ఈ ఏడాది నవంబర్ నాటికి అయోధ్య రామాలయ మొదటి అంతస్తు (రామ్‌లల్లా దర్బారు) సిద్ధం కానున్నదని రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. సర్క్యూట్ హౌస్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ నిర్ణీత గడువులోగానే రామమందిర నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు.
నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, టెంపుల్ పార్కు, ఇతర సౌకర్యాల కోసం జరుగుతున్న పనులను పరిశీలించామని మిశ్రా తెలిపారు. ఆలయంలోని మొదటి, రెండో అంతస్తుల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయడంపై దృష్టి సారించామని, రామ్‌లల్లా దర్బారు నవంబర్ నాటికి పూర్తికానున్నదని పేర్కొన్నారు.
ఇదిలావుండగా అయోధ్య తీర్థ వికాస్ పరిషత్ ప్రధాన కార్యాలయాన్ని రామనగరిలో నెలకొల్పనున్నారు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్, అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయాల కోసం కొత్త భవనాలను నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఆలయ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆలయ నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ఏజెన్సీ టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్ ఆనంద్ మెహతా తెలిపారు.
మార్చి నెలాఖరులోగా కాశీ-అయోధ్య మధ్య హెలికాప్టర్ సర్వీసు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరాన్ని కేవలం 55 నిమిషాల్లోనే పూర్తిచేయవచ్చు. ఒక్కో ప్రయాణికునికి ఛార్జీ రూ.14,159 చొప్పున వసూలు చేయనున్నారు. ఒక ట్రిప్పులో ఐదుగురు ప్రయాణించే అవకాశం ఉండనుంది. ఈ హెలికాప్టర్ సేవలను ఉత్తరాఖండ్‌కు చెందిన రాజాస్ ఏరోస్పోర్ట్ అండ్ అడ్వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ అందించనుంది.
Comments
Please login to add a commentAdd a comment