మాల్దీవులో వాలిపోయిన పూజా, స్టన్నింగ్‌ వీడియోలు షేర్‌ చేసిన ‘బుట్టబొమ్మ’ | Pooja Hegde Off To Maldives Tour And Shares Stunning Video | Sakshi
Sakshi News home page

Pooja Hegde: మాల్దీవులో వాలిపోయిన పూజా, స్టన్నింగ్‌ వీడియోలు షేర్‌ చేసిన ‘బుట్టబొమ్మ’

Nov 13 2021 5:28 PM | Updated on Nov 13 2021 9:35 PM

Pooja Hegde Off To Maldives Tour And Shares Stunning Video - Sakshi

పూజా హెగ్డే.. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. వరస హిట్‌లు అందుకంటూ మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా తెలుగులో చక్రం తిప్పుతోంది. ఇటీవల ఆమె నటించిన ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకుంది. ఇక ఆమె నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్‌’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆచార్యలో తన పార్ట్‌ను కంప్టీట్‌ చేసుకున్న నేపథ్యంలో షూటింగ్‌లకు కాస్తా బ్రేక్‌ ఇచ్చిన బుట్ట బొమ్మ ఈ విరామ సమయాన్ని ఆస్వాదించే పనిలో పడింది. ఇందుకోసం ఆమె మాల్దీవుల పర్యటనకు పయనమైంది. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టులో దిగిన ఫొటోలతో పాటు విమానంలో పయనిస్తున్న వీడియోలతో సహా పూజ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

చదవండి: ఆచార్య: ‘నీలాంబరి’ ఫుల్‌ లిరికల్‌ సాంగ్‌ వచ్చేసింది

ఈ సందర్భంగా ఆమె ‘విరామం తీసుకునే సమయం ఇది.. ఆ తర్వాత ఏంటో చూడండి’ అంటూ మాల్దీవుల పేరుతో ఉన్న హ్యాష్‌ ట్యాగ్‌ను జత చేసింది. ఈ క్రమంలో మాల్దీవులు సమీపంకు రాగానే విమానం నుంచి మాల్దీవుల ప్రాంతాన్ని తీసిన స్టన్నింగ్‌ వీడియోను సైతం ఆమె పంచుకుంది. అలాగే అక్కడ ఆమె దిగిన హోటల్‌ రూం వీడియోను కూడా షేర్‌ చేసింది. చూస్తుంటే పుట్ట బొమ్మ ఈ వేకషన్‌ను తను ఎంజాయ్‌ చేయడమే కాకుండా అక్కడ అందమైన ప్రదేశాలను ప్రతి క్షణం పంచుకుంటూ ఫ్యాన్స్‌ను కూడా కనువిందు చేస్తోంది. కాగా పూజ ఈ వెకేషన్‌ తర్వాత తను సంతకం చేసిన పలు తెలుగు,  తమిళ ప్రాజెక్ట్స్‌లో తిరిగి పాల్గొననుందని ఆమె సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement