
సాక్షి, కడప: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో ట్విస్ట్‌ల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నేరవేర్చలేక ఇటు చంద్రబాబు.. అటు ఎమ్మెల్యేలు చేతులెత్తేస్తున్నారు. తన సొంత మేనిఫెస్టో అంటూ ఎన్నికల్లో పోటీకి దిగిన కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి కొత్త పంథాలో ముందుకు వెళ్తున్నారు. తన నియోజకవర్గం అభివృద్ధికి చంద్రబాబు నిధులు ఇవ్వకపోవడంతో తాను ఇచ్చిన హామీల అమలు కోసం కొత్త రకం పన్నులు విధించేందుకు సిద్దమయ్యారు. పీ-4 మోడల్‌లో భాగంగా కప్పం ఇవ్వాలని హుకుం జారీ చేశారు.
వివరాల ప్రకారం.. టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి తాజాగా.. కడపలో డాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు రెడీ అయ్యారు. ప్రతీ ఒక్క వైద్యుడు ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని ఎమ్యెల్యే.. వాట్సాప్ గ్రూప్‌ల్లో మెసేజ్‌లు పెడుతున్నారు. దీంతో, డాక్టర్లు అందరూ బెంబేలెత్తిపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే కావడంతో ఆమెను ఎవరూ ప్రశ్నించలేకపోతున్నారు. అయితే, తమ వద్ద డబ్బులు వసూలు చేయడమేంటని ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు డాక్టర్ల వంతు కాగా.. రానున్న కాలంలో మాధవి రెడ్డి ఎవరిని టార్గెట్ చేస్తారోనని వణికిపోతున్నారు.