కూసుమంచి, న్యూస్‌లైన్: పాలేరులో కాంగ్రెస్ వర్గ పోరు మరోసారి పొడచూపింది. సర్పంచ్ రామసహాయం మాధవీరెడ్డి, మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి నడుమ చోటుచేసుకున్న విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. మంత్రి సమీప బంధువైన మాధవీరెడ్డి సర్పంచ్ అయ్యేంత వరకూ ఆయన వెన్నంటే ఉన్నారు. ఇటీవల గ్రామంలో రెండుసార్లు రేణుకాచౌదరితో సభలు పెట్టించడం, ఎంపీ నిధులతో నిర్మించిన రోడ్లకు ఆమెతో శంకుస్థాపన చేయిం చడం స్థానికులను విస్మయం కలిగించింది. సభల్లో వెంకటరెడ్డిపై రేణుకాచౌదరి నిప్పులు చెరగడం, ఆ తర్వాత మంత్రి వర్గీయులు ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడం విదితమే. ఈ నేపథ్యంలో మంత్రికి, సర్పంచ్‌కు మధ్య తీవ్ర విభేదాలు చోటుచేసుకున్నాయి.
తాజాగా గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ నిర్మాణ పనుల విషయంలోనూ వారి మధ్య మరోసారి విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆలయ నిర్మాణం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపడుతుండడంతో మంత్రితో భూమి పూజ చేయించేందుకు అధికారులుత శుక్రవారం ఉదయం ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తెలుసుకుని సర్పంచ్ ముందస్తుగానే తెల్లవారుజామున తన అనుచరులతో అక్కడికి చేరుకుని ఆలయ నిర్మాణ స్థలంలో పూజలు చేశారు. అనంతరం మంత్రి కూడా ఆలయ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈసందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తనకు ఎవరిపై ఎలాంటి కోపం లేదని, కొందరు తెలిసీతెలియని రాజకీయాలు చేస్తున్నారని సర్పంచ్‌ను ఉద్దేశిస్తూ అన్నారు. ఓ దశలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
ముహూర్తం బాగాలేకనేనట..!
ఆలయ పనులకు వేరుగా శంకుస్థాపన ఎందుకు చేశారని, ప్రొటోకాల్ ప్రకారం అధికారులు మిమ్మల్ని ఆహ్వానించలేదా..? అని సర్పంచ్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరింది. దీనిపై ఆమె మాట్లాడుతూ అధికారులు తనను ఆహ్వానించారని, ఉదయం 11 గంటలకు ఖరారు చేసిన మమూర్తం బాగా లేకపోవడం వల్లే తాను ముందస్తుగా భూమి పూజ చేయాల్సి వచ్చిందని చెప్పారు. గ్రామస్తులకు శుభం కలగాలనే కాంక్షతోనే తెల్లవారుజామున 5 గంటలకు పూజలు చేశానని తెలిపారు.
మంత్రి వర్సెస్ సర్పంచ్
Published Sat, Dec 7 2013 4:45 AM | Last Updated on Sat, Sep 2 2017 1:20 AM
Advertisement
Advertisement