
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల సందడి నెలకొంది. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అదే సమయంలో శ్రీరాముడు కొలువైన అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ మూడవసారి దేశానికి ప్రధానమంత్రి కావాలని భగవంతుణ్ణి వేడుకుంటూ యాగాలు, ప్రార్థనలు ప్రారంభించారు.
బాబ్రీ మసీదు కేసు న్యాయవాది ఇక్బాల్ అన్సారీ ఖురాన్ పఠించి, ప్రధాని మోదీ మూడవసారి ప్రధాని కావాలని వేడుకున్నారు. అలాగే జగద్గురు పరమహంస ఆచార్య.. మోదీ కోసం ప్రార్థనలు చేశారు. అయోధ్య మతపరమైన నగరమని, ఇక్కడి ప్రజల ప్రార్థనలు దేవతలు తప్పకుండా వింటారని, ఇక్కడ ఏ పూజ చేసినా, ప్రార్థించినా దైవం స్వీకరిస్తాడని ఇక్బాల్ అన్సారీ పేర్కొన్నారు.
అయోధ్యలోని తపస్వి కంటోన్మెంట్‌కు చెందిన జగద్గురు పరమహంస ఆచార్య మీడియాతో మాట్లాడుతూ గత పదేళ్లలో ప్రధాని మోదీ పాలన దేశానికి, ప్రజలకు ఎంతో మేలు చేసిందన్నారు. అందుకే దేశ ప్రజలంతా మూడోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలన్నారు.