బెదిరింపులు, దూషణలతో రెచ్చిపోయిన ఎమ్మెల్యే, కార్పొరేటర్లు
సాక్షి ప్రతినిధి, కడప: కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవీరెడ్డి తీరు ఏ మాత్రం మారలేదు. ప్రజా సమస్యలను గాలికొదిలి నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో తనకు మేయర్ పక్కనే కుర్చీ వేయలేదని రచ్చ చేశారు. అజెండా పేపర్లను చించేసి నిరసన తెలిపారు. మేయర్ సురే‹Ùబాబు కార్పొరేటర్లను సస్పెండ్ చేసినా బయటకు వెళ్లకుండా రచ్చ చేస్తూనే, దూషణలు, కవ్వింపు
పు చర్యలకు దిగారు. లేని ప్రోటోకాల్ కోసం ఎమ్మెల్యే పంతానికి దిగారు. మేయర్ స్థాయిలో సీటు వేయాలని.. అంతవరకూ సమావేశం జరగనిచ్చేది లేదంటా రభస కొనసాగించారు. వందలాది మంది టీడీపీ కార్యకర్తలను వెంటేసుకుని నగరపాలక సంస్థ కార్యాలయం లోపల, బయట యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సమావేశాన్ని రెండోసారి కూడా కొనసాగనివ్వకుండా అడ్డుకున్నారు.
అధికార దర్పంతోనే..
వాస్తవానికి కార్పొరేషన్ నిబంధనల ప్రకారం.. ఎమ్మెల్యే నగరపాలక సంస్థకు ఎక్స్‌అఫిíÙయో సభ్యులు మాత్రమే. ఎక్స్‌అఫిíÙయో సభ్యులు కూడా కార్పొరేటర్ల చెంతన కూర్చోవాలి. మంత్రులు సైతం మిగతా సభ్యులతో కలిసి కూర్చోవాల్సిందే. సభకు అధ్యక్షత వహించే మేయర్‌కు మాత్రమే పోడియంపై ఆశీనులయ్యే అధికారం ఉంటుంది. కాగా కడప కార్పొరేషన్లో మాత్రం మేయర్ స్థాయిలో తన సీటు ఉండాలని ఎమ్మెల్యే మాధవీరెడ్డి పట్టుబడుతున్నారు. నిబంధనలన్నిటినీ గాలికొదిలేసి తనకు కుర్చీ వేయాల్సిందేనని ఇష్టారీతిన వ్యవహరించారు. దీంతో పాలకవర్గ సమావేశంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మరోవైపు వైఎస్సార్‌సీపీ నుంచి పార్టీ ఫిరాయించిన 8మంది కార్పొరేటర్లను అడ్డుపెట్టుకొని దౌర్జన్యానికి దిగారు.
అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేకుండా..
కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో రచ్చ చేయడమే ఏకైక అజెండాతో ఎమ్మెల్యే, ఫిరాయింపు సభ్యులు వచి్చనట్టు స్పష్టంగా కని్పంచింది. సమావేశంలోకి రావడంతోనే నేరుగా పోడియం వద్దకు వెళ్లి ఎమ్మెల్యేకు కుర్చీ వేయాలంటూ సభను కొనసానివ్వకుండా అడ్డుకోవడంపై నగరపాలక సంస్థ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. 15వ ఆర్థికసంఘం పనులను ఆమోదిస్తేనే కార్పొరేషన్‌కు కేంద్రం నుంచి నిధులు వస్తాయి. కాగా, గత రెండు సమావేశాలనూ ఎమ్మెల్యే అడ్డుకుంటూ నగరాభివృద్ధికి రావాల్సిన నిధులను రాకుండా చేస్తున్నారని మహిళా కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఎమ్మెల్యేకు తాము గౌరవం ఇచ్చినా .. ఆమె నిలుపుకోలేకపోయారని, మేయర్ ఇంటిపై చెత్త వేయించి చెత్త రాజకీయం చేశారని మహిళా కార్పొరేటర్లు వాపోయారు. అలాంటప్పుడు ఆమెకు తామెందుకు లేని గౌరవం ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు.
144 సెక్షన్ ఉన్నా.. దూసుకొచ్చిన టీడీపీ శ్రేణులు
కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం సందర్భంగా పోలీసులు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ టీడీపీ శ్రేణులు పోలీసు బారికేడ్లను తోసుకొని ర్యాలీగా నగరపాలక
సంస్థ కార్యాలయానికి దూసుకొచ్చారు. ప్రధాన గేటు వద్ద నినాదాలు చేశారు. వారిని నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారు. 144 సెక్షన్ ఉల్లంఘించినా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment