Dispute
-
పెళ్లి కూతురిని వెతకనందుకు రూ.60 వేలు జరిమానా!
కుమారుడికి పెళ్లి కూతురుని వెతకడంలో విఫలమైన ఓ మ్యాట్రిమోనీ కంపెనీపై తండ్రి కోర్టుకెళ్లిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. దీనిపై విచారణ జరిపించిన కోర్టు కుమారుడి తండ్రికి రూ.60,000 చెల్లించాలని కంపెనీని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. ఇంతకీ తండ్రి, కంపెనీ మధ్య ఎలాంటి వివాదం ఉందో, దీనిపై కోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో తెలుసుకుందాం.సామాజిక మాధ్యమాల వేదికగా చేసిన ప్రమోషన్ ఆధారంగా కుమార్ అనే వ్యక్తి దిల్మిల్ అనే మ్యాట్రిమోనీ కంపెనీను మార్చిలో ఆశ్రయించాడు. తన కుమారుడు బాలాజీకి పెళ్లి చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. అందుకు పెళ్లి కూతురును వెతికే బాధ్యతను కంపెనీకి అప్పగించాడు. సంస్థ అందుకు నెల రోజుల సమయం విధించింది. ప్రతిగా ఇనిషియల్ పేమెంట్ ఛార్జీల కింద కుమార్ నుంచి రూ.30,000 వసూలు చేసింది. ముందుగా నిర్ణయించిన సమయం ప్రకారం నెల తర్వాత కుమార్ వెళ్లి వివరాలు అడిగితే కంపెనీ స్పందించలేదు. ఏప్రిల్ నెలాఖరు వరకు ఆగాలని కంపెనీ ప్రతినిధులు కోరారు. ఏప్రిల్ తర్వాత కూడా తనకు పెళ్లికుతురి వివరాలు పంపలేదు. దాంతో మే నెలలో కళ్యాణ్ నగర్‌లోని దిల్మిల్ మ్యాట్రిమోనీ కంపెనీకి కుమార్ లీగల్ నోటీసులు పంపాడు. కోర్టు నోటీసులకు కూడా కంపెనీ స్పందించలేదు. దాంతో బెంగళూరు వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు.ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ బైంక్ లాంచ్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్అక్టోబరు 28న న్యాయస్థానం దిల్మిల్ సంస్థపై చర్యలు చేపట్టింది. కుమార్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. తాను ముందుగా చెల్లించిన సొమ్ముపై 6 శాతం వడ్డీతోపాటు నష్ట పరిహారంగా రూ.20,000 చెల్లించాలని ఆదేశించింది. కస్టమర్‌కు మానసిక వేదన కలిగించినందుకు రూ.5000, లీగల్ ఖర్చులకు మరో రూ.5000 చెల్లించాలని కంపెనీని స్పష్టం చేసింది. -
TG: ఎందుకీ గ్రూప్-1 వివాదం.. ఏమిటీ జీవో 55.. జీవో 29?
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని, జీవో 29ను వెంటనే రద్దు చేయాలనే డిమాండ్లతో అభ్యర్థులు శనివారం చేపట్టిన సచివాలయం ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అభ్యర్థుల ఎంపికకు పాటించిన విధానంతో రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, అందువల్ల పరీక్షలను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు.జీవో 55 ప్రకారం..గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలకు అభ్యర్థుల ఎంపికను.. మల్టీజోన్ వారీగా ఉన్న పోస్టులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను అనుసరిస్తూ కమ్యూనిటీ, జెండర్, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, స్పోర్ట్స్ తదితర కేటగిరీల్లో 1:50 నిష్పత్తిలో గుర్తించాలి. ఈ లెక్కన గతంలో 503 పోస్టులకుగాను 1:50 నిష్పత్తిలో ఎంపిక చేపట్టారు. మొత్తం 25,150 మంది అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండగా.. దివ్యాంగుల కేటగిరీలో రెండు పోస్టులకు అభ్యర్థులు లేకపోవడంతో 25,050 మందిని మాత్రమే ఎంపిక చేశారు.జీవో 29 ప్రకారం..రిజర్వేషన్ ప్రకారం కాకుండా.. నేరుగా మల్టీజోన్ పోస్టుల సంఖ్యకు 50 రెట్ల మంది అభ్యర్థుల ఎంపిక చేపడతారు. ఇలా 50 రెట్ల మందిని ఎంపిక చేసినప్పుడు.. రిజర్వుడ్ కేటగిరీల్లో అభ్యర్థుల సంఖ్య 1:50 నిష్పత్తి కంటే తక్కువగా ఉంటే, తర్వాతి మెరిట్ వారిని కూడా అదనంగా తీసుకుంటారు. తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ నిబంధనల్లోని రూల్ 22, 22ఏ ఆధారంగా వీరి ఎంపిక చేస్తారు. ఈ మేరకు జీవో 55లోని అంశం ‘బి’లో మార్పులు చేసి.. జీవో 29 ఇచ్చారు.వివాదం ఏమిటి?ప్రస్తుతం గ్రూప్–1 కేటగిరీలో మొత్తం 563 పోస్టులు ఉన్నాయి. జీవో 55కు అనుగుణంగా 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక చేపడితే 28,150 మందికి మాత్రమే మెయిన్స్‌కు అవకాశం కల్పించాలి. కానీ ఇప్పుడు జీవో 29 ప్రకారం ఎంపిక చేపట్టారు. అంటే నేరుగా మెరిట్ లిస్టులోని 28,150 మందిని ఎంపిక చేశారు. వీరిని ఓపెన్ కాంపిటీషన్, రిజర్వుడ్ కేటగిరీలు విభజించారు.ఇందులో రిజర్వుడ్ కేటగిరీల్లో 1:50 నిష్పత్తి కంటే తక్కువగా ఉండటంతో.. కింది మెరిట్ ఆధారంగా అదనంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. అంటే 28,150 మందికి మరో 3,233 మంది అదనంగా.. 31,383 మంది అభ్యర్థులను కమిషన్ మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేసింది. 1:50 నిష్పత్తి కంటే అభ్యర్థుల సంఖ్య పెరగడం, అందులో రిజర్వుడ్ కేటగిరీలవారు చాలినంత మంది లేకపోవడమంటే.. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టేనని, ఇది రిజర్వేషన్లకు దెబ్బ అని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: గ్రూప్–1 అభ్యర్థుల ఆందోళన.. ముట్టడి.. ఉద్రిక్తం! -
ఎట్టకేలకు రెండేళ్ల వివాదానికి పరిష్కారం!
ఫిన్‌టెక్ స్టార్టప్ భారత్‌పే సహవ్యవస్థాపకులు అష్నీర్ గ్రోవర్ రెండేళ్లుగా సంస్థతో కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించుకున్నారు. అష్నీర్, సంస్థకు జరిగిన ఒప్పందం ప్రకారం ఇకపై తాను భారత్‌పేతో ఏ హోదాలో కొనసాగరు. కంపెనీలోని తన షేర్లను కుటుంబ ట్రస్ట్‌కు బదిలీ చేస్తారు. ఇరువైపులా ఉన్న చట్టపరమైన కేసులను ఉపసంహరించుకోనున్నారు.అసలేం జరిగిందంటే..భారత్‌పేలో విధులు నిర్వహించే సమయంలో అష్నీర్ గ్రోవర్ దంపతులు విలాసాలకు అలవాటుపడి రూ.81 కోట్లు సంస్థ నిధుల్ని కాజేశారు. ట్యాక్స్ క్రెడిట్, జీఎస్టీ అధికారులకు పెనాల్టీ చెల్లింపుల్లో అవకతవకలు, ట్రావెల్ ఏజెన్సీలకు అక్రమ చెల్లింపులు, నకిలీ ఇన్వాయిస్లను సృష్టించడం, సాక్ష్యాలను నాశనం చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఆ కుంభకోణం వెలుగులోకి రావడంతో భారత్‌పే వారిద్దరిని సంస్థ నుంచి తొలగించింది. ఇదే అంశంపై అష్నీర్ దంపతుల్ని విచారించాలని కోరుతూ భారత్‌పే ఢిల్లీ హైకోర్ట్‌ను ఆశ్రయించింది. ఆ కేసులో వాళ్లిద్దరూ విదేశాలకు పారిపోకుండా గతేడాది నవంబర్‌లో ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) లుకౌట్ నోటీసులు జారీ చేసింది. వీరిపై ఐపీసీ సెక్షన్లు 406, 408, 409, 420, 467, 120బీ, 201 కింద కేసులు నమోదు చేశారు. అష్నీర్ గ్రోవర్, మాధురీ గ్రోవర్, శ్వేతాంక్ జైన్ (మాధురి సోదరుడు), సురేష్ జైన్ (అష్నీర్ మామ), దీపక్ గుప్తా (అష్నీర్ బావమరిది)పై భారత్‌పే గతంలోనే ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల సంస్థ నిధుల దుర్వినియోగంలో అష్నీర్ బావమరిది దీపక్‌గుప్తాకు సంబంధం ఉందనే ఆరోపణలతో తనను అదుపులోకి తీసుకున్నట్లు ఈవోడబ్ల్యూ తెలిపింది.ఈ నేపథ్యంలో అష్నీర్ సంస్థతో రెండేళ్లుగా సాగుతున్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలిపారు. సంస్థ కూడా ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. ఒప్పందంలో భాగంగా ఇకపై గ్రోవర్‌కు భారత్‌పేతో సంబంధం ఉండదు. తాను కంపెనీలో ఏ హోదాలోనూ కొనసాగరు. గ్రోవర్ షేర్లు ఫ్యామిలీ ట్రస్ట్‌కి బదిలీ చేయబడతాయి. అందులో కొంతభాగం కంపెనీ అభివృద్ధికి తోడ్పడే ‘రెసిలెంట్ గ్రోత్ ట్రస్ట్’కు బదిలీ చేయనున్నారు.ఇదీ చదవండి: యాపిల్‌కు రూ.1.29 లక్షల జరిమానా‘భారత్‌పేతో ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించుకున్నాను. సంస్థ వృద్ధికి సరైన దిశలో పాటుపడుతున్న మేనేజ్మెంట్, బోర్డు సభ్యులపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇకపై సంస్థ కార్యకలాపాల నుంచి వైదొలుగుతున్నాను. నాకు చెందిన కొన్ని షేర్లను నా ఫ్యామిలీ ట్రస్ట్ నిర్వహిస్తుంది. సంస్థతో ఉన్న చట్టపరమైన కేసులను రద్దు చేసుకున్నాం’ అని ఎక్స్‌లో ప్రకటించారు.I have reached a decisive settlement with BharatPe. I repose my faith in the management and board, who are doing great work in taking BharatPe forward in the right direction. I continue to remain aligned with the company's growth andsuccess. I will no longer be associated with… pic.twitter.com/gB3Pla5qQZ— Ashneer Grover (@Ashneer_Grover) September 30, 2024 -
విశాఖలో కూటమి ‘మహా’ కుట్ర
సాక్షి, విశాఖపట్నం: మహా విశాఖ నగర పాలక సంస్థలో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో టీడీపీ కూటమి కుట్ర రాజకీయాలకు తెరతీసింది. కూటమి కార్పొరేటర్లకు జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్ మద్దతు పలుకుతూ.. చెల్లని ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకుని.. 10కి 10 స్థానాల్లోనూ టీడీపీ విజయం సాధించినట్లు ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక తొలిసారిగా జీవీఎంసీలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో.. టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కార్పోరేటర్లను బలవంతంగా లాక్కెళుతున్న పోలీసులుకుట్రలు చేసైనా విజయం సాధించాలనే ఉద్దేశంతో.. కార్పొరేటర్లకు రూ.5 లక్షల వరకూ డబ్బులిచ్చి మరీ ఓట్లు బహిరంగంగానే కొనుగోలు చేశారు. తమకు మద్దతిస్తున్న కార్పొరేటర్లను భీమిలిలోని రిసార్టులో మంగళవారం రాత్రి మొత్తం అక్కడే బస చేయించి.. ఉ.11 గంటల సమయంలో ఓటింగ్‌కు బస్సులో తీసుకొచ్చారు. మరోవైపు.. టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు కొందరు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు నేరుగా ఫోన్లుచేసి డబ్బులు పంపిస్తున్నట్లు చెప్పి ఓట్లు కొనుగోలు చేశారు. కన్నీటి పర్యంతమవుతున్న వైఎస్సార్సీపీ కార్పోరేటర్ రోహిణిబ్యాలెట్ పేపర్లపై కలర్ పెన్సిళ్లతో గుర్తులు..ఇక డబ్బులు తీసుకున్న వారు తమకు ఓట్లు వేశారా లేదా అనేది తెలుసుకునేందుకు కలర్ పెన్సిళ్లతో బ్యాలెట్ పేపర్‌పై అనధికారికంగా గీతలు గీశారు. వాస్తవానికి.. బ్యాలెట్ పేపర్‌పై పెన్ను, పెన్సిల్, స్కెచ్ గీతలుంటే కచ్చితంగా ఆ ఓట్లు చెల్లుబాటు కావన్న నిబంధనలున్నా కమిషనర్ మాత్రం పూర్తిగా పక్కా టీడీపీ కార్యకర్తలా వ్యవహరించారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఆ ఓట్లు చెల్లుబాటు కావని చెబుతున్నా బేఖాతరు చేస్తూ టీడీపీ కార్పొరేటర్లు 10 మందీ విజయం సాధించినట్లు ప్రకటించారు.దీంతో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు కమిషనర్ తీరుపై మండిపడ్డారు. పోర్టికోలో బైఠాయించారు. ముందుగానే కుట్ర పన్ని గెలుపొందాలని స్కెచ్ వేసిన టీడీపీ పెద్దఎత్తున పోలీసు బలగాల్ని రంగంలోకి దించి.. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను జీవీఎంసీ నుంచి బయటికి పంపించేశారు. అక్రమంగా విజయం సాధించిన టీడీపీ వ్యవహారం, కమిషనర్ వ్యవహరించిన తీరుపై న్యాయపోరాటం చేస్తామని మేయర్ గొలగాని హరివెంకటకుమారి, డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్, కటుమూరి సతీష్, ఫ్లోర్‌లీడర్ బానాల శ్రీను, ఇతర కార్పొరేటర్లు తెలిపారు. -
తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి పోటాపోటీగా సాగునీరు విడుదల
-
వికలాంగులను సాటి మనుషులుగా చూడలేని వారిది చిత్త వైకల్యం!
‘వైకల్యం’ లేని మనుషులు అరుదు. కొందరికి అంగవైకల్యం, మరికొందరికి చిత్తవైకల్యం. ఎలాంటి వైకల్యమూ లేకపోవడం పరిపూర్ణత అవుతుంది. కాని అదెక్కడ కనిపిస్తుంది? చిత్తవైకల్యం మతిభ్రమణమూ కానక్కర లేదు, మందబుద్దీ కానక్కర లేదు. ఆస్థిర చిత్తాలు మనోవికారాలు ఆలోచనల వైపరీత్యాలు కూడా వైకాల్యాలే. కనుక ఒకరిని చూసి మరొకరు సానుభూతి చూపించ వలసిందేమి లేదు.వైకల్యాలు ప్రకృతి సహజంగా భావించి, పరస్పరం ప్రేమించుకొనడానికి, గౌరవించుకొనడానికి అవి అవరోధం కాకుండా చూసుకోవడమే మనం చేయవలసిందీ,చేయగలిగిందీ!‘ అంటూ ‘ మనోనేత్రం ’ పేరుతో వికలాంగుల సమస్యలను వస్తువుగా తీసుకొని, ప్రపంచ వికలాంగుల దినోత్సవ సందర్బంగా ( 19 మార్చ్ 1989 ) నేను రచించిన కవితా సంపుటికి తమ అమూల్యమైన అభినందన సందేశం అందిస్తూ ఆనాటి ప్రముఖ దినపత్రిక ఆంధ్రప్రభ సంపాదకులు పొత్తూరి వేంకటేశ్వర రావు గారు వెలిబుచ్చిన అభిప్రాయం ఇది.సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో బహుకాలంగా పనిచేస్తున్న ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిణి సివిల్స్‌లో దివ్యాంగుల కోటాను విమర్శిస్తూ ‘వికలాంగులు ఐ ఏ ఎస్, ఐపీఎస్ వంటి ఉద్యోగాలకు సరిపోరని ’ఇటీవల చేసిన వ్యాఖ్యలకు సరియైన సమాధానం పెద్దలు పొత్తూరి వారి మాటల్లో స్పష్టంగా ఉందని నేను భావిస్తున్నాను.పై అధికారిణి ప్రభుత్వంలో ఉంటూనే చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ స్వయంగా అంగవైకల్యంతో బాధపడుతున్న, సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయే ఎంతో మంది అభ్యర్థులకు శిక్షణనిచ్చే ఒక ఐ ఏ ఎస్ అకాడమీని విజయవంతంగా నడుపుతున్న మల్లవరపు బాలలత గారు ‘ సివిల్ సర్వంట్ గా తాను పన్నెండేళ్లు పనిచేసానని, ఇలాంటి అధికారులు ఉండబట్టే రాజీనామా చేయాల్సి వచ్చిందని తన బాధను వ్యక్తపరిచారు. అంతేకాదు పై అధికారిణికి ఏదైనా జరగరానిది జరిగి దివ్యంగురాలు అయితే ఆమె తన పదవికి రాజీనామా చేస్తారా?’ అంటూ వారు వేసిన ప్రశ్న సమంజసమైంది, అందరూ ఆలోచించవలసింది.అంధులంటే ఎవరో కాదు కళ్లుండీ వాస్తవాన్ని చూడలేని గర్వాంధులు, ధనాందులు , మాదాంధులు ‘ అన్నాను ’ మనోనేత్రం‘ లో నేను 1992 లో కూడా ‘ వికలాంగులలో ‘విజేతలు’ పేరుతో నేను చేసిన మరో రచనలో తమ అంగవైకల్యాన్ని అధిగమించి ఎన్నో రంగాల్లో రాణించిన భక్తకవి సూరదాస్ మొదలుకొని ద్వారం వెంకటస్వామి నాయుడు( వయలిన్ ) ఎస్ జైపాల్ రెడ్డి ( రాజకీయాలు ), సుధాచంద్రన్ ( నాట్యం ), లూయీబ్రెయిల్ ( బ్రెయిల్ లిపి ), మేధావుల్లో మేటి అంటోనియో గ్రాన్సీ , విశ్వకవి భైరన్ వంటి ఎంతోమంది జాతీయ అంతర్జాతీయ ప్రముఖుల పరిచయాలతో పాటు , నాకు గురుతుల్యులు ప్రముఖ హాస్య రచయిత ఎన్వీ గోపాల శాస్త్రి, వికలాంగుల జంట మా అమ్మానాన్నలు ఆండాళమ్మ వేముల రాజంల గురించి కూడా ఇందులో రాశాను.‘లోక కళ్యాణం కోసం కొందరు అడవులకు వెళ్లి ఋషులు మునులైతే సభ్యసమాజంలో ఉంటూ సాటివారిని బాగుచేయడానికి మరికొందరు వికలాంగులు అయ్యారు ’ అన్న నా మాటలను పేర్కొంటూ‘ వికలాంగులను సాటి మనుషులుగా చూడలేని చిత్తవైకల్యం ఎవరిలోనైనా ఉంటే ’మనోనేత్రం‘ దానిని పోగొట్టగల సాహిత్య ఔషధం’ అంటూ నా రచనకు మంచి కితాబునిచ్చి నన్ను ప్రోత్సహించిన పెద్దలు కీశే పొత్తూరి వెంకటేశ్వర రావు ( 1934 - 2020 ) గారికి శతకోటి వందనాలు !-వేముల ప్రభాకర్ -
కడప టీడీపీలో ‘పెన్షన్ల’ రగడ.. ఎమ్మెల్యే Vs కార్పొరేటర్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడప నగర పాలక సంస్థలో పెన్షన్ల పంపిణిపై టీడీపీ సభ్యుల మధ్య రగడ రచ్చరచ్చగా మారింది. కడప ఎమ్మెల్యే మాధవి, 49వ డివిజన్ కార్పొరేటర్ ఉమాదేవి మధ్య మాటల తూటాలు పేలాయి. తన ప్రమేయం లేకుండా పెన్షన్లు పంపిణి చేశారంటూ ఉమాదేవి మండిపడ్డారు. కనీసం సమాచారం ఇవ్వకుండా ఎలా పంపిణి చేశారంటూ కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డిని నిలదీశారు. గతంలో పల్స్ పొలియో కార్యక్రమం కూడా స్థానిక ప్రజాప్రతినిధులతో నిర్వహించే వారని ఉమాదేవి అన్నారు.సొంత పార్టీ కార్పొరేటర్‌నే కించపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యే మాధవీరెడ్డి.. పెన్షన్ల పంపిణికి ప్రత్యేకంగా ఎవరికి ప్రోటోకాల్ లేదని.. సొంతంగా డివిజన్‌ను ఎవరు రాయించుకొలేదంటూ వ్యాఖ్యానించారు. కిరిటాలు పెట్టి.. డప్పులు కొట్టి ఎవరు మిమ్మల్ని పిలవరని.. సమాచారం తెలిస్తే వచ్చి ఉండాల్సిందంటూ ఎమ్మెల్యే మాధవీ ఉచిత సలహా ఇచ్చారు. సొంత పార్టీ కార్పోరేటర్‌నే ఎమ్మెల్యే మాధవీ కించపరిచేలా మాట్లాడటంపై ఉమాదేవి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. -
సింగరేణి వివాదం.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి ఒక్క రాష్ట్ర ప్రభుత్వానిదే కాదని.. కేంద్రానికి బాధ్యత ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సింగరేణిపై కేంద్రం పారదర్శకంగా వ్యవహరిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో సింగరేణిని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. డిప్యూటీ సీఎం చెప్పిన విషయాలన్నింటిని పరిశీలిస్తాం. ఒడిశాలో గనుల వ్యవహారంపై అక్కడి ముఖ్యమంత్రితో మాట్లాడతాను. దేశమంతా ఒకే పాలసీ వర్తించేలా చొరవ తీసుకుంటాం’’ అని కిషన్‌రెడ్డి వెల్లడించారు.‘‘సింగరేణికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీన్ని రాజకీయం చేయకూడదు. సింగరేణి కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సింగరేణిపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలి. కోల్ ఇండియా లిమిటెడ్‌కు ఇచ్చిన ప్రాధాన్యత సింగరేణికి కేంద్రం ఇస్తోంది. రెండు మైన్లు కేంద్రం దృష్టిలో ఉన్నాయి.. ఒడిశా నైనీ ప్రాజెక్టుపై త్వరలో నిర్ణయం ఉంటుంది. సింగరేణిలో కొన్ని సమస్యలు ఉన్నాయి.. వాటిని అధిగమిస్తాం’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘రెండు, మూడు రోజుల్లో సింగరేణిపై మరింత స్పష్టత ఇస్తాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పొంతన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న పాలసీనే తెలంగాణలో అమలు అయ్యే అవకాశం. ఆక్షన్ అనేది ఓపెన్.. సింగరేణి మాత్రమే కాదు ఎవరైనా బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చు‘‘ అని కిషన్‌రెడ్డి తెలిపారు. -
ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌తో నష్టం!
సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ సర్కారు శాసనసభలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం ప్రకటించడం, ఆ తర్వాత ప్రతిపక్ష బీఆర్ఎస్తో సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో.. ప్రభుత్వం జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి అధ్యక్షతన విచారణ కమిషన్‌ను నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వ వర్గాలు పలు గణాంకాలు చెప్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం వల్ల దాదాపు రూ.6 వేల కోట్ల వరకు విద్యుత్ సంస్థలు నష్టపోయాయని అంటున్నాయి. అనవసరంగా ట్రాన్స్మిషన్ కారిడార్లను బుక్ చేసుకోవడం, ఒప్పందం మేరకు విద్యుత్ తీసుకోకపోవడం, అర్ధంతరంగా కొనుగోళ్లు ఆపేయడం, బకాయిలు చెల్లింపుపై వివాదాలు వంటివన్నీ కలసి సమస్యగా మారాయని పేర్కొంటున్నాయి. అదనపు ఖర్చులతో రేటు పెరిగి.. 2017 చివరి నుంచి ఛత్తీస్‌గఢ్ విద్యుత్ అందుబాటులోకి వచ్చిందని.. 2022 ఏప్రిల్ వరకు సరఫరా జరిగిందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ విద్యుత్ సంస్థలతో యూనిట్‌కు రూ.3.90 ధరతో 1000 మెగావాట్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నా.. ఏనాడూ పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా కాలేదని తెలిపాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్ర విద్యుత్ సంస్థలు కొనుగోలు చేసిన మొత్తం విద్యుత్ 17,996 మిలియన్ యూనిట్లని.. ఇప్పటివరకు రూ.7,719 కోట్లు చెల్లించారని, ఇంకా రూ.1,081 కోట్లు చెల్లించాల్సి ఉందని వివరించాయి.ట్రాన్స్మిషన్ లైన్ల కోసం రూ.1,362 కోట్లు చార్జీలు చెల్లించారని తెలిపాయి. అన్ని ఖర్చులు కలిపి లెక్కిస్తే ఒక్కో యూనిట్ సగటు ఖర్చు రూ.5.64కు చేరిందని.. దీనితో దాదాపు రూ.3,110 కోట్లు అదనపు భారం పడిందని వెల్లడించాయి. బకాయిల విషయంలో వివాదం ఉందని, రూ.1,081 కోట్లే బకాయి ఉందని తెలంగాణ చెప్తుంటే.. ఛత్తీస్‌గఢ్ మాత్రం రూ.1,715 కోట్లు రావాల్సి ఉందని లెక్క చూపిస్తోందని పేర్కొన్నాయి. సరిగా విద్యుత్ సరఫరా లేక.. ఛత్తీస్‌గఢ్ నుంచి ఏనాడూ వెయ్యి మెగావాట్ల కరెంటు సాఫీగా రాలేదని.. దీనితో తెలంగాణ డిస్కంలు బహిరంగ మార్కెట్లో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచి్చందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇలా 2017 నుంచి 2022 వరకు రూ.2,083 కోట్లు అదనపు భారం పడిందని పేర్కొన్నాయి. ఇక ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌ను తెచ్చుకునేందుకు పవర్ గ్రిడ్ నుంచి వెయ్యి మెగావాట్ల కారిడార్ బుక్ చేయడం.. విద్యుత్ తెచ్చుకున్నా, లేకున్నా ఒప్పందం ప్రకారం చార్జీలు చెల్లించాల్సి రావడంతో రూ.638 కోట్లు భారం పడిందని తెలిపాయి.దీనికితోడు మరో 1000 మెగావాట్ల కారిడార్‌ను అడ్వాన్స్‌గా బుక్ చేయడం, దాన్ని అర్ధంతరంగా రద్దు చేసుకోవడం కూడా రాష్ట్ర విద్యుత్ సంస్థలకు నష్టం కలిగించిందని పేర్కొన్నాయి. పరిహారం కింద రూ.261 కోట్లు కట్టాలని పవర్‌గ్రిడ్ సంస్థ రాష్ట్ర డిస్కంలకు నోటీసులు జారీ చేసిందని వివరించాయి. ఇక ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర ఈఆర్సీ ఇప్పటివరకు ఆమోదం తెలపలేదని.. ఈ లెక్కన ఛత్తీస్‌గఢ్‌కు కట్టిన వేల కోట్ల రూపాయలను అడ్డదారి చెల్లింపులుగానే పరిగణించాల్సి ఉంటుందని ఆరోపించాయి. -
మధ్యవర్తిత్వం..వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయం
నగరంపాలెం: గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా జడ్జి హాల్లో సోమవారం సుప్రీంకోర్టు మీడియేషన్/కాన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ(ఎంసీపీసీ–న్యూఢిల్లీ), రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ(అమరావతి) ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ‘మధ్యవర్తిత్వం’పై 40 గంటల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. గుంటూరు జోన్‌లోని గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఏపీ రాష్ట్ర హైకోర్టు ఎంపిక చేసిన న్యాయాధికారులు హాజరు కాగా, ఈ నెల 20 నుంచి 24 వరకు కొనసాగనున్నాయి.శిక్షణ అధికారులుగా ఎంపికైన సుప్రీంకోర్టు మీడియేషన్, కాన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ ఢిల్లీ నుంచి నిషా సక్సేనా(జిల్లా జడ్జి), నీర్జాభాటియా(జిల్లా జడ్జి) హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి తరగతులను ప్రారంభించారు. వారు మధ్యవర్తిత్వానికి సంబంధించి పలు అంశాలను వివరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎఫ్ఏసీ చైర్మన్, నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్.శరత్‌బాబు, సంస్థ టి.లీలావతి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయం అని అన్నారు. తక్కువ ఖర్చుతో న్యాయం పొందేందుకు మధ్యవర్తిత్వం అనే సాధనం చక్కగా ఉపకరిస్తుందని వివరించారు. -
సూడాన్‌లో హింస.. 52 మంది మృతి!
ఈశాన్య ఆఫ్రికాలోని సూడాన్‌లో హింసాయుత ఘటనలు చోటుచేసుకున్నాయి. అబేయిలో కొందరు ముష్కరులు, గ్రామస్తుల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల్లో 52 మంది మృతిచెందగా, 64 మంది గాయపడ్డారు. మృతుల్లో ఐక్యరాజ్యసమితి ప్రాంతీయ అధికారి కూడా ఉన్నారు. కొందరు ముష్కరులు సామాన్యులపై దాడికి పాల్పడ్డారని అబేయి సమాచార శాఖ మంత్రి బుల్లిస్ కోచ్ తెలిపారు. అయితే దాడికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. భూవివాదాల నేపధ్యంలోనే ఈ దాడి జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ హింసకు పాల్పడినవారు న్యూర్ తెగకు చెందినవారని, వారు భారీగా ఆయుధాలు కలిగి ఉన్నారని కోచ్ తెలిపారు. గత ఏడాది వరదల కారణంగా ఈ సాయుధ యువకులు వార్రాప్ రాష్ట్రానికి వలస వెళ్లారని సమాచారం. సూడాన్‌లో జాతి హింస రోజురోజుకూ పెరిగిపోతోంది. అబేయిలోని ఐక్యరాజ్యసమితి మధ్యంతర భద్రతా దళం (యూఎన్ఐఎస్ఎఫ్ఏ) శాంతి పరిరక్షకుని మృతికి దారితీసిన హింసను ఖండించింది. అబేయిలోని పలుప్రాంతాల్లో అంతర్ మత ఘర్షణలు జరిగాయని యూఎన్ఐఎస్ఎఫ్ఏ ధృవీకరించింది. కాగా సూడాన్, దక్షిణ సూడాన్లు రెండూ అబేయిపై ఆధిపత్యాన్ని కోరుకుంటున్నాయి. 2011లో సూడాన్ నుండి దక్షిణ సూడాన్ స్వతంత్రం పొందిన తర్వాత కూడా ఈ సమస్యను పరిష్కరించలేదు. ఆఫ్రికన్ యూనియన్ ప్యానెల్ అబేయిపై ప్రజాభిప్రాయ సేకరణను ప్రతిపాదించింది. అయితే ఎవరు ఓటు వేయాలనే దానిపై భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ప్రస్తుతం అబేయి ప్రాంతం దక్షిణ సూడాన్ ఆధీనంలో ఉంది. మార్చిలో దక్షిణ సూడాన్ తన దళాలను అబేయిలో మోహరించినప్పటి నుండి అంతర్గత సరిహద్దు ఘర్షణలు మరింతగా పెరిగాయి. -
Texas: తీవ్రమవుతున్న సరిహద్దు భద్రత వివాదం
టెక్సాస్: సరిహద్దు భద్రతపై అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర ప్రభుత్వానికి అమెరికా ఫెడరల్ ప్రభుత్వానికి మధ్య వివాదం తీవ్రమవుతోంది. అక్రమ వలసలకు మూలంగా మారిన షెల్బీ పార్కులోకి ఎవరినీ అనుమతించేది లేదని టెక్సాస్ ప్రభుత్వం తేల్చి చెబుతుంటే సరిహద్దు ఏజెంట్లను అనుమతించాల్సిందేనని ఫెడరల్ ప్రభుత్వం పట్టుబడుతోంది. జో బైడెన్ ప్రభుత్వం సరిహద్దు భద్రతలో వైఫల్యం చెందిందని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ ఆరోపించారు. దేశ దక్షిణ సరిహద్దు నుంచి అక్రమ వలసలను అరికట్టేందుకు టెక్సాస్ స్టేట్ నేషనల్ గార్డ్, ఇతర బలగాలను మోహరించినట్లు ఆయన చెప్పారు. షెల్బీ పార్కును టెక్సాస్ ప్రభుత్వం ఇటీవలే తమ ఆధీనంలోకి తీసుకుంది. రియో గ్రాండేలో ఉన్న ఈ పార్కులోకి ఎవరినీ అనుమతించేంది లేదంటూ ఫెడరల్ ప్రభుత్వ ఆదేశాలను కూడా టెక్సాస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ వివాదం కారణంగా స్టాండ్ విత్ టెక్సాస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఇదీచదవండి.. అమెరికాలో నైట్రోజన్ గ్యాస్‌తో మరణ శిక్ష -
రామాలయం.. 1528 నుంచి నేటి వరకూ..
అయోధ్యలోని శ్రీరాముని జన్మస్థలంలో నూతన రామమందిరాన్ని నిర్మించారు. శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం 2024, జనవరి 22న జరగనుంది. అత్యంత వైభవంగా జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రపంచం మొత్తం వీక్షించనుంది. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రత్యేక అతిథులు అయోధ్యకు తరలిరానున్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత సామాన్య భక్తులు కూడా చారిత్రాత్మక రామాలయాన్ని సందర్శించుకోగలుగుతారు. అయితే అయోధ్య రామాలయం నిర్మాణం వెనుకున్న పలు సంఘటనలు ఒకసారి గుర్తు చేసుకుందాం. అది.. 1528వ సంవత్సరం బాబ్రీ మసీదును మొఘల్ చక్రవర్తి కమాండర్ మీర్ బాకీ నిర్మించారు. మీర్ బాకీ ఈ మసీదుకు బాబ్రీ అని పేరు పెట్టారు. 1885 అయోధ్య రామజన్మభూమి వ్యవహారం తొలిసారిగా కోర్టుకు చేరింది. బాబ్రీ మసీదు పక్కనే రామ మందిరాన్ని నిర్మించేందుకు అనుమతి ఇవ్వాలని మహంత్ రఘువర్‌దాస్ ఫైజాబాద్ కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. 1949 వివాదాస్పద నిర్మాణంలోని మధ్య గోపురం కింద రామ్ లల్లా విగ్రహం కనిపించింది. ఆ తర్వాత స్థానికులు ఆ ప్రదేశంలో పూజలు చేయడం ప్రారంభించారు. 1950 గోపాల్ సింగ్ విశారద్ అనే పండితుడు ఇక్కడ పూజలు చేసే హక్కును డిమాండ్ చేస్తూ ఫైజాబాద్ కోర్టులో కేసు వేశారు. ఈ కేసు నేపధ్యంలో హిందువులు ఆలయంలో పూజించే హక్కును పొందారు. 1950 పరమహంస రామచంద్ర దాస్ ఆ ప్రాంతంలో విగ్రహాలను ఉంచి, పూజించేందుకు అనుమతించాంటూ ఫైజాబాద్ కోర్టులో కేసు వేశారు. ఇదే రామ మందిర ఉద్యమానికి నాంది పలికింది. 1959 వివాదాస్పద స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు నిర్మోహి అఖారా కోర్టు మెట్లు ఎక్కింది. 1981 యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు ఆ ప్రాంతం స్వాధీనంపై కేసు వేసింది. 1986 ఫిబ్రవరి ఒకటిన హిందువులు పూజించేందుకు ఈ స్థలాన్ని తెరవాలని స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 1989 హైకోర్టు నుంచి కూడా హిందువులకు ఉపశమనం లభించింది. ఆగస్టు 14న ఈ కేసులో యథాతథ స్థితిని కొనసాగించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. 1992 డిసెంబర్ 6న ఈ వివాదాస్పద కట్టడం కూల్చివేతకు గురయ్యింది. దీంతో రామమందిరం కోసం ఉద్యమం మరింత ఊపందుకుంది. 2002 ఈ వ్యవహారం అలహాబాద్ హైకోర్టుకు చేరింది. వివాదాస్పద స్థలం యాజమాన్య హక్కులపై అలహాబాద్ హైకోర్టు విచారణ ప్రారంభించింది. 2010 అలహాబాద్ హైకోర్టు సెప్టెంబరు 30న తీర్పు వెలువరించింది. వివాదాస్పద స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్ లల్లాకు మూడు సమాన భాగాలుగా విభజించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. 2011 మే 9న అలహాబాద్ హైకోర్టు ఈ ప్రాంతాన్ని మూడు సమాన భాగాలుగా విభజించాలన్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. 2018 ఫిబ్రవరి 8న సివిల్ అప్పీళ్లపై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. 2019 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటయ్యింది. 2019 ఆగస్టు 6న అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో రోజువారీ విచారణ ప్రారంభమైంది. 2019, ఆగస్టు 16న విచారణ పూర్తయిన తర్వాత ధర్మాసనం నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టుకు చెందిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం శ్రీరామ జన్మభూమికి అనుకూలంగా తీర్పునిచ్చింది. హిందూ పక్షం 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని దక్కించుకుంది. మసీదు కోసం ప్రత్యేకంగా ఐదు ఎకరాల స్థలాన్ని ముస్లిం వర్గానికి అందించాలని నాడు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ తీర్పు తదనంతరం అయోధ్య రామాలయ నిర్మాణం ప్రారంభమయ్యింది. -
సాగర్‌పై ఏపీ చర్యలు న్యాయమైనవే: మంత్రి అంబటి
సాక్షి, గుంటూరు: నాగార్జున సాగర్ డ్యామ్ అంశంపై తప్పుడు రాతలు రాస్తున్నారని, తెలుగు రాష్ట్రాల మధ్య వైరుధ్యాలు సృష్టించవద్దని మంత్రి అంబటి రాంబాబు కొన్ని మీడియా సంస్థలకు హితవు పలికారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ వ్యవహారానికి రాజకీయపరమైన ముడిపెట్టడం తగదని.. తెలంగాణలో ఏ పార్టీ వచ్చినా తమకు సంబంధం లేదని అన్నారు. ‘‘ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆ ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉంటాయి. తెలంగాణలో మా పార్టీ లేదు. అక్కడ మేం పోటీ చేయలేదు. అలాంటప్పుడు ఏపార్టీని ఓడించాల్సిన అవసరం మాకు ఉండదు కదా. మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టును మేము వాడుకోం’’ అని మంత్రి అంబటి స్పష్టం చేశారు. ‘‘నాగార్జున సాగర్‌పై దండయాత్ర చేసినట్టు ఎల్లోమీడియా వార్తలు రాసింది. ఎవరిష్టం వచ్చినట్టు వారు రాశారు, టీవీల్లో చూపించారు. నిన్న మేము చేపట్టిన చర్య న్యాయమైనది, ధర్మమైనది. రాష్ట్ర విభజ తర్వాత నదీ జలాలను కూడా విభజించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు ఉమ్మడిగా ఉన్నాయి. బీజేపీ కిషన్ రెడ్డి నిన్న కొన్ని వాస్తవాలను కూడా అంగీకరించారు. కానీ ఏపీకి చెందిన కొన్ని పత్రికలు రాద్దాంతం చేశాయి’’ అంటూ మంత్రి అంబటి మండిపడ్డారు. వాస్తవానికి నది, డ్యాంలో సగం మాత్రమే తెలంగాణ పరిధిలో ఉంటుంది. కానీ ఈ చివరి వరకు మొత్తం తెలంగాణ ఆక్రమించింది. చంద్రబాబు హయాంలో చూస్తూ ఊరుకున్నారు. అప్పట్లో నీటి విడుదలకు కూడా తెలంగాణ ఒప్పుకోలేదు. మన భూభాగంలోకి మన పోలీసులు వెళ్తే దండయాత్ర ఎలా అవుతుంది. రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రబాబు సమాధానం చెప్పాలి. తెలంగాణలో ఏదో పార్టీకి మేము మద్దతు తెలిపేందుకే ఇలా చేశామని కూడా వార్తలు రాయటం అవివేకం. మేము తెలంగాణలో పోటీ చేయటం లేదు. ఏ పార్టీకీ మద్దతు ఇవ్వటం లేదు. మన హక్కులను చంద్రబాబు తెలంగాణకు ధారపోశారు. ఓటుకు నోటు కేసు వలన ఇలా చేశారు. మన హక్కులను మనం కాపాడుకుంటే దండయాత్ర ఎలా అవుతుంది?’’ అని మంత్రి అంబటి ప్రశ్నించారు. ‘‘చంద్రబాబు ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యారు. జగన్ ప్రభుత్వం చేసి సక్సెస్ అయింది. దీంతో టీడీపీ నాయకులు ఏమీ మాట్లాడలేక పోతున్నారు. పురంధేశ్వరి మాత్రం ఆంధ్రా హక్కులను నీరు గార్చేలా మాట్లాడటం దారుణం. 13వ గేటు వరకు మా హక్కు ఉంది. ఒక అడుగు ముందుకు వేసి మా హక్కులను మేము సాధించాం. చంద్రబాబు అప్పట్లో తెలంగాణకు లొంగిపోయారు.’’ అని మంత్రి దుయ్యబట్టారు. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసు చెల్లదు. ఘటన జరిగింది ఏపీలో ఐతే తెలంగాణ లో కేదు నమోదు ఏంటి?. కృష్ణా బోర్డుకానీ, కేంద్ర జలశక్తి కానీ ఎవరైనా వచ్చి పరిశీలించవచ్చు. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా స్వాగతిస్తాం. మా పార్టీ అక్కడ పోటీ చేయటం లేదు. తెలంగాణలో చంద్రబాబు కుల సంఘాలు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చాయి. రాహుల్, ప్రియాంక గాంధీ సభల్లో కాంగ్రెస్ జెండాలతో పోటీగా టీడీపీ జెండాలు కూడా కనిపించాయి. పవన్ కళ్యాణ్ పార్టీ అభ్యర్థులను ఓడించటానికి చంద్రబాబు కులం వారు భారీగా డబ్బు ఖర్చు పెట్టారు. తెలంగాణలో జనసేన అవసరం లేదు, ఏపీలో అవసరమా. పవన్ పిచ్చోడేమోకానీ, ఆయన కులం పిచ్చిది కాదని చంద్రబాబు గుర్తించాలి’’ అంటూ మంత్రి అంబటి వ్యాఖ్యానించారు. -
నిజ్జర్ హత్య కేసు: 'కెనడా ఆరోపణల్లో ఎలాంటి వివాదం లేదు'
న్యూయార్క్: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుపై కెనడా ఆరోపణల్లో ఎలాంటి వివాదం కనిపించట్లేదని ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ (ASIO) డైరెక్టర్ మైక్ బర్గెస్ అన్నారు. కాలిఫోర్నియాలోని ఫైవ్ ఐస్ ఇంటెలిజెన్స్ భాగస్వాముల చారిత్రాత్మక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక దేశ పౌరుని హత్య విషయంలో మరో దేశం జోక్యం చేసుకోవడం తీవ్రమైన అంశమని ఆయన అన్నారు. ఇలాంటి చర్యలకు ఏ దేశం పాల్పడకూడదని చెప్పారు. భారత ఏజెంట్ల తర్వాతి లక్ష్యం ఆస్ట్రేలియానేనా అని అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. అలా అని తాను ఊహించలేనని చెప్పారు. కెనడాలో జరిగిన విషయం ఆస్ట్రేలియా వరకు వస్తుందని చెప్పలేమని అన్నారు. ఇతర దేశ ప్రభుత్వం తమ దేశంలో జోక్యం చేసుకుంటే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులకు పాల్పడుతున్న అతివాదులకు భారత్ నుంచి ముప్పు ఉంటుందని భావిస్తున్నారా..? అని అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ.. అది వారినే అడగాలని దాటవేశారు. కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్యవేత్తల ప్రమేయం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల ఆరోపించారు. తమ దేశ పౌరుని హత్యలో ఇతర దేశ ప్రమేయం తగదని హెచ్చరికలు చేసింది. ఇది ఇరుదేశాల మధ్య తీవ్ర వివాదానికి దారితీసింది. ఇరుదేశాలు ప్రయాణ హెచ్చరికలతోపాటు వీసా రద్దు వంటి కఠిన చర్యలు తీసుకున్నాయి. ఈ కేసు విచారణలో భారత్ సహకరించేలా ఒప్పించేట్లు ప్రపంచదేశాల నుంచి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కూడా కెనడా చేసింది. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని భారత్ వాదించింది. ఇదీ చదవండి: పాలస్తీనాకు మద్దతుగా అమెరికాలో ఆందోళనలు -
భారత్-కెనడా వివాదం: జైశంకర్, బ్లింకెన్ కీలక సమావేశం
న్యూయార్క్: భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్‌తో గురువారం భేటీ కానున్నారు. భారత్-కెనడా మధ్య వివాదం కొనసాగుతున్న వేళ వీరి సమావేశం ప్రధాన్యత సంతరించుకుంది. హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్యకేసులో ఇరుదేశాల మధ్య చెలరేగిన వివాదం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ భేటీ వెనక ఉన్న ఉద్దేశాన్ని మాత్రం వెల్లడించలేదు అధికార వర్గాలు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు అంశం చర్చకు వచ్చే అవకాశం ఉందా..? ప్రశ్నించినప్పుడు.. ఈ వ్యవహారంలో కెనడాకు సహకరించాలని భారత్‌ను ఇప్పటికే కోరినట్లు యూఎస్ విదేశాంగ శాఖ ప్రతినిధి మ్యాథ్యూ మిల్లర్ స్పష్టం చేశారు. కెనడా, భారత్ రెండు దేశాలు సహకరించుకోవాలని విజ్ఞప్తి చేశామని ఆయన చెప్పారు. భారత్‌తో సంబంధాలు పెంచుకోనున్న నేపథ్యంలో నిజ్జర్ హత్య కేసులో కెనడాకు అమెరికా మద్దతుగా నిలవడంలేదనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని జస్టిన్ ట్రూడో ఆరోపించడం ఇరు దేశాల మధ్య వివాదానికి కారణమైంది. నిరాధారమైన ఆరోపణలను భారత్ ఖండించింది. అనంతరం ఇరుదేశాలు ఆంక్షల దిశగా అడుగులు వేశాయి. ఈ కేసులో భారత్‌పై ఒత్తిడి పెంచడంలో అమెరికా విఫలమైందనే ఆరోపణలు కూడా వచ్చాయి. భారత్‌తో సంబంధాలు పెంచుకునే నేపథ్యంలోనే కెనడాను పక్కకు పెడుతోందని వాదనలు వెలువడ్డాయి. ఈ క్రమంలో భారత్ దర్యాప్తుకు సహకరించాలని అమెరికా కోరింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలకు హాజరైన విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్.. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి బ్లింకెన్‌తో అనధికారికంగా ఇప్పటికే ఒకసారి కలిశారు.కానీ కెనడా-భారత్ వివాదం చర్చకు రాలేదని తెలుస్తోంది. న్యూయార్క్‌లో జరిగిన క్వాడ్ సమావేశంలోనూ ఈ అంశం చర్చకు రాలేదని మిల్లర్ తెలిపారు. ఇదీ చదవండి: చైనాపై నిరసనల హోరు.. జిన్‌పింగ్ దిష్టిబొమ్మ దహనం -
ఇండియా-కెనడా వివాదం: అగ్గికి ఆజ్యం పోస్తున్న ట్రూడో
ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ఇండియా-కెనడా మధ్య ఆంక్షల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా కెనడా మరోసారి అగ్గికి ఆజ్యం పోస్తున్నట్లు తెలుస్తోంది. కెనడా పౌరులకు ప్రయాణ హెచ్చరికలను పునరుద్ధరించింది. ఇండియాలో ఉన్న కెనడా పౌరులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. కెనడా పట్ల భారత సోషల్ మీడియా వెబ్సైట్లలో నిరసన వైఖరికి సంబంధించిన పోస్టులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రమేయం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై భారత్ మండిపడింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సమంజసం కాదని హెచ్చరికలు జారీ చేసింది. ప్రయాణ హెచ్చరికలతో పాటు కెనడాలో వీసాలను కూడా రద్దు చేసింది. కెనడా కూడా ఇప్పటికే తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన వేళ.. కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారులు భారతీయ హిందువులకు హెచ్చరికలు జారీ చేశారు. భారత్ తిరిగి వెళ్లాలని బహిరంగంగానే పిలుపునిచ్చారు. భారత ఎంబసీ ముందు సిక్ ఫర్ జస్టిస్ అనే ఖలిస్థానీ మద్దతుదారు సంస్థ నిరసనలు కూడా చేపట్టింది. ఈ పరిణామాలు వియన్నా కన్వెన్షన్ అంతర్జాతీయ ఒప్పందానికి విరుద్ధంగా ఉండటంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. కెనడా, యూకే, అమెరికా సహా తదితర దేశాల్లో నివాసం ఉంటున్న దాదాపు 19 మంది ఖలిస్థానీ మద్దతుదారులను ఉగ్రవాదులుగా పేర్కొంటూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఖలిస్థానీ మద్దతుదారులకు సంబంధించిన భారత్‌లో ఉన్న ఆస్తులను స్వాధీనం కూడా చేసుకుంది. ఇదీ చదవండి: ఖలిస్తానీ ఉగ్రవాదుల ఓసీఐ కార్డులు రద్దు? -
భారత్-కెనడా వివాదం:'అమెరికా దూరం'
న్యూయార్క్: భారత్-కెనడా వివాదంలో అమెరికా తలదూర్చకపోవచ్చని రాజకీయ వ్యూహ సంస్థ సిగ్నమ్ గ్లోబల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు చైర్మన్ చార్లెస్ మైయర్స్ చెప్పారు. కెనడా వివాదం కారణంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంతో ఏర్పరుచుకున్న సంబంధాలకు అమెరికా ఇబ్బంది కలిగించబోదని ఆయన అన్నారు. ఈ వ్వవహారంలో అంటీ అంటనట్లు ఉండవచ్చని అంచనా వేశారు. భారత్- కెనడా వివాదంలో ఇరుదేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అమెరికా చెప్పింది. సమస్యను పరిష్కరించడానికి ఇరుదేశాలు సహకరించుకోవాలని కోరింది. ఈ అంశంలో భారత్ జవాబుదారీగా ఉండాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ అన్నారు. కానీ అమెరికా దాని మిత్రపక్షాలు ఈ అంశంలో భారతీయ దౌత్యవేత్తలను బహిష్కరించడం వంటి చర్యలు తీసుకోకుండా ఆగిపోయాయి. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గతవారం వివాదాస్పద ఆరోపణలు చేశారు. ఇది రెండు దేశాల మధ్య వివాదానికి కారణమైంది. ఆ తర్వాత ఇరుదేశాలు ప్రయాణ హెచ్చరికలను జారీ చేశాయి. ఇరుపక్షాలు దౌత్య వేత్తలను బహిష్కరించాయి. కెనడా వీసాలను భారత్ రద్దు చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కెనడా ఆరోపణలు చేస్తోందని భారత్ మండిపడింది. రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇదీ చదవండి: కెనడాలో పిల్లలు.. భారతీయ తల్లిదండ్రుల్లో ఆందోళన -
భారత్- కెనడా వివాదం: అమెరికా ఎవరి వైపు..?
న్యూయార్క్: కెనడా-భారత్ మధ్య ప్రస్తుతం దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయాన్ని అంటగడుతూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభణకు కారణమైంది. అయితే.. ఈ వ్వవహారంలో అమెరికా ఎవరి పక్షాన ఉంది.? భారత్‌కూ మినహాయింపు లేదు..? భారత-కెనడా ప్రతిష్టంభణపై స్పందించిన అమెరికా.. ఇలాంటి వ్యవహారంలో ఏ దేశానికైనా ప్రత్యేక మినహాయింపులు ఉండవని తెల్చి చెప్పింది. ఈ అంశంలో భారత్‌కైనా మినహాయింపు ఉండదని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ స్పష్టం చేశారు. కెనడా ఆరోపణలపై భారత్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. కెనడాతో విబేధాలు లేవు.. భారత్‌తో బంధాలను బలోపేతం చేసుకునే దిశలో అమెరికా ఉన్నందున కెనడా వైపు బలంగా మాట్లాడటంలేదని ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన జేక్ సుల్లివన్.. ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. అమెరికా దాని నియమ నిబంధనలకు ఎల్లప్పుడు కట్టుబడి ఉంటుంది. కెనడా ఆరోపణలపై అత్యున్నత స్థాయిలో ఇరుదేశాలతో చర్చిస్తున్నాము. ఈ అంశంపై అమెరికా నిష్పక్షపాతంగా ఉందని అన్నారు. ఇలాంటి అంశాల్లో భారత్‌కైనా మినహాయింపు ఉండదని చెప్పారు. ఇండియా కెనడా మధ్య చెలరేగిన ఖిలిస్థానీ ఉగ్రవాది హత్యకేసు వివాదంలో.. అమెరికా-కెనడా మధ్య దూరం పెరిగిందనే ఆరోపణలు అవాస్తవని సుల్లివాన్ తెలిపారు. ఇలాంటి ఆరోపణలు ఆందోళనలు కలిగిస్తున్నాయని అన్నారు. ఈ వ్యవహారంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని అమెరికా కోరుకుంటున్నట్లు చెప్పారు. నేరస్థులు ఎవరైనా శిక్ష పాడాలని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ప్రెసిడెన్షియల్ సూట్ వద్దన్నాడు.. విమానాన్ని కాదన్నాడు! -
శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు?
ముంబయి: ఎన్సీపీలో ఇరు వర్గాల మధ్య వివాదం ఇంకా కొనసాగుతోంది. పార్టీలో ఎలాంటి చీలిక రాలేదని సీనియర్ నాయకులు అజిత్ పవార్, శరద్ పవార్లు ప్రకటించినప్పటికీ ఇరుపక్షాల నుంచి ఇంకా విభజనకు సంబంధించిన వివాదాలు కొనసాగుతున్నాయి. శరద్ పవార్ గ్రూప్ ఎమ్మెల్యేలపై అజిత్ పవార్ వర్గం అనర్హత వేటుకు సిద్ధమైంది. ఈ మేరకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గానికి మద్దతు ఇస్తున్నారని ఎమ్మెల్యేల పేర్లు పేర్కొంటూ స్పీకర్‌కు అజిత్ వర్గం ఫిర్యాదు చేసింది. మొదట అజిత్ పవార్ వర్గానికి చెందిన 41 మంది ఎమ్మెల్యేలపై శరద్ పవార్ వర్గం అనర్హత పిటిషన్‌ను దాఖలు చేసింది. దీని తర్వాత అజిత్ పవార్ వర్గం కూడా ఈ చర్యలకు పూనుకుంది. అనర్హత వేటు పిటిషన్లో శరద్ పవార్ వర్గానికి చెందిన జయంత్ పాటిల్, జితేంద్ర అవద్, రోహిత్ పవార్, రాజేష్ తోపే, అనిల్ దేశ్‌ముఖ్, సందీప్ క్షీరసాగర్, మాన్సింగ్ నాయక్, ప్రజక్తా తాన్పురే, రవీంద్ర భూసార, బాలాసాహెబ్ పాటిల్ ఉన్నారు. అనర్హత పిటిషన్ జాబితా నుంచి నవాబ్ మాలిక్, సుమన్ పాటిల్, అశోక్ పవార్, చేతన్ తుపేలను మినహాయించారు. ఎన్సీపీ జాతీయాధ్యక్ష పదవిపై ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ సమక్షంలో ఇరు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. అజిత్ వర్గం పిటిషన్‌పై అక్టోబర్ 6న ఇరువర్గాలను ఈసీ విచారణకు పిలిచింది. పార్టీ జాతీయాధ్యక్షున్ని తాము ఎన్నుకున్నామని అజిత్ వర్గం ఈసీకి పిటిషన్ దాఖలు చేసింది. అజిత్ పవార్ తిరుగుబాటుతో జులైలో ఎన్సీపీలో చీలిక వచ్చింది. తన వర్గం ఎమ్మెల్యేలతో అజిత్ పవార్.. శివ సేన నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతునిచ్చారు. అనంతరం తన వర్గమే నిజమైన ఎన్సీపీ అని ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్సీపీలో ఎలాంటి చీలిక రాలేదని ఇటీవల ఇరుపక్షాల నాయకులు చెప్పారు. అయినప్పటికీ తాజాగా ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇదీ చదవండి: చంద్రయాన్ 3: విక్రమ్ ల్యాండర్, రోవర్ మేల్కొలుపు! -
భారత్-కెనడా వివాదం.. మీమ్స్‌తో నవ్వులు పూయిస్తున్నారు
ఇండియా-భారత్ మధ్య దౌత్యపరంగా వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో ఆరోపించడం వివాదానికి తెరలేపింది. అయితే.. ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితులను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. వచ్చే జీ20 సమ్మిట్‌లో ఇండియా, కెనడా దౌత్య వేత్తలు ఈ విధంగా కొట్టుకుంటారంటూ ఓ వీడియోను జతచేశారు. ఉత్తరప్రదేశ్‌లో భాగ్‌పత్‌లోని చాట్ సెల్లర్లు కొట్టుకున్న వీడియోను ఇండియా, కెనడా దౌత్య వేత్తలతో ఫన్నీగా పోల్చారు. India and Canada diplomats in the next G20 summit pic.twitter.com/q9wclQuSbY — Sagar (@sagarcasm) September 21, 2023 తాజా పరిణామాలతో ఇరుదేశాలు ‘‘నువ్వా-నేనా’’ అన్నట్లు ఆంక్షలు విధించుకునే స్థాయికి చేరాయి. తమ దేశాల్లోని ఇరుపక్షాల దౌత్య వేత్తలను బహిష్కరించుకున్నాయి. కెనడా భారత దౌత్య అధికారులను బహిష్కరించిన కొద్ది గంటల్లోనే ఇండియా కూడా కెనడా దౌత్య అధికారిని దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. కెనడా, యూఎస్, యూకేల్లో పెరుగుతున్న ఖలిస్థానీల మద్దుతుకు మన దేశ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మరో మీమ్‌ను కూడా నెటిజన్లు ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు. India - Canada situation explained pic.twitter.com/oqCgxNrjxW — Pakchikpak Raja Babu (@HaramiParindey) September 21, 2023 ఇరు దేశాలు అంతటితో ఆగకుండా తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలను జారీ చేశాయి. ఇండియా ఒకడుగు ముందుకేసి కెనడా వీసాలను కూడా రద్దు చేసింది. కెనడాకు పంజాబ్ నుంచి ఎక్కువ సంఖ్యలో వెళ్తుంటారు. వీసాలు రద్దు చేసిన నేపథ్యంలో పంజాబ్ నుంచి వెళ్లేవారి ఇలా ఉంటుందంటూ ఫన్నీగా ఓ వీడియో ట్రోల్ అయింది. Indian Cancels visa Services for Canada right now Whole Punjab now 👇 #canadaindia #IndiaCanada #Canadian pic.twitter.com/DdRCqRvtX2 — Harsh (@Harshjindal22_) September 21, 2023 "Canadian High Commissioner"😭🤣🤣🤣#JustinTrudeau #Khalistani #Canada #India #CanadianPappu #CanadaBanegaKhalistan #canadaindia #CanadaNews #CanadaIndiaRelations #CanadaNews #indianGovernment #KhalistanisAreNotSikhs #KhalistaniTerrorist pic.twitter.com/x7CEe7NSQA — Arun Gangwar (@AG_Journalist) September 19, 2023 కెనడాతో ప్రతిష్టంభన నెలకొన్న వేళ ఆదేశానికి వెళ్లాలనుకునే భారతీయులకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాదానికి సంబంధించిన విపత్కర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కెనడాలో ఉన్న భారతీయులు, ఆ దేశానికి ప్రయాణించేవారు జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. #canadaindia #KhalistaniTerrorist India has suspended visa services for Canadian nationals. This is what happening : de pic.twitter.com/VtXC7bBenQ — M A 𝕏 A L U 🗡️ (@YourMasalu) September 21, 2023 ఇదీ చదవండి: కెనడా-భారత్ ప్రతిష్టంభనకు అగ్గి రాజుకుంది అక్కడే..? -
మధ్యవర్తిత్వమే ఉత్తమ మార్గం
సాక్షి, హైదరాబాద్: న్యాయపరమైన సమస్యలను పరిష్కరించడంలో మధ్యవర్తిత్వం ఉత్తమ మార్గమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్ పేర్కొన్నారు. కోర్టులు, చట్టాల ద్వారా అందేది కక్షిదారులపై బయటి నుంచి రుద్దిన పరిష్కారమే అవుతుందని.. మనుషులంతా కూర్చుని సంప్రదింపులతో జరిపే మానవీయ పరిష్కారం కాదని చెప్పారు. విద్వేష భావనలు, విద్వేష ప్రసంగాలతో కలుషితం అవుతున్న సమాజంలో సోక్రటీస్ వంటి మహనీయులు ప్రవచించిన జీవన విధానం మంచిదని సూచించారు. శనివారం హైదరాబాద్ షామీర్పేటలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో 20వ స్నాతకోత్సవం జరిగింది. ఇందులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ (నల్సా) కార్యనిర్వాహక అధ్యక్షుడు జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్ ముఖ్య అతిథిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, వర్సిటీ చాన్సలర్ అలోక్ అరాధే అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్ మాట్లాడుతూ.. ‘‘మనుషులం కనుకే ఆలోచిస్తాం.. ఒకరికొకరు భిన్నంగా ఆలోచిస్తాం. తర్క, వితర్కాలతో సంభాషించుకుంటూనే శాంతియుతంగా జీవించే సమాజం ఉండాలి. మన రాజ్యాంగ నైతికత కూడా దీన్నే తెలియజేస్తుంది. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించే విధానంలో అందరి తర్కం, వాదన విని.. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుంది. నాలుగు మెదళ్ల సంఘర్షణ నుంచి వచ్చే పరిష్కారం మెరుగ్గానే ఉంటుందనడంలో అశ్చర్యం అవసరం లేదు..’’ అని పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు న్యాయం అందేలా కృషి చేయాలని న్యాయ విద్యార్థులకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ సహకారం మరువలేనిది.. నల్సార్ వర్సిటీలో వసతులు కల్పించడంలో సీఎం కేసీఆర్ సహకారం మరువలేనిదని వర్సిటీ వీసీ శ్రీకృష్ణదేవరావు పేర్కొన్నారు. జ్యుడిషియల్ అకాడమీ కోసం 25 ఎకరాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. 25ఏళ్ల నల్సార్ వర్సిటీ ప్రస్థానంలో ఎన్నో కొత్త కోర్సులను తీసుకొచ్చామని, ఎందరో విద్యార్థులను సమాజానికి అందించామని చెప్పారు. లీగల్ ఎయిడ్‌తోపాటు అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్‌లను ప్రోత్సహించడంలో నల్సార్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పీహెచ్డీ, ఎల్ఎల్ఎం, ఎంబీఏ, బీఏ ఎల్ఎల్బీ ఆనర్స్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలతో పాటు 58 మందికి బంగారు పతకాలను అందజేశారు. ప్రొఫెసర్ బాలకృష్ణరెడ్డితోపాటు ఇతరులు రాసిన పుస్తకాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు సీజే ఆవిష్కరించారు. హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యకార్యదర్శి గోవర్థన్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
తండ్రి ప్రేమకు పరాకాష్ట.. కన్నీరు పెట్టిస్తున్న వాంగ్మూలం!
ఏసీ కూలింగ్ విషయమై ఆ తండ్రీ కొడుకుల మధ్య వివాదం జరిగింది. ఆగ్రహంతో రగిలిపోయిన కుమారుడు వెంటనే తుపాకీ తీసుకుని, తండ్రిపై తూటాల వర్షం కురిపించాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పోలీసులతో ఏమి చెప్పాడో తెలిస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. పంజాబ్‌లోని హోషియార్పూర్ జిల్లాలో ఆ సమయంలో కలకలం చెలరేగింది. ఏసీ కూలింగ్ విషయమై జరిగిన వివాదంలో కుమారుడు తండ్రిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. తూటాలు ఆ వృద్ధుడైన ఆ తండ్రి రెండు కాళ్లలోకి దూసుకుపోయాయి. దీనిని గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మరింత మెరుగైన వైద్యం కోసం బాధితుడిని అమృత్‌సర్‌లోని ఒక ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ ఘటన హోషియార్ పూర్ జిల్లాలోని జలాల్‌చక్క గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన వీర్‌సింగ్ తన కుమారుడు అమర్‌సింగ్‌తో పాటు ఇంటిలో ఉంటున్నాడు. వారి ఇంటిలోని ఏసీ సరైన చల్లదనాన్ని అందించడం లేదు. దీంతో కుమారుడు ఏసీకి మరమ్మతు చేయించాలని తండ్రికి చెప్పాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ‘వాడు తప్పు చేశాడని.. నేను చేయను’ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి పోలీసులతో మాట్లాడుతూ..‘ నా కొడుకు మద్యం మత్తులో ఉన్నాడు. వాడు ఆగ్రహంతో లైసెన్స్ కలిగిన తుపాకీతో నాపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నా రెండు కాళ్లలోకి బుల్లెట్లు దిగాయి. వాడు మద్యం మత్తులో తప్పు చేశాడు. నేను వాడికి తండ్రిని అయిన కారణంగా అతనిని అరెస్టు చేయించి, తప్పు చేయలనుకోవడం లేదు. నా కుమారునిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని వేడుకుంటున్నాను’ అని అన్నాడు. ఘటన ఆధారంగా దర్యాప్తు: పోలీసులు ఈ ఉదంతంపై పోలీసు అధికారి బల్విందర్ సింగ్ మాట్లాడుతూ సమాచారం అందగానే తాము సంఘటనా స్థలానికి చేరుకున్నామని అన్నారు. బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందున్నాడు. ఘటనపై తమకు ఫిర్యాదు చేసేందుకు నిరాకరిస్తున్నాడు. ఒకవేళ అతను కుమారునిపై ఫిర్యాదు చేస్తే చర్యలు చేపడతామన్నారు. ఇది కూడా చదవండి: ‘ఇక చూసింది చాలు పడుకో’ అని తల్లి అనడంతో.. -
శ్రీకృష్ణ జన్మభూమి కేసు అలహాబాద్ హైకోర్టుకు బదిలీ
ఉత్తర ప్రదేశ్‌లోని మథురలో ఉన్న శ్రీ కృష్ణ జన్మభూమి వివాదానికి సంబంధించిన అన్ని కేసులు అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యాయి. ప్రస్తుతం ఈ పిటిషన్లు మథుర జిల్లా కోర్టు విచారణలో ఉన్నాయి. అయితే కృష్ణ జన్మభూమి కేసు జాతీయ ప్రాధాన్యత కలిగినదని, దీనిని హైకోర్టు విచారణ చేపట్టాలని హిందూ పిటిషనర్లు కోరారు. మే 3న విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. తాజాగా శ్రీ కృష్ణ జన్మభూమి కేసులపై తామే విచారణ చేపడతామని హైకోర్టు శుక్రవారం ప్రకటించింది. ఆ మేరకు సంబంధిత కేసులను హైకోర్టు తనకు బదిలీ చేసుకుంది. కాగా శ్రీ కృష్ణ జన్మభూమి ఆలయం పక్కన ఉన్న షాహి ఈద్గా మసీదు నిర్మితమైందంటూ భగవాన్ శ్రీ కృష్ణ విరాజ్మాన్, రంజనా అగ్నిహోత్రితోపాటు మరో ఏడుగురు సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. షాహీ మసీదు ఈద్గా నిర్వహణ కమిటీ, శ్రీ కృష్ణ జన్మభూమి ట్రస్ట్, శ్రీ కృష్ణ జన్మ స్థాన్ సేవా సంస్థాన్‌లను ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చారు. మసీదు స్థలంపై హిందువులకే హక్కులు ఉంటాయని వాదించారు. హిందూ దేవాలయాలను కూలగొట్టి ఈద్గాను నిర్మించారని తెలిపారు. అలాంటి నిర్మాణం మసీదు కాబోదని పేర్కొన్నారు. ఆ భూమిని మసీదు నిర్మాణం కోసం ఎవరూ ఇవ్వలేదని తెలిపారు. చదవండి: సివిల్స్ ఫలితాల్లో ఇద్దరు అమ్మాయిలకు ఓకే ర్యాంకు.. అదెలా? -
ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టిన అధికారులు
సాక్షి, జగిత్యాల జిల్లా: ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తలుపులు తెరుచుకున్నాయి. హైకోర్టు ఆదేశాలతో స్ట్రాంగ్ రూమ్ తాళాలు అధికారులు పగలగొట్టారు. 2018 ధర్మపురి అసెంబ్లీ ఎన్నిక ఫలితాలపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థి.. హైకోర్టును ఆశ్రయించారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిటిషన్‌తో నివేదిక సమర్పించాలని జగిత్యాల జిల్లా అధికారులు, నాటి జిల్లా ఎన్నికల అధికారిని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ఈ నెల ఏప్రిల్ 10వ తేదీనే స్ట్రాంగ్ రూమ్ తాళాలు తెరవడానికి అధికారులు సిద్ధమయ్యారు. కాగా, స్ట్రాంగ్ రూమ్ తాళం చెవుల మిస్సింగ్‌తో హైడ్రామా నెలకొంది. కీస్ మిస్సింగ్‌పై విచారణ చేపట్టాలని భారత ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ఈ నెల ఏప్రిల్ 17వ తేదీన నాచుపల్లి జేఎన్టీయూలో నాటి ఎన్నికల అధికారి శరత్, ఆ తర్వాత విధులు నిర్వహించిన కలెక్టర్ రవినాయక్, ప్రస్తుత కలెక్టర్ యాస్మిన్ బాషాతో పాటు, నాటి రిటర్నింగ్ ఆఫీసర్, ఇతర అధికారులను ఈసీఐ బృందం విచారించింది. ఈసీఐ నివేదిక సమర్పించడంతో స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగులగొట్టేందుకు జగిత్యాల జిల్లా కలెక్టర్‌ను కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో నాటి అభ్యర్థుల సమక్షంలో ఆదివారం స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టారు. నాటి ఎన్నికలకు సంబంధించిన కీలకమైన ప్రొసీడింగ్స్, 17ఏ, 17 సీ ఫామ్స్‌తో పాటు, ఫలితాల రోజు కౌంటింగ్ రూమ్ సీసీ కెమెరాల ఫుటేజ్‌ను జిల్లా అధికారులు సమర్పించనున్నారు. ఏప్రిల్ 26లోపు నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ధర్మపురి ఎన్నిక వివాదంపై కోర్టు తీర్పు, తదుపరి పరిణామాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చదవండి: బొంగు బిర్యానీ, బకెట్ బిర్యానీ, కుండ బిర్యానీ.. యాక్ ఛీ! బాత్రూం బిర్యానీ!