జనవరి నుంచి సెప్టెంబర్ వరకు అయోధ్యకు 13.55 కోట్ల మంది పర్యాటకులు
తాజ్‌మహల్‌ను సందర్శించిన వారు 12.51 కోట్ల మంది
అయోధ్యకు 3,153 మంది విదేశీయులు రాక
తాజ్‌మహల్‌కు పెరిగిన విదేశీ పర్యాటకులు, తగ్గిన దేశీయ పర్యాటకులు
అయోధ్య కంటే వారణాసి, మధురపై విదేశీయుల ఆసక్తి
ఇప్పటివరకు పర్యాటకుల సంఖ్యలో అగ్రస్థానంలో ఉన్న ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను ఆయోధ్య రామ మందిరం వెనక్కి నెట్టి, మొదటి స్థానంలోకి వచ్చిoది. 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు అత్యధికంగా పర్యాటకులు సందర్శించిన నగరంగా ఆయోధ్య రికార్డులకు ఎక్కింది. ఈ 9 నెలల్లో ఆగ్రాను 12.51 కోట్ల మంది సందర్శించగా.. అయోధ్యను 13.55 కోట్ల మంది సందర్శించినట్లు పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఈ ఏడాది జనవరి 22న ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా అట్టహాసంగా ప్రారంభమై అయోధ్య రామ మందిరం దేశీయ ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా చేరింది. విదేశీయులు 3,153 మంది మాత్రమే అయోధ్య రామ మందిరాన్ని సందర్శించారు.
ఆధ్యాత్మిక పర్యాటకంలో అయోధ్య దూసుకుపోతోందని ట్రావెల్ ప్లానర్స్ చెబుతున్నారు. ఆధ్యాత్మిక పర్యాటకుల్లో 70 శాతం మంది రామమందిరం, సరయు నది అందాలను తిలకిస్తూ పరవశించిపోతున్నారని చెబుతున్నారు. – సాక్షి, అమరావతి
Comments
Please login to add a commentAdd a comment