Ram mandir
-
కోదండ రాముడి విగ్రహ ప్రతిష్ఠలో వైఎస్ జగన్
సాక్షి,పులివెందుల : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా బుధవారం లింగాల మండలం తాతిరెడ్డి పల్లిలో కోదండ రాముడి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్నారు. వైఎస్ జగన్ తన హయాంలో రామాలయానికి రూ.34లక్షలు మంజూరు చేశారు. ఇక, వైఎస్ జగన్ రాకతో తాతిరెడ్డిపల్లిలో పండగ వాతావరణం నెలకొంది. తమ అభిమాన నేత రావడంతో ప్రజలు వైఎస్ జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్ జగన్ సైతం గ్రామ గ్రామానా ప్రజానీకంతో మమేకం అవుతూ,వారిని పలుకరిస్తూ ముందుకు కదిలారు. -
'ఇది మాకు దక్కిన గొప్ప ఆశీర్వాదం'.. ఉపాసన ట్వీట్
మెగా హీరో రామ్ చరణ్ సతీమణి ప్రస్తుతం ఆధ్యాత్మిక సేవలో బిజీగా ఉంది. తాజాగా అయోధ్యలోని రామమందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విటర్లో పంచుకున్నారు. సనాతన ధర్మం గురించి మా తాత చాలా నేర్పించారని ఈ సందర్భంగా ఉపాసన గుర్తు చేసుకున్నారు. ఇక్కడ సేవ చేసే అవకాశం లభించడం మాకు గొప్ప ఆశీర్వాదం లాంటిదని పోస్ట్ చేశారు.ఆయన మాటల స్ఫూర్తితోనే అయోధ్య రామమందిరానికి వచ్చే భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు ఉపాసన తెలిపారు. ఈ సందర్భంగా అయోధ్యలో ఏర్పాటు చేసిన అపోలో అత్యవసర సంరక్షణ కేంద్రాన్ని(అపోలో ఎమర్జన్సీ కేర్ సెంటర్) ప్రారంభించామని వెల్లడించారు. ఇప్పటికే తిరుమల, శ్రీశైలం, కేదార్నాథ్, బద్రీనాథ్‌లో సేవలందిస్తున్నట్లు ట్వీట్ చేశారు. రామజన్మ భూమిలో సేవ చేయడం అదృష్టమని పేర్కొన్నారు. ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ఉపాసన పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శంకర్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. Thatha taught us that true Sanatan Dharma for us lies in healing with dignity & empathy. Inspired by his words we opened a free Emergency Care Centre at the Ram Mandir in Ayodhya.After successfully serving in Tirumala, Srisailam, Kedarnath, and Badrinath, we are blessed to… pic.twitter.com/YcCVf0ZM61— Upasana Konidela (@upasanakonidela) December 15, 2024 -
అయోధ్యలో కృష్ణాష్టమి వేడుకలకు సన్నాహాలు
అయోధ్యలోని నూతన రామాలయంలో తొలిసారిగా కృష్ణాష్టమి వేడుకలు జరగనున్నాయి. ఇందుకు ఘనంగా సన్నాహాలు జరుగుతున్నాయి. రామనగరిలోని మఠాలు, ఆలయాల్లో ఉత్సవశోభ నెలకొంది. నూతన రామాలయంలో బాలరాముని ప్రతిష్ఠ తరువాత జరుగుతున్న తొలి జన్మాష్టమి వేడుకలు ఇవి.జన్మాష్టమి నాడు రామ్‌లల్లాకు 50 కిలోల పంచామృతంతో అభిషేకం చేయనున్నారు. సాయంత్ర వేళ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రామనగరి అయోధ్యలో కృష్ణభక్తి కూడా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో పురాతన కృష్ణ దేవాలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయాలన్నింటిలో కూడా జన్మాష్టమి వేడుకలు నిర్వహించనున్నారు.అయోధ్యలో రెండు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. బాలరాముని ఆస్థానంలో ఆగస్టు 26న జన్మాష్టమి వేడుకలు జరుపుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయోధ్యలోని గోకుల్ భవన్, బ్రిజ్మోహన్ కుంజ్, రాధా బ్రిజ్రాజ్ ఆలయం, రాజ్ సదన్ వద్ద ఉన్న రాధా మాధవ్ ఆలయం, గురుధామ్, ఇస్కాన్ ఆలయాల్లో జన్మాష్టమి వేడుకలకు సన్నాహాలు పూర్తయ్యాయి. -
49 మందికే రామ్ మందిర్ వాచ్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!
స్విస్ వాచ్ తయారీదారు జాకబ్ & కో భారతదేశంలోని దాని రిటైలర్ భాగస్వామి ఎథోస్ వాచ్ బోటిక్స్ సహకారంతో 'రామ్ జన్మభూమి ఎడిషన్ వాచ్' లాంచ్ చేసింది. ఈ వాచ్ కేవలం 49 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. దీని ధర 41000 డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 34,00,000.జాకబ్ & కో లాంచ్ చేసిన ఈ వాచ్ ఈ వాచ్‌లో అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరం, రాముడు, హనుమంతుని నమూనాలు ఉన్నాయి. ఇది కుంకుమపువ్వు రంగులో ఉంది. దీనికి కేవలం 49మంది మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది.భారతీయ సంస్కృతికి నిదర్శనంగా సంస్థ ఈ వాచ్ లాంచ్ చేసింది. ఈ వాచ్‌లో 9 గంటల వద్ద రామ మందిరం, 2 గంటల వద్ద రాముడు, 4 గంటల వద్ద హనుమంతుడు ఉండటం చూడవచ్చు. ఈ వాచ్ కలర్ ఆధ్యాత్మికతకు ప్రతీకగా చెబుతున్నారు. దీనిని ప్రధానంగా సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ప్రతిధ్వనించేలా రూపొందించారు. View this post on Instagram A post shared by WatchTime India (@watchtimeindia) -
అయోధ్యలో మూడు కీలక మార్పులు
అయోధ్యలో కొలువైన బాలక్ రాముని దర్శించుకునేందుకు లక్షలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. తాజాగా శ్రీరామ జన్మభూమి ఆలయ ట్రస్టు భక్తుల సౌలభ్యం కోసం మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తులలో నెలకొన్న అసంతృప్తిని దూరం చేసేందుకు ఈ నిర్ణయాలు ఉపయోగపతాయని ట్రస్టు భావిస్తోంది.ఇకపై ఆయోధ్య రామాలయానికి వచ్చే ప్రముఖులకు, సెలబ్రిటీస్‌కు చందనం రాయడం లేదా తిలకం పెట్టడం లాంటివి చేయరు. చరణామృతం(తీర్థం) ఎవరికీ ఇవ్వరు. అలాగే అక్కడి పూజారులకు దక్షిణ ఇవ్వకూడదు. దానిని విరాళం రూపంలోనే సమర్పించాల్సి ఉంటుంది.రామాలయంలో భక్తులందరినీ సమానంగా చూడడం లేదనే ఆరోపణలు వస్తున్న దరిమిలా శ్రీరామ జన్మభూమి ఆలయ ట్రస్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఆలయానికి వచ్చే ప్రముఖులకు ప్రత్యేక సౌకర్యాలు లభిస్తున్నాయి. వారికి గంధం పూస్తున్నారు. తిలకం దిద్దుతున్నారు. చరణామృతం అందజేస్తున్నారు. ఈ విధానాన్ని ఇప్పుడు ట్రస్ట్ రద్దు చేసింది. ఇకపై రామాలయానికి వచ్చే ఎవరినీ ప్రత్యేకంగా గుర్తించరు. రామభక్తులందరినీ సమానంగానే పరిగణించనున్నారు. -
అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేసిన ఆచార్య లక్షీకాంత్ కన్నుమూత
అయోధ్యలోని రామాలయంలో బాల రాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించిన ఆచార్య లక్షీకాంత్ దీక్షిత్ (90) వారణాసిలో కన్నుమూశారు. నేడు(శనివారం) మణికర్ణికా ఘాట్‌లో ఆచార్య లక్ష్మీకాంత్ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.ఆచార్య లక్ష్మీకాంత్ మృతి చెందారనే వార్త తెలియగానే కాశీ, అయోధ్యలలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఏడాది జనవరిలో అయోధ్యలో జరిగిన బాలరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో లక్ష్మీకాంత్ దీక్షిత్ కీలక పాత్ర పోషించారు. ఆయన ఆధ్వర్యంలో పూజాదికాలు జరిగాయి. ఆయన కుటుంబం తరతరాలుగా కాశీలో ఉంటోంది.లక్ష్మీకాంత్ వారణాసిలోని సంగ్వేద కళాశాలలో సీనియర్ ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఈ కళాశాలను కాశీ రాజు స్థాపించారు. లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రముఖ యజుర్వేద పండితులలో ఒకనిగా పేరుగాంచారు. హిందువులు ఆచరించే పూజా విధానాలపై ఆయనకు లోతైన అవగాహన ఉంది. తన మేనమామ గణేష్ దీక్షిత్ దగ్గర లక్ష్మీకాంత్ వేదాలు అభ్యసించారు. -
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
రాయ్‌పూర్: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రచారంలో శరవేగంగా దూసుకుపోతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి మాత్రం రోజురోజుకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పలువురు నేతలు పార్టీలకు రాజీనామా చేయటం తీవ్ర తలనొప్పిగా మారింది.తాజాగా ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ నేత రాధికా ఖేరా కాంగ్రెస్ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు.‘‘అయోధ్యలోని రామమందిరం సందర్శించినందుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చాలా తీవ్రమైన వివక్షను ఎదుర్కొన్నా. ఎన్ఎస్యూఐ నుంచి కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగానికి 22 ఏళ్లుగా నా జీవితం అంకితం చేశా. పార్టీకి చాలా నిజాయితీగా పని చేశా. కానీ, నేను అయోధ్య రామ మందిరానికి మద్దతు తెలిపటం కారణంగా పార్టీలో చాలా వ్యతిరేకతను అనుభవించా. నేను ఒక మహిళను. న్యాయం కోసం, దేశం కోసం పోరాడుతా. కానీ, కాంగ్రెస్ పార్టీలో పోరాడటంలో ఓడిపోయా. ఒక రామ భక్తురాలిగా నేను చాలా బాధించబడ్డాను’’ అని రాధికా ఖేరా తెలిపారు. -
అయోధ్యలో 10 పడకల మినీ ఆసుపత్రి!
మండుతున్న ఎండల్లో అయోధ్యకు వస్తున్న భక్తులకు వైద్య సదుపాయాలు అందించేందుకు రామాలయ ట్రస్ట్ 10 పడకల మినీ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకువచ్చింది. దర్శనం సమయంలో భక్తులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా ఈ నూతన ఆసుపత్రిలో చికిత్స అందించనున్నారు. అయోధ్యలో భక్తుల కోసం మినీ ఆసుపత్రితోపాటు దర్శన్ మార్గ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ట్రస్ట్ మీడియాకు తెలిపింది. మండుతున్న ఎండల్లో రామభక్తులకు ఉపశమనం కలిగించేందుకు రామ మందిర ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం జన్మభూమి పాడ్ నుంచి రామాలయం వరకు వివిధ ప్రాంతాల్లో వసతి ఏర్పాట్లు చేసినట్లు ట్రస్ట్ తెలిపింది.రామజన్మభూమి మార్గంలో ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ప్రయాణికుల సౌకర్యాల కేంద్రంలో వెయ్యిమంది విశ్రాంతి తీసుకోవచ్చు. ఇక్కడ కూలర్లు, ఫ్యాన్లు, తాగునీటి సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. ఈ సేవా కేంద్రంలోనే 10 పడకల మినీ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు.మూడు రోజుల క్రితం రామజన్మభూమి కాంప్లెక్స్‌లో ఇద్దరు భక్తులు అపస్మారక స్థితికి చేరారు. వారిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటన తర్వాత ట్రస్ట్ వెనువెంటనే 10 పడకల మినీ ఆసుపత్రిని భక్తులకు అందుబాటులో ఏర్పాటు చేసింది. ఈ మినీ ఆసుపత్రిలో సాధారణ వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు రామమందిర ట్రస్టు సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా తెలిపారు. ఇక్కడ వైద్యులతో పాటు సిబ్బందిని కూడా నియమించారన్నారు. అలాగే అంబులెన్స్ సౌకర్యం కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. -
శ్రీరామ నవమికి అయోధ్య వెళ్తున్నారా?.. వీటినీ సందర్శించండి!
అయోధ్యలో నూతన రామాలయం నిర్మితమయ్యాక భక్తుల తాకిడి మరింతగా పెరిగింది. దేశవిదేశాల నుంచి కూడా భక్తులు శ్రీరాముని జన్మస్థలికి తరలివస్తున్నారు. ఏప్రిల్ 17న అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయోధ్యలో నూతన రామాలయంతో పాటు తప్పక సందర్శించాల్సిన మరికొన్ని స్థలాలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 1. హనుమాన్‌గర్హి అయోధ్యలో పురాతన సిద్ధపీఠం హనుమాన్‌గర్హి ఆలయం ఉంది. రామాలయాన్ని దర్శించుకునే ముందు భక్తులు హనుమాన్‌గర్హికి వెళ్లాలని స్థానికులు చెబుతుంటారు. ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు హనుమాన్గర్హిని సందర్శిస్తారు. 2. కనక్ భవన్ త్రేతా యుగంలో పట్టపు రాణి కైకేయి.. సీతామాతకు ఈ రాజభవనాన్ని కానుకగా ఇచ్చారని చెబుతారు. కనక్భవన్లో శ్రీరామునితో పాటు సీతామాత, శ్రీరాముని నలుగురు సోదరుల విగ్రహాలు కొలువుదీరి ఉన్నాయి. సీతారాముల దర్శనం, పూజల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు కనక్ భవన్‌కు తరలివస్తుంటారు. 3. దశరథ్ మహల్ దశరథ్ మహల్ కూడా అత్యంత పురాతనమైనది. త్రేతా యుగానికి చెందినదని చెబుతారు. దశరథ మహారాజు ఈ రాజభవనంలో ఉండేవాడట. దరశరథుని కుటుంబమంతా ఈ ప్యాలెస్‌లో కనిపిస్తుంది. 4. నాగేశ్వర్ నాథ్ ఆలయం శ్రీరాముని కుమారుడైన కుశుడు నిర్మించిన నాగేశ్వర్ నాథ్ ఆలయం రామ్ కి పాడిలో ఉంది. శ్రావణమాసంలోను, శివరాత్రి సందర్భంగానూ లక్షలాది మంది భక్తులు నాగేశ్వర్ నాథ్ ఆలయానికి తరలివస్తుంటారు. 5. బహు బేగం సమాధి బహు బేగం సమాధి కూడా అయోధ్యలోనే ఉంది. పర్యాటకులు కుటుంబ సమేతంగా ఇక్కడి అందమైన పూల తోటకు వచ్చి సేద తీరుతారు. 6. సూర్య కుండ్ త్రేతా యుగంలో శ్రీరాముడు లంకను జయించి అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు, అయోధ్యవాసులతో పాటు దేవతలు ఆయనకు స్వాగతం పలికారు. ఆ సమయంలో సూర్యభగవానుడు కూడా ఒక నెలరోజుల పాటు అయోధ్యలో ఉన్నాడట. దీనికి గుర్తుగానే సూర్యకుండ్ నేటికీ ఇక్కడ కనిపిస్తుంది. ఇది దర్శన్ నగర్లో ఉంది. లేజర్ షో ద్వారా శ్రీరాముని కథను ఇక్కడ ప్రదర్శిస్తారు. 7. రామ్ కి పాడి రామ్ కి పాడిని అయోధ్యకు కేంద్ర బిందువుగా చెబుతారు. ఇక్కడ రామాయణాన్ని లేజర్ షో ద్వారా ప్రదర్శిస్తారు. ఈ ప్రదేశంలో దీపాల పండుగను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు రామ్ కి పాడికి తరలివస్తారు. ఇక్కడి సరయూమాతను పూజిస్తారు. 8. సరయూ తీరం పెద్ద సంఖ్యలో భక్తులు సరయూ తీరాన్ని చూసేందుకు తరలి వస్తుంటారు. సరయూ నది ఒడ్డున స్నానం చేయడం ద్వారా పాపాల నుండి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతుంటారు. 9. గుప్తర్ ఘాట్ గుప్తర్ ఘాట్ కూడా సరయూ నది ఒడ్డున ఉంది. ఈ ఘాట్ మీదుగానే శ్రీ రాముడు తన నివాసానికి వెళ్లేవాడని చెబుతుంటారు. గుప్తర్ ఘాట్ పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. -
రామ్‌ల్లా వెండి నాణెం విడుదల.. ధర ఎంతంటే..
అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమయ్యాక రామ్‌లల్లాను దర్శించుకునేందుకు వేలాదిగా భకులు తరలివస్తున్నారు. వీరు ఇక్కడి వస్తువులను కొనుగోలు చేసి, తమతో పాటు తీసుకువెళుతున్నారు. అయోధ్యకు వచ్చి రామ్‌లల్లా దర్శనం చేసుకోలేని వారు ఆన్లైన్లో ప్రసాదాన్ని తెప్పించుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వం 50 గ్రాముల అయోధ్య రామాలయ వెండి నాణేలను ప్రజలకు విక్రయించేందుకు విడుదల చేసింది. ఈ నాణెం ధర రూ. 5,860. 50 గ్రాముల బరువున్న ఈ నాణెం 999 స్వచ్ఛమైన వెండితో తయారు చేశారు. దీన్ని ఎస్‌పీఎంసీఐసీఎల్‌ఐ వెబ్సైట్ నుండి ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు. ఈ నాణెంలో ఒక వైపు రామ్ లల్లా విగ్రహం, మరొక వైపు రామాలయ దృశ్యం కనిపిస్తాయి. ఆలయంలోని రామ్‌లల్లా విగ్రహాన్ని శిల్పి అరుణ్ యోగి రాజ్ రూపొందించారు. దీనిని ఇంటిలోని పూజా మందిరంలో ఉంచవచ్చని, లేదా ఎవరికైనా బహుమతిగా ఇవ్వవచ్చని ట్రస్ట్ తెలిపింది. ప్రధాని మోదీ గత జనవరి 22న అయోధ్య రామాలయంలో రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యకమం జరగుతుండగా ఆర్మీ హెలికాప్టర్లు ఆలయంపై పూలవర్షం కురిపించాయి. ఆరోజు మొదలుకొని అయోధ్యలో సందడి కొనసాగుతోంది. -
అయోధ్యలో బంగారు రామాయణం
అయోధ్యకు వచ్చే రామభక్తులకు ఇప్పుడు మరొక కానుక అందనుంది. అదే బంగారు రామాయణ దర్శనభాగ్యం. ఈ రామాయణాన్ని నూతన రామాలయంలోని గర్భగుడిలో ప్రతిష్ఠించారు. ఈ ప్రత్యేక బంగారు రామాయణాన్ని మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన మాజీ ఐఎఎస్ అధికారి సుబ్రమణ్యం లక్ష్మీనారాయణన్, అతని భార్య సరస్వతి రామాలయ ట్రస్ట్‌కు అందించారు. శ్రీరామ నవరాత్రులలో మొదటి రోజున ఈ రామాయణ ప్రతిష్ఠాపన జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మీ నారాయణ్ దంపతులు పాల్గొన్నారు. చెన్నైకి చెందిన వుమ్మిడి బంగారు జ్యువెలర్స్ ఈ బంగారు రామాయణాన్ని తయారు చేసింది. గర్భగుడిలోని రామ్‌లల్లా విగ్రహానికి 15 అడుగుల దూరంలో ఒక రాతి పీఠంపై ఈ రామాయణాన్ని ప్రతిష్ఠించారు. ఈ రామాయణ గ్రంథం పైభాగంలో వెండితో చేసిన రాముడి పట్టాభిషేక దృశ్యం కనిపిస్తుంది. ఈ రామాయణ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో రామాలయ నిర్మాణ ఇన్చార్జి గోపాల్‌రావు, పూజారి ప్రేమ్‌చంద్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలయ్యాక రామ్‌లల్లా సన్నిధికి లాలూ
అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమైన తరువాత ఈ నెలలో తొలిసారిగా శ్రీరామ నవమి వేడుకలు జరగనున్నాయి. ఇందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇదిలావుండగా రానున్న ఎన్నికల్లో బీజేపీకి రామాలయ అంశం కలిసివచ్చేదిగా కనిపిస్తోంది. దీంతో ఇతర పార్టీల నేతలు కూడా అయోధ్య రామాలయంవైపు దృష్టి సారిస్తున్నారు. తాజాగా బీహార్‌లోని పాటలీపుత్ర ఎంపీ మిసా భారతి మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు తాను కూడా త్వరలో అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించనున్నానని తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నామని, ఎన్నికల అనంతరం రామాలయానికి వెళ్తామన్నారు. కాగా బీహార్ సీఎం నితీష్ కుమార్.. ప్రధాని మోదీ పాదాలను తాకడంపై మిసా భారతి మాట్లాడుతూ అది మన సంస్కృతి అని అన్నారు. -
మరో బాలరాముని విగ్రహాన్ని తయారుచేసిన యోగిరాజ్
ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ బాలరాముని చిన్న నమూనా విగ్రహాన్ని తయారు చేశారు. ఈయన గతంలో అయోధ్య రామాలయానికి రామ్‌లల్లా విగ్రహాన్ని తయారు చేశారు. యోగిరాజ్ తన ట్విట్టర్ హ్యాండిల్లో బాలరాముని చిన్న నమూనా రూపానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. యోగిరాజ్ ట్విట్టర్లో తాను రాతితో రామ్‌లల్లా చిన్న విగ్రహాన్ని తయారు చేశానని తెలిపారు. వెండి సుత్తితో, బంగారు ఉలితో రామ్‌లల్లా కళ్లను చెక్కానని పేర్కొన్నారు. ఈ భూమిపై తాను ఎంతో అదృష్టవంతుడినని, తన పూర్వీకుల ఆశీస్సులు, శ్రీరాముని ఆశీస్సులు తనకు ఎప్పుడూ ఉంటాయని భావిస్తున్నానని పేర్కొన్నారు. అరుణ్ యోగిరాజ్ 2008 నుంచి శిల్పాలు తయారు చేస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండియా గేట్ వద్ద 30 అడుగుల సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని కూడా యోగిరాజ్ రూపొందించారు. అలాగే కేదార్‌నాథ్‌లోని 12 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహం, మైసూర్ జిల్లాలోని చుంచన్కట్టేలో 21 అడుగుల ఎత్తయిన హనుమాన్ విగ్రహాలను యోగిరాజ్ తీర్చిదిద్దారు. -
500 ఏళ్ల తర్వాత అయోధ్యలో హోలీ వేడుకలు
భగవాన్ రామ్‌లల్లా నూతన రామాలయంలో కొలువైన దరిమిలా రామనగరిలో ప్రతి క్షణం ఉత్సాహం కనిపిస్తోంది. దాదాపు 500 ఏళ్ల పోరాటం తర్వాత రామాలయం రూపుదిద్దుకుంది. దీంతో బాలరాముడు తన జన్మ స్థలంలో భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ఇకపై ప్రతి పండుగను అయోధ్యలో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కోవలో అయోధ్యలో 500 ఏళ్ల తరువాత హోలీ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ హోలీ చారిత్రాత్మకంగా నిలిచిపోనుంది. ఈనెల 25న జరగబోయే హోలీ వేడుకలకు రామాలయం ముస్తాబవుతోంది. రామ భక్తులు ఆరోజు బాలరామునితో హోలీ వేడుకలు చేసుకోనున్నారు. హోలీ నాడు 56 వంటకాలను బాలరామునికి నైవేద్యంగా సమర్పించనున్నారు. అలాగే ఆరోజున ఇక్కడికి వచ్చే భక్తులందరికీ ప్రసాద వితరణ చేయనున్నారు. రామమందిరం ట్రస్ట్ కార్యాలయ ఇన్చార్జి ప్రకాష్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ ఇకపై హోలీ వేడుకలు రాముని ఆస్థానంలో జరగనున్నాయని, ఈ నేపధ్యంలో అయోధ్య అంతటా ఆనందం నెలకొన్నదన్నారు. ఇందుకోసం రామమందిర ట్రస్ట్ సన్నాహాలు చేస్తున్నదన్నారు. హోలీ వేడుకల సందర్భంగా అయోధ్యలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. -
UNGA: పాకిస్తాన్‌కు రుచిరా కంబోజ్ కౌంటర్
ఐక్యరాజ్య సమతిలో పాకిస్తాన్ రాయబారిపై భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కంబోజ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ ఒక పగలగొట్టబడిన రికార్డు అని ఆమె ఎద్దేవా చేశారు. శుక్రవారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్ రాయబారి మునీర్ అక్రమ్ చేసిన వ్యాఖ్యలపై రుచిరా కంబోజ్ ఘాటుగా స్పందించారు. ‘ఇస్లామోఫోబియాను ఎదుర్కొవటానికి చర్యలు’పై తీర్మాన్నాని ప్రవేశపెట్టే సందర్భంలో పాక్ రాయబారి మునీర్ అక్రమ్ భారత దేశానికి సంబంధించిన రామ మందిర్ నిర్మాణం, సీఏఏ అమలు అంశాలను ప్రస్తావించారు. మునీర్ అక్రమ్ చేసిన వ్యాఖ్యలపై రుచిరా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘మా దేశం (భారత్)కు సంబంధించిన విషయాలపై పాకిస్తాన్ చాలా పరిమితమైన, తప్పుదోవ పట్టించే అభిప్రాయాలు కలిగి ఉండటం దురదృష్టకరం. ప్రపంచం మొత్తం ఒకవైపు అభివృద్ది మార్గంలో దూసుకువెళ్తుంటే పాక్ తీవ్ర విషాదంతో కూడిన స్తబ్దతను కనబరుస్తోంది. ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ఒక పగలగొట్టబడిన రికార్డు’ అని రుచిరా మండిపడ్డారు. ఇక పాకిస్తాన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా 115 దేశాలు ఓటు వేయాగా.. ఎవరు వ్యతిరేకంగా ఓటు వేయలేదు. కానీ, 44 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఇండియాతోపాటు బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఉక్రెయిన్, యూకే ఓటింగ్‌లో పాల్గొనలేదు. -
అయోధ్యలో మరో ఉత్సవానికి సన్నాహాలు.. 24 గంటలూ దర్శనం!
అయోధ్యలోని రామాలయంలో బాలక్ రాముని ప్రాణప్రతిష్ఠ అనంతరం ఇప్పుడు మరో ఉత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బాలరాముని జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. అయోధ్యలో బాలరాముని పుట్టినరోజును ఏప్రిల్ 17న నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ తలుపులు మూడు రోజుల పాటు 24 గంటలూ తెరచి ఉండనున్నాయి. భగవంతునికి నైవేద్యం సమర్పించేటప్పుడు, అలంకారం చేసేటప్పుడు మాత్రమే తలుపులు మూసివేయనున్నారు. శ్రీరాముని జన్మదినోత్సవ వేడుకలకు అయోధ్యకు వచ్చే రామభక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం రామాలయ తలుపులు సాధారణ భక్తుల దర్శనం కోసం ఉదయం 6:30 గంటల నుంచి రాత్రి 9:30 వరకు తెరిచి ఉంటున్నాయి. అయితే బాలరాముని జన్మదిత్సవాన్ని పురస్కరించుకుని దర్శన సమయాన్ని పెంచనున్నారు. ఈ ఉత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్ మీడియాకు తెలిపారు. ఇక్కడకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
‘అక్కడ రాముడుంటే.. ఇక్కడ మురుగన్’.. డీంఎంకే కొత్త ప్లాన్?
భారతీయ జనతా పార్టీ అయోధ్యలో నూతన రామాలయాన్ని ప్రారంభించి, తన ఖ్యాతిని పెంచుకుందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్న వేళ.. తమిళనాట అధికార డీఎంకే ‘మురుగన్’ను ఆశ్రయిస్తున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో విశేషంగా పూజలు అందుకునే మురుగన్ (కుమారస్వామి)ని ఆరాధిస్తూ డీఎంకే ప్రభుత్వం రాబోయే జూన్ లేదా జూలైలో అంతర్జాతీయ ఉత్సవాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిలో మురుగన్ చిత్రాలతో కూడిన ఎగ్జిబిషన్, సదస్సులు నిర్వహిస్తామని హిందూ ధార్మిక, ధర్మాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు తెలిపారు. తమిళనాడులో రాజకీయ పార్టీలు ‘మురుగన్’ వైపు మొగ్గు చూపడం కొత్తేమీ కాదు. 2020లో ఎల్ మురుగన్ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీ ‘వేల్ యాత్ర’ నిర్వహించింది. డీఎంకే కొంత వరకు నాస్తిక భావజాలాన్ని కలిగివుందని అంటుంటారు. అయితే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం దేవుణ్ణి ఆశ్రయించడం ఇదే తొలిసారి. హిందుత్వంపై తనదైన ముద్రను పెంచుకుంటున్న బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకే డీఎంకే ఈ ఎత్తుగడ వేసిందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మురుగన్ సదస్సు ద్వారా ఎన్నికల్లో లాభపడాలని డీఎంకే భావిస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు. కాగా డీఎంకే సారధ్యలో మురుగన్ సదస్సు నిర్వహణపై బీజేపీ విమర్శలు గుప్పించింది. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆర్.శ్రీనివాసన్ మాట్లాడుతూ మొదట డీఎంకే పార్టీ కేంద్ర ప్రభుత్వ పథకాలను కాపీ కొట్టిందని, ఇప్పుడు బీజేపీ భావజాలాన్ని, రాజకీయాలను కాపీ కొడుతున్నదని ఆరోపించారు. మురుగన్‌ను తమిళనాడుకు మాత్రమే పరిమితం చేయలేమని, మురుగన్‌ను దేశవ్యాప్తంగా పూజిస్తారని, డీఎంకే మాయలో ప్రజలు ఎప్పటికీ పడిపోరని పేర్కొన్నారు. బీజేపీ నేతల ఆరోపణలపై రాష్ట్ర మంత్రి శేఖర్‌బాబు స్పందిస్తూ, మురుగన్ అంతర్జాతీయ ఉత్సవ నిర్వహణలో ఎలాంటి రాజకీయం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మురుగన్ ఆలయాల కోసం ఖర్చు చేస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌లో తిరుచెందూర్ మురుగన్ ఆలయాన్ని చేర్చామని, ఆలయ పునరుద్ధరణకు రూ.300 కోట్లు కేటాయించామని తెలిపారు. అలాగే పళని మురుగన్ ఆలయ పునరుద్ధరణకు రూ.100 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. -
నవంబరు నాటికి రామ్‌లల్లా దర్బారు సిద్ధం!
ఈ ఏడాది నవంబర్ నాటికి అయోధ్య రామాలయ మొదటి అంతస్తు (రామ్‌లల్లా దర్బారు) సిద్ధం కానున్నదని రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. సర్క్యూట్ హౌస్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ నిర్ణీత గడువులోగానే రామమందిర నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, టెంపుల్ పార్కు, ఇతర సౌకర్యాల కోసం జరుగుతున్న పనులను పరిశీలించామని మిశ్రా తెలిపారు. ఆలయంలోని మొదటి, రెండో అంతస్తుల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయడంపై దృష్టి సారించామని, రామ్‌లల్లా దర్బారు నవంబర్ నాటికి పూర్తికానున్నదని పేర్కొన్నారు. ఇదిలావుండగా అయోధ్య తీర్థ వికాస్ పరిషత్ ప్రధాన కార్యాలయాన్ని రామనగరిలో నెలకొల్పనున్నారు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్, అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాల కోసం కొత్త భవనాలను నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఆలయ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆలయ నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ఏజెన్సీ టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్ ఆనంద్ మెహతా తెలిపారు. మార్చి నెలాఖరులోగా కాశీ-అయోధ్య మధ్య హెలికాప్టర్ సర్వీసు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరాన్ని కేవలం 55 నిమిషాల్లోనే పూర్తిచేయవచ్చు. ఒక్కో ప్రయాణికునికి ఛార్జీ రూ.14,159 చొప్పున వసూలు చేయనున్నారు. ఒక ట్రిప్పులో ఐదుగురు ప్రయాణించే అవకాశం ఉండనుంది. ఈ హెలికాప్టర్ సేవలను ఉత్తరాఖండ్‌కు చెందిన రాజాస్ ఏరోస్పోర్ట్ అండ్ అడ్వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ అందించనుంది. -
దేశానికి బాబా మోదీ అవసరం లేదు: ఒవైసీ
న్యూఢిల్లీ: కేంద్రం వైఖరిపై మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ నిప్పులు చెరిగారు. మోదీ ప్రభుత్వం ఒక వర్గానికో, మతానికో చెందిన ప్రభుత్వమా లేక యావద్దేశానికి ప్రభుత్వమా అని నిలదీశారు. దేశానికి బాబా మోదీ ప్రభుత్వం అవసరం లేదన్నారు. రామమందిర నిర్మాణంపై శనివారం సభలో చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘రామ మందిర ప్రారంభం ద్వారా ఒక మతంపై మరో మతం విజయం సాధించినట్లు సందేశం ఇవ్వదలిచారా? దేశంలోని 17 కోట్ల ముస్లింలకు ఏం సందేశమిస్తున్నారు? నేను బాబర్, జిన్నా, ఔరంగజేబ్ తరఫున మాట్లాడటం లేదు. రాముడిని గౌరవిస్తా. కానీ గాడ్సేను ద్వేషిస్తా. ‘బాబ్రీ మసీదు జిందాబాద్, బాబ్రీ మసీదు ఎప్పటికీ ఉంటుంది’ అంటూ ముగించారు. -
అయోధ్యకు పోటెత్తిన భక్తులు..
-
సింగపూర్‌లో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో వైభవంగా అయోధ్య శ్రీరామ పవిత్ర అక్షింతల వితరణ మహోత్సవం జరిగింది. తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) వారు భారత దేశం నుండి ప్రత్యేకంగా తెప్పించిన అయోధ్య శ్రీ రాముల వారి ప్రాణ ప్రతిష్ట అక్షింతలు సింగపూర్ లో నివసిసిస్తున్న భక్తులకు అందజేసే శుభకార్యాన్ని అదే రోజు జనవరి 22 న ఇక్కడి చాంగి విలేజ్ లో ఉన్న శ్రీ రాముని గుడిలో కన్నుల పండుగలా నిర్వహించారు. ఇటువంటి పవిత్రమైన కార్యక్రమాన్ని ఇక్కడి దేవాలయాల్లో నిర్వహించే అవకాశం దక్కడం సొసైటీకి దక్కిన పుణ్యం అని అక్కడి సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులందరూ భక్తిశ్రద్ధలతో రామ నామ స్మరణ చేస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం, అందరూ ప్రసాదంతో పాటు అక్షింతలు కూడా స్వీకరించి శ్రీ రాముని ఆశీసులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా జై శ్రీ రామ్ అనే నామస్వరణతో మారుమ్రోగింది. ఈ వేడుకల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరు ఆ రాముని సేవలో భక్తితో పరవశించి పోయారు. ఈ మహోత్సవంలో సుమారు 1000 మంది వరకు భక్తులు పాల్గొని అయోధ్య శ్రీరామ పవిత్ర అక్షింతలను స్వీకరించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న కొందరు భక్తులు మాట్లాడుతూ.. ఇటువంటి కార్యక్రమాన్ని సింగపూర్‌లో నిర్వహించిన తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపుతు అభినందించారు. దీంతో పాటు సొసైటీ స్థాపన నుండి ఎలాంటి ఆడంబరాలకు పోకుండా, లాభాపేక్ష లేకుండా విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్న సొసైటీని స్థానికులు కొనియాడారు. తెలుగు వారితో పాటు ఇతర భక్తులు పెద్ద ఎత్తున రాముని సేవలో పాల్గొని విజయవంతంగా జరిగేందుకు తోడ్పడిన, సహాయ సహకారాలు అందించిన దాతలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున టీసీఎస్ఎస్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, గోనె నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి, కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి వెంకటరమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు రోజా రమణి, రాధికా రెడ్డి నల్లా, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి మొదలగు వారు భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. భారత్ నుండి ఈ పవిత్ర అక్షింతలను సింగపూర్‌కు చేర్చడంలో ముఖ్య పాత్ర పోషించిన గోనె నరేందర్ రెడ్డికి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా శ్రీరామ ఆలయ అధికారులు మాట్లాడుతూ.. ఈ ఆలయంలో ఇటువంటి పుణ్య కార్యక్రమం నిర్వహించడం ఎన్నో జన్మల పుణ్యఫలం అని తెలుపుతూ వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. (చదవండి: అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన: డల్లాస్‌లో పండుగ వాతావరణం! ) -
Ayodhya Ram Mandir: ప్రపంచ నలుమూలల్లోనూ ఘనంగా ప్రాణప్రతిష్ట వేడుకలు
వాషింగ్టన్/పోర్ట్ ఆఫ్ స్పెయిన్: అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ మహోజ్వల ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారాల్లో చూసి ప్రపంచవ్యాప్తంగా భక్తులు పులకించిపోయారు. ఆస్ట్రేలియా నుంచి అమెరికా దాకా సంబరాలు జరుపుకున్నారు. న్యూయార్క్‌లో ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ కూడలి వద్ద భారీ తెరలపై వందలాది భారతీయ అమెరికన్లు వేడుకను వీక్షించారు. సంప్రదాయ వస్త్రధారణలో భజనలు, కీర్తనలు చేశారు. పాకిస్తానీ ముస్లింలు సైతం.. అమెరికాలో వర్జీనియా రాష్ట్రం ఫెయిర్‌ఫాక్స్ కౌంటీలోని శ్రీవెంకటేశ్వర లోటస్ టెంపుల్ వద్ద సిక్కులు, ముస్లింలు, పాకిస్తానీ అమెరికన్లు, క్రైస్తవులు సైతం వేడుకల్లో పాలుపంచుకున్నారు. అమెరికా స్టాక్ ఎక్సే్చంజ్ ‘నాస్డాక్’ స్క్రీన్ మీదా కోదండరాముని చిత్రాన్ని ప్రదర్శించారు. లాస్ఏంజిలెస్లో 1,000 మందికిపైగా 250 కార్ల ర్యాలీ చేపట్టారు. పారిస్‌లో ఈఫిల్ టవర్ వద్ద భారతీయులు జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు. ట్రినిడాడ్, టొబాగో, మారిషస్, ఫిజీ, స్పెయిన్ తదితర దేశాల్లో సంబరాలు జరిగాయి. మెక్సికోలో తొలి రామాలయాన్ని అయోధ్య ప్రాణప్రతిష్ట ముహూర్తంలోనే ప్రారంభించారు. -
ఒంటిమిట్టకు పోటెత్తిన జనం
-
కంగనా రనౌత్ అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠను జరుపుకుంటున్నారు
-
అయోధ్య రాముని దర్శనంతో పులకించిన భక్తకోటి