న్యూఢిల్లీ: మాల్దీవులపై భారత్ ఇచ్చిన బాయ్‌కాట్ కాల్‌పై ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ ఇచ్చిన బాయ్‌కాట్ పిలుపుతో మాల్దీవుల పర్యాటకంపై భారీ ప్రభావం పడిందని చెప్పారు. ఈ విషయమై ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న నషీద్ మీడియాతో మాట్లాడారు. ‘భారత్ బాయ్‌కాట్ పిలుపు మాల్దీవుల పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపింది.
దీనిపై నేను చాలా ఆందోళన చెందుతున్నాను. ఇందుకు క్షమాపణలు చెబుతున్నాను. హాలీడేస్‌కు భారత ప్రజలు మాల్దీవులకు రావాలని కోరుకుంటున్నాను. మా ఆతిథ్యంలో ఎలాంటి తేడాలుండవు. భారత్, మాల్దీవుల సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలి. ఈ పర్యటనలో ప్రధాని మోదీని కూడా కలిశాను. నేను మోదీకి పెద్ద మద్దతుదారును. ఆయనకు ఆల్ ద బెస్ట్ చెబుతున్నాను’అని నషీద్ తెలిపారు.
మాల్దీవుల నుంచి భారత సైన్యం వైదొలగాలని ప్రస్తుత అధ్యక్షుడు మహ్మద్ మిజ్జు తీసుకున్న నిర్ణయంపైనా నషీద్ స్పందించారు. దీనిపై ఇరు దేశాలు చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కాగా, చైనా మద్దతుదారుగా పేరున్న ప్రస్తుత మాల్దీవుల ప్రధాని మిజ్జు ఈ నెల 10లోగా భారత సైన్యం మాల్దీవులను విడిచి వెళ్లాలని డెడ్‌లైన్ పెట్టిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి.. గాజాలో దారుణం.. తిండి కోసం ఎదురు చూస్తున్నవారిపై పారాచూట్
Comments
Please login to add a commentAdd a comment