సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడప నగర పాలక సంస్థలో పెన్షన్ల పంపిణిపై టీడీపీ సభ్యుల మధ్య రగడ రచ్చరచ్చగా మారింది. కడప ఎమ్మెల్యే మాధవి, 49వ డివిజన్ కార్పొరేటర్ ఉమాదేవి మధ్య మాటల తూటాలు పేలాయి. తన ప్రమేయం లేకుండా పెన్షన్లు పంపిణి చేశారంటూ ఉమాదేవి మండిపడ్డారు. కనీసం సమాచారం ఇవ్వకుండా ఎలా పంపిణి చేశారంటూ కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డిని నిలదీశారు. గతంలో పల్స్ పొలియో కార్యక్రమం కూడా స్థానిక ప్రజాప్రతినిధులతో నిర్వహించే వారని ఉమాదేవి అన్నారు.
సొంత పార్టీ కార్పొరేటర్‌నే కించపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యే మాధవీరెడ్డి.. పెన్షన్ల పంపిణికి ప్రత్యేకంగా ఎవరికి ప్రోటోకాల్ లేదని.. సొంతంగా డివిజన్‌ను ఎవరు రాయించుకొలేదంటూ వ్యాఖ్యానించారు. కిరిటాలు పెట్టి.. డప్పులు కొట్టి ఎవరు మిమ్మల్ని పిలవరని.. సమాచారం తెలిస్తే వచ్చి ఉండాల్సిందంటూ ఎమ్మెల్యే మాధవీ ఉచిత సలహా ఇచ్చారు. సొంత పార్టీ కార్పోరేటర్‌నే ఎమ్మెల్యే మాధవీ కించపరిచేలా మాట్లాడటంపై ఉమాదేవి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment