్జయినిలోని అందరికీ తెలిసిన మహాకాల్ రెస్టారెంట్‌కు మాత్రమే సంబంధించిందని జొమాటో వివరణ ఇచ్చుకుంది. ఉజ్జయిని ప్రజల మనోభావాలను తాము గౌరవిస్తామని, ఇకపై ఆ యాడ్‌ను ప్రదర్శించబోమని జొమాటో ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇదీ చదవండి: మహాకాల్ దైవప్రసాదం.. అవమానిస్తారా? -
ట్రెండింగ్‌లోకి ‘బాయ్‌కాట్ లైగర్’.. ‘రౌడీ’ ఫ్యాన్స్ గట్టి కౌంటర్
బాలీవుడ్లో బాయ్‌కాట్ ట్రెండింగ్ నడుస్తోంది. ఇటీవల ఆమిర్ ఖాన్ ‘లాల్‌సింగ్ చడ్డా’, అక్షయ్ కుమార్ ‘రక్షా బంధన్’, తాప్సీ ‘దొబారా’చిత్రాలకు ఈ బాయ్‌కాట్ సెగ తగిలింది. సినిమాలను బహిష్కరించాలని సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ బాయ్‌కాట్ సెగ విజయ్ దేవరకొండను తాకింది. ఆయన నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ను బహిష్కరించాలంటూ #BoycottLigerఅనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విటర్లో ట్రెండ్ చేస్తున్నారు. దీనికి కౌంటర్‌గా విజయ్ దేవరకొండ అభిమానులు, సినీ ప్రియులు ఐ సపోర్ట్ లైగర్(#iSupportLIGER), అన్ స్టాపబుల్ లైగర్(#UnstoppableLiger) అనే యాష్ ట్యాగ్ లను ట్రెండింగ్ చేస్తున్నారు. (చదవండి: విజయ్ 'లైగర్'కు బాయ్‌కాట్ సెగ.. ట్విట్టర్లో ట్రెండింగ్) లైగర్ బాయ్ కాట్ అనే దాన్ని ఎందుకు ట్రెండింగ్ చేస్తున్నారు, ఇది కరణ్ జోహార్ ప్రాజెక్ట్ అనా లేక ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోలకు వస్తున్న క్రేజ్ చూడలేకా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. వేల మంది ఆధారపడిన అతి పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమాలను బాయ్ కాట్ చేయాలని పిలువు ఇవ్వడం అర్థం లేని పని అని అంటున్నారు. లైగర్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఈ సినిమా టీమ్ ను చూసేందుకు ఎగబడుతున్నారు. ఈ క్రేజ్ తట్టుకోలేని కొంతమంది.. బాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ తో పాటు లైగర్ ను కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.ఏదేమైనా బాయ్‌కాట్ ట్రెండ్ చిత్ర పరిశ్రమకు కొత్త సమస్యగా మారింది. ఇక లైగర్ విషయానికొస్తే.. విజయ్ దేవరకొండ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రమిది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూరి కనెక్ట్స్ , బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. -
కరీనాకు ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ చురక, ఆమె కామెంట్స్‌పై ఘాటు స్పందన
‘బాయ్‌కాట్ లాల్ సింగ్ చడ్డా’ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ విషయంలో ఆమిర్ ఖాన్‌కు మద్ధతు తెలిపేందుకు ముందుకు వస్తున్న హీరోలకు సైతం బాయ్‌కాట్ సెగ తాకుతోంది. అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్లు ఆమిర్‌కు సపోర్ట్ చేయడంతో వారి సినిమాలను కూడా బహిష్కరించాలంటూ నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే లాల్ సింగ్ చడ్డాకు వసూళ్లు పడిపోవడంపై ఇటీవల ఓ ఇంటర్య్వూలో కరీనా ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘లాల్ సింగ్ చడ్డా’ మంచి సినిమా అని, ఇలాంటి చిత్రాన్ని ఎందుకు బహిష్కరిస్తున్నారో అర్థం కావడం లేదంది. చదవండి: ఇప్పటికీ నాతో వారు నటించేందుకు సంకోచిస్తున్నారు: నటి ఆవేదన అంతేకాదు మూడేళ్ల పాటు 250 మంది ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని వాపోయింది కరీనా. అయితే ఆమె వ్యాఖ్యలపై ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి స్పందించాడు. బాలీవుడ్ డాన్లుగా నటులు వ్యవహరించి, హిందూ ఫోబియాతో చిన్న సినిమాలు రిలీజ్ కాకుండా ఆగిపోయినప్పుడు మీరెక్కడికెళ్లారు అని ప్రశ్నించాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘చిన్న సినిమాలు, మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను బాలీవుడ్ డాన్లుగా పిలవబడే నటులు అడ్డుకున్నప్పుడు, ఆ చిత్రాలకు థియేటర్లకు ఇవ్వకుండా ఆపేసినప్పుడు మీరెందుకు స్పందించలేదు. Why nobody from Bollywood raises voice when the Kings of Bollywood boycott, ban & destroy careers of so many outsider actors, directors, writers? The day common Indians get to know the ARROGANCE, FASCISM & HINDUPHOBIA of the Dons of Bollywood, they’ll drown them in hot coffee. — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) August 13, 2022 దానివల్ల ఎందరో ప్రతిభ కలిగిన నటులు, దర్శకులు, రచయితల జీవితాలు నాశమయ్యాయి కదా! ఆ సినిమాలకు పని చేసింది కూడా 250 మంది పేద ప్రజలే’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. అలాగే మరొ ట్వీట్లో ‘బాలీవుడ్ డాన్ల ఆహంకారం, హిందూ ఫోబియా గురించి భారతీయులకు తెలిసినప్పుడు వారిని వేడి కాఫీ ముంచేస్తారు’ అంటూ ఘాటూ వివేక్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా అమీర్ ఖాన్, కరీనా కపూర్లు హీరోహీరోయిన్లుగా నటించిన ‘లాల్‌సింగ్ చడ్డా’ ఆగష్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్ హీరో నాగా చైతన్య కీ రోల్ పోషించాడు. భారీ అంచనాల మధ్య విడుదలై ఈ చిత్రం అశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. చదవండి: సల్మాన్‌పై మరోసారి విరుచుకుపడ్డ మాజీ ప్రేయసి When Good Content Small films are sabotaged, boycotted by the Dons of Bollywood, when their shows are taken away by Multiplexes, when critics gang up against small films… nobody thinks of 250 poor people who worked hard on that film. #Bollywood — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) August 13, 2022 -
కొంపముంచిన విజయ్ కామెంట్స్.. ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ 'లైగర్'
#బాయ్‌కాట్ బాలీవుడ్.. ఇండియలో ట్రెండింగ్‌లో ఉన్న హ్యాష్‌ట్యాగ్ ఇది. బీటౌన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ బాయ్‌కాట్ ట్రెండ్ ఇప్పడు 'లైగర్' సినిమాను కూడా తాకింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న ఈ సమయంలో లైగర్‌కు బాయ్‌కాట్ సెగ తగిలింది. దీనికి కరణ్‌జోహార్ ఒక కారణమైతే, విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ మరో కారణంగా తెలుస్తుంది. పూరి కనెక్ట్స్‌తో కలిసి కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించడంతో లైగర్ బాయ్‌కట్ చేయాలంటూ పిలుపునిస్తున్నారు. ఇక మరోవైపు ఓ ఇంటర్వ్యూలో లాల్‌సింగ్ చడ్డా బాయ్‌కాట్ చేయడంపై విజయ్ స్పందిస్తూ.. ఇలా చేయడం వల్ల చాలామంది కార్మికులు నష్టపోతారని కామెంట్స్ చేసి అమీర్‌ఖాన్‌కు మద్దతు తెలపడంతో ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. దీనికి తోడు ఓ ప్రెస్మీట్లో విజయ్ దేవరకొండ టేబుల్ మీద కాళ్లు పెట్టి మీడియాకు ఆన్సర్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఈ కారణాలతో లైగర్ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ #BoycottLigerఅనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. We Telugu youth also support for this #BoycottLiger because it is not Telugu movie it is Hindi movie which is dubbing in telugu produced by Karan Johar #BoycottLigerMovie — suman kumar (@khsumankumar45) August 20, 2022 It's enough for boycott #BoycottLigerMovie pic.twitter.com/Tkt5PVhuOJ — Chris Virat🇮🇳 (@Chrisvirat100) August 20, 2022 -
శ్రీకృష్ణ జన్మాష్టమి: బాయ్‌కాట్ అమెజాన్ దుమారం
సాక్షి, బెంగళూరు: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి చిక్కుల్లో పడింది. శ్రీకృష్ణాష్టమి సందర్బంగా అభ్యంతర కరమైన ఫోటోను షేర్ చేసి హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సోషల్ మీడియాలో బాయకాట్ అమెజాన్ హ్యాష్‌టాగ్ ట్రెండ్ అవుతోంది. అంతేకాదు ఈ వ్యవహారంలో వెంటనే క్షమాపణ చెప్పాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. (PM Kisan eKYC deadline extended: పీఎం కిసాన్ ఈ-కేవైసీ అప్డేట్ గడువు పొడిగింపు) పవిత్రమైన రాధాకృష్ణుల బంధాన్ని, ప్రేమను అవమానించింది. అసలు ఇలాంటి అసభ్య చిత్రాలను విక్రయించే ధైర్యం అమెజాన్ ఎలా చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. ‘షేమ్ ఆన్ యూ’ అంటూ మండిపడుతున్నారు. ఇందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ అమెజాన్‌పై సోషల్ మీడియా యూజర్లు దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో ఎక్సోటిక్ ఇండియాపై ఇవే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫలితంగా ట్విటర్లో #Boycott_Amazon #Boycott_ExoticIndia జోరు కొనసాగుతోంది. (వారెన్ బఫెట్ పోలికపై రాకేష్ ఝున్‌ఝున్‌వాలా స్పందన వైరల్) జన్మాష్టమికి 20 శాతం సేల్ అంటూ కొన్ని చిత్రాలను అమ్మకానికి పెట్టింది అమెజాన్. వెబ్సైట్లో రాధతో శ్రీకృష్ణుడు ఉన్న అశ్లీల పెయింటింగ్‌ను విక్రయించడంపై హిందూ జాగృతి సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెజాన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బెంగుళూరులోని సుబ్రమణ్య నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా హిందూ దేవతలపై అభ్యంతరంగా ,అనుచితంగా వ్యవహరించడం ఆనక లెంపలేసుకోవడం అమెజాన్‌కు ఇది కొత్తేమీ కాదు. ఇది చదవండి: లక్ అంటే టెకీలదే: అట్లుంటది ఐటీ కొలువంటే! #Boycott_Amazon#Boycott_ExoticIndia ‼️‼️amazonIN & exoticindiaart selling obscene paintings of hindu gods and again & again hurting hindu sentiments!! 👉Hindus are you still want to use this app⁉️⁉️ pic.twitter.com/5xPp1UVTdq — Snehal Patil (@SnehalPatil4SP) August 19, 2022 Press Release Members of @HinduJagrutiOrg submitted a memorandum to the Police Inspector, Subramanya Nagar Benguluru, requesting action against @amazonIN for selling obscene painting of Lord Krishna with Radha on their website.#Boycott_Amazon #Boycott_ExoticIndia pic.twitter.com/E5ASG6PLSH — HJS Karnataka (@HJSKarnataka) August 19, 2022 Hindu unity triumphs! Amazon & Exotic India Art quietly withdraw obscene painting of ShriKrishna & Radhaji. But this is not enough. Both Amazon & Exotic India must tender unconditional apology & pledge not to hurt sentiments of Hindus again.#Boycott_Amazon#Boycott_ExoticIndia pic.twitter.com/tvWbuAetcg — Yamanu Naikodi (@Yamanu76669807) August 19, 2022 We won't allow anyone to hurt Hindu sentiments Neither Bollywood nor Corporates Time and again Amazon providing its platform to sell things which hurt Hindu sentiment#Boycott_Amazon for insulting gods 👇@RadharamnDas#Boycott_ExoticIndia#Janmashtami #harekrishna . pic.twitter.com/u5wX3cyrQ3 — Saffron Swamy (@SaffronSwamy) August 19, 2022 -
చేతకానితనంగా చూస్తున్నారా.. బాయ్‌కాట్ ట్రెండ్‌పై హీరో రియాక్షన్
ప్రస్తుతం బాలీవుడ్‌కు బాయ్‌కాట్ సెగ అట్టుకుంది. మొదట ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చద్ధా మొదలైన బాయ్‌కాట్ ట్రెండ్ ఇప్పుడు అక్షయ్ కుమార్ రక్షా బంధన్, త్వరలోనే రిలీజ్ కాబోయే హృతిక్ రోషన్ విక్రమ్ వేద చిత్రాలకు తాకింది. తాజాగా ఈ బాయ్‌కాట్ ట్రెండ్‌పై హీరో అర్జున్ కపూర్ స్పందించాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ బాలీవుడ్ మొత్తం ఐక్యంగా ఉండి ఈ సమస్యను ఎదుర్కొవాలని పిలుపు నిచ్చాడు. చదవండి: ఆస్కార్ బరిలో నాని సినిమా.. మూడు క్యాటగిరిల్లో పోటీ ఈ మేరకు అర్జున్ పోస్ట్ చేస్తూ.. ‘ఇంతకాలం బాయ్‌కాట్‌పై మౌనం ఉండి తప్పుచేశాం. అది మా మర్యాద అనుకున్నాం. ఇన్నాళ్లు మా పనితనమే దీనికి సమాధానం ఇస్తుందని అనుకుని పొరపాటు చేశాం. కానీ కొందరు దీనితో ప్రయోజం పొందడం స్టార్ట్ చేశారు. బురదలో చేయి పెట్టడం ఎందుకని మేం అనుకుంటుంటే. మా సహనాన్ని చేతకానితనంగా చూస్తున్నారు. బాయ్‌కాట్‌ను ఓ ట్రెండ్‌గా మారుస్తున్నారు. మన గురించి రాసే రాతలు, ట్రెండ్ చేసే హ్యాష్‌ట్యాగ్‌లు వాస్తవికతకు చాలా దూరంగా ఉన్నాయి. చదవండి: వారీసు మూవీ టీంకు షాక్.. నిర్మాత దిల్ రాజు స్ట్రిక్ట్ వార్నింగ్! దీన్ని ఎదుర్కొనేందుకు మనమంతా ఏకం కావాలి’ అని అర్జున్ కపూర్ పిలుపునిచ్చాడు. అలాగే సినిమాలను బహిష్కరించాలనే సంస్కృతి సరైనది కాదంటూ అసహనం వ్యక్తం చేశాడు. ‘ప్రతి శుక్రవారం ఉదయం ప్రజల్లో ఉత్తేజం ఉండేది. కొత్త చిత్రం కోసం వాళ్లు ఉత్సాహం చూపిస్తుంటే పరిశ్రమ ప్రకాశవంతంగా వెలిగిపోయేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోవడం ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు కొందరు మనపై బురద జల్లుతున్నారు. కానీ, సినిమా విడుదల తర్వాత ప్రజల అభిప్రాయం మారుతుందని భావిస్తున్నాం’ అంటూ అర్జున్ కపూర్ రాసుకొచ్చాడు. -
ICC auction: అసంబద్ధ వేలంలో పాల్గొనలేం
ముంబై: భారత్‌లో ఐసీసీ టోర్నమెంట్ల ప్రసార హక్కుల కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎలక్ట్రానిక్ వేలం (ఇ–వేలం) నిర్వహించేందుకు ప్రముఖ ప్రసారకర్తల నుంచి టెండర్లు ఆహ్వానించింది. అయితే ఇ–వేలం ప్రక్రియకు సంబంధించిన పత్రాల్లో అస్పష్టమైన వివరాలే ఉన్నాయని, ఇలాంటి అసంబద్ధ టెండర్ల ప్రక్రియలో పాల్గొనలేమని భారతీయ బ్రాడ్కాస్టర్లు డిస్నీ–స్టార్, వయాకామ్–18, సోనీ, జీ నెట్వర్క్ సంస్థలు ఐసీసీకి లేఖ రాశాయి. టెండర్ల పత్రాల్లో పొందుపరిచిన అంశాల్లో మరింత స్పష్టత కావాలని లేఖలో కోరింది. ఇంచుమించు నాలుగు బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు కూడా ఒకే రకంగా స్పందించాయి. ‘నాలుగు ప్రసారకర్తలు తమ అభ్యంతరాలను తెలుపుతూ ఐసీసీకి లేఖ రాశా యి. అమెజాన్ సంస్థ ఇందులో ఎలా ముందుకెళుతుందో అర్థం కావట్లేదు. స్పష్టతలేని అంశాలతో ఆ సంస్థ సంతృప్తిగా ఉందా లేదో తెలియదు. అలాంటపుడు ఆ సంస్థ ఎందుకంత ఉత్సాహంగా ముందకెళుతుందో మరి! మేం అయితే ఇప్పుడున్న టెండర్ల ప్రక్రియపై అసంతృప్తితో ఉన్నాం. బిడ్లు దాఖలు చేయలేం’ అని ఓ బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ అధికారి తెలిపారు. ఐసీసీ కమిటీ మీటింగ్‌లలో పాల్గొనే భారత క్రికెట్ నియంత్రన మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా బ్రాడ్కాస్టర్లకు మరింత సమాచారం ఇవ్వాలని ఐసీసీని కోరినట్లు తెలిసింది. ఐపీఎల్ మీడియా హ క్కుల కోసం బీసీసీఐ నిర్వహించిన ఇ–వేలం ప్రక్రియను అనుసరించేందుకు ఐసీసీ ఆసక్తిచూపడం లేదు. -
కావాలనే టార్గెట్ చేశారు.. అందుకే ఓపెనింగ్స్ తగ్గాయి: కరీనా కపూర్
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం 'లాల్‌సింగ్ చడ్డా'. కరీనా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో నాగచైతన్య కీలక పాత్రలో నటించారు. అద్వెత్ చందన్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. తాజాగా ఈ వ్యవహారంపై కరీనా కపూర్ స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో లాల్ సింగ్ చడ్డా ఓపెనింగ్స్‌పై ఆమె మాట్లాడుతూ.. 'కొందరు కావాలనే ఈ సినిమాను టార్గెట్ చేశారని ఆరోపించింది. కేవలం ఒక్కశాతం ప్రేక్షకులే ఇలా చేస్తున్నారు. విడుదలకు ముందే ‘బాయ్‌కాట్ లాల్ సింగ్ చద్దా’ అంటూ దుష్ప్రచారం చేశారు. ఆ వ్యతిరేక ప్రచారం వల్లే ఓపెనింగ్స్ తగ్గాయి. ఈ సినిమాను బహిష్కరిస్తే మంచి సినిమాను దూరం చేసినవారవుతారు. మూడేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డాం. దయచేసి మా సినిమాను బహిష్కరించకండి' అంటూ కరీనా విఙ్ఞప్తి చేసింది. -
ఆళ్ల సినిమాలు చూడొద్దంతే.. ఇప్పుడిదే నడుస్తోంది!
బాలీవుడ్లో బాయ్‌కాట్ ట్రెండ్ నడుస్తోంది. తాజాగా ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాను బాయ్‌కాట్ చేయాలని గత కొద్ది రోజులుగా ట్విటర్లో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమా ఫ్లాప్ కావడానికి ఇది కూడా ఒక కారణమన్న వాదన అప్పుడే మొదలైంది. ఆమిర్.. ట్రోలింగ్ గతంలో పీకే సినిమాలో ఇతర గ్రహం నుంచి భూమికి వచ్చిన పాత్రలో ఆమిర్ నట్టించారు. కళ్లను పెద్దవిగా చేసి, వెడల్పాటి చెవులతో చిత్రమైన హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజా సినిమాలోనూ ఇలాగే నటించారని కొందరు విమర్శిస్తుంటే.. సిక్కులను చిత్రీకరించిన తీరు బాలేదంటూ ఆ సామాజిక వర్గానికి చెందిన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమిర్‌ను హిందు వ్యతిరేకిగా పేర్కొంటూ #BoycottLaalSinghChaddha హ్యాష్‌టాగ్‌తో ట్విటర్లో నెటిజనులు ట్రోల్ చేశారు. భారత సైన్యాన్ని అగౌరవపరిచారని మరి కొందరు అలిగారు. తన చిత్రాన్ని బహిష్కరించవద్దని ఆమిర్ ఖాన్ పబ్లిగ్గా కన్నీళ్లు పెట్టుకున్నా నిరసనకారులు శాంతించలేదు. అయితే బాయ్‌కాట్ బాలీవుడ్‌కు కొత్తేమి కాదు. గతంలోనూ, ఇప్పుడు కూడా పలు చిత్రాలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నాయి. గతంలో ఆమిర్‌ఖాన్ దంగల్, దీపికా పదుకోన్ పద్మావత్ సినిమాల విడుదల సమయంలోనూ ఇలాంటి ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఈ రెండు సినిమా ఘన విజయం సాధించడం విశేషం. అక్షయ్‌కు తప్పని తలనొప్పి ఇక లాల్ సింగ్ చద్దాతో పాటే విడుదలైన అక్షయ్ కుమార్ 'రక్షా బంధన్' సినిమా కూడా బహిష్కరణాస్త్రాన్ని ఎదుర్కొంది. ఈ సినిమా రచయిత్రి కనికా ధిల్లాన్ గతంలో హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో #BoycottRakshaBandhanMovie హ్యాష్‌టాగ్‌తో ట్విటర్లో ప్రచారం చేశారు. అయితే వివాదస్పద ట్వీట్లను తొలగించి నిరసనకారులను చల్లబరిచే ప్రయత్నం చేశారు కనికా ధిల్లాన్. సినిమాలు చూడొద్దంటూ ప్రచారం చేయడం సమంజసం కాదని హీరో అక్షయ్ కుమార్ కూడా విన్నవించుకున్నాడు. అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినట్టు తెలుస్తోంది. తాప్సి సినిమా చూడొద్దు అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన దొబారా మూవీని చూడొద్దంటూ సోషల్ మీడియాలో ప్రచారం షురూ అయింది. అనురాగ్, తాప్సి తీరు నచ్చని సంప్రదాయవాదులు ట్విటర్లో వారికి వ్యతిరేకంగా #CancelDobaaraa హ్యాష్‌టాగ్‌తో ట్రోలింగ్ చేస్తున్నారు. ఆగస్టు 19న విడుదలవుతున్న ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలని ట్విటర్ వేదికగా పిలుపునిస్తున్నారు. బాయ్‌కాట్ ప్రచారాన్ని అనురాగ్, తాప్సి చాలా తేలిగ్గా తీసుకున్నారు. (క్లిక్: 'పోకిరి' స్పెషల్ షో.. దిమ్మతిరిగే కలెక్షన్స్ వసూలు) ఒటీటీలనూ వదలడం లేదు అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన డార్లింగ్స్ సినిమా ఆగస్టు 5న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సినిమా కూడా బాయ్‌కాట్ ప్రచారాన్ని ఎదుర్కొంది. #BoycottAliaBhatt హ్యాష్‌టాగ్‌తో అలియా భట్‌పై అక్కసు వెళ్లగక్కారు కొంతమంది. పురుషులను కించేపరిచేలా సినిమా తీసిన అలియా భట్ని అందరూ బహిష్కరించాలని పిలుపునిచ్చారు. పురుషులపై గృహ హింస అనేది బాలీవుడ్‌కు నవ్వులాటగా ఉందని ఫైర్ అవుతున్నారు. గౌరీ ఖాన్, గౌరవ్ వర్మతో కలసి అలియా భట్ నిర్మించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రారంభ వారాంతంలోనే 10 మిలియన్లపైగా వాచ్ అవర్స్ నమోదు చేసి దూసుకుపోతోంది. (క్లిక్: ట్విటర్లో తెగ ట్రెండ్ అవుతున్న దిల్‌రాజు.. కారణమిదే!) `బ్రహ్మాస్త్ర`పై నిషేధాస్త్రం రణ్‌బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటిస్తున్న `బ్రహ్మాస్త్ర` మూవీ ట్రైలర్ అలా రిలీజైందో లేదో వెంటనే బాయ్కాటర్లు రెడీ అయిపోయారు. #BycottBrahmastra ట్యాగ్‌తో వ్యతిరేక ప్రచారం మొదలెట్టేశారు. హీరో రణబీర్ కపూర్ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని ట్విటర్ వేదికగా ఏకీపారేశారు. కాగా, ఈ సినిమాలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రల్లో కనిపించనున్నారు. (క్లిక్: ‘సీతారామం’ నేను చేయాల్సింది.. నాగార్జున) -
అల్లరి చేసేవారే ఇలా బహిష్కరిస్తారు: అక్షయ్ కుమార్
Akshay Kumar Says Mischievous People Are Boycotting Films: బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఎప్పుడూ వరుసపెట్టి సినిమాలు చేస్తూ అలరిస్తుంటాడు. ఇటీవల సూర్యవంశీ, ఆత్రంగి రే, బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాలతో పలకరించాడు. ఆయన తాజాగా నటించిన చిత్రం 'రక్షా బంధన్'. అయితే ఈ మధ్య 'బాయ్‌కాట్ బాలీవుడ్' అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిన విషయం తెలిసిందే. రణ్‌బీర్ కపూర్ 'బ్రహ్మాస్త్రం', అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా', అలియా భట్ 'డార్లింగ్స్'తో పాటు అక్షయ్ కుమార్ 'రక్షా బంధన్' చిత్రాలను బహిష్కరించాలని నెట్టింట్లో ట్రోలింగ్ జరిగింది. రక్షా బంధన్ ప్రమోషన్లో పాల్గొన్న అక్షయ్ కుమార్ బాయ్‌కాట్‌పై స్పందించాడు. అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా బాయ్‌కాట్' ట్రెండింగ్‌లో ఉండటం తనను బాధించిందని తెలిపాడు. 'ఇలా బాయ్‌కాట్ పేరుతో అల్లరిపాలు చేసేవాళ్లు కొంతమంది మాత్రమే ఉంటారు. అల్లరి చేసేవాళ్లు మాత్రమే ఇలా బాయ్‌కాట్ చేస్తారు. అది పర్వాలేదు. ఇది స్వేచ్ఛాయుత భారతదేశం. ప్రతి ఒక్కరూ తమకు నచ్చినవి చేసేందుకు అనుమతిస్తారు. కానీ ఇది ఆర్థిక వ్యవస్థకు చాలా ఉపయోగపడుతుందా?. అలా జరగడం లేదు కదా. ప్రజలు ఇలాంటి పనులు చేయడంలో ఎలాంటి అర్థం లేదు. మన భారతదేశాన్ని గొప్పగా పెంపొందిచడంలో తోడ్పడాలి కానీ, ఇలాంటివి చేయకూడదు. ఇలాంటి పనులు ఎవరు చేయకూడదని నేను అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే దీనివల్ల మన దేశానికి ఎలాంటి ఉపయోగం లేదు' అని అక్కీ పేర్కొన్నాడు. కాగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ఒక్క అన్న, నలుగురు చెళ్లెళ్ల మధ్య అనుబంధంగా తెరకెక్కింది 'రక్షా బంధన్' చిత్రం. ఇందులో భూమి పెడ్నేకర్, సాదియా ఖతీబ్, సాహెజ్మీన్ కౌర్, స్మృతి శ్రీకాంత్, దీపికా ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే రోజున అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' కూడా విడుదల కానుంది. -
తెలంగాణ సీఎం ఆరోపణలు అర్థరహితం: నీతి ఆయోగ్
సాక్షి, న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తూ.. సంచలన ఆరోపణలు, తీవ్ర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. నీతి ఆయోగ్ ఒక పనికి మాలిందని, నీతి ఆయోగ్ సమావేశాలు భజన బృందంగా మారిందంటూ తీవ్ర ఆరోపణలే చేశారాయన. ఈ క్రమంలో కేసీఆర్ ఆరోపణలు చేసిన కాసేపటికే నీతి ఆయోగ్ తీవ్రంగా స్పందించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఆరోపణలు అర్థరహితం. సమాఖ్య స్ఫూర్తి బలోపేతం కోసమే ఈ సంస్థ ఏర్పాటు. గడిచిన ఏడాదిలోనే సీఎంలతో ముప్ఫై సమావేశాలు నిర్వహించాం. నీతిఆయోగ్ వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో గతేడాది జనవరి 21న రాష్ట్రాభివృద్ధి అంశాలపై తెలంగాణ సీఎంతో భేటీ అయ్యాం. పలుమార్లు సమావేశం కోసం ప్రతిపాదించినా.. తెలంగాణ సీఎం స్పందించలేదు. రేపటి సమావేశానికి ఆయన హాజరుకావొద్దన్న నిర్ణయం దురదృష్టకరం. రాష్ట్రాలకు ఎజెండా తయారీలో నీతి ఆయోగ్ సహకరించడం లేదన్న ఆరోపణలు సరికాదు. కేంద్రం రాష్ట్రాలకు ఆర్థికంగా అన్ని రకాలుగా సహకరిస్తుంది. 2015-16లో రూ. 2 లక్షల 3 వేల 740 కోట్లు.. 2022-23 ఏడాదికి రూ.4 లక్షల 42 వేల 781 కోట్లకు చేరింది. జల్‌జీవన్ మిషన్ కింద తెలంగాణకు రూ.3,982 కోట్లు కేటాయింపు జరిగింది. కానీ, తెలంగాణ కేవలం రూ.200 కోట్లు మాత్రమే వినియోగించుకుంది. పీఎంకేఎస్‌వై-ఏబీపీ స్కీం కింద రూ.1,195 కోట్లు విడుదల అయ్యాయి అని గణాంకాలతో సహా సీఎం కేసీఆర్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చింది నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ అనేది దేశంలోని అత్యున్నత రాజకీయ నాయకత్వం ఉండే వేదిక. రాష్ట్ర స్థాయిలలో కీలకమైన అభివృద్ధికి సంబంధించిన సమస్యలపై చర్చించి, జాతీయ అభివృద్ధికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే వేదిక. బలమైన రాష్ట్రాలు బలమైన దేశాన్ని తయారు చేయాలనే ఉద్దేశ్యంతో స్పూర్తితో నీతి ఆయోగ్ ఒక సంస్థగా ఏర్పాటు చేయబడింది. రాష్ట్రాలతో సన్నిహితంగా పని చేసేందుకు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టాం అని ప్రకటించుకుంది.. ఇదీ చదవండి: నీతి ఆయోగ్ తెలంగాణను మెచ్చుకుంది కూడా-సీఎం కేసీఆర్ -
నా సినిమాను బాయ్‌కాట్ చేయొద్దు: అమీర్ ఖాన్
Aamir Khan Reacts To Boycott Laal Singh Chaddha Twitter Trend: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్, కరీనా కపూర్ మరోసారి జోడిగా నటించిన చిత్రం 'లాల్‌సింగ్ చద్దా'. హాలీవుడ్లో సూపర్ హిట్టయిన 'ఫారెస్ట్ గంప్' మూవీకి రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. టాలీవుడ్ గుడ్ బాయ్ నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు ఇటీవల బాయ్‌కాట్ సెగ తగిలింది. 'లాల్ సింగ్ చద్దా' సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేశారు. తాజాగా ఈ బాయ్‌కాట్ నిరసనపై అమీర్ ఖాన్ స్పందించాడు. తన చిత్రాన్ని ఎవరూ బహిష్కరించవద్దని కోరాడు. ''నాపై, నా సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతున్నందుకు చాలా బాధగా ఉంది. నాకు భారతదేశం అంటే ఇష్టం లేదని కొంతమంది మనసుల్లో చాలా గట్టిగా నాటుకుపోయింది. అందుకు నాకు చాలా విచారంగా ఉంది. నేను నా దేశాన్ని గౌరవించనని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్లకు నేను చెప్పాల్సింది ఒక్కటే.. మీరు ఎంతో దృఢంగా నమ్ముతున్న ఈ విషయంలో ఎలాంటి వాస్తవం లేదు. నా గురించి అలాంటి ప్రచారాలు జరగడం చాలా దురదృష్టకరం. దయచేసి నా సినిమా చూడండి. బహిష్కరించవద్దు'' అని అమీర్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. Don't feel safe here then why release movie here? Go to your safe place as we know where you're heart lies#BoycottLaalSinghChaddha pic.twitter.com/ezhxuttiEp — hindu_unnity (@hindu_unitty) August 1, 2022 Would you support ?#BoycottbollywoodForever#BoycottLaalSinghChaddha pic.twitter.com/Y4plcIiSaZ — Jaydip Dhameliya (@Jaydip_2001) July 30, 2022 #BoycottLaalSinghChaddha Who do you want on screen Choose please #BoycottbollywoodForever pic.twitter.com/bx49oBZ03s — सदैव देश प्रथम (@afighteroftruth) July 30, 2022 Internet never forgets. #BoycottLaalSinghChaddha pic.twitter.com/6CP35cgWP4 — Punit Doshi (@doshipunit) July 22, 2022 Support only those who support you.#JusticeForKanhaiyaLal#BoycottLaalSinghChaddha pic.twitter.com/jKzR8M1AgG — Kreately.in (@KreatelyMedia) July 1, 2022 #BoycottLaalSinghChaddha What your opinion about movie: Amir lal singh chaadi movie pic.twitter.com/mgT9aU2RjU — vaibhav pandey (@vaibhav06457792) July 30, 2022 -
నల్లగొండ టీఆర్ఎస్లో గందరగోళం
-
దివంగత నటుడికి ఘోర అవమానం.. ఫ్లిప్‌కార్ట్ ‘ఛీ’ ప్ ట్రిక్స్!
Boycott Flipkart: ఇటీవల కంపెనీలు ప్రతీది వ్యాపార కోణంలోనే చూస్తున్నాయి. తమ వస్తువుల మార్కెటింగ్ విషయంలో కంటెంట్‌ని కాకుండా కాంట్రవర్శీతో లాభాలను పొందాలని భావిస్తున్నాయి. సోషల్ మీడియా వాడకం పెరిగినప్పటి నుంచి ఇలాంటి వాటినే పబ్లిసిటీ స్టంట్‌గా చేసుకుని దాన్ని వ్యాపారంగా మార్చుకోవాలని చూస్తున్నాయి. ప్రస్తుతం ఇదే తరహాలో దేశంలోని అతిపెద్ద ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ పాటించింది. వీళ్ల మార్కెటింగ్ పైత్యం చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగింది.. ఈ కామర్స్ సైట్లో ఓ టీ-షర్ట్ పై సుశాంత్ ఫోటోతో పాటు "డిప్రెషన్ ఈజ్ డ్రోయింగ్" అనే ట్యాగ్‌లైన్‌తో వాటిని అమ్ముతున్నారు. ఇదే కాంట్రవర్సీకి తెర తీసింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోటోని చూసిన సుశాంత్ సింగ్ అభిమాని, ట్విటర్లో పోస్ట్ చేస్తూ బాయ్‌కాట్ ఫ్లిప్‌కార్ట్ హ్యాష్‌ట్యాగ్ పెట్టాడు. అప్పటి నుంచి ఈ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయిపోయింది. వెంటనే అన్ని ఇ-కామర్స్ సైట్ నుంచి ఆ టీ షర్ట్‌లని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ .. తమ వస్తువుల సేల్ కోసం ఇంతకి దిగజారుతారా అని కామెంట్ చేయగా, మరొకరు ఫ్లిప్‌కార్ట్‌కి ఎందుకీ పైత్యం.. ఇలాంటి చీప్‌ట్రిక్స్ ఆపాలంటూ కామెంట్ చేశారు. మరొక యూజర్ "చనిపోయిన వ్యక్తి ఫోటోను టీ షర్ట్‌పై పెట్టడమే కాకుండా, అలాంటి కోట్‌ను యాడ్ చేస్తారా" అంటూ ఓ నెటిజన్ తీవ్రంగా మండిపడ్డాడు. How dare you @Flipkart & @amazon call Sushant depressed? There is absolutely no evidence proving he was depressed. Stop maligning Sushant's image Remove it right now#BoycottFlipkart #boycottAmazon Smear Campaign Against SSR pic.twitter.com/uH0M5wknYI — Justice seeker-Kritika🔱 (@Kritika4Sushant) July 27, 2022 చదవండి: New Delhi: దేశంలో ఆఫీస్ స్పేస్.. ఆ నగరం చాలా కాస్ట్లీ గురూ! -
'బ్రహ్మాస్త్ర'కు నిరసన సెగ.. బాయ్‌కాట్ పేరిట ట్రెండింగ్.. ఎందుకంటే ?
బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం `బ్రహ్మాస్త్ర`. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘బ్రహ్మస్త్రం’ పేరుతో విడుదల చేయబోతున్నారు. రణ్‌బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటిస్తున్నఈ చిత్రంలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ పలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరితోపాటు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అతిథి పాత్రలో మెరవనున్నాడని సమాచారం. ఈ చిత్రం నుంచి ఇటీవల ట్రైలర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. రిలీజైన అతి కొద్ది సమయంలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ మూవీ మంచి స్పందనతోపాటు విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. '#BycottBrahmastra' అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. అందుకు కారణం ఆ మూవీ ట్రైలర్లో చూపించిన ఒక సన్నివేశమే. ఈ ట్రైలర్లో రణ్‌బీర్ కపూర్ గుడిలోకి వెళ్తూ గంటలు కొడతాడు. కానీ ఆ సమయంలో రణ్‌బీర్ షూ ధరించి ఉంటాడు. ఇదే ఈ విమర్శలకు కారణంగా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. '#BycottBrahmastra' ట్యాగ్‌తో బాలీవుడ్‌ను ఏకిపారేస్తున్నారు. 'అరే వా.. బాలీవుడ్ షూలతో గుడిలోకి వెళ్లింది. ఈ మూవీని బాయ్‌కాట్ చేయండి', 'ఎందుకు అతను షూలతో టెంపుల్‌లోకి వెళ్లాడు' అంటూ తదితర ట్వీట్లతో 'బ్రహ్మాస్త్ర' మూవీకి నిరసన సెగ తగిలింది. చదవండి: 13 ఏళ్ల పిల్లల నుంచి అత్యాచార బెదిరింపులు, తట్టుకోలేకపోయాను: నటి ముసలిదానివైపోతున్నావ్.. అంటూ అనసూయపై కామెంట్లు Waah re bollywood entering temple with shoes on. Boycott this movie!!! Let them feel our power!!! Aakhir kab tak urduwood bane rahoge#BoycottBrahmastra pic.twitter.com/uwdvwzD3lE — ईशा 🕉️ (@iishapradhan_) June 15, 2022 No matter how many religious films you make, these Bollywood people always build mistakes, that's why I don't trust Bollywood. #jagohindu #BoycottBollywood #BoycottBrahmastra #BoycottBrahmastraMovie #WeWantHinduRashtra pic.twitter.com/z79rA2Etac — Ankit Ranjan Singh (@AnkitSingh13_) June 16, 2022 Why he Is entering Temple with shoes #BoycottBrahmastra pic.twitter.com/YJGyauTD1z — Shashikanth Reddy (@Shashi26214076) June 15, 2022 #RanbirKapoor is Shown Wearing Shoes and Ringing a Bell in Temple #Brahmastra #Bollywood Will Never Stop Insulting Hinduism.#BoycottBollywood ❌#BoycottBrahmastra ❌#BrahmastraTrailer ❌ #KaranJohar ❌ But Rabel Star #Prabhas Worships God Blockbuster #Adipurush.☑️ #RRRMovie pic.twitter.com/IXMIu9Wroo — ℝ𝕒𝕞 𝕔𝕙𝕒𝕣𝕒𝕟 📿🚩🚩 (@Boss42265174) June 15, 2022 I Am Ready to #BoycottBrahmastra What about you? #BoycottBollywood CBI Do Justice To Sushant pic.twitter.com/YEoACI4zRj — KumardeepRoy(DETECTIVE BYOMKESH) (@I_Am_Roy18) June 16, 2022 Entering Temple with shoes, this is what we can expect from Urduwood. Bollywood never misses a chance to hurt our sentiments towards Sanatana Dharma.#BoycottBollywood #BoycottBrahmastra pic.twitter.com/Pa5hmX99Ag — 🚩 (@Chand_Bardai) June 15, 2022 -
బెల్ట్ షాప్ వద్దన్నాడని.. సామాజిక బహిష్కరణ!
ఏర్పేడు (తిరుపతి): గ్రామంలో మద్యం అమ్మరాదని ప్రశ్నించాడని ఓ వ్యక్తిని గ్రామ బహిష్కరణ చేసిన సంఘటన మండలంలోని కొత్తవీరాపురంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం.. గ్రామానికి చెందిన పెద్దమనుషులు రామదాసు, కృష్ణారెడ్డి, సుబ్రమణ్యం, కుమార్, గిరిబాబు గ్రామంలో మద్యం అమ్మకాలకుగాను ఆదివారం రాత్రి వేలం నిర్వహించారు. గ్రామానికి చెందిన శ్రీనివాసులు, పెరిబ్బ, నాగభూషణమ్మ బెల్టు షాపును వేలంలో రూ.75 వేలకు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన కృష్ణయ్య మద్యం అమ్మడానికి వీలులేదని వ్యతిరేకించాడు. దీంతో కృష్ణయ్యతో మాట్లాడినా, ఇంటికి వెళ్లినా, పనులకు వెళ్లినా వారికి జరిమానా విధించి గ్రామ బహిష్కరణ చేస్తామని సోమవారం రాత్రి దండోరా వేశారు. అయితే గ్రామస్తులు దండోరా వేసే వ్యక్తిని మందలించి పంపారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి శ్రీనివాసులును అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించినట్లు సమాచారం. చదవండి: (Raptadu: టీడీపీ వర్గీయుల చేతిలో వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య) -
మా ఎంపిక సరైనదే అంటూ చైనా కొత్త పల్లవి
Winter Olympic 2022: వింటర్ ఒలంపిక్స్‌లో టార్చ్‌బేరర్‌గా గల్వాన్‌లోయ ఘర్షణతో సంబంధం ఉన్న సైనికుడిని ఎంపిక చేయడాన్ని చైనా సమర్థించుకుంది. సదరు సైనికుడిని ప్రమాణాలకు అనుగుణంగా ఎంచుకున్నామని తెలిపింది. ఇందులో రాజకీయ దురుద్దేశాలు చూడవద్దని కోరింది. గల్వాన్ లోయ ఘర్షణలో గాయపడిన కమాండర్ క్వి ఫాబావోను చైనా టార్చ్‌బేరర్‌గా ఎంపిక చేయడంపై విమర్శలు వచ్చాయి. దీనికి నిరసనగా వింటర్ ఒలంపిక్స్ ఆరంభోత్సవాలను భారత్ బహిష్కరించింది. యూఎస్ సైతం చైనా చర్యను తప్పుబట్టింది. అయితే ఇది కేవలం ముందుగా అనుకున్న ప్రమాణాలకు లోబడి తీసుకున్న నిర్ణయమని చైనా విదేశాంగ మంత్రిత్వ ప్రతినిధి ఝావో లిజియన్ చెప్పారు. ఈ విషయాన్ని భారత్ హేతుబద్ద దృష్టితో చూడాలని, అనవసర రాజకీయ విమర్శలు చేయవద్దని కోరారు. అయితే ఒలంపిక్స్లాంటి కార్యక్రమాన్ని కూడా రాజకీయం చేయాలని చూడడం చైనా కోరికని భారత ప్రతినిధి బాగ్చీ విమర్శించారు. -
చైనా చేష్టలు.. భారత్ రియాక్షన్ ఇది
గల్వాన్ లోయ ఘర్షణల్లో పాల్గొన్న కమాండర్, ఉయిగర్ల ఊచకోతలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తిని టార్చ్‌బేరర్‌గా అర్హత ఇవ్వడం ద్వారా పెను వివాదానికే కేంద్రం బిందువుగా మారింది వింటర్ ఒలింపిక్స్ 2022. పైపెచ్చు ఇప్పుడు అథ్లెటిక్స్ను స్వేచ్ఛగా మాట్లాడేందుకు వీలు లేకుండా ఆంక్షలు పెట్టింది. ఇక గల్వాన్ లోయ ఘర్షణలకు కారణమైన సీపీఏల్ఏ కమాండర్ క్వీ ఫబోవోను టార్చ్‌బేరర్‌గా ఎంపిక చేయడంపై భారత్, చైనా తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సరిహద్దు అంశాన్ని కెలిగి.. రాజకీయం చేయాలని చూస్తోందని భారత్ అంటోంది. అందుకే వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత రాయబారి, దౌత్యవేత్తలు పాల్గొనడని స్పష్టం చేసింది. ఈ బహిష్కరణతో పాటు ఒలింపిక్స్ ఈవెంట్స్‌ను టెలికాస్ట్ చేయడంలో దూరదర్శన్ దూరంగా ఉంటుందని ప్రసారభారతి స్పష్టం చేసింది. Consequent to the announcement by @meaindia, @ddsportschannel will not telecast live the Opening and Closing ceremonies of the Winter Olympics being held in Beijing. https://t.co/sSP1EX9pSQ — Shashi Shekhar Vempati शशि शेखर (@shashidigital) February 3, 2022 పదహారు రోజులపాటు బీజింగ్ వేదికగా శీతాకాల ఒలింపిక్స్ జరగున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మునుపెన్నడూ లేనంతగా అథ్లెటిక్స్ మీద ఆంక్షలు విధించింది. అంతేకాదు చైనా చట్టాల మీద, రూల్స్‌కి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే.. శిక్ష తప్పదని హెచ్చరించింది బీజింగ్ ఆర్గనైజింగ్ కమిటీ. అంతేకాదు నిరసనలు తెలిపే హక్కును తొలగిస్తూ.. అందుకు సంబంధించిన పోడియంలను ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. -
బాయ్‌కాట్ అమెజాన్.. జాతీయ పతాకానికి అవమానం!
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మన దేశ జాతీయ పతాకాన్ని తీవ్రస్థాయిలో అవమానించింది. రిపబ్లిక్ డేకి ముందు భారత జాతీయ జెండా ముద్రలతో ఉన్న పలు ఉత్పత్తులను తన వెబ్సైట్లో విక్రయానికి పెట్టింది. ఈ అంశంపై స్పందించిన నెటిజన్లు ట్విటర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #BoycottAmazon అనే ట్యాగ్ ఇప్పుడు ట్విటర్లో ట్రెండ్ అవుతుంది. అమెజాన్‌లో భారత జాతీయ పతాకాల ముద్ర ఉన్న ఉత్పత్తులను విక్రయిస్తున్న ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ అమెజాన్‌ను బాయ్‌కాట్ చేయలని కోరుతున్నారు. జాతీయ పతాకం ముద్రతో ఉన్న కమర్షియల్ ఉత్పత్తులను అమ్ముతున్నందుకు అమెజాన్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే అమెజాన్‌పై పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. చాక్లెట్లు, ఫేస్ మాస్క్ లు, సిరామిక్ మగ్స్, కీచైన్, పిల్లల దుస్తులు వంటి ఉత్పత్తులు జెండా ముద్రను కలిగి ఉన్నాయని ట్విట్టర్ వినియోగదారులు తెలిపారు. 2017లో కూడా కెనెడాలోని అమెజాన్ వెబ్సైట్లో భారత జాతీయ పతాకం ముద్రతో ఉన్న పలు డోర్ మ్యాట్లను విక్రయానికి పెట్టింది. అయితే దీన్ని గమనించిన నెటిజన్లు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. Our National Flag Our Pride. #BoycottAmazon pic.twitter.com/RwpuCSCyd7 — Vikash Ahir (@team_hyv) January 25, 2022 Amazon should not only boycott but it should be made in India#boycottamazon pic.twitter.com/MuzvOfx4VW — Ankur Srivastava (@AnkurSr12580270) January 25, 2022 This #RepublicDay nationalist Indians have given a call to #BoycottAmazon How about you ? pic.twitter.com/o3LRDtxtjU — Guruprasad Gowda (@Gp_hjs) January 25, 2022 #BoycottAmazon T-shirts with tricolor flag are being sold on e-commerce site Amazon. Even before this, Amazon has insulted the tricolor of India many times by selling shoes, footwear and toilet seat covers, masks etc. of India.@PMOIndia @CimGOI @sambitswaraj @HJS_Convener pic.twitter.com/s73WjCdEHS — Madan Tanaji Sawant (@MadanTanajiSaw1) January 25, 2022 (చదవండి: టెక్ దిగ్గజ సీఈఓలకు పద్మభూషణ్ అవార్డ్స్..!) -
‘భోజనమాత’పై వివక్ష.. దళిత మహిళ వండిన ఆహారం మాకొద్దు
డెహ్రడూన్: కుల వివక్ష ఇప్పటికీ ఎంత తీవ్రంగా ఉందో చెప్పే ఘటన ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లా సుఖిందాంగ్‌లో చోటుచేసుకుంది. దళిత మహిళ వండిన ఆహారాన్ని తినడానికి అగ్రవర్ణ పిల్లలు నిరాకరించారు. దాంతో పాఠశాల బాధ్యులు ఆమెను తొలగించి మరో వివక్షాపూరిత చర్యకు పాల్పడ్డారు. పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం వండి, వడ్డించే మహిళలను ఉత్తరాఖండ్‌లో ‘భోజనమాత’గా సంబోధిస్తారు. కొద్దిరోజుల కిందట ఈ బడిలో భోజనమాత పోస్టు కోసం ఇంటర్వ్యూలు నిర్వహించారు. అగ్రవర్ణ మహిళ కూడా ఇంటర్వ్యూకు వచ్చినా ఆమెను కాదని దళిత మహిళను ఎంపిక చేయడంపై పిల్లల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తర్వాత సదరు మహిళ వండిన ఆహారాన్ని తినడానికి పిల్లలు నిరాకరించారు. మొత్తం 66 మంది పిల్లల్లో 40 మంది పాఠశాలలో పెట్టే మధ్యాహ్న భోజనాన్ని తినడం మానివేసి ఇంటి నుంచి లంచ్ బాక్స్‌లు తెచ్చుకోవడం మొదలుపెట్టారు. దీంతో దళిత మహిళను తొలగించి ఆమె స్థానంలో మరొకరికి తాత్కాలికంగా నియమించారు పాఠశాల బాధ్యులు. అయితే చంపావత్ జిల్లా విద్యాధికారి పి.సి.పురోహిత్ వాదన మాత్రం భిన్నంగా ఉంది. దళిత మహిళ నియామకంలో నిబంధనలను పాటించలేదని, ఉన్నతాధికారులు ఆమోదముద్ర వేయకుండానే సదరు మహిళను భోజనమాతగా నియమించారని పురోహిత్ చెప్పుకొచ్చారు. అందుకే ఆమె నియామకాన్ని రద్దు చేశామని చెప్పారు. (చదవండి: మతమార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం) -
'పుష్ప' సినిమాపై ఆగ్రహం.. బాయ్‌కాట్ చేస్తామని వార్నింగ్
Boycott Pushpa In Karnataka: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషనల్ వస్తున్న 'పుష్ప: ది రైజ్' ప్రభంజనం మొదలు కావడానికి ఇంకా ఒక్క రోజే మిగిలి ఉంది. డిసెంబర్ 17న ఏడు భాషల్లో పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్న 'పుష్ప' గురించి సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరెక్కనున్న 'పుష్ప' సినిమాలో బన్నీ పుష్పరాజ్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే. రష్మిక మందన్నా పల్లెటూరి యువతి పాత్రలో ఆకట్టుకోనుంది. స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేసింది. ఈ మధ్యే రిలీజైన ఈ సాంగ్ యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది! అయితే తాజాగా ఈ మూవీకి ఒక సమస్య ఎదురైంది. అదేంటంటే.. అల్లు అర్జున్ నటించిన ఈ పాన్ ఇండియా మూవీపై కర్ణాటక ప్రజలు ఫైర్ అవుతున్నారు. కర్ణాటకలో కన్నడ కంటే తెలుగు వెర్షన్‌కే ఎక్కువ స్క్రీన్స్ కేటాయించారని మండిపడుతున్నారు. కర్ణాటకలో సినిమా విడుదల చేయాలనుకుంటే కన్నడలోనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే సినిమాను బాయ్‌కాట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. #BoycottPushpaInKarnataka అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. #BoycottPushpaInKannada #PushpaTheRiseOnDec17th #PushpaTheRise @alluarjun @MythriOfficial release your cinema in Kannada or else be ready to face boycott from Kannadigas. pic.twitter.com/grydunIxqE — ಕನ್ನಡದ ಕಂದ (@Suresh96380427) December 16, 2021 If u want 2 release ur movie in Karnataka better release Kannada version more than any version. What is this? Telugu version200+ hindi vsn 10+ malayalam vsn 4+ tamil vsn 4+ & Kannada versn 3 shws just 3 that too in Karnataka 😡#BoycottPushpaInKarnataka #BoycottPushpaInKannada https://t.co/MW3scDHCVp — Sunil Kumar B.M. (ಸುನಿಲ್ ಕುಮಾರ್. ಬಿ ಎಂ.) (@sunny8197447891) December 16, 2021 Dear @alluarjun, why are you dumping Telugu version in Karnataka when you have Kannada version? You and your marketing team has got it all wrong. This is not going well with Kannadigas. I won't watch Pushpa unless released in Kannada across Karnataka.#BoycottPushpaInKarnataka — ಶರಣ್ ಕನ್ನಡಿಗ (@sharankannadiga) December 16, 2021 ವಿಜಯಪುರದಂತ ಅಪ್ಪಟ ಕನ್ನಡ ಪ್ರದೇಶಗಳಲ್ಲಿ #Pushpa ತೆಲುಗು ವರ್ಶನ್, ಯಾವನು ನೋಡಲ್ಲ. @JayannaFilms @MythriOfficial @SwagathOffl ಕನ್ನಡ ಅವತರಣಿಕೆ ಬಿಡುಗಡೆ ಮಾಡದಂತೆ ಯಾರ ಕೈವಾಡ ತಿಳಿಸಿ? #BoycottPushpaInKarnataka pic.twitter.com/Hzsci0WG76 — Jayateerth Nadagouda (@jayateerthbn) December 16, 2021 Indukey KGF vachey varaku meedhi oka industry undhi ani jananiki teliyaledhu..#BoycottPushpaInKarnataka — OldMonk (@imdalmighty) December 16, 2021 -
ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం
సాక్షి, న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం తీరుపై ఇక ప్రజా క్షేత్రంలోనే తేల్చుకోవాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలను పూర్తిగా బహిష్కరిస్తున్నట్టు తెలిపింది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన కోరుతూ శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఆందోళనలు కొనసాగిస్తున్న టీఆర్ఎస్ పార్టీ, కేంద్రం నుంచి ఎలాంటి స్పం దన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై కేంద్రంతో పోరుబాటులోనే నడవాలని, ‘హమారా నారా(నినాదం).. మోదీ సర్కార్ జానా’ నినాదంతో ఉద్యమించాలని నిర్ణయిం చింది. మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతి రేక విధానాలను ప్రజల్లోనే ఎండగడతామంటూ ఎంపీలంతా హైదరాబాద్ తిరిగి వెళ్లారు. నల్లచొక్కాలతో నిరసన మంగళవారం ఉభయ సభల ప్రారంభానికి ముందే దేశంలో సమగ్ర జాతీయ ధాన్యం సేకరణ విధానం తేవాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ.. లోక్‌సభ, రాజ్యసభల్లో టీఆర్ఎస్ పక్ష నేతలు నామా నాగేశ్వరరావు, కె.కేశవరావు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. తర్వాత పార్టీ ఎంపీలంతా నల్ల చొక్కాలు ధరించి సభలు ప్రారంభమైన వెంటనే నిరసనలకు దిగారు. లోక్‌సభలో నామాతో పాటు బీబీ పాటిల్, కవిత, రంజిత్‌రెడ్డి, పసునూరి దయాకర్, రాములు, ఎంఎస్ఎన్ రెడ్డి, నేతకాని వెంకటేశ్‌లు గట్టిగా నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లారు. రబీ ధాన్యం సేకరణపై స్పష్టమైన ప్రకటన చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్ర రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేశారు. రాజ్యసభలోనూ కేకేతో పాటు కేఆర్ సురేశ్‌రెడ్డి, లింగయ్యయాదవ్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు నిరసనలు తెలిపి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. మా నిరసనలకు విలువ లేదు: కేకే ‘ధాన్యం సేకరణపై ఎన్నివిధాలా నిరసనలు తెలపాలో, ఎన్ని విధాలుగా పోరాడాలో అంతా చేశాం. ఎంతచేసినా గోడకు తలబాదుకున్నట్లుగా ఉంది తప్ప స్పందించే వారే లేరు. ఇది ఫాసిస్టు ప్రభుత్వం. పార్లమెంట్లో ఈ అంశం తేలదని భావించి సమావేశాలను బహిష్కరిస్తున్నాం. రైతు వ్యతిరేక ప్రభుత్వంపై ప్రజల్లోకి వెళతాం. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. రాజీనామాలు చేసే విషయం ఆలోచిస్తాం..’అని కేకే మీడియాతో చెప్పారు. దున్నపోతుపై వానబడ్డ చందం: నామా ‘ధాన్యంపై ప్రకటన కోరుతుంటే దున్నపోతుపై వానపడ్డ చందంగా కేంద్రం వ్యవహరిస్తోంది. కొంటామో? లేదో? చెప్పకుండా డొంక తిరుగుడు సమాధానాలు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని, రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఇకపై ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం..’అని నామా అన్నారు. చట్టబద్ధత కల్పించాలని కోరుతూ.. లోక్‌సభ, రాజ్యసభల్లో టీఆర్ఎస్ పక్ష నేతలు నామా నాగేశ్వరరావు, కె.కేశవరావు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. తర్వాత పార్టీ ఎంపీలంతా నల్ల చొక్కాలు ధరించి సభలు ప్రారంభమైన వెంటనే నిరసనలకు దిగారు. లోక్‌సభలో నామాతో పాటు బీబీ పాటిల్, కవిత, రంజిత్‌రెడ్డి, పసునూరి దయాకర్, రాములు, ఎంఎస్ఎన్ రెడ్డి, నేతకాని వెంకటేశ్‌లు గట్టిగా నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లారు. రబీ ధాన్యం సేకరణపై స్పష్టమైన ప్రకటన చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్ర రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేశారు. రాజ్యసభలోనూ కేకేతో పాటు కేఆర్ సురేశ్‌రెడ్డి, లింగయ్యయాదవ్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు నిరసనలు తెలిపి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. -
టారిఫ్‌ల పెంపు.. ‘ట్రాయ్ నిద్రపోతోందా?’
BoycottJioVodaAirtel Twitter Trend Amid Tariffs Hike: పరిణామాలు ఏవైనా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిత్యావసరాలు మొదలుకుని.. ప్రతీదానిపైనే బాదుడు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నిరసనలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా మొబైల్ టారిఫ్‌ల పెంపుపైనా వ్యతిరేక గళం వినిపిస్తోంది. భారత జనాభాలో సగానికి కంటే ఎక్కువగా(దాదాపు 60 శాతంపైనే అని సర్వేలు చెప్తున్నాయి) మొబైల్ ఇంటర్నెట్నే ఉపయోగిస్తున్నారు. ఈ తరుణంలో ధరల పెంపు పెద్దషాక్ అనే చెప్పాలి. ఈ తరుణంలో టెలికాం కంపెనీలను నియంత్రించలేని ట్రాయ్ (TRAI) నిద్రపోతోందా? అంటూ తీవ్ర విమర్శలను దిగుతున్నారు నెటిజనులు. నష్టాల సాకును చూపిస్తూ.. టెలికామ్ కంపెనీలన్నీ సగటు భారతీయుల డబ్బును దోచేస్తున్నాయని మండిపడుతున్నారు. ఎయిర్‌లెట్, వొడాఫోన్-ఐడియా, జియో కంపెనీలు 20రూ. మినిమమ్ పెంపుతో రెగ్యులర్, డాటా టారిఫ్ ప్యాకేజీలన్నింటిని సవరించడం సామాన్యుడికి దెబ్బే అని చెప్పాలి. పేద దేశమైనా సుడాన్ సూపరహే.. 1 జీబీకి ఎంత ఖర్చంటే.. ఇక ఎయిర్టెల్, వొడాఫోన్, జియో కంపెనీలు టారిఫ్‌లను అమాంతం పెంచేయడంపై నిరసన తీవ్ర స్థాయిలోనే కొనసాగుతోంది. అదే టైంలో ఈ నిరసన సరదా కోణంలోనూ నడుస్తోంది. ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఇంటర్నెట్తోనే ఈ ట్రెండ్‌ను నడిపిస్తున్నారంటూ సరదా కామెంట్లు కనిపిస్తున్నారు. పరుషంగా తిట్టలేక మీమ్స్ టెంప్లెట్స్‌తో విమర్శిస్తున్నారు కొందరు. పెరిగిన జియో టారిఫ్ ధరల పూర్తి వివరాలు VI పెంచిన ధరలు ఇవే! ఎయిర్టెల్ బాదుడు.. ఇలా ఉంది మరికొందరేమో బీఎస్ఎన్ఎల్ వైపు వెళ్లడం మంచిదేమోనని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ నెట్వర్క్ బీఎస్ఎన్ఎల్ను ప్రైవేట్‌పరం చేయొద్దని, అలాగని ప్రజలంతా బీఎస్ఎన్ఎల్ (సిగ్నల్, ఇంటర్నెట్ స్పీడ్ ఆధారంగా) పోర్ట్ కావాలంటూ పిలుపు ఇస్తున్నారు నెటిజన్స్. ట్విటర్లో ఈ ట్రెండ్‌ను మీరూ చూసేయండి. #BoycottJioVodaAirtel In the past jio hiked the prices then after all the telecom companies hiked,but now airtel hiked then after suddenly jio hiked something is fishy, #Airtel #Jio #VI these fu.... Companies wanted to create monopoly in the market — VAMSHI RUDRA (@VAMSHIRUDRA2) November 29, 2021 #BoycottJioVodaAirtel is trending People who are using BSNL right now reaction of #BSNL user..💪 pic.twitter.com/ZXCMPA4EHR — Rakesh prajapat (@Rakeshp8290) November 29, 2021 #BoycottJioVodaAirtel We will go to BSNL network — prakash (@sibdumercury) November 29, 2021 #BoycottJioVodaAirtel People in this corona situation lost their jobs and all the investments. In this difficult situation the telecom operators are ruthlessly increasing their tariff price. 😡😡🤬🤬😤😤😤🤧🤧 @JioCare @reliancejio — Satnam Singh (@SatnamS1995) November 29, 2021 Why @TRAI is sleeping? all telecome companies are extending their money is it easy to paid by poor people? wake up TRAI.#BoycottJioVodaAirtel pic.twitter.com/L6CKCy3m4k — Ajeet Kushwaha (@AjeetKushwaha33) November 29, 2021 Jio Raises Prepaid Rates By Up To 20% After Airtel, Vodafone Idea. Where is @TRAI in all this loot?#BoycottJioVodaAirtel — Ajeet Kushwaha (@AjeetKushwaha33) November 29, 2021 Meanwhile me to those who are trending: #BoycottJioVodaAirtel pic.twitter.com/yk8POQ387W — All in One 🇮🇳 (@mayankm94847123) November 29, 2021 This woman got so busy on her mobile that she left her child at the hotel. Just think from where did this mobile reach us #BoycottJioVodaAirtel #Vellore #VirgilAbloh #NZvsIND #bimbisarateaser pic.twitter.com/svBgJczqSV — Imtiyaz Ahamad (@ahamad1_imtiyaz) November 29, 2021 -
సల్మాన్ సినిమాకు బైకాట్ సెగ.. విరుచుకుపడుతున్న నెటిజన్లు
#BoycottAntim Trending In Twitter: బాలీవుడ్ కండల వీరుడు, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ అయిన సల్మాన్ ఖాన్, ఆయుష్ శర్మ నటించిన తాజా చిత్రం 'ఆంటీమ్: ది ఫైనల్ ట్రూత్'. ఈ సినిమా నవంబర్ 26న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు మహేష్ మంజ్రేకర్ దర్వకత్వం వహించారు. విద్యుత్ జమాల్, శృతి హాసన్ నటించిన 'పవర్' తర్వాత మహేష్ మంజ్రేకర్ తీసిన రెండో చిత్రమిది. అయితే సల్మాన్ ఖాన్ పోలీస్ పాత్రలో నటిస్తుండడంతో విడుదలకు ముందు ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ప్రేక్షకులు, విమర్శకుల నుంచి బ్యాడ్ టాక్ తెచ్చుకుంటోందీ చిత్రం. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఈ సినిమాపై #బైకాట్ఆంటీమ్ అని ట్రెండ్ కూడా అవుతోంది. ఈ చిత్రంపై నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఒక సల్మాన్ అభిమానులు మాత్రం సినిమాను ఎంజాయ్ చేస్తుంటే, అత్యధికంగా నెటిజన్లు బహిష్కరిస్తున్నారు. ప్రతి నిమిషానికి ట్వీట్లు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఇందుకు కారణం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం అని తెలుస్తోంది. ఎందుకంటే సుశాంత్ మరణం కేసులో సల్మాన్ ఖాన్ పేరు వినిపించడం ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కారణంతోనే ఆంటీమ్ సినిమాను బైకాట్ చేస్తున్నట్లు సమాచారం. సల్మాన్‌కు దేశం పట్ల శ్రద్ధ లేదని, అతనిది విరుద్ధమైన భావజాలంగా చూపిస్తూ ట్వీట్లు చేస్తున్నారు నెటిజన్లు. సినిమా విడుదలకు ముందు కూడా వివాదస్పదంగా మారింది. Eat Sleep#BoycottAntim Repeat 🔁 SUSHANT JUSTICE NOW https://t.co/pXVzvZhSji https://t.co/rq4rlBk9hR — Rajesh Kumar Singh (@RajeshK49676278) November 26, 2021 #Antim releases tmrw. We need to make it fail like 'Radhe' SK is the hub of ISI, Dawood, Drugs, Murders, mocking #Hindu gods, shaming #Hindus#BlackFriday #BoycottBollywood #BoycottAntim #Bollywood ANTIM IN CINEMAS TOMORROW@narendramodi @ianuragthakur @BJP4India @RSSorg pic.twitter.com/XnfLZ01M5r — Angry & Frustrated Hindu (@AF_indian) November 25, 2021 Never Believe In Words, Read The Actions#BoycottAntim Boycott Bollywood Our Wishes 4 Sushant pic.twitter.com/ljZDKWJRiM — 🦋🦋🦋ANGRY BOT 🇮🇳 🇮🇳 (@Angry_Bot14) November 17, 2021 1/4 To me BOLLYWOOD was over on 14th June 2020! How about u ? BOYCOTT BOLLYWOOD #BoycottAntim pic.twitter.com/VG0fTg21RN — deepali 🇮🇳 (@deepali53882005) November 26, 2021 -
ఆమిర్ ఖాన్ యాడ్‌పై తీవ్ర దుమారం
Boycott CEAT Trending in Twitter: సినిమాలు, వెబ్ సిరీస్‌లను వివాదాస్పద కాన్సెప్ట్‌లు, సీక్వెన్స్‌లతో తెరకెక్కించడమే కాదు.. అప్పుడప్పుడు అడ్వర్టైజ్మెంట్ల రచ్చ ద్వారానూ వార్తల్లో నిలుస్తోంది బాలీవుడ్. ముఖ్యంగా సున్నితమైన అంశాల్ని టచ్ చేయడం ద్వారా సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహానికి గురికావాల్సి వస్తోంది. ఈమధ్య వివాహ దుస్తులమ్మే ఓ బ్రాండ్ నటి అలియా భట్‌తో తీసిన ‘కన్యాదాన్’ అడ్వర్టైజ్మెంట్ తీవ్ర విమర్శలపాలైన సంగతి తెలిసిందే. ఆ వేడి చల్లారకముందే బాలీవుడ్ సీనియర్ హీరో ఆమిర్ ఖాన్ యాక్ట్ చేసిన ఓ యాడ్‌పై తీవ్ర దుమారం నడుస్తోంది. ఆమిర్ ఖాన్ నటించిన సీయట్ టైర్ల కంపెనీ యాడ్ ఒకటి ఈమధ్య రిలీజ్ అయ్యింది. ‘‘రోడ్లు ఉంది పటాసులు(టపాకులు) పేల్చడానికి కాదు’’ అంటూ తన ఎదురుగా ఉన్న జనాలకు క్లాస్ పీకుతూ.. సదరు టైర్ల యాడ్‌ను ప్రమోట్ చేశాడు. అయితే అమీర్ ఖాన్ ఈ యాడ్ చేయడం, పైగా తమ మతాన్ని కించపరిచేదిగా ఉందంటూ కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఆ అభ్యంతరాలు తారాస్థాయికి చేరగా.. సీయట్ను బాయ్‌కాట్ చేయాలంటూ Boycott_Hinduphobic_CEAT వేల ట్వీట్లు, రీట్వీట్లతో నింపేస్తున్నారు. ఈ యాడ్ చేసింనందుకు నటుడు ఆమిర్ ఖాన్ క్షమాపణలు చెప్పాలని, యాడ్‌ను తొలగించాలని సీయట్ కంపెనీని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇక కొందరైతే ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకాను ఇందులోకి తీసుకొస్తున్నారు. గతంలోనూ ఇలా సున్నితమైన అంశాలపై హర్ష గోయెంకా అనుచిత ట్వీట్లు వేశాడని, ఆ టైంలోనూ బాయ్‌కాట్ ఉద్యమం నడిచిందని కొందరు స్క్రీన్ షాట్లను రీట్వీట్లు చేస్తున్నారు. మతాన్ని, పండుగల్ని కించపరిచేలా సీయట్ కంపెనీ యాడ్స్ తీయాల్సిన అవసరం, అందులో ఆమిర్ ఖాన్ లాంటి స్టార్ నటించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు చాలామంది. Hello @CEATtyres The chairman of your parent company has such views on Hinduism and it's traditions We have many alternative tyre companies in India MRF, JK, Apollo So there won't be any problem for us if we #BoycottCEAT We need an unconditional apology from him ✌🏼 pic.twitter.com/Qr7UjGYDjC — Anish (@Aniiiiish) April 14, 2021 చదవండి: అండర్వేర్ యాడ్.. ఏం మెసేజ్ ఇద్దామని రష్మిక? -
డప్పుల కూలి పెంచమన్నందుకు బహిష్కరించారు: బాధితులు
-
సుశాంత్ ప్లేస్‌లో మరొకరిని ఊహించుకోలేం, దాన్ని నిషేధించండి
'పవిత్ర రిష్తా' సీరియల్ పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చే వ్యక్తి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. 2009లో ఏక్తాకపూర్ తెరకెక్కించిన ఈ సీరియల్ బుల్లితెర మీద ప్రభంజనం సృష్టించింది. మానవ్‌గా సుశాంత్ సింగ్, అర్చనగా అంకిత లోఖండేల నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. సుమారు ఐదేళ్లపాటు ప్రసారమైన ఈ సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యాడు సుశాంత్. తాజాగా ఈ సీరియల్ రెండో సీజన్ త్వరలో సందడి చేయబోతుందంటూ ఆల్ట్ బాలాజీ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. 'ఆర్డినరీ జీవితాల్లో కొన్నిసార్లు ఎక్స్ట్రార్డినరీ లవ్‌స్టోరీలు కూడా కనిపిస్తాయి. పవిత్ర రిష్తా షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలో ఆల్ట్ బాలాజీలో స్ట్రీమింగ్ కానుంది' అని ప్రకటన రిలీజ్ చేసింది. ఈ సీజన్లో అర్చన పాత్రను మరోసారి అంకిత చేస్తుండగా మానవ్ పాత్రలో నటించేందుకు షాహీర్‌ను ఎంపిక చేసుకున్నట్లు ఫొటోతో సహా వెల్లడించారు. View this post on Instagram A post shared by ALTBalaji (@altbalaji) అయితే సుశాంత్ సింగ్ అభిమానులు మానవ్ పాత్రలో వేరొకరిని ఊహించుకోలేకపోతున్నారు. సుశాంత్ వల్లే పవిత్ర రిష్తా సీరియల్ హిట్టయిందని, అలాంటిది అతడు లేకుండా రెండో సీజన్ ఎలా తీస్తారని ప్రశ్నిస్తున్నారు. 'మానవ్ అంటే ఒక పేరు కాదు, అది ఒక ఎమోషన్.. మానవ్ 2గా సుశాంత్‌ను కాకుండా మరొకరిని ఊహించుకోలేం' అంటూ #BoycottPavitraRishta2 అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. సుశాంత్ అంటే నిజమైన ప్రేమే ఉంటే అంకిత ఈ సీరియల్లో నటించేందుకు ఒప్పుకునేదే కాదని సదరు నటిని కూడా విమర్శిస్తున్నారు. If this lady really loved our SSR then she would never take part in this serial again . Such a fake lady😠🤒. Thank god SSR was break-up with her.#BoycottPavitraRishta2 Eyes On Law Minister 4 SSR#SSRians pic.twitter.com/vFVKYuaIR0 — Scarcastic memer (@scarcasticmemer) July 13, 2021 #BoycottPavitraRishta2 No one will be able to take Sushant's place. @itsSSR 🌿🌸💫✨🦋🌼🦋✨💫🌸🌿 Pavitra Rista serial was popular for Sushant, not for any Natunkita. OUR MANAV ONLY SUSHANT#BoycottBullywood #BoycottPavitraRishta2 pic.twitter.com/aY7lTAPDsB — Pari Sona Sanjay (@PariSonaSanjay) July 13, 2021 #pavitrarishta pic.twitter.com/XP92sIZL8r — Ankita lokhande (@anky1912) July 11, 2021 looking so cheap...how can a person even think to cash a dead person's name... #BoycottPavitraRishta2#Boycottankita#JusticeForSushantSinghRajput pic.twitter.com/LnhqoS6e1R — debashree (@debashr35191593) July 13, 2021 #BoycottPavitraRishta2 You deserve this only.God will never leave you in peace. You are killing his soul everyday! Why remake after his death not before?? @ektarkapoor @Shaheer_S @anky1912 VULTURES!! pic.twitter.com/t5oWT57f3S — Ritu🇮🇳 (@Sushritu) July 13, 2021 -
ట్విటర్ ట్రెండ్: ఈ సినిమాను అస్సలు చూడకండి!
Boycott Toofaan మరో వారంలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సినిమాకు సోషల్ మీడియా నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ఫర్హాన్ అక్తర్, మ్రునాల్ థాకూర్ జోడిగా నటించిన ‘తూఫాన్’ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ లో చూడొద్దంటూ రిక్వెస్టులు చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో గత రాత్రి చెలరేగిన దుమారం.. ఇంకా నడుస్తూనే వస్తోంది. తూఫాన్ కథలో భాగంగా ఫర్హాన్‌ది ఒక గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్. ప్రియురాలు మ్రునాల్ ప్రోత్సాహంతో బాక్సింగ్ ఛాంపియన్‌గా మారతాడు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇందులో ఫర్హాన్ క్యారెక్టర్ పేరు అజిజ్ అలీ. మ్రునాల్ పాత్ర పేరు డాక్టర్ పూజా షా. ఈ పేర్లే అభ్యంతరాలకు కారణం అయ్యాయి. బాయ్‌కాట్ తూఫాన్కు బలం ఇచ్చాయి. ఇది సంప్రదాయానికి విరుద్ధం, మతాంతర కథలను ప్రోత్సహించకూడదని కొందరు వాదిస్తున్నారు. అయితే గతంలో సీఏఏకి వ్యతిరేకంగా ఫర్హాన్ నిరసనల్లో పాల్గొన్నాడు. దీంతో రివెంజ్ తీర్చుకునేందుకు టైం వచ్చిందని మరికొందరు ఈ బాయ్‌కాట్ ట్రెండ్‌లో చేతులు కలపడం విశేషం. Trending in India 🇮🇳 Say Loudly #BoycottToofaan 📢@beingarun28 pic.twitter.com/XfSxne5sy1 — Keshav Pandey (@KeshavPandeyWB) July 10, 2021 Remember this 👇#BoycottToofaan pic.twitter.com/32ZKNvpDtz — कुंवर अजयप्रताप सिंह 🇮🇳 (@iSengarAjayy) July 10, 2021 ఇదిలా ఉంటే ‘భాగ్ మిల్కా భాగ్’ తర్వాత.. మరోసారి ‘తూఫాన్’ కోసం ఒళ్లు హూనం చేసుకున్నాడు ఫర్హాన్. రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీలో విలక్షణ నటుడు పరేష్ రావెల్, ఫర్హాన్‌కు కోచ్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు. షెడ్యూల్ ప్రకారం.. జులై 16న అమెజాన్ ప్రైమ్‌లో ‘తూఫాన్’ స్ట్రీమింగ్ కానుంది. It took about two years to bring the boxer persona to life. This wouldn't have been possible without the belief & support of this amazing team. Watch my boxing journey here.https://t.co/T5ccRHIlYu@excelmovies @PrimeVideoIN — Farhan Akhtar (@FarOutAkhtar) July 9, 2021 -
రైతుకు జరిమానా.. కట్టకపోతే బహిష్కరణ.. ఏం జరిగిందంటే?
ముంబై: మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో అమ్గాన్ గ్రామ పంచాయతీ ఓ రైతుకు రూ. 21,000 జరిమానా విధించింది. పోలీసుల వివరాల ప్రకారం.. జూన్ 12న అమ్గావ్ తహసీల్‌లోని సీతేపార్ గ్రామానికి చెందిన తికారామ్ ప్రీతమ్ పార్ధి అనే రైతు తన పొలంలో భూమిని చదును చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు స్థానిక దేవత రాతి విగ్రహం దెబ్బతిన్నది తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకుని పార్ధిని పొలం పనులు ఆపేయాలని బలవంతం చేశారని అన్నారు. తర్వాత పంచాయతీ సమావేశం ఏర్పాటు చేసి, పార్ధి తమ మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించినట్లు పేర్కొన్నారు. ఇందుగాను అతనిపై రూ. 21 వేల జరిమానా విధించినట్లు తెలిపారు. అయితే ఈ మొత్తం చెల్లించకపోతే సామాజిక బహష్కరణను ఎదుర్కొటామని బెదిరించినట్లు అమ్గావ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ విలాస్ నాలే తెలిపారు. ఆ డబ్బు చెల్లించే ఆర్థిక స్తోమత లేదు! కాగా ఈ మొత్తం డబ్బును దెబ్బతిన్న విగ్రహ నిర్మాణానికి, మిగిలిన క్రతువులకు ఉపయోగించుకోనున్నట్లు పంచాయతీలో తీర్పు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కానీ పార్ధి తన ఆర్థిక స్తోమత బాగోలేనందున డబ్బు చెల్లించలేకపోయాడని, అనంతరం పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా గ్రామ సర్పంచ్ గోపాల్ ఫులిచంద్ మెష్రామ్, పోలీసు పాటిల్ (గ్రామస్థాయి పోలీసు అసిస్టెంట్) ఉల్హాస్రావ్ భైయలాల్ బిసెన్, రాజేంద్ర హివర్లాల్ బిసెన్, పురన్ లాల్ బిసెన్, యోగేష్ హిరలాల్ బిసెన్, యాదవరావ్ శ్రీరామ్ బిసెన్, ప్రతాప్ లధాన్ లంచన్‌లపై మహారాష్ట్ర ప్రొహిబిషన్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ సోషల్ బాయ్‌కాట్ (ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్) చట్టం, 2016 కింద కేసు నమోదు చేసి, నిందితులకు నోటీసులు జారీ చేసినట్లు ఇన్స్పెక్టర్ నాలే తెలిపారు. దీనిపై సర్పంచ్ మేష్రామ్ మాట్లాడుతూ.. స్థానిక సాంప్రదాయం ప్రకారం, గ్రామస్తులు విగ్రహాన్ని పూజించడం ద్వారా ప్రతి సంవత్సరం కొత్త పంట కాలం ప్రారంభమవుతుందన్నారు. పార్ధిని చెల్లించమని అడిగిన మొత్తం డబ్బుతో విగ్రహాన్ని మరమ్మతు చేసి, చిన్న ఆలయం నిర్మించడానికి పంచాయతీలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చదవండి: హిజ్రాలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ -
Naomi Osaka: ఫ్రెంచ్ టోర్నీలో ఊహించని ట్విస్ట్!
‘మీడియా సమావేశాల్లో పాల్గొనను. ఈ నిర్ణయం కారణంగా ఎదురయ్యే ఎలాంటి పరిణామాలకైనా సిద్ధం’... ఫ్రెంచ్ ఓపెన్ ఆరంభానికి ముందు జపాన్ స్టార్ నయోమి ఒసాకా చేసిన ప్రకటన ఇది. వారం రోజులు కూడా గడవక ముందే ఆమె అంచనా నిజమైంది. ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు భారీ జరిమానా వేసి కఠినంగా వ్యవహరించగా... తాను కూడా వెనక్కి తగ్గనంటూ ఒసాకా కఠిన నిర్ణయం తీసుకుంది. మున్ముందు తనపై చర్యలు తీసుకునే అవకాశం ఎలాగూ ఉండటంతో టోర్నీ నుంచే తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. మీడియా కారణంగా మానసికంగా ఆందోళనకు లోనవుతున్న తన దృష్టిలో గ్రాండ్‌స్లామ్ టోర్నీ లెక్క కాదన్నట్లుగా ఆమె వ్యవహరించింది. పారిస్: నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, ప్రపంచ రెండో ర్యాంకర్ నయోమి ఒసాకా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి అర్ధాంతరంగా తప్పుకుంది. మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా ఆట నుంచి విరామం కోరుకుంటున్నట్లు ప్రకటించింది. తొలి రౌండ్లో విజయం సాధించిన ఒసాకా... బుధవారం జరిగే రెండో రౌండ్లో రొమేనియాకు చెందిన అనా బొగ్డన్తో తలపడాల్సి ఉంది. అయితే ఒకరోజు ముందే ఆమె క్లే కోర్టు గ్రాండ్‌స్లామ్‌కు గుడ్‌బై చెప్పేసింది. తాను తప్పుకోవడానికి గల కారణాలను వెల్లడిస్తూ ఒసాకా ట్విటర్లో ఒక ప్రకటన విడుదల చేసింది. 23 ఏళ్ల ఒసాకా తన కెరీర్లో మొత్తం ఏడు సింగిల్స్ టైటిల్స్ సాధించగా... అందులో నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉండటం విశేషం. 2018లో అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌ను ఓడించి యూఎస్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన ఒసాకా 2019, 2021లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను... 2020లో యూఎస్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఒసాకా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకోవడం దురదృష్టకరమని, వచ్చే ఏడాది ఆమె ఈ టోర్నీలో పాల్గొనాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించిన ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేషన్ చీఫ్ గైల్స్ మోరెటాన్... ఆటగాళ్ల ఆరోగ్యం, మంచీ చెడూ చూసుకునే బాధ్యతను తాము ఎప్పుడూ విస్మరించలేదని స్పష్టం చేశారు. నేపథ్యమిదీ... మీడియా సమావేశాల్లో విలేకరులు అర్థం పర్థం లేని ప్రశ్నలు, అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడిగి తమను ఇబ్బంది పెడుతుంటారని... పలు సందర్భాల్లో ఆటగాళ్లను బాధపెట్టడమే లక్ష్యంగా ఇలా చేస్తుంటారని ఆరోపిస్తూ ఒసాకా రాబోయే ఫ్రెంచ్ ఓపెన్‌లో జరిగే మీడియా సమావేశాల్లో పాల్గొననని టోర్నీకి ముందు ప్రకటించింది. ఓడినప్పుడైతే తమ మానసిక స్థితిని పట్టించుకోకుండా విలేకరులు వేధిస్తారంటూ వ్యాఖ్యానించిన ఆమె... తాను ఇవన్నీ తట్టుకోలేనంటూ చెప్పింది. అయితే గ్రాండ్‌స్లామ్ నిబంధనల ప్రకారం ఆటగాళ్లు కచ్చితంగా మీడియా సమావేశానికి హాజరు కావాల్సిందే. ఊహించినట్లుగానే తొలి రౌండ్ విజయం తర్వాత ఒసాకా తన మాటపై నిలబడటంతో నిర్వాహకులు ఆమెపై 15 వేల డాలర్ల జరిమానా కూడా విధించారు. దీంతో పాటు అవసరమైతే గ్రాండ్‌స్లామ్‌లలో ఆడకుండా నిషేధం కూడా విధిస్తామంటూ నాలుగు గ్రాండ్‌స్లామ్‌ల నిర్వాహకులు హెచ్చరించారు కూడా. ఇలాంటి స్థితిలో టోర్నీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవడమే సరైందిగా ఆమె భావించింది. మీడియా గురించి కొద్ది రోజుల క్రితం నేను మాట్లాడినప్పుడు ఇలాంటి స్థితి వస్తుందని ఊహించలేదు. అయితే నాపై అనవసర దృష్టి పడుతున్న కారణంగా అందరి మేలు కోరి టోర్నీ నుంచి తప్పుకోవడమే సరైనదిగా భావిస్తున్నా. ఇది తగిన సమయం కాదని తెలిసినా తప్పడం లేదు. నా దృష్టిలో మానసిక ఆరోగ్య సమస్య చిన్నదేమీ కాదు. నిజం చెప్పాలంటే 2018లో యూఎస్ ఓపెన్ గెలిచిన నాటి నుంచే మానసికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ వస్తున్నాను. నేను పెద్దగా కలుపుగోలు మనిషిని కాదని నా సన్నిహితులందరికీ తెలుసు. జనంలో ఉన్నప్పుడు ఆందోళనను తగ్గించుకునే క్రమంలోనే ఎక్కువ సమయం హెడ్ ఫోన్లు ధరిస్తూ ఉంటాను కూడా. నిజానికి టెన్నిస్ మీడియా నన్ను మరీ ఎక్కువగా ఇబ్బంది పెట్టకపోయినా, మీడియా సమావేశానికి రాగానే తీవ్రంగా ఆందోళనకు లోనవుతూ ఉంటాను. పారిస్‌లో ఇప్పటికే పరిస్థితి నన్ను మరీ భయపెట్టేలా ఉంది. అందుకే నా మేలు కోసం మీడియాకు దూరంగా ఉండాలని భావించా. ఇక్కడ ఉన్న కొన్ని పాతకాలపు నిబంధనలను అందరి దృష్టికీ తీసుకురావాలని ప్రయత్నించా. నిర్వాహకులకు క్షమాపణ చెబుతూ టోర్నీ ముగిసిన తర్వాత మాట్లాడతా అని కూడా విడిగా చెప్పా. ప్రస్తుతానికి మైదానం నుంచి విరామం తీసుకుంటున్నా. రాబోయే రోజుల్లో అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో ఏమేం చేయవచ్చో నేనూ చర్చిస్తా. –నయోమి ఒసాకా చదవండి: ర్యాప్ అండ్ లవ్‌స్టోరీ -
పరువు కోల్పోయేకంటే ఇదే బెటర్..
సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్ని బహిష్కరించాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తోంది. పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన నేపథ్యంలో ఈ ఎన్నికల్లోనూ అవే ఫలితాలు పునరావృతమవుతాయని ఆ పార్టీ నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. అలాంటప్పుడు పోటీ చేసి పరువు పోగొట్టుకుని బాధపడడం కంటే, ఎదో ఒక వంకతో పోటీలో లేకుండా పక్కకు తప్పుకుంటే మంచిదని ఎక్కువ మంది నేతలు భావిస్తున్నారు. ఎన్నికలకు మళ్లీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఇప్పటికే టీడీపీ నేత వర్ల రామయ్యతో కొత్త ఎస్ఈసీ నీలం సాహ్నికి ఫిర్యాదు చేయించారు. గతంలో ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో.. అక్కడి నుంచే మిగిలిన ప్రక్రియ కొనసాగుతుందని ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇవ్వడంతో ఇక పోటీలో ఉంటే పరువు పోవడం ఖాయమని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో దౌర్జన్యాలు జరిగాయనే సాకు చూపి పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. శుక్రవారం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరిపి చంద్రబాబు అందులో ఈ నిర్ణయం ప్రకటిస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చదవండి: సీఎం జగన్ చిత్రపటానికి తెలంగాణ ఉద్యోగుల క్షీరాభిషేకం అమానుషం: ఒకే ఆటోలో వచ్చారని.. -
కీలక నిర్ణయం: రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణ
న్యూఢిల్లీ : బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రేపు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేయనున్న ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు 16 పార్టీలు ప్రకటించాయి. వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్ కోరుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. ప్రతిపక్షం లేకుండా చేసి, ఏకపక్షంగా చట్టాలు ఆమోదం చేసుకున్నారని ఆరోపించాయి. ఈ కొత్త వ్యవసాయ చట్టాల కారణంగా ఆహర భద్రతకు విఘాతం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ మేరకు గురువారం 16 ప్రతిపక్ష పార్టీలు ఓ ప్రకటన విడుదల చేశాయి. ఈ మేరకు రేపు రాష్ట్రపతి ప్రసంగాన్ని కాంగ్రెస్, ఎన్సీపీ, జేకేఎన్సీ, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, సీపీఐ(ఎం), సీపీఐ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఆర్ఎస్పీ, పీడీపీ, ఎండీఎంకే, కేరళ కాంగ్రెస్ (ఎం), ఏఐయూడీఎఫ్ పార్టీలు బహిష్కరించనున్నాయి. ఈ సందర్భంగా విపక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్ మీడియాతో మాట్లాడారు. కొత్త వ్యవసాయ చట్టాలతో ఆహార ఉత్పత్తులను ప్రభుత్వం సేకరించడం నిలిచిపోతుందని.. దీంతో ప్రజా పంపిణీ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని తెలిపారు. ఉభయ సభల్లో సాగు చట్టాలను బలవంతంగా ఆమోదం చేయించినట్లు ఆరోపించారు అందుకే రైతులు ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ 64 రోజులుగా ఆందోళన చేస్తున్నారని గుర్తుచేశారు. ఈ ఆందోళనల్లో 155 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గణతంత్రం రోజు హింసాత్మక ఘటనలు ఖండనీయమని ప్రకటించారు. ఈ దుశ్చర్యల వెనుక అసలు కుట్రదారులెవరో తేల్చాల్సిన అవసరం ఉందని 16 పార్టీలు పేర్కొన్నాయి. దీనికోసం నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశాయి. -
దళితులకు హెయిర్ కట్ : ఆత్మహత్యే శరణ్యం
సాక్షి, బెంగళూరు: కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా పలు వ్యాపారాలు, చిన్న, చిన్న దుకాణాలు కూడా మూతపడ్డాయి. దీంతోపాటు అనేక వృత్తి కార్మికులు కూడా ఉపాధిలేక సంక్షోభంలోకి కూరుకుపోయారు. అయితే ఇపుడిపుడే సాధారణ పరిస్థితులతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఒక బార్బర్‌షాపు యజమాని పట్ల గ్రామ పెద్దలు అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సీ, ఎస్టీ సామాజివర్గాలకు హెయిర్ కట్ చేశారన్న అక్కసుతో మైసూరు జిల్లాలోని నంజనాగుడు తాలూకాలోని బార్బర్ కుటుంబాన్ని బాయ్‌కాట్ చేసిన ఉదంతం కర్నాటకలో చోటుచేసుకుంది. హల్లారే గ్రామానికి చెందిన మాల్లికార్జున శెట్టి కుటుంబం కటింగ్ సెలూన్ నడుపుకుంటోంది. చెప్పినా వినకుండా ఎస్టీ, ఎస్సీ సభ్యులకు జుట్టు కత్తిరించారంటూ కొందరు కుల దురహంకారులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరిస్తున్నట్టు గ్రామ పెద్దలు ప్రకటించారు. అంతేకాదు ఏకంగా 50 వేల రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశించారు. గతంలో కూడా రెండుసార్లు కుల వివక్షకు గురయ్యామని జరిమానా కూడా చెల్లించామంటూ బార్బర్ మాల్లికార్జున ఆవేదన వ్యక్తం చేశారు. తమ షాపును సందర్శించిన చన్నా నాయక్ తదితరులు దళితులకు ఎక్కువ చార్జ్ వసూలు చేయాలని గతంలో ఆదేశించారని ఆరోపించారు. దీనికి తాము అంగీకరించకపోవడంతో తమ కుమారుడిని కొట్టి, బెదిరించి మరీ అతడినుంచి 5 వేల రూపాయలను లాక్కుపోయారని తెలిపారు. దళితుడికి హెయిర్ కట్ చేయడం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఈ ఘటనపై అధికారులకు పిర్యాదు చేశామన్నారు. ఈ హింస ఆపకపోతే, తమకు న్యాయం జరగకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమని పేర్కొన్నారు. మరోవైపు దీనిపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆధునిక నాగరిక సమాజంలో జాతి, కుల, మతం అటూ విద్వేషాన్ని వెళ్లగక్కడం శోచనీయమని మండిపడుతున్నాయి. ఇంకా దళితులు, అంటరాని వారు అంటూ వివక్ష, సంఘ బహిష్కారం లాంటి ఘటనలు అమానవీయమైవనవీ, అధికారులు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. -
బాయ్‌కాట్ బింగో: రణ్‌వీర్‌పై ట్రోలింగ్
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులు హీరో రణ్వీర్ సింగ్ మీద ఫైర్ అవుతున్నారు. ఆయన నటించిన బింగో యాడ్‌లో సుశాంత్‌ను కించపరిచారని విమర్శిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో #BoycottBingo హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. బింగోకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న రణ్వీర్ చిప్స్ కోసం నటించిన కొత్త యాడ్‌ను ఇటీవలే రిలీజ్ చేశారు. అందులో రణ్వీర్ ఓ ఫంక్షన్‌కు వెళ్తారు. అక్కడి బంధువులు నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అని హీరోను పదేపదే అడుగుతుంటారు. వాటికి సమాధానం చెప్పలేక, అక్కడనుంచి తప్పించుకోలేక సతమతమవుతున్న అతడికి బింగో మ్యాడ్ యాంగిల్స్ తినగానే ఓ ఐడియా వస్తుంది. (చదవండి: బాయ్‌కాట్ మీర్జాపూర్2 .. ట్విటర్లో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్) వెంటనే ఎవరికీ అర్థం కాని రీతిలో జవాబు చెప్పడం ప్రారంభిస్తారు. పారడాక్సికల్ ఫొటాన్స్, అల్గారిథమ్స్, ఏలియన్స్.. అంటూ చెప్తూ ఇదే తన నెక్స్ట్ ప్లాన్ అని జవాబివ్వడంతో అందరూ షాక్ అవుతారు. ఈ యాడ్‌లో ఎక్కడా సుశాంత్ పేరును ప్రస్తావించలేదు. అయితే సుశాంత్ మాత్రమే ఫొటాన్స్, ఏలియన్స్ అంటూ సైన్స్ గురించి ఎప్పుడూ మాట్లాడేవారని, కావాలనే ఈ యాడ్‌లో అతన్ని టార్గెట్ చేశారని ఆయన అభిమానులు ఆరోపిస్తున్నారు. దీంతో రణ్వీర్ను, బింగో యాడ్‌ను ఏకిపారేస్తున్నారు. సుశాంత్ ఆలోచనలను కించపరిచేలా ఉన్న ఈ యాడ్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: యూట్యూబర్‌కు భారీ షాక్ ఇచ్చిన అక్షయ్) 💫Paradoxical Photons of 𝕒𝕥𝕣𝕒𝕟𝕘𝕚 Algorithm! 💫E=mc2! 💫Mitramandal mai Aliens ki feelings match karni hai.. What the hell do you mean by using these terms?? 𝗠𝗮𝗸𝗶𝗻𝗴 fun of our @itsSSR 😑 𝙍𝙖𝙣𝙫𝙚𝙚𝙧 this isn't acceptable😾#BoycottBingopic.twitter.com/Y7EBeYKczK — Deepika981 (@Deepika9813) November 18, 2020 Yes boycott this ghatiya bingo! #BoycottBingo #boycottzomato #BoycottBollywood #RepublicRoar4SSR #NoSushantNoBollywood https://t.co/3yEwMALamc — Upendra Singh Rajput (@itsusrajput) November 19, 2020 #BoycottBingo #NoSushantNoBollywood https://t.co/NDwxpldSwx — WE ❤MODI (@NaYAmbre) November 19, 2020 -
భేటీకి కేంద్ర మంత్రుల గైర్హాజరు
న్యూఢిల్లీ/చండీగఢ్: కొత్త వ్యవసాయ చట్టాలపై పంజాబ్ రైతుల ఆందోళనను తీర్చడానికి కేంద్ర వ్యవసాయ శాఖ దేశ రాజధాని ఢిల్లీలోని కృషి భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశాన్ని అన్నదాతలు బహిష్కరించారు. ఈ భేటీకి కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్‌తో పాటు, సహాయ మంత్రులు గైర్హాజరు కావడంతో 29 రైతు సంఘాలకు చెందిన ప్రతినిధులు సమావేశాన్ని వాకౌట్ చేసి, వ్యవసాయ చట్టం ప్రతుల్ని చించేశారు. సమావేశానికి పిలిచి అవమానిస్తారా..? వ్యవసాయ చట్టాలపై తమకున్న ఆందోళనల్ని తొలగిస్తామని ఢిల్లీ పిలిచి మరీ తమని పట్టించుకోలేదని రైతు సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కేంద్ర మంత్రులెవరూ ఈ సమావేశానికి హాజరు కానప్పుడు, భేటీని ఎందుకు ఏర్పాటు చేశారు ? కేంద్రం ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోంది’’ అని రైతు సంఘాల సమన్వయ కమిటీ సభ్యుడు దర్శన్ పాల్ చెప్పారు. తమ ప్రశ్నలకు సరైన సమా« ధానాలు ఇవ్వకపోవడంతో వాకౌట్ చేశా మన్నారు. దీనిపై వివాదం రేగడంతో ప్రభుత్వం వివరణ ఇస్తూ, షెడ్యూల్ ప్రకారం ఇది కార్యదర్శుల స్థాయి సమావేవమని పేర్కొంది. రైతులతో చర్చలకు ఎల్లప్పుడూ సిద్ధమేనని, వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. -
బాయ్‌కాట్ కంగనా!
‘‘వారసులను మాత్రమే సల్మాన్ ఖాన్ ప్రోత్సహిస్తాడు. తనకు ఎదురు తిరిగినవాళ్లను హింసిస్తాడు. బాయ్‌కాట్ సల్మాన్ ఖాన్’’ అంటూ ఆ మధ్య బాలీవుడ్లో పెద్ద దుమారం మొదలైంది. ఇప్పుడు ‘బాయ్‌కాట్ కంగనా రనౌత్’ అనే వివాదం ఆరంభమైంది. ‘బాయ్‌కాట్ కంగనా’ అనే పోస్ట్‌ని లక్షమందికి పైగా సమర్థించారు. గంటకు దాదాపు 13 వేలకు పైగా సోషల్ మీడియా ఫాలోయర్స్ ఆమెకు వ్యతిరేకంగా పోస్టులను పెట్టారు. డేటా ఇంటిలిజెన్స్ యూనిట్ ఉదయం పదిగంటల నుండి సాయంత్రం ఆరుగంటల వరకు ఉన్న డేటాను తీసుకుని (డి.ఐ.యూ) కంగనాకి వ్యతిరేకంగా వచ్చిన పోస్టులను లెక్కకట్టింది. అసలు కంగనాను ఎందుకు ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు? అంటే దానికి కారణం లేకపోలేదు. నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యా లేక హత్యా అనే విషయం తేలకముందే బాలీవుడ్ మాఫియానే అతన్ని చంపేసిందని, బాలీవుడ్‌లోని నెపోటిజమే (బంధుప్రీతి) బలి తీసుకుందని ఆరోపణలు చేశారు కంగనా. ఈ ఆరోపణలు నిజమే అని నమ్మిన. కొందరు ఫాలోయర్లు కంగనా వ్యతిరేకించినవారిని (స్టార్స్‌ని) సోషల్ మీడియాలో అన్‌ఫాలో అయ్యారు. అయితే ఇప్పుడు ‘బాయ్‌కాట్ కంగనా’ అనేది వైరల్ అయింది. ‘‘ఇదంతా బాలీవుడ్ మాఫియా చేస్తున్న పనే. స్టార్ కిడ్స్‌ని ప్రోత్సహించడానికి, నా కెరీర్‌ని నాశనం చేయడానికి ఇలా చేస్తున్నారు. అందుకే సోషల్ మీడియాలో బాయ్‌కాట్ కంగనా అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ చేస్తున్నారు’’ అన్నారు కంగనా. అది మాత్రమే కాదు.. త్వరలోనే కొందరి వ్యవహారాలను బయటపెడతా అని కూడా పేర్కొన్నారు. -
కరీనా సినిమాలను బాయ్‌కాట్ చేయాలి
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో బాలీవుడ్లో మొదలైన నెపోటిజంపై చర్చ నేటికీ కొనసాగుతోంది. స్టార్ కిడ్స్‌పై విమర్శలు వెల్లువెత్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లో కరీనా కూడా చేరింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నెపోటిజంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన కరీనా కపూర్‌ను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. కరీనా చిత్రాలను బాయ్‌కాట్ చేయాలంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రముఖ జర్నలిస్టు బర్ఖాదత్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నెపోటిజం చర్చకు రాగా కరీనా స్పందిస్తూ.. ‘బాలీవుడ్లో మాత్రమే నెపోటిజం ఉన్నట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. సుశాంత్ మరణంతో ఇది తారా స్థాయికి చేరింది. స్టార్కిడ్స్ని ఇండస్ర్టీలోకి తెచ్చినప్పుడు ఈ ప్రేక్షకులే కదా వాళ్లని అసలైన స్టార్స్‌గా చేసేది. ఒకరికి స్టార్ ఇమేజ్ తేవాలన్నా, దాన్ని బ్రేక్ చేయాలన్నా అది వారి చేతిలోనే ఉంటుంది. సరే స్టార్ కిడ్స్ సినిమాలు నచ్చకపోతే చూడటం మానేయండి. మిమ్మల్ని ఎవరూ బలవంతంగా సినిమా చూడమని చెప్పరు కదా’ అంటూ ఫైర్ అయ్యారు. (ఓటీటీలో సడక్ 2) కరీనా వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమెకు అహంకారం బాగా పెరిగిందని, ఆమె సినిమాలు బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజన్లు అంతేకాకుండా ఆమె వ్యక్తిగత జీవితంపై కూడా విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. తండ్రి రణ్‌ధీర్ కపూర్, కుమార్తెగా, కరిష్మా కపూర్ సోదరిగా ఇండస్ర్టీలో అడుగుపెట్టిన కరీనా స్టార్ హీరోయిన్గా చలామణి అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమీర్ ఖాన్‌తో కలిసి లాల్ సింగ్ చద్దా సినిమాలో నటిస్తుంది. ఈ ఏడాది డిసెంబర్లో సినిమా విడుదల చేయాలని భావించానా ప్రస్తుతం కరోనా నేపథ్యంలో వచ్చే ఏడాది విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ప్రస్తుతం కరీనా కపూర్పూ ట్రోల్స్ కారణంగా బాయ్‌కాట్ లాల్ సింగ్ చద్దా అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. (లాల్‌సింగ్ వాయిదా పడ్డాడు) #KareenaKapoorKhan Wait. What? Sahi to keh rahi h. Audience banati h. Mat jao na. You people make nepo kids star. Now she is getting trolled for harsh truth she said.#KareenaKapoorKhan pic.twitter.com/eNP3t7j7EV — Mamta Dagar 🇮🇳 (@TheMamtaDagar) August 10, 2020 -
'హిందూ దేవుళ్లను కించపరుస్తున్న నెట్‌ఫ్లిక్స్'
కృష్ణ అండ్ హిజ్ లీల.. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంపై హిందుత్వవాదులు మండిపడుతున్నారు. సినిమాలో దేవుడి పేరు పెట్టుకున్న కృష్ణ అనే వ్యక్తి అనేక మంది అమ్మాయిలతో శారీరక సంబంధాలు పెట్టుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ దేవత పేరు పెట్టుకున్న రాధను కూడా బాధితురాలిగా చూపించారని ఆగ్రహిస్తున్నారు. ఇలాంటి అభ్యంతరకర సన్నివేశాలకు హిందూ దైవాల పేర్లు వినియోగించడమే కాక, హిందూ మతాన్ని కించపరిచే వాటిని ప్రోత్సహిస్తుందంటూ నెట్‌ఫ్లిక్స్‌పై ఆక్రోశం వెల్లగక్కుతున్నారు. దీంతో ట్విటర్లో #BoycottNetflix ట్రెండ్ అవుతోంది. (‘క్రిష్ణ అండ్ హీస్ లీల’ ఫస్ట్‌లుక్ టీజర్) "ఇంతకుముందు వచ్చిన సాక్క్డ్ గేమ్స్, లైలా, ఘౌల్, ఢిల్లీ క్రైమ్ వంటి పలు వెబ్ సిరీస్‌లు హిందూ వ్యతిరేకతను ప్రోత్సహించింది. ఇప్పుడొచ్చిన కృష్ణ అండ్ హిస్ లీల కూడా హిందూ దేవుళ్లను కించపరుస్తోంది", "మా డబ్బుతో, మా విశ్వాసాలకు వ్యతిరేకంగా వెబ్ సిరీస్‌లు తీసేందుకు నెట్ఫ్లిక్స్కుఎంత ధైర్యం? ఒక మనిషిని చంపడం కన్నా వారి నమ్మకాన్ని చంపడమే పెద్ద నేరం. దీన్ని ఎట్టి పరిస్థితిలోనూ సహించం" అంటూ నెటిజన్లు కోపంతో రగిలిపోతున్నారు. మరికొందరు మాత్రం దీనిపై మీమ్స్ చేస్తూ సమస్యను శాంతింప చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాగా రానా దగ్గుబాటి సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన "కృష్ణ అండ్ హిజ్ లీల" చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించారు. శ్రద్దా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలినీ వందికట్టి హీరోయిన్లుగా నటించారు. (మాజీ ప్రియుడి నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ హ్యాక్!) -
‘చాలా కోపంగా ఉన్నాం.. చైనా వాళ్లకు ఇవ్వం’
సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు వ్యతిరేకంగా దేశంలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. చైనా దేశస్థులకు వసతి కల్పించబోమని తాజాగా ఢిల్లీ హోటల్ అండ్ రెస్టరెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ (డీహెచ్‌ఆర్‌ఓఏ) ప్రకటించింది. తమ హోటళ్లు, అతిథి గృహాల్లో చైనీయులకు చోటు కల్పించబోమని గురువారం స్పష్టం చేసింది. డీహెచ్‌ఆర్‌ఓఏలో సభ్యత్వం కలిగిన దాదాపు 3 వేల బడ్జెట్ హోటళ్లలో మొత్తం 75 వేల వరకు గదులు అందుబాటులో ఉన్నాయి. కాగా, చైనా వస్తువులు, సరుకులు విక్రయించబోమని భారత వర్తకుల సంఘం(సీఏఐటీ) ఇప్పటికే ప్రకటించింది. ఈనెల 15న సరిహద్దులో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవానులు అమరులు కావడంతో చైనా వ్యతిరేక నిరసనలు దేశవ్యాప్తంగా మిన్నంటుతున్నాయి. చైనా ఉత్పత్తులు ఉపయోగించం కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ ప్రభావం అన్ని రంగాలతో పాటు హోటళ్ల వ్యాపారంపైనా పడింది. దేశ రాజధానిలో హోటళ్లు, అతిథి గృహాలు పూర్తిస్థాయిలో ఇంకా తెరుచుకోలేదు. చైనా పౌరులకు గదులు అద్దెకు ఇవ్వకూడదన్న తమ నిర్ణయాన్ని అన్ని హోటళ్లు పాటిస్తాయన్న విశ్వాసాన్ని డీహెచ్‌ఆర్‌ఓఏ ప్రధాన కార్యదర్శి మహేంద్ర గుప్తా వ్యక్తం చేశారు. ‘భారత్ పట్ల చైనా వ్యవహరించిన తీరు పట్ల ఢిల్లీ హోటల్ వ్యాపారవేత్తలలో చాలా కోపం ఉంది. దేశవ్యాప్తంగా చైనా వస్తువులను బహిష్కరించాలని సీఏఐటీ సాగిస్తున్న ప్రచారంలో ఢిల్లీ హోటళ్లు, గెస్ట్‌హౌస్‌ల యజమానులు భాగస్వాములు అయ్యారు. నగరంలోని బడ్జెట్ హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లలో చైనా జాతీయులకు వసతి ఇవ్వకూడదని మేము నిర్ణయించుకున్నామ’ని గుప్తా తెలిపారు. తమ హోటళ్లలో చైనా ఉత్పత్తులను ఉపయోగించకూడదని నిర్ణయించినట్టు వెల్లడించారు. (చైనా మైండ్ గేమ్‌కు ఇదే నిదర్శనం) డీహెచ్‌ఆర్‌ఓఏ తీసుకున్న నిర్ణయాలను సీఏఐటీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ స్వాగతించారు. చైనా వస్తువులను బహిష్కరించాలన్న ప్రచారానికి వివిధ రంగాలకు చెందిన వారంతా మద్దతు పలుకుతున్నారని దీని ద్వారా స్పష్టమైందన్నారు. రవాణాదారులు, రైతులు, హాకర్లు, చిన్న తరహా పరిశ్రమలు, వినియోగదారులకు చెందిన జాతీయ సంఘాలను కూడా ఈ ప్రచారంలో భాగస్వాములను చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. (చైనా ఆక్రమణ: మౌనం వీడని నేపాల్!) -
చైనా ఉత్పత్తుల బహిష్కరణ సాధ్యమేనా?
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రకంపనలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం, దేశ సరిహద్దు వద్ద చైనా దుశ్చర్యతో 20 మంది సైనికుల మరణం తరువాత దేశీయంగా చైనాపై ఆగ్రహం మరింత రాజుకుంది. చైనా వస్తువులు, దిగుమతులను నిషేధించి, దాని ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టాలన్న డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ ఇందుకు భిన్నంగా స్పందించింది. చైనా వస్తువులను బహిష్కరించడం సాధ్యం కాకపోవచ్చని వ్యాఖ్యానించింది. చైనా దిగుమతులపై భారత్ ఎక్కువగా ఆధారపడి ఉన్నందున బహిష్కరణ డిమాండ్ నెరవేరకపోవచ్చని గురువారం అభిప్రాయపడింది. అయితే చైనా ఉత్పత్తులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాలని తెలిపింది. (గణేష్ విగ్రహాలు కూడా చైనా నుంచేనా ?) దేశ సరిహద్దు వద్ద చైనాతో ఏర్పడిన వివాదం నేపథ్యంలో భారతదేశ స్వావలంబన అంశంపై ప్రభుత్వానికి మద్దతునిస్తున్నాం, కానీ మనం చాలా కీలకమైన ముడి పదార్థాల కోసం చైనాపై ఆధారపడుతున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ అధ్యక్షుడు శరద్ కుమార్ సారాఫ్ అన్నారు. భారతీయ వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వాలని, చైనా వస్తువులను కొనడం మానేయాలని ప్రభుత్వం భారతీయులను కోరాలి. కానీ చైనా ఉత్పత్తులను నిషేధించడం లేదా బహిష్కరించాలన్న డిమాండ్ అన్ని భారతీయ తయారీదారులను కష్టాల్లోకి నెడుతుందన్నారు. మనం ఎగుమతి చేసే వస్తువులను తయారు చేయడానికి చాలా ముడి పదార్థాలను దిగుమతి చేసుకుంటామని సంస్థ డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ అన్నారు. (బాయ్ కాట్ చైనా : సీఏఐటీ మరో అడుగు) కాగా చైనా ఉత్పత్తులను బహిష్కరించాలనే ప్రచారంలో ముందంజలో ఉన్న ట్రేడ్ బాడీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) 'చైనాను బహిష్కరించండి' అంటూ దేశీయ టాప్ పారిశ్రామికవేత్తలకు ఒక లేఖ రాసిన సంగతి తెలిసిందే. -
బాయ్ కాట్ చైనా : సీఏఐటీ మరో అడుగు
సాక్షి, న్యూఢిల్లీ : చైనా ఉత్పత్తులను బహిష్కరించాలనే ప్రచారంలో ముందంజలో ఉన్న ట్రేడ్ బాడీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) మరో కీలక అడుగు వేసింది. కరోనా విస్తరణ, సరిహద్దు ఉద్రిక్తత నేపథ్యంలో 'చైనాను బహిష్కరించండి' అంటూ దేశీయ టాప్ పారిశ్రామికవేత్తలకు ఒక ఈ లేఖ రాసింది. చైనా వస్తువులను ఉపయోగించడం మానుకోవాలంటూ అంబానీ, టాటా, గోద్రేజ్, ప్రేమ్‌జీ, మిట్టల్‌కు తదితర 50 మంది దిగ్గజాలనుద్దేశించి సీఏఐటీ ఈ లేఖ రాసింది. భారత ప్రజలు విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా, భారతీయ పరిశ్రమ కెప్టెన్లలో ఒకరిగా భావిస్తారనీ తామూ అదే నమ్ముతున్నామని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ ఈ లేఖలో పేర్కొన్నారు. అందుకే ఈ ప్రచారంలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాం. చైనా ఆధిపత్యాన్ని తగ్గించడం ద్వారా ప్రపంచ సూపర్ పవర్‌గా భారత ప్రయాణాన్ని పునర్నిర్మించే ఈ సామూహిక ఉద్యమంలో మనస్ఫూర్తిగా పాల్గొనాలని, సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. ఇది భారతదేశాన్ని 'స్వయం ఆధారిత భారత్' గా మార్చడానికి దేశంలోని ఇతర పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహాన్నిస్తుందని ప్రవీణ్ అభిప్రాయపడ్డారు. ఈ లేఖను పంపిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల జాబితాలో ముకేశ్ అంబానీ, రతన్ టాటా, ఆది గోద్రెజ్, అజీం ప్రేమ్ జీ, కుమారం మంగళం బిర్లా, ఆనంద్ మహీంద్ర, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, గౌతమ్ అదానీ, అజయ్ పిరమల్, విక్రమ్ కిర్లోస్కర్, సునీల్ భారతి మిట్టల్, రాహుల్ బజాజ్, శివ్ నాదర్, పల్లోంజి మిస్త్రీ, ఉదయ్ కోటక్, నుస్లీ వాడియా, శశి మధుకర్ పరేఖ్, హర్ష్ మారివాలా, డాక్టర్ సతీష్ రెడ్డి, పంకజ్ పటేల్ , నీలేష్ గుప్తా తదితరులు ఉన్నారు. కాగా ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, సౌరశక్తి వంటి వ్యాపారాలు చైనా దిగుమతులు, ప్రధానంగా విడిభాగాల దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. అలాగే స్మార్ట్ఫోన్లు, ఔషధాలు, పునరుత్పాదక ఇంధనం, ఆటోమొబైల్స్ వంటి ఎలక్ట్రానిక్స్ వంటివి కూడా చైనా దిగుమతులపై ఎక్కువగా ఆధారపడతాయి, దీంతో చైనా దిగుమతులు, వస్తువుల నిషేధం అంశంపై పరిశ్రమ వర్గాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అంతేకాదు మారుతి, బజాజ్ వంటి ఆటో సంస్థలు చైనా నుండి దిగుమతులను తగ్గించడం రాత్రికి రాత్రికి సాధ్యం కాదని ఇప్పటికే బహిరంగంగా ప్రకటించాయి. గత 15 సంవత్సరాలకు పైగా చైనా వస్తువులను దిగుమతి చేసుకుంటున్నాం. భారీ పెట్టుబడులు పెట్టాం. చాలా విశ్వసనీయమైన, స్నేహితులున్నారు. అకస్మాత్తుగా నిలిపివేయాలంటే ఎలా అని బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ప్రశ్నించారు. ఒక సంస్థగా, దేశంగా ఇది ఎంత వరకు సబబో మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్నారు. మరోవైపు రాబోయే 3 సంవత్సరాల్లో ఆటోమోటివ్ రంగంలో విడి భాగాల దిగుమతులు, ఇతర సాధనాలపై ఆధారపడటాన్ని సగానికి తగ్గించడం సాధ్యమని ఎం అండ్ ఎం మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా అభిప్రాయపడ్డారు. చైనాలోని వ్యూహాన్ నుంచి కరోనా ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం, సరిహద్దు వెంబడి చైనా దుశ్చర్య కారణంగా గాల్వన్ ప్రావిన్స్‌లో 20 మంది సైనికుల మరణం తరువాత చైనా బహిష్కరణ ప్రచారాన్ని సీఏఐటీ ఉధృతం చేసింది. దాదాపు 500 ఉత్పత్తులను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. 2021 డిసెంబర్ నాటికి 100,000 కోట్ల (13.3 బిలియన్ డాలర్లు) రూపాయల దిగుమతులను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2019-20లో చైనా నుండి 65.26 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను భారతదేశం దిగుమతి చేసుకుంది. 2019-20లో 81.86 బిలియన్ డాలర్లకు పైగా ద్వైపాక్షిక వాణిజ్యంలో చైనా ఇండియాకు రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది.