మహబూబాబాద్ ఎ మ్మెల్యే శంకర్‌నాయక్, తహసీల్దార్ విజయ్‌కుమార్ నడుమ ఏర్పడిన వివాదానికి ఇరువర్గాలు తెరదించాయి. ఎమ్మెల్యే శంకర్‌నాయక్ తహసీల్దార్‌ను దూషించారని ఆరోపిస్తూ జిల్లావ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు సోమవారం నిరసన బాట పట్టారు.
-
కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే శంకర్‌నాయక్
-
సమస్య పరిష్కార బాధ్యతలు ఆర్డీఓకు అప్పగించిన కలెక్టర్
హన్మకొండ అర్బన్ : మహబూబాబాద్ ఎ మ్మెల్యే శంకర్‌నాయక్, తహసీల్దార్ విజయ్‌కుమార్ నడుమ ఏర్పడిన వివాదానికి ఇరువర్గాలు తెరదించాయి. ఎమ్మెల్యే శంకర్‌నాయక్ తహసీల్దార్‌ను దూషించారని ఆరోపిస్తూ జిల్లావ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు సోమవారం నిరసన బాట పట్టారు. తహసీల్దార్ స్థాయి అధికారిని దూషించిన నేపథ్యంలో సీరియస్‌గా తీసుకున్న ఉద్యోగ సంఘాలు ఆది, సోమవారాల్లో సమావేశమయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం మహబూబాబాద్ ఎమ్మె ల్యే శంకర్‌నాయక్ జిల్లా కలెక్టర్ కరుణను కలిసి ఇదే విషయంపై వివరణ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. ఎమ్మెల్యేతో మాట్లాడిన అనంతరం వ్యవహారం సద్దుమణిగేలా చర్చలు జరిపి చర్యలు తీసుకోవాలని మహబూబాద్ ఆర్డీవో భాస్కర్‌రావును కలెక్టర్ ఆదేశించినట్లు తెలిపారు. ఈ మేరకు ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాగా ఏర్పడనున్న తరుణంలో అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య çసుహృద్బావ వాతావరణం ఉండాలని కలెక్టర్ సూచించారని ఆర్డీఓ ఇరువర్గాలకు నచ్చచెప్పారు. దీంతో తాము సంతృప్తి చెంది నిరసనలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ తహసీల్దార్ల సంఘం జిల్లా అ««దl్యక్షుడు పూల్‌సింగ్, ట్రెసా జిల్లా అధ్యక్షుడు రాజ్‌కుమార్ సంయుక్తంగా తెలిపారు. కాగా, ఈ ఘటనపై ‘సాక్షి’లో ఆదివారం కథనం ప్రచురితమైన విషయం విదితమే.