ఈ ఏడాది సంక్రాంతికి 'నా సామిరంగ' అంటూ వచ్చేశాడు కింగ్ నాగార్జున. నాగార్జున, ఆషిక రంగనాథ్ జంటగా నటించిన ఈ చిత్రానికి విజయ్ బిన్నీ దర్శకత్వం వహించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలైంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కింగ్ నాగార్జున్ మాల్దీవుస్ అంశంపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. అదేంటో తెలుసుకుందాం. కాగా.. ఇప్పటికే సంక్రాంతి బరిలో నిలిచిన గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్ చిత్రాలు రిలీజైన సంగతి తెలిసిందే.
(ఇది చదవండి: కిష్టయ్య వస్తున్నాడు... బాక్సాఫీస్ బద్దలు కొడుతున్నాడు: నాగార్జున)
నాగార్జున మాట్లాడుతూ..'అటు బిగ్‌బాస్‌తో పాటు సినిమాలతో ఫుల్ బిజీగా 75 రోజుల పాటు షూటింగ్‌తో ఉన్నా. ఫెస్టివల్ తర్వాత 17,18 తేదీల్లో మాల్దీవుస్ వెళ్దామని టికెట్స్ బుక్ చేసుకున్నా. నాకు బాగా ఇష్టమైన ప్లేస్. కానీ మన ప్రధాని మోదీపై వాళ్లు చేసిన కామెంట్స్‌ను చూసి నేను టికెట్స్ క్యాన్సిల్ చేశా. అంతే కానీ.. నేను భయంతో టికెట్స్ రద్దు చేసుకోలేదు. వాళ్లు చేసింది కరెక్ట్ కాదు. ఇన్ని కోట్ల మంది ప్రజలకు లీడర్‌గా ఉన్నా మన ప్రధాని పట్ల వారు వ్యవహరించిన తీరు సరైంది కాదు. ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. మన ఇప్పటి నుంచి లక్షద్వీప్‌లోని బంగారం ఐల్యాండ్స్‌కు వెళ్దాం' అంటూ నవ్వుతూ అన్నారు. కాగా.. నా సామిరంగ అల్లరి నరేశ్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్ , రుక్సార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతమందించారు.
Comments
Please login to add a commentAdd a comment