
సాక్షి, న్యూఢిల్లీ : హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామమందిర నిర్మాణ భూమిపూజ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ప్రధాని అయోధ్య పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆగస్ట్ 5న ఉదయం జరిగే భూమి పూజ కార్యక్రమంలో మోదీ పాల్గొంటారని సోమవారం ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు చైర్మన్ మోదీకి ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే. ప్రధానితో పాటు మరో 250 మంది అతిథులు కూడా హాజరుకాన్నారు. కేంద్ర మంత్రులను, ఉత్తర ప్రదేశ్ మంత్రులతోపాటు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, విశ్వ హిందు పరిషత్ సీనియర్ ప్రతినిధులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేను కూడా భూమి పూజ కోసం ఆహ్వానించనున్నారు. (భూమి పూజకు 250 మంది అతిథులు)
Comments
Please login to add a commentAdd a comment