maldives
-
‘గోల్’తో ఛెత్రి పునరాగమనం
షిల్లాంగ్: అంతర్జాతీయ ఫుట్‌బాల్ పునరాగమనంలో భారత జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి గోల్‌తో మెరిశాడు. ఫలితంగా 12 మ్యాచ్‌ల నుంచి విజయం లేకుండా సాగుతున్న భారత ఫుట్‌బాల్ జట్టు ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. బుధవారం జరిగిన అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్‌లో భారత్ 3–0 గోల్స్ తేడాతో మాల్దీవులుపై నెగ్గింది. భారత్ తరఫున రాహుల్ (35వ నిమిషంలో), లిస్టన్ కొలాకో (66వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. గత ఏడాది జూన్‌లో అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన 40 ఏళ్ల ఛెత్రి 77వ నిమిషంలో గోల్ చేసి జట్టు ఆధిక్యాన్ని మరింత పెంచాడు. ఛెత్రి కెరీర్లో ఇది 95వ అంతర్జాతీయ గోల్. తన రిటైర్మెంట్ తర్వాత జాతీయ జట్టు పేలవ ప్రదర్శన కారణంగా ఛెత్రి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. 286 రోజుల అనంతరం ‘బ్లూ జెర్సీ’లో మైదానంలో అడుగు పెట్టాడు. సునీల్‌కు ఇది 152వ మ్యాచ్ కాగా... 16 నెలల తర్వాత భారత జట్టు తొలి విజయం నమోదు చేసుకుంది. మొనొలో భారత ఫుట్‌బాల్ జట్టు హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం జట్టుకు ఇదే మొదటి గెలుపు. భారత జట్టు చివరిసారిగా ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయింగ్ రౌండ్లో భాగంగా 2023 నవంబర్ 16న కువైట్‌పై విజయం సాధించింది. -
మాల్దీవుల్లో చిల్ అవుతున్న రోహిత్ శర్మ (ఫోటోలు)
-
తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ
సాక్షి, అమరావతి: పర్యాటక రంగమే కీలక ఆదాయ వనరుగా ఉన్న మాల్దీవుల ప్రభుత్వం భారతీయుల రాకపై ఆశలు పెట్టుకుంది. భారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం ఎన్నడూ లేనివిధంగా వినూత్న నిర్ణయాలతో అడుగులు వేస్తోంది. 2023లో మాల్దీవుల మంత్రులు భారత ప్రధాని మోదీపై అవమానకర రీతిలో విమర్శలు చేశారు. దీంతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ పర్యాటకులు ఘాటుగా స్పందించి మాల్దీవుల పర్యాటకాన్ని బహిష్కరించారు. చాలా ట్రావెల్ కంపెనీలు సైతం మాల్దీవుల పర్యాటకాన్ని బ్లాక్ లిస్టు చేశాయి. దీంతో మాల్దీవుల పర్యాటకంలో కీలకంగా ఉండే భారతీయులు భారీగా తగ్గిపోయారు. ఫలితంగా ఆదాయ వనరులు క్షీణించడంతో పాటు అక్కడి స్థానికుల ఉపాధికి తీవ్ర విఘాతం ఏర్పడింది. ఈ క్రమంలో దౌత్య సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు గత అక్టోబర్‌లో మాల్దీవులు అధ్యక్షుడు ముయిజు భారతదేశాన్ని సందర్శించారు. ఈ తర్వాత రెండు నెలల్లో పర్యాటకుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. 3 లక్షల మందిని ఆకర్షించే లక్ష్యంతో.. మాల్దీవుల పర్యాటకంలో భారతీయలే అగ్రస్థానంలో ఉండేవారు. కోవిడ్–19 తర్వాత 2020–23 వరకు ఇదే పరిస్థితి ఉండేది. కానీ.. దౌత్య సంబంధాలు దెబ్బతిన్న తర్వాత మాల్దీవులకు భారతీయ పర్యాటకులు తగ్గిపోయారు. 2023లో 18.87 లక్షల మంది విదేశీ పర్యాటకులు మాల్దీవులకు వెళ్లగా.. గతేడాది 20.46 లక్షలకు పెరిగారు. ఇందులో చైనా మొదటి స్థానం, రష్యా రెండో స్థానంలో నిలిచింది. గత ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు ద్వీప సమూహ దేశానికి భారత పర్యాటకుల సందర్శనలు తగ్గిపోయాయి. 2023లో 2.09 లక్షల మంది పర్యటిస్తే 2024లో 1.30 లక్షలకు పడిపోయారు. 2024లో ఆక్కడి పర్యాటకం 6వ స్థానానికి పడిపోయింది. ఈ క్రమంలో భారతీయులపై గంపెడాశలు పెట్టుకున్న మాల్దీవుల ప్రభుత్వం ఈ ఏడాది 3 లక్షల మంది భారతీయ పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో ప్రణాళికలు వేస్తోంది.విమాన సర్వీసులు పెంపుభారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు నెలవారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు మాల్దీవుల ప్రభుత్వం ప్రకటించింది. దేశీయ మీడియాలో విస్తృత ప్రచారంతో పాటు బ్రాండ్ అంబాసిడర్‌ను నియమించాలని భావిస్తోంది. ఇక మాల్దీవుల్లో క్రికెట్ వేసవి శిబిరాలను కూడా నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. పర్యాటకులకు సౌకర్యాలను మెరుగుపరచడంలో భాగంగా భారతదేశంలోని మరిన్ని గమ్యస్థానాల నుంచి విమాన సర్వీసులు నడిపేందుకు చర్యలు చేపడుతోంది. కోల్‌కతా, పుణె, చెన్నై వంటి కొత్త గమ్యస్థానాల నుంచి విమానాలు నడపనుంది. -
ఆర్థిక సంక్షోభంలో మాల్దీవులు.. స్పందించిన భారత్
మాల్దీవులు భారీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఆ దేశ ఆర్థిక పరిస్థితి పాకిస్తాన్, శ్రీలంక మాదిరిగా ఉండబోతోంది. మాల్దీవులలో పెరుగుతున్న ఆర్థిక సంక్షోభానికి సంబంధించిన వివరాలను తెలుసుకుంటున్నామని భారత్ తెలిపింది. రుణ సంక్షోభం కారణంగా మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది.భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాల్దీవులలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఆ దేశంలో నెలకొన్న పరిస్థితికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామన్నారు. మాల్దీవుల ప్రభుత్వం ఇటీవల భారత్‌తో కుదుర్చుకున్న ఒప్పందాల గురించి కూడా జైస్వాల్ ప్రస్తావించారు. మాల్దీవుల ఆర్థిక పరిస్థితుల కారణంగా భారత్‌కు ఆదాయ నష్టం జరుగుతున్నదని, ఇది ఆందోళన కలిగించే అంశమని జైస్వాల్ పేర్కొన్నారు.బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ)మధ్య జరగనున్న చర్చల గురించి జైస్వాల్ మాట్లాడుతూ పరస్పర అంగీకారంతో కూడిన ఈ ఒప్పందాలను గౌరవించాలని భారత్ భావిస్తున్నదన్నారు. ఫిబ్రవరి 17 నుండి 20 వరకు న్యూఢిల్లీలో బీఎస్ఎఫ్- బీజేబీ మధ్య డైరెక్టర్ జనరల్ స్థాయి చర్చలు జరగనున్నాయి. ఇవి సరిహద్దు భద్రతా దళాల మధ్య సయోధ్య పరిస్థితులకు సహకరిస్తాయి. భద్రత, వాణిజ్య మౌలిక సదుపాయాల కల్పనను సులభతరం చేయనున్నాయి.ఇది కూడా చదవండి: నాడు నెలకు 10 వేలు.. నేడు లక్షలు.. సందీప్ జీవితం మారిందిలా.. -
కోవ్.. కేక!
గోవిందరావుపేట: చుట్టూ నీళ్లు.. మధ్యలో ఉన్న దీవిలో అందమైన కుటీరాలు.. వాటిల్లో లోకాన్ని మరిచి సేదదీరేందుకు అద్భుతమైన వసతులు.. ఈ సీన్ ఊహించుకోగానే ఏ మాల్దీవులో ఠక్కున గుర్తుకొస్తున్నాయి కదా? కానీ.. ఆ అనుభూతిని ఆస్వాదించేందుకు అంతదూరం వెళ్లాల్సిన పనిలేదు. తెలంగాణ రాష్ట్రంలోనే అంతటి అందాల ప్రదేశం ఉంది.అదే లక్నవరం చెరువు. లక్నవరం చెరువులో ఇప్పటికే ఉన్న అందమైన దీవులకు అదనంగా టీఎస్‌టీడీసీ, ఫ్రీకోట్స్ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో ‘ది కోవ్’రిసార్ట్స్ పేరుతో మూడో ద్వీపాన్ని తీర్చిదిద్దాయి. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామ పరిధిలో ఉన్న ఈ జలాశయంలోని కొత్త ఐలాండ్ పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటోంది. రూ.7 కోట్ల వ్యయంతో మూడెకరాల విస్తీర్ణంలో 21 కాటేజీలతో తీర్చిదిద్దిన ఈ దీవి 2024 నవంబర్లోనే అందుబాటులోకి వచి్చంది. వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ గేమ్స్ ది కోవ్ రిసార్ట్‌లో పర్యాటకులు ఆటలతో ఉల్లాసంగా గడపడానికి జల క్రీడలు, సాహస కార్యకలాపాలు, కృత్రిమ బీచ్, బాక్స్ క్రికెట్, షటిల్ కోర్టులు, ఈత కొలనులు, క్యాంపింగ్ జోన్లు ఏర్పాటు చేశారు. మాల్దీవుల్లో ఉన్న అనుభూతిని కలిగించేలా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. దీంతో టూరిస్టుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ద్వీపం మాల్దీవులు, మున్నార్, గోవా, అండమాన్ దీవులను తలపిస్తోందని పర్యాటకులు చెబుతున్నారు.ఇవీ ప్రత్యేకతలు.. ఒక్కో కాటేజీలో నలుగురు బస చేయవచ్చు. వ్యక్తిగత కాటేజీలకు ఈత కొలనులు నిర్మించారు. పిల్లల కోసం ప్రత్యేకంగా ఈత కొలనులు, ఆట వస్తువులు ఉన్నాయి. పెద్దల కోసం రెండు స్పాలు, రెస్టారెంట్ ఉన్నాయి. ఈ కాటేజీల్లో ఒకరోజు (24 గంటలు) బస చేయడానికి అద్దె రూ.5,000 నుంచి రూ.15, 000 వరకు వసూలు చేస్తున్నారు.పొంచి ఉన్న నీటి సమస్య పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న లక్నవరం సరస్సుకు త్వరలోనే నీటి సమస్య ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. చెరువు కింద 4,150 ఎకరాల ఆయకట్టు భూములకు యాసంగి పంట కోసం నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఫిబ్రవరి నుంచి సరస్సులో నీటి మట్టం తగ్గిపోయి సరస్సు అడుగంటే ప్రమాదం ఉంది.అదే జరిగితే వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ గేమ్స్ మూలనపడ నున్నాయి. -
భారత్ 11 మాల్దీవులు 1
బెంగళూరు: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) స్నేహపూర్వక మ్యాచ్‌లో మరోసారి భారత మహిళల జట్టు అదరగొట్టింది. తొలి పోరులో 14–0తో మాల్దీవులును చిత్తు చేసిన భారత్... గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో 11–1 గోల్స్ తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్ ద్వారానే జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసిన ఫార్వర్డ్ ప్లేయర్ లింగ్డైకిమ్ (12వ, 16వ, 56వ, 59వ నిమిషాల్లో) నాలుగు గోల్స్‌తో విజృంభించింది. సిమ్రన్ గురుంగ్ (62వ, 68వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో సత్తా చాటింది. మరో అరంగేట్ర ప్లేయర్ సిబాని దేవి (45+1వ నిమిషంలో)తో పాటు కాజల్ డిసౌజా (15వ ని.లో), పూజ (41వ ని.లో), భూమిక దేవి (71వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. మాల్దీవుల తరఫున మరియం రిఫా (27వ ని.లో) ఏకైక గోల్ సాధించగా... ఆ జట్టు కెప్టెన్ హనీఫా (17వ నిమిషంలో) సెల్ఫ్ గోల్ చేసి భారత్ ఆధిక్యాన్ని మరింత పెంచింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి 6–1తో ఆధిక్యంలో నిలిచిన భారత జట్టు... ద్వితీయార్ధంలో కూడా అదే జోరు కొనసాగిస్తూ ప్రత్యరి్థకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా తిరుగులేని విజయం సాధించింది. -
వెడ్డింగ్ డే మూడ్: మాల్దీవుల్లో హన్సిక మోత్వానీ జిల్జిల్ జిగా (ఫోటోలు)
-
బిజినెస్‌మ్యాన్ బర్త్ డే పార్టీలో చిరు-మహేశ్-వెంకటేశ్ ఫుల్ చిల్ (ఫొటోలు)
-
Syed Asifa: దీపస్తంభం
‘శక్తి’ అనే మాటకు ఎన్నో కోణాలలో ఎన్నో నిర్వచనాలు ఉన్నాయి. ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్ మాటల్లో ‘శక్తి’కి నిర్వచనం ‘లక్ష్యం కోసం ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకపోవడం’. అలాంటి ‘శక్తి’ సయ్యద్ ఆసిఫాలో ఉంది. బాడీ బిల్డింగ్‌లో ‘రాణి’స్తున్న ఆసిఫా ఎంతోమంది యువతులకు స్ఫూర్తిని ఇస్తోంది. ఈ నెల 5 నుంచి 11 వరకు మాల్దీవులలో జరిగే వరల్డ్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్–2024లో 52 దేశాలు పాల్గొనబోతున్నాయి. ఈ పోటీకి తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక మహిళ సయ్యద్ ఆసిఫా...‘పెళ్లికి ముందు ప్రపంచాన్ని జయించాలని కల కంటాం. పెళ్లయిన తరువాత ఇల్లే ప్రపంచం అవుతుంది’ అనేది చాలామంది గృహిణుల నోటినుంచి నిరాశ నిండిన చమత్కారంతో వినిపించే మాట. ఆ చమత్కారం మాట ఎలా ఉన్నా... ఎంతోమంది ప్రతిభావంతులైన మహిళలు పెళ్లి తరువాత కలలకు తెర వేసి, ఇంటి నాలుగు గోడలకే పరిమితం అవుతున్నారనేది అక్షర సత్యం. అయితే కొందరు మాత్రం‘ఇలాగే జరగాలని లేదు. ఇలా కూడా జరుగుతుంది’ అని తమ విజయాలతో నిరూపిస్తారు. సయ్యద్ ఆసిఫా ఈ కోవకు చెందిన మహిళ.ప్రకాశం జిల్లా కంభం పట్టణానికి చెందిన ఆసిఫా పెళ్లయిన తరువాత ఇల్లే లోకం అనుకోలేదు. ఒక కల కన్నది. ఆ కలను నిజం చేసుకుంది. బీ ఫార్మసీ చేస్తున్నప్పుడు కంభం పట్టణానికి చెందిన మిలిటరీలో పనిచేసే మొఘల్ అన్వర్ బేగ్‌తో ఆసిఫా వివాహం జరిగింది. చదువుపై ఆమె ఇష్టం బీఫార్మసీ పూర్తి చేసేలా చేసింది. ఆ తరువాత ఎంబీఎ పూర్తి చేసింది. చదువుల విషయంలో భర్త ఏరోజూ అభ్యంతరం చెప్పలేదు. తానే చదువుతున్నంత సంతోషపడేవాడు.‘పెళ్లికిముందు తల్లిదండ్రులు ప్రోత్సహించినట్లుగా, పెళ్లయిన తరువాత భర్త ప్రోత్సాహం ఉండాలి. ఆ ఉత్సాహంతో ఎన్నో విజయాలు సాధించవచ్చు’ అంటుంది ఆసిఫా. చదువు పూర్తయిన తరువాత ఒక ప్రముఖ ఫార్మా కంపెనీలో జనరల్ మేనేజర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించింది. ‘ఇక చాలు’ అనుకొని ఉంటే ఆసిఫా దేశదేశాలకు వెళ్లేది కాదు. విజేతగా ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చి ఉండేది కాదు.ఒకానొక రోజు ‘బాడీ బిల్డింగ్’పై తన ఆసక్తిని భర్తకు తెలియజేసింది ఆసిఫా. ‘ఇప్పుడు ఎందుకు ... ఉద్యోగ బాధ్యతలు, మరోవైపు బాబును చూసుకోవాలి’ అని ఆయన నిరాశపరిచి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదుగానీ ‘నువ్వు కచ్చితంగా సాధించగలవు’ అని ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ ధైర్యంతోనే ముందడుగు వేసింది ఆసిఫా.ప్రముఖ అమెరికన్ బాడీ బిల్డింగ్ చాంపియన్ కొరినా ఎవర్సన్ గ్రాడ్యుయేషన్ చేసింది. పెళ్లయిన తరువాత ‘బాడీ బిల్డింగ్’ వైపు వెళ్లింది. ‘ఇప్పుడు ఏమిటీ! బాడీ బిల్డింగ్ ఏమిటీ!!’ అన్నట్లుగా మాట్లాడారు చాలామంది. వీలైనంతగా వెటకారాలు కూడా చేశారు. ‘రెస్పాన్స్ ఇలా వస్తుంది ఏమిటీ’ అని ఆమె వెనకడుగు వేయలేదు. జిమ్ వైపే అడుగులు వేసింది.‘నేను కూడా వస్తాను’ అంటూ భర్త ఆమెతోపాటు మాడిసన్లోని ‘ఎర్నీ’ జిమ్‌కు వెళ్లి ప్రాక్టీస్ చేసేవాడు. ఆమె శ్రమ వృథా పోలేదు. 1980లో ‘మిస్ మిడ్ అమెరికా’గా మొదలైన ఆమె విజయ పరంపర రిటైరయ్యే వరకు అజేయంగా కొనసాగింది. కొరినా ఎవర్సన్లాంటి ఎంతోమంది విజేతలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లిన ఆసిఫా వెటకారాలను పట్టించుకోలేదు. ఆమె సాధన వృథా పోలేదు. బాడీబిల్డింగ్‌లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించి తిరుగులేని విజేతగా నిలిచింది.బాడీ బిల్డింగ్‌లోకి అడుగు పెట్టకముందు ఎంబీఏ చదివే రోజుల్లో జైపూర్‌లో జరిగిన ఈత పోటీల్లో వెండి పతకం సాధించింది ఆసిఫా. ఆ సమయంలో ఎంతోమంది నోటినుంచి వినిపించిన ‘కంగ్రాచ్యులేషన్స్’ అనే మాట తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆనాటి ఆ ఉత్సాహమే శక్తిగా మారి నలుగురు గొప్పగా మాట్లాడుకునేలా ‘బాడీ బిల్డింగ్ ఛాంపియన్’ను చేసింది. ట్రాక్ రికార్డ్→ 2019లో ఆసిఫా బాడీ బిల్డింగ్‌లో శిక్షణ మొదలు పెట్టింది → 2023లో తెలంగాణలో జరిగిన రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్ పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచింది → 2023లో గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీలలో పతకాలు గెలుచుకుంది → 2024లో ‘సౌత్ ఇండియన్ చాంపియన్ షిప్’లో ప్రథమ స్థానంలో నిలిచింది. అర్జున కలఅర్జున అవార్డు సాధించడమే లక్ష్యంగా కష్టపడుతున్నాను. అర్జున అవార్డు సాధించాలంటే మూడు సార్లు వరల్డ్ చాంపియన్ షిప్ సాధించాల్సి ఉంటుంది. అందుకోసం కష్టపడి సాధన చేస్తున్నాను. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి. ఇందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం కావాలి. పెళ్లి తర్వాత భర్త ప్రోత్సహించాలి. నా భర్త ప్రోత్సాహంతో నేను ఈ స్థాయికి రాగలిగాను. అందరూ ప్రోత్సహిస్తే ప్రతి ఇంటికి ఒక మెడల్ వచ్చే అవకాశం ఉంటుంది.– సయ్యద్ ఆసిఫా– ఖాదర్ బాష, సాక్షి, కంభం, ప్రకాశం జిల్లా -
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి జాన్వీ కపూర్ మాల్దీవులు ట్రిప్? (ఫొటోలు)
-
PM Narendra Modi: ఏ కష్టమొచ్చినా మేమున్నాం
న్యూఢిల్లీ: చైనా పంచన చేరి భారత్‌పై ద్వేషం పెంచుకున్న మాల్దీవులు ఇప్పుడు మళ్లీ భారత్‌తో మైత్రిబంధం బలోపేతానికి ముందడుగు వేసింది. పెట్టుబడులు, పర్యాటకం ద్వారా తమ ఆర్థికాభివృద్ధికి తోడ్పాడాలని స్నేహహస్తం అందించింది. నాలుగు నెలల వ్యవధిలోనే మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు భారత్‌లో రెండోసారి పర్యటించడం ఈ పెనుమార్పుకు అద్దం పడుతోంది. స్నేహహస్తం అందించిన ఏ దేశానికైనా సాదర స్వాగతం పలికే భారత్ మరోసారి తన స్నేహశీలతను చాటుకుంది. వేల కోట్ల రూపాయల ఆర్థికసాయం అందిస్తూనే మాల్దీవుల్లో సోమవారం రూపే కార్డు సేవలను ప్రారంభించింది. మాల్దీవుల్లో ఎయిర్‌పోర్టుల అభివృద్ధి ప్రాజెక్ట్, ఇరుదేశాల మధ్య మరింత అనుసంధానత, పర్యాటకం వృద్ధి కోసం భారత ప్రధాని మోదీ, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు సమాలోచనలు జరిపారు. సోమవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్ వీరి ద్వైపాక్షిక భేటీకి వేదికైంది. తొలుత రాష్ట్రపతి భవన్లో ముయిజ్జుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్వాగతం పలికారు. తర్వాత మోదీ, ముయిజ్జు ద్వైపాక్షిక చర్చలు జరిపాక ఇద్దరూ సంయుక్త ప్రకటన విడుదలచేశారు. మాల్దీవులకు దాదాపు రూ.3,360 కోట్ల ఆర్థికసాయం ప్రకటించారు. సాయం చేసేందుకు సదా సిద్ధం ‘‘ మాల్దీవులు మాకు అత్యంత సమీప పొరుగుదేశం. భారత పొరుగుదేశాల విధానం, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్(సాగర్) దార్శనికతలో మాల్దీవులు మాకు అత్యంత ప్రధానం. మాల్దీవులపై భారత్ ఎల్లప్పుడూ స్నేహభావాన్నే వెదజల్లింది. గతంలో ఎప్పుడు కష్టమొచ్చినా మొట్టమొదట ఆదుకునేందుకు భారతే ముందు కొచ్చింది. కోవిడ్ సంక్షోభకాలంలోనూ ఆదుకున్నాం. పొరుగుదేశంగా అన్ని బాధ్యతల్ని నెరవేర్చాం. ఏ కష్టమొచ్చినా ఆదుకునేందుకు మేమున్నాం’’ అని మోదీ అన్నారు. ఈ సందర్భంగా మాల్దీవుల్లో రూపే కార్డ్ సర్వీసులను మోదీ, ముయిజ్జులు వర్చువల్‌గా ప్రారంభించారు. 700 ఇళ్ల అప్పగింత రూ.3,000 కోట్ల విలువైన దిగుమతులను స్థానిక కరెన్సీల్లో చెల్లించేలా ఇరుదేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. హనీమధో ఎయిర్‌పోర్ట్‌లో నూతన రన్‌వేనూ ప్రారంభించారు. హల్హమేలో నిర్మించిన 700 ఇళ్లను భారత్ మాల్దీవులకు అప్పగించింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న మాల్దీవుల్లో పోర్టులు, రోడ్ల నెట్వర్క్, పాఠశాలలు, గృహ ప్రాజెక్టుల్లో సాయపడేందుకు భారత్ అంగీకారం తెలిపింది. థాంక్యూ మోదీజీ: ముయిజ్జు ఆర్థిక సాయం ప్రకటించిన భారత్‌కు మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ కష్టకాలంలో కీలక భాగస్వామిగా భారత్ మమ్మల్ని ఆదుకుంటోంది. పర్యాటకం అభివృద్ధికి భారత్ సాయపడాలి. ఎందుకంటే మాల్దీవుల్లో పర్యాటకానికి భారతే ప్రధాన వనరు. పెద్ద ఎత్తున భారతీయులు మా దేశంలో పర్యటించాలి’’ అని ముయిజ్జు అన్నారు. ఈ సందర్భంగా తమ దేశంలో పర్యటించాలని ప్రధాని మోదీని ముయిజ్జు కోరారు. మంగళవారం ఆగ్రా, ముంబైలో, బుధవారం బెంగళూరులో ముయిజ్జు పర్యటిస్తారు. -
మాల్దీవ్స్ అధ్యక్షుడి యూటర్న్.. భారత్‌తో సంబంధాలపై కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్ మయిజ్జు భారత్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా భారత్-మాల్దీవుల సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీతో మాల్దీవులు బలమైన, వ్యూహాత్మక సంబంధాలను కొనసాగిస్తుందని పేర్కొన్నారు. భారత్ తమకు విలువైన భాగస్వామి మాత్రమే కాకుండా మంచి స్నేహితుడని తెలిపారు. పరస్పర గౌరవంతో తమ సంబంధం ఏర్పడినట్లు చెప్పారు.తమ దేశ ‘ మాల్దీవ్స్ ఫస్ట్’ విధానం భారత్‌లో దాని దీర్ఘకాల సంబంధాలకు ఎలాంటి ఆటంకం కలిగించదని స్పష్టం చేశారు. ముఖ్యంగా భారత భద్రతా ప్రయోజనాలను దెబ్బతీసేలా మాల్దీవులు వ్యవహరించబోదని పేర్కొన్నారు. రక్షణ సహా పలు రంగాల్లో సహాకారానికి ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.అంతర్జాతీయ సంబంధాల్లో వైవిధ్యతను చూపడం మాల్దీవులకు చాలా అవసరమని, అలాగే ఏ ఒక్క దేశంపైనా అతిగా ఆధారపడటం తగ్గించుకోవాల్సిఉందన్నారు. అయితే దాని వల్ల భారత ప్రయోజనాలు దెబ్బతినవని తెలిపారు. ఈ సందర్భంగానే భారత టూరిస్టులకు ఆహ్వానం పలికారు. భారత టూరిస్టులు తమ దేశంలో పర్యటించాలని, వారు తమ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతున్నారని తెలిపారు.చదవండి: ఇజ్రాయెల్ నగరంపై హెజ్బొల్లా వైమానిక దాడులు#WATCH | Delhi: Prime Minister Narendra Modi receives Maldives President Mohamed Muizzu at Hyderabad House. The two leaders are holding a meeting here.(Video: DD News) pic.twitter.com/P3oE9MVRay— ANI (@ANI) October 7, 2024 కాగా నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మయిజ్జు ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. మాల్దీవుల ప్రథమ మహిళ సాజిదా మొహమ్మద్ కూడా మొయిజ్జు వెంట ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం రాష్ట్రపతి భన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజ్‌ఘట్ వద్ద మహాత్వాగాంధీకి నివాళులు అర్పించారు. తర్వాత హైదరాబాద్ హౌజ్‌లో ప్రధానితో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. కాగా నాలుగు నెలల్లో మొయిజ్జు భారత్‌కు రావడం ఇది రెండోసారి కాగా.. ఇదే తొలి ద్వైపాక్షిక పర్యటన. ఇక చైనా అనుకూలుడుగి పేరున్న మయిజ్జు హయాంలో రెండు దేశాల మద్య సంబంధాలు దెబ్బతిన్నాయి. గతేడాది నవంబర్‌లో మయిజ్జు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారత్‌కు రావడం ఇది రెండోసారి. ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇతర దేశాధినేతలతో మయిజ్జు హాజరయ్యారు. ప్రస్తుతం మాల్దీవులు ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్నందుకున్న భారత్‌తో దెబ్బతిన్న సంబంధాలను తిరిగి గాడిన పెట్టేందుకు మయిజ్జు ప్రయత్నిస్తున్నారు. -
భారత్ చేరుకున్న మాల్దీవులు అధ్యక్షుడు
ఢిల్లీ: ఐదురోజులు పర్యటనలో భాగంగా మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు భారత్ చేరుకున్నారు. ఆయన సతీమణి షాజిదా మహ్మద్‌తో కలిసి మొయిజ్జు.. ఆదివారం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగారు. వారికి కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు ఇతర సీనియర్ ఉన్నతాధికారులతో ఆయన భేటీ కానున్నారు. మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ద్వైపాక్షిక చర్చల కోసం మొయిజ్జు భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి.A warm welcome to President @MMuizzu of Maldives as he arrives in New Delhi on a State Visit to India.Received by MoS @KVSinghMPGonda at the airport.The visit will provide further boost to this long-standing 🇮🇳-🇲🇻 comprehensive bilateral partnership.#NeighbourhoodFirst pic.twitter.com/FHoNN4C0U3— Randhir Jaiswal (@MEAIndia) October 6, 2024 ‘‘మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జుకు భారతదేశ పర్యటనలో న్యూ ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో మొయిజ్జు దంపతులకు కేంద్రమంత్రి కీర్తి వర్ధన్ సింగ్ స్వాగతం పలికారు. ఈ పర్యటన భారత్-మాల్దీవులు మధ్య ద్వైక్షిక భాగస్వామ్యానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుంది’’ అని భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి రణ్‌దీర్ జైశ్వాల్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.EAM S Jaishankar tweets, "Pleased to call on President Mohammed Muizzu today at the start of his State Visit to India. Appreciate his commitment to enhance the India-Maldives relationship. Confident that his talks with PM Narendra Modi tomorrow will give a new impetus to our… pic.twitter.com/9gTdb11huD— ANI (@ANI) October 6, 2024 ‘‘ఈ రోజు భారతదేశ పర్యటనలో భాగంగా మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జును రావటం ఆనందంగా ఉంది. భారతదేశం-మాల్దీవుల సంబంధాలను మెరుగుపరచడానికి ఆయన నిబద్ధతను అభినందిస్తున్నాం. రేపు(సోమవారం) ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన చేపట్టే చర్చలు ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలకు కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తాయనే నమ్మకం ఉంది’ అని విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ ఎక్స్‌లో పేర్కొన్నారు. -
మాల్దీవుస్‌లో పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్..!
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను ప్రేమ వివాహం చేసుకుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి వేడుగ గ్రాండ్‌గా జరిగింది. కొన్నేళ్ల పాటు డేటింగ్ ఉన్న వీరిద్దరు చివరికీ ఏడడుగులు వేశారు.(ఇది చదవండి: పెళ్లై నెల కాలేదు.. భర్తతో కాకుండా మరొకరితో హనిమూన్ ఎంజాయ్)ఇటీవల తమ మొదటి వివాహా వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు ఈ జంట. ఈ సందర్భంగా పరిణితీ ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన భర్త రాఘవ్‌తో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీరిద్దరూ మాల్దీవుస్‌లో తమ మొదటి పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by @parineetichopra -
అక్టోబర్‌లో భారత్‌కు మాల్దీవులు అధ్యక్షుడు ముయిజ్జు
మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు వచ్చే నెల భారత్‌లో పర్యటించనున్నారు. అక్టోబర్ రెండో వారంలో మొయిజ్జు భారత్‌లో పర్యటించనున్నట్లు మాల్దీవులు అధికారిక వర్గాలు ప్రకటించించాయి. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఆయన ప్రధాని మోదీతో చర్చించనున్నట్లుగా వెల్లడించాయి.ఇటీవల ఇరు దేశాల మధ్య తలెత్తిన దౌత్య విభేదాల తర్వాత.. ముయిజ్జు భారత్‌కు రావడం ఇది రెండోసారి. జూన్ 9న ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణస్వీకార కార్యక్రమం సందర్భంగా ముయిజ్జు భారత్‌ను చివరిసారి సందర్శించారు. తాజా ధ్వైపాక్షిక పర్యటనలో అక్టోబర్ 7-9 తేదీల్లో ఆయన భారత్‌కు రానున్నారని, 8వ తేదీన ప్రధాని మోదీ, ఇతర అధికారులతో చర్చలు జరపనున్నారని సమాచారం. ఇరుదేశాల సత్సంబంధాల బలోపేతంతో పాటు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఇతర విషయాల గురించి ప్రధాని మోదీతో చర్చించనున్నారని సంబంధింత వర్గాలు పేర్కొన్నాయి.నవంబర్ 2023లో ముయిజ్జు మాల్దీవులు అధ్యక్షుడైన తర్వాత భారత్‌తలో ద్వైపాక్షిక పర్యటన చేయడం ఇదే తొలిసారి. గతంలో భారత్ బలగాలు మాల్దీవులను విడిచివెళ్లిపోవాలని షరతు విధించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పట్లో మోదీ కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో పర్యటించిన సమయంలో.. కొందరు మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య దూరం మరింత పెరిగింది.చదవండి: సీఎం సిద్దరామయ్యపై లోకాయుక్త పోలీసుల ఎఫ్ఐఆర్ నమోదు -
భారత్‌లో మాల్దీవుల అధ్యక్షుని పర్యటన త్వరలో
మాలె: మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు మాల్దీవుల అధ్యక్ష కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అయితే ఆయన ఏ తేదీల్లో పర్యటించనున్నారన్నది వెల్లడించలేదు. గత ఏడాది మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొయిజ్జు భారత్‌కు రావడం ఇది రెండోసారి.ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం మొయిజ్జు తొలిసారి భారత్ వచ్చారు. చైనా అనుకూలుడిగా పేరున్న మొయిజ్జు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారత్ బలగాలు మాల్దీవులు విడిచివెళ్లిపోవాలని షరతు విధించారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కాగా, ఈ ఏడాది ఆరంభంలో మోదీ లక్షద్వీప్‌లో పర్యటించినపుడు అప్పటి మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య మరింత దూరేం పెరిగింది. సోషల్ మీడియాలో బాయ్‌కాట్ మాల్దీవుల ఉద్యమం తీవ్రమైంది. మంత్రుల వ్యాఖ్యలతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మాల్దీవులు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. చివరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులను ప్రభుత్వం నుంచి తొలగించాల్సి వచ్చింది. -
‘శాఫ్’ టోర్నీ సెమీస్‌కు దూసుకెళ్లిన భారత జట్టు
దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) అండర్–20 చాంపియన్‌షిప్‌లో భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. నేపాల్ వేదికగా గ్రూప్ ‘బి’ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 1–0 గోల్ తేడాతో మాల్దీవులు జట్టుపై గెలిచింది. మ్యాచ్ ఆరంభం నుంచి భారత స్ట్రయికర్లు తమ దాడులకు పదును పెట్టారు. కొరౌ సింగ్, కెల్విన్ సింగ్ టోరెమ్ ప్రత్యర్థి గోల్‌పోస్ట్ లక్ష్యంగా కదంతొక్కారు. ఈ క్రమంలో కెల్విన్ కొట్టిన షాట్‌ను ఎబందస్ యేసుదాసన్ గోల్‌గా మలిచేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు.తర్వాత కాసేపటికి గుర్నాజ్ సింగ్ ఇచ్చిన కార్నర్ పాస్‌ను మోనిరుల్ హెడర్ గోల్ పోస్ట్‌ను చేరలేకపోయింది. అయినా సరే భారత యువ స్ట్రయికర్లు నిరాశచెందక తమ ప్రయత్నాలను కొనసాగించారు. 18వ నిమిషంలో కొరౌ, 47వ నిమిషంలో కెల్విన్ గోల్ కోసం చేసిన ప్రయత్నాలేవీ ఫలితమివ్వలేదు. రెండో అర్ధభాగంలోను గోల్ చేయడం కష్టంగా మారింది. చివరకు ఇంజ్యూరీ టైమ్ (90+5వ నిమిషం)లో మంగ్లెంతంగ్ కిప్జెన్ చేసిన గోల్ భారత్‌ను గెలిపించింది.ఫినిషింగ్ లోపాలతో గోల్స్‌గా మలచలేకపోయినప్పటికీ కొరౌ సింగ్, కెల్విన్, ఎబిందస్‌లు తమ ఆటతీరుతో ఆకట్టుకున్నారు. సోమవారం జరిగే సెమీఫైనల్లో గ్రూప్ ‘ఎ’ రన్నరప్, డిఫెండింగ్ చాంపియన్ బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతుంది. -
నేర్చుకోవలసిన పొరుగు పాఠాలు
ఈ సంవత్సరం జనవరి–మార్చి మధ్య కాలంలో క్షీణస్థాయికి చేరుకున్న సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి భారత్, మాల్దీవులు నిశ్శబ్దంగా పని చేస్తున్నాయి. ఒకరికొకరు అవసరమని ఇరుపక్షాలూ గ్రహించాయి. మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు భారత ప్రాముఖ్యం ఎంతో ఉందని ఆ దేశ ఆర్థిక మంత్రి పేర్కొనడం గమనార్హం. విదేశాల్లోని ప్రభుత్వాలను ‘ఢిల్లీ మిత్రుడు’ లేదా ‘భారత వ్యతిరేకి’ అనే పరిమితార్థంలో వర్ణించడం మన అభద్రతా భావాలనే వెల్లడిస్తుంది. ఉదాహరణకు బంగ్లాదేశ్‌లో చాలా ఎక్కువగా ప్రచారమైన భారత్, షేఖ్ హసీనా ‘స్నేహం’ ప్రస్తుత భారత్, బంగ్లా ద్వైపాక్షిక సంబంధాలను రిస్కులో పడేసింది. ప్రజాస్వామ్య దేశాల్లో ప్రభుత్వ మార్పు అనివార్యం కాబట్టి, ప్రతిపక్ష పార్టీలకు కూడా దౌత్యపరంగా చేరువకావడం ముఖ్యం.ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవం కోసం మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజూ ఢిల్లీకి విచ్చేసిన రెండు నెలల తర్వాత, ఆగస్టు నెల ప్రారంభంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాలే పర్యటనకు వెళ్లివచ్చారు. మాల్దీవుల నుండి భారత్ తన సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవలసి వచ్చింది. కానీ, ఈ ద్వీపసమూహానికి చెందిన పర్యాటక, దిగుమతుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ... నిండా మునిగి పోతోంది. గత నెలలో, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజూ ప్రభుత్వ ఖర్చుల్లో కోతలను ప్రకటించారు. దీంతో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయి. ఆర్థిక కష్టాల నుంచి బయట పడటానికి మాల్దీవులకు ఢిల్లీ అవసరం. కాగా, మాల్దీవుల వ్యూహాత్మక ప్రాముఖ్యత గురించి కేంద్ర ప్రభుత్వానికి బాగా తెలుసు. మాలే అభ్యర్థన మేరకు, 5 కోట్ల డాలర్ల ట్రెజరీ బిల్లు గడువును మరో ఏడాది పాటు ఢిల్లీ పొడిగించింది.ఒక నెల తర్వాత మాల్దీవుల నుంచి కృతజ్ఞతా పూర్వకమైన సందేశం వచ్చింది. తన చైనా పర్యటన సమయంలో, మాల్దీవుల ఆర్థిక అభివృద్ధి, వాణిజ్య మంత్రి మహమ్మద్ సయీద్ ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు భారతదేశ ప్రాము ఖ్యత ఎంతో ఉందని పేర్కొన్నారు. దీన్ని ఈ జనవరి నెలలో బీజింగ్‌లో ముయిజూ చేసిన ‘భారతదేశం మా సార్వభౌమత్వానికి ముప్పు’ ప్రకటన నుండి 180 డిగ్రీల మలుపుగా చెప్పొచ్చు.కానీ మాల్దీవుల నుండి మరింత ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అడిగేది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ). మాలేలో విలేఖరుల సమావేశంలో సయీద్ మాట్లాడుతూ, దీనికి సంబంధించి చర్చలు ప్రారంభమయ్యాయని చెప్పారు. ‘వాణిజ్య సౌలభ్యం’ కోసం మాల్దీవులు ‘అన్ని దేశాలతో’ ఎఫ్టీఏలను కలిగి ఉండటానికి సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. చైనాతో 2018 సంవత్సరంలోనే మాల్దీవులు ఎఫ్‌టీఏని కలిగి ఉంది. దీనిపై అబ్దుల్లా యమీన్ ప్రభుత్వ హయాంలోనే సంతకాలు జరిగాయి. అది అమలు కాకముందే ఆయనను ప్రజలు ఓడించారు. తదనంతరం వచ్చిన ఇబు సోలిహ్ ప్రభుత్వం దానిని నిలిపివేసింది. చైనాతో ఎఫ్‌టీఏ అమలుపై ముయిజూ సెప్టెంబరు నెలలో చేయనున్న ప్రకటనకు కొన్ని రోజుల ముందు జైశంకర్ మాల్దీవులలో పర్యటించడం గమనార్హం.విదేశాల్లోని ప్రభుత్వాలను ‘ఢిల్లీ మిత్రుడు’ లేదా ‘భారత వ్యతిరేకి’ అనే పరిమితార్థంలో వర్ణించడం భారతదేశ స్వీయ అభద్రతా భావాలను మాత్రమే వెల్లడిస్తుంది. ఇది ఆదర్శ పరిస్థితుల్లో మాత్రమే దౌత్యం విజయవంతమయ్యే పరిస్థితులను కల్పిస్తుంది. ఇతర ప్రభుత్వం నుండి ‘విధేయత’ కేంద్ర స్థానంలో ఉన్నప్పుడే ఇలా జరుగుతుంది. 2022లో భారత్‌పై విమర్శలను చట్టవిరుద్ధం చేయాలనే ‘భారత అనుకూల’ నేత ఇబు సోలిహ్ తీసుకున్న నిర్ణయంపై ఢిల్లీ ప్రభావం ఎంత స్థాయిలో ఉందో తెలియదు. స్పష్టమైన విషయం ఏమిటంటే, మాల్దీవుల ప్రతిపక్షంతోపాటు, ‘వెళ్లిపో ఇండియా’ నిరస నల వెనుక ఉన్నవారు పై అప్రజాస్వామిక ఉత్తర్వుతో బాగా ఆడు కున్నారు. ఇదే తరహాలో బంగ్లాదేశ్‌లో చాలా ఎక్కువగా ప్రచారమైన భారత్, షేక్ హసీనా ‘స్నేహం’ ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను రిస్కులో పడేసింది. ప్రత్యేకించి తీస్తా జలాల పంపిణీ ఒప్పందం గురించిన షేక్ హసీనా పెద్ద డిమాండ్‌ను భారత ప్రభుత్వం సాకారం చేయని నేపథ్యంలో. మరో వైపున నిరంకుశత్వం వైపు హసీనా ప్రయా ణించిన క్రమంలో భారత్‌పై నిందలు రావడం మొదలైంది.ప్రజాస్వామ్య దేశాల్లో ప్రభుత్వ మార్పు అనివార్యం కాబట్టి, ప్రతిపక్ష పార్టీలకు కూడా దౌత్యపరంగా చేరువకావడం ముఖ్యం. శ్రీలంకలో, భారతదేశాన్ని తీవ్రంగా వ్యతిరేకించే చరిత్ర కలిగిన జనతా విముక్తి పెరమున (జేవీపీ)కి భారత్ చేరువ కావడం కనిపించింది. జేవీపీ నాయకుడు అనురా కుమార దిసానాయకే రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో బలమైన పోటీదారుగా ఉండబోతున్నారు. ఆయనను ఇటీ వల భారతదేశానికి ఆహ్వానించటం జరిగింది. భారతదేశంలో పాల స్వయం సమృద్ధి కేంద్రస్థానమైన ఆనంద్, కేరళ పర్యటనలకు అనూరాను ఆహ్వానించారు. సింహళ జాతీయవాదాన్ని వామపక్ష వాదంతో కలిపిన పార్టీ అయిన జేవీపీ, భారత్‌లో ఫెడరలిజం ఎలా పనిచేస్తోందో కేరళలో చూడవచ్చు. ఒక ముఖ్యమైన ఎన్నికలు జరగ డానికి ఆరు నెలల ముందు, భారత్ ఇలా చేయడం ఇంకో రకమైన సంకేతం ఇస్తుంది. ఇలాంటివి దీర్ఘకాలంగా సాగాలి. బంగ్లాదేశ్ విషయానికి వస్తే, భారత్ 2012 నుండి బంగ్లా నేషనల్ పార్టీకి దూరంగా ఉంది.మాల్దీవులలో సోలిహ్ ప్రభుత్వం ఇండియా ఫస్ట్ విధానాన్ని కలిగి ఉన్నప్పటికీ, బీజేపీ ప్రతినిధి 2022 జూన్‌లో మహమ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల కారణంగా ఆ దేశ ప్రతిపక్షం తీసుకొచ్చిన ఒత్తిడితో సోలిహ్ ప్రభుత్వం ఈ అంశంపై తన ‘తీవ్ర ఆందోళన’ ప్రక టనను జారీ చేయవలసి వచ్చింది. మరోవైపు, మైనారిటీలను రక్షించ మని బంగ్లాదేశ్‌ను కోరడంలో భారత్ వైఖరి సరైనదే. కానీ స్వదేశంలో మైనారిటీల పరిరక్షణకు సంబంధించి ఉదాహరణగా నిలబడటంలో భారత్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహమ్మద్ యూనిస్ హిందూ దేవాలయాన్ని సందర్శించి దేశంలోని హిందువులకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ భారత ప్రధాని ప్రమాదకరమైన గావుకేకలు వేసే పనిలో నిమగ్నమయ్యారు.ఆర్థిక అత్యవసర పరిస్థితుల నుండి వాతావరణ మార్పు, పైరసీ, సముద్రంలో ప్రమాదాలు, నీటి కొరత, సునామీలు, భూకంపాలు మొదలైన వాటిపై మొదట ప్రతిస్పందించే దేశంగా తనను తాను నిల బెట్టుకునే భారతదేశానికి, ప్రజలతో వ్యవహరించడమే కేంద్రస్థానంలో ఉండాలి. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవులు, పౌర సమాజంతోపాటు మీడియా బలమైన పాత్రలు పోషిస్తుంటాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడంలో వీటన్నింటి పాత్ర తక్కువగా ఉండదు. భారతదేశం, దాని పాత్ర గురించి ప్రజలలో ఉండే అవగా హన, అభిప్రాయాలు ఈ దేశాలలో చాలా వరకు అధికార పార్టీపట్ల వ్యతిరేకతకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దోహదం చేస్తాయి.నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకకు చెందిన మీడియా ప్రతినిధులు, పౌర సమాజ కార్యకర్తలు ఇటీవల చేసిన ప్రకటనల్లో భారతదేశం ‘దక్షిణాసియా ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షలకు మద్దతుగా ఉండా లనీ, భవిష్యత్తుకు వారి వ్యక్తిగత మార్గాలను నిర్మించుకోనివ్వాలనీ’ కోరటం జరిగింది. కానీ ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానంలో ప్రభుత్వేతర వ్యక్తులతో వ్యవహరించడంలో తక్కువ పాత్రను కలిగివుంది. ఇది స్వదేశంలో ప్రభుత్వేతర వ్యక్తుల పట్ల మోదీ ప్రభుత్వ వైఖరికి అద్దం పడుతుంది. భారత విదేశాంగ మంత్రి చివరి సారిగా ఈ దేశాల్లోని మీడియాకు ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చారు? దీనికి బదులుగా, ఈ దేశాల్లో ప్రజా సంస్థలను తక్కువ చేసి మాట్లాడే ధోరణి ఉంది.ఈ ప్రాంతంలో భారతదేశాన్ని బేషరతుగా ప్రేమిస్తున్న ప్రజ లున్న ఏకైక దేశం అఫ్గానిస్తాన్. కాగా, భద్రత కోసం పాకిస్తాన్‌పై ఆధారపడిన తాలిబన్ల వల్ల ఇరుదేశాల ప్రజలమధ్య సంబంధాల నుంచి భారత్ ఉద్దేశపూర్వకంగా వైదొలిగింది. కానీ అక్కడ కూడా, అఫ్గాన్ ప్రజలు తమ ప్రాతినిధ్యాన్ని ఎన్నటికీ తిరిగి గెలవలేరని నమ్మడం ఢిల్లీ చేస్తున్న తప్పు అవుతుంది.నిరుపమా సుబ్రమణియన్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
భారత్ దెబ్బ అదుర్స్.. మాల్దీవుల ముయిజ్జు కొత్త రాగం
ప్రధాని మోదీ, భారత్‌పై మాల్దీవుల రాజకీయ నేతల అనుచిత వ్యాఖ్యల కారణంగా రెండు దేశాల మధ్య రాజకీయంగా పెను దుమారమే చెలరేగింది. దీంతో, మాల్లీవుల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ఇలాంటి నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాల్దీవుల పర్యటనలో అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. దీంతో, భారత్ దెబ్బకు ముయిజ్జు యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది.కాగా, మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాల్దీవులకు చేరుకున్నారు. ఈ క్రమంలో మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జుతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరూ అనేక అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం, జైశంకర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ముయిజ్జుతో భేటీ కావడం ఆనందగా ఉంది. భారత ప్రధాని మోదీ తరఫున మాల్దీవుల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసినట్లు వివరించారు. తమ ప్రజలు, ఈ ప్రాంత ప్రయోజనాల కోసం భారత్-మాల్దీవుల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయన్నారు. అయితే, చివరిసారిగా 2023 జనవరిలో జైశంకర్ మాల్దీవుల్లో పర్యటించిన విషయం తెలిసిందే.ఇక, వీరి భేటీ అనంతరం ముయిజ్జు మాట్లాడుతూ భారత్ పట్ల సానుకూల వ్యాఖ్యలు చేశారు. మాల్దీవులకు భారత్ ఎల్లప్పుడూ మిత్ర దేశమేనని చెప్పుకొచ్చారు. మాల్దీవుల సన్నిహిత మిత్ర దేశాల్లో భారత్ ఒకటని అన్నారు. ఆర్థికంగా భారత్ తమకు ముఖ్యమైన భాగస్వామి అని చెప్పారు. అలాగే, తమ దేశం అవసరంలో ఉన్నప్పుడల్లా సాయం చేయడంతో భారత్ ముందు ఉంటుందని పొగడ్తల వర్షం కురిపించారు. ఇదే సమయంలో భారత్‌తో ఉన్న చారిత్రక సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. తమ దేశం పట్ల చూపుతున్న ఉదారతకు ప్రధాని మోదీ, భారత ప్రభుత్వం, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. It was a pleasure to meet @DrSJaishankar today and join him in the official handover of water and sewerage projects in 28 islands of the Maldives. I thank the Government of India, especially Prime Minister @narendramodi for always supporting the Maldives. Our enduring partnership… pic.twitter.com/fYtFb5QI6Q— Dr Mohamed Muizzu (@MMuizzu) August 10, 2024 ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీ లక్షద్వీవుల్లో పర్యటించిన అనంతరం భారత్, మాల్దీవుల మధ్య మాటల యుద్ధం నడిచింది. మాల్దీవుల ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవారు చేసిన వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. దీంతో, భారతీయులు ఎవరూ మాల్దీవులకు వెళ్లవద్దంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో మాల్దీవుల పర్యాటక రంగంపై ఇది తీవ్ర ప్రభావం చూపించింది. ఈ నేపథ్యంలో మాల్దీవుల ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. భారత్‌లో మైత్రికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఇటీవలే ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్ భారత్‌లో పర్యటించారు. -
భారత్‌కు కృతజ్ఞతలు తెలిపిన మాల్దీవుల అధ్యక్షుడు
మాలె: తమ దేశ రుణ చెల్లింపులను సులభతరం చేయటంలో మద్దుతు ఇచ్చినందుకు మాల్లీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు భారత్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్, మాల్దీవులు బలమైన సంబంధాలను ఏర్పరుస్తాయని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకొనున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం మాల్దీవలు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలో దైత్య సంబంధమైన విషయాల్లో విదేశాంగ విధానం సాధించిన విజయాలను ప్రశంసించారు. దేశ రుణచెల్లింపులను సులభతరం చేయటంలో సాయం అంధించిన భారత్, చైనా దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో నెలకొన్న అమెరికా డాలర్ల కొరతను తగ్గించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ క్రమంలోనే మాల్దీవుల ప్రభుత్వం భారత, చైనా దేశాలతో కరెన్సీ మార్పిడి ఒప్పందాలపై చర్చలు జరుపుతోందని వెల్లడించారు. బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. అదేవిధంగా భారత్‌తో కూడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక.. గతంలో భారత్‌త్‌తో దౌత్యపరంగా దెబ్బతిన్న సంబంధాలను మళ్లీ పునరుద్ధరించుకోవాలని మహ్మద్ మొయిజ్జు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక.. గత నెలలో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి ప్రెసిడెంట్ మహ్మద్ మొయిజ్జు హాజరైన విషయం తెలిసిందే. -
ఢిల్లీకి మాల్డీవుల అధ్యక్షుడు మయిజ్జు
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు(ఆదివారం) మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు దేశాధినేతలను ఆహ్వానించారు. ప్రస్తుతం వీరంతా రాజధాని ఢిల్లీకి తరలివస్తున్నారు.భారత ప్రభుత్వం ఆహ్వానం మేరకు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు ఆదివారం ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈయన ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. గతేడాది నవంబర్‌లో మాల్దీవుల అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా మహ్మద్ ముయిజ్జు భారత్‌కు వచ్చారు.‘నరేంద్ర మోదీతోపాటు ఆయన మంత్రివర్గమండలి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు న్యూఢిల్లీ చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘనస్వాగతం లభించింది’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వెంట్లో తెలియజేశారు.బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే తదితరులు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నారు. -
డ్రాగన్ కంట్రీ కుట్రలో మాల్దీవులు..!?
-
ఇజ్రాయెల్‌పై మాల్దీవ్స్ బ్యాన్
మాలె: గాజాపై చేస్తున్న దాడులను వ్యతిరేస్తూ.. నిరసగా ఇజ్రాయెల్‌పై ద్వీప దేశం మాల్దీవులు కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ పౌరులు తమ దేశానికి రావడాన్ని నిషేధించింది. ఆదివారం నిర్వహించిన ‘పాలస్తీనాకు సంఘీభావం’ ర్యాలీలో మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు ప్రకటించారు.ఇజ్రాయెల్ పాస్‌పోర్టు కలిగిన పౌరులు ఇజ్రాయెల్‌కు రావడాన్ని నిషేధిస్తున్నామని అధ్యక్షుడి అధికార ప్రతినిధి తెలిపారు. అయితే దీనికి సంబంధించిన చట్టపరమైన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. పాలస్తీనాకు మాల్దీవుల సంఘీభావం పేరుతో నిధుల సేకరణ కార్యక్రమాన్ని మొయిజ్జు ప్రకటించారు. ఇక.. గతంలో 1990లో ఇజ్రాయెల్ పౌరులపై విధించిన నిషేధాజ్ఞలు 2010లో ఎత్తివేసిన విషయం తెలిసిందే.గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేయడంలో మాల్దీవులు ప్రతిపక్షాలు, ప్రజలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఆ దేశ పౌరులపై నిషేధం విధించాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో అధ్యక్షుడు మొయిజ్జు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిషేధంపై ఇజ్రాయెల్ అధికార ప్రతినిధి స్పందించారు. ఇజ్రాయెల్ పౌరులను మాల్దీవులకు వెళ్లవద్దని సూచించారు. అక్కడ ఏమైనా జరిగితే సాయం చేయటం కష్టమవుతుంది. అందుకే ఇజ్రాయెల్‌లోనే ఉండాలని తెలిపారు. -
Maldives: ‘భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కోరుకుంటోంది’
మాలె: మాల్దీవులుతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) చేసుకోవడానికి భారత్ ప్రయత్నాలు ప్రారంభించిందని ఆ దేశ మంత్రి మహ్మద్ సయీద్ అన్నారు. అయితే దానికి సంబంధించిన చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. మాలెలో ఆర్థిక, వాణిజ్య అభివృద్ధి శాఖ మంత్రి మహ్మద్ సయీద్ మీడియాతో మాట్లాడారు.‘‘దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(SAFTA)తో పాటు మాల్దీవులతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని భారత్ కోరుకుంటోంది. అయితే దీనికి సంబంధించిన చర్చలు, సంప్రదింపులు కొనసాగుతున్నాయి. మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం చేసుకోవడానికి అన్ని దేశాలకు అవకాశం కల్పించారు. వాణిజ్య కార్యకలాపాలను మరింత సులభతరం చేయటంలో భాగంగా అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది’’ అని మహ్మద్ సయీద్ అన్నారు.ఇక.. గతేడాది భారత ప్రధాని మోదీ లక్ష్యదీప్ పర్యటన సందర్భంగా దీగిన ఫొటోలు, వీడియోలపై మాల్దీవులు మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బ తిన్నాయి. అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జుకు చైనా అనుకూలుడనే పేరు ఉండటం. అదే విధంగా మాల్దీవుల్లో ఉన్న భారత్ బలగాలను వెనక్కి తీసుకోవాలని వ్యాఖ్యానించటం వంటి వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి.అయినప్పటికీ భారత్ మాల్దీవుల విజ్ఞప్తి మేరకు బడ్జెట్లో 50 మిలియన్ డాలర్ల అర్థిక సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక.. 1981లో ఇండియా-మాల్దీవుల మధ్య అత్యవసర సరుకుల ఎగుమతుల కోసం వాణిజ్య ఒప్పందం కుదిరింది. 2021లో మొదటిసారి ఇరుదేశాల ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 300 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆ తర్వాత సంవత్సరాల్లో అదికాస్త ఇంకా పెరుగుతూ 500 మిలియన్ డాలర్లు చేరుకుంది. -
దిగొచ్చిన మాల్దీవ్స్.. ప్లీజ్ అంటూ భారత్‌కు అభ్యర్థన
భారత్-మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో.. అక్కడి పర్యాటకం చాలా దెబ్బతింది. ఈ నేపథ్యంలో భారత్‌ను బతిమాలడం మొదట్టింది. తమ దేశ పర్యాటకంలో మళ్లీ భాగం కావాలని మాల్దీవుల పర్యాటక శాఖ మంత్రి ఇబ్రహీం ఫైసల్ భారత్‌ను కోరారు. సోమవారం ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘మాక్కూడా ఓ చరిత్ర ఉంది. మాల్దీవుల్లో ఏర్పాటైన కొత్త ప్రభుత్యానికి భారత్‌తో కలిసి పని చేయాలని ఉంది. మేము ఎప్పుడూ శాంతి, స్నేహపూర్వక పరిస్థితులను పెంపొందించుకోవాలని ఆశిస్తున్నాం. భారత్ నుంచి వచ్చేవారికి మాల్దీవుల ప్రజలు, ప్రభుత్వం సాదరంగా స్వాగతం పలుకుతుంది. దయ చేసి భారతీయులు మాల్దీవుల పర్యాటకంలో తిరిగి మళ్లీ భాగం కావాలని కోరుతున్నా. మా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పర్యటకం ఆధారపడి ఉంటుంది’ అని ఇబ్రహీం ఫైసల్ భారత్‌ను కోరారు.ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన అనంతరం సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలపై మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ మంత్రల వ్యాఖ్యలను భారతీయులు తీవ్రంగా ఖండించారు. ఇక నుంచి తాము మాల్దీవుల పర్యటన రద్దు చేసుకుంటామని పలువురు భారతీయ ప్రముఖులు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక.. అప్పటి నుంచి మాల్దీవులు పర్యాటకం దెబ్బతింది. మరోవైపు.. చైనా అనుకూల వ్యక్తిగా గుర్తింపు ఉన్న మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు విధానాల వల్ల దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మాల్దీవుల్లో ఉన్న భారతీ సైనిక దళాలను వెనక్కి తీసుకోవాలని మొయిజ్జు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి దశలో కొంత మంది సైనికులు భారత్‌కు వచ్చారు. -
భారత్‌తో పెట్టుకుంటే అట్లుంటది మరి.. దెబ్బకు దిగొచ్చిన మాల్దీవులు!
మాలే: భారత్‌తో పెట్టుకుంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో మాల్దీవులకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. భారత్‌తో మాల్దీవుల ప్రభుత్వం కయ్యానికి దిగడంతో అసలుకే ఎసరు వచ్చింది. దీంతో, పర్యాటకం రూపంలో మాల్దీవులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ క్రమంలో దిద్దుబాటు చర్యలకు దిగింది మాల్దీవులు. ఇంతకీ ఏమైందంటే.. చైనా అనుకూల విధానాన్ని అవలంబిస్తూ మాల్దీవుల ప్రభుత్వం.. భారత్‌తో కయ్యానికి దిగింది. ఈ క్రమంలో పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతినండంతో మాల్దీవులు ఇప్పుడు సమస్యలతో సతమతమవుతున్నది. పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మాల్దీవులకు భారత్ నుంచి వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో మళ్లీ భారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగానే భారత్‌లోని ముఖ్యమైన నగరాల్లో రోడ్‌షోలు నిర్వహించాలని మాల్దీవ్స్ అసోసియేషన్ ఆఫ్ ట్రావెల్ ఏజెంట్స్ అండ్ టూర్ ఆపరేటర్స్ భావిస్తున్నది. ఇందుకోసం భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నది. కాగా, మాల్దీవులకు భారత్ ఇప్పటికీ కీలకమైన మార్కెట్. ఈ క్రమంలోనే తమ దేశాన్ని ఒక ప్రధాన గమ్యస్థానంగా మరింత ప్రోత్సహించేందుకు భారత్‌లోని ప్రముఖ ట్రావెల్ అసోసియేషన్లు, పరిశ్రమ వర్గాలతో భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నాం. ప్రధాన నగరాల్లో రోడ్ షోల నిర్వహణకు, ఇన్ఫ్లుయెన్సర్లు, ఇతర ప్రముఖులను రప్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇరుదేశాల మధ్య పర్యటక సంబంధాలను పెంపొందించడంలో భారత హైకమిషన్‌తో కలిసి పనిచేస్తామని ట్రావెట్స్ సంస్థ తెలిపింది. ఇక, మాల్దీవుల పర్యాటకుల విషయంలో మొదటి స్థానంలో ఉండే భారత్.. ప్రస్తుతం ఆరోస్థానానికి చేరింది. అధికారుల వివరాల ప్రకారం.. ఈ ఏడాదిలో ఏప్రిల్ 10 నాటికి మాల్దీవులకు మొత్తం 6,63,269 మంది టూరిస్టులు వచ్చారు. 71,995 మందితో చైనా అగ్రస్థానంలో ఉంది. బ్రిటన్ (66,999), రష్యా (66,803), ఇటలీ (61,379), జర్మనీ (52,256), భారత్ (37,417)లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. దీంతో, మాల్దీవుల ఆదాయం గణనీయంగా పడిపోయింది. -
వివాదాస్పద జెండా.. భారత్‌కు మాల్దీవుల మంత్రి క్షమాపణలు
మాలె: భారత్‌తో దౌత్యసంబంధమైన వివాదం కొనసాగుతన్న వేళ మాల్దీవుల మంత్రి మరియం షియునా ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఓ పోస్టు మరోసారి వివాదాస్పదమైంది. గతంలో ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. ఆమె సెస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. అయితే ఆమె ఇటీవల ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఓ పోస్ట్ వివాదాస్పదం కావటంతో క్షమాపణలు తెలిపారు. మరియం ఇటీవల ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఓ పోస్టులోని ఫొటో భారత జాతీయ జెండాలోని అశోకచక్రాన్ని పోలి ఉండటం వివాదం అయింది. ‘నేను ఇటీవల ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఓ పోస్టుపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. నా పోస్ట్‌లోని కంటెంట్ వల్ల ఎవరినైనా కించపరిచినట్లు అయితే ఇవే నా క్షమాపణలు. నేను ఆ పోస్ట్ మాల్దీవుల ప్రతిపక్ష పార్టీ ఎండీపీని విమర్శిస్తూ ఓ ఫొటో పెట్టాను. అయితే అది భారతీయ జెండాను పోలినట్లు ఉండటం నా దృష్టికి వచ్చింది. .. అందుకే వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేశా. అది నేను ఉద్దేశపూర్వంగా పెట్టిన ఫొటో కాదు. ఆ ఫొటోలో ఏదైనా అపార్థం కలిగించినందుకు నేను చింతిస్తున్నా. మాల్దీవుల భారత్‌తో సంబంధాలను గౌరవిస్తుంది. ఇక భవిష్యత్తులో కూడా సున్నితమైన అంశాను పోస్ట్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉంటాను’ అని మరియం షియునా క్షమాపణ చెబుతా వివరణ ఇచ్చారు. డిలీట్ చేసిన పోస్ట్‌లో ఏం ఉంది? మాల్దీవుల అధికార పార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎంసీ) నేత, మంత్రి మరియం ప్రతిపక్ష పార్టీ మాల్దీవీయన్ డెమోక్రటిక్ పార్టీ ( ఎండీపీ)ని టార్గెట్ చేస్తూ.. ఆ పార్టీ లోగోను మార్పు చేస్తూ ఒక ఫొటోతో పోస్ట్ పెట్టారు. అయితే ఆ ఫొటో భారత్ జాతీయ జెండాలోని అశోక చక్రాన్ని పోలి ఉండటం గమనార్హం. దీంతో పోస్ట్ వైరల్ అయి ఆమె విమర్శల పాలు అయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆమె వెంటనే ఆ పోస్ట్‌ను డిలీట్ చేశారు. అయితే తాజాగా ఆ పోస్ట్‌పై మరియం భారత్‌కు క్షమాపణలు తెలిపారు. ఇక.. భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ లక్ష్యదీప్ పర్యటనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మాల్దీవుల మంత్రుల్లో మరియం ఒకరు. అప్పుడు ఈ విషయంపై మాల్దీవుల ప్రభుత్వం ఆ ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. I would like to address a recent social media post of mine that has garnered attention and criticism .I extend my sincerest apologies for any confusion or offense caused by the content of my recent post. It was brought to my attention that the image used in my response to the… — Mariyam Shiuna (@shiuna_m) April 8, 2024 -
‘భారత్‌తో మొండి వైఖరి మార్చుకోండి’
మాలె: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు తను వ్యవహరిస్తున్న తీరు మార్చుకోవాలని మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ హితవు పలికారు. మొండిగా వ్యవహరించటం మానేసి.. దేశ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొటంలో పొరుగుదేశం భారత్‌తో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలన్నారు. అయితే ఇటీవల మహ్మద్ మొయిజ్జు భారత్ విషయంలో సర్వం మార్చి.. భారత్ తమకు ఎప్పటి నుంచి సన్నిహిత మిత్ర దేశంగా కొనసాగుతుందని పేర్కొన్న విషయంలో తెలిసిందే. భారత్‌కు మాల్దీవులు దాదాపు 400.9 మిలియన్ డాలర్లు బకాయిపడింది. అయితే దానిని తిరిగి చెల్లించడంలో ఉపశమనం కల్పిలచాలని మాల్దీవుల కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహమ్మద్ సోలిహ్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. మాలెలో నిర్వహించిన ఓ ర్యాలీలో పాల్గొన్న మహమ్మద్ సోలిహ్ మాట్లాడారు. బాకాయిపడ్డ రుణంలో ఉపశమనం కల్పించాలని అధ్యక్షుడు మొయిజ్జు భారత్‌ను కోరినట్లు తాను మీడియాలో చేశానని తెలిపారు. భారత్‌తో బాకిపడ్డ మొత్తం కంటే చైనాతో బాకిపడ్డ రుణం ఎక్కువని అన్నారు. ‘పొరుగు దేశాలు సాయం చేస్తాయని నేను విశ్వసిస్తున్నా. మనం మొండితనం వదిలి, చర్చలు జరపాలి. దేశంలోని అన్ని పార్టీలు సహకరిస్తాయి. అధ్యక్షుడు మొయిజ్జు ఎట్టిపరిస్థితుల్లో మొండితనంతో వెనకడుగు వేయోద్దు. ప్రభుత్వానికి ఇప్పడు దేశం ఎదుర్కొంటున్న పరిస్థితి అర్థం అయినట్లు తెలుస్తోంది’ అని మాజీ అధ్యక్షుడు మహమ్మద్ సోలిహ్ తెలిపారు. తమ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులను చేపట్టిందని తెలిపారు. కానీ ప్రస్తుత ప్రభుత్వంలోని మంత్రులు అసత్యాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. చైనా అనుకూల వ్యక్తిగా గుర్తింపు ఉన్న అధ్యక్షుడు మొయిజ్జు గతేడాది మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో భారత్ సైన్యం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రచారం చేసిన విషయం తెలిసిందే. -
మాట మార్చిన మాల్దీవులు.. భారత్ ఎప్పుడూ మిత్రుడే అంటూ..
మాలె: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు ఒక్కసారిగా మాటమార్చారు. ఇన్ని రోజులు భారత్, ప్రధాని మోదీపై అక్కసు వెళ్లగక్కిన ముయిజ్జు సడెన్‌గా మాట మార్చారు. మాల్దీవులకు భారత్ ఎప్పటకీ సన్నిహిత మిత్రుడే అంటూ ఆయన కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆయన ఇలా ఎందుకు మాట్లాడారంటే?.. గతేడాది చివరి నాటికి భారత్‌కు మాల్దీవులు దాదాపు 400.9 మిలియన్ డాలర్లు బకాయిపడింది. దీనిని తిరిగి చెల్లించడంలో ఉపశమనం కలిగించాలని మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు ప్రాధేయపడుతున్నారు. ఇందులో భాగంగానే కొత్త ప్లాన్ రచించారు. అయితే, అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ముయిజ్జు తొలిసారిగా స్థానిక మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. మాల్దీవులకు సాయం అందించడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని, పెద్ద మొత్తంలో ప్రాజెక్టులను నిర్మించిందని కొనియాడారు. ఇరుదేశాల మధ్య స్నేహసంబంధాలు కొనసాగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. రుణాలను తిరిగి చెల్లించడంలో మాల్దీవులకు ఉపశమనం కలిగించాలని భారత్‌ను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ముయిజ్జు..‘గత ప్రభుత్వాలు చేపట్టిన చర్యల వల్ల భారత్ నుంచి తీసుకున్న అప్పులు భారీగా పేరుకుపోయాయి. తిరిగి చెల్లించడంలో మినహాయింపు కోరుతూ ఆ దేశంతో చర్చలు జరుపుతున్నాం. ప్రస్తుతం ఇక్కడ నిర్మాణంలో ఉన్న ఏ ప్రాజెక్టుకు విఘాతం కలిగించం. వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేసేందుకు సహకరిస్తాం’ అని కామెంట్స్ చేశారు. ఇక, ఇదే విషయాన్ని ప్రధాని మోదీతో దుబాయ్ వేదికగా జరిగిన కాప్ 28 సదస్సు సమయంలోనూ ప్రస్తావించినట్లు తెలిపారు. After his Continued anti-India rhetoric, Maldives President #MohamedMuizzu has softened his stance towards #Bharat saying Bharat will continue to remain his country's “closest ally” as he sought a debt relief from New Delhi. Maldives owes approximately $400.9 million to India! pic.twitter.com/po89Zaj8Mq — Sudarshan_World (@Sudarshan_World) March 22, 2024 ఇదిలా ఉండగా.. గత నవంబర్‌లో అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి ముయిజ్జు.. చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. మే 10 నాటికి భారత్‌కు చెందిన బలగాలు తమ దేశాన్ని వీడి వెళ్లిపోవాలని ముయిజ్జు గడువు విధించిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా ఆయన చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. -
‘బాయ్‌కాట్’ దెబ్బ గట్టిగా తగిలింది: మాల్దీవుల మాజీ అధ్యక్షుడు
న్యూఢిల్లీ: మాల్దీవులపై భారత్ ఇచ్చిన బాయ్‌కాట్ కాల్‌పై ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ ఇచ్చిన బాయ్‌కాట్ పిలుపుతో మాల్దీవుల పర్యాటకంపై భారీ ప్రభావం పడిందని చెప్పారు. ఈ విషయమై ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న నషీద్ మీడియాతో మాట్లాడారు. ‘భారత్ బాయ్‌కాట్ పిలుపు మాల్దీవుల పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. దీనిపై నేను చాలా ఆందోళన చెందుతున్నాను. ఇందుకు క్షమాపణలు చెబుతున్నాను. హాలీడేస్‌కు భారత ప్రజలు మాల్దీవులకు రావాలని కోరుకుంటున్నాను. మా ఆతిథ్యంలో ఎలాంటి తేడాలుండవు. భారత్, మాల్దీవుల సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలి. ఈ పర్యటనలో ప్రధాని మోదీని కూడా కలిశాను. నేను మోదీకి పెద్ద మద్దతుదారును. ఆయనకు ఆల్ ద బెస్ట్ చెబుతున్నాను’అని నషీద్ తెలిపారు. మాల్దీవుల నుంచి భారత సైన్యం వైదొలగాలని ప్రస్తుత అధ్యక్షుడు మహ్మద్ మిజ్జు తీసుకున్న నిర్ణయంపైనా నషీద్ స్పందించారు. దీనిపై ఇరు దేశాలు చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కాగా, చైనా మద్దతుదారుగా పేరున్న ప్రస్తుత మాల్దీవుల ప్రధాని మిజ్జు ఈ నెల 10లోగా భారత సైన్యం మాల్దీవులను విడిచి వెళ్లాలని డెడ్‌లైన్ పెట్టిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. గాజాలో దారుణం.. తిండి కోసం ఎదురు చూస్తున్నవారిపై పారాచూట్ -
భారత్ Vs మాల్దీవులు: ముయిజ్జు మరో సంచలన నిర్ణయం
మాలె: డ్రాగన్ కంట్రీ చైనా అండతో మాల్దీవుల ప్రభుత్వం భారత వ్యతిరేక కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు మరోసారి భారత వ్యతిరేకతను వెళ్లగక్కారు. క్రమంలో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాల్దీవులకు భారత్ అందజేసిన హెలికాప్టర్, దాన్ని నిర్వహిస్తున్న సిబ్బందిపై పూర్తి నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్లు మాల్దీవుల జాతీయ రక్షణ దళం ప్రకటించింది. వివరాల ప్రకారం.. మాల్దీవుల ప్రభుత్వం భారత్‌కు వ్యతిరేకంగా మరో నిర్ణయం తీసుకుంది. చైనా అండతో భారత వ్యతిరేక చర్యలకు పదునుపెడుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే తమ భూభాగం నుంచి భారత సైనికులను పంపించేయాలని నిర్ణయించగా తాజాగా మరో ముందడుగు వేసింది. భారత్ అందజేసిన హెలికాప్టర్, దాన్ని నిర్వహిస్తున్న సిబ్బందిపై పూర్తి నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్లు మాల్దీవుల జాతీయ రక్షణ దళం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక, భారత దళాల ఉపసంహరణపై చర్చలు కొనసాగుతున్నాయని ఎంఎన్‌డీఎఫ్‌లోని ప్లాన్స్, పాలసీ, రీసోర్సెస్ విభాగం డైరెక్టర్ కర్నల్ అహ్మద్ ముజుథబ మహమ్మద్ తెలిపారు. మే 10 తర్వాత మాల్దీవుల భూభాగంపై విదేశీ దళాలు ఉండొద్దని అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ఆదేశించినట్లు గుర్తుచేశారు. దీంతో, సైనిక సిబ్బంది నుంచి ఆ కేంద్రాల బాధ్యతలను చేపట్టేందుకు భారత్ నుంచి పౌర సిబ్బందితో కూడిన మరో బృందం అక్కడికి చేరుకుంది. కాగా, మాల్దీవుల్లో భారత్ మూడు వైమానిక కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
భారత బలగాలు మా భూభాగంపై వద్దేవద్దు
మాలె: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు మరోసారి భారత వ్యతిరేకతను వెళ్లగక్కారు. సాధారణ పౌర దుస్తుల్లోనైనా సరే భారత సైనిక సిబ్బంది తమ భూభాగంలో మే 10వ తేదీ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండరాదని అన్నారు. మాల్దీవుల్లో భారత్ మూడు వైమానిక కేంద్రాలను ఏర్పాటు చేసింది. అక్కడి ప్రభుత్వం మార్చి 10వ తేదీ కల్లా భారత సైనిక సిబ్బంది వాటిని విడిచి వెళ్లిపోవాలని గడువు ప్రకటించింది. దీంతో, సైనిక సిబ్బంది నుంచి ఆ కేంద్రాల బాధ్యతలను చేపట్టేందుకు భారత్ నుంచి పౌర సిబ్బందితో కూడిన మరో బృందం అక్కడికి చేరుకున్న నేపథ్యంలో చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధ్యక్షుడు ముయిజ్జు మళ్లీ తన బుద్ధిని బయటపెట్టారు. భారతీయ సిబ్బంది ఏ రూపంలోనైనా సరే తమ దీవిలో ఉండరాదన్నారు. -
మాల్దీవుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు!
మాలె: మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు మరోసారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కాడు. మే 10 తర్వాత భారత్‌కు చెందిన ఓ ఒక్క మిలిటరీ సిబ్బంది తమ దేశంలో ఉండకూదని తెలిపారు. కనీసం సివిల్ డ్రెస్సుల్లో కూడా తమ భూభాగంలో తిరగడానికి వీలు లేదంటూ మంగళవారం పేర్కొన్నారు. సైనిక సహకారంపై చైనాతో మాల్దీవులు కీలక ఒప్పందం కుదుర్చుకున్న గంటల వ్యవధిలోనే ముయిజ్జు ఈ తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం ‘భారత సైన్యం ఉపసంహరణలో మా ప్రభుత్వం విజయం సాధించింది. కానీ దీనిని చూసి తట్టుకోలేని కొంతమంది (విపక్షాలు) తప్పుడు విషయాలను వ్యాప్తిచేస్తున్నారు. కొత్త ట్విస్ట్‌లు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇండియన్ మిలిటరీ ఇక్కడి నుంచి వెళ్లడం లేదని.. వారు తమ యూనిఫామ్‌లను పౌర దుస్తులుగా మార్చుకొని మళ్లీ తిరిగి వస్తున్నారని ఆరోపిస్తున్నారు. కానీ అలాంటి అనుమానాలేం పెట్టుకోవద్దు. మే 10 తర్వాత భారత బలగాలు మాల్దీవుల్లో ఉండవు. యూనిఫామ్‌లో అయినా లేదా సివిల్ దుస్తుల్లోనూ ఎవరిని ఉండనివ్వం’ అని స్పష్టం చేశారు. చదవండి: Melbourne: ‘డ్రాగన్’కు చెక్..! సింగపూర్ కీలక నిర్ణయం మాల్దీవులలోని మూడు వైమానిక స్థావరాల్లో ఒకదానిలో విధులు నిర్వర్తిస్తున్న భారత సైనిక సిబ్బందిని మార్చి 10లోగా మిగతా రెండు స్థావరలాల్లోని బలగాలను మే 10 నాటికి వెనక్కి వెళ్లిపోవాలని మాల్దీవులు విదేశాంగమంత్రిత్వ శాఖ తెలిపింది. దీనిపై ఢిల్లీలో ఫిబ్రవరి 2న ఇరు దేశాల ప్రతినిధులు సమావేశమయ్యారు. తమ బలగాల స్థానంలో సమర్థులైన సాంకేతిక సిబ్బందిని నియమించేందుకు భారత్ పెట్టిన షరతును మాల్దీవులు అంగీకరించింది. దీంతో గతవారమే మాల్దీవుల్లో బాధ్యతలు స్వీకరించడానికి భారత సాంకేతిక బృందం అక్కడికి చేరుకుంది కాగా మాల్దీవుల్లో మూడు వైమానిక స్థావరాల్లో 88 మంది భారత మిలిటరీ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు రెండు హెలికాప్టర్లు ఒక డోర్నియర్ విమానాల ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా మాల్దీవుల ప్రజలకు మానవతా సాయం, వైద్యం కోసం తరలింపు వంటి సేవలను అందిస్తున్నారు. అయితే ముయిజ్జు గత సంవత్సరం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్‌పై వ్యతిరేక వైఖరిని అవలంభిస్తున్నారు. -
Maldives: ‘అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు చెప్పేవన్నీ అబద్ధాలే’
మాలె: భారత భద్రతా బలగాలపై మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు చేసిన వ్యాఖ్యలను మాల్దీవుల మాజీ విదేశాంగ మంత్రి, మాల్దీవీయన్ డెమోక్రటిక్ పార్టీ నేత అబ్దుల్లా షాహిద్ ఖండించారు. వేల సంఖ్యలో భారత భద్రత బలగాలు మాల్దీవులలో ఉన్నారని అధ్యక్షుడు మొయిజ్జు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. అసలు విదేశాలకు చెందిన సాయుధ మిలిటరీ బలగాలు మాల్దీవులలో ఎవరూ లేరని తెలిపారు. పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫును అధ్యక్షుడిగా ఎన్నికైన మహ్మద్ మొయిజ్జు అధికారంలోకి వచ్చి వంద రోజులు అవుతోంది. అప్పటి నుంచి భారత భద్రతా బలగాలు విషయంలో అబద్ధాలు చేబుతున్నారని విమర్శించారు. తాజాగా వేలల్లో భారత భద్రత బలగాలు మాల్లీవులలో ఉన్నారంటూ మరో కొత్త అబద్ధానికి తెరతీశారని అబ్దుల్లా షాహిద్ దుయ్యబట్టారు. విదేశి భద్రత బలగాల సంఖ్య విషయంలో నిర్దిష్టమైన సమాచారాన్ని అందిచటంలో ప్రస్తుత ప్రభుత్వ అసమర్థత స్పష్టంగా తెలుస్తోందని ఎద్దేవా చేశారు. పారదర్శకత చాలా ముఖ్యమని.. నిజం గెలవాలని అన్నారు. ప్రస్తుతం 70 మంది భారత భద్రతా బలగాలు మాల్దీవులలో ఉన్నారు. అయితే.. మాల్దీవుల నుంచి భారత భద్రత బలగాల ఉపసంహరించుకోవాలనే నినాదంతో మహ్మద్ మొయిజ్జు పార్టీ గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ప్రచారం చేసి.. అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక.. భారత్-మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న వేళ ఇరుదేశాల మధ్య జరిగిన చర్చల్లో భాగంగా.. భారత దేశానికి చెందిన మూడు వైమానిక స్థావరాల్లోని భద్రతా బలగాల్లో ఒక స్థావరం సిబ్బందిని మార్చి 10 వరకు, మరో రెండు స్థావరాల సిబ్బందిని మే 10 వరకు భారత్ వెనక్కి తీసుకోవాలని అధ్యక్షుడు మొయిజ్జు కోరారు. ఇక..ఇటీవల భారత్ మాల్దీవులలో ఉన్న భద్రతా బలగాల బదులు నైపుణ్యం ఉన్న సిబ్బందని అక్కడికి బదిలీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. -
చైనా కవ్వింపులు.. మాల్లీవుల్లోకి డ్రాగన్ పరిశోధన నౌక
మాలె: భారత్ పొరుగు దేశం మాల్దీవుల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భారత్‌తో దౌత్యపరంగా వివాదం కొనసాగుతున్న వేళ.. చైనా భారీ నౌక మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. దీంతో, ఈ పరిణామం రాజకీయంగా ప్రాధానత్యను సంతరించుకుంది. మరోవైపు.. భారత్‌ను కవ్వించేందుకే డ్రాగన్ కంట్రీ ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. చైనాకు చెందిన పరిశోధక నౌక షియాంగ్ యాంగ్ హాంగ్-03 తాజాగా మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. రాజధాని మాలె తీరంలో ఇది లంగరు వేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కాగా, 4,300 టన్నుల బరువున్న ఈ నౌక హిందూ మహాసముద్రం అడుగు భాగంలోని ఉపరితలంపై పరిశోధన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిశోధనల్లో భాగంగా ఇక్కడి సముద్ర జలాల్లో జలాంతర్గాముల సంచారానికి అవసరమైన మార్గాలను గుర్తించే అవకాశం బీజింగ్‌కు లభిస్తుందని నావికాదళ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉండగా.. గతంలో చైనా ఇదే తరహాలో శ్రీలంకలో ఓడలను నిలిపింది. అయితే, ఈసారి మాత్రం కొలంబో ఇందుకు అంగీకరించలేదు. దీంతో, చైనా ప్లాన్ ప్రకారం మాల్దీవుల్లో మకాం వేసింది. ఇక, ఈ నౌకలు సైనిక-పౌర ప్రయోజనాలకు సంబంధించనవని భారత అధికారులు ఆరోపిస్తున్నారు. వాటిలోని టెక్నాలజీ.. భారత్‌కు చెందిన నిఘా సమాచారాన్ని సేకరిస్తాయని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఇవి భారత్‌లో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలు , గగన తలంపై నిఘా ఉంచగలవు. మన పోర్టులు, అణు కేంద్రాలపై కూడా ఇవి ఫోకస్ పెట్టే అవకాశం కూడా ఉందని వారు చెబుతున్నారు. 🚨Maldives' Chinese Ship Visit Raises India's Ocean Security Concerns The Indian Ocean, the Chinese research ship Xiang Yang Hong 03 is scheduled to arrive in the Maldives on Thursday. Over three weeks, the research institute-owned vessel surveyed waters beyond the exclusive… pic.twitter.com/iZ2I5tKVkR — CRUXX | News App (@CRUXX_Ind) February 22, 2024 మరోవైపు.. ఇటీవలే భారత్, మాల్దీవుల మధ్య దౌత్యపరంగా పలు విబేధాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ.. లక్షద్వీప్‌కు వెళ్లి పర్యాటకాన్ని ప్రోత్సహించేలా పలు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో పలు మాల్దీవుల ఎంపీలు.. భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో రాజకీయంగా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో, భారత పర్యాటకులు మాల్దీవుల ట్రిప్స్‌ను రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మాల్దీవులకు ఆర్థికపరంగా నష్టం కలుగుతోంది. -
మారిషస్‌ను మాల్దీవుల అనుకున్న నెటిజన్లు.. ‘ఎక్స్’ పోస్టులు వైరల్
భారత్-మాల్లీవుల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. లక్ష్యదీప్‌ను పర్యటించిన ప్రధాని మోదీ.. అక్కడి అందాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా.. మాల్దీవుల మంత్రులు మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయటంతో వివాదం తీవ్రస్థాయికి చేరింది. అప్పుడు భారత దేశంలోని ప్రముఖులంతా మాల్దీవుల కంటే.. స్వదేశానికి చెందిన లక్ష్యదీప్, అండమాన్ ద్వీపాలకు పర్యటనకు వెళ్లాలని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగిన సంగతి విదితమే. భారత్-మాల్దీవుల మధ్య కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో మారిషస్ ద్వీప దేశం భారతీయ పర్యటకులను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా ‘మరిషస్ టూరిజం(ఇండియా)’ ‘ఎక్స్’ (ట్విటర్)లో భారతీయ పర్యటకులు తమ దేశంలోకి రావాల్సిందిగా స్వాగంతం పలికింది. ‘మారిషస్‌లోని అందాలను అన్వేషించటం కోసం భారతీయులకు స్వాగతం. 2024 ఏడాదిలో మారిషస్ ద్వీపాన్ని సందర్శించండి. అక్కడి అందాలను చూసి కొత్త శక్తి, అనుభూతిని ఆస్వాధించండి. టన్నుల కొద్ది సాహసాలు, అనుభవాలు మీ కోసం ఎదురు చేస్తున్నాయి. ఈ రోజు మీ హాలీ ట్రిప్‌ను ప్లాన్ చేసుకోండి!’ అని పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కానీ, భారతీయ నెటజన్ల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అయింది. మారిషస్ ద్వీపాన్ని పలువురు భారతీయ నేటిజన్లు మాల్దీవులగా పొరపాటు పడ్డారు. ‘మాల్దీవులపై మాకు ఆసక్తి లేదు. మాకు లక్ష్యదీప్ ఉంది’, ‘ మీరు మా ప్రధానమంత్రిని అవమానించారు. అందుకే మేము మీ దేశాన్ని పర్యటించము’ అని నెటిజన్లు కామెంట్లు చేశారు. దీంతో స్పందించిన మారిషస్ టూరిజం.. ‘హాయ్, ఇది మారిషస్ దేశం. మాల్దీవుల ద్వీపం కాదు. రెండు వేర్వేరు ద్వీపాలు’ అని స్పష్టత ఇచ్చింది. వెంటనే నెటిజన్లలో నవ్వులు పూచాయి. మరికొంత మంది నెటిజన్ల స్పందిస్తూ.. మాల్దీవుల కంటే మారిషస్ పర్యటన బాగుటుందని కామెంట్లు చేశారు. ‘ మాల్దీవుల కంటే స్నేపూర్వకంగా ఉండే మారిషస్ పర్యటనకు వెళ్లటం ఉత్తమం’, మాల్దీవుల కంటే మారిషస్ చాలా చాలా మంచి పర్యటక ప్రాంతం’ అని కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టులు ‘ఎక్స్’ వైరల్ అవుతున్నాయి. -
మాల్దీవులలో సైనిక బలగాలపై భారత్ కీలక నిర్ణయం
మాల్దీవుల-భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా భారత విదేశి వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాల్దీవులలో ఉండే భారత భద్రత బలగాలపై గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. మాల్దీవులలో ఉన్న మిలిటరీ బలగాల స్థానంలో నైపుణ్యంతో కూడిన సాంకేతిక సిబ్బందిని మాలేలో ప్రవేశపెడతామని వెల్లడించింది. ఇటీవల మాలే నుంచి భారత మిలిటరీ బలగాలను వెనక్కి తీసుకోవాలని మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు మర్యాదపూర్వకంగా విజ్ఞప్తి చేసిన క్రమంలో ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ‘ఇరు దేశాల మధ్య రెండో అత్యున్నత స్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. మరోసారి కూడా ఇరుదేశాల అధికారులు సమావేశం కానున్నారు. అంతలోపు మాల్దీవులలో ఉన్న భారత్ మిలిటరీ బలగాల స్థానంలో నైపుణ్యం గల సాంకేతిక సిబ్బందిని ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నాం.’ అని భారత విదేశాంగ కార్యదర్శి రణ్‌ధీర్ జైశ్వాల్ వెల్లడించారు. ఇక.. రెండోసారి జరిగిన అధికారుల సమావేశంలో మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖ.. తమ దేశంలోని భారత్‌కు చెందిన మూడు వైమానిక స్థావరాల్లోని సైనిక బలగాల్లో.. ముందుగా ఒక స్థావరంలో నైపుణ్యం గల సాంకేతిక సిబ్బందిని మార్చి 10 వరకు భర్తీ చేయాలని కోరింది. మరో రెండు వైమానిక స్థావరాలోని మిలిటరీ బలగాల బదులుగా మాలేలో మే 10వరకు నైపుణ్యం గల సాంకేతిక సిబ్బందని పంపిచాలని విజ్ఞప్తి చేసింది. ఇక.. మల్దీవుల ప్రజలకు మానవతా సాయం, వైద్య సేవలను అందించేందుకు భారత్ వైమానిక స్థావరాల్లో నైపుణ్యం గల సాంకేతిక సిబ్బంది ద్వారా నిరంతరం కార్యకలాపాలు సాగించడానికి ఇరు దేశాలు అంగీకరించినట్ల సమాచారం. -
Maldives: ‘మేలో భారత్ బలగాలు వెనక్కి.. ఏ దేశ జోక్యం అనుమతించం’
భారత్-మాల్దీవుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు భారత భద్రత బలగాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జు ఆ దేశ పార్లమెంట్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా తమ దేశ సార్వభౌమాధికారంలో ఏ దేశం జోక్యం చేసుకోవద్దని భారత్‌ను దృష్టిలో పెట్టుకొని మాట్లాడటం గమనార్హం. తమ ద్వీపదేశం నుంచి భారత్‌కు చెందిన భద్రతా బలగాలు మే 10 తేదీ వరకు వెనక్కి వెళ్లడానికి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరినట్లు పేర్కొన్నారు. మూడు బృందాలుగా ఉన్న భారత్ భద్రతా బలగాల్లో మొదటి బృందం మార్చి 10 తేదిన మాల్దీవుల నుంచి వెళ్లిపోనుందని తెలిపారు. అదేవిధంగా మిగిలిన రెండు సైనిక బృందాలు సైతం మే10లోగా పూర్తిగా మాల్దీవుల నుంచి వైదొలుగుతాయని పార్లమెంట్లో పేర్కొన్నారు. తమ దేశ అంతర్గత విషయాలకు సంబంధించి ఎటువంటి ఒప్పందాలను భారత్‌తో ఇక మీదట పునరుద్దరించబోమని వెల్లడించారు. తమ దేశ సార్వభౌమాధికంలోకి ఏ ఇతర దేశం జోక్యం చేసుకోరదని.. అలా జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తే తమ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో అనుమతి ఇవ్వబోదని స్పష్టం చేశారు. భారత్‌కు చెందిన 80 మంది భద్రతా బలగాలు.. మాల్దీవుల దేశంలో మానవతా సాయం, వైద్య అత్యవసర సాయం అందించటంలో సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక.. మహ్మద్ మొయిజ్జు ప్రభుత్వంపై ఇక్కడి ప్రతిపక్ష పార్టీల్లో అసంతృప్తి కొనసాగతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంనే ప్రధాన ప్రతిపక్షాలైన ఎండీపీ, డెమోక్రాట్లు పార్లమెంట్ సమావేశాలను బాయ్‌కాట్ చేశాయి. కేవలం 24 మంది ఎంపీలు మాత్రమే పార్లమెంట్ సమావేశాలకు హజరుకాగా.. 56 మంది గైర్హాజరు అయ్యారు. ఇటీవల పార్లమెంట్లో చోటుచేసుకున్న పరిణామాలతో ఓ దశలో.. చైనా అనుకూలమైన వ్యక్తిగా పేరున్న మహ్మద్ మొయిజ్జు ప్రభుత్వంపై అక్కడి ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానం ప్రవేపెట్టడానికి కూడా సిద్ధపడ్డ విషయం తెలిసిందే. చదవండి: UK Prime Minister: చిన్నతనంలో వివక్షకు గురయ్యా: సునాక్ -
భారత్‌కు మాల్దీవుల అభ్యర్థన.. ఎందుకో తెలుసా?
మాల్దీవుల-భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా భారత్ తాను ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో కూడా మాల్దీవులకు రూ.600 కోట్ల ఆర్థిక సాయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఆ మరోసటి రోజే.. తాజాగా మాల్దీవుల నుంచి భారత్‌కు ఒక అభ్యర్థన వచ్చింది. తమ దేశ సముద్ర ప్రాదేశిక జలాల్లో మూడు మత్స్యకారుల నౌకల్లో ఇండియన్ కోస్ట్‌గార్డు సిబ్బంది ప్రవేశించటంపై భారత్ నుంచి స్పష్టత ఇవ్వాలని కోరింది. శుక్రవారం రాత్రి తమ దేశ మిలిటరీ.. గురువారం విదేశి మిలిటరీ సిబ్బంది మాల్దీవుల మత్స్యకారుల నౌకల్లోకి ప్రవేశించినట్లు సమాచారం అందుకుందని.. అందులో భారత్‌కు చెందిన కోస్ట్ గార్డు సిబ్బంది ఉన్నట్లు గుర్తించినట్లు భారత్‌కు నివేదించింది. అదేవిధంగా మరో రెండు నౌకల్లో కూడా ఇండియన్ కోస్ట్‌గార్డు సిబ్బంది ప్రవేశించారని పేర్కొంది. అయితే వారు ఏం చేశారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. మాల్దీవీయన్ ఎక్స్క్లూసివ్ ఎకానమిక్ జోన్లో ప్రయాణిస్తున్న మాల్దీవుల మత్స్యకారుల నౌకల్లోకి ఇండియన్ కోస్ట్ సిబ్బంది ప్రవేశించటంపై భారత్ అధికారికంగా నివేదిక అందించాలని ఈ మేరకు మాల్దీవుల విదేశీ వ్యవహారాల మంత్రి భారత్‌కు అధికారిక విజ్ఞప్తి చేసింది. సంబంధిత అధికారులతో సమన్వయం లేకుండా అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఈ ఘటనపై స్పష్టత ఇవ్వాలని ఆ దేశ స్థానిక భాషలోనే భారత్‌ను అభ్యర్థించడం గమనార్హం. ఇక.. మాల్దీవుల- భారత్ మధ్య నెలకొన్నదౌత్యపరమైన ప్రతిష్టంభన నేపథ్యంలో ఇది మొదటి దౌత్యపరమైన అభ్యర్థనగా తెలుస్తోంది. ఇక కీలకమైన హిందూ మహాసముద్రంలో భారత్, చైనా తమ వ్యూహాత్మ ప్రాధాన్యపై దృష్టిపెట్టిన విషయం తెలిసిందే. మాల్దీవుల మంత్రులు.. లక్షద్వీప్ విషయంలో ప్రధానిమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయటంతో చైనా అనుకూల వ్యక్తిగా పేరున్న మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జతో భారత్ దౌత్యపరమైన సంబంధాలు క్షీణిస్తూ వచ్చాయి. చదవండి: US Strikes: యూఎస్ ప్రతీకార దాడులు.. ఆరుగురు ఉగ్రవాదులు మృతి! -
మాల్దీవులకు పాక్ ఆర్థిక సాయం దేనికి?
మాల్దీవులకు భారత్‌కు నడుమ దౌత్యపరమైన విభేధాలు కొనసాగుతున్నాయి. ఈ గ్యాప్‌ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. మాల్దీవులతో సన్నిహిత సంబంధాలను ఏర్పరుచుకుంటోంది. అదే సమయంలో పాకిస్థాన్ సైతం మాల్దీవులకు ఆర్థిక సాయం అందిస్తుందట. అసలు పాక్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే మాల్దీవులకు ఆర్థిక సాయం ఎలా చేస్తుందో?. మాల్దీవులతో దౌత్యపరమైన విభేదాలు నెలకొన్న తరుణంలోనూ భారత్ ఆ దేశానికి ఆపన్నహస్తం అందించడానికి మొగ్గుచూపిన విషయం తెలిసిందే. గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో మాల్దీవులకు ఆర్థిక సాయం కింద రూ.600 కోట్లు కేటాయించింది. అయితే గతంతో పోల్చితే కొంత మొత్తంలో ఆర్థిక సాయం తగ్గింది. అయితే.. ఇదే క్రమంలో దాయాది దేశమైన పాకిస్తాన్ సైతం మాల్దీవులకు ఆర్థికసాయం చేయడానికి ముందుకు వచ్చింది. మాల్దీవుల అభివృద్ధి అవసరాలకు తాము సాయం అందిస్తామని పాకిస్తాన్ ఆపద్ధర్మ అధ్యక్షుడు అన్వర్ ఉల్ హక్ కాకర్ పేర్కొన్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా పాక్ అధ్యక్షుడు అన్వర్.. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జకు ఫోన్ చేసి మరీ ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఈ విషయాన్ని పాక్ అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. పాక్ ప్రభుత్వం తమ దేశ అభివృద్ది కోసం నిధులు అందించనుందని తెలిపినట్లు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు సైతం పేర్కొన్నారు. ఇరు దేశాల నేతలు అంతర్జాతీయ అంశాల్లో తమ దేశాల మధ్య అభివృద్ధికి సంబంధించిన విషయాలను చర్చించుకున్నట్లు తెలుస్తోంది. వాతావరణ మార్పులకు సంబంధిచిన విషయంలో కూడా మాల్దీవులకు ఆర్థిక సాయంతో పాటు తమ పూర్తి మద్దతు ఉంటుందని పాక్ అధ్యక్షుడు పేర్కొన్నట్లు సమాచారం. ఇక.. ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు 26, జూలై 1996 నుంచి కొనసాగుతున్నాయి. ఇరు దేశాలు కూడా చైనాకు అనుకూలమైన దేశాలుగా గుర్తింపు ఉండటం గమనార్హం. మరోవైపు పాకిస్తాన్ దేశమే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే మాల్దీవులకు ఆర్థిక సాయం ఎలా చేస్తుందని అక్కడి ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: సంక్షోభంలో పాక్.. జనం పెదవి విరుపు, వ్యాపారుల గగ్గోలు -
భారత్ ఎఫెక్ట్.. మాల్దీవుల ప్రభుత్వానికి మరో షాక్!
మాలే: మాల్దీవుల ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. మాల్దీవుల మంత్రులు, నేతలు.. భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన కారణంగా భారతీయులు.. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాగా, మాల్దీవుల పర్యాటకం కోసం వెళ్లే భారతీయులు సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఈ విషయాన్ని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. వివరాల ప్రకారం.. భారత్‌తో దౌత్యపరమైన వివాదానికి తెరలేపిన మాల్దీవులకు మరోసారి షాక్ తగిలింది. భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గింది. మాల్దీవుల పర్యాటక ర్యాంకింగ్‌లో మన దేశ స్థానం గణనీయంగా పడిపోయింది. ఈ విషయాన్ని ప్రభుత్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. గతేడాది డిసెంబరు 31 వరకు భారత్ నుంచి 2,09,198 మంది పర్యాటకులు మాల్దీవులను సందర్శించారు. దీంతో, మాల్దీవుల పర్యాటక మార్కెట్లో 11 శాతం వాటాతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. రష్యా రెండో స్థానంలో.. చైనా మూడో స్థానంలో కొనసాగాయి. నాలుగో స్థానంలో బ్రిటన్ నిలిచింది. ఈ ఏడాది ప్రారంభంలో లక్షద్వీప్‌ను ప్రధాని మోదీ సందర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పర్యాటకులు లక్షద్వీప్‌లో పర్యటించాలని కోరారు. ఇక, ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన నేపథ్యంలో మాల్దీవుల మంత్రులు భారత్ ఆతిథ్యంపై అక్కసు వెళ్లగక్కారు. దీంతో, ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతీసే స్థాయికి చేరింది. గత మూడు వారాలుగా మాల్దీవుల పర్యాటక జాబితాను పరిశీలిస్తే.. అప్పటివరకు అగ్రస్థానంలో కొనసాగిన భారత్ కొంతకాలంలోనే ఐదో స్థానానికి పడిపోయింది. 13,989 మంది మాత్రమే మాల్దీవులను సందర్శించారు. 18,561 మంది పర్యాటకులతో రష్యా మొదటి స్థానంలో నిలిచింది. 18,111 మంది పర్యాటకులతో ఇటలీ రెండో స్థానానికి ఎగబాకింది. చైనా 16,529.. బ్రిటన్ 14,588 మంది పర్యాటకులతో మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. -
Maldives: మోదీకి క్షమాపణ చెప్పాల్సిందే!
మల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు భారతదేశా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారతీయులు క్షమాపణ చెప్పాలని ప్రతిపక్ష జుమ్‌హూరీ పార్టీ చీఫ్ గసుయిమ్ ఇబ్రహీం డిమాండ్ చేశారు. భారత్-మాల్దీవుల దౌత్యపరమైన సంబంధాలు మెరుగుపరుకునే క్రమంలో అధ్యక్షుడు మొయిజ్జు ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పాలన్నారు. అధ్యక్షుడు మొయిజ్జు నేతృత్వంలోని మాల్దీవుల ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. చైనా అనుకూలమైన వ్యక్తిగా పేరున్న మొయిజ్జు ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలు సంబంధిత తీర్మాణంపై సంతకాల సేకరణకు కసరత్తు చేస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో జుమ్‌హూరీ పార్టీ చీఫ్ గసుయిమ్ ఇబ్రహీం భారత్‌కు క్షమాపణ చెప్పాలని చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అదేవిధంగా అక్కడి ప్రజలు కూడా సోషల్ మీడియాలో తమ అధ్యక్షుడు భారతీయులకు క్షమాపణలు చెప్పాలని ప్రచారం జరుగుతోంది. చైనా అనుకూల అధ్యక్షుడు ముయిజ్జు కేబినెట్లోకి నలుగురు మంత్రులను చేర్చుకునే అంశంపై ఆదివారం పార్లమెంట్లో ఓటింగ్ జరిగింది. అయితే నలుగురిలో ఒక్కరికి మాత్రమే పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ముగ్గురిని తిరస్కరించింది. దీంతో ఆగ్రహిస్తూ అధికార పక్షం ఎండీపీకి చెందిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్లపై అవిశ్వాసం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రతిపక్ష ఎంపీలు బాహాబాహీకి దిగారు. ఈ ఘటనలో ఇద్దరు ఎంపీలు గాయపడ్డారు. ఈ పరిణామాలతో ఎండీపీ, మిత్రపక్షం డెమోక్రాట్లతో కలిసి ముయిజ్జుపై అవిశ్వాసం పెట్టాలని సోమవారం నిర్ణయించిన విషయం తెలిసిందే. పార్లమెంట్లో మొత్తం 80 మంది సభ్యులకుగాను ఎండీపీకి 45 మంది, డెమోక్రాట్లకు 13 మంది ఉన్నారు. -
Maldives: తగ్గిన భారత్ టూరిస్టులు.. పెరిగిన చైనా వాటా
మాలె: భారత్, మాల్దీవుల వివాదం తర్వాత మాల్దీవుల పర్యాటకంలో భారత్ వాటా తగ్గిపోయింది. గతంలో మాల్దీవుల విదేశీ పర్యాటకంలో మూడవ స్థానంలో ఉండే భారత్ వివాదం అనంతరం ఐదవ స్థానానికి పడిపోవడం గమనార్హం. ఈ ఏడాది ప్రారంభంలో మాల్దీవుల టూరిజంలో భారత దేశ వాటా 7.1 శాతంగా ఉండి 3వ స్థానంలో ఉంది. ఇదే సమయంలో చైనా కనీసం మాల్దీవుల టూరిజంలో అధిక వాటా కలిగిన దేశాల జాబితాలో కనీసం టాప్ టెన్‌లో కూడా లేదు. అలాంటిది వివాదం తర్వాత మాల్దీవుల టూరిజంలో చైనా, బ్రిటన్ల వాటా గణనీయంగా పెరిగింది. ఇప్పుడు చైనా మూడవ స్థానానికి, బ్రిటన్ అయిదవ స్థానానికి ఎగబాకాయి. జనవరి 2వ తేదీన ప్రధాని మోదీ లక్షద్వీప్‌లో పర్యటించారు. దీనిపై మాల్దీవుల మంత్రులు బహిరంగ విమర్శలు చేశారు. దీంతో భారత పర్యాటకుల్లో చాలా మంది మాల్దీవుల టూర్లు రద్దు చేసుకున్నారు. సోషల్ మీడియాలో బాయ్‌కాట్ మాల్దీవులు ట్రెండింగ్‌గా మారింది. ఇదీచదవండి.. మాల్దీవుల అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం -
మాల్దీవుల అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం!
మాల్దీవుల అధికారపార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్(PNC)పై తీవ్రమైన అసమ్మతి పెరుగుతోంది. దీంతో దేశ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జుకు చెందిన అధికార పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్‌పై ప్రతిపక్ష మాల్దీవీయన్ డెమోక్రటిక్ పార్టీ అభిశంసన తీర్మానం ప్రవేశపట్టడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ దేశ మీడియా సోమవారం పలు కథనాలు ప్రచురించింది. ప్రతిపక్ష మాల్దీవీయన్ డెమోక్రటిక్ పార్టీ(ఎండీపీ), మరో భాగస్వామ్య పార్టీకి చెందిన ఎంపీలందరితో అభిశంసన తీర్మానంపై సంతకాలు చేయిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి ప్రతిపక్ష ఎండీపీ అభిశంసన తీర్మానాన్ని ఇంకా పార్లమెంట్లో సమర్పించలేదు. అయితే ఆదివారం మల్దీవుల పార్లమెంట్లో అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం ఘర్షణకు దారితీసింది. తీర్మానం ఓటింగ్‌ను ప్రతిపక్ష ఎంపీలు అడ్డుకున్నారు. అక్కడితో ఆగకుండా స్పీకర్‌కు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్‌లోనే తన్నుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రతిపక్ష పార్టీలు అన్ని మహ్మద్ మొయిజ్జు ప్రభుత్వంపై అభిశంసన తీర్మానం ప్రవేశపట్టడానికి సిద్ధమైనట్లు సమాచారం. చదవండి: Maldives: మాల్దీవుల పార్లమెంట్లో ఎంపీల కొట్లాట -
Maldives: మాల్దీవుల పార్లమెంట్లో ఎంపీల కొట్లాట
పార్లమెంట్లో ఎంపీలు తీవ్రంగా విమర్శలు చేసుకోవటం వింటున్నాం. కానీ చట్టాలు చేయాల్సిన ప్రజాప్రతినిధులు వీధి రౌడీల్లా కొట్టుకోవటం చూశారా? మాల్దీవుల పార్లమెంట్లో అధికార పార్టీ ఎంపీలు, ప్రతిపక్ష పార్టీ ఎంపీలు బాహాబాహికి దిగారు. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు కేబినెట్లోని మంత్రుల సంబంధించి పార్లమెంట్ ఆమోదం కోసం ఆదివారం ఏర్పాటు చేసిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో తీవ్రమైన ఘర్షణ చెలరేగింది. దీనికి సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం మాల్దీవుల ప్రజా ప్రతినిధుల ఘర్షణ వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. *Viewer discretion advised* Parliament proceedings have been disrupted after clashes between PPM/PNC MPs and opposition MPs. pic.twitter.com/vhvfCBgQ1s — Adhadhu (@AdhadhuMV) January 28, 2024 అధికారపార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్(PNC), ప్రభుత్వ అనుకూల పార్టీ ప్రొగ్రెసీవ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్(PPM) ఎంపీలకు... ప్రతిపక్ష పార్టీ మాల్దీవీయిన్ డెమోక్రటిక్ పార్టీ (MDP)ఎంపీల మధ్య గొడవ జరిగింది. అయితే అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు కేబినెట్లో నలుగురు మంత్రుల ఆమోదానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ నిరసన తెలియజేశారు. ఈ క్రమంలోనే పీఎన్సీ ఎంపీ షహీమ్.. ఎండీపీ ఎంపీ ఇసా కాలు పట్టుకొని నేలపై పడగొట్టాడు. దీంతో ఇసా... షహీమ్ మెడపై పిడిగుద్దులు గుద్దాడు. సహచర ఎంపీలు వారిగొడవను శాంతింపచేశారు. తీవ్రంగా గాయపడ్డ షహీమ్‌ను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు మంత్రి వర్గంలోని మంత్రులకు ఆమోదం తెలపకపోవటంతో పాటు స్పీకర్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాల డిమాండ్ చేశాయి. మరోవైపు కెబినెట్లో మంత్రులకు ఆమోదం తెలపకపోవటం ప్రజా సేవలకు విఘాతం కల్పించడమేనని ప్రతిపక్షాలపై అధికారపార్టీ పీపుల్స్ నేషనల్ పార్టీ మండిపడుతోంది. చదవండి: Dinosaurs: పక్షులు డైనోసార్ల వంశమా? -
మోదీ ఎఫెక్ట్.. మాల్దీవుల మయిజ్జూకు కొత్త టెన్షన్!
మాలే: మాల్దీవుల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మాల్దీవుల్లోని మహ్మద్ మయిజ్జూ ప్రభుత్వానికి తాజాగా మరో షాక్ తగిలింది. భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తున్న మాల్దీవుల ప్రభుత్వంపై స్వదేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మాల్దీవుల్లో ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీపై విరుచుకుపడుతున్నాయి. వివరాల ప్రకారం.. భారత వ్యతిరేక వైఖరి దేశ అభివృద్ధికి హానికరంగా పరిణమించవచ్చునని రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ (ఎండీపీ), డెమోక్రాట్స్ పార్టీల నేతలు మయిజ్జూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి భాగస్వామిని దూరం చేసుకోవడటం ఏమాత్రం సబబుకాదని, మరీ ముఖ్యంగా సుదీర్ఘకాలంగా మైత్రిని కొనసాగిస్తున్న దేశాన్ని దూరం చేసుకుంటే దీర్ఘకాలిక అభివృద్ధికి హానికరమని ఎండీపీ, డెమోక్రాట్ పార్టీల నేతలు విమర్శించారు. అయితే, రెండు రోజుల క్రితం చైనాకు చెందిన గూఢాచార నౌక మాల్దీవుల నౌకాశ్రయంలో తిష్ట వేయడం ఆసక్తికరంగా మారింది. భారత్‌తో దౌత్య బంధాలు దెబ్బతినడంతో మాల్దీవుల ప్రభుత్వం చైనా సానుకూల వైఖరిని ప్రదర్శిస్తోంది. దీంతో హిందూ మహాసముద్ర ప్రాంతంలో రాజకీయ, సైనిక మార్పులు వచ్చాయని అక్కడి ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఇదే సమయంలో భారత్‌ను దీర్ఘకాల మిత్రదేశంగా ప్రతిపక్షాలు అభివర్ణించాయి. విదేశాంగ విధానంలో భాగంగా ప్రభుత్వం అన్ని అభివృద్ధి భాగస్వాములతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని విపక్ష నేతలు పేర్కొన్నారు. Two major opposition parties in the Maldives, the Maldivian Democratic Party (MDP) and The Democrats, have voiced concerns over President Mohammad Muizzu's perceived 'anti-India' stance. pic.twitter.com/Y7OlSJMets — Mohit Vijh (@vijh_mohit) January 25, 2024 మాల్దీవుల స్థిరత్వం, భద్రతకు హిందూ మహాసముద్ర ప్రాంతంలో స్థిరత్వం, శాంతి, భద్రత చాలా ముఖ్యమైనదని ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీలు సూచించాయి. ఈ మేరకు ఎండీపీ చైర్మన్ ఫయాజ్ ఇస్మాయిల్, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ అహ్మద్ సలీమ్, డెమొక్రాట్స్ పార్టీ చీఫ్ హసన్ లతీఫ్, పార్లమెంటరీ గ్రూప్ లీడర్ అలీ అజీమ్‌లు ఉమ్మడి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. భారత ప్రధాని మోదీ లక్షదీప్ పర్యటన అనంతరం.. జనవరి 8న చైనాలో నాలుగు రోజుల అధికారిక పర్యటనకు ముయిజ్జూ వెళ్లారు. అదే సందర్భంలో ఆయన ప్రభుత్వంలోని ముగ్గురు ఉప మంత్రులు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గురించీ, మొత్తంగా భారతీయుల గురించీ అవమానకరమైన వ్యాఖ్యలను పోస్ట్ చేయడంతో వివాదం చెలరేగింది. చైనాలో మయిజ్జూ కూడా భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు. అయితే, కొన్ని సంవత్సరాలుగా, మాల్దీవులను సందర్శించేవారిలో భారతీయుల వాటా అత్యధికం. తాజా పరిణామంతో మాల్దీవులను సందర్శించాలనుకున్న భారతీయులు తమ హోటల్, విమాన బుకింగ్‌లను రద్దు చేసుకున్నారు. మరోవైపు.. దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో భారత్ తన దళాలను ఉపసంహరించుకోవాలని మాల్దీవులు ప్రభుత్వం చెప్పింది. ఇందుకు మార్చి 5 గడువు తేదీగా విధించింది. -
దౌత్య సంబంధాల్లో సహనం ముఖ్యం
మాల్దీవుల్లోని ప్రస్తుత ప్రభుత్వం ‘ఇండియా ఔట్’ నినాదంతో గెలిచింది. భారత సైన్యాన్ని తమ దేశం నుంచి ఉపసంహరించుకోవాలని కోరింది. దీనికి తోడు లక్షదీవులు వర్సెస్ మాల్దీవుల సోషల్ మీడియా వివాదం చెలరేగింది. ఈ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో భారత్ వైఖరి ఎలా ఉండాలి? సోషల్ మీడియాకు ప్రతిస్పందనగా విదేశాంగ విధానం ఉండకూడదు. అభ్యంతరకరమైన ట్వీట్లకు కారణమైన ముగ్గురు మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయాన్ని మనం విస్మరించకూడదు. అలాగే మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ ఇండియాకు అనుకూలం. ఈ ముఖ్యమైన వర్గాన్ని చీకాకు పెట్టేలా భారతీయ కార్యకలాపాలు ఉండకూడదు. విదేశాంగ విధానం అనేది ఎప్పటికప్పుడు ముగిసిపోయేది కాదు. అది స్థిరంగా కొనసాగాలి. 2023 నవంబర్‌లో జరిగిన మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ నాయకుడు మొహమ్మద్ ముయిజ్జూ ‘ఇండియా ఔట్’ (భారత్ వెళ్లిపో) అనే ప్రజాకర్షక నినాదంతో గెలిచినప్పుడే భారత్–మాల్దీవుల సంబంధాలు మళ్లీ దెబ్బతింటాయని అందరూ భావించారు. బాధ్యతలు స్వీక రించిన వెంటనే, తమ దేశం నుంచి భారత రక్షణ సిబ్బందిని ఉపసంహరించుకోవాలని ముయిజ్జూ భారత్‌ను కోరారు. మాల్దీవులలోని వెయ్యికి పైగా ద్వీపాలు విస్తారమైన సముద్ర ప్రాంతంలో వ్యాపించి ఉన్నాయి. అక్కడి అతిపెద్ద ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజెడ్) భద్రత, దీవుల్లో విపత్తు సహాయ కార్యకలాపాలపై నిఘా కోసం భారత్ బహుమతిగా ఇచ్చిన డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్లను 75 మంది భారత సైనికులు నడుపుతున్నారు. మాల్దీవులు వ్యవస్థాపక సభ్యదేశంగా ఉన్న ‘కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్’లో భాగంగా సముద్ర భద్రతను ప్రోత్సహించడానికి ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగానే దేశంలోని అతిపెద్ద ఆర్థిక మండలిలో భూజ లాధ్యయన సర్వేను భారత్ నిర్వహించాల్సి ఉంది. కానీ ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించడానికి కూడా కొత్త ప్రభుత్వం నిరాకరించింది. దీనిమీద భారత్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన లేదు. కానీ తమ అభ్యర్థనలను భారత్ అంగీకరించిందని ముయిజ్జూ చెబుతున్నారు. జనవరి 8న చైనాలో నాలుగు రోజుల అధికారిక పర్యటనకు ముయిజ్జూ వెళ్లారు. అదే సందర్భంలో ఆయన ప్రభుత్వంలోని ముగ్గురు ఉప మంత్రులు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గురించీ, మొత్తంగా భారతీయుల గురించీ అవమానకరమైన వ్యాఖ్యలను పోస్ట్ చేయడంతో ఒక వికారమైన వివాదం చెలరేగింది. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్ దీవులను సందర్శించిన ఫోటోలను పోస్ట్ చేశారు. లక్షద్వీప్‌కు దక్షిణంగా ఉన్న ఈ దీవులు మాల్దీవుల కంటే మరింత ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా ఆవిర్భవించగలవని కొందరు సోషల్ మీడియాలో వాద నలు మొదలుపెట్టారు. వాటికి వ్యతిరేకంగానే మాల్దీవుల మంత్రులు ప్రతిస్పందించినట్లు కనబడింది. ఆ తర్వాత మాల్దీవులను బహిష్కరించాలని కొందరు భారతీయ ప్రముఖులు పిలుపునివ్వడంతో సోషల్ మీడియా యుద్ధం చెలరేగింది. కొన్ని సంవత్సరాలుగా, మాల్దీవులను సందర్శించేవారిలో భారతీయుల వాటా అత్యధికం. తాజా పరిణా మంతో మాల్దీవులను సందర్శించాలనుకున్న భారతీయులు తమ హోటల్, విమాన బుకింగ్‌లను రద్దు చేసుకున్నారు. ఇది ఆ దేశ పర్యా టక పరిశ్రమను దెబ్బతీసింది. అయితే ఒకటి మర్చిపోకూడదు. కోవిడ్ –19 మహమ్మారికి ముందు, ఈ పర్యాటకుల రాకపోకలలో చైనా మొదటి స్థానంలో ఉండేది. అన్ని ప్రయాణ ఆంక్షలను చైనా ఎత్తివేస్తే ఆ స్థానాన్ని తిరిగి ఆ దేశమే పొందే అవకాశం ఉంది. ముయిజ్జూ చైనా పర్యటన సందర్భంగా, రెండు దేశాల మధ్య ‘సమగ్ర వ్యూహాత్మక సహకార భాగస్వామ్యాన్ని’ ప్రకటించే సంయుక్త పత్రికా ప్రకటన వెలువడింది. గ్లోబల్ సివిలైజేషన్ ఇనిషియేటివ్, గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్, గ్లోబల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ (జీడీఐ) అనే మూడు కీలకమైన చైనా ప్రాజెక్టులలో పాల్గొనడానికి మాల్దీవులు సుముఖంగా ఉన్నట్లు ఈ ప్రకటన సూచిస్తోంది. ‘గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆఫ్ ద జీడీఐ’లో మాల్దీవులు చేరింది. చైనీస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద ప్రాజెక్టులను స్వాగతించింది. మాల్దీవుల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారానికి ప్రామాణికమైన చైనా మద్దతు ఉంది. మాల్దీవుల అంతర్గత వ్యవహారాలలో ఏదైనా బాహ్య జోక్యాన్ని చైనా వ్యతిరేకిస్తోంది. ఈ విషయంలో పేరు ఎత్తని గురి ఇండియానే అని చెప్పనక్కరలేదు. అయితే చైనా, మాల్తీవుల ఉమ్మడి ప్రకటనలో రెండు ముఖ్యమైన మినహాయింపులు ఉన్నాయి. 2017లో అప్పటి మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ బీజింగ్‌లో పర్యటించారు. చైనాకు అత్యంత అను కూలమైన స్థానాన్ని ఇచ్చేలా, ఇరు దేశాల మధ్య కుదిరిన వివాదా స్పద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద అమలు గురించి ఉమ్మడి ప్రకటనలో ఏ ప్రస్తావనా లేదు. అప్పటినుంచి అది సుప్తచేతనలో ఉంది. దాని పునరుద్ధరణ కోసం మాలేలోని చైనా రాయబారి ఒత్తిడి చేస్తున్నారు. హిందూ మహాసముద్రంలో సముద్ర ట్రాఫిక్‌ను పర్యవేక్షించడానికి తమకు అనుకూలమైన స్థానాన్ని ఇచ్చే పరిశీలనా కేంద్ర ఏర్పాటు కోసం చైనా ప్రతిపాదించిన ప్రాజెక్ట్ గురించి కూడా ఉమ్మడి ప్రకట నలో ప్రస్తావన లేదు. ఇవి సాపేక్షంగా భారత్‌కు సానుకూలాంశాలు. ఈ పరిణామాలను భారత్ గమనించాలి. (దీవుల్లో పరిశోధన కోసం చైనా నౌక చేరుకుందన్న వార్తలు వచ్చాయి. అది ఫిబ్రవరిలో రానుందనీ, కానీ పరిశోధన కోసం మాత్రం కాదనీ మాల్దీవులు చెబుతోంది.) 2023 డిసెంబర్ 7న మారిషస్‌లో జరిగిన కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్కు మాల్దీవులు గైర్హాజరవడం ఒక ఎదురుదెబ్బ. భారత్ 2011లో శ్రీలంక, మాల్దీవులతో ఈ త్రైపాక్షిక సముద్ర భద్రతా వేదికను ప్రారంభించింది. సముద్ర భద్రత, ఉగ్రవాద నిరోధం, మానవ అక్రమ రవాణా, సైబర్ భద్రతతో కూడిన ఎజెండాపై, ఈ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడంలో ఈ వేదిక ముఖ్య మైన పాత్ర పోషించింది. 2020లో మారిషస్ ఈ కూటమిలో చేరింది. ఇటీవలి మారిషస్ సమావేశంలోనే, సీషెల్స్, బంగ్లాదేశ్ పరిశీలకులుగా చేరాయి. తర్వాత ఇవి పూర్తి సభ్య దేశాలు కావచ్చు. చైనా మెప్పు కోసం మాల్దీవులు ఈ సమావేశానికి హాజరుకాలేదని అనుకోవచ్చు. ఈ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో భారత్ వైఖరి ఎలా ఉండాలి? ఒకటి, సోషల్ మీడియాకు ప్రతిస్పందనగా విదేశాంగ విధానం ఉండకూడదు. మాల్దీవుల ప్రభుత్వం అధికారికంగా క్షమా పణ చెప్పనప్పటికీ, అభ్యంతరకరమైన ట్వీట్లకు కారణమైన ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేయడంతోపాటు, తమ మంత్రుల చర్యలను తీవ్రంగా ఖండించిన విషయాన్ని మనం విస్మరించకూడదు. రెండు, మాల్దీవులలోని పార్లమెంట్లో ఇండియాకు అనుకూలంగా ఉండే మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ ఆధిపత్యం చలాయిస్తోంది, దీని ప్రతినిధులు మోదీ వ్యతిరేక ట్వీట్లను తీవ్రంగా ఖండించారు, అధికారికంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పైగా దీర్ఘకాలంగా మాల్దీవులకు భారత్ ఇస్తున్న మద్దతు, సద్భావన గురించి గొప్పగా మాట్లాడాలని డిమాండ్ చేశారు. మాలెలో ఇటీవల జరిగిన మేయర్ ఎన్నికల్లో ఈ పార్టీ సునాయాసంగా విజయం సాధించింది. ముయిజ్జూ అధ్యక్షుడు కావడానికి ముందు రాజధాని మేయర్‌గా ఉన్న విషయం తెలిసిందే. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో భారత అను కూల రాజకీయ శక్తులు విజయం సాధించే అవకాశం ఉంది. భారత్ పట్ల సానుకూల భావాలను కలిగి ఉన్న ఈ బలమైన, ముఖ్యమైన వర్గాన్ని చికాకు పెట్టేలా మన కార్యకలాపాలు ఉండకూడదు. భారత విదేశాంగ మంత్రి ఇటీవలి ప్రకటన, రెండు దేశాల మధ్య బలమైన ప్రజా సంబంధాలను సమర్థించడంలోని ప్రాముఖ్యతను సూచిస్తోంది. అదే సమయంలో, మాల్దీవుల వ్యతిరేక సోషల్ మీడియా వ్యాఖ్యల వరదలకు ఆయన ప్రకటన ఒక ముఖ్యమైన దిద్దుబాటుగా వెలువడింది. విదేశాంగ విధానం ఎప్పటికప్పుడు ముగిసే ఉపకథలా ఉండ కూడదు. పొరుగు దేశాలలోని రాజకీయాలు అనుకూలంగా లేన ప్పుడు కూడా స్థిరంగా, బలమైన ఒప్పుదలతో కొనసాగాలి. భారత్‌కు మాల్దీవులు వ్యూహాత్మకంగా ముఖ్యమైనది. అక్కడి పరిణామాలపై తన మాటలు, చేతలను భారత్ జాగ్రత్తగా బేరీజు వేసుకోవాలి. అంతి మంగా సహనమే ఫలితాన్ని ఇస్తుందని మరచి పోకూడదు. శ్యామ్ శరణ్ వ్యాసకర్త విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
భారత్‌తో వివాదం వేళ.. చైనా నౌకను ధ్రువీకరించిన మాల్దీవులు
భారత్-మాల్దీవుల మధ్య ఇటీవల చోటు చేసుకున్న వివాదం నేపథ్యంలో మాల్దీవుల చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. చైనా పరిశోధక నౌక ‘షియాంగ్ యాంగ్ హాంగ్ 03’ మాలె తీరానికి చేరినట్లు ధృవీకరిస్తూ మాల్దీవుల ప్రభుత్వం మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. సిబ్బంది రాకపోకలు, భర్తీ కోసం చైనా దౌత్యపరమైన అభ్యర్థన చేసిందని మాల్దీవుల ప్రభుత్వం పేర్కొంది. తమతో స్నేహంగా ఉండే పలు దేశాలకు చెందిన నౌకలకు మాల్దీవుల ద్వీపం ఓ గమ్యస్థానమని పేర్కొంది. తాము ఎప్పుడు ఆ దేశాల నౌకలకు స్వాగతం చెబుతామని తెలిపింది. మాల్దీవుల తీరంలోకి తమ దేశం పరిశోధక నౌక వస్తున్నట్లు చైనా సమాచారం అందించిందని మాల్దీవుల విదేశాంగ శాఖ వెల్లడించింది. చైనా తమ దేశ నౌకను మాల్దీవుల తీరంలో నిలపడానికి మాల్దీవుల దౌత్యపరమైన అనుమతి తీసుకుందని పేర్కొంది. ఇక.. గతంలో చైనా నౌక శ్రీలంక తీరంలో నిఘా కార్యకలాపాలు నిర్వహించటంపై భారత్ తీవ్ర అభ్యంతం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జుకు చైనా అనుకూల వ్యక్తి పేరు ఉందన్న విషయం తెలిసిందే. ఒక వైపు భారత్‌తో వివాదం కొనసాగుతున్న సమయంలో మొయిజ్జు.. చైనా పర్యటించారు. తమ దేశంలోని సైన్యాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని భారత్‌ను కోరిన విషయం తెలిసిందే. చైనా పరిశోధక నౌక.. నిఘా సమాచారాన్ని సేకరించే సాధనాలను కలిగి ఉంటుందని భారత్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇటువంటి నౌకలు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రాంతాలు, గగన తలంపై నిఘా ఉంచగలవని తెలుస్తోంది. అందుకే భారత్.. చైనా నౌకలపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తోంది చదవండి: ఫిబ్రవరి 8న పాక్ ఎన్నికలు...‘బ్యాట్’ పట్టని ఇమ్రాన్! -
ముయిజ్జూ భారత వ్యతిరేక వైఖరి.. బాలున్ని చంపేసింది!
మాలే: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ భారత వ్యతిరేక విధానాల వల్ల ఓ 14 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. భారత్ అందించిన ఎయిర్‌క్రాఫ్ట్ వినియోగాన్ని నిరాకరించిన కారణంగా బ్రెయిన్ స్ట్రోక్‌తో బాలుడు మరణించాడు. బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతున్న అబ్బాయిని వేగంగా ఆస్పత్రికి తరలించడానికి ఎయిర్‌క్రాఫ్ట్ కోసం బాధితులు అభ్యర్థించారు. కానీ అనుమతి లభించకపోవడంతో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు బ్రెయిన్ ట్యూమర్ స్ట్రోక్‌తో బాధపడుతున్న బాలుడి పరిస్థితి విషమించడంతో బాధిత కుటుంబం అతన్ని గాఫ్ అలీఫ్ విల్లింగిలిలోని వారి ఇంటి నుండి రాజధాని మాలేకి తరలించడానికి ఎయిర్‌క్రాఫ్ట్ అంబులెన్స్‌ను అభ్యర్థించింది. కానీ సమాధానం రాలేదు. 16 గంటల తర్వాత బాలున్ని మాలేకి తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. "స్ట్రోక్ వచ్చిన వెంటనే బాలున్ని మాలేకి తీసుకురావడానికి ఐలాండ్ ఏవియేషన్‌కు కాల్ చేశాం. కానీ మా కాల్‌కు సమాధానం అందలేదు. ఉదయం 8:30 గంటలకు ఫోన్‌కు సమాధానం ఇచ్చారు. సాధారణంగా అలాంటి కేసులకు ఎయిర్ అంబులెన్స్ ఇస్తారు. అది ఉండటమే పరిష్కారం" అని బాలుని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి మాల్దీవుల మంత్రులు చేసిన అవమానకరమైన వ్యాఖ్యల అనంతరం ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ప్రతిష్టంభణ కొనసాగుతోంది. భారత్, మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో ఈ ఘటన జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. బాలుడి మరణంపై వ్యాఖ్యానించిన మాల్దీవుల ఎంపీ మీకైల్ నసీమ్.. “భారతదేశం పట్ల అధ్యక్షుడి వ్యతిరేక వైఖరి కారణంగా ప్రజలు తమ ప్రాణాలను కోల్పోవాల్సిన అవసరం లేదు.” అని అన్నారు. ఇదీ చదవండి: అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిగా ట్రంప్ మానసిక స్థితి సరిపోతుందా? -
Maldives Row: మాల్దీవులు-భారత్ విదేశాంగ మంత్రుల కీలక భేటీ
కంపాలా: మాల్దీవులు-భారత్ మధ్య వివాదం నడుస్తున్న వేళ ఇరుదేశాల విదేశాంగ మంత్రులు భేటీ అయ్యారు. ఉగాండ రాజధాని కంపాలాలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్, మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలపై చర్చించారు. శుక్రవారం ప్రారంభమయ్యే నాన్-అలైన్డ్ మూవ్మెంట్(NAM) రెండు రోజుల శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ఇరువురు నేతలు కంపాలాకు వెళ్లారు. ఈ సందర్భంగా భారతదేశంతో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని మూసా జమీర్ స్పష్టం చేశారు. నామ్ సమ్మిట్‌లో భాగంగా జైశంకర్‌ని కలవడం ఆనందంగా ఉందని మూసా జమీర్ ట్విట్టర్(ఎక్స్) లో తెలిపారు. మాల్దీవుల నుంచి భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ, అలాగే తమ దేశంలో జరుగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించినట్లు పేర్కొన్నారు. సార్క్, నామ్ల సహకారంపై అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిపారు. భారతదేశంతో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. Met Maldives FM @MoosaZameer today in Kampala. A frank conversation on 🇮🇳-🇲🇻 ties. Also discussed NAM related issues. pic.twitter.com/P7ResFlCaK — Dr. S. Jaishankar (@DrSJaishankar) January 18, 2024 మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ చైనా అనుకూల విధానాలను అనుసరిస్తున్నారు. నవంబర్‌లో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత సైనిక సిబ్బందిని మాల్దీవుల నుంచి తరిమివేస్తానని ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు. దానికితోడు ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద ట్వీట్లు చేయడం.. భారత్-మాల్దీవుల మధ్య సంబంధాలు ఒత్తిడికి గురయ్యాయి. మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని మార్చి 15వరకు గడువు కూడా విధించారు. ఈ సందర్భంగా ఇరుదేశాల నేతలు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదీ చదవండి: హౌతీలపై భూతల దాడులకు యెమెన్ పిలుపు -
దారితప్పిన మాల్దీవులు
ఏదో యథాలాపంగా, ఎంతో యాదృచ్ఛికంగా మొదలైనట్టు కనబడిన మాల్దీవుల పంచాయితీ ఆంతర్యం మన దేశానికి దూరం జరగటమేనని తాజా పరిణామాలు మరింత తేటతెల్లం చేస్తున్నాయి. భారత వ్యతిరేకతే అస్త్రంగా ఎన్నికల్లో ప్రచారం చేసి మొన్న నవంబర్‌లో అధికారంలో కొచ్చిన అధ్యక్షుడు మహమ్మద్ మెయిజూ ఇప్పటికీ అదే పోకడలు పోతున్నారు. లక్షద్వీప్‌లో పర్యటించిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఒక ఛాయాచిత్రాన్ని పోస్టు చేసినప్పుడు ముగ్గురు మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై రాజుకున్న రగడ తర్వాత ఆ దేశం ఒకటొకటిగా చర్యలు మొదలుపెట్టింది. మన దేశం బహుమతిగా ఇచ్చిన రెండు తేలికపాటి అధునాతన ధ్రువ హెలికాప్టర్లు వెనక్కు తీసుకోవాలని కోరటంతో పాటు వచ్చే మార్చి 15లోపు దేశంలోవున్న భారత సైనిక దళాలను ఉపసంహరించాలని తుదిగడువు విధించారు. కేవలం 88 మంది సైనికుల వల్ల తమ దేశానికి ముప్పు ముంచుకొస్తుందంటూ హడావిడి చేస్తున్నారు. అధికారంలోకొచ్చిన వెంటనే భారత పర్యటనకొచ్చే సంప్రదాయాన్ని పక్కనబెట్టి మెయిజూ టర్కీని ఎంచుకున్నారు. ఆ తర్వాత యూఏ ఈలో జరిగే కాప్–28 సదస్సుకెళ్లారు. తాజాగా ఈ నెల 8 నుంచి 12 వరకూ చైనాలో పర్యటించారు. ‘భౌగోళికంగా ఆకారంలో చిన్నదైనంత మాత్రాన మాల్దీవులు ఎవరి బెదిరింపులకూ లొంVýæద’ని హెచ్చరించారు. వీటన్నిటి వెనుకా ఉన్నదెవరో సులభంగానే పోల్చుకోవచ్చు. మనకూ, మాల్దీవులకూ వున్న బంధం చాలా పాతది. అలాగని భారత్‌పై విద్వేషాన్ని వెళ్లగక్కే శక్తులకు అక్కడ కొదవేమీ లేదు. దేశ ప్రజానీకంలోవున్న భారత్ అనుకూలతను ఎలాగైనా పరిమార్చాలని చాలామంది రాజకీయ నాయకులు ప్రయత్నించారు. ప్రత్యర్థుల విధానాలనూ, వారి కార్యాచరణనూ తప్పుబట్టడానికి సందు దొరకని ప్రతిసారీ భారత్ ప్రసక్తి తీసుకొచ్చి విమర్శించటం అక్కడ పరిపాటి. గతంలో అబ్దుల్లా యామీన్ సైతం మూడు దశాబ్దాల తన ఏలుబడిలో భారత్ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని, చైనాతో అంటకాగి దేశాన్ని నిండా ముంచారు. ప్రశ్నించినవారిని ఖైదు చేశారు. ఇది సరికాదంటూ తీర్పునిచ్చిన ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జీలను జైలుకు పంపారు. ఆయన నిర్వాకంలో ఆ దేశం చైనా నుంచి భారీగా రుణాలు తీసుకుంది. పెట్టుబడులను ఆహ్వానించింది. వీటివల్ల చెల్లించాల్సిన వడ్డీలే అపరిమితంగా పెరిగిపోయాయి. 2013లో రెండోసారి అధికారంలోకొచ్చాక కూడా యామీన్ తీరు మారలేదు. చివరకు ఆయన విధానాలతో విసిగిన జనం 2018లో ఇబ్రహీం మహ్మద్ సోలిహ్‌ను గద్దెనెక్కించారు. నియంతృత్వ పోకడలకు పోలేదన్న మాటేగానీ... అవినీతిని అంతమొందిస్తానన్న వాగ్దానాన్ని సోలిహ్ నిలుపుకోలేకపోయారు. ఒక అవినీతి కేసులో యామీన్‌కు 11 ఏళ్ల జైలు శిక్ష పడిన మాట వాస్తవమే అయినా, అది మినహా అవినీతి నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకోలేకపోయారు. ఉపాధి కల్పనలోనూ సొంత మనుషులకే ప్రాధాన్యమిచ్చారన్న ఆరోపణలు వినబడ్డాయి. ఈ అసంతృప్తిని ప్రస్తుత అధ్యక్షుడు మెయిజూ ఆసరాగా తీసుకుని అధికారానికి రాగలిగారు. అయిదున్నర లక్షలమంది జనాభాగల మాల్దీవుల్లో మూడులక్షలమంది సున్నీ ముస్లివ్ులు. మతం పేరుతో వీరిలో అత్యధికులను తనవైపు తిప్పుకోవాలని, జాతీయవాదాన్ని రెచ్చగొట్టాలని అంతక్రితం యామీన్ ప్రయత్నించినా ప్రయో జనం లేకపోయింది. కాకపోతే ఈ రాజకీయ క్రీడ చివరకు సెక్యులర్ పార్టీల వైఫల్యంగా మారి మతతత్వ శక్తుల ప్రాబల్యం పెరుగుతుందా అన్న సందేహాలు చాలామందిలో ఉన్నాయి. మెయిజూ అయినా, మరొకరైనా దేశాభివృద్ధిలో భారత్ కీలకపాత్రను తోసిపుచ్చలేరు. ప్రస్తుతం దేశ దిగుమతుల్లో అత్యధిక వాటా భారత్‌దే. దీన్ని తగ్గించుకుందామని ప్రయత్నిస్తే వ్యయం పెరగటం మినహా ప్రయోజనం శూన్యం. ఇక మాల్దీవుల విదేశీ రుణాల్లోనూ సింహభాగం మన దేశానిదే. గతంలో చైనాతో సాన్నిహిత్యం పెంచుకుని ఎడాపెడా రుణాలు తీసుకుని శ్రీలంక ఆర్థికంగా ఎంత నష్టపోయిందో, ఎలా దివాలా తీసిందో అక్కడి పరిణామాలే తేటతెల్లం చేశాయి.అధికారంలోకొచ్చిన నాటి నుంచీ మెయిజూ పాలనపై దృష్టి నిలపడానికి బదులు చైనాను సంతుష్టిపరచటానికి సమయం వెచ్చిస్తున్నారు. అన్ని దేశాల్లోనూ ఒకే తరహా వ్యవస్థలు,రాజకీయ భావాలుండటం సాధ్యం కాదు. ఎన్నికలప్పుడు ఏం మాట్లాడినా అధికారంలో కొచ్చాక బాధ్యతగా మెలగాలి. దేశ గరిష్ఠ ప్రయోజనాలు గీటురాయిగా ఉండాలి తప్ప, మూర్ఖత్వంతో అవతలివారిని నొప్పించటమే ధ్యేయం కాకూడదు. మెయిజూకు ఎన్నికల జాతరలో తలకెక్కిన మత్తు ఇంకా దిగినట్టు లేదు. లోగడ పాలించిన యామీన్‌కు చైనాతో ఉన్న సాన్నిహిత్యం, ఇటీవల గద్దె దిగిన సోలిహ్ భారత్ అనుకూల ధోరణి జగద్వితమే అయినా వారిద్దరూ ఇరు దేశాలకూ సమాన దూరంలో మెలుగుతామని ప్రకటించేవారు. విధానాల రూపకల్పనలో, నిర్ణయాల్లో ఎంతోకొంత దాన్ని చేసిచూపేవారు. మెయిజూకు ఆ పరిణతి లేదని ఆయన చర్యలు స్పష్టం చేస్తున్నాయి. అది చాలదన్నట్టు ఇటీవల తైవాన్‌లో చైనాను గట్టిగా వ్యతిరేకించే పక్షమే తిరిగి అధికారంలోకి రాగా, తగుదునమ్మా అంటూ తమది ‘వన్ చైనా’ విధానమేనంటూ ప్రకటించారు. భౌగోళికంగా చూస్తే మాల్దీవులు 1,190 పగడపు దిబ్బల సముదాయం. కానీ అందులో నివాస యోగ్యమైనవి కేవలం 185 దీవులు మాత్రమే. మన దేశానికి 400 కిలోమీటర్ల దూరంలోవుంటూ మన భద్రత రీత్యా హిందూ మహా సముద్రంలో కీలక ప్రాంతంలో ఉన్న మాల్దీవులు భారత్ – చైనాల మధ్య సాగే పందెంలో తలదూర్చి బొప్పి కట్టించుకునే చేష్టలకు దూరంగా ఉండటం అన్నివిధాలా దానికే శ్రేయస్కరం. -
భారత్‌కు మద్దతుగా నిలిస్తే.. రాజకీయంగా చూస్తున్నారు - ఈజ్‌మైట్రిప్ సీఈఓ
ఇండియా & మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదాల కారణంగా ప్రముఖ ట్రావెల్ ఏజన్సీ 'ఈజ్‌మైట్రిప్' (EaseMyTrip) అన్ని బుకింగ్స్ నిలిపివేసింది. మన దేశానికి మద్దతుగా నిలువడానికి సంస్థ సీఈఓ అండ్ కో ఫౌండర్ 'నిషాంత్ పిట్టి' (Nishant Pitti) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ విషయం మీద ప్రశాంత్ పిట్టి కూడా చలో లక్షద్వీప్ హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేస్తూ.. మాల్దీవులు/సీషెల్స్ మాదిరిగానే లక్షద్వీప్‌లోని నీరు & బీచ్‌లు చాలా బాగున్నాయి. ఇటీవల వీటిని దేశ ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ఈ అందమైన ప్రదేశాన్ని సందర్శించడానికి అద్భుతమైన క్రేజీ స్పెషల్-ఆఫర్లు ఇక్కడ ఉన్నాయంటూ ట్వీట్ చేశారు. ఈజ్‌మైట్రిప్ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయాలు కొందరు రాజకీయంగా చూస్తున్నట్లు సమాచారం. గత కొన్ని సంవత్సరాలుగా భారత్ నుంచి చాలామంది మాల్దీవులకు వెళ్తున్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన సందర్భంగా మాల్దీవులకు చెందిన ముగ్గురు డిప్యూటీ మంత్రులు అవమానకర వ్యాఖ్యలు చేయడంతో వివాదం చెలరేగింది. దీంతో మాల్దీవుల చర్యలను భారత్ ఖండించింది. ఇదీ చదవండి: ప్రపంచ వ్యాపార సామ్రాజ్య పతనం! భయపడుతున్న సీఈఓలు.. ప్రస్తుతం ఈజ్‌మైట్రిప్ తీసుకున్న నిర్ణయాన్ని సుమారు 95 శాతం మంది భారతీయులు సమర్థిస్తున్నారు. దీంతో యాప్ డౌన్లోడ్ కూడా గత వారం 280 శాతం పెరిగిందని.. 5 శాతం మంది మాత్రమే మా నిర్ణయాన్ని రాజకీయం చేస్తున్నట్లు వెల్లడించారు. Read some tweets, saying we instigated India-Maldives Standoff Here is a brief history: Nov 2023, President of Maldives won election on plank of "India Out" campaign. They wanted India & its tourist OUT, since last few years. Being 2nd largest tourism provider to Maldives, we… — Nishant Pitti (@nishantpitti) January 15, 2024 -
Maldives Row: విదేశాంగ మంత్రి జై శంకర్ కీలక వ్యాఖ్యలు
భారత్-మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశి విధానాల్లో రాజకీయం.. రాజకీయమేనని అన్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మొదటిసారిగా భారత్-మాల్దీవుల దౌత్యపరమైన వివాదంపై స్పందించారు. ఏ దేశమైనా తప్పనిసరిగా భారత్ దేశానికి మద్దతుగా ఉంటుందని చెప్పలేమని అన్నారు. మాల్దీవులతో నెలకొన్న వివాదం నేపథ్యంలో విదేశి ప్రభుత్వాల మార్పుతో సంబంధం లేకుండా భారత్ ప్రయోజనాలను ఎలా నిర్ధారిస్తారన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. పొరుగు దేశం మొదటి ప్రాధాన్యం ఏంటో తెలుసుకొని దాని ప్రకారమే దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తామని పేర్కొన్నారు. అందుకే రాజకీయం అంటే రాజకీయమేని.. ఇందులో ఎటువంటి మార్పు ఉండదని తెలిపారు. ప్రతి దేశం కూడా భారతదేశంతో సఖ్యత, మద్దతుగా ఉంటుందని తాను హామీ ఇవ్వలేని స్పష్టం చేశారు. గత పదేళ్ల కాలంలో భారత్.. మాల్దీవులతో పటిష్టమైన సంబంధాలను ఏర్పరిచిందని తెలిపారు. ప్రస్తుతం అక్కడ ప్రభుత్వం మారిందని రాజకీయాల్లో కూడా మార్పులు వచ్చాయని తెలిపారు. అయినప్పటికీ అక్కడి ప్రజల్లో భారత్-మాల్దీవల మధ్య ఉన్న సంబంధాలపై మంచి అభిప్రాయమే ఉందని తెలిపారు. తమ దేశం నుంచి భారత భద్రతా బలగాలను ఉపసంహరించుకోవాలని చైనా అనుకూల వ్యక్తిగా గుర్తింపు ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు ఆదివారం సూచించినట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించిన విషయం తెలిసిందే. చదవండి: అయోధ్య: ‘డబ్బులు తీసుకోకుండా ఆశీర్వదిస్తాం’ -
మార్చి 15 కల్లా సైన్యాన్ని ఉపసంహరించుకోండి
మాలె: భారత్ తమ దేశంలోని సైన్యాన్ని మార్చి 15వ తేదీకల్లా ఉపసంహరించుకోవాలని మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు కోరారు. ప్రస్తుతం మాల్దీవుల్లో 88 మంది భారత సైనికులున్నారు. ఈ పరిణామంపై కేంద్రం ఎటువంటి వ్యాఖ్యా చేయలేదు. గత నవంబర్ 17న మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ముయిజ్జుకు చైనా అనుకూల నేతగా పేరుంది. ప్రజాభీష్టం మేరకు భారత సేనలు తమ దేశం నుంచి వెళ్లిపోవాలని ఆయన అప్పట్లోనే ప్రకటించారు. భారత ప్రధానిపై మాల్దీవుల మంత్రులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, వారిని ప్రభుత్వం తొలగించడం తెలిసిందే. ఈ పరిణామం రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసింది. -
Maldives Row: మిలిటరీ బలగాలను ఉపసంహరించుకోండి!
మాల్దీవుల-భారత్ మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతోంది. ఇటీవల ప్రధానమంత్రి లక్ష్యదీప్ పర్యటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలపై మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలతో వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. తాజాగా మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మాల్దీవులలో ఉన్న భారత భద్రతా బలగాలను తమ దేశం నుంచి మార్చి 15 వరకు ఉపసంహరించుకోవాలని ఇండియాను కోరినట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఇరుదేశాల మధ్య చోటుచేసుకున్న దౌత్య వివాదం నేపథ్యంలో మాల్దీవుల దేశం సుమారు రెండు నెలల తర్వాత మరోసారి భారత్‌ను తమ మిలిటరీ బలగాలను వెనక్కి తీసుకోవాలని కోరినట్లు సమాచారం. మాల్దీవులలో భారత్‌కు చెందిన 88 మంది మిలటరీ సైనికులు ఉన్నారు. తమ ద్వీపదేశం నుంచి భారత భద్రతా దళాలను మార్చి 15 వరకు ఉపసంహిరించుకోవాలని మర్యాదపూర్వకంగా ఇండియాను కోరినట్లు మల్దీవుల పబ్లిక్ పాలసీ కార్యదర్శి అబ్దుల్లా నజీమ్ ఇబ్రహీం తెలిపారు. ఇక నుంచి భారత భద్రతా బలగాలు మాల్దీవులలో ఉండరాదని తెలిపారు. తమ దేశ అధ్యక్షుడైన మహ్మద్ మొయిజ్జు పాలనాపరమైన విధానమని స్పష్టం చేశారు. అయితే భారత్ భద్రతా బలగాలను ఉపసంహరించే విషయంపై ఇరు దేశాలకు చెందిన ప్రతినిధులతో ఉన్నతస్థాయి కమిటి ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆ ఉన్నత స్థాయి కమిటీ మొదటి సమావేశం జరగ్గా భారత హైకమిషనర్ మును మహవర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాల్దీవుల నుంచి భారత్ భద్రతా బలగాలను మార్చి 15 వరకు ఉపసంహరించుకోవాలని మాల్దీవుల పబ్లిక్ పాలసీ కార్యదర్శి అబ్దుల్లా ఇబ్రహీం కోరినట్లు మును మహవర్ తెలిపారు. ఇక.. చైనాకు అనుకూలమైన వ్యక్తిగా గుర్తింపు ఉన్న మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు ఆ దేశానికి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నవంబర్లోనే భారత్ భద్రతా బలగాలను ఉపసంహరించుకోవాలని కోరిన విషయం తెలిసిందే. చదవండి: Maldives: మహమ్మద్ ముయిజ్జుకు ఎదురుదెబ్బ.. భారత్‌కు ఫేవర్! -
'నా సామిరంగ'.. దెబ్బకు టికెట్స్ క్యాన్సిల్ చేశా: నాగార్జున కామెంట్స్ వైరల్!
ఈ ఏడాది సంక్రాంతికి 'నా సామిరంగ' అంటూ వచ్చేశాడు కింగ్ నాగార్జున. నాగార్జున, ఆషిక రంగనాథ్ జంటగా నటించిన ఈ చిత్రానికి విజయ్ బిన్నీ దర్శకత్వం వహించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలైంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కింగ్ నాగార్జున్ మాల్దీవుస్ అంశంపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. అదేంటో తెలుసుకుందాం. కాగా.. ఇప్పటికే సంక్రాంతి బరిలో నిలిచిన గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్ చిత్రాలు రిలీజైన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: కిష్టయ్య వస్తున్నాడు... బాక్సాఫీస్ బద్దలు కొడుతున్నాడు: నాగార్జున) నాగార్జున మాట్లాడుతూ..'అటు బిగ్‌బాస్‌తో పాటు సినిమాలతో ఫుల్ బిజీగా 75 రోజుల పాటు షూటింగ్‌తో ఉన్నా. ఫెస్టివల్ తర్వాత 17,18 తేదీల్లో మాల్దీవుస్ వెళ్దామని టికెట్స్ బుక్ చేసుకున్నా. నాకు బాగా ఇష్టమైన ప్లేస్. కానీ మన ప్రధాని మోదీపై వాళ్లు చేసిన కామెంట్స్‌ను చూసి నేను టికెట్స్ క్యాన్సిల్ చేశా. అంతే కానీ.. నేను భయంతో టికెట్స్ రద్దు చేసుకోలేదు. వాళ్లు చేసింది కరెక్ట్ కాదు. ఇన్ని కోట్ల మంది ప్రజలకు లీడర్‌గా ఉన్నా మన ప్రధాని పట్ల వారు వ్యవహరించిన తీరు సరైంది కాదు. ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. మన ఇప్పటి నుంచి లక్షద్వీప్‌లోని బంగారం ఐల్యాండ్స్‌కు వెళ్దాం' అంటూ నవ్వుతూ అన్నారు. కాగా.. నా సామిరంగ అల్లరి నరేశ్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్ , రుక్సార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతమందించారు. -
Maldives: మహమ్మద్ ముయిజ్జుకు ఊహించని షాక్!
మాలె: ప్రపంచవ్యాప్తంగా మాల్దీవుల విషయం హాట్ టాపిక్‌గా మారింది. కొద్దిరోజులుగా మాల్దీవులకు సంబంధించి ప్రతీ చిన్న విషయం కూడా హైలైట్ అవుతోంది. తాజాగా మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు మరో షాక్ తగిలింది. రాజధాని మాలె మేయర్ ఎన్నికల్లో ఆయన పార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ ఘోర ఓటమి చవిచూసింది. వివరాల ప్రకారం.. మాల్దీవుల్లో అధికారం చేపట్టిన కొన్ని నెలల్లోనే అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు బిగ్ షాక్ తగిలింది. రాజధాని మాలె మేయర్ ఎన్నికల్లో ఆయన పార్టీ పీఎన్సీ ఘోర ఓటమి చవిచూసింది. భారత్ అనుకూల పార్టీ అయిన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (ఎండీపీ) ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. దీంతో, అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది. అయితే, భారత్‌తో దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న తరుణంలో అధికార పార్టీ ఓడిపోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. Congratulations 👏👏👏@adamazim , New Mayor @MaleCitymv@MDPSecretariat @MDPmediaTeam @MDPYouth pic.twitter.com/5RNIACr3Ci — Ahmed Sarah - Thimarafushi (@SarahThimara) January 13, 2024 ఇక, మాలె మేయర్‌గా ఎండీపీకి చెందిన ఆదమ్ అజీమ్ ఎన్నికయ్యారు. అధ్యక్ష అభ్యర్థిగా బరిలో దిగేంత వరకు ఆ పదవిలో ముయిజ్జు కొనసాగారు. అజీమ్ గెలుపును మాల్దీవుల మీడియా భారీ ఘన విజయంగా అభివర్ణించింది. ఎండీపీకి ప్రస్తుతం భారత అనుకూల విధానాలను అనుసరించే మాజీ అధ్యక్షుడు మహమ్మద్ సొలిహ్ నాయకత్వం వహిస్తున్నారు. కాగా, మేయర్ గెలుపు ఎండీపీకి రాజకీయంగా కలిసొస్తుందని అక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా.. చైనా పర్యటన అనంతరం అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు పరోక్షంగా భారత్‌పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మాల్దీవులను విమర్శించే హక్కు ఏ దేశానికి లేదన్నారు. ‘మాది చిన్న దేశమే కావచ్చు. కానీ అది మీకు మమ్మల్ని అవమానించేందుకు అనుమతి ఇవ్వడం లేదు. ఓ స్వతంత్ర, సార్వభౌమ దేశం మాది’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
మమ్మల్ని విమర్శించే హక్కు ఏ దేశానికి లేదు: మాల్దీవ్స్ అధ్యక్షుడు
చైనా పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాల్దీవులను విమర్శించే హక్కు ఏ దేశానికి లేదని పరోక్షంగా భారత్‌ను ఉద్ధేశిస్తూ వ్యాఖ్యానించారు. ‘మాది చిన్న దేశమే కావచ్చు. కానీ అది మీకు మమ్మల్ని అవమానించేందుకు అనుమతి ఇవ్వడం లేదు..’ అంటూ చైనాలో అయిదు రోజుల పర్యటన నేటితో(శనివారం) ముగుస్తున్న సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అన్నారు. కాగా ప్రస్తుతం మాల్దీవులు వర్సెస్ భారత్ వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించి అక్కడి సాగర తీరాన ప్రకృతి అందాలను సేదతీరుతున్న ఫోటోలను, సముద్ర సాహస క్రీడల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. దీంతో లక్షద్వీప్ ఒక్కసారిగా నెట్టింట్లో ట్రెండింగ్‌గా మారింది. వేల మంది నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు. చదవండి: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరు అంతస్తుల్లో చెలరేగిన మంటలు మాల్దీవులకు వెళ్లాలనుకుంటున్న పర్యాటకుల చూపు ఒక్కసారిగా లక్షద్వీప్ వైపు మళ్ళింది. దీంతో మాల్దీవుల్లో ఎనిమిది వేలకు పైగా హోటల్ బుకింగ్స్, వేల సంఖ్యలో విమాన టికెట్లు రద్దయ్యాయి. ఈ పరిణామాలు తమ దేశ పర్యాటకంపై ఎక్కడ ప్రభావం చూపుతాయని భావించిన మాల్దీవులు మంత్రులు.. మోదీ, భారత్‌పై అనుచిత వ్యాఖ్యలుచేశారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది. దీంతో బైకాట్ మాల్దీవ్స్ అంటూ భారత నెటిజన్లు నెట్టింట్లో నిరసన వ్యక్తం చేశారు. దీంతో నష్ట నివారణకు ఉపక్రమించిన మాల్దీవులు సర్కారు.. అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులను సస్పెండ్ చేసింది. భారత్ విషయంలో మాల్దీవుల ప్రభుత్వ వైఖరిపై సొంత దేశంలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదం రాజుకున్న సమయంలోనే మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు చైనాలో పర్యటించారు. చైనా నుంచి తమ దేశానికి మరింతమంది పర్యాటకులువచ్చేందుకు కృషి చేయాలని ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కోరారు. -
Maldives Row: వారి కుట్రతోనే వివాదం..మాల్దీవుల మాజీ రాయబారి
న్యూఢిల్లీ: భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు దెబ్బతినేందుకు అక్కడ అధికారంలో ఉన్న ఇస్లామిక్ కన్జర్వేటివ్ పార్టీయే కారణం అని మాల్దీవుల్లో గతంలో భారత హై కమిషనర్‌గా పనిచేసిన మనోహర్ మూలే తెలిపారు. ‘మాల్దీవుల ప్రజల మనసును కలుషితం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. దీని వెనుక చైనా పాత్ర కీలకంగా ఉంది. పర్యాటక దేశంలోని కన్జర్వేటివ్ ఇస్లామిస్టులకు చైనా తన పూర్తి అండదండలందిస్తోంది. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ ఇస్లామిస్టులు అభివృద్ధి వైపు ఎక్కువ మొగ్గు చూపుతారనే పేరుంది. అదే సమయంలో ఇస్లామిక్ భావజాలాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. మహ్మద్ మొయిజ్జు మాల్దీవుల్లో అధికారం చేపట్టినప్పటి నుంచి పాలనలో కొంత ఇస్లామిక్ రంగు కనిపిస్తోంది. మొయిజ్జు ప్రధాని అయిన తర్వాత తొలుత టర్కీలో పర్యటించారు. రెండవ పర్యటన కోసం చైనాకు వెళ్లారు. నిజానికి మహ్మద్ మొయిజ్జు మాల్దీవుల మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ను అనుసరించే వ్యక్తి అబ్దుల్లా యమీన్ కరుడు గట్టిన భారత్ వ్యతిరేకి అని తెలిసిందే.ప్రస్తుతం మహ్మద్ మొయిజ్జు చేపట్టినట్లుగానే 2015లో అబ్దుల్లా యమీన్ ఇండియా అవుట్ క్యాంపెయిన్‌ను చేపట్టారు’ అని మనోహర్ మూలే వివరించారు. ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో తీవ్ర వివాదం రేగింది. వేల సంఖ్యలో భారత పర్యాటకులు తమ మాల్దీవుల పర్యటనలను రద్దు చేసుకున్నారు. సోషల్ మీడియాలో బాయ్‌కాట్ మాల్దీవులు పిలుపును కూడా ఇచ్చారు. ఈ పిలుపుతో దిగి వచ్చిన మాల్దీవుల ప్రభుత్వం ఆ మంత్రుల వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని పేర్కొంది. మోదీపై వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేసింది. ఇదీచదవండి..హౌతీలపై అమెరికా దాడులు -
మాల్దీవుల్లో విదేశీ జోక్యాన్ని వ్యతిరేకిస్తున్నాం: చైనా
బీజింగ్: మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నామని చైనా పేర్కొంది. మాల్దీవుల సార్వ భౌమత్వం, స్వాతంత్య్రాలకు తమ మద్దతు ఉంటుందని తెలిపింది. మాల్దీవుల అధ్యక్షు డు ముయిజ్జు చైనాలో అయిదు రోజుల పర్యటన శుక్రవారంతో ముగియ నుంది. ఈ సందర్భంగా రెండు దేశాలు తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు పరస్ప రం మద్దతుగా నిలవాలంటూ ఒక ప్రకటన విడుదలైంది. ‘మాల్దీవుల సార్వభౌమాదికారం, స్వాతంత్య్రం, జాతి గౌరవాన్ని నిలబెట్టడంలో చైనా గట్టిగా మద్దతిస్తుంది. మాల్దీవుల విధానాలను గౌరవిస్తుంది, మద్దతు ఇస్తుంది. మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో బాహ్య జోక్యాన్ని వ్యతిరే కిస్తుంది’అని అందులో పేర్కొంది. భారత ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను అధ్యక్షుడు ముయిజ్జు తొలగించడం, ఈ వ్యవహారం ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తలు పెంచడం తెలిసిందే. ఈ సమయంలోనే చైనా అనుకూలుడిగా పేరున్న ముయిజ్జు బీజింగ్ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. పర్యటన అనంతరం చైనాపై ప్రకటన విడుదల చేయడం గమనార్హం. -
బై బై మాల్దీవులు చలో లక్షద్విప్
సాధారణంగా హైదరాబాద్ నుంచి ప్రతి రోజూ వందలాది మంది టూరిస్టులు మాల్దీవులకు వెళ్తారు. హైదరాబాద్ నుంచి కేవలం రెండున్నర గంటల ప్రయాణం కావడం, ఎక్కువ సంఖ్యలో దీవులు, ఆకట్టుకునే బీచ్‌లు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో మూడు, నాలుగు రోజుల పాటు గడిపేందుకు ఆసక్తి చూపుతారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొద్ది రోజులుగా ఈ టూర్లు పూర్తిగా తగ్గిపోయాయి. సాక్షి, హైదరాబాద్: పర్యాటకులకు స్వర్గధామంగా భావించే మాల్దీవుల పట్ల నగరవాసులు విముఖతను ప్రదర్శిస్తున్నారు. సాధారణంగా హైదరాబాద్ నుంచి మాల్దీవులకు రోజూ విమానాలు రాకపోకలు సాగిస్తాయి. పర్యాటకులతోపాటు కొత్తగా పెళ్లయిన జంటలు మాల్దీవులను హనీమూన్‌కు ఎంపిక చేసుకుంటారు. అలాగే డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు కూడా మాల్దీవులు కొంతకాలంగా కేరాఫ్‌గా మారింది. కానీ ఇటీవల ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన సందర్భంగా మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దేశంతోపాటు నగరం నుంచీ అక్కడికి వెళ్లే పర్యాటకుల సంఖ్య అకస్మాత్తుగా పడిపోయింది. ఇప్పటికే ప్యాకేజీలు బుక్ చేసుకున్న వాళ్లు పర్యటనలు వాయిదా వేసుకుంటుండగా, కొత్తగా ఎలాంటి బుకింగ్‌లు కావడం లేదని హైదరాబాద్‌కు చెందిన పలు ట్రావెల్స్ సంస్థలు తెలిపాయి. పలు ఎయిర్‌లైన్స్, ట్రావెల్స్ సంస్థలు విమాన, ప్యాకేజీ చార్జీలను తగ్గించినప్పటికీ మాల్దీవులకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని నగరానికి చెందిన ఒక ప్రముఖ ట్రావెల్స్ సంస్థ ప్రతినిధి తెలిపారు. సంక్రాంతి సందర్భంగా వరుస సెలవులను దృష్టిలో ఉంచుకుని వెళ్లే వాళ్లు కూడా తమ పర్యటనలను వాయిదా వేసుకున్నట్లు చెప్పారు. దీంతో కొత్త సంవత్సరం సందర్భంగా ఉండే డిమాండ్ కూడా బాగా తగ్గిందన్నారు. లక్షద్విప్ వైపు సిటీ చూపు.. మాల్దీవులకు ప్రత్యామ్నాయంగా నగర పర్యాటకులు లక్షద్విప్ను ఎంపిక చేసుకుంటున్నారు. దీంతో లక్షద్వీప్‌కు పర్యాటక ప్యాకేజీలు, విమాన చార్జీలు కూడా పెరిగాయి. లక్షద్విప్‌లో రెండు రోజుల క్రూయిజ్ పర్యటనకు గతంలో రూ.20 వేలు ఉంటే ప్రస్తుతం రూ.35 వేల వరకు ప్యాకేజీ ధరలు పెరిగాయి. ప్యాకేజీల వివరాలను తెలుసుకొనేందుకు పదుల సంఖ్యలో ఫోన్‌కాల్స్ వస్తున్నట్లు సికింద్రాబాద్‌కు చెందిన ఒక పర్యాటక సంస్థ ప్రతినిధి చెప్పారు. లక్షద్విప్తోపాటు సమీప ప్రాంతాల్లో పర్యటించేందుకూ సిటీజనులు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు గోవా, డామన్ డయ్యూ, కోవలం తదితర ప్రాంతాలకు సైతం సిటీ టూరిస్టులు తరలివెళ్తున్నారు. ప్యాకేజీల్లో భారీ రాయితీలు ఒక్కసారిగా మాల్దీవులకు వెళ్లే టూరిస్టులు తగ్గిపోవడంతో ట్రావెల్స్ సంస్థలు, ఎయిర్‌లైన్స్ భారీ ఆఫర్లతో ముందుకొచ్చాయి. గతంలో మూడు రోజుల ప్యాకేజీ రూ.55,000 నుంచి రూ.72,000 వరకు ఉంటే దాన్ని ఇప్పుడు రూ.45,000 నుంచి రూ.60,000 వరకు తగ్గించినట్లు ఒక ట్రావెల్ ఏజెంట్ చెప్పారు. అలాగే రూ.లక్షల్లో ఉండే ప్రీమియం ప్యాకేజీలపైనా భారీ తగ్గింపును ప్రకటించారు. ప్రీమియం ప్యాకేజీలపై రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు తగ్గించినట్లు మరో ట్రావెల్స్ ప్రతినిధి తెలిపారు. విమానంలో సింగిల్ జర్నీ గతంలో రూ.20 వేల వరకు ఉంటే ఇప్పుడు రూ.15వేల వరకు తగ్గించారు. మరోవైపు ఇప్పటికే బుకింగ్‌లు చేసుకున్నవారు మాత్రం తమ పర్యటనలను రద్దు చేసుకోకుండా వాయిదా వేసుకుంటున్నారు. బుకింగ్‌లను రద్దు చేసుకుంటే భారీగా నష్టపోయే అవకాశం ఉండటంతో వాయిదా వేసుకుంటున్నారు. కానీ కొత్తగా బుకింగ్‌లు మాత్రం కావడం లేదు. అన్ని ట్రావెల్స్ సంస్థల్లో మాల్దీవులకు బుకింగ్‌లు పూర్తిగా స్తంభించాయి. -
మాల్దీవులు-భారత్ వివాదం ముగియాలంటే ఇదే మార్గం..!
మాలే: భారత్-మాల్దీవుల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను పరిష్కరించడంపై ఆ దేశ ప్రతిపక్ష నాయకుడు, డెమోక్రాటిక్ పార్టీ ఛైర్పర్సన్ ఫయ్యాజ్ ఇస్మాయిల్ చక్కని ఫార్ములా సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన వైఖరి ప్రదర్శించాలని ప్రభుత్వాన్ని కోరారు. సోషల్ మీడియా ద్వారానే ఇద్దరి వ్యక్తులు వివాదం రెండు దేశాల మధ్య వివాదంగా మారిందని అన్నారు. 'భారత్-మాల్దీవుల మధ్య వివాదం ప్రభుత్వాలను దాటిపోయింది. సోషల్ మీడియా ద్వారానే ఇరుదేశాల సామాన్య ప్రజలకు కూడా ఈ అంశం చేరింది. ఇరుపక్షాల నుంచి వాదించుకుంటున్నారు. ఒకరినొకరు అవమానించుకుంటున్నారు. ప్రధాని మోదీపై అవమానకర వ్యాఖ్యలు చేయడంలో ప్రభుత్వానికి ఎలాంటి ఉద్దేశం లేదని మనం స్పష్టంగా తెలియజేయాలి. ప్రభుత్వంలో స్థానం కల్పించిన వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయలు మాత్రమేనని ఇరుపక్షాలకు తెలిపేలా చర్యలు తీసుకోవాలి' అని ఆయన అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న వివాదం ఇరుదేశాల మధ్య సంబంధాలను, ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తుందా? అని అడిగిన ప్రశ్నకు.. ఈ సమస్య ఇరుదేశాల ఆర్థిక ప్రయోజనాలకు మించినదని అన్నారు. ఎన్నో ఏళ్లుగా గత ప్రభుత్వ నేతలు ఇండియా-మాల్దీవుల మధ్య మంచి బంధాలను ఏర్పరిచారని తెలిపిన ఇస్మాయిల్.. కేవలం ఇద్దరు వ్యక్తులు రెండు మెసేజ్‌లతో చెడగొట్టారని మండిపడ్డారు. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మళ్లీ నెలకొల్పడంపైనే ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. అది సహజమే.. ఇరుదేశాల్లో జాతీయవాదులు వైరుధ్యంగా మాట్లాడవచ్చు. భారత్ పాత్ర లేకుండానే మాల్దీవులు రాణించగలదని, అలాగే.. మాల్దీవులు చిన్న దేశం అని ఇరుపక్షాలు చెప్పవచ్చు. కానీ ఇది సరైన విధానం కాదు. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పుకోవడం మాత్రమే ప్రధానం.' అని ఇస్మాయిల్ అన్నారు. మాల్దీవుల ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ చైనా పర్యటనపై స్పందించిన ఇస్మాయిల్.. ప్రభుత్వాలు మారినప్పుడు విదేశాంగ విధానం మారడం సహజమేనని చెప్పారు. గత తమ ప్రభుత్వంలో భారత్‌కు మొదటి ప్రాధాన్యం ఇచ్చాం.. ప్రస్తుత ప్రభుత్వం చైనాకు మొదటి ప్రాధాన్యం ఇవ్వడంలో సమస్యేమి లేదని అన్నారు. ఒక్క ఇజ్రాయెల్ తప్పా.. ప్రపంచంలో అన్ని దేశాలతో మాల్దీవులు మంచి సంబంధాన్నే కొనసాగిస్తుందని చెప్పుకొచ్చారు. ఇదీ చదవండి: మాల్దీవుల వివాదం.. భారత్‌పై చైనా మీడియా అక్కసు -
మాల్దీవులు పావుగా కుట్ర !..చైనాకి చెక్..మోదీ స్కెచ్ ?
-
లక్షద్వీప్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. మోదీ మాస్టర్ ప్లాన్!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో చేపట్టిన పర్యటన.. దేశీయ పర్యాటకుల్లో ఆ దీవుల సముదాయంపై ఒక్కసారిగా ఆసక్తిని పెంచింది. ఈ నేపథ్యంలో కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. యుద్ధ విమానాలతోపాటు వాణిజ్య విమాన సర్వీసులను సైతం నడిపేందుకు వీలైన విమానాశ్రయాన్ని లక్షద్వీప్‌లోని మినికాయ్ దీవిలో నిర్మిస్తే బాగుంటుందని యోచిస్తోంది. ఇప్పటి వరకు మినికాయ్ దీవిలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలనే రక్షణ శాఖ ప్రతిపాదన మాత్రమే కేంద్రం వద్ద ఉంది. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో సైనిక, పౌర అవసరాలకు సైతం సరిపోయేలా ఎయిర్‌పోర్టును నిర్మించే సరికొత్త ప్రతిపాదన కేంద్రం పరిశీలిస్తోందని అధికారవర్గాలు తెలిపాయి. అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రాలకు బేస్‌గా, పెరుగుతున్న పైరసీ, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా చాలా కీలకమైందిగా ఇక్కడి ఎయిర్‌పోర్టు మారేందుకు అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అరేబియా సముద్రంపై నిఘాను మరింత విస్తృతం చేసుకునేందుకు మినికాయ్ వద్ద ఎయిర్‌పోర్టు వైమానిక దళానికి ఉపయోగపడనుంది. ప్రస్తుతం లక్షద్వీప్ మొత్తంలో ఒకే ఒక్క విమానాశ్రయం అగట్టిలో ఉంది. ఇక్కడ చిన్న విమానాలు మాత్రమే దిగేందుకు అవకాశం ఉంది. మినికాయ్ దీవిలో విమానాశ్రయం అందుబాటులోకి వస్తే పర్యాటక రంగం అభివృద్ధి చెందనుంది. మరోవైపు, భారత్‌తో వివాదం తమకు భారీగా నష్టం చేసేలా కన్పిస్తున్న నేపథ్యంలో మాల్దీవులకు చెందిన పర్యాటక సంస్థలు రంగంలోకి దిగాయి. ఇటీవల సస్పెన్షన్‌కు గురైన తమ మంత్రులు ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు పేర్కొన్నాయి. -
Maldives Row : భారత్‌పై చైనా మీడియా సంచలన కథనాలు
న్యూఢిల్లీ: ఓ వైపు భారత్, మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతోంది. మరోవైపు తాజాగా ఈ వివాదంలో చైనా తలదూర్చింది. ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన ప్రధాని మోదీపై విమర్శలు చేసిన మాల్దీవుల మంత్రులపై భారత్ వ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికిన విషయం తెలిసిందే. ఈ మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది. అయితే ఈ విషయంలో చైనా మీడియా మాత్రం భారత్‌దే తప్పన్నట్లు చిత్రీకరిస్తూ కథనాలు ప్రచురిస్తోంది. ‘దక్షిణ ఆసియాలో ఆధిపత్యం ప్రదర్శించాలనే మనస్తత్వంతో భారత్ ఉంది. ఎప్పటి నుంచో భారత్ తీరు ఇలానే ఉంది. ఇదే ఆ ప్రాంతంలోని మాల్దీవుల లాంటి దేశాలతో భారత సంబంధాలు దెబ్బతినడానికి కారణమవుతోంది. మాల్దీవులతో వివాదానికి సంబంధించి మా మీదకు మాత్రం తప్పు నెట్టకండి’అని పలువురు చైనా విశ్లేషకులు భారత్‌పై రాసిన కథనాలను ఆ దేశ అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ప్రచురించింది. భారత్‌తో ఓ పక్క వివాదం నడుస్తున్న సమయంలో మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు ఐదు రోజుల పర్యటన కోసం చైనాలోనే ఉండటం గమనార్హం. ఇదీచదవండి..ఇజ్రాయెల్ గాజా యుద్ధం.. హౌతీ వ్యాఖ్యలు -
మాల్దీవుల వివాదం.. ప్రధాని మోదీకి మద్దతుగా శరద్ పవార్
‘లక్షద్వీప్’ విషయంలో మాల్దీవులు-భారత్ మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్నాయి. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన అనంతరం భారత్‌పై మాల్దీవ్ మంత్రులు వ్యంగ్య వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య వివాదాస్పద వాతావరణం తలెత్తిన విషయం తెలిసిందే. తాజాగా మాల్దీవుల వివాదంపై ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ స్పందించారు. ఈ విషయంలో మోదీకి మద్దతుగా నిలిచి శరద్ పవార్.. ఇతర దేశాలకు చెందిన వారు ప్రధానికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేసినా తాము(దేశం) అంగీకరించబోమని తేల్చి చెప్పారు. ‘మోదీ దేశానికి ప్రధానమంత్రి.. వేరే దేశస్థులు మా ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాటిని మేము అంగీకరించము. మేము ప్రధానమంత్రి పదవిని గౌరవిస్తాం. ఆయనకు వ్యతిరేకంగా బయటి వాళ్లు ఏం మాట్లాడినా మేం ఊరుకోం’ అని పేర్కొన్నారు. కాగా గత వారం ప్రధాని లక్ష్యద్వీలో పర్యటించిన విషయం తెలిసిందే. అక్కడ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఆయన.. కొన్ని గంటలపాటు ఆ సముద్ర తీరంలో సేద తీరారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ పేర్కొన్నారు. ఈ ఫోటోలో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో.. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు. దీనిపై మాల్దీవుల మంత్రులు వ్యంగ్యంగా స్పందించారు. సంబంధిత వార్త: భారత్-మాల్దీవుల వివాదం.. దుష్టబుద్ధిని బయటపెట్టిన చైనా లక్షద్వీప్‌పై అక్కసు వెళ్లగక్కుతూ మోదీని జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ఇది ఇరుదేశాల మధ్య వివాదాస్పద వాతావరణం ఏర్పడటానికి కారణమైంది. ఈ క్రమంలో ప్రపంచ పర్యాటకులంతా లక్షద్వీప్ వైపు చూస్తున్నారు. చాలా వరకు భారతీయులు మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకుంటున్నారు. బైకాట్ మాల్దీవులు అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. మరోవైపు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు మాల్దీవ్ ప్రభుత్వం సిద్ధమైంది. భారత్‌పై విమర్శలు చేసిన మంత్రులపై వేటు వేసింది. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో త్వరలోనే మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు భారత్ పర్యటనకు రానున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. చదవండి: లక్షద్వీప్ వైపు లక్షల మంది చూపు! -
భారత్-మాల్దీవుల వివాదం.. దుష్టబుద్ధిని బయటపెట్టిన చైనా
బీజింగ్: మాల్దీవులు-భారత్ మధ్య వివాదాస్పద వాతావరణం నెలకొన్న వేళ చైనా తన దుష్టబుద్ధిని బయటపెట్టింది. మాల్దీవుల అంశంలో భారత్‌పై మరోసారి విమర్శలు గుప్పించింది. ఆసియా దేశాల మధ్య దౌత్య సంబంధాల్లో భారత్ మరింత ఓపెన్ మైండెడ్(విశాల దృక్పథం)తో ఆలోచించాలని విమర్శలు చేసింది. మాల్దీవుల-భారత్ మధ్య వివాదం నడుస్తున్న వేళ మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు చైనాలో పర్యటిస్తున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు ముయిజ్జు తన సతీమణితో కలిసి బీజింగ్ వెళ్లారు. ఈ క్రమంలోనే చైనా అధికారిక గ్లోబల్ టైమ్స్ సంపాదకీయంలో భారత్‌పై చైనా అక్కసు వెళ్లగక్కింది. 'మాల్దీవులను మేము సమాన భాగస్వామిగా పరిగణిస్తాం. భారత్, చైనా ఘర్షణల నేపథ్యంలో భారత్‌కు దూరంగా ఉండాలని మాల్దీవులకు మేము ఎన్నడు చెప్పలేదు. భారత్ నుంచి మాల్దీవులకు వచ్చే సహకారాన్ని ముప్పుగా భావించలేదు. సంబంధాల్లో భారత్ మరింత విశాల దృక్పథంతో నిర్ణయాలు తీసుకోవాలి' అని గ్లోబల్ టైమ్స్ కథనం ప్రచురించింది. మాల్దీవుల్లో గత సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో మహమ్మద్ ముయిజ్జు అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి భారత్-మాల్దీవుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈయనకు ముందు వరకు మాల్దీవులు భారత్‌తో సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకున్నాయి. కానీ ముయిజ్జు అధికారంలోకి వచ్చాక మాల్దీవులకు చైనాతో సాన్నిహిత్యం ఎక్కువైంది. ఆ దేశంలో చైనా పెట్టుబడులు పెట్టి తన ప్రభావాన్ని విస్తరిస్తోంది. అధ్యక్షునిగా పదవి చేపట్టిన వెంటనే ఆయన మొదట చైనాకే పర్యటించారు. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. ఇది ఇరుదేశాల మధ్య వివాదాస్పద వాతావరణం ఏర్పడటానికి కారణమైంది. ఇదీ చదవండి: భారత హైకమిషనర్‌కు మాల్దీవులు సమన్లు -
లక్షద్వీప్ వైపు లక్షల మంది చూపు!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ జనవరి మొదటి వారంలో లక్షద్వీప్‌లో పర్యటించారు.కవరత్తిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కొన్ని గంటల పాటు ఆ సముద్ర తీరంలో సేద తీరారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకోవైపు,మాల్దీవుల మంత్రులు లక్షద్వీప్ పరిశుభ్రత గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారిపై ఆ ప్రభుత్వం వేటు కూడా వేసింది. వీటన్నిటి ప్రభావంతో నేడు ప్రపంచ పర్యాటకులంతా లక్షద్వీప్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే లక్షలమంది గూగుల్, మేక్ మై ట్రిప్ బాట పట్టారు. ఈ 20 ఏళ్ళలో ఎప్పుడూ లేనంత గరిష్ఠ స్థాయిలో ఆన్ లైన్ అన్వేషణ పెరిగిందని కేంద్ర సమాచార శాఖ విభాగాలు వెల్లడించాయి. తమ వెబ్ సైట్ లో లక్షద్వీప్ కోసం వెతుకుతున్న వారి సంఖ్య అనూహ్య రీతిలో పెరిగిందని ఆన్ లైన్ ట్రావెల్ సంస్థ మేక్ మై ట్రిప్ కూడా ప్రకటించింది. ప్రధాని మోదీ ఈ ద్వీపంలో గడపడమే కాక సాహసమైన ప్రయాణం కూడా చేశారు. సముద్ర గర్భంలో తిరుగుతూ మిగిలిన జీవరాసుల జీవనాన్ని కూడా దర్శించుకున్నారు. అంత పెద్ద ద్వీపంలో ఇంతటి సాహసం చేయడం మోదీకే చెల్లిందనే ప్రశంసలు,ఇటువంటి సాహసకృత్యాలు ఎందుకనే విమర్శలు రెండూ వెల్లువెత్తాయి. లక్షద్వీప్ లో అద్భుతమైన బీచ్ లు ఉండడమే కాక,భోజనం, ఆహారపదార్ధాలు,ఆతిధ్యం అద్భుతంగా వున్నాయని సాక్షాత్తు దేశ ప్రధాని చెప్పడంతో భారతీయులలో ఈ ద్వీపాలను దర్శించాలనే ఆరాటం పెరిగింది. మిగిలిన దేశాల వారికీ అంతే ఆసక్తి పెరిగింది. మాల్దీవ్ ప్రభుత్వానికి మాత్రం అసూయ,భయం పెరిగాయి. భారత్ లోని బీచ్ లను,ద్వీపాలను అన్వేషించాలనే ఆరాటం ప్రపంచ పర్యాటకులలో మరింత ఎక్కువైంది. ఒక్క సంఘటన ఇంత ప్రభావం చూపిందన్నమాట! లక్షద్వీప్ పై మాల్దీవులు అక్కసు వెళ్ళ గక్కుతూ,కువిమర్శలు చేస్తున్న వేళ,మాల్దీవులకు బుకింగ్స్ నిలిపివేయాలని నెటిజన్లు మేక్ మై ట్రిప్ వారికి సూచనలు పంపుతున్నారు. ఈ వేడి రగులుతున్న సందర్భంలో దిద్దుబాటు చర్యలకు మాల్దీవ్ ప్రభుత్వం సిద్ధమైంది. భారత్ తో సయోధ్య కోసం అర్రులు జాస్తోంది. మన దేశ సినిమా,క్రీడారంగ ప్రముఖులు సైతం మాల్దీవులకు ప్రత్యామ్నాయంగా భారత ద్వీపాలను దర్శించాలని పిలుపునివ్వడం గమనార్హం! భారత్ లో పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి కేంద్ర ప్రభుత్వం అనేక ప్రణాళికలు చేస్తోంది.ప్రధాని చేసిన లక్షద్వీప్ పర్యటన,ప్రచారం కూడా అందులో భాగమేనని అర్థం చేసుకోవాలి. లక్షద్వీప్ లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు పెరగాల్సివుంది. పర్యాటక విధానంలో యువతకు ఉద్యోగాల కల్పన కూడా ముఖ్యమైన అంశం. ఇప్పుడు ఇంతగా చర్చకు,శోధనకు కేంద్రంగా మారిన ఈ ద్వీపం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఇది దేశంలోనే అత్యల్ప సంఖ్యలో జనాభా కలిగిన అతి చిన్న కేంద్ర పాలిత ప్రాంతం. అరేబియా సముద్రంలో కేరళ తీరం నుంచి 200-300 కిలోమీటర్ల దూరంలో ఈ ద్వీపాలు వున్నాయి. ఈ ప్రాంత రాజధాని కవరత్తి నగరం.లక్షద్వీప్ పేరుతో ఒక జిల్లా కేంద్రం కూడా వుంది. లెక్కల్లోలేని అనేక ద్వీపాలు ఈ సముద్రంలో ఉన్నాయి.అందుకే లక్షద్వీప్ అనే పేరు వచ్చింది. ప్రస్తుతం దొరికే అంకెల ప్రకారం 10 దీవుల్లో మాత్రమే జనాభా వున్నారు. మిగిలిన 17 దీవులలో జనాభా శూన్యం. సముద్రగర్భంలో మాత్రం అనేక జీవరాసులు వున్నాయి. ఆగట్టిలో ఎయిర్ పోర్ట్ వుంది. కొచ్చిన్ నుంచి ఇక్కడికి విమానాల రాకపోకలు వున్నాయి. ఇక్కడ వున్నదంతా ముస్లిం జనాభానే. కాకపోతే,వీళ్లంతా మలయాళం యాసలో మాట్లాడుతారు. లక్షద్వీప్ గురించిన ప్రస్తావన తమిళ సాహిత్యంలో మొట్టమొదటగా వచ్చినట్లు చెబుతారు.ఒకప్పుడు పల్లవుల ఏలుబడిలో ఈ ప్రాంతం ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం ఇక్కడ జనాభా మొత్తం కలిసి 70వేలు లోపే. మలయాళం,జెసేరీ ( ద్వీపంలోని స్థానిక భాష ),తమిళం,మలయాళ యాసతో అరబిక్,మహ్ల్ భాషలు ఇక్కడ వాడుకలో ఉన్నాయి. ప్రధానంగా మలయాళం -అరబిక్ సంస్కృతి ఇక్కడ రాజ్యమేలుతోంది. ఈ దీవులు మాల్దీవులలోని చాగోస్ దీవులను పోలివుంటాయి. "మీరు సాహసాలు చెయ్యాలనుకుంటున్నారా? అయితే,లక్షద్వీప్ లో 'స్మార్కెలింగ్ చేయండి. మీ సాహసాల జాబితాలో దీనిని కూడా చేర్చుకోండి "అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచిస్తున్నారు.ఇది అద్భుతమైన అనుభవమని కితాబు ఇస్తున్నారు. స్మార్కెలింగ్ అంటే?సముద్రంలో చేసే ఒక తరహా డ్రైవింగ్.స్మార్కెల్ అనే ట్యూబ్, డ్రైవింగ్ మాస్క్ వేసుకొని సముద్రగర్భంలో ఈత కొట్టడం అన్నమాట! దీని ద్వారా సాగర గర్భంలోని జీవరాశులను, పర్యావరణాన్ని తెలుసుకొనవచ్చు. మన ప్రధాని ఆ పని చేశారు. మొత్తంగా చూస్తుంటే, మాల్దీవులు -లక్షద్వీప్ మధ్య భవిష్యత్తులో పెద్ద పోటీ జరుగనుంది. వెరసి,మన పర్యాటకం ఊపందుకోనుంది. 👉: #Lakshadweep : ప్రకృతి చెక్కిన ‘అందాలు’.. లక్షదీప్ చూసొద్దామా.. (ఫొటోలు) రచయిత : మా శర్మ, సీనియర్ జర్నలిస్టు -
#Maldives : బుల్లి దేశం.. మంత్రముగ్ధం.. మాల్దీవులు (ఫొటోలు)
-
భారత్ అంటే "911 కాల్".. మాల్దీవుల మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు
మాలే: మాల్దీవులు-భారత్ మధ్య కొనసాగుతున్న వివాదంపై ఆ దేశ మాజీ రక్షణ మంత్రి మారియా అహ్మద్ దీదీ స్పందించారు. ప్రధాని మోదీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం మాల్దీవుల ప్రభుత్వానికే చిన్నచూపు అని ఆమె అన్నారు. రక్షణతో సహా వివిధ రంగాలలో సహాయం చేస్తూ భారతదేశం నమ్మకమైన మిత్రదేశంగా ఉందని చెప్పారు. భారత్‌తో మాల్దీవులకు ఉన్న చిరకాల బంధాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను ఆమె విమర్శించారు. మాల్దీవుల మంత్రుల అవమానకరమైన వ్యాఖ్యలపై మారియా అహ్మద్ నిరాశను వ్యక్తం చేశారు. మాల్దీవుల పట్ల భారతదేశాన్ని "911 కాల్"(అమెరికాలో అత్యవసర సేవల నెంబర్)గా అభివర్ణించారు. ఎప్పుడూ కాల్ చేసినా మాల్దీవులను రక్షించడానికి సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు. ప్రధాని మోదీని అవమానించడం ప్రస్తుత ప్రభుత్వ చిన్న చూపు అని విమర్శించారు. 'మేము అధికారంలో ఉన్నప్పుడు అందరితో స్నేహంగా ఉన్నాం. భారతదేశంతో భద్రతా సమస్యలను పంచుకున్నాం. భారత్ కూడా ఎల్లప్పుడూ మాకు సహాయం చేస్తుంది. రక్షణ రంగంలో సామర్థ్యం పెంపొందించడం మాల్దీవులను స్వయం సమృద్ధిగా మార్చడానికి ప్రయత్నించాం' అని మరియా అహ్మద్ దీదీ అన్నారు. #WATCH | Male: On the row over Maldives MP's post on Prime Minister Narendra Modi, Former Maldives Defence Minister Mariya Ahmed Didi says, "... India has been our 911 call, whenever we need it, we give a call and you all come to our rescue. That kind of a friend. When you see… pic.twitter.com/9X64vqwWwg — ANI (@ANI) January 8, 2024 ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యల అంశంపై మాల్దీవుల విదేశాంగ మంత్రిని పార్లమెంట్లో ప్రశ్నించాలని ఆ దేశ పార్లమెంట్ సభ్యుడు మికేల్ నసీమ్ పిలుపునిచ్చారు. అవమానకర వ్యాఖ్యలు చేసిన సభ్యులు జవాబుదారీతనంగా ఉండాలని కోరారు. భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ దేశ ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ి ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య వివాదాస్పద వాతావరణం ఏర్పాటైంది. భారత్ గురించి హైళనగా మాట్లాడటంపై ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బైకాట్ మాల్దీవులు నినాదాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఆ తర్వాత ఇరుదేశాలు హైకమిషనర్లకు సమన్లు జారీ చేశాయి. ఇదీ చదవండిL: భారత హైకమిషనర్‌కు మాల్దీవులు సమన్లు -
#Maldives Row: ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన.. టీమిండియా పేసర్ స్పందన
#Maldives Row- #ExploreIndianIslands: దేశ పర్యాటక రంగ వృద్ధిలో పాలుపంచుకోవాల్సిన బాధ్యత భారతీయులందరిపై ఉందని టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ అన్నాడు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు వీలుగా చేపడుతున్న చర్యలకు మద్దతుగా ఉండాలని పిలుపునిచ్చాడు. కాగా ప్రధాని మోదీ ఇటీవల.. కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌ను సందర్శించారు. అక్కడి ప్రకృతి అందాలను ఆవిష్కరిస్తూ సముద్ర తీరంలో తన సాహసక్రీడలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేశారు. మీలోని సాహసికుడికి సరైన గమ్యస్థానం లక్షద్వీప్ అంటూ పర్యాటకులను ఉద్దేశించి పోస్ట్ పెట్టారు. మల్దీవుల మంత్రుల నోటి దురుసుతనం ఈ నేపథ్యంలో మాల్దీవుల మంత్రి అబ్దుల్లా మాజిద్ మాల్దీవులను మరపించి లక్షద్వీప్‌ను పర్యాటక కేంద్రంగా ప్రోత్సహించడానికే మోదీ ఇలాంటి చర్యకు పూనుకున్నారంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దుమారం రేగింది. తర్వాత మరియం షియునా, మాల్షా ఆయనకు మద్దతుగా భారత్‌ను తక్కువ చేసే విధంగా మాట్లాడటంతో వివాదం మరింత ముదిరింది. మాకేం సంబంధం లేదు దీంతో ఆ దేశ అధ్యక్షుడు మంత్రులను సస్పెండ్ చేసి వారి వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ప్రకటించారు. అయినప్పటికీ అప్పటికే బాయ్‌కాట్ మాల్దీవ్స్ పేరిట భారత నెటిజన్లు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జాతికి సంఘీభావంగా పలు పర్యాటక సంస్థలు మాల్దీవుల ప్రయాణ బుకింగ్స్ నిలిపివేశాయి. ప్రధాని మోదీ ఏం చేస్తున్నారో అర్థం చేసుకోవాలి ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు ప్రధాని మోదీకి మద్దతుగా భారత పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామంటూ అభిమానులకు పిలుపునిస్తున్నారు. ఈ విషయంపై మహ్మద్ షమీ తాజాగా స్పందించాడు. ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘మన దేశ పర్యాటకాన్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి. ఏరకంగా అయితేనేమి దేశం అభివృద్ధి చెందడమే ముఖ్యం. దేశం వృద్ధి సాధిస్తే ప్రతి ఒక్క పౌరుడికి మంచే జరుగుతుంది. ప్రధాని మన దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని శాయశక్తులా కృషి చేస్తున్నారు. మనమందరం ఆయనకు తప్పక మద్దతుగా ఉండాలి’’ అని షమీ పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్ నాటికి కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో టాప్ వికెట్ టేకర్(24)గా నిలిచిన మహ్మద్ షమీ గాయం కారణంగా సౌతాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌తో అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. భారత మాజీ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, ఆకాశ్ చోప్రా, సురేశ్ రైనా తదితరులు .. ‘‘భారత పర్యాటకాన్ని ప్రోత్సహించాలి’’ అంటూ ప్రధాని మోదీకి మద్దతుగా పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. చదవండి: Ind Vs Afg: అఫ్గన్‌తో టీమిండియా సిరీస్: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
India-Maldives Row: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుపై అవిశ్వాసానికి పిలుపు
మాలే: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జును తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆ దేశ పార్లమెంటరీ మైనారిటీ నాయకుడు అలీ అజీమ్ కోరారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలని సభ్యులకు పిలుపునిచ్చారు . మాల్దీవుల మంత్రులు ప్రధాని నరేంద్ర మోదీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. " స్థిరమైన విదేశాంగ విధానాన్ని పెంపొందిచడానికి డెమొక్రాట్లమైన మేము ప్రయత్నించాం. పొరుగు దేశాలతో సత్సంబంధాలను నెలకొల్పాము. అధ్యక్షుడు @MMuizzu ను అధికారం నుండి తొలగించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మాల్దీవుల సెక్రెటేరియట్ సిద్ధంగా ఉందా? విశ్వాసం లేదా?" అని నాయకుడు ఎక్స్‌లో పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. ఇది ఇరుదేశాల మధ్య వివాదాస్పద వాతావరణం ఏర్పడటానికి కారణమైంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేశారు. మాల్దీవుల పర్యాటకంపై ప్రముఖులు నిరసన వ్యక్తం చేశారు. బైకాట్ మాల్దీవులు అంటూ నినాదాలు విస్తృతంగా వ్యాప్తి చేశారు. ఈ వివాదంపై ఇరుదేశాలు ఇప్పటికే హైకమిషనర్లకు సమన్లు జారీ చేశారు. ఇదీ చదవండి: PM Modi Maldives Controversy: మోదీ పర్యటన తర్వాత లక్షద్వీప్ వైపే అందరి చూపు! -
India-Maldives Row:మాల్దీవుల వివాదం: లక్ష్యదీప్ అడ్మినిస్ట్రేటర్ కీలక వ్యాఖ్యలు
లక్ష్యదీప్ వ్యవహారంలో ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై లక్ష్యదీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫూల్ పటేల్ మండిపడ్డారు. మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలు భారతదేశ గౌరవాన్ని సవాల్ చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై మొదటిసారి అడ్మినిస్ట్రేటర్ ప్రఫూల్ పటేల్ స్పందించారు. ఇలాంటి ద్వేష పూరిత వ్యాఖ్యలను భారత్ అస్సలు సహించదని అన్నారు. అదీ కాక, భారత దేశంలో మొత్తం ప్రధాని నరేంద్ర మోదీకి అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ సమయంలో భారతప్రధాన మంత్రికి తమదైన శైలిలో అండగా నిలిచిన భారత దేశ ప్రజలకు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అనుచిత వ్యఖ్యలు చేసిన మాల్దీవులు మంత్రులు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బహిరంగ క్షమాపణలు కూడా చెప్పాలని లేదని, తమ విలువలు పూర్తిగా భిన్నమైనవి పేర్కొన్నారు. మాల్దీవుల మంత్రులు అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయాల్సింది కాదని అన్నారు. సదరు మంత్రులపై ఆ దేశ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. భారత దేశాన్ని, తమ దేశ ప్రధానమంత్రిని కించపరిచితే ఊరుకునే ప్రసక్తే లేదని మండిపడ్డారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారని గుర్తుచేశారు. లక్ష్య దీప్‌కు మాల్దీవుల టూరిస్టులను అనుతిస్తారా? అని మీడియా ప్రశ్నకు.. అందరిని స్వాగతించడమే తమ దేశ సంస్కృతి అని అన్నారు. మాల్దీవుల సందర్శకులు లక్ష్యదీప్కు వచ్చి, ఇక్కడి అందాలను ఆస్వాదిస్తూ.. అభినందిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. వారు అలా ఉంటే తమకు కూడా సంతోషమేనని అన్నారు. వారి రాకపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు. తప్పకుండా మాల్దీవుల టూరిస్టులు కూడా లక్ష్యదీప్కు రావాలని తెలిపారు. ఇటీవల ప్రధానమంత్రి మోదీ లక్ష్యదీప్‌లో పలు కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ క్రమంలో అక్కడి అందాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన విసయం తెలసిందే. అయితే కొంత మంది నెటిజన్లు మాల్దీవుల కంటే కూడా లక్ష్యదీప్ బాగుందని కామెంట్లు చేశారు. దీంతో మాల్దీవుల మంత్రులు.. ప్రధాని మోదీ వీడియో, ఫొటోలపై అక్కసుతో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం వివాదాస్పదమై.. సోషల్ మీడియాలో బాయ్‌కాట్ మాల్దీవులు అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. ఇక.. మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సదరు ముగ్గురు మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం వేటు వేసిన విషయం తెలిసిందే. చదవండి: Lakshadweep vs Maldives: ముదిరిన లక్షద్వీప్–మాల్దీవుల వివాదం -
India-Maldives Row: ఇజ్రాయెల్ అభ్యర్థన ఇదే!
ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రులు ముగ్గురు చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న వివాదం మరింత ముదురుతోంది. మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలను నిరసిస్తూ ఇప్పటికే పలువురు ప్రముఖులు ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’’ పేరుతో సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారమూ చేపట్టారు. ఈ అంశంపై తాజాగా ఇజ్రాయెల్ స్పందించింది. ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం తన సోషల్ మీడియా సైట్లో #ExploreIndianIslands ట్యాగ్‌తో లక్షద్వీప్ చిత్రాలను షేర్ చేసింది. అద్భుతమైన ఆకర్షణ కలిగిన లక్షద్వీప్ దీవులను సందర్శించాలని కోరింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన అవమానకరమైన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం జరిగింది. డీశాలినేషన్ కార్యక్రమం.. లక్షదీవుల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి ఇజ్రాయెల్ నడుం బిగించింది. డీశాలినేషన్ (నీటిని శుభ్రపరిచే ప్రక్రియ) ప్రక్రియను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ప్రభుత్వ అభ్యర్థన మేరకు గత ఏడాది లక్షదీవుల్లో ఇజ్రాయెల్ నిపుణులు పరిశీలించారు. మాల్దీవులు-భారత్ మధ్య వివాదం నెలకొన్న వేళ డీశాలినేషన్ ప్రక్రియను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. We were in #Lakshadweep last year upon the federal government's request to initiate the desalination program. Israel is ready to commence working on this project tomorrow. For those who are yet to witness the pristine and majestic underwater beauty of #lakshadweepislands, here… pic.twitter.com/bmfDWdFMEq — Israel in India (@IsraelinIndia) January 8, 2024 ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య వివాదాస్పద వాతావరణం ఏర్పాటైంది. భారత్ గురించి హైళనగా మాట్లాడటంపై ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బైకాట్ మాల్దీవులు నినాదాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఆ తర్వాత ఇరుదేశాలు హైకమిషనర్లకు సమన్లు జారీ చేశాయి. ఇదీ చదవండిL: భారత హైకమిషనర్‌కు మాల్దీవులు సమన్లు -
Lakshadweep vs Maldives: ముదిరిన లక్షద్వీప్–మాల్దీవుల వివాదం
న్యూఢిల్లీ: ‘లక్షద్వీప్–మాల్దీవుల’ వివాదం ముదురుతోంది. మన పర్యాటక రంగంపై మాల్దీవుల మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలతో మొదలైన ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’ పిలుపుకు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఆ దేశ దౌత్యవేత్త అలీ నజీర్ మొహమ్మద్‌తో భారత హైకమిషనర్ మును ముహావర్ సోమవారం సమావేశమయ్యారు. భారత్ పట్ల, ప్రధాని మోదీ పట్ల మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలను ఎండగట్టారు. వారిని మాల్దీవులు ఇప్పటికే సస్పెండ్ చేయడం తెలిసిందే. అయినా దీనిపై భారతీయ సమాజంలో ఆగ్రహావేశాలు తగ్గలేదు. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, శ్రద్దా కపూర్, వెంకటేశ్ ప్రసాద్, వీరేందర్ సెహా్వగ్ తదితర సెలెబ్రిటీలు కూడా ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’కు జై కొట్టారు. మాల్దీవుల పర్యటన మానేసి లక్షద్వీప్, అండమాన్ వంటి భారతీయ రమణీయ కేంద్రాలకు వెళ్లాలంటూ ఫొటోలను షేర్చేశారు. మాల్దీవులతో వాణిజ్య కార్యకలాపాలు తగ్గించుకోవాలని కన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ పిలుపునిచి్చంది. 3,400 శాతం పెరిగిన సెర్చింగ్! లక్షద్వీప్‌లో మోదీ పర్యటన తర్వాత ఆన్లైన్ వేదికల్లో భారత దీవుల కోసం వెతికే వారి సంఖ్య ఏకంగా 3,400 శాతం పెరిగిందని మేక్మైట్రిప్ సంస్థ పేర్కొంది. మాల్దీవులకు పర్యాటకుల్లో భారతీయుల సంఖ్యే అత్యధికమని ఆ దేశ పర్యాటక శాఖ గణాంకాల్లో వెల్లడైంది. గతేడాది 2.09 లక్షల మంది భారతీయులు అక్కడికెళ్లారు. 2022లో 2.4 లక్షలు, 2021లో 2.11 లక్షల మంది పర్యటించారు. అంతేకాదు, కోవిడ్ కాలంలోనూ 63,000 మంది అక్కడ పర్యటించారు! ట్రెండింగ్‌లో లక్షద్వీప్ మాల్దీవులకు బదులు భారతీయ పర్యటక కేంద్రాలకే వెళ్దామన్న సెలబ్రిటీలు పిలుపుతో లక్షద్వీప్ కోసం ఆన్లైన్లో సెర్చింగ్ అనూహ్యంగా పెరిగింది. ‘లక్షద్వీప్’ పదంతో ప్రపంచవ్యాప్తంగా సెర్చింగ్ చేస్తున్న వారి సంఖ్య గత రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంత ఎక్కువ స్థాయికి చేరుకుందని ‘గూగుల్ ట్రెండ్స్’ గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఈజ్‌మైట్రిప్ సంస్థ భారత్‌కు మద్దతుగా మాల్దీవులకు విమానాల బుకింగ్స్‌ను రద్దుచేసింది. ‘‘మాల్దీవులు/సీషెల్స్ మాదిరే లక్షద్వీప్‌లోని బీచ్‌లు, పరిసరాలు అద్భుతంగా ఉంటాయి. ఇక్కడే పర్యటించండి’’ అని సంస్థ సీఈవో నిషాంత్ పిట్టి చెప్పారు. -
అనుచిత వ్యాఖ్యల చిచ్చు
బాధ్యతా రహితమైన వ్యాఖ్యలు చేస్తే, ఫలితం భారంగానే ఉంటుంది. మాల్దీవులకు చెందిన ఒక ఎంపీ, ముగ్గురు మంత్రులకు బహుశా అది ఇప్పుడు అనుభవంలోకి వచ్చి ఉంటుంది. మాల్దీవుల ప్రభుత్వంలోని ముగ్గురు డిప్యూటీ మంత్రులు మరియమ్ షివునా, మల్షా షరీఫ్, మహజూమ్ మజీద్... భారత్‌కూ, భారత ప్రధానికీ వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసి, పదవి నుంచి సస్పెండయ్యారు. రెండు దేశాల మధ్య దౌత్య వివాదానికి దారి తీసిన ఆ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో బోలెడంత రచ్చ జరుగుతోంది. మాలే మంత్రుల వ్యాఖ్యలపై భారత ప్రముఖులు గట్టిగానే స్పందించారు. మాల్దీవ్స్ బహిష్కరణ నుంచి మన సొంత ద్వీపాల పర్యాటకాభివృద్ధి దాకా నినాదాలు జోరందుకున్నాయి. వ్యవహారం లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవ్స్‌గా మారింది. జరిగిన కథ గమనిస్తే – ‘మీలోని సాహసికుడికి సరైన గమ్యస్థానం లక్షద్వీప్’ అంటూ, అక్కడి సముద్రతీరంలోని తన ఫోటో జోడించి జనవరి 5న భారత ప్రధాని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ మీద మాల్దీవుల మంత్రులు, ఎంపీల అనుచిత వ్యాఖ్యలు ఇంత దూరం తెచ్చాయి. మంత్రి అబ్దుల్లా మాజిద్ ఇదంతా మాల్దీవుల నుంచి దృష్టి మరల్చి, లక్షద్వీప్‌ను మరో పర్యాటక కేంద్రంగా ప్రోత్సహించడానికేనని విమర్శించడంతో రాజకీయ వివాదం రేగింది. ఆయనలా అంటే, మరో మంత్రి మరియమ్ షియునా ‘ఎక్స్’లో ఇజ్రాయెల్‌తో భారత సంబంధాలను ప్రస్తావించారు. ఆమెతో మరో మహిళా సహచర మంత్రి మాల్షా స్వరం కలిపారు. భారత పర్యాటక ప్రాంతాలు, గదులు దుర్వాసన వేస్తుంటాయన్న నోటి తీట మాటలూ వచ్చాయి. ఇవన్నీ చిచ్చు రేపేసరికి, చైనా పర్యటనలోని మాల్దీవుల అధ్యక్షుడు దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి వచ్చింది. మంత్రుల సస్పెన్షన్, వారి వ్యక్తిగత వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని ప్రభుత్వ వివరణ చకచకా జరిగాయి. భారత్‌లోని పర్యాటక ప్రాంతాల గురించి, ప్రధాని గురించి నోటికొచ్చినట్టు మాట్లాడడం మన వారికి కోపం తెప్పించింది. సెలవులకు మాల్దీవులకు వెళదామనుకున్న వేలాది భారతీయులు టికెట్లను రద్దు చేసుకుంటూ, సదరు స్క్రీన్షాట్లను ‘ఎక్స్’ వేదికగా పంచుకుంటున్నారు. అలాగే, దేశంలోనే ఉన్న అందమైన సముద్ర తీరాలు, ఆహ్లాదకరమైన దీవుల గురించి అన్వేషణ ఆరంభమైంది. ఈ వివాదం పుణ్యమా అని ఇంటర్నెట్లో లక్షద్వీప్ గురించి అన్వేషణ గత 20 ఏళ్ళలో ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరింది. అయితే, గత ఏడాది లక్షద్వీప్‌కు 10 వేల మంది లోపే వెళితే, మాల్దీవులకు వెళ్ళిన పర్యాటకుల సంఖ్య లక్షల్లో ఉందని గమనించాలి. ఈ పరిస్థితుల్లో సెంటిమెంట్లు రేపి, ప్రస్తుత వివాదాన్ని ఆత్మాభిమాన, ఆత్మనిర్భర అంశంగా, లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవ్స్‌గా చేస్తే అది వట్టి హ్రస్వదృష్టి. ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు నిత్యం సాగుతున్న వేళ, మాల్దీవ్స్‌తో మన దీర్ఘకాలిక బంధం దెబ్బతినకుండా చూడడం ముఖ్యం. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్‌కు కీలక పొరుగుదేశం మాల్దీవులు. ‘ప్రాంతీయ భద్రత, పురోగతి’ (సాగర్) లాంటి ప్రయత్నాల్లో ఆ దేశానిది ప్రధాన పాత్ర. అలాగే, ‘పొరుగుకు పెద్ద పీట’ లాంటి భారత ప్రభుత్వ ప్రాధాన్యాలకు మాల్దీవులు ఓ ప్రధాన కేంద్రం. అలాంటి మాల్దీవు లతో ఇటీవల పొరపొచ్చాలు వచ్చాయి. భారత వ్యతిరేక అజెండాతో గెలిచి, గత 2023 నవంబర్‌లో మహమ్మద్ మొయిజు మాల్దీవ్స్‌కు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వెంటనే మాల్దీవుల ద్వీపబృందం నుంచి భారత సైన్యాన్ని ఉపసంహరించాల్సిందిగా కోరారు. భారత్ మాత్రం హిందూ మహాసముద్రంలోని సుదూర ద్వీపాలకు వైద్యసాయానికై తమ సైనికులు అక్కడున్నారంది. తాజా వివాదాల వేళ మరో పొరుగు దేశం చైనా వైఖరి పక్క ఇల్లు తగలబడుతుంటే, చలి కాచుకుంటున్నట్టుంది. భారత్, మాల్దీవుల మధ్య రచ్చను అది ఆస్వాదిస్తోంది. మాల్దీవుల విదేశాంగ విధానం బాగుందనీ, ఆ దేశాధ్యక్షుడు భారత్‌తో సరైన రీతిలో వ్యవహరిస్తున్నారనీ చైనా మీడియా ప్రశంసిస్తోంది. అసలీ అంశంలో ఢిల్లీయే విశాల దృక్పథంతో ఉండాలంటూ బీజింగ్ సుద్దులు చెబుతోంది. ఇప్పటికే భారత్‌కు దక్షిణాన, పశ్చిమాన వివిధ దేశాల్లో చైనా పాగా వేసింది. హిందూ మహాసముద్రంలో కీలకమైన మాల్దీవుల్ని కూడా తన బుట్టలో వేసుకొనే పనిలో ఉంది. ఢిల్లీతో దీర్ఘకాలిక దౌత్యబంధమున్న మాలే సైతం క్రమంగా చైనా వైపు మొగ్గుతున్నట్టు కనిపిస్తోంది. మరోపక్క మాలేలో పెరుగుతున్న ఇస్లామిక్ తీవ్రవాదం ఆందోళన రేపే అంశం. అత్యధికులు ముస్లిమ్లైన మాల్దీవుల నుంచి 600 – 700 మంది ఇస్లామిక్ తీవ్రవాద ‘ఐసిస్’లో చేరారని లెక్క. ఈ పరిస్థితుల్లో మాల్దీవులు కేంద్రంగా వ్యూహాత్మక ప్రయోజనాలెన్నో ఉన్న భారత్ ఆచితూచి వ్యవహరించాలి. నెటిజన్ల ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’ లాంటి వ్యాఖ్యలు వినడానికి బాగున్నా, భౌగోళిక అనివార్యతల రీత్యా కుదిరేపని కాదు. సంచలన ప్రకటనల కన్నా సవ్యమైన కార్యాచరణే మన పర్యాటకాభివృద్ధికి కీలకం. ఇందులో మన పాలకులు చేసింది తక్కువ, చేయాల్సిందే ఎక్కువ. లక్షద్వీప్‌కు ప్రాముఖ్యం కల్పించాలని మోదీ సర్కార్ భావిస్తే తప్పు లేదు కానీ, ఆ చిరు కేంద్రపాలిత ప్రాంతంలో భారీ నిర్మాణాలతో జీవ్యావరణాన్ని దెబ్బ తీసే యత్నాలు మానాలి. మాల్దీవ్స్ ప్రజాస్వామ్యం బాట పట్టి అంతా కలిపి దశాబ్దిన్నరే అయింది. కొద్ది నెలల క్రితమే వచ్చిన కొత్త ప్రభుత్వం ఇంకా కుదురుకోనే లేదు. ఈ పరిస్థితుల్లో చేతి నిండా పని ఉన్న మాల్దీవ్స్ మంత్రులు భారత్ గురించి, భారత్‌లో భాగమైన లక్షద్వీప్ గురించి మాట్లాడాల్సిన పని లేదు. అది వారి పరిధి కూడా కాదు. తాగునీటి కొరత నుంచి ఇటీవలి కోవిడ్ నియంత్రణ దాకా పలు సందర్భాల్లో మానవతతో అండగా నిలిచిన భారతే తాము నమ్మదగిన, చిరకాల మిత్రుడని గ్రహించాలి. -
మోదీ పర్యటన తర్వాత లక్షద్వీప్ వైపే అందరి చూపు!
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్షద్వీప్‌లో పర్యటించడం వల్ల అక్కడి దీవుల్లో పర్యాటకానికి ఊతం లభించిందని మేక్మైట్రిప్ సంస్థ పేర్కొంది. లక్షద్వీప్ టూర్ కోసం తమ ఆన్-ప్లాట్‌ఫారమ్ సెర్చ్‌లో 3,400 శాతం పెరిగిందని తెలిపింది. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల రాజకీయ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై వివాదం చెలరేగిన తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారత్-మాల్దీవుల మధ్య వివాదం చెలరేగడంతో మాల్దీవులకు విమానాల బుకింగ్‌లను నిలిపివేసినట్లు భారతీయ ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ అయిన EaseMyTrip ఇప్పటికే ప్రకటించింది. మన దేశానికి సంఘీభావంగా నిర్ణయం తీసుకున్నామని EaseMyTrip వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టి ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. ఇది ఇరుదేశాల మధ్య వివాదాస్పద వాతావరణం ఏర్పడటానికి కారణమైంది. మాల్దీవుల పర్యాటకంపై ప్రముఖులు నిరసన వ్యక్తం చేశారు. బైకాట్ మాల్దీవులు అంటూ నినాదాలు విస్తృతంగా వ్యాప్తి చేశారు. ఈ వివాదంపై ఇరుదేశాలు ఇప్పటికే హైకమిషనర్లకు సమన్లు జారీ చేశారు. ఇదీ చదవండి: లక్షద్వీప్‌తో మాల్దీవులకు సమస్య ఏంటి?.. స్థానిక ఎంపీ ఫైర్ -
Boycott Maldives: భారత్‌తో వివాదం వేళ చైనాకు మాల్దీవుల అధ్యక్షుడు
బీజింగ్: లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవుల వివాదం కొనసాగుతున్న వేళ మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మిజ్జు 5 రోజుల పర్యటన నిమిత్తం చైనా వెళ్లారు. ఈ పర్యటనలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చలు జరపడంతో పాటు పలు అంశాల్లో చైనాతో ఒప్పందాలు చేసుకోనున్నారు. సోమవారం ఉదయం చైనా చేరుకున్న మిజ్జు దంపతులకు చైనా సీనియర్ అధికారుల బృందం స్వాగతం పలికింది. ‘చైనా,మాల్దీవుల మధ్య సంబంధాలు ప్రస్తుతం అత్యున్నత స్థితికి చేరుకున్నాయి. మాల్దీవుల అధ్యక్షుడి చైనా పర్యటనతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నత స్థితికి వెళ్లనున్నాయి’అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ చెప్పారు. కాగా,లక్షద్వీప్‌లో ప్రధాని మోదీ పర్యటనపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వివాదం రేగిన విషయం తెలిసిందే.దీంతో భారత పర్యాటకులు మూకుమ్మడిగా మాల్దీవుల పర్యటనలు రద్దు చేసుకోవడంతో పాటు సోషల్ మీడియాలో బాయ్‌కాట్ మాల్దీవ్స్ పిలుపునిచ్చారు. దీంతో బాయ్‌కాట్ మాల్దీవ్స్ ట్రెండింగ్‌గా మారింది. ఇదీచదవండి.. ప్రధాని మోదీపై వ్యాఖ్యలు సిగ్గుచేటు -
ప్రధాని మోదీపై వ్యాఖ్యలు సిగ్గుచేటు.. కానీ..
మాలే: ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇరుదేశాల మధ్య వివాదం కొనసాగుతోంది. మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలు సిగ్గుచేటు.. జాత్యాహంకారం అని ఆ దేశ మాజీ డిప్యూటీ స్పీకర్ ఇవా అబ్దుల్లా అన్నారు. ఈ వ్యాఖ్యల పట్ల ఆమె భారతదేశానికి క్షమాపణలు చెప్పారు. బైకాట్ మాల్దీవులు నిర్ణయాన్ని వదిలివేయాలని భారతీయులను అభ్యర్థించారు. "మా దేశ మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలపై ఆగ్రహం అర్థం చేసుకోవచ్చు. భారతీయులు న్యాయబద్ధంగా కోపంగా ఉన్నారు. ఆ వ్యాఖ్యలు దారుణమైనవి. కానీ ఇవి మాల్దీవుల ప్రజల అభిప్రాయాన్ని ఏ విధంగానూ ప్రతిబింబించవు. ఈ వ్యాఖ్యలకు భారతదేశ ప్రజలకు వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా" అని ఆమె అన్నారు. ప్రధాని మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ కూడా స్పందించారు. విదేశీ నాయకులపై ఈ వ్యాఖ్యలు ఆమోదించలేనివని అన్నారు. మాల్దీవుల ప్రభుత్వ అధికారిక అభిప్రాయాన్ని ప్రతిబింబించవని చెప్పారు. భారత్‌తో మాల్దీవులు నిర్మాణాత్మక, సానుకూల సంభాషణను పెంపొందించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. ఇదీ చదవండి: Lakshadweep Islands History: లక్షద్వీప్‌పై పాక్ కన్ను.. భారత్ ఎత్తుగడతో చిత్తు! -
భారత హైకమిషనర్‌కు మాల్దీవులు సమన్లు
మాలె: ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. మాల్దీవుల హైకమిషనర్‌కు భారత్ సమన్లు జారీ చేసిన కొన్ని గంటలకే కీలక పరిణామం చోటుచేసుకుంది. మాల్దీవుల ప్రభుత్వం కూడా అక్కడ ఉన్న భారత హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసింది. భేటీ కావాల్సిందిగా మాలేలోని భారత హైకమిషనర్ మును మహావార్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. మాల్దీవుల హైకమిషనర్ ఇబ్రహీం షహీబ్‌కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నేడు నేడు సమన్లు జారీ చేసింది. ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సౌత్ బ్లాక్‌కు ఆయన వచ్చివెళ్లినట్లు సమాచారం. వివాదంపై రెండు దేశాలు సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులపై మాల్దీవుల ప్రభుత్వం వేటు వేసిన మరుసటి రోజే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. ఇది ఇరుదేశాల మధ్య వివాదాస్పద వాతావరణం ఏర్పడటానికి కారణమైంది. ఇదీ చదవండి: Lakshadweep Islands History: లక్షద్వీప్‌పై పాక్ కన్ను.. భారత్ ఎత్తుగడతో చిత్తు! -
లక్షద్వీప్‌తో మాల్దీవులకు సమస్య ఏంటి?.. స్థానిక ఎంపీ ఫైర్
మాలె: ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ విరుచుకుపడ్డారు. లక్షద్వీప్ అభివృద్ధి చెందితే మాల్దీవులకు వచ్చిన సమస్య ఏంటీ..? అని ఎంపీ మహమ్మద్ ఫైజల్ ప్రశ్నించారు. 'భవిష్యత్తులో లక్షద్వీప్ కచ్చితంగా పర్యాటక ప్రాంతంగా మారుతుంది. ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు. ప్రధాని ఇక్కడికి వచ్చి ఒక రోజు గడిపారు. లక్షద్వీప్ ప్రజలు ఎల్లప్పుడూ పర్యాటక కోణంలో ఉండాలని కోరుకునే విషయాన్ని ఆయన చెప్పారు. ప్రభుత్వం టూరిజం కోసం ఒక విధానాన్ని కలిగి ఉండాలని మేము కోరుకున్నాను. దీంతో యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. దానితో మాల్దీవులకు వచ్చిన సమస్య ఏంటి?' అని ఆయన ప్రశ్నించారు. ఇదీ జరిగింది..! ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. పర్యాటకంలో మాల్దీవులతో లక్షద్వీప్ ఏ మాత్రమూ సరితూగదంటూ ఎద్దేవా చేశారు. ‘‘భారత్‌లో హోటల్ గదులు అసహ్యంగా ఉంటాయి. మా దేశంతో లక్షద్వీప్‌కు పోలికేమిటి?’’ అంటూ మాల్దీవుల ఎంపీ జహీద్ రమీజ్ కూడా నోరు పారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలపై మాల్దీవుల్లోని భారత హైకమిషన్ కార్యాలయం అధికారులు నిరసన తెలిపారు. దుమారం నేపథ్యంలోవారి వ్యాఖ్యలను ‘ఎక్స్’ నుంచి తొలగించారు. ఈ వివాదంపై భారత్ కూడా ఘాటుగానే స్పందించింది. దీంతో మాల్దీవులు ఆ మంత్రులను పదవి నుంచి తప్పించింది. ఢిల్లీలో మాల్దీవుల హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసింది. ఇదీ చదవండి: మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. మాల్దీవుల హైకమిషనర్‌కు భారత్ సమన్లు -
‘మనం వద్దని మాల్దీవులు ఓటేసింది.. ఇకపై అక్కడికి వెళ్తారా? లేదా..’
Cricket Stars Fume Over Maldives Row: భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులను టీమిండియా మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. భారతీయులను తక్కువ చేసేలా మాట్లాడటం తగదని హితవు పలుకుతున్నారు. గతంలో ఎన్నోసార్లు మాల్దీవుల పర్యటనకు వెళ్లామని.. కానీ ఇకపై అలాంటి పరిస్థితులు ఉండబోవని స్పష్టం చేస్తున్నారు. భారతదేశంలో ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయని.. ఇకపై వాటిపైనే మనమంతా దృష్టి సారించాలని పిలుపునిస్తున్నారు. భారత పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేలా తమ వంతు సహకారం అందిస్తామంటూ ఎక్స్ వేదికగా ప్రధాని మోదీకి మద్దతు తెలుపుతున్నారు. మోదీ ఫొటోలు వైరల్.. మాల్దీవుల మంత్రుల నోటి దురుసు కాగా ప్రధాని మోదీ.. కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో ఇటీవల పర్యటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు మాల్దీవులతో లక్షద్వీప్‌ను పోలుస్తూ ప్రధాని మోదీ ఫొటోలను నెట్టింట వైరల్ చేశారు. ఈ నేపథ్యంలో మాల్దీవుల మంత్రులు మోదీని కించపరిచే విధంగా తోలుబొమ్మ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. భారత్‌లో బీచ్‌లు, హోటల్ గదులు శుభ్రంగా ఉండవని.. అలాంటి దేశంతో తమకు పోలికేంటని వివాదాస్పద రీతిలో కామెంట్లు చేశారు. దీంతో బాయ్‌కాట్ మాల్దీవ్స్, #ExploreIndianIslands ట్రెండ్ చేస్తున్నారు భారత నెటిజన్లు. మన పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలి ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, ఆకాశ్ చోప్రా, మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, మాజీ బ్యాటర్ సురేశ్ రైనా తదితరులు స్పందించారు. ఈ మేరకు సెహ్వాగ్.. ‘‘ఉడుపి, పాండిలోని పారడైజ్ బీచ్, అండమాన్‌లోని నీల్, హవెలాక్‌తో పాటు దేశంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇంతవరకు మనం చూడని చక్కటి బీచ్‌లు కూడా చాలా ఉన్నాయి. మన ప్రధాని పట్ల మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేసిన తీరును అందరూ గమనించాలి. ఇకపై అవసరమైన చోట్ల మౌలిక సదుపాయాలు మరింత అభివృద్ధి చేసి మన పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసి.. ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసుకోవాలి’’ అని పేర్కొన్నాడు. Whether it be the beautiful beaches of Udupi , Paradise Beach in Pondi, Neil and Havelock in Andaman, and many other beautiful beaches throughout our country, there are so many unexplored places in Bharat which have so much potential with some infrastructure support. Bharat is… pic.twitter.com/w8EheuIEUD — Virender Sehwag (@virendersehwag) January 7, 2024 ఇక ఇర్ఫాన్ పఠాన్.. ‘‘నాకు 15 ఏళ్ల వయసు ఉన్నపటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో పర్యటించాను. ఇండియన్ హోటల్స్‌లో లభించిన ఆతిథ్యం మరెక్కడా లభించదు. మన దేశంలో ఉన్నన్ని పర్యాటక ప్రాంతాలు మరెక్కడా లేవు. మనం ప్రతి దేశ సంస్కృతిని గౌరవిస్తాం. కానీ.. నా మాతృదేశం గురించి, ఇక్కడి ఆతిథ్యం గురించి ఇలాంటి ప్రతికూల వ్యాఖ్యలు వినడం ఎంతో బాధిస్తోంది’’ అని మాల్దీవుల మంత్రులకు చురకలు అంటించాడు. Having traveled the world since I was 15, every new country I visit reinforces my belief in the exceptional service offered by Indian hotels and tourism. While respecting each country's culture, it's disheartening to hear negative remarks about my homeland's extraordinary… — Irfan Pathan (@IrfanPathan) January 7, 2024 మనం వద్దని మాల్దీవులు ఓటేసింది.. ఇక వెళ్లాలా లేదా? అదే విధంగా ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. ‘‘ఇండియా వద్దని మాల్దీవులు ఓటేసింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో.. వెళ్లవద్దో అన్న అంశంలో భారతీయులు తెలివిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నా కుటుంబం అయితే, ఇలాగే చేస్తుంది. జై హింద్’’ అని పేర్కొన్నాడు. ‘India Out’ was a part of the manifesto. Maldives voted for it. Now, it’s up to us, Indians, to choose wisely. I know that my family will. Jai Hind 🇮🇳 — Aakash Chopra (@cricketaakash) January 6, 2024 కాగా మోదీపై అనుచిత వ్యాఖ్యల కారణంగా ఇప్పటికే చాలా మంది భారత ప్రముఖులు మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. పర్యాటకమే ఆయువుపట్టుగా ఉనికిని చాటుకుంటున్న తమకు.. తాజా పరిణామాలు భారీ నష్టం చేకూరుస్తాయని పసిగట్టిన మాల్దీవుల ప్రభుత్వం.. ఇప్పటికే సదరు మంత్రులపై వేటు వేసింది. -
మాల్దీవుల హైకమిషనర్‌కు భారత్ సమన్లు
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఈ క్రమంలో మాల్దీవుల హైకమిషనర్ ఇబ్రహీం షహీబ్‌కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సౌత్ బ్లాక్‌కు ఆయన వచ్చివెళ్లినట్లు సమాచారం. వివాదంపై రెండు దేశాలు సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులపై మాల్దీవుల ప్రభుత్వం వేటు వేసిన మరుసటి రోజే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. #WATCH | Ibrahim Shaheeb, Maldives Envoy exits the MEA in Delhi's South Block. He had reached the Ministry amid row over Maldives MP's post on PM Modi's visit to Lakshadweep. pic.twitter.com/Dxsj3nkNvw — ANI (@ANI) January 8, 2024 మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. పర్యాటకంలో మాల్దీవులతో లక్షద్వీప్ ఏ మాత్రమూ సరితూగదంటూ ఎద్దేవా చేశారు. ‘‘భారత్‌లో హోటల్ గదులు అసహ్యంగా ఉంటాయి. మా దేశంతో లక్షద్వీప్‌కు పోలికేమిటి?’’ అంటూ మాల్దీవుల ఎంపీ జహీద్ రమీజ్ కూడా నోరు పారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలపై మాల్దీవుల్లోని భారత హైకమిషన్ కార్యాలయం అధికారులు నిరసన తెలిపారు. దుమారం నేపథ్యంలోవారి వ్యాఖ్యలను ‘ఎక్స్’ నుంచి తొలగించారు. బైకాట్ మాల్దీవులు.. ఈ వివాదంపై నెటిజన్లు ఫైరయ్యారు. మాల్దీవుల పర్యాటకాన్ని రద్దు చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు. బైకాట్ మాల్దీవులు అంటూ నినదించారు. మాల్దీవుల మంత్రుల నోటి దురుసును సెలబ్రెటీలు క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహం, శ్రద్ధా కపూర్ తదితరులు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. వారి విద్వేష వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయని అక్షయ్ అన్నారు. దిద్దుబాటు చర్యలు ఈ వ్యాఖ్యలపై మాల్దీవుల ప్రభుత్వం కూడా స్పందించి దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. మంత్రులను పదవి నుంచి సస్పెండ్ చేసింది. మంత్రుల వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని స్పష్టం చేసింది. ఆ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ఈ వివాదం ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇదీ చదవండి: మోదీపై అనుచిత పోస్టు.. మాల్దీవుల టూర్‌ను రద్దు చేస్తున్న నెటిజన్లు -
మాల్దీవులకు టికెట్ బుకింగ్స్ నిలిపేసిన ప్రముఖ సంస్థ
భారత్‌పై తీవ్రంగా స్పందించిన మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దేశీయ ప్రయాణ సంస్థ ఈజ్‌మైట్రిప్ ఎక్స్ వేదికగా కీలక నిర్ణయం ప్రకటించింది. ఆ దేశానికి ఫ్లైట్ బుకింగ్స్ నిలిపివేయాలని సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిషాంత్ పిట్టి ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈజ్‌మైట్రిప్ సంస్థ దిల్లీ కేంద్రంగా సేవలు అందిస్తోంది. ఇది ఆన్లైన్ టికెట్ బుకింగ్ సేవలందిస్తోంది. నిషాంత్ పిట్టి, రికాంత్ పిట్టి, ప్రశాంత్ పిట్టి ఈ సంస్థను 2008లో ప్రారంభించారు. In solidarity with our nation, @EaseMyTrip has suspended all Maldives flight bookings ✈️ #TravelUpdate #SupportingNation #LakshadweepTourism #ExploreIndianlslands #Lakshadweep#ExploreIndianIslands @kishanreddybjp @JM_Scindia @PMOIndia @tourismgoi @narendramodi @incredibleindia https://t.co/wIyWGzyAZY — Nishant Pitti (@nishantpitti) January 7, 2024 భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల లక్ష్యదీప్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన పోస్ట్ చేసిన వీడియోపై మాల్దీవులు మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆ దేశ ప్రభుత్వం వారిపై వేటు వేసింది. ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది. లక్ష్యదీప్ బీచ్‌లో మోదీ నడుస్తున్న ఓ వీడియోపై మాల్దీవులు మంత్రి మంతత్రి మరియం షియునా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ దేశపు తోలు బొమ్మ అని అనుచిత కామెంట్ చేశారు. ఆమె వ్యాఖ్యలకు మంత్రులు మల్షా షరీఫ్, అబ్దుల్లా మజూం మాజిద్ మద్దతు పలికారు. దీంతో ఒక్కసారిగా ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆమె వ్యాఖ్యలను భారత్‌లోని పలువురు తీవ్రంగా ఖండించారు. ఇదీ చదవండి: బీఐఎస్ గుర్తింపు తప్పనిసరి.. ఏ ఉత్పత్తులకంటే.. పర్యాటక రంగంలో మాల్దీవులతో పోలిస్తే లక్షద్వీప్ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందని మంత్రులు విమర్శించారు. ‘పర్యాటకంలో మాతో పోటీ పడాలన్న ఆలోచన భ్రమే (ప్రధాని మోదీ పర్యటన వీడియోను ట్యాగ్ చేస్తూ). మా దేశం అందించే సేవలను ఎలా అందించగలరు? పరిశుభ్రంగా ఎలా ఉంచగలరు? అక్కడి గదుల్లో వచ్చే వాసన అతి పెద్ద సమస్య’ అని మంత్రి మాజిద్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌పై భారత నెటిజన్లు మండిపడ్డారు. పర్యాటకంగా ఆ దేశాన్ని బహిష్కరించాలని డిమాండు చేశారు. -
ప్రధాని మోడీపై పిచ్చి కామెంట్స్..ముగ్గురు మంత్రులు సస్పెండ్
-
మోదీ ఎఫెక్ట్.. మాల్దీవులకు కోలుకోలేని ఎదురుదెబ్బ!
#Maldives.. మాలె/న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వాటిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ, సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. కేంద్రం కూడా వాటిపై తీవ్ర అభ్యంతరం వెలిబుచి్చంది. మంత్రుల వ్యాఖ్యలకు నిరసనగా వేలాది మంది భారత పర్యాటకులు మాల్దీవులకు ప్లాన్ చేసుకున్న హాలిడే ట్రిప్పులను రద్దు చేసుకుంటున్నారు. ఆ దేశ పర్యాటకానికి మన టూరిస్టులే ఆయువుపట్టు. పైగా భారత్‌తో వ్యూహత్మక బంధం మాల్దీవులకు అత్యంత కీలకం. దాంతో ఈ వివాదంపై ఆ దేశం హుటాహుటిన స్పందించింది. భారత ప్రభుత్వ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసినట్లు ఆదివారం ప్రకటించింది. వారి వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగతమని, వాటితో ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టతనిచ్చింది. ‘‘భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రజాస్వామ్యయుతంగా, బాధ్యతాయుతంగా ఉండాలే తప్ప, విద్వేషాన్ని, ప్రతికూల ప్రభావాన్ని కలిగించేలా ఉండొద్దు. అంతర్జాతీయ భాగస్వామ్య దేశాలతో సంబంధాలను దెబ్బతీయొద్దు’’ అని పేర్కొంది. మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలకు వెనుకాడబోమని స్పష్టం చేసింది. సస్పెండైన మంత్రులు మరియం షియునా, అబ్దుల్లా మజూం మజీద్, మల్షా షరీఫ్ అని తెలుస్తోంది. అసలేమైంది...? ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలు»ొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. పర్యాటకంలో మాల్దీవులతో లక్షద్వీప్ ఏ మాత్రమూ సరితూగదంటూ ఎద్దేవా చేశారు. ‘‘భారత్‌లో హోటల్ గదులు అసహ్యంగా ఉంటాయి. మా దేశంతో లక్షద్వీప్‌కు పోలికేమిటి?’’ అంటూ మాల్దీవుల ఎంపీ జహీద్ రమీజ్ కూడా నోరు పారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలపై మాల్దీవుల్లోని భారత హైకమిషన్ కార్యాలయం అధికారులు నిరసన తెలిపారు. దుమారం నేపథ్యంలోవారి వ్యాఖ్యలను ‘ఎక్స్’ నుంచి తొలగించారు. మంత్రుల వ్యాఖ్యలను మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ తీవ్రంగా ఖండించారు. ‘‘భారత్ మనకు కీలక మిత్రదేశం. మాల్దీవుల భద్రత, అభివృద్ధిలో చాలా కీలకం. అలాంటి దేశాధినేతను ఉద్దేశించి నీచమైన భాష వాడటం తగదు’’ అన్నారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుకు హితవు పలికారు. ఇంతగా నిరసనలు వ్యక్తమవుతున్నా మరియం మాత్రం ఆన్లైన్ వేదికలపై అక్కసు వెళ్లగక్కడం ఆపలేదు. దాతో పలువురు భారత నెటిజన్లు ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’ అంటూ పిలుపునిస్తున్నారు! సెలబ్రిటీల ఖండన మాల్దీవుల మంత్రుల నోటి దురుసును క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహం, శ్రద్ధా కపూర్ తదితరులు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. వారి విద్వేష వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయని అక్షయ్ అన్నారు. ‘‘మాల్దీవులకు ఏటా భారీగా పర్యాటకులను పంపే భారత్‌పై అలా మాట్లాడటం దారుణం. పొరుగువారితో స్నేహంగా మెలగాలనే అనుకుంటాం కానీ ఇలాంటి ద్వేషాన్ని మనమెందుకు సహించాలి? నేనెన్నోసార్లు మాల్దీవుల్లో పర్యటించా. ప్రతిసారీ ఆ దేశాన్ని ప్రశంసించా. కానీ మన ఆత్మగౌరవమే ఫస్ట్. ఇకపై మన దీవుల్లో పర్యటిస్తూ మన పర్యాటకానికి దన్నుగా నిలుద్దాం’’ అని పిలుపునిచ్చారు. లక్షద్వీప్‌లో అందమైన, పరిశుభ్రమైన బీచుల్లో ప్రధాని మోదీని చూడటం ఎంతో బాగుంది. మన దేశంలోనే ఇంత అద్భుతమైన బీచ్లుండటం గర్వకారణం’’ అని సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు. ‘‘అతిథి దేవోభవ సందేశంతో భారత్ ఇచ్చే అద్భుతమైన ఆతిథ్యం, విస్తారమైన మన సముద్ర తీరాలను చూడాలే తప్ప వరి్ణంచలేం. ఇందుకోసం లక్షద్వీప్‌కు వెళ్లాల్సిందే’’ అంటూ జాన్ అబ్రహం బీచ్ ఫొటోలను షేర్ చేశారు. సుందరమైన లక్షద్వీప్ బీచ్‌ల అందాలను చూసేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు నటి శ్రద్ధా కపూర్ తెలిపారు. సచిన్ కూడా ఇటీవలి లక్షద్వీప్ పర్యటన సందర్భంగా అక్కడ తాను క్రికెట్ ఆడిన వీడియో, బీచ్ ఫొటోలను షేర్ చేశారు. -
మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. మాల్దీవులు మంత్రులపై వేటు!
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల్దీవులు మంత్రులపై ఆ దేశ ప్రభుత్వం వేటు వేసింది. ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది మాల్దీవులు ప్రభుత్వం. మంత్రులు మరియం షియునా, మల్షా షరీఫ్ , మహ్జూమ్ మజీద్ సస్పెన్షన్‌కు గురైనట్లు మాల్దీవులు స్థానిక మీడియా వెల్లడించింది. ఇప్పటికే మంతత్రి మరియం షియునా ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమైనవి అని మాల్దీవులు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా ప్రకటించిన కొద్ది గంటల్లోనే వారిపై మాల్దీవులు ప్రభుత్వం సస్పెన్ వేటు వేయటం గమనార్హం. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యదీప్ పర్యటనకు వెళ్లిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. వాటిలో ఓ వీడియోపై మాల్దీవులు మంత్రి మరియం షియునా చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. లక్ష్యదీప్ బీచ్‌లో మోదీ నడుస్తున్న ఓ వీడియోపై మరియం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ దేశపు తోలు బోమ్మ అని అనుచిత కామెంట్ చేశారు. దీంతో ఒక్కసాగా ఆమె వ్యాఖ్యలు వివాదాస్పంగా మారాయి. ఆమె వ్యాఖ్యలను భారత్‌లోని పలువురు తీవ్రంగా ఖండించారు. మాల్దీవులు మంత్రి చేసిన అవమానపూరిత వ్యాఖ్యలపై బాలీవుడ్ నటులు సైతం తీవ్రంగా ఖండిచారు. ‘భారత్‌పై మాల్దీవులు దేశ మంత్రులు అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా ఆశ్చర్యం కలిగించింది. పొరుగు దేశంతో తాము స్నేహంగానే ఉండాలనుకుంటాం. కానీ, వారి ద్వేషాన్ని సహించము. మాల్దీవులులో ఎన్నోసార్లు పర్యటించాను. అయితే ఇటువంటి సమయంలో భారత్‌లోని దీవులను పర్యటిస్తూ.. మన పర్యాటకానికి మద్దతు ఇద్దాం’ అని బాలీవుడ్ నటుడు ఆక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ‘చాలా పరిశుభ్రమై లక్ష్య ద్వీప్ బీచ్‌ను ప్రధాని మోదీ పర్యటించడం ఎంతో బాగుంది. విశేషమేంటంటే అవి కూడా మన దేశంలో ఉండటం’ అని నటుడు సల్మాన్ ఖాన్ తెలిపారు. ఇక.. వీరితోపాటు చాలామంది ప్రముఖులు, సామాన్యులు కూడా మాల్దీవులు మంత్రి వ్యాఖ్యలను సోషల్‌మీడియాలో తీవ్రంగా ఖండిస్తున్నారు. తమ మాల్దీవులు పర్యటనను కూడా రద్దు చేసుకుంటున్నామని భారతీయ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. చదవండి: మోదీపై అనుచిత పోస్టు.. ఖండించిన మాల్దీవుల ప్రభుత్వం -
మోదీపై అనుచిత పోస్టు.. మాల్దీవుల టూర్‌ను రద్దు చేస్తున్న నెటిజన్లు
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని 'ఇజ్రాయెల్ తోలుబొమ్మ'తో పోల్చుతూ మాల్దీవుల మంత్రి మరియం షియునా చేసిన వివాదాస్పద ట్వీట్‌పై వివాదం కొనసాగుతోంది. మాల్దీవుల మంత్రి చేసిన వివాదాస్పద ట్వీట్‌పై భారత నెటిజన్లు భగ్గుమంటున్నారు. మాల్దీవుల పర్యటనలను రద్దు చేసుకుంటున్నారు. ఈ మేరకు టూర్లను రద్దు చేసుకున్న టికెట్ క్లిప్‌లను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఫిబ్రవరి 2న వచ్చే నా పుట్టినరోజు కోసం మాల్దీవులకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాను. నా ట్రావెల్ ఏజెంట్‌తో దాదాపుగా డీల్‌ని ఖరారు చేశాను. అయితే మాల్దీవుల డిప్యూటీ మినిస్టర్ చేసిన ఈ ట్వీట్ చూసిన వెంటనే క్యాన్సిల్ చేసుకున్నాను. Was planning to go to Maldives for my birthday which falls on 2nd of feb. Had almost finalised the deal with my travel agent (adding proofs below👇) But immediately cancelled it after seeing this tweet of deputy minister of Maldives. #boycottmaldives pic.twitter.com/hd2R534bjY — Dr. Falak Joshipura (@fa_luck7) January 6, 2024 Sorry Maldives, I have my own Lakshadweep. I am Aatmanirbhar 🔥🇮🇳❤️ pic.twitter.com/kYcvnlLCrF — Akshit Singh 🇮🇳 (@IndianSinghh) January 6, 2024 Had a 3 week booking worth ₹5 lacs from 1st Feb 2024 at Palms Retreat, Fulhadhoo, Maldives. Cancelled it immediately after their Ministers being racists. Jai Hind 🇮🇳#BoycottMaldives #Maldives #MaldivesKMKB pic.twitter.com/wpfh47mG55 — Rushik Rawal (@RushikRawal) January 6, 2024 లక్షద్వీప్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా మోదీ ఫొటోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలను ఉద్దేశిస్తూ మాల్దీవుల యూత్ ఎంపవర్మెంట్ డిప్యూటీ మంత్రి మరియం షియునా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీని ఇజ్రాయెల్ తోలుబొమ్మ అని పేర్కొంటూ ట్విట్టర్ వేదికగా పోస్టులు చేశారు. భారత్ పర్యాటకాన్ని మాల్దీవుల పర్యాటకంతో పోల్చుతూ ఆ దేశ మంత్రులు హేళనగా పోస్టులు చేశారు. దీనిపై భారత్ కూడా స్పందించింది. మంత్రి మరియం షియునా వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మంత్రి మరియం షియునా వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు రావడంతో ట్విట్టర్(ఎక్స్) నుంచి వాటిని తొలగించారు. మాల్దీవులను బైకాట్ చేయాలంటూ పలువురు విమర్శించారు. భారతదేశం, మాల్దీవుల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఇటీవలి కాలంలో పెరిగాయి. ముఖ్యంగా గత ఏడాది నవంబర్‌లో అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధికంగా మార్పు కనిపించింది. మునుపటి "ఇండియా ఫస్ట్" విధానం నుండి వైదొలగనున్నట్లు సూచనలు ఇచ్చారు. చైనాతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు. హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మకంగా ఉన్న మాల్దీవులు, భారతదేశం 'నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీ' వంటి విధానాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇదీ చదవండి: ఫ్లోరిడాలో టోర్నడో బీభత్సం -
మోదీపై అనుచిత పోస్టు.. ఖండించిన మాల్దీవుల ప్రభుత్వం
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని 'ఇజ్రాయెల్ తోలుబొమ్మ'తో పోల్చుతూ మాల్దీవుల మంత్రి మరియం షియునా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆ దేశ ప్రభుత్వం ఖండించింది. ఈ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. అభిప్రాయాలు వ్యక్తిగతమైనవని పేర్కొంది. ప్రభుత్వ హోదాలో ఉండి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇలాంటి ద్వేషపూరిత వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలకు ఎలాంటి ఆటంకం కలిగించదని స్పష్టం చేసింది. లక్షద్వీప్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా మోదీ ఫొటోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలను ఉద్దేశిస్తూ మాల్దీవుల యూత్ ఎంపవర్మెంట్ డిప్యూటీ మంత్రి మరియం షియునా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీని ఇజ్రాయెల్ తోలుబొమ్మ అని పేర్కొంటూ ట్విట్టర్ వేదికగా పోస్టులు చేశారు. ఈ వ్యాఖ్యలపై భారత్ కూడా స్పందించింది. మంత్రి మరియం షియునా వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మంత్రి మరియం షియునా వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు రావడంతో ట్విట్టర్(ఎక్స్) నుంచి వాటిని తొలగించారు. మాల్దీవులను బైకాట్ చేయాలంటూ పలువురు విమర్శించారు. ఖండించిన మాజీ అధ్యక్షుడు.. ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రి మరియం షియునా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ కూడా తీవ్రంగా ఖండించారు. ఆమె ఉపయోగించిన భాష భయంకరమైనదని అన్నారు. మాల్దీవుల శ్రేయస్సు కోసం పనిచేయడంలో భారత్ మంచి మిత్రుడని అన్నారు. "ప్రధాని మోదీపై మంత్రి మరియం షియునా భయంకరమైన వ్యాఖ్యలు చేశారు. మొహమ్మద్ ముయిజ్జూ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలకు దూరంగా ఉండాలి. ఆ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సంబంధం లేదని భారతదేశానికి స్పష్టమైన హామీ ఇవ్వాలి" అని మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్ అన్నారు. ఇదీ చదవండి: ‘ఫొటో సెషన్‌కు సమయం ఉంది.. మణిపూర్ పరిస్థితి ఏంటి?’ -
లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవ్స్.. పనిచేస్తున్న పర్యాటక దేశ వెబ్సైట్లు
మాలె: మాల్దీవులకు చెందిన ప్రభుత్వ ప్రధాన వెబ్సైట్లు మళ్లీ పనిచేయడం ప్రారంభించాయి. సాంకేతిక సమస్యతో శనివారం రాత్రి కొంత సమయం పాటు పనిచేయకుండా పోయిన మాల్దీవుల అధ్యక్ష కార్యాలయ, విదేశాంగ మంత్రిత్వ శాఖ, టూరిజం మంత్రిత్వ శాఖ వెబ్సైట్లను కొన్ని గంటల తర్వాత పునరుద్ధరించారు. ప్రభుత్వ ప్రధాన వెబ్సైట్లు సాంకేతిక సమస్య తలెత్తి కొంత సేపు డౌన్ అయ్యాయని దేశ ప్రెసిడెంట్ ఆఫీసు ఎక్స్‌లో పోస్టు చేసింది. నేషనల్ సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఎన్ఎస్ఐటీ) వెబ్సైట్ల పూర్తిస్థాయి పునరుద్ధరణ కోసం పనిచేస్తోందని ప్రెసిడెంట్ ఆఫీసు తెలిపింది. ఈ అంతరాయం వల్ల కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్తున్నామని ప్రకటించింది. మరోపక్క ప్రధాని మోదీ లక్షద్వీప్‌ను ఇటీవల సందర్శించిన తర్వాత ఆయన ఫొటోలపై మాల్దీవుల ప్రోగ్రెసివ్ పార్టీ మెంబర్ జహీద్ రమీజ్ ఎక్స్‌లో చేసిన పోస్టులు దుమారం రేపాయి. రమీజ్ పోస్టులపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్‌లో లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవ్స్‌గా మారింది. ఇక నుంచి టూర్లకు మాల్దీవులకు వెళ్లకుండా లక్షద్వీప్‌కు వెళ్లాలని పిలుపునిస్తున్నారు. దీంతో ఎక్స్‌లో బాయ్‌కాట్ మాల్దీవ్స్ ట్రెండింగ్‌గా మారింది. చాలా మంది భారత పర్యాటకులు తమ మాల్దీవుల టికెట్లను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటిస్తున్నారు. అయితే ఈ వివాదానికి మాల్దీవుల వెబ్సైట్లు డౌన్ అవడానికి సంబంధం లేదని తెలుస్తోంది. Please note that the President’s Office website is currently facing an unexpected technical disruption. NCIT and other relevant entities are actively working on resolving this promptly. We apologise for any inconvenience caused. Thank you for your understanding and patience. pic.twitter.com/jUOopsQTUs — The President's Office (@presidencymv) January 6, 2024 The move is great. However, the idea of competing with us is delusional. How can they provide the service we offer? How can they be so clean? The permanent smell in the rooms will be the biggest downfall. 🤷🏻♂️ https://t.co/AzWMkcxdcf — Zahid Rameez (@xahidcreator) January 5, 2024 ఇదీచదవండి..అమెరికా రక్షణ మంత్రికి అనారోగ్యం -
భారత్‌కు కొత్త టెన్షన్.. ట్విస్ట్ ఇచ్చిన మహమ్మద్ ముయిజ్జు!
మాలె: మాల్దీవుల నూతన అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశం మాల్దీవుల్లో ఉన్న సైనికులను భారత్ ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ క్రమంలోనే తమ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా బలమైన తీర్పునిచ్చారని, దానిని భారత్ గౌరవిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే, మాల్దీవుల కొత్త అధ్యక్షుడిగా ముయిజ్జు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈనేపథ్యంలో శనివారం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆయనతో మర్యాపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత సైనికులను ఉపసంహించుకోవాలని కోరినట్లు అధ్యక్ష కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల సందర్భంగా మాల్దీవుల నుంచి ఇండియన్ మిలిటరీని తిరిగి పంపిస్తామని ముయిజు అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. ఆయన గెలుపు నేపథ్యంలో ఆ హామీని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. #WATCH | Malé | Union Minister Kiren Rijiju called on President Mohamed Muizzu of Maldives today. pic.twitter.com/U1BPO8Rr9W — ANI (@ANI) November 18, 2023 కాగా, హిందూ మహాసముద్రంలో కీలకమైన పొరుగుదేశం కావడంతోపాటు, అక్కడ అనేకమంది భారతీయులు నివసిస్తుండటం గురించి రిజిజు ప్రస్తావించారు. అందువల్ల నిర్మాణాత్మక సంబంధాలను పెంచుకునేందుకు, దేశాల ప్రజల మధ్య సంబంధాల బలోపేతానికి ఎదురుచూస్తున్నామని చెప్పారు. కాగా, హిందూ మహాసముద్రంలో చైనా ఆధిపత్యం పెరుగుతున్న నేపథ్యంలో దానిని అడ్డుకోవడానికి మాల్దీవులు చాలా అవసరం. ఈనేపథ్యంలో 70 మంది సైనికులను భారత్ అక్కడ మోహరించింది. అక్కడి నుంచి రాడార్లు, నిఘా విమానాలను నిర్వహిస్తున్నది. దీంతోపాటు ఎకనమిక్ జోన్‌కు భారత యుద్ధ నౌకలు గస్తీ కాస్తున్నాయి. -It was expected -#Maldives Pres Mohamed Muizzu under pressure from #China formally asks #India to withdraw forces from his country within 24 hrs of taking oath -Maldives forgets how India protected & helped them for decades, while China is taking them deeper into the debt trap pic.twitter.com/7EUQFfXbP9 — Insightful Geopolitics (@InsightGL) November 19, 2023 ఇదిలా ఉండగా.. మాల్దీవులు ఎన్నికల సందర్భంగా తాను అధికారంలోకి వస్తే అక్కడ ఉన్న భారత్ బలగాలను వెనక్కి పంపిస్తానని మయిజ్జు ఎన్నికల సమయంలో హమీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన అధికారం చేపట్టిన తర్వాతి రోజునే చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. చైనా అనుకూలవాదిగా పేరొందిన మాజీ అధ్యక్షుడు యామీన్‌కు మయిజ్జు సన్నిహితుడు కావడం గమనార్హం. 2013లో అధికారంలోకి వచ్చిన యామీన్ గయూమ్ భారత్ వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించి చైనాకు దగ్గరయ్యాడు. -
భారత దళాలు వైదొలగాలి
మాలె: మాల్దీవుల నుంచి భారత సైనిక దళాలు వైదొలగాలని ఆ దేశాధ్యక్షునిగా ఎన్నికైన మహమ్మద్ ముయ్‌జ్జు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే చైనా దళాలను కూడా తమ భూభాగంపైకి అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. భారత దళాలను వెనక్కు పంపుతానని ఎన్నికల సందర్భంగా ఆయన వాగ్దానం చేశారు. మాల్దీవుల్లో 70 మంది భారతసైనిక సిబ్బంది ఉన్నారు. భారత్ అందజేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తుంటారు. ఆ ప్రాంతంలో సైనికంగా ప్రభావం చూపేందుకు, ముఖ్యంగా మాల్దీవులపై పట్టు కోసం భారత్, చైనా దశాబ్దాలుగా పోటాపోటీగా ప్రయతి్నస్తూ వస్తున్నాయి. -
చెన్నై టూ సింగపూర్.. వయా వైజాగ్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విహార ప్రపంచానికి విశాఖ సరికొత్తగా కనిపించబోతోంది. విశాఖ మీదుగా పర్యాటక రంగంలో సేవలందించేందుకు రెండు క్రూయిజ్ షిప్పులు క్యూ కడుతున్నాయి. సాగర జలాల్లో హాయిగా విహరిస్తూ.. విశాఖ నుంచి ప్రపంచంలోని పలు నగరాలకు సర్విసులు నడిపేందుకు లిట్టోరల్ క్రూయిజ్ సంస్థ సిద్ధమవుతోంది. విశాఖలో నిర్మించిన క్రూయిజ్ టెర్మినల్ మీదుగా డిసెంబర్ నుంచి తొలి సర్విస్ ప్రారంభించేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. చెన్నై నుంచి సింగపూర్‌కి తొలి సర్విసు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన లిట్టోరల్.. ఈ క్రూయిజ్‌ని విశాఖ మీదుగా నడపాలని నిర్ణయించింది. మరోవైపు భారత్, శ్రీలంక, మాల్దీవుల్లో విహరించేలా మరో క్రూయిజ్ సర్విస్ కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే టూరిస్ట్ క్రూయిజ్ షిప్‌ల ప్రతినిధులు విశాఖపట్నం పోర్టు అథారిటీ అధికారులతోపాటు కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ, రాష్ట్ర పర్యాటక శాఖతో సంప్రదింపులు జరిపారు. అనుమతులు ఇచ్చేందుకు పోర్టు అంగీకారం తెలిపింది. త్వరలోనే సర్విసుల వివరాల్ని ప్రకటించేందుకు చెన్నైకి చెందిన లిట్టోరల్ క్రూయిజ్ సంస్థ సన్నద్ధమవుతోంది. రాష్ట్ర పర్యాటక శాఖతో చర్చలు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, విశాఖ పోర్టు అథారిటీ సంయుక్తంగా విశాఖలో నిర్మించిన ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్‌ను కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జల మార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించారు. టెర్మినల్ అందుబాటులోకి రావడంతో.. క్రూయిజ్‌లో విహరించే వారికి సౌకర్యాలుంటాయన్న కారణంతో ఈ సర్విస్‌ని విశాఖ మీదుగా నడపాలని భావించారు. ముంబైలో ఇటీవల ముగిసిన గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ (జీఎంఐఎస్)–2023లో లిట్టోరల్ క్రూయిజెస్ లిమిటెడ్ ప్రమోటర్ రాజా వైజ్‌తోపాటు చెన్నైకి చెందిన వోక్ పోర్టు అథారిటీ, ట్యుటికోరిన్ పోర్టు ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీనికి సంబంధించి విశాఖపట్నం పోర్టు ప్రతిని«ధులతో సంప్రదింపులు కూడా జరిగాయి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాతో లిట్టోరల్ ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. చెన్నైని హోం పోర్ట్‌గా చేసుకుని రెండు విలాసవంతమైన నౌకలకు సంబంధించిన నిర్వహణను సులభతరం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. భారత్–శ్రీలంక– మాల్దీవులకు మరో సర్విసు రూ.1,200 కోట్ల పెట్టుబడితో భారత్–శ్రీలంక–మాల్దీవుల మధ్య మరో లగ్జరీ క్రూయిజ్ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సర్విసును కూడా లిట్టోరల్ సంస్థ నడపనుంది. వీలైనంత త్వరగా ఈ సర్విసు కూడా విశాఖ మీదుగా ప్రారంభించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీనిద్వారా దాదాపు 3 వేల మందికి ఉపాధి అవకాశాలు కలిగే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు షిప్పులు పూర్తి లగ్జరీగా ఉంటాయని విశాఖపట్నం పోర్టు ప్రతినిధులు చెబుతున్నారు. ఒక్కొక్కటి 10 అంతస్తులుండే ఈ భారీ షిప్లో ఒకేసారి 1,200 నుంచి 1,500 మంది వరకూ ప్రయాణించవచ్చు. ఫుడ్ కోర్టులు, స్పెషాలిటీ రెస్టారెంట్లు, బార్లు, స్పా, సెలూన్, థియేటర్, నైట్ క్లబ్, స్విమ్మింగ్ పూల్స్, ఫిట్నెస్ సెంటర్లు, డీజే ఎంటర్టైన్మెంట్, లైవ్ బ్యాండ్, అడ్వెంచర్ యాక్టివిటీస్, షాపింగ్ మాల్స్, లైవ్‌షో ఉన్నాయి. చిన్నారుల కోసం ప్రత్యేక ఫన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. టికెట్ తీసుకున్న వారందరికీ షిప్‌లోని క్యాసినో వరల్డ్‌కు ఎంట్రీ ఉచితం. దీంతో పాటు లిక్కర్, ఇతర సర్విసులకు అదనపు చార్జీలు ఉంటాయి. -
200 ద్వీపాలు గల దేశం ఏది? సందర్శనలో భారతీయులకు వెసులుబాటు ఏమిటి?
భారతదేశంలో ఏ ముస్లిం గురించి మాట్లాడినా, మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు పాకిస్తాన్. అయితే ఇదే సందర్భంలో మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న దేశం పాకిస్తాన్ కాదు. మనం ఇప్పుడు మాల్దీవులకు సంబంధించిన ఒక విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మాల్దీవులు ఆసియాలోనే అతి చిన్న దేశం. దీని వైశాల్యం 298 చదరపు కిలోమీటర్లు. ఈ దేశ జనాభా లక్షల సంఖ్యలో మాత్రమే ఉందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు మాల్దీవుల జనాభా విషయానికొస్తే 2016 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడి జనాభా దాదాపు 4 లక్షల 28 వేలు. అయితే 2021లో ఇక్కడి జనాభా 5.21 లక్షలుగా అంచనా వేశారు. మాల్దీవులలో సుమారు 212 ద్వీపాలు ఉన్నాయి. వాటిలో సుమారు 200 ద్వీపాలు స్థానిక జనాభాకు కేటాయించారు. 12 ద్వీపాలను పర్యాటకుల కోసం కేటాయించారు. భారతీయులు మాల్దీవులకు వెళ్లాలనుకుంటే వీసా అవసరం లేదు. మాల్దీవులకు వెళ్లే వారికి వీసా ఆన్ అరైవల్ సౌకర్యం అందుబాటులో ఉంది. అంటే ఇక్కడి విమానాశ్రయంలో దిగగానే 30 నుంచి 90 రోజుల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా వీసా లభిస్తుంది. అయితే చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, మాల్దీవులలోని హోటల్లో బస చేసినట్లు రుజువు కలిగి ఉండాలి. మాల్దీవుల రాజ్యాంగం ప్రకారం ఇస్లాం మతాన్ని విశ్వసించే వారు మాత్రమే మాల్దీవుల పౌరులవుతారు. అంటే ఇక్కడ ఉండే ముస్లింలకు మాత్రమే స్థానిక పౌరసత్వం లభిస్తుంది. మాల్దీవుల రాజ్యాంగంలోని వివరాల ప్రకారం సున్నీ ఇస్లాం ఇక్కడ జాతీయమతం. ముస్లిమేతరులెవరికీ ఈ దేశ పౌరసత్వం ఇవ్వకూడదని కూడా ఈ రాజ్యాంగంలో పేర్కొన్నారు. ఇక్కడ ప్రభుత్వ నియమాలు కూడా ఇస్లామిక్ చట్టంపై ఆధారపడి ఉండటం విశేషం. ఇది కూడా చదవండి: హమాస్‌లో ‘మ్యాన్ ఆఫ్ డెత్’ ఎవరు? -
భారత్‌ను మాల్దీవులు వదులుకోగలదా?
దక్షిణాసియాలో చిట్టచివరగా బ్రిటిష్ పాలకుల నుండి స్వాతంత్య్రం పొందిన దేశం మాల్దీవులు. 1965లో స్వతంత్ర దేశంగా అవతరించినప్పటి నుండి ఆర్థిక, శాస్త్రీయ–సాంకేతిక అభివృద్ధిలో, సముద్ర భద్రతా విషయాల్లో మాల్దీవులకు భారత్ చేయూత అందించింది. 1988లో ఆపరేషన్ కాక్టస్ ద్వారా ప్రభుత్వాన్ని తీవ్రవాదుల చెర నుండి కాపాడింది. అయినా కొన్నేళ్లుగా భారత్ ఆ దేశంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. రెండు మూడేళ్లుగా ఏకంగా ‘ఇండియా అవుట్’ ప్రచారానికి కేంద్రం అయింది. దీని వెనక ఐఎస్ఐ, చైనా ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. అలాగని అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతుకగా తన వాణిని బలంగా వినిపిస్తున్న భారత్‌ను దూరం చేసుకోవడం మాల్దీవులకు కూడా అంత తేలిక కాదు. మాల్దీవుల్లో కొన్ని రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో భారత వ్యతిరేక రాజకీయాలు నెరిపిన మొహమ్మద్ ముయిజ్యూ సుమారు 54 శాతం ఓట్లతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికతో ఇరు దేశాల సంబంధాలు ఎలా వుండబోతున్నాయో అంచనా వేసే ముందు, భారత్ పట్ల వ్యతిరేకత పెరగడానికి కారణాలు ఏమిటో తెలుసుకోవాలి. మాల్దీవ్స్‌లో 12వ శతాబ్దంలో ఇస్లాం అడుగుపెట్టినప్పటికీ అది స్థానిక సంప్రదాయాలు, ఆచారాల సమ్మిళితంతో ఉదారవాదంగా ఉండేది. 1970ల్లో ఉదార మత విధానాలను అవలంబించిన మాల్దీ వులు, క్రమంగా గల్ఫ్ దేశాల ప్రభావానికి లోనయ్యింది. చమురు ఉత్పాదిత గల్ఫ్ దేశాలు అరబ్, ముస్లిం ప్రపంచంలో ముఖ్యమైన భూమికను పోషించడం మొదలుపెట్టాయి. సున్నీ ముస్లిం వహాబీజం పాటించే గల్ఫ్ దేశాలు సంప్రదాయవాదాన్ని బలంగా ప్రచారం చేయడం, మొహమ్మద్ అబ్దుల్ గయూమ్ నేతృత్వంలోని ప్రభుత్వం 1980, 90ల్లో ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవడానికి మతాన్ని అస్త్రంగా ఉపయోగించుకోవడం, గల్ఫ్ దేశాల నుండి వచ్చే చమురు, ఆర్థిక సహాయాన్ని పొందేందుకు సాంప్రదాయవాదాన్ని, ఇస్లామిక్ షరియా చట్టాల్ని ప్రవేశపెట్టడం వరుసగా జరిగాయి. ఆఫ్గనిస్తాన్‌ను సోవియట్ ఆక్రమించడంతో దానికి వ్యతిరేకంగా సంప్రదాయవాద వర్గాల ఏకీకరణ జరిగింది. ఇరవై ఒక్కటవ శతాబ్దం మొదట్లో జరిగిన ప్రపంచ పరిణామాల ప్రభావం మాల్దీవుల యువత మీద తీవ్రంగా పడింది. ఆ దేశంలోని చాలామంది యువత అల్–ఖాయిదాలో చేరినట్టుగా వార్తలు వచ్చాయి. 2007లో జరిగిన వరుస బాంబు పేలుళ్లు ప్రమాద ఘంటికలు మోగించాయి. 2008లో మాల్దీవులు ఏక పార్టీ వ్యవస్థ నుండి బహుళ పార్టీ వ్యవస్థగా రూపాంతరం చెందింది. మతపరమైన సాంప్రదాయ పార్టీలు ఏర్పాటు కావడానికీ, అవి మత రాజకీయాలు నెరప డానికీ ఇది దారి తీసింది. 2012లో షరియా చట్టాల అమలు కోసం అనేక ఉద్యమాలు ఈ పార్టీలు చేపట్టాయి. చాలామంది యువత ‘ఐసిస్’లో చేరడానికి సిరియా వెళ్లినట్టు అంతర్జాతీయ నివేదికలు పేర్కొన్నాయి. ఇస్లామిక్ ఛాందసవాదాన్ని ఎగదోయడంలో, ముఖ్యంగా భారత్ పట్ల వ్యతిరేకతను పెంచడంలో పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ పాత్ర చాలా ఉంది. 1990ల్లో జరిగిన ఇస్రో ‘హనీ ట్రాప్’ కేసులో మాల్దీవులకు చెందినవారు ఉన్నట్టుగా బయట పడటం ఆ దేశంలో వేళ్లూనుకున్న ఐఎస్ఐ పాత్రకు ఒక ఉదాహరణ మాత్రమే. 1978 నుండి 2008 వరకు సుమారు ముప్పయ్యేళ్లు మాల్దీవులను ఏకధాటిగా పాలించిన మౌమూన్ అబ్దుల్ గయూమ్, అయన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్, 2018లో అధ్యక్షుడిగా ఎన్నికైన ఇబ్రహీం సోలీహ్ భారత్ పట్ల సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. కానీ 2013 నుండి 2018 మధ్యకాలంలో అధికారంలో ఉన్న అబ్దుల్లా యామీన్ ప్రభుత్వం భారత్ వ్యతిరేక విధానాలను అనుసరించింది. తాజాగా ఆయన వారసుడిగా మొహమ్మద్ ముయిజ్యూ భారత్ పట్ల అంతే తీవ్ర వ్యతిరేక ప్రచారాలతో ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించారు. యామీన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో మాల్దీవ్స్‌లో చైనా కార్యకలాపాలు విపరీతంగా పెరిగాయి. 2014లో చైనీస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో మాల్దీవ్స్ చేరడమే కాకుండా అనేక మౌలిక వసతుల నిర్మాణ బాధ్యతలను చైనీస్ కంపెనీలకు అప్పగించింది. మాలె, హుల్హులే, హుల్హుమాలే దీవులను కలిపే సినిమాలే బ్రిడ్జితో పాటు, వెలనా అంతర్జాతీయ విమానాశ్రయం, హుల్హులే ద్వీపంలోని నివాస సముదాయ నిర్మాణాలు, టూరిజం, ఎనర్జీ తదితర రంగాల్లో చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. మాల్దీవుల ఆర్థిక శాఖ అంచనా ప్రకారం, 2022 చివరికల్లా ఆ దేశ అప్పులు జీడీపీలో 110 శాతం. అందులో చైనా వాటా సుమారు 70 శాతం. ప్రతి సంవత్సరం చైనాకు చెల్లించే వడ్డీలు సుమారు 92 మిలియన్ల అమెరికన్ డాలర్లు. మాల్దీవుల వార్షిక బడ్జెట్లో ఇది సుమారు 10 శాతం. యామీన్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన రాజ్యాంగ సవరణ ప్రకారం, విదేశీయులు ఆ దేశంలో స్థిరాస్తులు కొనుగోలు చేయవచ్చు. దీని ఆసరాగా చైనీస్ కంపెనీలు ఫెయిదూ ఫింహులు ద్వీపాన్ని 50 ఏళ్ల కాలానికి లీజుకు తీసుకున్నాయి. ఈ లెక్కలు చైనా ప్రభావం మాల్దీవుల పైన ఎంతవుందో, చైనా అప్పుల ఊబిలో ఎంతగా చిక్కుకుందో తెలియజేస్తాయి. చైనా ఈ పరిస్థితులను భారత వ్యతిరేక శక్తులను పెంచడానికి ఉప యోగించుకుంది. చైనా అనుసరిస్తున్న వైఖరిని గ్రహించిన ఇబ్రహీం సోలీహ్ ప్రభుత్వం ‘ఇండియా ఫస్ట్’ విధానాన్ని పాటించింది. అయితే భారత వ్యతిరేక శక్తులు ఒక క్రమ పద్ధతిలో ప్రచారాన్ని సాగించాయి. ఆ దేశంలో ఉన్న నిరుద్యోగానికి ముఖ్య కారణం, భారతీయులు టూరిజం తదితర రంగాల్లో ఉద్యోగాలు ఎగరేసుకు పోవడమేననీ, భారత్‌లో ముస్లింల పట్ల అణచివేతకు పాల్పడుతున్నా రనీ, భారత్ తన సైనిక కార్యక్రమాలు సాగిస్తూ మాల్దీవుల సార్వభౌ మత్వాన్ని ఉల్లంఘిస్తోందనీ, ఇబ్రహీం సోలీహ్ ప్రభుత్వం దేశ సంపదను భారత్‌కు ధారాదత్తం చేస్తోందనీ ఇలా అనేక రకాలుగా విష ప్రచారం చేశాయి. ఇదే రకమైన రాడికలైజేషన్, యువతలో భారత వ్యతిరేక భావజాల వ్యాప్తి బంగ్లాదేశ్‌లోనూ గమనించవచ్చు. ఈ ప్రచారం వెనక అటు ఐఎస్ఐ, ఇటు చైనా ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. ఈ పరిణామాల నేపథ్యంలో కొత్త ప్రభుత్వాన్ని భారత వ్యతిరేక కార్యక్రమాలు కొనసాగించకుండా చేయడం, విదేశాంగ విధానానికి ఒక సవాలు. ఇప్పటికే హిందూ మహాసముద్రంలో మయాన్మార్ నుండి జిబౌటి వరకు తన ఆర్థిక, సైనిక, వ్యూహాత్మక ప్రభావాన్ని విపరీతంగా పెంచుకున్న చైనాను కట్టడి చేయడం అంత తేలిక కాదు. భారత్, చైనా మధ్య ఈ ప్రాంతంలో నెలకొన్న పోటీలో మాల్దీవులు ముఖ్య భూమికను పోషిస్తాయి, 2013లో అమెరికా మాల్దీవులతో సైనిక ఒప్పందాలు చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలను, భారత్ అడ్డుకుంది. దక్షిణాసియాలో ప్రాంతీయేతర శక్తుల ప్రభావాన్ని అడ్డు కోవడం భారత విదేశీ విధానంలో ముఖ్య భాగం. కానీ అది క్రమంగా మారడం గమనించవచ్చు. 2020లో కుదిరిన అమెరికా, మాల్దీవుల సైనిక ఒప్పందానికి భారత్ సానుకూలత వ్యక్తం చేసింది. మాల్దీవులకు సుమారు 1,800 కిలోమీటర్ల దూరంలో ఉన్న డిగో గరిసియ అమెరికా మిలిటరీ స్థావరాన్ని గతంలో వ్యతిరేకించిన భారత్ ప్రస్తుత పరిస్థి తుల్లో తన స్వరం మార్చింది. ఈ ఒప్పందాలు చైనా ప్రభావాన్ని నిలువరించడంలో సహాయపడతాయని భావిస్తోంది. భారత వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడబోతున్నందుకు మరీ ఆందోళన చెందకుండా ఇదివరకే ఆ దేశంతో కుదిరిన అనేక ఒప్పందాలు, ముఖ్యంగా 500 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన థిలమలే సముద్ర వంతెన ప్రాజెక్ట్, తాగునీరు పైపులైన్ ప్రాజెక్ట్, విద్య, అరోగ్య సేవల వసతుల నిర్మాణ ప్రాజెక్టులు, వివిధ ఇతర పనులకు సంబంధించిన దాదాపు 300 బిలియన్ డాలర్ల విలువైన ప్రాజెక్టులు కొనసా గించాలి. ఇవి మాల్దీవులకు చాలా ముఖ్యమైనవి. ఇవి కొనసాగించేందుకు నూతన ప్రభుత్వాన్ని ఒప్పించడం, భారత వ్యతిరేక ప్రచారాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం తక్షణ కర్తవ్యాలు. అభివృద్ధి చెందు తున్న దేశాల గొంతుకగా తన వాణిని బలంగా వినిపిస్తున్న భారత్‌ను దూరం చేసుకోవడం మాల్దీవులకు కూడా అంత తేలిక కాదు. ‘ఇండియా అవుట్’ ప్రచారం అక్కడి భారత సైనిక బలగాలకు వ్యతి రేకంగానో, భావోద్వేగ రాజకీయాల కోసమో తప్ప, పూర్తిగా భారత్‌ను ఆ దేశానికి దూరం చేయాలని కాదని మనం అనుకోవలసి ఉంటుంది. డా‘‘ గద్దె ఓంప్రసాద్ వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, దక్షిణాసియా వ్యవహారాల అధ్యయన విభాగం, ఎస్ఐఎస్, జేఎన్‌యూ -
మనకు కొత్త సవాలు
తరచూ రాజకీయ సంక్షోభాలు చవిచూసే ద్వీపసమూహ దేశం మాల్దీవుల్లో ఈసారి శాంతియుతంగా అధికార మార్పిడి జరిగింది. అది సంతోషజనకమే అయినా, ఈ తాజా అధ్యక్ష ఎన్నిక ఫలితాలు భారత్‌లో కొత్త ఆందోళన రేపుతున్నాయి. చైనాకు అనుకూలుడైన ప్రతిపక్ష అభ్యర్థి దేశాధ్యక్షుడు కానుండడమే అందుకు కారణం. మాల్దీవులకు కొత్త అధ్యక్షుడి రాకతో, ఇప్పటి దాకా అక్కడున్న పలుకుబడి, పట్టు భారత్ కోల్పోనుంది. అది గణనీయమైన నష్టమే. రక్షణ రంగం, ప్రాథమిక వసతుల ప్రాజెక్టుల్లో మాల్దీవులతో భారత సంబంధాలే ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాంశం కావడం గమనార్హం. మాల్దీవులపై డ్రాగన్ దేశం మరోసారి పట్టు సాధించే అవకాశం రావడంతో ఢిల్లీ – మాల్దీవుల బంధానికి ఇది పరీక్షా సమయం. ప్రభుత్వం మారినా, కీలకమైన మాల్దీవుల్లో తన ప్రయోజనాల పరిరక్షణకు కృషి చేయడం భారత్‌కు ఇప్పుడు తప్పనిసరి. అంతేకాక, గడచిన రెండు దశాబ్దాలుగా చైనా తన ప్రాబల్యం పెంచుకొంటూ, మన పెరట్లో తన పట్టు బిగిస్తున్న వైనాన్ని గమనించి జాగ్రత్తపడక తప్పదని మరోసారి రుజువైంది. భారత్‌కు దక్షిణంగా సుమారు 450 మైళ్ళ దూరంలో, కేవలం 5 లక్షల జనాభా ఉండే మాల్దీవులు చిరు ద్వీపదేశమే. అయితే, హిందూ మహాసముద్రంలో రద్దీగా ఉండే నౌకా రవాణా మార్గంలో నెల కొన్నందున వ్యూహాత్మకంగా చాలా కీలకం. అందుకే, ఆ దేశాధ్యక్ష పదవికి ఎన్నికలు అనేసరికి భారత, చైనాల్లో ఆసక్తి నెలకొంది. ఒక విధంగా చూస్తే ఈ ఎన్నికలు... ద్వీపదేశంపై భారత, చైనాల్లో ఎవరికి పట్టు ఎక్కువుందో తెలియపరిచే ప్రజాభిప్రాయ సేకరణ పోటీ లాంటివి. రాజధాని మాలే నగరానికి ప్రస్తుతం మేయర్‌గా ఉంటూ, దేశాధ్యక్ష పదవికి పోటీ పడ్డ ముయిజు మొదటి నుంచి చైనాతో సన్నిహిత సంబంధాల్ని కోరుకుంటున్నారు. నిజానికి, జనంతో క్రిక్కిరిసిన రాజధానిలో జాగా కొరత వల్ల తలెత్తిన గృహవసతి సమస్య, తరిగిపోతున్న డాలర్ రిజర్వులు సహా అనేక అంశాలు ఈ ఎన్నికల ప్రచారంలో ముందుకు వచ్చాయి. అయితే, చివరకు మాల్దీవుల భవితపై ఆసియాలోని రెండు అగ్రదేశాల ప్రభావం చుట్టూరానే ఓటింగ్ సరళి సాగింది. దాదాపు 85 శాతానికి పైగా ఓటింగ్‌లో పాల్గొన్న ఈ ఎన్నికల్లో ఓటర్లు భారత, చైనా వర్గాలుగా చీలిపోయారని చెప్పవచ్చు. ఇరుగుపొరుగు దేశాల్లో పలుకుబడిని పెంచుకొనే ప్రయత్నాలు భారత, చైనాలు రెంటికీ కొత్త కాదు. ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్’ (బీఆర్ఐ) కింద అభివృద్ధి రుణాలతో మాల్దీవుల్లో చైనా ముందుగా అడుగేసింది. ఇటీవల కొన్నేళ్ళుగా భారత్ తన పట్టు చాటింది. నిరుడు శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పతనమైనప్పుడు వందల కోట్ల డాలర్ల సాయం అందించిన ఢిల్లీ 2018లో సోలిహ్ అధ్యక్షు డిగా ఎన్నికైన నాటి నుంచి ద్వీపదేశంలో తన ఉనికిని విస్తరించింది. ప్రాజెక్టులూ పెరిగాయి. నిజం చెప్పాలంటే – గతానికి భిన్నంగా గత అయిదేళ్ళలో భారత అనుకూల సోలిహ్ పాలనలో మాల్దీవుల్లో శాంతి, స్వేచ్ఛ నెలకొన్నాయి. అంతకు ముందు అయిదేళ్ళు ప్రస్తుతం అవినీతి ఆరోపణలపై జైలులో ఉన్న చైనా అనుకూల అబ్దుల్లా యమీన్ పాలన సాగింది. అయితే, ప్రస్తుత సర్కార్ మాల్దీవుల సార్వభౌమాధికారాన్ని భారత్‌కు తాకట్టు పెడుతోందనే భావనను జనంలో ప్రతిపక్ష కూటమి కల్పించగలిగింది. ‘ఇండియా అవుట్’ అనే దాని నినాదాల భావోద్వేగం ఫలించింది. సెప్టెంబర్ మొదట్లో జరిగిన తొలి రౌండ్ ఓటింగ్‌లో 8మంది అభ్యర్థుల్లో సోలిహ్‌కు 36 శాతం, ముయిజుకు 46 శాతం వచ్చినా, ఎవరూ అర్ధశతం దాటలేదు. అలా అదనపు రెండో విడత ఓటింగ్ అవసరమైంది. ఈసారి ప్రతిపక్ష ముయిజు స్పష్టమైన విజేతగా నిలిచారు. బ్రిటన్‌లో చదువుకొని, సివిల్ ఇంజనీరింగ్‌లో డాక్టరేట్ చేసి, ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికైన 45 ఏళ్ళ ముయిజు రాజకీయా ల్లోకి రాక ముందు ప్రైవేట్ రంగంలో ఇంజనీర్. మాలేకు మేయర్ అవడానికి ముందు ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రిగా వ్యవహరించారు. తాజా ఎన్నికల్లో ముయుజు గెలుపునకు సోలిహ్ తప్పులూ కారణమే. దేశానికి భారత్ నుంచి పెట్టుబడులు, అభివృద్ధి సాయం అందుతున్న మాట అటుంచి, ఓ చిన్న భారత సైనికదళాన్ని దేశంలోకి తెచ్చారన్న ప్రత్యర్థుల ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టలేక పోయారు. అలాగే, దేశాధ్యక్షుడయ్యేందుకు తనకు సాయపడ్డ బాల్యమిత్రుడు పార్టీని చీల్చి, కొత్త కుంపటి పెట్టే పరిస్థితి తెచ్చుకున్నారు. ఆ పార్టీ 7 శాతం ఓట్లు సాధించడం పెద్ద దెబ్బ అయింది. భారత్ సంగతికొస్తే ఈ ఫలితాల్ని అతిగా అంచనా వేసినా తప్పే! అలాగని తక్కువగా అంచనా వేసినా చిక్కే!! భౌగోళిక సామీప్యం, ఉమ్మడి భద్రతా ప్రయోజనాలు, సాంస్కృతిక సాన్నిహిత్యం రీత్యా మాలేతో మనది లోతైన బంధం. కానీ, ఇండో– పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో చైనా తన ఛాయను విస్తరిస్తూ, ఆర్థిక – వ్యూహాత్మక గణితంలో మాలేను తెలివిగా భాగం చేసుకుంది. సోలిహ్ పాలనలో గణనీయంగా పెట్టుబడులు పెట్టి, ‘గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్’ సహా అనేక ప్రాథమిక వసతులకు ఆర్థిక సాయం చేసిన భారత్ ఇప్పుడు చాకచక్యంగా వ్యవహరించాలి. మాలేతో మనది ప్రభుత్వాల మార్పుతో సంబంధం లేని సుస్థిర బంధమని చాటాలి. కొత్త సర్కా రుతో స్నేహానికి భారత విదేశాంగ విధాన వ్యవస్థ శ్రమించాలి. భారత వ్యతిరేక అపోహలు పోగొట్టేలా రాజకీయంగా అన్ని పార్టీలతో సుహృద్భావం పెంచుకోవాలి. ఇండియా పొడ గిట్టని యమీన్ రేపు మళ్ళీ తెర వెనుక చక్రం తిప్పుతారని భావిస్తున్న వేళ... కొత్త అధ్యక్షుడికి ఇప్పటికే అభినందనలు తెలిపిన భారత్ అంతటితో ఆగక మరింత ముందడుగు వేయాలి. హిందూ మహాసముద్రంలో మన వ్యూహాత్మక ప్రయోజనాలకు దెబ్బ తగలకపోవడమే ప్రాథమ్యం కావాలి! -
టీ20ల్లో నేపాల్ బౌలర్ అత్యుత్తమ గణాంకాలు
ఏషియన్ గేమ్స్ మెన్స్ క్రికెట్ రికార్డులకు అడ్డాగా మారింది. ఈ పోటీల్లో పాల్గొంటున్న అన్ని జట్ల ఆటగాళ్లు ప్రతి మ్యాచ్‌లో ఏదో ఒక రికార్డు బద్దలు కొడుతూనే ఉన్నారు. ముఖ్యంగా నేపాల్ జట్టు ప్రస్తుత ఏషియన్ గేమ్స్‌లో రికార్డుల రారాజుగా మారింది. మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఆటగాళ్లు టీ20ల్లో ఫాస్టెస్ట్ హండ్రెడ్, ఫాస్టెస్ట్ ఫిఫ్టి రికార్డులతో పాటు పలు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టారు. తాజాగా మాల్దీవ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు బౌలర్ అభానష్ బొహారా టీ20ల్లో ఏడో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో అతను 3.4 ఓవర్లలో 11 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో నేపాల్ తరఫున ఇవే అత్యుత్తమ గణాంకాలు. ఈ విభాగానికి సంబంధించి మలేషియా బౌలర్ శ్యాజ్రుల్ ఇద్రుస్ పేరిట అత్యుత్తమ గణాంకాలు ఉన్నాయి. ఇదే ఏడాది చైనాతో జరిగిన మ్యాచ్‌లో ఇద్రుస్ 4 ఓవర్లలో 8 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఏ బౌలర్ ఇద్రుస్కు ముందు 7 వికెట్లు తీయలేదు. ఇదిలా ఉంటే, ఏషియన్ గేమ్స్‌లో మాల్దీవ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ 138 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేయగా.. మాల్దీవ్స్ 19.4 ఓవర్లలో 74 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. నేపాల్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ పౌడెల్ 27 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లతో 52 పరుగులు చేయగా.. గత మ్యాచ్‌లో టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు నమోదు చేసిన కుషాల్ మల్లా మరో విధ్వంసకర ఇన్నింగ్స్ (20 బంతుల్లో 47 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడాడు. మాల్దీవ్స్ బౌలర్లలో నజ్వాన్ ఇస్మాయిల్ (4-0-17-3) ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన మాల్దీవ్స్ అభినాశ్ బొహార ధాటికి 74 పరుగులకు కుప్పకూలింది. మాల్దీవ్స్ ఇన్నింగ్స్‌లో ఘనీ (36) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ పోటీల్లో భారత్ మ్యాచ్ అక్టోబర్ 3న జరుగనుంది. -
తమన్నా తప్పించుకుంది.. బాయ్‌ఫ్రెండ్ సీరియస్ అయ్యాడు!
స్టార్ హీరోయిన్ తమన్నా నటుడు విజయ్ వర్మతో రిలేషన్లో ఉంది. ఇప్పటికే ఈ బంధం గురించి అందరికీ తెలుసు. అయితే పెళ్లెప్పుడు? అని అడిగితే మాత్రం అప్పుడు-ఇప్పుడు అని ఇద్దరూ ఆ టాపిక్ దాటవేస్తున్నారు. కరెక్ట్‌గా చెప్పాలంటే తప్పించుకుని తిరుగుతున్నారు. అలాంటిది వీళ్లని తాజాగా ఓ వ్యక్తి.. కొంటె ప్రశ్న వేసి ఇరకాటంలో పడేశాడు. దీంతో విజయ్ సీరియస్ అయ్యాడు. (ఇదీ చదవండి: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమాలు) ఓసారి షూటింగ్లో భాగంగా పరిచయమైన తమన్నా-విజయ్ వర్మ.. కొన్నాళ్లకు ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఎందుకంటే గతేడాది న్యూయర్ సందర్భంగా వీళ్లిద్దరూ ముద్దు పెట్టుకుంటున్న వీడియో ఒకటి బయటకొచ్చింది. అప్పటినుంచి ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ జంటగా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. మరి వీళ్లిద్దరూ ఫ్రెండ్స్ లేదా లవర్స్ అనేది పక్కనబెడితే తాజాగా మాల్దీవులు వెళ్లొచ్చారు. అయితే ఎయిర్‌పోర్ట్‌లో దిగి నడిచి వస్తుండగా.. అక్కడే ఉన్న అభిమానులు తమన్నా వెంటపడ్డారు. వెకేషన్ ఎలా జరిగింది, విజయ్ సర్ రాలేదా అని అడిగే ప్రయత్నం చేశారు కానీ ఆమె పెద్దగా రెస్పాండ్ కాకుండా వెళ్లిపోయింది. కాసేపటి విజయ్ వర్మ బయటకొచ్చాడు. దీంతో అతడిని.. 'మాల్దీవుల్లో బాగా మజా చేశారా?' అని కొంటెగా ఓ వ్యక్తి అడిగాడు. ఈ క్వశ్చన్ పై సీరియస్ అయిన ఇతడు.. 'మీరు అలా మాట్లాడకూడదు' అని సీరియస్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: 'ఖుషి' రిజల్ట్‌పై విజయ్ దేవరకొండ ఫస్ట్ రియాక్షన్) #VijayVarma gets a little angry with a cameraman asking too many questions as he lands back in Mumbai post his vacation with girlfriend #TamannaahBhatia 📸 . . .#tamannahbhatia #vijayvarma #pinkvilla #papped pic.twitter.com/wE7cLt09iU — Pinkvilla (@pinkvilla) August 31, 2023 -
మాల్దీవ్స్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా! నిద్ర రాదేమో అంటూ..
Anand Mahindra Twitter Video: చాలామంది సెలబ్రిటీలు బాగా ఎంజాయ్ చేయడానికి మాల్దీవులకు వెళ్లిన కథనాలు గతంలో చాలా కథనాల్లో తెలుసుకుని ఉంటారు. అండర్ వాటర్ హౌస్‌లో స్టే చేయడం వంటి గొప్ప అనుభూతులు అక్కడ అనుభవించవచ్చని చాలామంది చెబుతూ ఉంటారు. అయితే తాజాగా మాల్దీవులకు సంబంధించిన ఆనంద్ మహీంద్రా ఒక ట్వీట్ చేసారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ప్రపంచంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ హోటల్ సూట్‌ను కలిగి ఉన్న ది మురాకా అనే హోటల్ వీడియోను పోస్ట్ చేశారు. అక్కడ ఒక రాత్రి కూడా గడపలేనని, రాత్రంతా గ్లాస్ పగుళ్ళకు వెతుకుతానని ట్వీట్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆరువేలకు పైగా లైకులు వచ్చాయి, చాలామంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. చాలామంది ఎంజాయ్ చేయడానికి ఇలాంటి ప్రదేశాలకు వెళ్లడం సహజం, కానీ ఆనంద్ మహింద్ర మాత్రం భయపడుతున్నట్లు ట్వీట్ ద్వారా అర్థమవుతుంది. వీడియోలో మీరు గమనించినట్లతే వాటర్ లోపల ఒక రూమ్ ఉండటం, దాని చుట్టూ.. పైన చేపలు ఈత కొట్టడం వంటివి చూడవచ్చు. ఇది చూడటానికి బాగానే అనిపించినా.. ఎవరికైనా తప్పకుండా భయం పుడుతుంది. ఇదీ చదవండి: ఆరుపదుల వయసులో రూ. 23,000కోట్ల అధిపతిగా.. ఎవరీ లచ్మన్ దాస్ మిట్టల్ ఇక్కడ కనిపించే సూట్ 180 డిగ్రీల విశాల దృశ్యాలను చూపిస్తుంది. కావున మీరు ఆ గది లోపల నుంచి బయట తిరిగే జలచరాలను వీక్షించవచ్చు. ఇందులో కావలసిన సకల సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఒక రాత్రి ఉండటానికి సుమారు రూ. 41 లక్షలు ఖర్చవుతుందని చెబుతారు. The Muraka was the Maldives’ and the world's, very first underwater hotel suite. I was sent this post with a suggestion that a stay here would ensure the most relaxed weekend rest. To be honest, I don’t think I would get a wink of sleep…I would stay awake looking for cracks in… pic.twitter.com/CkqUPNlPJs — anand mahindra (@anandmahindra) August 12, 2023 -
Gouri G Kishan : మాల్దీవుల్లో అందాల ఊయల ఊగేస్తున్న గౌరీ కిషన్(ఫోటోలు)
-
మాల్దీవులకు హాయ్
వరుస షూటింగ్‌లతో బిజీ బిజీగా గడిపిన హీరో రజనీకాంత్ హాలిడే ట్రిప్ కోసం మాల్దీవులు వెళ్లారు. చెన్నై నుంచి మాల్దీవుల రాజధాని మాలె వరకు శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్‌లో రజనీ ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఓ ఫొటోలో ఎయిర్ హోస్టెస్ ఇచ్చిన ఫ్లవర్ బొకేతో నవ్వుతూ కనిపించిన రజనీ కాంత్, మరో ఫొటోలో బ్యాగ్ పట్టుకుని, కళ్ల జోడు పెట్టుకుని స్టైలిష్‌గా ఉన్నారు. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న ‘లాల్ సలామ్’ సినిమాలో తన ΄ాత్ర (మొయిద్దీన్ భాయ్) షూటింగ్‌ని పూర్తి చేశారాయన. ఇప్పుడు కొంచెం విరామం దొరకడంతో రిఫ్రెష్ అయ్యేందుకు మాల్దీవులకు వెళ్లారు రజనీకాంత్. కాగా ఆయన నటించిన ‘జైలర్’ సినిమా ఆగస్టు 10న విడుదల కానుంది. -
Rakul Preet Singh : మాల్దీవుల్లో రకుల్ ప్రీత్ రచ్చ (ఫోటోలు)
-
మాల్దీవులకు భారత్ గస్తీ నౌక, ల్యాండింగ్ క్రాఫ్ట్
న్యూఢిల్లీ: కీలకమైన మిత్రదేశమైన మాల్దీవులకు భారత్ గస్తీ నౌక, ల్యాండింగ్ క్రాఫ్ట్‌లను కానుకగా అందివ్వనుంది. మే ఒకటి నుంచి మూడో తేదీ వరకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాల్దీవుల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వీటిని అందజేస్తారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో కొంతకాలంగా పెరుగుతున్న చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసే దిశగా భారత్ తీసుకుంటున్న చర్యల్లో ఇది భాగమని చెబుతున్నారు. పర్యటనలో భాగంగా మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం సోలిహ్, విదేశాంగ మంత్రి అబ్దుల్లా సాహిత్, రక్షణ మంత్రి మరియా దీదీతోనూ రాజ్‌నాథ్ చర్చలు జరుపుతారు. -
మాల్దీవులకు వెకేషన్‌కు వెళ్లిన రామ్‌చరణ్,ఉపాసన
హీరో రామ్‌చరణ్ విహారయాత్ర కొనసాగుతూనే ఉంది. తన భార్య ఉపాసనతో కలిసి రామ్‌చరణ్ ఇటీవల దుబాయ్ వెళ్లారు. బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో అక్కడ ఉపాసన బేబీ షవర్ సెలబ్రేషన్స్ ముగించుకుని ఇటీవల హైదరాబాద్ వచ్చారు. తాజాగా రామ్‌చరణ్, ఉపాసన కలిసి శనివారం మాల్దీవులకు పయనమయ్యారు. ఈ షార్ట్ వెకేషన్‌ను ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగొచ్చిన తర్వాత ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్లో పాల్గొంటారు చరణ్. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా, అంజలి, ఎస్జే సూర్య, జయరాం, సునీల్, నవీన్‌చంద్ర కీ రోల్స్ చేస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలపై త్వరలో ఓ స్పష్టత రానుంది. Mega power star Ram Charan along with his wife Upasana get clicked at the airport as they head for a getaway ✈️❤️@alwaysramcharan#globalstarramcharan#ramuapsana pic.twitter.com/giqUS2narK — Dr. Ramachandran Srinivasan (@indiarama) April 9, 2023 -
దేశం కాని దేశంలో.. మన కుర్రాళ్ల ఇబ్బందులు
సాక్షి, శ్రీకాకుళం(వజ్రపుకొత్తూరు): దేశం కాని దేశంలో మన కుర్రాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. దుబాయ్, మలేషియా, మాల్దీవులు.. దేశాల పేర్లు మారుతున్నాయి గానీ మన వాళ్ల అవస్థలు మారడం లేదు. విదేశీ ఉద్యోగాల ఎరలో చిక్కుకుని శల్యమైపోతున్నారు. తాజాగా శ్రీకాకుళం, ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాలకు చెందిన యువత మాల్దీవుల్లో జీతభత్యాలు లేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. తమను ఇండియాకు పంపాలని కంపెనీ యాజమాన్యాన్ని కోరుతున్నా పట్టించుకోవడం లేదంటూ బుధవారం పత్రికలకు వీడియోలు, మెసేజీలు పెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. తిండి లేదు.. జీతం రాదు ఆరు నెలల కిందట సుమారు 60 మంది యువకులు విశాఖపట్నం పూర్ణామార్కెట్‌కు చెందిన మురళీరెడ్డి, ఇచ్ఛాపురానికి చెందిన పండు అనే ఏజెంట్ల ద్వారా మాల్దీవుల్లోని జాయ్‌షా కన్స్ట్రక్షన్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో వివిధ కేటగిరీల్లో పనిచేసేందుకు వెళ్లారు. ఇందు కోసం ఏజెంట్లకు తామంతా రూ.70 వేలు నుంచి రూ.85 వేలు వరకు చెల్లించామని, రూ.40వేలు వరకు జీతం వస్తుందని వారు చెప్పారని, ఇక్కడికి వ చ్చాక మోసపోయామని వారు తెలిపారు. వీరితో పాటు అప్పటికే విశాఖ, ఉభయగోదావరి జిల్లాల నుంచి వచ్చిన నిరుద్యోగులు నాలుగు నెలలుగా జీతాలు రాక, తిండి లేక అనారోగ్యం పాలయ్యారు. ఐడీ కార్డులు, ఆరోగ్య బీమా లేదని, పాస్‌పోర్టులు కూడా కంపెనీ తీసుకుని తిరిగి ఇవ్వడం లేదని పూండికి చెందిన ఢిల్లేశ్వరరావు, జిల్లాకు చెందిన రుద్రయ్య, సీహెచ్ మురళీకృష్ణ, రంజిత్‌కుమార్, శివకృష్ణ, టి.సింహాచలం, జి.శంకర్, బి. నరిసింహులు, సీహెచ్ రామారావుతో పాటు 60 మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఎలాగైనా స్వదేశానికి రప్పించేందుకు మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు కృషి చేయాలని కోరుతున్నారు. -
మాల్దీవుల్లో యాంకర్ రష్మీ రచ్చ.. వీడియో వైరల్
బుల్లితెరపై యాంకర్ రష్మీ గౌతమ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందచందాలతో పాటు తనదైన మాటతీరుతో ప్రస్తుతం టాప్ యాకర్స్‌లో ఒకరుగా కొనసాగుతుంది. బుల్లితెరపైనే కాకుండా అప్పుడప్పుడు వెండితెరపై కూడా మెరుస్తూ అలరిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె మాల్దీవుల పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
Maldives Fire: తొమ్మిది మంది భారతీయుల దుర్మరణం
మాలే: మాల్దీవుల రాజధాని మాలేలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పదకొండు మంది దుర్మరణం చెందగా.. పలువురు గాయపడ్డారు. మృతుల్లో తొమ్మిది మంది భారతీయులే ఉన్నట్లు సమాచారం. విదేశీ వలస కార్మికులు ఉంటున్న ఇరుకైన వసతి గృహాల్లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వెహికిల్ రిపేర్ గ్యారేజీలో చెలరేగిన మంటలు.. పైఫ్లోర్లకు విస్తరించినట్లు అధికారులు ధృవీకరించారు. నాలుగు గంటలపాలు మంటలు చెలరేగుతూనే ఉండడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా చోటుచేసుకుందని సమాచారం. మృతుల సంఖ్యపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై ప్రతిపక్షాలు రాజకీయం మొదలుపెట్టాయి. విదేశీ కార్మికులను పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తున్నాయి. మాలే జనాభా రెండున్నరల లక్షలుగా ఉంటే.. అందులో బంగ్లాదేశ్, భారత్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక నుంచే సగం జనాభా ఉంది. Deadliest #fire broke out at #crampedlodgings of foreign workers in the #Maldives capital #Male. So far 11 bodies have been recovered. Out of 11 9 are #Indians. The bodies were recovered from the upper floor of a building destroyed in the fire. The bodies are of #migrantworkers. pic.twitter.com/Is4jw2nRZ9 — Ashmita Chhabria (@ChhabriaAshmita) November 10, 2022 We are deeply saddened by the tragic fire incident in Malé which has caused loss of lives, including reportedly of Indian nationals. We are in close contact with the Maldivian authorities. For any assistance, HCI can be reached on following numbers: +9607361452 ; +9607790701 — India in Maldives (@HCIMaldives) November 10, 2022 -
మాల్దీవుల్లో రకుల్ ప్రీత్ సింగ్.. సోషల్ మీడియాలో పిక్స్ వైరల్
తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ గుర్తింపు దక్కించుకున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం ఈ భామ వ్యాకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల బాలీవుడ్లో ఆమె నటించిన చిత్రాలు ఛత్రివాలి, డాక్టర్ జి విడుదలయ్యాయి. ఈ సినిమాల్లో విభిన్న పాత్రల్లో రకుల్ నటించింది. తాజాగా మాల్దీవుల్లో ఉన్న ఓ ఫోటోలను సోషల్ మీడియాతో పంచుకుంది. ఆ ఫోటోలు కాస్తా వైరలవుతున్నాయి. బాలీవుడ్లో ఆమె నటించిన 'థ్యాంక్ గాడ్'మూవీ విడుదలైన తర్వాత మాల్దీవులకు చెక్కేసింది ఈ భామ. ఇన్‌స్టాలో తన చిత్రాలను షేర్ చేస్తూ.. 'కాస్ ఐలాండ్ లైఫ్ వైబ్' అంటూ రాసుకొచ్చింది. సూర్యాస్తమయం వేళ ఉన్న మరో చిత్రాన్ని పంచుకుంటూ.. 'సూర్యాస్తమయం, నక్షత్రాల రాత్రులు, సంతోషకరమైన అమ్మాయి' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీపావళికి విడుదలైన థ్యాంక్ గాడ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రా నటించారు. బాలీవుడ్లో డాక్టర్ జి, కట్ పుట్లి, రన్‌వే 34, అటాక్ సినిమాల్లో నటించింది ఈ భామ. రకుల్ ప్రీత్ సింగ్ డైరీ, ఛత్రివాలి, ఇండియన్- 2లో సినిమాల్లో కూడా నటిస్తోంది. View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
మాల్దీవుల్లో రష్మిక.. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్
పుష్ప భామ రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండపై గాసిప్స్ గుప్పమంటున్నాయి. ఇటీవలే వ్యాకేషన్ కోసం మాల్దీవులకు చెక్కేయగా ఈ జంటపై సోషల్ మీడియాలో రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా బ్లాక్ కలర్ సన్‌గ్లాసెస్‌తో మాల్దీవుల్లో ఉన్న ఓ ఫోటోను ఆమె షేర్ చేశారు. దీంతో అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఆ సన్ గ్లాసెస్ విజయ్ దేవరకొండవే అని.. ఇద్దరు కలిసి వ్యాకేషన్‌కు వెళ్లారని పోస్టులు పెడుతున్నారు. (చదవండి: ప్రేమించడానికి టైమ్ లేదు : రష్మిక మందన్నా) రష్మిక తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చున్న ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో ఓ పువ్వును పట్టుకుని తెల్లటి బుట్ట వైపు చూస్తూ కూర్చుంది. ఆమె తన పోస్ట్‌కు సన్‌ఫ్లవర్‌తో పాటు రెడ్‌హార్ట్ సింబల్‌ను జోడించింది. మాల్దీవుల్లోని ఓజెన్ రిజర్వ్ బోలిఫుషిగా ప్రాంతాన్ని జియో ట్యాగ్ చేసింది ఈ బుట్టబొమ్మ. కాగా.. రష్మిక, విజయ్ ఈ ఏడాది బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అమితాబ్ బచ్చన్, నీనా గుప్తా నటించిన గుడ్‌బై చిత్రంలో రష్మిక నటించింది. విజయ్ అనన్య పాండేతో లైగర్‌తో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్లో విజయ్స, రష్మిక జోడి గీతగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
మాల్దీవుల్లో రష్మిక - విజయ్.. సోషల్ మీడియాలో పిక్స్ వైరల్
పుష్ప భామ రష్మిక మందన్నా వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే ఆమె నటించిన బాలీవుడ్ మూవీ గుడ్‌బై థియేటర్లలో సందడి చేస్తోంది. ప్రస్తుతం కొద్దిరోజులు వ్యాకేషన్ కోసం మాల్దీవులకు చెక్కెసింది ఈ నేషనల్ క్రష్. టాలీవుడ్‌తో స్టార్డమ్ సంపాందించుకున్న ఈ అమ్మడు కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ నటిస్తోంది. తాజాగా మాల్దీవుల్లో విజయ్ దేవరకొండతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు అది కాస్తా వైరలవుతోంది. నిన్న టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఇద్దరు కలిసి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ వ్యాకేషన్‌కు వెళ్లినట్లు భావించారు. అందరూ అనుకున్నట్లుగానే విజయ్‌తో కలిసి మాల్దీవుల వెకేషన్లో ఉన్న ఫోటోను పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. అందమైన డ్రెస్‌లో ఉన్న రష్మిక మందన్నా మిర్రర్ సెల్ఫీని షేర్ చేసింది.'హాయ్ లవ్స్ విత్ ఎ వైట్ హార్ట్ ' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. కాగా గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించిన విజయ్-రష్మికల కెమిస్ట్రీకి ఎంతో మంది అభిమానులున్న సంగతి తెలిసిందే. -
మాల్దీవులకు చెక్కేసిన విజయ్, రష్మిక? ఫోటోలు వైరల్
విజయ్ దేవరకొండ-రష్మిల డేటింగ్లో ఉన్నట్లు చాలకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై ఇప్పటికే ఈ జంట క్లారిటీ ఇచ్చినా డేటింగ్ రూమర్స్ ఆగడం లేదు. తాజాగా విజయ్, రష్మిక ఒకేసారి ఎయిర్‌పోర్టులో దర్శనం ఇవ్వడంతో మరోసారి ఈ జంట లవ్టాపిక్ హాట్‌టాపిక్‌గా మారింది. అంతేకాకుండా ఇద్దరూ ఒకే కలర్ డ్రెస్‌లో కనిపించడం మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఎయిర్‌పోర్టుకు విజయ్ వచ్చిన కాసేపటికే రష్మిక కూడా నవ్వుతూ లోపలికి వెళ్లింది. దీంతో ఇద్దరూ కలిసే వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లినట్లు టాక్ వినిపిస్తుంది. కాగా గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించిన విజయ్-రష్మికల కెమిస్ట్రీకి ఎంతో మంది అభిమానులున్న సంగతి తెలిసిందే. #VijayDevarakonda and #RashmikaMandanna keep it cool and casual as they jet off to Maldives for vacation 🛫✈️#pair ❤️ #virosh 😘🔥 @TheDeverakonda @iamRashmika VC: @pinkvilla pic.twitter.com/dpYSk9mOYj — Revanth (@AtmakuriRevanth) October 7, 2022 -
లంకాధ్యక్షుడి జంప్ జిలానీ.. గొటబయ గో! అంటే ముల్లేమూటా సర్దాల్సిందే!
శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సకు ఆందోళనకారుల నిరసనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే దేశం విడిచి మాల్దీవులకు పరారైన రాజపక్సకు అక్కడ కూడా నిరసన సెగ తగిలింది. రాజపక్స మాల్దీవులకు చేరిన విషయాన్ని తెలుసుకున్న అక్కడి శ్రీలంక పౌరులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. గొటబయ గో అంటూ నినాదాలు చేశారు. దీంతో ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో ఆయన మళ్లీ సింగపూర్‌కు పయనమవుతున్నారు. మాల్దీవుల నుంచి సింగపూర్‌కు బయల్దేరి వెళ్లనున్న నేపథ్యంలో అక్కడి వెలనా అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం రాత్రి అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వెలనా అంతర్జాతీయ విమానాశ్రయం వీఐపీ టెర్మినల్ దగ్గర వేచి ఉన్న జర్నలిస్టులను అధికారులు బయటకు పంపించారు. అయితే సింగపూర్‌కు వెళ్లిన తర్వాత గొటబయ తన రాజీనామా లేఖను శ్రీలంక స్పీకర్ మహిందాయాపా అబేయవర్ధనేకు అందించనున్నట్లు రాయిటర్స్ తెలిపింది. చదవండి: రాజపక్స పారిపోతాడనుకోలేదు.. భారత్‌ను ఎంత సాయం అడుగుతాం! తన పదవికి బుధవారం రాజీనామా చేస్తానని చెప్పిన అధ్యక్షుడు గొటబయ రాజపక్స మాల్దీవులకు పారిపోవడంతో దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించారు. ఇప్పటికే ఆర్థిక, ఆహార సంక్షోభంతో అట్టుడుకుతున్న ఆందోళనలు ఎమర్జెన్సీ, కర్ఫ్యూ విధింపుతో మిన్నంటుతున్నాయి. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ కొలంబోలోని ప్రధానమంత్రి కార్యాలయాన్ని నిరసనకారులు చుట్టుముట్టారు. కాగా గోటబయ తన భార్య ఇద్దరు సెక్యూరిటీ అధికారులతో కలిసి సైనిక విమానంలో బుధవారం ఉదయమే మాల్దీవులకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఆ దేశ స్పీకర్ మహ్మద్ నషీద్ ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. మరోవైపు గోటబయ దేశం విడిచి పారిపోయినట్లు తెలుసుకున్న జనం ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. రోడ్డుపైకి చేరుకొని కేరింతలు కొట్టారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే దేశం వీడిపోవడంతో ప్రధాని రణిల్ విక్రమసింఘే తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. జూలై 20న పార్లమెంట్లో శ్రీలంక కొత్త అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించనున్నారు. -
మాల్దీవుల్లో ‘గొటబయ’కు నిరసనల సెగ.. మళ్లీ ఏ దేశం వెళ్తారో?
మాలే: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ప్రజాగ్రహంతో అట్టుడుకుతోంది శ్రీలంక. ఆందోళనల నేపథ్యంలో అధ్యక్షుడు గొటబయ రాజపక్స కుటుంబంతో సహా బుధవారం వేకువజామునే దేశం విడిచి మాల్దీవులకు పారిపోయారు. అయితే.. అక్కడ కూడా గొటబయకు నిరసనల సెగ తగిలింది. పదుల సంఖ్యలో అక్కడి శ్రీలంక పౌరులు ఆందోళన చేపట్టారు. గొటబయకు మాలే ఒక సురక్షితమైన ప్రాంతం కాకూడదని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలపాలని అక్కడి ప్రజలను కోరారు. శ్రీలంక జాతీయ జెండాలు, ప్లకార్డులతో రాజపక్సకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు నిరసనకారులు. ' ప్రియమైన మాల్దీవుల స్నేహితులారా.. క్రిమినల్స్‌కు ఈ ప్రాంతం సురక్షితమైనదిగా మారకుండా మీ ప్రభుత్వానికి తెలియజేయండి' అని బ్యానర్ ప్రదర్శించారు. మరోవైపు.. మిలిటరీ విమానంలో వెలనా అంతర్జాతీయ విమానంలో దిగిన రాజపక్సకు వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేస్తున్న వీడియోలను మాల్దీవులకు చెందిన మీడియాలు ప్రసారం చేశాయి. అలాగే.. మాలేలోని కృత్రిమ బీచ్ ప్రాంతంలో పలువురు శ్రీలంక పౌరులు నిరసనలు చేపట్టగా.. పోలీసులు వారిని చెదరగొట్టారు. సింగపూర్‌కు గొటబయ..! శ్రీలంక నుంచి పరారై మాల్దీవులకు చేరిన అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఓ విలాసవంతమైన రిసార్ట్‌లో తలదాచుకున్నట్లు స్థానిక మీడియాలు వెల్లడించాయి. అక్కడి నుంచి యూఏఈ లేదా సింగపూర్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. 'ఆయన రెండు దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అయితే.. ఆ దేశాల్లోనూ శ్రీలంక పౌరులు ఉన్నందున భద్రతాపరమైన సమస్యలు తలెత్తనున్నాయి.' అని శ్రీలంకకు చెందిన భద్రతా విభాగం అధికారి ఒకరు తెలిపారు. గొటబయ రాజపక్సను దేశంలోకి అనుమతించటాన్ని వ్యతిరేకించింది మాల్దీవులకు చెందిన ప్రతిపక్ష ప్రోగ్రెసివ్ పార్టీ. రాజపక్సను అనుమతించటం ద్వారా శ్రీలంకలోని తమ స్నేహితులకు ద్రోహం చేస్తున్నామని పీపీఎం నేత ఒకరు పేర్కొన్నారు. మరోవైపు.. ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. శ్రీలంక పౌరులు మాల్దీవుల్లోని విద్య, ఆరోగ్య, ఆతిథ్య రంగాల్లో పని చేస్తుండగా.. మాల్దీవుల పౌరులు సైతం పెద్ద సంఖ్యలోనే శ్రీలంకలో ఉన్నారు. ఇదీ చూడండి: Gotabaya Rajapaksa: దేశం విడిచిన లంకాధ్యక్షుడు.. అంతా ఇండియానే చేసిందని వదంతులు.. హైకమిషన్ రియాక్షన్ ఏంటంటే? -
ప్రియురాలితో భర్త మాల్దీవ్ ట్రిప్.. సడెన్‌గా భార్య ఫోన్ చేయడంతో
మాల్దీవులు.. ఏంటో ఈ మధ్య ఎక్కడ విన్నా ఈ పేరే వినిపిస్తోంది. ఏ జంటను చూసిన ఎంచక్కా మాల్దీవులకు చెక్కేస్తున్నారు. హాలీడే వెకేషన్ స్పాట్‌గా ఈ పేరు తెగ మార్మోగుతోంది. కరోనాతో రెండేళ్లపాటు ఇళ్లలోనే ఉండి విసుగెత్తిన ప్రజలు హాయిగా సేదతీరేందుకు మాల్దీవుల బాట పడుతున్నారు. పాపం ఇలాగే ఆలోచించి.. పెళ్లైన ఓ వ్యక్తి కూడా ఎంజాయ్మెంట్ కోసం మాల్దీవులకు వెళ్లాడు. వెళ్తే వెళ్లనీ అందులో పెద్ద విషయం ఏముంది అనుకుంటాన్నారా.. అయితే అతను వెళ్లింది తన భార్యతో కాదండీ.. వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న ప్రియురాలితో. అంతేగాక తొందరపాటులో చేసిన పొరపాటు అతన్ని జైలుపాలు చేసింది. ముంబైకు చెందిన 32 ఏళ్ల వ్యక్తి ఎంఎన్సీ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఆయన భార్య ఆఫీస్ పని మీద విదేశాలకు వెళ్లింది. దీంతో ఇదే సువర్ణావకాశంగా భావించిన వ్యక్తి తనప్రియురాలితో మాల్దివులకు వెళ్లి రిలాక్స్ అవుదామనుకున్నాడు. అనుకున్నట్లు భార్య అలా ఫారిన్ ట్రిప్ వెళ్లిందో లేదో ఇటు ఇతను తన ప్రేయసితో హాలీడ్ ట్రిప్‌కు చెక్కేశాడు. అక్కడా ఇద్దరు జాలీగా చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. అయితే భర్త తన కాల్ ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో అతనిపై భార్య అనుమానం పెంచుకుంది. భర్తకు పలుమార్లు వాట్సాప్ కాల్ చేసింది. భార్య ఫోన్ చేస్తుండటంతో ఖంగుతున్న భర్త తన వెకేషన్‌కు స్వస్తీ చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అయితే మాల్దీవులకు వెళ్లిన విషయం భార్యకు తెలిస్తే చంపేస్తుందని భయపడి ఓ తింగరిపని చేశాడు. చదవండి: పెళ్లి పీటలపై వరుడికి షాకిచ్చిన వధువు.. రెండడుగులు కలిసి నడిచి.. పాస్‌పోర్టులోని కొన్ని పేజీలను చింపేసి అక్కడి నుంచి ఇండియాకు పయనమయ్యాడు. అయితే గురువారం రాత్రి ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకోగా ఇమిగ్రేషన్ అధికారులు అతని పాస్‌పోర్టును తనిఖీ చేశారు. అందులో 3-6, 31-34 పేజీలు కనిపించకపోవడాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు గమనించారు. దాని గురించి ప్రశ్నించగా ఏవోవే సమాధానాలు చెప్పడంతో చీటింగ్, ఫోర్జరీ ఆరోపణలపై అతన్ని అధికారులు అరెస్ట్ చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో తన ప్రియురాలో కలిసి మాల్దీవులకు వెళ్లినట్లు అంగీకరించాడు. ఈ విషయాన్ని తన భార్యకు తెలియకుండా రహస్యంగా ఉంచేందుకు పాస్‌పోర్ట్ పేజీలను చింపివేశానని కూడా తెలిపాడు. ఇదిలా ఉండగా భారత ప్రభుత్వం జారీ చేసిన పాస్‌పోర్ట్‌ను ఏ విధంగానూ పాడు చేయడం నేరపూరిత చర్య అని పోలీసులు తెలిపారు. -
భారీ వర్షాలతో జనాలు బెంబేలెత్తిపోతుంటే.. అతను మాత్రం భలే ఎంజాయ్ చేస్తున్నాడు
పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్న కొంతమంది చాలా గంభీరంగా ప్రశాంతంగా ఉంటారు. వాళ్లో ఎలాంటి ఉద్విగ్నత, భయం ఆందోళన కనిపించవు. ఆ సంకట పరిస్థితిని సైతం ఆనందంగా మలుచుకుంటారు కొందరూ. అచ్చం అలాంటి కోవకు చెందినవాడే ఇతను కూడా. ముంబై గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అతలాకుతలమవుతోంది. నగరాలకు నగరాలు, మునిగిపోవడమే గాక లోతట్టు ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు వాతావరణ విభాగం(ఐఎండీ) సమీప ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడమే కాక బీచ్‌లను సందర్శించడం కూడా నిషేధించింది. ఐతే ప్రస్తుతం ముంబైలో ఒక వైపు రహదారులన్ని వర్షపు నీళ్లతో నిండిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రజలు నానాతంటాలు పడుతుంటే..ఒకడు మాత్రం ఆ వర్షపు నీటిని హాయిగా ఆస్వాదిస్తూ.. ఎంజాయ్ చేస్తున్నాడు. అంతేకాదు అతను ఏదో వేసవి సెలవులకు మాల్దీవులు వెళ్లి సరదాగా ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఆ వర్షపు నీటిలో పడుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. అదికూడా రహదారులపై నిండి ఉన్న వాన నీటిలో పడుకుని ఉన్నాడు. మరోవైపు నుంచి ఆ వ్యక్తి సమీపం నుంచి వాహనాలు నీళ్లను చిమ్ముకుంటూ వెళ్లిపోతున్నాయి. అతను మాత్రం తనకేం పట్టనట్లు తన పని తనదే అన్నట్లు అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు. ఐతే ఎందువల్ల అలా పడుకుని ఉన్నాడో అనేది కారణాలు తెలియరాలేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. This man feel Maldives in Malad 😄😄bheegi bheegi sadkon par tera intezaar karu …#Mumbaiweather #mumbailocals#MumbaiRains #MumbaiMonsoon pic.twitter.com/AbVJkxKF2L — 🆂🅷🅰🅷🅸🅳 (@iamshahidkhan42) July 8, 2022 -
జియో మరో సంచనలం!! ప్లాన్ మామూలుగా లేదుగా!
టెలికం రంగంలో సంచలనాలకు వేదికైన రిలయన్స్ జియో మరో అడుగు ముందుకు వేసింది. ప్రపంచంలోని ఇతర ప్రధాన ఇంటర్నెట్ హబ్‌లతో కనెక్ట్ చేస్తూ జియో సముద్ర మార్గానా ఇంటర్నెట్ కేబుల్ నిర్మాణాల్ని చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నిర్మాణాలు త్వరలో మాల్దీవ్లోని హుల్ హుమలే ప్రాంతం వరకు కనెక్ట్ కానున్నాయి. సెకనుకు 200 టెరాబైట్స్ వేగంతో ఇంటర్నెట్ సామర్థ్యంతో జియో సంస్థ ముంబై, చెన్నై కేంద్రంగా పదహారు వేల కిలోమీటర్ల పొడవున సముద్రంలో కేబుల్స్‌ను వేస్తుంది. ప్రస్తుతం ఈ కేబుల్స్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. తాజాగా ఈ కేబుల్స్ నిర్మాణం మాల్దీవులోని హుల్హుమలే ప్రాంతం వరకు కనెక్ట్ అవుతున్నట్లు జియో తెలిపింది. తద్వారా భారత్, సింగపూర్లలో ప్రపంచంలోని ప్రధాన ఇంటర్నెట్ హబ్‌లతో కనెక్ట్ కానున్నాయి. ఈ సందర్భంగా మంత్రి ఉజ్ ఫయాజ్ ఇస్మాయిల్ మాట్లాడుతూ..మాల్దీవుల మొదటి అంతర్జాతీయ కేబుల్ నిర్మాణం గురించి మాట్లాడుతూ..మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, నాణ్యమైన ఇంటర్నెట్ను అందించడం ద్వారా మాల్దీవుల ప్రజలు ఆర్ధికంగా అన్నీ రంగాల్లోని అవకాశాల్ని అందిపుచ్చుకుంటారని కొనియాడారు. ఆర్థికాభివృద్ధితో పాటు, ఇది మాల్దీవుల అంతటా హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ ద్వారా సామాజిక అభివృద్ధి వేగవంతం అవుతుందని ఉజ్ ఫయాజ్ అన్నారు. చదవండి: రిలయన్స్ జియోకు దిమ్మతిరిగేలా షాక్..! దెబ్బ మామూలుగా లేదు -
మాల్దీవ్స్‌లో విక్ట్రీనా హనీమూన్.. ఫొటో షేర్ చేసిన నవ వధువు.. 21 గంటల్లోనే...
పెళ్లి బంధంతో ఒక్కటైన బాలీవుడ్ స్టార్స్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ మాల్దీవ్స్‌లో వాలిపోయారు. డిసెంబర్ 9న రాజస్తాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లా సిక్స్ సెన్సెస్ కోటలో ఏడడుగుల బంధంతో విక్ట్రీనా జంట ఒక్కటైంది. ప్రేమ ముచ్చట్ల నుంచి పెళ్లి హడావుడి వరకు వాళ్లకు సంబంధించిన వార్తలు బీటౌన్‌లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా హైలైట్ అయ్యాయి. ఇక వివాహ అనంతరం నూతన వధువు కత్రినా తొలిసారిగా ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ ఫొటో వైరల్‌గా మారింది. హనీమూన్‌ను మాల్దీవ్స్‌లో ప్లాన్ చేసుకుందీ కొత్త జంట. మెహందితో ఉన్న చేతులు, బ్యాక్‌గ్రౌండ్‌లో సముద్రతీరం ఉన్న ఫొటోను కత్రినా షేర్ చేసింది. లవ్లీ మాల్దీవ్స్, లవ్లీ లైఫ్ అన్నట్టుగా ఆమె షేర్ చేసిన ఫొటో చెప్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఆలస్యంగానైనా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ కామెంట్లు చేయగా.. మరికొందరు మీ రెండు చేతులు చూపిస్తూ ఫొటో ఉంది. ఫొటో విక్కీయే తీశాడు కదా? అని ఫన్నీగా స్పందించారు. ‘నన్ను వదిలేసి వెళ్లావ్‌గా’ అని ఒక నెటిజన్ కొంటెగా కామెంట్ చేశాడు. ఫొటో షేర్ చేసిన 21 గంటల్లోనే దాదాపు 38 లక్షలకు పైగా లైక్స్ రావడం విశేషం. (చదవండి: ప్రగ్యా జైస్వాల్ కట్టుకున్న చీర ఖరీదెంతో తెలుసా?) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
మాల్దీవ్స్‌లో ఫుడ్, బెడ్, స్పా అంతా మాదే
సాక్షి, హిమాయత్‌నగర్(హైదరాబాద్): మాల్దీవ్స్‌లో ఫుడ్, బెడ్, స్పా అంతా తామే చూసుకుంటామని నమ్మించి భారీగా ట్రావెల్ ఏజెన్సీ వాళ్లు డబ్బులు స్వాహా చేశారని నగర వాసి సోమవారం సిటీ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హాలిడే ట్రిప్ కోసం ఓ ట్రావెల్ కంపెనీ వాళ్లను సంప్రదించారు. కుటుంబసభ్యులతో కలసి మాల్దీవ్స్ వెళ్లేందుకు ఫ్లైట్ ఛార్జీలతో పాటు 7 రోజులు, 8 రాత్రులు, హోటల్, స్పాతో కలిపి రూ.2.45 లక్షలు చెల్లించారు. అక్కడకు వెళ్లకముందే 7 రోజుల్లో మా ప్యాకేజీ ఉంటుందని, మరో రెండు రోజులు వేరే హోటల్లో ఉంచుతామంటూ అబద్దాలు ఆడి ఇబ్బంది పెట్టారు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు సిటీ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. చదవండి: పిచ్చోడి చేతికి ఫోన్.. మహిళా ఏఎస్సైకి అశ్లీల ఫోటోలు! -
మాల్దీవుల్లో ప్రియుడితో రచ్చచేస్తున్న మలైకా అరోరా
సెలబ్రిటీలు, ప్రేమికులు ఎక్కువగా మాల్దీవులు వెళ్లడానికి ఇష్టపడుతుంటారు. వారికి ఏమాత్రం సమయం దొరికినా వెంటనే అక్కడ వాలిపోతుంటారు. తాజాగా, బాలీవుడ్ ప్రేమజంట.. మలైకా అరోరా, అర్జున్ కపూర్లు కూడా మాల్దీవులకు వెళ్లారు. వారు సరదాగా గడిపిన క్షణాలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. సూర్యకిరణాలు నేలను ముద్దాడుతున్న ఫోటోలను కూడా తీశారు. మలైకా అరోరా తన ప్రియుడితో కలిసి సెల్ఫీ దిగడమే కాక అక్కడ సైక్లింగ్ కూడా చేశారు. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ఈ జంట 2018 నుంచి డేటింగ్లో ఉంది. మలైకా అరోరా విషయానికి వస్తే ఆమె ఒక డ్యాన్స్ రియాలిటీ షోలో టెరెన్స్ లూయిస్, గీతాకపూర్‌తో కలిసి జడ్జిగా వ్యవహరించారు. అంతేకాకుండా చయ్యా.. చయ్యా పాట.., మున్నీ బద్నాం హుయ్ డార్లింగ్ తేరే లియే, అనార్కలీ డిస్కో చాలీ పాటల్లో హుషారైన స్టెప్పులతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు. మిలింద్ సోమన్, అనూశా దండేకర్లతో కలిసి సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్ 2 కు జడ్జిగా పనిచేశారు. అర్జున్ కపూర్.. సైఫ్ అలీఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, యామీ గౌతమ్‌లతో కలిసి హరర్ కామెడీ మూవీ భూత్ పోలీస్, సందీప్ ఔర్ పింకీ ఫరార్ లో నటించారు. గతేడాది కృతి సనన్, సంజయ్ దత్‌లతో కలిసి పీరియాడిక్ డ్రామా పానిపట్‌లోనూ నటించారు. -
నన్ను ట్రోల్ చేయండి.. నా కూతురి జోలికొస్తే ఊరుకోను: హీరో
Abhishek Bachchan Lashes Out At Trolls Attacking Daughter Aaradhya: సాధారణంగా సెలబ్రిటీలకు సంబంధించి ఏ వార్తైనా క్షణాల్లో వైరలవుతుంది. వారితో పాటు వాళ్ల ఫ్యామిలీపై కూడా జనాల అటెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొన్నిసార్లు ఇబ్బందిగానూ అనిపిస్తుంది. తమ అంచనాలకు తగ్గట్లు వారితో ఏమాత్రం మార్పులు కనిపించినా జనాలు తెగ ట్రోల్ చేసేస్తుంటారు. తాజాగా ఇలాంటి పరిస్థితే బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్‌లకు సైతం ఎదురైంది. ఇటీవలె కూతురు ఆరాధ్యతో కలిసి మాల్దీవులకు వెళ్లిన బచ్చన్ ఫ్యామిలీ ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంట పడింది. ముఖ్యంగా ఆరాధ్య నడకపై అందరి ఫోకస్ వెళ్లింది. ఐశ్వర్య ఎప్పుడూ కూతురి చేయి పట్టుకొనే నడిపించడం, ఆరాధ్య వంకరగా నడుస్తుందంటూ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. తాజాగా ఓ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న అభిషేక్ బచ్చన్.. తన కూతురి నడకపై చేస్తున్న ట్రోల్స్‌పై స్పందించారు. నేను పబ్లిక్ ఫిగర్‌ని. నన్ను ఎంతైనా ట్రోల్ చేయండి పడతాను. కానీ నా కూతుర్ని అనేడానికి మీకు హక్కు లేదు. దమ్ముంటే ఆ మాటలు నా ఎదురుగా వచ్చి అనండి అంటూ ట్రోలర్స్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం అభిషేక్ చేసిన ఈ కామెంట్స నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్న పూజా హెగ్డే
-
Aaradhya Birthday:ఆరాధ్య పదో బర్త్‌డే.. మాల్దీవుల్లో బచ్చన్ ఫ్యామిలీ చిల్లింగ్
బాలీవుడ్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ కుమార్తె ఆరాధ్య ముగ్గురు మాల్దీవుల్లో చిల్ అవుతున్నారు. నవంబర్ 13న ఈ ముగ్గురు ముంబై విమానాశ్రయంలో కెమెరాలకు చిక్కారు. అభిషేక్, ఐశ్వర్య నుదిటిపై తిలకంతో క్యాజువల్స్ వేర్స్‌లో కనిపించారు. బచ్చన్ వంశం కుటుంబ సెలవుల కోసం మాల్దీవులకు వెళ్లినట్లు తెలిసిందే. ఈ దంపతుల కుమార్తె ఆరాధ్య నవంబర్ 16న 10 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. అయితే కూతురు బర్త్‌డేను మాల్దీవుల్లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) ఐశ్వర్య రాయ్ మాల్దీవుల దీవుల్లో చిల్ అవుతున్న దృశ్యాన్ని ఇన్‌స్టా గ్రామ్‌లో పంచుకున్నారు. ఆ స్నాప్‌ను షేర్ చేసి, 'సన్ బ్రీజ్ అండ్ ప్యారడైజ్' అని క్యాప్షన్ ఇచ్చారు. అభిషేక్ కూడా దీవుల నుంచి ఒక చిత్రాన్ని షేర్ చేస్తూ 'మేల్కొల్పడానికి చెడు దృశ్యం కాదు' అంటూ రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Abhishek Bachchan (@bachchan) గత సంవత్సరం, 2020లో, ఐశ్వర్య సోషల్ మీడియాలో ఆరాధ్యతో ఉన్న ఒక అందమైన స్నాప్‌ను షేర్ చేశారు. అందులో, " నా జీవితపు సంపూర్ణ ప్రేమ, నా ప్రియమైన దేవదూత ఆరాధ్యా.. నేను నిన్ను ఎప్పటికీ, నిత్యం, అనంతంగా ప్రేమిస్తాను. నేను తీసుకుంటున్న ప్రతి శ్వాస నీకోసమే అయినందుకు దేవుడికి కృతజ్ఞతలు. గాడ్ బ్లెస్ యూ లవ్' అంటూ 9వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆరాధ్య నవంబర్ 16, 2011లో జన్మించింది. -
Pooja Hegde: మాల్దీవులో వాలిపోయిన ‘బుట్టబొమ్మ’
-
మాల్దీవులో వాలిపోయిన పూజా, స్టన్నింగ్ వీడియోలు షేర్ చేసిన ‘బుట్టబొమ్మ’
పూజా హెగ్డే.. ప్రస్తుతం టాలీవుడ్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. వరస హిట్లు అందుకంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా తెలుగులో చక్రం తిప్పుతోంది. ఇటీవల ఆమె నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఆమె నటించిన పాన్ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆచార్యలో తన పార్ట్‌ను కంప్టీట్ చేసుకున్న నేపథ్యంలో షూటింగ్‌లకు కాస్తా బ్రేక్ ఇచ్చిన బుట్ట బొమ్మ ఈ విరామ సమయాన్ని ఆస్వాదించే పనిలో పడింది. ఇందుకోసం ఆమె మాల్దీవుల పర్యటనకు పయనమైంది. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టులో దిగిన ఫొటోలతో పాటు విమానంలో పయనిస్తున్న వీడియోలతో సహా పూజ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. చదవండి: ఆచార్య: ‘నీలాంబరి’ ఫుల్ లిరికల్ సాంగ్ వచ్చేసింది ఈ సందర్భంగా ఆమె ‘విరామం తీసుకునే సమయం ఇది.. ఆ తర్వాత ఏంటో చూడండి’ అంటూ మాల్దీవుల పేరుతో ఉన్న హ్యాష్ ట్యాగ్‌ను జత చేసింది. ఈ క్రమంలో మాల్దీవులు సమీపంకు రాగానే విమానం నుంచి మాల్దీవుల ప్రాంతాన్ని తీసిన స్టన్నింగ్ వీడియోను సైతం ఆమె పంచుకుంది. అలాగే అక్కడ ఆమె దిగిన హోటల్ రూం వీడియోను కూడా షేర్ చేసింది. చూస్తుంటే పుట్ట బొమ్మ ఈ వేకషన్‌ను తను ఎంజాయ్ చేయడమే కాకుండా అక్కడ అందమైన ప్రదేశాలను ప్రతి క్షణం పంచుకుంటూ ఫ్యాన్స్‌ను కూడా కనువిందు చేస్తోంది. కాగా పూజ ఈ వెకేషన్ తర్వాత తను సంతకం చేసిన పలు తెలుగు, తమిళ ప్రాజెక్ట్స్‌లో తిరిగి పాల్గొననుందని ఆమె సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. -
మాల్దీవులకు టీడీపీ నేత పట్టాభి..!?
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసి జైలుకెళ్లి.. బెయిల్ మీద విడుదలైన టీడీపీ నేత పట్టాభి మాల్దీవులకు వెళ్లినట్లు సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. వీటికి బలం చేకూరుస్తూ.. పట్టాభి విమానంలో కూర్చుని ఉన్న ఫోటోలు, ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న చిత్రాలు వైరలవుతున్నాయి. చదవండి: చంద్రబాబు డైరెక్షన్లోనే పట్టాభి అనుచిత వ్యాఖ్యలు: సజ్జల హైదరాబాద్ నుంచి పట్టాభి మాల్దీవ్స్ వెళ్లినట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో పట్టాభి ఎక్కడ అనే చర్చ జోరుగా సాగుతుంది. దేశం వదిలి పారిపోతున్న పట్టాభి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరలవుతున్నాయి. సీఎం జగన్‌ను బూతులు తిట్టిన కేసులో పట్టాభి అరెస్టయిన సంగతి తెలిసిందే. పట్టాభి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు జనాగ్రహ దీక్షలు చేపట్టారు. చదవండి: ప్రజాస్వామ్యంపై యుద్ధ ప్రకటన -
మాల్దీవ్స్‌కు టీడీపీ నేత పట్టాభి..!?
-
కుటుంబంతో మాల్దీవుల్లో వాలిపోయిన అల్లు అర్జున్, వీడియో వైరల్
కాస్త సమయం దొరికితే చాలు సెలబ్రిటీలు మాల్దీవులు చెక్కేస్తుంటారు. సేద తీరాలన్నా, సెలబ్రేషన్స్ చేసుకోవాలన్నా.. దేనికైనా మాల్దీవులే బెస్ట్ చాయిస్ అంటుంటారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి మాల్దీవులో వాలిపోయాడు. భార్య స్నేహారెడ్డి, కొడుకు అయాన్, కూతురు ఆర్హలతో కలిసి అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయన భార్య అల్లు స్నేహా సోషల్ మీడియాలో వెల్లడించింది. చదవండి: తన రాజీనామా లేఖలో నాగబాబు సంచలన వ్యాఖ్యలు ఆర్హ, ఆయాన్, బన్నీ స్విమ్మింగ్ ఫూల్లో సరదాగా ఈత కొడుతున్న వీడియోను స్నేహా తన ఇన్‌స్టాగ్రామ్‌లో.. ‘ఫ్యామిలీ వెకేషన్’ అంటూ షేర్ చేసింది. దీంతో ప్రస్తుతం బన్ని కుటుంబంతో కలిసి మాల్దీవులో సేదతీరుతున్నాడని స్పష్టమైంది. కాగా ప్రస్తుతం బన్ని నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల పుష్ప ఫస్ట్ పార్ట్ షూటింగ్ చివరి దశకు చేరింది. ఈ క్రమంలో బన్నికి కాస్తా విరామ సమయం దొరికరడంతో ఆలస్యం చేయకుండా ఫ్యామిలీతో మాల్దీవులు పర్యటనకు వెళ్లినట్లున్నాడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా పుష్ప ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 17న విడుదల చేయనున్నట్లు మూవీ టీం ప్రకటించింది. చదవండి: తహశీల్దార్ కార్యాలయానికి అల్లు అర్జున్ View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
స్విమ్‌సూట్‌లో నటి.. విడాకులు ఎప్పుడు అని అడిగిన నెటిజన్
Vidyullekha Raman: లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ ఇటీవలె పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. ప్రియుడు, ఫిట్నెస్, న్యూట్రిషన్ నిపుణుడు సంజయ్‌ను విద్యుల్లేక గత నెల 9వ తేదీన చెన్నైలో పెళ్లాడింది. అనంతరం కొత్తజంట హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. రీసెంట్గా అక్కడ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ బికినీలో బీచ్‌లో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. చదవండి: బిగ్‌బాస్ కంటెస్టెంట్: ప్రేమించి పెళ్లాడిన భర్త ఆత్మహత్య, రెండో పెళ్లి ఏడాదికి రెండుసార్లు అంటే ఆరు నెలలకొకసారి వెకేషన్‌ను ఎంజాయ్ చెయ్యాలి అంటూ స్విమ్ సూట్, గాగుల్స్‌తో ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. దీంతో ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌ను విమర్శిస్తూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు. విడాకులు ఎప్పుడు తీసుకుంటున్నారు అన్న నెటిజన్ కామెంట్‌పై విద్యుల్లేఖ మండిపడింది. '1920 నాటి కాలాన్ని వదిలి 2011కు రండి. నెగిటివ్ కామెంట్ సమస్య కాదు. సమాజం ఆలోచించే తీరును బట్టి ఉంటుంది. ఒక మహిళ వస్త్రధారణే విడాకులకు కారణం అయితే చక్కగా, పద్ధతిగా దుస్తులు ధరించిన వాళ్లందరూ వారి వైవాహిక జీవితాల్లో సంతోషంగా ఉన్నారా? నీతి, నిజాయతీ విశ్వాసాలు కలిగిన భర్త లభించడం నా అదృష్టం. ఇక సంకుచిత వ్యక్తిత్వం ఉన్న మనుషులని నేను మార్చలేను. మీ జీవితంలో మహిళలు అంటే కేవలం శారీరక సుఖాన్ని ఇచ్చి, ఆణచివేత, అవమానాలను భరిస్తూ ఉండే వ్యక్తిలానే చూస్తున్నప్పుడు ఆమె వ్యక్తిత్వం మీకెక్కడ కనిపిస్తుంది' అంటూ ఘాటుగా బదులిచ్చింది. చదవండి: విడాకుల తర్వాత తొలిసారి స్పందించిన సమంత -
మాల్దీవుల్లో హనీమూన్‌కు వెళ్లిన హాస్య నటి
Vidyullekha Ramans Wedding Photos Goes Viral: లేడీ కమెడియన్ విద్యుల్లేక రామన్ ఇటీవల మెట్టినింట్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రియుడు, ఫిట్నెస్, న్యూట్రిషన్ నిపుణుడు సంజయ్‌ను విద్యుల్లేక ఈ నెల 9వ తేదీన చెన్నైలో పెళ్లాడింది. తమిళ, సింధీ సాంప్రదాయాల ప్రకారం వీరి వివాహం అత్యంత సన్నిహితులు, బంధువుల సమక్షంలో వైభవంగా జరిగింది. అయితే ఇప్పటివరకు వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు మాత్రం బయటకు రాలేదు. తాజాగా విద్యుల్లేక పెళ్లినాటి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. ఇందులో రెడ్ కలర్ లెహంగాలో పెళ్లికూతురిగా విద్యుల్లేక ముస్తాబవగా, సంజయ్ గోధుమ రంగు షేర్వానీలో కనిపించారు. ప్రస్తుతం ఈ జంట హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లారు. ఇటీవల భర్త క్లిక్ చేసిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇక పలు సినిమాల్లో హీరోయిన్లకు స్నేహితురాలిగా పాత్ర పోషిస్తూ, కామెడీ పండిస్తూ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది విద్యుల్లేక. ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఈమె త్వరలోనే హీరోయిన్గా పరిచయం కానున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Vidyu Raman (@vidyuraman) View this post on Instagram A post shared by Gitanjali Selvaraghavan (@gitanjaliselvaraghavan) -
‘కత్తి’ హీరోయిన్ మరోసారి వార్తల్లోకి, అటు భర్తతో మాల్దీవుల్లో హల్చల్
సాక్షి, హైదరాబాద్: కత్తి మూవీ హీరోయిన్, హిందీ బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ సనాఖాన్ మరోసారి వార్తల్లో నిలిచింది. పాఠశాల స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సనాఖాన్ ఈ వేడుకలను సంబంధించిన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. గుజరాత్‌కు చెందిన వ్యాపారవేత్త, భర్త ముఫ్తీ అనాస్ సయ్యద్‌తో కలిసి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలను సనాఖాన్ పోస్ట్ చేసింది. అలాగే భర్తతో మాల్దీవుల్లో గడిపిన అద్భుతమైన క్షణాలను, ఫోటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంది. 75 వసంతాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ఆమె ఆ తరువాత విద్యార్థులనుద్దేశించి మాట్లాడింది. అయితే ఆ తరువాత వారిద్దరూ వెళుతుండగా, విద్యార్థులంతా చుట్టు ముట్టి హడావిడి చేశారు. ‘సనా..సనా’ అటూ పెద్దగా అరుస్తూ సందడి చేశారు. దీంతో పోలీసులు, బాడీగార్డులు వారికి రక్షణగా ఏర్పడ్డారు. దేవుడా.. ఈ ప్రేమ ఎప్పటికీ ఉండాలని ఆ అల్లాను ప్రార్థిస్తున్నా నంటూ ఆ వీడియోను షేర్ చేసింది. మరోవైపు భర్త అనాస్‌తో సనా ఇటీవల మాల్దీవుల్లో హాలీడే ట్రిప్‌ను ఎంజాయ్ చేసింది. అక్కడి బీచ్, వాటర్ విల్లా, పూల్‌లో సరదాగా గడపింది. పూల్ ఫ్లోటీపై స్వారీ చేస్తూ దాదాపు నీటిలో పడిపోవడం, రియాల్టీ, ఎక్స్పెక్టేషన్ అంటూ ఊయలను గట్టిగా ఊపుతూ భర్త తనను భయపెట్టి, నవ్వించిన ఫన్నీ వీడియోను కూడా అభిమానులతో షేర్ చేసింది. కాగా సినిమా లైఫ్ స్టయిల్‌కు పూర్తిగా దూరం కావాలని భావిస్తున్నానంటూ గత ఏడాది అక్టోబర్‌లో ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చింది. ఆ సృష్టికర్త ఆదేశాలకు నటను స్వస్తి పలికి మానవాళికి సేవ చేయాలని భావిస్తున్నానని ప్రకటించింది. ఆ తరువాత అనాస్‌ని వివాహమాడి మరో సర్ప్రైజ్ ఇచ్చింది. సనాఖాన్ ఖత్రోన్ కే ఖిలాడీ, హల్లా బోల్, జై హో,ఏక్ ప్రేమ్ కథ వంటి చిత్రాలతోపాటు, టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్ నటించిన చిత్రం కత్తి మూవీలో హీరోయిన్గా నటించింది. 'గగనం', 'మిస్టర్ నూకయ్య' సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Saiyad Sana Khan (@sanakhaan21) View this post on Instagram A post shared by Saiyad Sana Khan (@sanakhaan21) View this post on Instagram A post shared by Saiyad Sana Khan (@sanakhaan21) View this post on Instagram A post shared by Saiyad Sana Khan (@sanakhaan21) -
వైరల్ వీడియో: బురదలో మాయమైన భర్త.. పగలబడి నవ్విన భార్య
చిత్తడి నేల, బురదలో నడిచే సమయంలో ఆచితూచి నడవాలి. సరిగా చూసుకోకుండా ఒక్క అడుగు వేసిన కాలు జారి బొక్కబోర్లా పడాల్సి వస్తుంది. ఇలాగే ఓ వ్యక్తి బురద మట్టిలో నడుస్తూ ఆమాంతం కొన్ని సెకన్లపాటు మాయమైపోయాడు. బురద అనుకొని పెద్ద గోతిలో కాలు వేయడంతో నిండా మునిగిపోయాడు. అతడికి సాయం చేయాల్సిన భార్య.. ఇదంతా వీడియో తీస్తూ పగలబడి నవ్వింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవ్వడంతో నెటిజన్లు సైతం పొట్ట చెక్కలయ్యేలా నవ్వేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బ్రిటిష్ టూరిస్ట్ అయిన మార్టిన్ లూయిస్ తన భార్య రచెల్తో కలిసి మాల్దీవుల పర్యటను వెళ్లారు. అక్కడ వ్యూవాములా ప్రాంతంలో రోడ్డు మీద కాకుండా షార్ట్‌కట్ మార్గంలో వెళ్దామని అతని భార్య సలహా ఇచ్చింది. దారిలో వీరు బురదను దాటాల్సి వచ్చింది. దీంతో అతడు చెప్పులు చేతులో పెట్టుకుని ప్యాంటు తడవకుండా ఎంతో జాగ్రత్తగా బురదను దాటేందుకు కాలు ముందుకేశాడు. ఈ క్రమంలో ఒక అడుగు ముందుకు పడటంతో కాలుజారి వెంటనే బురదలో మునిగిపోయాడు. బురదలో పడిన వెంటనే మార్టిన్ కొన్ని సెకన్ల వరకు బయటకు రాలేదు. అయితే, అతడి భార్య అతడికి సాయం చేయకుండా వీడియో తీస్తూనే ఉంది. అంతేగాక భర్త గుంటలో పడటంతో పగలబడి నవ్వుతూనే ఉంది. దీంతో అతడు కోపంతో ‘‘నాతో మాట్లాడకు’’ అని భార్యతో అరిచాడు. ఈ విషయాన్ని అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ వీడియో ఇప్పటి వరకు 28 మిలియన్ల వ్యూవ్స్ సంపాదించింది. అనంతరం మార్టిన తన అనుభవాన్ని షేర్ చేస్తూ.‘మేము ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్నాము. నా భార్య మరోవైపుకు వెళ్లేందుకు దగ్గరి దారి ఉందని ఇలా తీసుకెళ్లింది. బురదలోకి వెళితే నా పాదాలు తడిసిపోతాయని నాకు తెలుసు. నా ప్యాంటు అడుగు కూడా నాశనం అవుతుందని భావించాను. కానీ దుస్తులు పాడవ్వకుండా జాగ్రత్తగా వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఒక్క అడుగు వేయగానే బురదలో ఉన్న గోతిలోకి వెళ్లిపోయాను. బురదలోకి పూర్తిగా మునిగిపోవడంతో షాక్‌కు గురయ్యా. నేను కిందికి వెళ్తూనే ఉన్నాను. దాదాపు తొమ్మిది నుంచి 10 అడుగుల లోతులో ఉంది. కానీ నేను భయపడలేదు, వెంటనే నీటి నుంచి బయటకొచ్చాను. అయితే నా భార్య 10 నిమిషాలపాటు నవ్వుతూనే ఉంది. తర్వాత బీచ్ వైపుకు వెళ్లి దుస్తులకు అంటుకున్న బురద మొత్తం తొలగించుకున్నాను’ అని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by The3Dumbbells (@the3dumbbellz) View this post on Instagram A post shared by The3Dumbbells (@the3dumbbellz) -
మరో 80 ఏళ్లలో మాల్దీవులు మాయం..!
మనదేశంలో సెలబ్రిటీల ఫెవరెట్ హాలీడే స్పాట్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది మాల్దీవులు. మరీ ముఖ్యంగా బీటౌన్ లవ్ కపుల్స్‌కి మాల్దీవులంటే మహా ఇష్టం. ఇక హీరో, హీరోయిన్లు ఏమాత్రం గ్యాప్ దొరికినా చాలు.. మాల్దీవుల్లో వాలిపోతారు. కొత్తగా పెళ్లైన బడాబాబులు హానీమూన్ ట్రిప్ కోసం కూడా మాల్దీవులనే సెలక్ట్ చేసుకుంటారు. అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద దీరుతూ.. ఏంజాయ్ చేస్తూ.. రోజువారి ఒత్తిడి నుంచి దూరమయ్యి.. రిఫ్రెష్ అయ్యి వస్తారు. అయితే మాల్దీవ్స్ లవర్స్‌కి ఓ బ్యాడ్ న్యూస్. మరో 80 ఏళ్లలో అనగా 2100 నాటికి మాల్దీవులు మాయమవుతాయట.. అంటే పూర్తిగా నీటిలో మునిగిపోతాయని నివేదిక వెల్లడించింది. మాల్దీవ్స్, ఫిజితో పాటు మరో మూడు అందమైన దీవులు నీటిలో మునిగిపోతాయంటున్నారు శాస్త్రవేత్తలు. రానున్న 60 ఏళ్లలోపు ఈ ద్వీపాలు నీటిలో మునిగిపోతాయని, గ్లోబల్ వార్మింగ్ వల్లనే ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల పెరుగుతున్న సముద్ర మట్టం 40 వ దశకంలో, అమెరికన్ శాస్త్రవేత్త బెనో గుటెన్బర్గ్ సముద్రంలో నీరు పెరుగుతున్నట్లు అనుమానించి.. ఒక అధ్యయనం చేశాడు. దీన్ని ధ్రువీకరించుకోవడానికి గుటెన్బర్గ్ గత 100 సంవత్సరాల డేటాను అధ్యయనం చేశాడు. అతని అనుమానం నిజమని తేలింది. ధృవాల వద్ద మంచు కరగడం వల్ల సముద్రంలో నీటి మట్టం నిరంతరం పెరుగుతోందని గుటెన్బర్గ్ గమనించాడు. 90 వ దశకంలో, నాసా కూడా దీనిని ధ్రువీకరించింది. అప్పటి నుంచి, గ్లోబల్ వార్మింగ్ వల్ల తలెత్తే సమస్యల ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన చర్చ ప్రారంభమయ్యింది. 2100 నాటికి మాయమవనున్న మాల్దీవులు సముద్రపు నీరు వేగంగా పెరగడం వల్ల 2100 చివరి నాటికి మాల్దీవులు నీటిలో మునిగిపోతాయని ప్రపంచ బ్యాంక్, అనేక ఇతర సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఫిజీ కూడా ముప్పు అందమైన బీచ్‌లతో తయారైన ఫిజీ, దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం. ఫిజీలో అనేక మంది భారతీయులు నివసిస్తున్నారు. అయితే సముద్ర మట్టం పెరగడం వల్ల భవిష్యత్తులో ఈ అందమైన దేశం కూడా నీటిలో మునిగిపోతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఏటా పెరుగుతున్న సముద్ర నీటి మట్టం పలావు, పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం. నీటి మట్టం పెరగడం వల్ల సముద్రంలో మునిగిపోయే ప్రమాదం ఎదుర్కొనబోతుంది. పలావు నేషనల్ వెదర్ సర్వీస్ ఆఫీస్ అండ్ పసిఫిక్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ ప్రోగ్రాం ప్రకారం 1993 నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ సముద్రపు నీరు 0.35 అంగుళాల చొప్పున పెరుగుతోంది. ఇప్పటికే నీట మునుగుతున్న రిపోసోలోమోన్ ద్వీపం రీడర్స్ డైజెస్ట్‌లోని ఒక నివేదిక ప్రకారం, రిపోసోలోమోన్ ద్వీపం దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. ఇది సుమారు 1000 ద్వీపాలు ఉంటాయి. ఇవి ఇప్పుడు నీటిలో మునిగిపోతున్నాయి అని తెలిపారు శాస్త్రవేత్తలు. చదవండి: ఇండియాకు మాల్దీవులు షాక్.. అయోమయంలో బీటౌన్ లవ్‌బర్డ్స్ -
మాల్దీవుల్లో రచ్చ రచ్చ చేసిన యూనివర్సల్ బాస్..
మాల్దీవ్స్: యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మైదానంలో ఉన్నా, మైదానం వెలుపల ఉన్నా సందడి మాత్రం కామన్‌గా కనిపిస్తుంటుంది. క్రికెట్ గ్రౌండ్లో బౌండరీలు, సిక్సర్లతో అలరించే ఈ విండీస్ విధ్వంసకర వీరుడు.. మైదానం వెలుపల రకరకాల డ్యాన్సులు చేస్తూ, తనలో దాగి ఉన్న అనేక నైపుణ్యాలను బయటపెడుతూ.. ఫ్యాన్స్ కావాల్సిన కనువిందును అందిస్తుంటాడు. భారత్‌లో కరోనా కేసులు అధికమవడం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ వాయిదా పడటంతో మాల్దీవుల్లో సేదతీరేందుకు బయల్దేరిన ఈ పంజాబ్ కింగ్స్ ఆటగాడు.. అక్కడ తనలో దాగి ఉన్న మరో కళను ఆవిష్కరించాడు. ఎగిసిపడుతున్న సముద్రపు అలలపై జెట్ స్కీయింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ రచ్చరచ్చ చేశాడు. స్కీయింగ్ చేస్తూ, చేతిలో సిగార్‌తో దిగిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా గంటల వ్యవధిలో 1.3 లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి. దీన్ని బట్టి సోషల్ మీడియాలో అతని స్టామినా ఏ రేంజ్లో ఉందో తెలుస్తుంది. సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తున్న వీడియోను మంగళవారం పోస్ట్ చేయగా, దానికి కూడా రెండు లక్షలకు పైగా వ్యూవ్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే, తమ దేశంలో అంక్షల కారణంగా ఐపీఎల్లో పాల్గొన్న ఆసీస్ ఆటగాళ్లు కూడా కొద్ది రోజుల పాటు మాల్దీవుల్లోనే గడిపారు. సోమవారం ఆసీస్ ఆటగాళ్లంతా స్వదేశానికి చేరుకోగా యూనివర్సల్ బాస్ మాత్రం మరికొద్ది రోజులు అక్కడే గడపాలని నిర్ణయించుకున్నాడట. చదవండి: టీమిండియా ఆటగాడికి ధన్యవాదాలు తెలిపిన సోనూ సూద్.. View this post on Instagram A post shared by KingGayle 👑 (@chrisgayle333) View this post on Instagram A post shared by KingGayle 👑 (@chrisgayle333) -
Mike Hussey: ఎట్టకేలకు స్వదేశానికి..
చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ కోచ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైక్ హస్సీ ఎట్టకేలకు స్వదేశానికి బయలు దేరాడు. మాల్దీవుల నుంచి ఆదివారం దోహా మీదుగా హస్సీ ఆస్ట్రేలియాకు పయనమయ్యాడని, సోమవారం అక్కడికి చేరుకుంటాడని చెన్నై జట్టు సీఈవో కేఎస్ విశ్వనాథన్ ట్విటర్లో పేర్కొన్నాడు. ఇక మాల్దీవుల్లో ఉన్న ప్యాట్ కమిన్స్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ సహా ఇతర ఆస్ట్రేలియా ఆటగాళ్లు బీసీసీఐ ఏర్పాటు చేయనున్న ప్రత్యేక విమానంలో స్వదేశానికి చేరుకోనున్నారు. సిడ్నీలోని ఓ హోటల్లో క్వారంటైన్ పూర్తి చేసుకున్న అనంతరం వారు ఇళ్లకు వెళ్లే అవకాశం ఉంది. కాగా భారత్‌లో కరోనా మహమ్మారి ప్రకంపనల నేపథ్యంలో ఐపీఎల్-2021 నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విదేశీ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా స్వస్థలాలకు చేరుకుంటున్నారు. చదవండి: సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు భారత మహిళల క్రికెట్ జట్టు -
హమ్మయ్య.. గండం తప్పింది
బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా తీవ్ర భయాందోళనకు గురిచేసిన చైనా లాంగ్‌మార్చ్ 5బీ రాకెట్ శకలాల కథ సుఖాంతమయ్యింది. ఈ శకలాలు ఆదివారం హిందూ మహా సముద్రంలో మాల్దీవుల సమీపంలో కూలిపోయాయి. శకలాలన్నీ సురక్షితంగా సాగర గర్భంలోకి చేరడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. ఈ విషయాన్ని అంతరిక్ష సంస్థ అధికారికంగా ప్రకటించింది. చైనా స్థానిక కాలమానం ప్రకారం.. లాంగ్‌మార్చ్ రాకెట్ శకలాలు ఆదివారం ఉదయం 10.24 గంటలకు భూవాతావరణంలోకి ప్రవేశించాయి. 72.47 డిగ్రీల తూర్పు రేఖాంశం(లాంగీట్యూడ్), 2.65 డిగ్రీల ఉత్తర అక్షాంశం(లాటీట్యూడ్) వద్ద సముద్రంలో కూలిపోయినట్లు చైనా స్పేస్ ఇంజనీరింగ్ ఆఫీస్ వెల్లడించింది. చాలా శకలాలు భూవాతావరణంలో మండిపోయి, నీళ్లల్లో కూలాయి. ఇక రిలాక్స్ కావొచ్చు చైనా రాకెట్ శకలాల కథ సుఖాంతం కావడాన్ని నాసా కూడా ధ్రువీకరించింది. లాంగ్‌మార్చ్ 5బీ పునరాగమనాన్ని ఉత్కంఠతో పరిశీలిస్తున్నవారంతా ఇక రిలాక్స్ కావొచ్చని, రాకెట్ సముద్రంలో కూలిపోయిందని స్పష్టం చేసింది. ఈ గండం నుంచి చైనా ఇప్పటికిప్పుడు గట్టెక్కింది గానీ దాని నిర్లక్ష్యం మాత్రం వీడడం లేదని హార్వర్డ్ వర్సిటీకి చెందిన ఆస్ట్రోఫిజిసిస్ట్ జోనాథన్ మెక్‌డొవెల్ తప్పుపట్టారు. చైనా ప్రభుత్వం తియాన్‌గాంగ్ పేరిట అంతరిక్ష కేంద్ర నిర్మాణాన్ని తలపెట్టింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 29న హైనన్ ప్రావిన్స్‌లోని వెన్చాంగ్ స్పేస్‌క్రాఫ్ట్ లాంచ్ సైట్ నుంచి లాంగ్‌మార్చ్ 5బీ (సీజెడ్–5బీ) రాకెట్‌ను ప్రయోగించింది. అంతరిక్ష కేంద్రానికి అవసరమైన కీలక భాగాన్ని (కోర్ మా డ్యుల్) ఈ రాకెట్ మోసుకెళ్లింది. అయితే, మా డ్యుల్ను విజయవంతంగా రోదసీలో ప్రవేశపెట్టాక నియంత్రణ కోల్పోయింది. అంతరిక్షంలోనే పేలి పోయింది. దాని శకలాలు మళ్లీ భూమి పైకి దూసుకొచ్చాయి. అవి ఎక్కడ పడతాయన్న దాని పై భిన్న వాదనలు వినిపించాయి. ఒక దశలో ఇం డియా రాజధాని ఢిల్లీని ఢీకొట్టడం ఖాయమన్న పుకార్లు కూడా వినిపించాయి. చివరకు సముద్రంలో కూలిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాకెట్ శకలాలకు సంబంధించి బాధ్యతాయుతమైన ప్రమాణాలను పాటించడంలో చైనా విఫలమైందని అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ ప్రతినిధి బిల్ నెల్సన్ విమర్శించారు. -
స్లేటర్‌తో ఘర్షణపై వార్నర్ క్లారిటీ
మాలె: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఆ దేశ మాజీ క్రికెటర్, కామెంటేటర్ మైకేల్ స్లేటర్లో ఇటీవల మాల్దీవ్స్‌లోని ఓ బార్లో కొట్టుకున్నట్లు వచ్చిన వార్త హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం ఈ వార్త కు సంబంధించి ఈ ఇద్దరు ఆస్ట్రేలియన్లు వివరణ ఇచ్చారు. కరోనా విజృంభిస్తున్న కారణంగా భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లడంపై ఆ దేశ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ వాయిదా పడడంతో ఆసీస్ క్రికెటర్లు, సిబ్బంది మాల్దీవ్స్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. వాళ్లు అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు పయనమయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మేము గొడవ పడలేదు.. ఇది ఇలా ఉండగా మాల్దీవ్స్‌లోని ఓ బార్లో వార్నర్, స్లేటర్ గొడవపడినట్లు ద డైలీ టెలిగ్రాఫ్ ఓ స్టోరీ రాసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెటర్లు ఉన్న తాజ్ కోరల్ రిసార్ట్‌లోనే ఈ ఘటన జరిగినట్లు చెప్పింది. ఈ వార్త పై స్లేటర్, వార్నర్ స్పందించారు చెప్పారు. దీనిపై మొదటగా స్పందించిన స్లేటర్ సీనియర్ జర్నలిస్ట్ ఫిల్ రోత్‌ఫీల్డ్‌కు చేసిన మెసేజ్‌లో.. నేను, వార్నర్ ఎప్పటి నుంచో మంచి స్నేహితులం. మా మధ్య గొడవ జరిగే అవకాశమే లేదు. ఇదంతా పుకారే అని స్పష్టం చేశాడు. ఆ తర్వాత వార్నర్ కూడా తన వివరణగా.. మీకు ఇలాంటి పుకార్లు ఎక్కడి నుంచి వస్తాయో నాకు తెలియడం లేదు. ఇటువంటి వార్తలు రాసే ముందు బలమైన ఆధారాలు ఉంటేనే రాయాలంటూ తెలిపాడు. కాగా గత వారం ఆస్ట్రేలియా ప్రధానిపై తీవ్రంగా మండిపడిన స్లేటర్ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. భారత్ నుంచి వచ్చే ఆస్ట్రేలియన్లపై నిషేధం విధించడంపై స్లేటర్ తీవ్రంగా మండిపడ్డాడు. ( చదవండి: కేకేఆర్ జట్టులో మరో ఆటగాడికి కరోనా ) -
‘హోం వర్క్’ చేసి సంతకాలు పెట్టండి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా లీగ్‌లలో పాల్గొనే ముందు అన్ని అంశాలు చూసుకొని, మున్ముందు రాబోయే సమస్యలను అంచనా వేసి సంతకాలు పెట్టాలని ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘం (ఏసీఏ) తమ ఆటగాళ్లను హెచ్చరించింది. కరోనా నేపథ్యంలో ఆస్ట్రేలియా దేశంలోకి విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో ఐపీఎల్లో ఆడుతున్న ఆసీస్ క్రికెటర్లంతా ఒక రకంగా చిక్కుకుపోయారు. నేరుగా స్వదేశం వెళ్లలేక ఇప్పుడు మాల్దీవుల మీదుగా వెళ్లాల్సి వస్తోంది. దీనినే ఏసీఏ గుర్తు చేసింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) వాయిదా పడిన సమయంలో కూడా లిన్, క్రిస్టియాన్, కటింగ్ కూడా దాదాపు ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. ‘భవిష్యత్తులో ఇలాంటి స్థితి రాకూడదని కోరుకుంటున్నా. అయితే ఒప్పందాలపై సంతకాలు చేసే ముందు కాస్త హోంవర్క్ చేసుకుంటే మంచిది. కరోనా కారణంగా ఇప్పుడు ప్రపంచం అంతా మారిపోయింది. మన దేశంలో అయితే అంతా బాగుండి మీరంతా ఎంతో స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. సరిహద్దులు మూసేసి ప్రయా ణాలపై ఆంక్షలు పెడతారని ఆటగాళ్లూ ఊహించలేదు. అయితే ఇలాంటివి జరిగినప్పుడు ఆందోళన పెరగడం సహజం’ అని ఏసీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టాడ్ గ్రీన్బర్గ్ అన్నారు. మైక్ హస్సీ మినహా.... కరోనా పాజిటివ్‌గా తేలిన చెన్నై బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ మినహా మిగతా ఆస్ట్రేలియన్లంతా మాల్దీవులకు చేరుకున్నారు. ఈ విషయాన్ని నిర్ధారించిన ఆస్ట్రేలియా బోర్డు (సీఏ)... ప్రభుత్వ ఆంక్షల్లో సడలింపులు వచ్చేవరకు వారంతా మాల్దీవులలోనే ఉండి ఆస్ట్రేలియాకు బయల్దేరతారని చెప్పారు. హస్సీ మాత్రం కోలుకున్న తర్వాత ఇక్కడి నుంచి బయల్దేరతాడు. హస్సీ, బౌలింగ్ కోచ్ బాలాజీలను ముందు జాగ్రత్తగా సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఢిల్లీ నుంచి చెన్నైకి తరలించింది. ఇక్కడ తమకు అందుబాటులో అన్ని సౌకర్యాలు ఉన్నాయని... అవసరమైతే చెన్నైలో చికిత్స అందించడం సులువవుతుందని సీఎస్కే వర్గాలు వెల్లడించాయి. ఆటగాళ్లంతా తమ స్వస్థలాలకు చేరుకున్న తర్వాతే ధోని తన ఇంటికి బయల్దేరనున్నాడు. ఎలాంటి ఆంక్షలులేని ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఆటగాళ్లు స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఇంగ్లండ్ పర్యటనకు దూరమవుతున్న న్యూజిలాండ్ పేసర్ బౌల్ట్ కూడా స్వదేశం వెళ్లిపోగా... విలియమ్సన్, సాన్‌ట్నర్, జేమీసన్ మాత్రం భారత్‌లోనే ఉండి మే 11న ఇంగ్లండ్‌కు బయల్దేరతారు. ‘మా మెడికల్ పాలసీ పని చేస్తుందా’ భారత్‌లో కరోనా పరిస్థితుల వార్తలు సోషల్ మీడియాలో చదువుతూ భయపడిన ఐపీఎల్ విదేశీ క్రికెటర్లు లీగ్‌లోకి కూడా కరోనా ప్రవేశించడంతో మరింత ఆందోళనకు గురయ్యారు. భారత ఆటగాళ్లు వారికి ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించినా విదేశీ క్రికెటర్లలో భయం మరింత పెరిగిపోయిందని సన్‌రైజర్స్ ఆటగాడు శ్రీవత్స్ గోస్వామి అన్నాడు. ‘అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా కానీ వైరస్ ఎలా బబుల్‌లోకి వచ్చిందో తెలీదు. ఒక్కసారి కరోనా సహచరుడికి వచ్చిందని తెలిశాక ఆటగాళ్లంతా భయపడిపోయారు. ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లు అప్పటికే ఇక్కడి పరిస్థితులు, ఆక్సిజన్ సమస్యలు, బెడ్లు లేకపోవడంలాంటి వార్తలు చదివి ఉండటంతో మరింత బెంగ పెరిగిపోయింది. కొందరు క్రికెటర్లయితే నాకు ఇక్కడ కోవిడ్ వస్తే పరిస్థితి ఏమిటి. నా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ భారత్‌లో పని చేస్తుందా అని కూడా అడిగేశారు’ అని గోస్వామి వెల్లడించాడు. దీన్ని బట్టి చూస్తే లీగ్ వాయిదా ప్రకటనకు ముందు క్రికెటర్లలో ఎంతటి అభద్రతా భావం నెలకొందో అర్థమవుతుంది. -
మాల్దీవులకు పారిపోయిన కామెంటేటర్
ఢిల్లీ: ప్రస్తుత ఐపీఎల్లో బయోబబుల్‌ను విదేశీ క్రికెటర్లు అసలు భరించలేకపోతున్నారు. ఎక్కడికి కదలకుండా ఒకే ప్లేస్‌లో ఎవరితోనూ సంబంధాలు లేకుండా ఉండటాన్ని వారికి కష్టంగా ఉంటుంది. ఈ క్రమంలోనే పలువురు క్రికెటర్లు ఐపీఎల్‌ను అర్థాంతరంగా వీడి తమ దేశాలకు వెళ్లిపోయారు. భారత్‌లో కరోనా తీవ్రత అధికంగా ఉండటం కూడా వీరిని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇలా చిక్కుకపోవడం వారికి మింగుడు పడటం లేదు. మరొకవైపు భారత్ నుంచి విమానరాకపోకలను పలుదేశాలు నిషేధం విధించడంతో ఐపీఎల్లో ఉన్న విదేశీ క్రికెటర్లు చేసేది ఏమీ లేకుండా పోయింది. కాగా, ఐపీఎల్లో కామెంటరీ ఒప్పందాన్ని కుదుర్చుకున్న ఆసీస్ మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్ బయోబబుల్ నిబంధనను అతిక్రమించాడు. కొన్ని రోజుల నుంచి కామెంటరీ ప్యానల్ కనిపించన స్లేటర్ మాల్దీవులకు పారిపోయినట్లు తెలుస్తోంది. భారత్‌లో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతోనే మాల్దీవుల మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మరికొంతమంది విదేశీ క్రికెటర్లు కూడా అదే రూట్‌ను ఎంచుకుని బయోబబుల్ నుంచి ఎస్కేప్ కావడానికి యత్నాలు ఆరంభించినట్లు సమాచారం. ఇక్కడ చదవండి: సీఎస్కే క్యాంప్‌లోనూ కరోనా కలకలం..! ‘ఇకపై వార్నర్‌ను సన్‌రైజర్స్ జెర్సీలో చూడలేం’ -
కరోనా పేషెంట్లకు సాయం చేస్తా: ఆలియా భట్
ముంబై : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. అనేక మంది తిండిలేక, వైద్యం అందక అల్లాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 'మేము సైతం' అంటూ సాయం చేయడానికి అనేక మంది సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ఇటీవలె గౌతమ్ గంభీర్ నిర్వహిస్తున్న స్వచ్చంద సంస్థకు కోటి రూపాయలు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా కోవిడ్ పేషెంట్ల కోసం సకల సౌకర్యాలతో వెయ్యిపడకల ఆసుపత్రిని నిర్మిస్తానని హిందీ నటుడు గుర్మీత్ చౌదరి ప్రకటించాడు. పాట్నా, లక్నోలో ఈ హాస్పిటళ్లను త్వరలోనే ప్రారంభిస్తానని ఆదివారం నాడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. తాజాగా కరోనాతో అల్లాడిపోతున్న జనాలకు సాయం చేయడానికి హీరోయిన్ ఆలియా భట్ ముందుకు వచ్చింది. ఇటీవలె ప్రియుడు రణ్‌బీర్‌తో కలిసి హాలిడే ట్రిప్ కోసం మాల్దీవులకు వెళ్లిన ఆలియా రెండు రోజుల క్రితమే ముంబైకు చేరుకుంది. ఈ నేపథ్యంలో దేశంలో నెలకొన్న పరిస్థితులను సమీక్షించి అవసరమైన వారికి సహాయం చేస్తానని ప్రకటించింది. జర్నలిస్ట్ ఫయే డిసౌజాతో కలిసి కోవిడ్ పేషెంట్లు ఎంత మంది ఉన్నారు? ఎవరెవరికి తక్షణ సహాయం అందాల్సి ఉంది వంటి వివరాలను సేకరించి వారికి సహాయం చేస్తానని ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆలియా ప్రకటించింది. కాగా ఆలియా- రణ్‌బీర్, టైగర్ ష్రాఫ్-దిశా పటానీ సహా పలువురు సెలబ్రిటీలు మాల్దీవులకు వెకేషన్‌కు వెళ్లడం పట్ల నెటిజన్లు నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. 'కాస్త అయిన బాధ్యత ఉండక్కర్లేదా.. ఓ వైపు దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. మీకు టూర్లు కావాల్సి వచ్చిందా’అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) చదవండి : 'ఆ ఫోటోలు పెడుతున్నారు..కొంచెమైనా సిగ్గుండాలి' కరోనా పేషెంట్ల కోసం వెయ్యి పడకల ఆస్పత్రి: నటుడు -
ఇండియాకు మాల్దీవులు షాక్.. అయోమయంలో బీటౌన్ లవ్‌బర్డ్స్
భారత్‌లో కరోనా వైరస్ రెండో దశ తీవ్రంగా విరుచుకుపడుతోంది. రోజూ మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో జర్మనీ, ఇటలీ, ఇరాన్, సింగపూర్, నెదర్లాండ్ , బంగ్లాదేశ్ వంటి దేశాలు ఇప్పటికే భారత ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. భారత్ నుంచి వచ్చే విమానాలు రద్దు చేశాయి. తాజాగా ఈ జాబితాలోకి మాల్దీవులు చేరింది. భారత్ నుంచి మాల్దీవులకు వచ్చే అన్ని విమానలను నిలిపివేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు మాల్దీవులు పర్యాటక మంత్రిత్వశాఖ ట్విటర్ ద్వారా అధికారికంగా వెల్లడించింది. With effect from 27 April @HPA_mv suspends tourists travelling from #India to #Maldives from staying at tourist facilities in inhabited islands. We thank you for the support in our endeavour to make tourism safest possible with minimum inconvenience. — Ministry of Tourism (@MoTmv) April 25, 2021 ఆ ఆంక్షలు ఏప్రిల్ 27 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. భారత పర్యాటకులెవరూ మాల్దీవుల్లోని హోటళ్లు, రిసార్ట్లు, గెస్ట్ హౌజ్‌ల్లో బస చేయవద్దని నిషేధం విధించింది. తమ పర్యాటక రంగాన్ని సురక్షితంగా ఉంచడానికి చేస్తున్న ఈ ప్రయాత్నానికి మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ట్వీట్లో పేర్కొంది. అయితే బీటౌన్ తారలు, జాన్వీ కపూర్, దిశా పటాని, టైగర్ ష్రాఫ్‌తోపాటు మరికొంత మంది ఇటీవల వెకేషన్‌కు మాల్దీవులకు వెళ్లొచ్చారు. రణబీర్ కపూర్, అలియా భట్ కూడా కోవిడ్ -19 నుంచి కోలుకున్న వెంటనే మాల్దీవులు చుట్టొచ్చారు. అక్కడ దిగిన ఫోటోలను సైతం సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేశారు. మాల్దీవుల ప్రకటన అనంతరం బాలీవుడ్ సెలబ్రిటీలపై నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ఫన్నీ మీమ్స్‌తో నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. ఓ వైపు దేశమంతా కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం తమ వినోదాల కోసం హాలీడే ట్రిప్పుల పేరుతో ఎంజాయ్ చేస్తున్నారని విరుచుకుపడుతున్నారు. దేశం తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే ట్రిప్పులు కవాల్సి వచ్చిందా అని విమర్శిస్తున్నారు. ఇండియా టూరిస్టులను మాల్దీవులు బ్యాన్ చేయడం మంచిపని అయ్యిందంటూ సంబరపడుతున్నారు. చదవండి: ‘తిండి లేక అల్లాడుతుంటే.. డబ్బులు నీళ్లలా ఖర్చుపెడుతున్నారు’ కరోనా బాధితులకే కరువైందంటే.. చేపలకు ఆక్సిజన్! With effect from 27 April @HPA_mv suspends tourists travelling from #India to #Maldives from staying at tourist facilities in inhabited islands. We thank you for the support in our endeavour to make tourism safest possible with minimum inconvenience. — Ministry of Tourism (@MoTmv) April 25, 2021 Maldives restricts entry of tourists from India Bollywood celebs rn: pic.twitter.com/Pa5ZU83lRu — Mawa_Jalebi 🦄 (@HighnPositive) April 26, 2021 Bollywood celebrities rushing for the Maldives while watching people in India die... #CovidIndia pic.twitter.com/KUFrVUixm1 — Delhi Decoded (@DelhiDecoded) April 26, 2021 Bollywood celebrities planning for tourism in Maldives Le Maldive's government suspends tourists from India :) pic.twitter.com/HYsTufAY2S — Anant (@Bihariladka_) April 26, 2021 View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) -
'ఆ ఫోటోలు పెడుతున్నారు..కొంచెమైనా సిగ్గుండాలి'
ముంబై : ఓ వైపు దేశమంతా కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం తమ ఎంజాయ్‌మెంట్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. సెలబ్రిటీలు మాత్రం వినోదాల కోసం విదేశాలకు వాలిపోతున్న సంగతి తెలిసిందే. హాలీడే ట్రిప్పుల పేరుతో ప్రేమపక్షులు మాల్దీవుల బీచుల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు ఫోజులిస్తున్నారు. ఇటీవలె అలియా భట్, రణ్‌బీర్ కపూర్, దిషా పటాని-టైగర్ ష్రాఫ్ హాలీడే ఎంజాయ్ చేయడం కోసం మాల్దీవులు చెక్కేసిన సంగతి తెలిసిందే. వీరి హాలిడే ట్రిప్పై నెటి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘‘కాస్త అయిన బాధ్యత ఉండక్కర్లేదా.. ఓ వైపు దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. మీకు టూర్లు కావాల్సి వచ్చిందా’’అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా విషయంపై బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ స్పందించారు. ఇప్పడు ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకుంది. మన దేశంలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. కనీసం తినడానికి తిండి కూడా లేకుండా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వీళ్లు మాత్రం తమ జల్సాల కోసం డబ్బులను నీళ్లలా ఖర్చుపెడుతున్నారు. ఓ వైపు దేశం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతుంటే...వీరు మాత్రం వెకేషన్ ట్రిప్పులను ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలు పెడుతున్నారు. కొంచెం అయినా సిగ్గుండాలి. వీళ్లు యాక్టింగ్ గురించి తప్పా ఇంకేమీ మాట్లాడలేరు అంటూ బాలీవుడ్ సెలబ్రిటీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని, అందరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఒక తన వెకేషన్ గురించి మాట్లాడుతూ..తాను బుధానాలోని తన కుటుంబంతో సమయం గడుపుతున్నానని, ఇదే తనకు మాల్దీవులు అని చెప్పుకొచ్చారు. చదవండి : అయినా ఇప్పుడు ట్రిప్పులు ఏంటి : శృతి హాసన్ ‘‘ఓ పక్క జనాలు చస్తుంటే.. మీరు ట్రిప్పులకు వెళ్తారా?’’ -
జిమ్ ట్రైనర్‌తో మాల్దీవుల్లో రచ్చ చేస్తున్న నటి
నటి, మోడల్ పార్వతీ నాయర్‌కు సోషల్ మీడియాలో బాగానే క్రేజ్ ఉంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటో షూట్లతో కుర్రాల మతులు పోగొడుతుంది ఈ మలమాళీ ముద్దుగుమ్మ. తాజాగా మాల్దీవులకు వెళ్లిన భామ అక్కడి అందాలను ఆస్వాదిస్తూ ఎప్పటికప్పుడు ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. ఈ నేపథ్యంలో జిమ్ ట్రైనర్ మైఖేల్‌తో కలిసి పార్వతీ చేసిన రొమాంటిక్ స్టంట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో మైఖేల్‌తో కలిసి ఓ వీడియో తీస్తుండగా, అతను సడెన్‌గా పార్వతిని గాల్లోకి పైకెత్తాడు. దీంతో షాక్ అయిన నటి..ఇది సడెన్ సర్ప్రైజ్ అంటూ ఆ వీడియోను షేర్ చేసింది. ట్రైనర్ మైఖేల్ సైతం ఈ వీడియోను షేర్ చేస్తూ..సడెన్‌గా ఆమెను లిఫ్ట్ చేయగానే పార్వతీ చాలా షాకింగ్‌కి గురయ్యిందని చెప్పుకొచ్చాడు. కాగా గత కొన్ని రోజులుగా పలువురు సెలబ్రిటీలు హాలీడే ట్రిప్ పేరుతో మాల్దీవులకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్‌లో కరోనా విజృంభిస్తున్నా ఏమాత్రం భాద్యత లేకుండా సెలబ్రిటీలు ఇలా విహారయాత్రలకు వెళ్లడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. View this post on Instagram A post shared by Parvati Nair (@paro_nair) చదవండి : అల్లు అర్జున్ను దారుణంగా అవమానించిన దిల్ రాజు! అయినా ఇప్పుడు ట్రిప్పులు ఏంటి : శృతి హాసన్ -
అయినా ఇప్పుడు ట్రిప్పులు ఏంటి : శృతి హాసన్
దేశ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తున్నా సెలబ్రిటీలు మాత్రం వినోదాల కోసం విదేశాలకు వాలిపోతున్నారు. ప్రజలంతా ఇంటికే పరిమితం కావాలని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని ప్రభుత్వాలు నెత్తీ నోరు ముత్తుకుంటున్నా కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలకు మాత్రం అది చెవికెక్కడం లేదు. ఇటీవలె బాలీవుడ్ ప్రేమ పక్షులు అలియా భట్, రణ్‌బీర్ కపూర్, దిషా పటాని-టైగర్ ష్రాఫ్ హాలీడే ఎంజాయ్ చేయడం కోసం మాల్దీవులు చెక్కేసిన సంగతి తెలిసిందే. వీరి హాలిడే ట్రిప్పై నెటిజనులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘కాస్త అయిన బాధ్యత ఉండక్కర్లేదా.. ఓ వైపు దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. మీకు టూర్లు కావాల్సి వచ్చిందా’’అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై హీరోయిన్ శృతి హాసన్ సైతం స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'వారికి హాలిడే దొరికినందుకు సంతోషం, వారు దానికి అర్హులు కూడా. అయితే విహారయాత్రలకు ఇది సరైన సమయం కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. ప్రస్తుతం ఎంతోమంది కష్టకాలంలో ఉన్నారు. ఇలాంటి పాండమిక్ సమయంలో వెకేషన్ ట్రిప్పులకు వెళ్లడం కరెక్ట్ కాదు' అని పేర్కొంది. శృతి సహాన్ పాటు రోహిణి అయ్యర్, కాలమిస్ట్ శోభా దే సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు సెలబ్రిటీల విహారయాత్రలను తప్పుబడుతున్నారు. చదవండి: ‘‘ఓ పక్క జనాలు చస్తుంటే.. మీరు ట్రిప్పులకు వెళ్తారా?’’ గుండె పగిలింది: విషాదంలో పూజా హెగ్డే -
‘‘ఓ పక్క జనాలు చస్తుంటే.. మీరు ట్రిప్పులకు వెళ్తారా?’’
దేశంలో కరోనా కకావికలం సృష్టిస్తోంది. సెకండ్ వేవ్ ప్రభావం భారతదేశం మీదనే అధికంగా ఉంది. ఏకంగా రోజుకు సుమారు మూడు లక్షల కొత్త కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. జనాలంతా సాధ్యమయినంత వరకు ఇంటికే పరిమితమై.. క్షేమంగా ఉండాలని ప్రభుత్వాలు విన్నవిస్తున్నాయి. కానీ సెలబ్రిటీల్లో కొందరు మాత్రం ఈ మాటలను పెడచెవిన పెడుతున్నారు. అత్యవసర పనులు ఏం లేకపోయినా సరే.. విదేశాల బాట పడుతున్నారు. ఎందుకంటే హాలీడే ఎంజాయ్ చేయడం కోసం అంటున్నారు. వీరిలో కొందరు ఈ మధ్య కాలంలోనే కరోనా బారిన పడి కోలుకున్న వారు కూడా ఉన్నారు. తాజాగా బాలీవుడ్ ప్రేమ పక్షులు అలియా భట్, రణ్‌బీర్ కపూర్‌లిద్దరూ కూడా హాలీడే ఎంజాయ్ చేయడం కోసం మాల్దీవులు చెక్కేసిన సంగతి తెలిసిందే. విహారయాత్రకు వెళ్లడానికి కొద్ది రోజుల ముందే వీరిద్దరూ కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. ఇక నిన్న ఈ జంట ముంబై ఎయిర్‌పోర్టులో విలేకరుల కెమరాకి చిక్కింది. ఎక్కడి దాకా ప్రయాణం అని ఆరా తీయగా.. హాలీడే ఎంజాయ్ చేయడం కోసం మాల్దీవ్స్‌కు వెళ్తున్నట్లు తెలిసింది. మహారాష్ట్రలో కరోనా ఎలాంటి విలయం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోవిడ్ కట్టడి కోసం ముంబైలో జనతా కర్ఫ్యూ విధించినప్పటికి కూడా వీరు విదేశాలకు చెక్కేశారు. ఇక వీరి మాల్దీవుల ట్రిప్పై నెటిజనులు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ‘‘డబ్బులున్న వారికి ఏమైనా చెల్లుతుంది’’ అంటే.. మరి కొందరు మాత్రం ‘‘కాస్త అయిన బాధ్యత ఉండక్కర్లేదా.. ఓ వైపు దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. మీకు టూర్లు కావాల్సి వచ్చిందా’’ అంటూ విమర్శిస్తున్నారు. వీరి ట్రిప్పై వస్తున్న విమర్శలు ఇలా ఉన్నాయి.. ‘‘దేశ ప్రజలు కోవిడ్ మహమ్మారి వల్ల అష్టకష్టాలు పడుతుంటే.. మీరు మాత్రం ఎంజాయ్ చేయడానికి విదేశాలకు వెళ్తారా.. ఇది సబబేనా’’.. ‘‘దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అలియా, రణ్‌బీర్ లాంటి వారు సామాన్యుల వల్లనే కేసులు పెరుగుతున్నాయి అంటారు’’.. ‘‘వీరు ఎంజాయ్ చేయడం కోసం మాల్దీవులు వెళ్తూ.. ఇంట్లోనే ఉండండి అంటూ జనాలకు ఉచిత సలహాలు ఇస్తారు’’ అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘‘మీరు హాలీడే కోసం ఖర్చు చేసే డబ్బు పేదల కోసం వినియోగిస్తే ఎంత బాగుంటుందో ఆలోచించండి’’.. ‘‘మీ పనుల ద్వారా సామాన్యులకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు’’.. ‘‘దేశంలో మహమ్మారి కోరలు చాచింది.. జనాలు చచ్చిపోతున్నారు.. కానీ ఇలాంటి జనాలకు కొంచెం కూడా సిగ్గనిపించడం లేదు’’ అంటూ ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు. మరి కొందరు మాత్రం ‘‘వారి డబ్బు వారి ఇష్టం.. మనం ఇలా విమర్శించడం, ప్రశ్నించడం తగదు’’ అంటున్నారు. ఏది ఏమైనా సెలబ్రిటీలకు ఇలాంటి అనుభవాలు తప్పవు. ఇక అలియా, రణ్‌బీర్ ఇద్దరు అయన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్రహ్మస్త్ర చిత్రంలో నటిస్తున్నారు. ఇదేకాక అలియా గంగుబాయి కతియావాడి, ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నారు. చదవండి: మాల్దీవులకు చెక్కేసిన బాలీవుడ్ ప్రేమజంటలు -
మాల్దీవులకు చెక్కేసిన బాలీవుడ్ ప్రేమజంట
-
మాల్దీవులకు చెక్కేసిన బాలీవుడ్ ప్రేమజంటలు
సినీతారలకు ఏమాత్రం గ్యాప్ దొరికినా ఎంచక్కా ఏదో ఒక దీవిలో వాలిపోతారు. ఇక కరోనా కకావికలం నుంచి తప్పించుకునేందుకు కూడా వారు ఇదే రూట్‌ను ఎంచుకుంటున్నారు. జనసంద్రానికి దూరంగా వ్యక్తిగత జీవితానికి దగ్గరగా ఉండేలా ట్రిప్‌ను ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రేమజంటలు మరోసారి మాల్దీవులు చెక్కేశాయి. మహారాష్ట్రలో జనతా కర్ఫ్యూ అమల్లో ఉండటంతో రణ్‌బీర్ కపూర్- అలియా భట్, టైగర్ ష్రాఫ్- దిశా పటానీలు మాల్దీవులకు వెళ్లారు. యంగ్ హీరోలు రణ్‌బీర్, టైగర్లు తమ నెచ్చెలితో కలిసి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. రణ్‌బీర్ జోడి నేడు(సోమవారం) ఉదయం ముంబై ఎయిర్‌పోర్టు నుంచి పయనమైన పలు ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇక వీళ్ల కన్నా ఒక రోజు ముందే మాల్దీవుల్లో వాలిపోయింది టైగర్ ష్రాఫ్ జోడీ. ఆదివారం నుంచే అక్కడ సేద తీరుతూ ఎంజాయ్ చేస్తోంది. కాగా కరోనా బారిన పడ్డ బాలీవుడ్ ప్రేమ జంట రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ఇటీవలే దాన్ని జయించారు. వైరస్‌ను ఎదుర్కొన్న తర్వాత వారిద్దరూ కలిసి బయటకు వెళ్లడం ఇదే తొలిసారి. ఇదిలా వుంటే పలువురు తారలు సైతం హాలీడే ట్రిప్ ప్లాన్ చేసుకునే పనిలో పడగా మరికొంతమంది ఇప్పటికే సిటీని వీడి నచ్చిన ప్రదేశాలకు వెళ్లిపోయారు. కాగా కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో షూటింగ్‌లు ఆపేయాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో పలు సినిమాలు వాయిదా బాట పడగా పలువురు సెలబ్రిటీలు తిరిగి తమ ఫ్యామిలీకి సమయం కేటాయిస్తున్నారు. చదవండి: ఏంటి? నాకు రోజుకు రూ.16 కోట్లు వస్తాయా?: హీరో -
ఫొటోలు: మాల్దీవుల్లో జాన్వీ సందడి
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఈ మధ్యే రూహీతో ప్రేక్షకులను భయపెట్టిన ఈ హీరోయిన్ తాజాగా తన అందచందాలతో కుర్రకారును కవ్విస్తోంది. ఇటీవలే లాస్ఏంజిల్స్లో చిల్ అయిన ఈ భామ తాజాగా మాల్దీవులకు చెక్కేసింది. అక్కడ సముద్ర తీరాన్ని, అలల సవ్వడిని ఆస్వాదిస్తోంది. ఈ మేరకు పలు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ పిక్స్ చూసిన ఆమె ఫ్యాన్స్ బ్యూటిఫుల్, ఏంజెల్, లవ్లీ.. అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా వుంటే జాన్వీ కపూర్ ‘ధడక్’ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. ఇందులో హీరో ఇషాన్ ఖట్టర్‌తో కలిసి నటించింది. ప్రస్తుతం ఆమె నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తున్న ‘ఘోస్ట్ స్టోరీస్’లో నటిస్తోంది. 'గుడ్ లక్ జెర్రీ', కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్న 'తఖ్త్', ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న 'దోస్తానా 2' ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) చదవండి: లాస్ఏంజిల్స్లో చిల్ అవుతున్న బాలీవుడ్ భామ.. ఖరీదైన ఫోన్ పోగొట్టుకున్న అల్లు అర్జున్! -
మాల్దీవుల్లో టాలీవుడ్ జంటల రచ్చ.. వైరలైన ఫోటోలు
కరోనా లాక్డౌన్ అనంతరం సినీ సెలబ్రిటీలు మాల్దీవుల ట్రిప్‌కి విరివిగా వెళ్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు తమ హాలిడే స్పాట్‌గా మాల్దీవులను ఎంచుకుంటున్నారు. ఫ్రెండ్స్‌తో కలసి వెకేషన్‌కి అయినా..భార్యా భర్తల హనీమూన్‌కైనా, ఫ్యామిలీ వెకేషన్ అయినా ఇప్పుడు ఎవరి నోట విన్నా మాల్దీవ్స్ పేరే వినిపిస్తుంది. అక్కడి ప్రకృతి సౌందర్యం ఆకర్షనీయంగా ఉండడంలో మాల్దీవుల టూర్‌నే ఇష్టపడుతున్నారు.లాక్డౌన్ ఎత్తెయ్యగానే సినీ ప్రపంచం మాల్దీవుల్లో సేదతీరింది. ఇటీవల కాలంలో మాల్దీవుల టూర్‌కి వెళ్లిన టాలీవుడ్ ప్రముఖులెవరో చూద్దాం. మాల్దీవుల్లో బన్నీ ఫ్యామిలీ సందడి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎక్కువగా ఫ్యామిలతో గడపడానికి ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం బన్నీ ‘పుష్ప’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది. విరామం దొరకగానే..కుటుంబసభ్యులతో కలిసి..బన్నీ…మాల్దీవులకు చెక్కేశారు. తన కొడుకు అయాన్ పుట్టిన రోజు సెలబ్రేషన్ కోసం మాల్దీవులు వెళ్లారు. కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేశారు. మజా చేసిన మంచు ఫ్యామిలీ ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ మాల్దీవుల్లో ఎంజాయ్ చేసింది. మోహన్‌బాబు, ఆయన భార్య నిర్మల సహా మంచు లక్ష్మీ తన కూతురు, భర్త ఆండీ శ్రీనివాసస్‌తో కలిసి అక్కడి అందాలను ఆస్వాదిస్తున్నారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత సేదతీరేందుకు, ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు మాల్దీవులకు వెళ్లింది సొట్టబుగ్గల సుందరి తాప్సీ. ఈ సందర్భంగా తాను పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక కొత్తగా పెళ్లి చేసుకున్న కాజల్ తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి మాల్దీవుల్లో హనీమూన్ జరుపుకుంది. నాగార్జున అక్కినేని, అమల దంపతులు మాల్దీవుల్లో ఎంజాయ్ చేశారు. దానికి సంబంధించిన ఫోటోలను అమల తన సోషల్ మీడియాలో అకౌంట్లో పోస్ట్ చేసారు. అక్కడ వీరు చేసిన హంగామానుఅక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేశారు. ఇక లాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవులకు వెళ్లింది. అక్కడ యోగాసనాలు వేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. నాగచైతన్య, సమంత సైతం మాల్దీవుల్లో చక్కర్లు కొట్టి వచ్చారు. చైతూ బర్త్‌డేని అక్కడే జరుపుకున్నారు. ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సింగర్ సునీత..వాలెంటైన్స్‌డే సందర్బంగా తన భర్త రామ్‌తో కలిసి మాల్దీవుల ప్రకృతి సోయగాలను ఎంజాయ్ చేసింది. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు అండ్ ఫ్యామిలీ కూడా మాల్దీవులు వెళ్లి ఎంజాయ్ చేసింది. కృష్ణంరాజు ఆయన సతీమణి శ్యామల దేవి గారితో పాటు అతని కూతుర్లు సాయి ప్రసీద, సాయి ప్రకీర్తి, సాయి ప్రదీప్తి మాల్దీవుల అందాలను వీక్షించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ తన పుట్టినరోజును జరుపుకోవడానికి భర్త కల్యాణ్ దేవ్‌తో కలసి మాల్దీవులు వెళ్లారు. కొన్ని రోజుల పాటు ఈ బర్త్‌డే వీక్‌ను ఎంజాయ్ చేశారు ఈ కపుల్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మాల్దీవుల్లో వాలిపోయిన బాలీవుడ్ డాన్సింగ్ క్వీన్!
సమ్మర్ వెకేషన్ మొదలైందో లేదో బాలీవుడ్ సెలబ్రిటీలు ‘ఛలో మాల్దీవులు’ అంటున్నారు. తాజాగా డ్యాన్సింగ్ క్వీన్ మాధురీ దీక్షిత్ తన భర్త డా.శ్రీరామ్ నానే, ఇద్దరు పిల్లలు ఆరిన్, రెయాన్లతో కలిసి మాల్దీవులకు వెళ్లారు. తమ వినోద, విహారానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇవి నెటిజనులను తెగ ఆకట్టుకుంటున్నాయి. వ్యూ ఆఫ్ ది డే...పేరుతో పడవ ప్రయాణం, చల్లటి తీయటి ఐస్‌క్రీమ్‌తో ఆనందం, క్యాండిల్ లైట్ డిన్నర్.. మొదలైన ఫొటోలు పోస్ట్ చేయడమే కాకుండా తనదైన శైలిలో వాటికి వ్యాఖ్యలు జోడించారు మాధురీ. కుటుంబ సభ్యులతో మాల్దీవులలో మాధురీ దీక్షిత్ మరి శ్రీరామ్ ఏమైనా తక్కువ తిన్నాడా! ఆమెతో దిగిన సెల్ఫీలకు ప్రేమకవిత్వంలాంటి పంక్తులు జోడించాడు. అంతే కాదు తన కాలేజీ రోజుల నాటి ఫొటోకు, కుమారుడి ఫొటో జోడించి ‘ఎవరు వీరు?’ అనే ప్రశ్న వేశాడు. జవాబు కూడా తానే సరదాగా చెప్పాడు... -
మాల్దీవుల్లో అల్లు అర్జున్ కుటుంబం సందడి
కాస్త సమయం దొరికితే చాలు సెలబ్రిటీలు మాల్దీవులు చెక్కేస్తుంటారు. సేద తీరాలన్నా, సెలబ్రేషన్స్ చేసుకోవాలన్నా.. దేనికైనా మాల్దీవులే బెస్ట్ చాయిస్ అంటుంటారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కొడుకు అయాన్ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ కోసం మాల్దీవులు వెళ్లాడు. కుటుంబం అంతటితో కలిసి జాలీగా గడిపాడు. బన్నీ భార్య స్నేహారెడ్డి సైతం అక్కడి ప్రకృతి అందాలను తనివితీరా ఆస్వాదిస్తోంది. ఈ మేరకు తన లేడీ గ్యాంగ్‌తో కలిసి దిగిన పలు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. వీటికి సిస్టర్ స్క్వాడ్ అని క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక బన్నీ చిత్రాల విషయానికొస్తే.. ప్రస్తుతం అతడు పుష్ప సినిమా చేస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది. మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ విలన్‌గా కనిపించనున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 13న ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ నెల 7 సాయంత్రం 6.12 గంటలకు పుష్పరాజ్‌గా బన్నీని ప్రజలకు పరిచయం చేయనున్నట్లు ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. చదవండి: హ్యాపీ బర్త్‌డే మై బేబీ బాబు అయాన్: అర్జున్ 'లోడు దింపతాండాం'.. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు పండుగే