Ayodhya
-
స్నేహితులతో కలిసి పుణ్యక్షేత్రాల్లో రచయిత చంద్రబోస్ (ఫోటోలు)
-
'ఇది మాకు దక్కిన గొప్ప ఆశీర్వాదం'.. ఉపాసన ట్వీట్
మెగా హీరో రామ్ చరణ్ సతీమణి ప్రస్తుతం ఆధ్యాత్మిక సేవలో బిజీగా ఉంది. తాజాగా అయోధ్యలోని రామమందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విటర్లో పంచుకున్నారు. సనాతన ధర్మం గురించి మా తాత చాలా నేర్పించారని ఈ సందర్భంగా ఉపాసన గుర్తు చేసుకున్నారు. ఇక్కడ సేవ చేసే అవకాశం లభించడం మాకు గొప్ప ఆశీర్వాదం లాంటిదని పోస్ట్ చేశారు.ఆయన మాటల స్ఫూర్తితోనే అయోధ్య రామమందిరానికి వచ్చే భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు ఉపాసన తెలిపారు. ఈ సందర్భంగా అయోధ్యలో ఏర్పాటు చేసిన అపోలో అత్యవసర సంరక్షణ కేంద్రాన్ని(అపోలో ఎమర్జన్సీ కేర్ సెంటర్) ప్రారంభించామని వెల్లడించారు. ఇప్పటికే తిరుమల, శ్రీశైలం, కేదార్నాథ్, బద్రీనాథ్‌లో సేవలందిస్తున్నట్లు ట్వీట్ చేశారు. రామజన్మ భూమిలో సేవ చేయడం అదృష్టమని పేర్కొన్నారు. ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ఉపాసన పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శంకర్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. Thatha taught us that true Sanatan Dharma for us lies in healing with dignity & empathy. Inspired by his words we opened a free Emergency Care Centre at the Ram Mandir in Ayodhya.After successfully serving in Tirumala, Srisailam, Kedarnath, and Badrinath, we are blessed to… pic.twitter.com/YcCVf0ZM61— Upasana Konidela (@upasanakonidela) December 15, 2024 -
సరయూ నదీ తీరాన శ్రీరాముని సేవలో నటి సోనాలి బింద్రే (ఫోటోలు)
-
Kartik Purnima: వారణాసి, అయోధ్యలతో పాటు దేశవ్యాప్తంగా భక్తుల పుణ్యస్నానాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈరోజు(నవంబర్ 15) కార్తీక పౌర్ణమి వేడుకలు ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ పరిత్ర పుణ్యదినాన ఉత్తరాదినగల గంగా ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. వారణాసి, అయోధ్యలతో పాటు ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పవిత్ర నదుల వద్ద భక్తుల రద్దీ నెలకొంది.యూపీలోని అయోధ్యలోని సరయూ స్నాన ఘట్టాల వద్ద భక్తులు పూజలు, పుణ్యస్నానాల కోసం బారులు తీరారు. కార్తీక పౌర్ణమి పుణ్య స్నానాలకు 10 లక్షల మందికి పైగా భక్తులు అయోధ్యకు వచ్చే అవకాశం ఉందని స్థానిక అధికారులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.#WATCH | Uttar Pradesh: A huge crowd of devotees arrive in Varanasi to take holy dip in the Ganga River, on the occasion of Kartik Purnima. pic.twitter.com/dosN2SHqNN— ANI (@ANI) November 15, 2024ఇదేవిధంగా యూపీలోని వారణాసిలోనూ పుణ్యస్నానాల కోసం గంగా ఘాట్ల వద్ద భక్తులు బారులు తీరారు. ఈ రోజున వారణాసిలో దేవ్ దీపావళి వేడుకలు జరుగుతున్నాయి. వీటిని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు వారణాసికి తరలివస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా రెండు రోజుల పాటు విశ్వనాథుని స్పర్శ దర్శనాన్ని అధికారులు నిలిపివేశారు. కాగా సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రజలకు కార్తీక పూర్ణిమ, గురునానక్ దేవ్ల జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు దక్కాలని ఆకాంక్షించారు. గురునానక్ తత్వవేత్త, సంఘ సంస్కర్త, కవి, యోగి, దేశభక్తుడని ఆయన కొనియాడారు. సమాజంలోని మూఢనమ్మకాలు, కులతత్వాన్ని తొలగించేందుకు గురునానక్ కృషి చేశారని ఆయన అన్నారు.ఇది కూడా చదవండి: Guru Nanak Jayanti: కార్తీక పౌర్ణమి నాడే గురునానక్ జయంతి ఎందుకు చేస్తారంటే.. -
15న మరో రికార్డుకు సిద్ధమవుతున్న అయోధ్య
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లో శ్రీరాముడు కొలువైన అయోధ్య పలు రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పుడు నవంబర్ 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా మరో రికార్డుకు అయోధ్య సిద్ధమవుతోంది.రాష్ట్రంలో యోగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అయోధ్యలో ప్రతీయేటా ‘దీపోత్సవం’ ప్రారంభమైంది. నూతన రామాలయంలో బాలక్ రామ్‌ను ప్రతిష్టించిన తర్వాత అయోధ్యలో చారిత్రాత్మక స్థాయిలో దీపోత్సవాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిశ్చయించారు. ఈ నేపధ్యంలో ఇక్కడి సరయూ తీరంలో మూడు రికార్డులు నమోదయ్యాయి.72 గంటల్లో 28 లక్షల దీపాలుఅయోధ్యలోని రామ్ కీ పైడీలో గత అక్టోబరులో 35 వేల మంది వాలంటీర్లు 55 ఘాట్లలో 28 లక్షల దీపాలు వెలిగించారు. కేవలం 72 గంటల్లోనే దీపాలను అలంకరించి, అయోధ్యలో సరికొత్త రికార్డు సృష్టించారు.ఏకకాలంలో 1,100 హారతులుగత అక్టోబర్ 30న సాయంత్రం సమయాన సరయూ నది ఒడ్డున సరికొత్త రికార్డు నెలకొల్పారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 1,100 మంది భక్తులు సరయూమాతకు హారతులిచ్చారు. ఈ సమయంలో వీరంతా ఒకే రంగు దుస్తులు ధరించారు.35 లక్షల మంది భక్తుల ప్రదక్షిణలు మొన్నటి నవంబరు 9వ తేదీన సాయంత్రం అయోధ్యలో 35 లక్షల మంది భక్తులు ఆలయ ప్రదక్షిణలతో మరో రికార్డు నెలకొల్పారు. 24 గంటల పాటు ఈ ప్రదక్షిణలు సాగాయి. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం భక్తుల కోసం పలు ఏర్పాట్లు చేసింది.కార్తీక పౌర్ణమికి మరో రికార్డునవంబర్ 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా అత్యధిక సంఖ్యలో భక్తులు అయోధ్యకు తరలివచ్చి, సరయూ నదిలో పుణ్యస్నానాలు చేయనున్నారని స్థానిక అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసింది. 12 చోట్ల తాత్కాలిక ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా సారించనున్నారు.ఇది కూడా చదవండి: Children's Day 2024: బాలల నేస్తం.. చాచా నెహ్రూ.. -
మూడేళ్ళలో 15 రెట్లు.. అక్కడ దూసుకెళ్తున్న రియల్ ఎస్టేట్ మార్కెట్
దేశంలోని ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా దూసుకెళ్తోంది. గత మూడేళ్లలో అయోధ్యలో భూముల ధరలు 15 రెట్లు పెరిగాయని 'హౌస్ ఆఫ్ అభినందన్ లోధా' (HoABL) చైర్మన్ 'అభినందన్ లోధా' అన్నారు.ఒక ప్రముఖ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభినందన్ లోధా మాట్లాడుతూ.. 2021లో అయోధ్యలో భూమిని కొనుగోలు చేయడం ప్రారంభించినట్లు చెప్పారు. అప్పట్లో ఒక ఎకరా భూమి ధర రూ. 25 లక్షల నుంచి రూ. 50 లక్షలు మధ్య ఉండేది. కానీ ప్రాంతాన్ని బట్టి నేడు అయోధ్యలో ఎకరం భూమి ధర రూ. 5 కోట్లు వరకు ఉందని ఆయన అన్నారు.2021లో కొనుగోలు చేసిన భూమిని మేము ఈ ఏడాది విక్రయించడం ప్రారంభించాము. 7 నెలల్లో 1400 ప్లాట్లను విక్రయించాము. మేము ఈ సంవత్సరం చివరగా అమ్మిన భూమి చదరపు గజం విలువ రూ. 15,000. మా సంస్థ మొత్తం 1400 రైతుల దగ్గర నుంచి ఇప్పటికే 51 ఎకరాల భూమిని కొనుగోలు చేసిందని అభినందన్ లోధా పేర్కొన్నాడు.పవిత్ర నగరమైన అయోధ్యలో భూముల విక్రయం మాత్రమే కాకుండా.. 6,000 చెట్లను నాటడం, 30కి పైగా స్థానిక జాతులను సంరక్షించడం, 1000 చెట్లను పెంచడం వంటివి కూడా చేసినట్లు లోధా చెప్పారు.ఇదీ చదవండి: 38 ఏళ్ల వయసు.. 120 కోట్ల విరాళం: ఎవరో తెలుసా?ప్రముఖ సినీ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా అయోధ్యలో 15000 చదరపు అడుగుల భూమిని కొనుగోలు చేశారు. అయోధ్య ఇప్పుడు మతపరమైన నగరంగా మారిన తరువాత.. వారణాసి, బృందావన్‌లలో ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు లోధా ప్రకటించారు. ముంబైకి సమీపంలోని అమృత్సర్, బృందావన్, వారణాసి, సిమ్లా, నాగ్‌పూర్, ఖోపోలీలో 352 ఎకరాలు భూసేకరణను ఇటీవలే ముగించినట్లు కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. -
అయోధ్యలో.. తొలి మంచు కురిసింది..
అయోధ్య: రాముడు కొలువైన అయోధ్యలో ఈరోజు(ఆదివారం) శీతాకాలపు తొలి పొగమంచు కనిపించింది. వేడి నుంచి ఉపశమనం లభించడంతో పాటు అయోధ్యవాసులను చలి తాకింది. భక్తులు తొల పొగమంచును ఎంజాయ్ చేస్తున్నారు.అయోధ్యలో తొలి పొగమంచు ప్రభావం రోడ్లపై వెళుతున్న వాహనాలపై పడింది. వాహనాలు నెమ్మదిగా నడుస్తున్నాయి. సరయూ తీరం, రామ్ కీ పైడీ, రాంపథ్.. ఇలా అన్ని చోట్లా పొగమంచు కనిపిస్తోంది. అయోధ్య చేరుకున్న భక్తులు చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇది చలికాలం ఆగమనానికి ప్రతీక అని స్థానికులు అంటున్నారు.చలి ప్రవేశంతో అయోధ్యకు వచ్చే భక్తులకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలుగుతోంది. అయోధ్యలో తొలిసారిగా పొగమంచు కమ్ముకోవడం శుభపరిణామమని భక్తులు భావిస్తున్నారు. కౌశాంబి నుండి అయోధ్యకు వచ్చిన భక్తురాలు రాణి మాట్లాడుతూ అయోధ్యలో పొగమంచు మాత్రమే ఉందని, చలి అంతగా లేదన్నారు. గోరఖ్‌పూర్ నుంచి అయోధ్యకు వచ్చిన నవీన్ అనే భక్తుడు మాట్లాడుతూ అయోధ్యలో కురుస్తున్న పొగమంచు చక్కని అనుభూతిని ఇస్తున్నదన్నారు.ఇది కూడా చదవండి: కార్తీకం స్పెషల్.. దేశంలోని ప్రముఖ శివాలయాలు -
అయోధ్య: ఆ మట్టి ప్రమిదలను ఏం చేస్తారంటే..
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిన్న(బుధవారం) అత్యంత వేడుకగా దీపోత్సవం జరిగింది. 25 లక్షలకు పైగా దీపాలు వెలిగించి యోగి ప్రభుత్వం సరికొత్త రికార్డు నెలకొల్పింది.దీపావళి సందర్భంగా గత ఎనిమిదేళ్లుగా దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. దీపోత్సవ వేళ నగరం వినూత్న కాంతులతో నిండిపోతుంది. అయితే దీపోత్సవం సందర్భంగా దీపాలు వెలిగించిన తర్వాత ఆ ప్రమిదలను ఏమి చేస్తారు? ఈ ప్రశ్న అందరిమదిలో మెదులుతుంది.గత ఎనిమిది ఏళ్లుగా అయోధ్యలో లక్షలాది దీపాలు వెలిగిస్తున్నారు. తొలిసారి జరిగిన ఈ వేడుకల్లో లక్షకు పైగా దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఏటా ఈ సంఖ్యను పెంచుతూ నిన్న జరిగిన ఎనిమిదో దీపోత్సవంలో 25 లక్షలకు పైగా దీపాలు వెలిగించి, సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. దీనిని వరల్డ్ రికార్డ్స్ బృందం లెక్కించి సర్టిఫికేట్ జారీ చేయనుంది.ఈ లెక్కింపు అనంతరం అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఆ దీపాల ప్రమిదిలను అక్కడి నుంచి తొలగించనున్నారు. అవధ్ యూనివర్సిటీ మీడియా ఇన్ఛార్జ్ డాక్టర్ చతుర్వేది మీడియాతో మాట్లాడుతూ దీపోత్సవం అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ బృందం అన్ని ఘాట్లను శుభ్రం చేసి,ఆ ప్రమిదలనన్నింటినీ సేకరించి, ఒక చోటచేర్చి, ఆ తర్వాత పారవేస్తుందని తెలిపారు. ఇది కూడా చదవండి: సువాసనలు వెదజల్లే దీపాలను వెలిగిద్దాం ఇలా..! -
‘అయోధ్య దీపోత్సవ్‌కు ఆహ్వానం అందలేదు’
లక్నో: అయోధ్యలో ఇవాళ (బుధవారం) నిర్వహించే దీపోత్సవ్ కార్యక్రమానికి తనను నిర్వాహకులు ఆహ్వానించలేదని సమాజ్‌వాదీ పార్టీ నేత, ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ తెలిపారు. మన పండుగల విషయంలో కూడా బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపణలు చేశారు. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘దీపావళి సందర్భంగా అయోధ్య ప్రజలందారికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నేను ఇక్కడి నుంచి ఎన్నిక కావడం నా అదృష్టంగా భావిస్తున్నా. మన పండుగలను కూడా బీజేపీ రాజకీయం చేస్తోంది. దీపావళి పండుగను బీజేపీ రాజకీయం చేసి ప్రజలను విభజిస్తోంది. నాకు దీపోత్సవ్‌కు పాస్ లేదా ఆహ్వానం అందలేదు. ఈ పండుగ ఏ ఒక్క వర్గానికి చెందినది కాదు. ..నేను ఈరోజు అయోధ్యకు వెళ్తున్నా. నాకు నిర్వాహకుల నుంచి దీపోత్సవ్ కార్యక్రమానికి ఎటువంటి పాస్ లేదా ఆహ్వానం రాలేదు’’ అని అన్నారు. అయోధ్య ఆధ్యాత్మిక నగరం.. ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుందన్న విషయం తెలిసిందే. అయోధ్యలో అట్టహాసంగా నిర్వహించనున్న దీపోత్సవ్ కార్యక్రమానికి స్థానిక ఎంపీని ఆహ్వానించకపోవటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.దీపావళి సందర్భంగా సరయూ నది ఒడ్డున లక్షలాది దీపాలు వెలిగించే దీపోత్సవ్ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇవాళ సాయంత్రం నుంచి రాత్రి వరకు సరయూ నది ఒడ్డున సుమారు 28 లక్షల దీపాలను వెలిగించటం ద్వారా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
అయోధ్య దీపోత్సవం.. కన్నడ స్టార్ కు బిగ్ రిలీఫ్
-
దీపావళి వేడుకలు: అయోధ్య నుంచి అమృత్సర్ వరకూ..
దీపావళి.. దివ్యకాంతుల మధ్య జరుపుకునే ఆనందాల పండుగ. మన దేశంలోని అందరూ జరుపుకునే అతి పెద్ద పండుగ దీపావళి. దేశంలోని వివిధ ప్రాంతాలలో దీపావళికి ప్రత్యేక సంప్రదాయాలనున్నాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను భావిస్తారు. అయోధ్యలో ఈ ఏడాది దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే పలు ప్రధాన నగరాల్లోనూ దీపావళి వేడుకలు అంబరాన్ని అంటనున్నాయి.అయోధ్యఈ ఏడాది ప్రపంచమంతా అయోధ్యలో జరిగే దీపావళి వేడుకలను చూసేందుకు పరితపిస్తోంది. అయోధ్య శ్రీరాముని జన్మస్థలం. 500 ఏళ్ల తరువాత శ్రీరాముడు ఇక్కడ ప్రతిష్టితుడయ్యాడు. రామాయణంలోని వివరాల ప్రకారం శ్రీరాముడు రావణాసురుడిని ఓడించి 14 సంవత్సరాల అజ్ఞాతవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఈ సందర్భంగా దీపావళి వేడుకలు జరుపుకుంటారు. ఈ ఏడాది దీపావళికి అయోధ్యలో 28 లక్షల దీపాలు వెలిగించి, ప్రపంచ రికార్డు నెలకొల్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి.వారణాసికాశీ అని కూడా పిలిచే వారణాసి భారతదేశానికి ఆధ్యాత్మిక రాజధాని. ప్రపంచంలోని పురాతన నగరాలలో వారణాసి ఒకటి. ఇక్కడి గాలిలో ఆధ్యాత్మిక శక్తి ప్రవహిస్తుంటుంది. ప్రతి సంవత్సరం దీపావళికి లక్షలాది మంది భక్తులు వారణాసికి తరలివస్తుంటారు. ఇక్కడ దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి.ఉదయపూర్రాజస్థాన్లోని ఉదయపూర్ నగరం సరస్సుల నగరంగా పేరొందింది. ఇక్కడ కూడా దీపావళిని ఘనంగా జరుపుకుంటారు. నగరంలోని వీధులను రంగురంగుల దీపాలతో అలంకరిస్తారు. సరస్సుల ఒడ్డున ఉన్న ప్యాలెస్‌లు విద్యుత్ దీపకాంతులతో వెలుగొందుతుంటాయి. ఉదయపూర్‌లోని పలు ప్రాంతాల్లో బాణసంచా కాల్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.అమృత్సర్అమృత్సర్లో దీపావళి వేడుకలు భిన్నమైన అనుభూతిని అందిస్తాయి. స్వర్ణ దేవాలయంలో దీపావళి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. దీపావళి నాడు గ్వాలియర్ కోట నుండి ఆరవ సిక్కు గురువుతో పాటు 52 మంది ఇతర ఖైదీలను విడుదల చేసిన రోజును సిక్కు సోదరులు గుర్తు చేసుకుంటారు. గోల్డెన్ టెంపుల్ కూడా బంగారు దీపాలతో ప్రకాశవంతంగా మారిపోతుంది.కోల్కతాపశ్చిమబెంగాల్లో దీపావళి నాడు కాళీ పూజలు నిర్వహిస్తారు. అమావాస్య రాత్రివేళ కాళీ పూజలు చేస్తారు. దీంతో దీపావళి రాత్రి వేళ నగరం దీపకాంతులతో శోభాయమానంగా మారిపోతుంది.ఇది కూడా చదవండి: వరల్డ్ ట్రేడ్ సెంటర్లో దీపావళి వెలుగులు -
నేడు రికార్డుకు సిద్ధమవుతున్న దీపోత్సవం
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరం నేడు (అక్టోబర్ 30) మరో రికార్డుకు వేదికకానుంది. ఈ రోజు అయోధ్యలో ఎనిమిదో దీపోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది.అయోధ్యలో ఈరోజు సాయంత్రం జరిగే దీపోత్సవానికి సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ వెలుగుల పండుగలో అయోధ్యలోని సరయూ తీరం వెంబడి రామ్ కీ పైడీతో సహా 55 ఘాట్ల వద్ద 25 లక్షల దీపాలు వెలిగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో అయోధ్య దీపోత్సవం మరో రికార్డును సాధించనుంది.దీపోత్సవం కోసం స్థానికులు అయోధ్యను అందంగా ముస్తాబు చేస్తున్నారు. అక్టోబర్ 30న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రామ్ కీ పైడీలో తొలి దీపం వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో లేజర్ షో, బాణసంచా కాల్చడం, రాంలీల ప్రదర్శనలు ఉండనున్నాయి.ఈ ఏడాది జనవరి 22న నూతన రామాలయంలో బాలరాముని ప్రతిష్ఠాపన మహోత్సవం జరిగింది. దీనితరువాత జరుగుతున్న తొలి దీపోత్సవం ఇదే కావడంతో స్థానికుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ఈరోజు జరిగే దీపోత్సవంలో సరయూ ఒడ్డు, రామ్కీ పైడీ, ఇతర 55 ఘాట్లలో 28 లక్షల దీపాలను ఏర్పాటు చేశారు. వీటిని వెలిగించి పాత రికార్డును బద్దలు కొట్టడం ద్వారా గిన్నిస్ బుక్‌లో కొత్త రికార్డు నమోదు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అన్ని సన్నాహాలు చేసింది.గత ఏడాది దీపోత్సవంలో 22 లక్షల 23 వేల దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈసారి జరుగుతున్న దీపోత్సవంలో అవధ్ విశ్వవిద్యాలయంతోపాటు ఇతర కళాశాలలకు చెందిన 30 వేల మంది విద్యార్థులు తమ సేవలు అందిస్తున్నారు. 2017లో ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా దీపోత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది కూడా చదవండి: ఉక్కు ఉద్యోగుల ఆకలి కేకలు -
అయోధ్య, బద్రీనాథ్‌లో ఓడిన బీజేపీ కేదార్నాథ్ కోసం ఏం చేస్తోంది?
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని నాలుగు ధామ్‌లలో కేదార్నాథ్ ధామ్ ఒకటి. త్వరలో కేదార్నాథ్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరగనుంది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ప్రత్యక్ష పోరు నెలకొంది. సోమవారం ఇరు పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. యూపీలోని అయోధ్య, ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ స్థానాల్లో ఓడిపోయిన దరిమిలా బీజేపీకి ఇప్పు కేదార్నాథ్ కీలకంగా మారింది. 2013లో సంభవించిన భారీ విపత్తు తర్వాత, కేదార్నాథ్ ధామ్, కేదార్నాథ్ లోయలో మౌలిక సదుపాయాలను పునరుద్ధరించే పని ప్రారంభమైంది. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టాక కేదార్నాథ్ పునర్నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ప్రధాని మోదీ తరచూ కేదార్‌నాథ్‌ను సందర్శిస్తున్నారు. ఈ సంవత్సరం చార్ ధామ్ యాత్రలో అత్యధిక సంఖ్యలో యాత్రికులు కేదార్‌నాథ్‌ను దర్శించుకున్నారు. 2002 నుంచి ఉనికిలోకి వచ్చిన కేదార్నాథ్ అసెంబ్లీలో బీజేపీ మూడుసార్లు, కాంగ్రెస్ రెండుసార్లు గెలిచాయి.కేదార్‌నాథ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే శైలారాణి రావత్ మృతి చెందడంతో ఇక్కడ ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ ఏడాది అయోధ్యతో కూడిన ఫైజాబాద్ లోక్‌సభ స్థానాన్ని బీజేపీ కోల్పోయింది. ఆ తర్వాత ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ ఓడిపోయింది. అయోధ్యలో సమాజ్‌వాదీ పార్టీ, బద్రీనాథ్‌లో కాంగ్రెస్ విజయం సాధించాయి. అయోధ్య, బద్రీనాథ్ రెండూ కూడా హిందువుల ఆదరణకు నోచుకున్న ప్రాంతాలు. అందుకే వీటిపై బీజేపీ దృష్టి సారించింది. ఇప్పుడు కేదార్నాథ్ సీటును దక్కించుకోవాలని ఉబలాటపడుతోంది.బీజేపీ తన సంప్రదాయాలకు భిన్నంగా దివంగత ఎమ్మెల్యే శైలారాణి రావత్ కుటుంబంలో ఎవరికీ టిక్కెట్ ఇవ్వకుండా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆశా నౌటియాల్‌ను ఎన్నికల్లో పోటీకి దింపింది. ఈ నియోజకవర్గంలో దాదాపు 90 వేల మంది ఓటర్లు ఉన్నారు. కుల సమీకరణల విషయానికి వస్తే ఠాకూర్ ఓటర్ల సంఖ్య ఈ ప్రాంతంలో అత్యధికం. బీజేపీ బ్రాహ్మణ అభ్యర్థిని నిలబెట్టగా, కాంగ్రెస్ ఠాకూర్ అభ్యర్థికి ప్రాధాన్యతనిచ్చింది.ఇది కూడా చదవండి: 19 ఏళ్ల క్రితం దీపావళి ఆనందాలను చిదిమేసిన బాంబు పేలుళ్లు -
ఇంట్లో కూర్చుని.. అయోధ్యలో దీపం వెలిగించండిలా..
అయోధ్య: యూపీలోని అయోధ్యలో ఈ నెల 30 భారీ ఎత్తున దీపోత్సవం నిర్వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా అయోధ్యలో లక్షల దీపాలు వెలిగించనున్నారు. అయితే అందరికీ ఈ వేడుకలను వెళ్లే అవకాశం ఉండదు. అటువంటివారికి అయోధ్య డెవలప్మెంట్ అధారిటీ శుభవార్త చెప్పింది.ఏ ప్రాంతంలోని వారైనా వారి ఇంటిలోనూ కూర్చొని అయోధ్యలో ఘనంగా జరిగే దీపోత్సవంలో పాల్గొనవచ్చు. ఇందుకోసం అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. శ్రీరాముని పేరిట ఒక దీపం’ పేరుతో శ్రీరాముని భక్తులు తమ ఇంట్లో కూర్చొని దీపోత్సవంలో భాగస్వాములు కావచ్చు.ఇందుకోసం అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ దివ్య అయోధ్య యాప్ ద్వారా భక్తులకు ఆన్లైన్ బుకింగ్ ఎంపికను ఇచ్చింది. ఈ యాప్ ద్వారా భక్తులు దీపాలు వెలిగించవచ్చు. అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ సెక్రటరీ సత్యేంద్ర సింగ్ మాట్లాడుతూ.. దీపోత్సవ్‌కు హాజరుకాలేని భక్తులు ఇంట్లో కూర్చొనే దీపాలు వెలిగించే అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. ‘దివ్య అయోధ్య యాప్’ సాయంతో ఆన్లైన్ బుకింగ్ ద్వారా దీపం వెలిగించినవారికి డిజిటల్ ఫోటోతో పాటు అయోధ్య ప్రసాదం పంపిస్తామన్నారు.ఇది కూడా చదవండి: ఆర్మీ శునకం ‘ఫాంటమ్’ ఇకలేదు -
దీపోత్సవానికి అయోధ్య ముస్తాబు
అయోధ్య: దీపావళి సందర్భంగా జరిగే దీపోత్సవ్ వేడుకలకు యూపీలోని అయోధ్య ముస్తాబవుతోంది. అక్టోబర్ 30న జరిగే దీపోత్సవ్ కోసం రామనగరిని అందంగా తీర్చిదిద్దుతున్నారు. భక్తివిశ్వాసాల కలబోతతో అయోధ్య వెలుగులమయం కానుంది.అయోధ్యలో జరిగే 8వ దీపోత్సవంలో అవధ్ యూనివర్సిటీకి చెందిన 30 వేల మంది వాలంటీర్లు దీపోత్సవ్ స్థలంలో 28 లక్షల దీపాలను అమర్చేందుకు కృషి చేస్తున్నారు. రామ్ కీ పైడిలోని 55 ఘాట్ల వద్ద జై శ్రీరామ్ నినాదాలతో వెలుగుల పండుగలో వాలంటీర్లు పాల్గొననున్నారు.శ్రీరాముడు కొలువైన అయోధ్య ఈ సంవత్సరం దీపోత్సవం సందర్భంగా డిజిటల్ సిటీగా కనిపించబోతోంది. వెలుగుల సంగమం ఆవిష్కృతం కానుంది. ధరంపథ్ నుండి లతా మంగేష్కర్ చౌక్ వరకు, రంగురంగుల లైట్లు ఆకర్షణీయంగా కనువిందు చేయనున్నాయి. ముఖ్యంగా లతా మంగేష్కర్ చౌక్ వెలుగు జిలుగులతో అత్యంత సుందరంగా కనిపించనుంది.దీపోత్సవ వేడుకలకు నగరమంతా త్రేతాయుగంలా ముస్తాబైంది. త్రేతాయుగంలో రాముడు లంకను జయించి అయోధ్యకు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి. ఇప్పుడు వాటిని గుర్తు చేసేలా అయోధ్యను రంగురంగుల దీపాలతో అలంకరించారు.లతా మంగేష్కర్ చౌక్ నుండి వివిధ కూడళ్లలో రామభక్తుల కోసం డిజిటల్ డిస్ప్లే వ్యవస్థను ఏర్పాటు చేశారు. రామభక్తులు దీపోత్సవ్ ప్రదేశానికి వెళ్లలేకపోయినా, డిజిటల్ తెరలపై దీపోత్సవాన్ని చూసి ఆస్వాదించవచ్చు.రంగురంగుల దీపాలు అయోధ్య అందాన్ని మరింత పెంచుతున్నాయి. రామభక్తులు రాత్రిపూట అయోధ్య వీధుల్లోకి వెళ్లినప్పుడు తమను తాము మైమరచిపోయేలా దీపోత్సవానికి ఏర్పాట్లు సాగుతున్నాయి.ఇది కూడా చదవండి: అత్యంత వృద్ధ మహిళ అస్తమయం -
1,100 మంది వేదాచార్యులతో సరయూ హారతి
లక్నో: ఉత్తరప్రదేశ్ యోగి సర్కారు అక్టోబర్ 28 నుంచి 30 వరకు రామనగరి అయోధ్యలో దీపోత్సవం నిర్వహించనుంది. ఈ సందర్భంగా మొత్తం 25 లక్షల దీపాలు వెలిగించనున్నారు. ఈ సందర్భంగా పలు కళాకారుల బృందాలు రామాయణంలోని వివిధ ఘట్టాల ఆధారంగా ప్రదర్శనలను నిర్వహించనున్నాయి.ఈ దీపోత్సవ్‌కు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా హాజరుకానున్నారు. లక్ష్మణ్ ఖిలా ఘాట్ నుంచి నయా ఘాట్ వరకు 1100 మంది వేదాచార్యులతో సరయూ హారతి నిర్వహించి గిన్నిస్ రికార్డు నెలకొల్పుతామని యోగి ప్రభుత్వ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జైవీర్ సింగ్ తెలిపారు. రామ్ కీ పైడీలో లక్షల దీపాల మధ్య భారీ వేదికపై కళాకారులచేత సాంస్కృతిక కార్యక్రమాలు, లేజర్ షో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ దీపోత్సవంలో ఆరు దేశాలకు చెందిన కళాకారులు రాంలీలను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా థాయ్‌లాండ్, కంబోడియా, ఇండోనేషియా, మయన్మార్, మలేషియా, నేపాల్‌కు చెందిన కళాకారులు తమ ప్రతిభను చాటనున్నారు. అలాగే కశ్మీర్, ఉత్తరాఖండ్, హర్యానా, మధ్యప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాం, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, బీహార్, చండీగఢ్, సిక్కిం, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన కళాకారులు అయోధ్యలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇది కూడా చదవండి: ఈ ఐదు నగరాల్లో.. మిన్నంటే దీపావళి సంబరాలు -
అయోధ్య: దీపోత్సవానికి ముస్తాబు.. పుష్ఫ వర్షానికి ఏర్పాట్లు
అయోధ్య: యూపీలోని రామనగరి అయోధ్య దీపోత్సవానికి ముస్తాబవుతోంది. తాజాగా అవధ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తన బృందంతో కలిసి రామ్ కీ పైడీ, దీపోత్సవ్ సైట్లను పరిశీలించారు. అక్టోబరు 22న అయోధ్యలో దీపోత్సవం జరగనుంది. దీనికిముందు అవధ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రతిభా గోయల్, ఆమె బృందం రామ్ కీ పైడీ వద్ద వేద పండితుల సమక్షంలో భూమి పూజ చేయనున్నారు. నూతన రామాలయంలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్టించిన తర్వాత జరిగే మొదటి దీపాల పండుగ ఇదే కావడంతో, దీనిని అద్భుతంగా నిర్వహించాలని రామాలయ ట్రస్టు భావిస్తోంది.ఈసారి అయోధ్యలో 25 లక్షల దీపాలు వెలిగించి, నూతన రికార్డు సృష్టించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 40 స్వచ్ఛంద సంస్థలతో పాటు అవధ్ యూనివర్సిటీ, కాలేజీ, 36 ఇంటర్ కాలేజీలకు చెందిన 30 వేల మందికి పైగా విద్యార్థులు దీపాలు వెలిగించనున్నారు. రామ్ కీ పైడీ సహా 55 ఘాట్లపై 28 లక్షల దీపాలు వెలిగించనున్నారు. ఇందుకోసం దాదాపు 90 వేల లీటర్ల నూనెను వినియోగించనున్నారు. అక్టోబర్ 28 నాటికి ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తికానున్నాయి. ఈ ఏడాది దీపోత్సవం నిర్వహిస్తున్న సమయాన హెలికాప్టర్ల నుంచి పూలవర్షం కురిపించనున్నారు. అలాగే అయోధ్య నగరాన్ని పూలతో అందంగా అలంకరించనున్నారు.ఇది కూడా చదవండి: ధర్మ చక్రం: నాలుగు ఆశ్రమాలలో ఏది గొప్పది? -
అయోధ్యలో దీపావళికి రెండు లక్షల దీపకాంతులు
అయోధ్య: రాబోయే దీపావళి నాడు అయోధ్యలో లక్షలాది దీపాలు వెలగనున్నాయి. రామాయణ యుగాన్ని తలపించే విధంగా అయోధ్య ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. రామజన్మభూమి ప్రధాన మార్గం నుంచి గర్భగుడి వరకు భారీ అలంకరణ చేయనున్నారు.ఈసారి దీపావళికి ఆలయ ప్రాంగణంలో రెండు లక్షల దీపాలు వెలిగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ట్రస్ట్ చైనా వస్తువులు, దీపాలను నిషేధించింది. రెండు లక్షల దీపాలు వెలిగించి గిన్నిస్ రికార్డు నెలకొల్పే లక్ష్యంతో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ దీపావళి నాడు శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చే దృశ్యాలను పునశ్చరణ చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. భారత్ భిన్నత్వం కలిగిన దేశమని, మనమంతా పండుగలను ఎలా, ఎప్పుడు జరుపుకోవాలనే వివరాలను పండితుల నుంచి తెలుసుకుంటామన్నారు. జన్మాష్టమి వంటి పండుగలను నక్షత్రం, ఆరోజు ఉదయం ఉన్న తిథి ప్రకారం జరుపుకుంటారని తెలిపారు. కాశీ పంచాంగాన్ని అనుసరించి దీపావళి అక్టోబర్ 31న వచ్చిందన్నారు.ఇది కూడా చదవండి: 30 కోట్లకు విమాన ప్రయాణికులు -
అయోధ్యకు పోటెత్తిన భక్తజనం
అయోధ్య: దేశవ్యాప్తంగా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో అమ్మవారి ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. పలు దేవాలయాలకు నిలయమైన అయోధ్యకు చేరుకున్న వేలాది మంది భక్తులు ఉదయం నుండి అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే బాలరాముణ్ణి దర్శించుకుంటున్నారు.నవరాత్రులలో మొదటి రోజున నవదుర్గలలో ఒకరైన శైలపుత్రిని పూజిస్తారు. అయోధ్యలో అన్ని దేవాలయాలు అమ్మవారి పూజలతో కళకళలాడుతున్నాయి. ఇక్కడి ఛోటీ దేవ్‌కాళి ఆలయంలో భక్తులు క్యూ కట్టి, అక్కడ కొలువైన సీతామాతను ఆరాధిస్తున్నారు. ఈ ఆలయంలో పూజలు చేయడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని పలువురు నమ్ముతుంటారు.అయోధ్యకు చెందిన పండితులు సత్యేంద్ర దాస్ మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు నవరాత్రులలో మొదటి రోజు. ఈ రోజున చాలామంది తమ ఇళ్లలో కలశాన్ని ప్రతిష్టించి, తొమ్మిది రోజుల పాటు అమ్మవారి పూజలు నిర్వహిస్తారని తెలిపారు. అయోధ్యకు వచ్చిన భక్తురాలు మీరా మాట్లాడుతూ, ఆలయంలో అమ్మవారి దర్శనం చక్కగా అయ్యిందని, అధికారులు భక్తుల కోసం సకల ఏర్పాట్లు చేశారని అన్నారు. మరో భక్తుడు శైలేంద్ర మాట్లాడుతూ ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని అన్నారు. ఇది కూడా చదవండి: 4న సీఎం నివాసాన్ని ఖాళీ చేయనున్న కేజ్రీవాల్ -
అయోధ్యలో నవరాత్రి వేడుకలు.. మారిన దర్శన, హారతి సమయాలు
అయోధ్య: దేశవ్యాప్తంగా దసరా నవరాత్రుల ఉత్సాహం నెలకొంది. యూపీలోని అయోధ్యలోనూ దసరా వేడుకలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ శరన్నవరాత్రులలో రామ్‌లల్లా దర్శన, మంగళ హారతుల సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ తెలిపింది. నవరాత్రుల మొదటి రోజు నుండి ఈ మార్పులు అమలులోకి వస్తాయని ట్రస్ట్ పేర్కొంది. తెల్లవారుజామున 4:30 నుంచి 4:40 గంటల వరకు మంగళ హారతి, 4:40 నుంచి 6:30 గంటల వరకు స్వామివారి అలంకారాలు జరగనున్నాయి. సాయంత్రం 6:30 గంటలకు శృంగార ఆరతి ఉంటుందని సమాచారం. ఇక రామ్‌లల్లా దర్శనం ఉదయం 7:00 గంటలకు ప్రారంభమవుతుంది. ఉదయం 9:00 గంటలకు బాలభోగం నిర్వహించనున్నారు. ఈ సమయంలో ఆలయ తలుపులు ఐదు నిమిషాల పాటు మూసివేయనున్నారు.నవరాత్రులలో లక్షలాది మంది భక్తులు అయోధ్యకు తరలివస్తారని ట్రస్ట్ భావిస్తోంది. ఈ నేపధ్యంలోనే భక్తులకు సులభ దర్శనం కల్పించేందుకు ట్రస్ట్ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. దర్శన వేళల్లో చేసిన నూతన మార్పుల విషయానికొస్తే.. బాలభోగం అనంతరం ఉదయం 9:05కు ఆలయ తలుపులు తెరుస్తారు. 11:45 వరకు దర్శనాలు ఉంటాయి. 11:45 నుండి 12:00 వరకు ప్రభువు ఏకాంతం ఉంటుంది. తిరిగి 12:00 గంటలకు భోగ్ హారతి ఉంటుంది. ఆలయంలో స్వామివారు మధ్యాహ్నం 12:15 గంటలకు నిద్రిస్తారు. ఈ సమయంలో ఆలయ తలుపులను 12:30 నుండి 1:30 వరకు మూసివేస్తారు. అదే సమయంలో భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తారు.మధ్యాహ్నం 1:30కి ఆలయంలోని తలుపులు తెరుస్తారు. దేవతా హారతి నిర్వహిస్తారు. దర్శనాలు మధ్యాహ్నం 1:35 నుండి ప్రారంభమై, సాయంత్రం 4:00 గంటల వరకు కొనసాగుతుంది. అనంతరం ఐదు నిమిషాల పాటు ఆలయ తలుపు మూసివేస్తారు. ఆ తర్వాత 4:05 నుంచి 6:45 వరకు నిరంతర దర్శనం ఉంటుంది. దీని తరువాత సాయంత్రం 6:45 నుండి 7:00 గంటల వరకు 15 నిమిషాల పాటు స్వామివారి ఆలయ తలుపులు మూసివేస్తారు. ఈ సమయంలో భోగ్ అందిస్తారు. సాయంత్రం 7:00 గంటలకు హారతి కార్యక్రమం జరుగుతుంది. రాత్రి 7:00 నుండి 8:30 గంటల వరకు దర్శనం కొనసాగుతుంది. రాత్రి 9:00 గంటలకు భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తారు. 9:30 గంటలకు స్వామివారికి ప్రసాదం సమర్పించి, శయన హారతి అందిస్తారు. అనంతరం 9:45 గంటలకు స్వామివారు నిద్రించేందుకు ఆలయ తలుపులు మూసి వేస్తారు.ఇది కూడా చదవండి: దుర్గా పూజల వేళ.. మెట్రో శుభవార్త -
హైదరాబాద్ నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి అయోధ్య, కాన్పూర్, ప్రయాగరాజ్ ప్రాంతాలకు విమాన సర్వీసులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ - కాన్పూర్, హైదరాబాద్-అయోధ్య మధ్యన వారానికి 4 రోజుల సర్వీసులు నడపనున్నారు. రేపటి(శనివారం) నుంచి హైదరాబాద్ - ప్రయాగరాజ్ మధ్యన, హైదరాబాద్-ఆగ్రా మధ్యన వారానికి 3 రోజుల సర్వీసును ప్రారంభించనున్నారు.హైదరాబాద్ నగరం నుంచి ఒక్క నెలలోనే 7 నూతన సర్వీసుల ప్రారంభం పట్ల కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నూతన సర్వీసులు ఆయా నగరాల మధ్యన ప్రయాణికుల డిమాండ్‌ను నెరవేరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కొత్త సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని కిషన్‌రెడ్డి ప్రయాణికులను కోరారు.ఇదీ చదవండి: ఈ దుఃఖం తీర్చేదెవరు? -
అయోధ్యలో మసీదు నిర్మాణం ఎంతవరకూ వచ్చింది?
అయోధ్య: యూపీలోని అయోధ్యలో నూతనంగా నిర్మిస్తున్న మసీదుకు సంబంధించిన పనులు ఎంతవరకూ వచ్చాయనే ఆసక్తి అందరిలో నెలకొంది. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఆర్థిక కారణాలతో మసీదు పనులు నిలిచిపోయాయి. మసీదును నిర్మిస్తున్న ట్రస్ట్ ఐఐసీఎఫ్‌కు సంబంధించిన నాలుగు కమిటీలు రద్దు అయిన దరిమిలా మసీదు నిర్మాణ పనులు ఆగిపోయాయని తెలుస్తోంది.2019, నవంబర్ 9న సుప్రీంకోర్టు తన చారిత్రాత్మక తీర్పులో అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడానికి ఆమోదం తెలిపింది. దీనితో పాటు మసీదు నిర్మాణానికి ముస్లింలకు ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని కోర్టు పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం మసీదు కోసం మరో ప్రాంతంలో స్థలాన్ని కేటాయించింది. అయితే మసీదు నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. అలాగే మసీదు నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసీఎఫ్)తన నాలుగు కమిటీలను రద్దు చేసింది.ఐఐసీఎఫ్ తెలిపిన వివరాల ప్రకారం ఆర్థిక ఇబ్బందుల కారణంగా మసీదు నిర్మాణ పనులు ఆగిపోయాయి. మసీదు కోసం కేంద్ర ప్రభుత్వం ఐదు ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు ఇచ్చింది. ఈ బోర్డు ఈ భూమిని పరిరక్షించేందుకు ఐఐసీఎఫ్ని ఏర్పాటు చేసింది. ఐఐసీఎఫ్ కార్యదర్శి అథర్ హుస్సేన్ పేర్కొన్న వివరాల ప్రకారం ఈ కమిటీలు మసీదు పేరుతో విరాళాలు సేకరించేందుకు పలు నకిలీ ఖాతాలు తెరిచాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని అథర్ హుస్సేన్ తెలిపారు.మసీదు కోసం కేటాయించిన ఐదు ఎకరాల స్థలంలో సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్, కమ్యూనిటీ మసీదు, లైబ్రరీ నిర్మించాలని ఐఐసీఎఫ్ ప్రతిపాదించింది. అయితే ట్రస్టుకు డబ్బు కొరత ఏర్పడింది. గత నాలుగేళ్లలో ఐఐసీఎఫ్ విరాళంగా కోటి రూపాయలు అందుకుంది. అయితే నిర్మాణ పనులు చేపట్టేందుకు ట్రస్టుకు రూ.3 నుంచి 4 కోట్లు అవసరమవుతాయని తెలుస్తోంది. కాగా మసీదు నిర్మాణ పనులను చేపట్టేందుకు వివిధ సంస్థలతో సమావేశాలు నిర్వహిస్తున్నామని, నిధులు సేకరణ జరిగాక మసీదు నిర్మాణ పనులు ప్రారంభమవుయని ఐఐసీఎఫ్ తెలిపింది. ఇది కూడా చదవండి: రామాయణ ప్రస్తావనతో సీఎం అతిషి భావోద్వేగం -
అయోధ్యలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
యూపీలోని అయోధ్యలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సకల ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాదే ప్రారంభమైన ఈ ఆలయంలో తొలిసారిగా రామనవమి జరిగింది. ఇప్పుడు శ్రీకృష్ణ జన్మాష్టమి వైభవంగా జరుగుతోంది.ట్రస్టు సభ్యులు డా అనిల్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ శ్రీకృష్ణాష్టమి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఈరోజున బాలరామునికి ఒకటిన్నర క్వింటాళ్ల నైవేద్యాన్ని సమర్పించనున్నామని తెలిపారు. నేడు రోజుంతా భజన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. జన్మాష్టమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకం, అలంకరణ నిర్వహించామన్నారు. సాయంత్రం భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు. -
అయోధ్యలో కృష్ణాష్టమి వేడుకలకు సన్నాహాలు
అయోధ్యలోని నూతన రామాలయంలో తొలిసారిగా కృష్ణాష్టమి వేడుకలు జరగనున్నాయి. ఇందుకు ఘనంగా సన్నాహాలు జరుగుతున్నాయి. రామనగరిలోని మఠాలు, ఆలయాల్లో ఉత్సవశోభ నెలకొంది. నూతన రామాలయంలో బాలరాముని ప్రతిష్ఠ తరువాత జరుగుతున్న తొలి జన్మాష్టమి వేడుకలు ఇవి.జన్మాష్టమి నాడు రామ్‌లల్లాకు 50 కిలోల పంచామృతంతో అభిషేకం చేయనున్నారు. సాయంత్ర వేళ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రామనగరి అయోధ్యలో కృష్ణభక్తి కూడా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో పురాతన కృష్ణ దేవాలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయాలన్నింటిలో కూడా జన్మాష్టమి వేడుకలు నిర్వహించనున్నారు.అయోధ్యలో రెండు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. బాలరాముని ఆస్థానంలో ఆగస్టు 26న జన్మాష్టమి వేడుకలు జరుపుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయోధ్యలోని గోకుల్ భవన్, బ్రిజ్మోహన్ కుంజ్, రాధా బ్రిజ్రాజ్ ఆలయం, రాజ్ సదన్ వద్ద ఉన్న రాధా మాధవ్ ఆలయం, గురుధామ్, ఇస్కాన్ ఆలయాల్లో జన్మాష్టమి వేడుకలకు సన్నాహాలు పూర్తయ్యాయి. -
మోదీని పొగిడిన భార్యకు తలాక్...
బహ్రెయిచ్: అయోధ్యలో అభివృద్ధికి ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్ కారణమంటూ పొగడటమే ఆ మహిళ చేసిన నేరం. ఇందుకు ఆగ్రహిస్తూ భర్త ఆమెకు మూడుసార్లు తలాక్ చెప్పేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు భర్తతోపాటు అతడి ఏడుగురు కుటుంబసభ్యులపైనా కేసులు నమోదు చేశారు. బహ్రెయిచ్ జిల్లా మొహల్లా సరాయ్‌కి చెందిన బాధితురాలికి గతేడాది డిసెంబర్లో అయోధ్యకు చెందిన అర్షద్‌తో వివాహమైంది. మెట్టినింటికి వెళ్లాక అయోధ్యలో రోడ్లు, ఆ నగరం, అక్కడి వాతావరణం ఆమెకు నచ్చాయి.ఇదే విషయాన్ని భర్తకు చెప్పింది. ప్రధాని మోదీ, సీఎం యోగియే ఇందుకు కారణమని తెలిపింది. దీంతో, అర్షద్‌కు కోపం వచ్చి ఆమెను వెంటనే పుట్టింటికి పంపేశాడు. బంధువులు నచ్చజెప్పి, ఆమెను తిరిగి అయోధ్యకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆమెను కొడుతూ, తిడుతూ వేధిస్తున్నాడు. ప్రధాని మోదీ, సీఎం యోగిపై దుర్భాషలాడుతున్నాడు. అత్త, మరదళ్లు, మరుదులు కలిసి ఆమెను చంపేందుకు యత్నిస్తున్నారు. అర్షద్ చివరికామెకు మూడుసార్లు తలాక్ చెప్పాడు. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.