madhavi reddy
-
లేని ప్రొటోకాల్ కోసం టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి రచ్చ
సాక్షి ప్రతినిధి, కడప: కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవీరెడ్డి తీరు ఏ మాత్రం మారలేదు. ప్రజా సమస్యలను గాలికొదిలి నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో తనకు మేయర్ పక్కనే కుర్చీ వేయలేదని రచ్చ చేశారు. అజెండా పేపర్లను చించేసి నిరసన తెలిపారు. మేయర్ సురే‹Ùబాబు కార్పొరేటర్లను సస్పెండ్ చేసినా బయటకు వెళ్లకుండా రచ్చ చేస్తూనే, దూషణలు, కవ్వింపుపు చర్యలకు దిగారు. లేని ప్రోటోకాల్ కోసం ఎమ్మెల్యే పంతానికి దిగారు. మేయర్ స్థాయిలో సీటు వేయాలని.. అంతవరకూ సమావేశం జరగనిచ్చేది లేదంటా రభస కొనసాగించారు. వందలాది మంది టీడీపీ కార్యకర్తలను వెంటేసుకుని నగరపాలక సంస్థ కార్యాలయం లోపల, బయట యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సమావేశాన్ని రెండోసారి కూడా కొనసాగనివ్వకుండా అడ్డుకున్నారు. అధికార దర్పంతోనే.. వాస్తవానికి కార్పొరేషన్ నిబంధనల ప్రకారం.. ఎమ్మెల్యే నగరపాలక సంస్థకు ఎక్స్‌అఫిíÙయో సభ్యులు మాత్రమే. ఎక్స్‌అఫిíÙయో సభ్యులు కూడా కార్పొరేటర్ల చెంతన కూర్చోవాలి. మంత్రులు సైతం మిగతా సభ్యులతో కలిసి కూర్చోవాల్సిందే. సభకు అధ్యక్షత వహించే మేయర్‌కు మాత్రమే పోడియంపై ఆశీనులయ్యే అధికారం ఉంటుంది. కాగా కడప కార్పొరేషన్లో మాత్రం మేయర్ స్థాయిలో తన సీటు ఉండాలని ఎమ్మెల్యే మాధవీరెడ్డి పట్టుబడుతున్నారు. నిబంధనలన్నిటినీ గాలికొదిలేసి తనకు కుర్చీ వేయాల్సిందేనని ఇష్టారీతిన వ్యవహరించారు. దీంతో పాలకవర్గ సమావేశంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మరోవైపు వైఎస్సార్సీపీ నుంచి పార్టీ ఫిరాయించిన 8మంది కార్పొరేటర్లను అడ్డుపెట్టుకొని దౌర్జన్యానికి దిగారు. అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేకుండా..కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో రచ్చ చేయడమే ఏకైక అజెండాతో ఎమ్మెల్యే, ఫిరాయింపు సభ్యులు వచి్చనట్టు స్పష్టంగా కని్పంచింది. సమావేశంలోకి రావడంతోనే నేరుగా పోడియం వద్దకు వెళ్లి ఎమ్మెల్యేకు కుర్చీ వేయాలంటూ సభను కొనసానివ్వకుండా అడ్డుకోవడంపై నగరపాలక సంస్థ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. 15వ ఆర్థికసంఘం పనులను ఆమోదిస్తేనే కార్పొరేషన్‌కు కేంద్రం నుంచి నిధులు వస్తాయి. కాగా, గత రెండు సమావేశాలనూ ఎమ్మెల్యే అడ్డుకుంటూ నగరాభివృద్ధికి రావాల్సిన నిధులను రాకుండా చేస్తున్నారని మహిళా కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఎమ్మెల్యేకు తాము గౌరవం ఇచ్చినా .. ఆమె నిలుపుకోలేకపోయారని, మేయర్ ఇంటిపై చెత్త వేయించి చెత్త రాజకీయం చేశారని మహిళా కార్పొరేటర్లు వాపోయారు. అలాంటప్పుడు ఆమెకు తామెందుకు లేని గౌరవం ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు.144 సెక్షన్ ఉన్నా.. దూసుకొచ్చిన టీడీపీ శ్రేణులుకార్పొరేషన్ సర్వసభ్య సమావేశం సందర్భంగా పోలీసులు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ టీడీపీ శ్రేణులు పోలీసు బారికేడ్లను తోసుకొని ర్యాలీగా నగరపాలక సంస్థ కార్యాలయానికి దూసుకొచ్చారు. ప్రధాన గేటు వద్ద నినాదాలు చేశారు. వారిని నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారు. 144 సెక్షన్ ఉల్లంఘించినా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండిపోయారు. -
కడప కార్పొరేషన్ లో TDP ఎమ్మెల్యే మాధవి రెడ్డి దౌర్జన్యం
-
కుర్చీ కోసమే మాధవీరెడ్డి పంతం: మేయర్ సురేష్‌బాబు
సాక్షి,వైఎస్ఆర్జిల్లా:ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఏకపక్షంగా,నియంతలా వ్యవహరిస్తున్నారని కడప మేయర్ సురేష్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం(డిసెంబర్23) కడప మునిసిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఎమ్మెల్యే చేసిన గలాటాపై సురేష్‌బాబు సాక్షి టీవీతో మాట్లాడారు.‘తనకు కుర్చీ వేయలేదని ఎమ్మెల్యే రెండు సార్లు సమావేశాన్ని అడ్డుకున్నారు.దౌర్జన్యానికి దిగి సమావేశ ఎజెండా పేపర్లను చించివేశారు. ఇలా చేస్తున్న ఆమెకు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఎక్కడుంది?మిగిలిన కార్పొరేషన్లలో మీ ఎమ్మెల్యేలు,మంత్రులు ఎక్కడ కూర్చుంటున్నారు..?మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచారని గౌరవిస్తే మా ఇంటిపైనే చెత్త వేయించింది.కార్పొరేటర్లపై నోటికొచ్చినట్లు మాట్లాడారు. వందలాది మంది కార్యకర్తలతో కార్పొరేషన్పైకి దండెత్తారు. ఇదెక్కడి సభ్యత?ఒక ప్రజాప్రతినిధి వ్యవహరించాల్సిన తీరు ఇదేనా..?ఎమ్మెల్యే,పిరాయింపు సభ్యులను సస్పెండ్ చేసినా బయటకు వెళ్ళలేదు.ఎజెండా పేపర్లను చింపి సభను అడ్డుకున్నారు.వాళ్ళని బయటకు పంపడంలో అధికారులు వైఫల్యం చెందారు.పార్టీలకు అతీతంగా మేము గౌరవం ఇచ్చినా ఆమె నిలబెట్టుకోలేదు.ప్రజాసమస్యలు చర్చించడానికి యుద్ధానికి వచ్చినట్లు వస్తారా?ఎమ్మెల్యే మాధవి రెడ్డి తీరును ఎవరూ హర్షించడం లేదు.ఫిరాయింపు సభ్యులు మా పార్టీ సభ్యులపై దాడికి దిగారు.ఇది ప్రజాస్వామ్యంలో సరైన చర్య అని ఎవరైనా అంటారా? మొదటి సారి ఎమ్మెల్యే అయిన ఆమె తన హక్కులు ఏంటో ముందు తెలుసుకోవాలి.ఆమె ప్రజాసమస్యల కంటే తన పంతం ముఖ్యం అన్నట్లు వ్యవహరిస్తున్నారు.15 అర్థికసంఘం పనులు ఆమోదించి పంపాలి..కానీ ఆమె సమావేశం జరగనివ్వడం లేదు.బాధ్యతాయుతమైన ఒక ప్రజాప్రతినిధి ఇలా వ్యవహరిస్తే ఎలా’అని సురేష్‌బాబు ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. కార్పొరేషన్ సమావేశపు ఎజెండాను కడప కార్పొరేషన్ ఏకపక్షంగా ఆమోదించింది. ఎజెండా మొత్తాన్ని ముక్తకంఠంతో ఆమోదిస్తున్నట్లు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు చేతులెత్తారు. ఇదే సమయంలో పలు అభివృద్ధి పనులకు కార్పొరేషన్ ఆమోదం తెలిపింది. సస్పెండ్ చేసినా అజెండా ఆమోదాన్ని అడ్డుకునేందుకు ఎమ్మెల్యే మాధవీరెడ్డి ప్రయత్నించారు. అయితే, మెజార్టీ సభ్యుల మద్దతుతో ఎజెండాలోని అంశాలకు ఆమోదం దక్కింది. ఇదీ చదవండి: కుర్చీ కోసం ఎమ్మెల్యే దౌర్జన్యం -
TDP ఎమ్మెల్యే మాధవిరెడ్డి దౌర్జన్యం
-
కుర్చీ కోసం కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి దౌర్జన్యం
సాక్షి,వైఎస్ఆర్జిల్లా: కడపలో ఎమ్మెల్యే మాధవీరెడ్డి మళ్లీ దౌర్జన్యానికి దిగారు. సోమవారం(డిసెంబర్23) జరుగుతున్న కడప మునిసిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో అనుచరులతో కలిసి వీరంగం సృష్టించారు. మేయర్‌తో పాటు తనకూ కుర్చీ వేయాలని మళ్లీ హంగామా చేశారు. దీంతో ఎమ్మెల్యే,మేయర్‌కు మధ్య మాటల యుద్ధం జరిగింది.టీడీపీ నేతలతో కలిసి ఎమ్మెల్యే మాధవీరెడ్డి సమావేశ మందిరంలో గొడవకు దిగారు. ఇందుకు ప్రతిగా మేయర్‌కు మద్దతుగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఆయన సీటు ముందే బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ, టీడీపీ కార్పొరేటర్లకు మధ్య తోపులాట జరిగింది. దీంతో సమావేశానికి ఆటంకం కలిగిస్తున్నారంటూ మేయర్ సురేష్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఏడుగురు కార్పొరేటర్లపై సస్పెన్షన్ వేటు వేశారు. సమావేశానికి సభ్యులు మినహా ఎవరికీ అనుమతి లేదని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎమ్మెల్యే ఖాతరు చేయలేదు. డబ్బులిచ్చి మరీ మహిళలను నగరపాలక సంస్థ సమావేశానికి తీసుకువచ్చి కవ్వింపు చర్యలకు దిగారు. కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు.గతంలోనూ నగరపాలక సంస్థ సమావేశంలో మాధవీరెడ్డి కుర్చీ కోసం హంగామా చేశారు.ప్రజా సమస్యలపై చర్చించండన్నా వినకుండా గొడవ చేశారు. దీంతో ప్రస్తుతం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సమావేశానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.కార్యాలయం సమీప ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.కార్యాలయ పరిసర ప్రాంతాల్లో ఎవరూ గుమికూడవద్దని,ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఇదీ చదవండి: గుంటూరులో టీడీపీ నేత దాష్టీకం -
గళమెత్తిన రెడ్డెమ్మ...
ఆడవారి మాటలకు ఆర్థాలే వేరులే...అంటూ ఓ సినిగేయ రచయిత పాట రచించారు. వాస్తవానికి ఆ స్థానంలోకి రాజకీయ నాయకులు వచ్చి చేరిపోయారు. వారి మాటలకు చేష్టలకు పొంతన లేకుండా ఉంది. ‘నోటితో మాట్లాడడం, నొసలుతో వెక్కిరించడం, దేని పని దానిదే’అన్నట్లుగా ఉండిపోయింది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు అదే విషయాన్ని రూఢీ చేస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో ఆదానీ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు ఎంపీ రమేష్‌నాయుడుకు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ చేపడుతోంది. కొండాపురం మండలంలోని దొబ్బుడుపల్లె, రావికుంట, తిరువాలయపల్లె గ్రామాలతోపాటు మైలవరం మండలంలోని బొగ్గులపల్లె గ్రామాల పరిధిలో ఆ పనులు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పనులన్నీ తమ వర్గీయులే చేపట్టాలంటూ జమ్మలమడుడు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పట్టుబట్టారు. మంతనాలు, హెచ్చరికలు, రాయబేరాలు ఎలా నడిపినా, ఆశించిన తీరులో నిర్మాణ పనులు దక్కలేదు. దీంతో ఎమ్మెల్యే ఆది కుటుంబ సభ్యులు శివనారాయణరెడ్డి, రాజేష్రెడ్డిల నేతృత్వంలో దొబ్బుడుపల్లె వద్ద చేపడుతున్న నిర్మాణపనుల్లో విధ్వంసం సృష్టించారు. స్థానికంగా ఉన్న రిత్విక్ కన్స్ట్రక్షన్స్ సిబ్బందిపై దాడి చేసి, అక్కడే ఉన్న వాహనాలను పగులగొట్టారు.తెరవెనుక మంత్రాంగంలో సీఎం రమేష్నాయుడుక్షేత్రస్థాయిలో రిత్విక్ కన్స్ట్రక్షన్స్ సంస్థ పనులు అడ్డుకొని స్థానికంగా ఉన్న సైట్ ఇంజినీర్లపై ఎమ్మెల్యే ఆది వర్గీయులు దాడి చేస్తే ఎంపీ రమేష్ నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు నోరు మెదపలేదు. తెరవెనుక మంత్రాంగంలో రమేష్‌నాయుడు ఉండిపోయారని సమాచారం. ఆమేరకు తన సోదరుడు రాజేష్‌నాయుడును సీఎం వద్దకు పంపించి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. సీఎం స్థాయిలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు దాడి చేపట్టిన వ్యవహారంపై వాకబు చేయడంతో వైఎస్సా ర్సీపీ నాయకులతో కలిసి పనులు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆది చెప్పుకొచ్చా రు. అదే వాస్తవమైతే ఫలానా వైఎస్సార్సీపీ నా యకులు పనులు చేస్తున్నారని, వారు అక్కడే ఉండి రెచ్చగొట్టారని ఎందుకు బహిరంగంగా ప్రకటి ంచలేదని విశ్లేషకులు నిలదీస్తున్నారు. రూ.1800 కోట్ల సివిల్ పనులు రిత్విక్ కన్స్ట్రక్షన్స్ ఎలా ఇస్తారన్నదే ఎమ్మెల్యే వర్గీయుల అసలు ప్రశ్న. ఆ పను లు తామే చేయాలన్నదే వారి ఆకాంక్ష. ఆ విషయాన్ని తెరమరుగు చేసి, వైఎస్సార్సీపీ నేతల పనులంటూ దాడి వ్యవహారాన్ని ఎమ్మెల్యే ఆది రక్తి కట్టించారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. గళమెత్తిన రెడ్డెమ్మ...ఎమ్మెల్యే మాధవీ రెడ్డి కడపలో మద్యం షాపుల నిర్వహణ తీరుపై అసెంబ్లీలో గళ మెత్తారు. మార్పు పేరిట డీ–ఆడిక్షన్ సెంటర్ మేడపైన నిర్వహిస్తుంటే, ఆ బిల్డింగ్ కిందనే మద్యం షాపు ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు. వాస్తవంగా ఎమ్మెల్యే లేవనెత్తిన ప్రశ్న మంచిదే అయినా, ఈ వ్యవహారంలో పాత్రధారులు, సూత్రధారులను బహిరంగ పర్చి ఉంటే బాగుడేందని పలువురు చెప్పుకొస్తున్నారు. కడపలో రెడ్డి వైన్స్ వర్సెస్ మౌర్య వైన్స్ మధ్య పెద్ద ఎత్తున ఆధిపత్య పోరాటం నడిచిన విషయం జగమెరిగిన సత్యం. అక్క డ మౌర్య వైన్స్ ఉంచరాదనే విషయంపై అధికారులపై రాజకీయ ఒత్తిడులు వచ్చినా అక్కడే కొనసాగిస్తున్నారంటే మరో అధికార పార్టీ నేత ప్రమే యం ఉండడమేనని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అటు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది వ్యవహారంలోనైనా, ఇటు కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి అసెంబ్లీలో గళమెత్తినా ఈ వ్యవహారంలో పాత్రధారు లు కూటమి ప్రభుత్వ నేతలేనన్నది సుస్పష్టం. -
కడప కార్పొరేషన్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే హల్ చల్
-
ఎమ్మెల్యే మాధవీరెడ్డి వీరంగం
వైఎస్సార్ జిల్లా, సాక్షి: కడప కార్పొరేషన్ వద్ద ఎమ్మెల్యే మాధవీరెడ్డి వీరంగం సృష్టించారు. కౌన్సిల్ సమావేశంలోకి ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా ఎమ్మెల్యేకి మాత్రమే అనుమతి ఉంది. కానీ నిబంధనలకు విరుద్దంగా ఎమ్మెల్యే మాధవి తన అనుచరులతో కౌన్సిల్ సమావేశంలోకి వెళ్లారు. ఎజెండాను విడిచి రాజకీయ ప్రసంగం చేశారు. దీనిపై మేయర్ సురేష్ బాబు, కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్ కాదని ఎజెండా ప్రకారం సమావేశం జరగాలని పాలకవర్గం డిమాండ్ చేశారు. -
మాధవి రెడ్డి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, వైఎస్సార్: అధికారం చేతిలో ఉందని టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు వైఎస్సార్ జిల్లా వైఎస్సార్సీపీ నేతలు. ఇదే సమయంలో వందేళ్ల క్రితమే కనుమరుగైన వాగు పేరుతో ఎమ్మెల్యే మాధవి రెడ్డి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.అయితే, వైఎస్సార్ జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి ప్రోద్బలంతో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై దాడులు జరుగుతున్నాయి. అన్నీ అనుమతులు ఉన్నప్పటికీ వైఎస్సార్సీపీ కార్పొరేటర్ భాగస్వామిగా ఉన్న లే అవుట్పైకి ఇరిగేషన్ శాఖ అధికారులను ఎమ్మెల్యే పంపించారు. లే అవుట్ నుండి వాగు వెళ్తోందంటూ ఇరిగేషన్ శాఖ అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నారు. వందేళ్ల క్రితం కనుమరుగైన వాగు పేరుతో ఎమ్మెల్యే మాధవి రెడ్డి రాజకీయం మొదలుపట్టారు. ఈ అంశంపై హై కోర్టులో స్టే ఉన్నా ఇబ్బంది పెట్టేందుకు కుటిల ప్రయత్నం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో లే అవుట్ వద్దకు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష, మేయర్ సురేష్ బాబు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఇతర కార్పొరేటర్లు బుధవారం చేరుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..‘కోర్టులో స్టే ఉన్నా రాజకీయ కక్షతో ఇలాంటి చర్యలకు పాల్పడటం సరైన పద్దతి కాదు. అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదు. మాధవి రెడ్డి కక్ష సాధింపు చర్యలు ఇప్పటికైనా మానుకోవాలి’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ఇక చంద్రబాబు కోరినట్టే సిట్ నివేదిక: ఎంపీ విజయసాయి రెడ్డి -
మేయర్ ఇంట్లో చెత్త వేయించిన టీడీపీ ఎమ్మెల్యే
-
మాధవీరెడ్డి దుందుడుకు చర్య.. కమిషనర్ తేజ్ భరత్ విముఖత
సాక్షి ప్రతినిధి, కడప: కడప గడపలో సరికొత్త సంప్రదాయం కొనసాగుతోంది. మునుపెన్నడూ లేని రీతిలో సాధింపు చర్యలు తెరపైకి వస్తున్నాయి. ప్రజాస్వామ్యం స్థానంలో నియంత పాలన నడుస్తోంది. ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత ప్రజాప్రతినిధులకు ప్రజలంతా ఒక్కటే అన్న స్ఫూర్తిని విస్మరిస్తున్నారు. మీరు మాకు ఓటేశారా? మీరు ఫలానా పార్టీ కదా? ఇలాంటి ప్రశ్నలు తెరపైకి వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరీ ముఖ్యంగా కడపకు అధికారులు విధుల్లో చేరాలంటే వెనుకంజ వేస్తున్నారు. ఆమేరకు రెండు వారాలైనా కమిషనర్‌గా నియమితులైన తేజ్ భరత్ బాధ్యతలు చేపట్టేందుకు విముఖత చూపుతున్నట్లు సమాచారం.⇒ కడప కమిషనర్‌గా సూర్యసాయి ప్రవీణ్‌చంద్ సమర్థవంత అధికారిగా తక్కువ కాలంలో గుర్తింపు పొందారు. అనంతరం తనదైన శైలిలో అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నగర పాలకమండలిని సమన్వయం చేసుకుంటూ ప్రధాన సర్కిల్స్ విస్తరణ, ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న రహదారుల వృద్ధి, డ్రైనేజీ వ్యవస్థలో సమూల మార్పులు చేపట్టేందుకు కృషి చేశారు. కాగా టీడీపీ సర్కార్ జూలై 20న అమరావతికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్థానంలో ఐఏఎస్ అధికారి తేజ్ భరత్‌ను నియమించారు. రెండు వారాలు గడిచినా ఆయన బాధ్యతలు చేపట్టేలేదు. నూతన కమిషనర్ విముఖత వ్యక్తం చేయడం వెనుక కడప నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులే ప్రధాన కారణమని తెలుస్తోంది. వైఎస్సార్సీపీ ప్రాతినిథ్యంలో పాలకమండలి ఉండడం ఒకే ఒక్క కార్పోరేటర్ మాత్రమే టీడీపీ పరిమితం కావడం, పైగా స్థానిక ఎమ్మెల్యే మాధవీరెడ్డి దుందుడుకు చర్యలు వెనుకంజకు ప్రధాన కారణంగా ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా ప్రొటోకాల్‌కు విరుద్ధ నిర్ణయాలు ఇలాంటి విషయాలన్నీ పరిగణలోకి తీసుకున్న ఆయన కడపకు వచ్చేందుకు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. అదే విషయాన్ని సహచర సన్నిహితులతో వెల్లడించినట్లు తెలుస్తోంది.అధికారుల్లో విస్మయంఎమ్మెల్యే మాధవీరెడ్డి ఏకపక్ష చర్యలతో అనతికాలంలోనే కడప నగరంలో తీవ్ర చర్చనీయాంశం అయ్యారు. ప్రభుత్వ, ప్రైవేటు వ్యవహారాల్లో అనవసర జోక్యమే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. డివిజన్ పరిధిలో కార్పొరేటర్ ప్రథమ పౌరుడు అన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు. ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులంతా భాగస్వామ్యులే అన్న స్పృహ అసలే లేదు. ఈపరిస్థితులను పరిశీలిస్తున్న అధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏకపక్ష చర్యలతో ఎంతోకాలం మనుగడ సాధించలేమని ఆవేదన సైతం వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్‌గా విధుల్లో చేరేందుకు తేజ్ భరత్ విముఖత వ్యక్తం చేయడంపై స్థానికంగా అధికారులు సమర్థిస్తున్నట్లు తెలుస్తోంది. కమిషనర్ విముఖత విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న ఆర్డీఓ ఒకర్ని సంప్రదించినట్లు సమాచారం. తొలుత సుమఖత చూపిన ఆర్డీఓ విషయాలు తెలుసుకున్న తర్వాత వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కమిషనర్ అన్వేషణలో టీడీపీ నేతలు ఉన్నట్లు సమాచారం. -
పెన్షన్ల పంపిణీపై టీడీపీ నేతల లొల్లి ఎమ్మెల్యేను నిలదీసిన కార్పొరేటర్
-
కడప టీడీపీలో ‘పెన్షన్ల’ రగడ.. ఎమ్మెల్యే Vs కార్పొరేటర్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడప నగర పాలక సంస్థలో పెన్షన్ల పంపిణిపై టీడీపీ సభ్యుల మధ్య రగడ రచ్చరచ్చగా మారింది. కడప ఎమ్మెల్యే మాధవి, 49వ డివిజన్ కార్పొరేటర్ ఉమాదేవి మధ్య మాటల తూటాలు పేలాయి. తన ప్రమేయం లేకుండా పెన్షన్లు పంపిణి చేశారంటూ ఉమాదేవి మండిపడ్డారు. కనీసం సమాచారం ఇవ్వకుండా ఎలా పంపిణి చేశారంటూ కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డిని నిలదీశారు. గతంలో పల్స్ పొలియో కార్యక్రమం కూడా స్థానిక ప్రజాప్రతినిధులతో నిర్వహించే వారని ఉమాదేవి అన్నారు.సొంత పార్టీ కార్పొరేటర్‌నే కించపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యే మాధవీరెడ్డి.. పెన్షన్ల పంపిణికి ప్రత్యేకంగా ఎవరికి ప్రోటోకాల్ లేదని.. సొంతంగా డివిజన్‌ను ఎవరు రాయించుకొలేదంటూ వ్యాఖ్యానించారు. కిరిటాలు పెట్టి.. డప్పులు కొట్టి ఎవరు మిమ్మల్ని పిలవరని.. సమాచారం తెలిస్తే వచ్చి ఉండాల్సిందంటూ ఎమ్మెల్యే మాధవీ ఉచిత సలహా ఇచ్చారు. సొంత పార్టీ కార్పోరేటర్‌నే ఎమ్మెల్యే మాధవీ కించపరిచేలా మాట్లాడటంపై ఉమాదేవి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. -
ఒక్క ఛాన్స్ ప్లీజ్!
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్ర మంత్రివర్గంలోకి వెళ్లేందుకు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎవరికి వారు విశేష ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. సామాజిక సమీకరణలో భాగంగా అవకాశం కల్పించాలని కొందరు యత్నిస్తే, అపార అనుభవం ఉంది, ఒక్క అవకాశం ఇవ్వాలని మరికొందరు యత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రమాణస్వీకారంలో నిమగ్నమైన అధినేత చంద్రబాబు సోమవారం నుంచి మంత్రివర్గ కసరత్తు చేయనున్నారు. ఈ నేపధ్యంలో ఆయా నేతలు గాడ్ఫాదర్లను ఆశ్రయిస్తున్నారు. బీజేపీ కోటాలో ఛాన్సు కోసం జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అత్యంత వేగంగా పావులు కదుపుతోన్నారు.👉 ఉమ్మడి జిల్లాలో ఏడు ఎమ్మెల్యే స్థానాలు తెలుగుదేశం కూటమి వశమయ్యాయి. ఇందులో ఐదు గురు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోటీ ఉన్న నేపధ్యంలో తొలిసారి ఎన్నికై న వారిని మంత్రివర్గంలోకి అవకాశం లేకపోతే, జిల్లాలో ఇద్దరికే ఛాన్సు కన్పిస్తోంది. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, వరదరాజులరెడ్డి సీనియర్లుగా మిగలనున్నారు. బీజేపీ కోటాలో మంత్రిగా అవకాశం దక్కించుకునేందుకు ఆదినారాయణరెడ్డి పెద్ద ఎత్తున పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ విషయమై ఇప్పటికే కేంద్ర పార్టీ పెద్దలతో మంతనాలు సాగిస్తున్నారు. కాగా రాయలసీమ కో టా పరంగా చూస్తే ఇక్కడున్న ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల్లో ఆదినారాయణరెడ్డి మాత్రమే సీనియర్. ఆదోని, ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యేలు పార్థసారధి, సత్యకుమార్ ఇద్దరూ తొలిసారిగా ఎన్నికై న వారే కావడం ఆదికి అదనపు బలంగా నిలుస్తోన్నట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు.బీసీ కోటాపై ఆశలు పెట్టుకున్న పుట్టామైదుకూరు నుంచి ఎన్నికై న పుట్టా సుధాకర్‌యాదవ్ బీసీ కోటాలో మంత్రివర్గంలో బెర్త్ ఖరారు చేస్తారనే ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం, గతంలో లభించిన ప్రాధాన్యత దృష్టి పెట్టుకొని అవకాశం కల్పిస్తారనే ఆశాభావంలో ఉన్నారు. మరో వైపు వియ్యంకుడు ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడుకు అవకాశం లేకపోతే, తప్పకుండా తనకు దక్కుతోందనే భావన కూడా ఆయన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.ఇరవై ఏళ్ల చరిత్ర తిరగరాశామంటున్న మాధవీరెడ్డికడప గడ్డపై 2004 నుంచి టీడీపీ ఓటమి పాలవుతోంది. 2024లో చరిత్ర తిరగరాశాం. అవకాశం కల్పిస్తే పార్టీ ఉన్నతికి విశేషంగా కృషి చేస్తామనే ఆశాభావాన్ని ఎమ్మెల్యే ఆర్.మాధవీరెడ్డి వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈమారు మహిళ కోటాకు పెద్దఎత్తున పోటీ ఉండడం విశేషం. రాయలసీమ జిల్లాల్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి పాణ్యం, ఆళ్లగడ్డ, పుట్టపర్తి ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, భూమా అఖిలప్రియ, పల్లె సింధూరరెడ్డి, నెల్లూరు జిల్లా నుంచి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మంత్రివర్గంలో ప్రాతినిథ్యం కోసం ప్రయత్నిస్తున్నారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి కేంద్ర కేబినేట్లో అవకాశం దక్కకపోవడంతో, ఆయన సతీమణీ ప్రశాంతిరెడ్డికి రాష్ట్రంలో ఛాన్సు ఉంటుందనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్త పరుస్తున్నారు. అనంతపురం జిల్లా నుంచి పరిటాల సునీత సైతం మహిళ కోటాలో అవకాశం కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈనేపధ్యంలో తొలిసారి ఎన్నికై న మాధవీరెడ్డికి అవకాశాలు తక్కవగా ఉన్నట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. జిల్లాలో బీజేపీకి కేటాయిస్తే, మహిళా కోటాలో తనకు ఛాన్సు దక్కనున్నట్లు మాధవీరెడ్డి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.మైనార్టీ కోటా కోసం షాజహాన్ యత్నంఅన్నమయ్య జిల్లాలో ముస్లిం మైనార్టీ కోటా లో అవకాశం కల్పించాలని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నంద్యాల ఎమ్మెల్యే ఫరూక్‌కు అవకాశం కల్పిస్తే షాజహాన్‌కు మిస్ అయ్యే అవకాశం లేకపోలేదు. అలా కూర్పు నిర్వహిస్తే పీలేరు ఎమ్మెల్యే ఎన్ కిశోర్‌కుమార్‌రెడ్డికి అవకాశం దక్కనున్న ట్లు విశ్లేషకులు భా విస్తున్నారు. ఇలా ఎవరికి వారు ఎత్తు లు పైఎత్తులు వేస్తూ మంత్రివర్గంలో అవకాశం కోసం ముమ్మ ర ప్రయత్నాలు ఆరంభించడం విశేషం.తెలంగాణ ముఖ్యనేత ద్వారా..తెలంగాణకు చెందిన ముఖ్యనేత ద్వారా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మంత్రివర్గంలో ఛాన్సు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎమ్మెల్యేగా 6సార్లు ఎన్నికై న చరిత్ర వరదకు ఉంది, పైగా ఇప్పటివరకూ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మంత్రివర్గంలో ప్రాతినిథ్యం దక్కకపోవడం కూడా అదనపు బలంగా నిలుస్తోంది. సుదీర్ఘ అనుభవం ఉన్నా మంత్రి పదవి ఇప్పటికీ దక్కలేదు. అందివచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకునే దిశగా పావులు కదుపుతోన్నారు. అదే విషయాన్ని తెలంగాణ ముఖ్యనేత ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబుకు వివరించినట్లు సమాచారం. నిబద్ధతతో పార్టీ ఉన్నతి కోసం పనిచేస్తామనే ఒక్క అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు సమాచారం. సీనియర్లుగా ఎమ్మెల్యేలు ఆది, వరద ఇరువురు వివిధ మార్గాలల్లో మంత్రివర్గంలోకి అవకాశం కల్పించాలని కోరుతు న్నా, తొలిసారి ఎన్నికై న ఎమ్మెల్యేలు కూడా విశేష ప్రయత్నాలు చేస్తున్నారు. -
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పై మహిళ నేతల నిరసన
-
చంద్రబాబు ఫొటోను చెప్పులతో కొట్టిన రమేష్ రెడ్డి వర్గీయులు
సాక్షి ప్రతినిధి, కడప: అభ్యర్థుల ప్రకటనతో ఉమ్మడి వైఎస్సార్ జిల్లా తెలుగుదేశం పార్టీలో ఆగ్రహజ్వాలలు రగులుతున్నాయి. ఆధినేత చంద్రబాబు ఫొటోను చెప్పులతో కొట్టారు. పార్టీ జెండాలకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడ్డారు. విధేయతను పరిగణలోకి తీసుకోకుండా అభ్యర్థులను ఎంపిక చేశారని మండిపడ్డారు. ఇదిలా ఉంటే కొద్ది సీట్లు మాత్రమే ప్రకటించి, తక్కినవి పెండింగ్ పెట్టడంతో ఆయా సెగ్మెంట్లలో తెలుగుతమ్ముళ్ల మధ్య హైటెన్షన్ కొనసాగుతోంది. ► రాయచోటి టీడీపీ అభ్యర్థిగా మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిని ప్రకటించారు. చంద్రబాబు శుక్రవారం రాత్రి మాజీ ఎమ్మెల్యేలు రమేష్‌కుమార్‌రెడ్డి, ద్వారకనాథరెడ్డిలకు ఫోన్ చేసి పార్టీ గెలుపునకు కృషి చేయాలని ఆదేశించారు. చంద్రబాబు నిర్ణయానికి శుక్రవారం రాత్రే ప్రతిఘటన ప్రారంభమైంది. టీడీపీ జెండాలకు నిప్పు పెట్టి అర్ధరాత్రి వరకు నిరసన పాటించారు. శనివారం అభ్యర్థి ప్రకటనతో మరింత ఆజ్యం పోసినట్లయింది. ఒక్కమారుగా రమేష్‌కుమార్‌రెడ్డి వర్గీయులు భగ్గుమన్నారు. చంద్రబాబు ఫొటోను చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. 11 మంది క్లస్టర్ ఇన్చార్జిలు, 44మంది యూనిట్ ఇన్చార్జిలు, 286 మంది బూత్ కమిటీ సభ్యులు, ఆరుగురు మండలశాఖ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్‌లు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, 9 మంది సర్పంచ్‌లు రాజీనామాలు చేయనున్నట్లు ప్రకటించారు. ఆ విషయాన్ని మాజీ జెడ్పీటీసీ మల్లు నరసారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కలాడీ ప్రభాకర్‌రెడ్డి తదితరులు ప్రకటించారు. 25ఏళ్లుగా పార్టీలో కొనసాగుతూ, కష్టకాలంలో వెంట నడిచినా నిరుపయోగమే అయిందని వారు వెల్లడించారు. కాగా మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి ఆశలకు సైతం బ్రేకులు పడ్డాయి. అధిష్టానం నిర్ణయం కలవరపాటుకు గురిచేసినా మౌనం వహిస్తున్నారు. కడప టీడీపీ అభ్యర్థిగా మాధవీరెడ్డి.... ఆరు నెలలు క్రితం వరకు అమె రాజకీయాలకు దూరం. సొంత కాంట్రాక్టు సంస్థ ఆర్కే ఇన్ఫ్రా పర్యవేక్షణలో ఉన్నారు. అనూహ్యంగా రాజకీయ అరంగ్రేటం చేసి కడప అసెంబ్లీ అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. అప్పటి వరకు అభ్యర్థిగా ఊరిస్తూ వచ్చిన ఉమాదేవి కుటుంబానికి చంద్రబాబు అండ్‌కో షాక్ ఇచ్చింది. రెండేళ్ల కిందట ఆలంఖాన్‌పల్లె లక్ష్మీరెడ్డి కుటుంబానికి టీడీపీ అధిష్టానం అభయం ఇవ్వడంతో తెరవెనుక ఎన్నికల గ్రౌండ్ దాదాపు పూర్తి చేశారు. అంతలోనే మాధవీరెడ్డి ప్రత్యక్షం కావడంతో డీలా పడ్డారు. కాగా నారా లోకేష్ మీ పని మీరు చేసుకోండి, ఉమాదేవి అభ్యర్థిత్వం ఖరారు చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. కాబట్టే మాధవీరెడ్డిని ఇన్చార్జిగా ప్రకటించినా పోటీగా కార్యక్రమాలు నిర్వహించారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. కార్పొరేటర్ ఉమాదేవి, మాజీ ఇన్చార్జి అమీర్‌బాబు, దుర్గాప్రసాద్ జట్టుగా ఏర్పడి పోటీ కార్యక్రమాలను కొనసాగించారు. ఉప్పు–నిప్పులా ఉన్న ఈ రెండు వర్గాలను ఏకతాటిపైకి తీసుకురాకుండానే మాధవీరెడ్డి అభ్యర్థిత్వం ఖరారు చేయడంపై వైరిపక్షం తీవ్ర ఆవేదన, ఆక్రోశం వ్యక్తం చేస్తోంది. తొలి జాబితాలో పుత్తాకు మొండిచేయి.... కమలాపురం టీడీపీ ఇన్చార్జిగా పుత్తానరసింహారెడ్డి పదహారేళ్లుగా ఉన్నారు.మూడు మార్లు టీడీపీ అభ్య ర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి ఎన్నికల్లో తలపడాలని భావించి పార్టీ కార్యక్రమాలను చురుగ్గా కొనసాగిస్తున్నారు. కమలాపురం కేంద్రంగా రా...కదిలిరా..కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించినా, ఆ సందర్భంగా చంద్రబాబు పుత్తా పేరు ఉచ్చరించకపోవడంతో తెలుగుతమ్ముళ్లు డైలమాలో పడ్డారు. ఈలోగా పుత్తా అభిప్రాయంతో నిమిత్తం లేకుండా మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డిని టీడీపీలో చేర్చుకున్నారు. తర్వాత ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్‌లో వీరశివా అభ్యర్థిత్వంపై సర్వే నిర్వహించారు. ఇలాంటి తరుణంలో తొలిజాబితాలో పుత్తాకు టీడీపీ అధిష్టానం మొండిచేయి చూపడంతో అక్కడి శ్రేణుల్లో టెన్షన్ కొనసాగుతోంది. ప్రొద్దుటూరులో కొనసాగుతున్న ఉత్కంఠ... ప్రొద్దుటూరు టీడీపీ టికెట్‌ను నలుగురు ఆశిస్తున్నారు. ఎవరికి వారు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి చంద్రబాబు ఆశీస్సులు లభించగా, ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి నారా లోకేష్ అభయమిచ్చారు. రాష్ట్ర కార్యదర్శి సురేష్‌నాయుడు అభ్యర్థిత్వం కోసం సోదరుడు సీఎం రమేష్‌నాయుడు మంత్రాంగం కొనసాగిస్తున్నారు. ఈపరిస్థితుల్లో ప్రొద్దుటూరు స్థానం తొలి జాబితాలో లేదు. ఎవరూ లేనప్పుడు, సీనియర్లు ముఖం చాటేసిన సమయంలో పార్టీ జెండాను తన భుజస్కందాలపై వేసుకున్నానని ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ప్రకటిస్తూ తన అభ్యర్థిత్వంపై ధీమా వ్యక్తం చేశారు. కాగా ఎక్కడికక్కడ ఆశావహుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతుండటం గమనార్హం. మాధవిరెడ్డికి టికెట్ కేటాయింపు తప్పడునిర్ణయం కడప రూరల్: కడప నియోజకవర్గ టికెట్ మాధవిరెడ్డికి ఇవ్వడం పార్టీ తప్పుడు నిర్ణయం తీసుకుందని కడప నియోజకవర్గ టీడీపీ మాజీ ఇనాచార్జి వీఎస్ అమీర్ బాబు, పార్టీ సీనియర్ నాయకులు ఆలంఖాన్‌పల్లె లక్ష్మీరెడ్డి, దుర్గాప్రసాద్, సింగల్ విండో మాజీ అధ్యక్షుడు మన్మోహన్ రెడ్డిలు అభిప్రాయపడ్డారు. శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ కష్టకాలంలో పారీ్టకి వెంట నడిచిన వారిని విస్మరించి మాధవిరెడ్డికి టికెట్ కట్టబెట్టడంతో కార్యకర్తలు నిరాశగా ఉన్నారని వారు తెలిపారు. -
టికెట్ ఉందా లేదా చెప్పండి బాబూ... బీపీ పెరిగిపోతోందిక్కడ..
సాక్షి ప్రతినిధి, కడప: రాజకీయ పొత్తులు సమీకరణలతో అధిష్టానం తల బద్దలు కొట్టుకుంటుంటే, టికెట్ ఇస్తారో లేదో తెలియడం లేదు, ఎంతకాలం నాన్చుడు ధోరణి అని తెలుగుతమ్ముళ్లు మదనపడుతున్నారు. దీంతో టికెట్ ఆశావహుల్లో హైటెన్షన్ నెలకొంది. ప్రతి రోజు బీపీ చెక్ చేసుకుంటున్నామని, ఎంతమంది తమలాగా ఇబ్బంది పడుతున్నారో అర్థం కావడం లేదని ఓ మాజీ ఎమ్మెల్యే రాయచోటిలో బాహాటంగా వ్యాఖ్యానించారు. ఇదే పరిస్థితి జిల్లాలో పలు నియోజకవర్గాల్లో నెలకొంది. వైఎస్సార్సీపీకి ప్రజాబలం గణనీయంగా ఉన్న నేపథ్యంలో సింగిల్‌గా ఢీకొట్టలేమని భావించిన తెలుగుదేశం పార్టీ రాజకీయ పొత్తుల కోసం ప్రయత్నిస్తోంది. అధికారికంగా అభ్యర్థులను ప్రకటించకపోయినా కడప, ప్రొద్దుటూరులో అభ్యర్థులు ఆర్ మాధవీరెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ప్రచారం కొనసాగిస్తున్నారు. మాధవీరెడ్డికి టికెట్ వచ్చే పరిస్థితి లేదని కార్పొరేటర్ ఉమాదేవి కుటుంబం ఇప్పటికీ బలంగా విశ్వసిస్తోంది. నారా లోకేష్ నుంచి అభయం వచ్చిన తర్వాతే తాము టీడీపీ కోసం విశేషంగా గ్రౌండ్ వర్క్ చేశామని పార్టీ టికెట్ తమదే అంటూ ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి వర్గీయులు అంటున్నారు. కుటుంబంలో ఒక్కరికే టికెట్ ఇవ్వనున్నట్లు తెలుగుదేశం పార్టీ నుంచి సిగ్నల్స్ అందుతున్నాయి. ఈనేపథ్యంలో రాయచోటిలో రమేష్‌రెడ్డికి టికెట్ దక్కితే, కడపలో మాధవీరెడ్డికి లభించదనే ధీమాతో ఉమాదేవి కుటుంబం ఉంది. అలాగే మాధవీరెడ్డికి టికెట్ ఖరారైతే, రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్‌రెడ్డికి దక్కే అవకాశం లేదనే భావన అక్కడి ఆశావహుల్లో వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితులల్లో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని నేతల్లో టెన్షన్ కొనసాగుతోంది. కమలాపురంలో పుత్తా తనయుడు వరుసగా ఓటమి చెందిన నేతలకు టికెట్ ఇచ్చేది లేదని ఇదివరకు నారా లోకేష్ ప్రకటించారు. ఈనేపథ్యంలో కమలాపురం నుంచి వరసగా నాలుగుసార్లు పోటీచేసి ఓడిపోయినా పుత్తా నరసింహారెడ్డికి టికెట్ దక్కే అవకాశం లేదని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ క్రమంలో పుత్తా తనయుడు చైతన్యరెడ్డి పేరు తెరపైకి వస్తోంది. ఎలాగైనా సరే తమ కుటుంబమే పోటీలో ఉంటుందని సన్నిహితులతో పుత్తా నరసింహారెడ్డి వ్యాఖ్యలు చేయడం కూడా అందుకు బలం చేకూరుస్తోంది. మొన్నటి వరకు పుత్తా ప్రచారంలో ఉన్నా తాజాగా చైతన్యరెడ్డి పేరు తెరపైకి రావడం విశేషం. అలాంటి పరిస్థితి ప్రొద్దుటూరులో కూడా కన్పిస్తోంది. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అభ్యర్థిగా కుటుంబ సమేతంగా ప్రచారం చేసుకుంటున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి తీవ్రస్థాయిలో వరదకు వ్యతిరేకంగా ఆరోపణలు చేశారు. అయినప్పటీకీ వరద పేరు ఖరారైందని.. పదవీకాలం ముగుస్తున్న రాజ్యసభ సభ్యుడి బంధువులు, సన్నిహితులకు సమాచారం అందించినట్లు తెలిసింది. రాజంపేటలో జనసేన బ్రేక్‌లు రాజంపేట టీడీపీ టికెట్ కోసం ముగ్గురు ఆశావహులున్నారు. వీరందరిలో జనసేన పొత్తు కారణంగా టికెట్ దక్కదనే అభద్రతాభావం ఏర్పడింది. రాజంపేట టికెట్ జనసేన కోరుతున్న నేపథ్యంలో టీడీపీ ఆశావహులు బేల మొహం పెడుతున్నారు. ఇప్పటి వరకు తనకే పార్లమెంటు టికెట్ అనే భావనతో ఉన్న సుగవాసీ బాలసుబ్రమణ్యంలో కూడా అంతర్గతంగా ఆవేదన ఉన్నట్లు సమాచారం. బీజేపీతో టీడీపీ పొత్తు కుదిరితే, రాజంపేట పార్లమెంటు బీజేపీ కోరే అవకాశం లేకపోలేదనే సందిగ్ధత ఆయనలో ఉన్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తెలుగుతమ్ముళ్లలో రోజు రోజుకు బీపీ పెరిగిపోతుంది. అదే విషయాన్ని ఆదివారం మాజీ ఎమ్మెల్యే ఒకరు రాయచోటిలో అనుచరవర్గంతో బాహాటంగా చెప్పుకు రావడం గమనార్హం. -
మాధవీ..మర్యాదగా మసలుకో!
సాక్షి ప్రతినిధి, కడప: శాంతిభద్రతలకు నిలయంగా, మత సామరస్యానికి ప్రతీకగా.. ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న జిల్లా కేంద్రమైన కడపలో దౌర్జన్యకర ఘటనలు జరుగుతున్నాయి. ఏదో ఒకచోట టీడీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. రెండు నెలల తర్వాత అధికారం మాదే, మేమేంటో చూపిస్తామంటూ అధికారులను సైతం బ్లాక్మెయిల్ చేస్తున్నారు.ఒక్కమాటలో చెప్పాలంటే టీడీపీ శ్రేణులు గూండారాజ్‌ను మరిపిస్తున్నారు. ఇదివరకు ఎన్నడు లేనివిధంగా టీడీపీ ఇన్చార్జిగా ఆర్ మాధవీరెడ్డి నియామకమయ్యాక ప్రత్యక్ష ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కార్పొరేటర్ షబానా కుమారుడు పీరుల్లా(26)పై హత్యాయత్నానికి పాల్పడ్డారు. కడప నగరం మోచంపేట 39వ డివిజన్ టీడీపీ ఇన్చార్జి అరీఫ్ మరికొంతమంది కలిసి పీరుల్లాపై గురువారం హత్యాయత్నానికి పాల్పడ్డారు. మొన్న మృత్యుంజయకుంట సమీపంలో మాధవీరెడ్డి ‘బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ’కార్యక్రమంలో భాగంగా ప్రచారానికి వెళ్లింది. ఇంటింటా టీడీపీ స్టిక్కర్లు గృహస్తుల అనుమతి లేకుండా అతికించారు. గమనించిన వలంటీర్ ఆంజనేయులు తన ఇంటికి టీడీపీ స్టిక్కర్ అతికిస్తుంటే అభ్యంతరం చెప్పారు. నా అనుమతి లేకుండా ఇలా చేయొద్దన్నందుకు టీడీపీ నేతలు దేరంగుల శివ, శివశంకర్ వాదనకు దిగారు. వలంటీర్‌పై దాడి చేశారు. అంతటితో ఆగకుండా మాధవీరెడ్డి తన ప్రైవేటు సైన్యంతో అక్కడికి వెళ్లి రచ్చ చేశారు. ఈవ్యవహారం చిన్నచౌక్ పోలీసుస్టేషన్‌కు చేరింది. పోలీసుస్టేషన్లో సైతం పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి రెండు నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది, తర్వాత నేనేంటో చూపిస్తానంటూ బెదిరింపులకు దిగారు. కలెక్టర్ విజయ్‌రామరాజు బుధవారం ఓటర్ల తొలగింపులు, చేర్పులు వ్యవహారంపై రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న శ్రీనివాసులరెడ్డి అదే పదజాలన్నీ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ అయిన విజయరామరాజు ఎదుట సైతం ఉపయోగించడం విశేషం. క్రమం తప్పకుండా దౌర్జన్యాలు.... ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్లలో పర్యటిస్తున్న మాధవీరెడ్డి ఇటీవల దౌర్జన్య కర ఘటనలకు పాల్పడుతున్నారు. మొన్న టీడీపీ బృందం ప్రచారం చేసుకుంటూ వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నేత వినోద్‌కుమార్ ఇంటికి వెళ్లారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే అభ్యంతరం చెప్పారు. వెంటనే వినోద్‌కుమార్‌ను టార్గెట్ చేసి, స్వయంగా మాధవీరెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. శ్రీనివాసులరెడ్డి దంపతులు డిప్యూటీ సీఎం అంజద్‌బాషాను సైతం ఏకవచనంతో సంబోధించడం పరిపాటిగా పెట్టుకున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. సోషల్ మీడియా కేంద్రంగా ఏకవచనంతో సంభోదిస్తూ కావాలనే సామాజికంగా ఎక్స్‌ఫోజ్ చేస్తున్నారని పలువురు భావిస్తున్నారు. మాధవీ..మర్యాదగా మసలుకో! కడప రూరల్ /కడప అర్బన్: ప్రశాంతంగా ఉన్న కడపకు వచ్చి విద్వేషాలను నింపుతున్న కడప నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి మాధవిరెడ్డి మర్యాదగా మసలుకుని ప్రవర్తించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కడప నగర మహిళా నేతలు హితవు పలికారు. గురువారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో విలేకరులతో పార్టీ కడప సోషల్‌మీడియా కన్వీనర్ సునీతరెడ్డి మాట్లాడుతూ మాధవిరెడ్డికి ఓటమి భయం పట్టుకుందన్నారు. దీంతో ఆమె మతిస్థిమితం లేని వ్యక్తిలా ప్రవర్తించడమే కాకుండా డిప్యూటీ సీఎం అంజద్బాషతోపాటు వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. బుధవారం రాత్రి 10–12 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి ఫోన్ చేసి తనను బెదిరించడమే కాకుండా ఇష్టానుసారంగా దూషించారన్నారు. కడప టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాధవిరెడ్డి నియమితులైనప్పటి నుంచి ఆ పార్టీ కార్యకర్తల ఆగడాలు, బెదిరింపులు ఎక్కువయ్యాయని తెలిపారు. ఈ విషయమై జిల్లా ఎస్పీకి, కడప డీఎస్పీకి ఫిర్యాదు చేశామని సోషల్ మీడీయా కన్వీనర్లు సునీతారెడ్డి, నిశాంత్‌లు తెలిపారు. పార్టీ మహిళా విభాగం కడప నగర అధ్యక్షురాలు వెంకటసుబ్బమ్మ మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న కడపకు మాధవిరెడ్డి శూర్పనఖలా వచ్చారని అన్నారు. పార్టీ నాయకులు పద్మావతి, మరియలు, సుశీల, తులశమ్మ, నారాయణ, నిర్మల పాల్గొన్నారు. కడపను కలుషితం చేస్తే సహించం టీడీపీ ఇన్చార్జి మాధవీరెడ్డి, ఆమె భర్త శ్రీనివాసులరెడ్డి కడపలో శాంతిభద్రతలకు భంగం కల్గిస్తున్నారు. వైఎస్సార్సీపీ యువజన నేత పీరుల్లాపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజామెప్పుతో నాయకుడిగా ఎదగాలని సూచిస్తున్నారు. టీడీపీ నేతలు రౌడీయిజంతో రాజకీయం చేయాలని చూస్తున్నారు.శాంతియుత వాతావరణంలో ఉన్న కడపను కలుషితం చేస్తే సహించం. –అంజద్‌బాషా, డిప్యూటీ సీఎం కవ్వింపు చర్యలు మానుకోండి టీడీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.వీటిని మానుకోవాలి. అకారణంగా వైఎస్సార్సీపీ శ్రేణులను టార్గెట్ చేస్తున్నారు. లక్కిరెడ్డిపల్లె, చక్రాయపేట, రామాపురం ప్రాంతాలకు చెందిన ప్రైవేటు సైన్యంతో శ్రీనివాసులరెడ్డి, మాధవీరెడి జిల్లా కేంద్రంలో దౌర్జన్యకర ఘటనలకు పాల్పడుతున్నారు. ఇలాంటివి పునరావృతమెతే టీడీపీ నేతలు తగిన మూల్యం చె ల్లించుకోవాల్సి వస్తోంది. – సురేష్‌బాబు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు -
ఆ నలుగురు టీడీపీ ఇన్చార్జీలు.. సీటు తేడా కొడితే పార్టీకి పనిచేస్తారా..?
సాక్షి ప్రతినిధి, కడప: ఎన్నికల నోటిఫికేషన్ రాకున్నా అధికార వైఎస్సార్సీపీ దూకుడుగా అభ్యర్థులను ప్రకటిస్తోంది. అభ్యర్థుల ప్రకటనపై టీడీపీ అంతర్మథనంలో ఉంది. నియోజకవర్గ ఇన్‌చార్జీలకు టికెట్ దక్కకపోతే, టీడీపీకి పనిచేస్తారా? లేదా? అన్న సందిగ్ధత ఆ పార్టీలో కొనసాగుతోంది. ఉమ్మడి కడప జిల్లాలో నాలుగు చోట్ల అలాంటి పరిస్థితే ఉంది. మెరుగైన అభ్యర్థులు లభించి, సీన్ మారితే రివర్స్ గేర్ అందుకుంటారా అన్న అనుమానం లేకపోలేదు. వెరశి వీళ్లకు టికెట్ ఉన్నట్టా...లేనట్టా...అన్న సందేహాం లేకపోలేదు. అపార ప్రజామద్దతు, విజయావకాశాలను బేరీజు వేసుకొని వైఎస్సార్సీపీ అభ్యర్థులను ప్రకటిస్తోంది. అలాంటి ధీమా తెలుగుదేశం పార్టీలో కనిపంచడం లేదు. నియోజకవర్గ ఇన్‌చార్జీలతో పార్టీ కార్యక్రమాలు కొనసాగించడం మినహా వారే అభ్యర్థులని ప్రకటించడం లేదు. ఇటీవల రా...కదలిరా కార్యక్రమంలో కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని అధినేత చంద్రబాబు అభ్యర్థించారే తప్ప, అభ్యర్థులుగా వీరి విజయానికి కృషి చేయాలని పేర్లు చెప్పలేకపోయారు. ఏక నాయకత్వం ఉన్న నియోజకవర్గాల్లో కూడా అదే దాటవేత ధోరణినే అవలంభించారు. అందుకు కారణం లేకపోలేదు. ఇప్పుడున్న వారి కంటే మెరుగైన అభ్యర్థి కోసం టీడీపీ అన్వేషిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే సింగిల్ నాయకత్వం ఉన్న చోట కూడా అభ్యర్థిగా ప్రకటించలేకపోతున్నారని విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఆ నాలుగు చోట్లా సంకటమే... తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల ఖరారు తర్వాత జిల్లా నేతల మధ్య సర్దుబాటు సాధ్యమౌతుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితి ఉమ్మడి జిల్లాలో నాలుగు చోట్ల ఉండిపోయింది. కడప నియోజకవర్గ ఇన్చార్జిగా మాధవీరెడ్డి నియామకం అయ్యాక, ఆమె పార్టీ కార్యక్రమాలు చురుగ్గా చేపడుతున్నారు. తనకే టికెట్ అన్న ధీమాతో జనంలోకి వెళ్తున్నారు. కాగా 2019లో పోటీచేసిన మైనార్టీ నేత అమీర్‌బాబు, 2014లో పోటీచేసిన దుర్గాప్రసాద్, ప్రస్తుతం టికెట్ ఆశిస్తున్న కార్పొరేటర్ ఉమాదేవి (జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ఆలంఖాన్పల్లె లక్ష్మిరెడ్డి కోడలు) ఒక జట్టుగా పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. మాధవీరెడ్డికి టికెట్ కేటాయిస్తే వీరంతా సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవల రా..కదలిరా కార్యక్రమానికి హాజరైన చంద్రబాబుతో కార్పొరేటర్ ఉమాదేవి గెలిచే వారికే టికెట్ ఇవ్వండి సార్..అంటూ బాహాటంగా కోరడం విశేషం. వైరి పక్షాన్ని కలుపుగోలుగా వెళ్లలానే ఆలోచన ఇన్చార్జి మాధవీరెడ్డిలో కూడా కన్పించడం లేదని పరిశీలకుల భావిస్తున్నారు. అదే సమయంలో మాధవీరెడ్డికి సహకరించే పరిస్థితి ఆ ముగ్గురు నాయకుల్లో కనిపించడం లేదని పలువురు అభిప్రాయడుతున్నారు. ప్రొద్దుటూరు అభ్యర్థిత్వాన్నిప్రకటించుకున్న ప్రవీణ్... ప్రొద్దుటూరు ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి టికెట్‌పై ధీమాగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల వరదరాజులరెడ్డి, మల్లెల లింగారెడ్డిలతో పాటు, రాష్ట్ర కార్యదర్శి సీఎం సురేష్‌లు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఈ నలుగురిలో చినబాబు ప్రవీణ్ వైపు మొగ్గు చూపుతుండగా, పెద్దబాబు డైలమాలో ఉన్నారు. ఒకరికిస్తే కనీసం ఇద్దరు విబేధించే పరిస్థితి లేకపోలేదు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే అంతంత మాత్రపు పోటీ ఇవ్వగలరని, ఇలాంటి పరిస్థితిలో ఏకాభిప్రాయం ఎలా సాధించాలనే సందిగ్ధత టీడీపీలో కనిపిస్తోందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. కాగా సోమవారం ప్రొద్దుటూరు పట్టణంలో టీడీపీ అభ్యర్థిగా గండ్లూరు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తనకు తానుగా పోస్టర్లు వేసుకున్నారు. ఈవ్యవహారంపై అటు మాజీ ఎమ్మెల్యే వరద వర్గీయులు, ఇటు లింగారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏకపక్షంగా అభ్యర్థిగా ప్రకటించుకోవడం ఏమిటని నిలదీస్తున్నారు. ప్రొద్దుటూరు టీడీపీలో తాజాగా అభ్యర్థిత్వం అగ్గి రాజుకుంది. ఎటు వైపు దారి తీస్తుందో వేచి చూడాల్సిందేనని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. పుత్తా పేరు ఎత్తని చంద్రబాబు... కమలాపురం కేంద్రంగా ఈనెల 19న రా...కదలిరా కార్యక్రమాన్ని చంద్రబాబు చేపట్టారు. అక్కడి నియోజకవర్గ ఇన్చార్జి పుత్తా నరసింహారెడ్డిని ఈ మారైనా గెలిపించాలని అధినేత చంద్రబాబు సూచించకపోవడం చర్చనీయాంశమైంది. వరుసగా నాలుగు సార్లు ఓటమి పాలైన పుత్తా స్థానంలో మరెవ్వరినైనా దింపాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారా? ఆ కారణంతోనే పుత్తా పేరు ప్రకటించలేదా? మెరుగైన అభ్యర్థి లభించి తెరపైకి తీసుకువస్తే పుత్తా సహకరిస్తారా? అనే సందేహం కూడా టీడీపీని వెంటాడుతున్నట్లు సమాచారం. ఈక్రమంలో పుత్తాకు తెలియకుండానే కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డిని తాజాగా టీడీపీలో చేర్చుకున్నారు. ఇక్కడ కూడా టికెట్ విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. అదే పరిస్థితి రాయచోటిలో ఉంది. ప్రస్తుత ఇన్చార్జి రమేష్‌కుమార్‌రెడ్డి 2014, 19ల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఈమారు టికెట్ తనకే లభిస్తుందనే ధీమాతో ఉన్నారు. కాగా ఇటీవల టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథరెడ్డి, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, సుగవాసీ ప్రసాద్‌బాబు కూడా టికెట్ ఆశిస్తున్నారు. గడికోట ద్వారకా నందమూరి కుటుంబంతో ఉన్న బంధుత్వం (దివంగత నందమూరి తారకరత్న) కారణంగా తనకే టికెట్ లభిస్తుందనే భావనతో వర్గ సమీకరణ దిశగా అడుగులు వేస్తున్నారు. మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి కూడా ఈమారు టికెట్ దక్కుతోందనే ధీమాగా ఉన్నారు. వీరిలో ఒక్కరికి టికెట్ లభిస్తే, మరొకరు సహకరించే పరిస్థితి కన్పించడం లేదని పరిశీలకుల అంచనా. ఇలాంటి పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలనే ఆలోచనలో టీడీపీ ఉండిపోయిందని పలువురు చెప్పుకొస్తున్నారు. -
‘మాధవీరెడ్డి.. నోరు అదుపులో పెట్టుకో.. విమర్శిస్తే సహించం’
సాక్షి ప్రతినిధి, కడప: అర్హత ప్రామాణికంగా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. పార్టీలు, వర్గాలకతీతంగా సంక్షేమం అండగా నడిపిస్తోంది. నాటి చంద్రబాబు సర్కార్‌లో ఉన్నట్లు జన్మభూమి కమిటీల సిఫార్సులు అవసరం లేదు. ప్రజల వద్దకే పాలన వచ్చి చేరింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి అపార ప్రజా మద్దతు దక్కుతోంది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం ఇన్‌ఛార్జులు కల్లిబొల్లి కబుర్లతో ప్రజల చెంతకు చేరితే, ప్రతిఘటన ఉత్పన్నమవుతోంది. ప్రజానీకం నిలదీస్తే సమాధానం చెప్పుకోలేక మథన పడుతున్నారు. వ్యక్తిగత దూషణలకు దిగుతోన్న నేపథ్యం తెరపైకి వస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. ► 2019, మే నెల 30న సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆదే రోజున వర్గాలు, పార్టీలు, ప్రాంతాలను చూడకుండా రాజకీయాలకతీతంగా నవరత్నాలు అందిస్తామని స్పష్టం చేశారు. చెప్పిన మాట ప్రకారం తర, తమ, భేదం లేకుండా పథకాలకు అర్హులైతే గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా లబ్ధి చేకూరుతోంది. ఇందులో తెలుగుతమ్ముళ్లుకు సైతం సంక్షేమం వర్తిస్తోంది. అప్పట్లో తెలుగుతమ్ముళ్లు నేతృత్వంలో ఏర్పాటైన జన్మభూమి కమిటీల లాగా, మరెలాంటి సిఫార్సులు అవసరం లేదు. పాలన ప్రక్షాళన చేశారు. అర్హుల ఇళ్లు ముంగిటకు సంక్షేమం తీసుకెళ్లారు. కోవిడ్ వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందిన వ్యవస్థలు అస్థవ్యస్థమైనా, సంక్షేమాన్ని అపలేదు. వెరశి ప్రజల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ప్రజల నుంచి మద్దతు దక్కతోంది. టీడీపీ నేతలకూ సంక్షేమ ఫలాలు రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు వివిధ పథకాల ద్వారా రూ.7,197.48 కోట్లు నేరుగా లబ్ధి చేకూర్చింది. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు దక్కాయి. ఈ క్రమంలో టీడీపీ క్రియాశీలక నేతలకు సైతం పెద్ద ఎత్తున సంక్షేమం దక్కింది. బద్వేల్ మున్సిపాలిటీలో టీడీపీ కౌన్సిలర్ సోమేశుల సుధామణి కుటుంబానికి రూ.11.6 లక్షలు సమకూరింది. ఖాజీపేట మండలశాఖ అధ్యక్షుడు తిప్పిరెడ్డి లక్ష్మీరెడ్డి కుటుంబానికి రూ.5.25 లక్షలు దక్కింది. చాపాడు టీడీపీ నేత మార్తల నరసింహారెడ్డి కుటుంబానికి దాదాపు రూ.4 లక్షల లబ్ధి చేకూరింది. జిల్లా వ్యాప్తంగా టీడీపీ క్రియాశీలక నేతలందరికీ వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్‌లో సంక్షేమ ఫలాలు దక్కాయి. టీడీపీ సామాన్య కార్యకర్త నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న నేతల వరకూ అర్హుల జాబితాలో ఉండడం మరో విశేషం. విమర్శిస్తే సహించని ప్రజానీకం... తెలుగు తమ్ముళ్లు ప్రభుత్వాన్ని విమర్శిస్తే సామాన్య ప్రజలు సహించలేకున్నారు. కడపలో వైఎస్సార్ కాలనీలో ఇన్‌ఛార్జి మాధవీరెడ్డి మాటలను ఖండిస్తూ అడ్డుతగిలిన నేపథ్యమే ఉదాహరణ. ఈ పరిస్థితిలో మరింతగా రెచ్చిపోయిన అమె వ్యక్తిగతంగా మంత్రి అంజాద్‌బాషాపై ఆరోపణలు సంధించడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రొద్దు టూరు, మైదుకూరు, కమలాపురం టీడీపీ ఇన్‌ఛార్జిలు గండ్లూరు ప్రవీణ్ కుమార్‌రెడ్డి, పుట్టా సుధాకర్‌యాదవ్, పుత్తా నరసింహారెడ్డిలు ఇలాగే వ్యవహరిస్తున్నారు. వ్యక్తిగత విమర్శలు మినహా ప్రజలకు పథకాలు అందలేదని కానీ, మ్యేనిఫెస్టో అమలు చేయలేదని కానీ ఆరోపణలు చేయడం లేదని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ప్రజల నుంచి టీడీపీ నేతలకు ప్రతిఘటన ఉత్పన్నం కావడం వెనుక సంక్షేమ పథకాలేనని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. -
తెలంగాణ ఉద్యమంతో...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఉద్యమ సింహం’. నటరాజన్, మాధవీ రెడ్డి, జలగం సుధీర్, లత, పీఆర్ విటల్ బాబు, సూర్య ముఖ్య పాత్రల్లో నటì ంచారు. అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వంలో పద్మనాయక ప్రొడక్షన్స్ పతాకంపై కల్వకుంట్ల నాగేశ్వర రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. కల్వకుంట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘ఉద్యమ సింహం’ సినిమా కేసీఆర్ జీవితకథ కాదు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్ నేతృత్వంలో సాగిన అంశాల నేపథ్యంగా తెరకెక్కించిన కథ. కేసీఆర్ పాత్రలో నటరాజన్ చక్కగా నటించారు’’ అన్నారు. ‘‘ప్రత్యేక తెలంగాణ కోసం ఎందరో ఉద్యమాలు నడిపారు కానీ ఒక్క కేసీఆర్‌గారు మాత్రమే పోరాడి తెలంగాణాను సాధించారు. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని కృష్ణంరాజు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దిలీప్ బండారి. -
మంత్రి వర్సెస్ సర్పంచ్
కూసుమంచి, న్యూస్‌లైన్: పాలేరులో కాంగ్రెస్ వర్గ పోరు మరోసారి పొడచూపింది. సర్పంచ్ రామసహాయం మాధవీరెడ్డి, మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి నడుమ చోటుచేసుకున్న విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. మంత్రి సమీప బంధువైన మాధవీరెడ్డి సర్పంచ్ అయ్యేంత వరకూ ఆయన వెన్నంటే ఉన్నారు. ఇటీవల గ్రామంలో రెండుసార్లు రేణుకాచౌదరితో సభలు పెట్టించడం, ఎంపీ నిధులతో నిర్మించిన రోడ్లకు ఆమెతో శంకుస్థాపన చేయిం చడం స్థానికులను విస్మయం కలిగించింది. సభల్లో వెంకటరెడ్డిపై రేణుకాచౌదరి నిప్పులు చెరగడం, ఆ తర్వాత మంత్రి వర్గీయులు ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడం విదితమే. ఈ నేపథ్యంలో మంత్రికి, సర్పంచ్‌కు మధ్య తీవ్ర విభేదాలు చోటుచేసుకున్నాయి. తాజాగా గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ నిర్మాణ పనుల విషయంలోనూ వారి మధ్య మరోసారి విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆలయ నిర్మాణం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపడుతుండడంతో మంత్రితో భూమి పూజ చేయించేందుకు అధికారులుత శుక్రవారం ఉదయం ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తెలుసుకుని సర్పంచ్ ముందస్తుగానే తెల్లవారుజామున తన అనుచరులతో అక్కడికి చేరుకుని ఆలయ నిర్మాణ స్థలంలో పూజలు చేశారు. అనంతరం మంత్రి కూడా ఆలయ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈసందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తనకు ఎవరిపై ఎలాంటి కోపం లేదని, కొందరు తెలిసీతెలియని రాజకీయాలు చేస్తున్నారని సర్పంచ్‌ను ఉద్దేశిస్తూ అన్నారు. ఓ దశలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ముహూర్తం బాగాలేకనేనట..! ఆలయ పనులకు వేరుగా శంకుస్థాపన ఎందుకు చేశారని, ప్రొటోకాల్ ప్రకారం అధికారులు మిమ్మల్ని ఆహ్వానించలేదా..? అని సర్పంచ్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరింది. దీనిపై ఆమె మాట్లాడుతూ అధికారులు తనను ఆహ్వానించారని, ఉదయం 11 గంటలకు ఖరారు చేసిన మమూర్తం బాగా లేకపోవడం వల్లే తాను ముందస్తుగా భూమి పూజ చేయాల్సి వచ్చిందని చెప్పారు. గ్రామస్తులకు శుభం కలగాలనే కాంక్షతోనే తెల్లవారుజామున 5 గంటలకు పూజలు చేశానని తెలిపారు. -
రామనామం...ప్రత్యర్థులపై బాణం!
సాక్షి, కొత్తగూడెం: ‘భద్రాచలం రాముడు తెలంగాణ దేవుడు.. ఈ ప్రాంతానికే రాములోరు దక్కేలా నినదించాలి’ అంటూ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి చేపట్టిన భద్రాచలం జైత్రయాత్ర వెలవెలపోయింది. అనుంగు నేతలు ఆమె పర్యటనకు భారీ ఏర్పాట్లు చేసినా చివరకు క్యాడర్ లేకపోవడంతో కార్యకర్తల సమావేశాలు కూడా రద్దయ్యాయి. ఊహించని రీతిలో క్యాడర్ దూరం కావడంతో సదరు నేతల అంచనాలు తలకిందులయ్యాయి. కాగా, పర్యటన యావత్తూ పార్టీలోని ప్రత్యర్థులపై విమర్శలకే రేణుక ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. ఇటీవలి కాలంలో తమ వర్గానికి షాక్ ఇచ్చేలా పార్టీలోని ప్రత్యర్థి వర్గం ఎత్తులు వేయడంతో నైరాశ్యంలో ఉన్న రేణుక అనుచర నేతలు జిల్లా పర్యటనకు రావాలని ఆమెను కోరినట్లు సమాచారం. ఇదేసమయంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి పదవి నుంచి కూడా ఆమెను పక్కన పెట్టారు. మొత్తంగా తన అనుచరులలో ఉత్సాహం నింపాలన్న ఉద్దేశంతో రేణుక జిల్లా పర్యటన చేపట్టారు. దీంతో పాలేరు నుంచి భద్రాచలం వరకు నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశాలు పెట్టాలని ఆమె పర్యటనకు నాలుగు రోజుల ముందే ఆయా నేతలు షెడ్యూల్ ఖరారు చేశారు. ఊహించని రీతిలో రేణుక పర్యటనను సక్సెస్ చేసి ప్రత్యర్థులకు చెక్ పెట్టాలని భావించారు. అయితే శనివారం నాటి జిల్లా పర్యటనలో... గతంలో ఆమె వెంట ఉన్న నేతలు మినహా మిగతా వారేవరూ రాకపోవడంతో ఆమె వర్గీయులు ఆశించిన స్థాయిలో జరగలేదు. నాయకన్‌గూడెం నుంచి భద్రాచలం వరకు ఇదే పరిస్థితి. పార్టీ శ్రేణులు లేకపోవడంతో ఖమ్మం, వైరా, కొత్తగూడెం, ఖమ్మంరూరల్‌లో కార్యకర్తల సమావేశాలు రద్దు అయ్యాయి. దీంతో ఆమె కొణిజర్ల, వైరా, ఏన్కూరు, జూలూరుపాడు, కొత్తగూడెం, పాల్వంచసెంటర్లలో కాన్వాయ్ ఆపి అక్కడ ఉన్న కొద్దిమంది కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తల్లాడలో గతంలో ఉన్న ఆమె అనుచర నేతల నుంచి కూడా స్పందన కూడా లేకపోవడం గమనార్హం. కొత్తగూడెం, పాల్వంచలో కొంతమంది క్యాడర్ కనిపించగా.. మిగతా చోట్ల అంతా పేలవంగానే ఆమె యాత్ర సాగింది. ప్రత్యర్థులపైనే విమర్శనాస్త్రాలు.. రేణుక పర్యటన అంతా పార్టీలో తనను ప్రశ్నిస్తున్న ప్రత్యర్థులను ఉద్దేశించిందిగానే సాగింది. ‘నేను సైనికుడిని బిడ్డను.. దేశంలో ఎక్కడైనా తిరుగుతా.. ఈ జిల్లాలో పుట్టినవారు జిల్లాకు ఏమైనా చేశారా..? నేను 27 ఏళ్లుగా జిల్లాకు రూ.కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి చేశాను. జిల్లా ఆడబిడ్డగా ఇలా అభివృద్ధి చేస్తుంటే.. నన్ను చేయనివ్వరు.. వాళ్లు చేయరు. వాళ్లు జిల్లాకు ఏంచేశారో..? నేను ఏంచేశానో బహిరంగ చర్చకు సిద్ధం’ అని ఆమె పరోక్షంగా మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డికి సవాల్ విసిరారు. ఆమె ప్రసంగించిన చోటల్లా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రత్యర్థులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా రాష్ట్ర విభజన ద్వారా తలెత్తే సమస్యలనూ సీఎం అధిష్టానానికి విన్నవిస్తున్నారని, ఆయన ఫ్లెక్సీలు చించేవారు మూర్ఖులతో సమానం అంటూ విమర్శించారు. అనుంగు నేతల హల్చల్.. జిల్లా సరిహద్దు నాయకన్‌గూడెం మొదలు భద్రాచలం వరకు ఆమె అనుచర నేతల హల్చల్తోనే రేణుకాచౌదరి పర్యటన కొనసాగింది. ఖమ్మంలో ఉన్న కొద్దిమంది నేతలు నాయకన్‌గూడెం వెళ్లి స్వాగతం పలకడంతో పాటు అక్కడి నుంచి భద్రాచలం వరకు ఆమె పర్యటనలో కొనసాగారు. పాలేరులో కొంత సేపు ఆగగా.. అక్కడి సర్పంచ్ మాధవిరెడ్డి తన వాహనంలో ఖమ్మం తీసుకెళ్లారు. దీంతో మంత్రికి వ్యతిరేకంగా పాలేరు నియోజకవర్గంలో కుంపటి పెట్టాలని ఆమె వ్యూహంలో ఉన్నట్లు పార్టీవారే చర్చించుకున్నారు. క్యాడర్ లేక కార్యకర్తల సమావేశాలు రద్దు కావడం, అసలు పర్యటన ఫలితం ఏముంటుందని భావించే రేణుకాచౌదరి.. ‘భద్రాచలం జైత్రయాత్ర’ అని ఆమె పర్యటనకు పేరుపెట్టుకున్నట్లు పార్టీలోని నేతలు చర్చించుకుంటున్నారు. పలువురు ముఖ్యనేతలు, వారి వర్గం వారు రేణుక పర్యటనకు దూరంగా ఉన్నారు. కాగా, తెలంగాణవాదులు, ఆమె ప్రత్యర్థి వర్గం అనుచరులు ఎవరైనా ఆమె పర్యటనను అడ్డుకుంటారేమోనని పోలీసులు మాత్రం భారీ బందోబస్తు చేపట్టారు.