అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమైనది మొదలు కాశీ నుండి అయోధ్యకు వెళ్లే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తన నియోజకవర్గమైన వారణాసిలోని ప్రజలకు మరో కానుక అందించారు.
ఇకపై వారణాసికి వచ్చే భక్తులు కేవలం మూడు గంటల్లో ‘వందే భారత్’ సాయంతో అయోధ్య ధామ్ చేరుకోగలుగుతారు. ప్రధాని మోదీ నేడు (మంగళవారం) ఈ నూతన వందేభారత్ రైలుకు పచ్చ జెండా చూపించనున్నారు. మంగళవారం ఈ కార్యక్రమం జరగనుంది.
ఈ వందే భారత్ బీహార్‌లోని పట్నా నుండి అయోధ్య ధామ్, లక్నో మీదుగా వారణాసి కాంట్ రైల్వే స్టేషన్‌కు చేరుకోనుంది. ఇది కాశీ పర్యాటకులు అయోధ్యకు వెళ్లడాన్ని సులభతరం చేయనుంది. ఈ వందే భారత్ పట్నా నుండి వారణాసి కాంట్ స్టేషన్‌కు ఉదయం 9.30 గంటలకు వస్తుంది. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. కాశీ నుండి అయోధ్య కు భక్తులు కేవలం మూడు గంటల్లో చేరుకోగలుగుతారు.
Comments
Please login to add a commentAdd a comment