Prime Minister
-
Nehru Birthday: ఆ హత్యాయత్నాల నుంచి నెహ్రూ తప్పించుకున్నారిలా..
న్యూఢిల్లీ: భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1889, నవంబరు 14న జన్మించారు. నెహ్రూ దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆయన 1947 ఆగస్టు 15 నుంచి 1964 మే 27 వరకు దేశ ప్రధానిగా ఉన్నారు. స్వాతంత్య్రోద్యమంలో నెహ్రూ పలుమార్లు జైలుకు వెళ్లారు. నెహ్రూ ప్రధానిగా ఉండగా ఆయనపై పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయి. వాటినుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు.జవహర్లాల్ నెహ్రూపై మొదటి హత్యాయత్నం 1947లో జరిగింది. ఆ సమయంలో నెహ్రూ దేశ తాత్కాలిక ప్రభుత్వానికి అధ్యక్షునిగా ఉన్నారు. నెహ్రూ నార్త్-వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్‌లో కారులో ప్రయాణిస్తుండగా ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఈ ప్రాంతం నేటి పాకిస్థాన్‌లో ఉంది. 1948 జూలైలో నెహ్రూపై రెండవసారి హత్యాయత్నం జరిగినట్లు వార్తలు వచ్చాయి. నెహ్రూను హత్య చేయాలనే ఉద్దేశ్యంతో ఢిల్లీకి వెళ్తున్న ముగ్గురిని బీహార్‌లోని ధర్మశాలలో పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రెండు పిస్టల్స్, రెండు రివాల్వర్లు, రైఫిల్, కంట్రీ మేడ్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో వీరి కుట్ర బయటపడింది.1953లో కూడా నెహ్రూపై హత్యాయత్నం జరిగింది. నాటి నివేదికల ప్రకారం నెహ్రూ ప్రయాణిస్తున్న బొంబాయి-అమృతసర్ ఎక్స్‌ప్రెస్ రైలును పేల్చివేసేందుకు కొందరు కుట్ర పన్నారు. అయితే కళ్యాణ్‌లోని రైల్వే పట్టాల దగ్గర కూర్చున్న ఇద్దరిని పోలీసులు పట్టుకోవడంతో ఈ కుట్ర విఫలమైంది.1955లో నెహ్రూపై ఒక రిక్షా పుల్లర్ కత్తితో దాడి చేశాడు. నాటి వార్తాపత్రికల నివేదికల ప్రకారం 32 ఏళ్ల రిక్షా పుల్లర్ నుంచి పోలీసులు ఆరు అంగుళాల కత్తిని స్వాధీనం చేసుకున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి నెహ్రూ కారుపైకి దూకాడు. దీనిని గమనించిన నెహ్రూ అతనిని కిందకు నెట్టివేశారు. 1955లో నెహ్రూ ముంబైలోని ఒక వేదికపై ప్రసంగిస్తుండగా వందలాది మంది రాళ్లతో దాడికి ప్లాన్ చేశారని నాడు పోలీసులు తెలిపారు. ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.ఇది కూడా చదవండి: 15న మరో రికార్డుకు సిద్ధమవుతున్న అయోధ్య -
దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. కచ్ బోర్డర్లో జవాన్లతో కలిసి ప్రధాని మోదీ వేడుకలు
-
'మీ లేఖ నాలో ధైర్యాన్ని నింపింది'.. ప్రధానికి హీరో రిప్లై!
కన్నడ హీరో కిచ్చా సుదీప్ పీఎంవో నుంచి వచ్చిన లేఖపై స్పందించారు. ఇలాంటి కష్ట సమయంలో అండగా నిలిచినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. మీ లేఖ నాలో ధైర్యాన్ని నింపిందని కిచ్చా సుదీప్ ట్విటర్ ద్వారా పోస్ట్ చేశారు.కాగా ఇటీవల కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ మాతృమూర్తి సరోజా సంజీవ్ (86) కన్నుమూసింది. అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆమె తుదిశ్వాస విడిచింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆమె మరణం పట్ల సంతాపం తెలిపారు. ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ పీఎంవో నుంచి లేఖ కూడా వచ్చింది. తాజాగా ఆ లేఖకు హీరో సుదీప్ రిప్లై ఇచ్చారు. Honarable @PMOIndia @narendramodi ji, I am writing to sincerely thank you for this compassionate condolence letter. Your thoughtful words provide a source of comfort during this profoundly difficult time.Your empathy has touched my heart deeply, and I am truly grateful for your… pic.twitter.com/u4aeRF8Sw3— Kichcha Sudeepa (@KicchaSudeep) October 28, 2024 -
నన్ను చంపాలని చూస్తున్నారు.. భద్రత పెంచండి
సాక్షి, న్యూఢిల్లీ: తనను కొందరు చంపాలని చూస్తున్నారని, భద్రత పెంచాలంటూ ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా లకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీ, సహా మోదీ కూడా తనకు శత్రువులే అని పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘నన్ను చంపితే స్వర్గానికి పోతా..మీరు (చంపాలనుకున్నవారు) చస్తే నరకానికి పోతారు’అంటూ వ్యాఖ్యానించారు. పలు విషయాలపై తాను కేసులు వేస్తూ పోరాడుతున్నానని, ఎన్నో కేసుల్లో స్టే లు తీసుకువస్తున్నానని తెలిపారు. చంద్రబాబు, పవన్ సహా.. బీజేపీ,ఆర్ఎస్ఎస్, తీవ్రవాదుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయని తెలిపారు. పాలన చేతకాకపోతే సీఎం పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని కేఏపాల్ డిమాండ్ చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వేలాది మంది గ్రూప్–1 అభ్యర్థులపై పోలీ సులు దాడులు చేయడం అమానుషమన్నారు. -
‘పరమ్ రుద్ర’ సూపర్ కంప్యూటర్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: నేషనల్ కంప్యూటింగ్ మిషన్ ద్వారా దేశీయంగా అభివృద్ధి చేసిన మూడు సూపర్ కంప్యూటర్లను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఆవిష్కరించారు. శాస్త్రీయ పరిశోధనలను సులభతరం చేసేందుకు రూ.130 కోట్లతో పుణె, ఢిల్లీ, కోల్‌కతాలో ఏర్పాటు చేసిన ‘పరమ్ రుద్ర’ సూపర్ కంప్యూటర్లను ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. అలాగే వాతావరణ పరిశోధనల కోసం రూ.850 కోట్లతో రూపొందించిన హై-పెర్ఫామెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్‌ను సైతం ప్రధాని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. శాస్త్ర సాంకేతిక అభివృద్దిలో భారత్ కొత్తపుంతలు తొక్కుతుందని తెలిపారు. ఈ రోజును శాస్త్ర, సాంకేతిక రంగంలో చాలా గొప్ప విజయాలు సాధించిన రోజుగా అభివర్ణించారు. సాంకేతికత, కంప్యూటింగ్ సామర్థ్యంపై ఆధారపడని రంగం ఏదీ లేదని ప్రధాని మోదీ అన్నారు. ఈ విప్లవంలో మన వాటా బిట్లు, బైట్లలో కాకుండా టెరాబైట్లు, పెటాబైట్లలో ఉండాలని తెలిపారు. మనం సరైన వేగంతో సరైన దిశలో పయనిస్తున్నామని ఈ ఘనత నిరూపిస్తోందని పేర్కొన్నారు.With Param Rudra Supercomputers and HPC system, India takes significant step towards self-reliance in computing and driving innovation in science and tech. https://t.co/ZUlM5EA3yw— Narendra Modi (@narendramodi) September 26, 2024 ‘2015లో జాతీయ సూపర్కంప్యూటింగ్ మిషన్‌ను ప్రారంభించాం. ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీ ముందంజలో ఉంది. ఇది ఐటీ, తయారీ, ఎమ్ఎస్ఎమ్ఈలు, స్టార్టప్‌లను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.టెక్నాలజీలో పరిశోధనలు సామాన్యులకు ఉపయోగపడేలా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దేశం పెద్ద విజన్ కలిగి ఉంటేనే ఉన్నత విజయాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగలదు. పేదలకు సాధికారత కల్పించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచాలి’ అని పేర్కొన్నారు. -
Harini Amarasuriya: శ్రీలంక ప్రధాని హరిణి.. హక్కుల చుక్కాని!
శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా హరిణి అమరసూర్య. ప్రధాని కావడానికి ముందు పార్లమెంట్ సభ్యురాలు. ఎంపీ కావడానికి ముందు లెక్చరర్. లెక్చరర్‌కు ముందు, లెక్చరర్ అయిన తరువాత స్త్రీవాదం, నిరుద్యోగం, లింగ వివక్ష... ఇలా ఎన్నో సామాజిక అంశాలపై హక్కుల కార్యకర్తగా తన గొంతును బలంగా వినిపించింది. సమస్యలు తెలిసిన... సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి ప్రధాని అయితే ఆ పాలన దేశ సామాజిక, ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని చరిత్ర నిరూపించింది. ‘ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రయాణంతో శ్రీలంకలో మరో చరిత్ర మొదలుకానుంది’ అనే ఆశారేఖలు వెల్లివిరుస్తున్నాయి...కొలంబోలో పుట్టి పెరిగిన హరిణి అమరసూర్య హిందూ కాలేజ్, దిల్లీ యూనివర్శిటీలో బి.ఎ, సిడ్నీలోని మక్వరీ యూనివర్శిటీలో ఆంత్రోపాలజీ అండ్ డెవలప్మెంట్లో ఎం.ఎ, ఎడిన్‌బరో యూనివర్శిటీలో సోషల్ ఆంత్రోపాలజీలో పీహెచ్డీ చేసింది. యూత్, పాలిటిక్స్, యాక్టివిజం, జెండర్, డెవలప్మెంట్, శిశు సంరక్షణ, గ్లోబలైజేషన్ అండ్ డెవలప్మెంట్... ఇలా ఎన్నో అంశాలపై లోతైన పరిశోధన చేసింది. పుస్తకాలు రాసింది. డిగ్రీ తరువాత శ్రీలంకలోని మెంటల్ హెల్త్ ఆర్గనైజేషన్ ‘నెస్ట్’తో కలిసి పనిచేసింది హరిణి. ‘నెస్ట్’ వ్యవస్థాపకురాలైన సాలీ హులుగల్లే అట్టడుగు, అణగారిన వర్గాల కోసం పనిచేసింది. ‘నెస్ట్’ ద్వారా ఎంతో మార్పు తీసుకురాగలిగింది. ఆమె ప్రభావంతో మానసిక వైద్యశాలలలో ఎంతోకాలంగా దిక్కుమొక్కు లేకుండా పడి ఉన్న దీనులు, ఎవరూ పట్టించుకోని హెచ్ఐవీ బాధితులు, అనాథ పిల్లలతో కలిసి పనిచేసింది హరిణి.చైల్డ్ ప్రొటెక్షన్, సైకలాజికల్ ప్రాక్టీషనర్‌గా ఎన్నో సంవత్సరాలు పని చేసిన తరువాత శ్రీలంక ఓపెన్ యూనివర్శిటీలో లెక్చరర్‌గా చేరింది. యాక్టివిస్ట్‌గా ఉచిత విద్య కోసం ఎన్నో ఉద్యమాలు చేసింది. ‘ఫెడరేషన్ ఆఫ్ యూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్’ సభ్యురాలైన హరిణి లింగసమానత్వం నుంచి జంతుసంక్షేమం వరకు ఎన్నో అంశాలపై తన గళాన్ని వినిపించింది.ఇక రాజకీయాల విషయానికి వస్తే... 2019లో ‘నేషనల్ ఇంటలెక్చువల్ ఆర్గనైజేషన్’లో చేరిన హరిణి శ్రీలంక అధ్యక్ష ఎన్నికల సమయంలో నేషనల్ పీపుల్స్ పవర్(ఎన్పీపీ) అభ్యర్థి అనురా కుమార దిస్సానాయకే తరఫున ప్రచారం చేసింది. 2020 శ్రీలంక పార్లమెంటరీ ఎన్నికల తరువాత ఎంపీగా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టింది. ఎంపీగా తన రాజకీయ జీవితాన్ని కొనసాగించడానికి లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేసింది. అత్యున్నత పదవి విషయంలో ‘సరిౖయెన వ్యక్తి’ అనే ప్రశంస చాలా తక్కువమందికి లభిస్తుంది. ఇలాంటి వారిలో 54 సంవత్సరాల హరిణి అమరసూర్య ఒకరు. ‘ప్రధానిగా ఆమె సరిౖయెన వ్యక్తి’ అనేది ఇప్పుడు చాలామంది నోట వినిపిస్తున్న మాట.సమాజం అనే పుస్తకాన్ని చదివి..హరిణికి ఆంగ్ల సాహిత్యం అంటే చాలా ఇష్టం. ‘ఇంగ్లీష్ సాహిత్యాన్ని అధ్యయనం చేయాలని ఉంది’ అంటూ నాన్న స్నేహితుడైన మాజీ దౌత్యవేత్త దగ్గర తన మనసులో మాట బయటపెట్టింది. మొదట ఆయన ఎగతాళిగా నవ్వినా ఆ తరువాత మాత్రం ఆంగ్ల సాహిత్యంలోని ఎంతో మంది దిగ్గజ రచయితలను పరిచయం చేశాడు. వారి రచనలు చదువుతుంటే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లుగా అనిపించింది. ‘ఆంగ్ల సాహిత్యంలోకి అడుగు పెట్టిన తరువాత నా చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మొదలైంది. ఆ తరువాత కాలంలో సాహిత్య అధ్యయనం కంటే నా చుట్టూ ఉన్న సమాజాన్ని లోతుగా అధ్యయనం చేయాలనిపించింది’ అంటుంది హరిణి. పుస్తక ప్రపంచంలో కంటే సామాజిక ప్రపంచంలోనే ఆమెకు ఎక్కువ విషయాలు తెలిసాయి. నిరుద్యోగం నుంచి లింగ వివక్ష వరకు ఎన్నో సమస్యలను ప్రత్యక్షంగా చూసింది. ఆమె ఉద్యమకారిణిగా ప్రయాణంప్రారంభించడానికి, ఆ తరువాత రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి ‘సమాజం’ అనే పుస్తకం ఎంతో ఉపయోగపడింది.అవును... ఆమె దిల్లీ స్టూడెంట్!‘హిందూ కళాశాల పూర్వ విద్యార్థి అయిన హరిణి శ్రీలంక ప్రధాని కావడం మా కళాశాలకు గౌరవంగా భావిస్తున్నాను. ఆమె విజయం పట్ల మేము గర్వపడుతున్నాం. హరిణి సాధించిన విజయం మా కళాశాల చరిత్రలో మరో మైలురాయి. హిందూ కళాశాలలో హరిణి గడిపిన కాలం ఆమె నాయకత్వానికి మార్గనిర్దేశం చేయడంలో సహాయపడుతుందని ఆశిస్తున్నాను’ అన్నారు ఆ కళాశాల ప్రిన్సిపాల్ అంజు శ్రీవాస్తవ. హరిణి హిందూ కాలేజీలో 1991 నుండి 1994 వరకు చదివింది. బాలీవుడ్ దర్శకుడు నళిన్ రాజన్సింగ్ హిందూ కాలేజీలో హరిణి బ్యాచ్ మేట్.‘కాలేజీ ఉత్సవాలు, చర్చలలో హరిణి చురుగ్గా పాల్గొనేది. ఆమె ప్రధాని స్థాయికి ఎదగడం గర్వంగా ఉంది’ అంటున్నాడు నళిన్ రాజన్సింగ్.ఇవి చదవండి: మహిళల ప్రపంచకప్ టికెట్ల విక్రయం షురూ -
యుద్ధక్షేత్రం పరిష్కారం కాదు. ఐరాస సదస్సులో మోదీ వ్యాఖ్యలు
-
‘ప్రపంచ డిమాండ్‌ను తీర్చే భారత్’
భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడే సెమీకండక్టర్ల డిమాండ్‌ను భారత్ తీరుస్తుందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ఈ విభాగంలో భారత్‌లో పెట్టుబడి పెట్టే విదేశీ కంపెనీలకు ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో మార్ట్‌లో జరిగిన ‘సెమీకాన్ ఇండియా 2024’ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.‘సమీప భవిష్యత్తులో భారత కంపెనీలకు సెమీకండక్టర్ల కొరత తీరనుంది. రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వీటికి ఏర్పడే డిమాండ్ భర్తీ చేసే సత్తా భారత్‌కు ఉంది. విదేశీ కంపెనీలు భారత్‌లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావాలి. ఈ రంగంలో ఇన్వెస్ట్ చేసే కంపెనీలకు ప్రభుత్వం ఇన్ని విధాలా సహకరిస్తుంది. దేశవ్యాప్తంగా సెమీకండక్టర్ల తయారీ విభాగంలో దాదాపు 85,000 మంది ఇంజినీర్లు, టెక్నీషియన్లు, ఆర్ అండ్ డీ నిపుణులు పనిచేసేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. చిప్‌ల తయారీకి అవసరమయ్యే మౌలిక సదుపాయాలు కల్పించడంపై దృష్టి పెడుతున్నాం. ఈ రంగాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. దేశంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) పెరుగుతోంది. భవిష్యత్తులో ఇది మరింత ఎక్కువవుతుంది’ అని ప్రధాని మోదీ తెలిపారు.సెమీకండక్టర్ తయారీలో దేశాన్ని గ్లోబల్ హబ్‌గా మర్చే లక్ష్యంతో ‘సెమీకాన్ ఇండియా 2024’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఈవెంట్‌ను 13వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గ్లోబల్ సెమీకండక్టర్ తయారీ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొని వారి ఆవిష్కరణల గురించి తెలియజేస్తారు. దాంతో స్థానికంగా చిప్‌ల తయారీకి మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ సదస్సులో 250 మందికి పైగా వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని అంచనా.భారత సెమీకండక్టర్ మార్కెట్ ప్రస్తుతం సుమారు 23.2 బిలియన్ డాలర్ల(రూ.1.93 లక్షల కోట్లు) విలువను కలిగి ఉంది. 2028 నాటికి ఇది దాదాపు రూ.6 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. ఈ విభాగం 17.10% వార్షిక వృద్ధి రేటు నమోదు చేస్తుందని ఇన్వెస్ట్ ఇండియా సంస్థ నివేదించింది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) రెండో దశలో భాగంగా సెమీకండక్టర్ తయారీ యూనిట్లకు ఆర్థిక ప్రోత్సాహకాలు కొనసాగించాలని కేంద్రం యోచిస్తోంది. దాంతోపాటు కాంపౌండ్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్, సిలికాన్ ఫోటోనిక్స్‌లో ప్రత్యేకత కలిగిన మరిన్ని కంపెనీలను ఆకర్షించడంపై దృష్టి సారిస్తోంది.ఇదీ చదవండి: ఈయూ కోర్టులో గూగుల్‌కు చుక్కెదురు!దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దానివల్ల ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాడే సెమీకండక్టర్లకు గిరాకీ ఏర్పడింది. స్థానికంగా ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీలు సెమీకండక్టర్ల దిగుమతిపై ఆధారపడుతున్నాయి. అందుకు భిన్నంగా స్థానికంగా వీటిని అభివృద్ధి చేసి వినియోగించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం)ను డిసెంబర్ 2021లో ప్రతిపాదించింది. మొదటి దశలో భాగంగా ఔట్సోర్స్డ్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్(ఓఎస్ఏటీ)తోపాటు అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్(ఏపీఎంపీ) కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించింది. మరికొన్ని నెలల్లో ఈ కంపెనీలు సెమీకండక్టర్ల ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఐదు కంపెనీలకు వీటి తయారీ కోసం కేంద్రం అనుమతులు జారీ చేసింది. అందులో టాటా ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ ఫ్యాబ్, మైక్రాన్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్, టాటా ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్, సీజీ పవర్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్, కేన్స్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్ కంపెనీలున్నాయి. -
హోటల్ వ్యాపారం నుంచి ఏకంగా దేశ ప్రధాని స్థాయికి..!
హోటల్ వ్యాపారాన్ని నిర్వహిస్తూ అంచలంచెలుగా ఎదుగుతూ దేశ ప్రధానిగా అత్యున్నత పదవిని అలకరించింది. అంతేగాదు జస్ట్ 37 ఏళ్లకే ప్రధాని అయిన మహిళగా చరిత్ర సృష్టించింది కూడా. ఎవరామె? ఆమె సక్సెస్ జర్నీ ఏంటంటే..ఆమె పేరు పేటోంగ్టార్న్ షినవత్రా. అతి పిన్న వయస్కురాలైన థాయి రెండో ప్రధానిగా చరిత్ర సృష్టించింది. గత ప్రధాని స్రెట్టా థావిసిన్ నైతిక ఉల్లంఘనలపై పదవీచ్యతుడు కావడంతో థాయ్ మాజీ ప్రధాని తక్సిన్ షినవత్రా కుమార్తె కొత్త ప్రధానిగా నామినేట్ అయ్యారు. ఆమె రాజకీయాల్లోకి రావడానికి ముందు తమ కుటుంబ హోటల్ని విజయవంతంగా నిర్వహించారు. ఆ తర్వాత ఫ్యూ థాయ్ ఇన్‌క్లూజన్ అండ్ ఇన్నోవేషన్ అడ్వైజరీ కమిటీ చీఫ్‌గా 2021లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఉంగ్ ఇంగ్ అనే మారుపేరుతో పిలువబడే షినవత్రా తన కుటుంబంలో ఇలాంటి అత్యున్నత పదవిని అలకరించిన మూడొవ కుటుంబ సభ్యుడు. అంతేగాదు ఆమె పార్టీ, దాని మిత్రపక్షాలు 493 సీట్లలో 319 కైవసం చేసుకోవడంతో పార్లమెంటులో భారీ విజయం సాధించారు. ఆమె 2023లో కూడా ప్రధాని మంత్రి పదవికి పోటీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ప్రజా రవాణా ఛార్జీలను తగ్గించడం, ఆరోగ్య సంరక్షణ కవరేజీని విస్తరింపజేయడం , కనీస రోజువారీ వేతనాన్ని రెట్టింపు చేస్తాం వంటి హామీలు ఇచ్చింది. అంతేగాదు తన తండ్రి పాలనలో అనుసరించిన విధానాలకు కొన్ని మార్పులు తీసుకురావాలనే దృక్పథంతో పనిచేయాలనుకుంటోంది షినవత్రా. ఆమె రిలాక్స్డ్ వ్యయ విధానాలతో వృద్ధిని పెంచి దేశ ఆర్థిక సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయనున్నట్లు తెలిపింది. ఇక ఆమె వాణిజ్య పైలట్ అయిన పిడోక్ సూక్సావాస్ను వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతేడాది ఎన్నికల సమయంలో ప్రచారం చేస్తున్నప్పుడే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక్కడ షినవత్రా అంకితభావంతో తన కుటుంబ వ్యాపారాన్ని లాభాల బాట పట్టించడమే కాకుండా దేశ ఆర్థిక విధానాల్లో మార్పులు రావాలన్నా ఆకాంక్ష ఆమెను ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేసింది. ఆ క్రమంలో కెరీర్‌పరంగా, వ్యక్తిగతంగా పలు సవాళ్లను ఎదుర్కొని విజయం సాధించి, ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.(చదవండి: హార్ట్ బైపాస్ సర్జరీ: రికవరీ కోసం తీసుకోవాల్సిన డైట్ ఇదే..!) -
భారత్‌కు మలేషియా ప్రధాని.. పీఎం మోదీతో భేటీ
భారత్- మలేషియాల దౌత్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యేదిశగా మరో ముందడుగు పడబోతోంది. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ప్రధాని మోదీతో భేటీకానున్నారు. మూడు రోజుల భారత్ పర్యటన నిమిత్తం మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం న్యూఢిల్లీ చేరుకున్నారు.ప్రధాని హోదాలో ఆయన భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ప్రధాని నరేంద్ర మోదీ నేడు (మంగళవారం) మలేషియా ప్రధానితో విస్తృత చర్చలు జరపనున్నారు. అనంతరం భారతీయ కార్మికుల రిక్రూట్మెంట్తో సహా పలు ఒప్పందాలపై ఇరుపక్షాలు సంతకాలు చేయనున్నాయి. భారతదేశం నుండి మలేషియాకు అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణా అనేవి ఇరు దేశాల్లో ఆందోళనకు కారణంగా నిలుస్తున్నాయి. ఈ నేపధ్యంలో భారత కార్మికుల నియామకంపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరనుంది.మలేషియాలో నివసిస్తున్న వివాదాస్పద ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్‌ను అప్పగించే అంశంపై కూడా ప్రధానితో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ప్రస్తావనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో మలేషియా మాజీ ప్రధాని మహతీర్ మహ్మద్‌తో భారత్ ఈ అంశాన్ని లేవనెత్తింది. అయితే దీనిపై ఎటువంటి పురోగతి కానరాలేదు. ఆర్థిక మోసం కేసులో నాయక్ భారత్‌లో వాంటెడ్ గా ఉన్నాడు. మలేషియా ప్రధాని ఇబ్రహీం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా సమావేశం కానున్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మలేషియా ప్రధానిని కలుసుకున్నారు. #WATCH | Prime Minister of Malaysia Dato’ Seri Anwar bin Ibrahim arrives in New Delhi on a three-day state visit to India He was received by MoS V Somanna pic.twitter.com/rfXPn48Zph— ANI (@ANI) August 19, 2024 -
పోలాండ్, ఉక్రెయిన్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ.. ఎప్పుడంటే!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగష్టు 21 పోలాండ్‌లో పర్యటించనున్నారు. ఆగష్టు 23న యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యదర్శి తన్మయలాల్ సోమవారం ప్రకటించారు.కాగా భారత ప్రధాని పోలాండ్‌లో పర్యటించడం గత 45 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలపై నేతలు చర్చించనున్నారు. మరోవైపు రష్యాతో వివాదం తర్వాత ఉక్రెయిన్‌లో ప్రధాని తొలి పర్యటన ఇది. గత 30 ఏళ్లలోనూ భారత ప్రధాని ఉక్రెయిన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి మాస్కోలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయిన నెల రోజుల తర్వాత మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు.2022లో ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత పాశ్చాత్య రాజధానులు మాస్కోపై ఆంక్షలు విధించారు. అయితే భారతదేశం వంటి స్నేహపూర్వక దేశాలు దానితో వాణిజ్యాన్ని కొనసాగిస్తున్నాయి. -
Independence Day 2024: ఎర్రకోటపై జెండా ఎగురవేయని ఇద్దరు ప్రధానులు
అది 1947.. ఆగస్టు 15.. భారతదేశం బ్రిటీషర్ల బానిసత్వం నుంచి విముక్తి పొందింది. 200 ఏళ్లుగా బ్రిటిష్ పాలనకు చిహ్నంగా ఉన్న యూనియన్ జాక్ జెండా అవనతం అయ్యింది. భారత జాతీయ జెండా రెపరెపలాడింది. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తొలిసారిగా స్వతంత్ర భారతదేశపు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.ప్రతి సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవాన భారత ప్రధాని ఎర్రకోట ప్రాకారాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. ఇక్కడి నుంచి అత్యధికంగా 17 సార్లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన రికార్డు జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉంది. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 11వ సారి ప్రధానిగా ఎర్రకోటపై జెండా ఎగురవేయనున్నారు.అయితే స్వతంత్ర భారతంలో ఇద్దరు ప్రధానులు తమ హయాంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయలేకపోయారు. మాజీ ప్రధానలు గుల్జారీలాల్ నందా, చంద్రశేఖర్ ఈ జాబితాలో ఉన్నారు. గుల్జారీలాల్ నందా 13 రోజుల చొప్పున రెండుసార్లు ప్రధాని అయ్యారు.1964 మే 27 నుండి జూన్ 9 వరకు మొదటిసారి, 1966 జనవరి 11 నుండి జనవరి 24 వరకు రెండవసారి తాత్కాలిక ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇక మాజీ ప్రధాని చంద్రశేఖర్ విషయానికొస్తే ఆయన 1990 నవంబర్ 10 నుండి 1991, జూన్ 21 వరకు 8 నెలల పాటు ప్రధానిగా ఉన్నారు. ఆగస్టు 15వ తేదీ వీరిద్దరి పాలనా కాలాలలో రాకపోవడంతో వీరికి ఎర్రకోటపై నుంచి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే అవకాశం దక్కలేదు. -
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా
-
కోట్లకు పడగలెత్తిన బంగ్లాదేశ్ ప్రధాని ఇంటి సేవకుడు
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భవనంలో గతంలో పనిచేసిన సేవకునికి బాగోతం సంచలనంగా మారింది. ఆ సేవకుని ఆస్తుల విలువ దాదాపు రూ.284 కోట్లని ఢాకా ట్రిబ్యూన్ పేర్కొంది. గతంలో ఆ సేవకుడు ప్రధాని హసీనా భవనానికి వచ్చే అతిథులకు నీరు, టీ, స్నాక్స్ అందించేవాడని సమాచారం.ఢాకా ట్రిబ్యూన్ తెలియజేసిన వివరాల ప్రకారం ఆ సేవకుడని పేరు జహంగీర్ ఆలం. ఆయనపై అనేక అవినీతి కేసులు ఉన్నాయి. పీఎం షేక్ హసీనా కార్యాలయంతోపాటు ఆమె ఇంట్లో పనిచేసే సమయంలో ఆయన పలువురి నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. వివిధ పనులు ఇప్పిస్తానంటూ చాలామంది నుంచి భారీగా డబ్బులు వసూలు చేసేవాడని సమాచారం. ఆ సేవకుడు ప్రైవేట్ హెలికాప్టర్లో ప్రయాణాలు సాగించేవాడని తెలుస్తోంది. ఈ ఉదంతం వెలుగులోకి రావడంతో పీఎం హసీనా వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా జహంగీర్ అమెరికాకు వెళ్లపోయాడని తెలుస్తోంది.బంగ్లాదేశ్‌కు చెందిన మాజీ ఆర్మీ చీఫ్, పోలీసు అధికారి, పన్ను విభాగపు అధికారి, పలువురు ప్రభుత్వ ఉద్యోగుల అవినీతికి సంబంధించిన కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపధ్యంలో ప్రధాని షేక్ హసీనా ఇంటిలో పనిచేసిన మాజీ సేవకుని బాగోతం కూడా బయట పడింది. కాగా ప్రధాని షేక్ హసీనాకు కోట్లకు పడగలెత్తిన సేవకుని గురించి తెలియగానే ఆశ్చర్యపోయారు. ఒక సాధారణ బంగ్లాదేశీయుడు ఇంత సంపదను కూడబెట్టడానికి చాలా ఏళ్లు పడుతుందని, అతని విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, దర్యాప్తు చేస్తున్నదని తెలిపారు. ప్రపంచ బ్యాంకు వెల్లడించిన వివరాల ప్రకారం 17 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్‌లో తలసరి ఆదాయం రూ. 2.11 లక్షలుగా ఉంది.ఈ ఉదంతంపై బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)అధికార ప్రతినిధి వహిదుజ్జామాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని ఇంటిలోని పనివానికే భారీ ఆస్తులు ఉన్నప్పుడు యజమాని ఆస్తి ఎంతో ఊహించలేమని వ్యాఖ్యానించారు. ఆ సేవకుడిని ఇంకా అరెస్టు చేయలేయకపోవడం శోచనీయమన్నారు. మరోవైపు బంగ్లాదేశ్ మాజీ ఆర్మీ చీఫ్ అజీజ్ అహ్మద్‌పై కూడా అవినీతి ఆరోపణలు రాగా, సంబంధిత అధికారులు అజీజ్‌కు ఆస్తులను జప్తు చేశారు. అతని బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. -
విశ్వాస పరీక్షలో ఓడిన నేపాల్ ప్రధాని ‘ప్రచండ’
ఖాఠ్మాండూ: నేపాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శుక్రవారం పార్లమెంట్లో ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ ఓడిపోయారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ (CPN-UML) ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకోవడంతో 'ప్రచండ' విశ్వాస తీర్మానాన్ని కోల్పోయారు.275 మంది సభ్యులు కలిగిన పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం నుంచి గట్టేకాలంటే 138 ఓట్ల మెజార్టీ అవసరం. విశాస తీర్మానంలో ప్రచండకు 63 ఓట్లు రాగా. తీర్మానానికి వ్యతిరేకంగా 194 ఓట్లు పడ్డాయి. మాజీ ప్రధాని కేపీ.శర్మ ఓలి నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రస్తుత ప్రభుత్వం కూలిపోయినట్లయ్యింది.కాగా డిసెంబర్ 25, 2022న నేపాల్ ప్రధానిగా ప్రచండ బాధ్యతలు స్వీకరించారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఆయన నాలుగు అవిశాస్వ తీర్మానాలను ఎదుర్కొన్నారు. మూడింట్లో గెట్టకగా.. చివరిదైనా నాలుగో దాంట్లో ఓడిపోయారు.అయితే మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని సిపిఎన్-యుఎంఎల్ గత వారం సభలో అతిపెద్ద పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్‌తో అధికార భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో ప్రచండ నేతృత్వంలోని ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంది. ఈ క్రమంలో ఓలీని తదుపరి ప్రధాన ఓలీని తదుపరి ప్రధానమంత్రిగా ఆమోదించారు. ఇక పార్లమెంట్లో నేపాలీ కాంగ్రెస్‌కు 89 సీట్లు ఉండగా, CPN-UMLకి 78 సీట్లు ఉన్నాయి. దిగువ సభలో మెజారిటీకి అవసరమైన 138 కంటే వారి ఉమ్మడి బలం (167) ఎక్కువగా ఉంది. -
Video: 14 ఏళ్లు ప్రధానిగా సేవలు.. ఓటమి తర్వాత సైకిల్‌పై ఇంటికి!
జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎంత ఆస్తి సంపాదించినా, ఎన్ని మంచి పనులు చేసినా.. గర్వం, అహంకారం దరిచేరకుండా నిరాడంబరంగా ఉండాలనేది దీని సారంశం. కొందరికి డబ్బు, అధికారం అందగానే గొప్పగా జీవిస్తుంటారు.. కానీ మరికొందరు తాము ఎంత పెద్ద స్థాయిలో ఉన్న సింపుల్‌గానే జీవిస్తుంటారు. అందుకు నిదర్శనంగా నిలిచారు. డచ్ ప్రధాని మార్క్ రుట్టే..ఇటీవల జరిగిన నెదర్లాండ్స్ ప్రధానమంత్రిగా 14 ఏళ్లు సేవలందించిన మార్క్ రుట్టే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే కొత్త పీఎంగా ఎన్నికైన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ డిక్ షూఫ్‌కు అధికారికంగా బాధ్యతలు అప్పగించి రుట్టే సాధారణ పౌరుడిగా సైకిల్ తొక్కుంటూ వెళ్లిపోయారు.రుట్టే సైకిల్‌పై వెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఆయన సైకిల్‌పై అధ్యక్ష భవనం నుంచి బయటకు వస్తున్న సమయంలో కొంతమంది రుట్టేను చప్పట్లు కొట్టి ప్రశంసించడం వీడియోలో చూడొచ్చు. అయితే, రూట్టేకు ‘సైకిల్ రైడ్’ చేయడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు కూడా సభలకు సైకిల్‌పై వచ్చి తన నిరాడంబరతను, అంకితభావాన్ని చాటారాయన.అయితే డచ్ పద్ధతిలో ఇలా చేయడం ఆ దేశ ఆచారమని అంటున్నారు. ఎలాగైతే ఖాళీ చేతులతో ప్రజలకు ప్రాతినిధ్యం వహించడానికి వచ్చారో, అలాగే వెళ్లిపోవడం అక్కడ జరుగుతుందట. ఇక ఇక 14 ఏళ్లు నెదర్లాండ్స్ ప్రధానిగా సేవలు అందించిన మార్క్ రుట్టే.. వచ్చే ఏడాది 'నాటో' కొత్త సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.After 14 years in power, this is how former Dutch Prime Minister Mark Rutte left the Prime Minister's Office after completing the ceremony of officially handing over power to his successor, Dick Schoof.#netherlands pic.twitter.com/exux8saX0D— Kiran Bedi (@thekiranbedi) July 6, 2024 -
‘భావి ప్రధాని అఖిలేష్’
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పుట్టిన రోజు నేడు(జూలై 1). ఈ సందర్భంగా యూపీలోని పార్టీ నేతలు, కార్యకర్తలు అఖిలేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే వారు కేక్‌లను తీసుకువచ్చి అఖిలేష్ చేత కట్ చేయిస్తున్నారు. అయితే లక్నోలోని పార్టీ కార్యాలయం బయట వెలిసిన పోస్టర్ చర్చనీయాంశంగా మారింది.ఆ పోస్టర్లో సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ భావి ప్రధాని అని రాశారు. దీనిని చూసిన వారంతా ఈ అంశంపై చర్చించుకుంటున్నారు. మరోవైపు యూసీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తాజాగా అఖిలేష్‌కు తన ట్విట్టర్ ఖాతా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తమ నేత పుట్టినరోజు సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు లక్నోలోని హజ్రత్‌గంజ్‌లో గల మంచముఖ హనుమాన్ మందిరంలో అఖిలేష్‌కు దీర్ఘాయువు ప్రసాదించాలని కోరుతూ పూజలు నిర్వహించారు. అనంతం ఆలయానికి వచ్చినవారందరికీ ప్రసాదం పంపిణీ చేశారు. -
మూడోసారి ప్రధానిగా మోదీ..కాళ్ల బేరానికొచ్చిన చైనా?!
భారత్ అంటే కయ్యానికి కాలు దువ్వే చైనా ఇప్పుడు కాళ్ల బేరానికొచ్చినట్లు తెలుస్తోంది. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పరుచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని బహిరంగంగా ప్రకటించింది. కేంద్రంలో మూడోవిడత మోదీ ప్రభుత్వం విదేశాంగ విధానం విషయంలో మరింత దూకుడు పెంచింది. వాస్తవాధీనరేఖ వెంబడి తరచూ కవ్వింపు చర్యలకు దిగుతున్న చైనాకు గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా చైనా అక్రమిత టిబెట్‌లోని 30 ప్రాంతాల పేర్లు మార్చాలని మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. గతంలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని 30 ప్రాంతాలకు చైనా పేర్లు మార్చింది. ఇదే విషయంలో చైనాపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే తాజాగా, మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా వైఖరిపై ఆగ్రహంతో ఉన్న భారత్ డ్రాగన్ ఆక్రమిత టిబెట్ తమదేనంటూ అక్కడి ప్రాంతాల పేర్లు మార్చేందుకు సిద్ధమైంది.దీనికి తోడు రెండవసారి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన కొద్దిసేపటికే చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి సమస్యలను పరిష్కరించడంపై భారత్ దృష్టి సారిస్తుందని జైశంకర్ తెలిపారు.ఈ తరుణంలో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు భారత్‌తో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని,తమ సరిహద్దు వివాదాలను సక్రమంగా నిర్వహించాలని భారత్‌లోని చైనా రాయబార కార్యలయం ఎక్స్ వేదికగా స్పందించింది. మూడో విడత మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చైనా ఈ ప్రకటన చేయడం గమనార్హం. చైనా,భారత్‌లు పొరుగు దేశాలు. సంబంధిత సరిహద్దు సమస్యలను సక్రమంగా నిర్వహించాలి. ఈ రెండు దేశాల్లో అభివృద్ది,శాంతికి అనుకూలంగా ఉన్నాం.భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో సరైన దిశలో ముందుకు తీసుకెళ్లాలని భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం ట్వీట్లో పేర్కొంది. -
మోదీ మూడోసారి ప్రధాని కాగానే..
ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది జరిగిన వెంటనే జార్ఖండ్‌లోని గుమ్లాకు చెందిన వ్యక్తి తన అవతారాన్ని మార్చుకున్నాడు. అంతవరకూ అతనికి ఉన్న పొడవాటి, జుట్టు గడ్డంను కత్తిరించుకున్నాడు. వివరాల్లోకి వెళితే..జార్ఖండ్‌లోని గుమ్లాలో గల సిసాయి బ్లాక్‌లో నివసిస్తున్న ముఖేష్ శ్రీవాస్తవ డేవిడ్ ప్రధాని మోదీకి వీరాభిమాని. దీంతో ఆయన పలు సందర్భాల్లో మోదీ మీద తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేస్తుండేవాడు. దీనిలో భాగంగానే నాలుగేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయ్యాకనే తన జుట్టు, గడ్డం కత్తిరించుకుంటానని ప్రకటించాడు. మోదీ మూడోమారు ప్రధానిగా ఎంపికకాని పక్షంలో తన జీవితాంతం ఇలా గడ్డంతోనే ఉంటానని చెప్పాడు. దీనిపై ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తల ముందు ప్రమాణం కూడా చేశాడు.నాటి సందర్భం గురించి డేవిడ్ మీడియాతో మాట్లాడుతూ నాలుగేళ్ల క్రితం ఒక రోజు తాను మార్కెట్లో ఉన్నప్పుడు, 2024లో నరేంద్ర మోదీ మరోమారు ప్రధాని కాలేరని ప్రతిపక్షానికి చెందిన కొందరు స్నేహితులు అన్నారని, అప్పుడు తాను వారితో మోదీ మూడోసారి ప్రధాని కాకపోతే తాను జీవితాంతం షేవింగ్ చేసుకోనని ప్రమాణం చేశానని తెలిపారు. అయితే ఇప్పుడు తన కల నెరవేరిందని, మోదీ మూడోసారి ప్రధాని అయినందుకు ఎంతో సంతోషిస్తున్నానని, ఇప్పుడు తాను క్షవరం చేయించుకుంటానని డేవిడ్ తెలిపాడు. -
ప్రధాని కార్యాలయం మోదీ పీఎంవో కాదు, అది ప్రజా పీఎంవో అని మోదీ ఉద్ఘాటన.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ముచ్చటగా మూడోసారి మోదీ : నగల వ్యాపారి అరుదైన కానుక
భారత దేశ ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ అరుదైన బహుమతిని అందుకోనున్నారు. జమ్మూ-కశ్మీర్‌కు చెందిన బీజేపీ కార్యకర్త, నగల వ్యాపారి రింకూ చౌహాన్ బీజేపీ చిహ్నమైన కమలం పువ్వును స్వచ్ఛమైన వెండితో రూపొందించి కానుకగా అందించనున్నారు.మూడు కిలోల స్వచ్ఛమైన వెండితో దీన్ని తయారు కమలం పువ్వును ప్రత్యేకంగా తయారు చేయించి మరీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీకి అద్వితీయమైన బహుమతి ఇవ్వాలనే ఆలోచన వచ్చిందట జమ్మూ-కశ్మీర్‌లోని ముత్తి గ్రామానికి చెందిన జనతా యువమోర్చా (బీజేవైఎం) అధికార ప్రతినిధి చౌహాన్ వెల్లడించారు.జమ్ము కశ్మీర్లో అధికరణం 370 రద్దు, అయోధ్యలో రామమందిరం నిర్మాణం వాగ్దానాలను మోదీ నెరవేర్చిన నేపథ్యంలో ఆయనకు వెండి కమలాన్ని బహూకరించాలని సంకల్పించినట్టు తెలిపారు. తానే స్వయంగా స్వచ్ఛమైన వెండితో దీన్ని తయారు చేశాననీ, దీని తయారీకి 15 నుండి 20 రోజులు పట్టిందని చౌహాన్ మీడియాతో చెప్పారు. “నా ఆత్మ దానిలో ఉంది. మోదీ నాకు దేవుడిలాంటి వారు. ఆయన ఈ బహుమతిని ఇష్టపడతారని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు కాశ్మీర్లో శాంతిని పునరుద్ధరించడంలో సహాయపడిందని, అలాగే 500 ఏళ్లుగా ఎదురు చూస్తున్న యూపీలోని అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగిందంటూ కొనియాడారు. అలాగే ఈ బహుమతిని అందజేసేందుకు ప్రధానిని కలిసే అవకాశం కోసం తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఆయన భార్య అంజలి చౌహాన్ వెల్లడించారు. -
కన్నులపండువగా...
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం కన్నులపండువగా జరిగింది. దేశాధినేతల నుంచి రాజకీయ దిగ్గజాల దాకా వేడుకలో పాల్గొన్నారు. పారిశ్రామిక ప్రముఖులు మొదలుకుని సినీ తారల దాకా తళుక్కుమన్నారు. 8,000 మందికిపైగా వీవీఐపీలు, వీఐపీలతో రాష్ట్రపతి భవన్ ఆవరణ కళకళలాడింది. వరుసగా మూడోసారి ప్రధానిగా మోదీతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణస్వీకారం చేయిస్తుండగా ప్రాంగణమంతా కరతాళ ధ్వనులు, హర్షధ్వానాలతో మారుమోగింది. మాజీ రాష్ట్రపతులు ప్రతిభా పాటిల్, రామ్‌నాథ్ కోవింద్ తదితరులు పాల్గొన్నారు. షారుఖ్ ఖాన్ నుంచి రజనీకాంత్ దాకా పలువురు సినీ ప్రముఖులు కుటుంబ సమేతంగా హాజరై అలరించారు. పారిశ్రామికవేత్తలు గౌతం అదానీ దంపతులు, ముకేశ్ అంబానీ దంపతులు వేడుకకు హాజరయ్యారు. భిన్న మతాలకు చెందిన పెద్దలు పాల్గొనడం అందరినీ ఆకర్షించింది. బీజేపీ నుంచి తొలిసారి ఎంపీగా నెగ్గిన ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధానాకర్షణగా నిలిచారు. కేరళలోని త్రిసూర్ ఎంపీ, మలయాళ సినీ స్టార్ సురేశ్ గోపీ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అందరి దృష్టినీ ఆకర్షించింది. లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో బీజేపీకి ఇదే తొలి విజయమన్నది తెలిసిందే. మోదీకి పలు రంగాల ప్రముఖుల అభినందనలు, శుభాకాంక్షల సందేశాలతో ఎక్స్ తదితర సోషల్ సైట్లు హోరెత్తిపోయాయి. ఏడుగురు దేశాధినేతలు: మోదీ ప్రమాణ స్వీకారానికి 7 దేశాల అధినేతలు హాజరయ్యారు. బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాని ప్రవింద్ కు మార్ జగన్నాథ్, మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు, నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ, భూటాన్ ప్ర ధానమంత్రి త్సెరింగ్ టాగ్బే, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫిఫ్ తదితరులు కార్యక్ర మంలో పాల్గొన్నారు. భారత్, మాల్దీవుల మ« ద్య సంబంధాలు బలహీనపడ్డ నేపథ్యంలో ముయిజ్జు హాజరు ప్రాధాన్యం సంతరించుకుంది. 2023 నవంబర్‌లో అధ్యక్షుడయ్యాకఆయన భారత్ రావడం ఇదే తొలిసారి.తెలుపు కుర్తా–చుడీదార్, నీలి రంగు జాకెట్లో... మెరిసిపోయిన మోదీవిశేష సందర్భాల్లో తన వస్త్రధారణతో ఆకట్టుకునే మోదీ ఈసారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలుపు కుర్తా, చుడీదార్, దానిపై నీలి రంగు జాకెట్ ఎంచుకున్నారు. 2014లో తొలిసారి ప్రధానిగా ప్రమాణ చేసిన సందర్భంగా ఆయన క్రీం కలర్ కుర్తా, తెల్ల పైజామా, బంగారు రంగు జాకెట్ ధరించారు. 2019లో రెండోసారి ప్రధాని అయినప్పుడు తెలుపు రంగు కుర్తా, పైజామా, వాటిపై బంగారు రంగు జాకెట్ ధరించి ప్రమాణస్వీకారం చేశారు. పంద్రాగస్టు, గణతంత్ర వేడుకలకు మోదీ రంగురంగుల తలపాగాలు ధరించి అలరిస్తుంటారు. -
మోదీ 3.0 మంత్రివర్గ కూర్పుపై కసరత్తు.. ఎవరికి ఏ పదవులు?
Updateప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కొత్త మంత్రివర్గంలో నితీష్ కుమార్‌కు చెందిన జేడీయూకి రెండు శాఖలు లభించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. జేడీయూ సీనియర్ నేతలు లాలన్ సింగ్, రామ్ నాథ్ ఠాగూర్ పేర్లను పార్టీ ప్రతిపాదించింది. కాగా లాలన్ సింగ్ బిహార్‌ళోని ముంగేర్ నుంచి లోక్ సభకు ఎన్నికవ్వగా.. రామ్ నాథ్ ఠాగూర్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఇదిలా ఉండగా రామ్ నాథ్ ఠాగూర్ భారతరత్న అవా గ్రహీత కర్పూరి ఠాకూర్ కుమారుడు.న్యూఢిల్లీ: మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి 7.15 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో మోదీతో పాటు ఆయన క్యాబినెట్ మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో క్యాబినెట్ కూర్పుపై కసరత్తు కొనసాగుతోంది.ఈ క్రమంలో అమిత్ షా నివాసంలో శనివారం ఎన్డీయే కూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీకి జేపీ నడ్డా, బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ హాజరయ్యారు. ప్రస్తుతం మోదీ 3.0 కేబినెట్లో ఎవరెవరికి మంత్రి పదవులు వరించనున్నాయనే అంశంపై సర్వత్రా చర్చనీయాంగా మారింది. అయితే ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారిన టీడీపీ, జేడీయూలు కీలక పదవులు కోరుతూ తమతమ డిమాండ్లను మోదీ ముందు పెట్టినట్లు తెలుస్తోంది.అయితే కీలకమైన హోమ్, ఆర్థిక, రక్షణ, విదేశాంగ శాఖలు బీజేపీ తనవద్దనే ఉంచుకోవాలని నిర్ణయించుకుంది. అటు టీడీపీ మూడు మంత్రు పదవులతోపాటు, రెండు సహాయ మంత్రి పదవులు కోరుతున్నట్లు తెలుస్తోంది. కాగా టీడీపీకి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే అవకాశం కూడా ఉంది. ఇక మూడు మంత్రి పదవులతోపాటు బీహార్ ప్రత్యేక హోదా ప్రకటించాలని సీఎం నితీశ్ కుమార్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు శివసేన, ఎన్సీపీ, ఆర్ ఎల్జేపీ ఒక్కొక్క మంత్రి పదవి కోరుతున్నట్లు సమాచారం.ఇక శుక్రవారం జరిగిన ఎన్డీయే ఎంపీల సమావేశంలో కూటమి పక్షనేతగా నరేంద్ర మోదీని ఎన్నుకోవడంలో చంద్రబాబు, నితీశ్‌లు కీలకంగా వ్యవహరించారు.ఇండియా కూటమితో ఇరువురూ సంప్రదింపులు జరుపుతున్నారనే ఊహాగానాలకు తెరదించుతూ లిఖితపూర్వకంగా మోదీకి మద్దతు తెలిపారు. ఇదే సమయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీకి దీటుగా ఇండియా కూటమి మంచి ఫలితాలను సాధించింది. ప్రతిపక్ష కూటమి 232 సీట్లను గెలుచుకుంది. ఇండియా కూటమికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ 328 స్థానాల్లో పోటీచేసి 99 సీట్లను గెలుచుకుంది.2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ స్వతహాగా 242 స్థానాలు గెలుచుకున్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ రాకపోవడంతో.. ఎన్టీయే మిత్ర పక్షాలతో కలిసి కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఎన్డీయేలో భాగమైన టీడీపీి 16 స్థానాలు, నితీష్‌కుమార్‌కు చెందిన జేడీయూ 14, ఏక్నాథ్ షిండే నేత!త్వంలోని శివసేన 7, లోక్‌జనశక్తి రామ్ విలాస్ 3 చోట్ల విజయం సాధించింది. దీంతో మొత్తం 290 స్థానాల్లో ఎన్డీయే గెలుపొందింది. -
మోదీ ప్రమాణస్వీకారం.. అతిథుల్లో కూలీలు, హిజ్రాలు
న్యూఢిల్లీ: మోదీ మూడోసారి ప్రమాణస్వీకారానికి ఎందరో అతిథులు విచ్చేయనున్నారు. ఆదివారం(జూన్9) జరిగే ఈ కార్యక్రమానికి కనీవినీ ఎరుగని రీతిలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మోదీ ప్రమాణస్వీకారోత్సవంలో కొన్ని ప్రత్యేకతలుండటంతో పాటు కొంత మంది ప్రత్యేక అతిథులు కూడా హాజరుకానున్నారు.కొత్త పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్తా నిర్మాణంలో పాల్గొన్న కూలీలు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్టు, మెట్రో రైలు ప్రాజెక్టులో పనిచేసిన అధికారులతో పాటు పలువురు హిజ్రాలు, శానిటేషన్ సిబ్బంది, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు తదితరులకు మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమాకి ఆహ్వానాలు అందాయి. కాగా, మోదీ ప్రమాణస్వీకారానికి పలువురు ఇతర దేశాల అధినేతలు కూడా రానున్నారు. -
Lok Sabha Election Results 2024: 8 లేదా 9న ప్రమాణం!
సాక్షి, న్యూఢిల్లీ: మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించబోతున్నారు. వరుసగా మూడుసార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి జవహర్లాల్ నెహ్రూ నెలకొలి్పన రికార్డును మోదీ సమం చేయబోతున్నారు. ఈ నెల 8 లేదా 9న ప్రమాణం స్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రధాని సహా నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా, బుధవారం మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఎన్డీయే–2 ప్రభుత్వంలో ఇదే చివరి కేబినెట్ సమావేశం. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతోపాటు నూతన ప్రభుత్వ ఏర్పాటుపై విస్తృతంగా చర్చించారు. ప్రస్తుత 17వ లోక్‌సభను రద్దు చేయాలని కేబినెట్ సిఫార్సు చేసింది. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఉదయం 11.30 గంటలకు జరిగిన కేబినెట్ భేటీలో మోదీ మాట్లాడారు. రాజకీయాల్లో గెలుపోటములు ఒక భాగమేనని అన్నారు. నెంబర్ గేమ్ కొనసాగుతుందని చెప్పారు. గత పదేళ్ల పాలనలో ఎన్నో మంచి పనులు చేశామని, భవిష్యత్తులోనూ ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తూనే ఉంటామని వెల్లడించారు. పదేళ్లలో మంత్రులంతా కష్టపడి పనిచేశారని ప్రశంసించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తనతోపాటు మంత్రివర్గ సహచరుల రాజీనామా లేఖలను సమరి్పంచారు. మోదీతోపాటు కేంద్ర మంత్రుల రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించారు. నూతన ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా వ్యవహరించాలని మోదీని కోరారు. 17వ లోక్‌సభను రద్దు చేయాలని కోరుతూ కేబినెట్ చేసిన సిఫార్సు లేఖను రాష్ట్రపతి అందజేశారు. దీంతో 17వ లోక్‌సభను రద్దు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి. ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్‌తో మోదీ భేటీ ప్రధాని మోదీ బుధవారం తన పదవికి రాజీనామా చేసిన తర్వాత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ధన్‌ఖడ్ మూడు కమలం పువ్వులున్న పుష్పగుచ్ఛాన్ని మోదీకి అందజేసి అభినందనలు తెలియజేశారు. వరుసగా మూడుసార్లు విజయం సాధించినందుకు గుర్తుగా మూడు కమలం పువ్వులను ఇచి్చనట్లు తెలుస్తోంది. అలాగే మోదీ కూడా కొన్ని రకాల మిఠాయిలను ఉప రాష్ట్రపతికి అందజేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ, దిగిపోతున్న మంత్రివర్గానికి రాష్ట్రపతి భవన్లో విందు ఇచ్చారు. ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా దీనికి హాజరయ్యారు. టీడీపీ, జేడీ(యూ) మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటు సార్వత్రిక ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ మిత్రపక్షాల సహాయంతో వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. ఈసారి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలం బీజేపీకి లభించలేదు. ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీడీపీ, జేడీ(యూ), ఇతర మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ పెద్దలు నిర్ణయించారు. ఇదిలా ఉండగా, కేంద్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి సైతం తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో హస్తినలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎన్డీయే నుంచి కొన్ని భాగస్వామ్య పక్షాలు ప్రతిపక్ష కూటమిలో చేరబోతున్నాయంటూ ఢిల్లీలో ఊహాగానాలు మొదలయ్యాయి.